Lands
-
ప్రాణం తీసినా భూములివ్వం!
దుద్యాల్: తమ ప్రాణాలు తీసినా సరే భూములు మాత్రం కంపెనీల కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా ప్రజలు తేల్చి చెప్పారు. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) అధికారులు ఈ మూడు గ్రామాల్లో పర్యటించారు.ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ డిప్యూటీ రిజిస్ట్రార్ లా ముఖేశ్, ఇన్స్పెక్టర్లు రోహిత్‌సింగ్, యతి ప్రకాశ్‌శర్మ బాధిత కుటుంబాలను కలిసి అభిప్రాయాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని గిరిజన మహిళలు గోడు వెళ్లబోసుకొన్నారు. రోటిబండతండాకు చెందిన సోనీబాయి, కిష్టబాయి, జ్యోతి, ప్రమీల, వాల్మీబాయి, జార్పుల రూప్సింగ్ నాయక్, సీత తదితరులను అధికారులు ప్రశ్నించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, చివరికి ప్రాణాలు తీసినా భూములు మాత్రం ఇవ్వబోమని ఈ సందర్భంగా బాధితులు తేల్చి చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పగా.. ప్రభుత్వ లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ పర్యటనపై అధికారులు నివేదిక సిద్ధంచేసి కమిషన్‌కు అందజేయనున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన జరగగా.. బాధిత గిరిజనులు 18న ఢిల్లీకి వెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్హెచ్ఆర్సీ అడిగిన ప్రశ్నలివే.. ప్రశ్న: దాడి జరిగిన రాత్రి మీ మీ ఇళ్లలో ఎం జరిగింది? జవాబు: కరెంట్ తీసి పోలీసులు ఇళ్లలోకి దూరి మగవారిని తీసుకెళ్లారు, ఆడవారిని బెదిరించారు. అడ్డుపడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. ప్రశ్న: పోలీసులు మిమ్మల్ని కొట్టారా? జవాబు: కొట్టారు, అసభ్యకరంగా తిట్టారు సార్. ప్రశ్న: మీ డిమాండ్స్ ఏమిటి? జవాబు: మా ప్రాంతంలో కంపెనీలు వద్దు. మేము భూములు ఇవ్వం. మా జోలికి రావొద్దు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేసి మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి. కమిషన్ చేసిన సూచనలు.. ఎఫ్ఐఆర్లో పేరున్నవారు లొంగిపోతే 14 రోజులు రిమాండ్‌కు పంపి, బెయిల్ ఇస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు లేనివారు ముందస్తు బెయి ల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ వేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం జైలులో ఉన్నవారికి కూడా బెయిల్ రాదు. భూములు, కేసుల వ్యవహారాన్ని న్యాయస్థానాలు చూసుకుంటా యి. గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు మీ జోలికి రారు. నా కొడుకుకు సంబంధం లేదునా కొడుకు బాష్యానాయక్కు దాడితో ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజంతా మేకలు కాసేందుకు వెళ్లాడని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. అర్ధరాత్రి వచ్చి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టారు. – సోనీబాయి, బాధితురాలుబతిమాలినా వదిలిపెట్టలేదు నా భర్త ప్రవీణ్ పాల ఆటో నడుపుతాడు. ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తలుపు తట్టారు. మేము భయపడి తీయకపోవడంతో కాళ్లతో బలంగా తలుపులు తన్నేసి లోపలికి వచ్చారు. ఇంట్లోని బీరువాను పగలగొట్టి చూశారు. నాకు డెలివరీ సమయం ఉందని బతిమాలినా వినకుండా నా భర్తను లాక్కెళ్లారు. పోలీసులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. – జ్యోతి, బాధితురాలు -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
దక్షిణ రింగు భూనిర్వాసితులకు అధిక పరిహారం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డులోని దక్షిణ భాగం పరిధిలో సేకరించే భూములకు పరిహారం భారీగా పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రింగురోడ్డు ఉత్తర భాగాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుండగా, దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ ప్రక్రియలో భాగంగా అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భాగంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రింగురోడ్డు అలైన్‌మెంటును ఖరారు చేసే కసరత్తు మొదలుపెట్టింది. ఆమేరకు భూసేకరణ జరగాల్సి ఉంది. పరిహారం మొత్తం పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భూముల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయించింది. మార్కెట్ విలువ పెంచి పరిహారాన్ని భూసేకరణ, పునరావాస చట్టం–2013 ప్రకారం చెల్లించనుంది. మార్కెట్ విలువలు పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలంటూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు చట్టబద్ధంగా పరిహారం అందాలని, నష్టపోయామనే భావన వారిలో ఎక్కువగా కనిపించొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రాజెక్టు నిర్వహణ విభాగం ఏర్పాటుభారీ రోడ్డు ప్రాజెక్టులు నిర్వహించే ఎన్హెచ్ఏఐలో మాదిరి దక్షిణ రింగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్తో రేడియల్ రోడ్ల ద్వారా అనుసంధానాన్ని ఈ విభాగం ఖరారు చేస్తుంది. ఇందులో పర్యావరణ విభాగానికి సంబంధించి జిల్లా అటవీ అధికారి, సాంకేతిక విభాగంలో ఒక చీఫ్ ఇంజనీర్, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పరిపాలన విభాగానికి సంబంధించి అకౌంటెంట్ ఉండనున్నారు. అటవీ, రోడ్లు, భవనాలు, ఆర్థిక శాఖల నుంచి ఈ అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేయనున్నారు. అలాగే, రీజినల్ రింగురోడ్డు పురోగతి పరిశీలనకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి దాసరి హరిచందనను నియమించారు. ఇక దక్షిణ రింగుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్ల వ్యవహారం పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ సేవలు తీసుకోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఖరారుకు వీలుగా ఆర్ఎఫ్పీ బిడ్లు ఆహ్వానించాలంటూ రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీని ఆదేశించింది. -
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవన్నీ పట్టా భూములే
సాక్షి, అమరావతి: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు గ్రామ సభలో అడిగిన దాని కంటే ఎక్కువ పరిహారం ఇచ్చి భూములు సేకరించామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గ్రామ సభలో ఎకరానికి రూ.2.70 లక్షలు ఇస్తే చాలని రైతులు అడిగారని మావాళ్లు చెబితే.. రైతులను సంతోషపెట్టేలా దానికి అదనంగా రూ.30 వేలు కలిపి ఎకరాకు రూ.3 లక్షలు తగ్గకుండా చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశామని.. అదీ జగన్ అంటే అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన మాచవరం తహసిల్దార్.. ఆ భూముల వద్దకు వెళ్లి సర్వే చేసి, అందులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ, అటవీ, జల వనరుల భూములు లేవని స్పష్టం చేశారని(తహíసీల్దార్ మీడియాతో మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపుతూ) గుర్తు చేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఆ భూముల వద్దకు వెళ్లి ఏదో జరిగిపోతున్నట్లు ఊగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పరిశ్రమలు రాకూడదనే రీతిలో..⇒ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్స్ ఎకరా రూ.50 వేలు–రూ90 వేల లోపునే భూములు కొనింది. భవ్య సిమెంట్స్ తర్వాతే మా ప్రాజెక్టు వచి్చంది. వాళ్లు భూమి కొన్న ఏడాది తర్వాత మేము రూ.3 లక్షలకు తక్కువ కాకుండా భూములు సేకరించాం. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నేను నిజంగానే చెడ్డోడిని అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను రూపాయి పెట్టాల్సిన పని లేకుండా తీసుకోవచ్చు. గతంలో తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి ప్రభుత్వ భూములను వాళ్ల పీఏ పేరుతో రాయించుకున్నారని విమర్శలొచ్చాయి. సరస్వతి సిమెంట్స్‌లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అంతా ప్రైవేటు భూమే. ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవంబర్ 5న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందే డెప్యూటీ సీఎంగా ఆయన ఆదేశాలతోనే అక్టోబర్ 26న మాచవరం మండల తహసీల్దార్ సరస్వతి పవర్‌కు చెందిన భూములన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చారు. సరస్వతి సిమెంట్స్ కొనుగోలు చేసిన భూములన్నీ పట్టా భూములేనని ఆమె ప్రకటించారు. ఆ ఫ్యాక్టరీ కోసం సేకరించిన వెయ్యికిపైగా ఎకరాలు మొత్తం పట్టా భూమేనంటూ ధ్రువీకరించారు. నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నా, దాన్ని పరిశ్రమకు తీసుకోలేదని తహసీల్దార్ చెప్పారు. ⇒ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలతో కలిసి కేసులు వేశారు. దాని వల్లే ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్లింది. 2014లో మైనింగ్ లీజులు రద్దు చేశారు. దీనిపై మేము కోర్టును ఆశ్రయిస్తే 2015లో మాకు అనుకూలంగా స్టే ఇచి్చంది. ⇒ 2019లో చంద్రబాబు చేసింది తప్పని, లీజులన్నీ రీస్టోర్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. చంద్రబాబు పరిశ్రమలు రాకూడదనే రీతిలో అడుగులు వేస్తున్నారు. ఫ్యాక్టరీకి నీళ్లు కూడా ఇవ్వరా? ⇒ పవన్ కళ్యాణ్ సిమెంటు పరిశ్రమకు ఇచ్చే నీళ్లపైనా రాద్ధాంతం మొదలెట్టారు. వాస్తవంగా స్టీల్ ఫ్యాక్టరీలకు ఎక్కువగా నీళ్లు కావాలి. సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్దగా అవసరం ఉండదు. కానీ, అందులో పని చేసేవాళ్ల కోసం కనీసం నీళ్లు ఇవ్వాలి. ఆ మేరకు బాధ్యత ప్రభుత్వానిదే.⇒ కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి జిందాల్ ముందుకొచ్చి పునాది రాయి వేశారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆయన్ని ప్రోత్సహించాల్సింది పోయి జత్వానిని తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు పెట్టించి, బెదిరించి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతి సిమెంట్స్‌ను ఇదే రీతిలో అడ్డుకునే కుట్రలు చేశారు. రాని పరిశ్రమ వచ్చినట్టుగా గొప్పలు ⇒ మరోవైపున ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ అనకాపల్లికి వస్తోందంటూ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. ఆర్సిలర్ మిట్టల్–నిపాన్ పరిశ్రమ మా దగ్గరే ఉందని, పనులు ప్రారంభించింది అని ఒడిశా మంత్రి చెబుతున్నాడు. అక్కడ రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల గ్రీన్ పీల్డ్ ప్లాంట్ కడుతున్నారు. మొదలైన ప్లాంట్ అపేసి ఇక్కడి వస్తారా?‘అవి పట్టా భూములే’‘పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సరస్వతి ప్రాజెక్టు భూములను పరిశీలించాం. మాచవరం మండలం చెన్నాయ్ పాలెంలో 272.96 ఎకరాలు, పిన్నెల్లిలో 793.79, వేమవరంలో 710.63 ఎకరాలు.. మొత్తంగా 1073.38 ఎకరాలు పట్టా భూములే. చెరువులు, వాగులు, కుంటలు, వాడీ బాడీస్ లేవు. తర్వాత ప్రభుత్వ ల్యాండ్స్ పిన్నెల్లిలో 2.87 (కొండ ప్రాంతం), వేమవరంలో 1.44 (చుక్క భూములు) కలిపి మొత్తం 4.31 ఎకరాలుసరస్వతి సిమెంట్స్ ఇంకా తీసుకోలేదు. మొత్తం 1077 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఆన్లైన్ పోరి్టంగ్కు పంపించాం. ఇందులో 821.44 ఎకరాలకు పోరి్టంగ్ చేశాం. ఇంకా 255.94 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నివేదికను పై అధికారులకు పంపిస్తున్నాం’. – మాచవరం తహసీల్దార్ మాట్లాడిన వీడియోలోని మాటలు -
‘సరస్వతి’ భూముల్లో ప్రతి సెంటూ కొన్నదే
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్‌రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్‌కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ భూముల సంగతి పట్టదా పవన్! గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్‌కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్‌కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్‌కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్‌కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు. కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు. -
సరస్వతి భూములపై ఆగని విషప్రచారం
సాక్షి, నరసరావుపేట: సరస్వతి పవర్ భూముల సేకరణలో ఎటువంటి ఆక్రమణలు, అటవీ భూములు లేవని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెబుతున్నా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మాత్రం ఏదో జరిగిపోయినట్లు ఊగిపోతున్నారు. దీనిపై విచారణ చేసి నిగ్గు తేల్చాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి తన అక్కసును మరోమారు బైటపెట్టుకున్నారు. ఎలాంటి అక్రమాలూ జరగలేదని రెవెన్యూ, అటవీశాఖ అధికారులు చెప్పినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అసత్య ప్రచారానికి దిగడంపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. పవన్ ఆకస్మిక పర్యటన.. అసంబద్ధ ఆరోపణలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరి«ధిలోని సరస్వతి పవర్స్ భూముల పరిశీలన కోసమని మంగళవారం ఆకస్మిక పర్యటన చేసిన పవన్‌కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం తనకు అలవాటైన అసంబద్ధ, పొంతనలేని మాటలతో సాగింది. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేశారన్నారని ఆరోపించారు. కానీ.. అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. స్థానిక రైతులంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరస్వతి పవర్స్ కంపెనీ తీసుకున్న భూముల్లో 24 ఎకరాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన అసై¯న్డ్ భూములు ఉన్నట్లు తేలిందని మరో వాదన వినిపించారు. దీనిపై మరోసారి సమగ్ర విచారణ చేసి నిగ్గు తేల్చాలని పల్నాడు కలెక్టర్‌కు ఆదేశాలిచ్చానని పవన్ తెలిపారు. సరస్వతి పవర్స్ కంపెనీ కోసం భూములు తీసుకోవడం దగ్గర నుంచి నీటి కేటాయింపులు, లీజుల పునరుద్ధరణ వరకు ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు ఎందుకో మెత్తబడిపోయారు, భయపడుతున్నారని పవన్‌కళ్యాణ్ అన్నారు. 2014–19 మధ్య ఏం తేల్చారు? సరస్వతి భూముల సేకరణలో అక్రమాలు ఉన్నాయంటూ 2014–19 మధ్య టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విషప్రచారం చేశారు. అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ భూములపై పదేపదే ఆరోపణలు చేస్తూ అక్రమాల నిగ్గు తేలుస్తామని ప్రగల్బాలు పలికారు. ఐదేళ్ల కాలం ముగిసినా ఒక చిన్న తప్పును సైతం గుర్తించలేకపోయారు. ఈసారి కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి అసత్య ప్రచారాలకు తెరలేపారు. కూటమి నేతల కుట్రల వల్ల పల్నాడు అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడులో ఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు అగిపోయి ఇక్కడి ప్రజలు ఆర్థి కంగా బలపడతారు. కానీ.. కూటమి నేతల విషప్రచారాలు, కుట్రలతో పారిశ్రామిక వేత్తలు భయపడి వెనుకడుగు వేస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ ఈప్రాంత అభివృద్ధి గురించి ఒక్క ముక్క మాట్లాడకుండా కేవలం విద్వేష ప్రసంగాలు చేయడాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పల్నాడు జిల్లాకు కీలకమైన వరికపూడిసెల, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది, వాటిని పూర్తి చేస్తామని ఒక్క మాట కూడా అనకపోవడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అవన్నీ పట్టా భూములే: తహశీల్దార్ సరస్వతి పవర్స్ సంస్థ భూములన్నీ పట్టా భూములేనని మాచవరం తహశీల్దార్ క్షమారాణి గతనెల 26న మీడియాకు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సరస్వతి భూముల్లో తనిఖీ చేస్తున్నామని ఆమె వివరించారు. ఈ భూముల్లో చెరువులు, కుంటలు, వాగులు, నీటి వసతులేవీ లేవని చెప్పారు. అటవీ భూములేవీ ఆక్రమణకు గురికాలేదు : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో అక్టోబర్ 26న మాచవరం మండలంలోని చెన్నాయపాలెం, దాచేపల్లి మండలంలోని తంగెడ అటవీ భూములను సిబ్బందితో కలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. అటవీ భూములేవి అక్రమణకు గురి కాలేదన్నారు. అటవీ భూములకు సుమారు 8 మీటర్ల దూరంలో సరస్వతి భూములున్నట్టు గుర్తించామన్నారు. -
స్వర్ణవారిగూడెంలో భూ‘మాయ’
వేలేరుపాడు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఓ రాజకీయ పార్టీ నేతతో కుమ్మక్కైన కొందరు రెవెన్యూ అధికారులు పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన భూముల్లో మిగులు భూములను పంచేసుకుంటున్నారు. నిజమైన నిర్వాసితులకు భూములివ్వడానికి విపరీతమైన జాప్యం చేస్తున్న అధికారులు.. మిగులు భూములకు బినామీ పేర్లతో నకిలీ హక్కు పత్రాలు సృష్టించి చిటికెలో మాయం చేసేస్తున్నారు. పోలవరం ముంపు మండలమైన వేలేరుపాడు మండలంలోని తాట్కూరుగొమ్ము, తిర్లాపురం, నార్లవరం, రుద్రమకోట గ్రామాలకు చెందిన కొందరు నిర్వాసితులకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో 596.73 ఎకరాల భూమికి పీఎన్ (ప్లిమినరీ నోటిఫికేషన్), తర్వాత డీడీ (డ్రాఫ్ట్ డిక్లరేషన్) ఇచ్చారు. నిర్వాసితుల కోసం భూములు కొన్నారు. ప్రస్తుత అవార్డులో మాత్రం 525 ఎకరాల 12 సెంట్లు మాత్రమే అధికారులు చూపిస్తున్నారు. అవార్డుకు, డీడీకు మధ్య 71 ఎకరాల 61 సెంట్ల తేడా ఉంది. ఇంత తేడా ఎలా వచ్చి oదో ఇంతవరకు తేలలేదు. మరోపక్క స్వర్ణవారిగూడెం గ్రామంలోని మిగులు భూములు క్రమంగా తరిగిపోతున్నాయి. అప్పట్లో ఇక్కడ 43 ఎకరాల 33 సెంట్లు మిగులు భూమిగా చూపించారు. 2023 నవంబర్ 20న అప్పటి జీలుగుమిల్లి తహసీల్దార్ 18.52 ఎకరాల మిగులు భూమి ఉన్నట్టు సర్వే నంబర్లతో సహా చూపారు. ప్రస్తుతం ఇక్కడ 8 ఎకరాలు మాత్రమే మిగులు భూమి ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే సుమారు 35 ఎకరాలు అన్యాక్రాంతమైపోయింది. ఈ భూముల్లో నిర్వాసితులు కాని పలువురు సాగు చేసుకుంటుండటం గమనార్హం. 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకూ ఆర్ అండ్ ఆర్ అధికారి అయిన కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఎవరికీ మిగులు భూమి ఉన్న సర్వే నంబర్లపై ప్రొసీడింగ్స్ జారీ చేయలేదు. అలాట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కొందరు అధికారులు ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రాలు తయారుచేసి ఆయిల్‌పామ్ తోటలున్న ఈ భూములను విక్రయిస్తున్నారు. వీరిలో స్వర్ణవారిగూడెం వీఆర్ఏ, వీఆర్వో, స్థానిక రెవెన్యూ అధికారులు కొందరు కుమ్మక్కై ఈ భూములు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాత అవార్డులో పేరు లేకుండానే, పోలవరం ముంపు ప్రాంతంలో సెంటు భూమి లేని వారికి కూడా భూములు కట్టబెడుతున్నారు. నిజమైన నిర్వాసితులకు తీరని అన్యాయంమిగులు భూములుగా ఉన్న ఆయిల్‌పామ్ తోటలను రెవెన్యూ అధికారులు నకిలీ హక్కు పత్రాలతో కాజేస్తున్నారు. నిజమైన గిరిజన నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారు. అసలు అవార్డులో పేరు, ఆర్ అండ్ ఆర్ అధికారి ప్రొసీడింగ్స్ లేకుండా సెంటు భూమి లేని వారికి ఎలా భూములు ఇస్తున్నారు? – గుజ్జా రామలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, వేలేరుపాడు ఆయిల్‌పామ్ తోటలను ఆక్రమించుకుంటున్నారు నిజమైన నిర్వాసితుల కోసం కేటాయించిన భూములు ఈ రోజు చూస్తే, రేపటికి అధికారులు మాయం చేస్తున్నారు. విలువైన ఆయిల్‌పామ్ తోటలను దొంగ సరి్టఫికెట్లతో ఆక్రమించుకుంటున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారు. నిజమైన నిర్వాసితులు భూముల కోసం కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు మాత్రం చకచకా భూములు అప్పగిస్తున్నారు. –కారం దారయ్య, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కాజేస్తున్నారిలా..స్వర్ణవారిగూడెంలో 33/1 సర్వే నంబర్లో 4 ఎకరాలు, 33/2 సర్వే నంబర్లో 0.62 ఎకరాల మిగులు భూమిని గత ఏడాది వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు చెందిన కారం లక్ష్మయ్యకు మండల సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఏ చూపించారు. అయితే ఆ తర్వాత వీఆర్వో, వీఆర్ఏ, స్థానిక ఓ గిరిజనేతరుడు కుమ్మక్కై ఆ భూమికి ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కు పత్రం సృష్టించారు. ఎలాంటి అలాట్మెంట్, ప్రొసీడింగ్ లేకుండానే ఓ గిరిజనేతరుడు రెవెన్యూ అధికారుల అండదండలతో ఆయిల్‌పామ్ తోటను ఇటీవల ధ్వంసం చేశాడు. ఈ పొలాన్ని దున్నించి బహిరంగంగానే సాగు చేస్తున్నాడు. కారం లక్ష్మయ్యకు మాత్రం భూమి ఇవ్వలేదు. వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము రెవెన్యూలో మెట్టం వెంకయ్య పేరున ఎక్కడా సెంటు భూమి లేదు. అవార్డులో కూడా పేరు లేదు. అయినా స్వర్ణవారిగూడెంలో నకిలీ హక్కు పత్రంతో 166–4ఎ సర్వే నంబర్లో 0.73 సెంట్లు, 200–3ఎ సర్వే నంబర్లో 3.35 ఎకరాలు అప్పగించారు. ఇలాంటి నకిలీల పేర్లు ఇక్కడ చాలానే కనిపిస్తున్నాయి. తాట్కూరుగొమ్ము రెవెన్యూలో నాగులగూడేనికి చెందిన ఓ గిరిజనుడికి సెంటు భూమి లేదు. వాస్తవంగా అతనికి చిగురుమామిడి రెవెన్యూలో ఎకరా భూమి ఉండగా లాండ్ టు లాండ్ కింద బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంలో భూమి అప్పగించారు. ఇటీవల అతనికి స్వర్ణవారిగూడెంలో 6.25 ఎకరాలు, అతని మనుమడికి మరో 6.25 ఎకరాలు.. మొత్తం 12.50 ఎకరాలు కట్టబెట్టేశారు. ఈ భూమిలో సగం వాటా రెవెన్యూ అధికారులదని చెబుతున్నారు. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
‘ఫ్రీ హోల్డ్’ అన్నీ సక్రమమే!
మహారాణిపేట (విశాఖ): పేదల భూములు కాజేశారంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చేసిన ప్రకటనలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఆసైన్డ్ భూములు, డీ పట్టా భూములకు హక్కులు కల్పించేందుకు చేపట్టిన ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నిగ్గు తేల్చింది. ఇదే నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. భూములపై విచారణకు వెళ్లిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ముందుగా వీరికి చెప్పి పంపిన పద్ధతి వేరు, గ్రామంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా కనిపించింది. గ్రామంలో అడుగడుగునా విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్ల బృందానికి అక్రమాలు జరిగినట్టు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు అయోమయంలో పడ్డారు. బెడిసికొట్టిన గోబెల్స్ ప్రచారం ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని చేసిన గోబెల్స్ ప్రచారం కమిటీ విచారణతో బెడిసికొట్టినట్టు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్ల జారీకి బ్రేకులు వేసి, రిజి్రస్టేషన్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. అంతేకాకుండా ఈ భూముల కొనుగోలు, ఇతర లావాదేవీలపై విచారణ చేయాలని నిర్ణయించి విచారణ కమిటీలను నియమించారు. మొత్తం నాలుగు మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగారు. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. గ్రామ సభలో చెప్పలేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు చెప్పడం విశేషం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో లీగల్ హెయిర్ (కుటుంబ సభ్యులు) అయిన తమకు డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారని, ఈ భూముల్లో తమకూ వాటా ఉందని, న్యాయం చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్లు తలలు పట్టుకున్నారు. పేదల భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హక్కులు పేదల భూములకు హక్కులు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీవో 596 జారీ చేసింది. 2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ, విక్రయాలకు అవకాశం కల్పించారు. 609 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ఈ జీవో ప్రకారం జిల్లాలో 609 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 190 ఎకరాలకు రిజి్రస్టేషన్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఫ్రీ హోల్డ్ ప్రక్రియను నిలిపివేసింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ల కమిటీ కూడా ఫ్రీ హోల్డ్, రిజి్రస్టేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు. ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో కమిటీ ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. -
అమరావతి రైతులకు ప్లాట్లు ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములకు తిరిగి వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్లాట్ల అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు అవసరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో హామీ అమలుపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. తీసుకున్న ఎకరాకు 1,450 గజాల చొప్పున ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఒప్పంద పత్రాలు ఇచ్చి0ది. ప్రస్తుతం మరో 4 వేల ఎకరాలు సేకరించాలన్న ఆలోచనతో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుంటోంది. ఇటీవల అమరావతి పరిధిలోని 29 వేల ఎకరాల్లో రూ. 34 కోట్లతో సీఆర్డీఏ కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయ్యాక ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఇంత మొత్తం నిధులు ఎలా సేకరించాలో.. పనులు ఎలా చేపట్టాలోనని సీఆర్డీఏ ఆందోళన చెందుతోంది. సీఆర్డీఏ అభివృద్ధి చేసే ప్లాట్లలో నివాస, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఎస్టీపీలు, తాగునీరు సదుపాయాలు వంటివి కల్పించాలి. ప్లాట్లు పొందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వీటిని కల్పించాకే రైతులకు అప్పగించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం.మునిగే ప్లాట్లు రైతులు తీసుకుంటారా? ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ వర్షం, వరద నీరు ఈప్రాంతంలో నిలిచిపోయింది. ఇప్పుడున్నట్టుగా ప్లాట్లు వేస్తే భవిష్యత్‌లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్లాట్లన్నీ నీట మునగడం ఖాయం. ఇలా చేసినట్టయితే వాటిని రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయా ప్లాట్ల ప్రాంతాలను పూర్తిగా మట్టితో ఎత్తు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులన్నీ చేయడం ఇప్పుట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గతంలో సీఆర్డీఏ వేసిన అంచనా వ్యయమే రూ. 12 వేల కోట్లు దాటుతుండగా, ప్లాట్లు నీట మునగకుండా ఎత్తు చేయాలంటే రెట్టింపు నిధులు ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రభుత్వం అంత మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. -
నీటిపైనే ల్యాండ్ అవుతుంది.. బోట్ కాదు - ఇదొక ఫ్లైట్ (ఫోటోలు)
-
ప్రాపర్టీ కొనుగోలుకు ఏ డాక్యుమెంట్లు అవసరం..?
-
ఇలాంటి ల్యాండ్స్ కొంటే మీరు సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..
-
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
నక్కపల్లిలో ఉద్రిక్తత
నక్కపల్లి: నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చకుండా విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో చంద్రబాబు సర్కారు చేపట్టిన షెడ్లు, తాత్కాలిక వసతి సదుపాయాలు, రోడ్లు, సబ్‌స్టేషన్ వంటి నిర్మాణపు పనులను వైఎస్సార్సీపీ, సీపీఎం నేతల మద్దతుతో రైతులు, నిర్వాసితులు అడ్డుకున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో ఏపీఐఐసీవారి ఆధ్వర్యంలో రెండో రోజు పనులను ప్రారంభించారు. నక్కపల్లి, పాయకరావుపేట సీఐల ఆధ్వర్యంలో 70 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ అంబేద్కర్ పర్యవేక్షణలో ప్రారంభించిన ఈ పనులను కొనసాగకుండా రైతులు అడ్డుకోవడంతో 3 గంటలపాటు రైతులకు ఏపీఐఐసీ, రెవెన్యూ, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత రైతులకు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు అండగా నిలిచారు. రైతుల డిమాండ్లు ఎప్పటిలోగా నెరవేరుస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనులు జరగనివ్వబోమంటూ యంత్రాల ముందు బైఠాయించారు. ఇదే రైతులను గతంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టి ఆందోళన చేయించారని, ఏ హామీల కోసం అయితే గతంలో ఆందోళన చేశారో అదే సమస్య పరిష్కరించకుండా పనులు ప్రారంభించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత వీసం రామకృష్ణ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి ఎందుకు ఆందోళనలు చేశారని, పనులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పరిహారం చెల్లించినప్పుడు ఇంతకాలం భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తే పోలీసు బందోబస్తుతో పనులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రైతుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని, అప్పటి వరకు పనులు జరగనివ్వబోమని అన్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించిన సర్వే నంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలామంది రైతులు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారని, వీరిలో కొంతమందికి పరిహారం ఇచ్చి మరికొందరికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. చివరకు అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వచ్చే మంగళవారం హోం మంత్రి, కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని, చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. -
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
ఫార్మాసిటీ భూములు వెనక్కివ్వండి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫార్మా సిటీ రద్దు చేసింనందున దాని కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్లో మంగళవారం(జులై 30) చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘రూ. 16 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ కు అంతా సిద్ధం చేశాం. లక్షా 50 వేల కోట్లు మీ ప్రభుత్వానికి ఎందుకు అవసమరమవుతున్నాయి. హైదరాబాద్‌లో ఎస్ఆర్డీపీ రోడ్ల నిర్మాణ పనులను కొనసాగించాలి’అని కేటీఆర్ కోరారు. -
తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్ వీడియో చూడండి!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్షైర్ కోస్ట్లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
సమగ్ర భూ సర్వే రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.35 వేల కోట్ల భూ దోపిడీ వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు. -
వహ్.. జగన్ స్కీమ్‌లు కాస్త స్కామ్‌లుగా!
అమరావతి, సాక్షి: అబద్దాలు, ఆరోపణలతో ఏపీలో మరో శ్వేతపత్రం విడుదలయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో భూములు, గనులు, అటవీ సంపద దోపిడీ జరిగిందంటూ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఒకపక్క.. వాస్తవాలు అన్నీ ఎస్టాబ్లిష్ చేయలేమంటూ, మరోపక్క.. గత పాలనపై బురద చల్లారు. ఇంతకాలం ఎల్లో పేపర్లో వచ్చిన వార్తలనే వైట్పేపర్గా ప్రొజెక్ట్ చేసి చూపించారాయన. కోర్టుకు వెళ్లి మరీ పేదల ఇళ్ల స్థలాలు, పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూసిన టీడీపీ.. ఏ కోర్టులోను అవినీతి అని నిరూపించలేకపోయింది. ఇప్పుడేమో అధికారం ఉందని పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రం విడుదల చేసింది. జగన్ హయాంలో పేదలకు భూములను పంచడం.. 14 ఏళ్లు సీఎంగా ఉండి పేదలకు సెంట్ భూమి కూడా పంచని చంద్రబాబు దృష్టిలో ఇప్పుడు పెద్ద స్కామ్ అయ్యింది. పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరించడం, రైతులకు పరిహారం చెల్లించడం, దళితులకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం గత ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది. దళితులకు భూములపై హక్కులు కల్పించడం, వాళ్లను యజమానులుగా చేయడం అది చంద్రబాబుకి స్వతహాగానే నచ్చనట్లుంది. అందుకే ఇందులోనూ స్కామ్ అంటూ అడ్డగోలుగా ఆరోపణలు చేశారు ఇవాళ. ఇక.. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో 340 ఆధారంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు జరిగింది. అయితే.. టీడీపీ ఆఫీస్ లకు స్థలాలు కేటాయిస్తే ఒప్పు అయ్యిందేమో. అదే వైఎస్సార్ సీపీ ఆఫీస్ లకు స్థలాలు ఇస్తే అవినీతంటూ సీఎం చంద్రబాబు బురద జల్లారు. దీనికి తోడు లోకేష్ తోడల్లుడు భరత్‌కి చెందిన గీతం ఆక్రమణల్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా స్వాధీనం చేసుకుంది. అది మాత్రం ఇవాళ్టి శ్వేతపత్రంలోకి మాత్రం ఎక్కలేదు.పైగా 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాగేసుకున్నారంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఎక్కడి అసైన్డ్ భూములో మాత్రం శ్వేతపత్రంలో చెప్పలేదు. కొసమెరుపు: గతంలో చంద్రబాబు పాలనలో రైతుల భూములను చుక్కల భూముల జాబితాలో చేర్చేసింది. అయితే జగన్ పాలనలో నిజమైన యాజమానులకు వాటిని తిరిగి అప్పగించారు. అయితే ఆ చుక్కల భూములను నిజమైన యజమానులకు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతప్రతం విడుదల సందర్భంగా గగ్గోలు పెట్టారు. -
కబ్జా చేసి.. పట్టా భూమిలో కలిపేసి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో విలువైన భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మహేశ్వరం మండలంలోని రూ.180 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి మాయమైంది. బోర్డు పేరున భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూమి కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిలో బోర్డులు నాటి, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఏళ్ల తరబడి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో విలువైన ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. భూదాన్ భూమి...మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 435లో 12.17 ఎకరాల భూమి ఉంది. 1955–58 పహాణీ ప్రకారం ఈ భూమి ఫకీర్ మహ్మద్ పేరున ఉంది. ఆయన దీనిని 3/1/1979న (ప్రొసీడింగ్ నంబరు: 1585/79 ) భూదాన్ బోర్డుకు దానం చేశారు. 1979–80 నుంచి 1985–86 వరకు భూదాన్ సమితి పేరున ఈ భూమి రికార్డుల్లో ఉంది.ఆ తర్వాత ఈ భూమిని ప్రభుత్వం స్థానికంగా ఉన్న ఐదుగురు పేదలకు దానం చేసింది. ఆ తర్వాత ఈ భూమి పక్కనే ఉన్న ఓ పట్టాదారు ఆధీనంలోకి వెళ్లింది. సదరు రైతు ఈ భూదాన్ భూమిని తన పట్టా భూమిలో కలిపేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పంట సాగు చేస్తున్నాడు. నివేదికతో సరి...అసైన్‌దారుల ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మారడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని అప్పట్లో ఏపీ లోకాయుక్త సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని సుమోటో (కేసు నంబరు: 2585/2011)గా స్వీకరించింది. రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీంతో మహేశ్వరం తహసీల్దార్ సదరు కబ్జాదారుకు రికార్డులు చూపించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇందుకు ఆయన నిరాకరించడంతో 14/2/2012లో ఈ భూమిని తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశాన్ని లోకాయుక్తకు కూడా నివేదించింది. ఈ భూమిలో హెచ్చరికల బోర్డు కూడా ఏర్పాటు చేసింది. అయితే కబ్జాదారు దీనిని కూలి్చవేయగా, తహసీల్దార్ ఫిర్యాదుతో మహేశ్వరం పీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని స్వా«దీనం చేసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోరంబోకు..పట్టాగా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610లలో 33.8 ఎకరాల పోరంబోకు భూమి ఉంది. నిన్నమొన్నటి వరకు పేదల చేతుల్లో ఉన్న ఈ భూములు ఇటీవల పెద్దల చేతుల్లోకి వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. 1996 నుంచి ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు పోరంబోకు/గైర్హాన్ సర్కారివిగా నమోదై ఉన్నాయి. 2012లో ప్రభుత్వం వీటిని నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంతమంది బడానేతలు రికార్డులు మాయం చేసి గుట్టుగా వీటిని కాజేశారు. అసలు సర్వే నంబర్లకు అనేక బై నంబర్లు సృష్టించగా, పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఏడాదిక్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములు ఇటీవల పట్టా భూములుగా మారడంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందగా, ఆయన విచారణకు ఆదేశించడం కొసమెరుపు. -
'మాన్సాస్' కౌలు కిరికిరి
తగరపువలస (విశాఖ): అవి ఏడెనిమిది తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. వాటికి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఏనాడూ కౌలు వసూలు చేయలేదు.. ఇప్పుడు ఉన్న పళంగా ఎవరికీ చెప్పాపెట్టకుండా గ్రామసభ పెట్టి కౌలు వేలం నిర్వహిస్తామని ఏకపక్షంగా ప్రకటించేశారు. పైగా గతంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చి ఇప్పుడు ఆ మాట మార్చేశారు. దీంతో ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతులు మండిపడుతున్నారు. ఈ కలవరపాటుకు కారణం విశాఖ జిల్లాలో ‘మాన్సాస్’ ట్రస్ట్ తాజా వ్యవహారం. విషయం ఏమిటంటే.. ఆనందపురం మండలం బోని పంచాయతీలో మాన్సాస్ ట్రస్ట్‌కు 614.97 ఎకరాల భూములున్నాయి. వీటికి సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జూలై ఒకటి నుంచి మూడో తేదీ వరకు లైసెన్సు హక్కులు నిర్ణయించనున్నారు. బహిరంగ వేలం ద్వారా నిర్ణయించనున్న ఈ ట్రస్ట్ భూములకు సంబంధించి మాన్సాస్ ప్రతినిధులు, ఆనందపురం రెవెన్యూ అధికారులు బోని పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల అభివృద్ధికి గాను ఈ కౌలు ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు రైతులకు తెలిపారు. కొన్నాళ్లుగా రైతులెవరూ కౌలు చెల్లించకపోవడంతో మాన్సాస్ లక్ష్యం దెబ్బతింటోందని దీనికి కౌలు రైతులంతా సహకరించకపోతే తాము మరోదారిలో వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాన్సాస్ భూములు కేవలం కౌలుకు మాత్రమేనని విక్రయానికి సాధ్యపడదని రైతులకు తెలిపారు. ఎవరైనా వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో వచ్చినా నమ్మవద్దని తెలిపారు. వ్యవసాయానికి అయితే ఏడాదికి ఎకరాకు రూ.5వేలు.. ఇటుక బట్టీలకైతే ఇంకా ఎక్కువ ధర నిర్ణయించనున్నట్లు మాన్సాస్ ప్రతినిధులు తెలిపారు. సాగు హక్కులు కావాలంటూ రైతుల పట్టు.. పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఇనాం రైతులకు ఇచ్చినట్లే తమకు కూడా మాన్సాస్ సాగు హక్కులు ఇవ్వాలంటూ కౌలు రైతులు పట్టుబట్టారు. గతంలో మాన్సాస్ ప్రతినిధులు రైతులతో వన్‌టైమ్ సెటిల్మెంట్కు వచ్చినట్లు గుర్తుచేశారు. అసలు ఇక్కడి భూముల్లో బంజరు, ఇనాం, మాన్సాస్‌లకు చెందినవి విడివిడిగా చూపించాలన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి తమ ఏడెనిమిది తరాల వారు ఈ భూములను సాగు చేసుకుంటున్నట్లు వారంతా గుర్తుచేశారు. నిజానికి.. 18 ఏళ్లకు పైగా మాన్సాస్ ట్రస్ట్ తమ నుంచి కౌలు వసూలు చేయడంలేదని.. అంతకుముందు ఏడాదిలో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 కౌలు మించేది కాదన్నారు. ఆరి్థకంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన తమపై కౌలు పేరుతో చెల్లించలేనంత భారాన్ని మోపితే సహించబోమన్నారు. దీంతో గ్రామసభ మరోమారు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పుడు కౌలు అడగడం సరికాదు.. ముగ్గురు ఆడపిల్లలు, భార్య, నేను కలిసి ఎకరా భూమి సాగుచేసుకుంటున్నాం. మాకు తాతముత్తాతల నుంచి ఈ భూమే ఆధారం. ఇప్పుడొచ్చి ఏడాదికి రూ.5 వేలు కౌలు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం సరిగాలేదు. – కాళ్ల నారాయణ, కౌలు రైతు, బోని గ్రామం ముందస్తు సమాచారమే లేదు.. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే కరపత్రాలు ఈరోజు పట్టుకొచ్చి గ్రామసభలో పంచిపెట్టారు. కౌలు రైతులు ఎవరూ ఇందుకు సిద్ధంగా లేరు. – బోని ముకుంద, కౌలు రైతు, బోని గ్రామం కౌలు భూములకు కమర్షియల్ ధరలా? మేం సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కులు కల్పించాలి. అప్పుడే మా కుటుంబాలకు భద్రత. కౌలు భూములకు కమర్షియల్ ధరలంటూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. – సూరకత్తుల వెంకట్రావు, కౌలు రైతు, బోని గ్రామం రైతులను వేధిస్తే ఊరుకోం.. 1971లో గరీబ్ హఠవో ద్వారా ఇందిరాగాంధీ.. 1986లో దున్నేవాడిదే భూమిపై హక్కులు అంటూ ఎన్టీఆర్.. 30 ఏళ్లు సాగులో ఉండేవారికి భూమిపై అన్ని హక్కులు సంక్రమిస్తాయని చెప్పారు. 1956లో ట్రస్ట్లన్నింటినీ ప్రభుత్వం రద్దుచేసింది. 1958లో పుట్టుకొచ్చిన మాన్సాస్‌పై చాలా కేసులున్నాయి. చాలా ఏళ్ల తరువాత వచ్చి ఇప్పుడు కౌలు కట్టాలని రైతులను వేధిస్తే ఊరుకోం. – బోని సోంబాబు, కౌలు రైతు, బోని గ్రామం వన్‌టైం సెటిల్మెంట్పై మాటమార్చారు.. మా బోని గ్రామ పంచాయతీ ప్రజలంతా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం. ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులతో కౌలు భూములు సాగుచేసుకుంటున్నాం. గతంలో మాన్సాస్ ప్రతినిధులు వన్ టైమ్ సెటిల్మెంట్కు వచ్చారు. ఇప్పుడు కాదంటున్నారు. – మద్దిల తాతినాయుడు, కౌలు రైతు, బోని గ్రామం -
అధికారం వచ్చింది... ఆక్రమించేద్దాం..!
అధికార బలంతో ముందుగా అధికారులపై జులుం ప్రదర్శించడం.. భయకంపితులను చేయడం.. అనంతరం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం.. అక్రమాలకు పాల్పడడం.. ఇదీ టీడీపీ నేతల దురాక్రమణ సిద్ధాంతం. ప్రజలు ఇచ్చిన అధికార బలంతో చెలరేగిపోతున్నారు. రైతులు, పశువులు, గ్రామ అవసరాలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే పొలాలుగా మార్చేస్తున్నారు. దీనికి విజయనగరం మండలం గాజుల రేగవద్ద ఆక్రమణకు గురైన ఊరబంద నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. విజయనగరం రూరల్: అధికారం వచ్చి నిండా నెల పూర్తికాలేదు.. అప్పుడే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారు లు, జనంపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామన్న కసితో ఒక పక్క అధికారులను బెదిరిస్తూనే చెరువులు, ప్రభు త్వ భూముల ఆక్రమణకు తెరతీశారు. నీతి, నిజా యితీలకు మారుపేరని చెప్పుకునే టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు, తాజా ఎమ్మెల్యే, అశోక్ కుమార్తె అదితిగజపతిరాజు కనుసన్నల్లోనే తెలుగు తమ్ముళ్లు విజయనగరం మండల పరిధిలోని పలు గ్రామాల చెరువుల్లో అక్రమమట్టి తవ్వకాలకు పాల్పడుతుండగా, జమ్ము గ్రామంలో ప్రభుత్వ భూములను చదును చేసేస్తుండడం ప్రజలను కలవరపెడుతోంది. గాజుల రేగవద్ద ఉన్న రూ.4 కోట్ల విలువైన ఊరబందను ఆక్రమించేయడం సొంత పార్టీవర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.కబ్జా పర్వం ఇలా...విజయనగరం నియోజకవర్గం పరిధిలోని గాజులరేగ గ్రామ సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల ప్రభుత్వ చెరువు ఉంది. దీని విలువ రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం రూ.4 కోట్లు ఉంటుంది. దీనిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. అంతే.. కబ్జాకు ఉపక్రమించాడు. రైతులు, పశువులు, జీవాల దాహార్తిని తీర్చే చెరువును మట్టితో పూర్తిగా కప్పేసి పొలంలా చదును చేసేశాడు. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా సాగు భూమిగా మలచి చెరువులో నీలగిరి మొక్కలను సైతం నాటేశాడు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలకు ఉపక్రమించకుండా ఎమ్మెల్యేకూ వాటా ఉందని చెబుతూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చెరువు ఆక్రమణ అటు రెవెన్యూ, ఇటు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.చెరువు కబ్జా ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా...సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ చెరువును తమ పార్టీకి చెందిన బడా నేతే ఆక్రమించినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టిలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ చెరువు కబ్జాకు పాల్పడిన పార్టీ నాయకుడిపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలను ఆదిలోనే అడ్డుకుని అశోక్ పేరు నిలబెట్టాలని, లేదంటే ప్రజల్లో చులకన అయిపోతామని చెబుతున్నారు. ఆక్రమణల్లో రాజు పాత్ర ఉందా..? లేదంటే స్థానిక నాయకుడే ఆక్రమించి రాజుల పేరు చెబుతున్నాడా అన్న అనుమానాలను కొందరు వ్యక్తంచేస్తున్నారు.చెరువు ఆక్రమణను అడ్డుకుంటాంగాజులరేగ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 30/3 లో ఉన్న 1.22 ఎకరాల చెరువు ఆక్రమణ తమ దృష్టికి వచ్చింది. ఆక్రమణకు గురైన ఊరబంద స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. గ్రామ రెవెన్యూ అధికారి నివేదిక అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. చదును చేసిన స్థలంలో నాటిన నీలగిరి మొక్కలు తీసి వేయడానికి చర్యలు తీసుకుంటాం.– పి.వి.రత్నం, తహసీల్దార్, విజయనగరం