identity card
-
Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది. ‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. -
జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. -
Telangana: ఓటేద్దాం.. రండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్థారణైతే చాలని, ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును గుర్తింపునకు ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. ఓటరు గుర్తింపు నిర్థారణకు ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి..ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు.. ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో.. ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది.» ఆధార్ కార్డు» ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్,» కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు» రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రర్ (ఎన్పీఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు » భారతీయ పాస్‌పోర్టు» ఫొటో గల పెన్షన్ పత్రాలు » కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు»ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు» కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)చాలెంజ్ ఓటు అంటే?ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్థారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్థారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్థారణ అయితే సదురు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌తో ఎన్నో సదుపాయాలు..ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.పోలింగ్ సమయం ముగిసినా లైన్లో ఉంటే ఓటేయవచ్చురాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం!పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే.మీ ఓటును వేరే వాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవాళ్లు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెíషీన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్ర తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటేయదల్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటెవరికి వేశారో బయటికి కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు.జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి?» ఎన్నికల సంఘం వెబ్సైట్https://electoralsearch.eci. gov. in కి లాగిన్ కావాలి. » మీ వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులు వు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేసేందుకు వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయస్సు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు.» ఓటర్ హెల్ప్ లైన్ 1950కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.(మీ ఏరియా ఎస్టీడీ కోడ్ ముందు యాడ్ చేయాలి). » 1950 నంబర్‌కి మీ ఎపిక్ నంబర్‌ను ఎస్ఎంఎస్ చేసి తెలుసు కోవచ్చు. (ఎస్ఎంఎస్ ఫార్మాట్: ‘ఉఇఐ ఎపిక్ నంబర్’. ఈసీఐ, ఎపిక్ నంబర్ మధ్య స్పేస్ ఉండాలి).పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో..ఎలా తెలుసుకోవాలి?రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతేపోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు..అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితాను రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకుంటే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్థారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సైతం తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో సైతం తీసుకుంటారు. అనంతరం ఆ వ్యక్తికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న వేతనంతో కూడిన సెలవుసెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశంరాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్ టేకింగ్స్, ఎస్లాబ్లిష్మెంట్స్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. -
Telangana: మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలి. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని ఆర్టీసీకి సహకరించాలి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. -
ఆధార్ సురక్షితమేనా.. ఇంతకీ కేంద్రం ఏం చెబుతోంది?
గ్లోబుల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆధార్ కార్డుపై చేసిన వ్యాఖ్యల్ని కేంద్రం ఖండించింది. ఆధార్ బయోమెట్రిక్ టెక్నాలజీ విధానంతో ప్రజల భద్రత, గోప్యతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని తప్పు బట్టింది. మూడీస్ ఆరోపణలపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సైతం స్పందించింది. ఆధారాలు లేకుండా మూడీస్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రపంచంలోనే ఆధార్ అంత్యంత నమ్మకమైన డిజిటల్ ఐడీ’ అని తెలిపింది. కాబట్టే భారతీయులు 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ఉపయోగించారని, దీన్ని బట్టి ఆధార్‌పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అర్ధమవుతుందని మూడీస్‌కు సూచించింది. అంతర్జాతీయ సంస్థలు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు ఆధార్ విధానాన్ని ప్రశంసించిన అంశాన్ని ఈ సందర్భంగా యూఐడీఏఐ గుర్తు చేసింది. ప్రపంచంలో పలు దేశాలు సైతం ఆధార్ తరహాలో తమ దేశంలో డిజిటల్ ఐడీ వ్యవస్థను అమలు చేసేలా తమను సంప్రదించినట్లు చెప్పింది. ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి బయోమెట్రిక్ టెక్నాలజీలు కాంటాక్ట్‌లెస్ అని గుర్తించడంలో మూడీస్ విఫలమైందని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, ఆధార్ భద్రత విషయంలో మొబైల్ ఓటీపీ వంటి సెక్యూరిటీ అంశాలపై ప్రస్తావించడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధార్ డేటాబేస్ ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది కేంద్రం. -
ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్‌లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్‌లకు ఆధార్ కార్డ్‌ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్‌లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్‌ను ఆధార్‌లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్‌లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్‌ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్‌లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
దివ్యాంగులకు వరం.. యూడీ కార్డ్
ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకువచ్చిన యూడీ ఐడీ (యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డ్) వారికి వరంగా మారింది. ఏదోక వైకల్యం ఉన్న వారు ఎక్కడికైనా వెళ్లాలంటే తమ వద్ద ఉన్న అర్హత పత్రాలు అన్నింటినీ గతంలో వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో పొరపాటున ఏదైనా పత్రం పోతే తిరిగి దాన్ని పొందేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యలు లేకుండా దివ్యాంగులకు మేలు చేయాలనే లక్ష్యంతో యూడీ ఐడీ కార్డును ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అర్హులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 54,052 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ యూడీ కార్డులను జారీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ నుంచి జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖకు ఆదేశాలు అందాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనిక్ గుర్తింపు కార్డులో దివ్యాంగుని పేరు, గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ, వైకల్య శాతం, జారీ చేసిన తేదీ, కార్డు ఎప్పటివరకూ పనిచేస్తుంది, కార్డు వెనుక వైపు సదరం గుర్తింపు ఐడీ నంబర్, క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దీనిని కోడింగ్ చేస్తే పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా తొలి, మలి విడతల్లో 9,984 గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం ఇలా.. https://www.swavlambancard.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లైఫర్ సర్టిఫికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత దివ్యాంగుడి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రెండో కాలమ్‌లో చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, శాశ్వత చిరునామా పొందుపర్చాలి. మూడో కాలమ్‌లో వైకల్య వివరాలు, నాలుగో కాలమ్‌లో ఎంప్లాయిమెంట్, దివ్యాంగుని గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ఫొటో, వేలిముద్ర లేక సంతకం చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయిన తరువాత పరిశీలించి గుర్తింపు కార్డులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పటివరకు 9,984 కార్డులు మంజూరు జిల్లాలో ఇప్పటివరకూ 9,984 యూడీ కార్డులు మంజూరు చేశాం. దివ్యాంగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే కార్డులో పొందుపర్చడం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఎటువంటి సందేహాలు ఉన్నా జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఉన్న మా కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. – ఎం.ఝాన్సీరాణి, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ -
అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డు
సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్ స్మార్ట్‌వాచ్ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు. -
వదంతులకు ‘ఆధార్’తో చెక్
నర్సింగ్‌పూర్: పిల్లలను ఎత్తుకుపోయేవాళ్లు తిరుగుతున్నారన్న ఫేక్ వార్తలు మధ్యప్రదేశ్ గ్రామాల్లో కొన్నిరోజులుగా ఆందోళన రేకెత్తిస్తూండగా.. ఈ సమస్యను అధిగమించేందుకు జమార్ గ్రామ ప్రజలు ఓ వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులకు ఆధార‘భూతం’గా నిలిచిన ఆధార్ కార్డు లేనిదే గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని భీష్మించారు ఈ గ్రామస్తులు. ఆధార్ లేదా అలాంటి ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలని వీరు స్పష్టం చేస్తున్నారు. పిల్లలను ఎత్తుకుపోయే వాళ్లు తిరుగుతున్నారన్న పుకార్లు రావడంతో గ్రామ సేవకులు కొందరు ఇంటింటికీ తిరిగి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా.. సోషల్‌మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకున్న తరువాతే ఫార్వర్డ్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆధార్ ఆధారంగా అపరిచితులను గుర్తించడం గ్రామంలో మొదలైంది. ఈ పని మొదలుపెట్టిన తరువాత ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని గ్రామస్తులు తెలిపారు. -
టిక్.. టిక్.. టిక్
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలు–2019 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం వేగం పెంచింది. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి డీకేడబ్ల్యూ, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సీటీ, రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. డీకేడబ్ల్యూలో 6, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల వివరాలను ముందుగా సువిధాలో అప్లోడ్ చేయాల్సిఉంది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా సువిధాలో అప్లోడ్ చేసిన తరువాతనే ప్రకటిస్తారు. దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ టేబుల్స్ వద్దకు ఏజెంట్లకు అనుమతి లేదు. కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలలో ఓట్లు లెక్కించి ఏజెంట్లకు చూపుతారు. కౌంటింగ్ ఏజెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతనే లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి లేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకుపోవడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ.. ఇటూ తిరగడానికి వీలులేదు. ఏజెంట్లకు అవసరమైన మంచినీరు తదితర ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది. భారీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పహారం, భోజన ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి 22వ తేదీ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీ ఉదయం ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొక్క రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. వీవీ ప్యాట్లు లెక్కించి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సిఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ఆర్ఓ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. -
ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే: నీలేకని
బెంగళూరు/యశవంతపుర: ఆధార్ కార్డు నిఘా లేదా గోప్యతకు సంబంధించిన సాధనం కాదని కేవలం గుర్తింపు కార్డు మాత్రమే అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. ఆధార్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని స్పష్టం చేశారు. ‘ఆధార్ ఒక సరళమైన వ్యవస్థ. ఎందుకంటే ఒక సంస్థ మీకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేటప్పుడు గోప్యతకు సంబంధించిన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆధార్ మీకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. నాకు తెలిసి గోప్యత నిఘా కంటే భిన్నంగా ఉంటుంది’అని సోమవారమిక్కడ జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆధార్ సర్వాంతర్యామిగా మారటం ఆందోళన కలిగించే విషయమేనని పేర్కొన్నారు. -
వాట్ యాన్ ఐడియా సర్జీ!
హడావుడిలో బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతుంటాం.. అది సహజం కూడా. కానీ కొందరు అదే పనిగా రోజూ ఏదో ఒకటి మర్చిపోతుంటారు. అయితే వియత్నాంలో ఉన్న ఓ వ్యక్తి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ తన గుర్తింపు కార్డు మర్చిపోతున్నాడట. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఆఖరికి తన ఫ్రెండ్స్‌తో బార్‌కు గట్రా వెళ్లినప్పుడు మైనర్‌వి అంటూ ఆల్కహాల్ కూడా ఇవ్వట్లేదట. దీంతో విసుగు చెందిన మనోడు ఓ చక్కని పరిష్కారానికి ఆలోచించాడు. తన ఐడీ కార్డును తన చేతిపై పచ్చ బొట్టు మాదిరిగా వేయించుకోవాలని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా వెంటనే పచ్చబొట్లు వేసే దుకాణానికి వెళ్లి చేతిపై ఐడీకార్డు మొత్తం పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ ఆర్టిస్ట్‌కు ఐడీ కార్డు వేసేందుకు గంట సమయం పట్టిందట. ఆ యువకుడి పచ్చబొట్టును చూసిన స్నేహితులు ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫొటో వియత్నాం మొత్తం వైరల్ అయింది. ఎంతయినా మనోడి తెలివేతెలివిగురూ..! -
రైళ్లలో ధ్రువీకరణకు లాయర్ ఐడీ కార్డులు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రం(ఐడెంటిటీ ప్రూఫ్)గా న్యాయవాదులు తమకు ఆయా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడెంటిటీ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రైల్వే శాఖ గుర్తిస్తోంది. వాటిలో ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, విద్యార్థులకు వారి పాఠశాలలు, కళాశాలలు జారీ చేసే గుర్తింపు కార్డ్‌లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు మొదలైనవి ఉన్నాయి. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల కారణంగా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడీ కార్డులను ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తున్నామని రైల్వే బోర్డు సోమవారం ప్రకటించింది. -
మీ ‘గుర్తింపు’ @ డిజిలాకర్!
డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, ఓటర్ ఐడీ, పాన్, ఆధార్, విద్యా సర్టిఫికెట్లు...ఇలా ఏ గుర్తింపు కార్డు లేదా ధ్రువీకరణ పత్రానికైనా సరే మీరు ఇక ఎంచక్కా డిజిటల్ రూపం ఇవ్వొచ్చు. మీ సెల్ఫోన్లోనే అన్నింటినీ ఒకేచోట ఈృకాపీల రూపంలో భద్రపరుచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక్క క్లిక్‌తో వాటిని తీసి అడిగిన వారికి చూపించొచ్చు. ‘డిజిటల్ ఇండియా’లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన డిజిలాకర్ యాప్‌తో ఇవన్నీ సాధ్యం కానున్నాయి. ఈ అప్లికేషన్ వెబ్సైట్లతోపాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటినీ డిజిటల్ లాకర్లో భద్రపరుచుకోవడమే ‘డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, మీసెల్ఫోన్ నంబర్లకు దీనిని లింక్చేస్తారు. ఒక్కోవినియోగదారుడు 1 జీబీ డేటావరకు క్లౌడ్ పద్ధతిలో లో భద్రపరుచుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో స్కాన్ చేసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఈృసంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్లుఅవుతుంది.అదే విధంగా సీబీఎస్ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్నుశాఖలు జారీచేసే డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలనూ నేరుగా మీ డిజిలాకర్ఖాతాలోకి పంపొచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థతోపాటు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్నుశాఖ, సీబీఎస్ఈ సహా వివిధ స్కూలు బోర్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కులషీట్లు, కుల, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం డిజిలాకర్నువాడుతున్నారు. ఉపయోగించడం ఇలా.. - డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్సైట్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిలాకర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ కోసం ఆధార్, మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి. - ఏదైనా సంస్థ మీ ఈృడాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేసినా మీ అకౌంట్లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్లోడ్ చేయడంతోపాటు వాటిపై సంతకం చేయొచ్చు. - ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందొచ్చు. ఇందుకోసం ఈృడాక్యుమెంట్లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది. -
కార్డు పోయిందా? పొందడం సులువే!
గుంటూరు, తుళ్లూరు: గతంలో ప్రతి ఒక్కరూ తమ వెంట ఫోన్ బుక్, అవసరమైన వాళ్లు కాలిక్యులేటర్, నగదు ఉంచుకునేవారు. కాలం మారుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు వివిధ రకాల కార్డులు భాగస్వామ్యం అయ్యాయి. ఆధార్, ఓటర్, రేషన్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం, పాస్‌పోర్ట్ తదితర కార్డులను సిటిజన్లు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒకానొక కార్డును వినియోగించాల్సి వస్తోంది. ఆర్థిక లావాదేవీల కోసం ఏటీఎం కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యమైంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో అన్నీ ఒకేచోట ఉంచుకోవాల్సి వస్తోంది. అనుకోని పరిస్థితుల్లో మొత్తం కార్డులన్నీ ఒకేసారి పోగొట్టుకుంటే ఏమి చేయాలి? వాటిని తిరిగి ఎలా పొందాలన్న సందేహం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొంత సమయం తరువాత పొందే సదుపాయం ఉంది. ఆధార్ కార్డు భారతీయుడిగా గుర్తింపు ఉండాలి అంటే ఆధార్‌కార్డు తప్పనిసరి. ఎక్కడికెళ్లినా గుర్తింపు కోసం దీనినే అడుగుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. ఏ కార్డును పొందాలన్నా కూడా ఇది అవసరం. ఇలా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆధార్‌కార్డు పోతే టోల్ ఫ్రీ నంబర్ 18001801947 కి కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదుచేయాలి. ఇలా చేస్తే ఎలాంటి రుసుం లేకుండా కొత్త కార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. అలాగే ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి help@uiadi.gov.in లో పూర్తి సమాచారాన్ని పొందుపరిచి మళ్లీ కార్డును పొందవచ్చు. పాస్‌పోర్టు పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ జరిపి పాస్‌పోర్టు లభించకుంటే నాన్ ట్రేస్డ్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి, హైదరాబాద్ పేరిట, రూ.1000 డీడీ తీయాలి. రెండింటినీ జతపరచి దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల అనంతరం డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. తత్కాల్ పాస్‌పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.వివరాలకు www.ceoandhra.nic.in ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు ఓటరు గుర్తింపు కార్డు కూడా చాలా విధాలుగా పౌరులకు ఉపయోగ పడుతుంది. కేవలం ఓటు వేయడానికే కాకుండా నివాస, జనన తేదీ ధ్రువపత్రంగా కూడా కొన్ని సందర్భాల్లో దీనిని అడుగుతుంటారు. ఓటరు గుర్తింపు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నంబర్‌తో రూ.10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చు. కార్డు నంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా కార్డును పొందవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు కోసం మరిన్ని వివరాలకు www. passportindia.gov.in ను సందర్శించి తెలుసుకోవచ్చు. రేషన్‌కార్డు కుటుంబ అవసరాలకు రేషన్‌కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం అందించే సరుకుల కోసమే కాక పలు ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌కార్డును కీలక ఆధారం. తెల్లకార్డు ఉంటే ప్రభుత్వం వైద్య ఆరోగ్య పథకం కూడా వర్తిస్తుంది. అత్యంత ప్రాధాన్యం ఉన్న రేషన్ కార్డును పొగొట్టుకుంటే బాధితులు www. icfs2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ ఉన్న user name: guest, password: guest123 లాగిన్ అయి రేషన్‌కార్డు నంబర్‌ను వేసి రేషన్ జిరాక్స్ కాపీ ప్రతిని పొందవచ్చు. దీని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలించి నామమాత్రపు రుసుంతో అదే నంబర్‌పై కార్డును జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ వాహనం నడిపేందుకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది పోతే వెంటనే స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయలి. వారందించే నాన్ ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జత చేసి ఆర్డీఓ కార్యాలయంలో అందించాలి. అలాగే రూ.10 బాండ్ పేపర్‌పై కార్డు పోవడానికి కారణాలను అందజేయాల్సి ఉంటుంది. నెల రోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. www.aptransport.org నుంచి ఎల్ఎల్డీ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని మరిన్ని వివరాలు పొందవచ్చు. అందులోని వివరాలను పొందుపరచడం ద్వారా కూడా పోయిన కార్డును పొందవచ్చు. ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా ఎవరైనా దొంగతనం చేసినా ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తరువాత ఫిర్యాదు ఆధారంగా బ్యాంకులో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ ఈ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకుల నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల్లో పాన్‌కార్డు ఇప్పుడు చాలా అవసరం. ఆదాయపన్ను శాఖ అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు పోగొట్టుకుంటే సంబంధిత ఏజెన్సీలో కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాత కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫోటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. కొత్త కార్డు కోసం అదనంగా రూ.90 చెల్లించాలి. కొత్తకార్డు వచ్చే సరిని మూడు వారాల సమయం పట్టవచ్చు. www.nsdl.pan అనే వెబ్ సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. -
ఒకే దేశం.. ఒకే కార్డు
ఇంతకాలం దివ్యాంగులకు ఇస్తున్న గుర్తింపు కార్డులు జిల్లా వరకే పరిమితం కాగా సమస్యలు ఎదురవుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థాపర్చంద్ గెహ్లాట్ అన్నారు. ఈ మేరకు దేశమంతటా చెల్లుబాటయ్యేలా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ విధానంలోకి వచ్చేందుకు 24 రాష్ట్రాలు ముందుకొచ్చాయని.. ఇందులో తెలంగాణ కూడా ఉందని చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాలు పంపిణీ చేసేందుకు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దివ్యాంగుల గుర్తింపు కోసం ఇచ్చే గుర్తింపు కార్డు జిల్లా వరకే చెల్లుబాటు అయ్యేవని.. ఈ సమస్యను గుర్తించి దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుకార్డు అమలుచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగులు, వృద్ధులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గెహ్లాట్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. దివ్యాంగులకు అందజేసే యూనవర్సల్ ఐడెంటిటీ కార్డు అమలుచేయడానికి దేశంలోని 24 రాష్ట్రాల్లో ముందుకు వచ్చాయని, అందులో తెలంగాణ కూడా ఉందన్నారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా పథకాలను లబ్ధి పొందొచ్చని తెలిపారు. ఐదేళ్ల లోపు ఉన్న చెవిటి, మూగ చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చికిత్స చేయిస్తే భవిష్యత్‌లో వారు మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని. దీనిని దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ కోసం రూ.6లక్షల సబ్సిడీని కేంద్రం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 12.50 లక్షల మంది చిన్నారులకు కాక్లర్ ఇంపాక్ట్ చేయించడం జరిగిందన్నారు. అలాగే ఈ నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా దివ్యాంగుల కోసం 7వేల క్యాంప్‌లు నిర్వహించి ఐదు గిన్నిస్‌బుక్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.620 కోట్లతో 11లక్షల మంది దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వివరించారు. తన శాఖ పరిధిలోని పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గెహ్లాట్ వెల్లడించారు. సబ్సిడీపై మోటార్ ట్రై సైకిల్ 80శాతం వైకల్యం ఉండి నిలబడలేని దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేస్తున్నట్లు కేంద్ర మంత్రి గెహ్లాట్ తెలిపారు. వీటికోసం ఎలాంటి లైసెన్స్ ఉండదని, కేవలం బ్యాటరీతో నడుస్తుందన్నారు. ఈ మోటార్ ట్రై సైకిల్ విలువ రూ.37వేలు ఉండగా.. రూ.25వేల సబ్సిడీ కేంద్రం అందజేస్తుందన్నారు. దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దివ్యాంగులకు మోటార్ ట్రై సైకిల్ అందజేసేలా కృషి చేయాలని కోరారు. మోటార్ ట్రై సైకిల్ లబ్ధిదారులు చిరువ్యాపారాలు చేయడానికి రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి గెహ్లాట్, చిత్రంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యేలు రాజధానికి దీటుగా పాలమూరు అభివృద్ధి : రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మహబూబ్‌నగర్ రూరల్ : హైదరాబాద్‌కు తీసిపోని విధంగా దీటుగా పాలమూరు జిల్లా రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రూ.1860 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఎంపీ జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరగగా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ రోడ్ల విస్తరణ, వెడల్పు, మరమ్మత్తు పనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులకు ఉపరకరణాలు అందజేయడం ఓ బృహత్తర కార్యమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లు అందజేస్తుండడం సీఎం కేసీఆర్ మంచి మనస్సుకు నిదర్శనమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 8 నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. సీఎంకు ఎంతో ఇష్టమైన ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి : రొనాల్డ్‌రోస్, కలెక్టర్ జిల్లాలో దివ్యాంగు ల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. వెనకబడిన పాలమూరు జిల్లా లో దివ్యాంగులకు ఉపకరణాలు అందించే క్యాంపు జరగడం సంతోషించదగ్గ విషయమ ని అన్నారు. స్థానిక ఎంపీ జితేందర్‌రెడ్డి సహకారంతో ఇలాంటి క్యాంపులు మరిన్ని జరగా లని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కౌలు రైతు కుదేలు
►గుర్తింపు కార్డుల జారీలో జాప్యం ►నీరుగారుతున్న కౌలు రైతు చట్టం ►పంట రుణాలు అందక అవస్థలు ►వడ్డీ వ్యాపారుల వద్దే అప్పులు కెరమెరి(ఆసిఫాబాద్): సాగు జీవనాధారంగా చమటోడుస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలుల కావస్తున్నా పెట్టుబడులకు అవసరమైన ఆర్థిక సహకారం అందక కౌలు రైతు కుదేలవుతున్నాడు. ఆరేళ్లకిందట భూమిని నమ్ముకున్న కౌలు రైతుల కోసం తీసుకవచ్చిన చట్టాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వారికి రుణ అర్హత కార్డులను జారీ చేయాల్సి ఉంది. కొత్తవి జారీ చేయక పోగా పాత వాటిని సైతం పునరుద్ధరించడం లేదు. దీంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ఇలా చెబుతోంది.. కౌలు రైతు చట్టం 2011 మేరకు భూ యజమానులు అనుమతులు లేకుండానే కౌలు రైతుకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. తమ సొంత భూముల ద్వారా కౌలు రైతులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది భూయజమానులు నిరాకరిస్తున్నారు. ఇదే ప్రధాన సమస్యగా వారికి రుణాలు అందడం లేదు. ఈ క్రమంలో 2015లో ఇప్పటి ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా రుణ అర్హత కార్డులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అసలే భూ యజమానుల అనుమతి లేక రుణాలు పొందలేని వారికి ప్రభుత్వ జీవో కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్ల భూ యజమానులు అంగీకారం తెలిపినా బ్యాంకులు మాత్రం రుణాలు జారీ చేయడం లేదు. తమ భూములు తాకట్టు పెటి యజమానులు పంటరుణాలు తెచ్చుకోవడం కారణంగా రెండోసారి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. చట్టం ప్రకారం యజమానికి భూమి అభివృద్ధి కింద మరోసారి రుణం అందించే వెసులుబాటు ఉంది. అయితే బ్యాంకర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. సమన్వయలోపంతోనే.. అధీకృత సాగుధారులు చట్టం మేరకు రుణ అర్హత కార్డులు జారీ చేసిన రైతుకు ఎలాంటి హామీ లేకుండా రూ.50వేల రుణం ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం ముందుకు రావడం లేదు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు , బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపమే రైతుల పాలిట శాపంగా మారింది. సాగు చేసే అన్నదాతకు ప్రైవేట్ అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్తింపు అర్హత కార్డులు ఉన్నవారికి కూడా బ్యాంకర్లు మొండిచెయ్యి చూపుతున్నారనే ఆరోపణలు లేక పోలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తోంది. కార్డులు అందని కౌలు రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అర్జీలను పరిశీలించి రుణ కార్డుల మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. చట్టం వచ్చినప్పటినుంచి జిల్లాలో 100మంది వద్ద కూడా కౌలు రైతు కార్డులు లేవు. గతంలో కొందరు దరఖాస్తులు చేసుకోగా ఇప్పటికీ వారికి గుర్తింపు కార్డులు అందలేదు. కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కౌలు రైతుల గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రభుత్వం తెచ్చిన చట్టం నీరుగారుతోంది. సీజన్ ప్రారంభంలో గ్రామసభలు ఏర్పాటు చేసి వినతులు స్వీకరించాల్సి ఉన్నప్పటికి వాటి గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో చాలా మండలాలు ఏజేన్సీలు కావడంతో 1/70 చట్టం అడ్డు రావడంతో అనేక మండలాల్లో దరఖాస్తులు కూడా అందలేదని తెలిసింది. దీంతో గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులు పరిస్థితి దీనావస్థకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగించేలా సహకరించాలని వారు కోరుతున్నారు. -
‘గుర్తింపు’లోనూ నిర్లక్ష్యమే!
ధర్మవరం : కౌలు అధీకృత చట్టం ప్రకారం 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 63 మండలాల్లోని 1003 గ్రామ పంచాయతీల పరి«ధిలో గ్రామ సభలు నిర్వహించి, 29,383 మంది కౌలు రైతులను గుర్తించాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు లక్ష్యం విధించింది. అయితే ఇప్పటి దాకా 2,264 మందిని మాత్రమే గుర్తించారు. లక్ష్యంలో కనీసం 10 శాతం కూడా పూర్తి చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల ఆరంభంలో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి కార్యక్రమాన్ని మమ అనిపించారు. వివరాల వెల్లడికి ససేమిరా.. తమ భూమిని కౌలుకు ఇచ్చేందుకు, తమ భూమి వివరాలు ఇతరులకు వెల్లడించేందుకు రైతులు ఒప్పుకోవడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, లిటిగెంట్ వ్యవహారాల నేప«థ్యంలో భూములను కౌలుకు ఇచ్చేందుకు అంగీకరించడం లేదంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, వాతావరణ బీమా, ఇతరత్రా సబ్సిడీలు అన్నీ కౌలు రైతులకు దక్కితే తమకు నష్టం వాటిల్లుతుందని భావించిన రైతులు కౌలు పట్లు విముఖత చూపుతున్నారు. ఇంట్లో వారే కౌలు రైతులు కౌలు రైతులను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది కొత్త ఎత్తుగడ వేశారు. ఇంట్లో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రిపేరిట ఉన్న భూమిని కొడుకులిద్దరికీ కౌలుకు ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇలా అన్న పేరిట ఉన్న భూమిలో కొంత తమ్మునికి, తల్లి పేరిట ఉన్న భూమిని తనయులకు ఇచ్చినట్లు గుర్తింపుకార్డులు ఇచ్చి తాము కూడా గుర్తించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్క కౌలు రైతును కూడా గుర్తించని మండలాలు సగానికి పైగా ఉన్నాయి. ఒక్క ధర్మవరం మండలంలో మాత్రం 250 దాకా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు. సహకరించని బ్యాంకర్లు ఇదిలా ఉండగా కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వరుసగా పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో కౌలురైతు కార్డు పొందిన వారికి ఎన్నో నిబంధనలు పెట్టి రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు కార్డు పొందేందుకు రైతులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. -
గుర్తింపుకార్డులు తప్పనిసరి
-
గుర్తింపుకార్డులు తప్పనిసరి
తమిళసినిమా: సూపర్‌స్టార్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేకుంటే వారు ఎంతటి వీరాభిమానులైనా నోఎంట్రీ. ఏమిటిదంతా అనేగా మీ ఆసక్తి. రజనీకాంత్ రేపటి (సోమవారం)నుంచి ఐదురోజుల పాటు ఆయన అభిమానులను జిల్లాల వారిగా కలవనున్నారు. చాలా కాలం తరువాత ఆయన అభిమానుల కల నెరవేరబోతోంది. అయితే ఈ పరిణామం రాజకీయవర్గాల్లో గట్టి కలవరానికే దారి తీస్తోంది. రజనీకాంత్ రోజుకు మూడు జిల్లాలకు చెందిన అభిమానులు చొప్పున ఈ నెల 19 తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి మంచి విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కోడంబాక్కంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపం వేదిక కానుంది. అందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులను అందించడం జరిగింది. అవి ఉన్న వారికే అనుమతి అని, గుర్తింపు కార్డులు లేని వారు దయచేసి రావద్దని శనివారం రజనీకాంత్ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా రజనీకాంత్‌తో మాట్లాడాలని ప్రయత్నించడం గానీ, రాజకీయ ప్రస్తావన తీసుకురావడం గానీ, రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం లాంటివి చేయకూడదని నిబంధనలు విధించడం జరిగిందని సమాచారం. -
రైళ్లలో వారు గుర్తింపు కార్డు చూపాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మిలటరీ వారెంట్‌పై రైళ్లలో ఉచితంగా ప్రయాణించే రక్షణ శాఖ సిబ్బంది కచ్చితంగా గుర్తింపు ధ్రువపత్రం చూపాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే వారి కుటుంబసభ్యులైతే సంబంధిత శాఖ జారీ చేసిన మెడికల్ కార్డును చూపాలని పేర్కొంది. కొందరు సాధారణ వ్యక్తులు మిలటరీ వారెంట్ పేరుతో రైళ్లలో ప్రయాణిస్తున్న ఉదంతాలు వెలుగు చూసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గుర్తింపు కార్డులు చూపని వారిని ఉచితంగా ప్రయాణిం చేందుకు అనుమతించబోమని హెచ్చరించింది. -
గుర్తింపు కార్డు తీసుకెళ్తేనే ఓటు
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారు పోలింగ్ కేంద్రానికి ఫొటో ఓటరు స్లిప్పుతోపాటు గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసె¯Œ్స, పా¯ŒSకార్డు, సర్వీసు ఐడీ కార్డు, డిగ్రీ లేదా డిపొ్లమా ఒరిజినల్ సర్టిఫికెట్, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫి కెట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, లోకల్ బాడీలలో పనిచేసే ఉద్యోగులు సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దానిని తీసుకెళ్లవచ్చన్నారు. -
‘మార్పిడి’ కష్టాలు
cancellation of the two days of big money troubleపడ్డ ప్రజలకు కాస్త ఊరట లభించింది. పాత నోట్లు తీసుకుని అన్ని బ్యాంకులు, ప్రధాన పోస్టాఫీసుల్లో గురువారం కొత్త నోట్లు ఇచ్చారు. అరుుతే ఇందుకోసం ప్రజలు ఉదయం నుంచే ఆయా బ్యాంకు శాఖల వద్ద క్యూకట్టారు. గంటల తరబడి లైనులో ఉండడంతో కొన్నిచోట్ల తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గుర్తింపు కార్డుతోపాటు భారీగా నగదుతో వచ్చినా కేవలం రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే ఇచ్చారు. - సాక్షి, సిటీబ్యూరో మా నోటు మారేదెట్టా బాబయ్యా! నోట్ల మార్పిడి సంచార జీవులకు కష్టంగా మారింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు వీధివీధి తిరిగుతూ.. కూడళ్లలో బిచ్చమెత్తుకుని బతికేవారు. దారినపోయేవారు ధర్మంగా వేసిన రూపారుు, రూపారుు కూడబెట్టి చిల్లర మొత్తాన్ని పెద్ద నోట్లుగా మార్చుకున్నారు. ఇప్పుడు రూ.500 నోట్లు చెల్లవు అనేసరికి.. తమవద్దనున్న నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక వివిల్లాడుతున్నారు. ‘మా నోట్లు చెల్లవా’.. అంటూ అమయకంగా ప్రశ్నిస్తున్నారు. తాము అడుక్కుని సంపాదించిన చిల్లరను ఇచ్చి నోట్లు తీసుకున్నామని, ఇప్పుడు ఇవి ఎంచేయాలని దారినపోయేవారిని అమాయకంగా అడుగుతున్నారు. ఏ బ్యాంకుకు వెళ్లాలి.. ఎక్కడ మార్చుకోవాలో చెప్పాలంటూ ప్రాధేయపడుతున్నారు. - కుత్బుల్లాపూర్ -
పత్తి రైతుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో 84 పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. కనీస మద్దతు ధరపై పత్తి రైతులకు అవగాహన కల్పించేందుకు ‘రైతు సోదరులకు విజ్ఞప్తి’ పేరుతో వాల్ పోస్టర్‌ను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. పత్తి రైతులు తమ వెంట పత్తిరైతు గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీల జిరాక్స్ ప్రతులను తప్పకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వాల్ పోస్టర్లను అన్ని మార్కెట్ యార్డులు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రధాన కూడళ్లలో అతికించాలన్నారు. -
భరోసా ఇవ్వండి
సిరిసిల్ల : వస్త్రోత్పత్తి కార్మికులు రేరుుంబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర కూలితో దిక్కుతోచక శాశ్వత ఉపాధి మార్గాల కోసం దిక్కులు చూస్తున్నారు. మరోవైపు సిరిసిల్లలో ఏ కార్ఖానాలో ఎంతమంది పనిచేస్తున్నారో... ఎంత వస్త్రం ఉత్పత్తవుతుందో... ఎవరివద్దా లెక్కల్లేవు. భవిష్యత్‌పై భరోసా కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో జౌళిశాఖ అధికారులు, సిరిసిల్ల ప్రతినిధులతో సోమవారం ఉన్నతస్థారుు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కార్మికుల డిమాండ్లు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు నమ్మకమైన ఉపాధికి భరోసా కావాలి. కార్మికులు పనిచేసే కార్ఖానాలో గుర్తింపు కార్డు విధిగా ఇవ్వాలి. కార్మిక చట్టాల ప్రకారం ప్రతీ కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కార్మికుడి ఆదాయంలో ఎనిమిది శాతం మేర పొదుపు చేయాలి. ఒక్కో కార్మికుడు నెలకు రూ.6 వేలు ఆ దాయం పొందితే అందులో ఎనిమిది శాతం అంటే రూ.500 మినహాయించి పీఎఫ్ ఖాతా కు జమ చేయాలి. అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున కార్మికుడి కి జమ అవుతుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున కార్మికునికి భవిష్య నిధి జమ అవుతుంది. ఐదారేళ్లలో పెద్దమొత్తంలో రూ.60 వేల నుంచి రూ.80 వేల వర కు కార్మికునికి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఇలా పొదుపు చేసిన డబ్బు కార్మికుడి అవసరాల కు ఉపయోగపడుతుంది. గుర్తింపు కార్డు మూలంగా ప్రమాద బీమా, హెల్త్‌కార్డ్స్ వంటివి జారీ చేయడంతోపాటు కార్మికుడి భార్య, కూతురు ప్రసూతికి ఆర్థికసాయం అందుతాయి. మరోవైపు ఏటా బోనస్ ల భించేలా ఏర్పాటు చేయాలి. అసంఘటిత రంగంగా ఉన్న వస్త్ర కార్మికులను ఆసాముల యజమానులతో కలిపి సంఘటిత రంగంగా మార్చాలి. వేజ్‌బోర్డు, వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ అజమాయిషీలో వేతన ఒప్పందాలు జరగాలి. సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు రావాలి సిరిసిల్లలో తయారువుతున్న అన్ని రకాల వస్త్రాలను ముతక రకంగానే మార్కెట్‌కు తరలిస్తున్నారు. 34 వేల మరమగ్గాలున్న సిరిసిల్లలో 25 వేల మంది కార్మికులు పని చేస్తున్నా అధికారికంగా ఎక్కడా ఆ వివరా లు రికార్డు కాలేదు. ఉత్పత్తవుతున్న వస్త్రం వివరాలు ఎక్కడా నమోదు కావడం లేదు. టెక్స్టైల్ పార్క్ సహా ఏ కార్ఖానాలోనూ ఇంతమొత్తంలో వస్త్రం ఉత్ప త్తి చేస్తున్నామని రికార్డుల్లో రాయడం లేదు. ఎంతమేర జీతాలుగా చెల్లిస్తున్నారో నమోదు చేయడం లేదు. చట్టబద్ధంగా ఎగుమతులు, వచ్చే ఆదాయం, జరుగుతున్న ఖర్చుల వివరాలు రికార్డు చేయాల్సి ఉండగా, సిరిసిల్లలో అలా జరగడం లేదు. ఫలితంగా సిరిసిల్ల వస్త్రానికి గిట్టుబాటు లభించడం లేదు. సిరిసిల్లలోనే ప్రాసెసింగ్, డైయింగ్, ప్రింటింగ్ చేసి రెడీమేడ్ వస్త్రాల తయారీ, గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఫలితంగా ఇక్కడి వస్త్రానికి ఇక్కడే పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం మూలంగా మధ్యవర్తులు మిగుల్చుకునే కమీషన్ లేకుండా నేరుగా అమ్ముకునే వీలుంటుంది. ఎంబ్రారుుడరీ వంటి నైపుణ్య పనులతో పూర్తిస్థాయిలో సిరిసిల్ల వస్త్రానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇక్కడే మార్కెట్ చేయడం మూలంగా వస్త్రాన్ని డిమాండ్‌గా అమ్మవచ్చు. ఫలితంగా కార్మికులకు సంతృప్తికరమైన వేతనాలు అందించే అవకాశం ఉంది. ఆకలి చావుల సిరిసిల్లలో కార్మికులకు మెరుగైన వేతనాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. హైదరాబాద్‌లో నేడు మంత్రి సమీక్ష రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు సోమవారం హైదరాబాద్ బేగంపేట హరిత హోటల్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జౌళి శాఖ ఉన్నతాధికారులతో పాటు వస్త్ర పరిశ్రమ ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రయోజనం కలిగేలా స్వార్థంవీడి వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వానికి నివేదికలిస్తే నేత సమాజానికి అట్టడుగులో ఉన్న కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది. గతంలో లాగా సమస్య ఒకటైతే మరో అంశంపై చర్చించి మెజారిటీ వర్గానికి మేలు చేయకుండా కొద్దిమందికే లాభం జరిగేలా చర్చిస్తే సిరిసిల్ల సమస్యలకు ముగింపు ఉండదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 217 మందికి నేత కార్మికుల ఆత్మహత్యలుగా గుర్తించి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఇంతకు మరో రెండింతలు వివిధ కారణాలతో నేతన్నలకు పరిహారం దక్కకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ వాస్తవాలను ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు కార్మిక వర్గానికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటే నేతన్నలకు దీర్ఘకాలిక ప్రయోజనం దరిచేరుతుంది.