Destination
-
వందేళ్లకు కల నిజమైంది.. ఏడు ఖండాలూ చుట్టేసిన బామ్మ
‘బాబుమొషాయ్! జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ’ ఆనంద్ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకునేలా జీవితాన్ని ఆస్వాదించామన్నదే ముఖ్యమని సారాంశం. 102 ఏళ్ల ఈ బామ్మ ఎక్కువ కాలం బతకడమే గాక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ అరుదైన జ్ఞాపకాలను ఎంచక్కా పోగేసుకుంటోంది. ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’ అంటూ ఏడు ఖండాలను చూడాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఆ సాహస మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డొరోతీ స్మిత్. ఇటీవలే ఆ్రస్టేలియా వెళ్లడం ద్వారా తన ట్రావెల్ బకెట్ లిస్టులో చివరి కోరికనూ తీర్చేసుకున్నారు. కాలిఫోర్నియాలో రెడ్‌వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్‌లో ఉంటున్న స్మిత్‌కు ప్రపంచమంతా తిరగాలన్నది చిరకాల కల. ఆ క్రమంలో ఆరు ఖండాలూ తిరిగినా ఆ్రస్టేలియా మాత్రం అలా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఓ కథ కోసం స్మిత్ వద్దకు వెళ్లిన అమ్మర్ కిండిల్, స్టఫాన్ టేలర్ అనే యూట్యూబర్లకు ఈ విషయం తెలిసింది. ఆమె కలను ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. డెస్టినేషన్ ఎన్ఎస్డబ్లూ అనే ట్రావెల్ సంస్థ, క్వాంటాస్ విమానయాన సంస్థలతో కలిసి స్మిత్ ఆ్రస్టేలియా పర్యటన కోసం తమ వంతు సాయం అందించారు. ఇంకేముంది! స్మిత్ ఎంచక్కా తన కూతురు అడ్రియన్‌తో కలిసి ఇటీవలే ఆ్రస్టేలియా సందర్శించారు. క్వాంటాస్ విమానంలో దర్జాగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించడం విశేషం! అంతేకాదు, టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సన్మానించారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌ను ఆస్వాదించారు. వైల్డ్ లైఫ్ జూను సందర్శించారు. ఒపేరా హౌస్, బొండీ బీచ్ వంటి ఐకానిక్ ప్రదేశాలన్నీ కలియదిగిగారు. ‘‘వయసైపోయింది, ఇప్పుడేం చేస్తాం లెమ్మని ఎప్పుడూ అనుకోకండి. ప్రయతి్నస్తే అద్భుతాలు చేయగలరు, చూడగలరు. కదలకుండా కూర్చుంటే తుప్పు పట్టిపోతారు. అదే తిరిగితే అలసిపోతారు. నేను అలా అలసిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అని సీనియర్ సిటిజన్లకు హితవు కూడా చెప్పారు స్మిత్. అంతేకాదు, ‘‘ఆస్ట్రేలియా అద్భుతంగా ఉంది. అక్కడి ప్రజలు ఆకర్షణీయంగా ఉన్నారు. ఆహారం, వాతావరణం అన్నీ బాగున్నాయి’’ అంటూ కితాబిచ్చారు కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లి ఖర్చు పెరిగిపోతోంది
సాక్షి, అమరావతి: పెళ్లి అంటే ఓ పెద్ద వేడుక. రెండు కుటుంబాల మధ్య బలపడే బంధం. బంధు మిత్రుల సందడి, విందు, వినోదాలతో సాగే పెద్ద తంతు. దానికి తగ్గట్టే ఖర్చూ ఉంటుంది. నిరు పేదల నుంచి బిలియనీర్ల వరకు ఎవరికి తగ్గ రేంజ్లో వారు పెళ్లి వేడుక జరిపిస్తారు. గతంలో ఇళ్లలోనో, ప్రార్ధన మందిరాల్లోనో పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లలో భారీ ఏర్పాట్ల మధ్య జరుగుతున్నాయి. ఫొటోలు, వీడియోలు.. వీటికీ పెద్దపీటే. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు మరో రకం. ఇలా రాన్రాను పెళ్లిళ్ల ఖర్చు భారీగా పెరిగిపోతోంది.పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులో భారతీయులు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. భారత దేశంలో వివాహాల ఖర్చు ఏటికేడాది భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్‌మీగుడ్ తెలిపింది. దేశంలో ఈ ఏడాది సగటున ఒక్కొక్క వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక సర్వే నివేదికలో వెల్లడించింది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఈ సగటు వ్యయం రూ.51.1 లక్షలుగా ఉందని తెలిపింది. 2022లో సగటు వివాహ ఖర్చు రూ.25 లక్షలుగా ఉండగా, 2023లో రూ.28 లక్షలకు చేరి, ఇప్పుడు మరింత ప్రియమైందని పేర్కొంది. ఈ ఏడాది ఆతిథ్యం, విందు ఖర్చు భారీగా పెరగడమే వివాహ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది. ప్రతి ఐదు వివాహాల్లో ఒక పెళ్లి ఖర్చు రూ.50 లక్షలకు పైనే ఉంటోందని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం 3,500 మంది జంటలపై ఈ సర్వే నిర్వహించగా అందులో తొమ్మిది శాతం మంది పెళ్లి కోసం కోటి రూపాయల పైనే ఖర్చు చేసినట్లు తెలిపారు. 40 శాతం మంది వారి వివాహ ఖర్చు రూ.15 లక్షల లోపే అని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. పెళ్లి కోసం డబ్బు దాచుకుంటున్న వారే ఎక్కువ పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి తల్లిదండ్రులు తగినంత పొదుపుతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెడ్‌మీగుడ్ సర్వేలో వెల్లడయ్యింది. 82 శాతం మంది వారి పిల్లల వివాహన్ని సొంతంగా దాచుకున్న నిధులు లేదా స్నేహితుల నుంచి తీసుకొని ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. 12 శాతం మంది మాత్రమే పెళ్లిళ్ల కోసం రుణాలు తీసుకుంటున్నారు. మరో 6 శాతం మంది పిల్లల పెళ్లిళ్ల కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. మిలీనియల్స్, జనరేషన్ జెడ్‌కు చెందిన వివాహాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వెడ్‌మీగుడ్ సహ వ్యవస్థాపకుడు మెహక్ సాగర్ షహానీ పేర్కొన్నారు. పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయాలకు అనుగుణంగా కాక్టెయిల్స్, గేమింగ్స్ , రెస్టారెంట్ ఏర్పాట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవడం కోసం వీరు సోషల్ మీడియా మేనేజర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.వీటివల్ల సరికొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకొస్తున్నాయని మోహక్ సాగర్ పేర్కొన్నారు. ఏటా నవంబర్ – డిసెంబర్ నెలల్లోనే అత్యధిక వివాహాలు జరుగుతాయని, ఈ ఏడాది ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ఈ రెండు నెలల్లో వివాహల కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా.పెళ్లిళ్ల కోసం ఖర్చు చేస్తున్నవారి శాతంరూ. కోటి పైన 9%రూ.50 లక్షలు నుంచి రూ.1 కోటి 9%రూ.25 నుంచి రూ. 50 లక్షలు 23%రూ.15 నుంచి రూ. 25 లక్షలు 19%రూ.15 లక్షల లోపు 40%డబ్బు సమీకరణ ఇలా..సొంతం లేదా కుటుంబ పొదుపు 82%రుణాలు 12%ఆస్తులు అమ్మకం 6%సగటు వివాహ ఖర్చుఏడాది సగటు వ్యయం 2022 రూ.25 లక్షలు 2023 రూ.28లక్షలు 2024 రూ.36.5 లక్షలు -
ప్రపంచ దేశాల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు (ఫొటోలు)
-
మణిమహేష్ యాత్ర ప్రారంభం
హిమాచల్ ప్రదేశ్‌లో జన్మాష్టమికి మొదలై రాధాష్టమికి ముగిసే యాత్రను మణిమహేష్ యాత్ర అని అంటారు. ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అటు ప్రకృతి ప్రేమికులకు, ఇటు సాహస ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఇది. అలాగే విహారయాత్రలు చేసేవారికి, ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టేవారికి హిమాచల్‌ప్రదేశ్ గమ్యస్థానంగా నిలిచింది.వర్షాకాలం మినహా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించవచ్చు. ముఖ్యంగా జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు మణిమహేష్ సరస్సును సందర్శించేందుకు ఉత్తమమైన సమయం. దాల్ సరస్సునే మణిమహేష్ సరస్సును అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి అనంతరం మణిమహేష్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలివస్తుంటారు.ఆగస్టు 26 నుండి మణిమహేష్ యాత్ర ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మణిమహేష్ సరస్సును సందర్శించవచ్చు. కైలాస శిఖరంపై నివసిస్తున్న మణిమహేషుడు(మహాశివుడు)ఈ సమయంలో దాల్ సరస్సునుంచి అద్భుతంగా కనిపిస్తాడని చెబుతారు. మణిమహేష్ యాత్ర ప్రతియేటా సాధారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే జన్మాష్టమి నుంచి మొదలువుతుంది. తొమ్మదివ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మన్ ఇక్కడే శివుణ్ణి దర్శనం చేసుకున్నాడని చెబుతారు. సెప్టెంబర్ 11 రాధాష్టమితో మణిమహేష్ యాత్ర పరిసమాప్తమవుతుంది. -
వెడ్డింగ్స్.. డెస్టినేషన్
పెళ్లి..చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఘనంగా పెళ్లిళ్లు చేయడం దక్షిణాది ప్రత్యేకత. అయితే కొన్నేళ్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు మాత్రమే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు విదేశాలకు వెళ్లేవారు. అనంతర కాలంలో ఆ ఖర్చును భరించగలిగే ఆర్థికస్తోమత ఉన్నవారు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లోనే కాకుండా భారత్‌లోని జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్, ముస్సోరీ, గోవా వంటి ప్రదేశాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు వేదికలుగా ఆదరణ పొందాయి.కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాలు వీటికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకశాఖ నగరంతోపాటు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈ వేదికల్లో వేడుకలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్స్ సమ్మేళనంలో ఆ దిశగా దృష్టి సారించారు. ..: సాక్షి, హైదరాబాద్ :.. డెస్టినేషన్వెడ్డింగ్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు..ఖర్చెంత?సాక్షి, హైదరాబాద్వారసత్వ సంపదతోపాటు అద్భుత కట్టడాలకు కేంద్రం హైదరాబాద్ నగరం.ఇక్కడి చారిత్రాత్మక కట్టడం తారామతి బారాదరి వెడ్డింగ్ డెస్టినేషన్‌కు అడ్డాగా మారింది. ఎత్తయిన కొండపైన ఆనాటి రాజసం నింపుకున్న నిర్మాణ శైలి, వందలమంది ఒకేసారి కూర్చొని పెళ్లి వైభవం ఆస్వాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ వేడుక చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తారామతిలో ఐదు గంటల ఫొటో షూట్‌కు ఉదయం అయితే రూ.8000, సాయంత్రం నుంచి అయితే రూ. 10 వేలు చార్జ్ చేస్తున్నారు.పెళ్లిళ్లు, రిసెప్షన్ లేదా ఇతర ఫంక్షన్లకు ఓపెన్ ఏరియా అయితే రూ.70 వేలు, ఇండోర్ బాంకెట్ హాల్ అయితే లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఇక్కడ ఫుడ్ కాకుండా బయట నుంచి తెప్పించుకోవాలనుకునేవారు అదనంగా రూ.11 వేలు చెల్లించాలి. నిర్వాహకులే స్వయంగా ఫుడ్ ఏర్పాటు చేసుకోవాలంటే...అదనంగా రూ.15 వేలు చెల్లించాలి. వేదిక, వసతుల అద్దె సాధారణంగానే ఉన్నా, ఆకర్షణీయమైన అలంకరణ, ఖరీదైన వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ పెళ్లిళ్లకు కనీసం పాతిక లక్షల పైనే ఖర్చు పెడుతున్నారు.తారామతి బారాదరి, ఫలక్‌నుమా ప్యాలెస్..⇒ నగరంలోని ‘ఫలక్‌నుమా ప్యాలెస్’ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయితో ఖ్యాతి గడించిన విలాసవంతమైన వేదిక. గతంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన సోదరి వివాహం ఇక్కడే జరిపించిన విష యం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్‌తోపాటు పలువురు వ్యాపారవేత్తలు వచ్చారు. మరెందరో ప్రముఖులు కూడా ఈ వేదికను వినియోగించుకున్నారు.అనంతగిరి హిల్స్..⇒ అటు అనంతగిరిహిల్స్ వేది కగా కూడా వివాహాల సంఖ్య పెరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపించి వందల మంది వేడు కల్లో పాల్గొనేలా సౌకర్యాలు అభివృద్ధి చేయడంతో పెళ్లిళ్లు, వెడ్డింగ్ షూట్లకు ఇక్కడ ఆదరణ పెరిగింది. ఇక్కడి ప్రకృతి పారవశ్యం నూతన జంటలకు ఆకర్షిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే పలు వెడ్డింగ్ షూట్ సెట్టింగ్ రిసా ర్టులూ వెలిశాయి. ఇక్కడ డెస్టినే షన్ వెడ్డింగ్‌లకు సాధార ణంగా 5 లక్షల పైనే ఖర్చు అవుతుందని అంచనా. అయితే, వీటిల్లో వెడ్డింగ్ ప్లానర్ల ఖర్చులే అత్యధికంగా ఉంటాయి. తమ అభిరుచికి తగ్గ ట్టుగా కేవలం సెట్టింగ్‌లకు లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కొందరైతే సెట్టింగ్‌లకే కోటి రూపా యల దాకా ఖర్చు చేస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు.ఫ్యూచర్ ప్లాన్.. లక్నవరం వరంగల్‌కు సమీపంలోని లక్న వరం సరస్సు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మరో ఫేవరెట్ స్పాట్ కానుంది. ఇక్కడ 17 నుంచి 20 దాకా ఐల్యాండ్లు ఉన్నాయని, వాటిని కూడా ఈ దిశగా అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని టూరిజం శాఖ ప్రతినిధి తెలిపారు. లక్నవరంలోని కాటేజె స్తో పాటు దీనికి దగ్గరలోనే వరంగల్ టూరిజం హోటళ్లు, రిసార్ట్లు ఉన్నాయి. తీసుకునే కాటేజీల సంఖ్య, అవసరానికి అనుగుణంగా సమీపంలోనే హరిత హోట ళ్లలో ఏర్పాటు చేసే సౌకర్యా లను బట్టి రూ. 3–5 లక్షల వరకు ఖర్చు అవుతుందని పర్యా టక అధికారులు చెబుతు న్నారు. వినూత్నమైన సెట్టింగులు, పూల అలంకరణలు, భోజన ఏర్పాట్లు ఇలా అన్నీ.. చేసే స్థాయిని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. సోమశిల..ప్రముఖ పర్యాటక ప్రదేశం సోమశిలలో జరి గిన డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా అందరినీ ఆక ర్షించింది. ఇక్కడి డ్రోన్ షాట్లు ప్రకృతి పారవశ్యాన్ని చిత్రీ కరించిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే నాగార్జునసాగర్వంటి పలు పర్యాటక ప్రదే శాలు ఇలాంటి వినూత్న వివాహాల వేడుకలకు అద్భు త వేదికలుగా అవతరిస్తు న్నాయి. కాగా, ప్రస్తు తం కొద్ది మందికి మాత్రమే ఇలాంటి సౌక ర్యాలు అందు బాటులో ఉన్నా, వీటికున్న ఆదరణ దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తూ విదేశాలకు చెందిన వారిని సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు మన వైపు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర పర్యా టక శాఖ అధికారులు చెప్పారు.వెలుగులోకి మరిన్ని డెస్టినేషన్ వేదికలుమన సంస్కృతీ సంప్ర దాయాలకు గౌరవిస్తూనే.. ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మంచి వేదికలుగా వాడుకుంటున్నారు. ఈ మార్పు పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచడంతోపాటు వారి పెళ్లిని చిరకాల మధుర జ్ఞా్ఞపకంగా నిలుపుతుంది. ఈ ఆనవాయితీ ఇలానే కొనసాగితే మరి కొనేళ్లలో మరో పది వరకు డెస్టినేషన్ వేదికలు వెలుగులోకి వస్తాయి. అంతటి విశిష్టత కలిగిన కోటలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్లను సైతం ఆకర్షిస్తున్నాయి – అరవింద్, పర్యాటక నిపుణుడు -
ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అచ్చం..మురారీ సినిమాలోలాగ, అదీ కాదంటే తమ అభిమాన హీరో హీరోయిన్ల పెళ్లిలా..ఎవరైనా ఇలాంటి పెళ్లి సందడి కోరు కుంటారు. కానీ గుజరాత్‌కు చెందిన జంట మాత్రం వెరైటీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేయండి మరి..! అందిరిలా మేమూ చేసుకుంటే ‘కిక్’ ఏంటి అనుకున్నారేమో ఈ జంట మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలికి గజ గజ వణికిపోతూ మూడు ముళ్ల ముచ్చటను తీర్చుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పి ఉండే స్పితి లోయలో వివాహం చేసుకున్నారు. ఒక పక్క మంచు పూలవర్షమే అక్షితలుగా చలికి వణికి పోతూ మంచులో ముచ్చటగా పెళ్లి చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంతేనా ఈ పెళ్లి ఫోటోషూట్, కెమెరామెన్లు, బంధువులు, పంతుళ్లు ఇలా అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పెళ్లికి సంబంధించిన వీడియోలను హిమాచల్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ అజయ్ బన్యాల్, గో హిమాచల్ ట్విటర్ ఖాతాలో షేర్ అయ్యాయి. కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన లవర్ మాట కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట అబ్బాయి. స్పితిలోని మురాంగ్లో జరిగిన అపూర్వ వివాహం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అనే మాట ఇది వేరే లెవల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. అంతేనా 'ఓవర్‌యాక్టింగ్' అని ఒకరు, "షాదీ అండ్ హనీమూన్ డన్’’ అటూ మరొకరు కమెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేసి, మీకే మనిపించిందో కమెండ్ చేయండి. అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత एक विवाह ऐसा भी! गुजरात का प्रेमी जोड़ा, प्रेमिका की जिद्द ने स्पीति पहुंचाया, फिर माईनस 25 डिग्री तापमान में सजाया मंडप, यह अपने आप में पहली तरह का मामला है। स्पीति के मुरंग में आज हुआ अनोखा विवाह। यह है डेस्टिनेशन वेडिंग का example। pic.twitter.com/4lnaRl0c5h — Ajay Banyal (@iAjay_Banyal) February 26, 2024 Gujarat couple gets married at -25 degrees in Himachal Pradesh's Spiti Valley.😍 pic.twitter.com/nGLImoguLh — Go Himachal (@GoHimachal_) February 29, 2024 -
స్టార్టప్స్‌కు డెస్టినేషన్‌గా ఏపీ
సాక్షి, విశాఖపట్నం: స్టార్టప్స్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) అడిషనల్ డైరెక్టర్(ఏడీ) సురేష్ బాత్రా అన్నారు. డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్ (డీటీఎన్ఎఫ్) అధ్వర్యంలో విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్ర్డన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించిన ఏఐ క్లౌడ్ సమ్మిట్–2024ను సురేష్బాత్ర, విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ ప్రారంభించారు. సురేష్ మాట్లాడుతూ ఏపీలో స్టార్టప్‌లకు ఎకోసిస్టమ్ అద్భుతంగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుకూల వాతావరణం ఏపీలో ఉండటంతో కొత్త ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలకు విశాఖ కీలకంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టార్టప్స్‌లో మూడోవంతు విశాఖలోనే ఉన్నట్లు తెలిపారు. సీపీ రవిశంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది నేరస్తులను గుర్తించేందుకే కాకుండా నేర నియంత్రణకు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఇన్నోవేటివ్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. డీప్‌టెక్ నైపుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ భారత్‌లో ఉన్న ఎంఎన్సీ, హైటెక్ కంపెనీలకు చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీటీఎన్ఎఫ్, ఏపీఐఎస్ మధ్య కృత్రిమ మేధకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. సదస్సులో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. -
Rakul, Jackky Wedding: పెళ్లి విషయంలో రకుల్ యూ టర్న్.. అదే కారణమా?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిల్లీ భామ తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో అభిమానుల్లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, కిక్ -2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. అయితే గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అటాక్, రన్ వే -34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది భామ. ఈ జంట తమ వివాహా వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గోవాకు మారిన వెడ్డింగ్.. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్‌గా యూ టర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోని గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహా వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్‌ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. మోదీ పిలుపే కారణమా? రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశారు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరలవుతోంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లక్షద్వీప్ వెళ్లిన మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్‌తో వివాదం మొదలైంది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఈ జంట ముంబైలోని రామమందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. గోవాలో ఫిబ్రవరి 22న జరగబోయే వీరి వివాహానికి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు హాజరుకానున్నారు. -
ఇండియాలో చూడాల్సిన హాలిడే డెస్టినేషన్స్ ప్రదేశాలు
-
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
10 రోజుల్లో పెళ్లి.. వధూవరులకు షాక్ ఇచ్చిన పెంపుడు కుక్క
ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం ఇప్పటివరకు సినిమాల్లో, నిజజీవితంలోనూ చూశాం. కొన్ని ప్రత్యేకమైన కారణాలు, అనుకోని ట్విస్ట్‌ల కారణంగా ఇలా జరుగుతుంటాయి. అయితే ఓ పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న ఆ వరుడు కుక్క చేసిన పనికి తల పట్టుకున్నాడు. ఇంతకీ ఆ పెంపుడు కుక్క ఏం చేసింది? పెళ్లి ఆగిపోయిందా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. ఈ వేడుకను కలకాలం గుర్తించుకునేలా వధూవరులు ప్లాన్ చేసుకుంటారు. ఇక ఇప్పుడైతే చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అమెరికాలోని ఓ జంట కూడా తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో ఉండగానే వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదరింది. ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తో పాటూ పెళ్లికి హాజరయ్యే బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు, వీసాలు, టికెట్లు సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. కొన్ని పెళ్లి పనులు మిగిలి ఉండగా వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తీరా వచ్చి చూసేసరికి డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ఆగస్టు 31న ఇటలీలో తన పెళ్లి జరగనుందని, ఇలాంటి సమయంలో తన కుక్క చేసిన పనికి ఏం చేయాలో తెలియడం లేదని, ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా అభ్యర్థించాడు. లేదంటే తాను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్లిపోతారని అధికారులకు మొర పెట్టుకున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి ఆగస్టు 31న జరగాల్సిన వాళ్ల వివాహం జరుగుతుందా? అధికారులు చూపించిన ఆ ప్రత్యామ్నాయం ఏంటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)లో భాగమైన స్కూట్ నెట్వర్క్ తాజాగా చౌక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ నగరాల నుంచి విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. రూ. 6,200 నుంచి చార్జీలు మొదలవుతాయని వివరించింది. హైదరాబాద్ నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు రూ. 12,900 నుంచి, వైజాగ్ నుంచి సెబూ (ఫిలిప్పీన్స్)కు రూ. 11,900 నుంచి వన్–వే చార్జీలు (పన్నులు సహా) ప్రారంభమవుతాయని స్కూట్ తెలిపింది. ఈ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. -
Aakanksha Monga: ఆమె ఊరి పేరు... ప్రపంచం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్‌గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్‌కు తిరిగి ప్రాణం పోసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా... ట్విట్టర్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
గమ్యస్థానం చేరిన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్
మెల్బోర్న్: మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్ వెబ్ టెలిస్కోపు తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)ను చేరినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఎల్2 పాయింట్ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్లో ఇకపై వెబ్ టెలిస్కోప్ పరిభ్రమణ జరుపుతుంది. నెల రోజుల క్రితం ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపారు. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా దీని నిర్మాణం జరిగింది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్మెంట్) చెందడం వంటి పను లు పూర్తి చేయాల్సిఉంది. లక్ష్యాన్ని చేరడానికి ఒక రోజు ముందే టెలిస్కోప్‌లోని 18 దర్పణాలు పూరి ్తగా తెరుచుకోవడం విజయవంతంగా జరిగింది. దాదాపు 1000 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. -
కురువపురం దీవి; కృష్ణమ్మ సిగలో చేమంతి
‘ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడి మధ్య ఏరడ్డు...’ అని కవి హృదయం స్పందించింది బహుశా ఇలాంటి చోటును చూసే కావచ్చు. కృష్ణానదికి ఆ ఒడ్డున ఒక రాష్ట్రం, ఈ ఒడ్డున మరొక రాష్ట్రం. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్నాటక మీదుగా తెలంగాణను పలకరించి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టి హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఓ విచిత్రం. కొంతదూరం కర్నాటక– తెలంగాణల మధ్యగా ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట్ జిల్లా (ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా), మక్తల్‌కు పది కిలోమీటర్ల దూరాన ఉంది ఈ విచిత్రం. ఇక్కడ కృష్ణానది మధ్యలో ఉన్న దీవి పేరు కురువపురం. విశాలమైన ఇసుక తిన్నెల్లాంటి శిలలతో మంచి వీకెండ్ డెస్టినేషన్ ఇది. హైదరాబాద్‌కు 190 కి.మీ.ల దూరం. పంచదేవ్ పహాడ్ తీరాన నేల మీద నుంచి నీటిలోకి అడుగుపెట్టాలి. వలయాకారపు తెప్ప... కృష్ణానదిలో పెద్ద పెద్ద శిలలుంటాయి. మరబోట్లలో ప్రయాణించడం కష్టం. వలయాకారపు తెప్పలే ఇక్కడ రవాణా సాధనాలు. ఒక్కో తెప్పలో పది నుంచి పదిహేను మంది ప్రయాణించవచ్చు. ఈ తెప్ప తెడ్డు వేద్దామని సరదాగా ప్రయత్నించవచ్చు. కానీ అది ఫొటో వరకే. ఆ తెడ్డును చెయ్యి తిరిగిన సరంగు వేయాల్సిందే. మనం తెడ్డు వేస్తే తెప్ప ఉన్న చోటనే గిరగిర తిరుగుతుంది తప్ప ముందుకు వెళ్లదు. స్థానిక సరంగులకు నీటి లోపల ఎక్కడ శిల ఉన్నదీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ శిలకు కొట్టుకోకుండా తప్పించి నడుపుతారు. నేల మీద నుంచి దీవి అరకిలోమీటరు దూరంలో ఉంది. తెప్ప ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే లోపే దీవి వచ్చేస్తుంది. దీవిలో దేవుడు... కురువపురం దీవిలో దత్తాత్రేయ దేవస్థానం ప్రసిద్ధ క్షేత్రం. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో భక్తులు విశేషంగా దర్శిస్తుంటారు. పౌర్ణమి గురువారం మరింత విశిష్ఠమైనదిగా చెబుతారు. ఈ దీవిలో ఉన్న మఠంలో రాత్రి బస చేయవచ్చు, ఉచిత భోజనం ఉంటుంది. హోటళ్లు కూడా ఉన్నాయి. విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, తినుబండారాలు దొరకడం కష్టమే. కాబట్టి మక్తల్‌లో కొనుక్కుని వెళ్లడం మంచిది. ఇక్కడికి కర్నాటక వాళ్లు కూడా ఎక్కువగానే వస్తారు. రాయచూర్ ఇక్కడికి 30 కి.మీ.లు మాత్రమే. ఇప్పుడే కురిసిన మేఘమా... కృష్ణానదిలో శిలలు పైకి కొనదేలి ఉండవు. బల్లపరుపుగా ఇసుకతిన్నెలాగ ఉంటాయి. ఆ రాళ్ల మీద నిలబడి 360 డిగ్రీల కోణంలో తిరిగి చూస్తే ఎటు చూసినా పరవళ్లు తొక్కుతున్న నది అందంగా ఉంటుంది. నల్లమబ్బు అప్పుడే కరిగి నేల మీద జాలువారి ప్రవాహంగా మారినట్లు ఉంటుంది. ఈ దీవి నుంచి కొద్ది దూరం వెళ్తే నది రెండు పాయలుగా చీలిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. వర్షాలు కురిసేటప్పుడు ప్రవాహం ఉధృతిని బట్టి తెప్పలను ఆపేస్తారు. అలాగే వర్షాలు తక్కువగా పడిన ఏడాది ఎండాకాలంలో తీరం నుంచి దీవికి నడిచి వెళ్లవచ్చు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కాబట్టి ఈ ఎండాకాలం కూడా హాయిగా తెప్పలో విహరిస్తూ దీవి పర్యటనకు వెళ్లవచ్చు. వీకెండ్ హాలిడేకి ఇది మంచి ప్రదేశం. -
పర్యాటకానికి పెళ్లి కళ
న్యూఢిల్లీ: దేశంలో ఖరీదైన వివాహ వేడుకల సందడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది చాలా వివాహాలకు బ్రేక్ పడింది. అయితే, తమ వివాహాలను ‘అద్భుతం.. అనిర్వచనీయం’ అనే తీరున నిర్వహించుకోవాలన్న ఆకాంక్షలతో ఉన్న వారు ఈ ఏడాది అందుకు సరైన ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటలీలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన టుస్కానీలో విరాట్ కోహ్లీ–అనుష్క శర్మల వివాహం.. ఇటలీలోనే మరో చిన్న పట్టణం ‘కోమో’లో జరిగిన దీపికా పదుకొణె–రణవీర్‌సింగ్‌ల వివాహ వేడుకలు గుర్తుండే ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో.. ఈ తరహా ఘనమైన వివాహాలకు దేశీయంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు ఇప్పుడు రద్దీగా మారుతున్నాయి. దేశంలో వివాహ గమ్యస్థానాలుగా (డెస్టినేషన్ వెడ్డింగ్) పేరొందిన జైపూర్, జోధ్‌పూర్, ముస్సోరీ ప్రాంతా ల్లోని అల్ట్రా లగ్జరీ హోటళ్లకు ఇప్పుడు భారీ డిమాండ్ నెలకొంది. గతేడాది కరోనా కారణంగా చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కుదామనుకుంటే.. కరోనా మళ్లీ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం పరిమిత కాలపు నిషేధం విధించడం వారిని ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించేలా చేసింది. దీంతో ‘ఆగడం ఇక మా వల్ల కాదు’ అని భావించే వారు.. దేశీయంగానే మనసులను కట్టిపడేసే ప్రదేశాల వైపు చూస్తున్నారు. దీంతో ఖరీదైన వివాహ వేడుకులకు పేరొందిన.. తాజ్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, మారియట్, యాకోర్ ఇవన్నీ కూడా ఇప్పుడు బుకింగ్‌లకు మంచి డిమాండ్‌ను చూస్తున్నాయి. రణబీర్ కపూర్ వివాహం ఎక్కడ? ‘‘ఖరీదైన భారతీయ వివాహ వేడుకలు ఇప్పుడు కొంచెం పలుచన అయ్యాయేమో (తగ్గడం) కానీ.. గతంతో పోలిస్తే మరింత భారతీయతను సంతరించుకుంటున్నాయి’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరొందిన ప్రముఖ హోటళ్ల జనరల్ మేనేజర్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఉదయ్‌పూర్‌లో కలల వివాహాలకు పేర్కొందిన ఉదయ్ విలాస్‌లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకకు రణబీర్‌కపూర్ గతంలో విచ్చేశారు. కానీ, ఇప్పుడు హోటళ్ల ప్రతినిధుల మధ్య ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నందున.. రణబీర్ కపూర్ వివాహానికి ఏ హోటల్ వేదిక కానుందనే’’ అని పేర్కొన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హోటళ్ల యాజమాన్యాలు పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు సంబంధించి అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయి. గరిష్టంగా అతిథుల ఆహ్వానంలో పరిమితులు, అతిధుల మధ్య భౌతిక దూరం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘యే జవానీ హాయ్దివానీ తరహా వివాహాలను ఖరీదైన ప్రదేశాల్లో చేసుకోవాలంటే.. అది కనీసం రెండు మూడు రోజుల కార్యక్రమమే అవుతుంది. సంగీత్, మెహెంది, హాల్ది, చివరగా వివాహ వేడుక ఇలా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం ఖర్చు.. బస, భోజనాలు, పానీయాలు, వినోదం, ఇతర కార్యక్రమాలకు ఎంతలేదన్నా కనీసం కోటి నుంచి కోటిన్నర రూపాయల ఖర్చు ఉంటుంది’’ అని ప్రముఖ హోటల్ ప్రతినిధి పేర్కొన్నారు. డిమాండ్‌తో పెరుగుతున్న చార్జీలు.. ‘‘మా హోటళ్లలో పరిమిత అతిధులతో కూడిన వివాహాలకూ డిమాండ్ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లోనూ చక్కని బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఈ విభాగంలో తిరిగి డిమాండ్ బలపడుతోంది’’ అని తాజ్ హోటల్స్ అధికార ప్రతినిధి తెలిపారు. చాలా హోటళ్లు 2019 సంవత్సరం టారిఫ్‌లను 2021 మొదటి మూడు నెలల్లో జరిగిన వివాహ వేడుకలకు వసూలు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలోని వివాహాల బుకింగ్‌లపై 2019లో వసూలు చేసిన చార్జీల కంటే 10–15 శాతం అధికంగానే చార్జ్ చేయడం జరుగుతోంది. ఇక 2021 అక్టోబర్–డిసెంబర్ కాలంలోని పెళ్లిళ్ల బుకింగ్‌లపై చార్జీలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోని చార్జీల కంటే 20 శాతం అధికంగా ఉండనున్నాయి’’ అని జైపూర్‌లోని ఫెయిర్మాంట్ జనరల్మేనేజర్ రాజీవ్ కపూర్ చెప్పారు. -
కౌంట్‌డౌన్ స్టార్ట్.. మరో వారం రోజుల్లోనే
మెగా ఫ్యామిలీలో పెళ్లిబాజా కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో నటి, నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబు కానుంది. దీంతో నిహారిక, చైతన్యలు తమఫ్రెండ్స్తో కలిసి ఉదయ్‌పూర్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే. ప్రముఖ బిజినెస్‌మ్యాన్ చైతన్యతో నిహారిక వివాహం డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో జరగనుంది. ఇప్పటికే పెళ్లిక సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య వివాహ వేడుక జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్లోవీరి రిపెప్షన్ జరగనుంది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ నేపథ్యంలో ఇప్పటికే చైతన్య- నిహారిక జంట ఉదయ్‌పూర్ చేరుకున్నారు. (నిహారిక పెళ్లి పనులు షురూ ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ప్యాలెస్‌లో పెళ్లి
నటి, నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్లో ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఆగస్ట్‌లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరూ డిసెంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని టాక్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి జరగనుందట. డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం కుదిరిందని సమాచారం. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య ఈ వేడుక జరగనుంది. -
‘అవకాశాలు ఎక్కువ.. సులువుగా వీసా’
హైదరాబాద్: ‘ఐరోపా సిలికాన్ వ్యాలీ’గా పేరు గాంచిన ఐర్లాండ్ ఇప్పుడు భారత విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతోంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐర్లాండ్వైపు చూస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలు టెక్ కంపెనీలు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. (భర్త లేడు: కొడుకును పెళ్లాడిన తల్లి?) ‘ఉన్నత చదువుల కోసం మొదట్లో అమెరికా వెళ్లాలనుకున్నాను. వర్క్ వీసా పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని తెలిసి యూఎస్ ఆశలు వదిలేసుకుని ఐర్లాండ్‌ను ఎంచుకున్నా. అమెరికాతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు వర్క్ వీసా సులువుగా పొందవచ్చు’ అని డబ్లిన్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న రాకేశ్‌రెడ్డి బాదం తెలిపారు. శాశ్వత నివాసానికి అవసరమైన విధానం చాలా సులువుగా, సరళంగా ఉంటుందని వెల్లడించారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా సులభంగానే దొరుకుతాయని మార్కెటింగ్‌లో ఎంబీఏ చేస్తున్న అఖిల్ పుల్లినేని అనే విద్యార్థి చెప్పారు. యూరప్ దేశాల్లో బ్రిటన్‌తో పాటు ఐర్లాండ్‌లో మాత్రమే అదనంగా మరో భాషను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. (పేద దేశాలకూ కరోనా టీకా అందాలి) తమ దేశంలో నివాసానికి, చదువులకు అయ్యే ఖర్చు తక్కువని ఐర్లాండ్ ఎడ్యుకేషన్ సీనియర్ సలహాదారు బ్యారీ ఓడిస్కోల్ అన్నారు. ఏడాది పీజీ కోర్సుకు దాదాపు 11.16 నుంచి 19.6 లక్షల రూపాయల వరకు ఫీజు ఉంటుందన్నారు. విద్యార్థులు సంవత్సరానికి 10 వేల యూరోలు(సుమారు రూ. 8.9 లక్షలు)తో గడిపేయొచ్చని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ఐర్లాండ్‌కు వస్తున్న భారత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నమాట వాస్తమేనని అంగీకరించారు. ‘సంప్రదాయ ప్రత్యామ్నాయాలతో పోల్చుకుంటే ఉన్నత విద్యకు ఐర్లాండ్ మంచి గమ్యస్థానమని విద్యార్థులు భావిస్తున్నార’ని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు రెండేళ్ల స్టే బ్యాక్ వీసాను అందిస్తున్నట్టు వెల్లడించారు. బిజినెస్, సైన్స్, ఇంజినీరింగ్ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. బిగ్ డేటా, సైబర్ సెక్యురిటీ కోర్సులకు బాగా డిమాండ్ ఉందన్నారు. -
సత్‌భుక్తి
సింహాచలం మండుటెండను, నెత్తిమీది బరువునూ భరిస్తూ గమ్యం చేరి, తలమీది బరువును దిగ్గున కింద పడేసి, ఒక షాపు మెట్ల మీద కూర్చుంది. చీరకొంగు ముందుకు లాక్కుని, ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. చెంగుతో కలిసిన చేతివేళ్లు కళ్లవద్దకు వచ్చేసరికి కన్నీళ్లు తన్నుకు రాబోయాయి. కానీ, అలవాటైన చేతివేళ్లు ఆ కళ్లను సముదాయించి, తమ బాధ్యతను నెరవేర్చుకున్నాయి. సింహాచలం నిట్టూర్చింది. బతికి చెడినవారికి నిట్టూర్పులు, చెడి బతికినవారికి మైమరపులూ పరిపాటే. నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు అనుకుందామె. మనస్సుకు కాస్త తీరుబడి దొరికితే అది గతంలోకి చొచ్చుకుపోతుంది. ఉస్సూరుమంటుంది. శరీరానికే గానీ, మనస్సుకు విశ్రాంతినివ్వలేదా దేముడు. ఈలోగా కోమటి కోటేశ్వర్రావు కొడుకు నాగేశ్వర్రావు వచ్చి, షాపు తెరుస్తూ, ‘‘ఏం సింహాచలం! ఈరోజు పేపర్లు బాగానే పట్టినట్టున్నావే’’ అన్నాడు. సింహాచలం పేపర్లు తక్కెడలో పెడుతూ, ‘‘ఏముంది నాయనా, ఎంత సంపాదించినా కూటికీ, ఎన్నాళ్లు బతికినా కాటికేగదా అన్నట్టుంది నా కథ’’ అంది.‘‘నీతో మాట్లాడేటపుడో నోట్‌బుక్కూ, ఓ పెన్నూ సిద్ధం చేసుకోవాలి. ఎన్ని సామెతల్జెప్తావో’’ అన్నాడు నాగేశ్వర్రావు.పేపర్ల డబ్బులు తీసుకుని, కాళ్లీడ్చుకుంటూ గుడిశకి చేరి, ఓ మూడు గుప్పెళ్ల బియ్యం అత్తెసరు పడేసి, గోడకి జారపడి కూర్చుంది సింహాచలం. ఆమె మనస్సు గతంలోకి గుంజింది. ‘‘... సింహాచలం గెట్స్ క్లాస్ ఫస్టినింగ్లీష్’’ అది తన ఇంగ్లిష్ టీచర్ గొంతు. అది ఎనిమిదో తరగతి క్లాసు. టీచర్ గొంతు విన్న పిల్లల్లో ఆనందంతో కొందరు, ఆనవాయితీగా కొందరు, సరదాగా కొందరు, తప్పనిసరిగా కొందరు చప్పట్లు కొట్టారు. ఆ ఆనందంతో తను ఎగిరి గంతేసినంత పనిచేసి, నిభాయించుకుంది. మనస్సు మాత్రం ఎగిరి, గంతున్నర వేసింది ఉత్సాహంతో. ఆ రాత్రి భోజనాలయ్యాయనిపించుకున్నాక, సింహాచలం తండ్రితో, ‘‘నాన్నా! పన్నెండు పాసయ్యాక నే టీచరు చదువుతా’’ అని, కాసేపాగి, ‘‘వెంటనే కాదులే.. ఓ ఏడాగుతా.. ఈనెల నుంచీ మరికొన్నిళ్లు పనికి ఒప్పుకుంటా’’ అంది. సింహాచలం తండ్రి ఆమెకేసి జాలిగా చూసి, ‘‘అలాగేనమ్మా! నాకు కూతురివైనా, కొడుకువైనా నువ్వే కదా’’ అన్నాడు. తనకంత స్తోమతుందో లేదో అతనికే తెలీదు. ఈలోగా తల్లి సత్తెమ్మవచ్చి కూర్చుంటూ ‘‘మింగ మెతుకు లేదు. మీసాలకు సంపంగి నూనే అన్నట్టుంది నీ కథ’’ అంది.‘‘ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత కదే అది చెప్పేది. ఇప్పుడే మీద పడ్డట్టెందుకా ఊపు’’ అన్నాడతను చిరాగ్గా. సత్తెమ్మ అది వినిపించుకోకుండా ‘‘ఈ చదువయ్యాక ఆ చదువెన్నేళ్లే’’ అంది.‘‘ఓ ఏడాది’’‘‘అంటే మొత్తం అయిదేళ్లు.. తర్వాత’’‘‘ఉద్యోగం.. టీచరుద్యోగం చేస్తా’’‘‘ఎన్నేళ్లు మిడుకుతావ్’’సింహాచలం కాసేపాగి ‘‘ఓ రెండేళ్లు. కాపోతే మరో ఏడు’’ అంది.‘‘అంటే.. ఊ.. సరి. ఆ తర్వాత?’’ సింహాచలం జంకింది. ‘‘ఆ తర్వాత – నీ ఇష్టప్రకారం బావను పెళ్లి చేస్కుంటా. అయినా ఉద్యోగం మానను’’సత్తెమ్మ వెటకారంగా నవ్వింది.‘‘అంటే నీకోసం వాడు ఎనిమిదేళ్లు ఆగాలటే.. నా ముఖంలా ఉంది నీ కథ. ఆ మాత్రం దానికి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే నీ పీడ మాకు, మా పీడ నీకూ ఉండదు కదా’’ అందామె.‘‘పోనీ పెళ్లి చేసుకొని చదువుతా’’ అంది సింహాచలం గొంతు తగ్గించి. ‘‘అది నీ అత్త, నీ మొగుడూ ఇష్టం. నీకు పెళ్లి చేసి, మేం చేతులు దులుపుకుంటే ఇహ నువ్వేవ్టో, నీ కోర్కెలేవ్టో అన్నీ ఆ ఇంట్లోనే’’ అంటూ సత్తెమ్మ నడుంవాల్చింది.భవిష్యత్తు ఆలోచించుకుంటూ సింహాచలం కూర్చున్న చోటే సాగిలపడింది. అత్తెసరులో అన్నం మాడుతున్న వాసన సింహాచలాన్ని వాస్తవానికి లాగింది. ‘‘ప్చ్! ఏం బతుకిది’’ అనుకుంటూ సింహాచలం పొయ్యిమీంచి గిన్నె దింపింది. సంకల్పం ప్రకారం సింహాచలం ఆ నెల నుంచే మరికొన్ని ఇళ్లల్లో పనులు కూడా ఒప్పుకుంది. సంపాదనంతా నీల డబ్బీలో జమచేసి, నిలవ రాసుకునేది నెలనెలా. ఇలాగే ఓ రెండేళ్లు గడిచాయి. పెళ్లికి తండ్రి మద్దతుతో తల్లితో పోట్లాడుతూండేది. ఈలోగా దేవుడిటు చూశాడు. బీదవాళ్లను ధనలేమితోను, ధనం ఉన్న వాళ్లను ఆరోగ్యలేమితోను బాధలు పెడతాడాయన. అదే ఆయన గడుసుదనం. సాఫీగా సాగుతున్న కొంపమీద కొండ విరిగిపడ్డట్టు సింహాచలం నాన్న తను అద్దెకు తీసుకున్న ఆటో ఆ ఓనరుకు అప్పజెప్పి, లెక్క చెల్లుపెట్టి వస్తూంటే అతన్నో కారు ఢీకొంది. కారు ఓనరు వైద్య సహాయం చేసినా,కాలు విరిగి, ఇక ఆటో తోలడం మంచిది కాదు అనే నమ్మకంతో రెండు నెలలు ఆసుపత్రిలో ఉండి తిరిగొచ్చాడు.సింహాచలం నీల డిబ్బీ పైకొచ్చి, పగిలి ఆ ఖర్చు కొంత భరించింది.తనకిక చదువు యోగం లేదని సింహాచలానికి అర్థమయ్యింది. అయినా పన్నెండో క్లాసయ్యాక కదా. ఇంకా టైముందిలే.. అని మనస్సుకు సర్ది చెప్పుకునేది. మరో ఏడు గడ్డుగా గడిచేసరికి సింహాచలం నాయనమ్మ గోల ఆరంభించింది. తనకు చావు దగ్గరకొచ్చిందనీ, మనమరాలి పెళ్లి చూడకుండా చావదలుచుకోలేదనీ ప్రకటించింది. నానా గోల చేసి, రెండుసార్లు మంచం దిగి, మళ్లీ ఎక్కింది. ఫలితంగా సింహాచలం మెడలో మూడు ముళ్లూ పడ్డాయి. జీవితదశ దిశ మారిపోయిందామెకు ఆ మూడు ముళ్లతో. ఏడాది తిరిగేసరికి ఒక పిల్లాడు ఒళ్లో పడ్డాడు. ఇంటింటెడు చాకిరీ చేసి, మరో ఆరిళ్లకూ అదే పని చేసి, ఉస్సురుమంటూ ఇంటికొచ్చిన తనని చూసి, అత్తగా మారిన మేనత్త జాలి పడేది కాదు. ఈ దిక్కుమాలిన మేనరికం తగలడకపోతే, ఆ ముసిల్ది గోలచేసి, చావకపోతే తన కొడుక్కి చక్కని కట్నంతో పెళ్లయ్యేదని ముప్పూటలూ దెప్పేది. ఇంట్లో పని, బయట పని, అత్త సేవ, మొగుడి సేవ, పిల్లాడి చాకిరీ... రకరకాల పనులతో సింహాచలం జీవితం యంత్రాన్ని మించిన యంత్రంగా మారింది. ఆరోజు వర్షం పడుతూ ఉండటంతో సింహాచలం నాగేశ్వర్రావు షాపు ముందే కూర్చుంది. నాగేశ్వర్రావు తాను చూస్తున్న టీవీని ఆపు చేసి, ‘‘సింహాచలం, నీ కథ చెప్పు. నీ మొగుడు, కొడుకూ ఏరి! ఒంటరిగా ఒక్కతివే ఎందుకుంటున్నావు?’’ ఇల్లొదిలి వచ్చేశావా? ఏంటసలు..’’ అన్నాడు. సింహాచలం మాట్లాడేలోగా, ‘‘అవును, ఆ నాగేశ్వరమ్మ కూతురికి చదువు నువ్వే చెప్పిస్తున్నావట కదా, ఎందుకు! వాళ్లంత లేనివాళ్లు కాదు కదా,’’ అన్నాడు. సింహాచలం విరాగినిగా నవ్వింది. ‘‘నా కథ నాకు నేనే చాలాసార్లు చెప్పుకుంటుంటాను. మననం చేసుకుంటుంటాను. విమర్శించుకుంటుంటాను. అలా చెయ్యవలసినది, ఇలా చెయ్యవలసినది అనుకుంటుంటాను. ఈ కట్టె రాలేలోగా ఇంకా ఎన్నిసార్లు తలుచుకుంటానో గతాన్ని’’ అంది.‘‘ఓ సివాచలం, ఉపోద్ఘాతం మాని, కథ చెప్పు. మా నాన్నొచ్చేడంటే కథకు కామా పడుతుంది’’ అన్నాడు నాగేశ్వర్రావు. సింహాచలం ఆరంభించింది.‘‘ఒంటరితనం చాలా కష్టం నాయనా! పైగా ఓ లక్ష్యం లేని జీవితం సారం తీసేసిన చెరుకు పిప్పిలా ఉంటుంది. నాలుగు రాళ్లు సంపాదించడం, ఒండుకోవడం, మింగడం, పడుకోవడం – మర్నాడు, ఆ మర్నాడూ.. ఇహ జీవితమంతా అంతే! బతకడానికో అర్థం, లక్ష్యం ఉండాలి. నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ జన్మలో చదువుకూ నాకూ అంతే రాసిపెట్టాడా దేవుడు. చక్కగా చదువుకునే ఓ పిల్ల చదువు బాధ్యత తీసుకుందామని మన సందవతలుండే స్కూలుకు వెళ్లి అయిదో క్లాసులో బాగా చదివే పిల్లను ఎంచుకున్నాను. ఆ పిల్ల పేరు వైదేహీ. దాని మార్కులు అవీ బాగున్నాయి. ఆ పిల్లతో వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లమ్మా నాన్నతో మాట్లాడాను. ‘‘ఏవన్నారు వాళ్లు.. మేమేం లేనివాళ్లం కాదు. పదిళ్లల్లో పని చేసుకునే దానివి నువ్వు ఎవరు చదివించడానికి అన్లేదా?’’ అన్నాడు నాగేశ్వర్రావు. ‘‘అలానే అన్నారు. కానీ నా కోరిక చెప్పాక ఒప్పుకున్నారు.’’ ‘‘ఏమని చెప్పావు?’’ ‘‘నేను బతకడానికీ, ఒంటరితనాన్ని వెళ్లగొట్టుకోడానికీ ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను. మీరొద్దంటే, మరో పాపను ఎంచుకుంటాను’’ అన్నాను. స్కూల్లో మాష్టారు కూడా ఇదో స్కాలర్షిప్ అనుకోండి అని నచ్చజెప్పాడు. చివరికి వాళ్లు ఒప్పుకున్నారు.’’ అంది.‘‘ఆర్నెల్లయ్యిందా.. ఇది మొదలెట్టి?’’‘‘అయ్యుంటుంది.’’ అని మళ్లీ తనే ఆరంభించింది. ‘‘ఆ పిల్ల ఎంతవరకు చదువుకుంటే అంతవరకూ చదివిస్తా. నాకు టీచర్ ఉద్యోగం అంటే ఇష్టం.’’ అంది.‘‘బీఏ చేయించి, ట్రయినింగ్ చేయిస్తావా ఆ పిల్లని.. చాలా డబ్బవుతుంది కదా’’ అన్నాడు నాగేశ్వర్రావు, నోటి లెక్కలేసి చూసుకుంటూ. ‘‘ఏమి నాయనా! ఓపిక ఉన్నంతవరకూ చదివిస్తా. అది పోతే ఇంకేం చెస్తాం. చేతులెత్తేస్తా.. చూద్దాం దేవుడేం చేస్తాడో’’ అంది వేదాంత ధోరణిలో. ‘‘ఇక నువ్వు ఒంటరివెలా అయ్యావో చెప్పు’’ అని అంతలోనే ‘‘బాబోయ్, మా నాన్నొస్తున్నాడు. గమ్మునుండు. లేకపోతే నన్ను నస పెట్టి చంపేస్తాడు’’ అన్నాడు.కోటేశ్వర్రావు కొట్టు మెట్లెక్కుతూ, ‘‘ఏం సింహాచలం. తీరుబడిగా కూర్చున్నావే’’ అని మళ్లీ తనే, ‘‘అవున్లే! ఒంటి ప్రాణం. ఆరాటం లేని లైఫ్’’ అని ముగించి, కొడుకు వైపు చూస్తూ ‘‘ఏరా.. బోణీ ఏమైనా అయ్యిందా,’’ అని దానికి తనే సమాధానం చెప్పుకుంటూ, ‘‘నువ్ కూర్చుంటే బోణీ లేదు, వోణీ లేదు. పోరా, పోయి చదువుకునేడు’’ అన్నాడు. కొడుకు కిమ్మనకుండా మెట్లు దిగి మాయమైపోయాడు. కోటేశ్వర్రావు షాపులో కూర్చుంటూ, ‘‘అదేవ్టీ.. నువ్వు ఆ నరసయ్య కూతురి చదువు ఖర్చు భరిస్తున్నావట. డబ్బెక్కువయిందా, ఒంటరిదానివి. డబ్బులెక్కువయితే బ్యాంకులో దాచుకుంటే రేపు కాలూ చెయ్యి లొంగకపోతే అవసరమవుతాయి కదా’’ అన్నాడు.సింహాచలం వాదనవుతుందని, పెద్ద వాళ్లతో వాదన మంచిది కాదని, నవ్వేసి ఊరుకుంది. తాను చదివిస్తున్న పిల్ల వైదేహికి ఓ గౌను కొని, ఆ గౌను పెట్టెలో దాచుకుని, మర్నాడివ్వాలనీ, పెట్టె తీస్తే ఆ పెట్టెలో తన కొడుకు చొక్కా ఒకటి కనిపించింది.సింహాచలం కళ్లలో నీరు గిర్రున తిరిగింది. గుర్తుకొచ్చిన కొడుకు ఆమెను గతానికి లాక్కుపోయాడు.బంధువుల ఇంట్లో పెళ్లికి బయల్దేరారందరూ. తన తండ్రికి వాళ్లు ఛార్జీలకు డబ్బు కూడా పంపారు. తాను, తన కొడుకు, మొగుడూ, తల్లిదండ్రులూ, మామ గారూ.. అత్తయిన మేనత్త తాను రానంది. పెళ్లికి వెళ్లి ఆనందంగా తిరుగు ప్రయాణంలో కబుర్లూ పాటలతో సంతోషంగా ఉన్నారంతా. ట్రాక్టరు ట్రయిలర్ తొట్టిలో సిమెంటు బస్తాల లోడు మీద గోనె సంచులు పరుచుకుని కూర్చున్నారు. గేటులేని రైలు కట్ట ఎక్కుతూ ట్రాక్టరు అదుపుతప్పి, గుంజుకుని, కట్టమీంచి దొర్లుకుంటూ పడిపోయింది.పెళ్లి వారందరూ కింద, వారిమీద సిమెంటు బస్తాలు పడ్డాయి. ఊళ్లో జనాలకి తెలిసి, పరుగున వచ్చి ఆ సిమెంటు లోడంతా తీసేసరికి అందరూ చచ్చిపోయారు. సింహాచలం కన్నీరాగలేదు. తన కొడుకు సిమెంట్ విగ్రహంలా మారిపోయాడు. అందరూ కూడా ఊపిరాడక, సిమెంటు లోపలకు – ఊపిరితిత్తుల్లోపలకు పోయి, అంతా చచ్చిపోయారు. సిమెంటు బస్తాలు కొన్ని పగిలి కొందర్ని విగ్రహాలుగా మార్చేశాయి. తనకి మాత్రం రెండు కాళ్లమీద నాలుగైదు సిమెంటు బస్తాలు పడి, గిలగిల్లాడింది. సింహాచలం వెక్కి వెక్కి ఏడ్చింది. చాలాసేపు ఏడ్చాక, ఆ ఏడుపే ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్లు తుడుచుకుని, ముఖం కడుక్కుని, ఓ చెంబుడు మంచినీళ్లు తాగి స్థిమితపడింది. సింహాచలం కథ అంతటితో ఆగలేదు. ఒంటరిగా ఇంటికొచ్చిన సింహాచలాన్ని జుట్టు పట్టుకుని, సింహాచలం అత్త నడిరోడ్డు మీదికి ఈడ్చింది. ‘‘పాపిష్టిదానా, తల్లినీ తండ్రినీ, కొడుకునూ మింగడమే గాక, నీ మొగుణ్నీ మింగి, నా మొగుణ్నీ మింగి రాయిలా తిరిగివచ్చావా.. లోపలకొచ్చావంటే నీ మీదకి కిరసనాయిలు పోసి, తగలబెడ్తా. నేను జైలుకెళ్లినా ఫర్లేదు. నిన్ను బతకనివ్వను’’ అంటూ భీభత్సంగా గోల చేసింది. సింహాచలం ఆ ఊరు వదిలి, ఈ ఊరు చేరి, ఒంటరి బతుకు ఆరంభించింది. ఆరోజు ఎన్ని వీధులు తిరిగినా, ఎంత తిరిగినా పాత పేపర్లు దొరకలేదు. ఇక కొత్త వీధులు తిరిగి చూద్దామని, కొంచెం దూరం వెళ్లి ప్రయత్నించింది సింహాచలం. ఓ సందులో తన కేక విని ఒకావిడ ఎదురు కేక వేసింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ సింహాచలం ఆ ఇంటికి వెళ్లింది. ఆ ఇంటావిడ కట్టలు కట్టలుగా కట్టిన పేపర్లు తెచ్చి నెమ్మదిగా కింద పెత్తి ‘‘అన్నీ నీటుగా కట్టాను. తూచి చూసుకో’’ అని బేరమాడి, ఖరారు చేసింది.సింహాచలం కట్టలన్నీ తూచి, తన గోనే సంచీలో వేసుకుని, ఆవిడకివ్వాల్సిన డబ్బులిచ్చి, బరువు నెత్తికెత్తించుకుని బయల్దేరింది. ఆ ఇంటావిడ మురిసిపోతూ ఆ డబ్బు బీరువాలో దాచుకుంది. ఆ ఇల్లాలు మైథిలి.బరువు దింపుకుంటున్న సింహాచలాన్ని చూసి, ‘‘ఏం సివాచలం.. ఈరోజు బాగా పేపర్లు దొరికినట్టున్నాయే’’ అన్నాడు షాపు ఓనరు కోటేశ్వర్రావు లేచి, లైటు వేసి, దేవుడికి దండం పెట్టుకుంటూ. షావుకారు దీపం వేశాక ఇక ఆ పూట డబ్బులిచ్చే పనులేవీ చేయడని సింహాచలానికి తెలుసు. తాను తెచ్చిన పేపర్లన్నీ పొందికగా షాపులో ఒక మూల సర్దింది. కాస్సేపు మెట్లమీద కూర్చుని, ఇంటికి వెళ్లిపోయింది. పేపర్లమ్మిన ఇల్లాలు మైథిలి మొగుడు ఇంటికి రాగానే ‘‘పేపర్లమ్మేశాను’’ అని, ఎంత డబ్బు వచ్చిందో చెప్పి, పేపర్లు కొన్ని నెలలుగా అమ్మిన డబ్బు మొత్తం ఎంతో కూడా లెక్కలు చెప్పి, ‘‘నా దగ్గర ఎంతుంటే అంత డబ్బు మీరిస్తానన్నారు కదా, ఇవ్వండి’’ అంది.ఆ ఇల్లాలి భర్త ఎగిరి గంతేశాడు. ‘‘ఏయే.. నా బీరువా మీద విడిగా పెట్టిన పేపర్లు కూడా అమ్మేశావా?’’ అంటూ ఒక్క గెంతులో లోపలకెళ్లి బీరువాపైన ఖాళీగా ఉండటం చూసి, మరో గెంతులో పెళ్లాం మీద విరుచుకుపడ్డాడు. ‘‘ఓసినీ, ఆ పేపర్లు విడిగా పెట్టాను కదా, అవి కొన్ని చాలా ఇంపార్టెంటు పేపర్లు. ఆ పేపర్ల మధ్యలో ఓ కవరు పెట్టాను. అది తీసి దాచావా?’’ అన్నాడు.‘‘లేదు. కవరేం కనబళ్లా’’ అందా ఇల్లాలు.ఇంటాయన మోహన్‌రావు పిచ్చిపట్టిన వాడిలా జుట్టు కొంచెం పీక్కుని, ‘‘చంపేశావే.. ఆ కవర్లో డబ్...’’ అని, తమాయించుకుని ‘‘వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన కాగితాలు పెట్టాను. ఎవడికిచ్చావో గుర్తుందా, రా, బండెక్కు’’ అని దాదాపు అరిచినంత పని చేశాడు. మైథిలి కిక్కురుమనకుండా స్కూటరువెనక కూర్చుంది. దారిలో సింహాచలాన్ని వర్ణించి చెప్పింది. ఇద్దరూ ఓ గంటన్నర తెగ తిరిగి ఉస్సురుమంటూ ఇల్లు చేరారు. మోహన్‌రావు ధుమధుమలాడుతూ సోఫాలో కూలబడ్డాడు.‘‘అందులో ఇంపార్టెంటు పేపర్లా, లేక డబ్బు పెట్టారా. నాకు నిజం చెప్పండి. మీ వాలకం చూస్తే పేపర్లు పోయినట్టనిపించట్లేదు’’ అంటూ కొంచెం దబాయించి చూసింది.మోహన్‌రావు కిమ్మనకపోయేసరికి ఆమెకి కొంచెం ధైర్యం పాలు ఎక్కువైంది. దాంతో కాస్త పుంజుకుని ‘‘ఎన్ని వేలు ఉన్నాయందులో’’ అంది. ‘‘కాస్సేపు నోరు మూసుక్కూర్చుంటావా’’ అన్నాడు మోహన్‌రావు. కానీ మైథిలికి తనమీద తనకు నమ్మకం ఎక్కువైంది. కాస్సేపాగి, ‘‘ఓ పది వరకూ ఉండొచ్చా. చెప్పండి. పోయిన దాన్ని బట్టి ప్రయత్నం చేయడమా, మానడమా ఆలోచిస్తా. నాలుగిళ్లు వాకబు చేస్తే ఆ ముసిల్దాన్ని ఈజీగా పట్టియ్యచ్చు’’ అంది.ఈలోగా గేటు శబ్దమయితే అటు చూసి, ‘‘అయ్! అదిగో ఆ ముసిల్దే వచ్చింది’’ అని ఒక్క గంతులో గుమ్మం దాటి గేటు దగ్గరికి చేరింది. మోహన్‌రావు కూడా ఒక్క ఉదుటున హాలు దాటి గేటు దగ్గరకు చేరాడు. ‘‘మీ పేపర్లలో ఈ కవరొకటి ఉంది’’ అంటూ సింహాచలం ఆ కవరు మైథిలి చేతిలో పెట్టేలోపు మోహన్‌రావు గద్దలో ఆ కవర్‌ను లాక్కున్నాడు. ‘‘అందులో డబ్బు సరి చూసుకోండి’’ అంది సింహాచలం. ‘‘ఎంతుందే అందులో’’ అంది మైథిలి. ‘‘పదివేలు’’ అంది సింహాచలం. ‘‘పదివేలా.. అంతేనా.. నువ్వేమయినా..’’ అని మైథిలి నిలదీయబోయింది. ‘‘అలా చేసేదాన్నయితే.. ఈ డబ్బు కూడా పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు’’ అంది సింహాచలం. కవరు సరిచూసుకున్న మోహన్‌రావు సంతృప్తిగా, గాలిపీల్చి, ‘‘సరిపోయిందిలే’’ అని, ‘‘ఇందా.. ఈ వంద ఉంచుకో’’ అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. సింహాచలం ఆ వంద తీసుకుని, తన మొల్లో దోపుకున్న గుడ్డ సంచీలో పెట్టి, అందులోంచి ఓ ఇరవై రూపాయలు తీసి, ‘‘నే మోసపోయినదంతే బాబూ’’ అంది.‘‘అదేమిటీ?’’ అన్నాడతను. ‘‘చెప్తా’’ అంటూ సింహాచలం చంకలో ఉన్న గోని సంచిలోంచి కొన్ని నాపరాయి ముక్కలు తీసి మైథిలి చేతిలో పెడుతూ, ‘‘ఇవి పేపర్ల మధ్యలో ఉన్నాయమ్మా. ఈ రాళ్లు మళ్లీ మీకు అవసరపడొచ్చు. తూకం తేడా డబ్బులు అయ్యగారి వద్ద తీసేసుకున్నాను’’ అంది. వారిద్దరూ నిర్ఘాంతపోయి, తేరుకునేలోగా సింహాచలం రోడ్డు మీదికి వచ్చేసింది. ఆమె మనస్సు తేలికపడి, హాయి అనిపించింది. - ఫాలక్షుడు -
చీకటని తెలిసీ
గమ్యం అగమ్యగోచరం చీకటని తెలిసీ కళ్లు మూసిన నడక తల బొప్పిగట్టిన అనుభవం సోకు మీద ఎంత మనసుపడ్డా కళ్లుపొయ్యేంత కాటుకెందుకు కనుపాపలకేం కనపడ్డవన్నీ కావాలనుకుంటయి గాలికెగిరొచ్చే దుమ్మును ముద్దాడి చెంపలమీది జలపాతాలౌతయి రెప్పల బాధ రెప్పలదే కలగన్నమనీ కడపదాటుడు తప్పుకాదు పట్టుకున్న వేలు వాసన పసిగట్టాలె చుట్టుకున్న ఆశ లోతును కనిపెట్టాలె రెచ్చగొట్టే కోరిక కొండెక్కిచ్చి తోసే అగాధాన్ని అంచనా కట్టాలె. తోడుంటదని తోడేలును నమ్మటం అమాయకత్వం కాదు అతితెలివి. కాల్చుకునే వరకే చేతుల గాయి పట్టుకున్నాంక ఆకులేంచేస్తయి. దుష్యంతుడి మతిమరుపు గాయాన్ని ఏ కణ్వాశ్రమం కన్నీళ్లు ప్రశ్నిస్తయ్? నోరెత్తని పంచభూతాల సాక్షిగా అంతరాత్మల్లేని మనుషుల సాక్షిగా ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి ఎప్పుడూ చెరలోనే మనువు మంచానికి పురుషుడు చట్రం పుత్ర సంతానం పుట్టగతులూ కలలు. పునరావృతమౌతున్న వెతల కథల నిండా మీరుపంచే అమృతం తాగి విషంచిమ్మే జాతి ఆనవాళ్లే బలివితర్దిమీద మీ బతుకుల అవశేషాలే శూన్యాల్లో సగం పంచిన వంచనలు కొలిక్కిరాని బిల్లుల కింద పొందుతున్న వాయిదాల వాయినాలు. నిస్సహాయత మీ నిర్వచనం కాదు జయించాల్సిన బలహీనత పరాధీనత మీ గాచారం కాదు మీకు మీరే విధించుకుంటున్న శిక్ష విచక్షణతో మెదిలితే విచ్చుకత్తుల కవచాలు మీరే వివేకంతో కదిలితే విజేతల చరిత్ర మీది విశ్వాసమై ఎదిగితే వికాసాల శిఖరం మీది. – వఝల శివకుమార్ -
బుద్ధుని సత్యాన్వేషణ
సందేశం ‘‘తర్జనీ దర్శయత్యన్యం సద్యస్త్వామంగుళీత్రయమ్’’ నీచూపుడు వేలుతో ఇతరులను చూపిస్తావు కాని, అదే సమయంలో మూడు వేళ్ళు నిన్ను చూపిస్తాయి... గ్రహించు!’’ అందుకే సత్యాన్నే పలకాలి. దాన్ని ప్రియంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యాన్నే కదా అని ఎన్నడూ కఠినంగా, పౌరుషంగా చెప్పరాదు. బుద్ధ భగవానుని చరిత్ర మనకు తెలిసిందే. ఆయన జీవితం మానవ జాతికి చాలా ఆదర్శమైనది. బుద్ధుడు మహారాజవంశంలో పుట్టినా, అనేక భోగభాగ్యాలున్నా కూడా వాటిని త్యాగం చేసి సర్వసంగపరిత్యాగి అయ్యాడు. సత్యాన్వేషణకై తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు. అలాంటి బుద్ధ భగవానుని ఒక వ్యక్తి ప్రతిరోజూ దూషించేవాడు. ముఖం ఎదుటే దుర్భాషలాడేవాడు. కాని అందుకు బుద్ధునిలో ఎలాంటి స్పందన ఉండేది కాదు. మౌనంగానే వుండిపోయేవాడు. కొంత కాలం గడిచిన తర్వాత బుద్ధ భగవానుడు నోరు మెదిపాడు.‘‘అయ్యా! ఏదైనా మనం ఇతరులకిచ్చినప్పుడు మనం ఇచ్చింది వారు తీసుకోకపోతే అది తిరిగి ఇచ్చిన వారికే చెందుతుంది కదా! అలాగే మీ దూషణలను కూడా నేను స్వీకరించలేదు’’ అని చాలా ప్రశాంతంగా బదులు పలికాడు. ఆ వ్యక్తిలో చలనం కలిగింది. ఆలోచించే కొద్దీ భయం కలిగింది. ‘అనవసరంగా ఒక దయామూర్తిని నిందించానే’ అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు అంతే ప్రశాంత వదనంతో ‘‘నేనెప్పుడో క్షమించి వేశాను. మీ తిట్ల వల్ల నాలో ఎలాంటి భావమూ లేదు. మీరు బాధపడవలదు’’ అని ఓదార్చి పంపించాడు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం జరుగుతుంటాయి.వాటన్నింటినీ పట్టించుకుంటే గమ్యం చేరలేము. సాధకులైన వారు ఏకాగ్రత వీడకుండా వుండాలి. ఇతర విషయాలేవీ పట్టించుకోరాదు.సాధకుడికి సాధన కాలంలో అనేక అంతరాయాలేర్పడతాయి. వాటిని లెక్క చేయకుండా గమ్యం వైపు దృష్టి సారించి కృషి చేయడమే ముఖ్యం. దేనిని సాధించాలన్నా నిర్దిష్ట మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి. ఉత్తమ సాధకులెవ్వరూ తమ గమ్యం చేరే వరకూ వదిలిపెట్టరు. వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక ప్రారబ్ధార్ధాన్ని వదిలిపెట్టరు. విఘ్నాలు ఎన్ని వచ్చినా వారి ప్రయత్నానికి ఆటంకం కలిగించలేవు. సత్యదర్శనం కలిగే వరకు నిరంతర సాధన జరగడమే సరైన నిర్ణయం.బుద్ధ భగవానుని సత్యాన్వేషణలో చెదరని పట్టుదల ఉంది. అందుకు తగిన నిరంతర సాధన వుంది కనుకనే జీవిత సత్యాన్ని కనుగొన్నాడు. ఆయన మాట, ఆయన బాట ఎన్ని యుగాలకైనా ఆదర్శవంతమైంది... ఆచరణీయమైంది. -
విరామం విహారం
కాస్త ముందుగానే ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఈ నెలలో అయినా వేసవి సెలవులు ఆస్వాదించే అవకాశం భానుడు కల్పిస్తే సద్వినియోగం చేసుకోవాల్సిందే. రొటీన్ మూడ్ నుంచి బయటపడటానికి టూర్ వేసేయాల్సిందే....ఇలా అనుకుంటుంటే మీ వీకెండ్ టూర్ లిస్ట్‌లో చేర్చాల్సిన మరో డెస్టినేషన్ కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా. - హన్మకొండ కల్చరల్ చరిత్రకు సాక్ష్యం... రత్నగర్భగా పేరొందిన ఈ కోట కాకతీయుల కాలంలో సైనిక స్థావరంగా ఉండేది. కాకతీయులు, బహుమనీ సుల్తానులు, కులీ కుతుబ్‌షాహీలు దీనిని పాలించిన దాఖలాలున్నాయి. దీని గురించి పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. రామయణ మహాకావ్యంలో, కాళిదాసు మేఘసందేశంలోనూ దీని ప్రస్తావన ఉందంటారు. 4 ప్రవేశ ద్వారాలు, 4 కోట గోడలతో నిర్మించిన పటిష్టమైన ఈ దుర్గంలో 3 ప్రాకారాలు ఇప్పటికీ చూడొచ్చు. కొండ మీద ఉన్న ఈ కోటకు చేరుకోవడానికి కష్టపడాల్సిందే. ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కి చూస్తే మానేరు, గోదావరిలో కలిసే అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. కనుచూపు మేర రమ్యమైన పరిసరాలు... కోట వైభవాన్ని లీలగా గుర్తు చేస్తూ నాటి వైభవం సాక్షిగా నేడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారనే నమ్మకం తో భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటా రు. రాముడు ప్రతిష్టించిన లింగం, శ్రీసీతారాముల పాద ముద్రలుగా చెప్పే అడుగుల ముద్రలు కోట ఆవరణలో కనిపిస్తాయి. సీతమ్మ కొలను, రామపాదాలు, సీతారాముల ఆల యం, చిన్న జలపాతం.. ఇలా ఈ కోటలో విశేషాలెన్నో. అక్కడ మిగిలి ఉన్న అవశేషాలను బట్టి కొన్ని భవనా లు, బురుజులు, మసీదులు, సమాధు లు, ప్రతాపరుద్రుని కోట, అశ్వగజశాలలుగా పోల్చుకోవచ్చు. జైలు, భోజనశాల, రహస్యమార్గాలు, ఫిరంగులు కూడా కనిపిస్తాయి. ఈ కోటలో తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారిబావి ఇలా అనేక బావులు, కొలనుల నెలవు ఈ ప్రదేశం. అనేక బురుజులు, ఆలయాలు, ప్రవేశద్వారాలున్న ఈ రామగిరి కోటకు టూరిస్టులు మాత్రమే కాకుండా స్థానికులు కూడా తరచూ పిక్నిక్కి వస్తుంటారు. వన మూలికల వేదిక ఆయుర్వేద వన మూలికలకు నిలయంగా ఈ ప్రదేశానికి పేరు. అందుకే టూరిస్టులు, స్థానికులు, సాహసికులే కాదు ఆయుర్వేద వైద్యులు, బోటనీ విద్యార్థులు కూడా తరచూ సందర్శిస్తుంటారు. అయితే చీకట్లో ఈ ప్రాంతానికి వెళ్లటం శ్రేయస్కరం కాదు. హైదరాబాద్‌కు 215 కి.మీ దూరంలో ఉందీ ఖిల్లా. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మంథని దారిలో బేగంపేట గ్రామ పరిసరాల్లో ఈ కోట ఉంది. -
పెట్టుబడుల గేరు మార్చండిలా...
పెట్టుబడి సాధనాలను ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ (వాహనాలు)గా కూడా వ్యవహరిస్తుంటారు. భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మరింత మెరుగైన స్థాయికి చేరుకునేందుకు ఇవి నిజంగానే వాహనాలుగా ఉపయోగపడుతుంటాయి. వాహనంపై ప్రయాణించేటప్పుడు గమ్యం దగ్గర్లో ఉన్నా .. చాలా దూరంగా ఉన్నా పరిస్థితులను బట్టి గేరు మారిస్తేనే గమ్యాన్ని చేరుకోగలం. అదే విధంగా మనం నిర్దేశించుకున్న భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల దిశగా ప్రయాణం సాగించేటప్పుడు కూడా ఆయా సందర్భాలు, వయసును బట్టి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడుల తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఆసాంతం ఒకే గేరుపై వెడితే గమ్యాన్ని చేరుకోవడానికి ఎలా కష్టసాధ్యంగా ఉంటుందో.. పెట్టుబడి సాధనాల విషయం కూడా అంతే. అందుకే.. ఏ సందర్భానికి ఏ వాహనం, ఏ గేరు (సాధనం) అనువైనదో తెలుసుకోవడం మంచిది. సాధారణంగా వాహనంలో నాలుగైదు గేర్లు ఉంటాయి. వేగాన్ని బట్టి గేరు ఉపయోగించాల్సి ఉంటుంది. గమ్యం దగ్గర్లోనే ఉండి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు 1-2 గేర్లు, అదే చాలా సుదీర్ఘ ప్రయాణమైతే.. మరింత వేగానికి 4-5 గేర్లు ఉపయోగించాల్సి వస్తుంటుంది. వివిధ వాహనాలు, గేర్లలాగే పెట్టుబడి సాధనాల్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవే డెట్, ఈక్విటీ సాధనాలు. వడ్డీ రూపంలో ఆదాయాన్నిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి డెట్ కోవకి వస్తే.. స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు ఈక్విటీల కిందికి వస్తాయి. ఏ గేరు ఎప్పుడు.. డెట్ సాధనాలనేవి.. గమ్యం చేరువలో ఉన్నప్పుడు.. తక్కువ వేగంలో వెళ్లేందుకు ఉపయోగపడే గేర్లలాంటివి. ఎప్పటికప్పుడు పెరిగిపోయే రేట్లను పరిగణనలోకి తీసుకుంటే వీటిపై వచ్చే రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఢోకా మాత్రం ఉండదు. వీటిని స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు.. మరో రెండు మూడేళ్లలో అమ్మాయి పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే వీటిని ఎంచుకోవచ్చు. అదే.. సదరు అమ్మాయికి ప్రస్తుతం రెండేళ్ల వయస్సుండి.. పెళ్లి ఇరవై ఏళ్ల సుదీర్ఘమైన కాలం తర్వాత చేయాల్సి ఉంటే.. ఈ డెట్ సాధనాలు పనిచేస్తాయా? అంటే పెద్ద లాభసాటిగా పనిచేయవు. కనుక.. ఇక్కడ గమ్యం చాలా దూరంలో ఉంది కాబట్టి గేర్లు మార్చాలి. మరింత వేగంగా వెళ్లగలిగేందుకు ఉపయోగపడే పై గేరుకి మారాలి. అంటే పెట్టుబడికి సంబంధించి.. సాధనాన్ని మార్చుకోవాలి. దీర్ఘకాలంలో అధిక రాబడులు అందించగలిగే సత్తా ఉన్న ఈక్విటీలను ఎంచుకోవాలి. ఉదాహరణకు.. 2010కి ముందు సుమారు ఇరవై ఏళ్ల వ్యవధిలో సెన్సెక్స్ వార్షికంగా 17 శాతం రాబడి ఇస్తే.. ముప్ఫయి ఏళ్ల వ్యవధిలో 19 శాతం ఇచ్చింది. అంటే.. ఒక రూ.1 లక్షను 1990లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 2010 నాటికి రూ. 23 లక్షలే వచ్చేది. అదే 1980లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏకంగా రూ. 1.84 కోట్లు వచ్చేది. ఇదే షేర్ల సత్తా. మరి వాహనంపై వేగంగా వెళ్లినప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లే.. ఈక్విటీల్లోనూ రాబడికి తగ్గ రిస్కులు ఉంటాయి. వాహనంపై వెళ్లేటప్పుడు ప్రమాదం జరగకుండా ఎలా నేర్పుగా తప్పించుకుని వెడతామో.. షేర్ల విషయంలోనూ రిస్కులను తట్టుకుని ముందుకు వెళ్లగలగాలి. -
దటీజ్ తెరియా!
విజయం పోటీ పడనిదే గెలుపు దక్కదు. పరుగు తీయనిదే గమ్యం అందదు. తెరియాకి గెలుపు దక్కింది. ఇక గమ్యాన్ని చేరుకోవడమే మిగిలింది. ఇంతకీ ఆమె గమ్యం ఏమిటో తెలుసా... తన అభిమాన నటి సోనాక్షి సిన్హాలా నటి కావడం! డ్యాన్స ఇండియా డ్యాన్స లిటిల్ మాస్టర్స సీజన్ 3 ఫైనల్స్‌లో ఆఖరి రౌండ్ ముగిసింది. అందరూ ఊపిరి బిగబట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులంతా టెన్షన్ పడుతున్నారు. న్యాయ నిర్ణేతల నోటి వెంట ఎవరి పేరు వినిపిస్తుందోనని చెవులు రిక్కించి నిలబడ్డారు. వాళ్లు ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. విజేత పేరు వెలువడింది. స్టేజిమీద నిలబడిన పదకొండేళ్ల తెరియా మగర్ ముఖం... గెలుపు తెచ్చిన ఆనందంతో వెలిగిపోయింది. రాత్రికి రాత్రే ఆ చిన్నారి పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది. నేపాల్‌లోని రుద్రపూర్ గ్రామంలో జన్మించింది తెరియా. అడుగులు పడుతున్నప్పుడే డ్యాన్సు స్టెప్పులు వేయడం ప్రారంభించింది. కూతురి ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. చదువులో సైతం అత్యంత చురుగ్గా ఉండే ఈ చిచ్చర పిడుగు... డ్యాన్స ఇండియా డ్యాన్సలో చోటు సంపాదించింది. కానీ గెలుస్తుంది అనైతే ఆమె ఇంట్లోవాళ్లుగానీ, ఆమె గానీ ఊహించనేలేదు. అందుకే ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అంటోంది... సీజన్ 3 టైటిల్‌తో పాటు పది లక్షల నగదు అవార్డును కూడా గెలుచుకున్న తెరియా. ఇప్పుడే ఇంత సాధించావ్, పెద్దయ్యాక ఏం చేస్తావ్ అంటే.. మరో సోనాక్షీసిన్హాని అవుతా అంటోంది తెరియా తడుముకోకుండా. సోనాక్షి అన్నా, ఆమె నటన, డ్యాన్స తనకి చాలా ఇష్టమని, ఆమెలానే నటినవుతా అంటోంది తెరియా. అంతేకాదు... కొరియోగ్రఫీ కూడా చేస్తుందట. మరో ఏడెనిమిదేళ్లు గడిస్తే మనం మరో సోనాక్షిని తప్పక చూడొచ్చు. ఎందుకంటే... తెరియా చెప్పిందంటే చేసి తీరుతుంది. అనుకున్నది సాధించి చూపిస్తుంది!