Kraigg Brathwaite
-
పదిహేనేళ్ల కరువు తీరింది: వెస్టిండీస్‌కు ఊహించని షాక్.. పట్టికలోనూ తారుమారు
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌ను ఏకంగా 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా కరేబియన్ గడ్డపై పదిహేనేళ్లలో తొలి టెస్టు గెలుపు నమోదు చేసింది. అంతేకాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 పాయింట్ల పట్టికలో వెస్టిండీస్‌ను వెనక్కినెట్టింది.కరేబియన్ పర్యటనలో బంగ్లాదేశ్కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ కరేబియన్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు జరగగా.. ఆతిథ్య వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.జమైకాలో రెండో టెస్టుఅయితే, రెండో టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. జాకర్ అలీ బ్యాట్‌తో, తైజుల్ ఇస్లాం బాల్‌తో చెలరేగడంతో బ్రాత్‌వైట్ బృందాన్ని మట్టికరిపించింది. జమైకా వేదికగా శనివారం నుంచి మంగళవారం (నవంబరు 30- డిసెంబరు 3) వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసింది.బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(64), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(36) రాణించడంతో ఈ మేర స్కోరు సాధించింది. నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగడంతోఇందుకు బదులిచ్చేందుకు రంగంలోకి దిగిన విండీస్ జట్టు.. 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఈ క్రమంలో.. 18 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 268 పరుగులు సాధించింది. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 42 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ 91 పరుగులతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పర్యాటక బంగ్లాదేశ్ విండీస్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఈసారి ఐదేసిన తైజుల్ ఇస్లాంఅయితే, టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఓపెనర్లలో మైకైల్ లాయీస్(6)తో పాటు.. కెప్టెన్ బ్రాత్‌వైట్(43)లను అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలకగా.. పేసర్లు టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా అతడికి సహకారం అందించారు.సిరీస్ సమం.. ఇక విండీస్ బ్యాటర్లలో కేవం హోడ్జ్(55) అర్ధ శతకంతో కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. తైజుల్ ఇస్లాం అతడిని పెవిలియన్‌కు పంపి మరోసారి దెబ్బ కొట్టాడు. ఇక నహీద్ రాణా షమార్ జోసెఫ్(8)ను పదో వికెట్‌గా వెనక్కి పంపడంతో విండీస్ కథ ముగిసిపోయింది. 185 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. బంగ్లా 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక బంగ్లా బౌలర్లలో ప్లేయర్ ‘ఆఫ్ ది మ్యాచ్’ తైజుల్ ఇస్లాం ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్ తలా రెండు, నహీద్ రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పాయింట్ల పట్టికలోనూ తారుమారుఇక విండీస్‌పై విజయంతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
సౌతాఫ్రికాతో సిరీస్.. విండీస్ వికెట్ల వీరుడి రీ ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటిచ్చింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న టెవిన్ ఇమ్లాచ్, బ్రియాన్ చార్లెస్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం కల్పించింది.గయానాకు చెందిన ఇమ్లాచ్ 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 1097 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక ఆఫ్ స్పిన్నర్ చార్లెస్ 44 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో భాగమై.. 150 వికెట్లు పడగొట్టాడు. వీరి సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికే వన్డే జట్టులో సభ్యుడైన కేసీ కార్టీకి టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చింది విండీస్ బోర్డు.వైస్ కెప్టెన్‌గా జోషువా డా సిల్వాఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన వికెట్ కీపర్ బ్యాటర్ జోషువా డా సిల్వాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. తమ రెగ్యులర్ వైస్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్‌కు విశ్రాంతినివ్వాలని భావించామని.. అందుకే జోషువాకు ఈ ఛాన్స్ ఇచ్చినట్లు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఆండ్రే కోలే తెలిపాడు. ఇక ఈ జట్టులో.. ఇంగ్లండ్ టూర్‌కు పక్కనపెట్టిన జస్టిన్ గ్రేవ్స్‌కు కూడా అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. వికెట్ల వీరుడి పునరాగమనంఅదే విధంగా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన సీనియర్ పేసర్, వికెట్ల వీరుడు కెమర్ రోచ్(81 టెస్టుల్లో 270 వికెట్లు) కూడా ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగష్టు 7- 11 వరకు తొలి టెస్టు, గయానాలో ఆగష్టు 15- 19 వరకు రెండో టెస్టు నిర్వహించనున్నారు. అదే విధంగా.. ఆగష్టు 23, 24, 27 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ట్రినిడాడ్ వేదిక.ఇక ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుక్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, కేసీ కార్టీ, బ్రియాన్ చార్లెస్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, షమర్ జోసెఫ్, మిక్కిల్ లూయిస్, గుడకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికాన్. -
Eng Vs WI: మరోసారి మెరిసిన అట్కిన్సన్
England vs West Indies, 3rd Test Day 1: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్లు బ్రాత్‌వైట్ (61; 8 ఫోర్లు), హోల్డర్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 75.1 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్లో జొషువా సిల్వా (49; 3 ఫోర్లు) కూడా రాణించాడు.ఒక దశలో 76/1గా ఉన్న విండీస్ 115/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. అనంతరం జొషువా, హోల్డర్లు ఆరో వికెట్‌కు 109 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. వోక్స్ (3/69) ఈ జోడీని విడగొట్టి విండీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అట్కిన్సన్ (4/67) కీలకమైన వికెట్లు తీసి విండీస్ ఆట కట్టించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లకు 38 పరుగులు చేసింది. 2-0తో సిరీస్ కైవసంకాగా మూడు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మూడో టెస్టులోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకోవాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. అందుకు అనుగుణంగానే బర్మింగ్‌హాంలో అడుగులు వేస్తోంది.తుదిజట్లుఇంగ్లండ్జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.వెస్టిండీస్క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాసన్ హోల్డర్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్. -
ఆసీస్‌తో రెండో టెస్ట్.. విండీస్‌ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్‌వుడ్.. ఓపెనర్‌గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్‌తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. -
విండీస్‌తో తొలి టెస్ట్‌కు ఆసీస్ తుది జట్టు ఇదే.. స్మిత్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జనవరి 17 నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ తుది జట్ల వివరాలను వెల్లడించాయి. ఈ మ్యాచ్‌తో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. స్మిత్ ఓపెనర్ అవతారమెత్తడంతో మరో ఓపెనర్ మ్యాట్ రెన్షా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ కూడా చోటు దక్కించుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం ఆసీస్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. మరోవైపు ఈ మ్యాచ్‌తో ముగ్గురు విండీస్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు. కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్‌లు సుదీర్ఘ ఫార్మాట్లో తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, నాథన్ లయోన్, జోష్ హాజిల్‌వుడ్ వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తేజ్‌నరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జస్టిన్ గ్రీవ్స్, జాషువా డసిల్వా (వికెట్‌కీపర్), గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, కీమర్ రోచ్ -
టీమిండియాకు భారీ నష్టం! అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు: మాజీ క్రికెటర్
West Indies vs India, 2nd Test: ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో పటిష్ట జట్లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అందులో కొన్ని విదేశాల్లో ఆడాలి. కాబట్టి ప్రస్తుతం ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం టీమిండియాకు తీరని నష్టంగానే భావించాలి’’ అని భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో టీమిండియా తమ తొలి సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడింది. 2-0తో క్లీన్‌స్వీప్ చేద్దామనుకుంటే.. కరేబియన్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ గెలుపొంది 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భావించింది. అయితే, వర్షం కారణంగా విండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయింది. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లు విండీస్ బ్యాటర్ల పనిపట్టేవారే. ఎనిమిది వికెట్లను పడగొట్టడం అంత కష్టమయ్యేది కాదు. అయితే, అనూహ్యంగా వరణుడి కారణంగా ఆట వీలుకాకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. టీమిండియాకు భారీ నష్టం ఈ నేపథ్యంలో 12 పాయింట్లు రావాల్సిన చోట టీమిండియాకు 4 పాయింట్లే వచ్చాయి. ఆతిథ్య విండీస్ ఖాతాలో సైతం 4 పాయింట్లు చేరాయి. ఈ క్రమంలో దీప్‌దాస్ గుప్తా మాట్లాడుతూ.. ట్రినిడాడ్ మ్యాచ్ డ్రా అయిన కారణంగా భారత జట్టు భారీగా నష్టపోయిందని పేర్కొన్నాడు. ‘‘డబ్ల్యూటీసీ తాజా సైకిల్లో ఆరంభంలోనే ఇలా జరిగింది. వెస్టిండీస్ సిరీస్ అనగానే రెండు మ్యాచ్‌లు గెలిచి టీమిండియా 2-0తో ముగిస్తుందని అనుకున్నారంతా! కానీ అలా జరుగలేదు. మున్ముందు పటిష్ట జట్లతో ఆడాల్సి ఉంది. అలాంటపుడు 8 పాయింట్ల మేర నష్టపోవడం అంటే మామూలు విషయం కాదు’’ అని దీప్‌దాస్ గుప్తా చెప్పుకొచ్చాడు. అందుకే వాళ్లు అభాసుపాలవుతున్నారు ఇక వెస్టిండీస్ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువ లేదన్న ఈ మాజీ బ్యాటర్.. నిలకడలేమి ఆట వల్లే అభాసుపాలవుతున్నారని అభిప్రాయపడ్డాడు. కాగా డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం కోల్పోగా.. పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతోంది. చదవండి: వరల్డ్‌కప్‌నకు ముందు ఆసీస్‌తో టీమిండియా వన్డే సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ మనదే.. అయితే ఆ విషయంలో మాత్రం: టీమిండియా దిగ్గజం -
Ind Vs WI: విండీస్- టీమిండియా ఆఖరి రోజు ఆటకు వర్షం అంతరాయం
West Indies vs India, 2nd Test Day 5: వెస్టిండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాన తెరిపి ఇవ్వడంతో అంపైర్లు మైదానంలోకి వెళ్లి ఆట కొనసాగించే వీలుందా అని పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా వర్షం వల్ల మొదటి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ బ్రేక్ దాకా ఆట మొదలుకాలేదు. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు డొమినికా టెస్టులో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించడం... ఆపై అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. జూలై 12న మొదలైన మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి.. ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో జూలై 20న ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో గల క్వీన్స్ పార్క్ ఓవల్ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 438 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇందుకు బదులుగా కరేబియన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్ చెరో రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ సేన.. 181-2 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. వెస్టిండీస్ ఓపెనర్లరిద్దరి వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే ఆఖరి రోజు విండీస్ 289 పరుగులు చేయాలి. అదే విధంగా రోహిత్ సేన 2-0తో విజయం సంపూర్ణం చేసుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. వర్షం తెరిపిఇవ్వకపోతే మాత్రం ఇరు జట్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. చదవండి: Ind vs WI: వాళ్లిద్దరు ఉంటే అంతే! మ్యాచ్ డ్రా అయినా చాలనుకుంటే మాత్రం.. -
మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ప్రతిఘటిస్తోన్న వెస్టిండీస్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ ప్రతిఘటిస్తోంది. తొలి టెస్టు మాదిరిగా కాకుండా కాస్త నిలకడైన బ్యాటింగ్ కనబరిచిన విండీస్ బ్యాటర్ల వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. రోజంతా కలిపి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. దీనికి తోడు వర్షం అంతరాయం కలిగించడం.. సరైన వెలుతురులేమి కారణంగా ఆటను అరగంట ముందే నిలిపివేశారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక నాలుగో రోజు ఆట అరంగంట ముందుగానే మొదలుకానుంది. ఇక తొలి సెషన్లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, విండీస్ 31 పరుగులు చేసి కిర్క్ మెకన్జీ (57 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న మెకన్జీని భారత్ తరఫున అరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ తన తొలి వికెట్‌గా పెవిలియన్ పంపించడం విశేషం. ముకేశ్ వేసిన బంతిని ఆడలేక మెకన్జీ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు మెకన్జీ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఉనాద్కట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతను అశ్విన్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సిక్స్ బాదాడు. లంచ్ విరామ సమయానికి బ్రాత్‌వైట్ 49 పరుగుల వద్ద ఉన్నాడు. రెండో సెషన్ ప్రారంభం కాగానే బ్రాత్‌వైట్ 170 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇదే సెషన్లో అతని వికెట్ తీయడంలో భారత్ సఫలమైంది. అశ్విన్ వేసిన చక్కటి బంతి బ్రాత్‌వైట్ మిడిల్ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత బ్లాక్‌వుడ్, అతనజ్ కలిసి జట్టును నడిపించారు. మరో 13.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన టీమిండియా ఈ జోడీని విడదీయడంలో విఫలమైంది. రెండు రివ్యూలు కూడా భారత్‌కు ప్రతికూలంగా వచ్చాయి. చదవండి: #MLC2023: ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్? -
352 పరుగుల వెనుకంజలో విండీస్.. భారత్ పట్టు బిగిస్తుందా?
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. రెండోరోజు దాదాపు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 400 మార్క్ దాటింది. కోహ్లి సెంచరీతో ఆకట్టుకున్నాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి మరికొద్ది సేపు ఉండుంటే టీమిండియా కచ్చితంగా 500 మార్క్ అందుకునేది. ఇక అశ్విన్, జడేజాలు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ తొలి టెస్టు మాదిరిగా కాకుండా కాస్త నిలకడగా ఆడింది. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం తగ్‌నరైన్ చందర్‌పాల్(33 పరుగులు) జడేజాకు దొరికిపోయాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసిన విండీస్ మరో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్(37 పరుగులు బ్యాటింగ్), కిర్క్ మెకెంజీ(14 పరుగులు బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మూడోరోజు ఆటలో భారత బౌలర్లను ఎదుర్కొని ఎంతవరకు నిలబడతారనే దానిపై విండీస్ భవితవ్యం ఆధారపడి ఉంది. Stumps on Day 2 of the second Test! An exciting Day 3 awaits! 👏 👏 Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z #TeamIndia | #WIvIND pic.twitter.com/DS0CqS0e9i — BCCI (@BCCI) July 21, 2023 చదవండి: పాణీరావు కన్నుమూత.. బ్యాడ్మింటన్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం -
Ind Vs WI: ఏంటా బౌలింగ్? సీరియస్ అయిన కోహ్లి.. యశస్వితో చెప్తూ..
West Indies vs India, 1st Test: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వెస్టిండీస్‌తో టెస్టులో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. రన్‌మెషీన్ శైలికి భిన్నంగా తొలి బౌండరీ బాదేందుకు 81 బంతులు అవసరమయ్యాయి. మొదటి 80 బంతుల్లో కేవలం సింగిల్స్, డబుల్స్‌తోనే నెట్టుకొచ్చిన కోహ్లి.. ఎట్టకేలకు విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్(108.4వ ఓవర్లో)లో కవర్ డ్రైవ్ దిశగా ఆడి బౌండరీ సాధించాడు. ఏంటా బౌలింగ్? ఇదిలా ఉంటే.. కోహ్లి.. విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 79వ ఓవర్ సందర్భంగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ బ్రాత్‌వైట్ బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడు యశస్వి జైశ్వాల్‌తో కోహ్లి మాట్లాడిన మాటలు స్టంప్ మైకులో రికార్డు అయినట్లు క్రికెట్ సైట్ విజ్డన్ వెల్లడించింది. గతంలో కూడా అనుమానాలు ఇందులో కోహ్లి.. ‘Bhatta Phenk Raha Hai’(ఇటుకలు విసిరినట్లు బంతి విసురుతున్నాడన్న ఉద్దేశంలో) అన్నట్లు తెలుస్తోంది. బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్ గురించి కోహ్లి ఈ మేరకు యశస్వితో అన్నాడన్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా రైట్ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన క్రెగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్ యాక్షన్‌పై గతంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. 2019లో టీమిండియా వెస్టిండీస్ టూర్ సందర్భంగా.. అతడి యాక్షన్‌పై భారత బ్యాటర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడంటూ 2017లోనూ అతడిపై ఫిర్యాదు రాగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం క్లీన్చిట్ ఇచ్చింది. ఆధిక్యంలో టీమిండియా తాజాగా మరోసారి కోహ్లి వ్యాఖ్యలతో బ్రాత్‌వైట్ నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. కాగా బంతిని రిలీజ్ చేసే సమయంలో బౌలర్ అరచేయి హారిజెంటల్ అయ్యే క్రమంలో మోచేయిని 15 డిగ్రీలకు మించి వంచకూడదు/చాచకూడదు. లేదంటే దానిని నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్లు భావిస్తారు. ఇదిలా ఉంటే.. విండీస్‌తో డొమినికా టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి కోహ్లి మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఓపెనర్ల సెంచరీలతో రెండో రోజు టీమిండియాకు 162 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్ Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో.. He is here 👑 . .@imVkohli#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/J67P4r8EG6 — FanCode (@FanCode) July 13, 2023 -
చెలరేగిన అశ్విన్.. తొలిరోజు టీమిండియాదే
India tour of West Indies, 2023- West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో మొదలైన తొలి టెస్టులో తొలిరోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట తొలిరోజు విండీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతానజే 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, సిరాజ్, శార్దూల్‌లు చెరొక వికెట్ తీశారు. నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 27.6:జడేజా బౌలింగ్‌లో బ్లాక్‌వుడ్(14) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 ఓవర్లలో స్కోరు: 68-4. 25 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు 59-3 అథనాజ్ (11), బ్లాక్‌వుడ్ (11) క్రీజులో ఉన్నారు. 20 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 49-3. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌కు రెండు, శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కాయి. అశూ.. విండీస్ ఓపెనర్లు చందర్‌పాల్, బ్రాత్‌వైట్ వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. శార్దూల్.. రేమన్ రీఫర్ వికెట్ పడగొట్టాడు. వాళ్ల అరంగేట్రం వెస్టిండీస్- టీమిండియా మధ్య తొలి టెస్టు బుధవారం ఆరంభమైంది. డొమినికాలోని రోసోలో గల విండ్సర్ పార్కు ఇందుకు వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా తరఫున ఇషాన్ కిషన్ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరించనుండగా.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక ఇషాన్‌తో పాటు యశస్వి జైశ్వాల్ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. కాగా టీమిండియాపై విండీస్ గెలిచి ఇప్పటికే రెండు దశాబ్దాలు దాటిపోయింది. సొంతగడ్డపై 2002లో చివరిగా భారత జట్టుపై విజయం సాధించి టెస్టు సిరీస్ కైవసం చేసుకంది కరేబియన్ జట్టు. ఆ తర్వాత నుంచి వెస్టిండీస్‌పై పైచేయి సాధించి జైత్రయాత్ర కొనసాగిస్తోంది భారత్. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో విండీస్ ఈ అపవాదును చెరిపివేసుకుంటుందా లేదంటే టీమిండియా చేతిలో మరోసారి చిత్తవుతుందా వేచి చూడాలి!! తుది జట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కట్, మహ్మద్ సిరాజ్. వెస్టిండీస్: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), తగెనరైన్ చంద్రపాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలీక్ అథనేజ్, జాషువా డా సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, రకీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్. చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును.. Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
India tour of West Indies, 2023: దాదాపు నెలరోజుల విరామం తర్వాత టీమిండియా మైదానంలో దిగనుంది. వెస్టిండీస్‌తో వరుస సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. కరేబియన్ గడ్డపై టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో కావాల్సినంత వినోదం పంచనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ అనంతరం భారత టెస్టు జట్టుకు సుదీర్ఘ విరామం లభించింది. సుమారు 20 రోజుల పాటు ఆటగాళ్లు సెలవులను ఎంజాయ్ చేశారు. అనంతరం దాదాపు నెల రోజుల పర్యటన కోసం విండీస్ గడ్డపై అడుగుపెట్టారు. జూలై 12న మొదలయ్యే తొలి టెస్టుతో మళ్లీ బిజీ కానున్నారు. ఇక ఆగష్టు 13న టీమిండియా.. వెస్టిండీస్ పర్యటన ముగియనుంది. మరి ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం), లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు చూద్దామా?! టెస్టు సిరీస్ ►తొలి టెస్టు: జూలై 12- జూలై 16, విండ్సర్ పార్క్, రోసో, డొమినికా ►రెండో టెస్టు: జూలై 20- జూలై 24, క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►మ్యాచ్ ఆరంభ సమయం: రాత్రి 7. 30 నిమిషాలకు వన్డే సిరీస్ ►తొలి వన్డే: జూలై 27(గురువారం)- కెన్నింగ్స్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్ ►రెండో వన్డే: జూలై 29(శనివారం)- కెన్నింగ్స్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్ ►మూడో వన్డే: ఆగష్టు 1(మంగళవారం)- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం టీ20 సిరీస్ ►తొలి టీ20: ఆగష్టు 3(గురువారం)- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20: ఆగష్టు 6(ఆదివారం)- ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా ►మూడో టీ20: ఆగష్టు 8(మంగళవారం)- ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా ►నాలుగో టీ20: ఆగష్టు 12(శనివారం)- సెంట్రల్ బ్రౌవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా ►ఐదో టీ20: ఆగష్టు 13(ఆదివారం)- సెంట్రల్ బ్రౌవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా ►మ్యాచ్‌లు రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్‌లకు భారత జట్లు: టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. వన్డే జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్. టీ20 జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్. ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? వెస్టిండీస్- ఇండియా మ్యాచ్‌లు దూర్‌దర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా జియో సినిమా ఫ్యాన్ కోడ్ యాప్‌లో కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. చదవండి: కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా సునీల్ నరైన్.. -
టీమిండియాతో సిరీస్‌కు జట్టును ప్రకటించిన విండీస్.. ఆ ఇద్దరు తొలిసారి
West Indies 13 Member Squad For 1st Test against India: టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. జూలై 12న మొదలుకానున్న తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొట్టి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాణించిన అలిక్ అథనాజ్, కిర్క్ మెకంజీ ఈ మేరకు రోహిత్ సేనతో మ్యాచ్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 30 మ్యాచ్‌లు ఆడిన అథనాజ్ 1825 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక మెకంజీ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 591 పరుగులు(ఒక సెంచరీ కూడా ఉంది) సాధించాడు. రెండేళ్ల తర్వాత రీఎంట్రీ! ఇక వీరిద్దరు ఇటీవల బంగ్లాదేశ్- ఏ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో వరుసగా 220, 209 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ 2021 తర్వాత తొలిసారి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా రకీం 2019లో టీమిండియాతో టెస్టు సిరీస్‌తోనే అరంగేట్రం చేయడం విశేషం. మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అదే విధంగా జైడెన్ సీల్స్, కైలీ మేయర్స్ కూడా గాయాల కారణంగా సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. కాగా జూలై 12- జూలై 16 వరకు వెస్టిండీస్- టీమిండియా మధ్య డొమినికాలో తొలి టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్. ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్. వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: SL Vs WI: విండీస్‌కు మరో పరాభవం.. ఇంతకంటే గొప్పగా ఏం చేయగలరు?! -
టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం
West Indies Vs India 2023: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్ జట్టు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన సన్నాహక జట్టును ప్రకటించింది. ఈ మేరకు క్రెయిగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలోని విండీస్ శుక్రవారం(జూన్ 30) నుంచి ప్రిపరేషన్ క్యాంపులో బిజీ కానుంది. ఆంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. కాగా ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్‌తో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల జట్టు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన విండీస్.. ప్రధాన టోర్నీలో అడుగుపెట్టాలంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నెలరోజులు బిజీ ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విండీస్ పర్యటనను రోహిత్ సేన టెస్టు సిరీస్‌తో మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. వెస్టిండీస్ శుక్రవారం 18 మంది సభ్యులతో కూడిన సన్నాహక జట్టును ప్రకటించింది. ఇక వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌తో బిజీగా ఉన్న జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేస్, కైలీ మేయర్స్, అల్జారీ జోసెఫ్ తదితరులకు ఇందులో చోటు దక్కలేదు. వాళ్లంతా దూరం వీళ్లంతా జూలై 12న మొదలు కానున్న మొదటి టెస్టు సమయానికి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా క్వాలిఫయర్స్‌లో భాగంగా వెస్టిండీస్ సూపర్ సిక్స్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌ను జూలై 7న ఆడనుంది. ఒకవేళ అన్నీ కుదిరితే జూలై 9 నాటి ఫైనల్‌కు చేరితే.. పూరన్, హోల్డర్ తదితరులు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. క్వాలిఫయర్స్‌కు ఆతిథ్య ఇస్తున్న జింబాబ్వే నుంచి డొమినికాకు విమానాలు పరిమిత సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే.. బ్రాత్వెస్ట్ నేతృత్వంలోని టెస్టు స్పెషలిస్టులంతా జూలై 9నే డొమినికాకు చేరుకోనున్నారు. వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్. చదవండి: ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం! -
విండీస్ బౌలర్ ధాటికి విలవిలలాడిన జింబాబ్వే
Gudakesh Motie: వెస్టిండీస్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ధాటికి జింబాబ్వే విలవిలలాడింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) మొదలైన రెండో టెస్ట్‌లో మోటీ 7 వికెట్లతో విజృంభించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. మోటీతో పాటు జేసన్ హోల్డర్ (2/18), అల్జరీ జోసఫ్ (1/29) రాణించడంతో జింబాబ్వే స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఇన్నోసెంట్ కాలా (38) టాప్ స్కోర్‌గా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కాలాతో పాటు చిబాబ (10), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (22), ట్రిపానో (23 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రేమన్ రీఫర్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (36), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (22) ఓ మోస్తరుగా రాణించారు. కైల్ మేయర్స్ (8), రోస్టన్ చేజ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో బ్రెండన్ మవుటా 2 వికెట్లు పడగొట్టగా.. మసకద్జకు ఓ వికెట్ దక్కంది. రీఫర్ రనౌటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ సెంచరీ హీరో, జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవడం విశేషం. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో బ్యాలెన్స్‌తో పాటు విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ సెంచరీలు చేయగా.. శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్‌నరైన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. -
Zim Vs WI: జింబాబ్వే- వెస్టిండీస్ టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత
Zimbabwe vs West Indies, 1st Test- బులవాయో: వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 5 వికెట్లకు 203 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. బ్రాత్‌వైట్ (25; 3 ఫోర్లు), తేజ్‌నరైన్ (15) టెస్టు మ్యాచ్‌లో వరుసగా ఐదు రోజులు ఆడిన తొలి ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందింది. ఇక ఈ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ(207)తో మెరిసిన తేజ్‌నరైన్ చందర్‌పాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టు 2023 మ్యాచ్ స్కోర్లు వెస్టిండీస్- 447/6 డిక్లేర్డ్ & 203/5 డిక్లేర్డ్ జింబాబ్వే- 379/9 డిక్లేర్డ్ & 134/6 చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు -
'ఆరే'సిన నాథన్ లియోన్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను వెస్టిండీస్ ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 164 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 497 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 333 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికి మిగతావాళ్లు విఫలమయ్యారు. టగ్ నరైన్ చందర్‌పాల్ 45 పరుగులు చేశాడు. చివర్లో రోస్టన్ చేజ్ 55 పరుగులు, అల్జారీ జోసెఫ్ 43 పరుగులు.. కాస్త ప్రతిఘటించినప్పటికి ఆస్ట్రేలియా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ట్రెవిస్ హెడ్ 2, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. లియోన్ టెస్టు కెరీర్లో ఐదు వికెట్లు తీయడం ఇది 21వ సారి కాగా.. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌లు డబుల్ సెంచరీలతో చెలరేగడంతో 598 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 283 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన ఇన్నింగ్స్‌ను 182 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన లబుషేన్ మరోసారి సెంచరీతో చెలరేగడం విశేషం. మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన లబుషేన్ మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 8 నుంచి 12వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. Nathan Lyon seals it in Perth! Be sure to join the Australian Men's Cricket Team in Adelaide on Thursday and keep the momentum going for this summer of cricket! pic.twitter.com/oveeRTbwm0 — Cricket Australia (@CricketAus) December 4, 2022 చదవండి: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. రిషబ్ పంత్ దూరం! బీసీసీఐ కావాలనే తప్పించిందా? మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న ద్యుతీచంద్! -
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ కెరటం మార్నస్ లబూషేన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన లబూషేన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కొట్టి, టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, మూడో ఆసీస్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దిగ్గజ క్రికెటర్లు డౌగ్ వాల్టర్స్, గ్రెగ్ ఛాపెల్ (ఆస్ట్రేలియా), లారెన్స్ రోవ్, బ్రియాన్ లారా (వెస్టిండీస్), సునీల్ గవాస్కర్ (ఇండియా), గ్రహం గూచ్ (ఇంగ్లండ్), కుమార సంగక్కర (శ్రీలంక) ఈ ఫీట్‌ను సాధించగా.. తాజాగా లబూషేన్ వీరి సరసన చేరాడు. లబూషేన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 బంతుల్లో 20 ఫోర్లు, సిక్సర్ సాయంతో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. ప్రత్యర్ధి ముందు 498 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరాడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 598/4 డిక్లేర్ (లబూషేన్ 204, స్టీవ్ స్మిత్ 200 నాటౌట్) వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 283 ఆలౌట్ (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 64, టగెనరైన్ చంద్రపాల్ 51) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 182/2 డిక్లేర్ (లబూషేన్ 104 నాటౌట్) వెస్టిండీస్: 192/3 (క్రెయిగ్ బ్రాత్‌వైట్ 101 నాటౌట్) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి -
ఆసీస్‌తో తొలి టెస్ట్.. విండీస్ కెప్టెన్ వీరోచిత పోరాటం
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు ఓటమి నుంచి గట్టెక్కేందుకు అష్టకష్టాలు పడుతుంది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 498 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (166 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) వీరోచితంగా పోరడటంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి192 పరుగులు చేసి లక్ష్యానికి మరో 306 పరుగుల దూరంలో ఉంది. బ్రాత్‌వైట్ అజేయమైన సెంచరీతో విండీస్‌ను గట్టెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. యువ ఓపెనర్, విండీస్ దిగ్గజ బ్యాటర్ తనయుడు టగెనరైన్ చంద్రపాల్ (45) ఒక్కడు కాసేపు నిలకడగా ఆడగా.. షమ్రా బ్రూక్స్ (11), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (24) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బ్రాత్వైట్కు జతగా కైల్ మేయర్స్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు 306 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే ఆసీస్ గెలవాలంటే.. ఏడుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేస్తే సరిపోతుంది. అంతకుముందు మార్నస్ లబూషేన్ (110 బంతుల్లో 104 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 182/2 (37 ఓవర్లు) స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (6) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా, వార్నర్ (48) పర్వాలేదనిపించాడు. స్టీవ్ స్మిత్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో.. ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (64), టగెనరైన్ చంద్రపాల్ (51) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌటైంది. స్టార్క్ (3/51), కమిన్స్ (3/34) విండీస్ పతనాన్ని శాసించారు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా టెస్ట్ సారధి పాట్ కమిన్స్, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చోటు దక్కించుకున్నారు. గత నెలలో ఆసీస్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముందుండగా.. రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఆసీస్ సారధి పాట్ కమిన్స్, ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 78 సగటున 390 పరుగులు చేసిన పాక్ కెప్టెన్.. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. 3 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించి తన జట్టుకు ఒంటిచేత్తో సిరీస్ విజయాన్నందించాడు. సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టీ20లో సైతం చెలరేగిన బాబర్.. మరో హాఫ్ సెంచరీ బాది కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్‌లో ఆసీస్ స్కిప్పర్ పాట్ కమిన్స్ ఆఖరి టెస్ట్‌లో 8 వికెట్లు సాధించి, తన జట్టు చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ సిరీస్‌లో మొత్తం 12 వికెట్లు సాధించిన కమిన్స్.. సిరీస్ ఆధ్యాంతం జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ సారధి బ్రాత్‌వైట్.. సిరీస్‌లో భాగంగా జరిగిన 3 టెస్ట్‌ల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 85.25 సగటున 341 పరుగులు చేశాడు. బ్రాత్‌వైట్ సంచలన ప్రదర్శన కారణంగా విండీస్.. పర్యాటక ఇంగ్లండ్ జట్టును ఖంగుతినిపించి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్ కెప్టెన్ కొత్త రికార్డు?!
క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ కొత్త రికార్డు సృష్టించాడు. అదేంటి టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొలి స్థానంలో ఉన్నాడు.. మరి క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఎక్కడినుంచి వచ్చాడు అని కంగారు పడకండి. టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేయకుండా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రాత్‌వైట్ నిలిచాడు. విషయంలోకి వెళితే.. బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ పేరు సంపాదించిన బ్రాత్‌వైట్ ఇప్పటివరకు 77 టెస్టుల్లో 25 వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 25 వికెట్లు 25 బ్యాట్స్మెన్లవి. దీనర్థం ఏంటంటే.. బ్రాత్‌వైట్ తాను సాధించిన 25 వికెట్లలో ఒక్కaటి కూడా రిపీట్ కాలేదని. సాధారణంగా ఒక బౌలర్ ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేస్తుంటాడు. చాలా సందర్బాల్లో బౌలర్లకు తొలి 25 వికెట్లలోనే ఆ రిపీట్ బ్యాట్స్‌మన్ కనబడ్డారు. కానీ బ్రాత్‌వైట్ మాత్రం తాను తీసిన 25 వికెట్లు కొత్తవే కావడం విశేషం. ఇలా చూసుకుంటే ఇది రికార్డు కిందకే వస్తుంది. ఇంతకముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉండేది. అష్రాఫుల్ తాను ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేయకముందు 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ అష్రాఫుల్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక శ్రీలంక బౌలర్ సజీవ డిసిల్వా కూడా తాను తీసిన 16 వికెట్లతో ఒక్క రిపీట్ బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం విశేషం. ఇక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్( 133 టెస్టుల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్(145 టెస్టుల్లో 708 వికెట్లు) రెండో స్థానంలో.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్(169 టెస్టుల్లో 640 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(132 టెస్టుల్లో 619 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Virat Kohli: వరుసగా ఐదో ఏడాది ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్ కోహ్లి IPL 2022: 'అతడు ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు.. ప్రపంచకప్ భారత జట్టులో చోటు ఖాయం' -
WI Vs Eng: 2019 తర్వాత సొంతగడ్డపై తొలిసారిగా విండీస్..
WI Vs Eng Test Series: మీడియం పేసర్ కైల్ మేయర్స్ (5/18) చెలరేగడంతో... ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో ఆతిథ్య జట్టు సొంతం చేసుకుంది. మేయర్స్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 64.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 28 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ క్రమంలో 2019 తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను దక్కించుకుంది. ఇక వంద పరుగులతో అజేయంగా నిలిచిన జాషువా డ సిల్వా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. #MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6 — Windies Cricket (@windiescricket) March 27, 2022 ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా అత్యంత చిరాకు తెప్పించిన టెస్టు మ్యాచ్. తొలి ఇన్నింగ్స్‌లో మేము అద్భుతంగా ఆడాం. అప్పటికి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది చాలా చాలా విసుగు తెప్పించిన మ్యాచ్. ముఖ్యమైన సమయంలో సరిగ్గా రాణించలేకపోయాం. అయితే, కచ్చితంగా ఈ మ్యాచ్‌లో క్రెడిట్ వెస్టిండీస్‌కు ఇవ్వాల్సిందే. వాళ్లు బాగా ఆడారు. ఏదేమైనా మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 204 రెండో ఇన్నింగ్స్- 120 వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్- 297 రెండో ఇన్నింగ్స్- 28/0 చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! -
ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. సాహో విండీస్ కెప్టెన్
నాయకుడనే వాడు జట్టును నడిపించడమే కాదు.. అవసరమైనప్పుడు తన విలువేంటో చూపించాలి. అందరిలా ఉంటే అతన్ని ఎందుకు కెప్టెన్ చేస్తారు. మరి అలాంటి కెప్టెన్ అనే పదానికి సరైన అర్థం చెప్పాడు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్. సంప్రదాయ క్రికెట్‌పై మోజు తగ్గుతున్న వేళ తన మారథాన్ ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. 700 నిమిషాల(దాదాపు 12 గంటలు) పాటు క్రీజులో గడిపి 489 బంతులెదుర్కొని 17 ఫోర్ల సహాయంతో 160 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బ్రాత్‌వైట్ విండీస్ దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంతకముందు టెస్టు క్రికెట్లో విండీస్ తరపున మారథాన్ బ్యాటింగ్ చేసిన వాళ్లలో బ్రియాన్ లారా, రామ్‌నరేశ్ శర్వాన, వోరెల్లు ఉన్నారు. తాజాగా వీరి సరసన బ్రాత్‌వైట్ చోటు దక్కించుకున్నాడు. కాగా బ్రియాన్ లారా టెస్టుల్లో రెండుసార్లు మారథాన్ ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. 1994లో ఇంగ్లండ్‌పై 375 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన లారా దాదాపు 766 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. ఆ తర్వాత మళ్లీ 2004లో అదే ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక 400 పరుగులు నాటౌట్ (క్వాడప్రుల్ సెంచరీ) సాధించాడు. ఈ సమయంలో లారా 778 నిమిషాల పాటు క్రీజులో ఉండి ప్రపంచరికార్డు సాధించాడు. ఇక రామ్‌నరేశ్ శర్వాన్ 2009లో ఇంగ్లండ్‌పై 698 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 291 పరుగులు సాధించాడు. 1960లో ఎఫ్ఎమ్ వోర్రెల్ బ్రిడ్జ్‌టౌన్ వేదికగా 682 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 197 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా క్రెయిగ్ బ్రాత్‌వైట్ 710 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 160 పరుగులు సాధించి ఆ జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించాడు. చేసింది తక్కువ స్కోరైనప్పటికి.. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. అందుకే బ్రాత్‌వైట్ ఆటకు యావత్ క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు.''సాహో బ్రాత్‌వైట్.. నీ ఇన్నింగ్స్‌కు.. ఓపికకు సలాం''..''టెస్టు క్రికెట్లో ఉండే మజాను రుచి చూపించావు''..''అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్ బ్లాక్‌బ్లాస్టర్ మార్కులు సాధించావు''అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 21, అలెక్స్ లీస్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 411 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ ఇప్పటివరకు తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 136 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: ENG vs WI: డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్ బౌలర్‌కు వింత పరిస్థితి 150* up for Captain @K_Brathwaite 👏🏾👏🏾. Bat on Skip! 🌴🏏#WIvENG #MenInMaroon pic.twitter.com/Zzr88snbwH — Windies Cricket (@windiescricket) March 19, 2022 Maneuvered for four more! #WIvENG pic.twitter.com/dSU0VPVMfQ — Windies Cricket (@windiescricket) March 19, 2022 -
WI Vs Eng: రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం!
England Tour Of West Indies 2022- నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. 71 ఓవర్లలో 286 పరుగుల ఊరించే విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మ్యాచ్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్క్రుమా బానర్ (38 నాటౌట్), జేసన్ హోల్డర్ (37 నాటౌట్), బ్రాత్‌వైట్ (33) రాణించారు. ఆతిథ్య జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడి గెలుపు కోసం ప్రయత్నించింది. అయితే 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో వెనక్కి తగ్గిన వెస్టిండీస్ ‘డ్రా’పై దృష్టి పెట్టింది. నాలుగో వికెట్ పడిన తర్వాత బానర్, హోల్డర్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మరో 35.4 ఓవర్లు పట్టుదలగా నిలబడ్డారు. బానర్ 138 బంతులు ఆడగా, హోల్డర్ 101 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం(మార్చి 16) నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ పాత జట్టుతోనే బరిలోకి దిగుతామని విండీస్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ స్పష్టం చేశాడు. మొదటి టెస్టు జట్టులో భాగమైన 13 మంది ఆటగాళ్లను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బానర్‌పై హేన్స్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట తీరు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 355 బంతుల్లో 123 పరుగులు సాధించిన బానర్.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), బ్లాక్‌వుడ్(వైస్ కెప్టెన్), ఎన్క్రుమా బానర్, బ్రూక్స్, జాన్ కాంప్‌బెల్, జాషువా డి సిల్వా, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కైలీ మేయర్స్, వీరసామి పెరుమాల్, ఆండర్సన్ ఫిలిప్, కేమార్ రోచ్, జేడెన్ సీల్స్. కాగా భారత సంతతికి చెందిన వీరసామికి ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. తొలి టెస్టు తుదిజట్టులో భాగమైన ఈ లెష్టార్మ్ స్పిన్నర్ 87 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో మరో రికార్డు This kind of resilience is priceless! Nkrumah Bonner takes our #MastercardPricelessMoment of the 1st Test. #WIvENG pic.twitter.com/nM5Di0iCtq — Windies Cricket (@windiescricket) March 12, 2022 Draw! A patient day of Test cricket comes to an end.👏🏿 #WIvENG #MenInMaroon pic.twitter.com/1LsYMQn2YW — Windies Cricket (@windiescricket) March 12, 2022