Interview
-
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
ప్రశాంత్ నీల్ ముందే సినిమా చూసి బ్లాక్ బస్టర్ అన్నాడు
-
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్యూ: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్ పోలీసులపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్లో ప్రసారం చేశారు.కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో సిట్ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్ కస్టడీలో ఉండగా లారెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్ హోం శాఖ కార్యదర్శి గుర్కిరత్ కిర్పాల్ సింగ్ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
ఆయన్ని ఎప్పటికీ ఆ పని చేయనివ్వను..!
షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా. (పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం). ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా. డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా! -
ముఖాముఖి సంభాషణల్లో మేటి
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్టాక్లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు. నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్నైట్లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ. అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే! విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా
బిగ్‌బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‌కే ఝలక్స్ ఇచ్చాడు.గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి
చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు. గతేడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటికొచ్చేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇతడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)గుండెపోటు వచ్చిన తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా సహాయం చేయలేదని చంటి చెప్పుకొచ్చాడు. 'నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరూ హెల్ప్ చేయలేదు. కనీసం పలకరించలేదు కూడా. కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారంతే. నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు. కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు' అని చంటి చెప్పుకొచ్చాడు.చంటి చెప్పిన దానిబట్టి చూస్తే 'జబర్దస్త్', సినిమాలు చేస్తున్న టైంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆపదలో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదే అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో రియాలిటీ ఏంటనేది కూడా చెప్పకనే చెప్పారు. అలానే జబర్దస్త్ షోలో వాళ్లే వద్దన్నారని, దానికి కారణం కూడా తెలీదని చెప్పాడు. వాళ్లు వద్దన్న తర్వాత ఇక తాను మళ్లీ అడగనని, అది కరెక్ట్ కాదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత) -
Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత
బిగ్‌బాస్ 8 హౌస్ నుంచి ఆరో వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. తన తమ్ముడు నబీల్ విజేతగా నిలవాలని కోరింది. అలానే స్టేజీపై బోలెడన్ని విశేషాలు పంచుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగే బజ్ ఇంటర్వ్యూలోనూ అర్జున్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మంచితనమే కొంపముంచిందా అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది')బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ అవకాశం, మీరు దాన్ని సరిగా ఉపయోగించానని అనుకున్నారా? అని అడగ్గా.. 100 శాతం అయితే నేను ఇచ్చానని సీత చెప్పింది. హౌసులో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా? అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లని పంపినప్పుడు డౌన్ అయ్యానని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.ఏడవటం స్ట్రాంగా? అని అడగ్గా.. మరి అరవడం స్ట్రాంగా? అని అర్జున్‌కే కౌంటర్ వేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత మంచితనమే కొంపముంచిందా అని మీకు అనిపించలేదా? అని అడగ్గా.. కొంప మునగదు కదా అని క్యారెక్టర్ మార్చుకోలేను కదా అని సీత ఆన్సర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?)ఇక హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. టేస్టీ తేజ చిరాకులా అనిపించాడని, వారం అయినా సరే పెద్దగా ఫెర్ఫార్మ్ చేసినట్లు, కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించలేదని సీత చెప్పింది. గౌతమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనిపించిందని చెప్పింది. గేమ్ పరంగా చూస్తే నిఖిల్ ట్రాన్స్పరెన్సీతో లేడని అంది.మీ అమ్మ ఓ లెటర్ పంపించారు కదా అందులో ఏముంది? అని అర్జున్ అడిగేసరికి.. సీత ఎమోషనల్ అయిపోయింది. ఏం జరిగిందో పక్కనబెడితే, నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. ఎందుకంటే నేను నాలానే ఉన్నాను, సంతోషంగా బయటకొచ్చాను. మా అమ్మని హౌసులో చూడాలనుకున్న ఒక్కటే కల. అది తీరలేదు అని సీత ఏడ్చేసింది. ఏడుస్తూ, హౌసులో కాస్త మెతకగా ఉండటమే సీత ఎలిమినేషన్‌కి కారణం అయ్యుండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: తేజ చేతిలో సీత బలి.. ఈ వేట ఆగదా?) -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
మణికంఠ చెల్లి చెప్పిన సంచలన నిజాలు.. చిన్నప్పటి నుంచీ
ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. రీసెంట్‌గానే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే అందరిలో కాస్త విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ. ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతడికి సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)అనవసరంగా బిగ్‌బాస్ షోకి వెళ్లి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. 'అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పాకుండా ఉండాల్సింది కదా అనిపించింది. రీసెంట్గా నాకు నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య వాళ్ల ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం, వాళ్ల బంధువులు ఫోన్ చేసి.. ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అని అందరూ అడగడం మొదలుపెట్టారు''అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లమ్ మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్' అని మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)'చిన్నప్పటి నుంచి వాడు(మణికంఠ) అంతే. నాదే, నా ఒక్కడితే బాధ అని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు' అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. ఇతడి తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్‌బాస్ షోలో చెప్పాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు లేకపోలేదు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్
గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్)అసలేం జరిగింది?కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్మీట్లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)కార్తిది తప్పు లేకపోయినా ఆయన చేత పవన్ కళ్యాణ్ సారి చెప్పించుకున్నాడు సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ Create చేసి సారీ చెప్పినట్లు ట్విట్టర్ లో ప్రచారం చేశారు -@prakashraaj 🔥🔥🔥 pic.twitter.com/1gFGL0vioV— MBYSJTrends ™ (@MBYSJTrends) October 7, 2024 -
యాక్షన్ సినిమా చేయాలని ఉంది:కావ్యా థాపర్
‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్‌గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్లో నా క్యారెక్టర్లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్‌గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్‌గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్‌ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
నాలుగు పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది: శ్రీవిష్ణు
‘‘నా కెరీర్లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ‘శ్వాగ్’ సినిమాలో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది సవాల్‌గా అనిపించింది. ఒక్కసారి గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక చాలా బాగా కుదిరింది’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పంచుకున్న విశేషాలు.⇒ ‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సరంలో మొదలయ్యే కథ. పురుషులు గొప్పా? మహిళలు గొప్పా? అనే అంశంపై వినోదాత్మకంగా ఈ కథ సాగుతుంది. శ్వాగ్ అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ‘శ్వాగ్’ అని పెట్టాం. కొత్త తరహా కథల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అదే ధైర్యంతో సరికొత్త కథాంశంతో మా సినిమా చేశాం. ఈ మూవీలో నా పాత్రకి మేకప్ వేసుకోవడానికి రోజుకి నాలుగున్నర గంటలు పట్టేది... తీయడానికి రెండు గంటలు పట్టేది.. ఇదంతా చాలా కష్టంగా అనిపించింది. ⇒ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్లకి ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుంది. అలాగే యువ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. నేటి యువత తెలుసుకోవాల్సిన చాలా విషయాల్ని చూపించాం. మన వంశంతో పాటు పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అనేది హసిత్ చాలా చక్కగా తెరకెక్కించాడు. చాలా పెద్ద కథ ఇది. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా? అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే వినోదం ఉంటుంది. నా కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచే చిత్రాల్లో ‘శ్వాగ్’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ⇒పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు నన్ను, హసిత్ని నమ్మి తొలిసారి ‘రాజ రాజ చోర’ సినిమా అవకాశం ఇచ్చి, చాలా ్రపోత్సహించారు. ఇప్పుడు ‘శ్వాగ్’ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమా చూశాక మహిళలను ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నటీనటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ వినోదాత్మక చిత్రం చేస్తున్నాను. -
సాఫ్ట్వేర్ టు ఐపీఎస్.. సేవలోనే సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్. ఆయన డాక్టర్. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్ అధికారి శరత్చంద్ర పవార్. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నా బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్‌లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్‌ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.సాఫ్ట్‌వేర్‌లో ఉంటూనే సివిల్స్‌పై దృష్టిస్టార్టప్లో ఉండగా సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సాఫ్ట్‌వేర్‌తో వచ్చే డబ్బులతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్‌గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్డీ, మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, సెంట్రల్ జోన్ డీసీసీగా, నార్కొటిక్స్ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తిఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్‌కు ప్రిపరేషన్లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్‌మేళా నిర్వహిస్తాం.కుటుంబ నేపథ్యం ఇదీ..ఎస్పీ శరత్చంద్ర పవార్ తండ్రి బాలాజీ పవార్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్‌లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్చంద్ర భార్య పూజ ఇంటీరియర్ డిజైనర్. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్చంద్ర పవార్.అధిక వేతనం.. అయినా లోటుఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సన్‌టెక్ బిజినెస్ సొల్యూషన్స్‌లో జాబ్ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్ అనలిస్ట్‌గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్ ప్రారంభించాం. ఫుడ్ ఎన్ బ్రేవరేజెస్ ఇండస్ట్రీలో (ఎఫ్ఎన్బీ) రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్ వైపు మళ్లాను. -
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్‌గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్‌గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్‌గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్‌లో చూశాను. తన డైలాగ్ పేపర్స్‌ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్‌లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్‌ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: కార్తీ
‘‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే నాకు ఇష్టం. కానీ, ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. అయితే ‘సత్యం సుందరం’ కథ చదివినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా రాస్తారా? అనిపించింది. ఈ సినిమా తప్పకుండా కె.విశ్వనాథ్‌గారి తరహా లాంటి ఒక మంచి చిత్రం అవుతుందనిపించింది’’ అని కార్తీ అన్నారు. ‘96’ మూవీ ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్ మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ‘సత్యం సుందరం’. నాకు కథ బాగా నచ్చడంతో అన్నయ్యకి(హీరో సూర్య) చె΄్పాను. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన(జ్యోతిక) నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాకి పారితోషికం ఎక్కువ అడగొద్దు అంటూ నా మార్కెట్ కంటే కొంచెం తగ్గించి ఇచ్చారు(నవ్వుతూ). నా తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’ సినిమా చూసి ఆ΄్యాయంగా హత్తుకున్న అన్నయ్య మళ్లీ ఇన్నేళ్లకు ‘సత్యం సుందరం’ లో చాలా బాగా నటించానంటూ గర్వంగా హత్తుకున్నారు. ⇒ బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది.‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో ‘సత్యం సుందరం’ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అయితే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. మా సినిమా కూడా అలాంటిదే. ఈ చిత్రం చూశాక అందరికీ తమ బాల్యం గుర్తొస్తుంది. ⇒ చిన్న పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిత్వం ఉండే పాత్ర నాది. ఈ మూవీలో అరవింద్ స్వామిగారు కాకుండా ఆయన పాత్రలో మరొకర్ని ఊహించలేం. ‘ఊపిరి’ సినిమాలో ఉన్నట్లు సంతోషకరమైన భావోద్వేగాలున్న కథ ఇది. మా సినిమా తమిళంలో ఈ నెల 27న విడుదలవుతోంది.అయితే అదేరోజు తెలుగులో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే మా సినిమాని 28న రిలీజ్ చేస్తున్నాం. ‘దేవర’ ఒక యుద్ధంలా ఉంటుంది. మాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా(నవ్వుతూ). ⇒ ‘సత్యం సుందరం’ కి గోవింద్ వసంత్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి. సునీల్, సురేశ్ బాబుగార్లు మా సినిమా రిలీజ్ చేయడం హ్యాపీ. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ సినిమా ఉంది. ‘ఖైదీ 2’ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. -
మా అమ్మానాన్నను భయపెట్టారు!
‘‘నేను నటి కావాలనుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. అయితే మా బంధువులు, ఇరుగు పోరుగు వాళ్లు సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు. అక్కడికి వెళితే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు’ అంటూ ఏవేవో చెప్పి మా అమ్మానాన్నను భయపెట్టారు’’ అన్నారు త్రిప్తీ దిమ్రి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ (2023) సినిమాలో చేసిన కీలక పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు త్రిప్తి. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తీ దిమ్రి మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచే నాకు నటనంటే ఆసక్తి. నటి కావాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు కొంచెం కంగారుపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి ముంబై వచ్చాను.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవకాశాల్లేక బాధపడిన క్షణాలున్నాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోయాను. చివరకు హీరోయిన్గా ‘లైలా మజ్ను’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాను. నా విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ’’ అని పేర్కొన్నారు. -
తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్
ఎన్టీఆర్ 'దేవర' మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్.. ప్రస్తుతం హైదరాబాద్‌కి తిరిగొచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు 'దేవర' ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆలియా భట్-కరణ్ జోహార్-ఎన్టీఆర్‌ది రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు హీరో తారక్-కొరటాలతో విశ్వక్, సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం అని.. మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలానే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి రెండు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు.'ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటే పోతే దాదాపు 8-9 గంటలు సినిమా వచ్చేది' అని ఎన్టీఆర్ చెప్పారు.(ఇదీ చదవండి: మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. చెప్పేదొకటి చేస్తున్న మరొకటి)తారక్-కొరటాల ఇంకే ఏమేం చెప్పారో తెలియాలంటే దిగువన ఇంటర్వ్యూ చూసేయండి. -
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్‌పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్‌మేట్స్‌కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్‌సిరీస్‌లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్‌ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
యాక్షన్ చేయడం సవాల్‌గా అనిపించింది: ఫరియా అబ్దుల్లా
‘‘మత్తు వదలరా 2’ చిత్రంలో నాపాత్ర పేరు సన్నిధి. ఇందులో నేను, శ్రీ సింహా, సత్య స్పెషల్ ఏజెంట్స్‌గా కనిపిస్తాం. అయితే వారిపాత్రలపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నాపాత్రలో యాక్షన్ ఉంటుంది. గన్స్ పట్టుకుని యాక్షన్ చేయడం సవాల్‌గా అనిపించినా చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మత్తు వదలారా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని నటీనటులు ఎదుర్కొనే ట్రాజెడీ నుంచి కామెడీ పుడుతుంది (నవ్వుతూ). రితేష్ రానాగారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. కాల భైరవగారి సంగీతం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓపాటకి లిరిక్స్ రాసి,పాడి, కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథిపాత్ర చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి థ్యాంక్స్. ప్రభాస్‌గారితో పెద్దపాత్ర ఉండే సినిమా చేయాలనుకుంటున్నాను.‘జాతి రత్నాలు’ చిత్రంలో నేను చేసిన చిట్టిపాత్ర నా ఇంటిపేరు అయి΄ోయింది. ఎక్కడికెళ్లినా ఇప్పటికీ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ‘జాతి రత్నాలు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అయితే నాకు రాలేదు. ‘మత్తు వదలరా 2’తో వస్తుందని నమ్ముతున్నాను. ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్యగార్లతో ప్రత్యేకపాట చేశాను. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయమని కొందరు అడిగారు... కానీ, చేయలేదు. తమిళంలో నేను నటించిన ‘వల్లి మయిల్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. తెలుగులో తిరువీర్‌కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను. అలాగే మరో తమిళ సినిమా ప్రారంభం కాబోతోంది’’ అన్నారు.