Free sand policy
-
ఎమ్మెల్యేలకు ముడుపులు.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల దందా
తూర్పుగోదావరి జిల్లా : పేరుకే ఉచిత ఇసుక విధానం. కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేశ్చగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు.బాట ఛార్జీల పేరుతో లారీకి రూ.2,500వరకు వసూలు చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంప్‌లో తన అనుచరులతో దగ్గరుండి వసూలు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి.. మొత్తంలో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్‌గా మారాయి. -
జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. బాబు సర్కార్‌పై ట్రాక్టర్ డ్రైవర్లు సీరియస్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరు కారణంగా ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు.ఇదే సమయంలో ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించాలంటూ ప్రభుత్వాన్ని డ్రైవర్లు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రహదారిని దిగ్బంధం చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డ్రైవర్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’ -
వచ్చేనెల 11 నుంచి ఉచిత ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని వచ్చేనెల 11 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు.. దీని బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 18005994599, ఈ మెయిల్ dmgapsandcomplaints@yahoo.comను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇసుక విధానంపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఇసుక రవాణ ఛార్జీలను నిర్ణయించి ఆ వివరాలను ప్రజలకు తెలిసేలా చేయాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్లు రోజూ నివేదికలివ్వాలి..ఇక ఉచిత ఇసుక సరఫరాపై ప్రతిరోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని, అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడిచేసే బాధ్యత వారిదేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని, స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలన్నారు. బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా చూడాలని.. వాటి తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.వెంటనే మార్గదర్శకాలు జారీ : సీఎస్ ఇక నూతన ఇసుక విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే జారీచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సీఎం సమీక్షకు ముందు ఆయన జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, అంతకుమించి విక్రయించినట్లు ఫిర్యాదులొస్తే సహించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అంతేగాక.. ఆన్లైన్లో బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన ఏ సమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలన్నారు.ఇసుక వాహనాలకు ప్రత్యేక నెంబరు..గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. గురువారం జిల్లాల్లోని ట్రాన్సుపోర్టర్లు అందరినీ పిలిచి ఇసుక రవాణాకు వినియోగించే వాహనాలకు ఒక ప్రత్యేక యూనిక్ నంబరును కేటాయించాలని చెప్పారు. ఆ వాహనాలు మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగించాలని స్పష్టంచేశారు. అలాగే, ప్రతి రీచ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటుచేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఇసుక విధానానికి జేసీని కంట్రోలింగ్ అధికారిగా నియమించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ వంటివి ఎక్కడ జరిగినా అందుకు ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముకేశ్‌కుమార్ మీనా స్పష్టంచేశారు. -
ఇసుకలాంటి దందా చేస్తున్న రాజేష్
-
ఉచిత ఇసుక.. టన్ను కేవలం రూ. 1394
-
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొత్త ఇసుక విధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 40 పేరిట.. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2024 ఇసుక విధానం రూపకల్పన జరగాల్సిన ఉందని చెబుతూ.. అప్పటిదాకా కలెక్టర్లకు ఇచ్చిన ఈ అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఎస్పీ, జేసీ, పలువురు శాఖల అధికారులు కమిటీలుగా నియమించింది. అయితే భవన నిర్మాణాలు మినహా మరేయితర అవసరాలకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు. అయితే వీటిని కమిటీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం తాజా జీవోలో తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానంపై త్వరలో ఉత్తర్వులు జారీ కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
జేబులు నింపుకుంది చాలు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదులకు గర్భశోకం ఆపేలా నిర్ణయం వెలువడింది. తీరాల్లో జరుగుతున్న విధ్వంస రచనకు చరమ గీతం పాడేలా ఆదేశాలు వచ్చాయి. ఉచితం ముసుగులో జరిగిన అనుచితమైన పనులు ఆగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్నాళ్లూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపుకోవడానికి వరంగా ఉన్న ‘ఉచిత ఇసుక’ విధానం రద్దయ్యింది. ఖజానాకొచ్చే ఆదాయానికి గండి కొట్టి పార్టీ నాయకుల కడుపులు నిం పడానికి గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇక చెల్లదు. నదుల వద్ద ఇసుక రీచ్‌ల కేటాయింపులూ ఉండవు. గత సర్కారు చేసిన తప్పిదాలను సరిదిద్ది ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో నూతన ఇసుక విధానం తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. జూలై ఒకటో తేదీలోగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. అప్పటివరకూ జిల్లాలో ఎక్కడ ఇసుక లారీ కనిపించినా అధికారులదే బాధ్యత. అక్రమ రవాణా బాధ్యులపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించనున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... ఇలా నది ఏదైనా మాఫియా ఇసుక దోపిడీకి నిలయమైపోయాయి. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అనుసరించిన రకరకాల విధానాల్లో లొసుగులు మాఫియాకు వరంగా మారాయి. ఆ అక్రమార్కులు, టీడీపీ నాయకులు చేతులు కలిపి ఇసుక ద్వారా గత ఐదేళ్లలో దోచుకున్నది సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని ఓ అంచనా. నదుల జిల్లాగా పేర్కొందిన సిక్కోలులో ఎప్పుడూ ఐదు నుంచి పది ర్యాం పులకు మాత్రమే పర్యావరణ అనుమతులతో పాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు అనేకంగా ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయినర్లతో ఛిద్రం చేస్తున్నారు. టీడీపీ హయాంలో గందరగోళం.. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్లైన్లో చలానా చెల్లించి, రశీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్ చేసేవారు. ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలుకాలేదు సరికదా మరోవైపు ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే. ‘ఉచితం’ ముసుగులో దోపిడీ.. టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016, ఏప్రిల్ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవ్వరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవ్వరైనా దాన్నో వ్యాపారంగా మా ర్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్ని విధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నా యి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. వంతెనలకు, ఇరిగేషన్ పం పులు, వాటర్ ఫిల్టర్ సంపులకు కనీసం 500 మీట ర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు. ముఖ్యంగా ఇసుకరీచ్ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నది లో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌లవద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ ► టీడీపీ సర్కారు ‘ఉచిత ఇసుక’ విధానం రద్దు ► నెలాఖరు వరకూ ఇసుక రవాణా నిలిపివేత ►నదుల వద్ద రీచ్‌ల కేటాయింపులు బంద్ ► అక్రమ రవాణా ఆపకపోతే అధికారులపై చర్యలు ► మాఫియా వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగం ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఖజానా ఆదాయానికి గండికొట్టి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. నెలాఖరు వరకూ రవాణా బంద్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను అరికట్టి, ప్రజలకు ఇసుక కష్టాలను తప్పించేలా నూతన విధానం తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తలపోస్తోంది. ఇందు కు సంబంధించిన విధివిధానాలు రూపొందిం చేవరకూ జిల్లాలో ఇసుక రవాణా నిలిపేయనున్నారు. అంతేకాదు నదికి ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుక మేటల తవ్వకాలనూ నిలిపేయాల్సిందే. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోలేకపోతే అందుకు అధికారులే బాధ్యులవుతారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదేశాలు అందాయి.. ఇసుక తవ్వకాలకు సంబంధించిన కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ రవాణాను నిలిపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఉచిత ఇసుక విధానం రద్దు అయ్యింది. కొత్త విధానం వచ్చేవరకూ రీచ్‌ల కేటాయింపు ఉండదు. ఎవ్వరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కేసులు పెడతాం. – ఆర్.తమ్మునాయుడు, ఇన్చార్జ్ ఏడీ, జిల్లా గనుల శాఖ -
వెయ్యి కోట్లు... వెనకేశారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదుల జిల్లాగా పేరొందిన సిక్కోలులో ఐదు నుంచి పది ర్యాంపులకు మాత్రమే పర్యావరణ అనుమతులతోపాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఉన్నాయి. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయిన్లతో ఛిద్రం చేస్తున్నారు. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్లైన్లో చలానా చెల్లించి, రసీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్ చేసేవారు. ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలు కాలేదు. సరికదా మరోవైపు ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవననిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే. నేరుగా జేబుల్లోకి మళ్లించేందుకే... టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016 ఏప్రిల్ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవరైనా దాన్నో వ్యాపారంగా మార్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్నివిధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖకు తరలించి అక్రమ సంపాదన... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరైజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. జేబులు నింపుకోవడానికి... టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా సాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. కానీ అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగిస్తోంది. ♦ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. ♦ వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు కనీసం 500 మీటర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కా నీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు. ♦నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు. ♦ ముఖ్యంగా ఇసుక రీచ్ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నదిలో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ♦ ఇసుక డిమాండును బట్టి రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. బాహాటంగానే సంబంధాలు... ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న నాగావళి, వంశధార నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువులు, అనుచరగణం పాత్రపై అనేక విమర్శలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడి అనుచరులు ఉన్నారు. కల్లేపల్లి, భైరి ర్యాంపుల్లో మాఫియాతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచర గణానికి భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరుల వసూళ్లు భారీగానే సాగుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో మాతల వద్ద ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాత్ర ఏమిటో బహిరంగ రహస్యమే. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నాయకుల మధ్యే కోల్డ్‌వార్ సాగిన సంగతీ తెలిసిందే! -
పేరుకు ఉచితం.. దోపిడీ యథాతథం
అధికారపార్టీ అనుచరుల గుప్పెట్లో ఇసుక రీచ్‌లు నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలింపు శాఖల మధ్య సమన్వలోపం నర్సీపట్నం: ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఇక అందరికీ ఇసుక లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని అధికారపార్టీ అనుచరులు ఇసుక రీచ్‌లను వారి గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు రద్దు చేసిన రీచ్‌ల్లో కూడా అధికార బలంతో తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక రీచ్‌ల వలన సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఎప్పట్లాగే ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేలు పెట్టి ఇసుక కొనుగోలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖలు ఎవరికి వారే యమునాతీరే చందంగా వ్యవహరిస్తుండడంతో ట్రాక్టర్లలో ఇసుక తరలించే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పాలసీ మారినా..: కొద్దికాలం క్రితం వరకు ఇసుక కష్టాలు అందరినీ వెంటాడాయి. వేలకు వేలు వచ్చించి రోజల తరబడి వేచి చూస్తేగాని లభించడం గగనంగా మారింది. డ్వాక్రా సంఘాల పేరిట కొందరు ఇసుక అమ్మకాలతో భారీగా వెనకేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చని అదేశాలిచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్‌ల్లోనే తవ్వకాలు చేయాలని పేర్కొంది. దీంతో ఇసుక లభించడం సులభతరమైనా సామాన్యులు మాత్రం సొమ్ము వెచ్చించక తప్పడం లేదు. ట్రాక్టర్ల యజమానులు సమీపంలో రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక త వ్వి తరలిస్తున్నారు. మూసేసిన రీచ్‌లోనూ తవ్వకాలు : రెవెన్యూ విడిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట ఇసుక రీచ్, కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివేడ, చౌడువాడ, కైలాసపట్నం, గొలుగొండ మండలం తాండవ జలాశయం పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చే సమయానికి నారాయణరాజుపేట ఇసుక రీచ్ ఖాళీ అయింది. పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నారాయణరాజుపేట రీచ్ అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ అధికార పలుకుబడితో కొందరు నేటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మిగిలిన కీలకమైన రీచ్‌ల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. రీచ్‌లో నిత్యం వందలాది ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. ఆయా రీచ్‌ల్లో ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపేస్తున్నారు. రీచ్‌లోకి ట్రాక్టర్ ప్రవేశించగానే ఎక్కడ ఇసుక ఉంటే అక్కడే తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు మించి ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. అయినా సరే ఏవీ పట్టించుకోవడం లేదు. రీచ్‌లకు ఏర్పాటు చేసిన హద్దులను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుకపై అటు గనులశాఖ, ఇటు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోవటం లేదు. రీచ్‌ల్లో తవ్వకాలను పర్యవేక్షించటం లేదు. రహదారులపై వెళ్లే వాహనాలను మాత్రమే ఆపి విచారించి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అనుమతి లేకుండా తవ్వితే చర్యలు.. ఆర్డీవో ఈ విషయమై ఆర్డీవో కె.సూర్యారావును వివరణ కోరగా అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
దోచేయ్.. దాచేయ్!
* ఉచితం మాటున ఇసుక అక్రమ వ్యాపారం * అనధికార రీచ్ ల నుంచి యథేచ్ఛగా తరలింపు * నిబంధనలకు విరుద్ధంగా తోటల్లో డంపింగ్ * సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకొంటున్న ‘తమ్ముళ్లు’ * పర్యవేక్షణ మరచి, చోద్యం చూస్తున్న అధికారులు ఉలవపాడు: తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు డంప్‌లుగా వెలుగొందుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు వనగూరే ప్రయోజనం మాటెలా ఉన్నా ఆపార్టీ శ్రేణులకు మాత్రం వరంలా మారింది. వారికి నిబంధనలు పట్టవు.. రవాణాకు పగలు, రాత్రి అనే బేధం లేదు.. అధికారులు పర్యవేక్షణ ఉంటుందనే భయం అసలే లేదు.. వారికి నచ్చిన రీచ్‌ల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించి, తోటల్లో రహస్యంగా డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లతో వివిధ జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా తెలిసికూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. మన్నేరు నుంచి యథేచ్చగా తరలింపు.. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో నిర్ణయించిన రీచ్‌ల నుంచే అవసరమైన వారు ఇసుక తెచ్చుకోవాలి. డంప్ చేయకూడదు. రాత్రి వేళల్లో ఇసుక తరలించకూడనే నిబంధన ఉంది. కానీ, ఇసుకాసురులకు ఈ నిబంధనలు పట్టడం లేదు. ఉలవపాడు మండల పరిధిలో ప్రభుత్వం అనుమతిచ్చిన చినిగేవారిపాలెం రీచ్ నుంచే కాక మన్నేరులోని అన్ని రీచ్‌ల నుంచి రాత్రివేళల్లో సైతం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కొల్లూరుపాడు- ఆత్మకూరు మధ్య బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో, భీమవరం, కుమ్మరిపాలెం, మన్నేటికోట నుంచి ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులందరూ వీరి చేతుల్లోనే ఉండటంతో ఇసుక అవసరమైన సామాన్య ప్రజలు వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది. తోటల్లో రహస్య డంప్‌లు... ఉలవపాడు మండల పరిధిలోని నాయకులు పలు చోట్ల ఇష్టానుసారంగా ఇసుక డంప్ చేస్తున్నారు. ఇసుకను అవసరానికి మాత్రమే తీసుకెళ్లాలని తెలిసినా నాయకులు మాత్రం తోటల్లో కూడా రహస్యంగా డంపింగ్ చేస్తున్నారు. కృష్ణాపురం-భీమవరం సరిహద్దులోని తోటల్లో రోజూ రాత్రి వేళ భారీగా డంప్ చేయడం అక్కడ నుంచి వివిధ జిల్లాలకు టిప్పర్ల ద్వారా ఎగుమతులు చేస్తున్నారు. ఇవికాక ఉలవపాడు, కొల్లూరుపాడు, ఆత్మకూరు, మన్నేటికోట రెవెన్యూ పరిధిలో కూడా ఇసుక డంప్‌లు ఏర్పాటుచేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని వలన మండల పరిధిలో ఇసుక తగ్గిపోయి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారని ఇటీవల రీచ్‌కి వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇకనైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు. -
పెదపులిపాక ఇసుక క్వారీలో నిలిచిన ఇసుక రవాణా
► కోర్టు ఉత్తర్వులకు తలొగ్గిన అధికారులు ► ఇంకా క్వారీలోనే యంత్రాలు! పెదపులిపాక (పెనమలూరు): పెదపులిపాక ఇసుక క్వారీలో ఇసుక రవాణాకు ఆదివారం నుంచి ఎట్టకేలకు తెరపడింది. ఈ క్వారీలో ఇసుక తవ్వకాలు చేయరాదని హైకోర్టు గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేత పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి శనివారం వరకు ఇసుక లోడింగ్ చేయిం చారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి శనివారం ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సాక్షిలో కథనం రావడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు స్పందించి ఇసుక రవాణాను నిలుపుదల చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయటంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. అలాగే దాదాపు 2 వేలమంది కూలీలకు కూడా ఉపాధి దొరికింది. అయితే టీడీపీ నేత తన పొక్లయినర్లు ఇసుక క్వారీలోకి దించి లోడింగ్ చేపట్టాడు. దీనిని పెదపులిపాక గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ నేత వైఖరిలో మార్పురాలేదు. టీడీపీ నేత దందాపై హైకోర్టునాశ్రయించారు. కోర్టు పూర్వాపరాలు విచారణ చేసి స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ క్వారీ విషయంలో పోలీసులు టీడీపీ నేతలకు అండగా అత్యుత్సాహం చూపడం విమర్శలకు దారి తీసింది. ఆదాయానికి గండి ఇసుక క్వారీలో లోడింగ్ ఆగిపోవడంతో టీడీపీ నేత ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ నేతకు లోడింగ్ పుణ్యమాని రోజుకు రూ.2 లక్షలు ఆదాయం వచ్చేది. అయితే నేత అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసింది. మొత్తం మీద క్వారీ నిలుపుదల చేయటంతో గ్రామస్తులు మాత్రం ఆనందంగా ఉన్నారు. టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పామని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే క్వారీలో ఇంకా టీడీపీ నేతకు సంబంధించిన యంత్రాలు అక్కడే ఉన్నాయి. వాటిని వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బతుకులు.. కూలుతున్నాయ్!
► ఉచిత ఇసుక పాలసీతో ఎడా పెడా తవ్వకాలు ► ప్రమాదకర సొరంగాల్లో తోడేస్తున్న వైనం ► ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆరుగురి కూలీల మృతి ► బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో మరో ఇద్దరు జలసమాధి పలమనేరు : ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసినప్పటి నుంచి ఆ తవ్వకాలు ఊపందుకున్నాయి. కూలీలకు విఫరీతమైన డిమాండ్ ఏర్పడింది. అధిక మొత్తంలో కూలీ డబ్బులిస్తామని ట్రాక్టరు యజమానులు ఆశచూపుతున్నారు. ప్రమాదకర సొరంగాల్లో పనులు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక దిన్నె లు మీదపడి పలువురు కూలీలు మృత్యువాతపడుతున్నారు. ఇప్పటికే పలమనేరు ప్రాం తంలో ఆరుగురు మృతిచెందారు. బుధవా రం బెరైడ్డిపల్లె సమీపంలోని పెద్ద చెరువులో ఇద్దరు కూలీలు జలసమాధి అయ్యారు. ఎటు చూసినా ఇసుక త వ్వకాలే... పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య నదితో పాటు పలు చెరువుల్లో ప్రస్తుతం భారీగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. కొత్త విధానంతో వాహనాలను ఉపయోగించరాదు కాబట్టి కూలీలకు డిమాండ్ ఏర్పడింది. నాణ్యత కల్గిన ఇసుక కోసం వీరు 15 అడుగుల దాకా అత్యంత ప్రమాదకరంగా సొరంగాలు తవ్వి మరీ ఇసుక తోడేస్తున్నారు. నియోజకవర్గంలోని నాగమంగళం, రామాపురం, బొమ్మిదొడ్డి, గంగవరం మండలంలోని కౌండిన్యనది, పంజాణి మండల సరిహద్దులోని పలు చెరువులు, బెరైడ్డిపల్లె మండలలోని చెరువులు, వీకోట మండలంలోని పాలేరు నదుల్లో కూలీలు సొరంగాల్లా తవ్వి ప్రమాదకర పరిస్థితుల్లో ఇసుకను తోడుతున్నారు. మూడు పూటలా భోజనం, రూ.500 కూలీ ఇసుక తవ్వే కూలీలకు మూడు పూటలా భోజనం పెట్టి రూ.500 దాకా ఇస్తున్నారు. అధిక కూలీలకు ఆశ పడిన కూలీలు ఈ ప్రమాదకర పనులను చేస్తున్నారు. ఈ మధ్యనే బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో రాత్రి పూట ఇసుకను తోడుతూ ఓ యువకుడు ఇసుక దిన్నె కింది పడి మునిగిపోయాడు. అయితే అక్కడున్న ఇతర కూలీలు అతన్ని కాళ్లుపట్టి వెంటనే లాగేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రభుత్వ ఆదేశాలు గాలికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు మీటర్ల కంటే లోతు ఇసుక తవ్వరాదు. కానీ ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. చెరువులు, వాగులు, వంకల్లో ఇసుకను తోడుతుంటే ఎంత లోతు తవ్వారు, పనులు ఎలా చేస్తున్నారని పర్యవేక్షించేవారే లేకుండా పోయారు. దీనిపై ఏ శాఖకు పర్యవేక్షణ ఉందో కూడా తెలియదు. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రతి మండలంలోనూ కొన్ని రీచ్‌లను గుర్తించి వాటి నుంచే ఇసుకను తోడాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటి నుంచి కాకుం డా అక్రమార్కులు కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు, రైతుల సెటిల్మెంటు భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తోడుతున్నారు. ఉన్నట్టుండి కూలిపోతాయి ముఖ్యంగా చెరువుల్లో ఇసుక తోడడం చాలా ప్రమాదకరం. మొదట చెరువులోని బంకమట్టిని తొలగిం చాలి. ఆపై లోతుగా సొరంగాలు తవ్వుకుంటూ వెళ్లాలి. ఇలాంటి సమయంలో పై నున్న ఇసుక దానిపై ఉండే బరువైన మట్టి కారణంగా ఇసుక దిన్నెలు సెకన్ల వ్యవధిలో జారిపోతాయి. దీంతో కింద ఉండే కూలీలు అక్కడే సమాధి కావాల్సిందే. కనీసం తప్పించుకోవడానికీ సమయం ఉండదు. బుధవారం బెరైడ్డిపల్లె పెద్ద చెరువులో జరిగిన ప్రమాదం కూడా ఇలాగే సంభవించింది. -
తమ్మిలేరుపై రాబందులు..
► మళ్లీ చెలరేగిన ఇసుక మాఫియా అడ్డుకున్న గ్రామస్తులు ► పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం ఎల్లాపురం(ముసునూరు) : తమ్మిలేరును దోచుకునేందుకు ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య వివాదంగా చూపి సొమ్ము చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వర్తించవంటూ బుకాయించే ప్రయత్నించారు. కాని వారి కుట్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో తవ్వకాలను నిలిపివేశారు. వివరాలు.. తమ్మిలేరు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్యలో ఉంది. కృష్ణా జిల్లాలో తమ్మిలేరులో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇటీవల నూజివీడు సబ్‌కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. కొందరు అనుమతి ఇచ్చినట్లు ప్రకటన చేస్తున్నారని వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పరిధిలో తవ్వకాలను నిలిపివేశారు. డొంకదారిలో ఇసుక మాఫియా కృష్ణాజిల్లా పరిధిలో అనుమతులు లేకపోవడంతో ఇసుక తరలింపు సాధ్యం కావడం లేదు. దీంతో పశ్చిమ గోదావరి పరిధిలో అనుమతులు ఉన్నాయంటూ తమ్మిలేరు మధ్యలోకి వచ్చి బుధవారం తవ్వకాలు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. మాఫియాకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనుమతి పత్రాలు చూపాలంటూ నిలదీశారు. 11 ట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు సాగించేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు పట్టువిడవకుండా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తవ్వకాలను నిలిపివేశారు. అంతటితో వివాదానికి తెరపడింది. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
► అనధికారిక సీనరేజీ వసూలు యథాతథం ► నిరుపయోగంగా పోలీస్ చెక్‌పోస్టులు ► తెలంగాణకు తరలిపోతున్న ఇసుక తిరువూరు : ఇసుక ఉచితంగా తోలుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా తిరువూరు మండలంలో ప్రజల నుంచి కొందరు సిం డికేట్లు ముక్కుపిండి మరీ డబ్బులు దం డుకుంటున్నారు. గానుగపాడు, చింతల పాడు వాగుల్లో ఇంకా మిగిలిన కొద్దిపాటి ఇసుకను రోజుకు 50 నుంచి 60 ట్రక్కుల లో నింపి తెలంగాణాకు తరలిస్తున్నారు. స్థానికులు ఇళ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క ట్రాక్టరుకు రూ.300 చొప్పున సీనరేజీ వసూలు చేస్తున్నారు. దొడ్డిదారిన అక్రమ రవాణా చింతలపాడు నుంచి ముష్టికుంట్ల, వామకుంట్ల మీదుగా ఎన్ఎస్పీ కాలువ కట్టపై వెంకటేశ్వరనగర్ చేరుతున్న ఇసుక ట్రా క్టర్లు ఖమ్మం జిల్లాలోని ఎర్రబోయినపల్లి మీదుగా కల్లూరు వెళుతున్నాయి. ఈ మా ర్గంలో ఎక్కడా పోలీసు చెక్‌పోస్టు లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే అవకాశంలేదు. పోలీసులు తిరువూరు బై పాస్‌రోడ్డు, రాజుపేట, అక్కపాలెం, వేమిరెడ్డిపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వైపునకు వెళ్లకుండా దొడ్డిదారిలో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో చెక్‌పోస్టులు నిరుపయోగంగా మారాయి. గ్రామ కమిటీల పేరుతో వసూలు ఇసుక ఉచితంగా తెచ్చుకునే వారి నుంచి గ్రామ కమిటీల పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. దేవాలయాల అభివృద్ధి, గ్రామంలో కొత్త దేవాలయాల నిర్మాణం పేరు చెబుతూ కొందరు డబ్బు వసూలు చేస్తుండగా, తమ పొలం సమీపం నుంచి ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నందున డబ్బులు ఇవ్వాలని పెద్ద రైతులు డిమాండ్ చేస్తున్నారు. చింతలపాడు, గానుగపాడు, వామకుంట్ల గ్రామాల్లో నిత్యం వేలాది రూపాయలు అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
ఉచితం ముసుగులో అక్రమాలు
► ఇసుక తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్సీ డీవీ ► విచారణ జరపాలని డిమాండ్ కైలాసపట్నం (కోటవురట్ల): ఉచిత ఇసుక ముసుగులో అక్రమాలకు తెగబడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కైలాసపట్నంలోని వరాహనదిలో ఇసుక రీచ్‌లో తవ్వకాలను శనివారం రైతుల ఆధ్వర్యంలో ఆయన అడ్డుకున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు సునీలారాణికి తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. అనుమతులకు మించి ఇసుకను అక్రమంగా పట్టుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. మైనింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖలతో విచారణ జరిపి ఇప్పటివరకు ఎంత ఇసుక పట్టుకెళ్లారో తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తవ్వకాలను జరగనీయమని స్పష్టం చేశారు. రైతాంగానికి ఇంత నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు అప్పగించి చూస్తోందని విమర్శించారు. 14,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించాల్సి ఉండగా ఇప్పటి వరకు జరిపిన తవ్వకాల్లో అంతకు మించి పట్టుకెళ్లారని ఆరోపించారు. ఉచిత ఇసుకను నర్సీపట్నానికి చెందిన ఓ వ్యక్తి కైలాసపట్నంలో డంపింగ్ చేసుకుని నిబంధనలను అతిక్రమిస్తున్నారని మాజీ సర్పంచ్ సిద్దాబత్తుల నాగేశ్వర్రావు ఆరోపించారు. మున్సిపాలిటీకి తరలిస్తున్నామని సాకు చూపుతూ కైలాసపట్నంలో డంపింగ్ చేసి విక్రయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజుపేటకు చెందిన ప్రసాద్ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి నది ఒడ్డును ఆనుకుని మీటరు లోతుకు మించి తవ్వకాలు జరుపుతునఔన్నందున రైతుల పంట భూములకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తహసీల్దార్ సునీలారాణి మాట్లాడుతూ ఎయిర్‌పోర్టుకు 4 వేల క్యూబిక్ మీటర్లు, నర్సీపట్నం మున్సిపాలిటీకి 900 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఆర్డీవో అనుమతులు ఇచ్చారన్నారు. ఎయిర్‌పోర్టుకు చెందిన వాహనాలు నదిలోకి వెళ్లే పరిస్థితి లేనందున నదికి సమీపంలో డంపింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి డంపింగ్ చేయడానికి అనుమతులు లేవని అలా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
ఇసుక.. మస్కా
► ఉచిత విధానంతో విచ్చలవిడిగా వెలుస్తున్న డంప్‌లు ► అందినకాడికి దోచేసుకుంటున్న ► అధికార పార్టీ నేతలు, రియల్టర్లు ► సాధారణ ప్రజలకు దొరికేది కష్టమే ► పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కర్నూలు : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా అధికార పార్టీ నేతలు.. రియల్టర్లు ఉచిత ఇసుకను దోచేసుకుంటున్నారు వందల కొద్దీ ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీ స్థాయిలో ట్రాక్టర్లను రంగంలోకి దించి దర్జాగా ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకే సరిపోతాయనే అంచనాలు సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. డంప్‌లే.. డంపులు ఏ రోజు అవసరాలకు ఆ రోజే ఇసుకను సరఫరా చేసుకోవాలని అలా కాకుండా అక్రమంగా నిల్వ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థల వారు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేస్తోంది. ఇప్పటికే ఆలూరు సమీపంలో ఒక ప్రైవేట్ పవన విద్యుత్ ప్లాంట్‌తో పాటు మంత్రాలయంలో శ్రీమఠం అధికారులు ఇసుకను భారీ స్థాయిలో డంపు చేసినట్టు ఆధారాలతో సహా ‘సాక్షి’ బయటపెట్టింది. అలాగే చాలాచోట్ల అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా ఇసుకను డంప్ చేసినట్లు తెలుస్తోంది. వందల ట్రాక్టర్ల ఇసుకను రాత్రనక... పగలనక తవ్వుకుంటూ డంప్ చేస్తున్నారు. కంటి చూపు మేరలో ఇసుక డంప్‌లు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు చూసేందుకు సాహసించడం లేదు. ఉన్న కొద్దిపాటీ ఇసుక నిల్వలను ఈ విధంగా డంప్ చేసుకుంటూ పోతే మరికొద్ది రోజుల్లో సాధారణ ప్రజలకు ఇంటి నిర్మాణానికి కూడా ఇసుక లభించే పరిస్థితి లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 9 నెలలకే ఖలాస్ జిల్లాలో మొత్తం నాలుగు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇందులో కర్నూలు మండలంలోని ఆర్. కొంతలపాడు, పుడూరు, నందవరం మండలంలోని గురజాలతో పాటు పత్తికొండ నియోజకవర్గంలో కనకలదిన్నెలో రీచ్‌లు ఉన్నాయి. ఈ నాలుగు రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు కేవలం 3 లక్షల క్యూబిక్‌మీటర్లు మాత్రమే. గతంలో రాయల్టీ విధానం అమలులో ఉన్న సమయంలోనే ఏడాది కాలంలోనే ఏకంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను జిల్లా ప్రజలు కొనుగోలు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకు మించి సరిపోయే అవకాశం లేదు. ఆ తర్వాత జిల్లాలో ఇసుక దొరికే అవకాశమే లేదనే అభిప్రాయం నెలకొంది. కొత్త రీచ్‌లకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించడం లేదు. దీంతో ఈ రీచ్‌లల్లో ఇసుకను తవ్వేందుకు అవకాశం లభించడం లేదు. ఇక ఇతర ప్రాంతాల్లో మరికొన్ని కొత్త రీచ్‌లకు అనుమతి ఇచ్చేందుకు స్థానికం భూగర్భ జలవనరులశాఖ అధికారులు అంగీకరించడం లేదు. అలాచేస్తే భూగర్భ నీటి నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి తరిగిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు. -
‘ఉచితం’తో ఆదాయం గోవిందా..
ప్రత్యామ్నాయం కోరుతున్న పంచాయతీలు ఆత్మకూరురూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో తెలుగుతమ్ముళ్లు అందిన కాడికి ఇసుకను దోచుకొని అమ్ముకున్నారు. గతంలో ఉన్న ఇసుక పాలసీతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారిన క్రమంలో ‘ఉచితం’ అంటూ తాయిలం చూపి ప్రజలను మభ్య పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మేరకు సీనరేజ్ ఆదాయం కోల్పోతున్నామని పలు పంచాయతీ పాలకవర్గా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లు నిర్మించుకునే వారు ఇసుకను ఉచి తంగా తరలించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సంతోషం కలుగుతున్నా ఇదే అదునుగా పలువురు అధికారపార్టీ నేతలు ఇసుకను దోచుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉచితం మాటున ఓ వైపు ఇసుకను డంప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం ఇసుక రీచ్ నుంచి ఉచితంగా ఇసుకను తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 19 రీచ్‌లకు అనుమతి వసూలు చేసే మొత్తంలో పంచాయతీలకు క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సీనరేజ్ కింద ప్రభుత్వం ఆయా పంచాయతీ ఖాతాల్లో గతంలో జమ చేసేది. జిల్లాలో 19 ఇసుక రీచ్‌లను ఉచితానికి అనుమతిచ్చింది. అప్పారావుపాళెం, గొల్లకందుకూరు, సజ్జాపురం, జమ్మిపాళెం, పడమటి కంభంపాడు, లింగంగుంట, మాముడూరు, మినగల్లు, ముదివర్తిపాళెం, పల్లిపాడు, పడమటిపాళెం, సూరాయపాళెం, పొట్టేపాళెం తదితర రీచ్‌లలో ఇసుకను ఉచితంగా పొందేందుకు అనుమతి ఉంది. దీంతో ఉచితం అవకాశంగా పలువురు ఇసుక కొల్లగొడుతున్నారు. ప్రత్యామ్నాయ నిధులు మంజూరు చేయాలి ఇసుకను ఉచితంగా తరలిస్తుండడంతో సీనరేజ్ ఆదాయం కోల్పోతున్న పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా నిధులు మంజూరు చేయాలని ఆయా పంచాయతీ పాలక వర్గాలు కోరుతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీల ఆదాయం సీనరేజ్ కోల్పోతుండడంతో వాటి పరిస్థితి ఆర్థికంగా చతికిల పడ్డట్టు అయింది. గతంలో పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైతే కొంత సీనరేజ్ సొమ్ము ఖాతాల్లో ఉండడంతో సర్పంచ్‌లు పనులు చేయించేవారు. ప్రస్తుతం ఆదాయం కోల్పోవడంతో ప్రతి పనికీ ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఇలా ఇసుక రీచ్‌లున్న పంచాయతీల ఆదాయానికి గండి పడే రీతిలో ప్రకటన చేయడంతో వాటి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఉచితం ప్రకటించిన రీచ్‌ల పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా అదనపు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. పంచాయతీలు ఆదాయం కోల్పోవడం వాస్తవం : పంచాయతీలకు సీనరేజ్ లేకపోవడంతో ఆదాయం కోల్పోతున్న విషయం వాస్తవమే. ఈ నెల 16,17 తేదీల్లో కలెక్టర్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో పెంచలకోనలో సమావేశం జరగనుంది. ప్రస్తుతం శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సమావేశంలో అధికారుల దృష్టికి తెస్తాం. పరిష్కారానికి అక్కడ అధికారులు చర్యలు చేపడతారు. - నిర్మలాదేవి, ఎంపీడీఓ -
ఉచితం మేటలేస్తోంది!
► ఇసుక పాలసీ అపహాస్యం ► ఓ ప్రైవేట్ కంపెనీ ఇష్టారాజ్యం ► గుట్టలుగా ఇసుక డంప్ ► సరఫరా బాధ్యత అధికార పార్టీ నేతకు.. ► వాగులు, వంకలన్నీ ఖాళీ ► నోరు మెదపని అధికారులు ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. అవసరానికి మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. అంతకు మించి డంప్ చేస్తే సొంత పార్టీ వారున్నా వదిలిపెట్టొదు. జిల్లాలో ఏం జరుగుతోందంటే.. కళ్లెదుటే గుట్టలుగా ఇసుక మేటలు. అయినా అధికారుల మౌనం. ఎందుకంటే ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం కావడమే. ►ఆస్పరి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ ఆవరణలో ఇసుక దిబ్బ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత ఇసుక పాలసీ అపహాస్యమవుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి హెచ్చరించినా తమ్ముళ్లు పెడచెవిన పెడుతున్నారు. రీచ్‌ల్లో పెత్తనం చెలాయిస్తూ దోపిడీకి తెరతీస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక డంప్ చేస్తూ దోచుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరికి సమీపంలో పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న ఒక ప్రైవేటు కంపెనీ గుట్టలు గుట్టలుగా ఇసుకను డంప్ చేస్తోంది. ఈ ప్లాంటుకు ఇసుకను సరఫరా చేస్తోంది అధికారపార్టీ నేత కావడంతో అధికారులు కూడా కిమ్మనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రైవేటు కంపెనీ చేస్తున్న వ్యవహారంతో చుట్టుపక్కల వాగులు, వంకలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇది అంతిమంగా భూగర్భజలాలు ఇంకిపోయి సమీపంలోని గ్రామాల్లో తాగునీటి సమస్యకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వాగులు, వంకలు ఖాళీ వాస్తవానికి ఆస్పరికి సమీపంలో ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఇసుక రీచ్‌లు లేవు. గతంలో హొళగుంద వద్ద అధికారిక ఇసుక రీచ్ ఉండేది. అయితే, ఇది కూడా తాజాగా రద్దయింది. జిల్లాలో ప్రస్తుతం నాలుగు ఇసుక రీచ్‌లు మాత్రమే అధికారికంగా నడుస్తున్నాయి. అవి.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గురజాల, కర్నూలు మండలంలోని ఆర్.కొంతలపాడు, దేవమాడ-పడిదెంపాడు, పత్తికొండ నియోజకవర్గంలోని కనకదిన్నె. ఇక వాగులు, వంకలల్లో ఇసుక తవ్వకాలను చేపట్టవచ్చననేది ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీగా ఉంది. దీనిని ఆసరా చేసుకుని సమీపంలోని వాగులు, వంకలన్నింటినీ సదరు ప్రైవేటు కంపెనీ అవసరాల కోసం ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ఈ ఇసుక సరఫరా కాంట్రాక్టు కాస్తా అధికార పార్టీ నేతకు ఇవ్వడంతో మొత్తం వ్యవహారాన్ని సాఫీగా సాగిస్తున్నారని సమాచారం. అందుకే అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. ఇసుక దందాలో.. వాస్తవానికి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రకటించిది. దీంతో ఏ పనికైనా అవసరం మేరకు ఉచిత ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, ఇందుకు భిన్నంగా ఆస్పరి సమీపంలోని ప్రైవేటు కంపెనీ.. గుట్టలు గుట్టలుగా ఇసుకను పొగేసుకుంటోంది. తమ పని సాఫీగా సాగేందుకు వీలుగా అధికార పార్టీ నేతలకు ఇసుక సరఫరా కాంట్రాక్టును అప్పగించింది. దీంతో అడ్డూఅదుపు లేకుండా రాత్రి, పగలు ఇసుకను తోడేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం అడ్డుచెప్పని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
దారి దోపిడీ!
► ఇదీ.. తమ్ముడి లెక్క ► కర్నూలు - దేవనకొండ రోడ్డుకు మళ్లీ బ్రేకులు ► ట్రాక్టర్ ఇసుకకు అదనంగా రూ.400 చెల్లించాలని ఓ టీడీపీ నేత డిమాండ్ ► రంగంలోకి దిగిన మాజీ మంత్రి ► తట్టుకోలేక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్? ► నవంబర్ నాటికి పనులు పూర్తయ్యేది కష్టమే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు-దేవనకొండ రోడ్డు మార్గానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈసారి అధికార పార్టీ నేతల ఇసుక దందా అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రకటించినప్పటికీ.. తమకు మాత్రం ట్రాక్టర్‌కు రూ.400 చెల్లించాల్సిందేనని కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు డిమాండ్ చేయడమే పనులు నిలిచిపోయేందుకు కారణమైనట్లు తెలిసింది. ట్రాక్టర్ ఇసుకకు రూ.400 ఇవ్వకుంటే పనులు చేసుకోవద్దంటూ ఆ నేత కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు చర్చ జరుగుతోంది. జిల్లా ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి ఒకరు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాజకీయ నేతల మామూళ్ల కక్కుర్తికి రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి అనుచరుడి బెదిరింపులతో గత కొద్దిరోజులుగా కోడుమూరు దాటిన తర్వాత రోడ్డు పనులు కాస్తా పూర్తిగా నిలిచిపోయాయి. సీన్లోకి మాజీ మంత్రి.. రాష్ర్టంలో 45 రోజుల క్రితం ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. దీంతో రోడ్డు పనులకు ఇక ఇబ్బంది లేదనుకున్న సదరు కాంట్రాక్టర్‌కు అనుకోని రీతిలో అడ్డంకులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఉచితంగా ప్రకటించినప్పటికీ తనకు మాత్రం వాటా కావాల్సిందేనని కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ముఖ్య నేత సోదరుడు, మాజీ మంత్రి రంగంలోకి దిగారు. తన మనిషి అడిగిన మొత్తం ఇస్తేనే పనులు జరగనిస్తానని సదరు నేత కూడా స్పష్టం చేశారు. ఇక చేసేది లేక కాంట్రాక్టర్ కాస్తా చేతులెత్తేశారు. ఆది నుంచీ అదే తీరు.. వాస్తవానికి ఈ రోడ్డు నిర్మాణ పనులకు రూ.102.01 కోట్లు విడుదల చేస్తూ జూలై 24, 2009న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పనులను రెండు సంవత్సరాల్లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టు గడువును నిర్దేశించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో పాటు.. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, అనేక మంది ఎమ్మెల్యేలు పనులు చేసేందుకు తమకు మామూళ్లు ఇవ్వాలంటూ ఒత్తిళ్తు తీసుకొచ్చారు. దీంతో తాను పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ కాస్తా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ)ను కూడా వదిలివేసుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే, దీనిని సరిదిద్ది పనులు చేయించేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఫలితంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తీరా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనుల విలువను రూ.102.01 కోట్ల నుంచి ఏకంగా రూ.135 కోట్లకు పెంచుతూ 2014 నవంబర్ 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా 24 నెలల్లో(2016 నవంబరు 12వ తేదీ నాటికి) రోడ్డు పనులను పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మళ్లీ పనులు ప్రారంభమైన వెంటనే అధికార పార్టీ మంత్రి, జిల్లా ముఖ్యనేత కాస్తా వాటా అడగడంతో పనులకు బ్రేక్ పడింది. ఈ వ్యవహారం కాస్తా సద్దుమణిగి పనులు మళ్లీ ప్రారంభమై.. రెండు, మూడు నెలల్లో రోడ్డు పనులు పూర్తవుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయితే, ఇప్పుడు అధికార పార్టీ నేతల ఇసుక దందాతో రోడ్డు పనులకు బ్రేక్ పడటం గమనార్హం. -
కష్టాలు ఉచితం
ఇసుక ఉచితమే అయినా.. ఖర్చులు తడిసిమోపెడు ఇబ్బందుల పాల్జేస్తున్న నూతన విధానం చెంతనే గోదావరి ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి అయిన వారికి అడ్డదారిలో లోడింగ్ కిలోమీటర్లకొద్దీ బారులు తీరుతున్న వాహనాలు ర్యాంపుల్లో బాట ఖర్చుల పేరుతో దోపీడీ కొవ్వూరు/నిడదవోలు : ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చినా ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లాలో 11 ర్యాంపులకు అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం 6 ర్యాంపులే నడుస్తున్నాయి. సర్కారు ప్రకటించిన నూతన విధానం అమలుపై పర్యవేక్షణ కొరవడటం, లోపభూయిష్టమైన మార్గదర్శకాలు జనం పాలిట శాపంగా మారాయి. పోలవరం నుంచి నిడదవోలు మండలం పందలపర్రు వరకు గోదావరి తీరంలో సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ర్యాంపులు లేకపోవడంతో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. గోదావరి చెంతనే ఉన్న గ్రామాల వారు సైతం దూర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి రావడంతో రవాణా చార్జీలు భారంగా పరిణమించాయి. కనీసం అనుమతిచ్చిన ర్యాంపుల్లోకి వెళ్లి ఇసుక తెచ్చుకుందామన్నా.. అనువైన బాటలు లేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ నాయకులు దీనిని ఆసరాగా చేసుకుని బాట ఖర్చుల పేరిట సొమ్ములు గుంజుకుంటున్నారు. ఉచితమే అయినా.. ఖర్చయ్యేది పాత ధరలే ర్యాంపుల్లో లోడింగ్ చార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని.. అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ధరలపై ఎక్కడా నియంత్రణ లేకుండాపోయింది. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ.. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో విక్రయించిన ధరలనే ఇప్పుడు కూడా వెచ్చించాల్సి వస్తోంది. డ్వాక్రా సంఘాల హయాంలో సిద్ధాంతం ర్యాంపు నుంచి పెనుగొండకు ఒక ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు అన్ని ఖర్చులతో కలిపి రూ.2,600 వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నా ట్రాక్టర్ ఇసుకకు లోడింగ్, రవాణా ఖర్చులు కలిపి రూ.2,200 నుంచి రూ.2,400 అవుతోంది. అదే ర్యాంపు నుంచి తణుకు పట్టణానికి ట్రాక్టర్ ఇసుకకు డ్వాక్రా సంఘాల హయాంలో రూ.3,300 ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.3 వేలు అవుతోంది. లోడింగ్ చార్జీల ముసుగులో దోపిడీ యూనిట్ ఇసుకను లోడింగ్ చేయడానికి రూ.175 చార్జీగా నిర్ధేశించారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి ర్యాంపులో యూనిట్‌కు ఏకంగా రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలను అధికార పార్టీ నాయకులు తమ చెప్పు చేతల్లో పెట్టుకుని.. వారికి రోజువారీ కూలీ కింద రూ.500 చొప్పున ముట్టజెప్పుతూ అదన పు ధరలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ర్యాంపునుంచి నిత్యం సుమారు 50 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 400 యూనిట్లకు పైగా ఇసుకను విక్రయించారు. ఈ ర్యాంపులో టీడీపీ నేతలు దందాసాగిస్తున్నా రెవెన్యూ, పోలీసులు యంత్రాగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మిగిలిన చోట్లా ఇంతే పెనుగొండ మండలం సిద్ధాంతంలో వారం రోజుల నుంచి ఉచిత ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కార్మికుల సంఖ్య వెయ్యికి పైగా ఉండటంతో వారి అదుపాజ్ఞల్లోనే ర్యాంపు నడుస్తోంది. ర్యాంపు నుంచి ఇసుకను బయటకు తెచ్చుకోవడానికి అనువుగా బాటలు నిర్మించడానికి ఎమ్మెల్యే ఓత్తిడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కార్మికులు తాత్కాలిక బాటలు వేసుకుని ఎగుమతులు చేస్తున్నారు. బాట ఖర్చును కార్మికులు భరింంచాల్సి రావడంతో యూనిట్ అసుకకు అదనంగా రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు 250 ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎగుమతి అవుతోంది. బాటలు సరిగా లేకపోవడంతో లారీలకు ఎగుమతులు చేయడానికి కార్మికులు నిరాకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ ర్యాంపు నుంచి సుమారు 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎగుమతులు జరిగినట్టు అంచనా. ఇదిలావుంటే.. నిడదవోలు మండలం పందలపర్రు, పెండ్యాల-కానూరు ర్యాంపుల్లో ఉచిత ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కార్మికులు తాత్కాలిక బాటలు వేసి ఎగుమతులు చేస్తున్నారు. కొబ్బరి ఆకుల ఖర్చులు, లేబర్ ఖర్చుల, బాట ఖర్చుల పేరుతో యూనిట్‌కు రూ.500 నుంచి రూ.550 వరకు వసూలు చేస్తున్నారు. ఈ రెండు ర్యాంపుల ద్వారా రోజుకు సుమారు 400 ట్రాక్టర్ల ఇసుక ఎగుమతి అవుతోంది. సుమారు 25వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తరలించినట్టు అంచనా. నాలుగు రోజుల క్రితం కొవ్వూరు మండలం వాడపల్లిలో ర్యాంపు తెరిచినప్పటికీ ఇక్కడి నుంచి కేవలం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు మాత్రమే ఇసుక తరలిస్తున్నారు. బాటల్లేక నిరుపయోగంగా ఐదు ర్యాంపులు జిల్లాలో విలీమైన వేలేరుపాడు మండలం రుద్రమకోట, తిరుమలాపురం, రేపాకగొమ్ము ర్యాంపులతోపాటు కుక్కునూరు మండలం వింజరం, ఇబ్రహీంపట్న(గణవరం), దాచారం ర్యాంపులల్లో ఇసుక తవ్వకాలను అనుమతులున్నాయి. ఈ ర్యాంపుల్లోకి వాహనాలు వె ళ్లేందుకు బాటలు లేవు. ఆ రెండు మండలాల్లో 6 ర్యాంపులు ఉన్నా.. దారులు లేకపోవడంతో ఒక్క రుద్రమకోట ర్యాంపులో మాత్రమే తవ్వకాలు సాగుతున్నాయి. మిగిలిన ఐదు ర్యాంపులు నిరుపయోగం ఉన్నాయి. పైగా కొన్ని ర్యాంపుల నుంచి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న సమాచారం. పందలపర్రు ర్యాంపు వద్ద కిలోమీటర్లకొద్దీ బారులు పందలపర్రు ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు నిత్యం పెద్దఎత్తున వాహనాలు వస్తున్నాయి. ఏ సమయంలో చూసినా ర్యాంపు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరి ఉంటున్నాయి. బయటినుంచి వచ్చిన వాహనాలను క్రమపద్ధతిలో (వరుస సంఖ్యలో) ర్యాంపుల్లోకి అనుమతించడం లేదని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆ గ్రామం నుంచి వచ్చే వాహనాలతోపాటు ఏటుగట్టు మీదుగా వచ్చే కొందరు నాయకుల వాహనాలను అక్రమంగా ర్యాంపుల్లోకి తీసుకెళ్లి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇసుక దుమారం
ఉచిత ఇసుక విధానం అధికార టీడీపీకి వరమైంది. సామాన్య జనానికి భారమైంది. అధికారులకు తలనొప్పిగా తయారైంది. రీచ్‌ల వద్ద పాగావేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. వారి కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలనే రూలును అనధికారికంగా అమలు చేస్తున్నారు. అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా వారి అక్రమాలు ఆగడం లేదు. మరోపక్క ఉచిత ఇసుక కాస్తా సామాన్యులకు చేరేసరికి మరింత ‘ప్రియ‘మైపోయింది. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో జనానికి కంటిమీద కునుకులేదు. చీకటిపడితే ట్రాక్టర్ల హోరు. ఇసుక రవాణాతో గ్రామం మోతెక్కిపోతోంది. ఈ గ్రామానికి అనుకొని ఉన్న బలగ రీచ్, ఆమదలవలస సమీపంలోని గోపీనగరం ఇలా ఈ మూడు ప్రాంతాల నుంచి అక్రమ వ్యాపారం సాగుతోంది. అన్ని రీచ్‌లూ అనధికారికమే.. 36 మంది ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ రవాణాకు నేతృత్వం వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇందుకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇసుక ఉచితం లేని సమయంలో ట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు చొప్పున నెలవారీ వసూలు చేసేవారు. ఇవి పోలీసు సర్కిల్ స్థాయి అధికారితోపాటు జిల్లా అధికార పార్టీ నాయకుడికి వెళ్లేవి. ప్రస్తుతం తమ్మినాయుడుపేట నుంచి రోజూ రాత్రి 12 నుంచి 4 వరకు రవాణా సాగుతోంది. సమీప ప్రాంతాల్లో, తోటల్లో రాశులుగా వేస్తున్నారు. విశాఖపట్నం దీనిని తరలించనున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు చూసుకుంటున్నారని సమాచారం. అనధికార క్వారీల నుంచి పొక్లెయినరుతో ఇష్టానుసారంగా ఇసుక తవ్వుతున్నారు. మరో పక్క ఇసుక రీచ్‌కు వెళ్లేందుకు నది గట్లు సైతం తవ్వేసి రోడ్డు మార్గం చేసేశారు. రీచ్‌కు జాతీయ రహదారి నుంచి కిలోమీటర్ లోపలకు వెళ్లాలి. ఇసుకలో నుంచి ట్రాక్టర్లు తప్ప కార్లు, బైక్‌లు, జీపులు వెళ్లే పరిస్థితి లేదు. శ్రీకాకుళం మున్సిపాలిటీ బలగ ప్రాంతంలో ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. జాతీయ రహదారికి అనుకుని అనువైన ప్రదేశాల్లో పోగులు వేసి తర్వాత తరలింపునకు రంగం సిద్ధం చేస్తున్నారు. అర్థరాత్రి వేళ అధికారులు రీచ్‌కు వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. ట్రాక్టర్లు వివరాలను అధికారులు సేకరించినా అధికార పార్టీ నాయకులను కాదని చర్యలు తీసుకునే ధైర్యం చేయటం లేదు. వీరికీ వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత అక్రమ రవాణాతో స్థానికులకు కంటిమీద కునుకుండటం లేదు. ఈ ధ్వని కాలుష్యానికి చెవులు చిల్లులు పడుతున్నాయని వీరంతా వాపోతున్నారు. నిలదీస్తే బెదిరించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. దాంతో మాట్లాడలేకపోతున్నారు. -
పల్లెల్లో ఉచిత యుధ్దాలు
జుత్తాడలో ఇసుక లారీలను అడ్డుకున్న డ్వాక్రా మహిళలు మూడు ట్రాక్టర్లు..ఆరు లారీలుగా వెలిగిపోతున్న వ్యాపారులు చోడవరం: ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం గ్రామాల్లో చిచ్చురేపుతోం ది. జిల్లాలో ప్రధాన నదులు, పెద్ద ఎత్తున తవ్వకాలతో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు ఇప్పుడు ఇసుక యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. పెట్టుబడి లేకుండా కొందరికి రూ.లక్షలు ఆదా యం సమకూర్చిన ఈ వ్యాపారం జనాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రభుత్వం రోజుకో పాలసీతో వర్గ విబేధాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వరీచ్లు, ఆలైన్ అమ్మకాలన్నారు. ఇప్పుడేమో ఉచిత ఇసుక పాలసీ అధికారులను సైతం కలవరపెడుతోంది. పెద్దేరు, శారదా నదులను అనుసంధానం చేస్తూ చోడవ రం మండలం గౌరీపట్నం, జత్తా డ, లక్కవరంల్లో ఉచిత ఇసుక తవ్వకాలకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆన్లైన్లో ఇసుక అమ్మకాలప్పుడే జుత్తాడ, గౌరీపట్నంలలో అనేక గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల్లో సర్పం చ్‌లు, గ్రామస్తులు వేర్వేరుగా మామూళ్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉచిత ఇసుక పాలసీతో ఈ గొడవలు మరింత ముదిరాయి. ఇదీ పరిస్థితి ఆన్లైన్లో ఇసుక అమ్మకంతో తమకు రావలసిన కమీషన్ ఇప్పటికీ రాలేదంటూ జుత్తాడ డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పొలిమేర వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ర్యాంప్ నుంచి ఇసుక లోడుతో వస్తున్న లారీలను అడ్డుకుని ధర్నా చేశారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పినా వినలేదు. తమకు రావలసిన పావలా వాటా కమీషన్ మొత్తం తమ సంఘాల ఖాతాల్లో జమచేసే వరకు ఇసుక తవ్వకాలు చేపట్టనీయమంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వివాదం తారాస్థాయి చేరడంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సైతం నిలదీశారు. మహిళా పోలీసులను రంగంలోకి దింపినప్పటికీ సాయంత్రానికి కూడా ఇక్కడ పరిస్థితి సద్దుమణగలేదు. గౌరీపట్నంలో లారీలు నేరుగా నదిలోకి వచ్చి ఇసుకను తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే లోతుగా తవ్వకాలతో భూగర్భ లాలు ఇంకిపోయి గ్రామంలో బోర్లు నుంచి నీరు రావడం లేదని, నదిలో ఇసుక కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ యజమానులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటచేసుకుంది. లక్కవరం రీచ్‌కు కె.కోటపాడు మండలం మల్లంపేట నుంచి నేరుగా దారి ఉండటంతో అటుగా ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. గ్రోయిన్‌కు సమీపంలోతవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో ఇక్కడ వివాదం చోటుచేసుకుంది. ఇలా గ్రామాలన్నీ ఇసుక కుమ్ములాటలతో రచ్చరచ్చగా ఉన్నాయి. అధికారులకూ తలనొప్పి... అధికారులకూ ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కొత్త పాలసీలో కేటాయించిన రీచ్‌ల్లో ఇళ్లకు, ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక తవ్వుకోవచ్చని, ప్రభుత్వ నిర్మాణాలకు అధికారుల అనుమతి పత్రం ఉండాలనే నిబంధన ఉంది. గుర్తింపు రీచ్‌ల పర్యవేక్షణకు ఒక్కో అధికారిక బృందాన్ని నియమించారు. సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేపట్టాలని, సెలువు దినాల్లో చేయకూడదని కొత్త జీవోలో పేర్కొన్నారు. కానీ ఆదివారం కూడా ఈ రీచ్‌లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీ ఇళ్లనిర్మాణానికే అని చెబుతుండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఇసుక వ్యాపారులు మూడుట్రాక్టర్లు, ఆరు లారీలుగా వెలిగిపోతున్నారు. కమీషన్ పైసా ఇవ్వలేదు మా జుత్తాడ ఇసుక ర్యాంప్ నుంచి అధికారికంగా 20వేల క్యుబిక్మీటర్లకు పైగా ఇసుక తవ్వారు. వెలుగు అధికారుల పర్యవేక్షణలో రసీదులు ఇచ్చాం. ఇందుకు పావలా వాటా డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెప్పింది. పైసా కూడా జమకాలేదు. ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. అందుకే అడ్డుకున్నాం.అధికారులు,ఎమ్మెల్యేను నిలదీస్తాం. -బుద్ద తులసి, దుర్గాభవానీ డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు,జుత్తాడ. రూ. 25 లక్షలు ఇవ్వాలి డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.25లక్షలు వరకు జమ కావాల్సి ఉంది. అధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహించినప్పుడు 33 సంఘాల్లోని 450 మంది ఎంతో కష్టపడ్డాం. మాకు ఆ డబ్బులు జమచేయకుండానే ఇప్పుడు ఉచిత ఇసుక అంటూ ఇష్టమొచ్చినట్టు తవ్వేసి పట్టుకుపోతున్నారు. మాకు రావలసిన డబ్బులు జమచేసేవరకు ఇక్కడ నుంచి ఒక్క లారీ ఇసుక కూడా తీసుకెళ్లనీయం. -రమాదేవి, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు, జుత్తాడ. -
ఇసుక సరిహద్దులు దాటితే కేసులు
చిత్తూరు (అర్బన్): ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని ఇసుక సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని రాలయసీమ ఐజీ వీ.వేణుగోపాలకృష్ణ ఆదేశాలు జారీచేశారు. శనివారం చిత్తూరుకు వచ్చిన ఆయన ఇక్కడున్న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్‌తో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో ఎక్కడా దీనికి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. కట్టడాల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమో అంతే తీసుకెళ్లాలన్నారు. అలా కాకుండే ఒకే ప్రాంతంలో గుట్టలుగా ఇసుక నిల్వచేసినా, ఇతర రాష్ట్రాలకు ఇసుక తీసుకెళ్లినా వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు, రాజకీయ జోక్యాలకు తలొంచద్దని సూచించారు. ఇసుక రేవుల్లో జేసీబీలు, ఇతర యంత్రాలతో ఇసుకను తవ్వడం కూడా చట్ట విరుద్దమన్నారు. దీనిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ అభిషేక్ మొహంతి, ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరి, లక్ష్మీనాయుడు, గిరిధర్, శంకర్, శ్రీకాంత్, పలువురు సీఐలు పాల్గొన్నారు. -
ఇసుక మాఫియాపై ఉక్కు పాదం
►ఐజీ ఎన్.సంజయ్ మాదిపాడులో చెక్‌పోస్టు ప్రారంభం ►ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ఉచితంగా ఇసుకను వినియోగించుకోవాలి ►జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు మాదిపాడు (అచ్చంపేట) రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా,ఉచితంగా ఇసుకను వినియోగించుకోవచ్చని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు రేంజి ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. మండలంలోని మాదిపాడు వద్ద సోమవారం ఆయన ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా చెక్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా గుంటూరు జిల్లాలో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పొందుగల, తంగెడ, నాగార్జున సాగర్, మాదిపాడు, గోవిందాపురం, జట్టిపాలెంల వద్ద చెక్ పోస్టులు ప్రారంభించామని చెప్పారు. ఈ చెక్ పోస్టుల వద్ద పోలీస్ సిబ్బంది 24 గంటలు నిఘా ఉంచుతారని చెప్పారు. మోతాదు మించి రవాణా చేయడం, ఇసుకను నిల్వ ఉంచడం నేరమన్నారు. ఒక్కసారి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వదిలేది లేదని, పిడియాక్ట్ కింద వేలం పెడతామన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామ ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. నిబంధనలను అతిక్రమించినా, గూండాగిరి చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రకటించిన రీచ్‌లలోనే ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయవలసి ఉంటుందని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి మీమీ గ్రామాల్లో, ప్రాంతాల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లయితే వెంటనే 18005994599 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను పట్టించిన వారికి బహుమతులను ఇస్తామని, బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్దులు ఇస్తామని చెప్పారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్, సత్తెనపల్లి డీఎస్సీ ఎం.మధుసూదనరావు, సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ గుడి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. పొందుగలలో పోలీస్ ఔట్‌పోస్టు ప్రారంభం పొందుగల(దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామంలో పోలీస్ ఔట్‌పోస్ట్‌ను మంగళవారం ఐజి ఎన్.సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇసుక నిజమైన లబ్ధిదారుడికి అందేలా తమవంతు చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటి తరలించినా,ఇసుక నిల్వలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఇక్కడ చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశామన్నారు. ఐజీ వెంట జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ ఆళహరి శ్రీనివాసరావు తదితరులున్నారు. -
రోడ్డెక్కిన ఇసుక కార్మికులు
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి తమ పొట్టలు కొట్టిందని ఇసుక కార్మికులు రోడ్డెక్కారు. ఎవరికి వారు ఇసుక తవ్వుకుపోతుండడంతో ర్యాంపుల్లో తమకు పనిలేక పస్తులుంటున్నామని, తమకు ఉపాధి చూపాలని నిడదవోలు మండలం విజ్జేశ్వరం, కొవ్వూరు మండలం సీతంపేట గ్రామాలకు చెందిన బోటు యజమానులు, బోటు కార్మికులు బుధవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. విజ్జేశ్వరం, సీతంపేట గ్రామాల్లో సుమారు 65 బోట్లపై 650 కుటుంబాలు ఆధారపడ్డాయని వారు పేర్కొన్నారు. గతంలో విజ్జేశ్వరం, సీతంపేట రెండు గ్రామాలకు చెందిన కార్మికులు గోంగూర తిప్ప 1, 2 ర్యాంపుల నుంచి ఇసుకను బోట్లపై విజ్జేశ్వరం లాకుల ద్వారా తాడేపల్లిగూడెం ప్రాంతాలకు రవాణా చేసి ఉపాధి పొందేవారమని చెప్పారు. ప్రస్తుతం ఉచిత ఇసుక ప్రకటించిన నేపథ్యంలో లాకుల ద్వారా ఇసుక సరఫరా చేయడం నిషేధమని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో తమ కుటుంబాలు ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తమకు ఓ దారి చూపాలని వారు కలెక్టర్‌కు విన్నవించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సూరిశెట్టి ప్రభాకరరావు, వాకలపూడి వెంకటరత్నం, గొల్లకోటి నర్సయ్య, కోయి శ్రీనివాస్, సూరిశెట్టి రాఘవ, బొంబోతు సూర్యచంద్రం, పువ్వల వెంకయ్య ఉన్నారు.