Financial Basics
-
కొత్త సంవత్సరంలో ఎవరు ఏం చేయాలో తెలుసా..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.20-30 ఏళ్ల వయసువారు..ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.30-40 ఏళ్ల గ్రూప్ వారు..వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.40-50 ఏళ్లవారు..ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?50 దాటిన వారు..ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం. -
తప్పుల మీద తప్పులు... అప్పుల మీద అప్పులు
సంపాదించని వ్యక్తిని సమాజమే కాదు... ఇంట్లో వాళ్ళు కూడా లోకువగా చూస్తారన్నది ఒక నానుడి. సంపాదిస్తేనే సరిపోదు... అది సద్వినియోగం అయితేనే సార్ధకత. గత ఆర్టికల్ లో ఆర్ధిక క్రమశిక్షణ (Financial discipline) పాటించే వ్యక్తి జీవితం పూలపానుపు గా ఎలా మారుతుందో విశ్లేషించుకున్నాం..గాడి తప్పితే ఏమవుతుందో ఇప్పుడు సోదాహరణంగా చూద్దాం.శివకుమార్ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వ్యక్తి. చదువు పూర్తి కాగానే బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. తన ఖర్చులు పోగా కొంత మొత్తం ఇంటికి కూడా పంపేవాడు. కొన్నాళ్ళకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. గతంలో 20000 వచ్చే జీతం ఇప్పుడు 50000 అయింది. ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పుకున్న రాహుల్ మాదిరిగానే కుమార్ కు కూడా పాతికేళ్ల వయసులోనే 50000 ఉద్యోగం దొరికింది.అంతలోనే పెళ్లి కుదిరి ఓ ఇంటివాడయ్యాడు కూడా. భార్య రాకతో సింగిల్ రూమ్ ఖాళీ చేసి.. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. అప్పటిదాకా కడుతున్న 3000 రెంట్ కాస్తా 8000 కు పెరిగింది. తప్పదుగా.. కొత్త కాపురం కావడంతో తను దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి అవసరమైన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, బీరువా, ఓ పెద్ద టీవీ కొన్నాడు. పెళ్ళికి ముందే లక్షన్నర పెట్టి కొన్న బైక్ కి ఈఎంఐ (EMI) కడుతున్నాడు. అతనికున్న భారం ఏదైనా ఉందంటే ఇదొక్కటే. మరోపక్క అతనికున్న పెద్ద భరోసా క్రెడిట్ కార్డులు (Credit card) ... జీతం పెరిగాక పడి ఉంటాయిలే అని ఓ నాలుగైదు బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. వాటి లిమిట్ కూడా దాదాపు 3 లక్షల దాకా ఉంది. క్రెడిట్ కార్డు మీద 30000 ఖర్చు పెట్టి ఓ మొబైల్ కొనుక్కున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కావడంతో వివాహ వార్షికోత్సవానికి భార్యకు లక్ష రూపాయలు పెట్టి ఓ నెక్లెస్ కొన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టుకు రావడమే కాదు, వాళ్ళను స్కూల్లో చేర్పించాల్సిన టైం కూడా వచ్చింది. ఫీజులు కాస్త ఎక్కువైనా వెనకాడక కొంచెం 'ఖరీదైన' స్కూల్లోనే చేర్పించాడు.మరోపక్క జీతం 80000 కు పెరగడం, బైక్ బాకీ తీరిపోవడంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులేవీ రాలేదు. ఒకవేళ వచ్చినా క్రెడిట్ కార్డులు వాడుతూ.. నెలనెలా కనీస మొత్తం కడుతూ వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే సొంత ఇల్లు ప్లాన్ చేసి.. దాదాపు 70 లక్షలు పెట్టి ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నెలకు 40000 రూపాయలు ఈఎంఐ పడుతోంది. ఇది పోను జీతంలో ఇంకో 40000 మిగులుతున్నా... ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, క్రెడిట్ కార్డు వాయిదాలు, ఊళ్ళో తల్లిదండ్రులకు పంపాల్సి ఉండటం.. ఇలా మొత్తం మీద వచ్చిన జీతం బొటాబొటీగా సరిపోతోంది. అయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయన్న ధైర్యం అతన్ని పెద్దగా ఆందోళన పరచలేదు. ఇంతలో ఊహించని సంఘటన...ఓరోజు ఆఫీస్ నుంచి వస్తూండగా.. దారిలో ఆక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. హాస్పిటల్ లో వారం రోజులు ఉండి ఇంటికొచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ తీసుకోకపోవడంతో హాస్పిటల్ బిల్లు రెండున్నర లక్షలు అప్పోసొప్పో చేసి కట్టక తప్పలేదు. మరోపక్క నాలుగు నెలల పాటు బెడ్ రెస్ట్. ఎర్న్డ్ లీవ్ లు ఓ రెండు నెలల పాటు ఆదుకున్నా... మిగతా రెండు నెలలపాటు లాస్ అఫ్ పే తప్పలేదు. చేతికి రూపాయి వచ్చే మార్గం లేదు. క్రెడిట్ కార్డుల్లో బాలన్స్ కూడా వాడేశాడు.4 నెలల తర్వాత జాబ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. ఐదో నెల నుంచి శాలరీ రావడం మొదలయింది. కానీ జీవితం ఇదివరకటిలా లేదు. వచ్చే శాలరీ కి మించి కమిట్మెంట్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా క్రెడిట్ కార్డు బాకీల రూపంలో (మూడు లక్షలూ వాడేయడం వల్ల) నెలకు 15000 భారం (కనీస మొత్తమే కడుతున్నాడు అనుకుంటే) పడింది. మరోపక్క గోటి చుట్టు మీద రోకటి పోటులా ఇద్దరు పిల్లలకూ తలో 50000 చొప్పున ట్యూషన్ ఫీజు కట్టాల్సి వచ్చింది గతంలో చేసిన అప్పుకు ఇది మరింత ఆజ్యం పోసింది. అప్పులు.. వడ్డీలు.. ఖర్చులు.. రానురాను భారం పెరిగిపోతూ వచ్చింది.తట్టుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే ఇంటి లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల లోన్ రాలేదు. అయితే తన ఇంటి మీద టాప్ అప్ లోన్ వచ్చే అవకాశం ఉండటం తో దాన్ని ఆశ్రయించాడు. ఓ రెండు లక్షలు వచ్చాయి. దాంతో చిన్న చిన్న అప్పులు తీర్చేశాడు. అయినా భారం తగ్గకపోగా... కొత్త లోన్ తో ఈఎంఐ మరింత పెరిగింది. కష్టాలు కూడబలుక్కుని వస్తాయి అన్నట్లు తండ్రి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్ లో జాయిన్ చేయడంతో మరో 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. ఇది కూడా అప్పే.ఇక పిల్లలు క్లాస్ మారడంతో పెరిగిన ఫీజు తట్టుకోలేక.. అలాగని వాళ్ళని ఆ స్కూల్ మాన్పించలేక (ప్రెస్టేజ్ ఇష్యూ) అప్పుల మీద అప్పులు చేస్తూ పోయాడు. బాకీలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో మెల్లగా క్రెడిట్ కార్డులు డిఫాల్ట్ అవ్వడం మొదలైంది. ఇది అక్కడితో ఆగలేదు. ఇంటి లోన్ కూడా బకాయి పడే దుస్థితి ఎదురైంది. మొదట భార్య నెక్లెస్ కుదువ పెట్టాడు. తర్వాత బండి అమ్మేశాడు. ఆనక ఇల్లు అమ్ముకునే పరిస్థితి దాపురించింది.ఎన్నో కష్టాలుపడి జీవితంలో ఎదిగిన శివ కుమార్ చేసిన తప్పల్లా... ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడమే. దీనికి దారి తీసిన కారణాల గురించి విశ్లేషించుకుంటే...* ముందుచూపుతో వ్యవహరించకపోవడం * సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవడం * తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోవడం* పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడం* ఆరోగ్య, జీవిత బీమా ల గురించి ఆలోచించకపోవడం * జీవితంలో పూర్తిగా స్థిరపడక మునుపే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం * పిల్లల చదువుల విషయంలో స్థాయికి మించి పరుగులు తీయడం * చేతిలో కాసిని డబ్బులు కనబడగానే తనకు లోటు లేదనుకునే భ్రమలో బతికేయడం * ఎక్కువగా క్రెడిట్ కార్డు ల మీద ఆధారపడటం* క్రెడిట్ కార్డుల విషయంలో కనీస మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్ల బాకీ ఎప్పటికీ తీరకపోవడం* అప్పుల మీద అప్పులు చేస్తూ అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం... లోన్ ల కోసం ఎగబడటం * భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే విధంగా పొదుపుపై దృష్టి పెట్టకపోవడం * స్థాయికి మించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం...కష్టాలన్నవి చెప్పి చెప్పి రావు. అవి ఎప్పుడొచ్చినా తట్టుకునే విధంగా జీవితంలో ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటేనే ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే సామర్ధ్యం కలుగుతుంది. మొదట్లో కాస్త కష్టపడ్డా... పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగితే రాహుల్ మాదిరిగా చీకూ చింతా లేని జీవితం గడపగలుగుతాడు. లేదంటే శివకుమార్ లా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి విలవిలలాడుతాడు.రాహుల్ లాంటి సుఖమయ జీవితం కావాలా.. శివకుమార్ లాంటి కష్టాల ప్రవాహం కావాలా... అన్నది మన చేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావుపర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
అనగనగా ఒక రుపాయి..
రూపాయ్! రూపాయ్! ఎందుకు పడ్డావ్ అంటే.. దిగుమతులు గుదిబండగా మారాయని చెప్పింది. దిగుమతులూ! దిగుమతులూ! గుదిబండగా ఎందుకు మారారంటే... డాలర్ అంతకంతకూ బలపడుతోందని అంటాయి.lడాలర్! డాలర్! ఎందుకు బలపడుతున్నావంటే... అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అంటుంది. వడ్డీ రేటు! వడ్డీ రేటు! ఎందుకు పెరుగుతున్నావంటే.. ధరలు భారీగా పెరగడం వల్లంటుంది. ధరా! ధరా! ఎందుకు పెరిగావనడిగితే.. క్రూడాయిల్ రేట్లు మండిపోతున్నాయంటుంది. క్రూడాయిల్! క్రూడాయిల్! ఎందుకు మండుతున్నావంటే.. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిందని చెబుతుంది. రష్యా! రష్యా! ఎందుకు దండెత్తావంటే... అమెరికా నా బంగారు దేశానికి ముప్పు తలపెడితే ఊరుకుంటానా అంటుంది. ఇదీ... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది మన రూపాయి పరిస్థితి! ఎక్కడో ఉక్రెయిన్‌లో జరుగుతున్న వార్.. కరెన్సీలనే కాదు ఎకానమీలనూ కకావికలం చేస్తోంది. 1947లో దాదాపు 3 రూపాయలిస్తే ఒక డాలరు వచ్చేది. మరిప్పుడో... 80 రూపాయలు వదిలించుకోవాల్సిందే. అంతకంతకూ చిక్కి శల్యమవుతున్న రూపాయి తాజాగా చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి (80.05) జారిపోయింది. అంటే, బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టిన తర్వాత 75 ఏళ్లలో ఏకంగా 75 రెట్లకు పైగా విలువ కోల్పోయిందన్నమాట! అసలు రూపాయికి డాలరుతో ఉన్న లింకేంటి? మన దేశ కరెన్సీ విలువ ఇలా బక్కచిక్కడానికి కారణాలేంటి? రూపాయి పతనం వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది.. ఎందుకు తగ్గుతుంది? ఇలాంటి సందేహాలన్నీ తీరాలంటే... ఈ కథ చదివేయండి మరి!! - శివరామకృష్ణ మిర్తిపాటి మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశీ కరెన్సీ బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. విదేశీ లావాదేవీలన్నింటికీ పౌండ్లలో చెల్లింపులు జరిగేవి. అప్పట్లో ఒక బ్రిటిష్ పౌండ్ విలువను 13.33 రూపాయలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అప్పుడు పౌండ్ విలువ 4 డాలర్లు. దీని ప్రకారం డాలరుతో మన రూపాయి మారకం విలువ దాదాపు 3.3 కింద లెక్క. 1951లో మొదలుపెట్టిన పంచవర్ష ప్రణాళికల అమలు కోసం విదేశీ రుణాలను భారీగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ప్రభుత్వం స్థిర కరెన్సీ మారకం విలువను అమలు చేయడం వల్ల 1947 నుంచి 1966 మధ్య డాలరుతో రూపాయి విలువ 4–5 స్థాయిలోనే కొనసాగింది. ఇక 1962లో చైనాతో యుద్ధం, పాకిస్థాన్‌తో 1965లో జరిగిన పోరుతో భారత బడ్జెట్లో భారీ లోటు ఏర్పడింది. 1965–66లో వచ్చిన కరువుతో దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు ఇతర దేశాలనుంచి దిగుమతులు పోటెత్తడంతో వాణిజ్యలోటు దూసుకెళ్లింది. ఆ సమయంలో డాలరుకు రూపాయి మారకం రేటును 7.57గా నిర్ణయించారు. పెద్దన్న కబంధ హస్తాల్లో... 1971లో బ్రిటిష్ పౌండ్తో భారత్ కరెన్సీకి పూర్తిగా బంధం తెగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ కబంధ హస్తాల్లో రూపాయి చిక్కుకుంది. ఇక అప్పటినుంచి మన విదేశీ రుణ చెల్లింపులు, ఎగుమతులు– దిగుమతులు ఇతరత్రా లావాదేవీలన్నీ నేరుగా అమెరికా డాలరుతోనే ముడిపడ్డాయి. 1975లో డాలరుతో రూపాయి మారకం విలువ 8.39 డాలర్లకు తగ్గింది. 1985 నాటికి 12కు పడిపోయింది. ప్రధానంగా వాణిజ్యలోటు (ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు భారీగా ఎగబాకడం) పెరిగిపోవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ 1990 నాటికి 17.5కు క్షీణించింది. చెల్లింపుల సంక్షోభంతో నియంత్రణకు చెల్లు... 1991లో భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశంలో విదేశీ కరెన్సీ(ఫారెక్స్) నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. దీంతో ఇతర దేశాలనుంచి చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు జరపలేని స్థితి వచ్చేసింది. కేవలం మూడు వారాలకు సరిపడా చెల్లింపులకు మాత్రమే ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) భారత్‌వద్ద మిగలాయి. తీవ్రమైన చెల్లింపుల సంక్షోభం తలెత్తడంతో బంగారాన్ని తాకట్టు పెట్టి డాలర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనం ధరల మంటతో అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలి వచ్చేలా కీలకమైన సరళీకరణలకు ప్రభుత్వం తెరతీసింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గనుక సంస్కరణలతో చికిత్స చేసి ఉండకపోతే మన దేశం పరిస్థితి కూడా ఇప్పటి శ్రీలంకలా మారిపోయేదన్న మాట! ఇక 1993లో దేశ కరెన్సీ చరిత్రలో కీలక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కరెన్సీపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేసింది. ఆర్బీఐ కనుసన్నల్లో మార్కెట్ వర్గాలు (ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ఆధారంగా) రూపాయి మారకం విలువను నిర్దేశించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో 1995 నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 32.42కు పడిపోయింది. 2000 సంవత్సరం నాటికి ఒక అమెరికా డాలరు కోసం 44.94 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలు... మన్మోహన్ సింగ్.. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వ్యవస్థ వృద్ధి పతాక స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి రావడం, ప్రైవేటు రంగం పుంజుకోవడం, సరళీకరణల ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని కూడా కకావికలం చేసింది. దీనికితోడు ధరల మంట కరెన్సీని కుదేలు చేసింది. 2009లో తొలిసారిగా రూపాయి 50ని దాటి పడిపోయింది. ఇక అప్పటి నుంచీ అంతకంతకూ బక్కచిక్కుతూనే ఉంది. 2016 నవంబర్‌లో 68.86 కనిష్ఠానికి దిగజారింది. 2018 వరకూ 66–68 స్థాయిలో కదలాడిన రూపాయి మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలతో కట్టలు తెంచుకుంది. ట్రంప్ ముంపు... కరోనా పంజా! ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను ఎడాపెడా పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో అంతర్జాతీయ వాణిజ్య రంగం అతలాకుతలమైంది. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు మరింతగా కుప్పకూలాయి. ఇవన్నీ ఒకెత్తయితే, 2020 సంవత్సరంలో ప్రపంచం నెత్తిన ‘కరోనా’ పిడుగు పడింది. వ్యాపార వాణిజ్యాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ దెబ్బకు డాలరుతో రూపాయి విలువ 76.70 స్థాయికి క్షీణించింది. ఇప్పుడు నెలకొన్న భౌగోళిక రాజకీయ ప్రభావాలకు తోడు ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలతలతో తాజాగా రూపాయి 80.05ను తాకి చరిత్రాత్మక కనిష్టానికి జారిపోయింది. తాజా పతనానికి కారణాలేంటి...కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... రూపాయి తాజా పతనానికీ అనేక అంశాలు ఆజ్యం పోస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపు గుబులు..: 2020లో వచ్చిన కరోనా దెబ్బకు ఎకానమీ కకావికలం కావడంతో అమెరికా మళ్లీ డాలర్లను ఎడపెడా ముద్రించి, వడ్డీరేట్లను సున్నా స్థాయికి తెచ్చింది. అయితే, ధరల మంట కారణంగా (2022 జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1%.. 4 దశాబ్దాల గరిష్ఠం) తాజాగా ఈ ప్యాకేజీల ఉపసంహరణను స్టార్ట్ చేయడంతో పాటు వడ్డీరేట్లను శరవేగంగా పెంచుతూ పోతోంది. అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తుండటంతో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకుంటూ... కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే డాలరు వైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల కూడా ఇతర దేశాల కరెన్సీలు దిగజారుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో ముడిపడిన డాలరు ఇండెక్స్ విలువ ఏకంగా 20 ఏళ్ల గరిష్ఠానికి ఎగసి 109 స్థాయికి దూసుకెళ్లింది అందుకే. అయితే, మిగతా చాలా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది రూపాయి కాస్త తక్కువగానే పతనం కావడం విశేషం. రష్యా–ఉక్రెయిన్ వార్.. క్రూడ్ సెగలు: మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు...ప్రపంచ ఎకానమీకి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఊహించని షాకిచ్చింది. రష్యా క్రూడ్, గ్యాస్ ఇతరత్రా కమోడిటీల ఎగుమతులపై అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షల దెబ్బకు ముడి చమురు ధర భగ్గుమంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవడానికి ముందు బ్యారెల్‌కు 90 స్థాయిలో ఉన్న క్రూడ్ ఒక్కసారిగా 140 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం 100–105 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ ప్రభావంతో అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటడంతో.. వడ్డీరేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది రూపాయితో సహా అనేక దేశాల కరెన్సీ విలువలకు చిల్లు పెడుతోంది. దిగుమతుల బండ: అత్యధికంగా దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. క్రూడ్ ధర పెరిగిపోయిన కారణంగా ముడిచమురు దిగుమతుల బిల్లు అంతకంతకూ తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే మన క్రూడ్ అవసరాల్లో 85% వాటా దిగుమతులదే. గతేడాది (2021–22)లో దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్లను (28% వృద్ధి) తాకాయి. అయితే, దిగుమతులు ఏకంగా 55% ఎగబాకి... 610 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో ప్రధానంగా క్రూడ్, బంగారం దిగుమతులదే ప్రధాన వాటా కావడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు 88% ఎగసి 192 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రిఫైనర్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిపోతుండటంతో రూపాయిని బక్కచిక్కిపోయేలా చేస్తోంది. మరోపక్క, భారీ వాణిజ్య లోటు కారణంగా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్ – మూలధన పెట్టుబడులు మినహా.. దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య వ్యత్యాసం) తీవ్రమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న క్యాడ్ (జీడీపీతో పోలిస్తే 1.8%)... ఈ ఏడాది ఏకంగా 105 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3%) పెరిగిపోవచ్చనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా అంచనా. విదేశీ పెట్టుబడులు రివర్స్‌గేర్: అమెరికా వడ్డీరేట్ల భారీ పెంపునకు తోడు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు భారతీయ స్టాక్, బాండ్ మార్కెట్ నుంచి 39 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే, ఇది ఏకంగా 3 రెట్లు అధికం కావడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ బలహీనతలు..: 2021–22లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది (అయితే, కరోనా కారణంగా 2020–21లో జీడీపీ 6.6% క్షీణించిన నేపథ్యంలో దీంతో పోల్చడానికి లేదు). ఈ ఏడాది (2022–23) వృద్ధి రేటు 7 శాతం లోపే ఉండొచ్చని అంచనా. రూపాయికి ఆర్థిక బలహీనత సెగ కూడా తగులుతోంది. మనలాంటి వర్ధమాన దేశాల్లో, ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశంలో కరెన్సీ బలహీనత అనేది సహజమేనని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నంత వరకూ పెద్దగా ఆందోళనlచెందక్కర్లేదనేది వారి అభిప్రాయం. అయితే, ప్రస్తుత కరెన్సీ కల్లోలానికి దేశీ అంశాలకంటే అంతర్జాతీయ ప్రతికూలతలే ప్రధాన కారణం కావడంతో రూపాయి పతనానికి ఎక్కడ అడ్డుకట్టపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!! రూపాయి బలహీనత వల్ల ఏం జరుగుతుంది... కంపెనీల లాభాలు ఆవిరి: మనదేశంలో చాలా కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడటంతో అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది. అంటే 100 డాలర్ల విలువైన కమోడిటీ లేదా విడిభాగాన్ని దిగుమతి చేసుకోవడానికి గతంలో రూ.7,400 వెచ్చించాల్సివస్తే... ఇప్పుడు రూపాయి క్షీణతతో రూ.8,000 ఖర్చుపెట్టాల్సి వస్తుందన్నమాట. దీంతో లాభాలు కూడా కరిగిపోతాయి. విదేశీ రుణాలు తడిసిమోపెడు: రూపాయి క్షీణతతో విదేశీ రుణాలు కూడా భారంగా మారతాయి. గతంలో కంపెనీలు, ప్రభుత్వం డాలరు రూపంలో తీసుకున్న రుణాలకు ఇప్పుడు చెల్లింపులు, వడ్డీ తడిసిమోపడవుతుంది. పెట్రో మంట.. ధరల మోత: అధిక కమోడిటీ రేట్లకు తోడు రూపాయి పడిపోవటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పెట్రోలు నుంచి వంటనూనెల వరకూ అన్నీ ఆకాశాన్నంటి వంటింటి సంక్షోభానికి కారణమవుతోంది. బొగ్గు దిగుమతి భారం కూడా పెరిగి, కరెంటు చార్జీలు షాకిస్తున్నాయి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తుల తయారీ సంస్థలు ముడి వస్తువుల ధరల సెగతో రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7 శాతానికి ఎగబాకడం తెలిసిందే. విదేశీ ప్రయాణాలకూ సెగ..: రూపాయి దెబ్బకు విదేశీ ప్రయాణాల వ్యయం కూడా పెరిగిపోతోంది. విమాన టికెట్లకు, హోటల్స్ అద్దెకు, షాపింగ్‌కు మరింత వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు 100 డాలర్ల అద్దె ఉన్న హోటల్ రూమ్‌కు ఆర్నెల్ల క్రితం రూపాయి మారకంలో రూ. 7,400 కడితే.. ఇప్పుడు.. రూ. 8,000 కట్టాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో కోత..: రూపాయి పతన ంతో దిగుమతులకు కంపెనీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రేట్లు పెంచాలి. రేట్లు భారీగా పెరిగితే కొనేవాళ్లుండరు. కొనేవాళ్లు లేక ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్లే ఉద్యోగాల్లోనూ కోతలు తప్పవు. విదేశీ విద్య భారం: రూపాయి పతనం వల్ల విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం మరింత సొమ్ము వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు, ఆర్నెల్ల క్రితం సెమిస్టర్లో 2000 డాలర్ల ఫీజుకు అప్పటి రూపాయి విలువ ప్రకారం రూ.1.48 లక్షలు ఖర్చయిందనుకుందాం. అదే ఇప్పుడు మళ్లీ సెమిస్టర్ ఫీజు 2,000 డాలర్లే ఉన్నప్పటికీ రూ.1.60 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నమాట. కొందరికే ఊరట! రూపాయి పడటం వల్ల కొన్ని వర్గాలకు మాత్రం ఊరట లభిస్తుంది. డాలర్లలో ఆదాయం ఆర్జిస్తూ ఇక్కyì తమ కుటుంబాలకు సొమ్ము పంపేవారికి మరిన్ని ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అలాగే, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడమూ వారికి ప్రయోజనకరమే. ఇక సాధారణంగా రూపాయి బలహీనపడితే ఎగుమతి రంగ కంపెనీలకు పండగే. ఉదాహరణకు ఎగుమతుల ద్వారా ఆర్నెల్ల క్రితం రూ. కోటి ఆదాయం వచ్చుంటే.. రూపాయి క్షీణత వల్ల ప్రస్తుతం అదనంగా దాదాపు రూ. 6 లక్షలు ఆర్జించగలుగుతారు. మరోవైపు, డాలర్లలో ఆదాయం పొందే మన ఐటీ కంపెనీలకు కూడా రూపాయి పతనం సానుకూలంశమే. ఆర్బీఐ ఏం చేస్తోంది... చిక్కిపోతున్న రూపాయికి చికిత్స చేసేందుకు ఆర్బీఐ పరోక్షంగా పలు చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి డాలర్ నిధులను పెంచేలా మరిన్ని ఎన్ఆర్ఐ డిపాజిట్లకు ఓకే చెప్పింది. వడ్డీరేట్లను పెంచుకునే వెసులుబాటునూ బ్యాంకులకు ఇచ్చింది. ఇక విదేశీ వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్ చేసేందుకు (డాలర్లకు డిమాండ్ తగ్గించడం) తాజాగా అనుమతించింది. అలాగే, మన బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి మరింతగా రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని, పరిమితులను కూడా ఆర్బీఐ పెంచింది. కాగా, రూపాయి పతనంతో మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 632 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు తాజాగా 580 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి 9 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని అంచనా. రూపాయి పైకి.. కిందికి ఎందుకు? వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, రాజకీయ స్థితిగతులు కరెన్సీపై ప్రభావం చూపుతుంటాయి. ఉదాహరణకు, అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మన రూపాయలు చెల్లవు కాబట్టి.. వాటిని ఇచ్చి డాలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్లు మన దగ్గరకొస్తే డాలర్లు ఇచ్చి రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మార్కెట్లో సంబంధిత కరెన్సీ లభ్యత, డిమాండును బట్టి ఇతర కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మారుతూ ఉంటుంది. డాలర్‌కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అలాగే రూపాయలకు డిమాండ్ పెరిగినప్పుడు బలపడుతుంది. రూపాయి హెచ్చుతగ్గులకు లోనవడానికి అనేక ఆర్థికాంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు ఎగుమతులు పెరిగినప్పుడు ఆయా కంపెనీలకు ఆదాయం కింద ఎక్కువ డాలర్లు వస్తాయి. సహజంగానే వీటిని దేశీయంగా రూపాయల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో డాలర్ల లభ్యత ఎక్కువై.. రూపాయల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా రూపాయికి డిమాండ్ పెరిగి బలపడుతుంది. మరోవైపు, దేశీ కంపెనీలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటికి డాలర్లలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. కనుక దిగుమతులు ఎక్కువైనప్పుడు డాలర్లకు ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరిగి అది బలపడుతుంది. అలాగే, విదేశీ పెట్టుబడుల అంశం కూడా. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టినప్పుడు రూపాయలు కావాల్సి ఉంటుంది కనుక.. డాలర్ల విలువ తగ్గి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. అదే.. ఆ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులు అమ్మేసినప్పుడు వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనుక డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా తరచు డాలర్లు, రూపాయల డిమాండ్‌లో మార్పుల వల్ల ఒకదానితో పోలిస్తే మరొక దాని విలువ కూడా మారుతుంటుంది. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లూ కూడా కరెన్సీపై ప్రభావం చూపుతాయి. -
అంతర్జాతీయ అంశాలు, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో 2 శాతం లాభాలను నమోదుచేసింది. మూడు వారాల్లో 6 శాతం ఎగసింది. మార్చి 23 నాటి కనిష్టస్థాయి నుంచి ఏకంగా 42 శాతం లాభపడింది. నిఫ్టీ 7,511 పాయింట్ల నుంచి మళ్లీ 10,600 స్థాయిని అధిగమించింది. ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణం చేస్తుందనే అనే ఉత్కంఠభరిత వాతావరణంలో కంపెనీలు ప్రకటించనున్న 2020–21 మొదటి త్రైమాసిక ఫలితాలు, ఆర్థికాంశాలు మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురువారం క్యూ1 ఫలితాలను ప్రకటించడం ద్వారా ఐటీ రంగ త్రైమాసిక ఫలితాల బోణీ కొట్టనుంది. ప్రధాన సూచీల ట్రెండ్‌కు ఇది కీలకంకానుందని విశ్లేషణ. ఈ అంశాలకు తోడు రాష్ట్రాల లాక్డౌన్ ప్రకటనలు, ట్రేడ్‌వార్ వంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇక ఇదేవారంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్), కర్ణాటక బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఐఐపీ డేటా: మేనెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. చైనా జూన్ నెల ద్రవ్యోల్బణ డేటా, జపాన్ మేనెల మెషినరీ ఆర్డర్ల గణాంకాలు గురువారం విడుదలకానున్నాయి. మార్కిట్ సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ డేటాను అమెరికా సోమవారం ప్రకటించనుంది. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, ములుగు రూరల్: మనస్తాపంతో పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రాంనగర్‌తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై లలిత కథనం ప్రకారం...మండలంలో రాంనగర్‌తండాకు చెంది న పాల్తియా సమ్మయ్య (55) తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. కొన్ని రోజులు గా సమ్మయ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ మనస్తాపానికి గురై నిత్యం బాధపడుతుండేవాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
సంపద సృష్టి, వినాశనం రెండూ ఫైనాన్షియల్ రంగంలోనే
ముంబై: ఆర్థిక సేవల రంగం గడిచిన ఐదేళ్ల కాలంలో సంపదను సృష్టించిన రంగంగానే కాకుండా, నాశనం చేసినదిగానూ నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో పెట్టుబడులతో 2013– 2018 మధ్య అతిపెద్ద సంపద సృష్టించిన రంగమని పేర్కొంది. అయితే, ఎన్పీఏ సమస్యల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు హరించుకుపోవడం, షేర్ల ధరలు పతనం కావడంతో... ఇదే రంగం అతిపెద్ద సంపదను తుడిచిపెట్టినదిగానూ నిలిచినట్టు అభివర్ణించింది. -
ఫైనాన్షియల్ బేసిక్స్...
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు సంబంధించిన ఒక 12–అంకెల విశిష్ట సంఖ్య. యూఏఎన్ సాయంతో సులభంగా డబ్బుల్ని విత్‌డ్రా /ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఉద్యోగులు ఒక సంస్థ నుంచి వేరొక కంపెనీలోకి మారినప్పటికీ యూఏఎన్ నంబర్ మాత్రం ఒకేలా ఉంటుంది. మారదు. సభ్యుల కేవైసీ వివరాలు కలిగి ఉండి, కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈపీఎఫ్‌వో ఈ యూఏఎన్‌ను ఆవిష్కరించింది. ఉద్యోగులు ఆన్లైన్ యూఏఎన్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ సాయంతో ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవచ్చు. కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నంబర్ ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఆన్లైన్ సర్వీసులు పొందటానికి అర్హత కలిగి ఉన్నట్లు. పీఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. -
స్వయం ఉపాధి పొందే వారికి రిటైర్మెంట్ ప్లానింగ్..
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో రిటైర్మెంట్ అనే దశకు చేరుకుంటారు. పదవీ విరమణ తర్వాత జీవితం సుఖంగా సాగాలంటే ముందు నుంచే రిటైర్మెంట్కు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఉద్యోగం చేసేవారికి వారి పీఎఫ్ డిడక్షన్లు ఉంటాయి. మరి స్వయం ఉపాధి పొందే వారి పరిస్థితేంటి? ప్లానింగ్ ఆప్షన్స్ స్వయం ఉపాధి పొందే వారికి కూడా మార్కెట్లో చాలానే రిటైర్మెంట్ ప్లానింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రధానమైనది. ఇదే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్లాన్స్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పలు ఇన్వెస్ట్మెంట్ సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వయం ఉపాధిలో ఉన్నవారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఆర్థిక క్రమశిక్షణను తప్పక పాటించాలి. -
వెకేషన్ ఓనర్షిప్ గురించి తెలుసా?
ఫైనాన్షియల్ బేసిక్స్.. సాధారణంగా ఎవరైనా నాణ్యమైన సేవలను కోరుకుంటారు. మరీ ముఖ్యంగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లేటప్పుడు అక్కడ మంచి సేవలు అందుబాటులో ఉండాలని భావిస్తారు. హాలిడేస్‌ను మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. మనంతట మనమే ప్లాన్ చేసుకొని వెళితే అన్నీ అనుకున్నట్లు జరగకపోవచ్చు. ట్రిప్‌కి వెళ్లిన తర్వాత మన లెక్కలన్నీ తప్పొచ్చు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువే ఖర్చవుతుంది ఒక్కొక్కసారి. సేవలు దారుణంగా ఉండొచ్చు. ఇలాంటి తిప్పలు ఎందుకులే అనుకునేవారికి ‘వెకేషన్ ఓనర్షిప్’ అనువుగా ఉంటుంది. వెకేషన్ ఓనర్షిప్లో మనం మన వెకేషన్‌ను ముందుగానే డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తాం. మహీంద్రా హాలిడేస్ వంటి సంస్థలు ఇలాంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. క్లబ్ మహీంద్రా సభ్యులు 25 ఏళ్లపాటు ప్రతి ఏడాది ఏడు రోజుల హాలిడేస్‌ను సంస్థకు చెందిన 49 రిసార్ట్స్‌లో ఎక్కడైనా, మనకు నచ్చిన సమయంలో ఎంజాయ్ చేయవచ్చు. హాలిడేస్‌ను రెండు దఫాలుగా విభజించుకోవచ్చు. రిసార్ట్స్‌లోని వసతులు, ఇతర సేవల్లో డిస్కౌంట్ పొందొచ్చు. మెంబర్‌షిప్‌ను బట్టి సేవలు మారుతుంటాయి. -
అప్పుల ఊబిలో పడకుండా ఉండాలంటే?
‘అప్పు చేసి పప్పుకూడు’ అనే సామెత గుర్తుందా? చేతిలో డబ్బులు లేనప్పుడు అనుకున్న దాన్ని సాధించడం కోసం కొందరు అప్పే శరణ్యమని అనుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి న విషయం ఒకటుంది. మిగతా ఇబ్బందులతో పోలిస్తే ఆర్థిక పరమైన సమస్యలు మనల్ని ఎక్కువగా బాధిస్తుంటాయి. అందుకే అప్పుల ఊబిలో పడకుండా ఉండటానికే ఎక్కువ ప్రయత్నించాలి. రుణం తీసుకోవడం వలన సంభవించే ప్రతికూలతలను, అనుకూలతలను ముందుగానే బేరీజు వేసుకోవాలి. చాలా మంది ఇలా చేయరు. అప్పటికప్పుడు సమస్య తీరిందా? లేదా? అని మాత్రమే చూస్తారు. ఇలా చేయడం సరికాదు. మన కలల్ని సాకారం చేసుకోవడానికి రుణం సులువైన మార్గమని ఎప్పుడూ భావించకూడదు. ఇంట్లో మూడు పూటల తినడానికి లేకపోయినా పర్లేదు కానీ ఎవరికీ అప్పు ఉండకూడదు అని అనుకోవాలి. అప్పు తీసుకునే ముందు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ఇల్లు కొనుగోలుకు రుణం తీసుకుంటే అక్కడ ఆస్తి మిగులుతుంది. అంటే సంపద సృష్టి జరుగుతోంది. అదే టూర్‌కు వెళ్లడానికి అప్పు తీసుకుంటే దాని వల్ల ఏ ఉపయోగం లేదు. ఇలాంటప్పుడు అప్పు తీసుకోవడం కన్నా ఖాళీగా ఉండటం మంచిది. ఇక్కడ రుణం దేని కోసం తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని దేనికి పడితే దానికి ఖర్చు పెట్టడం అవివేకం అనిపించుకుంటుంది. అలాగే మన ఆదాయ, వ్యయాల మధ్య నిష్పత్తిపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఆదాయంలో సగభాగానికి మించి ఎక్కువ మొత్తాన్ని రుణ చెల్లింపులకు ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. అంటే ఎక్కువ స్థాయిలో రుణాలు తీసుకోవద్దు. ఎస్బీఐ రివార్డ్స్ మీరు స్టేట్ బ్యాంక్ గ్రూప్ కస్టమరా? అయితే దీన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ‘ఎస్బీఐ రివార్డ్స్’ యాప్‌లో మనం నిర్వహించిన బ్యాంకింగ్ లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొ చ్చు. అలాగే వీటిని రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా తదితర వాటి ద్వారా జరిపిన బ్యాంకింగ్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. బ్యాంక్ పార్ట్నర్ బ్రాండ్ ఔట్‌లెట్స్‌లో జరిపిన లావాదేవీలపై మరిన్ని ఎక్కువ పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్లతో డీటీహెచ్, మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డులను కొనొచ్చు. -
ఫైనాన్షియల్ బేసిక్స్
స్టార్టప్స్ ఉద్యోగులకు ఈసాప్స్ మంచివేనా? ప్రస్తుతం చాలా భారతీయ స్టార్టప్ కంపెనీలు ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈఎస్ఓపీ) ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సాధారణంగా ఇవి వేతన ప్యాకేజ్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈఎస్ఓపీ ఆప్షన్‌ను ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఉద్యోగులు వారి వేతనంలో నిర్ణీత మొత్తంతో వారు పనిచేసే సంస్థ షేర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించడమే ఈఎస్ఓపీ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. సంస్థలోనే పనిచేస్తున్నందున ఉద్యోగికి షేర్లు మార్కెట్ ధర కన్నా కొంత డిస్కౌంట్‌కు వస్తాయి. ఈ మేరకు సంస్థకు, ఉద్యోగికి నియామకం సమయంలోనే డీల్ కుదురుతుంది. అంటే కంపెనీ ఉద్యోగికి రూ.15 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేస్తోందనుకుంటే.. అందులో రూ.5 లక్షలను ఈఎస్ఓపీ రూపంలో ఇస్తోందనుకుందాం. అంటే ఈ రూ.5 లక్షల మొత్తానికి విలువైన కంపెనీ షేర్లు ఉద్యోగికి అలాట్ అవుతాయి. మిగతా రూ.10 లక్షల జీతం ఖాతాలో జమ అవుతుంది. మన పేరు మీది షేర్లను నిర్ణీత కాలం తర్వాత మాత్రమే విక్రయించుకోగలం. దీన్ని వెస్టింగ్ పీరియడ్‌గా పిలుస్తారు. ఈ విధానం ఎవరికీ మేలు.. స్టార్టప్ కంపెనీ, ఉద్యోగి ఇరువురికి ఈఎస్ఓపీ ఆప్షన్ ఉత్తమమే. అయితే ఇక్కడ కొన్ని రిస్క్‌లు ఉంటాయి. ఈఎస్ఓపీ ఆప్షన్ ఎంచుకొని మిలియనీర్లు అయిన వారు ఉన్నారు. నష్టపోయిన వారు కూడా ఉన్నారు. పది స్టార్టప్‌లలో ఒకటి మాత్రమే విజయవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే మనం తీసుకునే రిస్క్‌ను బట్టి ఆప్షన్ ఎంచుకోవాలి. భారీ మొత్తంలో వేతనాలు చెల్లించకుండా మంచి టాలెంట్‌ను నియమించుకోవటానికి కంపెనీలకు ఈసాప్ విధానం అనువుగా ఉంటుంది. దీనికి గూగుల్ సుందర్ పిచాయ్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే షేర్ల కేటాయింపు వల్ల ఉద్యోగి తను కూడా సంస్థలో భాగస్వామి అని భావించి మరింత బాగా పనిచేసే అవకాశముంటుంది. ఇది కూడా కంపెనీకి అనుకూలించే అంశమే. ఇదే సమయంలో ఈఎస్ఓపీ వల్ల కంపెనీ వ్యవస్థాపకుల షేర్ హోల్డింగ్ వాటా తగ్గుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు షేర్లు అలాట్ అవుతాయి కాబట్టి. చివరగా ఉద్యోగులు ఈఎస్ఓపీ ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు పన్నులు, డాక్యుమెంటేషన్, ఎగ్జిట్ వంటి పలు అంశాలపై దృష్టిపెట్టాలి. -
గృహ రుణ భారం తగ్గించుకోవాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ గృహ రుణాన్ని ముందే చెల్లిస్తే ఆర్థికంగా ఊరట లభిస్తుంది. అధిక మొత్తంలో డబ్బులు అందినప్పుడు ఈ బరువును క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. దీంతో వడ్డీ భారం తగ్గడంతోపాటు మొత్తంగా ప్రాపర్టీ ఖర్చు కూడా దిగివస్తుంది. హోమ్ లోన్ సహా ఎలాంటి రుణమైనా సరే ఒక వ్యక్తి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండాలి. అయితే మధ్యతరగతి ప్రజలకు ఇంటి కొనుగోలుకు కావాల్సిన అధిక మొత్తాన్ని పొదుపు చేయడం కష్టమైనపని. అందుకే వారు హోమ్ లోన్స్ వైపు వెళ్తుంటారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు ఇచ్చే గృహ రుణాలు మరొకవైపు రియల్ ఎస్టేట్ వృద్ధికి కూడా దోహదపడుతున్నాయి. తీసుకున్న రుణాన్ని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి చూద్దాం.. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. వృద్ధి రేటు: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందుగా కంపెనీ గురించి తెలుసుకోవాలి. దాని వ్యాపారం ఎలా ఉందో గమనించాలి. అంటే కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోందా? లేదా? వృద్ధి రేటు ఏ స్థాయిలో నమోదవుతోంది.. వంటివి చూడాలి. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ తదితర అంశాలను కూడా చూడాలి. లాభదాయకత: కంపెనీ ట్రాక్ రికార్డు బాగుండాలి. దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు చదవాలి. అది స్థిరమైన వృద్ధిని నమోదుచేస్తూ ఉండాలి. అలాగే దాని మార్జిన్లు కూడా బాగుండాలి. డివిడెండ్లపై ప్రత్యేకంగా కన్నేయాలి. షేర్ ధర క్రమంగా పెరుగుతూ వచ్చి ఉండాలి. ఇలా ఉన్న కంపెనీ షేర్లపై ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్యాలెన్స్ షీట్: కంపెనీ బ్యాలెన్స్ షీట్ బాగుండాలి. దాని కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడాలి. అంటే ఆ కంపెనీ రుణాలతో నడుస్తోందా? లేదా సరిపడినంత క్యాష్ ఫ్లో ఉందా? అనే అంశాలను గమనించాలి. కంపెనీ నిర్వహణ వ్యయం స్థిరంగా ఉందో.. పెరుగుతోందో చూడాలి. అమ్మకాలు పెరగకుండా.. వ్యయాలు మాత్రం పెరుగుతూ ఉంటే అప్రమత్తంగా ఉండాలి. మేనేజ్మెంట్: కంపెనీ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేకం గా మాట్లాడుకోవాలి. కంపెనీ చైర్మన్, డైరెక్టర్ల వివరాలు, వారి విద్యార్హతలు, ఇదివరకు పనితీరు, వేతనాలు వంటి పలు విషయాలను సవివరంగా తెలుసుకోవాలి. కంపెనీ మేనేజ్మెంట్ సుదీర్ఘకాలం నుంచి స్థిరంగా ఉందా? లేక దానిలో పలుమార్లు మార్పులు చోటుచేసుకుంటున్నాయా? అనే అంశాలపై కన్నేయాలి. రిస్క్‌లు: కంపెనీ పనితీరును, భవిష్యత్ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయేమో ముందే ఊహించాలి. కంపెనీ వార్షిక నివేదిక, మేనేజ్మెంట్ నిర్ణయాలు వంటి వాటి ఆధారంగా ప్రమాదాలను ముందే పసిగట్టొచ్చు. కంపెనీ ఏ రంగంలో ఉందో చూడాలి. ఆ రంగం భవిష్యత్ అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాతే నచ్చిన, అనువైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. -
ఈటీఎఫ్ అంటే..
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఈటీఎఫ్ అంటే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ప్రతి విషయంలోనూ మ్యూచువల్ ఫండ్లానే ఉంటుంది. అయితే మ్యూచ్‌వల్ ఫండ్ల మాదిరి కాకుండా ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో షేర్లను ఎలాగైతే కొనుగోలు చేస్తారో అలాగే బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్‌గా ఈటీఎఫ్‌లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజ్‌లలో ట్రేడ్ అవుతాయి. ఉదయం కొని సాయంత్రం విక్రయించొచ్చు కూడా. తక్కువ వ్యయాలు, పన్ను రాయితీలు, డైవర్సిఫికేషన్, స్టాక్స్‌కు ఉండే సౌకర్యాలను కలిగి ఉండటం వంటి పలు ప్రయోజనాల నేపథ్యంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్మెంట్లకు అనువుగా ఉంటాయి. ఇవి 1993 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈటీఎఫ్‌లు స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ, ఆప్షన్స్ వంటి పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు చేస్తాయి. ప్రధానంగా మాత్రం స్టాక్ సూచీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. -
ఫండ్స్ నుంచి ఎప్పుడు వైదొలగాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్... మనకు ఎన్నో ఆర్థిక లక్ష్యాలుంటాయి. రిటైర్మెంట్ ప్లాన్, పిల్లల చదువు, అమ్మాయి పెళ్లి ఇలా ఎన్నో అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. లక్ష్యాల సాకారానికి చాలా మంది వీటిల్లో పెట్టుబడులు పెడుతుం టారు. ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి బాగా తెలిసిన వారు వాటిల్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టకపోయినా మంచి రాబడి పొందొచ్చు. ఇక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేశామనే దాని కన్నా .. ఎలాంటప్పుడు (మార్కెట్ పరిస్థితులు) ఇన్వెస్ట్ చేశావనే అంశానికి ప్రాధాన్యమివ్వాలి. లక్ష్యాలపై దృష్టి అవసరం సాధారణంగా అయితే లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతనే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు రావాలి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలానికి ప్రణాళికలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తొలినాళ్లలోనే ఈక్విటీ ఫండ్స్‌కి అధిక ప్రాధాన్యతనివ్వాలి. కొద్ది కాలం తర్వాత పోర్ట్‌ఫోలియోను రీ–బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అంటే రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇక ఒక్కొక్కసారి నిర్దేశిత కాలం కన్నా ముందుగానే ఫండ్స్ నుంచి వైదొలగాల్సి వస్తుంటుంది. అంటే మన ఫండ్ మంచి పనితీరు కనబరచనప్పుడు, ఫండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు మారినప్పుడు మనం ఫండ్ నుంచి బయటకు వచ్చేయాలని యోచి స్తాం. మనకు ఏది మంచో ఏది చెడో మనకే తెలుస్తుంది. అందుకే ఇలాంటప్పుడు మనకు అనువైన నిర్ణయాన్నే తీసుకోవాలి. ప్రశ్నలకు సమాధానాలుండాలి ఇన్వెస్ట్మెంట్ల నుంచి వైదొలగాలి అని అనుకున్నప్పుడు ఒకే ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు వైదొలుగుతున్నాం అనే ప్రశ్నకు మన వద్ద సరైన సమాధానం ఉండేలా చూసుకోవాలి. ఫండ్ నుంచి బయటకు రావడానికి ముందే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశోధించాలి. అంటే స్థిరం గా ఉండి, దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తే.. ఎలాంటి ప్రతిఫలం పొందొచ్చు ఊహించగలగాలి. దీర్ఘకాలంలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అలాగే కాంపౌండింగ్ అంశం వల్లా లబ్ధి పొందొచ్చు. -
స్టాక్స్ వ్యూ
ఫైనాన్షియల్ బేసిక్స్.. లిక్విడ్ ఫండ్స్ చిన్న ఇన్వెస్టర్లకు అనువేనా? దేశంలో లిక్విడ్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో పెద్ద, సంస్థాగత ఇన్వెస్టర్లే వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. గతంలో వీటిని రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ చేద్దామనే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. లిక్విడ్ ఫండ్స్ అందిస్తోన్న పలు సౌలభ్యాలు, ప్రయోజనాల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉండటం, ఆన్లైన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, లిక్విడ్ ఫండ్స్ అందిస్తున్న ప్రయోజనాలు, డైరెక్ట్ ప్లాన్లు తేవటం, లిక్విడిటీ వంటి పలు అంశాల వల్ల చిన్న ఇన్వెస్టర్లు లిక్విడ్ ఫండ్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. నెఫ్ట్, డైరెక్ట్ డెబిట్/క్రెడిట్, స్వైప్ వంటి పలు ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసుల వల్ల వీటి దైనందిన ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలు సులభతరమయ్యాయి. లిక్విడ్ ఫండ్స్ ప్రత్యేకతలు ఇవి డెట్ మ్యూచువల్ ఫండ్స్ కిందకు వస్తాయి. ఈ ఫండ్స్ మన డబ్బుల్ని ట్రెజరీ బిల్లులు, గవర్నమెంట్ సెక్యూరిటీస్, వాణిజ్య పత్రాలు వంటి స్వల్పకాలిక మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో రిస్క్, ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. ఎగ్జిట్‌లోడ్ భారం ఉండదు. తక్కువ మెచ్యూరిటీ కాలం వల్ల వీటికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో లాకిన్ పీరియడ్ ఉండదు. సియట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.1,130 టార్గెట్ ధర: రూ.1,406 ఎందుకంటే: ఆర్పీ గోయెంకా గ్రూప్‌లో ప్రధాన కంపెనీ. ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ ఇదే. 4,500కు పైబడిన డీలర్లతో, 33 రీజినల్ ఆఫీసులతో, 400కు పైగా ఫ్రాంచైజీలతో, 6 ప్లాంట్లతో, 250కు పైగా డిస్ట్రిబ్యూటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్జిన్లు తక్కువగా ఉండే బస్సు, ట్రక్కు టైర్ల తయారీ నుంచి మార్జిన్లు అధికంగా ఉండే టూ వీలర్, ప్రయాణికుల వాహన టైర్ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. మార్కెటింగ్, బ్రాండింగ్‌పై అధికంగా వ్యయం చేసింది. దీంతో 2010–11లో 8 శాతంగా ఉన్న 2వీలర్ టైర్ల మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతానికి (ఎంఆర్ఎఫ్ తర్వాత రెండో స్థానం ఈ కంపెనీదే), ప్రయాణికుల వాహన టైర్ల మార్కెట్ వాటా 4 శాతం నుంచి 9 శాతానికి పెరిగాయి. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయంలో టూ వీలర్ టైర్ల వాటా 38 శాతానికి, ప్రయాణికుల వాహన టైర్ల వాటా 49 శాతానికి పెరుగుతాయని అంచనా. ఫలితంగా రబ్బర్ ధరల్లో ఒడిదుడుకులు వచ్చినా, మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ రెండు సెగ్మెంట్లలో(టూ వీలర్, ప్రయాణికుల వాహనాలు) చైనా టైర్ల నుంచి పోటీ తక్కు వగా ఉండడం కంపెనీకి కలసివస్తోంది. మార్జిన్లు అధికంగా ఉండే ఆఫ్–వే టైర్స్(ఓహెచ్‌టీ) సెగ్మెంట్లో ఇటీవలే ప్రవేశించింది. ఈ ఆఫ్–వే టైర్ల వల్ల కంపెనీ ఎగుమతులు బాగా పెరుగుతాయని, మార్జిన్లు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. శ్రీలంక అనుబంధ కంపెనీ ఏసీహెచ్ఎల్కు ఆ దేశంలో టైర్ల మార్కెట్లో 50 శాతం వాటా ఉంది. ఇబిటా మార్జిన్ 25 శాతంగా ఉంది. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం, నికర లాభం 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. నెస్లే ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.6,254 టార్గెట్ ధర: రూ.7,417 ఎందుకంటే: ఇన్స్టంట్ నూడుల్స్, చిన్న పిల్లల ఆహార పదార్ధాల సెగ్మెంట్లలలో నెస్లే ఇండియా కంపెనీదే అగ్రస్థానం. ఇన్స్టంట్ కాఫీ, చాక్లెట్ల సెగ్మెంట్లో రెండో స్థానంలో ఉంది. పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం అధికంగానే ఉన్నప్పటికీ, నెస్లే ఇండియా గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో మంచి ఆర్థిక ఫలితాలనే ప్రకటించింది. ఆదాయం 16% వృద్దితో రూ.2,261 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు 36% పెరగడం, న్యాయ వివాదాల పరిష్కారం కోసం రూ.81 కోట్ల కేటాయింపులు కారణంగా నికర లాభం రూ.215 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్ మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం ఉందనే అంచనాలతో 2015 జూన్‌లో నిషేధం విధించారు. మ్యాగీ సురక్షితమేనని వివిధ లేబరేటరీల్లో తేలడంతో అదే ఏడాది నవంబర్‌లో నెస్లే కంపెనీ మ్యాగీ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. దాదాపు ఏడాది తర్వాత కోల్పోయిన మార్కెట్ వాటాను మళ్లీ సాధించింది. గత ఏడాది చివరి ఆరు నెలల్లో నెస్లే కంపెనీ– మ్యాగీ, పాలు, చాక్లెట్ల కేటగిరీల్లో 30 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మరో ఐదు కొత్త కేటగిరిల్లోకి– నెస్ప్రెస్సో(కాఫీ మెషీన్), డాల్సే గస్టో(కాఫీ క్యాప్సూల్ సిస్టమ్), పెట్‌కేర్, హెల్త్‌కేర్, స్కిన్ కేర్ల్లోకి ప్రవేశిస్తోంది. బ్రాండ్ ఇమేజ్, ప్రచారానికి అధికంగా నిధులు ఖర్చు చేయడం వంటి అంశాల కారణంగా ఈ సెగ్మెంట్లలలో కూడా నెస్లే నిలదొక్కుకోగలదని భావిస్తున్నాం. చాక్లెట్ల కేటగిరిలో క్యాడ్బరీస్ నుంచి, పాల ఉత్పత్తుల కేటగిరిలో అమూల్, బ్రిటానియాల నుంచి పోటీ పెరుగుతుండడం ప్రతికూలాంశం. మధ్య తరగతి, అధికాదాయం గలవారే అధికంగా ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నందున ఉత్పత్తుల ధరలను పెంచినా, అమ్మకాలు తగ్గకపోవడం కంపెనీకి కలసివచ్చే అంశం. -
మార్జిన్ ఎంతుంది గురు?
ఫైనాన్షియల్ బేసిక్స్.. స్టాక్స్ గురించి మనకు బాగా తెలుసు. ఒక మంచి కంపెనీ స్టాక్ కొంటే... ఆ షేర్ ధర ఎక్కడెక్కడికో భారీగా పడిపోయినా.. ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్లీ పెరిగినప్పుడు మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. అయితే మార్కెట్లలో కొన్ని క్లిష్టమైన డెరివేటివ్ ప్రొడక్టులు ఉంటాయి. అందులో ‘ఫ్యూచర్స్’ ఒకటి. మీరు ఒక ఫ్యూచర్ కొన్నారంటే... మీరు అకౌంటులో కొనసాగించే మార్జిన్ మనీ ఇక్కడ చాలా ముఖ్యం. దీని గురించి తెలుసుకుందాం... ♦ ప్రస్తుతం క్రూడ్ బేరల్ ధర 55 డాలర్లు ఉంది. ఈ ధర 56 డాలర్లకు పెరుగుతుందని భావించారు. ఇది మీ బెట్. మీ బెట్‌కు కమోడిటీ మార్కెట్లో ఒక ఆప్షన్ ఉంది. దీని పేరే ఫ్యూచర్. ♦ ఈ బెట్లో పాల్గొనాలంటే... మీరు దాదాపు రూ.3 వేలు మార్జిన్‌గా చెల్లించి ఒక లాట్‌గా (ఈ ధరకు 10 బేరళ్లు ఒక లాట్) కొనాల్సి ఉంటుంది. సరే మీరు రూ.3 వేలు పెట్టి లాట్ కొన్నారు. ♦ మీరు ఊహించినట్లే లాట్ ధర 56 డాలర్లకు పెరిగింది. మీకు అప్పటి డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం... 10 బేరళ్లకు లాభం వచ్చేస్తుంది. అంటే ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రకారం దాదాపు రూ.660 లాభం వచ్చేస్తుందన్నమాట. ♦ ఒకవేళ మీరు ఊహించినట్లు కాకుండా డాలర్ ధర 54 డాలర్లకు పడిపోయిందనుకుందాం. ఇక్కడ మీకు రూ.660 నష్టం వస్తుంది. అప్పుడు మీ మార్జిన్ మనీలో రూ.660 తగ్గుతుంది. అందువల్ల ఇక్కడ మీరు ఈ కాంట్రాక్ట్ కొనసాగించేందుకు అదనంగా రూ.660 అకౌంటులో రెడీ చేయాలన్న మాట. అప్పుడు మీ కాంట్రాక్ట్ స్క్వేర్‌ఆఫ్ కాకుండా ఉంటుంది. అకౌంటులో మార్జిన్‌మనీ ఎక్కువ ఉంటే, ఒకవేళ ధర 54 స్థాయికి పడినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తిరిగి ధర 56 డాలర్లకి పెరిగినపుడు ... మీ లాభం మీకు వచ్చేస్తుంది. ♦ ఇక మీ మార్జిన్ తక్కువ ఉంటే కేవలం కాంట్రాక్టు ధర 54 డాలర్లకన్నా తక్కువకు పడిపోతే, మీ కాంట్రాక్ట్ ఆటోమేటిక్‌గా స్క్వేర్‌ఆఫ్ అయిపోతుంది. అంటే మీ కాంట్రాక్ట్ నష్టంతో ముగుస్తుందన్నమాట. ♦ అందుకే ఫ్యూచర్స్‌లో మార్జిన్ అనేది చాలా కీలకం. పై సందర్భంలో క్రూడ్ ధర ఎంతవరకూ పడిపోతుందన్న గట్టి అంచనాలతో తగిన మార్జిన్ ఉంచుకుంటే... మంచిది. దీనినే హోల్డింగ్ సామర్థ్యం అంటారు. ఈ సామర్థ్యం మీకు ఎంత ఉంటే అంత మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే... తగిన హోల్డింగ్ ఉంటే ఫ్యూచర్స్‌లో ‘అసాధారణ పరిస్థితులు’ తప్పించిన నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. -
ఫైనాన్షియల్ బేసిక్స్
► భారీగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయితే కేటాయింపు కష్టం ► కనీస లాట్ మేరకే కేటాయింపులుంటాయి ► అది కూడా దాటితే లాటరీ పద్ధతిలోనే ఐపీఓలో ఇలాగైతే షేర్లు దక్కవు!! ఇపుడు దాదాపు అన్ని ఐపీవోలకు చక్కని స్పందన వస్తోంది. ఎన్నో రెట్లు ఓవర్ సబ్‌స్రై్కబ్ అవుతున్నాయి. ఆఫర్ చేస్తున్న షేర్ల సంఖ్యకు తగినట్టు దరఖాస్తులు వస్తే ఏ సమస్యా లేదు. కానీ, అధిక స్పందన వస్తే షేర్ల కేటాయింపు ఎలా చేస్తారు...? ఎవరికి కేటాయిస్తారు..? దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి షేర్లు దక్కుతాయి, ఇందుకు అనుసరించే విధానాలు ఏంటి..? ఒకసారి చూద్దాం... బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ (బీఎస్ఈ) ఐపీవో 51 రెట్లు అధికంగా సబ్‌స్రై్కబ్ అయింది. ఆ మధ్య వచ్చిన క్వెస్ కార్ప్ ఐపీవోకు ఆఫర్ చేస్తున్న షేర్ల కంటే ఏకంగా 147 రెట్లు అధికంగా స్పందనొచ్చింది. ఇన్నేసి రెట్లు ఓవర్ సబ్‌స్రైబ్ అయితే షేర్లు దక్కే అవకాశాలు తక్కువేనని అనుకోవాలి. ఎందుకంటే ఐపీవోకు సంబంధించి ఇన్వెస్టర్లను పలు కేటగిరీలుగా విభజించి, వారి కంటూ నిర్ణీత వాటా ప్రకారం షేర్లను కేటాయిస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వంటి కేటగిరీలున్నాయి. ఉద్యోగుల కోటా కూడా ప్రత్యేకంగా ఉంది. ఇటీవలి బీఎస్ఈ ఐపీవోనే చూసుకుంటే... రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 6.18 రెట్లు అధికంగా చందాలొచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 48.64 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 77.22 అధికంగా బిడ్లు వచ్చాయి. ఇలాంటప్పుడు కేటాయింపు ఎలా...? అధిక స్పందన వచ్చినప్పుడు సెబీ నిబంధనల ప్రకారం షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఐపీవోలో కనీస దరఖాస్తు రుసుం రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండాలన్నది సెబీ నిబంధన. అంటే ఈ విలువ మేర షేర్ల కేటాయింపు ఉండాలి. మొత్తం షేర్ల సంఖ్యకు అనుగుణంగా షేర్ల లాట్ సైజ్ ను నిర్ణయించాలి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు సరిపడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి మేరకు ఎన్ని లాట్ల వరకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో ఎక్కువ స్పందన వచ్చినపుడు అందుబాటులో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యను కనీస లాట్ సైజ్‌తో డివైడ్ చేస్తే... ఎంత మంది దరఖాస్తు దారులకి షేర్లు వచ్చేదీ తెలుస్తుంది. వచ్చిన మొత్తం దరఖాస్తులకు సమానంగా ఉంటే అప్పుడు ఒక్కో ఇన్వెస్టర్ గరిష్టంగా ఎన్ని షేర్లకు దరఖాస్తు చేసినప్పటికీ, కనీసం ఒక లాట్ మేరకే షేర్లు కేటాయిస్తారు. ఒకవేళ ఈ స్థాయి కంటే అధికంగా దరఖాస్తులు వస్తే, అప్పుడు లాటరీ విధానాన్ని అనుసరిస్తారు. కనుక భారీ స్పందన వచ్చిన ఇష్యూల్లో షేర్లు లభించే అవకాశం తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. తో ఉపయోగం రిటైల్ ఇన్వెస్టర్లు తమ బ్యాంకు ఖాతాల నుంచే ‘అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్బీఏ)’ విధానం ద్వారా ఐపీవోకు దరఖాస్తు చేసుకునే విధానం ఉంది. ఈ విధానంలో డీపీఐడీ, క్లయింట్ ఐడీ ఇచ్చి ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు మీ తరఫున ఐపీవోకు దరఖాస్తు పంపి, షేర్ల కేటాయింపు వరకు బిడ్‌కు సరిపడా నగదును బ్లాక్ చేసి ఉంచుతుంది. షేర్ల కేటాయింపు జరిగితే ఆ మేరకు నగదు ఖాతాలోంచి బదిలీ అవుతుంది. కేటాయింపు లేకుంటే ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి ఖాతాదారుడికి అందుబాటులోకి తెస్తుంది. పైగా బ్లాక్ చేసి ఉంచినన్ని రోజులూ ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లిస్తుంది. దీని వల్ల అనవసర వ్యయాలు తగ్గుతాయి. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
రియల్టీలో పెట్టుబడులు ఉత్తమమేనా? భారతీయులకు రియల్ ఎస్టేట్ రంగంపై మక్కువ ఎక్కువ. రియల్టీతో మనకు విడదీయలేని అనుబంధముంది. ఇల్లు, ఆఫీస్, స్థలం ఇలా.. వీటిన్నింటితో ఎప్పుడు మనం మమేకమై ఉంటాం. ఇక ఇన్వెస్టర్లు కూడా వారి పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. అంతెందుకు సామాన్యులు కూడా రియల్టీలో పెట్టుబడులు సురక్షితమైనవని భావిస్తారు. స్థలం ధర రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడముండదని అనుకుంటారు. కానీ మనం అప్పుడప్పుడు ప్రాపర్టీ ధరలు తగ్గాయని, డిమాండ్ పడిపోయిందనే వార్తలూ చదువుతుంటాం. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. లిక్విడిటీతో చిక్కు.. రియల్టీ పెట్టుబడుల్లో సమస్యలు కూడా దాగున్నాయి. ఉదాహరణకు మీరు బ్యాంకుల్లో/ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో రుణం తీసుకొని రియల్టీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వడ్డీరేట్లు పెరిగితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన అంశం లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్య ఉత్పన్నం కాదు. అంటే డబ్బులు అవసరమైనప్పుడు స్టాక్స్‌ను వెంటనే విక్రయిం చొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు రావొచ్చు. కానీ రియల్టీలో ఇలాంటి పరిస్థితి ఉండదు. లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది. స్వల్పకాలికమైతే వద్దు.. గతంలో రియల్టీ రంగం మంచి బూమ్‌లో ఉండేది. ఆ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులకు రెట్టింపు రాబడిని పొందారు. కానీ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతమైతే డీమోనిటైజేషన్ దెబ్బలో రియల్టీ కష్టాలు మరింత పెరిగాయి. అయితే ఈ పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్వల్పకాలంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారు రియల్టీకి దూరంగా ఉండటం ఉత్తమం. దీర్ఘకాలంలో రియల్టీ పెట్టుబడులు మంచి రాబడినే అందిస్తాయి. -
ఫైనాన్షియల్ బేసిక్స్
భారత్‌ను వర్ధమాన దేశమంటారెందుకు? అభివృద్ధి చెందుతున్న దేశాలను వర్ధమాన దేశాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్లకు అధిక రాబడి అవకాశాలు అందుబాటులో ఉంటాయో వాటిని వర్ధమాన దేశాలుగా పేర్కొం టారు. ఇక్కడ పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోరు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లు, డెట్ మార్కెట్లు, మంచి జీడీపీ వృద్ధి రేటు, సంస్కరణలు వంటి అంశాలను మనం గమనించవచ్చు. అందుకే భారత్ వర్ధమాన దేశాల జాబితాలో చేరింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్లకు అధిక రాబడి పొందొచ్చు. ఇక్కడ అధిక రాబడికి సమానంగానే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ఎక్కువగా ఉందంటే.. మార్కెట్ ధర స్థిరంగా ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో రిస్క్‌లు తక్కువే. ఇండియన్ మార్కెట్లలో బలమైన దీర్ఘకాలిక వృద్ధి కనిపిస్తుంది. దీనికి అధిక జనాభా, ప్రజాస్వామ్య వ్యవస్థ, వృద్ధి అవకాశాలు, ఆర్థిక అంశాల రికవరీ వంటి పలు అంశాలను కారణంగా పేర్కొనవచ్చు. సుసంపన్న, సమాన వృద్ధి స్థాయిల పరంగా చూస్తే భారత్ ఇతర వర్ధమాన దేశాల కన్నా వెనుకంజలో ఉంది. అంటే ఇక్కడ వృద్ధికి అపార అవకాశాలున్నాయి. కాగా సంస్థాగత విధానాలు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ వంటి సమస్యల్ని భారత్ ఎదుర్కొంటోంది. -
ఫైనాన్షియల్ బేసిక్స్..
క్రెడిట్ కార్డు కొట్టేశారా? ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ కార్డుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే స్థారుులో సమస్యలూ ఉంటారుు. అందుకే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలి. భద్రంగా కాపాడుకోవాలి. అంటే పొరపాటున మీ కార్డును ఎవరైనా దొంగలించారు అనుకోండి. అప్పుడు పరిస్థితేంటి? పోరుుంది కదా అని అలాగే ఉంటే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది. కార్డు పోరుునప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం.. కార్డు పోరుున విషయం బ్యాంక్‌కు చెప్పండి క్రెడిట్ కార్డు జారిపోరుున విషయం వెంటనే సంబంధిత బ్యాంక్/కార్డు జారీ సంస్థకు తెలియజేయండి. అప్పుడు బ్యాంక్ మీ కార్డును రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త కార్డును జారీ చేస్తుం ది. కార్డు పోరుున వెంటనే దాని పిన్ నంబర్‌ను మార్చడం మరచిపోవద్దు. ఏమాత్రం ఆలస్యం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేయండి కార్డు దొంగతనం జరిగిన తర్వాత ఆ విషయాన్ని కేవలం బ్యాంకులకు మాత్రమే తెలియజేస్తే సరిపోదు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాలి. వారు కేసు నమోదు చేసుకుంటారు. ఈ కేసు సంబంధిత డాక్యుమెంట్లను భద్రం చేసుకోండి. క్రెడిట్ కార్డు పోరుున తర్వాత ఆ విషయాన్ని బ్యాంకులకు, పోలీసులకు చెప్పడం వల్ల ఆ అకౌంట్లో ఏవైనా అధిక మొత్తంలో లావాదేవీలు జరిగితే ఆ భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. -
చార్జీలు చూశాకే ‘క్రెడిట్’ వాడాలి!
ఫైనాన్సియల్ బేసిక్స్.. క్రెడిట్ కార్డులిపుడు అత్యవసర ఆర్థిక సాధనంగా మారిపోయాయి. అందుకే వీటి డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఫర్వాలేదు. కానిపక్షంలో చాలా సమస్యలు ఎదుర్కోవాలి. కార్డుల వాడకం గురించి తెలుసుకోవటంతో పాటు వాటికి సంబంధించిన చార్జీలను కూడా చూడాలి. మనకు తెలియకుండానే కొన్ని చార్జీలు పడుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఆలస్యంగా చెల్లించే పేమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్డులపై మనం చెల్లించే చార్జీలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం... ఫ్రీ కార్డు: దాదాపుగా ఏ క్రెడిట్ కార్డు కూడా ఉచితంగా రాదు. తొలి ఏడాది కార్డుకు ఎలాంటి చార్జీలూ ఉండకపోవచ్చు. కానీ కార్డు జారీ సంస్థలు తర్వాత సంవత్సరానికి కొంత మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తాయి. ఆలస్య చెల్లింపులు: కార్డు బిల్లులను ఆలస్యంగా చెల్లిస్తే... ఆ ఆలస్యానికీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని మరువొద్దు. ఏటీఎం విత్‌డ్రాయెల్స్: మనం క్రెడిట్ కార్డులను అటు ఔట్‌లెట్స్‌లోనూ, ఇటు ఏటీఎంలలోనూ స్వైప్ చేయవచ్చు. అయితే ఇక్కడ రెండింటికీ తేడా ఉంది. ఏటీఎంలో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకుంటే మాత్రం క్యాష్ అడ్వాన్స చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఆలస్య చెల్లింపులు.. వడ్డీ: చాలా క్రెడిట్ కార్డు సంస్థలు ఆలస్య చెల్లింపులకు గానూ చెల్లించని మొత్తానికి 42 శాతం వరకు వడ్డీని గుంజుతున్నాయి. అలాగే ఈ వడ్డనపై మళ్లీ సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. నాన్ పేమెంట్: క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ అమౌంట్ రుసుమును కూడా చెల్లించకపోతే దానికి కూడా చార్జీలు పడతారుు. ఇవి కార్డు ఔట్‌స్టాండింగ్ పేమెంట్స్‌పై ఆధారపడి ఉంటాయి. లిమిట్ దాటితే: పొరపాటున కొన్నిసార్లు కార్డుపై ఉన్న పరిమితిని దాటి లావాదేవీలు జరుపుతుంటారు. వీటికి వడ్డన భారీగానే ఉంటుంది. ఓవర్సీస్ ట్రాన్సాక్షన్: కొన్ని సంస్థలు విదేశాల్లో జరిపే లావాదేవీలకు చార్జీలను వసూలు చేస్తుంటారుు. ఈ చార్జీలు ఆ ట్రాన్సాక్షన్లో 3-3.5 శాతం వరకు ఉండొచ్చు. డూప్లికేట్ స్టేట్మెంట్: నెలవారీగా కార్డు స్టేట్మెంట్లను ఉచితంగా పొందొచ్చు. కానీ మనకు ఏమైనా అదనపు స్టేట్మెంట్ కావాలంటే మాత్రం అప్పుడు డూప్లికేట్ స్టేట్మెంట్ చార్జీలు చెల్లించాలి. కార్డు రిప్లేస్మెంట్: క్రెడిట్ కార్డు పోయిందనుకోండి..కొత్త కార్డు కోసం క్రెడిట్ సంస్థలు కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారుు. అందుకే ఈ ప్రపంచంలో ఏదీ కూడా ఉచితంగా రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. -
ఫైనాన్షియల్ బేసిక్స్...
క్రెడిట్ కార్డు.. ఈఎంఐ ఆప్షన్.. క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వీటిని కోరుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేనప్పుడు అత్యవసర ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అందుకే వీటికి ఆదరణ పెరిగిపోతోంది. చాలా మంది క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో వస్తు కొనుగోలు జరిపి దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. మనం ఎలాగైతే రుణం తీసుకొని వడ్డీ, అసలు చెల్లించి రుణాన్ని తీర్చుకుంటామో.. క్రెడిట్ కార్డు ఈఎంఐ కూడా అలాగే పనిచేస్తుంది. ఇక్కడ అసలు, వడ్డీ రెండూ చెల్లిస్తాం. చెల్లించే ఈ వడ్డీ క్రెడిట్ కార్డు కంపెనీకి ఆదాయం అవుతుంది. అలాగే నిర్ణీత గడువులోగా కార్డు బిల్లులను చెల్లించకపోతే మనకు పెనాల్టీ రూపంలో మళ్లీ వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ కూడా క్రెడిట్ కార్డు కంపెనీలకు రాబడి అవుతుంది. మనం సరైన సమయంలోనే బిల్లులు చెల్లిస్తే పర్వాలేదు. ఆలస్యంగా చెల్లిస్తే మాత్రం ఆయా కంపెనీల రాబడికి మన వాటా జమవుతుంది. అన్ని క్రెడిట్ కార్డులకు ఈఎంఐ సౌలభ్యం ఉండకపోవచ్చు. ఇక కొనుగోలు మొత్తాన్ని ఈఎంఐకి మార్చుకోవాలని భావిస్తే.. ముందుగా వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోండి. -
సిబిల్ స్కోరు ఎంతుండాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్ రుణ మంజూరుకు సంబంధించి సిబిల్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రుణమిచ్చే సంస్థ/బ్యాంక్ ఒకరికి రుణమివ్వడానికి ముందు వారి సిబిల్ స్కోర్ ఎంతుందో చూస్తుంది. స్కోర్ బాగుంటే పర్వాలేదు. రుణం వస్తుంది. లేకపోతే రుణ లభ్యత కష్టమవుతుంది. అందుకే సిబిల్ స్కోర్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. సిబిల్ స్కోర్ సాధారణంగా 300-900 మధ్యలో ఉంటుంది. సిబిల్ సంస్థ ఒక వ్యక్తి బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలను ఆధారంగా చేసుకొని అతనికి 300-900 మధ్యలో ఒక స్కోర్‌ను కేటాయిస్తుంది. ఈ స్కోర్ 900కు దగ్గరిలో ఉంటే.. రుణమిచ్చే సంస్థలు మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరని ఒక అంచనాకు వస్తాయి. అంటే రుణ మంజూరు సులభంగా జరుగుతుంది. ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకమైన సిబిల్ స్కోర్‌ను రుణ మంజూరుకు ప్రాతిపదికగా తీసుకుంటాయి. అయితే సాధారణంగా చాలా బ్యాంకులు మాత్రం 750 లేదా అంత కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు రుణాలివ్వటానికి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే మీ క్రెడిట్ రేటింగ్ ఎలా ఉందనేది తరచూ పరిశీలించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఈ రిపోర్ట్ పొందవచ్చని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. మీ ఆర్థిక జీవనంలో క్రెడిట్ స్కోర్ పాత్ర ఎంతో కీలకమన్న విషయం మర్చిపోవద్దు. ఈ రిపోర్టును మీరు బ్యాంకు లేదా సిబిల్ నుంచి పొందే వీలుంది. తప్పిదాలు జరగొచ్చు జాగ్రత్త: మనం క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ను సక్రమంగా చెల్లించినా కూడా సిబిల్ స్కోర్ తక్కువగా రావొచ్చు. దీనికి బ్యాంకులు లేదా మాన్యువల్ తప్పిదాలు కారణంగా నిలువొచ్చు. ఒక్కొక్కసారి డేటా తప్పుగా అప్డేట్ జరగవచ్చు. రిపోర్ట్ సందర్భంలో పేరు, అడ్రస్, పుట్టినతేదీ వంటి వివరాల్లో చిన్న తేడా వచ్చినా, రిపోర్ట్ తప్పుగా నమోదయ్యే వీలుంటుంది. ఏదైనా తప్పు ఎంట్రీ జరిగితే.. దానిని సిబిల్ దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.