Laxman reddy
-
స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్ఆర్సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్ఆర్సీ జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. అసమానతలు బాధాకరం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు. చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్స్పెక్టర జనరల్ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
‘మత్తు’ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మత్తు పానీయాలపై కళాజాత, అవగాహన సదస్సులను ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 13వ తేదీన రాజమహేంద్రవరంలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలలో, 14న కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలలో, 15న విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజీలలో, 16న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలలో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా విద్యార్థులు, యువతను డ్రగ్స్, మత్తు పానీయాలకు దూరంగా ఉంచడానికి ఈ కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. ఎక్కడైనా డ్రగ్స్, నాటుసారా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే 14500 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని లక్ష్మణరెడ్డి కోరారు. -
తగ్గిన మద్యం వినియోగం
కావలి: రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 27 నెలలుగా అమలు చేస్తున్న దశల వారీ మద్య నియంత్రణ కారణంగా మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 40 శాతం, బీరు అమ్మకాలు 78 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని సెబ్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా, ప్రభుత్వం 33 శాతం మేర దుకాణాల సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతం 2,975 దుకాణాలు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు లాభాపేక్షతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాలు నిర్వహించగా.. ప్రస్తుత ప్రభుత్వం దశల వారీ నియంత్రణకు దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణలో విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్‌రెడ్డి, సెబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు. -
లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు అందం, అభినయం ఉండాల్సిందే. హీరోల విషయానికొస్తే ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే ఇప్పుడు ఏ హీరో చూసినా షూటింగ్స్‌లో కన్నా ఎక్కువగా జిమ్ముల్లోనే గడిపేస్తున్నారు. చెమటలు చిందిస్తూ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందుకోసం వారికి స్పెషల్ ట్రైనర్లు కూడా ఉంటారు. అందరిలాగే బాహుబలి హీరో కు కూడా ఓ జిమ్ ట్రైనర్ ఉన్నాడు. ప్రభాస్ అతడితో ఆప్యాయంగా మాట్లాడేవారు. (చదవండి: ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?) తనకోసం కష్టపడుతున్న అతనికి ఓ బహుమతిని కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ గిఫ్ట్ విషయం అందరి నోరెళ్లబెట్టేలా చేసింది. ఎందుకంటే జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఆషామాషీది కాదు. లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనిచ్చారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రభాస్ ఇలా గిఫ్ట్ ఇవ్వడం ఇదేం తొలిసారేం కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్‌లో ఉన్న ఈ కోణాన్ని చూసి కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది. (చదవండి:మూడు సినిమాల నుంచి తప్పించారు) -
కొల్లి నాగేశ్వరరావు మరణం తీరని లోటు
సాక్షి, విజయవాడ: అఖిల భారత కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మృతి తీరని లోటని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మాచవరంలోని కొల్లి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై నాగేశ్వరరావు చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. జల వనరులపై అపార అనుభవం కలిగిన ఆయన చివరి నిముషం వరకు రైతు సంక్షేమానికి కృషిచేశారని కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తొలుత కొల్లి నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లి నాగేశ్వరరావు కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రశాంతి, భార్య టానియా, అల్లుడు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొల్లి నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం, ఆయన రాసిన పుస్తకాలను లక్ష్మణరెడ్డికి వివరించారు. ఆయన వెంట చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు చీఫ్ మేనేజర్ పి.వీరారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు. -
దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలు శరవేగంగా సాగుతోన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు శుక్రవారం గుంటూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గుంటూరు అర్బన్ ప్రత్యేకాధికారి కరిముల్లా షరీఫ్, గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. బాలకృష్ణన్ తో కలిసి మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎస్ఈబీ ప్రత్యేకాధికారి షరీఫ్ కి లక్ష్మణరెడ్డి అభినందనలు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ శాఖలు సమన్వయంగా పనిచేయాలి.. మద్య నిషేధం అమలులో భాగంగానే ఎస్ఈబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా పనిచేసి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లల్లో మద్యం దుకాణాలు తెరవనందున ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలించే ప్రమాదాన్ని పసిగట్టి నిరోధించాలన్నారు. రాష్ట్ర,జిల్లాల సరిహద్దుల్లో మద్యం అక్రమరవాణాకు పటిష్ట బందోబస్తును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను లక్ష్మణరెడ్డి కోరారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్ ల నేతృత్వంలో నాటు సారా కేంద్రాల్ని మూసేయించడం అభినందనీయమన్నారు. ('ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు') సరికొత్త శుభ పరిణామం.. నాటు సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేంద్రాలను అప్పచెప్పారని.. ముఖ్యమంత్రి సంకల్పమే తమలో మార్పునకు కారణమని చెప్పడం సరికొత్త శుభ పరిణామంగా లక్ష్మణరెడ్డి వివరించారు. ఇలాంటి సంఘటనల ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా పూనుకొని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాల్ని మూత వేయించాలన్నారు. రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు.. దశలవారీ మద్య నిషేధ చర్యలతో రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదని.. అలాంటప్పుడే ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నాటుసారా తయారీ, కల్తీకల్లు, గంజాయి ఇతర మత్తుపదార్ధాల ఉత్పత్తి జరగకుండా ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఈబీలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందితోనూ.. ఎక్సైజ్ శాఖ 30 శాతం సిబ్బందితో సమర్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరుశాఖల అధికారులు చెప్పారు. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ తమ శాఖల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయా శాఖల అధికారులు హామీనిచ్చారు. -
బాబు మాటలు.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మద్యం చుట్టూ రాజకీయం చేస్తున్నారని మద్యవిమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షకుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మద్యాన్ని విస్తృతంగా విక్రయించాలని చెబుతున్నారని మండిపడ్డారు. లక్షలమంది పేదల జీవితాలను నాశనం చేసేలా ఆయన సలహాలు ఉన్నాయని విమర్శించారు. (గ్యాస్ లీక్ ఘటనపై విచారణ జరిపిస్తాం : గౌతమ్‌రెడ్డి) మహిళలు ఓట్ల రూపంలో ఛీకొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా ఆయన మాటలున్నాయని ఎద్దేవా చేశారు. పేదలకు కిలో బియ్యం ఇవ్వలేని టీడీపీ నేతలు మద్యం సరఫరా చేయాలనటం సిగ్గుచేటు అని లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. -
వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
-
మద్యం నిర్మూలన కోసం షార్ట్ ఫిలిమ్స్
సాక్షి, విజయవాడ: మద్యం నిర్మూలనకు లఘు చిత్రాలు, పోస్టర్లతో ప్రచారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు కేంద్రంగా మద్య విమోచన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. మద్య నిషేధంపై అవగాహన కలిగించేందుకు డ్వాక్రా సంఘాలు, వలంటీర్ల సహాయం తీసుకుంటామన్నారు. వ్యసనపరులను గుర్తించి డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి మద్యం మాన్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థి దశ నుంచే మద్యం మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై ఒక పాఠం ఉండేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. -
పవన్‌కు జనచైతన్య వేదిక బహిరంగ లేఖ
సాక్షి, విజయవాడ : గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తే పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందరోజుల పాలన మీద జనసేన ఇచ్చిన నివేదికపై జనచైతన్య వేదిక స్పందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ తీసుకున్న దశలవారీ మద్యనిషేధం, ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సోమవారం పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు బెల్టు షాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారించారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపుల భరతం పట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి బాటలు వేశారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మంచి పనిని స్వాగతించక పోగా పవన్ వక్రభాష్యాలు చెప్పటం భావ్యం కాదని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, ఈ అవినీతిపై వైఎస్సార్సీసీ ప్రభుత్వం విచారణ చేస్తామంటే పవన్ అభ్యంతరం చెప్పటం సరైనదికాదని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను సమీక్షించుకోవాలని అన్నారు. రాజకీయం చేయకుండా మద్యపాన నిషేధానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. బిహార్ ,గుజరాత్, మిజోరాం వంటి రాష్ట్రాలలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు జరుగుతోందని, ఏపీలో భవిష్యత్తులో అదే జరుగుతుందని లక్ష్మణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
‘డ్రోన్ తిరిగింది బాబు కోసం కాదు..’
సాక్షి, అమరావతి: డ్రోన్ వ్యవహారాన్ని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఆదేశాలతోనే వరద ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించారని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో టీడీపీ నేతల తీరును జనచైతన్య వేదిక అధ్యక్షుడు తప్పుపట్టారు. వరద ప్రవాహం ఉన్న అన్ని ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీదనే డ్రోన్ వినియోగించారనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో తక్కువ నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం సమీక్షలు జరుపుతూ తగు ఆదేశాలను ఇస్తూ వరద బాధితులను ఆదుకోవడం హర్షనీయమని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం ‘ఎలాంటి కుట్ర లేదు..రాజకీయం చేయొద్దు’ -
చంద్రబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి
-
‘ఆయన్ను కోవర్టు అనడం సీఎంకు తగదు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను జనచైతన్య వేదిక అధ్యక్షులు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంఘాలు కలిసి సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే గవర్నర్ పాలన తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఓటింగ్ శాతాన్ని 80కి పెంచిన ఎన్నికల సంఘాన్ని అభినందిసున్నామని చెప్పారు. పోలింగ్ రోజు 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఓటమి భయంతో ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని సాకుగా చూపటం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు వైఖరిని ఖండించాలని కోరారు. టీడీపీ సంరక్షణలో ఉన్న ఐటీ గ్రిడ్ డేటా దొంగ అశోక్‌ని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం కంటే బ్యాలెట్ విధానం మంచిందంటూ చంద్రబాబు చెప్పడం అశాస్త్రీయమని వ్యాఖ్యానించారు. -
‘ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు’
సాక్షి, విజయవాడ : అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందంటూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో 35 శాతం మద్యం అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనచైతన్య వేదిక, వావిలాల సంస్థ సంయుక్తంగా ఈనెల(జూన్) 13న విజయవాడ ఎంబీ భవన్లో.. మద్య వ్యతిరేక ఉద్యమ సదస్సు నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. -
ఆ రెండుచోట్ల అవినీతి తారాస్థాయి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాక సభాపతి గౌరవాన్ని కాపాడాలని ఆయన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ రాజకీయ పార్టీ సమావేశాలలో పాల్గొనటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. గత 4 సంవత్సరాలలో 23 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అప్రజాస్వామికమని లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాక పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురు మంత్రుల పదవుల్లో కొనసాగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. గత ఎన్నికల్లో రూ. 11 కోట్లకు పైగా ఖర్చు చేశానని బహిరంగంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పిన విషయం విదితమే. కానీ, దానిపై ఇప్పటి వరకు ఏవ్యవస్థ చర్యలు తీసుకోకపోవటం దారుణమని లక్ష్మణ రెడ్డి అన్నారు. -
జేపీ అలా చెప్పడం హాస్యాస్పదం
అనంతపురం జిల్లా : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బలపర్చాలని కోరటం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం కిందకే వస్తుందన్నారు. ఈనెల16న ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ, వామపక్షాలు చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరారు. బంద్ అవసరం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, హోదా ఉద్యమన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. శివరామకృష్ణయ్య నివేదిక బుట్టదాఖలు చేశారని, ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు రాజధాని, పోలవరం పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
హోదా కోసం ఐక్యంగా ఉద్యమించాలి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలు కోసం ఐక్యంగా ఉద్యమించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు మొదటి నుంచీ ప్రత్యేక హోదాపై ఒకే విధమైన అభిప్రాయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ నెల 6 నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు పూనుకోవడం హర్షణీయమన్నారు. అదే రోజు జాతీయ రహదారులపై పాదయాత్ర పేరుతో మరో ఉద్యమాన్ని చేపట్టడం వల్ల సత్ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. ఒకేరోజు వేర్వేరు పార్టీలు వివిధ రకాల పోరాటాలకు పిలుపునిస్తే సత్ఫలితాలు రావని పేర్కొన్నారు. 25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తేవాలని, ఉద్యమానికి ఢిల్లీని కేంద్ర బిందువుగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకొని ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కృషి చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానించి ఐక్య పోరాటానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. -
చట్టాలకు ప్రభుత్వాలు తూట్లు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి విజయవాడ (మొగల్రాజపురం) : చట్టాలు అమలు చేయాల్సిప్రభుత్వం ఆ చట్టాలకుతూట్లు పొడిచి ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. బందరురోడ్డులోని ఆల్ ఇండియా రేడియో ఎదురుగా ఉన్న ౖవైట్హౌస్ బిల్డింగ్‌లో నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ (ఎన్ఏపీఎం), ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోషియేషన్ సంయుక్తంగా ‘ప్రజాహిత వ్యాజ్యాలు– న్యాయస్థానాల వైఖరి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటంలో ప్రజాప్రయోజనాల వాజ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో ఇదే మాదిరిగా వేసిన ‘ఫిల్స్’ వల్లనే బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి బహిర్గతమై వేల కోట్ల రుపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడగలిగారన్నారు. అమరావతిలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్న వైఖరి, రాజధాని నిర్మాణానికి ని«ధులు అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిల్‌ను కోర్టు స్వీకరించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2013 ల్యాండ్ ఎక్విజేషన్ చట్టాన్ని కేంద్రం పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే దానిని కాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఫూలింగ్ అంటూ కొత్త విధానాన్ని అమలు చేస్తుండటం అదేదో గొప్ప కార్యం మాదిరిగా మంత్రివర్గం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కుని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందని పిల్ వేస్తే విచారించకుండా మీకేం సంబంధం అంటూ ప్రశ్నించడం సరికాదన్నారు. పంట పొలాలను తీసుకోవద్దని మేధావులతో పాటుగా శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల వాజ్యం వేసే వారు 50 వేల రుపాయలను డిపాజిట్ చేయాలంటూ విధించిన నిబంధన సరికాదన్నారు. పిల్ వేయడం వల్ల ప్రజాధనం వృద్ధా కాకుండా ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, ఈ నిబంధన వల్ల అవినీతి జరుగుతుందని పౌరులకు తెలిసినా పిల్ వేయడానికి ఎవరూ ముందుకు రారన్నారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎన్ఏపీఎం రాష్ట్ర కన్వీనర్ బీఆర్కే రాజు, క్యాపిటల్ రీజియన్ ఫార్మర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మల్లెల శేషగిరిరావు, రైతు, రైతు కూలీ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ అనుమోలు గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని«ధులు కొలనుకొండ శివాజి, ఎన్.నరసింహారావు, రాజకీయ విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాసరావుతో పాటుగా కొంత మంది రైతులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులు అమలు చేయాలని, తక్షణమే నవ్యాంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఫిల్ వేసే వారు రూ.50 వేలు చెల్లించాలని హైదరాబాద్ హైకోర్టు విధించిన నిబంధన తొలగించాలని, సుప్రీం, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులు రాజకీయ నాయకులకు వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇవ్వడం వలన ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తిగత ఇంటర్వూ్యలు ఇచ్చే ముందు ఒక సారి ఆలోచించాలని తీర్మానాలు చేశారు. -
'ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఈసీకే ఇవ్వాలి'
తిరుపతి: పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాధికారం ఎన్నికల సంఘానికే ఇవ్వాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసమేనని అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు హాల్లో జనచైతన్య వేదిక నేతృత్వంలో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' పేరిట ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్ట సవరణకు పూనుకోవాలని కోరారు. కాగా, ఈ చర్చాగోష్టి కార్యక్రమానికి మేధావులు, ప్రజాసంఘాలు తదితరులు హాజరయ్యారు. -
'సీఎం రాజమండ్రిని వదిలి రావాలి'
రాజమండ్రి: ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పోతుందని ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన జన చైతన్య వేదిక మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబట్టింది. గోదావరి పుష్కరాల్లో మంగళవారం చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చంద్రబాబునాయుడు రాజమండ్రిని వదిలి రావాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు తన ప్రచార కాంక్షని మానుకోవాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు , రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి సూచించారు. చంద్రబాబు అక్కడ్నుంచి వచ్చేస్తేనే పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతాయన్నారు. మంగళవారం ఉదయం రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 29 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీణ, వాణీల చికిత్సపై ఎయిమ్స్ సలహా కోరాం
అవసరమైతే లండన్ వైద్యులను రప్పిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: వీణ, వాణీల శస్త్రచికిత్స విషయంలో లండన్ వైద్యులు పంపిన నివేదికపై ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ సలహా కోరుతూ లేఖ రాసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఇంకెక్కడైనా శస్త్రచికిత్స చేసే సదుపాయాలున్నాయా.. లేవా వంటి అంశాలపై వివరాలు పంపాలని కోరామన్నారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు లండన్ వైద్యులనే ఇక్కడకు రప్పించే అవకాశాలను పరిశీలించాలని, దీనిపై సాధ్యాసాధ్యాలు తెలపాలని ఎయిమ్స్ వైద్యనిపుణులను కోరినట్లు మంత్రి తెలిపారు. నేటి నుంచి ‘మిషన్ ఇంద్రధనుస్సు’: ఏడు వ్యాక్సిన్లు కలిపి వేయనున్న ‘మిషన్ ఇంద్రధనుస్సు’ టీకాల కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. -
రాయలసీమపై నిర్లక్ష్యం తగదు
జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడ ఉండాలనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదని, రాయలసీమ అభివృద్ధి జరగాలంటే రాజధాని లేదా హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు. నీటి పారుదల విషయంలో సీమ ప్రాజెక్టులకు బడ్జెట్లో కనీసం 5 శాతం కూడ కేటాయించకపోవటం బాధాకరమన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హన్మంతరెడ్డి మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాల్లో ఏ ఒక్కటి అమలు చేయటం లేదని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు నగరాల్లో ఉన్నాయని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ ధ్యేయంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ ఉద్యమ నేతలు పుత్త శివశంకర్, పోతుల శివ, మధుసూదన్ యాదవ్, రాధాకృష్ణారావు, ప్రొఫెసర్ ఎం.వెంకట్‌రెడ్డి, ఇస్మాయిల్‌రెడ్డి, బి.ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ, రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
PG ప్రవేశాలకు లైన్ క్లియర్
-
పీజీ ప్రవేశాలకు లైన్‌క్లియర్
జూడాల విజ్ఞప్తికి అంగీకరించిన సీఎం 600 మంది హౌస్సర్జన్లకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: వైద్యవిద్యకు సంబంధించి పీజీలో ప్రవేశాలు పొందేందుకు తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల (జూడా) వినతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందిం చారు. వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, డీఎంఈ శ్రీనివాస్‌తో కలసి జూడాల ప్రతినిధులు ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు. సమ్మె చేసిన రెండు నెలల కాలానికి సరిపడా కోర్సు వ్యవధిని మే 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూడాల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ సమ్మె కొనసాగించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినా వినకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా కాపాడాలని జూడాలు సీఎంను కోరారు. 600 మంది హౌస్సర్జన్లకు ప్రయోజనం.. సీఎం ఆదేశాల నేపథ్యంలో పీజీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందేలా తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీన పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోతామన్న భయంలో హౌస్సర్జన్లు ఉన్నారు. అయితే, సీఎం తాజా నిర్ణయంతో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన 600 మంది హౌస్సర్జన్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హత పొందుతారు. జూడాల మిగతా డిమాండ్లను ప్రభుత్వం ఇదివరకే అంగీకరించిందని వాటిని అమలుచేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’కి తెలిపారు. కాగా, జూడాల భద్రతకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ‘దరఖాస్తుకు రెండు రోజుల గడువు పెంచండి’ వైద్య పీజీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మరో రెండ్రోజులు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కోరింది. దరఖాస్తుకు ఈ నెల 16 (సోమవారం) చివరి తేదీ. పీజీ పరీక్ష రాసి, అడ్మిషన్ పొందేందుకు హౌస్ సర్జన్లకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సానుకూలత వ్యక్తంచేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు గడువు పొడిగించాలని కోరారు. -
ఎయిమ్స్‌పై కేంద్రానికి ‘చెక్‌లిస్ట్’
నేడు కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఇవ్వనున్న సీఎం? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటు ప్రతిపాదనలు, తనిఖీ జాబితా (చెక్ లిస్ట్) వివరాల నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డాకు అందజేయనున్నట్లు తెలిసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ఉండటం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఎయిమ్స్‌పై ప్రతిపాదనలు, తనిఖీ జాబితాను పంపడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించనున్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లా బీబీనగర్ వివరాలతోపాటు నిబంధనల ప్రకారం మరో మూడు ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపైనా చెక్‌లిస్ట్ ఇస్తారని తెలుస్తోంది. దీంతోపాటు తాము ప్రకటించినట్లుగా ఎయిమ్స్ నిర్మాణానికి బీబీనగర్ అనువైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించనున్నట్లు సమాచారం. దాన్ని ఖరారు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. అక్కడ 150 ఎకరాలు గుర్తించినట్లు, ఇంకా అవసరమైన 50 ఎకరాలు కూడా సేకరిస్తున్నామని పేర్కొననున్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం), 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్హెచ్ఎం కింద గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న కార్యక్రమాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను సీఎం కోరనున్నట్లు సమాచారం. ఇక 13 ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్రంలో 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కేంద్రానికి లేఖ కూడా రాశారు. సోలార్ విద్యుత్‌కు, పీహెచ్‌సీల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులతో కలిపి రూ. 50.59 కోట్లు విడుదల చేయాలని కోరనున్నట్లు సమాచారం.