equity market
-
మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు
భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!భారత్‌పట్ల బుల్లిష్‌గా..‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది. -
ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయించిన పెట్టుబడులు రిస్‌్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. రూ.లక్ష కోట్ల మైలురాయి తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
చిన్న షేర్ల పెద్ద క్రాష్
సెన్సెక్స్ భారీ పతనంతో బీఎస్ఈలో రూ.13.47 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.372 లక్షల కోట్లకు దిగివచి్చంది. గత 3 రోజుల్లో రూ.20.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ముంబై: చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల భారీ పతనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. అమెరికా ద్రవ్యోల్బణం దిగిరాకపోవడంతో ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు’ ఆశలు సన్నగిల్లాయి. ట్రేడింగ్‌లో వినిమయ, ఇంధన, మెటల్ షేర్ల భారీ పతనంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ 73,000, నిఫ్టీ 22,000 స్థాయిలను కోల్పోయాయి. లాభాల నుంచి భారీ నష్టాల్లోకి ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి దిగివచి్చన సానుకూల సంకేతాలతో ఉదయం స్టాక్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 325 పాయింట్లు పెరిగి 73,993 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 22,432 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే చిన్న, మధ్య తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సెబీ చైర్మన్ మాధవీ పురి ఇటీవలి వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,152 పాయింట్లు క్షీణించి 72,516 వద్ద, నిఫ్టీ 430 పాయింట్లు దిగివచ్చి 21,906 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997 వద్ద స్థిరపడ్డాయి. ► స్కాటిష్ చమురు కంపెనీ కెయిర్న్‌కు రూ.77.6 కోట్లు చెల్లించాలంటూ సెబీ ఆదేశాలు జారీ చేయడంతో వేదాంత లిమిటెడ్ షేరు 7% నష్టపోయి రూ.252 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ 8% నష్టపోయి రూ.250 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కంపెనీకి రూ.6,858 కోట్ల నష్టం వాటిల్లింది. ► మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం పదింటికి గానూ ఏడు కంపెనీల షేర్లు నష్టపోయాయి ► జీజే కెమికల్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.221)తో పోలిస్తే 4.52% డిస్కౌంట్‌తో రూ.211 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 18% క్షీణించి రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 16% నష్టపోయి రూ.185 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.724 కోట్లుగా నమోదైంది. ఎఫ్‌అండ్‌వోపై దృష్టి ఆందోళనకరం రిటైల్ ఇన్వెస్టర్లకు సీఈఏ హెచ్చరిక అత్యధిక రిసు్కలతోకూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో లావాదేవీలు చేపట్టేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం ఆందోళనకరమని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా పేర్కొన్నారు. తక్షణ లాభాలపై దృష్టి పెట్టడం పెట్టుబడుల పురోగతికి ప్రతికూలమని సెబీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. -
అస్సెట్ అలొకేషన్ అంటే ఇదేనా..?
నా దగ్గరున్న మొత్తంలో 60 శాతాన్ని బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40 శాతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఈక్విటీ పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఈక్విటీలకు 50 శాతం, ఎఫ్‌డీల్లో 50 శాతం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అస్సెట్ అలొకేషన్ అంటే.. 50 శాతం మించి ఈక్విటీలలో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మళ్లించడమేనా? – ఎస్కే సిన్హా అస్సెట్ రీబ్యాలన్స్ అంటే ఒక లకి‡్ష్యత కేటాయింపుల విధానాన్ని అనుకుని.. ఆ మేరకు పెట్టుబడుల మొత్తాన్ని వివిధ పెట్టుబడి సాధనాల మధ్య వర్గీకరించడం. ఒకే కాల వ్యవధిలో కొన్ని సాధనాలు మంచి పనితీరు చూపించడం వల్ల వాటిల్లోని పెట్టుబడుల విలువ ఇతర సాధనాలతో పోలిస్తే గణనీయంగా పెరగొచ్చు. దీంతో అలా మంచి పనితీరు చూపించిన వాటి వెయిటేజీ పెరిగిపోతుంది. అప్పుడు ముందు అనుకున్న కేటాయింపులకు మించి, ఎంత అయితే పెరిగిందో ఆ మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పోర్ట్‌ఫోలియోలో వెయిటేజీ పడిపోయిన సాధనాలకు ఆ మేరకు కేటాయింపులు పెంచుకోవాలి. అస్సెట్ రీబ్యాలన్సింగ్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడుల మధ్య సమతూకాన్ని కొనసాగించుకునే వెసులుబాటు ఈ విధానంతో వస్తుంది. అంటే ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలొకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నారని అనుకుందాం. కొంత కాలం తర్వాత మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80 శాతానికి చేరి డెట్ పెట్టుబడులు 20 శాతానికి తగ్గాయని అనుకుంటే.. అప్పుడు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఉద్దాన, పతనాల ప్రభావం పెట్టుబడుల విలువపై ప్రతిఫలిస్తుంటుంది. ఇది పెట్టుబడిదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని అనుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీల పెట్టుబడులను 60 శాతానికి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులు 40 శాతానికి అస్సెట్ రీఅలొకేషన్తో పెంచుకోవడం వల్ల తిరిగి వారి విధానానికి తగ్గట్టు పెట్టుబడుల స్వరూపం ఉంటుంది. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరొక ప్రయోజనాన్ని చూస్తే.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం. ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగిందంటే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీఅలొకేషన్ విధానంలో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం. తరచుగా కాకుండా.. ఏడాదికోసారి లేదంటే.. ఒక పెట్టుబడి సాధనంలోని పెట్టుబడుల విలువ నిర్దేశిత పరిమితి కంటే 5 శాతానికి మించి పెరిగిపోయిన సందర్భాల్లోనే దీన్ని చేయడం సూచనీయం. నా వయసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలా? – భాస్కర్ ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకున్న అనుభవం ఏ మేరకు? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం నుంచి ఆదాయం కోరుకోకుండా, పెట్టుబడి కోసమే అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
ఇన్వెస్టర్లలో అప్రమత్తత
ముంబై: అమెరికా ద్రవ్యోల్బణం డేటా ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. దీంతో బుధవారం ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా చలించి, చివరికి కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లో మగిసింది. అమ్మకాల ఒత్తిడికి ఉదయం సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ పావు శాతం వరకు నష్టాన్ని చూశాయి. కానీ, అక్కడి నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలను తిరిగి లాభాల బాట పట్టించింది. సెన్సెక్స్ మొత్తం మీద 400 పాయింట్ల శ్రేణిలో 61,573 నుంచి 61,974 మధ్య చలించింది. చివరికి పావు శాతం లాభంతో (179 పాయింట్లు) 61,940 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 22 లాభపడ్డాయి. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,315 పాయింట్ల వద్ద క్లోజయింది. మార్కెట్లు లాభాల్లో ముగియడం వరుసగా ఇది మూడో రోజు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ శాతం ప్రతికూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 3 శాతం లాభపడింది. నష్టపోయిన వాటిల్లో ఎస్బీఐ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ ఉన్నాయి. ‘‘దేశీ మార్కెట్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. యూఎస్ మార్కెట్ చుట్టూ నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్కెట్ల పట్ల సానుకూలంగా వ్యవహరించలేదు‘‘అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లు మరో రోజు స్థిరీకరణ చెందాయని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రియల్టీ, ఇంధనం, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించినట్టు చెప్పారు. యూఎస్ వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల కానుండడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు స్తుబ్దుగా ట్రేడయ్యాయి. సియోల్, టోక్యో, షాంఘై, హాంగ్‌కాంగ్ నష్టాల్లో ముగిశాయి. -
చిన్న షేర్లకు పెద్ద కష్టం
ముంబై: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ ఏడాది ఆరంభం నుంచి స్థిరీకరణ దిశగా సాగింది. ఈ క్రమంలో చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు(స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ షేర్లు) భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్ఈ స్మాల్ ఇండెక్సు 4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ మూడు శాతం చొప్పున డీలా పడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ రెండుశాతమే నష్టపోయింది. సాధారణంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్ 22 శాతం ర్యాలీ చేసింది. ఇవీ కారణాలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, రికార్డు స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ఆందోళనలతో ఈ ఏడాది ఆరంభం నుంచి దేశీయ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది. భారత కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదుచేయలేకపోయాయి. తాజాగా ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలకు మొగ్గుచూపొచ్చనే సంకేతాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ పెద్ద ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను అమ్మేశారు. ‘‘సాధారణంగా బేరిష్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీల షేర్లను(లార్జ్ క్యాప్) రక్షణాత్మక షేర్లుగా భావిస్తూ అట్టిపెట్టుకుంటారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఏదో ఒక స్థాయి వద్ద స్థిరపడి.., మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు చిన్న, తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతూనే ఉంటాయి. అయితే ధీర్ఘకాల దృష్ట్యా భారత ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ జరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అప్పుడు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో తిరిగి ర్యాలీ ప్రారంభం అవుతుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ న్యాతి తెలిపారు. ► గతేడాది మే 4న బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 21,847 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జనవరి 18న 31,304 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసింది. 2021లో 63 శాతం ర్యాలీ చేసింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ గతేడాది అక్టోబర్ 19 తేదీన 27,246 స్థాయి వద్ద 52–వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇదే సూచీ ఈ ఏడాదిలో మార్చి 4న 20,184 స్థాయి వద్ద ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. 2021లో 39 శాతం ర్యాలీ చేసింది. -
మార్కెట్లో మరో బ్లాక్ మండే
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర పాలసీకి మొగ్గుచూపుతుండటంతో ఈక్విటీ మార్కెట్ మరో బ్లాక్ మండేను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజూ పైపైకి ఎగబాకుతోంది. వీటిని అదుపులో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులు బాండ్ల వైపు మళ్లుతున్నాయి. ఈనెల పదో తేదీ నుంచి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వు అనుకున్న దానికంటే వేగంగా వడ్డీరేట్లను పెంచవవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నీ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని స్టాక్ నిపుణులు తెలిపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,024 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,621 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 17,214 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల భారీ అమ్మకాలు ఒత్తిడికిలోనయ్యాయి. ఎస్బీఐ రికార్డు ర్యాలీ అండతో ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ సూచీలో ఐదుశాతం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు రెండు శాతం వరుకు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1157 కోట్ల షేర్లను, డీఐఐలు రూ. 1376 కోట్ల షేర్లను అమ్మేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 17 పైసలు క్షీణించి 74.60 వద్ద స్థిరపడింది. లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో సోమవారం ఫారెక్స్, మనీ మార్కెట్లు పనిచేయలేదు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ‘గతవారంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల నుంచి 5% శాతానికి పెంచింది.పాలసీ ప్రకటన సందర్భంగా పావెల్ వ్యాఖ్యలతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ మార్చిలో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చనే స్పష్టత వచ్చింది. దేశంలో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదునెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 95 డాలర్లకు ఎగసిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడి (గురువారం) అయ్యేంత వరకు మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది’ జియోజిత్ ఫైనాన్షియన్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్రాష్ ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలతో ఉదయం సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 58,550 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పతనంతో 17,516 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గంట గంటకూ అమ్మకాల ఉధృతి పెరుగుతుండటంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్షీణించి 57,299 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 17,119 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలు పెరిగినట్లు ప్రకటించడంతో పేటీఎం షేరు ఇంట్రాడేలో ఆరుశాతం క్షీణించి రూ.899 వద్దకు దిగివచ్చింది. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పూడ్చుకొని అరశాతం స్వల్పలాభంతో రూ.957 వద్ద స్థిరపడింది. ► ఇదే క్యూ3లో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వరంగ ఎస్బీఐ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో మూడున్నరశాతం ఎగసి రూ.549 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణతో చివరికి అరశాతం లాభంతో 533 వద్ద స్థిరపడింది. ► మూడో త్రైమాసికంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇండిగో, లుపిన్ షేర్లు వరుసగా ఎనిమిది, పదిశాతం చొప్పున క్షీణించాయి. ► వీఐఎక్స్ ఇండెక్స్ ఎనిమిది శాతం పెరిగి 20.44 స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో మరో ముప్పై రోజుల తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సూచిస్తోంది. 3 రోజుల్లో రూ. 6 లక్షల కోట్లు హుష్ గత 3 రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1,937 పాయింట్లు, నిఫ్టీ 566 పాయింట్లు చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో రూ.ఆరు లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.270 కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్!
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్ మండే’’ నమోదైంది. వైరస్ కట్టడికి ఆయా దేశాల లాక్డౌన్ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు. సోమవారం సెషన్ సాగింది ఇలా..! ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్ సెషన్ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి. ► అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలివేయడతో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ (20%), ఫ్యూచర్ రిటైల్ (19.92%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (19.91%) షేర్లు రాణించి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ► ఇటీవల లిస్టయిన నైకా, కార్‌ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్ స్టాక్‌లు) ఎనిమిది శాతం క్షీణించాయి. నష్టాలకు నాలుగు కారణాలు... ► వణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్‌లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్డౌన్ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల పెరిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ► వడ్డీ రేట్ల పెంపు భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. దీంతో ఫలితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్ఐఐలు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్‌కు ముందు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లాక్డౌన్ విధించింది. పండుగ వేళ లాక్డౌన్లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్ దేశాల స్టాక్ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్‌లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డిస్కౌంట్లో శ్రీరాం ప్రాపర్టీస్ లిస్టింగ్ శ్రీరాం ప్రాపర్టీస్ షేర్లు లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్ 55,132కు పతనం ముగింపు 1190 పాయింట్లు డౌన్ 55,822 వద్ద క్లోజ్ -
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కంపెనీ.. ఐదేళ్లలో రూ. 9.70 లక్షల కోట్లు
దేశంలోనే అగ్రగామి వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన రిలయన్స్ తాజాగా మరో ఘనత సాధించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలు అందించిన సంస్థగా రికార్డుకెక్కింది. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తాజాగా వార్షిక సంపద సృష్టి నివేదిక విడుదల చేసింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌తో పాటు ఇన్వెస్ట్ సర్వీసులను ఈ సంస్థ అందిస్తోంది. ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈక్విటీ మార్కెట్లలో కంపెనీల పెర్ఫార్మెన్సుల ఆధారంగా ఈ జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తుంది. రిలయన్స్ నంబర్ 1 మోతీలాల్ రిపోర్టులో ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు ప్రథమ స్థానంలో నిలిచింది. 2016 నుంచి 2021 వరకు ఈక్విటీ మార్కెట్లో ఈ సంస్థ షేర్లు గణనీయంగా పెరిగాయి. తద్వారా ఈ షేర్లలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల ఇంట ఏకంగా రూ. 9.7 లక్షల కోట్ల సంపద జమ అయ్యింది. అంతకు ముందు 2014-19 టైం పీరియడ్‌లో రూ.5.6 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. రెండో స్థానంలో టీసీఎస్ దేశ వ్యాపార దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు సైతం సంపద సృష్టిలో ఎప్పటిలాగే ముందు వరుసలోనే నిలిచింది. ఈ గ్రూపుకి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ. 7.3 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.5.2 లక్షల కోట్ల స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రూ.3.2 లక్షల కోట్లతో హిందూస్థాన్ యూనీలీవర్, రూ.3.3 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ సంస్థలు నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ. కోటక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలు టాప్‌టెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. టాప్ 100.. రూ. 71 లక్షల కోట్లు మోతీలాల్ ఓస్వాల్ 26 యాన్వువల్ వెల్త్ క్రియేషన్ స్టడీలో ఇండియాలో టాప్ 100 సంస్థలు కలిసి రూ. 71 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. 2016 నుంచి 2021 వరకు ఐదేళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో సంపద సృష్టి జరగలేదని ఆ నివేదిక పేర్కొంది. అంతకు ముందు 2014-19 వ్యవధికి సంబంధించి రూ. 49 లక్షల కోట్ల సంపద మార్కెట్లోకి వచ్చి పడింది. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్–సౌదీ ఆరామ్కో ఒప్పందానికి బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి. కార్పొరేట్ల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్లో కన్సాలిడేషన్(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..? కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు. ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ కు మంగళం రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్ పడింది. సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ భావించిన సంగతి తెలిసిందే. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
ఒడిదుడుకులు ఉండొచ్చు..!
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ గురువారం(ఈ నెల 26న) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగుస్తుండటం ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో మన స్టాక్ సూచీలకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దిశానిర్దేశం చేస్తాయని అంటున్నారు. ఫెడ్ రిజర్వ్ ట్యాపరింగ్, డెల్టా వేరియంట్ కోవిడ్ వైరస్ వ్యాప్తి తీవ్రత అంశాలూ సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగురోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు రెండురోజులు లాభాల్ని ఆర్జించి, మరో రెండురోజులు నష్టాలను చవిచూశాయి. విస్తతృస్థాయి మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో వారం మొత్తంగా సెన్సెక్స్ 108 పాయింట్లు,నిఫ్టీ 78పాయింట్లను కోల్పోయాయి. మూడు లిస్టింగ్‌లు.., ప్రాథమిక, సెకండరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో మూడు లిస్టింగ్‌లతో పాటు నిధుల సమీకరణకు మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న విస్టాస్ షేర్లు నేడు (సోమవారం).., కెమ్‌ప్లాస్ట్ సన్మార్, అప్టాస్ షేర్లు మంగవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో గ్రే మార్కెట్లో ఈ కంపెనీల షేర్ల ధరలు దిగివచ్చాయి. స్వల్ప ప్రీమియం ధరతో లిస్ట్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఐపీఓకు అమి ఆర్గానిక్స్... ప్రత్యేక రసాయన, ఏపీఐ మానుఫ్యాక్చరర్ అమి ఆర్గానిక్స్ కంపెనీ ఇదే వారంలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఓ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.300 కోట్ల తాజా విలువైన షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతి ద్వారా ప్రమోటర్లు 60లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు... ఈ గురువారం(ఈ నెల 26న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల జోరు... మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లో ఇప్పటిదాకా(ఆగస్ట్ 1–23 తేదీల మధ్య) రూ.7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.5,001 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.2,244 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ వైస్ చైర్మన్ వీకే విజయకుమార్ తెలిపారు. -
బీమా రంగం పెట్టుబడులకు అనుకూలమేనా?
డిజిటల్‌గా పంపిణీ పద్దతులు, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలతో జీవిత బీమా పరిశ్రమ క్లిష్ట సమయాల్లోనూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కష్టించి పనిచేస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పరిశ్రమలో సర్దుబాటు చోటుచేసుకుంది. డిజిటల్, ఈ కామర్స్ నమూనాలు ఇటీవలి కాలంలో బీమా పరిశ్రమకు ఫలితాలనిస్తున్నాయి. జీవితంలోని కీలక దశల్లో ప్రజలకు విశ్వసనీయమైన భాగస్వామిగా లైఫ్ ఇన్సూరెన్స్ కొనసాగుతోంది. డిజిటల్ వైపు కరోనా సంక్షోభం ఎన్నో మార్పులకు బీజం వేసింది. భౌతికపరమైన సంప్రదింపులకు బ్రేక్ పడడంతో కస్టమర్లు పెద్ద ఎత్తున డిజిటల్ వేదికలకు మళ్లారు. దీంతో బీమా సంస్థలు డిజిటల్ విధానాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి అయింది. టెక్నాలజీ సదుపాయాల బలోపేతానికి బీమా పరిశ్రమ గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులు కూడా పెట్టింది. దీంతో ముఖ్యమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే వెసులుబాటు లభించింది. కస్టమర్లు బీమా పాలసీల కొనుగోలుకు సంబంధించి వారికి మెరుగైన సేవలు అందించడం సాధ్యపడింది. మారకపోయి ఉంటే 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నూతన పాలసీల ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) గణనీయంగా పడిపోయింది. ఎందుకంటే జీవిత బీమా సంస్థలు, పంపిణీదారులు ఈ తరహా పరిస్థితులకు సన్నద్ధంగా లేరు. దీంతో పంపిణీదారులు డిజిటల్‌గా మారిపోయేందుకు అవసరమైన సాయాన్ని బీమా సంస్థలు అందించాయి. కస్టమర్లతో సంప్రదింపులు మెరుగ్గా ఉండేందుకు డేటా అనలైటిక్స్‌ను వినియోగించడం ద్వారా.. ఈ సవాళ్లను బీమా కంపెనీలు, పంపిణీదారులు సమర్థవంతంగా అధిగమించాయి. డిజిటల్‌కు మారకపోతే పరిశ్రమ 2020–21 తొలినాళ్లలో మాదిరే స్తంభించిపోయే పరిస్థితి అనడంలో సందేహం లేదు. సమస్యలు కూడా డిజిటల్‌గా మారిపోవడం వల్ల ప్రయోజనాలున్నా కానీ, సమస్యలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మోసాల రిస్క్ కూడా పెరిగింది. చెల్లింపుల నెట్‌వర్క్‌ల దుర్వినియోగానికి అవకాశం ఉండడం, ఇప్పటికే సమాచార తస్కరణ ఘటనలు నమోదవుతుండడం వంటి వాటి రూపంలో పరిశ్రమకు నూతన సవాళ్లు ఏర్పడ్డాయి. అనుమానాస్పద వ్యక్తుల నుంచి అసలైన వినియోగదారులను వేరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వ్యక్తిగత సంప్రదింపులకు అవకాశం లేకపోవడంతో కస్టమర్లకు సంబంధించి రిస్క్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయడం పరిశ్రమకు కఠినమైన సవాలే. డేటా అనలటిక్స్ రిస్క్‌ను ఎదుర్కొనేలా, మోసాలకు చెక్ పెట్టేలా బలమైన సదుపాయాల ఏర్పాటు పరిశ్రమకు కీలకంగా మారింది. మోసాలను గుర్తించడంలో డేటా అనలైటిక్స్ ఎంతో సాయపడుతోంది. విశ్వసనీయమైన సమాచారం లోపించిన నేపథ్యంలో బీమా పరిశ్రమ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజలకు టీకాలు ఇస్తుండడంతో భవిష్యత్తు ఆరోగ్యం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు పరిశ్రమ ప్రయత్నిస్తోంది. ప్రజలకు బీమాను మరింత చేరువ చేయడం పరిశ్రమ ముందున్న ప్రాధాన్య అంశం. విస్తరణకు అవకాశం మొత్తంగా రిస్క్‌లను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక రక్షణ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చే విధంగా పరిశ్రమ సైతం సన్నద్ధమవుతోంది. జీడీపీలో 3.76 శాతం వాటాను కలిగిన బీమా పరిశ్రమ విస్తరణ పరంగా చూస్తే ఎంతో వెనుకనే ఉంది. కనుక విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయి. ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ఎండీ, సీఈవో -
మహీంద్రా మాన్యులైఫ్ నుంచి కొత్త ఫండ్
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ తాజాగా ఫ్లెక్సి క్యాప్ యోజన పేరిట కొత్త ఫండ్ ఆఫర్‌ను (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో చేసే పెట్టుబడుల వృద్ధిని ఆశించే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని సంస్థ ఎండీ, సీఈవో అశుతోష్ బిష్ణోయి తెలిపారు. జులై 30న ప్రారంభమైన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆగస్టు 13న ముగుస్తుందని చెప్పారు. తిరిగి ఆగస్టు 25 నుంచి విక్రయాలు, కొనుగోళ్లకు ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఫ్లెక్సి క్యాప్ యోజన ఫండ్ ద్వారా సమీకరించిన నిధుల్లో 65 శాతం భాగాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిష్ణోయి పేర్కొన్నారు. ఇక మిగతా నిధులను రెపో, రివర్స్ రెపో వంటి డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో 35 శాతం దాకా, అలాగే రీట్స్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు), ఇన్విట్స్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు) యూనిట్లలో 10 శాతం దాకా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. ఈక్విటీల ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ స్థిరమైన రాబడులు అందించగలుగుతాయని పేర్కొన్నారు. -
స్టాక్స్‌లో సిప్ చేయడం మంచిదేనా?
ప్రతీ రంగంలోనూ 5–10 శాతం పెట్టుబడులు చొప్పున పూర్తి వైవిధ్యంతో కూడిన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చా? లేదంటే కొన్ని రంగాల్లోకి కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావాలా? ఇందులో మంచి విధానం ఏది? – విజయ్ జాదవ్ వైవిధ్యం పేరుతో అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం అన్నది అంత మంచి విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలను పరిశీలించినట్టయితే.. వందల నుంచి వేల కోట్ల రూపాయిలను నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ వారు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయరు. స్పష్టత, ఎంపికలన్నవి కీలకం అవుతాయి. ముందుగా పెట్టుబడులకు విలువైన స్టాక్స్‌ను గుర్తించడం సరైన విధానం అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్‌కు 10–15 స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. బలమైన ఆర్థిక మూలాలతో, చక్కగా వృద్ధి చెందుతున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలానికి ఆయా కంపెనీలు సరైన ఎంపిక అవ్వాలంటే.. ఆయా కంపెనీలు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటున్నాయి తదితర అంశాలు కూడా తెలిసి ఉండాలి. ఇలా ముందు కంపెనీలను ఎంపిక చేసుకున్న తర్వాత రంగాల వారీ కేటాయింపులు చేసుకోవాలి. ఒకే రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం అవుతాయి. స్టాక్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/నిర్ణీత కాలానికోసారి కొంత చొప్పున) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానమేనా? మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌తో పోలిస్తే ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటి? – దుర్గేష్ చూడ్డానికి ఈ రెండూ ఒక్కటే. ఈక్విటీ ఫండ్‌లో సిప్ మాదిరే షేర్లలో నేరుగా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇందుకు మంచి కంపెనీని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కొంత కాల వ్యవధి వరకు విస్తరించడం వల్ల రిస్క్, ఆందోళన తగ్గుతుంది. అయితే, స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ పెట్టుబడులపై ఎప్పుడూ దృష్టి సారించి ఉండాలి. క్రమానుగతంగా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ కొంత వరకు చురుకైన నిర్వహణ విధానం అవసరమవుతుంది. సరైన సమయం, ఉత్సాహం ఉండి, వీటిన్నింటిని ఆస్వాదించేట్టు అయితే స్టాక్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపొచ్చు. లేదంటే మంచి మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. పైగా ప్రతి నెలా మీ పెట్టుబడులు రూ.5,000–10,000 మధ్యే ఉంటే యాక్టివ్ ఇన్వెస్టర్‌గా ఉండడం వల్ల పెద్దగా వచ్చే లాభం ఉండదు. ఇటువంటి వారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేవారు బ్యాలెన్స్డ్ ఫండ్ లేదా పన్ను ఆదా ఫండ్ (ఈఎల్ఎస్ఎస్)తో ప్రయాణాన్ని ప్రారంభించాలి. కనీసం రెండు, మూడేళ్ల పాటైనా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించాలి. దాంతో అస్థిరతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు వైవిధ్యంతో కూడిన ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రారంభించొచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్‌లోని పెట్టుబడులను వీటిల్లోకి మళ్లించాలి. ఆ తర్వాత మరో రెండు, మూడేళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇలా ఐదేళ్ల తర్వాత మార్కెట్లలో ఉద్దాన, పతనాలను అర్థం చేసుకుని, సర్దుబాటు చేసుకోవడం తెలిస్తే.. అప్పుడు కంపెనీ వార్షిక నివేదికలను అధ్యయనం చేయడం, మంచి స్టాక్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా అన్నది తెలుస్తుంది. స్టాక్ పడిపోయినా కానీ, మీకున్న కచ్చితమైన అవగాహన, విశ్వాసంతో పెట్టుబడులను కొనసాగించగలరు. అప్పుడే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ మాత్రం నైపుణ్యాలు, అవగాహన అవసరం. పైగా ఇదంతా ఒకే విడత చేయకూడదు. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులను 20–25 శాతంతో మొదలుపెట్టాలి. అలా ఏడాది పాటు చూడాలి. అంతా సక్రమంగానే ఉంటే అప్పుడు పెట్టుబడులను 50 శాతానికి పెంచుకోవాలి. అలా మరో ఏడాది పాటు కొనసాగించాలి. ఆ తర్వాత పెట్టుబడులను 75 శాతానికి పెంచుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులను అర్థం చేసుకునేందుకు ఇదొక క్రమానుగత విధానం అవుతుంది. దీనివల్ల పెట్టుబడుల నిర్వహణ ఫీజులను (మ్యూచువల్ ఫండ్స్‌లో వసూలు చేసేవి) ఆదా చేసుకోవచ్చు. ఇలా ఐదేళ్ల ప్రణాళికకు బదులు వేగంగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తే.. అంతే వేగంగా నష్టాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగం కూడా ఆకర్షించొచ్చు. కానీ, అందులోకి ప్రవేశించొద్దు. చాలా రిస్క్ ఎక్కువ. ఒకవేళ అంతగా ఆకర్షిస్తే చాలా స్వల్పమొత్తానికే పరిమితం అవ్వాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో , వాల్యూ రీసెర్చ్ -
స్థిరమైన రాబడులకు దారి..!
గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి ఏడాదిలోపే రెట్టింపునకు పైగా పెరిగి రికార్డులు సృష్టించాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన పథకాలు ఏవని పరిశీలిస్తే కేవలం కొన్నే పథకలు కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. కరోనా కారణంగా కుదేలైన మన దేశ ఆర్థిక వ్యవస్థ.. వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత తిరిగి అంతే వేగంగా కోలుకుంటుందని నిపుణుల అంచనా. ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడం అన్నది ఈక్విటీ మార్కెట్లకు అనుకూలైన మైన విషయమే. దీంతో ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లపాటు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. చారిత్రకంగా చూస్తే స్వల్ప కాలంలోనే ఈ అస్థితరలు ఉంటాయేమో కానీ.. దీర్ఘకాలంలో (కనీసం పదేళ్లు ఆ పైన) ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని ఎన్నో ఆధారాలున్నాయి. కనుక ఇన్వెస్టర్లు మెరుగైన రాబడుల కోసం.. అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి పరిమిత రిస్క్ తీసుకునే వారు నాణ్యమైన లార్జ్‌క్యాప్ (మార్కెట్ విలువ పరంగా టాప్–100) పథకాలను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ఒకవేళ మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లార్జ్‌క్యాప్ కంపెనీలు సమర్థవంతంగా అధిగమించగలవు. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం మంచి రాబడుల చరిత్ర కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు ఏ కాల వ్యవధికి పరిశీలించినా కానీ యాక్సిస్ లార్జ్‌క్యాప్ ఫండ్ రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ అగ్రగామిగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 44 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 15 శాతం, ఐదేళ్ల కాలంలో 16 శాతం చొప్పున ఉన్నాయి. ఏడేళ్లలోనూ వార్షికంగా 14 శాతం రాబడినిచ్చింది. పదేళ్ల కాలంలో వార్షిక రాబడి 14 శాతం చొప్పున ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్ రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఏడాది కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాల వ్యవధుల్లోనూ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం నిర్వహణలో జూన్ చివరికి రూ.28,233 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే (2010 జనవరి) వార్షిక రాబడి 13.35 శాతం చొప్పున ఉంది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక తన పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని చిన్న కంపెనీలకు కేటాయిస్తుంది. కానీ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకం దాదాపు పెట్టుబడులన్నింటినీ లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడం గమనార్హం. మెగా, లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే 99 శాతం ఇన్వెస్ట్ చేయగా.. ఒక శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. ప్రస్తుతం ఈ పథకం తన వద్దనున్న పెట్టుబడుల్లో 95.5 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 4.5 శాతాన్ని డెట్ సాధనాల్లో పెట్టి ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే మంచి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకునేందుకు గాను ఈ మేరకు డెట్ హోల్డింగ్స్‌ను కలిగి ఉందని భావించొచ్చు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లోనే 37 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి ఉంది. -
ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు, కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ఫండ్/ఏఎంసీ) ఎండీ నీలేష్ షా అభిప్రాయపడ్డారు. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక సమస్యలున్నా కానీ.. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకత మెరుగుపడడం ర్యాలీకి మద్దతునిచ్చే అంశంగా ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్ఛంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ‘ఈక్విటీ మార్కెట్ల భవిష్యత్తు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో నీలేష్ షా మాట్లాడారు. ‘‘కంపెనీల లాభాల్లో పురోగతిని స్టాక్ మార్కెట్ సానుకూలంగా పరిగణిస్తోంది. 2020 జూన్ త్రైమాసికంలో రూ.32,000 కోట్లుగా ఉన్న లాభం.. 2021 మార్చి త్రైమాసికం నాటికి రూ.2,10,000 కోట్లకు పెరిగింది. దీంతో కరోనా కారణంగా స్వల్పకాలంలో ఉండే సమస్యలను మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలంలో కంపెనీల లాభదాయకతను సానుకూలంగా చూస్తోంది. 2021 జూన్ త్రైమాసికంలో కంపెనీల లాభాలు తగ్గుతాయి. అయితే ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటాయన్నది మార్కెట్ అంచనాగా ఉంది’’ అని నీలేష్‌షా తెలిపారు. ఇవీ సానుకూలతలు.. అందరికీ టీకాలు ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్యసంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ నిర్వహణ వ్యయాలు, ప్రజల జీవనానికి మద్దతుగా ఉద్దీపన చర్యలు అన్నవి మార్కెట్లకు వచ్చే ఆరు నెలల కాలంలో ఎగువవైపు దిశగా మద్దతునిస్తాయని నీలేష్ అంచనా వేశారు. దీర్ఘకాలానికి భారత్ మూలాలు బలంగా ఉండనున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయిలో ఉండేందుకు తీసుకున్న చర్యలు, ద్రవ్యలోటు స్థిరత్వం, విదేశీ మారక నిల్వలు దండిగా ఉండడం, బ్యాంకింగ్ రంగం బలోపేతం కావడడం, భౌతిక, డిజిటల్ సదుపాయాలు అందుబాటులో ఉండడం ఆర్థిక ప్రగతికి తోడ్పడే అంశాలుగా వివరించారు. గృహ ఆధునికీకరణ, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్, డిజిటలైజేషన్ దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేశారు. ఇదే సమావేశంలో ఏఎన్ఎంఐ ప్రత్యామ్నాయ ప్రెసిడెంట్ కమలేష్‌షా మాట్లాడుతూ.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్లలో పాల్గొంటున్న తీరు ఆనందాన్నిస్తుందన్నారు. ఆది ఆశ, భయం సిద్ధాంతాన్ని గుర్తు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్‌కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్‌పై అప్పీల్‌కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్‌పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
లార్జ్‌క్యాప్‌లో సుదీర్ఘ అనుభవం
ఈక్విటీ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రాబడులు కూడా అలానే ఉంటాయి మరి. అయితే, ఈక్విటీల్లో రిస్క్ కొంత తక్కువ ఉండాలనుకునే వారికి లార్జ్‌క్యాప్ విభాగం అనుకూలం. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి ముందున్న ఎంపికల్లో హెచ్డీఎఫ్సీ టాప్ 100 మ్యూచువల్ ఫండ్ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మార్కెట్ పతనాలను ఎన్నింటినో చూసి ఉన్నది. రాబడుల విషయంలో మంచి ట్రాక్ రికార్డు కూడా ఈ పథకంలో గమనించొచ్చు. రాబడులు ఈ పథకం గత ఏడాది కాలంలో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎందుకంటే గత ఏడాది, ఏడాదిన్నర కాలంలో ప్రధానంగా బ్లూచిప్ కంపెనీలు మంచి ప్రదర్శన చూపడమే. లార్జ్‌క్యాప్ ఈక్విటీ డైవర్సిఫైడ్ విభాగంలో ఉత్తమ పనితీరు చూపించిన పథకం ఇదే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో పోటీ పథకాలైన యాక్సిస్ బ్లూచిప్ ఫండ్, రిలయ¯Œ ్స లార్జ్‌క్యాప్, ఆదిత్య బిర్లా స¯Œ లైఫ్ ఫ్రంట్‌లై¯Œ ఈక్విటీ కంటే హెచ్డీఎఫ్సీ టాప్100 ముందున్నది. మూడేళ్లలో ఈ పథకం వార్షికంగా 16.2 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 10.9 శాతం, పదేళ్లలో 13.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్నిచ్చింది. నిఫ్టీ 100 మూడేళ్లలో 14.8 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 11.3 శాతం చొప్పున ఉన్నాయి. సుదీర్ఘకాలంగా మార్కెట్లో ఉన్న ఈ పథకం 2015, 2016 సంవత్సరాల్లో మాత్రం ఆశించిన పనితీరు చూపలేదు. కానీ, 2017లో మాత్రం తిరిగి మంచి పనితీరుతో ముందున్నది. తక్కువ రిస్క్ కోరుకునే వారు ఈ పథకంలో దీర్ఘకాలం పాటు, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. పోర్ట్‌ఫోలియో, విధానం ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎన్నో ఏళ్ల ర్యాలీ అనంతరం ఈ పథకం తన ప్రాధాన్యంలో మార్పు చేసింది. కార్పొరేట్ బ్యాంకులు, ఇండస్డ్రియల్స్, యుటిలిటీలు, ఐటీ రంగాలకు 2017లో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ రంగాల్లోనే ఎక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాల్లో స్టాక్స్ వ్యాల్యూషన్లు ఎక్కువగా ఉండడం, డిమాండ్ బలహీనంగా ఉండడం వంటి కారణాలతో తక్కువ వెయిటేజీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 50 స్టాక్స్ ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో 97.44 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు నిల్వల రూపంలో కలిగి ఉంది. బ్లూచిప్ కంపెనీలకు 90.5 శాతం వరకు పెట్టుబడులను కేటాయించగా, మరో 9.5 శాతం మేర మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకు పెద్ద పీట వేసింది. ఈ రంగాల్లో 37.5 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఎనర్జీ స్టాక్స్‌కు 23.69 శాతం, టెక్నాలజీకి 13 శాతం పెట్టుబడులను కేటాయించింది. -
ప్రైవేట్ బ్యాంక్స్.. టాప్ గన్స్!
రుణాల వృద్ధి, మొండిబాకీల తగ్గుదలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సంస్థలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ త్రివేది. బ్యాంకింగ్ విభాగంలో ప్రైవేట్ బ్యాంకులు ఆశావహంగా కనిపిస్తున్నాయని, ఫార్మా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్నికలు.. మార్కెట్లపై.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశీ ఈక్విటీ మార్కెట్ల పనితీరు ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) రాకతో ప్రస్తుతం ఈ లోటు తీరగలదని అంచనాలు ఉన్నాయి. తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐలు దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యే దాకా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు కాస్త నెర్వస్‌గానే ఉండొచ్చు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కంపెనీల ఆదాయాల అంచనాలు, వాటికి తగ్గట్లుగా షేరు ధరలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నట్లు భావిస్తున్నాం. మూలధనం తగినంత స్థాయిలో ఉన్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉండే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా ఫార్మా రంగం అంతగా రాణించలేకపోయినప్పటికీ .. ప్రస్తుతం ఎకానమీ, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మధ్యకాలికంగా చూస్తే ఐటీ రంగం కూడా బాగానే కనిపిస్తోంది. డీల్స్ సంఖ్య పెరుగుతోంది. అమ్మకాలపరంగా ఆటోమొబైల్ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. కానీ వేల్యుయేషన్స్ ప్రస్తుతం బాగా కరెక్షన్కు లోనయ్యాయి. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. స్థూల గణాంకాలు చూస్తుంటే ఆర్థిక కార్యకలాపాలు కాస్త తగ్గిన ట్లుగా కనిపిస్తోంది. డిమాండ్‌పరంగా మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్దిష్ట రంగం లేదా స్టాక్‌పైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. ఉదాహరణకు రుణ వృద్ధి పుంజుకోవడం, మొండిబాకీలు తగ్గుతుండటం వంటివి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చు. ఇక ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికం సీజనల్‌గా బలహీనంగానే ఉంటుంది. కరెన్సీపరమైన ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. ఇక మా నిర్వహణలోని యూటీఐ టీఅండ్ఎల్ ఫండ్ ప్రధానంగా రవాణా, ఆటో, లాజిస్టిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో వాహన రంగం చాలా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఫలితంగా కొనుగోలుదారులపై అధిక భారం మోపాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల డిమాండ్ మందగించింది. పండుగల సీజన్, ఆ తర్వాత కూడా ఇదే ధోరణి నెలకొంది. వ్యయాలు పెరిగిపోవడం, డిమాండ్ తగ్గడం వంటి అంశాలతో వాహన కంపెనీల లాభాల అంచనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వాటి వేల్యుయేషన్స్ సైతం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత మార్కెట్లో వాహనాల వినియోగం ఇంకా పూర్తి స్థాయికి చేరలేదు. పెరుగుతున్న తలసరి ఆదాయాలతో డిమాండ్ కూడా మెరుగుపడవచ్చు. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాలకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో.. వాహన కంపెనీలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే ఈ రంగంపై మేం ఆశావహంగా ఉన్నాం. ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌లో వృద్ధి అవకాశాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లపై అంచనాలు.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కంపెనీల వాస్తవ ఆర్థిక పనితీరు .. ఏడాది ప్రారంభంలో వేసే అంచనాలకన్నా తక్కువగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో కొన్ని త్రైమాసికాలుగా ఆదాయాల డౌన్‌గ్రేడ్స్ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఆదాయాల వృద్ధి కొంత మెరుగుపడుతున్న ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ.. వేల్యుయేషన్స్‌పరంగా సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ50 తీసుకుంటే దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే సుమారు 18% ప్రీమియంతో ట్రేడవుతోంది. అలాగే మిడ్‌క్యాప్ సూచీలు దాదాపు 8% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మొత్తం మీద కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడాలి. ఇవి కాకుండా వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కూడా కొంత మేర భారత మార్కెట్లకు ఊతంగా ఉండగలదని అంచనా. -
రూపాయికి ‘విదేశీ నిధుల’ అండ
ముంబై: దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ పరుగులు రూపాయిని బలోపేతం చేస్తున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 18పైసలు బలపడి 69.71 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో ఈ స్థాయిని రూపాయి చూడ్డం ఇదే తొలిసారి. విదేశీ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ బలహీన ధోరణిసైతం రూపాయికి కలిసి వస్తోంది. మంగళవారం ఎగుమతిదారులు, బ్యాంకర్లు పెద్ద ఎత్తున డాలర్ అమ్మకాలకు దిగారని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లోకి మరిన్ని నిధులు వస్తాయన్న అంచనాలు రూపాయికి వరుసగా రెండవరోజూ లాభాలను తెచ్చిపెట్టినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. సోమవారం కూడా రూపాయి 30 పైసలు లాభపడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి పడిపోతూ రావడంతో రూపాయి కోలుకుని 2 నెలల క్రితం ప్రస్తుత స్థాయిని చూసింది. -
ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ.1.2లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ 2017 సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లో రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టగా, 2018 పట్ల కూడా ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. 2016లో చేసిన ఈక్విటీ పెట్టుబడుల కంటే రూ.48,000 కోట్లు అధికం. ‘‘రియల్ ఎస్టేట్, బంగారం కంటే ఆర్థిక సాధనాలకు ప్రాధాన్యం ఇస్తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇక ముందూ కొనసాగే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ స్థిరమైన రాబడులు ఇస్తుండటం, వివేకంతో కూడిన రిస్క్ నిర్వహణ, ఇన్వెస్టర్లలో అవగాహనకు చేపడుతున్న చర్యలు మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల విస్తరణకు దోహదం చేస్తోంది’’ అని కోటక్ మ్యూచువల్ ఫండ్ సీఐవో హర్ష ఉపాధ్యాయ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీల్లో అధిక పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యం చేదోడుగా నిలుస్తోంది. ఎక్కువ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఆధారంగా నడిచే స్టాక్ మార్కెట్లకు ప్రస్తుతం దేశీయ ఇన్వెస్టర్ల నుంచే తగినంత లిక్విడిటీ లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి నిదర్శనం ఎఫ్‌పీఐలకు మించి ఈక్విటీల్లో ఫండ్స్ పెట్టుబడులు పెట్టడమే. ఎఫ్‌పీఐలు 2017లో రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఏడాదిలో ఈక్విటీ పెట్టుబడులు రూ.20,500 కోట్లుగానే ఉన్నాయి. ‘‘ఈ ఏడాది దేశీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలను మించిపోయారు. దీంతో మార్కెట్ ఎఫ్‌పీఐల నిదులపై తక్కువగా ఆధారపడింది. దీనివల్ల ఎఫ్‌పీఐల పెట్టబడులు ఉపసంహరణ సమయాల్లోనూ మన మార్కెట్లకు తగినంత స్థిరత్వం ఏర్పడింది. దేశీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల మద్దతుగా స్టాక్ మార్కెట్లు ముందుకు కొనసాగాయి’’ అని మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
డాలర్, ఈక్విటీ మార్కెట్లపైనే పసిడి భవిత!
అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్ ధోరణి పసిడి భవితను సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది నిపుణుల విశ్లేషణ. డాలర్ బలహీనతతో అక్టోబర్ 13వ తేదీతో ముగిసిన వారంలో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) 1,305 డాలర్ల స్థాయికి ఎగిసిన పసిడి మళ్లీ వెనక్కు తగ్గింది. కీలక మద్దతయిన 1,305 స్థాయిని కోల్పోయి 24 డాలర్ల నష్టంతో 1,282కు చేరింది. అక్టోబర్ 20వ తేదీతో ముగిసిన వారంలో డాలర్ మళ్లీ బలోపేతం కావడం ఇందుకు ప్రధాన కారణం. ఈ వారంలో డాలర్ ఇండెక్స్ తిరిగి 93.67 స్థాయికి చేరడం గమనార్హం. అమెరికాలో పన్ను సంస్కరణలు, వృద్ధి మెరుగుదల అంచనాలు డాలర్ బలోపేతానికి కారణం. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలతో కూడిన 2018 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ప్రణాళికను సెనేట్ ఆమోదించటం డాలర్, ఈక్విటీలకు బలాన్నిచ్చింది. అయితే పన్ను కోతలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయాలను చూడాల్సి ఉంది. పసిడి బలహీనతకే ఎక్కువ ఓట్లు... ‘‘వచ్చే ఏడాది పన్ను కోతకు 75 శాతం అవకాశం ఉందని మార్కెట్లు భావిస్తున్నాయి. ఇది పసిడికి ప్రతికూలం’’ అని ఫారెక్స్ లైవ్.కామ్‌కు చెందిన కరెన్సీ వ్యూహకర్త ఆడమ్ బుటన్ పేర్కొన్నారు. పసిడి బులిష్ ట్రెండ్ సమీప కాలంలో కష్టమేనని తాను భావిస్తున్నట్లు ఫారెక్స్.కామ్ టెక్నికల్ అనలిస్ట్ ఫవాద్ రజాక్దా చెప్పారు. ఈక్విటీల అధిక విలువలు, పటిష్ట డాలర్‌ను దీనికి కారణంగా ఆయన పేర్కొన్నారు. పసిడి 1,300 డాలర్ల లోపునకు పడిపోతోందీ అంటే, సమీప భవిష్యత్తులో మరింత బలహీనానికి ఇది సంకేతమనీ ఆయన విశ్లేషించారు. ఇక వచ్చేవారం యూరోపియన్ యూనియన్ సెంట్రల్‌బ్యాంక్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పరపతి విధాన నిర్ణయాలు డాలర్‌పై, అందుకు అనుగుణంగా పసిడిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నా యి. అమెరికా ఫెడ్ రేటు పెంపు ఖాయమంటూ వస్తున్న సంకేతాలు డాలర్ బలానికి, పసిడి బలహీనతకు దీర్ఘకాలం లో దారితీసే అంశాలుగా వారి అభిప్రాయం. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పసిడికి స్వల్పకాలమే బూస్ట్నివ్వగలవు తప్ప, దీర్ఘకాలంలో ఇది సాధ్యపడదని విశ్లేషకుల అభిప్రాయం. దేశీయంగా చూస్తే...: 20వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి కదిలింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో పసిడి వారం వారీగా రూ.296 తగ్గి రూ. 29,554కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ. 29,645కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ. 29,495కు చేరింది. ఇక వెండి కేజీ ధర రూ. 425 తగ్గి రూ.39,430కి పడింది. -
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
ఇన్వెస్ట్ చేయడం సులభం. చేతిలో డబ్బులుంటే చేసేయొచ్చు. కానీ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ఎదగడమే కష్టం. ప్రస్తుతం మార్కెట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టాక్స్ ఒకటి. ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు తేడా ఉంది. ఇక్కడ రిటర్న్స్‌తో పాటు రిస్క్‌లూ ఎక్కువగా ఉంటాయి. అందుకే మన కష్టార్జితాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందే స్టాక్ మార్కెట్ గురించి అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకోవాలి. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. మీకు తెలిసిన రంగాలకు చెందిన, అవగాహన ఉన్న కంపెనీల స్టాక్స్‌నే కొనుగోలు చేయాలి. స్టాక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న కంపెనీ ఏ కార్యకలాపాలు నిర్వహిస్తుందో చూడాలి. కంపెనీ పనితీరు ఎలా ఉందో గమనించాలి. దాని త్రైమాసిక ఫలితాలను చదవండి. బ్యాలెన్స్‌షీట్ ఎలా ఉందో చూడండి. కంపెనీ మేనేజ్మెంట్ గురించిన సమాచారాన్ని తెలుసుకోండి. కంపెనీ స్టాక్ విలువ ఏ విధంగా ఉందో చూడండి. అంటే కొన్ని స్టాక్స్ ధర వాటి అసలు విలువ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించే మొత్తం సమంజసంగా ఉందో లేదో ఒకటి రెండు సార్లు చూసుకోండి. మీరు స్టాక్స్ కొనాలనుకున్న కంపెనీ ప్రత్యర్థుల గురించి కూడా తెలుసుకోవాలి. వాటి పనితీరు, కార్యకలాపాలు ఎలా ఉన్నాయో చూడాలి. కంపెనీకి సంబంధించిన పీఈ నిష్పత్తి, బీటా, డివిడెండ్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, డెట్, నికర ఆదాయం వంటి అంశాలనూ చూడండి. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉండండి. -
ఫలితాలు, గణాంకాలే కీలకం
* మార్కెట్‌పై ప్రభావం చూపనున్న అంశాలు ఇవీ.. * ఈ వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు * ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా * ప్రపంచ మార్కెట్ల పోకడ ముంబై: బ్లూ చిప్ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు... ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ ఐటీ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే రానున్నాయి. నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, డిసెంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఈ అంశాలతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు హిందూస్తాన్ యూనిలివర్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్‌ఇంద్ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీలు ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. జనవరి 12న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడతాయి. ఈ వారంలో పలు కీలకాంశాలు చోటు చేసుకోనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, వీటితో పాటు పలు ప్రధాన కంపెనీలు తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయని పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం చలించే తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. ‘అంతర్జాతీయ’ ప్రభావమే అధికం ! భారత కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం కంటే అంతర్జాతీయ సంకేతాల ప్రభావమే ఈ వారంలో స్టాక్‌మార్కెట్‌పై అధికంగా ఉంటుందని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థ అభిప్రాయ పడింది. అంతర్జాతీయ సంకేతాల్లో ఎలాంటి మెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నాణ్యత గల షేర్లపైననే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజా ఆందోళనలు, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం వంటి కారణాల వల్ల గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,227 పాయింట్లు(4.68 శాతం) నష్టపోయింది. డెట్ మార్కెట్లో ‘విదేశీ’ జోరు భారత డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,700 కోట్లకు పైగా డెట్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది మొత్తం మీద భారత డెట్‌మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. డిపాజిటరీ సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 8వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా డెట్ మార్కెట్లో రూ.3,706 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి ఒకింత స్థిరంగా ఉండడం వల్ల డెట్ మార్కెట్లో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లలోపే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉండడం, రూపాయి అవుట్‌లుక్ సానుకూలంగా ఉండడం వంటి అంశాలూ ప్రభావం చూపాయని వారంటున్నారు. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆందోళన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.493 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం క్యాపిటల్ మార్కెట్లో జనవరి 1-8 కాలానికి వీరి నికర పెట్టుబడులు రూ.3,214 కోట్లుగా ఉన్నాయి.