Jyothika
-
'కంగువా' రివ్యూలపై జ్యోతిక ఫైర్.. వాటికంటే దారుణమా..
-
'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక
కోలీవుడ్ 'బాహుబలి'గా ప్రచారం చేసిన సూర్య 'కంగువ'.. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్‌తో రిలీజైన ఈ సినిమాకు మొదటి సీన్ తర్వాత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీలో ప్లస్సులు కంటే మైనస్సులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూర్య భార్య జ్యోతిక ఇప్పుడు 'కంగువ'పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది. కావాలనే మా మూవీని తొక్కేస్తున్నారని అంటోంది.(ఇదీ చదవండి: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్)జ్యోతిక ఏమంది?'నటుడు సూర్య భార్యగా కాదు నేను ఈ నోట్‌ని జ్యోతికగా, ఓ సినీ ప్రేక్షకురాలిగా రాస్తున్నాను. కంగువ- ఓ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు. మ్యూజిక్ కూడా లౌడ్‌గా అనిపించింది. మన సినిమాల్లో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇలాంటి మూవీస్‌లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు.''మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయా. వీళ్లెవరు కూడా అవే పాత స్టోరీలతో తీసిన సినిమాలకు, అమ్మాయిల వెంటపడే, డబుల్ మీనింగ్స్ ఉండే, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే మూవీస్‌కి ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదు. మరి 'కంగువ' పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్.. రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు కనిపించలేదా?'(ఇదీ చదవండి: గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్)'తొలిరోజే 'కంగువ'పై నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. తొలి షో పూర్తవకముందే ఇలా చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాని కావాలని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్, కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు' అని జ్యోతిక ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజైన 'కంగువ'సినిమాకు 2 రోజుల్లో రూ.89.32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.2000 కోట్ల వసూళ్లు వస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ఆమెతో మళ్లీ కలిసి నటించాలని ఉంది.. కానీ, ఒక కండీషన్: సూర్య
నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటించిన కంగువ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. నటి దిశాపటాని నాయకిగా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు. శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది. కాగా నటుడు సూర్య తన 44వ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇదే క్రమంలో సూర్య తన 45 చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్ పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం కంగవ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య ఓ భేటీలో పేర్కొంటూ తన భార్య జ్యోతికతో కలిసి మళ్లీ నటించాలన్న కోరిక కలగానే మారిందన్నారు. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. అయితే,ఆ సినిమా కథకు జ్యోతిక అయితేనే సెట్ అవుతుంది అనేలా ఉండాలి కానీ, ఏదో సూర్య చెప్పాడని ఇరికించే ప్రయత్నం చేయకూడదన్నారు. తాను మాత్రం ఏ దర్శకుడిని తమ కోసం కథను సిద్ధం చేయమని కోరనన్నారు. సూర్య తన భార్యతో కలిసి మళ్లీ నటించాలన్న కోరికను వ్యక్తం చేయడంతో దర్శక, నిర్మాతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం నటి జ్యోతిక ఉమెన్స్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈమె తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారన్నది గమనార్హం. కాగా సూర్య, జ్యోతిక కెరీర్ ప్రారంభంలో పూవెల్లామ్ కేట్టుప్పార్, ఉయి రిలే కలందదు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, సిల్ల న్ను ఒరు కాదల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. -
నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్ఫుల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.ముంబైలో జ్యోతిక, సూర్యకాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. -
ముంబైకి షిఫ్ట్ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య
కోలీవుడ్‌లో బెస్ట్ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సూర్య చెప్పారు.తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్‌లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్లో శ్రీకాంత్, కాదల్- ది కోర్, సైతాన్ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది. మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్‌గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు. -
నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కూతురిపై జ్యోతిక ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ జంట సూర్య- జ్యోతికల కూతురు దియా మరోసారి తన పేరెంట్స్ గర్వపడేలా చేసింది. ఈ మధ్యే పన్నెండో తరగతిలో టాప్ మార్కులు సాధించిన దియా.. తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందించి తన టాలెంట్ బయటపెట్టింది. ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్ల ఇబ్బందులను డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.వివక్ష..సినిమాలో ఒక సీన్ అద్భుతంగా రావాలంటే నటీనటులకు మంచి టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ సీన్ షూట్ చేసే ప్రదేశంలో మంచి లైటింగ్ ఉండాలి. సీన్‌కు తగ్గట్లుగా ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ సరిగ్గా ఉండేట్లు చూసుకునే మహిళా టెక్నీషియన్లకు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. చాలామంది వారిని చిన్నచూపు చూస్తారు. వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ దియా.. లీడింగ్ లైట్: ద అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ద సీన్స్ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇది దియా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూఈ విషయాన్ని జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ కూతురిపై ప్రశంసలు కురిపించింది. దియా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న వివక్షను డాక్యుమెంటరీలో అర్థవంతంగా చూపించావు. ఎన్నాళ్లుగానో మూలుగుతున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింనకుగానూ దియా ఉత్తమ స్క్రీన్‌రైటర్‌గా త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: ఈ ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తప్పు ఆడాళ్లపైకి తోసేస్తారు: హీరోయిన్ -
Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్ దాకా...
జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి. మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ΄్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.అయినా సరే... వెనుకంజ వేయనివ్వలేదు...మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ్రపోత్సహించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్ కాంపిటిషన్స్కి స్కూల్ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో మంచి గ్రేడ్ వచ్చింది. చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చె΄్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్ ఆర్ట్స్ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది. – దండి శ్రీనివాసరావు, జ్యోతిక శ్రీ తండ్రి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లాపిల్లల లక్ష్యం కోసం...మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్ అనుకున్నాం. స్పోర్ట్స్ అంటే మంచి పోషకాహారం, ఫిట్నెస్, ట్రయినింగ్ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు. – లక్ష్మీ నాగ వెంకటేశ్వరి, జ్యోతిక శ్రీ తల్లి -
ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన 'శ్రీకాంత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్‌కుమార్ రావ్ అద్బుతంగా మెప్పించారు. అలయా ఎఫ్ ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో జ్యోతిక ఒక కీలక పాత్రలో కనిపించారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్ కుమార్, నిధి పర్మార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేటింగ్ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక
చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. రెండు రోజుల్లో పూర్తితర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. చదవండి: లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా.. -
అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ హీరోయిన్లు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించారు. మెగాస్టార్ చిరంజీవితో ఈ ముగ్గురూ యాక్ట్ చేశారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో గుర్తుపట్టారా?తెలుగులో ఆ చిత్రంతో ఎంట్రీఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి పక్కన కూర్చుని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ముగ్గురు నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మా విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ భాగి: ఎ రెబల్ ఫర్ లవ్ అనే సినిమాతో తన కెరీర్ మొదలైంది. పెద్దింటి అల్లుడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, అల్లరి రాముడు.. ఇలా అనేక చిత్రాల్లో యాక్ట్ చేసింది.అక్కడ ఫుల్ బిజీజ్యోతిక.. డోలి సజా కే రఖ్ణా అనే హిందీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిజీ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే! ఠాగోర్, మాస్, చంద్రముఖి, షాక్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైంది. హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.తెలుగులో ఫేమస్రోషిణి.. తన ఇద్దరు అక్కల్లా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించలేకపోయింది. శిష్య అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ మూవీ మాస్టర్, పవిత్ర ప్రేమ, శుభలేఖలు సినిమాతో తెలుగులో ఫేమస్ అయింది. రెండేళ్లు మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె తర్వాత చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పింది.పేరెంట్స్..కాగా ఈ హీరోయిన్ల తల్లి సీమా 1969లో అరవింద్ మొరార్జీని పెళ్లాడింది. వీరికి పుట్టిన కూతురే నగ్మా. మనస్పర్థల వల్ల ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి ఏడాది నిర్మాత చందర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబుతో పాటు జ్యోతిక, రోషిణి సంతానం.చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు! -
జ్యోతిక మనసు ఎలాంటిదో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలు..
-
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
-
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
‘‘పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనేది ‘శ్రీకాంత్’ సినిమా కథ. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడమన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్‌లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన ‘శ్రీకాంత్’ మూవీలో నటించడం గౌరవంగా ఉంది’’ అని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా (అంధ పారిశ్రామికవేత్త) బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘శ్రీకాంత్’. శ్రీకాంత్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించారు.తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ప్రోడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హీరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘‘తుషార్గారు ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యాను. శ్రీకాంత్ బొల్లాలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అనిపించింది. పూర్తి కథ వినగానే కచ్చితంగా ఈ మూవీలో భాగమవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్‌గారి పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలిగా నటించిన మూడో చిత్రం ఇది (నవ్వుతూ). శ్రీకాంత్‌ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త (హీరో సూర్య) తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది. మంచి పాత్ర కుదిరితే నటిస్తాను’’ అన్నారు. -
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
రాజకీయాల్లోకి తననెవరూ ఆహ్వానించలేదని నటి జ్యోతిక పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా రాణించిన ఈమె హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనను దూరం పెట్టి సంసార జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు కాస్త పెద్ద అయిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు.శ్రీకాంత్ బయోపిక్‌లో..ఇటీవల జ్యోతిక కథానాయికగా హిందీలో నటించిన సైతాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె అంధుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ శ్రీకాంత్ మూవీలో టీచర్‌గా ముఖ్యపాత్రను పోషించారు. రాజ్‌కుమార్‌రావు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అప్పుడే భర్తతో నటిస్తాఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నైలో జ్యోతిక మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్ అని, ఇది తన కెరీర్లో చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. శ్రీకాంత్ చిత్రంలో తాను భాగం కావడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడుగుతున్నారని, అందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు జ్యోతిక చెప్పారు.రాజకీయాల్లోకి..మీ భర్త అగరం సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు కూడా సామాజికపరమైన సమస్యలపై స్పందిస్తున్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే తనని ఎవరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, అయినా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్‌లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్. ఇది తెలుగువాడి బయోపిక్. అంధుడైన శ్రీకాంత్ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ టీచర్ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ తుషార్ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.రిజెక్ట్ చేసిన జ్యోతికఅవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్ బయోపిక్‌లో ఆఫర్‌ను తను రిజెక్ట్ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్ చేసి సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్ అంతా చదివాడు.మిస్ చేసుకోవద్దుఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి.. -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్‌కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్‌లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్‌లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్‌లో ప్రతి వర్కౌట్‌ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్‌కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
నీ భర్తను నాకిచ్చేయ్... జ్యోతిక సమాధానమిదే!
'మీ మధ్య దూరం పెరిగింది.. మీరు విడిపోయారు' అంటూ పుకార్లు షికార్లు చేసిన ప్రతిసారి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు హీరో సూర్య దంపతులు. కొంతకాలం క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగ్గా జంటగా వెకేషన్లో కనిపించి అందరి నోళ్లు మూయించారు. తమ మధ్య ఉన్న ప్రేమను పదేపదే చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పకనే చెప్పారు. షైతాన్ సూపర్ హిట్ సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఇచ్చిన జ్యోతిక తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆమె ఇటీవల షైతాన్ మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల మేర రాబట్టింది. ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనలైంది జ్యోతిక. అద్భుతమైన ప్రయాణం 'కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలకే తీసుకెళ్తాయి. కానీ షైతాన్ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్‌గణ్ ఫిలింస్, పనోరమ స్టూడియోస్, జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్ మొత్తానికి అభినందనలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షైతాన్ టీమ్‌తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన్ను ఆరాధిస్తున్నా ఇది చూసిన ఓ అభిమాని.. 'జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్మెన్కు పెద్ద అభిమానిని' అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా..' అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలెండి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: రుచికరమైన బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్ -
స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?
మన హీరోల్లో చాలామంది ఇప్పుడిప్పుడే తెలుగు కాకుండా ఇతర భాషల్లో క్రేజ్ సంపాదిస్తున్నారు. అలాంటిది చాలా ఏళ్ల క్రితం నుంచి తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా సూర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరో, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ల ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని నంబర్స్ బయటకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. గజిని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోల మించిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడట. అలా ఇతడి ఆస్తి దాదాపు రూ.206 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) సూర్యతోనే కెరీర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన జ్యోతిక.. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ పెరిగి పెద్దవడంతో నటిగా మళ్లీ జర్నీ షురూ చేసింది. రీసెంట్గా హిందీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయని ముంబయికి షిప్ట్ అయిపోయింది. ఇకపోతే ఈమె ఆస్తి రూ.331 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సూర్య-జ్యోతిక మొత్తం ఆస్తి దాదాపు రూ.537 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. సూర్య-జ్యోతిక దంపతులకు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు, ముంబయిలో రూ.70 కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నాయట. ఇక కార్ల విషయానికొస్తే.. రూ.1.38 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు, రూ.80 లక్షల ఆడీ క్యూ 7, రూ.61 లక్షల బెంజ్ కారు, రూ.1.10 కోట్ల విలువైన జాగ్వార్ కారు.. వీళ్ల దగ్గర ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు) -
సినీ అవార్డులు.. ఉత్తమ నటిగా జ్యోతికకు పురస్కారం
చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు. 2015వ సంవత్సరానికిగానూ.. ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా హీరో మాధవన్ అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్‌కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్‌కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు. కమిటీ ఏర్పాటు చేశాం.. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ