man died
-
Hydra: ఇల్లు పోతుందన్న భయంతో పేద గుండె ఆగింది
ఉప్పల్, సాక్షి హైదరాబాద్: తన ఇల్లు కూల్చివేస్తారేమో అన్న దిగులుతో ఓ నిరుపేద గుండె ఆగింది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ కేటీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన స్కూల్ వ్యాన్ నడిపే తాటిపల్లి రవీందర్ (55)కి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరికీ వివాహాలు అయ్యాయి. రవీందర్ 75 గజాల స్థలంలో నిరి్మంచిన రేకుల ఇంట్లో ఉంటున్నారు. ఇది మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండటం వల్ల రవీందర్ నివాసముంటున్న ఇంటికి అవతలి పక్కన ఉన్న ఇంటికి అధికారులు మార్కు చేశారు. దీంతో రవీందర్‌కు తన ఇంటిని కూడా కూల్చి వేస్తారేమోనన్న బెంగ పట్టుకుంది.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఉన్న చిన్న ఇల్లు ఆధారం పోతే ఎలా బతికేదంటూ కుటుంబ సభ్యులతో ఆందోళన వ్యక్తం చేసేవాడు. నెల రోజుల క్రితం ఇదే ఆవేదనతో గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవీందర్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద దిక్కు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైడ్రాపై ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రంగనాథ్ మూసీ నది ఎఫ్ఐఎల్, బఫర్ జోన్లలో మార్కింగ్, కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఫేక్ ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో హైడ్రాపై భయాందోళనలు సృష్టిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరిచారు. మూసీ నదిలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టదనీ, నిబంధనల ప్రకారమే హైడ్రా కార్యకలాపాలు ఉంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
పిడుగుపాటుకు యువతీ యువకుడు మృతి
ఐనవోలు/వర్ధన్నపేట: వ్యవసాయ భూముల్లో పనులు చేస్తుండగా పిడుగుపడి యువతీ యువకుడు మృతి చెందారు. కాగా, విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దౌతుబాజి శ్రీనివాస్, దౌతుబాజి విజయ, రాధాబాయి, ఇందిర, కోమల, శ్రావణి, రాజు ఆదివారం పొలాల్లో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అందరూ సమీపంలోని రేకుల షెడ్డులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. పిడుగు ధాటికి షెడ్డులో ఉన్న ఏడుగురూ కింద పడిపోయారు. తేరుకుని లేచి చూడగా ఇందిర కుమార్తె శ్రావణి (17), కూకట్ల కోమల కుమారుడు రాజు (24) మృతిచెంది ఉన్నారు. ఈ ఘటనలో కోమలతోపాటు మిగతా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. జఫర్‌గఢ్ ఎస్సై రాంచరణ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టార్చ్‌లైట్ వెలుతురులో శవపరీక్ష ఇదిలా ఉండగా శ్రావణి, రాజు మృతదేహాలకు వర్ధన్నపేట శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదిలో విద్యుత్ సౌకర్యం లేక టార్చ్‌లైట్ వెలుతురులోనే శవపరీక్ష చేశారు. వెంకటాపురం గ్రామం జఫర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకురాగా శ్మశానవాటికలోని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వైద్యులు అక్కడికి చేరేసరికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో టార్చ్లైట్ల సహాయంతో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. అక్కడ విద్యుత్ మీటరు లేకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతుంటే.. పోస్టుమార్టం గది నిర్మించి ఇచ్చాం, మిగతా విషయాలకు ఆస్పత్రి వారిదే బాధ్యత అని మున్సిపల్ శాఖ చేతులు దులిపేసుకున్నట్టు సమాచారం. -
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
మేడ్చల్ రూరల్: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ బొల్లారం తండాకు చెందిన మాజీ సర్పంచ్ మాంగ్యా నాయక్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పలువురు యువకులు సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కరంతోడ్ సురేందర్ అలియాస్ హంజా(28) నీటిలో మునిగాడు. ఈ విషయాన్ని గమనించని మిగతా యువకులు విగ్రహాన్ని నీటిలోకి నెట్టారు. ఈ క్రమంలో విగ్రహం మీద పడి హంజా నీటిలో మునిగిపోయాడు. నిమజ్జనం తర్వాత రోడ్డుపైకి వచ్చిన యువకులకు హంజా కనబడకపోవడంతో తిరిగి నీటిలోకి వెళ్లి చూడగా విగ్రహం కింద పడి విగతజీవిగా కనిపించాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైన్లో బెర్త్ కూలి.. ప్యాసింజర్ మృతి
తిరువనంతపురం: ట్రైన్ అప్పర్ బెర్త్ ఒక్కసారిగా కూలిపోవటంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కేరళకు చెందిన ప్యాసింజర్ అలిఖాన్ సీకే తన స్నేహితులతో ఆగ్రాకు.. ఎర్నాకులం-హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న జరిగిన ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ట్రైన్ తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయలో ఒక్కసారిగా అలిఖాన్ సీకేపై అప్పర్ బెర్త్కూలిపోయింది.దీంతో ఆయన మెడకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.దీంతో ఆయన్ను రామగుండంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తలించారు. ఇక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రైన్లో జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తటంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ‘ఎక్స్’లో స్పందించారు. అప్పర్ బెర్త్ కూలిపోయిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. ‘‘ రైల్వే అధికారుల ట్రైన్‌లోని బెర్త్‌ను పరిశీలించారు.ప్రయాణీకుడు అలిఖాన్ సీకే సీటు నెం. S/6 కోచ్‌లో 57 (లోయర్ బెర్త్). అయితే ఆయనపై ఉన్న పైబెర్త్కు చైన్ సరిగ్గా అమర్చకపోవడం వల్లనే కిందకు పడిపోయింది. కానీ, పైబెర్త్ డ్యామెజీ కారణంగా కిందపడలేదు’’ అని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి గాయాలైన ప్రయాణికుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై కేరళ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రైల్వేలో జరుగుతున్న ప్రమాదాలపై విమర్శలు చేసింది. ఈ ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. -
ఆటలో సిక్స్... జీవితంలో ఔట్!
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లో రెండు టీమ్‌లు క్రికెట్ ఆడుతుండగా.. పింక్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్ కొట్టాడు. బాల్ అమాంతం ఎగిరి పార్క్ గ్రౌండ్ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్ కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని రామ్ గణేష్ తేవార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#DisturbingVisuals : On camera, man dies immediately after hitting six in match near mumbai. In a shocking incident in Thane's Mira Road area in Maharashtra, a man died while playing cricket. #shocking#Thane #HeartAttack #Cricket #heartattack pic.twitter.com/882Zi9QwcS— Indian Observer (@ag_Journalist) June 3, 2024 -
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య
రాయికల్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్ నుంచి ఇంటికి వసూ్తనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించి రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!
తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా.. వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్‌లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు. పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
రాత్రి మిస్సింగ్.. తెల్లారేసరికి శవమై
బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్గాభవానీనగర్ బస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన మునావత్ కార్తీక్ (10) సెయింట్ మేరీస్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి ఆడుకునేందుకు వెళుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్, కవితకు చెప్పి బయటికి వెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. కాగా బుధవారం ఉదయం సమీపంలోని జీహెచ్ఎంసీ పార్కులోని నాలాలో కార్తీక్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడు ఎలా మృతి చెందాడనే విషయమై దర్యాప్తు చేపట్టారు. వరదనీటి కాలువ పైకప్పు లేకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెంది ఉంటాడా? ఇంకేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. రాత్రి అదృశ్యమైన కుమారుడు తెల్లారేసరికి విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ..
అనంతపురం: అతివేగం ఇద్దరిని బలిగొంది. కరిడికొండ శివారు 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరొకరు చిరు వ్యాపారి ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కొడుకు కురువ భువనచంద్ర (29) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితుడి బుల్లెట్ బైక్ తీసుకుని అనంతపురం బయల్దేరాడు. ఆటోలో పల్లెలు తిరుగుతూ స్టీలుసామాన్లు, మిక్సీలు విక్రయిస్తూ జీవనం సాగించే బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి చెందిన సలార్‌బాషా (55) అర్ధరాత్రి వేళ గుత్తి మండలం కరిడికొండ జాతీయ రహదారి సమీపంలో ఆగాడు. ఇటు వైపు నుంచి అటువైపు ఉన్న ధాబా వద్దకు వెళ్లేందుకని నడుచుకుంటూ రోడ్డు డివైడర్‌పైకి చేరుకున్నాడు. అక్కడ చెట్ల మధ్య నుంచి కిందకు కాలు పెట్టగానే అల్లంత దూరాన 130 కిలోమీటర్ల వేగంతో బైక్‌పై వస్తున్న భువనచంద్ర వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ ఢీకొని సలార్‌బాషా వంద అడుగుల దూరం ఎగిరి కిందపడగా.. భువన చంద్ర 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడ్డాడు. స్థానికులు ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. అచేతనావస్థలో ఉన్న ఇద్దరినీ గుత్తి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల్లో సలార్బాషాకు భార్య రషీదా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనచంద్ర అవివాహితుడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న బైక్ రేసర్ల ఆగడాలు.. గుత్తి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్ రేసర్లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య శని, ఆదివారాల్లో వందలాదిమంది బైక్ రేసర్లు మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 250 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం కలిగిన బుల్లెట్, హోండా, యమహా బైక్‌లను రేసర్లు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లాలని బెట్టింగ్ వేసుకుని.. వేగంతో పోటీపడుతూ వారితో పాటు ఇతరులనూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిఘా ఉంచి బైక్ రేసర్ల ఆగడాలను అరికట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
పరోట తిని వ్యక్తి మృతి
అన్నానగర్: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్పట్టికి చెందిన రామకృష్ణన్ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్ మిల్లుకు వచ్చారు. గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..
నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి విద్యుత్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్ జిల్లాకు విద్యుత్ స్తంభాలు లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్ గుగులోతు నితిన్(20) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శవమై తేలిన ధర్మతేజ
కరీంనగర్: ఎన్టీపీసీకి చెందిన పలువురు యువకులు ఈనెల 8వ తేదీన బర్త్ డే పార్టీ చేసుకునేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చారు. కేక్ కట్ చేసి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు మిత్రులు గోదావరినదిలో స్నానానికి దిగారు. ఈక్రమంలో కనకమేడల ధర్మతేజ(32) నీటిలో గల్లంతైన విషయం తెలిసిందే. 48 గంటల పాటు గోదావరినదిలో జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం మృతదేహం లభించింది. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతుడి బంధువులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు అంతర్గాం ఎస్సై బోగె సంతోష్‌కుమార్ తెలిపారు. -
ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు. రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది. దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దెయ్యం పట్టిందని క్షుద్రపూజలు.. యువకుడు మృతి
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో క్షుద్రపూజలు వికటించి ఓ యువకుడు మృతిచెందాడు. చెన్నూర్ పట్టణం బొక్కగూడెం కాలనీకి చెందిన దంపతులు దాసరి లచ్చన్న, లక్ష్మి కుమారుడు మధు (33) గత 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంచిర్యాలలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. మధుకు చేతబడి అయిందని బంధువులు చెప్పడంతో శనివారం సాయంత్రం సీసీసీ నస్పూర్ ప్రాంతానికి చెందిన క్షుద్ర మాంత్రికుడిని ఆశ్రయించారు. ఇంటి వద్ద పూజల్లో భాగంగా మధుపైనుంచి కోడిని తిప్పడంతో అది చనిపోయింది. దీంతో దెయ్యం పట్టిందని, పెద్ద పూజలు చేయాలంటూ చెప్పడంతో ఆదివారం చెన్నూర్ గోదావరి ఒడ్డున మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో వెళ్లారు. పూజలు చేసే క్రమంలో మాంత్రికుడు మధుకు గుగ్గిలం (సాంబ్రాణి) పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. పొగతో మధు స్పృహ కోల్పోయి కాసేపటికే మృతిచెందాడు. దీంతో సదరు మాంత్రికుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రి ఇంటికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియల కోసం గోదావరి నదికి తీసుకెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో నది వద్దే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. చదవండి: చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి -
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో..
సాక్షి, ఖమ్మం: పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ దూదిపాళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యం కోసం తిరువూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
భీమవరంలో యువకుడి హత్య
సాక్షి, భీమవరం: భీమవరంలో పట్టపగలు యువకుడి హత్య సంచలనం రేపింది. రౌడీషీటర్లకు సత్ప్రవర్తనపై కౌన్సెలింగ్ ఇచ్చి గంట గడవక ముందే ఈ హత్య జరిగింది. భీమవరం రెండో పట్టణం బలుసుమూడి గాంబీర్దొడ్డికి చెందిన బెవర విజయ్‌బాబు (23)ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. గతేడాది డిసెంబర్ 24న జరిగిన రౌతుల ఏసు హత్య కేసులో విజయ్‌బాబు నిందితుడు. రౌడీషీటర్లకు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై వెళ్తున్న విజయ్‌బాబు, గోవిందరావును గొల్లవానితిప్ప రోడ్డులోని దుర్గాలక్ష్మి ఆలయ సమీపంలో కారుతో ఢీకొట్టగా బైక్ నడుపుతున్న విజయ్‌బాబు కిందపడిపోయాడు. సోదరుడు గోవిందరావు పక్కనే ఉన్న పంటకాలువలోకి దూకి అవతలి గట్టుకు చేరుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. హంతకుల్లో ఒకరి అరెస్టు ఢీకొట్టిన అనంతరం కారు విజయ్‌బాబును కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి తల, మెడపై విచక్షణారహితంగా నరకడంతో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో నలుగురు, రెండు మోటార్‌సైకిళ్లపై వాహనాల్లో నిందితులు వెంబడించినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కారు పట్టణం వైపు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. హత్య ఘటన తెలిసిన వెంటనే ఎస్సై అప్పారావు, ఏఎస్సై బాజీ ఒక యువకుడ్ని వెంటాడి పట్టుకోగా ఆ యువకుడి చేతిలో హత్య సమయంలో ఉపయోగించిన కత్తి ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన యువకుడు భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించాడు. మృతుడిపై రౌడీషీట్ ఉందని, హత్యకు కారణాలు సేకరిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వీడియో: విధిని ఎవరూ ఎదురించలేరు.. ఇదే ఉదాహరణ..
ఘజియాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా ఎంతో మంది అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ కాలేజీ యువకుడు జిమ్‌లో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గజియాబాద్‌కు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిద్దార్థ్ కుమార్ సింగ్(19) అనే యువకుడు శనివారం జిమ్‌కు వెళ్లి వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా.. సడెన్‌గా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో, అక్కడే ఉన్న జిమ్‌లో మరో ఇద్దరు వ్యక్తులు సింగ్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. అనంతరం, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. సింగ్ పరిశీలించిన వైద్యులు.. సిద్ధార్థ్ అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. A 19 years old boy died while running on trademill in the gym at #Ghaziabad #gym #Running pic.twitter.com/jsOa0aA3C3 — Gulshan Nandaa (@Gulshann_nandaa) September 16, 2023 ఇక, జిమ్‌లో సిద్దార్థ్ మృతిచెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగ్ మృతితో పేరెంట్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సిద్ధార్ధ్ వారి పేరెంట్స్‌కు ఒక్కడే కుమారుడు. సిద్ధార్థ్ తన తండ్రితో ఘజియాబాద్‌లో ఉంటుండగా.. అతని తల్లి బీహార్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. సింగ్ మృతికి 10 నిమిషాల ముందే తన తల్లితో మాట్లాడాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇది కూడా చదవండి: భిక్షమెత్తుకొని పొట్టనింపుకునేది.. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా సూపర్ క్రేజ్ -
చెంపదెబ్బకి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడ్డాడు.. తర్వాత..
ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్‌ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్‌ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల -
క్షణాల్లో మాయమైతివా బిడ్డా..
గొల్లపల్లి(ధర్మపురి): ‘క్షణాల్లో మాయమైతివా బిడ్డా’అంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు కళ్లముందే కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓరుగంటి సరోజన– మల్లేశం దంపతులకు అరుణ్(18), కూతురు అక్షిత సంతానం. అరుణ్ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలో డిగ్రీ రెండో సంవత్సరం, కూతురు గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే దంపతులు పిల్లలను ఉన్నంతలో చదివిస్తున్నారు. అరుణ్ గురువారం మధ్యాహ్నం మినరల్ వాటర్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. నీటిని క్యాన్‌లో పడుతున్న క్రమంలో అక్కడే ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. మరోసారి బలవంతంగా లేచి నిలుచునే క్రమంలో మళ్లీ కుప్పకూలాడు. క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు పోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయినా ఆందోళనలో ఉన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, కిందపడిపోవడంతో శ్వాస ఆగి చనిపోయాడని ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, వారిని ఆపడం ఎవరితరం కాలేదు. -
స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వస్తూ..
రఘునాథపల్లి/హన్మకొండ: ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్తున్న స్నేహితుడికి ఆనందంగా వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లారు. రహదారి పక్కన పార్కింగ్ చేసిన లారీని.. బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు రాకేశ్ చంద్ర గౌడ్ (29), సందీప్ (32) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో శనివారం ఉదయం దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ గాంధీనగర్‌కు చెందిన వడ్లకొండ నరేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాజ్‌కుమార్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు రాకేశ్ చంద్ర గౌడ్ (29) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 2020లో ములుగుకు చెందిన నందినితో వివాహమైంది. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే, నయీంనగర్‌కు చెందిన వడ్డెపల్లి ఉపేందర్, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు క్రాంతి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండో కుమారుడు సందీప్ (32) బీటెక్ చదివి బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. నిజామాబాద్‌కు చెందిన పరిమళతో 2018లో వివాహమైంది. వీరికి 18 నెలల చిన్నారి ఉంది. లారీ రూపంలో కబళించిన మృత్యువు.. యూఎస్ఏ వెళ్తున్న తమ స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చేందుకు రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ శుక్రవారం రాత్రి బొలెరోలో వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో స్నేహితుడితో గడిపి శనివారం ఉదయం 5 గంటలకు హన్మకొండకు బయలు దేరారు. కోమళ్ల టోల్గేట్ సమీపంలోని మలుపు వద్ద లారీ డ్రైవర్.. నిబంధనలు పాటించకుండా రహదారిపై లారీని నిలిపాడు. ముందు నిలిచి ఉన్న లారీని గుర్తించక బొలెరో ఢీకొంది. దీంతో లారీ కిందికి చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆర్ సంతోష్ , ఎస్సై రఘుపతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, స్నేహితులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం.. పైగా ఇద్దరికి రెండేళ్లలోపు చిన్నారులు ఉండడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. రాకేశ్ గౌడ్ తండ్రి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. ఇష్టారాజ్యంగా పార్కింగ్.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు.ఈ జాతీయ రహదారిపై నిర్ణీత ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలి. ఇందుకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లారీలు పార్క్ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఇసుక తీసుకువచ్చే పదుల సంఖ్యలో లారీలను కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఇరువైపులా రోడ్డు పక్కన నిలుపుతున్నారు. అదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. లారీలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే విషయం అనుమానాలకు తావిస్తోంది. -
ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో అపశ్రుతి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సావాల్లో భాగంగా పలహార బండ్ల ఊరేగింపులో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్‌గా(23) గుర్తించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆకాష్.. ఆదివారం రాత్రి విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్‌కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
Karimnagar: గుండెపోటు.. వ్యక్తి ప్రాణాలు బలిగొన్న రైల్వేగేటు..
సాక్షి, కరీంనగర్: కూతురు గురుకులం విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్‌డే నిర్వహించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును చూసేందుకు ఆ తండ్రి విద్యాలయానికి వచ్చాడు. ఇంటినుంచి తీసుకెళ్లిన ప్రత్యేకమైన వంటకాలు కూతురుకు తినిపించాడు. అంతలోనే విధి వక్రీకరించిందేమో.. ఆ తండ్రి గుండెపోటుతో అల్లాడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతడిని కరీంనగర్ తరలించారు. అక్కడ మరోసారి విధి అతడిని చిన్నచూపు చూసింది. అప్పుడే కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని తీగలగుట్టపల్లి రైల్వే గేటు పడింది. సుమారు 15 నిమిషాలు ఆలస్యమైంది. ఆసుపత్రిలో చేర్చగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం విద్యాలయంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి విజయ్, సుధీవన కూతురు స్పందన పదో తరగతి చదువుతోంది. రెండో శనివారం కావడంతో విద్యాలయంలో పేరెంట్స్ డే నిర్వహించారు. దీంతో విజయ్, సుధీవన దంపతులు ఉదయమే కూతురు కోసం ప్రత్యేకమైన వంటకాలు తయారు చేసుకుని విద్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం కూతురుతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో వర్షం రావడంతో ప్రిన్సిపాల్ గిరిజ తల్లిదండ్రులందరరినీ హాల్లోకి రావాలని సూచించారు. హాల్లోకి వచ్చి విజయ్ కూర్చుంటున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సుంచు మల్లేశం, విజయ్ భార్య సుధీవన చికిత్స కోసం అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్ వద్ద ఉన్న రైల్వేగేట్ అప్పుడే పడటంతో సుమారు 15 నిమిషాలపాటు విజయ్ అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడాడు. తీరా ఆసుపత్రిలో చేర్చాక.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కరీంనగర్లో గేట్ పడకుంటే విజయ్ బతికేవాడని మల్లేశం తెలిపారు. మృతదేహం వద్ద కూతురు స్పందన రోదించిన తీరు కలచివేసింది. కుటుంబసభ్యులు, రోదనలతో స్తంభంపల్లిలో విషాదం నెలకొంది. కాగా కరీంనగర్ వద్ద రైల్వే గేటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బ్రిడ్జ్ నిర్మించాలని గత తొమ్మిదేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని ఆసుపత్రులకు ఉమ్మడి జిల్లాతోపాటు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రోగులను అంబులెన్స్‌ల్లో కరీంనగర్ తీసుకు వచ్చినా గేటుతో ఇబ్బందులు పడ్డ సందర్భారాలున్నాయి. అంబులెన్స్‌లో తీసుకు వచ్చిన రోగులు గంటల కొద్ది గేటు పడడంతో గతంలో పలువురు రోగులు మరణించిన సందర్భాలు ఉన్నాయి, తాజాగా ఆర్వోబీ నిర్మాణం చేపట్టకపోవడంతో పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఆంబులెన్స్ దృశ్యాల్ని మొబైల్ కొంతమంది చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.