fathers day
-
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)
-
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
ఫాదర్స్ డే : నాన్నను మురిపించిన స్టార్స్ (ఫోటోలు)
-
Father's Day 2024: హాయ్..! నాన్న..!!
"ఏ కష్టం ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం"...నేడు ‘ఫాదర్స్ డే’ ఈ పాట వినగానే గూస్బమ్స్ వస్తాయి.. ఇప్పుడెందుకు ఈ పాట గురించి చెప్పాల్సి వచ్చిందంటే..అదే నండి జూన్ 16న ‘ఫాదర్స్ డే’. నేటి హాయ్ నాన్న.. మొదలుకుని.. నాటి ‘డాడీ’ వరకూ అనేక సినిమాలు నాన్న కూతురు, నాన్న కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా చిత్రించారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నిజజీవితంలోనూ మనలో చాలామందికి రోల్ మోడల్ నాన్నే.. పైకి కోపంగా, కటువుగా, గంభీరంగా కనిపించే నాన్న మనసు పొరల్లో దాగున్న ప్రేమ బయటకు చెప్పలేనిది.లోపల ఎంత ప్రేమున్నా.. పైకి చూపిస్తే..పిల్లలపై ప్రభావం పడుతుందనుకునే నాన్నను అర్థం చేసుకునేవాళ్లు తక్కువ మందే.. అందుకే చాలా మందికి చివరి వరకూ నాన్న విలన్ లానే కనిపిస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఆయనే నిజమైన హీరో. అయితే నాన్న ప్రేమను అర్థం చేసుకోవడమూ అంత తేలికేం కాదు...మన కోసం తన కోర్కెలను, ఆశయాలను, ఆలోచనలను, ప్యాషన్‌ను, ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తాడు. అలాంటి నాన్నల గురించి ఫాదర్స్ డే సందర్భంగా పలువురిని సాక్షి పలుకరించగా.. వారు పంచుకున్న విశేషాలు...వారిమాటల్లోనే...ఆయన అలవాట్లే నాకొచ్చాయి..మాది ఉమ్మడి కుటుంబం. తాత కొండా వెంకటరంగారెడ్డి. నాన్న పేరు జస్టిస్ కొండా మాధవరెడ్డి. మాది పెద్ద కుటుంబం కావడంతో అంతా కలిసి భోజనం చేసే వాళ్లం. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాను. ఆయనంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ విధిగా పాటించేవాడిని. నాపై ఆయన కోపం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఎంత బిజీగా ఉన్నా...కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేవారు. ప్రతి రోజు కలిసే డిన్నర్ చేసేవాళ్లం. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే కాకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలపై పెద్ద చర్చే జరిగేది.ఆయన అలవాట్లే నాకూ వచ్చాయని అంతా అంటుంటారు. భోజనం తర్వాత స్వీటు తినే అలవాటు ఆయన నుంచి వచ్చినదే. కోపం కూడా ఆయన మాదిరే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జడ్జిగా పని చేస్తూ వ్యవసాయ పనులు చూసుకునే వారు. సాంస్కృతిక కేంద్రాలు. విద్యా సంస్థలు నిర్వహించారు. చాలా అంశాల్లో నాన్నే ఆదర్శం. ప్రతి అంశాన్నీ విశ్లేషించడమేకాదు..వాటి పరిణామాలనూ చెప్పేవారు. – చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డినాన్నే స్ఫూర్తి..స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. కుటుంబంతో కలిసి సోమాజీగూడలోనే స్థిరపడ్డాం. ఖైరతాబాద్ నాసర్ స్కూల్లోనే 12వ తరగతి వరకూ చదువుకున్నా. అమ్మ సుజాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉద్యోగిని. నాన్న చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఆఫీస్ మా ఇంటి పక్కనే ఉండేది. మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్ అయిపోయేది. దీంతో నాన్నే వచ్చి చూసుకునే వారు. ఆయన ప్రోత్సాహంతోనే స్కూల్ టాపర్‌గా మారా.నాన్న వారసురాలిగా 2011లో సీఏ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యా. నాన్నకు చిన్న తనం నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో సాధ్యంకాలేదు. నాకూ చిన్నప్పటికీ నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. మొదటి రెండు ప్రయత్నాల్లో సరైన గైడెన్స్ లేక అర్హత సాధించలేకపోయా. మూడో ప్రయత్నంలో నేను చేసిన తప్పు వల్ల అవకాశం కోల్పోయా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.‘నా కోసం వద్దు. నీకు పూర్తి ఆసక్తి ఉంటే విఫల్యాలను మర్చిపోయి మరింత దీక్ష, ప్రణాళికతో ముందుకెళ్లు’ అంటూ స్ఫూర్తి నింపారు. 2016లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో ఇండియాన్ ఫారెన్ సరీ్వస్‌కు ఎంపికయ్యా. ఆ తర్వాత అనేక విభాగాల్లో పనిచేశా. గడిచిన ఆరు నెలలుగా సికింద్రాబాద్ ఆరీ్పఓగా సేవ లు అందిస్తున్నా. నా భర్త రోహిత్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సరీ్వస్ (ఐఐఎస్) అధికారి. మా పాప సహస్రను ఆయనే చూసుకుంటారు. నాన్నకు సహస్ర మరో స్నేహజ. ‘నేను స్నేహజ ఫాదర్’ అంటూ నాన్న గర్వంగా చెప్పుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. –స్నేహజ, ఆర్పీఓ, సికింద్రాబాద్నాన్న వల్లనే ఈ స్థాయికి..చిన్న తనం నుంచి చదువు ఎంత ముఖ్యమో చెప్పేవారు. తాను హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉద్యోగవిరమణ చేసినా పిల్లలందరినీ ఉన్నత చదువులకు పట్టుబట్టారు. నాన్న పేరు అంబడపూడి మనోహరం. నాన్నతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ఎంతో ప్రేమానురాగాలను పంచేవారు. ఎంత కష్టమైనా ఉద్యోగాలు పొందాలనే అందరికీ చెప్పేవారు. ఆయన ఒత్తిడితోనే గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను. ఆడపిల్లలకు నాన్న అంటే భరోసా, కొండంత అండ, అన్నింటికీ నాన్న ఉన్నాడులే అనే భావన ఎప్పటికీ ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే నాన్నే నాకు స్పూర్తి. – అంబడపూడి శారద, ప్రిన్సిపల్ – సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డి ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం..నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆ పాత్ర ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. మాది కోనసీమజిల్లా చెయ్యేరు అగ్రహారం. దార్ల లంకయ్య(అబ్బాయిగారు), తల్లి దార్ల పెదనాగమ్మకు మేము ఐదుగురు సంతానం. అయినా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో చూసేవారు. తాను చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు.నాన్న ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా మా కడుపులు నిండాలని తపించేవారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఆ ఫలితాలను అనుభవించడానికి ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. మా చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకుని నాటకాలకీ, సినిమాలకీ తీసుకెళ్లేవారు. ఆహార పదార్థాలను తన చేతి రుమాలలో మూటగట్టుకొని తెచ్చిన రోజుల్ని మర్చిపోలేము.మా నాన్నని అందరూ ముచ్చటగా ‘అబ్బాయి’ అని పిలిచేవారు. అసలు పేరుకంటే అదే íస్థిరపడిపోయింది. అదే మానాన్న ఆత్మీయానురాగాలకు గొప్ప నిదర్శనం. నాన్న జ్ఞాపకార్థం హెచ్‌సీయూలో ప్రతి ఏటా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు–హెచ్సీయూమంచి ఇంజినీర్ కావాలి..ఆస్తులు అమ్మి అయినా ఖర్చు పెడతా అనేది మా తండ్రి. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్లలో పేద కుటుంబం మాది. నాన్న జి బాలకిష్టయ్య గౌడ్, అమ్మ లక్ష్మీదేవమ్మ. ఇంట్లో ఆరుగురు అక్కలు పుట్టిన తర్వాత నేను పుట్టడం, అదే రోజు మా వనపర్తి రాజుగా ఉండే రామేశ్వరరావు ఊరికి రావడంతో అయన పేరునే నాకు పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో తెలుగు మీడియం చదివా. తర్వాత పాలిటెక్నిక్ చేసి ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చదివా.అవసరమైతే ఆస్తులు అమ్మేస్తా... నువ్వు ఇంజినీర్ అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలనేవారు. నాన్న కల నెరవేర్చేందుకు మా తమ్ముడిని కూడా ఇంజినీరింగ్ చదవించా. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ కావడం నాన్న ప్రోద్బలమే.. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నలుగురూ చదువుకునేలా ప్రోత్సహించాలనేవారు నాన్న. ఇప్పటికీ నాన్న మాటలు నా చెవులకు వినిపిస్తుంటాయి. – డాక్టర్ జి రామేశ్వరరావు, డైరెక్టర్ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాఅందరూ చదవాలి..ఎంతకష్టమైనా పడతా...చదవండి అనేవారు నాన్న... అనంతపురం రాయదుర్గంలో టైలర్ మహ్మద్ అనీఫ్ నాన్న. కుటుంబంలో చదువుకున్నవారుంటే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడతా చదవండి అంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.ఒకరిని నేవీలో ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అక్క మంచి గైనకాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. నన్ను కూడా చదివించగా అనంతపురం జేఎన్టీయూలోఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించాను. అనంతరం ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి 1999లో రాయదుర్గం జీఐఎల్‌టీలో లెక్చరర్‌గా చేరా. ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ రాయదుర్గంలో ఉంటూ ఫోన్ చేస్తే మొదట పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతారు. –షేక్ ఎక్బాల్ హుస్సేన్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ–రాయదుర్గంనా ఇష్టాలను గౌరవిస్తారు...నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చేవారు. మొదట సినిమాల గురించి అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. దీంతో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే ఓ షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో చేయడం, అది పెద్దగా హిట్ అవ్వడంతో సుకుమార్ నన్ను రంగస్థలానికి ఎంపికచేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ప్రీమియర్‌కి పిలిచినప్పుడే చెప్పా.యాక్టింగ్ చూశాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకూ ఒప్పుకోరనుకున్నా.. మా నాన్నే నా లైఫ్‌లో రియల్ హీరో.. ఇండస్ట్రీకి ఓ అమ్మాయి వెళ్తుందంటే చాలా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. రూమర్స్‌ని అస్సలు పట్టించుకోరు.. నా ఎదుగుదల చూసి గర్వపడతారు.. – పూజిత పొన్నాడ, హీరోయిన్ఇవి చదవండి: -
ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
నవమాసాలు కడుపునమోసి పెంచకపోతే ఏంటి..పాలుపట్టి లాలించకపోతే ఏంటి..చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపంచకపోతే ఏంటి.. ఎక్కడో వంటగదిలో కుక్కర్ శబ్దానికి మన ఏడుపు వినిపించక అమ్మ తనపని చేసుకుపోతుంటే.. మన గొంతు విన్న నాన్న పరుగోమని హక్కున చేర్చుకుంటాడు కదా.. అహర్నిశలు అమ్మ, పిల్లలకు ఎలాంటిలోటు లేకుండా కంటిరెప్పలా చూసుకుంటాడు కదా.. తోచినంతలో దాచిపెట్టి తిరిగి అత్యవసర సమయాల్లో మనకే ఖర్చుపెడుతాడు కదా..మన ఇష్టాలే తన ఇష్టాలుగా బ్రతుకుతాడు కదా.. మనల్ని కొట్టినాతిట్టినా తనకంటే ఉన్నతస్థాయిలో చూసుకోవాలనుకుంటాడు కదా.. తన బుజాలపై మనల్ని మోస్తూ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు కదా.. నాన్నే మన హీరో. వ్యాపారంలో కోట్లు సంపాదించి అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు కూడా నాన్నతో తమకున్న బంధాన్ని, తమ పిల్లలపై ఉన్న ప్రేమను చూపిస్తుంటారు. అలా తండ్రుల నుంచి జీవితాన్ని నేర్చుకున్న కొందరు వ్యాపార ప్రముఖుల గురించి ఫాదర్స్‌డే సందర్భంగా ఈ కథనంలో తెలుసుకుందాం.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన తండ్రి జ్ఞాపకాలను మనసు పొరల్లో పదిలంగా దాచుకున్నారు. ఫాదర్స్ డే రోజున తన తండ్రి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీఎన్ యుగంధర్ గురించి తెలిపారు. ‘అప్పుడప్పుడు రాత్రుళ్లు మెలకువ వచ్చేది. లేచి చూస్తే నాన్న.. పని నుంచి తిరిగొచ్చి తనకు ఇష్టమైన రష్యన్ రచయిత పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఆయనకు తాను చేసే పని ఒక ఉద్యోగం కాదు. అదే తన జీవితం. కొన్ని దశాబ్దాల పాటు చట్టపరమైన పనులు, పాలసీ, ఫీల్డ్ ప్రోగాములతో నిరంతరం బిజీగా గడిపారు. కానీ ఆయన అలసట తీర్చింది మాత్రం ప్రజల చిరునవ్వే. పనిని, జీవితాన్ని మిళితం చేసుకుని ఆయన సాగించిన యాత్రే నాకు స్ఫూర్తి. నా జీవితం వేరైనా, ఆయన నేర్పిన పాఠాలే నాకు దిక్సూచి’అని నాదెళ్ల పేర్కొన్నారు.యుగంధర్ ప్రధానమంత్రి కార్యాలయంలో, ప్లానింగ్ కమిషన్‌లో, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో, ఉమ్మటి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ పదవుల్లో పని చేశారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తిసందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు..డియర్ అక్షితామీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ అందుకు అనుమతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయతీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ.- మీ పప్పాజమ్సెట్జీ టాటాభారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం హైడల్పవర్ ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు దొరాబ్జీ టాటా, రతన్జీటాటాలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేశారు. అప్పటి నుంచి జేఆర్డీ టాటా వారి స్ఫూర్తిని కొనసాగించారు. దాన్ని రతన్‌టాటా మరింత స్థాయికి తీసుకెళ్లి భారత పరిశ్రమలో మెఘుల్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. -
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్‌ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
బ్యూటీఫుల్ ఫాదర్ అండ్ డాటర్
ఆటవిడుపులో భాగంగా సెలబ్రిటీలు కుటుంబంతో గడిపే సంతోష సమయాలు వారికి మాత్రమే పరిమితమైనవి కాదు. అభిమానులకు కూడా సంతోషం కలిగిస్తాయి. ‘క్రికెటర్‌గా రోహిత్‌శర్మ ఏమిటి?’ అని చెప్పడానికి బోలెడు సమాచారం ఉంది. ‘తండ్రిగా రోహిత్ ఏమిటి?’ అని చెప్పడానికి ఈ వైరల్ ఫొటో ఒక్కటి చాలు. ‘ఫాదర్స్ డే’ సందర్బంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సముద్రపు ఒడ్డున తన కూతురు సమైరతో కలిసి రోహిత్‌శర్మ ఇసుకలో పిచ్చుక గూడు కడుతున్న ఫొటో ‘ఆహా’ అనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘ఫ్యామిలీ టైమ్ ఈజ్ ది బెస్ట్ టైమ్’ అని కాప్షన్ ఇచ్చారు నెటిజనులు.‘ది ఫాదర్, ది కెప్టెన్, ది హిట్‌మ్యాన్, ది భయ్యా, ది ఓపెనర్’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.మరో యూజర్ ‘బ్యూటీఫుల్ డాటర్ అండ్ ఫాదర్. లవ్ యూ మై మ్యాన్’ అని కామెంట్ పెట్టాడు. -
నాన్న... ఓ సూపర్ హీరో
చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
ఇంటి గడప దాటకూడని ఆంక్షలు అక్కడా ఇక్కడా ఇంకా కొనసాగుతున్నా నేడు భారతీయ యువతులు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఎగురుతున్నారు. కొడుకు ఎంతో కూతురూ అంతే అనే ఎరుక కలిగిన తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నా నాన్న ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిందని ఈ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు అంటున్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ల విజయగాథలు ఇవి.నాన్న మాటే ఇంధనంనా పేరు శ్రీప్రియ మోదలే. మాది మహారాష్ట్రలోని పూణే. నాన్న శ్రీకాంత్ మోదలే. అమ్మ ప్రజ్ఞ మోదలే. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా నాన్న పెట్రోల్ పంపులకు సంబంధించిన చిన్న వ్యాపారం చేస్తారు. అమ్మ ఇంట్లోనే ఆహారం తయారు చేసి అమ్ముతుంది. తండ్రి శ్రీకాంత్, తల్లి ప్రజ్ఞతో శ్రీప్రియ ఇలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ నిరాశపర్చలేదు. మా నాన్నైతే నీకు నచ్చిన వృత్తిలో వెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. నేను పూణే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత ఎట్మాస్ఫియరిక్ సైన్సెస్‌లో ఎంటెక్ చేశాను. ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్‌గా, స్విమ్మింగ్ కోచ్‌గా, జాతీయ స్థాయి కరాటే ప్లేయర్‌గా, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ స్ట్రక్టర్‌గా రకరకాల పనులు చేశాను. ఇన్ని చేసినా ఎక్కడో అసంతృప్తి నాలో ఉండేది. దేశసేవలో భాగం అయ్యేందుకు నాకున్న బలాలను, అవకాశాలను ఆలోచించాను. దేశ రక్షణ కోసం పనిచేసే ఉద్యోగం కరెక్ట్ అనిపించింది. అందుకే నేను భారత వాయుసేన వైపు రావాలని నిర్ణయించుకుని కష్టపడ్డాను. చివరకు ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ పూర్తి చేయడం సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. వాయుసేన ఆపరేషన్స్ అన్నింటికీ వాతావరణ సమాచారం అత్యంత కీలకమైంది. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందించే కీలక బాధ్యతలు దక్కడం నాకు సంతోషంగా ఉంది. – శ్రీప్రియ, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే నాకు స్ఫూర్తినా పేరు నందినీ సౌరిత్. హర్యానాలోని పల్వల్ జిల్లా మా స్వస్థలం. నాన్న శివ్‌నారాయణ్ సౌరిత్, అమ్మ సంతోషికుమారి సౌరిత్. మా నాన్న ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో ఆయనే నాకు స్ఫూర్తి. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క సంతానం. పైగా అమ్మాయిని అయినా నాన్న నాకు ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలూ లేకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా నాన్న కోరిక వల్లే నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరాను.తండ్రి శివ్‌నారాయణ్, సంతోషికుమారిలతో నందిని సౌరిత్ ‘నా కూతురు ఎంతో ఉన్నతంగా అందరికంటే ఎత్తులో ఉండాలి’ అని నాన్న నాకు చెబుతూ ఉండేవారు. అదే నాలో చిన్ననాటి నుంచి స్ఫూర్తి నింపింది. నేను ఎన్సీసీ కేడెట్ను. జాతీయ స్థాయిలో అథ్లెట్‌ను. భారత వాయుసేనలో చేరిన తర్వాత శిక్షణ సమయంలో ఇవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కఠోర శిక్షణ పూర్తి చేసి ఈ రోజు నేను ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇప్పుడు నా పక్కన ఉండడం నాకు మరింత సంతోషంగా ఉంది. నేను శిక్షణలో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌తో ఎడ్యుకేషన్ బ్రాంచ్‌కు ఎంపికయ్యాను. వాయుసేనకు సంబంధించిన కీలక బాధ్యతలు అవి. – నందినీ సౌరిత్, ఫ్లయింగ్ ఆఫీసర్నాన్నే దేశసేవ చేయమన్నారుమాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శామిలి జిల్లా. పుట్టిపెరిగింది అంతా ఢిల్లీలోనే. అక్కడే కేంద్రీయ విద్యాలయ్‌లో చదువుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాను. మా నాన్న రవీందర్‌కుమార్ ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ అంజేష్ గృహిణి. ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేదాన్ని.‘ఆ ఉద్యోగాలు చేసేందుకు అందరూ ఉత్సాహపడతారు. కాని దేశ సేవ కోసం కొందరే ముందుకు వస్తారు. నువ్వు దేశ సేవ చేయమ్మా’ అని నాన్న అన్నారు. తండ్రి రవీందర్‌కుమార్, తల్లి అంజేష్లతో మాన్వి నా మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికయ్యాను. మా కుటుంబంలో భారత సైన్యంలోకి వచ్చిన మొదటి ఆఫీసర్ని నేనే. అందుకు నాకు గర్వంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో గొప్ప ఉద్యోగం ఇది. అకాడమీకి రాక ముందు, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నాలో నేనే ఎంతో మార్పు గమనించాను. ఇక్కడ వృత్తిగతంగానే కాదు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎన్నో అంశాలు నేర్చుకున్నాను. నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను అకౌంట్స్ బ్రాంచ్‌లో ఉత్తమ కేడెట్‌గా నిలిచాను. నాకు ఇప్పుడు అకౌంట్స్ బ్రాంచ్ ఇచ్చారు. – మాన్వి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
Father’s Day 2024: వ్యాపార సామ్రాజ్యంలో నాన్న తోడుగా.. (ఫొటోలు)
-
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
Fathers Day 2024: ఓ నాన్నా... నీ మనసే వెన్న...
కనపడే కష్టం అమ్మ చేస్తుంది. కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది. గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు. షాపులో కూచుంటాడు. పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు. పంటచేలో మంచె ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో. ఖర్చెంతో జమ ఎంతో.కాని పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితో ఉంటాడు. ఎప్పుడూ చిర్నవ్వు... అప్పుడప్పుడూ కోపం ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకుమనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది.ఒక తండ్రి తన కొడుకును తీసుకొని పొరుగూరి నుంచి తన ఊరికి నడుస్తున్నాడు. ఐదారు మైళ్ల దూరం. తండ్రి వయసు 40 ఉంటుంది. కొడుకు వయసు 15 ఉంటుంది. దారిలో వాన మొదలైంది. క్షణాల్లో పెరిగింది. వడగండ్లుగా మారింది. పెద్ద వడగండ్లు. రాళ్ల వంటి వడగండ్లు. గుండ్ల వంటి వడగండ్లు. దారిలో ఎక్కడా చెట్టు లేదు. తల దాచుకోవడానికి చిన్నపాటి నీడ లేదు. పరిగెత్తి ఎక్కడికీ పారిపోవడానికి లేదు. కేవలం పొలాలు ఉన్నాయి. వడగండ్ల దెబ్బకు పిల్లాడు అల్లాడి పోతున్నాడు. తండ్రి నెత్తి చిట్లిపోయేలా ఉంది. అయినా ఆ తండ్రి భయపడలేదు. కొడుకును పొట్ట కిందకు తీసుకున్నాడు. చటుక్కున బోర్లా పడుకున్నాడు. తండ్రి శరీరం కింద పిల్లాడు సురక్షితం అయ్యాడు. తండ్రి తన దేహాన్ని ఉక్కుఛత్రంలా మార్చి కొడుక్కు అడ్డుపెట్టాడు. వడగండ్లు కురిసి కురిసి అలసిపోయాయి. తండ్రి కొడుకును సుక్షితంగా ఇల్లు చేర్చి ఆ గాయాలతో మరికొన్నాళ్లకు చనిపోయాడు. నాన్న శౌర్యమంటే అది. కుటుంబం కోసం నాన్న చేయగలిగే అంతిమ త్యాగం అది. ఈ కథలోని తండ్రి అమితాబ్ బచ్చన్ ముత్తాత. ఈ ఉదంతాన్ని అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన ఆత్మకథలో రాశాడు.మరో ఉదంతంలో ... తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు. అసలు ఏ ఉద్యోగమూ లేదు. బాధ్యతలు ఎక్కువున్నాయి. బరువులు మోయలేనన్ని. చదువుకున్నది అంతంత మాత్రమే. ట్యూషన్లు మొదలెట్టాడు. అతడు జీనియస్. ఏ సబ్జెక్ట్ అయినా ఇట్టే నేర్చుకుని చెప్పగలడు. లెక్కలు, ఇంగ్లిషు, సైన్సు, ఎకనమిక్సు, కామర్సు.... నేర్చుకోవడం... పిల్లలకు చెప్పడం... ఆ వచ్చే జీతం ఇంటికి... తనపై ఆధారపడ్డ బంధువులకు... ఖర్చులు పెరిగే కొద్ది క్లాసులు పెరిగాయి. ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు... చెప్పి చెప్పి చెప్పి... సరైన తిండి లేదు.. విశ్రాంతి లేదు... విహారం లేదు... వినోదం లేదు.... బాధ్యత... బాధ్యత బాధ్యత.... పిల్లలు ఎదిగొస్తుంటే చూడటం ఒక్కటే ఊరడింపు... కాని చేయాల్సింది చాలా ఉంది. ఈలోపు ఆ శ్రమకు దేహం అలసిపోయింది. మధ్య వయసులోనే ఓడిపోయింది. ఆ తండ్రి దూరమైనా ఆ త్యాగం పిల్లలు ఏనాడూ మర్చిపోలేదు. ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి తన తండ్రి గురించి చెప్పిన కథ.కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి. తిండి సమకూర్చే వేళ ఎద్దు. రక్షణకు కాపు కాచే గద్ద. నాలుగు గింజల కోసం ఎంతదూరమైనా వెళ్లే వలస పక్షి.నాన్న అతి నిరాడంబరుడు. రెండు జతల బట్టలు, రోజూ ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ. ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడక్కుర్చీ పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కాని నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచే వచ్చేవి. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకుని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు.దేశంలో డబ్బు లేని రోజులవి. నిస్సహాయ రోజులు. నాన్న ఎంత కష్టపడేవాడో. ఒకోసారి ఎంత కోప్పడేవాడో. ఆ పైన ఎంత బాధ పడేవాడో. పుస్తకాలు కొనిస్తానని, బూట్లు కొనిస్తానని, కొత్త బట్టలు కొనిస్తానని తీర్చలేని హామీలు ఇవ్వడానికి నాన్న ఎంత బాధ పడేవాడో. అరడజను అరటి పండ్లు తెచ్చి ఏడుగురు సభ్యుల ఇంటిలో ఎవరూ గొడవ పడకుండా పంచే గొప్ప మేథమెటీషియన్ నాన్నే. కొత్త సినిమా ఊళ్లోకొస్తే దాని ఊసు ఇంట్లో రాకుండా జాగ్రత్త పడేవాడు. ‘సినిమాకెళ్తాం నాన్నా’ అనంటే కేకలేసేవాడు. కాని ఏదో ఒక వీలు దొరికి కాసిన్ని డబ్బులు చేతికొస్తే తనే అందరినీ వెంటబెట్టుకొని తీసుకెళ్లి సంతోషపడేవాడు.లోకం చెడ్డది. జీతం ఇచ్చే చోట, పని చేసే చోట ఎన్నో అవస్థలు. ఎందరో శత్రువులు. నాన్న ఆ పోరాటం అంతా చేసి ఇంటికి ఏమీ ఎరగనట్టుగా వచ్చేవాడు. మరుసటి రోజు అవమానం ఎదురుకానుందని తెలిసినా పిల్లల కోసం తప్పక వెళ్లేవాడు. తాను అవమానపడి పిల్లలకు అన్నం పెట్టేవాడే కదా నాన్న.ఆరోగ్యం పట్టించుకోడు. అప్పుకు వెరవడు. కుటుంబానికి మాట రాకుండా తనను తాను నిలబెట్టుకుంటూ పరువు కోసం పాకులాడతాడు. తన జ్ఞానం, కామన్సెన్స్ పిల్లలకు అందిస్తాడు. ఇలా వెళ్లు గమ్యం వస్తుందని సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపిస్తాడు. తన కోసం ఏదీ వెనకేసుకోడు. సంపాదించిందంతా పిల్లలకే ఇవ్వాలని తాపత్రయ పడతాడు.తన యవ్వనాన్ని పిల్లలకు ధారబోసిన నాన్నకు వయసైపోయాక పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఒకసారి కనపడుతున్నారు. ఏది అడిగినా నీదంతా చాదస్తం అంటున్నారు. తమకు పుట్టిన సంతానాన్ని వారి ఒడిలో కూచోబెట్టలేనంత దూరం ఉంటున్నారు. అన్నీ ఉన్నా నాన్నకు తలనొప్పులు తెచ్చి పెట్టే పిల్లలను ఏమనాలి? కొత్త టెన్షన్స్ తెచ్చి పెడుతూ ఏడిపించే పిల్లలు పిల్లలేనా? నాన్న కన్నీరు భూమి మీద రాలితే అది ఆ పిల్లలకు శుభం చేస్తుందా?భర్తలుగా, కోడళ్లుగా మారిన పిల్లలూ... మీ నాన్న గురించి ఆలోచించండి. ఆయన సంతోషంగా ఉన్నాడా లేదా గుర్తించండి. మీ బాల్యంలో యవ్వనంలో మీ కోసం ఏమేమి చేశాడో గుర్తు చేసుకోండి. ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నతో గడుపుతూ ఆయన మనసు మాట వినండి.ఒకనాడు పులిలా ఉండే నాన్న ఇవాళ తన గాంభీర్యం తగ్గించుకున్నాడు. నేటి నాన్న ఇంటి పని చేస్తాడు. అమ్మను అదిలించకుండా స్నేహంగా ఉంటాడు. పిల్లలను ఎత్తుకుంటాడు. ఆడిస్తాడు. వారితో సరదా కబుర్లు చెబుతాడు. కొట్టని, తిట్టని నాన్నలే ఇప్పుడు ఎక్కడ చూసినా. అంత మాత్రాన పిల్లలు తేలిగ్గా తీసుకుంటే తన సత్తా చూపే శక్తి నాన్నకు ఉంటుంది. -
మా నాన్న సూపర్ హీరో!
‘మా నాన్న సూపర్‌హీరో’ అంటున్నారు సుధీర్ బాబు. ‘లూజర్’ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో ఆర్నా హీరోయిన్. సీఏఎం ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం (జూన్ 18) ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
సంపదకు మించిన స్ఫూర్తి.. బిజినెస్‌లో స్ఫూర్తివంతమైన తండ్రీకొడుకులు
ప్రపంచంలో అద్భుతమైన బంధం తండ్రీకొడులది. తండ్రి పిల్లలకు అన్నీ ఇస్తాడు. చాలా మంది తండ్రులు జీవితాంతం కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇస్తారు. కానీ కొంత మంది సంపదకు అంతకు మించిన స్ఫూర్తిని వారసత్వంగా అందిస్తారు. పిల్లలు కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తానే ఆ తండ్రుల పేరు శాశ్వతంగా నిలబడుతుంది. ఏటా జూన్ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకొంటున్నాం. ఎంతో మంది విజయవంతమైన బిజినెస్మెన్ వేలు, లక్షల కోట్ల సంపదను సృష్టించి వారసులకు అందించారు. కానీ కొంతమందే సంపదతోపాటు అంతకుమించిన స్ఫూర్తిని వారసులకు పంచారు. అటువంటి కొందరు బిజినెస్‌మన్ ఫాదర్స్ గురించి తెలుసుకుందాం.. జమ్సెట్జీ టాటా భారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్సెట్జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం జలపాతం శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్సెట్జీ టాటాకు తట్టింది. ఈ సమయంలో టెక్స్టైల్ మిల్లుల పొగలతో ముంబై నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పశ్చిమ కనుమలలో మొదటి జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు డోరాబ్, రతన్ టాటాలు తదనంతరం బొంబాయి నగరానికి సరసమైన, స్వచ్ఛమైన విద్యుత్తు అందించేందుకు పునాది వేసినట్లు టాటా గ్రూప్ వారి వెబ్సైట్లో పేర్కొంది. అప్పటి నుంచి రతన్ టాటా తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన పేరును ఉన్నత స్థాయిలో నిలిపారు. ధీరూభాయ్ అంబానీ అంబానీ అనే పేరు దాదాపు ప్రతి భారతీయుడికి సుపరిచితమే. ధీరూభాయ్ అంబానీ అని కూడా పిలిచే ధీరజ్‌లాల్ హరిచంద్ అంబానీ.. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించారు. నిరాడంబరమైన సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన స్థాపించిన వ్యాపారం భారతదేశం అత్యంత గుర్తించదగిన, విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా మారింది. ధీరూభాయ్ అంబానీ తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ అంబానీలు వారసత్వం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కొడుకుగా ముఖేష్ అంబానీ తండ్రి స్ఫూర్తివంతమైన వారసత్వాన్ని కొనసాగించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. నేడు అదే చర్యను ఆకాష్ అంబానీ చేతుల మీదుగా అంబానీ మూడవ తరం అమలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, గ్రూప్‌లోని ఇతర కంపెనీల వృద్ధి, విజయానికి ఆయన చేసిన కృషి, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం. సజ్జన్ జిందాల్ సజ్జన్ జిందాల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది భారీ మల్టీ బిలియన్ల వ్యాపార సంస్థ. సజ్జన్ జిందాల్ కుమారుడు పార్త్ జిందాల్ తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తనకు అందించిన దానికంటే మించి సాధించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న బెంగళూరు ఎఫ్సీకి సీఈవో అయ్యారు. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో తిరుగులేని సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను మరింత వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు తండ్రీ కొడుకులు పెద్ద కలలు కన్నారు. ఈ డైనమిక్ తండ్రీ కొడుకుల వ్యాపార విజయ గాథలు నిజంగా ఆదర్శవంతమైనవి. లాలా కేదార్నాథ్ అగర్వాల్ లాలా కేదార్నాథ్ అగర్వాల్ 1947లో దేశ విభజన తర్వాత బికనీర్ నుంచి జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్లారు. చాందినీ చౌక్‌లో ట్రాలీలో సంప్రదాయ స్వీట్లు, సావరీస్ అమ్మడం ప్రారంభించారు. ఆయన కృషికి అదృష్టం తోడైంది. తక్కువ కాలంలోనే అదే ప్రాంతంలో 'బికనేర్ నమ్కీన్ భండార్' పేరుతో చిన్నపాటి దుకాణాన్ని ప్రారంభించి నంకీన్లు, చిరుతిళ్లు విక్రయించారు. కాలక్రమేణా అది 'బికనీర్‌వాలా'గా గుర్తింపు పొందింది. బికనేరి భుజియా, ఇతర ప్రామాణికమైన భారతీయ చిరుతిళ్ల వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది. 1965లో వ్యాపారంలోకి అడుగుపెట్టిన లాలా కుమారుడు శ్యామ్ సుందర్ అగర్వాల్ బికనీర్‌వాలాను ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించారు. ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ బికానోను ప్రారంభించారు. బికనీర్‌వాలా వారసత్వాన్ని కొనసాగిస్తూ మూడో తరం వ్యాపారవేత్త మనీష్ అగర్వాల్ 2000లో వ్యాపారంలో చేరారు. బికానో ఇప్పుడు వివిధ రకాల నామ్కీన్లు, కుకీలు, స్వీట్లు, పాపడ్, సిరప్లు, సమోసా వంటి పిండి పదార్థాలను విక్రయిస్తోంది. -
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
నాన్నా! నన్నెందుకు కన్నావు? అని అమితాబ్ అడిగితే..
నేడు(జూన్ 18) అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి.. ఆధునిక భారతీయ కవులలో హరివంశ్రాయ్ బచ్చన్ సుప్రసిద్ధుడు. హిందీ కవిత్వంలోని ‘నయీ కవితా’ ఉద్యమ సారథుల్లో ఆయన ఒకరు. ఆయన 135 రుబాయిలతో రాసిన ‘మధుశాల’ కావ్యం ఆధునిక హిందీ కవిత్వానికి తలమానికంగా నిలిచే కావ్యాలలో ఒకటి. హిందీ సాహిత్యరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా హరివంశ్రాయ్ బచ్చన్ ‘పద్మభూషణ్’ పొందారు. హరివంశ్రాయ్ బచ్చన్ భార్య తేజీ బచ్చన్ కూడా కవయిత్రి. తల్లిదండ్రుల రంగంలో కాకుండా, భిన్నమైన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అమితాబ్ బచ్చన్‌పై తండ్రి ప్రభావం చాలానే ఉంది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ తొలినాళ్లలో నానా ఇక్కట్లు, తిరస్కారాలు ఎదుర్కొన్నా, సూపర్‌స్టార్‌గా ఎదిగి, బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. (చదవండి: హఠాత్తుగా ఎందుకంత కోపం? సనాతన ద్రోహినా?: రచయిత భావోద్వేగం) కష్టాలు పడుతున్న కాలంలో అమితాబ్ ఒకనాడు పట్టరాని ఉక్రోషంతో తండ్రి గదిలోకి వెళ్లి ‘నాన్నా! నన్నెందుకు కన్నావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఏదో రాసుకుంటూ ఉన్న హరివంశ్రాయ్ బచ్చన్ కొడుకు అడిగిన ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా అతన్ని ఒకసారి తేరిపార చూశారు. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటికి అమితాబ్ ఆ గది నుంచి వెళ్లిపోయాడు. మర్నాటి ఉదయమే హరివంశ్రాయ్ తన కొడుకును నిద్రలేపి, చేతిలో ఒక కాగితం ఉంచారు. అందులో ఈ కవిత ఉంది: ‘నా కొడుకు నన్నడిగాడు– నన్నెందుకు కన్నావని బదులు చెప్పడానికి నా వద్ద సమాధానమేదీ లేదు. నన్ను కనడానికి ముందు నా తండ్రి నన్నడగలేదు. నా తండ్రిని ఈ లోకంలోకి తెచ్చేటప్పుడు నా తాత కూడా అతణ్ణి అడగలేదు... నువ్వెందుకు కొత్త ప్రారంభానికి, కొత్త ఆలోచనకు నాంది పలకరాదు? నీ పిల్లలను కనే ముందు నువ్వు వాళ్లనడుగు’ అమితాబ్ ఆలోచనలో మార్పు తెచ్చిన కవిత ఇది. ఒక సందర్భంలో ఈ కవితను ప్రస్తావించాడాయన. తనను ప్రభావితం చేసిన తన తండ్రిని అమితాబ్ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. -
Fathers Day: తండ్రీ..నిన్ను తలంచి!
‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అన్నాడు అమెరికన్ రచయిత క్లారెన్స్ బడింగ్టన్ కెలాండ్. పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు, అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే, తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే చాలదు. నిజాయితీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో! ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే, పిల్లలు సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే, రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మిగులుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా, ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినప్పుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి! ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని శతకకారుడు అందుకే అన్నాడు. తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు, పుత్రికల వల్ల కూడా కలుగుతుంది. చరిత్రలోను, వర్తమానంలోను అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన వారి పిల్లల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తండ్రుల దినోత్సవం జరుపుకోవడం వెనుకనున్న కథా కమామిషును కూడా తెలుసుకుందాం. తండ్రుల దినోత్సవం వెనుకనున్న మహిళ అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 నుంచి మొదలైంది. తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకొంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్ మహిళ సొనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది. ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవం జరిగింది. దీంతో ఆమె ‘మదర్ ఆఫ్ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్ నెల మూడోవారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఒక తండ్రి, ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తిమంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడ్డాయని ఇందిరా గాంధీ ఒక సందర్భంలో చెప్పారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27న కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిర తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే, 1959లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా, ఆయన మంత్రివర్గంలో ఇందిరా గాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి, ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతా పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుపొందారు. పండిట్ రవిశంకర్ అనౌష్కా శంకర్ భారతీయ సంగీత దిగ్గజాల్లో పండిట్ రవిశంకర్ ప్రముఖుడు. సితార్ వాద్యానికి పర్యాయపదంగా మారిన రవిశంకర్ సంగీతరంగంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తొలినాళ్లలో తన సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలసి నృత్యం చేసుకుని, దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నా, అనతి కాలంలోనే నృత్యాన్ని విడిచిపెట్టి, సంగీతాన్ని తన రంగంగా ఎంచుకున్నారు. నాటి ప్రఖ్యాత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్ వద్ద సితార్ నేర్చుకున్నారు. ప్రస్తుత సంగీతరంగంలో ప్రాచుర్యం పుంజుకున్న ఫ్యూజన్ ప్రయోగాలను రవిశంకర్ దశాబ్దాల కిందటే చేశారు. ఎందరో పాశ్చాత్యులకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. సంగీతంపై అభిరుచి కనబరచిన తన కూతురు అనౌష్కా శంకర్‌ను అద్భుతమైన విద్వాంసురాలిగా తీర్చిదిద్దారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మాదిరిగా సంగీత రంగంలో వారసత్వం పెద్దగా పనిచేయదు. పిల్లలకు స్వతహాగా అభిరుచి, ఆసక్తి ఉంటే తప్ప తండ్రుల అడుగుజాడల్లో ఈ రంగంలో రాణించలేరు. పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్కా శంకర్ తండ్రి అడుగుజాడల్లోనే సితార్ విద్వాంసురాలిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం ఒక అరుదైన విశేషం. అనౌష్కా తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి రవిశంకర్ శిక్షణలో సితార్‌పై సరిగమలు పలికించడం నేర్చుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, కాలేజీలో చేరకుండా పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని నిర్ణయించుకుని, తండ్రి ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది గంటలు సాధన చేస్తూ విద్వాంసురాలిగా ఎదిగారు. ఎన్ని శైలీభేదాలు ఉన్నా, సంగీతం విశ్వజనీనమైనదని తన తండ్రి నమ్మేవారని, ఆయన నుంచే విభిన్న శైలులకు చెందిన సంగీతాన్ని సమ్మేళనం చేయడం నేర్చుకున్నానని, సంగీతంలో తనకు గురువు, దైవం, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత తన తండ్రేనని అనౌష్కా శంకర్ చెబుతారు. ధీరూభాయ్ అంబానీ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ భారతీయ పారిశ్రామిక రంగంలో టాటా, బిర్లాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా చరిత్ర సృష్టించారు. సామాన్య గ్రామీణ ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన ధీరూభాయ్ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఉపాధి వేటలో భాగంగా యెమెన్ వెళ్లి, అక్కడ కొంతకాలం ఒక పెట్రోల్ పంపులో పనిచేశారు. యెమెన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశాక తన సమీప బంధువు చంపక్లాల్ దమానీతో కలసి ‘మజిన్’ పేరుతో ఎగుమతులు దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలానికి చంపక్లాల్తో భాగస్వామ్యాన్ని వదులుకుని ధీరూభాయ్ సొంతగా వ్యాపారంలోకి దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించి, తొలుత పాలియెస్టర్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా దాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. ధీరూభాయ్ తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు వ్యాపార నిర్వహణలోని మెలకువలను నేర్పించారు. ధీరూభాయ్ 2002లో మరణించే నాటికి రిలయన్స్ గ్రూప్ భారతీయ పారిశ్రామిక రంగంలోనే అగ్రస్థానంలో ఉండేది. తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ముదరడంతో 2004లో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చేతికి, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అనిల్ అంబానీ చేతికి వచ్చాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కొంత వెనుకబడినా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది. (చదవండి: మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?) -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్నే
‘ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది నాన్నే’ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డేను పురస్కరించుకుని ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మన జీవితం అమ్మది.. జీవనం నాన్నది’ అని చెప్పారు. ‘మా నాన్న రామచంద్రారెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచే నాకు నాయకత్వ లక్షణాలునేర్పారు’ అని పేర్కొన్నారు. నాన్న ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని.. ఉన్నతంగా బతకాలని చెప్పేవారని తెలిపారు. ఆయన చూపిన బాటలో తాను నడుస్తున్నానని.. రాజకీయంగా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నానని చెప్పారు. -
నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే: పాయల్ రాజ్‌పుత్
‘తండ్రీకూతుళ్ల అనుబంధం అపురూపమైనది.. మాటల్లో వర్ణించలేనిది. నాన్నతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు స్పెషలే. అర్ధరాత్రివరకూ సాగే కబుర్లు, సరదా ఆటలు, చిన్నపాటి సాహసాలు వంటివి తండ్రీకూతుళ్ల అనుబంధాలను చాలా స్పెషల్‌గా మార్చుతాయి. మా లైఫ్‌లో అలాంటి ప్రత్యేక సమయాలు చాలా ఉన్నాయి. మా నాన్నగారే నా బలం. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆయనే’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి విమల్‌కుమార్ రాజ్‌పుత్ గురించి పాయల్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ► జీవితం అంటే ఏంటో మా నాన్న నాకు నేర్పించారు. అలాగే మనతో మనం నిజాయతీగా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కో డైరెక్షన్లో వెళుతుంది. తండ్రీ కూతురి జీవితం కూడా అంతే. మా లైఫ్ వెళ్లే డైరెక్షన్ ఏదైనా మా బంధం ఎప్పటికీ అలానే ఉంటుంది. అది ‘అన్బ్రేకబుల్’. ► చాలా విషయాల్లో మా నాన్న నాకు స్ఫూర్తిగా ఉంటారు. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? వాటి నుంచి తిరిగి ఎలా పుంజుకోవాలి? అనే విషయాలు మాత్రం నాన్న నుంచే నేర్చుకున్నాను. అలాగే తోటివారితో ఎలా మసులుకోవాలో కూడా ఆయన్ను చూసే తెలుసుకున్నాను. హార్డ్‌వర్క్ చేసేవారికి ఉండే విలువ ఏంటో నాన్న నాకు చెప్పారు. అలాగే మనం నమ్మిన విషయానికి కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. నా కలల విషయంలో రాజీ పడకుండా నన్ను నేను ఓ బెటర్ పర్సన్‌గా తీర్చిదిద్దుకోవడానికి మా నాన్నగారి మాటలు, ఆచరణ విధానాలే నాకు దోహదపడ్డాయి. ► మా నాన్న చాలా ట్రెడిషనల్. నేను యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా.. నటనపై నాకు ఉన్న ప్యాషన్‌ను, సినిమా ఇండస్ట్రీ పంథాను అర్థం చేసుకున్నాక నన్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. వృత్తిపరంగా నిరూపించుకునే విషయంలో అసలు ఏ మాత్రం తగ్గొద్దు అని అంటుంటారు. అంతేకాదు..కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. నిజానికి మా నాన్న ఒకప్పుడు యాక్టర్ కావాలనుకున్నారు. అయితే కుదరలేదు. ఇప్పుడు ఆయన కలను నేను నిజం చేసినందుకు గర్వంగా ఉంది. ► ఓ నటిగా నా కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మా నాన్న నాతో మరింత ఆప్యాయంగా మాట్లాడతారు. ‘నీ ప్రయాణంలో జయాపజయాలు ఓ భాగం మాత్రమే. వైఫల్యాలు ఎదురైతే వాటిని మైండ్‌కు ఎక్కించుకోకు. ఏదైనా తాత్కాలికమే. ఏదీ శాశ్వతం కాదు. సో.. జీవితం ఎలా వస్తే అలా ఉండు.. హ్యాపీగా ఉండు’ అంటారు. -
నాన్నా.. నీ స్పర్శ ఈ బొంత రూపంలో.. మదిని మెలిపెట్టే వీడియో!
మనకు ఎంతో ఇష్టమైనవారు దూరమైనప్పుడు భరించలేని బాధ కలుగుతుంది. వారు లేకపోయినప్పటికీ జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉంటారు. దూరమైన వారు వాడిన వస్తువులు, వారికి ఇష్టమైన వాటిని ఇంట్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ వారు ఉన్నట్లుగా భావిస్తుంటారు కొందరు. కానీ నిఖిత అనే అమ్మాయి తన తండ్రి స్పర్శ మరింత దగ్గర ఉండాలని భావించింది. ఇందుకోసం తన తండ్రి ధరించిన దుస్తులను బొంతలుగా మార్చింది. ఆ బొంత స్పర్శలో తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ సాంత్వన పొందుతోంది. ముంబైకి చెందిన నిఖిత ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఎంతో సరదాగా ఉండే నిఖిత తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి మరణాన్ని కుటుంబం మొత్తం జీర్ణించుకోలేకపోయింది. చిన్నప్పటి నుంచి ఆయనతో గడిపిన క్షణాలు నిఖితకు పదేపదే గుర్తుకొచ్చేవి... ఇలా ఆలోచిస్తోన్న సమయంలో ఆయన ధరించిన బట్టలు కనిపించాయి నిఖితకు. ‘‘ఎంతో ఖరిదైన, మంచి రంగు రంగుల షర్ట్స్ ధరించేవారు నాన్న. వీటిని ఇలా వదిలేస్తే పాడైపోతాయి. వీటిని నాన్న జ్ఞాపకంగా భద్రంగా మార్చాలి’’ అనుకుంది. అనుకున్న వెంటనే తన తండ్రికి ఎంతో ఇష్టమైన పింక్, బ్లు కలర్ చొక్కాలన్నింటిని ప్యాక్ చేసి ‘పుర్కాల్ స్త్రీ శక్తి సమితి’ వాళ్లకు పంపింది. పుర్కాల్ వారు ఆ చొక్కాలతో తయారు చేసిన బొంతలను అనుకోకుండా వాళ్ల నాన్న పుట్టినరోజు మార్చి 8న పంపించారు. ఈ విషయాన్ని తాజాగా జూన్ 19 ‘ఫాదర్స్ డే’ రోజున నిఖిత తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్టు చేసింది. ఇప్పటిదాక ఈ విషయం తెలియని నిఖిత సోదరుడు నిఖిత ఇచ్చిన బొంతను ఆశ్చర్యంతో తెరిచి చూసిన వీడియో, తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఆనందంగా గడిపిన క్షణాలున్న వీడియోను పోస్టుచేస్తూ..‘‘నాన్న నువ్వు మా పక్కన లేకపోయినప్పటికీ, నీ స్పర్శ ఈ బొంత రూపంలో మమ్మల్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుతుంది’’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసింది. దీంతోపాటు తన తండ్రి చొక్కాలను బొంతగా ఎలా మార్చిందో వివరించి చెప్పింది. ఇప్పటిదాక నిఖిత పోస్టుకు పన్నెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. లక్షమందికి పైగా యూజర్లు ఆమె చేసిన పనిని మెచ్చుకోలుగా లైక్ చేశారు. కొంతమంది యూజర్లు తమకిష్టమైన వారిని గుర్తుచేసుకుంటూనే, ఐడియా చాలా బావుంది. మేముకూడా ఇలా చేస్తామని భావోద్వేగ కామెంట్లు పెడుతుంటే నిఖిత పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయారని జీవితాంతం కుమిలిపోకుండా, వారి జ్ఞాపకాలను రకరకాలుగా భద్రపరచుకుంటూ వారు మనతోనే ఉన్నట్లు భావించవచ్చు అని నిఖిత ఆలోచన చెబుతోంది. దీని ద్వారా తమ వారిని కోల్పోయిన వారికి కొంత ఊరట కలుగుతుంది. పుర్కాల్.. చిన్ని స్వామి అనే పెద్దావిడ నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ‘పుర్కాల్ స్త్రీ శక్తి సమితి’ని డెహ్రాడూన్‌లో స్థాపించింది. చేతులతో తయారు చేయగల... ఇళ్లలో వినియోగించే వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. గత పదిహేడేళ్లుగా డెహ్రడూన్‌లోని నలభై గ్రామాల్లోని దాదాపు రెండువందల మంది మహిళలకు ఈ సమితి బాసటగా నిలిచింది. వీరు రూపొందిస్తోన్న వాటిలో ముఖ్యమైనవి బొంతలు కాగా, కుషన్ కవర్స్, ఆఫ్రాన్స్, టీ కాసీస్, బ్యాగ్స్, సాఫ్ట్ టాయిస్, పెట్స్ కోసం ప్లేమ్యాట్స్ వంటివెన్నో తయారు చేసి విక్రయిస్తున్నారు. వీరు తయారు చేసినవే గాక, నిఖితలాంటి వాళ్లు ఇచ్చిన ఆర్డర్లను అందమైన జ్ఞాపకాలుగా మార్చడం వీరి ప్రత్యేకత. View this post on Instagram A post shared by Nikhita Kini (@nikhitakini) -
హృదయ విదారకం: ఓ వైపు వివాహ తంతు, మరో వైపు అంత్యక్రియలు
పుల్కల్(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్ అహ్మద్(గూడు పటేల్)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి.. -
ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రులతో కలిసి పిల్లలు క్యాట్ వాక్
-
'మా నాన్నే మా సూపర్ హీరో'!
మైక్రో బ్లాగర్ ట్విటర్ యూజర్లను దాటే లక్ష్యంగా దేశీయ సోషల్ మీడియా సంస్థ 'కూ' దూసుకుకెళ్తుంది. యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో 'కూ' 'పాపా కి లవ్ లాంగ్వేజ్' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫాదర్స్ డే సందర్భంగా వినియోగదారులు వారి తండ్రికి సంబంధించిన ఆత్మీయ కథనాలతో పాటు ఫోటోలు, మీమ్‌లు,వీడియోల ద్వారా ఆసక్తికరమైన జ్ఞాపకాలను పంచుకునే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా యూజర్లు వారి నాన్నల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారో గుర్తు చేస్తూ ఆయన్ని సంతోష పెట్టే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తుంది.ఈ కాంపెయిన్లో భాగంగా, కూ యాప్ ప్రత్యేక కవితల పోటీని కూడా ప్రారంభించింది, కవిత్వం ద్వారా తమ తండ్రికి కృతజ్ఞత తెలియజేసేందుకు యూజర్లను ఆహ్వానిస్తోంది. మరి ఈ పోటీల్లో మీరూ పాల్గొంటున్నారా. Koo App Baat koi bhi ho, papa se sidha reply kahan aana hai.😝 Yeh #PapaKiLoveLanguage bhi na, Daant aur Dulaar ka perfect mixture hai.🥰 Share kariye apne #PapaKiLoveLanguage & jeetiye Koo Goodies. 🎁 #FathersDay #ContestAlert View attached media content - Koo (@KooOfficial) 17 June 2022