Habits
-
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్‌ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్‌కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్‌కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్‌ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్‌డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్‌ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
భారతీయలు-అమెరికన్లు: ఆహారపు అలవాట్లలో ఇంత వ్యత్యాసమా..?
భారతీయలు, అమెరికన్ల ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ స్పష్టంగా ఇలా ఉంటాయని మాత్రం తెలియదు. అయితే ఇక్కడొక అమెరికా మహిళ ఆ విషయంలో ఇరు దేశాల ప్రజలకు ఎంత వ్యత్యాసం ఉందనేది చేసి చూపించింది. అది చూస్తే వామ్మో ఇంత తేడానా అని ఆశ్యర్యపోతారు. భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లకు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వాళ్లకు వినోధభరితంగానూ, ఆశ్యర్యానికి గురి చేసే విధంగానూ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయతను బట్టి భాష, సంప్రదాయాల్లో చాలా వైరుధ్యాలు అడగడుగున కనిపిస్తుంటాయి. ఇక భారతీయులు, అమెరికన్ల ఆహారపు అలవాట్లు, ఫ్లోర్‌ని తుడిచే విధానంతో సహా ఉండే వ్యత్యాసాల గురించి సవివరంగా తెలిపేలా వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ మహిళ పేరు క్రిస్టెన్ ఫిషర్. అమెరికా పౌరురాలు. 2017లో భారత్‌కు వచ్చి న్యూఢిల్లీ నివసిస్తున్నప్పుడు తనకెదురైనా అనుభవాన్ని ఇలా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఆ వీడియోలో ముందుగా వంటకాల దగ్గర నుంచి మొదలుపెట్టింది. యూఎస్‌లో ఉప్పు మిరియాలను మసాలాగా ఉపయోగిస్తే..భారత్‌లో ఎండు మిర్చి కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాల, జీరా పొడి, నల్లమిరియాలు వంటివి ఉపయోగిస్తారు. ఇక భోజనం చేసే సమయాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. యూఎస్‌లో డిన్నర్ టైం సాయంత్రం 5 గంటలకే ప్రారంభం కాగా, అదే భారత్‌లో రాత్రి పదిగంటల సమయంలో మొదలవ్వుతుంది. ఇక కాఫీ, టీలు తాగే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. అమెరికన్లు పెద్ద కప్పులలో కాఫీ తాగేందుకు ఇష్టపడగా, భారతీయులు చిన్న కప్పులలో చాయ్‌ని సిప్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక తినే విషయంలో కూడా తీరు వేరుగా ఉంటుంది ఇరు దేశాల ప్రజలకు. అమెరికన్లు ఫోర్క్‌ని ఉపయోగించగా, భారతీయులు చేతితో తినేందుకు ఇష్టపడతారని. అలాగే పిల్లలను అమెరికన్లు ఉయ్యాలలోనూ లేదా సెపరేట్ బెడ్‌పై పడుకోపెట్టగా..భారతీయుల మాత్రం తమ పక్కనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఇల్లుని తుడిచే విధానంలో భారతీయులు కాళ్లపై కూర్చొని క్లీన్ చేయగా వాళ్లు క్లీనింగ్ స్టిక్‌తో శుభ్రపరుస్తారంటూ.. చాలా అందంగా వివరించింది క్రిస్టెన్ వీడియోలో. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..) -
రండి.. తిని తరించండి
ప్రజల్లో విభిన్న ఆహారపు అలవాట్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటకం కొత్త రుచులను అన్వేషిస్తోంది. ఫలితంగా భారతదేశంలో పాకశాస్త్ర సంస్కృతిని ఆస్వాదించే పర్యాటకం (గ్యాస్ట్రోనమీ టూరిజం) ఊపందుకుంటోంది. విదేశీ పర్యాటకులు భారత పాకశాస్త్ర సంస్కృతి, కొత్త వంటకాల తయారీపై మక్కువతో మన దేశానికి క్యూ కడుతున్నారు. 2023లో విదేశీ పర్యాటకుల రాకపోకలు 15.6 శాతం పెరిగాయి. ఈ పర్యాటకులలో అత్యధికులు తమ ప్రయాణంలో భాగంగా పాకశాస్త్ర అనుభవాలను కోరుకుంటారు. దేశంలోని సుసంపన్నమైన అహారం, వంటల సంప్రదాయాలు, విభిన్న ప్రాంతీయ వంటకాలు, ప్రామాణికమైన ఆహార అనుభవాలపై విదేశీ పర్యాటకులు ఆసక్తి పెంచుకుంటున్నారు. – సాక్షి, అమరావతిపాకశాస్త్ర పర్యాటకంలో టర్కీదే అగ్రస్థానంప్రపంచవ్యాప్తంగా గ్యాస్ట్రోనమీ పర్యాటకులను ఆకట్టుకోవడం, సరికొత్త అనుభూతులను అందించడంలో టర్కీ ముందంజలో ఉంది. గతేడాది రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైన అక్కడి పాకశాస్త పర్యాటక మార్కెట్ నుంచి 2025 నాటికి రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అక్కడి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగా 2,200 కంటే ఎక్కువ స్థానిక ఆహార, పానీయాల వెరైటీలున్నాయి. ముఖ్యంగా గాజియాంటెప్, అదావా, హటే, ఇజ్మీర్ వంటి నగరాల్లో గ్యాస్ట్రోనమీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే 41 రకాల విభిన్న ఆహార పదార్థాల తయారీ విధానంపై ప్రత్యేక కోర్సుల, శిక్షణను అందిస్తోంది. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 16 శిక్షణ కేంద్రాలున్నాయి.స్థానిక ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించడానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియాలను ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా 360 కంటే ఎక్కువ గ్యాస్ట్రోనమీ పండుగలను చేపడుతూ దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అందుకే గాజియాంటెప్ను ‘సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’గా యునెస్కో గుర్తించింది. మసాలా వంటకాల నుంచి మొఘలాయ్ వరకు.. దక్షిణాదిలోని మసాలా కూరల నుంచి ఉత్తరాదిలోని మొఘలాయ్ వంటకాల వరకు భారతీయ హోటళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికితోడు వీధుల్లో అమ్మే ఆహారాలు (స్ట్రీట్ ఫుడ్) సైతం అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారాయి. ఈశాన్య భారతదేశం అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతున్న పాకశాస్త్ర గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచులను అందిస్తోంది. ఇక గోవా కేవలం స్థానిక వంటకాలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ వంటకాలను కూడా ప్రవేశపెడుతోంది. వీధి వంటకాల్లో లక్నోలో లభించే నెహారీ కుల్చా, షీర్మల్, మలై మఖాన్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో లభించే చోలే–కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్, పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఆహారోత్సవాలతో ఆకర్షణవివిధ నగరాల్లో అనేక సంస్థల భాగస్వామ్యంతో ఆహారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నార్త్–ఈస్ట్ స్లో ఫుడ్ అండ్ ఆగ్రో బయోడైవర్సిటీ సొసైటీ (నెస్పాస్) ఏటా నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మేఘాలయ రాష్ట్రంలోని మావ్‌లాంగ్‌లో నిర్వహించే ‘సేక్రేడ్ గ్రోవ్’ (మతపరమైన తోట చెట్ల పండుగ) ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలోని స్థానికులు తయారుచేసి వడ్డించే వివిధ అటవీ, స్థానిక ఆహార వంటకాలను సంరక్షించేందుకు, ఆయా వంటకాలపై ప్రచారానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తున్నాయి. ఇలా వివిధ రాష్ట్రాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తూ గ్యాస్ట్రోనమీ టూరిజానికి ఊతమిస్తున్నాయి. -
సుదీర్ఘకాలం జీవించాలంటే..ఈ అలవాట్లు ఉండాలంటున్న పరిశోధకులు!
వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మన పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో సక్రమమైన జీవనశైలి అనుసరించక ఆయుర్దాయం పడిపోతుంది. జస్ట్ యాభైకే అనేక వ్యాధుల బారినపడి 60 ఏళ్ల వరకు బతికి బట్టగట్టగలగడం గగనంగా ఉంది. అయితే కొందరూ మాత్రం వయసు పరంగా సెంచరీ దాటి మరీ ఆరోగ్యంగా జీవించడం విశేషం. అలా మనం అన్నేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ఈ అలవాట్లను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో సవివరంగా చూద్దాం..!.వందేళ్లు జీవించిన వృద్ధులు విజయవంతమైన వృద్ధాప్యానికి ఉదాహరణగా నిలుస్తారు. అంతేగాదు వీళ్లు తరుచుగా దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం అనేది తక్కువగా ఉంటుంది. పైగా 90లలో కూడా తమ పనులు తామే చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తారు. అందుకు ప్రధాన కారణం జన్యుశాస్త్రమే అయినా, దీంతోపాటు 60% వారు అనుసరించే చక్కటి జీవనశైలి అని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘాయువుపై 2000 సంవత్సరం నుంచి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు 34 అధ్యయనాల్లో అందుకు గల కారణాల జాబితాను సవివరంగా తెలిపారు. వందేళ్ల ఆయువుకు దోహదం చేసిన ఆహారం, మందుల వాడకం గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఆయా అధ్యయనాల్లో సుదీర్ఘ దీర్ఘాయువు కోసం కీలకమైన నాలుగు అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. అవేంటంటే..సంతులిత ఆహారం: వందేళ్లు హాయిగా జీవించాలంటే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. సుమారు 57 నుంచి 65% ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, మెడిటేరియన్ డైట్, చేపలు, చిక్కుళ్లు, ఉంటాయి. ముఖ్యంగా ఉప్పు తక్కువ తీసుకోవడం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు. తక్కువ మందుల వాడకం: చాలా వరకు మందులు వాడకానికి దూరంగా ఉండేలా జీవనశైలి ఉండాలి. పూర్వం పెద్దవాళ్లు సహజసిద్ధమైన వాటితోనే చికిత్స పొందుతూ ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉండేవారు. వాళ్లు రోగాల బారిన పడటం అరుదుగా ఉండేది. పైగా చాలా ఏళ్లు జీవించేవారని చెబుతున్నారు. అందువల్ల మందుల వాడకాన్ని వీలైనంతగా తగ్గించేలా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర: నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోడం అనేది మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రకృతిలో జీవించడం: గ్రామాల్లో జీవించే వారిలో సుమారు 75% మంది సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ప్రకృతిలో ఎక్కువగా గడపడం వల్ల ఒత్తిడి, దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడటం తక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు. వాస్తవానికి ఇవన్నీ వందేళ్లు జీవిస్తారని నిర్థారణ చేసి చెప్పలేకపోయిన ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి ఆయుర్దాయం పెంచే అవకాశం ఉందని వెల్లడించారు పరిశోధకులు. (చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!
బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ని, జీవనశైలిని మార్చకుంటేనే ఇదంతా సాధ్యం. చెప్పాలంటే బరువు తగ్గాలనే గట్టి సంకల్పం ఉంటేనే తగ్గగలం. అలానే భారతసంతతి వ్యక్తి ఏకంగా 45 కిలోలు బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని పత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించినట్లు తెలిపాడు. అతనెవరు? ఎలా ఇన్ని కిలోలు మేర బరువు తగ్గగలిగాడు సవివరంగా చూద్దామా..!భారత సంతతికి చెందిన బిహేవియరల్ సైన్స్ సోల్యూషన్స్ కంపెనీ ఫైనల్ మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్ ప్రసాద్ ఏకంగా 45 కిలోలు బరువు తగ్గారు. ఆయన తన వెయిట్ లాస్ జర్నింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా నెటిజనల్తో షేర్ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని అన్నారు. ముందుగా వెయిట్ లాస్ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలి. "ఎక్స్ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్," "ట్రెయిట్స్ వర్సెస్ స్టేట్," "హాబిట్ లాడరింగ్ వర్సెస్ మోటివేషన్," "డిఫెరింగ్ రివార్డ్స్ వర్సెస్ విల్‌పవర్." వంటి పాయింట్లపై దృష్టిపెట్టండి. అంటే.. ఇక్కడ మీకు ఎలాంటి జీవనశైలి ఎంచుకుంటే బెటర్ అనేది సోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ఉన్న ప్రస్తుత పరిస్థితి, మీ శరీర తత్వానికి అనుగణంగా తీసకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం. వాయిదా పద్దతికి స్వస్తి పలికి విల్‌పవర్ చేయడం వంటివి అనుసరించాలని అంటున్నారు రాం ప్రసాద్. అలాగే బరువు తగ్గడంలో తనకు ఉపకరించిన వాటి గురించి కూడా చెప్పారు. డైట్లో రెండు నెలలు పాటు షుగర్ తీసుకోకుండా ఉండటం. ఏడాదిపాటు వాకింగ్ చేయడం. నాలుగైదు నెలలు పాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు సీఈవో రాం ప్రసాద్ చెప్పారు. అలాగే మూడేళ్లు ఒక పూటే భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు తెలిపారు. చివరిగా బరువు తగ్గాలనుకున్నప్పుడూ అందుకు సంబంధించి ఏర్పరుచుకున్న మన లక్ష్యాలపై ఫోకస్ ఉండాలని అన్నారు. అప్పుడే సులభంగా బరువు తగ్గగలమని చెప్పారు. అయితే నెటిజన్లు సీఈవో రాం ప్రసాద్ వెయిట్‌లాస్ జర్నీ చాలా స్ఫూర్తిని కలిగించిందంటూ ఆయన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
అంబానీ నుంచి మస్క్ వరకు.. బిలినీయర్లకు ఉన్న అలవాట్లు ఇవే!
ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మంది కొన్ని అలవాట్లను తూ.చ ఖచ్చితంగా పాటిస్తున్నారు. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు సక్సెస్ సాధించిన వ్యక్తులందరూ ఎలాంటి అలవాట్లను పాటిస్తారనేది ఈ కథనంలో చూసేద్దాం..ఉదయం త్వరగా మేల్కొనటంముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు దాదాపు చాలామంది బిలినీయర్లు రాత్రి ఎంత సమయానికి నిద్రపోయినా.. ఉదయం మాత్రం 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ రాత్రి త్వరగా పడుకుని ఉదయం ముందుగా నిద్రలేవాలి. ఇది ఓ మంచి అలవాటు.చదవడంచదవడం అనేది చాలామంది అలవాటు. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతానని గతంలో పేర్కొన్నారు. ఇది సమాజం పట్ల అవగాహనను మాత్రమే కాకుండా.. మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ఉత్తమ అలవాటు.వ్యాయామంఅమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రతి రోజూ వ్యాయామంతోనే రోజు మొదలుపెడతారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ కనీసం ఒక అరగంట వివిధ రకాల వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం కూడా దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమ అలవాటు.నిద్రశరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. ఇది వారి ఆలోచనా శైలిని పెంచుతుంది. బిలినీయర్లు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోతారు. ప్రతి ఒక్కరు నిద్రకు సరైన సమయం కేటాయిస్తే ఒక నెలరోజుల్లో మీలో మార్పు వస్తుందని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ క్యూబన్ చెబుతున్నారు.సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటంసక్సెస్ సాధించడానికి సామజిక అనుబంధాలు కూడా చాలా ముఖ్యం. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు చాలామంది సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఓ నూతన ఉత్సాహం వస్తుందని నమ్మకం. కాబట్టి సాధ్యమైనప్పుడల్లా సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఉత్తమం. -
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్‌తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు..⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
ఈ తరం తీరే వేరు!.. ఆనందం తక్కువ ఎందుకంటే...
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్ కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి... రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ఈ అలవాట్లు ఉన్న ఉద్యోగులకు తిరుగులేదంతే...
-
ఆరోజులే వేరు.. పండగ వస్తే ఇంటిల్లిపాది పిండివంటలు, ఆ హడావిడే వేరు
మా చిన్నతనంలో ఎవరింట్లో అయినా పెళ్లికి వెళితే ముందుగా ఎదురుచూసేది, "పెళ్ళి ఉప్మా" కోసం. ఎందుకంటే, నాటి - మేటి "పెళ్ళి ఉప్మా" రుచి అల్లాంటిది !పచ్చటి అరిటాకులో తెల్లటి ఉప్మా వేడి వేడిగా వేయించుకుని, చట్నీ కూడా లేకుండా, నోరు కాలిపోతున్నా, ఆబగా తినేసి, మళ్ళీ మళ్ళీ వెళ్ళి, సిగ్గు లేకుండా...అదే... సిగ్గు పడకుండా...వేయించుకుని, ఆ కాలిన నోటితోనే, వేడి వేడి కాఫీని,గాజు గ్లాసుతో చప్పరిస్తే వుండేదీ..ఆహా ఏమి రుచీ... తినగా మైమరచీ అనేలా. ఆ ఒక్కటీ అడగొద్దు.. ఇప్పుడూ పెళ్ళిళ్ళకి వెళుతున్నాం. ఖరీధైన, పేరుమోసిన క్యాటరింగ్ సర్వీసులు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని, టోపీలు పెట్టుకొని, ప్లాస్టిక్ ప్లేట్లలో ఉప్మాతో పాటు, నాలుగు రకాల టిఫిన్లు, మూడు రకాల చట్నీలు వేసి, స్పూన్లు వేసి మరీ మనమీదకి విసిరేస్తున్నారు. కానీ, ఏమిటో టిఫిన్ చెయ్యడం(అంటే వండడం కాదండి, తినడం)మొక్కుబడి అయిపోయింది.ఓ చేత్తో తింటూనే.. ఇంకో చేత్తో ఓ అరడజను మాత్రలు మింగాలిగా !"వేళకి మాత్రలు వేసుకు చావండి...లేపోతే ఛస్తారు"... అన్నారుగా డాట్టర్లు !) అందుకు తింటున్నాం ! తగ్గేదే లే... ఇంకోటి గమనించారా...ఇప్పుడు హొటల్ కి వెళ్ళి, మెనూ కార్డుని ఛడా - మడా చదివేసి, "ప్లేటు ఇడ్లీ...వేడిగా వుండాలి, గట్టి చట్నీ, కారప్పొడీ - నెయ్యీ వేసి పట్రా..." అని ఆర్డరు ఇచ్చేస్తున్నాం కానీ, రెండో ప్లేటు తినే దమ్ములేవీ ?అసలు హోటల్లో టిఫిన్ తినేదే వాడు వేసే చట్నీలు, సాంబార్ కోసం.అదే కొంపలో అయితే, నాలుగో...ఆరో ఇడ్లీలు అవలీలగా ఆవకాయ్ తో పట్టేస్తాం ఏంటి ?ఇంక హొటల్లో మసాలా దోశలు, పూరీ - కూరలు, గారీ - సాంబార్ లు అయితే...తెలుసుగా...ఒక ప్లేటుకే..పొట్ట "హౌస్ ఫుల్" బోర్డు పెట్టేస్తుంది !మరదే...ఇంట్లో అయితే..."తినే వాడికి ఒడ్డించే వాళ్ళు లోకువ" అన్నట్టు,"ఇంకా తే.. ఇంకా తే" అనుకుంటూ కుంభాలు కుంభాలు పట్టించేస్తూనే ఉంటాం. అస్తమానూ, "హమారే జమానే మే..." అనుకుంటూ, అప్పట్లో మనం, గోంగూర పచ్చడి, కొత్త చింతకాయ్ పచ్చడి లాంటి "ఇష్ట భోజ్యార్ధ సిధ్యర్ధం" ఎదురు చూసి,ఎదురు చూసి, కోరిక సిద్ధించగానే, పడికట్టుగా బాసింపట్టు వేసుక్కూర్చుని, రెండు, మూడు వాయిలు లాగించేసేవాళ్ళమని, ఇప్పటి 'ప్లేటు మీల్స్' వాళ్ళకి చెబితే ఏం లాభం ? ప్చ్ !"అర్ధం చేసుకోరూ...." వాళ్ళు...అన్నిటికీ మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నామనుకుంటున్నారు ! "చద్దన్నం - మజ్ఝాన్న భోజన పధకం - రాత్రి తిండి" అనే ముప్పొద్దుల 'ఉదర పోషణ' కార్యక్రమాలు ఉండేవని, మధ్య మధ్యలో ఆడుకుని వచ్చి, చిరుతిళ్ళకోసం, "ఏదైనా పెట్టు" అంటూనే వుండేవాళ్ళమని, అందుకు గృహిణులు వంటింటినే అంటిపెట్టుకుని బతికేసేవారని, చెబితే, ఇప్పటి వారికి, "ఆసచర్యం...ఆసచర్యం" !అదీకాక, రాత్రి పలహారాల బ్యాచి, విభాగాలు వేరే ఉండేవని కూడా చెబితే...వీళ్ళు నమ్మట్లేదు ! ఏం చేస్తాం ?ఇంక పండగలు - పబ్బాలు వస్తే, తెల్లారుకట్ల లేచి, ఇంటిల్లిపాదికీ నలుగెట్టి తలంట్లు, నవకాయ పిండివంటలతో వంటలు, పైపెచ్చు, ప్రత్యేక పిండివంటలు చేసి - చేసి, గృహిణులు అలిసిపోయి, పులిసిపోయినా... పాపం, "పండగ బాగా జరిగింది" అని పదిసార్లు చెప్పుకుని, మురిసిపోయేవాళ్ళే కానీ, ఏనాడూ,"మేం ఇంత పని చేశాం... అంత పని చేశాం" అని దెప్పడం ఎరుగుదుమా ? "హౌ గ్రేట్ !" అదే ఇప్పుడైతే...తెలుసుగా...? ఫ్రిజ్‌లోంచి స్పెషల్ ఐటమ్స్ రెడీ..పండగొస్తోందని మనవాళ్ళకి తెలిసేలోపే,స్వగృహా ఫుడ్స్ వాళ్ళు, మనందరి ఇళ్ళలోకీ కావలసినన్ని స్వీట్లు - హాట్లు,శ్రేష్టమైన నూనెల్తో తయారు చేయించేసి, ప్రత్యేక స్టాల్స్ వేసి, రోడ్డుమీద పెట్టేస్తున్నారుగా !వస్తూ వస్తూ, దారిలో నాలుగైదు రకాలు, తలో అర కేజీ తూపించుకుని వచ్చేస్తే, పండగ అయిపోయినట్టే !ఆ రోజుల్లో మగమహారాజులం మాత్రం, వంటింటి ఛాయలకి వెళ్ళకుండా, (భోంచెయ్యడానికి తప్ప) కొత్తబట్టలు వేసుకుని, భుక్తాయాసంతో అలిసిపోయేవాళ్ళం ! ఇంక తద్దినాలు, పితృ కార్యాలూ వస్తే, వందల కొద్దీ గారెలకి రుబ్బురోళ్ళలో పిండి రుబ్బడం దగ్గర్నుంచీ, నాలుగు రకాల కూరలు, పచ్చళ్ళు, పరవాన్నాలూ కూడా చేసి, సాయంత్రం ఏ నాలుగింటికో భోజనాలు చేసిన స్త్రీ మూర్తుల సహనాన్ని, ఓపికల్ని,"ఏమని వర్ణించనూ..." ఇప్పుడు అన్నిటికీ అంటే పుట్టిందగ్గిర్నించీ.. చివరిదాకా జరిపించే షోడశ కర్మలకీ... కాంట్రాక్టులు వచ్చేశాయి కాబట్టి, అలా...ఓ గంటసేపు రాఘవేంద్ర మఠానికి కార్లో వెళ్ళి, "మమ" అనుకుంటే...సరిపోతోంది ! అవన్నీ వాళ్లకేం తెలుసు? ఈ మధ్య ఫేసు బుక్కుల్లో "గత కాలము మేలు, వచ్చుకాలము కంటెన్" అనుకుంటూ, రోడ్డుమీద గోళీలు, గూటీ బిళ్ళ ఆడుకున్న ఫోటోలు, కిరసనాలు లాంతర్లు, పాత మర్ఫీ రేడియోల ఫోటోలు తెగ షేర్ చేసేస్తూ, మురుసిపోతున్నారు కానీ, ఒక గంట కరెంటు, ఒక పది నిమిషాలు నెట్టు లేకుండా ఊహించుకోడానికే భయపడిపోతారు ! ఆ విరామ సమయంలో...పాత కాలం నాటి తాటాకు విసినికర్రలు వాడుకుంటూ, తొక్కుడుబిళ్ళ ఆడుకోచ్చుగా ? "ఆ ఒక్కటీ అడక్కు" అంటున్నారు.అమ్మమ్మలు, తాతలు కథల్లో బాగుంటారు కానీ, వాళ్ళు ఇప్పుటిదాకా బావుంటే, కూచుని లేవడానికి మనకే ఓపికల్లేవు, వాళ్ళనేం చూస్తాం...వాళ్ళకేం చేస్తాం ? "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపిగురుతులూ..."అని చెప్పిన ఆత్రేయే, అనుకున్నామని జరగవు అన్నీ...అనుకోలేదని...ఆగవు కొన్నీ...జరిగేవన్నీ మంచికనీ.. అనుకోవడమే..మనిషి పనీ... !"అనికూడా అన్నాడు !కాబట్టి, అలాగే అనుకుంటే, ఓ పనైపోతుంది !శుభం భూయాత్ ! -
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్‌కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్‌చేస్తే చాలు టేబుల్‌పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..!
ఏయూ క్యాంపస్(విశాఖపట్నం): ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిలో అత్యంత క్లిష్టమైన జీర్ణాశయాంతర క్యాన్సర్ రోగులపై ఏయూ హ్యూమన్ జెనిటిక్స్ విభాగ పరిశోధక విద్యార్థి కోడెల్లి శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 400 మందికి సంబంధించిన రక్త నమూనాలు సేకరించారు. వీరిలో 200 మంది క్యాన్సర్ సోకిన వారు కాగా.. మరో 200 మంది ఆరోగ్యవంతులు ఉన్నారు. వీరి ఆహారపు, జీవన అలవాట్లు, జన్యువుల ప్రభావాలను ఆయన అధ్యయనం చేశారు. చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు ఈ పరిశోధనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ లభించింది. విభాగ సీనియర్ ఆచార్యులు జి.సుధాకర్ పర్యవేక్షణలో ‘స్టడీస్ ఆన్ జెనిటిక్ పాలిమారిజం ఆఫ్ పీ 53, ఎంఎంపీ2, ఎంఎంపీ9 ఇన్ గ్యాస్ట్రో ఇంటస్టెయిన్ పేషెంట్స్ ఆఫ్ నార్త్‌కోస్టల్ ఆంధ్రప్రదేశ్’అంశంపై పరిశోధన చేసి.. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్ ఉత్తర్వులు స్వీకరించారు. జన్యువుల విశ్లేషణ క్యాన్సర్ కారకాలుగా భావించే పీ 53, ఎంఎంపీ 2, ఎంఎంపీ 9 జన్యువులను శ్రీనివాసరావు అధ్యయనం చేశారు. క్యాన్సర్ బారిన పడిన 200 రోగుల రక్తనమూనాలను పరిశీలించగా వీరిలో ఎంఎంపీ 9 అత్యధికంగా ఉండటం గుర్తించారు. తర్వాత స్థానంలో ఎంఎంపీ 2లు జీర్ణాశయాంతర క్యాన్సర్ రోగుల్లో కనిపించాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎంఎంపీ 9 జన్యువు అధికంగా మ్యూటేషన్ కావడం గమనించారు. పురుషుల్లోనే అధికం తన అధ్యయనంలో భాగంగా 200 మంది క్యాన్సర్ రోగుల ఫలితాలను విశ్లేషించి పరిశీలిస్తే జీర్ణాశయాంతర క్యాన్సర్ వచ్చే ముప్పు పురుషుల్లో 73 శాతం ఉండగా స్త్రీలలో 27 శాతంగా ఉంది. నిరక్షరాస్యుల్లో 58 శాతం ఉండగా.. ఉన్నత విద్యావంతుల్లో 4.5 శాతం ఉండటం గమనించారు. ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే మాంసాహారుల్లో 77 శాతం మంది, శాకాహారుల్లో 23 శాతం మంది దీని బారిన పడుతున్నట్లు గుర్తించారు. పల్లె ప్రజలకంటే పట్టణాల్లో నివసించే వారిలో అధికంగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. పొగతాగేవారు, పొగాకు నమిలే అలవాటు కలిగిన వారిలో ఈ క్యాన్సన్ ముప్పు ఎక్కువగా ఉంది. మద్యం సేవించే అలవాటు కలిగిన వారిలో 58 శాతం మంది ఈ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ఆహారపు, జీవన అలవాట్లు కారణం తన పరిశోధనలో భాగంగా 20 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్ రోగులపై అధ్యయనం చేశారు. వారి రక్త నమూనాలను సేకరించి టోటల్ ప్రొటీన్, సీరం క్రియేటినిన్, బ్లడ్ యూరియా, బ్లడ్ సుగర్, కార్సినో–ఎంబ్రియోనిక్ యాంటిజెన్, బిలిరుబిన్, కాలేయ సంబంధ ఎంజైములు, అల్బూమిన్, గ్లోబులిన్, సోడియం, పొటాషియంల జీవరసాయన స్థాయిలను అంచనా వేశారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతుల నమూనాలను సేకరించి వారి డీఎన్ఏలను వేరుచేసి.. పీసీఆర్, ఆర్ఎఫ్ఎల్పీ విధానాల్లో అధ్యయం జరిపారు. యాంత్రిక సమాజంలో మారిపోతున్న ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు కారణంగా మారే అవకాశాలు ఉన్నాయి. తగినంత శారీరక వ్యాయామం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. ఈ మహమ్మారిని జయించడం సులవవుతుంది. జీవనశైలిలో మార్పు రావాలి మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండటం ఎంతో అవసరం. మన జీవనంలో దురాలవాట్లు, మత్తు పదార్థాలను దరిచేరనివ్వకుండా చూడాలి. జన్యువుల ప్రభావం మనిషిపై ఉంటుంది. దానికంటే ఆహారం, మద్యపానం, ధూమపానం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం అధికంగా ఉంటోంది. మంచి జీవన అలవాట్లను కలిగి ఉండటం వలన క్యాన్సర్‌ను నిరోధించడం సాధ్యపడుతుంది. – డాక్టర్ కె.శ్రీనివాసరావు -
స్టార్ హీరో.. కోకిల రెట్టను రోజు మొహానికి పూసుకుంటాడట!
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు. ఆ బుద్ధిలోనే మనిషికో అలవాటునూ కలిపేసుకోవచ్చు. సామాన్యుల అలవాట్లు, ప్రవర్తన ఎంత అసామాన్యంగా ఉన్నా ప్రాచుర్యంలోకి రావు. అసామాన్యులు లేదా పదిమందికీ తెలిసిన ప్రముఖుల అలవాట్లు ఎంత సామాన్యమైనవైనా ఇట్టే ప్రచారమవుతాయి. అలా వైరలైన కొందరు సెలబ్రిటీల వింత అలవాట్లు తెలుసుకుందాం.. సరదాగా! ఎంతిష్టమైతే మాత్రం.. చెప్పులంటే ఎంతిష్టమైతే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటామా!? కానీ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అలాగే చేస్తాడు ఇంచుమించుగా! అంటే .. తల మీద పెట్టుకోడు అలాగని చెప్పుల స్టాండ్‌లోనూ పెట్టడు. షారుఖ్‌కి షూస్ అంటే చాలా చాలా ఇష్టమట. అందుకే ఇరవై నాలుగ్గంటలూ ఇంటాబయటా షూస్ వేసుకునే ఉంటాడు. రాత్రి కూడా చాలాసార్లు షూస్‌తోనే నిద్రపోతాడట. ఏమయ్యా క్రూజూ.. ఏంటయ్యా అది? వ్వాక్.. ఎంత సౌందర్య పోషణయితే మాత్రం ఆ పనేంటండీ బాబూ.. ! ఏం చేశాడేంటి ఆ అమెరికన్ యాక్టర్ టామ్ క్రూజ్.. అంతమాటనేసినారు? తన ముఖారవింద చర్మ సంరక్షణ కోసం రోజూ నైటింగేల్ పిట్ట (కోకిల) రెట్టనింత తీసుకుని ఫేషియల్ క్రీమ్‌లా మొహానికి పూసుకుంటాడట!! అవాక్కయ్యారా! అది మరి మ్యాటర్... అట్లుంది వీళ్లలోని! అన్నింట్లోకి.... పెరుగు ఉండాల్సిందే ఆలియా భట్‌కు. ఉండొచ్చు .. పరోటా.. ఉప్మా.. పోహా.. ఆఖరుకు చపాతీకీ పెరుగు కాంబినేషన్ బాగానే ఉంటుంది. కానీ ఆలియాకు చైనీస్.. ఇటాలియన్.. మెక్సికన్.. ఇలా ఏ దేశపు వంటకానికైనా తోడు కూడా పెరుగు లేకపోతే ముద్ద దిగదట. ఆలియా పెరుగు పిచ్చి చూసి తోటివాళ్లంతా నవ్వుకుంటారట. నవ్విపోదురు గాక.. నాకేటి.. ప్లేట్లో పెరుగుంటే చాలు అనుకుంటూ వేళ్లకంటిన పెరుగును చప్పరించేస్తుందట. గుడ్లప్పగించి... సెలబ్రిటీలనెవరైనా గుడ్లప్పగించి చూస్తే బౌన్సర్లు వచ్చి కనుగుడ్లు పీకేసినా పీకేస్తారు. మరి సెలబ్రిటీలే అలా చూస్తే..! ఆ బుద్ధి ఉన్నది ఎవరికి?అని అడిగితే దీపికా పడుకోణ్ అని చెప్పాలి మరి. అవును.. ఎయిర్ పోర్ట్స్‌లో.. షాపింగ్ మాల్స్‌లో.. ఇలా పబ్లిక్ ప్లేసెస్‌లో ఎక్కడైనా కొత్తవాళ్లను కన్నార్పకుండా చూస్తుందట. ఆమెకున్న ఈ అలవాటు తెలియక ఆ స్ట్రేంజర్స్ జడుసుకుని వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోతారట. పాఫం..! ఆరుబయట... సొంత ఇల్లయినా.. అద్దె ఇల్లయినా సౌకర్యాలకు సంబంధించి రాజీ పడని అంశం.. బాత్రూమ్. మాజీ మిస్ యూనివర్స్.. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా అంతే. అసలు కాంప్రమైజ్ కాదు.. బాత్రూమ్లో స్నానం చేయని విషయంలో! మీరు చదువుతున్నది కరెక్టే.. ఆమెకు మేడ మీద.. ఆరుబయట స్నానం చేయడం ఇష్టం.. కంఫర్ట్ కూడా! అందులో రాజీ సమస్యే లేదు అంటుంది. ఈ గుట్టు చెప్పాం కదా అని ఆమె ఇంటి చుట్టూ ఉన్న మేడల మెట్లెక్కేయకండి! ఆ జాగ్రత్త ఆమెకు తెలుసు. -
వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?
హైదరాబాద్ మూసాపేటలో రెండు రోజుల క్రితం గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం? వాష్‌రూమ్‌ను వాడిన భర్త నీళ్లు కొట్టకపోవడంపై ఆమె విసుక్కుంది. భర్త వాదనకు దిగాడు. అంతే. స్త్రీలకు మగవారి దురలవాట్లు కొన్ని ససేమిరా నచ్చవు. వారు ఆ సంగతి చెప్పినప్పుడు వాటిని మానుకోవడం మగవాళ్ల కనీస సంస్కారం. ఎన్ని విధాలుగా చెప్తే మారుతారు మగవారు? నాన్నకు అమ్మ చెప్పలేదు. భర్తకు భార్య చెప్పలేదు. తండ్రికి కూతురు చెప్పలేదు. ఒకసారి చెప్పి ఉంటారు. విని ఉండరు. మరోసారి చెప్పి ఉంటారు. లెక్క చేసి ఉండరు. ఇంకోసారి చెప్పడం మానుకుని ఉంటారు. మానుకున్నారు కదా అని అలవాటు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిని తిరగేద్దాం. నాన్నకు స్కూటర్ ఉదయాన్నే శుభ్రంగా తుడిచి కనపడకపోతే కోపం వస్తుందనుకుందాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది. ఆయనకు కోపం వస్తుందని తనో పిల్లల చేతో ఆ పని చేయిస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్లే ముందు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే విసుగొస్తుందనుకుందాం. అమ్మ ఎంత అలెర్ట్‌గా ఉంటుంది. నాన్నకు ఫలానా సామ్రాణికడ్డి వాసన పడదనుకుందాం. అప్పుడు అమ్మ ఆ సామ్రాణి కడ్డీలను బయట పారేస్తుంది. నాన్నకు ఇష్టం లేనివి ఇంట్లో ఉండవు. కాని అమ్మకు ఇష్టం లేనివి? బాల్యం నుంచి ప్రభావాలు అమ్మ ఒక ఇంటి నుంచి వస్తుంది. నాన్న ఒక ఇంటి నుంచి వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక చోట చేరి జీవితం మొదలెడతారు. నాన్నకు ఎలాగైతే బాల్యం నుంచి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయో అమ్మకు కూడా అలాగే ఉంటాయి. కొన్ని తీవ్రమైన ఇష్టాలు అయిష్టాలు ఏర్పడి ఉంటాయి. కాని వాటికి నాన్న విషయంలో చెల్లుబాటయినట్టుగా అమ్మ విషయంలో కాదు. ఆ... ఏముందిలే.. అనే భావన. ఈ భావన ఇంకా ఎంత కాలం. అసలు అమ్మకు, భార్యకు, కుమార్తెకు ఇష్టం లేని అలవాట్లను మగవాళ్లు ఎందుకు కొనసాగించాలి. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగా నీళ్లు కొట్టరు.. విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. పైగా! చిన్న చిన్నవే అన్నీ... మనుషులు వైముఖ్యం కావడానికి ఎదుటి వారి మీద తీవ్రమైన అసహనం పెంచుకోవడానికి యుద్ధాలు రానక్కర్లేదు. చిన్న చిన్న దురలవాట్లు చాలు. ఉదాహరణకు స్త్రీలు ఇష్టపడని ఈ దిగువ విషయాలు ఎంత మంది పురుషులు ఇళ్ళల్లో కొనసాగిస్తారో గమనించండి. ►బయట నుంచి రాగానే చెప్పులు కుదురుగ్గా విడవరు. ►విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. లేదా వాష్ ఏరియాలో పడేయరు. లోదుస్తులు బాత్రూమ్లోనే వదిలేస్తారు. తడి టవల్ కుర్చీ మీద ఆరేస్తారు. ►సిగరెట్ డ్రాయింగ్‌రూమ్‌లో తాగి యాష్‌ట్రే క్లీన్ చేయకుండా వదిలేస్తారు. ►ఇయర్ బడ్స్ వాడి ఇంట్లో ఏదో ఒక మూలకు పడేస్తారు. ►వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు. ►షేవింగ్ చేసుకుని ఆ రేజర్ సింక్ మీదే వదిలిపెడతారు. ►అన్నం తిని ప్లేట్లోని చెత్తను డస్ట్‌బిన్‌లో వేయకుండానే సింక్‌లో పడేస్తారు. ►పెద్ద పెద్దగా కేకరిస్తూ పండ్లు తోముతారు. ►నిద్ర లేచాక దుప్పట్లు మడిచిన పాపాన పోరు ►బాత్రూమ్లోకి న్యూస్‌పేపర్ తీసుకెళ్లి తడి చేసి పట్టుకొస్తారు ►ఫోన్ ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకోరు, పైపెచ్చు ఇంట్లోవాళ్లు ఛార్జింగ్ పెట్టలేదని తిడతారు. ►గీజర్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయరు. ►వీటిలోని ఏ ఒక్కటి కొనసాగించినా స్త్రీలకు కష్టం. అలాంటిది ఇవన్నీ కొనసాగించేవారు ఉంటే ఆ స్త్రీలు ఎంత రోత అనుభవించాలి. అయినా సరే వారు భర్తలతో ఇంటి మగవారితో నవ్వుతూ వ్యవహరించాలని ఆశించడం ఏం భావ్యం. తప్పు చేస్తూ దబాయింపు ఇవన్నీ పురుషులు మానుకోగల అలవాట్లే. ఇంటి స్త్రీల మీద గౌరవం, ప్రేమ ఉంటే వెంటనే మానుకోవాలి కూడా. ఎప్పుడో ఒకసారి బద్దకించవచ్చు. కాని నిత్యం ఇదే పని అంటే అది ఏం సంస్కారం. ఏదో ఒకనాడు భరించలేక స్త్రీలు మందలిస్తే పురుషులు పౌరుషానికి పోయో, అహం కొద్దో, గిల్ట్తోటో స్త్రీలపై ఎదురుదాడి చేస్తే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమీ బాగుండవు. వ్యక్తుల బయట ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే సమాజం ఇబ్బంది పడుతుంది. ఇంటి ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే స్త్రీ మాత్రమే ఆ బాధ అనుభవిస్తుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా వినడే’ అని స్త్రీల లోలోపల విరక్తి గూడుకట్టుకోవడం ఏమీ మంచిది కాదు. కనుక మారడం పురుషుల విధి. వారికి నేరుగా చెప్పడం స్త్రీలకు వీలు కాకుంటే ఈ వ్యాసం చూపిస్తే సరి. -
కరోనా మార్చిన అలవాట్లు.. యుగోవ్ సర్వే ఏం చెప్తోంది..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్ పరిశోధన సంస్థ యుగోవ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటికొచ్చింది. ఈ మార్పులు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కాలం కొనసాగే అవకాశాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, భారత్, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 18 వేల మంది పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవి ఇవీ.. తగ్గిన జంక్‌ఫుడ్ వినియోగం కరోనా కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, లాక్డౌన్ విధించారు. వైరస్ తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. జంక్‌ఫుడ్‌కు బదులుగా ఎక్కువ పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తమ డైట్ చార్ట్‌లో చేర్చినట్లు 66 శాతం మంది సర్వే సందర్భంగా తెలిపారు. అదే సమయంలో మిగతా దేశాల్లోని 38% మంది ఈ విషయాన్ని అంగీకరించారు. 28% మంది జంక్‌ఫుడ్ తినడం తగ్గించినట్లు కూడా తెలిపారు. అదే సమయంలో భారత్‌లో 47% మంది ప్రజలు జంక్‌ఫుడ్ తగ్గించినట్లు పేర్కొన్నారు. మిగతా దేశాల్లోని 15% మంది ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం తగ్గించామని చెబితే, భారత్‌లో ఇది 32%గా ఉంది. అదే సమయంలో, భారత్‌లో 29%, చైనాలో 27% మంది ప్రజలు మునపటి కంటే అధికంగా మద్యం తీసుకున్నామన్నారు. ఇతర దేశాల వారిలో ఇది 25%గా ఉంది. కాస్మోటిక్స్‌పై తగ్గిన మోజు సర్వేలో మరో ఆసక్తికర విషయం సైతం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విధించిన ఆంక్షల ప్రభావం, కాస్మోటిక్ ఉత్పత్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని కారణంగా కాస్మోటిక్ కొనుగోళ్ళు తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో 36% మంది ప్రజలు ప్రస్తుతం కాస్మోటిక్ ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రపంచంలో 33% మంది ప్రజలు సౌందర్య ఉత్పత్తులను తక్కువగా కొనుగోలు చేశామని వెల్లడించారు. స్థానిక కిరాణా షాపులకు ఊతం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్మార్కెట్లు, పెద్ద దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే అలవాటు తగ్గి, దగ్గర్లోని చిన్న కిరాణా షాపులకు మారింది. భారతదేశంలో ప్రజలు చిన్న వ్యాపారానికి మద్దతు ఇస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు ఇంటి సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగించారు. మొత్తం 17 దేశాలలో 60% మంది స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని అనుకుంటున్నామని తెలిపారు. కావాల్సినవి మాత్రమే కొంటున్నారు ఈ మహమ్మారి సమయంలో కావాల్సిన వస్తువులను మాత్రమే కొంటున్నారని సర్వేలో తేలింది. ఇటువంటి షాపింగ్ ఇండోనేసియాలో 92%, భారతదేశంలో 90% మందికి, అగ్రరాజ్యం అమెరికాలోని 74% మందికి అలవాటైంది. మెక్సికోలో 83%, భారత్‌లో 81% మంది కరోనా కారణంగా తమ షాపింగ్ అలవాట్లు మారిపోయాయని చెప్పారు. అయితే ఈ ప్రభావం చైనీయులపై ఏమాత్రం కనిపించలేదు. కరోనా వల్ల వచ్చిన మార్పులతో చైనా మార్కెట్ తక్కువగా ప్రభావితమైంది. గతేడాది కరోనా వైరస్‌ను కనుగొన్న తరువాత చైనాలో లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉంది. -
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
అశ్వాలే అతడి నేస్తాలు..
జగిత్యాలఅగ్రికల్చర్: జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..అంటూ గుర్రంపై చిరంజీవి ఓ సినిమాలో వెళ్లడం చూస్తుంటే భళే మజాగా ఉంటుంది. అట్లాంటిది అశ్వాల మీద స్వారీ చేయాలనే కోరికతో జగిత్యాల ప్రాంతంలోని కొందరు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వాటిని కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు గుర్రాలపై వెళ్లి పనులు చేసుకోవాలనే నిర్ణయానికి బలం చేకూర్చాయి. అశ్వాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గుర్రాలను పెంచుతున్న ముగ్గురు రైతులు జగిత్యాల ప్రాంతంలో ముగ్గురు రైతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలు కొనుగోలు చేసి వాటిని పెంచుతున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన అరుణ్ క్రాంతి అంతర్గాం సమీపంలో డెయిరీ ఫాం, చేపలఫాం, కోళ్ల ఫాం, వ్యవసాయం కూడా చేస్తున్నాడు. గుర్రాన్ని లక్షకు గుజరాత్ నుంచి కొనుగోలు చేసి దానిపై తిరుగుతూ సరదా తీర్చుకుంటున్నాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మారిశెట్టి రవి అనే రైతు రెండు గుర్రాలను రూ.50 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేశారు. ఆ గుర్రాలపై రోజు పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. జగిత్యాల మండలం పెరుకపల్లికి చెందిన బెజ్జంకి హంసయ్య అనే రైతు రెండేళ్లక్రితం చిన్న వయసులో ఉన్న గుర్రాలను రూ.25 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచుతూ మురిసిపోతున్నాడు. ప్రత్యేకంగా గుర్రాల పెంపకం గుర్రాలను కొనుగోలు చేసిన రైతులు అరుణ్ క్రాంతి, మారిశెట్టి రవి వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. గుర్రాలకు ప్రతీ రోజు స్నానం చేయించడంతో పాటు పల్లిపిండి, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన దాణాను రోజు ఇస్తారు. దాణాకు నెలకు ఒక్కో రైతు కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు ప్రతీరోజు పచ్చి మేత ఆహారంగా ఇస్తున్నారు. గుర్రాల శరీర కండ పరిపుష్టికి రోజు కొద్దిదూరమైనా పరుగెత్తిస్తుంటారు. తారు రోడ్డు, కంకర రోడ్లు ఉండడంతో గుర్రాల కాళ్ల డెక్కలు దెబ్బ తినకుండా, గుర్రాల కాళ్లకు నాడెలు కొట్టిస్తున్నారు. ఎక్కువగా మట్టి రోడ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలకు ఏదైనా అనారోగ్యం వస్తే సమీపంలోని పశువైద్యుల వద్ద చికిత్స చేయిస్తున్నారు. గుర్రాల పేడను పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. -
సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి సిగరెట్ ముట్టనే ముట్టను.. మందు మొహమే చూడను.. చికెన్ మానేస్తా.. మటన్ మానేస్తా.. ఎక్సర్సైజ్ చేసేస్తా.. మంచోడిగా మారిపోతా.. ఇలా కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా చాలా అనుకుంటాం.. మనసులో ఒట్టు పెట్టేసుకుంటాం.. అయితే.. ఈ కొత్త ఏడాదులు వచ్చిపోతూనే ఉంటాయి.. ఒట్లు తీసి గట్ల మీద పెట్టేస్తునే ఉంటాం.. ఇక ఈ ఏడాది సంగతి చెప్పనక్కర్లేదు.. అనుకున్నదానికంతా రివర్స్ అయింది. మరికొన్ని రోజుల్లో 2021 వచ్చేస్తోంది.. మన దగ్గర మొదలైందో లేదో గానీ.. అమెరికావోళ్లు మాత్రం అప్పుడే అది చేయాలి ఇది చేయాలి అని ప్రతిజ్ఞలు మొదలుపెట్టేశారు. ఎక్కువగా ఈ ఏడాది ఇంట్లోనే ఉండటం.. సోషల్ డిస్టెన్స్.. దీనికితోడు జంక్ ఫుడ్ వంటివి బాగా లాగించేసి.. బొజ్జలు పెంచిన నేపథ్యంలో కొత్త సంవత్సరంలో దాన్ని తగ్గించే దిశగానే అలా చేస్తాం.. ఇలా చేస్తాం అని అనుకున్నారట..కొందరు రెండు మూడు గోల్స్ పెట్టుకున్నారంట.. దీనికి సంబంధించిన వివరాలను స్టాటిస్టా గ్లోబల్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. 1. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం 2. హెల్దీఫుడ్తింటాం.. 3. బంధుమిత్రులతో ఎక్కువ సమయం గడుపుతాం.. 4. బరువును తగ్గిస్తాం 5.పొదుపుగా జీవిస్తాం 6. సోషల్ మీడియాను చూడటం తగ్గిస్తాం.. 7. ఉద్యోగంలో సామర్థ్యాన్ని పెంచుకుంటాం 8. జాబ్‌లో పని ఒత్తిడిని తగ్గించుకుంటాం.. 9. సిగరెట్ మానేస్తాం 10. మందు తగ్గిస్తాం ఇంతకీ మీరేమనుకుంటున్నారు.. ఒకవేళ అనుకున్నా.. చేసే అలవాటు మీకుందా.. లేకుంటే.. ఎప్పట్లాగే.. ఇదే డైలాగ్ కొడతారా.. : సరె సర్లే చాలా అనుకుంటాం.. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం -
విమర్శించడం ఆపేద్దాం!
‘‘చెడు అలవాట్లకు బానిసయినవాళ్లను విమర్శించడం కంటే అసలు దానికి ఎందుకు బానిస అయ్యారనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ విమర్శించడం అలవాటై, ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం’’ అన్నారు నటి, దర్శకురాలు పూజా భట్. గతంలో ఆమె మద్యానికి బానిస అయి, అందులో నుంచి బయటపడ్డారు. పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావించారామె. తాజాగా మరోసారి మద్యం అలవాటు నుంచి బయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మూడు సంవత్సరాల తొమ్మిది నెలలయింది మద్యం మానేసి. ఇంకో మూడు నెలలయితే నాలుగేళ్లు పూర్తవుతాయి. నేను మందు ఎలా బహిరంగంగానే తీసుకున్నానో, అందులో నుంచి బయటపడిన విషయాన్ని కూడా ఓపెన్‌గానే చెబుతాను. ఎందుకంటే నా ప్రయాణం అందరికీ తెలియాలనుకున్నాను. మద్యం మత్తు నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్లకు స్ఫూర్తిగా ఉంటుందనుకున్నా. ఒక అలవాటు మానుకోవడానికి ఎంతో కృషి చేయాలి. మానేయాలనే పట్టుదలే మనల్ని మానేసేలా చేస్తుంది. మీరొక్కరే (మద్యానికి అలవాటుపడినవాళ్లు) ఒంటరిగా లేరు. మీలానే దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకోండి. ఇలా బయటకు మాట్లాడినందుకు చాలా మంది నన్ను అభినందించారు. కొందరు ఎగతాళి కుడా చేశారు. ఏదైనా విషయానికి బానిసలైతే దానికి ఎందుకు బానిసలయ్యారో కనుక్కోవాలి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు పూజా భట్. -
కరోనా నేర్పిన కొత్త జీవితం..
విజయనగరం: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు... జీవితాల్లోనూ ఎన్నో మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ప్రజల జీవనం కరోనాకు ముందు.. తర్వాత అన్నంతగా మారిపోయాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు ఇంటికే పరిమితమైన జనం గత కొద్ది రోజులుగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మనసులో మెదిలే భయాందోళన నడుమ.. మున్ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవనయానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా భయంతో కొన్ని విషయాల జోలికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. కొత్త తరహా జీవితానికి నాంది పలుకుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. పునర్వినియోగం కానివే మేలు.. నిన్నమొన్నటి వరకు పునరి్వనియోగించే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. కరోనాతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పునరి్వనియోగం జరగని వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక్కసారి వాడిపారేసే వస్తువులైతే మరొకరు తాకే అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీనివల్ల ఒక్కసారి వాడిపారేసే పెన్నులు, సంచులు, తినబండారాల ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు.. తదితర వస్తువుల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలుష్య కారక వస్తువులకు దూరంగా ఉంటున్నారు. వ స్తువులను తాకేందుకు భయపడుతున్నారు. సాయం అడిగినా.. వాహనం ఆగదే ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైంది.. లాక్డౌన్ సడలింపులు అనంతరం కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నడిచి వెళ్తుంటే వాహనదారులు ఆగి మరీ లిఫ్టు ఇచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పుడు కరోనా భూతం కారణంగా లిఫ్టు అడిగినా ఆపేందుకు వాహనదారులు జంకుతున్నారు. తెలిసిన వ్యక్తులకు దూరంగా ఉంటున్న సమయంలో తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడమా.. అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన పార్టీల జోరు... ఆధునిక ప్రపంచంలో కష్టం వచ్చినా... ఆనందం వచ్చినా పారీ్టల జోరు పెరిగిందనే చెప్పాలి. ఏ చిన్న విజయం సాధించినా ‘దావత్ ఎప్పుడు మామా’ అని అడగడటం మనకు అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిరోజుల పాటు దావత్‌లు బంద్ కావాల్సిందే. జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు దావత్ల ద్వారా విస్తరిస్తున్నవే. సరదాగా గడిపేందుకో లేదా పుట్టినరోజనో ఒకచోట చేరి పార్టీ చేసుకున్న సందర్భాల్లో కరోనా పంజా విసురుతోంది. అందుకు దావత్‌లకు ప్రజలంతా దూరంగా ఉంటున్నారు. వ్యక్తిగత రవాణాకే మొగ్గు ప్రస్తుతం జిల్లాల బస్సులకే ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన తక్కువేనని చెప్పాలి. బస్సుల వద్ద శానిటైజర్లు వంటివి ఉంచామని అధికారులు చెబుతున్నా.. ప్రజా రవాణాకు మొగ్గు చూపేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. నగరంలోనూ వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్లునే ప్రయాణానికి వినియోగిస్తున్నారు. బైక్‌లపై ఒక్కొ క్కరే ప్రయాణిస్తున్నారు. తీసుకెళ్లండి.. తినండి.. లాక్‌డౌన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు రద్దీగా కనిపించేవి. ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినా భోజన ప్రియులు మాత్రం వచ్చేందుకు జంకుతున్నారు. పది మందిలో కలిసి తింటే కరోనా వైరస్ వ్యాప్తిస్తుందన్న భయంతో కేవలం పార్సిల్ సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చుని తినాలంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి. పార్సిల్ తీసుకెళ్లడం ద్వారా ఇంట్లోనే ఉండి తినే వీలుంటుంది. నగరంలోని ఓ హోటల్లో టేబుల్‌కు ఒక్కరు చొప్పునే వడ్డింపు జాగ్రత్తలతోనే ఆరోగ్యకర జీవనం ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోడం తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం నిత్యకృత్యం చేసుకోవాల్సిందే. ప్రపంచా న్ని గడగడలాడిస్తున్న వైరస్ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమం. – ఎస్.ఎస్.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ -
అచ్చోసిన అబద్ధం!
ఇవ్వాళ ఒక అబద్ధం చెప్పడానికి అలవాటు పడినవాడు...రేపు వంద అబద్ధాలు చెప్పడానికైనా వెనకాడడు. వ్యసనాల బారిన పడ్డవాడు మొదట సుఖంగా ఉన్నట్లు అనిపించినా ఆ తరువాత అతడి జీవితం ఎలా కష్టాలమయమవుతుందో చెప్పే చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరు చెప్పుకోండి చూద్దాం... ఆ కుర్రాడు రిటైర్డ్ జడ్జీగారి చిన్న కొడుకు.దేవుని ఎదుట ప్రమాణం చేసినా చేయకపోయినా....అన్నీ అబద్ధాలే చెబుతాడు.నమ్మినవాళ్లకు నమ్మినన్ని అబద్ధాలు!ఈ కుర్రాడు ఒక్క రోజూ కూడా కాలేజీకి డుమ్మా కొట్టడు. కారణం చదువు మీద శ్రద్ధ కాదు. అమ్మాయిల మీద శ్రద్ధ!అందుకే ఈ కుర్రాడు మరియు అతని అనుచరగణం ఎప్పుడు బయటికి వెళతారో అని చూస్తుంటాడు లెక్చరర్.అదిగో ఆ క్లాస్ వైపు చూడండి...‘‘అందరికీ ప్రెజెంట్ అని వేశాను’’ అన్నారు లెక్చరర్‌గారు అప్పుడే వచ్చిన ఆ కుర్రగ్యాంగ్ను చూస్తూ.‘‘థ్యాక్సండీ’’ అని లెక్చరర్గారికి కృతజ్ఞతలు చెప్పి స్నేహితుల వైపు తిరిగి..‘‘అటెండెన్స్ అయిపోయింది. ఇక మనం వెళదాం’’ అని పిలుపునిచ్చారు అబ్బయిగారు.‘‘అటెండెన్స్ అయిపోగానే అదృశ్యమైపోతే మాస్టారుగారు రోదిస్తారురా’’ వెక్కిరింపు గొంతుతో అన్నాడు ఆ గుంపులో ఒకడు.‘‘ఆయనేం ఫీల్ అవ్వరురా. హాయిగా పండగలా ఫీలై పాఠాలు చెబుతారు’’ అసలు నిజాన్ని ఆవిష్కరించాడు మరొకడు.‘‘నిజంగానా, అయితే రాండ్రా వెళ్లిపోదాం’’ అని అమాయకపు ముఖం పెట్టాడు జడ్జిగారి అబ్బాయి.ఒకడు వెళుతూ వెళుతూ లెక్చరర్గారిని ఇలా ఆశీర్వదించాడు...‘‘పాఠాలు బాగా చెప్పి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే ప్రమోషన్ వచ్చి ప్రిన్సిపల్ అవుతారు’’‘‘వెళ్లొస్తాం సార్’’ అన్నాడు ఒకడు లెక్చరర్‌కి నమస్కరిస్తూ.‘‘మీదే ఆలస్యం’’ అన్నారు లెక్చరర్.గుంపు క్లాస్ విడిచి బయటికి వెళ్లింది. ‘హమ్మయ్య’ అనుకున్నారు లెక్చర్గారు మరియు విద్యార్థులు.వాళ్లు కాలేజీ నుంచి సరాసరి క్లబ్బుకు వెళ్లారు.ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగొచ్చారు అబ్బాయిగారు.‘‘అదేనమ్మా నడిరోడ్డు మీద లారీ కొట్టీ బామ్మ రోడ్డు మీద రక్తంలో మెడ తెగిన కోడిలా గిలగిలా కొట్టుకుంటుంటే’’‘‘శివా శివా... ఇక చెప్పకురా బాబు. ఆ ఘోరాన్ని వినలేను. ఇంతకీ ఆమె ప్రాణాలతో ఉందా?’’ అడిగింది పార్వతి.‘‘నేనే లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అర్ధరాత్రి అయినా అమ్మ తిట్టినా సరే అని బామ్మగారిని హాస్పిటల్లో చేర్పించాను. రక్తం తక్కువైతే నా రక్తం ఇచ్చా. దేవతలాంటి ఈ తల్లి రక్తం పంచుకు పుట్టాను. ఇందులో కాస్త అమ్మకు ఇవ్వాలనుకున్నాను. తప్పంటావా అమ్మ?’’ నాటకీయంగా మెలికలు తిరిగారు అబ్బాయిగారు.ఆ పిచ్చితల్లి నిజంగానే నమ్మింది!‘‘తప్పేముంది బాబూ! ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం లక్ష పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఒకటే. కానీ నువ్వు ఇలా ఆలస్యంగా వచ్చావని మీ నాన్నకు తెలిస్తే కారణం ఏమైనా సరే ఆయన మండిపడతారు’’ ఒకవైపు కొడుకును మెచ్చుకుంటూనే రాబోయే ప్రమాదాన్ని గురించి చెప్పింది పార్వతి.ఆ ప్రమాదం దగ్గరికి రానే వచ్చింది.‘‘మండిపడతారు కాదు పడుతూనే ఉన్నాను’’ అన్నారు తల్లికొడుకుల దగ్గరికి వచ్చిన జడ్జిగారు చుట్టకాలుస్తూ.‘‘కాలం విలువ తెలియకుండా వీడు తిరగడం, ఏంట్రా అని అడిగే లోపల ఏదో హరికథ, బుర్రకథ వినిపించడం నువ్వు నమ్మడం’’ అంటూ భార్యపై కన్నెర్రచేశారు జడ్జిగారు.‘‘బుర్రకథ ఏమిటండీ! ఎవరో బామ్మ చనిపోబోతుంటే..’’ అని ఆ పార్వతమ్మ అమాయకంగా అంటుంటే...పుత్రుడుగారు అందుకున్నారు... ‘‘అదేనమ్మా...బామ్మగారి బుర్ర బద్దలైపోయింది కదా. అందుకే బుర్రకథ అంటున్నారు నాన్నాగారు’’‘‘నోర్ముయ్. నువ్వు చెప్పే అబద్ధాలు మీ అమ్మలాగే నేను నమ్ముతాననుకుంటున్నావా?’’ అంతెత్తున లేచారు జడ్జిగారు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను.అబద్ధం చెప్పను. నిజంగా ఒక బామ్మగారికి యాక్సిడెంట్ జరిగింది’’ నాన్నను నమ్మించబోయాడు కొడుకు.‘‘ఛస్తే నమ్మను’’ అన్నారు ఆయన ముఖం అదోలా పెట్టి.‘‘రిటైర్డ్ జడ్జిగారు కదమ్మా. కోర్టులో ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పే సాక్షులను చూసీ చూసీ నాదీ అబద్ధమే అనుకుంటున్నారు’’ అని లేని బాధను తెచ్చుకున్నారు అబ్బాయిగారు. అమ్మ చేతిని తన చేతిలో తీసుకొని...‘‘అమ్మా...అన్నం పెడుదువుగాని రా’’ అన్నాడు.‘‘వాడికి పెట్టాల్సింది అన్నం కాదు గడ్డి. చదువు, సంధ్య వదిలి, పరువు మర్యాద మరిచి పశువులా తిరిగేవాడికి గడ్డి పెట్టాలి గడ్డి’’ అని ఉరిమారు జడ్జిగారు.‘‘అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బిడ్డను తిండి తిన్నావా? లేదా? అని అడగడం మానేసి ఇంతసేపు చీవాట్లు పెట్టడం చాలక గడ్డిపెట్టాలట. పాపం పసివాణ్ణి చేసి అస్తమానం మాటలు అనడమే మీ పని’’ అంటూ పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఊరుకోమ్మా...ప్రపంచంలో ప్రతి మహాత్ముడు మొదట్లో పదిమంది చేత ఇలా మాటలు పడ్డవారే. వీటిని పట్టించుకోకు’’ అంటూ తనకు తానే మహాత్ముడి హోదా ఇచ్చేసుకున్నారు అబ్బాయిగారు.‘‘ఛీ...నువ్వెందుకు పట్టించుకుంటావురా. అసలు నీకు సిగ్గు, అభిమానం ఉండి ఛస్తేగా’’ అని కొడుకును తిట్టి ఆ తిట్లలో సగం భార్యకు ఇలా పంచారు జడ్జిగారు.‘‘పసివాడు పసివాడు అని గారాబం చేసి పనికిమాలినవాడిని తయారుచేశావు’’పెద్దకొడుకు, రెండో కొడుకును గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు...‘‘ఆ పెద్దవాళ్లిద్దరూ నా పెంపకంలో పెరిగారు కాబట్టి పరువు దక్కించే పద్ధతిలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. మరి వీడు?’’‘‘అవుతాడు నాన్నాగారు అవుతాడు. వీడు గొప్పవాడవుతాడు. తొందరపడవద్దు’’ అన్నారు అబ్బాయిగారు.‘‘నువ్వా! నాకు కొరివి పెట్టేలోగా నా పేరు ప్రతిష్ఠలకు నిప్పెడతావు. నేను బూడిదయ్యేలోగా ఈ ఇంటిపేరు మట్టిపాలు చేస్తావు’’ అని గట్టిగా అరిచారు జడ్జిగారు.‘‘అబ్బా! వేళాపాళా లేకుండా ఏమిటండీ ఆ అపశకునపు మాటలు’’ అని భర్తను సముదాయించడానికి ప్రయత్నించింది పార్వతమ్మ. -
అంతా మీరే చేస్తున్నారు!
ఒకప్పుడు ఒబేసిటీ బాధితులు చాలా తక్కువ. మరి ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి 100 మందిలో 30 మంది దీనిబారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటి? ఇదేమైనా అంటువ్యాధా? ..ఎస్, అవుననే అంటున్నాయి పరిశోధనలు. అనారోగ్య సమస్య నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకపోయినా.. అందుకు కారణమయ్యే అలవాట్లు మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయట. ఉదయాన్నే లేవడం, ఇంటి పని చకచకా చేసుకోవడం, ఇంట్లో తయారుచేసే టిఫిన్ తినేసి పనులకెళ్లడం, సాయంత్రం వచ్చాక కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడపడం, పొద్దుగూకిన మరుక్షణమే పడుకోవడం.. ఇవన్నీ కనుమరుగై చాలారోజులే అయ్యింది. కాలచక్రం కాస్త.. కాదు కాదు.. బాగానే ముందుకు కదిలింది. రాత్రి ఒంటిగంట దాటిన తర్వాతే నిద్ర. పొద్దున 10 దాటిన తర్వాతే పక్కదిగడం. ఇక ఫోన్లో ఆర్డరిచ్చి, కార్లో తినేయడం, కదలకుండా గంటల తరబడి కుర్చీలో కూర్చొని పనిచేయడం, ఇంటికొచ్చాక సోఫాలో సాగిలబడి టీవీకి అతుక్కుపోవడం, వంటి అలవాట్లే మన కొంప ముంచుతున్నాయి. అలాగే రాబోయే తరాల ఆరోగ్యాన్నీ మనమే పాడుచేసేలా చేస్తున్నాయి. కారణం చిన్నపిల్లలు మనల్ని చూసి ఇలాంటి అలవాట్లు అనుకరిస్తుండడమే. అంటు వ్యాధిలా అలవాట్లు..: తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఎన్నో నేర్చుకుంటారు. వారి ఆహార్యాన్ని అనుకరించడమేకాదు.. అలవాట్లనూ పాటిస్తారు. పేరెంట్స్ ఒబెసిటీ మార్గంలో నడిస్తే.. పిల్లలూ అదేబాట అనుసరించి రేపటి ఒబెసిటీ పేషెంట్లవుతారు. అమెరికాలోని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు 286 కాలేజీల విద్యార్థుల అలవాట్లను పరిశీలించి, కారణాలను విశ్లేషించి చెప్పిన సంగతిది. ఇలా అలవాట్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వల్లే యువతరం ఒబేసిటీ బారిన పడుతున్నారని తేల్చారు. -
ఈ ఐదు అలవాట్లతో మరో పదేళ్ల ఆయుష్షు
బోస్టన్ : జీవితకాలాన్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. నిండు నూరేళ్లు బతకాలని ప్రతి మనిషికీ ఉంటుంది. వీలైతే సెంచరీ దాటాలనుకుంటారు. అయితే ఆయుష్షును పెంచే ప్రయత్నాలు చేయడంలో మాత్రం బద్ధకాన్ని చూపుతాడు. కానీ ఈ ఐదురకాల అలవాట్లతో దీర్ఘకాలంపాటు బతకొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, పోగతాగకపోవడం వంటివి పాటిస్తే మన ఆయుఃప్రమాణం మరో పదేళ్లు పెరుగుతుందని అమెరికాలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా 78,865 మంది మహిళల 34 ఏళ్ల డేటాను, 44,354 మంది పురుషుల 27 ఏళ్ల డేటాను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. -
ఎండు కొమ్మ
‘‘నవ్వితే మీరు బాగుంటారు!’’తలతిప్పి చూశాడు ఫ్రెడ్డీ. మామూలుగా చూడ్డం కాదు. విసురుగా చూశాడు.‘‘ఎవరు మీరు?’’ అన్నాడు.‘‘హారతి’’ అంది నవ్వుతూ.‘‘లుక్.. మీరు కూడా ఇదే ఆఫీస్‌లో, ఇదే సెక్షన్లో పని చేస్తుంటారన్నంత వరకే మీరు నాకు తెలుసు. మీరు కూడా నా గురించి అంతకుమించి తెలుసుకోవడాన్ని నేను ఇష్టపడను’’ అన్నాడు ఫ్రెడ్డీ వీలైనంతసౌమ్యంగా.చేతులతో హారతి తిప్పినట్లుగా.. ఫ్రెడ్డీ ముఖం చుట్టూ కళ్లు తిప్పింది హారతి.‘‘నిజం. నవ్వితే మీరు బాగుంటారు’’ అంది హారతి మళ్లీ.‘‘నాకు నవ్వే అలవాటు లేదు’’ అన్నాడు ఫ్రెడ్డీ కోపంగా.‘‘అందుకే అంటున్నా.. నవ్వితే బాగుంటారని’’.. అనేసి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ. నిజానికి హారతి ఆ రోజు దేవతలా ఉంది. రోజూ చుడీదార్లో ఆఫీసుకు వచ్చే హారతి, ఆ రోజు చీరలో వచ్చింది. ఆఫీస్‌లో చేరి రెండు నెలలు అవుతున్నా ఫ్రెడ్డీని పలకరించే చొరవ చేయని హారతి ఆ రోజు అతడి డెస్క్ దగ్గరికి వెళ్లి మరీ పలకరించింది. చుడీదార్లోని హారతికి, చీరలోని హారతికీ ఉన్న తేడాను ఫీల్ అవలేదు ఫ్రెడ్డీ. అసలతడు చుడీదార్లో ఉన్న హారతినైనా ఏనాడైనా చూస్తేనే కదా!హారతి న్యూ రిక్రూటీ. ఫ్రెడ్డీ ఆల్రెడీ అక్కడ రెండేళ్ల నుంచీ ఎంప్లాయీ.ఎప్పుడూ సీరియస్‌గా ఉండే ఫ్రెడ్డీని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే హారతిని చూస్తే ఆ సెక్షన్లో ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది. కొట్టుకుని చావడానికి ముచ్చటైన జంట అని.‘‘మేడమ్ పిలుస్తున్నారు’’.బాయ్ వచ్చి చెప్పాడు ఫ్రెడ్డీకి. మేడమ్ కోపంతో ఉన్నారని అర్థమైంది ఫ్రెడ్డీకి. జనరల్‌గా ఆమె ఇంటర్కమ్లోనే ఫ్రెడ్డీని పిలుస్తారు.డోర్ నెట్టుకుని కాబిన్లోకి వెళ్లి, మేడమ్ ఎదురుగా నిలబడ్డాడు.‘‘వాష్‌రూమ్‌తో అవసరం రాకుండానే అమ్మాయిలు పని మధ్యలో వాష్‌రూమ్‌కి ఎందుకు వెళ్లొస్తారో తెలుసా ఫ్రెడ్డీ’’ అని అడిగారు ఆవిడ.. శాంతంగా.ఫ్రెడ్డీ బ్లాంక్ ఫేస్ పెట్టాడు.‘‘నాకెలా తెలుస్తుంది మేడమ్!’’ అన్నాడు.‘‘చెప్తాను విను. నీలాంటి స్టుపిడ్స్ ఏడిపిస్తే.. ఏడ్చి ముఖం కడుక్కోడానికి వెళ్తారు’’ అన్నారు ఆవిడ. ఫ్రెడ్డీ ముఖంలోకి కోపం రక్తంలా చిమ్మింది. ‘‘ఏమంటున్నారు మేడమ్!’’ అన్నాడు.‘‘బిహేవ్ యువర్సెల్ఫ్ అంటున్నాను ఫ్రెడ్డీ. ఆడపిల్లలు ఉన్న చోట పనిచేస్తున్నావ్. వాళ్లేం దెయ్యాలు కాదు నిన్ను పీక్కు తినడానికి. ఇవాళ హారతిని ఏమన్నావ్.. చెప్పు’’ అన్నారు ఆవిడ.‘‘హారతి ఎవరు మేడమ్!’’ అన్నాడు ఫ్రెడ్డీ.నిజంగానే అప్పుడతడు హారతి ఎవరా అని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ హారతి ఎవరో అతడికి గుర్తొచ్చినా, హారతిని అతడేమన్నాడో అతడికి గుర్తుకొచ్చేది కాదు. గుర్తుపెట్టుకునేవీ, గుర్తు చేసుకునేవీ ఏవీ ఉండవు అతడి మాటల్లో.ఫ్రెడ్డీని తీక్షణంగా చూశారు ఆవిడ.‘‘హారతి ఎవరా? ఈ ఒక్క మాట చాలు ఫ్రెడ్డీ.. అమ్మాయిలంటే నీకెంత చులకన భావనో చెప్పడానికి. గో... గో అండ్ డూ యువర్ వర్క్’’ అన్నారు అసహనంగా.‘‘దెయ్యం’’.తిట్టుకున్నాడు ఫ్రెడ్డీ.. క్యాబిన్ బయటికి రాగానే.అతడు తిట్టుకున్నది మేడమ్‌ని కాదు. తనపై మేడమ్‌కి కంప్లయింట్ చేసిన అమ్మాయిని. అప్పుడైనా హారతిని అతడు ఓ అమ్మాయి అనుకున్నాడు తప్ప, హారతి అనే అమ్మాయి అనుకోలేదు. ఫ్రెడ్డీని కొత్తలో కొందరు రెడ్డీ అనేవాళ్లు. రెడ్డీ కాదు, ఫ్రెడ్డీ అని తెలిసి ‘అదేం పేరో?’ అనుకునే వారు.ఫ్రెడ్డీకి అమ్మానాన్న ఎవరో తెలీదు. ఊహ రాకముందే ఒక చర్చి ఫాదర్‌కు దత్తతగా వచ్చేశాడు. దత్తతకు ఇచ్చినవాళ్లు మళ్లీ చూడ్డానికి రాలేదు. చాలాకాలం పాటు అతడు.. పిల్లలందరికీ ఫాదర్ మాత్రమే ఉంటాడని, అది కూడా చర్చి ఫాదర్ మాత్రమే ఉంటాడని అనుకున్నాడు. కొద్దిగా వయసొచ్చాక అతడికి తెలిసిఆశ్చర్యపోయిందేమి టంటే.. పిల్లలకు మదర్ కూడా ఉంటుందని! మరి తనకెందుకు మదర్ లేదనే ఆలోచన రాకుండా పెంచాడు ఫాదర్.. ఫ్రెడ్డీని.ఫాదర్ దగ్గర ఫ్రెడ్డీ అనే కుక్కపిల్ల ఉండేది. అదంటే ఆయనకు వాత్సల్యం. అది చనిపోయిన రోజే వాడు దొరికాడు కాబట్టి ఫ్రెడ్డీ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పోయాక ఒక్కడే మిగిలాడు ఫ్రెడ్డీ. ఎవర్నీ దగ్గరకురానివ్వలేదు. ఎవరికీ దగ్గరగా వెళ్లలేదు. ఆ ఇంట్లో స్త్రీ లేదు కాబట్టి, అతడి జీవితంలోనూ స్త్రీ లేదు. మేడమ్ తనని ‘స్టుపిడ్’ అని తిట్టిన రోజు రాత్రి సెమెట్రీకి వెళ్లి చాలాసేపు ఫాదర్ సమాధి దగ్గర కూర్చొని వచ్చాడు ఫ్రెడ్డీ. మేడమ్ తిట్టడానికీ, అతడు సెమెట్రీకి వెళ్లడానికీ సంబంధం లేదు. వెళ్లానిపించింది, వెళ్లాడు. లేచి వచ్చేస్తుంటే, వెనుక నుంచి ఓ చెయ్యి అతడి భుజాన్ని తట్టింది! అది మగ మనిషి తట్టినట్లు అనిపించలేదు. ఆడ మనిషి తడితే ఎలా ఉంటుందో అతడికి తెలిసే అవకాశం లేదు. మరి ఎవరు తట్టినట్లు? వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో మసగ్గా ఏదో కనిపించింది. ఎండు కొమ్మకు ఊగుతున్న ఫొటో ఫ్రేమ్ అది. అదే తన భుజానికి తగిలినట్లుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. ఎవరిదో అమ్మాయి ఫొటో. ఒక అమ్మాయిని అంత దగ్గరగా చూడ్డం ఫ్రెడ్డీ జీవితంలో అదే మొదటిసారి. ఆమె కళ్లల్లో ఎంత కాంతి! చేతివేళ్లతో ఫొటోలోని ఆ అమ్మాయిని తాకాడు. ఒక అమ్మాయిని టచ్ చెయ్యడం జీవితంలో అదే మొదటిసారి ఫ్రెడ్డీకి. ఎందుకో తెలియదు.. అతడికి ఏడుపు రాబోయింది. ఇంటికి వచ్చేశాడు. ‘‘సారీ.. అబద్ధం చెప్పి, మేడమ్ చేత మిమ్మల్ని తిట్టించాను’’ అంది హారతి.‘‘మీరే కదా నిన్న నా దగ్గరికి వచ్చిన హారతి’’ అన్నాడు ఫ్రెడ్డీ, తలతిప్పి చూసి.ఆ అమ్మాయి ముఖం వెలిగిపోయింది. ఫ్రెడ్డీ నోటి నుంచి తన పేరు వినడం ఆమెకు బాగుంది.‘‘ఏం చెప్పారు మేడమ్‌కి నా మీద’’ అని అడిగాడు.‘‘నన్ను మీరు దెయ్యం అన్నారని చెప్పాను’’ అంది హారతి.నవ్వాడు ఫ్రెడ్డీ.‘‘నవ్వకపోయినా మీరు బాగుంటారు’’ అని, అతడి చేతిని తన చేత్తో చిన్నగా తాకి వెళ్లిపోయింది హారతి.‘‘దెయ్యం’’నవ్వుకున్నాడు ఫ్రెడ్డీ.రాత్రి తను తాకిన అమ్మాయిలా అనిపించింది, ఇప్పుడు తనని తాకి వెళ్లిన అమ్మాయి! - మాధవ్ శింగరాజు -
రాయండి... రాయండి!
మన కోసం... ఈ సాంకేతిక యుగంలో యువత పెన్ను పట్టుకోవడం అనేది అరుదైన విషయంగా మారింది. సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నా... కొన్ని అలవాట్లను మాత్రం అందులో నుంచి మినహాయించుకోవాలి.కాగితం మీద కలంతో రాయడం అనేది అందులో ఒకటి. మీ మనసులో రకరకాల భావాలు ఉండవచ్చు. అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని కాగితం మీద రాస్తూ ఉండండి. కంప్యూటర్ మీద టైప్ చేయడం కన్నా కలంతో రాయడంలోని మజాను అనుభవించండి. - హృతిక్ రోషన్, హీరో