High alert
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘బాంబు’ అలజడి
హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ హల్ చల్ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో.. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు.మరోవైపు.. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో పైగా విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై.. అది ఉత్తదేనని తేల్చారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు.. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించే దిశగా పౌర విమానయానశాఖ ఆలోచన చేస్తోంది. అయితే అందుకు తగ్గట్లు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు.ఇదీ చదవండి: మా జీతాల్లో కోతలు వద్దు సార్! -
ఓవైపు పోలింగ్.. మరోవైపు కంచెలేసి హైఅలర్ట్ పరిస్థితులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్‌ను మోహరించాయి.గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా. ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్‌లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్‌తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. -
ఇజ్రాయెల్ హై అలర్ట్
టెల్ అవీవ్: ఇరాన్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఎప్పుడు, ఎలా దాడి చేయనుందో కచ్చితంగా తెలియనప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం అత్యున్నత స్థాయి అప్రమత్తత ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పైకి విరుచుకుపడటం తెలిసిందే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూడా ఇరాన్‌పై రెండు సార్లు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఇజ్రాయెల్‌పైకి దాడి చేసే శక్తి, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సామర్ధ్యం ఈ దాడులతో దెబ్బతిన్నట్లు రూఢీ అయ్యింది. ‘ఇజ్రాయెల్ చేసిన దాడులను అతిగా చూపలేం, అలాగని తక్కువని చెప్పలేం’అని సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీయే స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయినప్పటికీ, ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. -
దానా తుఫాన్ ఉగ్రరూపం
-
ఎడతెరిపిలేని వాన
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో విద్యాసంస్థలకు అత్యవసరంగా సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సగటున 54.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి జిల్లాలో సగటున 25.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఒంగోలు బస్టాండ్ సెంటర్ సహా నగరంలోని కాలనీలన్నీ జలమయం అయ్యాయి. జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయ భవనంలోకి వర్షం నీరు చేరింది. వైఎస్సార్ జిల్లాలో చిరుజల్లులు కురిశాయి. సిద్ధవటంలో అత్యధికంగా 29.6 మి.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం నుంచి భీకర శబ్దాలు వెలువడుతున్నాయి. సముద్రాన్ని చూసేందుకు వెళ్లే వారిని స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు.తిరుమలలో హై అలర్ట్ తిరుమల: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికపై టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన అధికారులతో సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 48 గంటల్లో తిరుమలలో విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని కోరారు.కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్య శాఖ అంబులెన్సులను అందుబాటులో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ దృష్ట్యా 15న మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.రైళ్ల రాకపోకలకు అంతరాయం తెనాలి రూరల్: భారీ వర్షాల కారణంగా చెన్నై–విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పొన్నూరు–బాపట్ల స్టేషన్ల మధ్య డౌన్ లైన్ వద్ద భూమి కుంగుతోంది. దీని కారణంగా పట్టాలు దెబ్బతిని రైళ్లు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ డౌన్ లైన్లో మాచవరం స్టేషన్ వద్ద నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపడుతున్నారు. ఈ కారణంగా పలు రైళ్లను బాపట్ల, చీరాల, ఒంగోలులో నిలిపివేశారు. చెన్నైలో ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై, కోయంబత్తూరు తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరం, శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు అతి భారీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఈ నాలుగు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెల 18 వరకు వర్క్›ఫ్రం హోం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. -
పండుగల వేళ..ఢిల్లీలో హై అలర్ట్
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. పండుగల నేపథ్యంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారమందినట్లు తెలుస్తోంది. విదేశీయులను రక్షణ కవచంగా ఉపయోగించుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. కొన్ని దేశాల రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చని అనుమానిస్తున్నారు.పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద తనిఖీలను పెంచాలని హోం శాఖ నుంచి పోలీసులకు ఆదేశాలందాయి. మరోపక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాద ముఠాలు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ‘ఆప్’ ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు -
ముంబైలో హై అలర్ట్..
-
ఉగ్రదాడుల ముప్పు?.. ముంబై హైఅలర్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరానికి ఉగ్రదాడుల ముప్పు పొంచివున్నదంటూ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు హైఅలర్ట్ ప్రకటించారు. పండుగల సీజన్లో ముంబై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందనే ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌తో నగరం అప్రమత్తమైంది.నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. మతపరమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే పలుచోట్ల పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ముంబై నగర డీసీసీ భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఎవరైనా గుర్తిస్తే, ముందుజాగ్రత్త చర్యగా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రద్దీగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇది పండుగల సీజన్లో భద్రత కోసం చేస్తున్న కసరత్తు అని పోలీసు అధికారులు తెలిపారు.ఇటీవలే ముంబైలో 10 రోజుల గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు దుర్గాపూజ, దసరా, దీపావళికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పండుగల సమయంలో మార్కెట్లో రద్దీ అధికంగా ఉంటుంది. దేవాలయాలలో పూజలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికితోడు 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: పాక్‌కు ఘాటుగా బదులిచ్చిన భారత్ -
UP Bahraich: వేటాడుతున్న తోడేళ్లు.. మరో చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా వాసులను గత రెండు నెలలుగా తోడేళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 30 గ్రామాల ప్రజలకు వణికించేస్తున్నాయి. రాత్రి సమయాల్లో గ్రామాలపై దాడులు చేసి. ఇళ్లలోని చిన్నారులను ఎత్తుకెళ్లి చంపి తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. దీంతో బహ్రైచ్‌లోని 35 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు.తాజాగా తోడేళ్ల బీభత్సానికి రెండేళ్ల బాలిక బలైంది. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన తోడేళ్ల తాడిలో అంజలి అనే బాలిక మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడగా.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు తోడేళ్లను బంధీంచేందుకు అటవీ శాఖ అధికారుల వేట కొనసాగుతుండగానే ఈ దాడులు వెలుగుచూశాయి.గాయపడిన ముగ్గురిలో కమలా దేవి అనే మహిళ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్కు వెళ్లగా తమపై తోడేలు దాడి చేసినట్లు చెప్పింది. తన మెడ, చెవిని గాయపరిచిందని, వెంటనే కేకలు వేయడంతో అవి పారిపోయినట్లు తెలిపింది.#WATCH | Uttar Pradesh: On the death of a child attacked by a wolf, Monika Rani, DM Bahraich says, "We have caught 4 wolves, 2 are left... Our team is continuously patrolling, we are trying our best to catch them as soon as possible...I request people to sleep indoors...A… pic.twitter.com/Obk5dSqMKt— ANI (@ANI) September 2, 2024 బహ్రైచ్ జిల్లా కలెక్టర్ మోనికా రాణి మాట్లాడుతూ.. తోడేళ్ల డుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి లోపలే నిద్రించాలని సూచించారు. ఇప్పటి వరకు ‘ఆపరేషన్ బేడియా’ కింద నాలుగు తోడేళ్ళను పట్టుకున్నామని మరో రెండింటి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. తమ అధికారుల బృందం నిరంతరం పెట్రోలింగ్ చేస్తోందని, మిగిలిన తోడేళ్ళను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా బహ్రైచ్ తోడేళ్ల ఘటనలు పొరుగున ఉన్న బిహార్‌లో భయాందోళన సృష్టిస్తోంది. బిహార్‌లోని మక్సుద్పూర్ కోటలో తోడేళు అనుకొని పలువురు నక్కను అంతమొందించారు. దారుణంగా కొట్టి చంపారు. అయితే దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు మీడియానే కారణమని ఆరోపిస్తునున్నారు.తోడేళ్ల గురించి అనవసరమైన భయాందోళనలు వ్యాప్తి చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిష్ అంధేరియా పేర్కొన్నారు. బహ్రైచ్‌లో తోడేళ్లు పిల్లలను చంపినట్లు వస్తున్న ఆరోపణలపై విస్తృతమైన కవరేజీ ఇవ్వడం ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలలో ఇలాంటి అనాగరిక చర్యలకు జాతీయ, ప్రాంతీయ మీడియా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
భారత్-బంగ్లా బోర్డర్: BSF హై అలర్ట్
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో త్వరలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్- బంగ్లా సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది.కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య 4, 096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ ఛౌదరి కోల్‌కత్తాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. VIDEO | Border Security Force (BSF) issues high alert along the Indo-Bangladesh border in Karimganj, Assam in wake of the violent protests and political turmoil in Bangladesh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/BIVV9t1bsS— Press Trust of India (@PTI_News) August 5, 2024 DG BSF is already present in the eastern Command. The situation on the Indo- Bangladesh border is normal as of now. Troops are aware and alert about the recent development and situation across the IB: Statement#Bangladesh #coup#SheikhHasina #Pakistan pic.twitter.com/PpfOVh9dNB— world of politics (@world_dailyy) August 5, 2024 ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను తొలగించి ప్రతిభకు పట్టం కట్టాలని చేస్తున్న ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. ఈ క్రమంలో భారత్ చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా సైన్యం రంగంలోకి దిగింది. బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుండగా.. కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ప్యూను దాటుకొని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. Happy #Bangladesh!#HasinaDown #BangladeshWon pic.twitter.com/cdWKALiMVh— Basherkella - বাঁশেরকেল্লা (@basherkella) August 5, 2024 మరోవైపు.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Fall of Bangladesh government attributed to record high unemployment & inflation!Nearly 8 lakh graduates are unemployed in #BangladeshStudents were protesting the 30% job quota for families of freedom fighters. The supreme court then intervened & reduced the Quota to 5%...… pic.twitter.com/rwdAHTe6Z3— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024 शेख़ हसीना की 15 साल की सत्ता 15 मिनट में चली गई!ढाका में प्रधानमंत्री आवास के शयनकक्ष में प्रदर्शनकारी#SheikhHasina #Bangladesh pic.twitter.com/Vc5DJDik3o— Dheeraj Pal (@dheerajpal09) August 5, 2024 ناجائز دھاندلی زدہ وزیراعظم کے فرار کے بعد بنگلہ کے عوام نے وزیراعظم ہاؤس میں کھانا کھایا یہ کھانا حسینہ واجد کیلیے پکایا گیا تھا pic.twitter.com/Od2Qh3ldWO— Sabir Shakir (@ARYSabirShakir) August 5, 2024 Bangladesh Parliament. From Democracy to Mobocracy. pic.twitter.com/LnXQ7NPJXw— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024 -
మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 7.15 గంటలకు ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అయిదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు,స్నిపర్లతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బందినిమోహరించనున్నారు.రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో ప్రాంగణం లోపల, వెలుపల మూడంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసుల SWAT (ప్రత్యేక ఆయుధాలు, వ్యూహాలు), NSG నుంిచి కమాండోలు ఈవెంట్ రోజున రాష్ట్రపతి ఇంటి చుట్టూ, వివిధ వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ మోహరిస్తారు. ఐదు కంపెనీల పారామిలటరీ, ఢిల్లీ సాయుధ పోలీసు (డిఎపి) జవాన్లతో సహా దాదాపు 2500 మంది పోలీసు సిబ్బందిని రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించనున్నారు. ఈ కర్యాక్రమానికి సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)దేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో గత సంవత్సరం జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాటు చేసిన భద్రతనే కల్పించనున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే ప్రముఖులకు వారి హోటళ్ల నుంచి వేదిక వద్దకు, తిరిగి వెళ్లేందుకు నిర్దేశిత మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఢిల్లీిలో నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు. \ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు 291 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో బీజేపీ 242 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిత్రపక్షాలతో కలిసి మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
హై అలర్ట్: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్‌లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
గుడివాడలో హై అలెర్ట్
-
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది. -
బాంబు బెదిరింపులు.. ముంబై హైఅలర్ట్
ముంబై ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ బాంబు పేలుళ్లకు సంబంధించిన బెదిరింపులతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడుతామంటూ శనివారం సాయత్రం 6 గంటలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ముంబైలో బాంబు పేలుళ్లు ఉంటాయి’ అని గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే వెంటనే స్పందిన పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా.. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు తమ దృష్టికి రాలేదన్నారు. అయితే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కాల్‌ను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అప్రమత్తమై నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ పెంచారు. చదవండి: బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ! -
కేరళ పేలుళ్లు.. ఢిల్లీ, ముంబయిల్లో హైఅలర్ట్..
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనతో దేశ రాజధాని, ముంబయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండుగల సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముంబయిలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. "నిఘా సంస్థలతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిరంతరం టచ్‌లో ఉంది. ఏదైనా అనుమానిత సమాచారం అందితే తీవ్రంగా పరిగణిస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం." అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ, కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రదేశం కొచ్చికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దాదాపు 2000 మంది ప్రజలు ఈ ప్రార్థనా శిబిరానికి హాజరయ్యారు. మూడో రోజుల ప్రార్థనల్లో భాగంగా ఆదివారం చివరి రోజు కావడం గమనార్హం. ఈ పేలుడులో ఐఈడీ పదార్ధాలను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) దర్యాప్తు చేపట్టాయి. పేలుళ్లు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. #WATCH | Kerala: Outside visuals from Zamra International Convention & Exhibition Centre, Kalamassery; one person died and several others were injured in an explosion here. pic.twitter.com/RILM2z3vov — ANI (@ANI) October 29, 2023 కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దర్యాప్తు చేపట్టాలని ఎన్ఐఏ, ఎన్ఎస్జీ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఉగ్రవాద నిరోధక పరిశోధనలు, కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన రెండు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపాలని షా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: కేరళలో భారీ పేలుడు.. ఉగ్రదాడి కలకలం! -
నేడు స్వదేశానికి నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(73) దాదాపు నాలుగేళ్ల తర్వాత శనివారం స్వదేశానికి రానున్నారు.లండన్ నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. అక్కడి నుంచి చార్టెర్డ్ విమానంలో శనివారం పాకిస్తాన్‌కు చేరుకుంటారు. లాహోర్‌లో శనివారం సాయంత్రం తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్(పీఎంఎల్–ఎన్) నిర్వహించే బహిరంగ సభలో షరీఫ్ పాల్గొంటారు. అయితే, ఆయన భద్రతకు ముప్పు ఉందన్న నిఘా సమాచారం మేరకు పంజాబ్ పోలీస్ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. -
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారం అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీల భద్రతను కాపాడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అనంతరం భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం
ఇంఫాల్: మణిపూర్‌లో గిరిజనులు.. గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల అంశం చిచ్చు ఇంకా రగులుతోంది. నాలుగు నెలల కిందట మొదలైన అల్లర్లు.. హింసాత్మక ఘటనలకు కొంతకాలం బ్రేక్ పడినా.. తాజాగా మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రంలో జరిగిన ఘోరాలపై దర్యాప్తులో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇద్దరు విద్యార్థుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్ సింగ్‌కు చెందిన ఇంటిపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు. అయితే.. సీఎం బీరెన్ సింగ్ ప్రస్తుతం ఇంఫాల్‌లోని అధికార నివాసంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. #Breaking: Manipur CM N Biren Singh's residence under Mob attack. Rounds of firing heard as the forces retaliate the attack. Manipur is now a Lawless State#Manipur#IndiaWithCongress pic.twitter.com/Z7U0dvoTE2 — Aman Shukla (@AmanINC_) September 29, 2023 సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టియర్ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. అస్థికలైనా ఇప్పించండి.. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన ఓ అమ్మాయి, అబ్బాయి మృతదేహాల ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లల అవశేషాలనైనా గుర్తించి అప్పగిస్తే.. తాము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మణిపుర్లో ఇటీవల ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ మృతదేహాల ఫొటోలు బయటికొచ్చాయి. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్లు ఒక ఫొటోలో ఉండగా.. వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్ అయ్యింది. మృతులను మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించారు. ఈ ఏడాది జులైలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత వారిని సాయుధులు కిడ్నాప్ చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు మణిపుర్ ప్రభుత్వం ప్రకటించింది. -
స్వాతంత్య్ర వేడుకలపై ఉగ్రకన్ను.. హై అలర్ట్..
ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో దాడులు చేపట్టాలని ఎల్ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రత కట్టుదిట్టం.. ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు. ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్.. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్.. ప్రయాణికులకు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 15 పంద్రాగస్టుపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విధించారు. సీఐఎస్ఎఫ్, పోలీసుల తనిఖీలతో ముమ్మరం చేయనున్నారు. అంతేకాదు.. ఆగష్టు 15 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రయాణికులతో వెళ్లేవారికి అధికారులు సూచనలు చేస్తున్నారు. వీడ్కోలు పలికేందుకు ఒకరిద్దరే రావాలని సూచిస్తున్నారు. -
హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్
హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. ఢిల్లీ పోలీసుల అప్రమత్తం గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిరసనలకు పిలుపు మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. నుహ్‌లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్‌లోని బాద్షాపూర్లో అల్లరి మూకల గుంపు బైక్‌లపై వచ్చి రెస్టారెంట్‌కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్షాపూర్ మార్కెట్‌ను మూసివేశారు. చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? ఎందుకీ ఘర్షణలు హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. మరో మణిపూర్ కాబోతున్న హర్యానా? గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్‌గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.