Janasena
-
జనసేన నేత లైంగిక వేధింపులు..
-
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా?
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలు విషయంలో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం శాసన మండలిలో చర్చ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన.‘‘దీపం-2 పథకాన్ని తప్పు దోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ పథకానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఎన్నికలకు ముందు ఈ పథకంపై విపరీతమైన హామీలిచ్చారు. ఎన్నికలయ్యాక అధికారంలో వచ్చి ఇప్పుడు మెలిక పెడుతున్నారు. ఆర్థిక మంత్రి ఒకలా.. సివిల్ సప్లై మంత్రి మరోలా దీపం2 గురించి మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలో వచ్చింది. ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు వెంటనే అమలు చేయాలి.చేతిలో అధికారం ఉందని విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతామంటే కుదరదు. మా ప్రభుత్వ హయాంలో కూడా డిస్కంలకు సబ్సిడీ ఇచ్చాం. తల్లికి వందనం 18 వేలు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదు? అని బొత్స ప్రశ్నించారు. నేరస్తుల్లో భయం పోయిందినేరస్తులకు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై భయం పోయింది. నేరస్తులు రాష్ట్రంలో తీవ్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. మా హయాంలో పెట్టుబడి వ్యయం చేయలేదని అన్నారు. మరి నాలుగు పోర్టులు, ఎయిర్ పోర్టు, మెడికల్ కాలేజీలు నిర్మాణం ఎలా జరిగాయి? అవి క్యాపిటల్ వ్యయం కాకుండా హాం ఫట్ అంటే వచ్చాయా? ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ -
ఫ్రీ సిలిండర్లు అంటే ఇదేనా చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు
సాక్షి,అమరావతి: తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు.మెడికల్ కాలేజి నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఈ పదినెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామన్నా ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధి దారుడికి ఇవ్వాలి. లేదంటే వారి అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధి దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఈ విధానంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రు సైతం వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారంటే ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నాయన్నది అర్ధమవుతుంది’అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. -
బాబు మోసంపై కూటమి నేతలు నోరు మెదపరేం
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడుగతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడురాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు పోసానిపై జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో ఈయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇందులో పేర్కొన్నారు. పోసాని వ్యాఖ్యలు పార్టీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' మూవీ టీమ్‌పై పోలీస్ కేసు)బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపైన కూడా టీడీపీ నేత కేసు పెట్టాడు. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాలెం పోలీసులు.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.(ఇదీ చదవండి: రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు) -
TDP ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
-
అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
గీత దాటితే చర్యలు తప్పవ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారిపై జనసేన నేతల అరాచకం
నరసరావుపేట టౌన్: ఓ దుకాణంలోకి చొరబడి వ్యాపారిపై జనసేన నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కోట సెంటర్లోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని ఓ షాపులో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ (జనసేన కార్యకర్త)తో దుకాణ యజమానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో జనసేన నేతలు నాని, సాంబలను వెంటబెట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలు దుకాణంలో ఉన్న నాగేశ్వరరావు, అతని కుమారుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.పిడిగుద్దులతో వీరంగం సృష్టించారు. కేసు పెడితే మరో మారు దాడి చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ సీఐ హైమారావు తెలిపారు. కాగా, ఇటీవలే నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు 2 రోజుల క్రితం తన అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇలా..టీడీపీ, జనసేన నేతల వరుస దాడులతో నరసరావుపేటలోని వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు -
టీడీపీ-జనసేన బాహాబాహీ
సాక్షి, అమరావతి/పిఠాపురం: పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రెండు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన ఎన్డీఏ పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు తలపడ్డారు. టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, జనసేన ఇన్‌ఛార్జి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ సమక్షంలోనే ఇరుపార్టీల నేతలు ఒకరినొకరు తోసుకుని గందరగోళం సృష్టించడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి ఎవరికి వారు వెళ్లిపోయారు. అలాగే, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవికి వ్యతిరేకంగా ‘క్విట్ నెల్లిమర్ల’ అంటూ టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక ఏలూరు జిల్లా పైడిచింతపాడులో పింఛన్ల పంపిణీపై టీడీపీ, జనసేన నేతలు ఘర్షణపడి కొట్టుకున్నారు. చివరికి.. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోగా, జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గందరగోళంగా మారింది. ఇలా రెండు పార్టీల నేతలు తమదే పైచేయి కావాలని వివిధ నియోజకవర్గాల్లో పోటీపడుతూ.. ఘర్షణలకు దిగుతూ రభస సృష్టిస్తున్నారు.పైడిచింతపాడులో దాడికి దిగిన తెలుగు తమ్ముళ్ళు, జనసేన కార్యకర్తలుపిఠాపురంలో కండువాలు, ఫొటోల గోల..పిఠాపురంలో శుక్రవారం కూటమి బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయ సమావేశం కూటమి నేతల బాహాబాహీకి వేదికగా మారిపోయింది. వేదికపై వేసిన ఫ్లెక్సీలో టీడీపీ నేత వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్లవి పెద్ద ఫొటోలు వేసుకుని జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌ది చిన్నఫొటో వేయడంపై జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కురుమళ్ల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి మూడు పార్టీల కండువాలు వేసుకున్నారుగానీ వచ్చిన టీడీపీ నేతలు కేవలం వారివారి పార్టీ జెండాలే వేసుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరూ ఇకే మాటపై ఉంటుంటే ఇక్కడ మాత్రం టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తూ జనసేనను తొక్కేయాలని చూస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసేన పనిచేస్తోందా?.. మరి పిఠాపురంలో టీడీపీ ఎందుకు జనసేన, పవన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ కురుమళ్ల ప్రశ్నించడంతో గందరగోళం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు అరుపులు, కేకలతో వేదికపైకి దూసుకురావడంతో రెండు పార్టీల నేతల కార్యకర్తల మధ్య తోపులాట, తన్నులాట చోటుచేసుకుంది. రెండు పార్టీల నేతలు తమ కార్యకర్తలను అదుపుచేసేందుకు ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో వర్మ, రాజశేఖర్, మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ నుంచి నిష్క్రమించారు. పింఛన్ల పంపిణీ కోసం డిష్యూం డిష్యూం.. మరోవైపు.. పింఛన్ల పంపిణీ కోసం గురువారం దెందులూరు నియోజకవర్గం, కొల్లేరు గ్రామం పైడిచింతపాడు టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్లాటకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం.. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి.. గ్రామ టీడీపీ నాయకుడు సైదు సత్యనారాయణ వర్గీయులు దీపావళి రోజున వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, గ్రామ సర్పంచ్ ముంగర తిమోతీ, మోరు సుబ్బారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు సచివాలయానికి చేరుకున్నారు. తాములేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జనసేన నాయకుడు ముంగర వెంకటేశ్వరరావు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇందులో గాయపడిన జనసేన కార్యకర్తలు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) కట్టాలని పోలీసులను కోరారు. అదే సమయంలో టీడీపీ వారు సైతం ఆస్పత్రికి చేరుకుని, తమకు గాయాలయ్యాయని, ఎంఎల్సీ కట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలికి వారి ఫిర్యాదు మేరకు ఎంఎల్సీ కట్టారు. దీంతో జనసేన నేతలు విజయవాడ వెళ్లి అక్కడ ప్రభుత్వాస్పత్రిలో చేరి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కానీ, టీడీపీ నేతల చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏలూరు రూరల్ పోలీసులు జనసేన నేతలను అదుపులో తీసుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ నేతలు ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి.. టీడీపీ నేత, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఆమెకు వ్యతిరేకంగా బంగర్రాజు శుక్రవారం టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించి ఆమె నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని హడావుడి చేశారు. ఆమె తీరుతో నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత లేకుండాపోయిందని వాపోతున్నారు. నిజానికి.. రెండ్రోజుల క్రితం నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి, బంగర్రాజు మధ్య హాట్‌హాట్‌గా వాగ్వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోయారు. -
టీడీపీ Vs జనసేన.. తారాస్థాయికి వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ-జనసేనలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొల్లేరు గ్రామాల్లో జనసేన నాయకులపై టీడీపీ నేతల వరస దాడులకు తెగబడుతున్నారు. పెన్షన్ల పంపిణీ అంశంలో టీడీపీ నేతలే పంచి పెట్టాలని ఎమ్మెల్యే చింతమనేని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన జనసేన నేతలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తన అనుచరులతో దాడి చేయించి కేసులు పెట్టించారు.కొల్లేరులో టీడీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరాకు లక్ష కట్టాలంటూ కొల్లేరు వాసులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రౌడీ మూకలతో జనసేన నాయకులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.నేడు జిల్లాలో పర్యటించనున్న పవన్‌కల్యాణ్‌ను కలిసి చింతమనేని తీరుపై నియోజకవర్గ ఇన్ చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి ఫిర్యాదు చేయనున్నారు. కొన్ని అరాచక శక్తులు జనసేనలో చేరాయంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. కొత్తగా పార్టీలో చేరి పెత్తనం చలాయిస్తే ఊరుకోమని.. పెన్షన్ పంపిణీకి, అలాంటి వారికి ఏం సంబంధం అంటూ చింతమని హెచ్చరించారు. -
కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌తో హల్ చల్ చేసిన జనసేన నేత
-
ఏపీలో ఉచితం వంకతో వీర బాదుడు.. ఒక్క గ్యాస్ సిలిండర్ భారమే 14వేల కోట్లు!!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.తాజాగా పోతిన మహేష్ ట్విట్టర్లో వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP @JanaSenaParty@BJP4India దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు… pic.twitter.com/n44gAeFrCz— Pothina venkata mahesh (@pvmaheshbza) October 31, 2024 -
జనసేన నేతలపై టీడీపీ శ్రేణులు దాడి
-
చింతమనేని హుకుం.. దెందులూరు టీడీపీ, జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జనసేన ఎమ్మెల్యే దౌర్జన్యం.. సొంత పార్టీ కార్యకర్త టీ దుకాణం కూల్చివేత
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కసుతో జనసేన కార్యకర్త నిర్మించుకున్న టీ దుకాణాన్ని జనసేన ఎమ్మెల్యే కూల్చివేయించారు. సర్పవరం భావన నారాయణ స్వామి ఆలయం సమీపంలో మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు మూడు నెలల క్రితం టీ దుకాణాన్ని నిర్మించుకున్నారు.అయితే, బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొనాలంటూ కొద్ది రోజుల కిందట బాలరాజుతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం జనసేన నాయకులు మంతనాలు జరిపారు. స్థలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే ఇవాళ టీ దుకాణాన్ని పంచాయితీ అధికారులు కూల్చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపిస్తున్నారు. టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు బాలరాజు చెబుతున్నారు.ఇదీ చదవండి: జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి -
కూటమిలో కుంపట్లు జనసేన, టీడీపీ నేతల మధ్య కుర్చీల కోసం పోరాటం..
-
జనసేన ఎంపీ ఏకపక్ష ధోరణిపై టీడీపీలో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు ఆధి పత్యం కోసం బస్తీమే సవాల్ అంటున్నారు. కాకినాడ నగరంలో కూటమి నిట్టనిలువునా చీలిపోయింది. జనసేన, టీడీపీ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్నదానికి తన్నుకుంటున్నారు. అధికారుల బదిలీ కోసం మొదలైన ఆధిపత్య పోరు మద్యం, బాణసంచా షాపులు దక్కించుకునే వరకు దారి తీసింది. ఒక వర్గానికి వచ్చిన షాపులను మరో వర్గం లాగేసుకునే ప్రయత్నాలతో ఇరువర్గాలు రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తు న్నాయి. జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో రాజుకున్న అగ్గి ఇటీవల కాకినాడ ఆర్డీఓ బదిలీ వ్యవహారంలో ఇరువురి మధ్య సఖ్యత చెడిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కాకినాడలో వివిధ హోదాల్లో పనిచేసిన మల్లిబాబును ఆర్డీఓగా తీసుకురావాలనేది ఎంపీ ఉదయ్ ఆలోచన. ఇక్కడ జెడ్పీ సీఈఓగా పనిచేసిన సత్యనారాయణను ఆర్డీఓగా నియమిస్తామని కొండబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆర్టీఓ బదిలీల్లో ఎంపీ పెత్తనం ఏమిటంటూ ఎమ్మెల్యే వర్గీయులు విమర్శలకు దిగారు. చివరకు ఈ బదిలీ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంపీ సిఫారసు చేసిన మల్లిబాబు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఇది చాలదు అన్నట్టుగా ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన టీడీపీ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చేసి ఎంపీ శ్రీనివాస్ శిబిరంలో చేరారు. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలను అతని సోదరుడు సత్యనారాయణ సమన్వయం చేసుకునేవారు. సత్యనారాయణతో పాటు దొరబాబు కూడా కలిసే ఉండేవారు. అటువంటిది వీరిద్దరి మధ్య వచ్చిన పొరపొచ్చాలతో దొరబాబు ఎమ్మెల్యే శిబిరం నుంచి బయటకు వచ్చేశారు. సరిగ్గా అదే సమయంలో జనసేన రూపంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గెలుపొందడంతో దొరబాబు ఆ శిబిరంలో చేరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతూ వచ్చి చివరకు మద్యం, బాణసంచా షాపు ల వ్యవహారంలో పట్టుదలతో తారా స్థాయికి చేరుకుని రోడ్డెక్కే వరకు వెళ్లాయనేది పరిశీలకుల మాట. ముక్కున వేలేసుకుంటున్న జనం కాకినాడ సంజయ్‌నగర్‌లో ఒక మద్యం దుకాణాన్ని డ్రాలో తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కౌకుట్ల జీవన్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. షాపు ఏర్పాటు కోసం లీజు అగ్రిమెంట్ చేసుకుని పనులు మొదలుపెట్టేసరికి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అనుచరుడు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అతని అనుచరగణం అడ్డుతగిలారు. ఇంతకీ షాపు దక్కించుకున్న లీజుదారుడు ఎంపీ శ్రీనివాస్‌కు సహచరుడు.అదే కారణంతో ఎమ్మెల్యే కొండబాబు తన అనుచరులను రెచ్చగొట్టి దౌర్జన్యంగా మద్యం షాపును లాగేసుకునేందుకు ప్రయతి్నంచారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. ఇది చినికిచినికి గాలివానగా మారి పోలీసుల వరకు వెళ్లింది. ఈ రెండు వర్గాల మధ్య ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా కాకినాడ మెయిన్‌రోడ్డులో బాణసంచా షాపు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కొండబాబు వర్గం ప్రయత్నించింది. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో మందుగుండు షాపు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రమాదకరమనే కారణంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.మద్యం దుకాణం విషయంలో గొడవ చేసినందుకు ప్రతీకారంగా ఎంపీ కావాలనే మందుగుండు షాపునకు అను మతి రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తూ సోమవారం రాత్రి రోడ్డెక్కడం అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మా రింది. ఏదో ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేసినట్టు వ్యక్తిగత లాభాపేక్ష కోసం నిర్వహించే మ ద్యం, బాణసంచా షాపుల కోసం రోడ్డెక్కుతారా అంటూ టీడీపీ నేతల తీరుతో ప్రజలు ముక్కున వేలేసు కుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఏ పార్టీ ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడలేదని ఆక్షేపిస్తున్నారు. ఎంపీని ఏకాకిని చేసే వ్యూహం జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వివిధ కారణాలతో కాకినాడ ఎంపీ శ్రీనివాస్‌ను ఇటీవల కాలంలో దూరం పెట్టారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎంపీ కూటమిలోని ఎమ్మెల్యేలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పోతున్నారని ఆయా నియోజవకర్గాల నేతలు ఆగ్రహంతో ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు చేశారని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎంపీ శ్రీనివాస్‌ను ఏకాకిని చేసే వ్యూహంలో భాగంగానే టీడీపీ నేతలు తెర వెనుక ఉండి కొండబాబును నడిపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
టీడీపీకి జనసైనికులు వార్నింగ్
-
రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా.. జనసేన నేతపై దాడి
అనకాపల్లి : హోం మంత్రి అనిత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు కోటవురట్ల మండలంలో టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు.అయితే, ఇసుక అక్రమ రవాణా తరలింపులో కూటమి నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు జనసేన నేత కోన మౌళిపై గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన కోన మౌళిని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇసుక అక్రమ రవాణపై ఇరు పార్టీ నేతలు చేసుకున్న దాడుల్ని భూతగాదా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’
కాకినాడ: కాకినాడలో కూటమి పార్టీలైన టీడీపీ–జనసేన మధ్య ‘దీపావళి’ చిచ్చు రేపింది. బాణసంచా దుకాణాల కేటాయింపులో అధికారుల తీరును తప్పుపడుతూ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వర్గీయులు రోడ్డుపై పడుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సును అడ్డగించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.ఓ వైపు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌పై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతూ పనిలో పనిగా ఇక్కడి అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే పర్లోపేట వద్ద వైన్‌షాపు కేటాయింపు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇప్పుడు బాణసంచా దుకాణాల కేటాయింపులో కూడా రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వివరాలివీ.. టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు మద్దతుతో కాకినాడ మెయిన్‌రోడ్డు అపోలో ఆస్పత్రి పక్క ఓ బాణసంచా దుకాణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, ఆస్పత్రులున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. బాణసంచా దుకాణం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక అధికారులు అభ్యంతరం చెప్పడాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు వీరు జీర్ణించుకోలేకపోయారు.వాస్తవానికి.. జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటుపై వివాదం రేగడంతో కలెక్టర్ షణ్మోహన్ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులతో వేసిన కమిటీ కూడా అక్కడ దుకాణం ఏర్పాటుచేయడంపై అభ్యంతరం తెలిపింది. భానుగుడి జంక్షన్ సమీపంలో జనసేన మద్దతుతో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణానికి లేని అభ్యంతరం తమ విషయంలోనే ఎందుకంటూ అధికారులపై మండిపడ్డారు. ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ఒత్తిడితోనే టీడీపీ వారి దుకాణానికి చెక్ పెట్టారని వీరు బలంగా అనుమానిస్తున్నారు. దీంతో ఎంపీపై అక్కసు వెళ్లగక్కేందుకు వీరుతోపాటు టీడీపీ శ్రేణులంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుకాణాల కేటాయింపు తీరుపై విమర్శలు..మరోవైపు.. గతంలో ఎన్నడూలేని విధంగా కాకినాడలో బాణసంచా దుకాణాల కేటాయింపు ప్రక్రియను టీడీపీ ఓ ప్రైవేటు లాడ్జిలో నిర్వహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే కేటాయింపు ప్రక్రియను హైజాక్ చేసి కొత్త సంస్కృతికి తెరలేపడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..ఇక ప్రభుత్వం మారినా అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట విని, పనిచేస్తున్నారంటూ కొండబాబు వర్గీయులు ఆరోపణలకు దిగారు. దీంతో.. బాణాసంచా దుకాణాల కేటాయింపులో వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ద్వారంపూడిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జేసీఎస్ (జగనన్న కన్వీనర్లు, సారథుల) కన్వీనర్ సుంకర విద్యాసాగర్ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన చేసిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా తరచూ ద్వారంపూడిని వివాదంలోకి లాగడం సర్వసాధారణమైందని విమర్శించారు. దుకాణాల కేటాయింపు అంశంపై ద్వారంపూడి కానీ, వైఎస్సార్సీపీ కానీ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టంచేశారు. -
'పుష్ప2: ది రూల్' ప్రీ రిలీజ్‌కు చిక్కులు.. ఏపీ, తెలంగాణలో కష్టమే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2: ది రూల్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. సుమారు మూడేళ్ల తర్వాత వెండితెరపై తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ చూడనున్నారు. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానున్నడంతో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ ప్రారంభించారు. పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురుకానుంది.తెలంగాణలో కష్టమేహైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు పోలీసుల ఆంక్షలు ఉండనున్నాయి. ఈమేరకు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగునున్నట్లు సమాచారం రావడంతో బీఎన్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించారు. ఇది అమల్లో ఉన్నప్పుడు నలుగురికి మించి గుమిగూడటం, కలిసి తిరగడంపై నిషేధాజ్ఞలు ఉంటాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల దాకా హైదరాబాద్‌లో ఎలాంటి సభలు,సమావేశాలు,ధర్నాలు,రాస్తారోకోలు,ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం కష్టమేనని చెప్పవచ్చు. నగరంలో వరుస ఆందోళనలతో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఏపీలోనే ఛాన్స్పుష్ప2 ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించడం దాదాపు కష్టమేనని చెప్పవచ్చు. పోలీసులు ఆంక్షలు నవంబర్ 28 నాటికి పూర్తి అయినా కూడా వెంటనే ఒక భారీ ఈవెంట్ జరుపుకునేందుకు అనుమతులు రావడం కష్టమేనని చెప్పవచ్చు. దీంతో పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే, అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అల్లు అర్జున్ మెగా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ జనసేన కార్యకర్తల నుంచి నాయకుల వరకు కొద్దిరోజుల క్రితమే డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గాల్లో పుష్ప చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటామని వారు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒక వేదికపై పుష్ప చిత్రాన్ని తక్కువగా చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇలా పలు అడ్డుంకుల మధ్య పుష్ప ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏపీలో జరుగుతుందా..? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'దేవర' కూడా పలు ఇబ్బందులు ఎదురుకావడంతో ప్రీ రిలీజ్ కార్యక్రమం లేకుండానే సినిమాను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా బాధతో తన అభిమానుల కోసం ఎన్టీఆర్ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
పవన్‌కళ్యాణ్‌పై టీడీపీ నేత ఫైర్
ఏలూరు రూరల్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్నారా లేదా అన్నది స్పష్టంచేయాలని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామ టీడీపీ నేత సైదు గోవర్థన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో.. పవన్‌కళ్యాణ్ కొల్లేరును సర్వనాశనం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తూ.. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడిగా తనకు ఇలా అడిగే హక్కుందన్నారు. ఇటీవల జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు గ్రామాల్లోని వైఎస్సార్సీపీ నాయకులను వారి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతూ.. దొంగలను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే ఎక్కడ దాక్కున్నారని అసభ్య పదజాలంతో దూషించారు. జనసేన నాయకుల కారణంగా కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి పనితీరును అడ్డుకుంటానని గోవర్థన్ హెచ్చరించారు. ఈ వీడియో కొల్లేరు గ్రామాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.