Election Expenditure
-
Election Commission: ఎన్నికల వ్యయంలో తేడాలున్నాయి
శ్రీనగర్: ఎన్నికల వ్యయ నివేదికలో చూపిన ఖర్చులో తేడాలున్నాయని బారాముల్లా ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్)కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసులు జారీచేసింది. తీవ్రవాదులకు నిధులు అందజేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ఇంజనీర్ రషీద్‌ను 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్న రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి విజయం సాధించారు. కోర్టు రెండు గంటలు పెరోల్ ఇవ్వడంతో ఈనెల 5న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రషీద్ తనకు రూ.2.10 లక్షలు ఖర్చయిందని ఎన్నికల రిజిస్టర్లో చూపారని, అయితే ఎన్నికల పరిశీలకులు నిర్వహించిన సమాంతర రిజిస్టర్లో ఖర్చును రూ.13.78 లక్షలుగా చూపారని ఈసీ తెలిపింది. ఈ వ్యత్యాసంపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. జిల్లా వ్యయ పర్యవేక్షక కమిటీ ముందు రషీద్ లేదా ఆయన ప్రతినిధి హాజరై వివరణ ఇవ్వాలని, ఈసీకి సకాలంలో ఎన్నికల వ్యయ నివేదికను సమరి్పంచాలని కోరింది. -
బిగ్ జడ్జిమెంట్ డే: మోదీ హ్యాట్రిక్ కొడతారా?
దేశవ్యాప్తంగా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 543 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తెలిసిపోతాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్నికల ఫలితాలు 8,360 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బయటపెట్టనున్నాయి. సర్వేలు పేర్కొన్నట్లు ఈ ఏట మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలిస్తే.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారు. వరుసగా మోదీ మూడోసారి గెలిస్తే జవహర్లాల్ నెహ్రూ సరసన నరేంద్ర మోదీ చేరుతారు. ఇది 1984 తరువాత అతి పెద్ద రికార్డ్ అనే చెప్పాలి.ఇప్పటికే నరేంద్ర మోదీ 400 సీట్లు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయన్న రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జరిగిన ఎన్నికల్లో బీజేపీ మొత్తం 441 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 328 స్థానాల్లో బరిలోకి దిగింది.ఎన్నికల కౌంటింగ్ మొదలైపోయింది. ఇప్పటి వరకు బీజేపీ హవా సాగుతోంది. బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. గెలుపోటములు మరి కొన్ని గంటల్లో తెలుస్తాయి. -
Lok sabha elections 2024: ఎన్నికల్లో పోటీకి ఎంత కావాలి?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బులు తన వద్ద లేవని, అందుకే పోటీకి దూరంగా ఉంటున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన సంచలనమైంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆమె గతంలోనూ లోక్‌సభకు పోటీ చేయలేదు. అందుకు బాగా ధన బలం కావాలని తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. దాంతో ఎన్నికల వ్యయం మరోసారి చర్చనీయాంశంగా మారింది... 2016లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల 2014 నుంచి 2016 దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గత రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన నికర ఆస్తుల విలువను రూ.2.5 కోట్లుగా ప్రకటించారు. అయినా ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బుల్లేవని స్వయంగా దేశ ఆర్థిక మంత్రే అనడంతో అసలు ఒక అభ్యరి్థకి ఎంత డబ్బుండాలన్నది ఆసక్తికరంగా మారింది. ఎంత కావాలి? ఎన్నికల ప్రచారానికి పార్టీలు ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. వాటికి పరిమితులేమీ లేవు. కానీ అభ్యర్థులు చేసే వ్యయాలకు మాత్రం పరిమితులున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ట వ్యయ పరిమితి రూ.40 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు రూ.75 లక్షలు, అసెంబ్లీకి రూ.28 లక్షల పరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం విధించింది. పరిమితి దాటితే..? ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయితే 30 రోజుల్లోపు, లోక్‌సభ ఎన్నికలు అయితే 90 రోజుల్లోపు వ్యయాలకు సంబంధించిన అన్ని ఆధారాలను అభ్యర్థులు ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10ఏ కింద అభ్యరి్థని మూడేళ్ల పాటు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈసీ నిర్ణయించిన పరిమితికి మించి ఎవరైనా ఖర్చు చేసినట్టయితే వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఈసీ ముందు పిటిషన్ దాఖలు చేయవచ్చు. పరిమితికి మించి ఖర్చు చేయడాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(6) కింద అవినీతి చర్యగా ఈసీ పరిగణిస్తుంది. అలాంటప్పుడు సెక్షన్ 10ఏ కింద సదరు అభ్యరి్థపై మూడేళ్లపాటు అనర్హత వేటు పడుతుంది. ఈ ఎన్నికల వ్యయం రూ.లక్ష కోట్ల పై మాటే! 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రూ.1,264 కోట్లు ఖర్చు చేసినట్టు నాడు బీజేపీ ప్రకటించగా, కాంగ్రెస్ వ్యయం రూ.820 కోట్లుగా ఉంది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పారీ్టలు, అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.60,000 కోట్లు దాటి ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సరీ్వసెస్ (సీఎంఎస్) అధ్యయనం పేర్కొంది! ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇది ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా. అంటే ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సగటున రూ.221 కోట్లు! ఎందుకు పరిమితి? ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశాలు అందరికీ సమానంగా కలి్పంచాలన్నదే వ్యయ పరిమితుల్లోని ఉద్దేశ్యం. తద్వారా ధన బలం కలిగిన అభ్యర్థులది పైచేయి కాకుండా ఉంటుంది. నామినేషన్ వేసినప్పటి నుంచి, పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి చేసే వ్యయాలను ఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. అభ్యర్థుల బ్యాంక్ లావాదేవీలను, ఖాతాస్టేట్‌మెంట్లను ఈసీ పరిశీలిస్తుంది. వ్యయాలపై ఎన్నికల పరిశీలకుల నిఘా కూడా ఉంటుంది. ఈసీ గైడ్‌లైన్స్ ఇవీ.. ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థి ప్రచారానికి సంబంధించినది. ఓటర్లకు చేరువయ్యేందుకు చేసే ఖర్చు ఆ పరిమితిని మించరాదు. ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, సమావేశాలు, వాహనాల వినియోగం వంటివన్నీ ఇందులోకి వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రచార ఖర్చు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎన్నికల వ్యయ పరిమితులను ఈసీ ఎప్పటికప్పుడు సవరిస్తుంటుంది. నియోజకవర్గంలో పెరిగిన ఓటర్ల సంఖ్యను కూడా పరిశీలనలోకి తీసుకుంటుంది. ఎన్నికల వ్యయ పరిమితిని చివరిసారి 2022లో సవరించింది. తొలుత తక్కువే 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి రూ.25వేల ఖర్చుకే అనుమతించారు. చిన్న రాష్ట్రాల్లోనైతే రూ.10 వేలే. తర్వాత దీన్ని సవరిస్తూ వచ్చారు. చట్టబద్ధమైన వ్యయ పరిమితితో పోలిస్తే, ఒక్కో అభ్యర్థి చేసే వాస్తవ ఖర్చు కోట్లలో ఉంటుందన్నది తెలిసిందే. వందలాది కోట్లు ఖర్చు చేసేవాళ్లూ ఉన్నారు. నగదు, ఇతర కానుకల రూపంలోనూ ఓటర్లను ప్రలోభపెడుతుంటారు. ఇదంతా అనధికారికంగా నడిచే వ్యవహారం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’
చాయ్‌కి పంజాబ్‌లోని జలంధర్‌లో రూ.15. అదే మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్‌లో రూ.15 అయితే మధ్యప్రదేశ్‌లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది. ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం! చాయ్ రూ.5 నుంచి 15 దాకా... చాయ్ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కప్పు చాయ్ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్‌లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్‌లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్‌తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్‌లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15. చెన్నైలో తగ్గిన చికెన్ బిర్యానీ రేటు చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్లో వెజ్ భోజనం రూ.100. సమోసా, చాయ్ రూ.10. కచోరీ రూ.15, శాండ్విచ్ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్‌లో దాల్ మఖానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ రూ.130. మటర్ పనీర్ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్‌జామ్ వంటివి కూడా ఉన్నాయి. వీటికీ రేట్లు ఫిక్స్... ► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌజ్‌లతో పాటు పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. ► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. ► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే. ► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్ చేసి పెట్టింది. కొసమెరుపు: ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు, సేవలకు అసాధారణ రీతిలో గిరాకీ పెరుగుతోంది. అందుకుగల కారణాలు విశ్లేషించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈమేరకు జీఎస్టీ ఇ-వేబిల్లుల అనలటిక్స్‌ను ఉపయోగించి రియల్‌టైమ్‌లో ప్రభుత్వం ధరల ప్రభావాన్ని పరిశీలిస్తోందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. జీఎస్టీ విధానంలో వస్తువుల మొత్తం విలువ రూ.50,000 మించితే అంతరాష్ట్ర రవాణాకు ఇ-వేబిల్లును తీసుకోవడం తప్పనిసరి. రూ.5 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న వ్యాపార సంస్థలు కూడా 2024 మార్చి 1 నుంచి ఇ-వేబిల్లులు తీసుకోవాల్సి ఉంది. వస్తు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. నిజంగా గిరాకీ ఏర్పడిందా.. లేదంటే కృత్రిమ కొరత సృష్టించేలా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులు కంపెనీ ఎందుకు మారడం లేదో తెలుసా..? వస్తువులకు గిరాకీ పెరగడాన్ని పర్యవేక్షించేందుకు రియల్- టైం జీఎస్టీ ఇ-వేబిల్లు అనలటిక్స్ మంచి సాధనమని నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలోని పత్రాలను విశ్లేషణ చేయడం ద్వారా మార్కెట్ల ధోరణి, పన్ను నిబంధనల పాటింపు వంటి వాటిని అధికారులు, వ్యాపారులు గుర్తించే అవకాశం ఉంది. దాంతో వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు. -
దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రం మంగళవారం నుంచి (2వ తేదీ) 30వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఆమోదం తెలిపింది. రాజకీయ నిధుల విషయంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు ఇచ్చే ప్రత్యక్ష నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రూపొందించారు. 17వ లోక్‌సభ కాలపరిమితి ముగుస్తున్నందున ఈ ఏడాది మధ్యలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30వ ఫేజ్ ఆఫ్ సేల్‌లో భాగంగా జనవరి 2 నుండి జనవరి 11వ తేదీ వరకూ తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్‌క్యాష్ చేయడానికి ఎస్బీఐని అనుమతించడం జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2018 నుంచీ అమలు.. మొదటి బ్యాచ్ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం మార్చి 2018లో జరిగింది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన అధీకృత బ్యాంకులో ఉన్న బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఎన్‌క్యాష్ చేసుకోగలుగుతుంది. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి ఎస్బీఐ మాత్రమే అధీకృత బ్యాంకు. బెంగళూరు, లక్నో, సిమ్లా, డెహ్రాడూన్, కోల్‌కతా, గౌహతి, చెన్నై, పాట్నా, న్యూఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్, గాంధీనగర్, భోపాల్, రాయ్‌పూర్ ముంబైలు అధీకృత ఎస్బీఐ శాఖల్లో కొన్ని. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేసిన తేదీ నుండి 15 క్యాలెండర్ రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్‌ను డిపాజిట్ చేసినట్లయితే, సంబంధిత రాజకీయ పార్టీకి ఆయా చెల్లింపులు జరగవు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ నిర్దిష్ట కాలంలో తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ అదే రోజు జమ అవుతుంది. గత లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 1 శాతం ఓట్లను పొందిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది!
సాక్షి, ఖమ్మం: శాసనసభ సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తికాగా, బరిలో మిగిలే అభ్యర్థులెవరో 15వ తేదీన తేలనుంది. దీంతో పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇక ఎన్నికల సంఘం నుండి పోలింగ్ సామగ్రి సోమవారం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా పోలింగ్ సామగ్రిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. పోలింగ్ రోజు ఉపయోగించే కంపార్ట్మెంట్లు, ఫారాలు, విధివిధానాలతో రూపొందించిన పుస్తకాలు, కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే బ్యానర్లు ఇతరత్రా సామగ్రి మొత్తం చేరాయని తెలిపారు. కాగా, పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు వెల్ఫేర్ కిట్లు అందజేయనున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల అధికారులు అజయ్‌కుమార్, కె.శ్రీరామ్, రాంబాబు, మదన్‌గోపాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అఫిడవిట్లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే.. -
‘లెక్క’ తేలుస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అకౌంటింగ్ టీమ్స్‌ను నియమించారు. వీరు ఆయా నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం, ర్యాలీలు, బహిరంగ సభలు తదితర కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్న సొమ్మును ఆడిట్ చేస్తారు. ఎన్నికల సామాగ్రికి ఎంత ఖర్చు చేసిందీ తెలుసుకుంటారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...ముïÙరాబాద్ నియోజకవర్గానికి చార్మినార్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ మీర్జా రాజా అలీ, జీపీఎఫ్ సెక్షన్‌కు చెందిన అజయ్కుమార్లను అకౌంటింగ్ ఆఫీసర్లుగా నియమించారు. మలక్‌పేటకు కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్మోహన్, ఖైరతాబాద్ జోన్ జూనియర్ ఆడిటర్ అనిల్‌కుమార్‌ను నియమించారు. అంబర్‌పేటకు కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఆడిటర్ కె.నరేందర్‌లను, ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూకట్ పల్లి జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రాజు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ బాబును నియమించారు. అలాగే జూబ్లీహిల్స్‌కు ఖైరతాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమార స్వామి, సనత్‌నగర్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మజ రాణి, జూనియర్ ఆడిటర్ భరత్, నాంపల్లికి శేరిలింగంపల్లి జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ లెనిన్ బాబు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ ఫర్జానా బేగం, కార్వాన్కు ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీలత, కూకట్పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ భారతి, గోషామహల్ నియోజకవర్గానికి పీడీఎస్జడ్ –2 సూపరింటెండెంట్ ముబీన్ ఫాతి మా, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్‌లను నియమించారు. అలాగే చారి్మనార్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సయ్యద్ జియా ఉల్లా హుస్సేన్, చార్మినార్ సర్కిల్ హెల్త్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.డి ఖాదిర్ అలీ చాంద్రాయణగుట్టకు చార్మినార్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ముబాస్సిర్ హుస్సేన్ ఖాన్, జూనియర్ అసిస్టెంట్ సాగర్ సక్సేనా, యాకుత్‌పురా నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, బహదూర్‌పురా నియోజకవర్గానికి ఎల్బీనగర్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమోహన్, జూనియర్ అసిస్టెంట్ బావ్మాతి, సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎల్బీనగర్ జోన్ ఎఫ్ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సంజన, జూనియర్ అసిస్టెంట్ స్రవంతి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఆడిట్ సెక్షన్ సీడీఓ పరమేశ్వరి, ఎఫ్ఏ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సురేష్లను నియమించారు. వీరితోపాటు మరికొందరిని రిజర్వుగా ఉంచారు. -
జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి(జమిలి) నిర్వహిస్తే ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో కిరెణ్ చెప్పారు. ఎన్నికలు ఖరీదైన అంశంగా మారిన నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణల కోసం లా కమిషన్ సమర్పించిన నివేదిక జమిలి ఎన్నికల ఆవశ్యకతను గుర్తుచేసిందన్నారు. పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. జమిలి ఎలక్షన్స్‌తో ప్రజలకే కాదు, పార్టీలకు, అభ్యర్థులకు కూడా లాభమేనని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ని రెండుసార్లు అమలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశంలో 1951–52, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయ్యాయి. దాంతో జమిలి ఎన్నికల గొలుసు తెగిపోయింది. -
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు..
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు చేసే వ్యయం ఏడాదికేడాది తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో (ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) బీజేపీ రూ.344.27 కోట్లు ఖర్చు చేసింది.2017లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చేసిన ఖర్చు కంటే ఇది 58% ఎక్కువ. అప్పట్లో బీజేపీ చేసిన ఖర్చు రూ.218.26 కోట్లుగా ఉంది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన నివేదికల ప్రకారం కాంగ్రెస్ చేసిన వ్యయం ఏకంగా 80 శాతం పెరిగింది. 2017లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి 108.14 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.194.80 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక బీజేపీ యూపీలో అత్యధికంగా రూ.221.32 కోట్లు ఖర్చు పెట్టగా, పంజాబ్, గోవాలలో ఖర్చు భారీగా పెరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వారీగా ఎంత ఖర్చు చేసిందో వెల్లడించలేదు. -
యూపీ ఎన్నికలు.. సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థి ఉదయం పూట తినే పూరీ నుంచి ప్రచారానికి వినియోగించే లగ్జరీ కార్ల వరకు ఒక్కొక్క వస్తువుకి ఒక్కో ధరను ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ప్రచార ఖర్చు విషయంలో ఒక అభ్యర్థి ప్రచారంలో ఖర్చు వినియోగించుకునే సేవలు, వస్తువుల ధరలకు గరిష్ట పరిమితి ఎంతో తెలిపే చార్ట్‌ను లక్నో జిల్లా ఎన్నికల అధికారి తాజాగా ఖరారు చేసి విడుదల చేశారు. చదవండి: బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్ ఇందులో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు పరిమితిని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. దీని ప్రకారం ఒక్కో అభ్యర్థి గరష్టంగా దేనిపై ఎంత ఖర్చు చేయాలనే దానిపై సమీక్ష నిర్వహించి ఈ జాబితాను ప్రకటించారు. చదవండి: ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్: సూరీ.. ప్రమాణానికి సిద్ధమా ? -
Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ!
సాక్షి, కరీంనగర్: ఒకప్పుడు పాడుబడిన జీపు అటూ ఇటూ ఊగుతూ పల్లెల్లోకి వచ్చేది. అభిమానులు దయతలచి రిపేరు చేయిస్తేనే రయ్‌మంటూ తిరిగేది. టాప్‌పైన తనకు ఓటేయాలంటూ నాయకుడు కనిపించేవాడు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఖర్చంటే కేవలం భోజనాల కోసమే వెచ్చించేవారు. తలా కొంత పోగేసుకుని భాగస్వాములయ్యేవారు. ఇక ఎన్నికల డిపాజిట్ రూ.250 నుంచి రూ.500 ఉండేది. మొత్తం వ్యయం రూ.3,000 నుంచి రూ.10,000 వరకు అయ్యేది. ఇది నాలుగు దశాబ్దాల కిందటి మాట. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: పెరిగిన పోలింగ్ సమయం.. ఎప్పటివరకంటే! కానీ నేడు వాహనాల రణగొణ ధ్వని చెవుల్లో మార్మోగుతోంది. ఒక వాహనం వెంట పదుల సంఖ్యలో వాహనాలు అనుసరిస్తున్నాయి. డీజే శబ్దంతో ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఖర్చంటే మందు, విందు, నగదు, చీరలు, వాహనాలు, పెట్రోల్, డీజిల్ తదితరాలన్నీ కలసి అభ్యర్థి ఖాతా ఖాళీ అవుతోంది. సరాసరి అభ్యర్థి మొత్తం ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంటోంది. 1980 నుంచి పెరుగుతూ వస్తున్న ఎన్నికల వ్యయం తాలుకు చరిత్ర ఇది. చదవండి: ‘టీఆర్ఎస్కు ఓటేయకుంటే పింఛన్లు కట్ చేస్తామంటున్నారు’ నేటి రాజకీయవిుదీ.. ప్రత్యర్థిని ఆలోచనలో పడేయడమెలా?.. ఎన్నికల సభలకు భారీ జనాన్ని తరలించి ఇతరులను హడలెత్తించడమెలా? ఇదీ మారిన ఎన్నికల ప్రచార సరళి తీరును స్పష్టం చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో జరిగిన పలు సమావేశాలకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సభలకు భారీ వ్యయం ఓ సభ నిర్వహించాలంటే వేదిక ఏర్పాటుకే కనీసం రూ.10 లక్షల మంచి రూ.20 లక్షల వ్యయమవుతోంది. వేదిక తీర్చిదిద్దడం నుంచి కుర్చీలు, షామియానాలు, లైట్లు, మైకులు, ఇతరత్రా ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. ప్రాంగణంలో వేలల్లో కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తుండటం అభ్యర్థులకు భారమవుతోంది. ఇక పార్టీలు కూడా ఖర్చు చేసే శక్తి ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తుండటం పరిపాటి. పార్టీ ఎంత ఇస్తుంది.? తానెంతæ భరించేది లెక్కలు కట్టి మరీ అధిష్టానం వద్ద చెప్పుకోవడం ఏటా ఎన్నికల్లో జరుగుతున్న తంతు. మందు, విందు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా ఉండగా యువత మాత్రం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తున్నారు. యువకులకు భలే సమయమొచ్చింది. ఖాళీగా ఉంటున్నవారిని పార్టీలు పట్టేశాయి. యువకులు జై కొట్టాలంటే వారికి రూ.500 నుంచి రూ.800 ఇస్తున్నారు. బీరు, బిర్యానీ అదనంగా వ్యయమవుతోంది. ద్విచక్ర వాహనాలు సమకూర్చుకోవడం, బ్యానర్లు, జెండాలు మోయడం, భారీ ర్యాలీలకు అండగా నిలవడం యువకులకు పనిగా మారింది. డబ్బు పంపకం.. వాహనాలే వాహనాలు సభకు, ర్యాలీలు, ప్రచారానికి వచ్చే మహిళలకు రూ.300 నుంచి రూ.500 వరకు ఇస్తున్నారు. వచ్చిన వారి హాజరు కూడా తీసుకుంటుండటంతో ఎన్నికల కోసం ఎలా çవ్యయం చేస్తున్నదీ ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. యువకులు హాజరైతే మందు, విందు రోజువారీ వెళ్లేటపుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగానికి అధికంగా ఖర్చు చేస్తున్నారు. ఖరీదైన కార్లతో పాటు ద్విచక్ర వాహనాలు ప్రచారంలో భాగమవుతున్నాయి. ఇలా ఒక్కో గ్రామంలో రూ.20 నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రలోభాలు శిక్షార్హమే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టరాదు. తమకే ఓటు వేయాలంటూ ప్రలోభపెట్టినా, ప్రలోభాలకు లొంగినా భారత శిక్షాస్మృతిలోని 171(3) సెక్షన్ ప్రకారం ఏడాది పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంది. అయితే ప్రలోభాల పరంపర ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూనే ఉంది. నిరాడంబరుడు చొక్కారావు నిరాడంబరుడు అంటే గుర్తుకొచ్చే తొలితరం రాజకీయ నాయకుల్లో జువ్వాడి చొక్కారావు ఒకరు. ఆయన 1957 నుంచి 1996 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తొలి ఎన్నికల్లో ఆయన ఖర్చు రూ.10వేలలోపేనని పలు సందర్భాల్లో చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు బస్సులో వెళ్లేవారు. మాజీగా మిగిలాక కూడా బస్సులోనే ప్రయాణించారు. చివరగా బస్సులో ప్రయాణిస్తూనే గుండెపోటుకు గురయ్యారు. కాకా ఖర్చు అంతంతే ‘నేను 1957 ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు నా ఎన్నికల ఖర్చు కేవలం రూ.2వేలు మాత్రమే. చెన్నూరు నుంచి పోటీ చేసినపుడు కేవలం ప్రచారంతోనే గెలిచాను. ఓటర్లు ఇప్పటికీ మారలేదు. రాజకీయ నాయకులు, రాజకీయాల్లో మాత్రమే మార్చు వచ్చింది. ఎన్నికల వ్యయం తడిసిమోపెడవుతుంది’ అని 2014 ఎన్నికల్లో పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వెంకటస్వామి అన్న మాటలివి. నాడు వేలల్లో ఉన్న ఖర్చు నేడు రూ.కోట్లు దాటిందంటూ ఆవేదన చెందారు. నడకతోనే ప్రచారం, పర్యటనలు కరీంనగర్ తొలి పార్లమెంటు సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి. నీతి, నిజాయతీ, నిరాడంబరతకు నిలువుటద్దంలా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రనేత అయిన ఎల్లారెడ్డి 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల బరిలో కరీంనగర్ నుంచి నిలిచారు. ఆయన ఎన్నికల కోసం కాలినడకనే ప్రచారం నిర్వహించేవారు. ఎవరైనా వాహనం తెస్తే అందులో ప్రచారం చేసేవారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఆయన ఎన్నికల వ్యయం రూ.10వేల లోపే -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు ప్రాబల్యం పెరిగిందని దీన్ని అరికట్టేలా వెంటనే చర్యలు చేపట్టాలని భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రధానాధికారిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి మంగళవారం ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖరాశారు. ఎన్నికలు ఒక ప్రహసనంలా మారాయని, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో డబ్బు జోక్యం మితిమీరిందని ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరిస్తుందని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు అక్రమ రవాణాను అడ్డుకుంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుందని గుర్తుచేశారు. కానీ, ఎన్నికల ముగిసిన అనంతరం ఆ కేసుల పురోగతిని పట్టించుకోవడం లేదని వాపోయారు. 2014లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో 1,199 కేసులు, డబ్బు పంపిణీలో 543 కేసులు నమోదు కాగా రూ.34.38 కోట్ల నగదు పట్టుబడిందని పద్మనాభరెడ్డి తెలిపారు. అదే సమయంలో 2,194 అక్రమ మద్యం కేసులు, 52 ఘటనల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక 2018లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 1,086 కేసులు, డబ్బుపంపిణీపై 548 కేసులవగా రూ.55.07 కోట్లు నగదు పట్టుబడిందని తెలిపారు. 1,875 మద్యం పంపిణీ కేసులు నమోదవ్వగా మొత్తంగా 3,561 కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నారు. చదవండి: Funds: బీజేపీకి కోట్లకు కోట్లు.. చతికిలబడ్డ కాంగ్రెస్ -
స్థానిక ఎన్నికలు: 40 వేల మందికి ఈసీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలిచామనే ఆనందంలో కొందరు.. ఓడిపోయిన నిస్పృహలో మరికొందరు.. తెలిసి కొందరు.. తెలియక ఇంకొందరు.. నిర్లక్ష్యంతోనో మరో కారణం చేతనో చేసిన పని ఇప్పుడు వారిపాలిట శాపంగా మారింది. ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించనందకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దాదాపు 40వేల మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో కొందరు పదవులు సైతం కోల్పోయి లబోదిబోమంటున్నారు.. ఇదండీ 2019 స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఎన్నికల వివరాలు ఈసీకి సమర్పించని వారి సంగతి. అసలేం జరిగిందంటే.. రాష్ట్రంలో 2019 జనవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ ఖర్చు వివరాలు మొత్తం ఈసీకి వెల్లడించాలి. దీనికి గెలుపోటములతో సంబంధం లేదు. ప్రతి ఒక్క అభ్యర్థీ తమ వ్యవ వివరాలు ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఫలితంగా గెలిచినవారు పదవిని కోల్పోతారు. ఓడినవారు మూడేళ్ల పాటు పోటీకి అనర్హులవుతారు. ఇదే కోవలోనే 2019లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వార్డు సభ్యులు మొదలుకొని జడ్పీటీసీల వరకు పోటీచేసిన వారిలో 39,499 మంది అనర్హతకు గురయ్యారు. ఇందులో ఆ ఎన్నికల్లో ఓడిన వేలాది మందితోపాటు గెలిచి సర్పంచ్‌లు అయిన 17 మంది, వార్డు సభ్యులు 3,499 మంది, ఎంపీటీసీలు ఆరుగురు ఉన్నారు. దీంతో గెలిచి అనర్హత వేటుకు గురయినవారి స్థానాలతోపాటు, వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలకు త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదట వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాట, కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి, తదనంతంర గ్రామీణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ రెండు గ్రామాల్లో వార్డు స్థానాలన్నీ ఖాళీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి, జియాపల్లి తండా గ్రామ పంచాయతీల్లోని వార్డు సభ్యులంతా అనర్హత వేటుకు గురయ్యారు. ఈ రెండు పంచాయతీల్లో ప్రస్తుతం ఇద్దరు సర్పంచ్‌లు మాత్రమే ఉనికిలో ఉండగా, వార్డు సభ్యులు లేకుండా పోయారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వీరంతా సకాలంలో ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించకపోవడం వల్లనే అనర్హత వేటు పడింది. నిబంధనలు ఇలా.. ఐదు వేలకుపైగా జనా భా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఖర్చు చేయాలి. -
అధ్యక్ష అభ్యర్థుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతుందంటే ఆశ్చర్యం వేస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్లు జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు, అంటే 105 రోజుల్లో ఒక్క సోషల్ మీడియాకు ఇద్దరు సంయుక్తంగా ఇచ్చిన అండ్వర్టయిజ్మెంట్లపైనే ఏకంగా 68.8 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు 502 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారు ఆగస్టు పదవ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ మధ్యనే 40 శాతం సొమ్మును, అందులోనూ ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపైనే ఖర్చు చేశారని సైరాక్యూస్ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో బయట పెట్టింది. ఆగస్టు పది నుంచి సెప్టెంబర్ 13 మధ్య, నెలరోజుల్లో ఆన్లైన్ యాడ్స్‌కు 27 మిలియన్ డాలర్లు (దాదాపు 197 కోట్ల రూపాయలు) ఖర్చు పెట్టారని తెలిపింది. 2016 సంవత్సరంలో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ పోటీ పడినప్పుడు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారని యూనివర్శిటీ పరిశోధకులు ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా సేకరించిన వివరాల మేరకు తెలిపారు. (చదవండి: యూఎస్ మార్కెట్లకు ట్రంప్ జోష్) అధ్యక్ష ఉన్నికల్లో పోటాపోటీగా యాడ్స్ కోసం ఖర్చు పెడుతున్న ట్రంప్, బైడెన్లు అందులో 70 శాతం నిధులను కేవలం ఓటర్లను ఆకర్షించేందుకు ఖర్చు పెడుతుండగా, 30 శాతం నిధులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే ఓటర్లను సమీకరించేందుకు ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో టీవీలో యాడ్ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవడం వల్ల ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు కూడా సోషల్ మీడియాకే ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు. అమెరికా టీవీలో ప్రైమ్ టైమ్‌లో 30 నిమిషాల యాడ్ ఇవ్వాలంటే అక్షరాల లక్ష డాలర్లు. అంటే, దాదాపు 73 లక్షల రూపాయలు. టీవీ యాడ్ కోట్ల మంది ప్రజల ముందుకు వెళుతుంది కనుక యాడ్ టారిఫ్ లక్ష డాలర్లలో ఉంటుంది. సోషల్ మీడియా లక్షల మందికి మాత్రమే వెళుతుంది కనుక యాడ్ టారిఫ్ వేల డాలర్లలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రింట్, రేడియో, బిల్‌బోర్డు యాడ్లు చాలా తక్కువ. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం యాడ్స్‌కు ఖర్చు పెట్టే సొమ్ములో కేవలం 5 శాతం మాత్రమే ఈ మూడు మీడియాలపై ఖర్చు పెడతారట. డోనాల్డ్ ట్రంప్ పురష ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్ ఇస్తుండగా, అందుకు భిన్నంగా బైడెన్ మహిళా ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు. (చదవండి: కమలా హారిస్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు) -
మున్సిపోల్స్ ఖర్చుపై ఎస్ఈసీ స్పష్టత
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టతనిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను ప్రకటించింది. నూతన మున్సిపల్ చట్టానికి అనుగుణంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో మార్పులు చేస్తూ ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థులు రూ.1.5 లక్షలు, మున్సిపాలిటీల పరిధిలో వార్డు సభ్యులు రూ.1 లక్ష వరకు ఎన్నికల ఖర్చు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమాచారాన్ని జీహెచ్చ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారులు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్వోలు, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ తదితరులకు ఎస్ఈసీ తెలియజేసింది. -
కాంగ్రెస్ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఖర్చు వివరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అందులోని వివరాల ప్రకారం ఆ పార్టీకి రూ. 856 కోట్లను సమీకరించగా, అందులో రూ. 820.9 కోట్లు ఖర్చయినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ట్రెజరర్ అహ్మద్ పటేల్ సంతకం చేసిన పత్రాలను ఈసీకి అందించారు. ఇందులో ఎన్నికల వ్యవహారాల కోసం రూ. 626.36 కోట్లు ఖర్చు చేయగా, రూ. 194 కోట్లు అభ్యర్థుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ దగ్గర మొత్తం రూ. 315.88 కోట్లు మిగిలినట్లు తెలిపింది. ఇందులో రూ. 265 కోట్లు బ్యాంకులో ఉండగా, రూ. 50 కోట్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రూ. 516 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు బీజేపీ రూ. 714 కోట్లు ఖర్చుచేయగా 2019 వివరాలు వెల్లడించాల్సి ఉంది. (చదవండి: ‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు) -
వ్యయమా.. స్వాహామయమా..?
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాగం భారీగా వ్యయం చేసింది. మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణకు ఏకంగా రూ.1.74 కోట్లు ఖర్చు చేశారు. నిర్వహణ వ్యయం ముసుగులో కొందరు స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల విభాగం ఖర్చు చేసిన నిధులు అక్షరాలా రూ.52 కోట్లు. ఇందులో రూ.22 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో వాటితో చెల్లింపులు చేశారు. ఇంకా రూ.32 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రావాల్సిన వాటిలో కలెక్టరేట్ యూనిట్ చేసిన ఖర్చుకు సంబంధించి కలెక్టర్ అప్రూవల్ చేసిన బిల్లులు రూ.6.50 కోట్లు ఉండగా, మరో రూ.2 కోట్లకు అప్రూవల్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇక రూ.21.50 కోట్లు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఖర్చు బిల్లులు ఉన్నట్లు తెలియవచ్చింది. వీడియో చిత్రీకరణకు రూ.1.74 కోట్లు జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో 3,884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియ వీడియో చిత్రీకరణకు వీడియోగ్రాఫర్లకు ఒక్కొక్కరికి రూ.4,500 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు రూ.1,74,78,000 వెచ్చించారు. సమస్యాతమ్మక, అత్యంత సమస్యాత్మ, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే అధికారులు పాదర్శకం పేరిట 3,884 కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించారు. ఈ అంశంపై ఓ జిల్లా అధికారి మాట్లాడుతూ అనవసరంగా వీడియో చిత్రీకరణకు నిధులు వెచ్చించామని, జరిగిన చిత్రీకరణలో చివరికి ఒక ఎంబీ వీడియోనూ కూడా ఏ ఒక్క అధికారీ చూడలేదని అన్నారు. ఇందుకు వెచ్చించిన నిధులు పూర్తిగా వృథా అని పేర్కొనడం గమనార్హం. ఆర్ఓలు ఇష్టారాజ్యంగా ఖర్చు ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుండుసూది మొదలు భోజన వసతి వరకు అన్నీ సెంట్రలైజ్డ్ చేసి జిల్లా ఎన్నికల విభాగం ఖర్చు చేసింది. అయితే అత్యవసర ఖర్చు కోసమంటూ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు (ఆర్ఓ)ఎన్నికల ఖర్చు కింద కొందరికి రూ.1.03 కోట్లు, మరికొందరికి రూ.1.15 కోట్లు ఇచ్చారు. అయితే ఇందులో వారు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా రూ.70 లక్షలకు మించదని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. మిగతా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్ సామగ్రి తరలించే రోజున సిబ్బందికి భోజన వసతి, వారికి రెమ్యునరేషన్, వీడియో గ్రాఫర్లకు ఇవాల్సిన రెమ్యునరేషన్‌కు, ఇతరత్ర చిన్నపాటి పనులకు మాత్రమే ఆర్ఓలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇందులోనూ ఇద్దరు ఆర్ఓలు వీడియోగ్రాఫర్లకు రెమ్యునరేషన్ ఇవ్వలేదని తెలిసింది. విచారణకు ఆదేశం ఎన్నికల వ్యయం ఏకంగా రూ.52 కోట్లు కావడంపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఆర్ఓలు ఉంచిన బిల్లులు చూసి... ఇవన్నీ నిజంగా ఖర్చు చేసినవేనా అంటూ ఓ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది. ఎన్నికల నిర్వహణ వ్యయం : రూ.52 కోట్లు విడుదల చేసింది : రూ.22 కోట్లు ఇంకా విడుదల కావాల్సింది : రూ.30 కోట్లు -
రూల్స్ బ్రేక్ చేసిన సన్నీడియోల్
చంఢీఘర్: గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు, నటుడు సన్నీ డియోల్ ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేసినట్లు తేలిందని ఎన్నికల అధికారి తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రూ. 78,51,592 ఖర్చు చేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గానికి రూ. 70లక్షల వరకు వ్యయపరిమితి ఉంటుంది. చట్టబద్ధమైన పరిమితి కంటే రూ. 8.51 లక్షలు అధికంగా ఖర్చు చేసినట్లు గురుదాస్‌పూర్ జిల్లా ఎన్నికల కార్యాలయం పోల్ ఖర్చుల తుది నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపినట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. నివేదిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ డియోల్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జఖర్ ఎన్నికల ఖర్చు రూ. 61,36,058గా నిర్ణీత పరిమితిలో ఉంది. ఎన్నికల వ్యయ పరిమితిపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలో గురుదాస్‌పూర్ జిల్లా ఎన్నికల అధికారి ఎంపీ డియోల్‌కు నోటీస్ పంపారు. కాగా పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రతిపక్షం సన్నీ డియోల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తన పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి, ముఖ్యమైన విషయాలను సంబంధిత అధికారులతో చర్చించడానికి ఎంపీ సన్నీ డియోల్ ఓ ప్రతినిధిని నియమించుకున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా వివిధ వర్గాల నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. సన్నీ డియోల్ ఈ ఎన్నికల్లో 82,459 ఓట్ల తేడాతో సునీల్ జఖర్ను ఓడించారు. -
వీరి ఓటు విలువ ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ఎన్నికలు నిర్వహించడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఈ ఖర్చు 1998 నాటి నుంచి అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 55 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింటుందని ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అనే స్వతంత్య్ర పరిశోధనా సంస్థ అంచనా వేసింది. 50 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఎన్నికల కమిషన్ ముందుగానే అంచనా వేసింది. ఈ మొత్తాన్ని విభజిస్తే ఒక్కో నియోజక వర్గానికి వంద కోట్ల రూపాయలు, ఒక్క ఓటుకు 700 రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి లోక్‌సభ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రాన్నిబట్టి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు, ప్రతి అసెంబ్లీ 20 నుంచి 28 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు అర్హుడు. ఈసారి లోక్‌సభకు 8, 049 అభ్యర్థులు, అసెంబ్లీలకు 3,589 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరంతా కలిసి అధికారికంగా 6,639.22 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి అభ్యర్థి పరిమితికి మించే ఖర్చు చేస్తారని, పరిమితంగానే ఖర్చు చేసినట్లు దొంగ లెక్కలు చూపిస్తారని అందరికి తెల్సిందే. అందుకనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఓ సందర్భంలో ‘కొందరి లోక్‌సభ జీవితం పెద్ద అబద్ధంతోనే ప్రారంభమవుతోంది’ అని చమత్కరించారు. ఈసారి అభ్యర్థులందరూ కలిసి 24వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ‘సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్’ అంచనా వేసింది. రాజకీయ పార్టీలు మరో 18 వేల కోట్లు, ఎన్నికల కమిషన్ లేదా ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు, మీడియా–దాతలు మూడు రెండు కోట్లు, రాజకీయేతరులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా వేశారు. దీనికి అదనంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వర్గాలు మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, నగదు రూపేనా అక్రమంగా రవాణా అవుతున్న రూ. 3, 475 కోట్లను పట్టుకున్నారు. 2014 ఎన్నికలకన్నా ఇది నాలుగింతలు ఎక్కువ. ఈ మొత్తంలో పాలకపక్ష బీజేపీ 45 నుంచి 50 శాతం అంటే 24 వేల కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగా, కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 20 శాతం వరకు డబ్బు ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడానికి కారణం అంతగా డబ్బులు అందుబాటులో లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకే అధిక నిధులు వచ్చిన విషయం తెల్సిందే. -
ఎన్డీయే పక్షాలకు అమిత్ షా విందు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు. కేంద్ర క్యాబినెట్ భేటీ కూడా అదే రోజు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ విందు భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్డీయే 300 సీట్లుపైగా సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌లో ప్రజలంతా మోదీ పాలనకు జేజేలు పలికారని, అంకిత భావంతో సుపరిపాలన అందించిన మోదీసర్కార్‌కు సానుకూలంగా ప్రజలు ఓటు వేశారని వెల్లడైందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. అసత్య ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారంలో పెట్టిన విపక్షాలకు ఎగ్జిట్ పోల్స్ ఓ గుణపాఠమని అన్నారు. కాగా ఎగ్జిట్ పోల్స్ కట్టుకథలని, మే 23న అసలైన ఫలితాలు రానున్నాయని, ఎగ్జిట్ పోల్స్‌ను తాను విశ్వసించనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఓటర్లు విపక్షం వైపు నిలబడినట్టు స్పష్టంగా వెల్లడవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎగ్జిట్‌పోల్స్ తప్పుడు ఫలితాలను అందించాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ప్రతిపైసా లెక్క చెప్పాలి
సాక్షి, మహబూబాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి పైసా లెక్క కట్టడం జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నియమింపబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎంకే.శర్మ, నితిన్‌జైన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల లీస్టులను వారు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖర్చు చేసిన వివరాల పరిశీలన నేడు మొదటి దశ అయిపోయిందన్నారు. ఈ నెల 5న రెండో దశ, 9న మూడో ద శ, ఆ తరువాత తుది పరిశీలన ఉంటుందన్నారు. బృందాలను నియమించి అభ్యర్థులు చేసిన ప్రతి పైసాపై నిఘా ఉంచి లెక్క చేయడం జరుగుతుందన్నారు. పోటీ చేసే 14 మందిలో కేవలం 8 మంది అభ్యర్థుల ప్రతినిధులు ఖర్చుల వివరాలు సక్రమంగా సమర్పించలేదని, నిబంధనలు అనుసరించి తిరిగి సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు. వ్యయ పరిశీలకుల రిజిస్టర్లు, అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలు ట్యాలీ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి ఇందిరా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచాలి
సాక్షి, భూపాలపల్లి: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కించి, వారి ఖర్చుల్లో జమ చేయాలని వరంగల్ లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్‌అగర్వాల్ అధికారులను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ లోక్‌సభ పరిధిలో నిభూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నుంచి నియమించబడిన విజయ్‌అగర్వాల్ శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార ఖర్చులను లెక్కించడానికి సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి, లోక్‌సభ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వెంకటాచారి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌అగర్వాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రతీ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి ముందస్తూ అనుమతితోనే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించి లెక్కించడానికి ఏర్పాటు చేసిన బృందాన్ని సమర్థవంతంగా పనిచేసి ప్రతీ పైసాను లెక్కించి అభ్యర్థి ఖర్చులో జమ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్ల అవగాహన, మోడల్ పోలింగ్ కేంద్రంను పరిశీలించి ఈవీఎంల పనితీరును చెక్ చేశారు. డీపీఆర్వో చాంబర్‌లోని ఎంసీఎంసీ కేం ద్రంను తనిఖీ చేసి పత్రికలు, కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రచురితం, ప్రసారమయ్యే ప్రతి అడ్వర్టైజ్మెంట్ను లెక్కించాలన్నారు. అలాగే పెయిడ్ న్యూస్‌లను జాగ్రత్తగా గుర్తించి వాటి విలువను లెక్కించి అభ్యర్థుల ఖర్చుల్లో జమ చేయాలని ఆదేశించారు. భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసంబంధాల అధికారి బి రవికుమార్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వేణు పాల్గొన్నారు. -
ఏటేటా భారం.. ఎన్నికల వ్యయం
సాక్షి, అమరావతి : మనదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఉప ఎన్నికలు..ఎమ్మెల్సీ ఎన్నికలు.. అసెంబ్లీ ఎన్నికలు ఇలా.. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తూనే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు చేసే వ్యయం ప్రతిసారీ పెరుగుతూనే ఉంటుంది. ఒకపార్టీని చూసి మరో పార్టీ ఖర్చులు చేస్తూనే ఉంటాయి. ఎన్నికలు ప్రధానంగా ధన, బుద్ధి, కండబలాల ఆధారంగా జరుగుతాయని రాజకీయ పండితులు చెప్తారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో ప్రచారం పబ్లిసిటీ కోసం బీజేపీ రూ.700 కోట్లు ఖర్చు చేసిందని నివేదించింది. అదే విధంగా ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గత ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో ఎన్నికల కోసం బీజేపీ రూ.1760 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయనేది ఓ అంచనా. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 1952లో ఒక్కో ఓటరుకు 16 పైసల వ్యయం అయితే, అది 2004కు రూ.17కు పెరిగింది. అనంతరం 2009లో ఆ వ్యయం రూ.12కు తగ్గింది. మొదటి మూడు సాధారణ ఎన్నికలకు అయిన ఖర్చు రూ.10 కోట్లు (ఒక్కో ఎన్నికకు). 1984–85 ఎన్నికల నాటికి ఎన్నికల ఖర్చు రూ.100 కోట్లు. తొలిసారి 1996లో జరిగిన ఎన్నికల్లోని వ్యయం రూ.500 కోట్లు. 2004లో అది రూ.1,000 కోట్లు. 2009లో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.1,483 కోట్లు అయితే 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.3,870 కోట్లు అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ఈ ఖర్చు ఇంకా పెరగనుంది. అయితే ఎంత అనేది తెలిసేది తరువాతే..! – యర్రంరెడ్డి బాబ్జీ, సాక్షి, అమరావతి