Kidney stones
-
ఆరు నెలల బాలుడికి కిడ్నీలో రాళ్లు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా చిన్నపిల్లలకు అవయవాలు చాలా చిన్నగా ఉంటాయి. అందులోనూ ఆరు నెలల పిల్లలంటే అత్యంత సున్నితంగా ఉంటాయి. ఆ వయసులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటిది రెండు కిడ్నీల్లోనూ రెండేసి రాళ్లు, అవీ పెద్ద పరిమాణంలో ఏర్పడటంతో ఓ బాబుకు మూత్రవిసర్జన ఆగిపోయి, పొట్ట ఉబ్బిపోయింది. ఆ బాబుకు ఎండోస్కోపిక్ విధానంలో మొత్తం నాలుగు రాళ్లను తొలగించి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఊరట కలిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ వై.మనోజ్‌కుమార్ తెలిపారు. ‘నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన ఆరు నెలల బాబు దక్షిత్‌కు మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బిపోవడంతో ఈ నెల 5వ తేదీన కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనికి అన్ని పరీక్షలు నిర్వహించగా, రెండు కిడ్నీల్లో 11 మి.మీ, 9 మి.మీ, 9 మి.మీ, 7 మి.మీ. పరిమాణంలో నాలుగు రాళ్లు ఉన్నట్లు తేలింది. ముందుగా స్టెంట్లు అమర్చి కిడ్నీలను సాధారణ స్థితికి తెచ్చిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఎండోస్కోపిక్ విధానంలో కుట్లు లేకుండా లేజర్ ద్వారా ఇతర అవయవాలకు ఎలాంటి హాని జరగకుండా కిడ్నీలో రాళ్లను తొలగించాం. అతను కోలుకోవడంతో 10వ తేదీన డిశ్చార్జ్ చేశాం. ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీల్లో రెండేసి రాళ్లు ఏర్పడటం ఏపీలో ఇదే తొలిసారి. లక్ష మందిలో కేవలం పది మందికే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.’ అని డాక్టర్ వివరించారు. -
Hyderabad: కిడ్నీలో 418 రాళ్లు!
లక్డీకాపూల్: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్‌యూ వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల మహేష్ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్యూ వైద్య నిపుణులు సూచించారు. -
ఆపరేషన్ లేకుండా కిడ్నీలో రాళ్ల తొలగింపు
కర్నూలు(హాస్పిటల్): కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక యంత్రాన్ని సమకూర్చింది. గత సంవత్సరం రూ.1.5కోట్ల ఖర్చుతో ఈఎస్‌డబ్ల్యుఎల్ మిషన్‌ను ఆసుపత్రిలోని యురాలజి విభాగానికి అందజేసింది. ఇప్పటి వరకు 200 మంది రోగులకు కిడ్నీలో రాళ్లను ఆపరేషన్, ఎలాంటి అనెస్తీషియా లేకుండానే వైద్యులు తొలగించారు. దీంతో పాటు రోగిని అదేరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వెసలుబాటు సైతం ఈ మిషన్ వల్ల కలుగుతోంది. ఈ మిషన్ ద్వారా నిర్వహించిన కేసుల వివరాలను ఇటీవల దుబాయిలో నిర్వహించిన అంతర్జాతీయ యురాలజి కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సేపూరి బాలరవితేజ వివరించారు. ఇందుకు ఆయన ప్రశంసలను సైతం అందుకున్నారు. -
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
బొల్లం రవిని పరామర్శించిన బీఆర్ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్
నల్గొండ: ఇటీవల కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల బీఆర్ఎస్ నేత బొల్లం రవి యాదవ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఆయన పాటు బీఆర్ఎస్ నేతలు ఆవుల పురుషోత్తం యాదవ్, హాలియా ఏయంసి డైరెక్టర్ పోశం శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ హలీం, గురజాల సైదులు, కుంటిగొర్ల రాజశేఖర్, పగిడిమర్రి అనిల్ కుమార్ ఉన్నారు. -
చిన్నారులూ... కిడ్నీలో రాళ్లు...!
పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల మూత్రపిండాల్లో రాళ్లు రావడం అంతే సాధారణం కాదుగానీ... అరుదు మాత్రం కాదు. గణాంకాల ప్రకారం పదహారేళ్లలోపు వారిలో 5 నుంచి 6 శాతం మంది పిల్లల్లో కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. కిడ్నీల్లో రాళ్లు వచ్చే కండిషన్‌ను ‘నెఫ్రోలిథియాసిస్’ అంటారు. కారణాలు: పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారు కావడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి... ► ఆహారంలో రాళ్లను కల్పించే రసాయన గుణాలు ఉండటంతో పాటు కొంతవరకు వాతావరణం, ఆర్థిక–సామాజిక పరిస్థితులు. (పేదవర్గాల్లో కలుషితాహారం తీసుకునే ఆర్థిక సామాజిక పరిస్థితులు మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే అవకాశాలు ఎక్కువ. వారు తీసుకునే ఆహారాలను బట్టి అవి క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి రాళ్లను ఏర్పరవచ్చు. వాటిని బట్టి ఫలానా ఆహారనియంత్రణ పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు). ► పిల్లల్లో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు. ► కొందరిలో ఎండోక్రైనల్ సమస్యలు ► కొన్ని జన్యుపరమైన అంశాలు ► కిడ్నీలో రాళ్లు కనిపించిన పిల్లల్లో మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని కూడా డాక్టర్లు అన్వేషిస్తారు. లక్షణాలు: ► జ్వరం ► తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్రమైన నడుము నొప్పి ► మూత్రంలో రక్తం కనిపించడం ► వాంతులు ► కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు కూడా. నిర్ధారణ : ► కొన్ని రొటీన్ మూత్రపరీక్షలు, ► రీనల్ ఫంక్షన్ టెస్ట్, ► రీనల్ స్కాన్ ► కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం. (రీనల్ స్కాన్స్, మెటబాలిక్ పరీక్షల సహాయంతో రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకుంటారు. దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. జాగ్రత్తలు / చికిత్స: కిడ్నీల్లో స్టోన్స్ వచ్చేందుకు అవకాశం ఉన్న పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం; పొటాషియమ్ ఎక్కువగా ఉండే ద్రవాహారాల్ని తీసుకోవడం; కొవ్వులు ఎక్కువగానూ, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించాలి. చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను తగ్గించాలి. చికిత్స : ఈ రాయి పరిమాణం చాలా చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఒకవేళ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, దేనికైనా అడ్డుపడుతుంటే షార్ట్వేవ్ లిథోట్రిప్సీ వంటి అధునిక పద్ధతులతో రాయిని పొడిపొడి అయ్యేలా బ్లాస్ట్ చేయడం, అదీ కుదరనప్పుడు చివరగా యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
ప్రపంచంలో అతి పెద్ద కిడ్నీలో రాయి ఇదే.!
ఈమధ్య కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువైంది. వీటివల్ల వచ్చే నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. కిడ్నీలో రాళ్ల సమస్యను ప్రారంభదశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు? వాటి లక్షణాలేంటి? ఈ సమస్య దరిచేరకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి వంటివి ఇప్పుడు చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. ప్రపంచంలోనే పెద్ద కిడ్నీ స్టోన్ ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ను శ్రీలంకలోని ఒక రోగి నుంచి వైద్యులు తొలగించారు. ఈ రాయి 5.26 అంగుళాల పొడవు, 801 గ్రాముల బరువు కలిగి ఉంది . ఈనెల ప్రారంభంలో శ్రీలంక ఆర్మీ వైద్యులు దీన్ని తొలగించారు. ప్రపంచంలోని అతిపెద్ద, బరువైన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని శ్రీలంక మిలిటరీ హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు కూడా శ్రీలంకలోనే ఒక రోగి నుంచి 620 గ్రాముల బరువైన కిడ్నీ స్టోన్‌ను తొలగించారు. what a week at GWR HQ: - Chef Hilda Baci achieves longest cooking marathon at 93 hours - Max Park completes the fastest 3x3x3 cube solve, smashing record by 0.3 seconds - A kidney stone removed from a man in Sri Lanka is heaviest and largest ever seen we're off for a lie down😴 pic.twitter.com/6p4twlFuFK — Guinness World Records (@GWR) June 16, 2023 కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఏం చేయాలి? ముందుగా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి..అందులో ఎక్కువగా నీళ్లు తాగడం ముఖ్యమైనది. రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది. మంచి ఆహారం, తగు వ్యాయామాలు చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాదు. అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. -
కర్బూజ జ్యూస్ తాగుతున్నారా? అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల..
వేసవిలో మనకు అధికంగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కర్బూజలో దాదాపు తొంబై శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్బూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. తెల్ల రక్తకణాల వృద్ధి ►కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ►కర్బూజలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండటం వల్ల కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు.. ►కర్బూజ పండులో విటమిన్ కె, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా పని చేసేలా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన ►ఈ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వలన గుండెకు మంచి న్యూట్రియంట్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండటం వలన అది హార్ట్ ఎటాక్ నుండి, గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ►తక్కువ క్యాలరీస్, ఎక్కువ పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. ►ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. కిడ్నీలో రాళ్లను సైతం ►ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ►ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. గర్బిణులకు ఎంతో మేలు ►ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం గర్బిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ►కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... -
Kidney Stones: కాల్షియమ్ ఆక్సలేట్ ఉండే గింజలు తింటే అంతే! మూత్రనాళంలో తట్టుకుంటే..
ఒక వ్యక్తికి కిడ్నీలో నొప్పి వచ్చేంత రాయి తయారు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? నొప్పి రావడానికి ముందే తెలుసుకునే మార్గాలు ఉంటాయా? కిడ్నీ సమస్య వస్తే ఎప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి? సాధారణంగా, మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రపిండంలో కదిలే దశ వచ్చే వరకు లేదా మూత్రనాళంలోకి వెళ్ళేవరకు నొప్పి కలిగించవు. రాళ్ళు చిన్నవయితే చాలా సార్లు శరీరం నుండి తక్కువ నొప్పితో లేదా అసలు నొప్పి తెలియకుండానే మూత్రంతో పాటుగా బయటకు వెళ్ళిపోతాయి. ఇవి మూత్రనాళంలో తట్టుకుంటే మాత్రం నొప్పి మొదలవుతుంది. ఇలా తట్టుకున్న రాళ్లు మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అలాగే మూత్రపిండాల వాపునకు దారి తీస్తాయి. దీని వల్ల మూత్రనాళ దుస్సంకోచానికి (spasm) కారణమవుతుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ రాళ్ళు 85% కాల్షియమ్ ఆక్సలేట్ (calcium oxalate) అన్న రసాయనంతో ఏర్పడుతాయి. ఈ నొప్పులకు రాళ్ళ సైజుతో సంబంధం లేదు. కావున మూత్రం తగ్గడం కానీ ఎక్కువ సార్లు పోవడం, మూత్రం వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మంచది. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు నిర్దారణ అయితే భోజనంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? 1. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు పెద్ద స్పూన్‌తో తేనే, నిమ్మరసాలను కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. రాళ్లు కరిగిపోవడానికి ఇది దోహాదపడుతుంది. 2. కొండపిండి అనే మొక్కకు చాలా శక్తి ఉంది. మూత్రపిండాలలో కొండలు ఏర్పడినా కరిగించగల సత్తా దీనికి ఉందని అంటారు. ఇది రోడ్డు పక్కన అన్ని ప్రాంతాల్లో ఉచితంగా దొరికే మొక్క. దీనిని శుభ్రం చేసి ఎండబెట్టి దంచి పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు పాలలో బాగా మరిగించి వడగట్టి తాగాలి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కచ్చితంగా కరుగుతాయని ఇప్పటికే నిర్దారణ అయింది. 3. భోజనం తిన్న తర్వాత కిడ్నీలో రాళ్లు కొన్నిసార్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. తక్కువ భోజనం మరియు మొత్తంలో ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది. అలాగే ఇంటి భోజనానికి మాత్రమే పరిమితం కండి. వేపుళ్లు, జంక్‌ఫుడ్ తింటే ఇబ్బంది పెరుగుతుంది. నీళ్లు పుష్కలంగా తాగండి. 4. ఎక్కువగా కూరగాయలు మరియు పండ్లు, తృణధాన్యాలు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి. చక్కెరతో కూడిన తియ్యని ఆహారాలు (స్వీట్లు) , పానీయాలను తగ్గించండి లేదా ఆపేయండి. 5. ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా మద్యంలో ఉంటుంది. దీనికి పరిమితి విధించండి లేదా ఆపేయండి. ఆల్కహాల్ ఎందుకు వద్దు అంటే ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. పైగా ఇతర ఇబ్బందులకు దారి తీస్తుంది. 6. దుంపలు, చాక్లెట్, బచ్చలికూర, టీ వంటి రాళ్లను ఏర్పరిచే ఆహారాలకు దూరంగా ఉండండి. చాలా గింజలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దోహదం చేస్తుంది. కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉండే వాటిని తినకూడదు. సరైన ఆహారాన్ని సూచించే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు తింటున్నారా? తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే.. -
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా?
కిడ్నీలో రాళ్లు ఏర్పడే కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. కిడ్నీ పనితీరు, కిడ్నీ రోగాల బారినపడితే ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం(మార్చి 9) సందర్భంగా ప్రిస్టిన్ హెల్త్ కేర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ప్రతి ముగ్గురిలో ఒకరు నమ్ముతున్నట్లు ఈ సర్వేలో తేలింది. అయితే ఇందులో అసలు వాస్తవం లేదని, కేవలం కల్పితమేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్సను 50 శాతం మంది కావాలనే 6 నెలలు ఆలస్యం చేస్తున్నారు. దాన్ని కాస్తా రెండేళ్లకు పొడిగిస్తున్నారు. కిడ్నీ రోగాలకు సంబంధించి అధికారికంగా జాతీయ గణాంకాలు లేకపోయినప్పటికీ కేసుల్లో గణనీయ పెరుగుదల కన్పిస్తున్నట్లు లైబ్రేట్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ డేటా స్పష్టం చేసింది. దీని ప్రకారం 2021తో పోల్చితే 2022 కిడ్నీ రోగాలకు సంబంధించి డాక్టర్ అపాయింట్మెంట్లు ఏకంగా 180 శాతం పెరిగాయి. వీరిలో ఎక్కువమందికి కిడ్నీలో రాళ్ల సమస్యే ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మహిళలతో పోల్చితే పురుషులే మూడు రెట్లు అధికంగా ఉన్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల ప్రధానంగా ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి సమస్యల బారినపడే ముప్పు ఉంటుంది. అయితే ఈ విషయం బాధితుల్లో 14 శాతం మందికే తెలుసు. యూరిన్ కిడ్నీ నుంచే ఉత్పత్తి అవుతుందన్న విషయం సర్వేలో పాల్గొన్న 50 శాతం మందికిపైగా తెలియదు. కిడ్నీలు కూడా ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని 9 శాతం మందికి మాత్రమే తెలుసు. ఎముకల ఆరోగ్యానికి కిడ్నీనే కీలకమని 7 శాతం మందికే తెలుసు. ఫిట్నెస్, బాడీ బిల్డింగ్‌కు పాపులారిటీ పెరుగుతున్న కారణంగా చాలా మంది తమ డైట్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయని 50 శాతం మంది విశ్వసిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కిడ్నీ ఆరోగ్యంపై చాలా మందికి కనీస అవగాహన లేదని సర్వే స్పష్టం చేసింది. కిడ్నీలో రాళ్లను తొలగించే సర్జరీ సేఫ్ అని సర్వేలో పాల్గొన్న 68శాతం మంది నమ్ముతున్నారు. అయినా 50 శాతం మంది కావాలనే చికిత్సను 6 నెలల పాటు ఆలస్యం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే అవి మరింత పాడవకుండా నివారించవచ్చని డాక్టర్ వైభవ్ కపూర్(ప్రిస్టిన్ కేర్ సహవ్యవస్థాపకులు) సూచిస్తున్నారు. చదవండి: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..! -
ఆస్పత్రిలో ప్రభు
ప్రముఖ నటుడు ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన చెన్నై కోడంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాళ్లను తొలగించడానికి యుకిథ్రోస్ కోఫీ అనే లేజర్ శస్త్ర చికిత్సను మంగళవారం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. -
Health: బ్లాక్ సాల్ట్‌ను నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకుంటే..
Black Salt- Health Benefits: బీపీ సమస్య ఉన్నవారు రెగ్యులర్ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడాలి. దీంతో వంటల రుచి మారదు. పైగా ఉప్పు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారు నల్ల ఉప్పును వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం పలుచగా కూడా మారుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే నల్ల ఉప్పును తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంతో పాటు సైనస్, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఉప్పును వాడడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ►డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. ►కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ►ఎముకలు దృఢంగా మారుతాయి. ►నిద్ర చక్కగా పడుతుంది. ►మానసిక ప్రశాంతత లభిస్తుంది. ►అధిక బరువు తగ్గుతారు. ►కొవ్వు కరిగి పోతుంది. ►కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. ►అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ►చర్మం కాంతివంతంగా మారుతుంది. ►కనుక సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక దీన్ని సాధారణ ఉప్పులాగే వాడుకోవచ్చు. లేదా రోజూ ఉదయం నిమ్మరసం నీళ్లలో కలిపి పరగడుపునే తీసుకోవచ్చు. లేదా తేనె నీళ్లతోనూ కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం పొందే ఆస్కారం ఉంటుంది. చదవండి: Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. సమస్య ఏమిటి? పరిష్కారం ఉందా? -
ఆసుపత్రిలో చేరిన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
ఇటీవలే దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైదొలిగాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కిడ్నీలో రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుఉతున్న సర్ఫారాజ్ ప్రస్తుతం రాంచీలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ''కొన్నిరోజులు కిందట కిడ్నీలో తీవ్రమైన నొప్పి రావడంతో స్కానింగ్ చేయగా స్టోన్స్ ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు'' అంటూ సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ వెల్లడించాడు. ఇక 25 ఏళ్ల సర్ఫారాజ్ ఖాన్ ఇటీవలే ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికి నిరాశే ఎదురైంది. అయితే బంగ్లాదేశ్-ఏ టూర్‌కు మాత్రం సర్ఫరాజ్‌ను ఎంపిక చేశారు. ఇక విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న ముంబై జట్టుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఫ్రంట్‌లైన్ పేసర్ శివమ్ దూబే గాయంతో దూరమవడం.. తాజగా సర్ఫరాజ్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో టోర్నీకి దూరం కావడం జట్టును దెబ్బతీసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో జట్టు బలహీనంగా మారిపోయింది. చదవండి: Ben Stokes: ఆలస్యమైనా కుంభస్థలాన్ని గట్టిగా బద్దలు కొట్టాడు ఇంగ్లండ్ గెలుపులో మూల స్తంభాలు.. -
హైదరాబాద్: మనిషి కిడ్నీలో 206 రాళ్లు.. గంటలోనే
సాక్షి, హైదరాబాద్: రోగి కిడ్నీలో ఏర్పడిన 206 రాళ్లను వెలికితీసి అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. గురువారం సదరు ఆస్పత్రి వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. నల్లగొండకు చెందిన వీరమల్ల రామలక్ష్మయ్య (56) ఆరు నెలలుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయన గత నెల ఎల్బీనగర్లోని అవేర్ ఆస్పత్రిలో చేరాడు. యూరాలజీ సీనియర్ వైద్యుడు పూల సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రామలక్ష్మయ్యకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు రామలక్ష్మయ్యకు కీ హోల్ శస్త్ర చికిత్స చేసి గంట సేపట్లోనే కిడ్నీలో ఉన్న 206 రాళ్లను తొలగించారు. రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రామ లక్ష్మయ్యను డిశ్చార్జి చేశారు. ఎండకాలం డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుందని, ఎండలో అధికంగా తిరగ డం కారణంగా సమస్య వస్తుందన్నారు. నీరు, జ్యూస్ అధిక మొత్తంలో తీసుకోవాలని వైద్యు లు సూచించారు. నీటి శాతం తక్కువ అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి చూపులకు వచ్చిన వారు ఎవరూ ఒప్పుకోవడం లేదని -
కిడ్నీలో రాళ్ల తొలగింపు ఇప్పుడు తేలికే!
Kidney Stones Can Now be Removed Easily: సాధారణంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుండటం వల్ల, వేసవిలో విపరీతంగా దాహం కారణంగా ఎంత తాగినా ఆవిరైపోవడం వల్ల డీ–హైడ్రేషన్ సమస్య రావచ్చు. ఇది కిడ్నీలో రాళ్లు పెరిగేందుకు ఆస్కారం ఇస్తుంది. అందుకే ఎప్పుడూ తగినన్ని నీళ్లు తాగుతూ దేహాన్ని నిత్యం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఒకవేళ మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినా ఆందోళన పడాల్సిన పనిలేదు. వాటి సైజు చాలా చిన్నగానే ఉంటే... ఎక్కువగా నీళ్లు తాగడం, ద్రవాహారాలు తీసుకోవడం వల్ల అవే పడిపోతాయి. పెద్దగా ఉన్న సమయంలో కొన్ని చికిత్సలతో వాటిని తొలగించవచ్చు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. ►మూత్రపిండాల్లో రాళ్ల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఐవిపి, అల్ట్రాసౌండ్, సిటిస్కాన్వంటి పరీక్షలు అవసరమవుతాయి. చికిత్సలో భాగంగా శబ్దతరంగాల సహాయంతో కిడ్నీలోని రాయిని చిన్న చిన్న పలుకులుగా పేల్చివేస్తారు. దాంతో అవి మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయి. ఈ ప్రక్రియను ‘ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ’ అంటారు. చిన్న పలుకుల్లాంటి రాళ్లు బయటకు వచ్చే సమయంలో, అవి మూత్రనాళాల గోడలతో ఒరుసుకుపోయి, గాయం కాకుండా ఉండేందుకు మూత్రవిసర్జన మార్గం ద్వారా... కిడ్నీలు – మూత్రాశయానికి మధ్యన ఓ ట్యూబ్ వేస్తారు. దీనిని యూరెటెరిక్ స్టెంట్ అంటారు. దీన్ని కొద్దిరోజుల వరకు అలాగే ఉంచాల్సి రావచ్చు. చిన్నముక్కలుగా మారిన ఆ రాతి పలుకులన్నీ తొలగిపోయాక దీన్ని తొలగిస్తారు. దీన్ని చాలా సులభంగా ఔట్ పేషెంట్ విభాగంలోనే తొలగించవచ్చు. -
Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...
రీనల్ కాల్కులీ, నెఫ్రోలిథియాసిస్, యురోలిథియాసిస్... ఇవన్నీ మనం వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే వ్యాధుల వైద్యపరిభాష పదాలు. ఆహారంలో దేహానికి అందిన మినరల్స్, సాల్ట్స్ మూత్రం ద్వారా విసర్జితం కాకుండా ఒకచోట కేంద్రీకృతం కావడం ద్వారా ఏర్పడుతాయి. కాంపౌండ్స్‌ను బట్టి వీటిని కాల్షియం స్టోన్స్, స్ట్రక్టివ్ స్టోన్స్, యూరిక్ యాసిడ్స్టోన్స్, క్రిస్టైన్ స్టోన్స్‌గా వర్గీకరిస్తారు. ఎందుకు వస్తాయి? కొందరిలో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కారణమవుతుంది. దేహం డీ హైడ్రేషన్‌కు గురికావడంతోపాటు ప్రోటీన్, సోడియం, షుగర్స్ మితిమీరి తీసుకోవడం స్వీయ తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల ఆపరేషన్ల సైడ్ ఎఫెక్ట్‌గా కూడా కిడ్నీ రాళ్లు ఏర్పడుతుంటాయి. దేహం అధిక బరువు, కొన్ని రకాల అనారోగ్యాలు, ఆ అనారోగ్యం తగ్గడానికి తీసుకునే మందులు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతుంటాయి. ఇలా ఇబ్బంది పెడతాయి కిడ్నీలో రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మధ్యలో ఏదో ఒక చోట యూరినరీ ట్రాక్ట్‌ను ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఈ రాళ్లు సైజును బట్టి మూత్ర విసర్జన సమయంలో కొద్దిపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన నొప్పి కలిగిస్తుంటాయి. రాయి ఒరుసుకుపోవడంతో మూత్రవిసర్జన మార్గంలో గాయమవుతుంటుంది. మూత్రాశయం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. నాళం ద్వారా బయటకు రాలేనంత పెద్ద రాళ్లు ఆ మార్గంలో ఏదో ఒక చోట స్థిరపడిపోతాయి. నిజానికి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వెంటనే వాటి లక్షణాలు బయటకు తెలియవు. కొంతకాలం పాటు అవి స్వేచ్ఛగా మూత్రాశయం, మూత్రనాళాల మధ్య సంచరిస్తుంటాయి. మూత్రనాళం సైజ్ కంటే చిన్నవిగా ఉన్న రాళ్లు మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతుంటాయి. అంతకంటే పెద్దవైన తర్వాత మాత్రమే లక్షణాలు బహిర్గతమవుతాయి. మూత్రనాళం వాపుకు లోనవడం, కండరాన్ని పట్టినట్లు నొప్పి రావడం తొలి లక్షణాలు. పక్కటెముకల కింద ఒక పక్క నుంచి వెనుక వైపుకు తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి నొప్పి షాక్ కొట్టినట్లు ఉంటుంది. పొత్తి కడుపు కింద నుంచి పాకినట్లు నొప్పి నొప్పి తీవ్రత పెరుగుతూ – తగ్గుతూ అలలు అలలుగా రావడం మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట వీటితోపాటు మూత్రం రంగు మారడం (రక్తం కలిసినట్లు), దుర్వాసన, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, విసర్జన తర్వాత కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించడం, మూత్రాశయం నిండిపోయినట్లు అనిపిస్తున్నప్పటికీ కొద్దిమోతాదులో మాత్రమే విడుదల కావడం, తల తిరగడం– వాంతులు, ఇన్ఫెక్షన్ తీవ్రమై చలిజ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాయిని బట్టి చికిత్స మూత్రం పలుచగా ఉన్నప్పుడు మినరల్స్, సాల్ట్స్ అన్నీ సులువుగా బయటకు వెళ్లిపోతాయి. కానీ మూత్రం చిక్కబడినప్పుడు ఇవి ఒక చోట కేంద్రీకృతమవుతుంటాయి. కాబట్టి దేహం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తీసుకోవడం ప్రధానమైన జాగ్రత్త. చికిత విషయానికి వస్తే... రాయి కాంపౌండ్స్, సైజ్‌ను బట్టి కరిగించడం, శస్త్ర చికిత్స చేసి తొలగించడంతోపాటు లేజర్ కిరణాల ద్వారా రాయిని పలుకులుగా చేయడం అనే నొప్పి లేని పద్ధతులు కూడా పాటిస్తారు. తక్షణ వైద్యం కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు సందేహం కలిగిన వెంటనే డాక్టర్ని సంప్రదించి తీరాలి. ఎందుకంటే కొంతకాలం సొంత వైద్యం చేసుకుని వేచి చూసే పరిస్థితి కాదు. లక్షణాలు బయటపడేటప్పటికే వ్యాధి తక్షణ వైద్యం అందాల్సిన స్థితికి చేరి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఇలా ఉంటాయి. ∙నొప్పి తీవ్రమవడంతోపాటు కనీసం కూర్చోలేకపోతారు. ఈ భంగిమలో కూర్చుంటే కొంచెం ఉపశమనంగా, సౌకర్యంగా ఉంది అనడం కూడా సాధ్యం కాని స్థితి ∙నొప్పితోపాటు చలిజ్వరం ∙మూత్రంలో రక్తం పడడం, మూత్ర విసర్జన కష్టం కావడంతోపాటు నొప్పి, తలతిరగడం, వాంతులు కావడం అన్నీ ఏకకాలంలో సంభవిస్తాయి. -
ఆ మాష్టారు కిడ్నీలో 156 రాళ్లు!
బంజారాహిల్స్: దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆపరేషన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్ సర్జరీ నిర్వహించి ఓ వ్యక్తి కిడ్నీలో ఉన్న 156 రాళ్లను ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి యూరాలజిస్ట్, ఎండీ డాక్టర్ వి.చంద్రమోహన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటకలోని హుబ్లికి చెందిన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజు కడుపు నొప్పి రావడంతో పరీక్షలు నిర్వహించడంతో కిడ్నీల్లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ అందుకు బదులుగా కడుపు దగ్గరలో ఉందని దీన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారని డాక్టర్ చంద్రమోహన్ పేర్కొన్నారు. ఇలాంటి చోట కిడ్నీలోని రాళ్లను తీయడం చాలా పెద్ద ప్రయత్నమేనని అయితే శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి తీసేశామని ఆయన వివరించారు. ఈ రోగికి రెండేళ్లకు ముందే రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుందని అయితే ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఉన్నట్టుండి నొప్పి రావడంతో పరీక్షలు చేయిచుకున్నారని అన్నారు. -
మూత్రపిండాల్లో రాళ్లు, ఐసీయూలో నటుడు
తమిళ సినిమా: నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్ అలీఖాన్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు. చదవండి: తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా.. -
నాలుగు నెలలు.. కిడ్నీలో ఆరు రాళ్లు
సాక్షి, హైదరాబాద్ : నాలుగున్నర కేజీల బరువు ఉన్న నాలుగు మాసాల మగ శిశువు రెండు మూత్రపిండాల నుంచి 6 రాళ్లను వైద్యులు విజయవంతంగా తొలగించారు. కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే శిశువు కిడ్నీల నుంచి రాళ్లను తొలగించినట్లు నగరంలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ తరహా చికిత్స ప్రపంచంలోనే మొదటిసారని చెప్పారు. ఈ మేరకు గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండీ, సర్జన్ డాక్టర్ వి.చంద్రమోహన్, రేడియాలజిస్ట్ డాక్టర్ రూప, యూరాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ, అనస్థీషియన్ డాక్టర్ పవన్, పీడియాట్రిక్ డాక్టర్ అజయ్లతో కూడిన బృందం చికిత్స వివరాలను వెల్లడించింది. రెండు కిడ్నీల్లో ఆరు రాళ్లు.. అత్తాపూర్‌కు చెందిన అర్షాద్ హుస్సేన్ దంపతులకు ఏప్రిల్ 5వ తేదీన మగ బిడ్డ జన్మించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ మాంసాహారులు కావడం, గర్భస్థ సమయంలో డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తడం వల్ల పుట్టుకతోనే శిశువు కిడ్నీలో రాళ్ల ఏర్పడ్డాయి. మూడో నెలలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం బాలుడిని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోగా ఆ తర్వాత మూత్ర విసర్జనా నిలిచిపోయింది. వైద్యులు పొట్ట సహా కిడ్నీ ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్స కోసం కేపీహెచ్‌బీలోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ప్రీతి ఆస్పత్రి యూరాలజీ సర్జన్ డాక్టర్ చంద్రమోహన్ బాలుడికి పలు రకాల వైద్య పరీక్షలు చేసి ఎడమ కిడ్నీలో 3, కుడి కిడ్నీలో 3 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నెలరోజుల క్రితం రిట్రో గ్రేడ్ ఇంట్రా రీనల్ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్) పద్ధతిలో విజయవంతంగా రాళ్లను తొలగించారు. కేవలం గంట వ్యవధిలోనే రెండు కిడ్నీల్లో ఉన్న ఆరు రాళ్లను లేజర్ కిరణాల ద్వారా కరిగించి, మూత్ర నాళం నుంచి కిడ్నీ వరకు స్టంట్‌ను అమర్చారు. పది రోజుల తర్వాత స్టంట్‌ను కూడా తొలగించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ రాళ్లను కరిగించి, బయటికి తీయడం ద్వారా శరీరంపై ఎలాంటి కోతలు, కుట్లు అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ తరహా చికిత్సకు ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో పాటు అనస్థిషియా నిపుణులు, రేడియాలజిస్ట్‌ల సేవలు అవసరం ఉంటుందని డాక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు. ప్రతి లక్ష మంది పిల్లల్లో ముగ్గురికి ‘డీహైడ్రేషన్, పోషకాహారలోపం, అధికంగా మాంసం, మద్యం సేవించడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. పెద్దల్లో చాలా సహజం. కానీ చిన్నపిల్లల్లో అది కూడా నాలుగు నెలల శిశువు కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా అరుదు. జన్యుపరమైన లోపాల వల్ల ప్రతి లక్ష మంది శిశువుల్లో ముగ్గురికి మాత్రమే ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయి. ఇప్పటివరకు చైనా, టర్కి దేశాల్లో ఏడు, ఎనిమిది నెలల పిల్లలకు ఈ తరహా చికిత్స చేశారు. కానీ నాలుగున్నర కేజీల బరువున్న నాలుగు నెలల శిశువుకు రెండు కిడ్నీల నుంచి ఆరు రాళ్లను తొలగించడం ప్రపంచంలోనే ఇదే ప్రధమం’వైద్యులు అని తెలిపారు. -
కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది
వినడానికి, చదవడానికి, నమ్మశక్యంగా లేని వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన దక్షిణ డకోటాలో ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలు.. గిల్ట్జ్(34) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడసాగింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గిల్ట్జ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేల్చారు. అంతేకాక ఆమె కడుపులో కవలలు లేదా ముగ్గురు పిల్లలు పెరుగుతున్నట్లు గుర్తించారు. గిల్ట్జ్ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని ప్రసవ వేదనతో అని పేర్కొన్నారు. అనంతరం 4 నిమిషాల వ్యవధిలో గిల్ట్జ్ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్నారులంతా 1.8కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘ఎటువంటి ఆపరేషన్లు లేకుండా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరిగే సంఘటన. డెలివరీ సమయానికి గిల్ట్జ్ 34 వారాల గర్భంతో ఉన్నారు. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. వైద్యుడిని అయినప్పటికి సాధరణ జనాల మాదిరిగానే నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఓ మహిళకు తాను గర్భవతిని అని తెలియకపోవడం.. నిజంగా వింతే. ఎందుకంటే గర్భవతి అయ్యాక నెలసరి ఆగిపోతుంది.. బిడ్డ పెరుగుతున్న కొద్ది ఉదర భాగం ముందుకు వస్తుంది. అంతేకాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పటికి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కిడ్నీలో రాళ్లు అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ ఏకంగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్త చదివిన జనాలు కూడా సదరు వైద్యులు వ్యక్తం చేసిన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు. గిల్ట్జ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఓ అమ్మాయికి, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. -
ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, సరైన వ్యాయామం లేని కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. ఇక డయాబెటిస్తో పాటు అత్యధికులను బాధిస్తున్న మరో సమస్య ఒబేసిటి. ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు. మెంతి గింజలతో తయారు చేసే తేనీరుతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా స్థూలకాయం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్‌గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు. వేడినీళ్లలో గుప్పెడు మెంతి గింజలను కలుపుకొని తాగడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. తరచుగా ఈ టీని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చని పేర్కొంటున్నారు. మెంతి టీ తయారీ ఒక టీ స్పూను మెంతి గింజలను తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పులో నీటిని తీసుకుని వేడి చేసి.. అందులో మెంతి పొడి కలపాలి. కావాలనుకుంటే టీ స్పూన్ తేనె, తులసి ఆకులు, తేయాకులను కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత ఈ టీని తాగినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు. -
మహిళకు టెస్టులు చేసి డాక్టర్లు షాక్
బీజింగ్ : వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్ సైతం కంగుతిన్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్జు హాస్పిటల్లో జరిగింది. షాంగైకి చెందిన మహిళ ఝాంగ్(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి బాధిస్తోంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ కోసం చంగ్జౌలోని వుజిన్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాకయ్యారు. కుడి మూత్రపిండంలో(రైట్ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించేశారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు సూచించారు. అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. -
కిడ్నీలో వెయ్యిరాళ్లు
సాక్షి, నంద్యాల అర్బన్: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని శాంతిరాం ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. పట్టణానికి చెందిన సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ భార్గవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్ అనే వ్యక్తి కిడ్నీలో ఉన్న దాదాపు వెయ్యిరాళ్లను బయటకు తీశారు. అనట్రోఫిక్ నెఫ్రో విథాటమి అనే ఈ శస్త్రచికిత్సను 3గంటల పాటు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను విజవంతంగా నిర్వహించిన డాక్టర్లను ఆసుపత్రి చైర్మన్ మిద్దె శాంతిరాముడు, వైస్ చైర్మన్ డాక్టర్ మాధవీలత అభినందించారు. కార్యక్రమంలో సహ యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్, హౌస్ సర్జన్ హరి, మత్తు డాక్టర్లు మధుసూదన్‌రెడ్డి, నలిని, స్టాఫ్‌నర్సు ఏంజల్, తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీల్లో రాళ్లు... నివారణ ఇలా..!
మహాభాగ్యం సమ్మర్లో మనం నీళ్లు ఎక్కువగా తాగినా సరే... చెమట వల్ల ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. దీనివల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జిస్తారు. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, ఆ మోతాదులో మూత్ర విసర్జన చేయడానికి గాను రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి. ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ఇవి రాళ్లు ఏర్పడే కారకాలు. క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది.ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ.కూల్డ్రింకులు కూడా అలాంటి ప్రమాదాలనే కలిగిస్తాయి. కాబట్టి వాటిని మానేయాలి. -
ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి!
అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయి. అలా పాలు, పాలకూర వంటివి కొందరికి కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. అలాగే పైన పల్చటి పొర ఉండే టమాటా కాస్తా... టెంకాయి పైన టెంకలాంటి రాయిని కిడ్నీలో ఏర్పరుస్తుంది. ఇలా కిడ్నీలకు వచ్చే మరో ప్రమాదం రాళ్ల రూపంలో ఉంటుందన్నమాట. వాటి వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ రాళ్ల దెబ్బలనుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. అదే చేస్తుంది ఎంతో మేలు. పెద్ద ప్రమాదాన్నే నివారించే ఆ చిరు జాగ్రత్తలివే... (చదవండి: అర్థంచేసుకోకపోతే.. కిడ్నీ ఒక పెద్ద పజిల్) ►రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ►ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ► క్యాల్షియం సప్లిమెంట్లనూ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించాలి. ►ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. ► ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు. ►కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. కిడ్నీకి గండం... మందులూ, మద్యం మూత్రపిండాల ఆరోగ్యానికి గండంగా పరిణమించేవి మామూలుగా మనం వాడే మందులు, కొందరు అలవాటుగా తీసుకునే మద్యం. మీరు చాలసార్లు వినే ఉంటారు... చీప్‌లిక్కర్ కిడ్నీలను కొట్టేస్తుందని. సాధారణంగా ఒంటిని శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలను రక్తం నుంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని మలినసంద్రం మళ్లీ మూత్రపిండాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతటి కష్టాన్ని ఓర్చలేక అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకుంటే చాలు. ఆ రెండు కిడ్నీలే నిండు నూరేళ్లు! సంతోషాల క్యాలెండర్ లెక్కల్లో వెరసి వెయ్యేళ్లు!!