kuderu
-
భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య
సాక్షి, అనంతపురం (కూడేరు): భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూడేరుకు చెందిన సుగాలి లక్ష్మన్ననాయక్ కుమార్తె సుజాత(27)కు రాయదుర్గం మండలం ఆవులదట్లకు చెందిన పృథ్వీరాజ్ నాయక్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఏడాది కిందట అత్తింటి వారు డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో సుజాత పుట్టింటింటికి వచ్చింది. చదవండి: (సైనెడ్‌తో కుక్కను చంపి.. తర్వాత ప్రియుడితో కలిసి) పలుమార్లు పెద్దమనుషుల ద్వారా పంచాయితీ జరిగినప్పటికీ ఆమెను భర్త కాపురానికి పిలుచుకోలేదు. దీంతో సుజాత, కొడుకుతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల భర్త రెండవ వివాహం చేసుకున్నాడన్న సమాచారం తెలియడంతో మనస్తాపం చెందిన సుజాత శనివారం రాత్రి పొద్దుపోయాక పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరుడు శంకరనాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (ఇష్టంలేని పెళ్లి.. నవవధువు బలవన్మరణం) -
విషపురుగు కాటుతో విద్యార్థి బలి
సాక్షి, కూడేరు: విషపురుగు కాటుకు గురై ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఉదిరిపికొండకు చెందిన దేవేంద్ర (17) ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు కట్టపై నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి బాగా పొద్దుపోయాక చెవి వద్ద విషపురుగు కాటేయడంతో గట్టిగా అరిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే దేవేంద్ర మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నబిరసూల్ కేసు నమోదు చేశారు. -
కేశవ్..ఐదేళ్లలో ప్రజల వద్దకు ఎన్నిసార్లు వెళ్లావ్ ?
సాక్షి, కూడేరు: పయ్యావుల కేశవ్..ఈ ఐదేళ్ల పాలనలో ఉరవకొండ నియోజక వర్గంలో ఎన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్నావని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. బుధవారం కూడేరు మండల పరిధిలోని అరవకూరు, కమ్మూరు గ్రామాల్లో పయ్యావుల కేశవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడు. ఏమి అభివృద్ధి చేశాడని చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ. ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాదన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌లు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నీవు ప్రజలకు అందుబాటులో లేవని ఓటుతో ఓడించారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక రెండేళ్ల పాటు కనిపించకుండా పోయావు. ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక కొద్గి రోజులకు నియోజక వర్గ కేంద్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నావు. కాని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులతో పోరాటాలు చేశాడని అన్నారు8. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికి తెలుసన్నారు. నీ మాదిరి ఎమ్మెల్యే గిమ్మిక్కు రాజకీయాలు చేయడన్నారు. కూడేరు మండలంలో ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీటి విడుదల కోసం ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసింది తేదీలతో సహా చూపిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిన నీకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు తోపుదుర్తి రామాంజనేయులు, క్రిష్టప్ప, సంగప్పతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
తహశీల్దార్‌తోపాటూ ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, అనంతపురం : భూ అక్రమాలపై కలెక్టర్ వీరపాండ్యన్ సీరియస్ అయ్యారు. కూడేరు తహశీల్దార్ వసంత లతతో సహా ఏడుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. డబ్బు తీసుకొని ప్రభుత్వ భూములకు ఇష్టారాజ్యంగా కూడేరు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేశారు. విచారణలో నిజాలు నిగ్గు తేలటంతో అక్రమార్కులపై కలెక్టర్ వేటు వేశారు. -
తలుపూరులో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
సాక్షి, అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సోమవారం కూడేరు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్.. తలుపూరులోకి చేరుకోగా.. అక్కడ స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుత పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్‌కు వివరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదని, అబద్ధపు హామీలతో చంద్రబాబు మోసం చేశాడని జగన్ ఎదుట వాపోతున్నారు. వారి బాధలు విన్న వైఎస్ జగన్...మరో ఏడాదిలో రాజన్నరాజ్యం వస్తుందని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వడ్డుపల్లి, మదిగుబ్బ క్రాస్ మీదుగా సాయంత్రం వరకు పాదయాత్ర సాగుతుంది. మైనార్టీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్ జగన్ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రిన్సిపల్ సెక్రటరీతో ఎమ్మెల్యే విశ్వ భేటీ
కూడేరు : మండలంలో నిరుపయోగంగా ఉన్న సమగ్ర గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించాలంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహార్‌రెడ్డిని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థించారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం జవహార్‌రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిసి, మాట్లాడారు. రక్షిత మంచి నీటి పథకానికి పీఏబీఆర్ డ్యాం వద్ద రూ. 56 కోట్ల వ్యయంతో 11 నెలల క్రితం పనులు పూర్తి చేశారన్నారు. దీనిపై పలుమార్లు ట్రయల్ రన్ కూడా చేశారని గుర్తు చేశారు. వేసవిలో దాహార్తితో 90 గ్రామాల ప్రజలు పడిన ఇబ్బందులను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరిస్తూ.. ఆ సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించాలంటూ ఆందోళనలు చేపడితే అరెస్ట్‌లు చేశారే తప్ప నీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావులు కేశవ్ ప్రమేయంతోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి నోచుకోలేకపోతోందని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
కూడేరులో ఎనర్జీ వర్సిటీ
– తాత్కలికంగా జేఎన్టీయూలో సెప్టెంబర్ నుంచి తరగతులు – జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీ కె.రాజగోపాల్ వెల్లడి జేఎన్టీయూ : జిల్లాలోని కూడేరు వద్ద ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీ భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఎనర్జీ యూనివర్సిటీ ప్రతినిధుల బుధవారం జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీతో సంప్రదింపులు జరిపారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ , ఏఐసీటీఈ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్ మంతా, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, జేఎన్టీయూ రెక్టార్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఈసీ మెంబర్ సి.శశిధర్, ప్రొఫెసర్ బి.ప్రహ్లాదరావు తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయులో తరగతులు.. ఎనర్జీ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్, తరగతులు జేఎన్టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలోనే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని ఇన్చార్జ్ వీసీ కె.రాజగోపాల్ తెలిపారు. తరగతి గదులకు అవసరమయ్యే భవనాలు, ల్యాబ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి ఎనర్జీ వర్సిటీ తరగతులు జేఎన్టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమవుతాయన్నారు. -
దొంగల ముఠా అరెస్టు
కూడేరు (ఉరవకొండ) : కూడేరు సమీపంలోని డాక్టర్ వెంకటస్వామి, పోతప్ప తోటల్లో గాలిమరల కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సంబంధించిన తీగలను దొంగలించిన దొంగల ముఠాను ఎట్టకేలకు వలపన్ని ఆదివారం అరెస్తు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. నార్పల మండలానికి చెందిన ఇబ్రహీం, షేక్ బాబావలి, గొల్ల నాగలింగ, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, అనిల్ బాబు అరెస్టైన వారిలో ఉన్నారు. వారి నుంచి రూ.48,800 నగదు, 290 మీటర్ల విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
విశ్వాసం కోల్పోతున్న బాబు
- ఆయనది నియంతృత్వ, అణచివేత ధోరణి - దుష్టపాలనకు ప్రజలు సమాధి కట్టాలి - ఉరవకొండ ప్లీనరీలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు - సీఎం డ్యాష్ బోర్డులో కరువు కనిపించలేదా? - మాజీ ఎంపీ అనంత ధ్వజం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజురోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ప్లీనరీ శుక్రవారం కూడేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నియంతృత్వ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. తన పాలన పట్ల, ఎమ్మెల్యేల పట్ల విశ్వాసం లేక ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. తద్వారా వైఎస్సార్సీపీలో అయోమయం సృష్టించాలని భావించారని, అయితే.. ప్రజలు పూర్తిగా అండగా నిలవడంతో చంద్రబాబు కుయుక్తులు పటాపంచలయ్యాయని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అత్యంత హేయం, దిగజారుడు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో 144 సెక్షన్, 30 యాక్ట్ లేకుండా పాలించలేని పరిస్థితి నెలకొందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ దుష్టపాలనకు సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకే ప్లీనరీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పని చేద్దామని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో కొండంత అభిమానం ఉందన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు ఏమాత్రమూ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తోందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోనైతే పయ్యావుల సోదరులు చెప్పినట్లే అధికారులు వింటున్నారని మండిపడ్డారు. చివరకు ఇంట్లో అన్నదమ్ములు విడిపోయి భూముల పట్టాదారు పాసుపుస్తకాలు సపరేటుగా చేయించుకోవాలన్నా ముందుగా అధికార పార్టీ నేతలను ఒప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. మూడేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. వరుస కరువులతో జిల్లా రైతులు అల్లాడుతున్నా సీఎం డ్యాష్‌బోర్డులో చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. జిల్లాకు హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు వచ్చాయంటే అది వైఎస్ ఘనతే అని పునరుద్ఘాటించారు. ఇప్పుడేమో తామే నీళ్లు తెప్పించామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది జిల్లాకు 38 టీఎంసీలు నీళ్లొచ్చాయని చెబుతున్న పాలకులు 38 ఎకరాల సాగుకైనా అందించారా అని నిలదీశారు. దీనిపై జిల్లాలోని ఎంపీలు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబును అడిగే దమ్ము, ధైర్యం లేదన్నారు. పార్టీ మారితే సమస్యలు సమసిపోయినట్లేనా అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చురకలంటించారు. దోచుకోవడమే తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదు చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడమే తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు.చంద్రబాబు రాష్ట్రానికి శనిలా మారారన్నారు. తరచూ సింగపూర్, జపాన్ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో జిల్లా మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దోచుకుంటున్నారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా...మంత్రి సునీత రూ.1100 కోట్లతో అంచనాలు వేయిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆడిన రెయిన్గన్ల డ్రామాలో రూ. 300 కోట్లు దోపిడీ చేశారన్నారు. వాతావరణ బీమా కాకుండా పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పగించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహమ్మద్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గుంతకల్లు సమన్వయకర్త వెంకటరామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి ప్రణయ్‌కుమార్‌రెడ్డి, మునిరత్నం శీనా, పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, గిరిజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలె జయరాంనాయక్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలే స్ఫూర్తిగా..
- నేడు కూడేరులో ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీ ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టాలల్సిన పోరాటాలే ప్రధాన లక్ష్యంగా కూడేరులో శుక్రవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ప్లీనరీ జరగనుంది. పోరాటాల యోధుడుగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఈ మూడేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి సాగించిన పోరాటాలు అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విశ్వేశ్వరరెడ్డి సాగించిన పోరాటాలు.. ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపాయి. అదే స్ఫూర్తితో శుక్రవారం చేపట్టని ప్లీనరీలోనూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారు. - ఉరవకొండ మూడేళ్లలో విశ్వ చేపట్టిన ఉద్యమాలు - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీటి సాధన కోసం అఖిలపక్షాన్ని కలుపుకుని 2015 మార్చిలో భారీ రైతు సదస్సు - ఉరవకొండ పట్టణంలోని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 2015 జూన్ 20న 34 గంటల దీక్ష - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ 2015 జూలైలో 24 గంటల పాటు జలజాగరణ ఉద్యమం - 2015 ఏఫ్రిల్ 12న ఉరవకొండలో పేదలకు ఇంటి పట్టాలకు 25 గంటల దీక్ష - 2015 జూలై 29న ఉరవకొండ పట్టణ సమస్యలతో పాటు స్వచ్చమైన తాగునీటి సరఫరా, విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై వేలాది మందితో మహాధర్నా - 2016 ఫిబ్రవరి 20న పొట్టిపాడు వద్ద హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని జలజాగరణ - హంద్రీ-నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో 2016 ఆగస్టు 29న రాగులపాడు లిప్ట్ ముట్టడి - కూడేరులోని తాగునీటి పథకాన్ని ప్రారంభించాలంటూ గత నెల 13న వేలాది మందితో ముట్టడి -
ఘనంగా సంగమేశ్వరుడి వసంతోత్సవం
కూడేరు : స్థానిక శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వడి బ్రహ్మోత్సవాలు గురువారం వసంతోత్సవంతో ముగిశాయి. జోడు లింగాలకు పురోహితుడు శివశంకర్ శాస్త్రి, అర్చకుడు మహేష్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపు చేశారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను కోనేటి వద్ద పవిత్ర జలంతో వేదపండితులు అభిషేకం చేశారు .జోడు లింగాలను దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు పోనుగంటి వారు అన్నదానం చేశారు. ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అక్కి రెడ్డి , ఆలయ సేవా కమిటీ, జీర్ణోద్ధరణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. -
కూడేరులో చిరుత సంచారం
కూడేరు : కూడేరులో సంగమేశ్వర స్వామి దేవాలయం - అరవకూరు గ్రామం మధ్య ఉన్న కొండ ప్రాంతంలో శనివారం చిరుతపులి కనిపించినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. గొర్రెలను మేపు కోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లగా దూరంగా చిరుత కనిపించిందని, కుక్కలు అరవడంతో వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. తాము ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గొర్రెలను కొండ నుంచి కిందకు తోలుకొచ్చేశామన్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
చూసిరాతలు
–‘పది’ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ – సిబ్బందే ప్రోత్సహిస్తున్న వైనం – ఒక్క కేంద్రంలోనూ చర్యలు తీసుకోని అధికారులు – ఆందోళన చెందుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు - యాక్ట్–25 అభాసుపాలు అనంతపురం ఎడ్యుకేషన్ : కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కేంద్రంలో ఇన్విజిలేటర్ చొరవ తీసుకుని ఓ విద్యార్థిని రాసిన జవాబు పత్రాన్ని అదే గదిలో ఇతర విద్యార్థులకు అందజేశారు. చూసిరాతను ప్రోత్సహించారు. ఇన్విజిలేటరే కల్పించుకుని తన పేపరు ఇతర విద్యార్థులకు ఇవ్వడంతో సదరు విద్యార్థిని ప్రశ్నించే సాహసం చేయలేదు. – మరో కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటలకే మూడో అంతస్తుపై పుస్తకాలు పెడుతున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అటెండర్, వాటర్‌బాయ్ తదితరులు ప్రశ్నపత్రాన్ని పరిశీలించి.. పైకి వెళ్లి జవాబులు తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి చిట్టీలు ఇస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఏ రీతిన జరుగుతున్నాయో ఈ రెండు ఘటనలే నిదర్శనం. ఈ నెల 17 నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లూ ఉండకూడదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కోన శశిధర్ మరో అడుగు ముందుకేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ సూపరింటెండెంట్లను నియోజకవర్గాలు మార్పు చేశారు. గతంలో ఏ స్కూల్లో అయితే హెచ్ఎంగా ఉండేవారో అదే స్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించేవారు. ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇక ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి జిల్లా పరిశీలకులుగా ఇక్కడే మకాం వేశారు. రోజూ పదుల సంఖ్యలో కేంద్రాలు తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండడం లేదు. చాలా కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ విషయంలో కొందరు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు చక్రం తిప్పుతున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ప్రలోభపెట్టి తమ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పరీక్షల నిర్వహణ సిబ్బంది కూడా ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు మాత్రమే చిట్టీలు ఇవ్వడం, చూసిరాతలు ప్రోత్సహించడం, బిట్స్‌కు సమాధానాలు చెప్పడం వంటివి చేస్తున్నారు. మరోవైపు ఆయా కేంద్రాలకు ఎవరైనా తనిఖీకి వస్తే నిమిషాల్లోనే అందర్నీ అలర్ట్ చేస్తున్నారు. తనిఖీ అధికారులు బయటకు వెళ్లగానే మళ్లీ తమ పని కానిచ్చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన మరోవైపు కష్టపడి చదువుకుని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, తమతో పాటు రాస్తున్న మరికొందరు విద్యార్థులకు చిట్టీలు ఇవ్వడం, చూసి రాయిస్తుండటంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ వాపోతున్నారు. యాక్ట్ 25 అభాసుపాలు యాక్ట్- 25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ప్రోత్సహించినా ఈ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఆర్నెల్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. ఇంతటి కఠినమైన చట్టం అమలులో ఉన్నా కొందరు బరి తెగిస్తూ అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక కొందరు అధికారుల అండ కూడా ఉందనే ప్రచారం సాగుతోంది. కూడేరులో గణితం పేపర్ లీక్ కూడేరు : కూడేరు హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం పదోతరగతి గణితం పేపర్–2 ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 11 గంటలకు ప్రశ్నపత్రం బయట హల్చల్ చేసింది. దాని ఆధారంగా జవాబు స్లిప్పులను పరీక్షా కేంద్రంలోని గదుల్లోకి వేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. పరీక్షా కేంద్రంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం. కొందరు సిబ్బంది సెల్ఫోన్లను లోపలికి తీసుకెళుతున్నారని, వాట్సాప్ ద్వారానో, ఇతరత్రా మార్గాల్లోనో బయటకు పంపివుంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏటీఎం నుంచి నకిలీ రూ.500 నోట్లు
కూడేరు : ఏటీఎంల నుంచి నకిలీ రూ.500 నోట్లు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూడేరులో రెండు నకిలీ రూ.500 నోట్లు బుధవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే కూడేరులోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రామన్న స్వీట్స్ తీసుకురమ్మని పనిమనిషికి రూ.500 ఇచ్చాడు. ఆమె ఓ బేకరిలో స్వీట్స్ తీసుకున్న రూ.500 నోటు ఇచ్చింది. ఆ నోటు చెల్లదని దుకాణదారుడు తిరస్కరించాడు. నోటును పరిశీలించగా 5 గీతలు ఉబ్బుగాలేవు. నోటుమధ్యలో పచ్చని రంగలో ఆర్బీఐ అని లేదు. నోటు కూడా పలుచగా ఉందని హెచ్ఎం వివరించారు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం నుంచి మంగళవారం తాను డ్రా చేశానని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణంలో మరో వ్యక్తి వద్ద కూడా రూ.500 నకిలీ నోటు బయటపడినట్లు తెలిసింది. -
లారీని ఢీకొన్న స్కూటర్
కూడేరు : కూడేరులో షిర్డీసాయి బాబా ఆలయం వద్ద ఆదివారం అనంతపురం– బళ్లారి ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీని స్కూటర్ ఢీకొనింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న కూడేరుకు చెందిన విద్యార్థులు అరవింద్ (9వ తరగతి), పవన్ (9వ తరగతి, కడదరగుంట) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. -
అగ్ని ప్రమాదంతో మూడు దుకాణాల దగ్ధం
కూడేరు : అగ్ని ప్రమాదం మూడు పేద కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆదాయాన్ని అందించే దుకాణాలు కాలి బూడిదయ్యాయి. వివరాలు.. మండలకేంద్రం కూడేరు కలగళ్ల రోడ్డులో సాలమ్మ టిఫిన్ సెంటర్‌ను, ఎర్రిస్వామి కల్లు దుకాణాన్ని, అక్కులప్ప చికెన్ సెంటర్‌ను నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 1:30కు ఈ మూడు దుకాణాల నుంచి మంటలు లేచాయి. మొదట చికెన్ సెంటర్లో మంటలు వ్యాపించి.. అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు ఇల్లలోనుంచి బయటకు వచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు లేచాయి. స్థానికులు వెంటనే ఫైరింజన్‌కు ఫోన్ చేశారు. అనంతపురం నుంచి ఫైరింజన్ వచ్చేటప్పటికి మూడు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దుకాణాల్లో ఎవరూ లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు వచ్చాయా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్మాప్తు చేపట్టారు. మూడు దుకాణాల్లోనూ కలిపి రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. -
టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
కూడేరు : మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి టెంకాయ కొట్టమని కూడేరు సర్పంచ్ ఓబుళపతిని ఆ పార్టీ బీసీ సెల్ మాజీ జిల్లా కార్యదర్శి బాస్కర్‌గౌడ్, మరి కొందరు సూచించారు. దీనిపై తెలుగు యువత జిల్లా కార్యదర్శి కుసాల నాగరాజు అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కుసాలు నాగరాజు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధం కాగా భాస్కర్ గౌడ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. వెంటనే నాయకులు కల్పించుకొని వారిని శాంతింపచేశారు. -
ఎస్ఆర్సీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు
కూడేరు: కూడేరు మండలంలోని జల్లిపల్లివాసులు గురువారం ప్రధాన రహదారి విస్తరణ చేపడుతున్న ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన లారీలను, జీపులను అడ్డుకున్నారు. రెండు నెలల క్రితం రోడ్డు వెడల్పు చేసి కంకర వేశారు. ఇంతవరకు దానిపై తారు రోడ్డు వేయలేదు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. కంకర రోడ్డుపై వాహనాలు వెళ్లినపుడు పెద్ద ఎత్తున దుమ్ము పైకి లేచి రోడ్డు పక్కన ఉన్న నివాస గృహాల్లోకి, బ్యాంక్‌లోకి, హోటల్స్, దుకాణాల్లోకి వెళుతోంది. రాత్రి పూట మాత్రమే కంపెనీ వారు ఒక ట్రిప్ నీటిని కంకర రోడ్డుపై చల్లి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆ కంపెనీకి చెందిన వాహనాలు రోడ్డుపై తిరగకుండా అడ్డుకున్నారు. నెలల తరబడి రోడ్డు నిర్మాణం జాప్యం చేస్తే తాము దుమ్ముతో ఎలా జీవించాలని నిలదీశారు. కంపెనీ యజమానుల దృష్టికి తీసుకుపోతామని వారు చెప్పడంతో వాహనాలను వదిలివేశారు. -
పైలెట్ పంచాయతీగా కమ్మూరు
అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన కూడేరు : నీటి సంరక్షణ పథకం కింద పంచాయతీల అభివృద్ధిలో భాగంగా మండల పరిధిలోని కమ్మూరు పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్, ఫారెస్టు, పశువైద్య శాఖ జిల్లా అధికారులు గురువారం కమ్మూరులో నీటి సంరక్షణకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. రీసెర్చ్ మ్యాప్ నమూనాతో ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ ఈ రూపకల్పన విజయవంతమైన తర్వాత జిల్లాలో మిగిలిన పంచాయతీలలో దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. నెలరోజుల పాటు భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, పంచాయతీ అభివృద్ధికి ఏం చేయాలి అనే వాటిపై శిక్షణ ఇచ్చి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా క్లష్టర్ ఏపీడీ అయేషాతోపాటు 12 మంది ఏపీడీలు, డబ్ల్యూఎంపీ పీఓ రామయ్య శ్రేష్ఠి, తహశీల్దార్ వసంతలత, ఎంపీడీఓ రాజమన్నార్, ఈఓఆర్డీ గంగావతి, ఏపీఓ నాగమణి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఖాతాదారులు
అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో కూడేరు: ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండానే కేంద్రం పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల డబ్బు కోసం భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని పలువురు వాపోయారు. గురువారం కూడేరులో స్టేట్ బ్యాంక్ వద్దకు సుమారు 300 మంది రాగా, బ్యాంక్ అధికారులు క్యాష్ లేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వారు రోజూ ఇదే మాట చెబితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అనంతపురం – బళ్ళారి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటలపాటు వారంతా రోడ్డుపైనే బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మేనేజర్ జయశీల్, పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పారు. ప్రస్తుతం టోకన్లు ఇస్తామని, డబ్బు రాగానే నగదు పంపిణీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
నేడు కుడి కాలువకు నీటి విడుదల
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు నేడు నీటిని విడుదల చేయనున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప సోమవారం తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కూడేరు: మండల పరిధిలోని ఉదిరిపికొండ సమీపాన ఆదివారం అనంతపురం–బళ్ళారి ప్రధాన రహదారిపై లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న సంఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు అందించిన వివరాలు మేరకు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన వన్నూరుస్వామి (32) ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి వెళుతున్నాడు. ఉరవకొండ నుంచి అనంతపురం వైపు లారీ వస్తోంది. సంఘటనా స్థలానికి రాగానే లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో వన్నూరు స్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
నవ వధువు ఆత్మహత్య
కూడేరు : పుట్టింటికి పంపలేదన్న చిన్న కారణంతో నవ వధువు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కూడేరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు కూడేరుకు చెందిన చట్వోజీరావు రెండవ కుమారుడు రాఘవేంద్రకు కణేకల్ మండలం యర్రగుంటకు చెందిన కటిక జయరామ్ కుమార్తె ఉమాదేవి బాయి (20)తో 2016 ఆగస్టు 4న వివాహం జరిగింది. శుక్రవారం ఉమాదేవి తండ్రి కూతురును చూసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఉమాదేవి పుట్టింటికి వస్తానని తండ్రిని కోరింది. తండ్రి, అత్తమామలు ఈ రోజు అమావాస్య వద్దు అని చెప్పుకొచ్చారు. తండ్రి వెళ్ళిపోయాడు. ఉమాదేవికి తలనొప్పి ఉండేది. పుట్టింటికి పంపలేదని మనస్థాపానికి గురై ఉదయాన్నే ఇంటి ముందు ఉన్న బాత్రూమ్లోకి వెళ్ళి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పిన కొద్దిసేపటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఉమాదేవి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. పెళ్ళైన మూడు నెలలకే తనువు చాలించావా అంటూ రోదించారు. తలనొప్పిని భరించలేక, ఊరికి పంపలేదన్న చిన్న కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
కూడేరు : మండల పరిధిలోని అరవకూరులో పెద్దమ్మ జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరను పురష్కరించుకుని సోమవారం గ్రామస్తుల ఆ««దl్వర్యంలో ఇరుసు, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఇరుసు ఎత్తుడు పోటీల్లో పాల్గొనేందుకు పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాలతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు ఉత్సాహంగా తరలివచ్చారు. తప్పెట్లు, ఈలల Ô¶ బ్ధం నడుమ ఇరుసు పోటీలు ఉత్సాహంగా సాగాయి. యువకులు పోటీ పడి ఇరుసును ఎత్తి సత్తా ఏమిటో ప్రదర్శించారు. కబడ్డీ పోటీలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఈ రెండు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతిని అందజేశారు. -
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
కూడేరు (అనంతపురం) : బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘట మంగళవారం అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కమ్మకు గ్రామంలో జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న బాబారావు నాయక్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి.