Football
-
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్‌ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్‌తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్‌లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్‌పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్‌పై గెలుపొందాయి. -
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2024లో భారత్‌కు తొలి పతకం లభించింది. పురుషుల డబుల్స్ విభాగంలో అనాస్ బేగ్, డెక్లన్ గొంజాల్వెస్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. టెక్బాల్ క్రీడలోకి ఇటీవలే ప్రవేశించిన బేగ్-గొంజాల్వెస్ జోడీ అంచనాలకు మించి రాణించి అభిమానులను ఆకట్టుకుంది. తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్-గొంజాల్వెస్ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్‌లాండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్బాల్లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.On our photo of the day none other than team India! The duo who achieved a historical bronze medal!•#Teqball #WTCH24 #WorldChampionships #Vietnam pic.twitter.com/AGzzVv8sRI— TEQBALL (@Teqball) December 8, 2024టెక్బాల్ అంటే.. టెక్బాల్ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్డ్ (వంగిన) టేబుల్‌పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్‌బాల్ తరహా బంతిని వాడతారు. టెక్‌బాల్‌ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్‌గా ఆడవచ్చు. ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ నాని
పోర్చుగీస్ స్టార్ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా నా కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నాను.నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్‌స్టాగ్రామ్‌లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్‌ను ఆరంభించాడు. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్‌లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ సమయంలో మరో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీలక సహచరుడిగా నానికి పేరుంది. నాని తన వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్బోర్న్ విక్టరీ అదానా డెమిర్స్పోర్ల వంటి మొత్తం 10 క్లబ్‌ల తరపున ఆడాడు.నాని తన జాతీయ జట్టు పోర్చుగల్ తరపున 112 మ్యాచ్‌లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్షిప్ విజేత నిలిచిన పోర్చుగల్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు.చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్‌లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
57 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో సంతోష్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ రౌండ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్ 1967లో సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఫైనల్ రౌండ్ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్ సర్వీసెస్, రన్నరప్ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు డెక్కన్ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్‌లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతాయి. సెమీఫైనల్స్ డిసెంబర్ 29న, ఫైనల్ డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది. -
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్‌జెరెకోర్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
బ్రెజిలియన్ సాకర్ స్టార్ నెయ్మార్.. అదిరిపోయే లగ్జరీ పెంట్ హౌస్ (ఫోటోలు)
-
దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్‌లో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్‌లోని బుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ పెంట్‌హౌస్‌ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్‌తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్‌తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్‌తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్‌బాల్ సందడి (ఫొటోలు)
-
కొడుకు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
పిడుగుపాటుకు ఫుట్‌బాల్ ఆటగాడి మృతి.. వైరల్ వీడియో
ఫుట్‌బాల్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడి ఓ ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. రిఫరీ, మరో నలుగురు ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో గత ఆదివారం జరిగింది.వివరాల్లోకి వెళితే.. పెరూలోని హ్యూయాన్కాయోలో నవంబర్ 3వ తేదీన దేశీయ ఫుట్‌బాల్ క్లబ్‌లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి వర్షం మొదలుకావండతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ బాట పడుతుండగా.. 39 ఏళ్ల జోస్ హ్యూగో లా క్రూజ్ మెసాపై పిడుగు పడింది. In Peru, a soccer player died after being struck by lightning during a matchThe tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ— NEXTA (@nexta_tv) November 4, 2024పిడుగు నేరుగా హ్యూగోపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పిడుగు ప్రభావం సమీపంలో గల రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లపై పడటంతో వారు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఐదుగురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో ఇలాగే ఓ స్థానిక ఆటగాడిపై పిడుగు పడటంతో అతను కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. -
ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న రోడ్రి
స్పానిష్ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్ మాడ్రిడ్‌కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్తో పోటీ పడ్డారు. మాంచెస్టర్ సిటీ గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్ ఈ ఏడాది యూరో టైటిల్ గెలవడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇంగ్లీష్ క్లబ్ నుంచి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్ రోడ్రీనే. మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్‌బాలర్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్‌కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
జంషెడ్‌పూర్‌కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్‌బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్‌పూర్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడనుంది. -
12న భారత్, వియత్నాం ఫుట్‌బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్‌లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్‌కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లంతా 5న కోల్‌కతాలో కలుసుకుంటారు. హెడ్‌కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్‌కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. -
ప్రత్యర్థిని కొరికేశాడు
ప్రిస్టన్ (ఇంగ్లండ్): హోరాహోరీగా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి మెడ దగ్గర గట్టిగా కొరికేశాడు. అంతే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం (ఈఎఫ్ఏ) ఆగ్రహానికి గురయ్యాడు. నిషేధం, జరిమానా రెండు పడ్డాయి. ఇక వివరాల్లోకెళితే... ఇంగ్లండ్‌లో సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రిస్టన్, బ్లాక్బర్న్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరుగుతోంది. ప్రిస్టన్ ఆటగాడు మిలుటిన్ ఉస్మాజిక్ ఉన్నపళంగా తనను నిలువరిస్తున్న బ్లాక్బర్న్ డిఫెండర్ ఒవెన్ బెక్ మెడ వెనుక కొరికేశాడు. ఇంత జరిగినా... రిఫరీకి చెప్పినా ఉస్మాజిక్కు మాత్రం రెడ్‌కార్డ్ చూపలేదు. బయటికి పంపలేదు. గత నెల 22న ఈ మ్యాచ్ జరుగగా... అప్పీల్ తదుపరి విచారణ అనంతరం తాజాగా ఈఎఫ్ఏ ఉస్మాజిక్పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధం విధించడంతో పాటు 15 వేల పౌండ్లు (రూ.16.80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇలా కొరకడంలో ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఫుట్‌బాల్ అభిమానులకు చిరపరిచితుడు. 2013లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో బార్సిలోనా స్ట్రయికర్ స్వారెజ్... చెల్సియా డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవానోవిచ్‌ను కొరకడంతో ఏకంగా 10 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయినా అతని బుద్ధి మారలేదు. ఆ మరుసటి ఏడాది బ్రెజిల్లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ (2014)లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ జియోర్జియో చిలినిని కొరికాడు. దీంతో మళ్లీ నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. -
ఇండియన్ సూపర్ లీగ్.. జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జంషెడ్పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.కోల్‌కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్‌సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఇటలీ మేటి ఫుట్‌బాలర్ స్కిలాచీ కన్నుమూత
రోమ్: ఇటలీ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ సాల్వటోర్ స్కిలాచీ(Salvatore Schillaci) బుధవారం కన్నుమూశాడు. 59 ఏళ్ల స్కిలాచీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. స్వదేశంలో జరిగిన 1990 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్కిలాచీ 6 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలిచాడు. అదే విధంగా..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇటలీ మూడో స్థానం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. అయితే వ్యక్తిగత ప్రదర్శనతో ఇటలీ స్ట్రయికర్ స్కిలాచీ అభిమానుల్ని అలరించాడు.చదవండి: మాళవిక సంచలనం -
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్‌లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్‌తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్‌బాల్‌కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్‌లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్‌కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్‌బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
‘డ్రా’తో మొదలైన ఐఎస్ఎల్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌లు ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2–2 గోల్స్‌తో సమంగా ముగిసింది. ముంబై సిటీ తరఫున థేర్ క్రూమ్ 90వ నిమిషంలో గోల్ సాధించాడు. మోహన్ బగాన్ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్ 28వ నిమిషంలో గోల్స్ కొట్టారు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్ గోల్ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్ బగాన్ మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్‌ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్ఎల్లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భువనేశ్వర్‌లో ఒడిషా ఎఫ్‌సీతో చెన్నైయిన్ ఎఫ్‌సీ... బెంగళూరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడతాయి. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైదానంలోనే కాదు ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్లో 900 గోల్‌లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.సోషల్ మీడియా కింగ్..రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్‌మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్‌బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్‌లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను పొందాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో ఈ ఫుట్‌బాల్ స్టార్‌ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు... We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024 -
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్‌కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్‌కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్‌బాల్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్‌కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
#Football : హైదరాబాద్ లో ఫుట్‌బాల్ కిక్ మొదలైంది (ఫొటోలు)
-
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్‌బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్