Grow
-
మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!
మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది. జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. (చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!
గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి. మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది. -
గుబురుగా, తాజాగా కొత్తిమీర : బాల్కనీలోనే ఇలా పెంచుకోండి!
ప్రస్తుతం కాలంలో ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను సాగు చేయడం ఒక అలవాటుగా మారింది. చాలామంది టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ పేరుతో ఉన్నకొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల మొక్కల్ని పెంచుతూ సేంద్రీయ ఉత్పత్తులను సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇది కాలుష్యం లేని ఆహారాన్ని అందించండం మాత్రమే కాదు ఇంటి వాతావారణానికి, పర్యావరణానికి చాలా మంచిది కూడా. ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో కొత్తమీర, పుదీనా లాంటి వాటిని సులభంగా పండించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంత అంత ఈజీ కూడా కాదు. మరి సులభంగా, చక్కగా కొత్తిమీరను ఎలా పండించుకోవాలో చూద్దామా!ఇంట్లో కొత్తిమీరను పెంచడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. కొత్తిమీరలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచేందుకు విత్తన ఎంపిక చాలా ముఖ్యం. ఇందులో శాంటో, లీజర్ లేదా కాలిప్సో వంటి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రకాలు త్వరగా మొలకెత్తి, ఎక్కువ కాలం పంట ఉండేలా చేస్తుంది.సరైన కంటైనర్కనీసం 8-12 అంగుళాల లోతు, మంచి డ్రైనేజీ ఉన్న కంటైనర్, లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేళ్లు లోతుగా వెళతాయి. కుండీ, లేదా కంటైన్ లోతుగా ఉండేలా చేసుకోవాలి. కంటైనర్ దిగువన నీళ్లు పోయేలా రంధ్రాలేన్నాయో లేదో చూసుకోవాలి.సాయిల్ మిక్సింగ్ కొత్తిమీర బాగా పెరగాలంటే, బాగా ఎండిపోయే, సారవంతమైన మట్టి కావాలి. అందుకే కాస్త మట్టి, కొద్దిగా ఇసుక ఉండేలా సేంద్రీయ ఎరువు, అధిక-నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మడి మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా జాగ్రత్తపడాలి.విత్తనాలు విత్తడం నాటేముందు విత్తనాలను(ధనియాలు) కొద్దిగా నలపాలి. అంటే ఒక గుడ్డపై ధనియాలను పోసి చపాతీ కర్రతోగానీ, ఏదైనా రాయితో గానీ సున్నితంగా నలపాలి. అపుడు గింజలు రెండుగా చీలతాయి. ఇలా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకలొస్తాయి. 1-2 అంగుళాలు దూరంలో విత్తనాలను 1/4 అంగుళాల లోతులో చల్లాలి. ఆపై మట్టితో తేలికగా కప్పి, నీరు పోయాలి.మొలకలు కంటైనర్‌ను వెచ్చని ఎండ తగిలేలా ఉంచాలి. కొత్తిమీర గింజలు సాధారణంగా మొల కెత్తడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ కాలంలో మట్టిలో నీళ్లు నిల్వలేకుండా, తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 4-6 గంటల పాటు ప్రత్యక్ష ఎండ తగలాలి. నీళ్లు పోయడానికి విత్తనాలు చెదిరిపోకుండా, దెబ్బ తగలకుండా, స్ప్రే బాటిల్‌ని ఉపయోగించాలి.నిర్దిష్ట సమయంలో సాధారణంగా మొలకలు వచ్చేస్తాయి. మట్టిని సమానంగా తేమగా ఉంచడానికి కొత్తిమీర మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఇంకా బలంగా పెరగాలంటే, నీటిలో కరిగే ఎరువులు, కంపోస్ట్ టీ లేదా డైల్యూటెడ్ ఫిష్ ఎమల్షన్ వంటి సేంద్రీయ ఎరువు వాడితే మంచిది. చక్కగా గుబురుగా, పచ్చపచ్చగా కొత్తిమీర మొక్కలు ఎదుగుతాయి. 6 అంగుళాల ఎత్తు పెరిగాక కొత్తమీరను హార్వెస్ట్ చేయ వచ్చు. కోస్తూ ఉంటే, కొత్తమీర ఇంకా గుబురుగా పెరుగుతుంది. అఫిడ్స్, సాలీడు , శిలీంధ్ర వ్యాధుల సమస్యలొస్తాయి. ఎలాంటి చీడపీడలు రాకుండా, వేపనూనె, పుల్లటి మజ్జిగ ద్రావణం లాంటి స్ప్రే చేయవచ్చు. కొత్తమీర పువ్వులు వచ్చేదాకా వాడుకోవచ్చు. దీన్ని బోల్టింగ్ అంటారు. ఈ టైంలో ఆకులు చేదుగా మారతాయనేది గుర్తించాలి. -
200 బిలియన్ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు. ‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్‌గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్‌లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్‌వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!
చిన్ని చిట్కాలతో కూరగాయాలను, పళ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన, ఇంటిని, ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. అందుకావల్సింది ఓపిక. దీంతో పాటు ఎలాంటి హానికరం కాని మంచి రెమిడీలు కాస్త అనుభవం గడించిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణుల సాయం ఉంటే చాలు. ఆకుకూరలు తాజగా ఉండాలంటే.. ఆకుకూరలు వాడిపోయినట్టుగా కనిపించినప్పుడు... వాటిని చల్లటినీటిలో వేయాలి. దీనిలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటినుంచి తీసేయాలి. ఇలా చేస్తే ఆకుకూరలు తిరిగి తాజాగా కనిపిస్తాయి. యాపిల్ ముక్కలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలపైన కాసింత నిమ్మరసం పిండితే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. జుట్టు రాలే సమస్య తగ్గాలంటే.. ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. (చదవండి: సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!) -
గోళ్లు పొడవుగా అందంగా ఉండాలంటే..ఇలా చేయండి!
గోళ్లు ..పొడవుగా అందంగా ఉండే ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ కొందరిలో కొద్దిగా పెరగగానే విరిగిపోతుంటాయి. కొంతమందికి అసలు పెరగవు. దీంతో నెయిల్ పెయింట్ వేసుకోవాలంటే ఇబ్బంది. గోళ్లను చక్కగా పెంచే ఈ ఐదు చిట్కాలు పాటించి చూడండి మీ కోరిక తీరుతుంది.. గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆలివ్ ఆయిల్ ముందుంటుంది. దీనిలోని విటమిన్ ఇ గోళ్లకు పోషణ అందించి చక్కగా పెరిగేలా చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను గోళ్లమీద రాసి మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ చక్కగా జరిగి గోళ్లలో పెరుగుదల కనిపిస్తుంది. టీస్పూను యాపిల్ సైడర్ వెనిగర్‌లో టీస్పూను వెల్లుల్లి తరుగు వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోళ్లపై రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే గోళ్లు విరగకుండా చక్కగా పెరుగుతాయి. వెల్లుల్లి రెబ్బను రెండు ముక్కలు చేసి గోళ్లపై పదినిమిషాలపాటు రుద్దాలి. కొద్దిరోజుల్లోనే గోళ్ల పెరుగుదల కనిపిస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌ను గోళ్లకు పూతలా అప్లైచేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది గోళ్లను అందంగా పెరిగేలా చేస్తుంది. ఇవన్నీ చేయలేకపోతే కొబ్బరినూనెను గోళ్లపై రాసి రోజూ మర్దన చేయాలి. కొబ్బరినూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు గోళ్ల పెరుగుదలకు దోహదపడతాయి. (చదవండి: కీర్తి సురేశ్ అందంగా ఉండేందుకు.. అవి వాడుతుందట!) -
ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు: అదరగొట్టిన శాంసంగ్
న్యూఢిల్లీ: దేశంలో ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్‌లో 22 శాతం వృద్ధి చెందింది. 5జీ ఆధారిత డివైజ్‌లకు డిమాండ్ నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి నమోదైందని సైబర్‌మీడియా రిసర్చ్ తెలిపింది.(Vu GloLED TV: క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!) ‘సెప్టెంబర్ త్రైమాసికంలో శాంసంగ్ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. లెనోవో 26, యాపిల్ 19 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం విక్రయాల్లో 8 అంగుళాల శ్రేణి మోడళ్ల వాటా ఏకంగా 43 శాతముంది. శామ్సంగ్ అమ్మకాలు 83 శాతం, యాపిల్ ఐప్యాడ్ 26 శాతం దూసుకెళ్లాయి. ట్యాబ్లెట్ పీసీ విపణి 2022లో 10-15 శాతం వృద్ధి సాధిస్తుంది’ అని సీఎంఆర్ వివరించింది. (భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు) -
క్రెడ్, అప్‌గ్రాడ్, గ్రో.. స్పీడ్
న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల్లోనూ దేశీయంగా 25 స్టార్టప్‌లు నిలకడను ప్రదర్శించినట్లు ఆన్లైన్ ప్రొఫె షనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. ఈ ఏడాది (2022)కి లింక్డ్ఇన్ తాజాగా రూపొందించిన స్టా ర్టప్ల జాబితాలో మూడు కంపెనీలు టాప్ ర్యాంకు ల్లో నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంస్థ క్రెడ్, ఆన్లైన్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అప్ గ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో అగ్రస్థానాన్ని పొందినట్లు జాబితా తెలియజేసింది. 6.4 బిలియన్ డాలర్ల విలువతో క్రెడ్ తొలి టాప్ చైర్‌ను కైవసం చేసుకోగా.. అప్‌గ్రాడ్, గ్రో తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. కొత్త కంపెనీలు ప్రస్తుత ఏడాది జాబితాలో కొత్తగా ఈ గ్రోసరీ కంపెనీ జెప్టో(4వ ర్యాంకు), ఫుల్‌స్టాక్ కార్ల కొనుగోలు ప్లాట్‌ఫామ్ స్పిన్నీ(7వ ర్యాంకు), ఇన్సూరెన్స్ స్టార్టప్ డిటో ఇన్సూరెన్స్(12వ ర్యాంకు)కు చోటు లభించినట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది. ఈ బాటలో ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్ అల్ట్రాహ్యూమన్ 19వ స్థానాన్ని పొందగా, ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ లివింగ్ ఫుడ్ 20వ ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. వినియోగదారులు ఇటీవల ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సంస్థలు జాబితాలో కొత్తగా చోటు సాధించినట్లు వివరించింది. కాగా.. టాప్–10లో స్కైరూట్ ఏరోస్పేస్(5వ ర్యాంకు), ఎంబీఏ చాయ్ వాలా(6), గుడ్ గ్లామ్ గ్రూప్(8), గ్రోత్స్కూల్(9), బ్లూస్మార్ట్(10) చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలలో షేర్‌చాట్, సింపుల్, రేపిడో, క్లాస్‌ప్లస్, పార్క్‌ప్లస్, బ్లిస్‌క్లబ్, డీల్‌షేర్, ఫామ్‌పే, అగ్నికుల్ కాస్మోస్, స్టాంజా లివింగ్ పాకెట్ ఎఫ్ఎం, జిప్ ఎలక్ట్రిక్‌కు చోటు దక్కింది. ఇందుకు 2021 జులై నుంచి 2022 జూన్ వరకూ ఉద్యోగ వృద్ధి, నిరుద్యోగుల ఆసక్తి తదితర నాలుగు అంశాలను పరిగణించినట్లు లింక్డ్ఇన్ తెలియజేసింది. ఇక టాప్–25 స్టార్టప్‌లలో 13 బెంగళూరుకు చెందినవికావడం గమనార్హం! -
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
1.7 కోట్ల వార్షిక యూనిట్లకు ఈవీ మార్కెట్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2021-2030 మధ్య ఏటా 49 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది. వార్షిక అమ్మకాలు 2030 నాటికి 1.7 కోట్లకు చేరుకుంటాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అందులో ద్విచక్ర ఈవీలు 1.5 కోట్లుగా ఉంటాయని తెలిపింది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, కొత్త కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం, ఈవీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ మద్దతు, ఉద్గారాల విడుదల ప్రమాణాలు ఇవన్నీ ఈవీ విక్రయాలు పెరిగేందుకు మద్దతుగా నిలుస్తున్న అంశాలని పేర్కొంది. 2020లో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ల నుంచి ఈవీ పరిశ్రమ చాలా వేగంగా కోలుకున్నట్టు గుర్తు చేసింది. 2021లో మొత్తం ఈవీ విక్రయాలు 4.67 లక్షల యూనిట్లలో సగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉండగా, ఆ తర్వాత తక్కువ వేగంతో నడిచే త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. ఇతర విభాగాల్లోనూ విక్రయాలు పుంజుకున్నట్టు పేర్కొంది. 2021–2030 మధ్య ఈవీ బ్యాటరీ డిమాండ్ ఏటా 41 శాతం మేర పెరుగుతూ, 142 గిగావాట్ హవర్‌కు (జీడబ్ల్యూహెచ్) చేరుకుంటుందని వెల్లడించింది. 2021లో 6.5 జీడబ్ల్యూహెచ్‌గా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీల ధరలు తగ్గుతుండడం, ఈవీ సాంకేతికతల్లో అత్యాధునికత వల్ల ఈవీల ధరలు కంబస్టన్ ఇంజన్ వాహనాల ధరల స్థాయికి (2024-25 నాటికి) చేరుకుంటాయని అంచనా వేసింది. భారత ఈవీ మార్కెట్లో లెడ్ యాసిడ్ ఆధారిత బ్యాటరీల ఆధిపత్యం కొనసాగుతోందని, 2021లో 81 శాతం మార్కెట్ వీటిదేనని పేర్కొంది. లిథియం అయాన్ బ్యాటరీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుందంటూ, 2021లో మొదటిసారి 1గిగావాట్‌కు చేరుకున్నట్టు వివరించింది. -
పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... ♦ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. ♦ విద్యుత్ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. ♦ మైనింగ్ రంగంలో పురోగతి 10.9 శాతం, ♦ పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. ♦ రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మరోవైపు 2022 ఏప్రిల్ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది. రూపాయి : 79.59 ముంబై: సెంట్రల్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్ మారకంలో మరో కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది. -
విమానాల్లో చక్కర్లు.. భారీగా పెరిగిన ప్రయాణికులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
స్విస్ బ్యాంకుల్లో.. మనోళ్ల సంపద ఎంతో తెలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకు భారతీయులు దాచిపెట్టిన సంపద గణనీయంగా పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా భారీగా పుంజు కున్నాయి. భారతీయలు, కంపెనీలు, పెట్టుబడులు,హోల్డింగ్స్ విలువ 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. 2020 ముగింపు నాటికి స్విస్ బ్యాంకుల్లోని నిధులు దాదాపు మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 20,700 కోట్లు)గా ఉండటం గమనార్హం. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, కంపెనీల ద్వారా 2021లో 83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.30,626 కోట్లకు) పెరిగాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో గురువారం వెల్లడించింది. సెక్యూరిటీలు, సంస్థాగత హోల్డింగ్స్ గణనీయంగా పెరిగాయని స్విస్ బ్యాంకు ధృవీకరించింది. దీని ప్రకారం మొత్తం స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో (239 బ్యాంకులు) కస్టమర్ డిపాజిట్లు 2021లో దాదాపు 2.25 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు పెరిగాయి. ఫారిన్ క్లయింట్స్ ఫండ్స్ కు సంబంధించిన జాబితాలో భారత్ 44వ స్థానంలో ఉండగా యూకే, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యూకే 379 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్. 168 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఆ తరువాత వెస్టిండీస్, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, హాంగ్‌కాంగ్, లక్సెంబర్గ్, బహమాస్, నెదర్లాండ్స్, కైమన్ ఐలాండ్స్, సైప్రస్ దేశాలు టాప్‌లో ఉన్నాయి. కాగా స్విస్ బ్యాంకుల్లో మనవాళ్ల సంపద 2006లో గరిష్టంగా 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదయ్యాయి. కానీ 2018లో 11శాతం, 2017లో 44 క్షీణించాయి. అలాగే 2019 చివరి నుంచి కస్టమర్ డిపాజిట్లు పడిపోయాయని బ్యాంకు తెలిపింది. అయితే 2011, 2013, 2017, 2020, 2021లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. స్విస్ బ్యాంకులకు తరలిపోతున్న భారతీయుల సంపద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. -
ఏప్రిల్‌లో మౌలిక రంగం శుభారంభం!
2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ శుభారంభం చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆరు నెలల్లో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. బొగ్గు (28.8 శాతం) పెట్రోలియం రిఫైనరీ (9.2 శాతం) విద్యుత్ (10.7 శాతం) రంగాలు మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. సహజ వాయువు ఉత్పత్తి 6.4%, ఎరువుల ఉత్పత్తి 8.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 8% పెరిగింది. అయితే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 0.9% క్షీణించింది. స్టీల్ ఉత్పత్తి కూడా 0.7 శాతం తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44%. ఏప్రిల్ ఐఐపీ గణాంకాలు రానున్న రెండు వారాల్లో వెలువడనున్నాయి. -
కరోనాలోనూ 'రియల్' దూకుడు! రూ.65,000 కోట్లకు రియల్టీ!
కోల్‌కతా: రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2024 నాటికి రూ.65,000 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్టీ పరిశ్రమ వాటా 13 శాతానికి చేరుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2019లో రూ.12,000 కోట్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనాకు సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ.. 2022లో మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ ఆధారిత ఎకోసిస్టమ్ ఉన్న కార్యాలయ వసతులకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. డెవలపర్లు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ చానల్స్ ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. భారత రిటైల్ పరిశ్రమ 2021–2030 మధ్య 9 శాతం చొప్పున వృద్ది చెంది 2026 నాటికి 1400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. భారతీయులు ఆన్లైన్ రిటైల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, 2024 నాటికి దేశ ఈ కామర్స్ పరిశ్రమ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. వేర్ హౌసింగ్ (గోదాములు) రియల్ ఎస్టేట్ ఇక మీదటా వృద్ధిని చూస్తుందని, ఈ కామర్స్ విస్తరణ కలసి వస్తుందని.. ఈ విభాగంలో లావాదేవీలు 20 శాతం వృద్ధిని చూస్తాయని పేర్కొంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశ ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. చదవండి👉హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
ప్రపంచంలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న భారత్ ఎకానమీ
కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యసవ్థగా నిలవనుందని జాతీయ గణాంకాల కార్యలయం (ఎన్ఎస్ఓ) పేర్కొంది. ఆర్థిక సంవత్సరం ఎకానమీ 9.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని, ఈ స్థాయి వృద్ధి రేటును ప్రపంచలో ఏ దేశమూ సాధించే స్థితిలో లేదని పేర్కొంది. ఎన్ఎస్ఓ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు... ►2021 మే 31వ తేదీన వెలువడిన గణాంకాల ప్రకారం 2020–21లో జీడీపీ విలువ రూ.135.13 లక్షల కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.147.54 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. 2019–20 ఎకానమీ రూ. 145.69 లక్షల కోట్లకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ విలువ అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలిస్తే, జీవీఏ విలువ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) 8.6 శాతం వృద్ధితో రూ.124.53 లక్షల కోట్ల నుంచి రూ.135.22 లక్షల కోట్లకు పెరగనుంది. ► తయారీ రంగం వృద్ధి రేటు 7.2 శాతం క్షీణత నుంచి 12.5 శాతం వృద్ధిలోకి మారే వీలుంది. ► గనులు, తవ్వకాల విభాగంలో వృద్ధి 14.3 శాతంగా ఉండే అవకాశం ఉంది. ► ట్రేడ్, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి 11.9 శాతంగా నమోదుకావచ్చు. ► ఆర్థిక వ్యవస్థలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.9 శాతానికి పెరుగే అవకాశం ఉంది. ‘బేస్ ఎఫెక్ట్’... విశ్లేషణలు.. అయితే ఈ స్థాయి వృద్ధి రేటుకు ప్రధానంగా లో బేస్ ఎఫెక్ట్ కారణమన్న విశ్లేషణలు ఉండడం గమనార్హం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 బేస్ ఇయర్‌ను గమనిస్తే కరోనా సవాళ్ల నేపథ్యంలో సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీలో అసలు వృద్ధి లేకపోగా 7.3 % క్షీణతను నమోదుచేసుకోవడం గమనార్హం. కోతల పర్వం ఇలా... నిజానికి తొలుత 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 10 శాతంపైగా అంచనావేయడం జరిగింది. అయితే ఒమిక్రాన్, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాల నేపథ్యంలో ఈ గణాంకాల అంచనాలు 8.4 శాతం నుంచి 10 శాతం వరకూ కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అంచనాలు 9.5 శాతంకన్నా ఎన్ఎస్ఓ తాజా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. కాగా ఫిచ్ రేటింగ్స్ అంచనాలు 8.7 శాతం కాగా, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా 9.3 శాతంగా నమోదయ్యింది. ప్రపంచబ్యాంక్ అంచనా 8.3 శాతం. ఓఈసీడీ విషయంలో ఈ అంచనా ఇప్పటి వరకూ 9.7 శాతంగా ఉంది. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఎకనమిక్ సర్వే వీటన్నింటకన్నా అధికంగా అంచనా 11 శాతంగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటు అంచనావేయగం, జూలై–సెప్టెంబర్‌లో 8.4 శాతం వృద్ధి నమోదయ్యింది. కాగా, చైనా విషయంలో 2021–22 వృద్ధి అంచనాలు 8 శాతంగా ఉన్నాయి. 2030 నాటికి ఆసియాలో నెంబర్ 2గా భారత్ కాగా, 2030 నాటికి ఆసియాలో జపాన్ను పక్కకునెట్టి భారత్ రెండవ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. అలాగే దేశ జీడీపీ జర్మనీ, బ్రిటన్లను దాటి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎదిగే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ తరువాత ఆరువ స్థానంలో ఉంది. భారత్ జీడీపీ 2021లో 2.7 ట్రిలియన్ డాలర్లయితే, 2030 నాటికి ఈ విలువ 8.4 ట్రిలియన్ డాలర్లకు చేరే వీలుందని విశ్లేషించింది. వృద్ధి బాటలో వేగంగా నడుస్తున్న మధ్యతరగతి, వినియోగం భారీ వృద్ధి వంటి అంశాలు భారత్‌కు లాభిస్తున్న ప్రధాన అంశాలని పేర్కొంది. దేశ వినియోగం 2020లో 1.5 ట్రిలియన్ డాలర్లు ఉంటే, ఇది 2030 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేషించింది. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020లో 500 మిలియన్లు (50 కోట్లు) ఉంటే, 2030 నాటికి 1.1 బిలియన్లకు (110 కోట్లు) చేరుతుందని పేర్కొంది. కాగా, 2021–22 వృద్ధి అంచనాలను 8.2 శాతంగా పేర్కొంది. 2022–23లో ఈ రేటు 6.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. చదవండి: రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు.. -
గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వేరబుల్స్ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్‌తో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్) మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్‌వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్‌వేర్ అమ్ముడయ్యాయి. ఇందులో ఇయర్‌వేర్ 92 లక్షలు, రిస్ట్ బ్యాండ్స్ 3.72 లక్షలు, స్మార్ట్‌వాచెస్ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్‌వేర్, వాచెస్ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్ వేవ్ మూలంగా జూన్ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్‌వేర్ విభాగంలో వాచెస్ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్‌వేర్ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్‌వేర్ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది. -
భారత ఎకానమీ వృద్ధి: బ్రిక్ వర్క్ అంచనాలు
సాక్షి,ముంబై: కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత్ ఎకానమీ వృద్ధి తొలి అంచనాలను తగ్గిస్తున్న ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థల వరుసలో తాజాగా బ్రిక్‌వర్క్ రేటింగ్స్ చేరింది. క్రితం 11 శాతం అంచనాలను 9 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. తొమ్మిది శాతం కూడా లోబేస్ వల్లే 2020-21లో అతి తక్కువ గణాకాల నమోదు) సాధ్యమవుతోందని తెలిపింది. వ్యాక్సినేషన్ విస్తృతమై, కరోనా కట్టడి జరిగే వరకూ సరఫరాల్లో ఇబ్బందులు, కార్మికుల కొరత, డిమాండ్ తగ్గుదల వంటి సవాళ్లు కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు భారత్ ఎకానమీ రికవరీ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిపింది. అయితే వ్యవసాయ రంగంపై మహమ్మారి ప్రతికూల సవాళ్లు అంతగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ రంగం 2021-22లో 3.5 శాతం వృద్ధిని నమోదుచేసుకోవచ్చని అంచనావేసింది. పారిశ్రామిక రంగం వృద్ధి అంచనాలను 11.5 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. సేవల రంగం వృద్ధి అంచనాలను 11.8 శాతం నుంచి 9.6 శాతానికి తగ్గించింది. భారత్ తొలి వృద్ధి అంచనాలు ఇప్పటికే ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి) కేర్ (10.2 శాతంనుంచి 10.7 శాతానికి) ఇండ్-రా (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్ట్‌ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) తగ్గించాయి. -
గోల్డ్ లోన్ కంపెనీలు జిగేల్!
సాక్షి,ముంబై: బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వ్యక్తులు, చిరు వర్తకుల నుంచి గోల్డ్ లోన్ల డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్-జూన్ కాలంలో బంగారంపై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది. లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నారు. చిరుద్యోగులు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, వ్యాపారులకు ఇచ్చే రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేశాయి. దీంతో వినియోగదార్లు గోల్డ్ లోన్లను ఎంచుకుంటున్నారు. పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలకే.. ఇతర లోన్లతో పోలిస్తే వసూళ్లు, పంపిణీ, తిరిగి తనఖా విషయంలో గోల్డ్ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ వెల్లడించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు వసూళ్లు చేయలేకపోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్లతోసహా బంగారంపై రుణాల పంపిణీ వరుసగా సెప్టెంబరు త్రైమాసికంలో రెండింతలకు పైగా అధికమైంది. 12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్ తెలిపింది. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. -
ఆశాజనకంగా జీడీపీ వృద్ది 4.7 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ స్థూల జాతీయోత్పత్తి ఆశాజనకంగా నమోదైంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ వృద్ధి 4.7 శాతంగా వుంది. మునుపటి త్రైమాసికంలో నమోదైన ఆరేళ్ల కనిష్టం 4.5 శాతంతో పోలిస్తే స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 5.6 శాతంగా వుంది. కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జీడీపీ వృద్ధి 4.7 శాతంగా నమోదైంది. అలాగే మూడవ త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 4.5 శాతంగా ఉంది, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4.3 శాతం ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయని, భారత దేశాన్ని 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశలో తమ తాజా బడ్జెట్ పునాది వేసిందని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలోతాజా గణాంకాల్లో జీడీవీ వృద్ధి రేటు సుమారు 5 శాతంగా ఉండటం విశేషం. -
ఇంటిపంటలతోపాటే పుట్టగొడుగులూ పెంచుకోవచ్చు!
పుట్టగొడుగుల పెంపకం సాధారణంగా వేడి, వెలుతురు తగలని పక్కా భవనాల్లోని గదుల్లో చేపడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా స్థానం (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఆరుబయట పెరట్లో లేదా మేడ మీద(గ్రామాల్లో లేదా నగరాల్లో) పెట్టుకొని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఉత్పత్తి చేసుకునే ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్‌కు రూరపకల్పన చేశారు. సౌర విద్యుత్తుతో పనిచేయడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చుతోనే ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌ను రూపొందించారు. ఎవాపొరేటివ్ కూలింగ్ సూత్రం ఆధారంగా పని చేసే ఈ అవుట్‌సైడ్ మొబైల్ ఛాంబర్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎండలు మండిపోయే ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ ఛాంబర్లో ఎంచక్కా పుట్టగొడుగులను పెంచుకోవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి ఛాంబర్ల ద్వారా పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన వారితో పాటు.. ఈ ఛాంబర్ల తయారీదారులు కూడా స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలున్నాయి. పుట్టగొడుల పెంపకాన్ని సులభతరం చేసే ఈ ఛాంబర్ వల్ల పుట్టగొడుగుల వినియోగం కూడా పెరుగుతుంది. మహిళలు వీటి పెంపకాన్ని చేపడితే వారిలో పౌష్టికాహార లోపం తగ్గడంతోపాటు ఆదాయ సముపార్జనకూ దారి దొరుకుతుంది. మష్రూమ్ ఛాంబర్ తయారీ పద్ధతి ఇదీ.. ఈ ఛాంబర్‌ను 1 అంగుళం మందం గల సీపీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌తో తయారు చేసుకోవాలి. చాంబర్ పొడవు 1.35 మీటర్లు, వెడల్పు 0.93 మీటర్లు, ఎత్తు 1.69 మీటర్లు. పురుగూ పుట్రా లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం, గాలి పారాడటం కోసం దీని చుట్టూతా నైలాన్ 40 మెష్‌ను అమర్చుకోవాలి. ఈ మెష్ పైన గన్నీ బ్యాగులు చూట్టేయాలి. గన్నీ బ్యాగ్‌లను తడుపుతూ ఉంటే ఛాంబర్ లోపల గాలిలో తేమ తగ్గిపోకుండా ఉంచగలిగితే పుట్టగొడుగులు పెరగడానికి తగిన వాతావరణం నెలకొంటుంది. ఛాంబర్ లోపల నిరంతరం సన్నని నీటి తుంపరలు వెదజల్లే 0.1 ఎం.ఎం. నాజిల్స్‌తో కూడిన 30 డబ్లు్య డీసీ మిస్టింగ్ డయాఫ్రం పంప్‌ను అమర్చుకోవాలి. 300 వాల్ట్స్ పేనెల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజీ బ్యాటరీలను, ఒక టైమర్‌ను అమర్చుకొని.. విద్యుత్‌తో గాని లేదా సౌర విద్యుత్తుతో గాని నడవపవచ్చు. ఈ ఛాంబర్ మొత్తాన్నీ స్టీల్ ఫ్రేమ్ (1.08 “ 1.48 “ 1.8 సైడ్ హైట్ “ 2.2 సెంటర్ హైట్) లోపల ఉండేలా అమర్చుకొని, ఛాంబర్ కింద 4 వైపులా చక్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటే.. ఛాంబర్‌ను అటూ ఇటూ కదుల్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సోలార్ పేనల్స్‌ను ఫ్రేమ్‌పైన అమర్చుకోవాలి. ఫ్రేమ్ లోపల ఇన్వర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలి. 30 లీటర్ల నీటి ట్యాంకును, మిస్టింగ్ పంప్‌ను స్టీల్ ఫ్రేమ్‌లో కింది భాగంలో అమర్చుకోవాలి. అంతే.. మష్రూమ్ ఛాంబర్ రెడీ. మూడేళ్ల పరిశోధన పక్కా భవనంలోని గదిలో, ఆరుబయట సోలార్ ఛాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్ పుట్టగొడుగుల రకాలను 20 బ్యాగ్‌ల(ఒక కిలో)లో మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా పెంచారు. 2016 నుంచి 2018 వరకు అన్ని నెలల్లోనూ ఈ పరిశోధన కొనసాగించి ఫలితాలను బేరీజు వేశారు. పక్కాభవనంలో కన్నా సోలార్ చాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి సగటున 108% మేరకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదేమాదిరిగా వైట్ మష్రూమ్స్ దిగుబడి 52% పెరిగింది. ఈ యూనిట్ నుంచి నెలకు సగటున 25–28 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయవచ్చని ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌కు రూపకల్పన చేసిన ఐ.ఐ.హెచ్.ఆర్. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సెంథిల్ కుమార్ (94494 92857) ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఆయనను సంప్రదించవచ్చు. అయితే, ఈ యూనిట్‌కు సంబంధించిన టెక్నాలజీ హక్కులను ఐఐహెచ్ఆర్ వద్ద నుంచి ఎవరైనా కొనుగోలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత, ఈ యూనిట్లను తయారుచేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టవచ్చని డా. సెంథిల్ కుమార్ తెలిపారు. దీనిపై ఆసక్తి గల వారు ఐ.ఐ.హెచ్.ఆర్. డైరెక్టర్‌ను సంప్రదించాల్సిన ఈ–మెయిల్:director.iihr@icar.gov.in మష్రూమ్ స్పాన్ లభించే చోటు.. బెంగళూరు హెసరఘట్ట ప్రాంతంలో ఉన్న ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ సెంటర్‌కు ఫోన్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే మష్రూమ్ స్పాన్(విత్తనాన్ని)ను విక్రయిస్తారు. మష్రూమ్ స్పాన్‌ను బుక్ చేసుకున్న వారు 30 రోజుల తర్వాత స్వయంగా ఐ.ఐ.హెచ్.ఆర్.కి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాగులను ఎవరికి వారే వెంట తెచ్చుకోవాలి. స్పాన్ బుకింగ్ నంబర్లు.. 70909 49605, 080–23086100 ఎక్స్టెన్షన్–349, 348, 347, డైరెక్టర్– 080–28466471, ఎస్.ఎ.ఓ. – 080 28466370 ఝuటజిటౌౌఝఃజీజీజిట.ట్ఛట.జీn -
కుక్కల్లో కూడా అంతేనట..!
వాషింగ్టన్: అధిక ఒత్తిడి కారణంగా మానవులలాగానే కుక్కలు కూడా ప్రభావితమవుతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫలితంగా వాటి బొచ్చుకూడా ముందుగానే తెల్లబడిపోతుందట. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఎక్కువ స్ట్రెస్ మూలంగా కుక్కల్లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ను గుర్తించినట్టు కొలరాడో పరిశోధకులు చెబుతున్నారు. కొలరాడో లో పరిశోధకులు 1-4 వయస్సున్న 400 ముదురు రంగు కుక్కలపై ఈ పరిశోధన జరిపారు. వాటి నమూనాలు ఛాయా చిత్రాలను సేకరించారు. మరోవైపు వాటి ఆరోగ్యం, ప్రవర్తనాతీరుపై అడిగి తెలుసుకునేందుకు వాటి యాజయానులకు ఒక ప్రశ్నాపత్రాన్ని అందించారు. పరిశోధన తరువాత కూడా ఫోటోలను పరిశీలించారు. దీంతో ముందు అస్పలు తెల్లగా లేని కుక్కల బొచ్చు పూర్తిగా తెల్లగా మారిపోయినట్టు గుర్తించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు. వ్యాకులత, మానసిక ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు. పెద్ద శబ్దాలచేయడం, ఏదో తెలియని భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం దీనికి సంకేతాలని తెలిపారు. మానవులు భయపడినట్టుగానే ఇవికూడా ప్రవర్తిస్తాయని , ఈ ప్రవర్తనను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లలోపు కుక్కల్లో కనిపించే 'గ్రే మజిల్' ఆందోళన లేదా ఇతర భయం సంబంధితమైన ఆందోళనకు పరిస్థితులు హెచ్చరిక సంకేతం కావచ్చని పరిశోధకులు తెలిపారు.అంతేకాదు మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు ఈ అధ్యయనం లో తేలింది. ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నలో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది. -
రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి
హన్మకొండ చౌరస్తా : ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రాజకీయ శక్తిగా ఎదిగిన యాదవుల స్ఫూర్తితో తెలంగాణలో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావ్యాదవ్ కోరారు. హన్మకొండలోని యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తెలంగాణ ప్రాంతంలో యాదవులు వెనుకబాటు తనంలో మగ్గుతున్నారన్నారు. యాదవ మహాసభ కార్యకర్తలు ఊరూరా తిరిగి సామాజికవర్గం ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్యయాదవ్, అర్బన్ అధ్యక్షుడు నోముల నరేందర్, మస్రగాని వినయ్‌కుమార్, ముంత రాజయ్య, వై.సాంబయ్య, దొనికెల రమాదేవి, ఎం.సాంబలక్ష్మి, బట్టమేకల భరత్, నక్క కొమురెల్లి, జిల్లెల కృష్ణమూర్తి, బంక సంపత్, డి శ్రీనివాస్, జినుక సిద్ధిరాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన కంది సాగు
ఫలించిన అధికారుల ప్రచారం మెట్ట పంటసాగుపై ఆసక్తి చూపిన రైతులు ఈ ఏడాది కంది సాగు1000 ఎకరాల పెంపు పెన్‌పహాడ్: ఈ ఏడాది మండలంలో కంది సాగు భారీగా పెరిగింది. వేసవిలో మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పత్తిని తగ్గించి పప్పుధాన్యాల సాగును పెంచాలని సూచించారు. గతేడాది ప్రతికూల వాతావరణం, లద్దె పురుగు బెడదతో ఆశించిన దిగుబడి రాలేదు. కంది పప్పు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఈ పంటసాగుపై ఆసక్తి కనబర్చారు. గత ఏడాది మండల వ్యాప్తంగా 2500ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. ఈ సారి 3500ఎకరాల్లో సాగు చేశారు. సింగారెడ్డిపాలెం, అనంతారం, మాచారం, గాజులమల్కాపురం, చెట్లముకుందాపురం, చీదెళ్ల, నారాయణగూడెం, పొట్లపహాడ్, భక్తాళాపురం, ధర్మాపురం తదితర గ్రామాల్లో కంది పంటను విరివిగా సాగు చేశారు. అందులో పెసరను అంతర పంటగా సాగు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వ్యవసాయ శాఖ మండలంలోని గాజులమల్కాపురం గ్రామంలో సబ్సిడీ కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఇతర గ్రామాల రైతులు వారి వద్ద గల కంది విత్తనాలను పొలంలో విత్తుకున్నారు. ప్రస్తుతం అధికారులు వివిధ గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పంట సాగులో తీసుకోవాల్సిన మొలకువలపై అవగాహన కల్పిస్తున్నారు. కంది దిగుబడి పెంచుకోవడం, పెట్టుబడులు తగ్గించుకోవడంపై రైతులకు సూచనలు చేస్తున్నారు. జూన్‌లో ఓ మోస్తారు వర్షం కురవడంతో జూలైలో ఆడపాదడపా వర్షాలు కురుస్తుస్తున్నాయి. దీంతో రైతులు పంట దిగుబడులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. తెగుళ్లతోనే భయం–సాయిరి నరేష్, అనంతారం గత ఏడాది కంది పంటకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండటంతో దిగుబడి రాలేదు. ఈసారి తెగుళ్ల వాప్తిపై ఆందోళన, భయంగా ఉంది. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తున్నాం. ఈ ఏడాది రెండు ఎకరాల్లో కంది సాగు చేశాను. లాభసాటి పంటే –ఏఓ బి. కృష్ణసందీప్ కంది లాభసాటి పంట. జాతీయ ఆహార పథకం కంది సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. రైతులు అధికారుల సూచనలు పాటించి దిగుబడిని పెంచుకోవాలి. క్రమంగా పత్తిని తగ్గించి పప్పుధాన్యాల పంటలను వేయడం రైతుకు శ్రేయస్కరం.