Memory loss
-
జ్ఞాపకశక్తి తగ్గుతుందా?! ఈ చిట్కాలు పాటించండి!
శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తాం. అలాగే, జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అని గ్రహించాలి. కండరాల కణాలు చురుగ్గా ఉండాలంటే మైండ్కూ వ్యాయామం త్పనిసరి. మైండ్‌కు బూస్ట్‌లా పనిచేసే సులువైన, సమర్ధవంతమైన వ్యాయామాలు ఇవి...ధ్యానంతో స్పష్టత: రోజూ ప్రశాంత వాతావరణంలో కూర్చొని పది నిమిషాలసేపు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యానం చేయాలి. దీని వల్ల మన ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఫలితంగా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్ నింపడం: క్రాస్‌వర్డ్స్, సుడోకో వంటి బ్రెయిన్ టీజర్స్ జ్ఞాపకశక్తికి పదునుపెడతాయి. ఎక్కడైనా జ్ఞాపకశక్తిలో సమస్యలు ఏర్పడినా త్వరగా పరిష్కారం లభిస్తుంది. పుస్తకపఠనం: ఆసక్తిని పెంచే రచనలు, వ్యాసాలు, మైండ్‌కి ఛాలెంజింగ్‌గా అనిపించే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానానికి సంబంధించిన సామర్థ్యం పెరుగుతుంది. సాధన: ప్రస్తుత మీ మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. భావోద్వేగాలు, చుట్టూ ఉండే వాతావరణం మన మైండ్‌కు మరింత పదును పెట్టేలా ఉండాలి. శారీరక వ్యాయామం మైండ్‌కు బూస్ట్: రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుంది. యోగా వంటి సాధనలు కూడా మనోవికాసాన్ని పెంచుతాయి. నలుగురిలో కలవడం: సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. దీని వల్ల ఎదుటివారితో సంభాషణ, చర్చలు, ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. భావోద్వేగాల పరంగా, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. బ్రెయిన్ ఎక్సర్‌సైజులతో, అవగాహనతో జ్ఞాపకశక్తికి ఎప్పుడూ పదునుపెడుతూ ఉండాలి. అది ఈ సమయం నుంచే మొదలుపెట్టండి. -
చీటికిమాటికి మర్చిపోతున్నారా? మతిమరుపు నుంచి ఎలా బయటపడాలి?
మతిమరుపు.. దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో దీని బారిన పడుతూనే ఉంటాం. అప్పుడే పెట్టిన వస్తువులను కాసేపట్లోనే మర్చిపోవడం, మళ్లీ వెంటనే గుర్తుకురావడం మామూలే. అయితే మతిమరుపు రెండు రకాలుగా ర్పడుతుంది. మొదటి రకం ఫిజికల్ డ్వామెజ్ ద్వారా, రెండవది మెంటల్ డ్యామేజ్ ద్వారా ఏర్పడేది. దీంట్లో మొదటిరకం నివారణకు మెడిసిన్స్ వాడాల్సిందే. కొందరికి పుట్టుకతోనే మతిమరుపు ఉంటుంది. ఇక రెండో రకంలో.. మెడిటేషన్ ద్వారా జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చు. అదెలాగో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ నడిమింటి మాటల్లోనే.. ఇవి పాటిస్తే కంట్రోల్లో ఉండే ఛాన్స్ ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యడం. మెదడును యాక్టివ్‌గా ఉంచుకోవడం. అంటే మెదడుకు మేత పెట్టే పజిల్స్,సుడోకు లాంటివి రోజూ సాధన చేస్తూ ఉండటం. మెమరీకి సంబంధించిన ఆటలు ఏదైనా ఆడుతూ ఉండటం. ఉదాహరణకు ఎవరినైనా కొన్ని వస్తువులు ఒక గదిలో పెట్టమని, వాటిని మీరు ఒక నిమిషం పాటు చూసి బయటకు వచ్చి, ఏమేం చూసి వచ్చారో అన్నీ గుర్తు చేసుకుని చెప్పడం, రాయడం. ఇది పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆడించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్నింటికీ మంచిది. నలుగురితో ఉల్లాసంగా గడపడం. దీనివల్ల నిద్రాణమైన జ్ఞాపకాలు బయటికి వచ్చి జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మీరు వాడే వస్తువులను క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల, ఏది ఎక్కడ ఉంటుందో సులభంగా గుర్తుంటుంది. ఉదాహరణకు మీ కళ్ళజోడు ఎప్పుడూ బెడ్ పక్కనే చిన్న టేబుల్ మీద ఉంచే అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కనబడనప్పుడు నేరుగా అక్కడికే వెళ్ళి వెతకచ్చు, ఇంట్లోవాళ్ళెవరైనా ఆ చోటు మార్చేస్తే తప్ప. మంచి నిద్ర కేవలం మతిమరుపు నివారించడానికే కాదు, ఆరోగ్యానికి కూడా అవసరం. మంచి నిద్రలో మెదడు సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది. మరిచిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. -
చిన్నవయసులోనే గజినీలుగా మరుతున్నారు.. విటమిన్ బి12 కారణమే
భద్రంగా దాచిన వస్తువును ఎక్కడ ఉంచిందీ గుర్తులేకపోవడం.. ఆఫీస్‌కు ఆలస్యమవుతోందనే భయంతో బైక్ కీస్‌ను మరిచి గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేయడం.. స్కూల్‌కి టైమ్ అవుతోందనే హడావుడిలో అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోవడం.. ఇలా చాలా మంది చిన్న వయసులోనే గజినీలుగా మారుతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు కనిపించేది. ఇప్పుడు 16 ఏళ్ల వారినీ మతిమరుపు వేధిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. టీనేజ్లోనే.. మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడు తోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అధికమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధిక ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టు తప్పుతోంది. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జయిటీ. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటంతో ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం గుర్తుకు రాని పరిస్థితి. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో ఒత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతోందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రతే లేదు యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మనసులో ముద్రించుకో వడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. గుర్తుంచు కున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. మతి మరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. డిప్రె షన్, యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య తలెత్తుతోంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల కోసం ఒత్తిడి తేకూడదు. ఒత్తిడి వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ ఆర్.తార, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వైద్య విభాగం, జీజీహెచ్ -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
భర్త మరణం తర్వాత.. మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ
సీనియర్ హీరోయిన్ భానుప్రియ అనగానే.. కలువ పువ్వులాంటి ఆమె కళ్లు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్లముందు ప్రతిబింబిస్తుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ దాదాపు అందరు అగ్రహీరోలతో జతకట్టింది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా వారు చనిపోయిన తర్వాత నుంచి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. డ్యాన్స్‌కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను. మొన్నా మధ్య ఓ తమిళ మూవీ షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మర్చిపోయా. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లండన్‌లో చదువుకుంటుందని, ఆమెకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా 1998లో భానుప్రియ ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్‌ను పెళ్లాడారు. ఆయన 2018లో గుండెపోటుతో కన్నుమూశారు. -
.. ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదట. ఈసారి ఎలక్షన్లో యువనాయకుడిని గెలిపించుకుందాం..!
.. ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదట. ఈసారి ఎలక్షన్లో యువనాయకుడిని గెలిపించుకుందాం..! -
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
మతిమరుపునకు మందే లేదా?
-
అయ్యో పాపం.. నిద్ర లేచేసరికి గతం మర్చిపోయింది!
జలుబు చేయడంతో ఓ మహిళ రాత్రి త్వరగా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? పడుకొని లేచేసరికి ఆమె తన గతం మర్చిపోయింది. ఇంగ్లండ్‌కు చెందిన క్లైర్ మఫ్ఫెట్ రీస్ అనే మహిళ 2021లో ఓ రోజు తీవ్రంగా జలుబు చేయడంతో త్వరగా నిద్రలోకి జారుకుంది. అయితే పొద్దునలేచేసరికి ఆమె కోమాలోకి వెళ్లింది. సుమారు16 రోజులు కోమాలోనే ఉండిపోయింది. కోమా నుంచి బయపడిన ఆమె దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్న క్లైర్ మఫ్ఫెట్కు మెదడువాపు వ్యాధి సోకడంతో తన గతం మర్చిపోయినట్లు ఆమె భర్త స్కాట్ చెప్పాడు. ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వ్యాపు వ్యాధి దినోత్సవం రోజున క్లైర్ మఫ్ఫెట్ తనకు జరిగిన ఈ ఘటనను వెల్లడించింది. Tomorrow marks World Encephalitis Day, so catch me and @Chipfatinasock on @PackedLunchC4 to raise awareness of encephalitis and how serious it is#worldencephalitisday #red4wed #theencephalitissociety #encephalitis #abi #acquiredbraininjury #stephspackedlunch #channel4 pic.twitter.com/33VXkBiF5y — Claire Muffett-Reece (@MrsMuffettReece) February 21, 2022 రెండు వారాల నుంచి ఆమెకు జలుబు ఉంది. తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షిణించినట్లు స్కాట్ గుర్తించాడు. జలుబుతో పడుకున్న క్లైర్ మఫ్ఫెట్ పొద్దున నిద్రలేవలేదని.. అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన ఆమెకు వెంటిలేటర్ అమర్చి వైద్యులు చికిత్స అందించారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు మెదడువాపు వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. "I woke up and had forgotten the past 20 years - I couldn't remember my kids' birthdays" Great article from Claire - a member of @encephalitis - who shares her story in @TheSun Read now 👉 https://t.co/DnHrINxWMa pic.twitter.com/OUlZ5veovX — Encephalitis Society (@encephalitis) January 24, 2022 క్లైర్ మఫ్ఫెట్ మాట్లాడుతూ.. ‘నేను దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయాను. అయితే అదృష్టవశాత్తు నాకు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుంది. కానీ, వారికి నేను జన్మనిచ్చినట్టు, వారి పుట్టినరోజులు, అభిరుచులు, మొదటిసారిగా వారిని స్కూల్‌కు తీసుకెళ్లిన విషయాలు మర్చిపోయాను’ అని తెలిపింది. అయితే మరో అదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తాను తన భర్తను మర్చిపోలేదని తెలిపారు. అలా జరిగి ఉంటే ఎలా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినా తను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి కారణం?
మనుషులను నడిపించేదే జ్ఞాపకం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వృద్ధాప్యం వచ్చే సరికి ఏదైనా గుర్తు చేసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి దీనికి కారణం మన మెదడులో మెమరీ ఫుల్ అయిపోవడమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ బాల్యం, యవ్వనం.. ఓ ట్రెజర్‌హంట్ సాధారణంగా ఒక వయసు దాటగానే ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తు చేసుకోవడానికి కష్టపడుతుంటారు. మిగతా విషయాల్లో చురుగ్గా ఉన్నవారు కూడా ఈ విషయంలో ఇబ్బందిపడుతుంటారు. ఇదేమిటన్న దానిపై హార్వర్డ్, కొలంబియా, టొరంటో యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. వివిధ దశల్లో మనిషి మెదడు తీరును పరిశీలించారు. బాల్యంలో ప్రతీది కొత్తగా, అద్భుతంగా తోస్తుందని. అనుభవంలోకొచ్చే ప్రతి విషయాన్ని ఆస్వాదించే సమయమని.. ఆ దశలోని ప్రతి జ్ఞాపకం ఇట్టే గుర్తుండిపోతుందని వారు చెప్తున్నారు. యవ్వనంలో అనుభవాలు, అనుభూతులు కూడా మెదడులో నిక్షిప్తమైపోతాయని.. అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఈ జ్ఞాపకాల దొంతరలు పెరిగిపోతాయని వివరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఎందుకు? చాలా మందిలో ఒక వయసు దాటిపోయాక మెదడు శక్తి ఏమాత్రం తగ్గిపోకున్నా.. జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం మాత్రం ఇబ్బందికరంగా మారుతుంటుంది. బాల్యం నుంచీ పేరుకుపోయిన జ్ఞాపకాల దొంతరలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. వేలకొద్దీ జ్ఞాపకాల్లోంచి మనం అనుకున్న విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకునేప్పుడు.. సదరు జ్ఞాపకాలతోపాటు, దానికి సంబంధమున్నవి కొన్ని, ఏమాత్రం సంబంధం లేనివి మరికొన్ని జ్ఞాపకాలు కూడా బయటికి (రిట్రీవ్) వస్తున్నట్టు గుర్తించారు. అలాంటి వాటిలో ఏది సరైనదని ఒక్కోసారి మెదడు గందరగోళానికి గురవుతూ ఉంటుందని తేల్చారు. కొందరు వృద్ధులపై పరిశీలన జరిపి.. శాస్త్రవేత్తలు తాము గమనించిన అంశాలను ధ్రువీకరించడానికి కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. యువత, వృద్ధుల మధ్య కొన్ని టాస్కులతో పోటీ పెట్టారు. ఇందులో విశ్లేషణ, ఇతర అంశాలకు సంబంధించి వృద్ధులు తమ అపార జ్ఞానంతో త్వరగా టాస్కులు పూర్తిచేసినట్టు గుర్తించారు. అంటే సృజనాత్మకతలో, నిర్ణయాలు తీసుకోవడంలో యువత కంటే ముందంజలో ఉన్నట్టు తేల్చారు. కానీ జ్ఞాపకశక్తికి వచ్చేసరికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకాస్త లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని చెప్తున్నారు. తమ పరిశోధన ఆధారంగా పెద్ద వయసువారు గందరగోళానికి గురికాకుండా ఉండటానికి.. వారిలో జ్ఞాపకశక్తి పెంచడానికి ఉన్న మార్గాల అన్వేషణపై దృష్టిపెట్టామని పేర్కొంటున్నారు. -
శరీరాన్ని తూట్లు పొడిచారు.. బతికింది.. శభాష్ అనిపించుకుంటోంది
బీరూట్: ప్రాణం లేని వస్తువనుకున్నారో ఏమో.. ఆ క్రూరులు అభంశుభం తెలియని ఆ శునకాన్ని దారుణంగా హింసించారు. దాన్ని గన్ ఫైరింగ్‌కు లక్ష్యంగా మార్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు. కళ్లు, ఓ చెవి పోగోట్టుకుంది, ఎముకలు విరగొట్టుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అది అదృష్టం బాగుండి బతికింది. మంచి మనుషుల తోడుతో నేడు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. తనకు హాని చేసిన మనషులకు సేవ చేస్తోంది. వివరాలు.. లెబనాన్‌కు చెందిన మ్యాగీ అనే కుక్కపై దాని మాజీ యజమానులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేయటానికి దాన్నో లక్ష్యంగా వాడుకున్నారు. కాళ్లు కట్టేసి పెల్లెట్స్(డూప్లికేట్ గన్‌కు సంబంధించిన బుల్లెట్ లాంటి గుళ్లు)తో కాల్పులు జరిపారు. దాని ఒంటినిండా పెల్లెట్స్‌తో తూట్లు పెట్టారు. పాపం అరిచి, మొత్తుకున్నా విడవలేదు. దాని ముక్కు, రొమ్ము, భుజాలు ఇతర శరీర భాగాల్లో దాదాపు 200 గుళ్లు దింపారు. ముఖ్యంగా దాని ముఖంపై కాల్చటంతో కంటి చూపుకోల్పోయింది. అంతేకాదు, దాని దవడ విరిగింది.. ఓ చెవిని కూడా కోల్పోయింది. ప్రాణాల కోసం పోరాడుతున్న దాన్ని తీసుకుపోయి దూరంగా పడేశారు. చావు బతుకులతో పోరాడుతున్న దాన్ని గుర్తించిన ‘‘ వైల్డ్ యాట్ హార్ట్ ఫౌండేషన్’’ అనే జంతు సంరక్షణా సంస్థ రక్షించింది. అనంతరం మ్యాగీ కథ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిగ్టన్కు చెందిన క్యాసీ చార్లీన్ అనే మహిళ దాన్ని దత్తత తీసుకుంది. దానికి శిక్షణ ఇచ్చి థెరపీ డాగ్‌గా తీర్చిదిద్దింది. (చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’) 2019లో మ్యాగీ పూర్తి స్థాయి థెరపీ డాగ్‌గా మారింది. డిమెన్షియా(మతి మరుపు వ్యాధి)తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది. అంతేకాదు స్కూళు పిల్లలు, పోలీస్, ఫైర్ ఫైటర్స్‌కు తోడుగా ఉంటోంది. 2020లో కరోనా సమయంలోనూ సేవలను అందించింది. దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తేశారు. దీంతో చాలా నెలల తర్వాత తను ఉంటున్న కేర్ హోమ్‌కు మ్యాగీ చేరుకుంది. అక్కడ ఉంటున్న తన కిష్టమైన వ్యక్తి యానీని కలుసుకుంది. (చదవండి: షాపింగ్ చేస్తోన్న కుక్క.. నెటిజనులు ఫిదా) యానీని కలుసుకోక సంవత్సరం కావస్తున్నా.. ఆమెను మ్యాగీ ఏ మాత్రం మర్చిపోలేదు. కేర్ హోమ్‌లోకి అడుగుపెట్టగానే నేరుగా యానీ రూమ్ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే మిగితా వ్యక్తుల్ని కలుసుకుంది. ప్రస్తుతం మ్యాగీ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మ్యాగీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంతో దాన్ని దత్తత తీసుకోవటానికి ఎవ్వరూ రాలేదు. కానీ, ఇప్పుడు లక్షల మంది దాన్ని పెంచుకుంటామంటున్నారు. చదవండి: ఒక్క రూపాయి అయినా పంపండి ప్లీజ్: యాంకర్ రష్మీ -
నిద్ర లేస్తూనే గతం మర్చిపోయాడు.. భార్యను చూసి భయంతో
వాషింగ్టన్: మనిషికి మరుపు సహజం. మనిషి జీవితంలో మరుపు అనేది లేకపోతే.. జీవనం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే జీవితం సుఖదుఖాల సమాహారం. మధుర స్మృతులను గుర్తు పెట్టుకోవాలి.. మనసును బాధ పెట్టేవాటిని మరిచి పోవాలి. అవసరం లేనివాటిని మర్చిపోతే ఏం కాదు.. అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతే.. జీవితం ఎలా ఉంటుందో నాని భలే భలే మగాడివోయ్ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ మతి మరుపు ముచ్చట ఎందుకంటే.. నిద్ర లేస్తూనే ఓ వ్యక్తి తన గతం మర్చిపోయాడు. భార్యాబిడ్డలతో సహా తనను కూడా మర్చిపోయాడు. అద్దంలో తనను చూసుకుని ఆశ్చర్యపోయాడు. కాలచక్రం అతడిని తన 16వ ఏట నిలిపింది. దాంతో స్కూల్‌కు వెళ్లేందుకు రెడీ అవ్వసాగాడు. అతడి వింత ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ అరుదైన సంఘటన వివరాలు.. అమెరికా టెక్సాస్‌కు చెందిన డానియల్ పోర్టర్(37) హియరింగ్ స్పెషలిస్ట్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో పోర్టర్ ఓ రోజు నిద్ర నుంచి లేస్తూనే తన గతం మర్చిపోయాడు. తనని తాను 16 ఏళ్ల యువకుడిలా భావించాడు. తన భార్య రుత్, పదేళ్ల కూతురిని కూడా మరిచిపోయాడు. అద్దంలో తనని తాను చూసుకుని ‘‘నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నాను’’ అని ఆలోచించసాగాడు. ఇంతలో వారి గదిలోకి వచ్చిన భార్యను చూసి బిత్తరపోయాడు.. ఎవరని ప్రశ్నించాడు. పోర్టర్ ప్రవర్తనతో భయపడిన ఆమె.. తాను అతడి భార్యనని.. వారికి కొన్నేళ్ల క్రితమే పెళ్లయ్యిందని గుర్తు చేసింది. కానీ పోర్టర్ ఒప్పుకోలేదు. తాను ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లాడినేనని వాదించాడు. ఈ సందర్భంగా పోర్టర్ భార్య రుత్ మాట్లాడుతూ.. ‘‘ఉదయాన్నే అతడు నిద్రలేచాడు. నేను ఎవరో తెలియనట్లు చూశాడు. చాలా గందరగోళానికి గురయ్యాడు. మేము ఉన్న గదిని కూడా అతడు గుర్తుపట్టలేదు. బాగా తాగేసి ఆ ఇంటికి వచ్చేడా.. లేక తనను ఎవరో కిడ్నాప్ చేసి మా రూమ్‌లో బంధించారా అని భావించాడు. నా భర్త మా గది నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించడం నేను చూశాను’’ అని ఆమె ఓ వార్త సంస్థకు తెలిపింది. ఈ సందర్భంగా రూత్ మాట్లాడుతూ.. ‘‘ఆ తర్వాత పోర్టర్‌కి.. నేను తన భార్యను అనే చెప్పే ప్రయత్నం చేశాను. అయితే, అతడు ఇంకా 90వ దశకంలో ఉన్నట్లు భావించాడు. అద్దంలో చూసుకుని ఆగ్రహానికి గురయ్యాడు. నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నానని అరిచాడు. అతడు హియరింగ్ స్పెషలిస్ట్. అయితే, ఆ రోజు తన ఉద్యోగం, చదివిన చదువు.. అన్నీ మరిచిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపింది. పోర్టర్‌ని పరీక్షించిన వైద్యులు.. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీన్నే ‘షార్ట్ టెర్మ్ మెమరీలాస్’ అని కూడా అంటారన్నారు. 24 గంటల్లో సర్దుకుంటుందని తెలిపారు. అయితే, ఈ సమస్య వల్ల డానియల్ సుమారు 20 ఏళ్ల గతాన్ని మరిచిపోయాడు. దాంతో భార్య అతడు బాల్యంలో నివసించిన ఊరికి తీసుకెళ్లింది. అతడిని పాత స్నేహితులతో కలిపింది. చిత్రం ఏమిటంటే మెమరీ లాస్ తర్వాత అతడి ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. ఇదంతా జరిగి ఆరు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే అతడికి అన్నీ నెమ్మదిగా గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం పోర్టర్ థెరపీకి వెళ్తున్నాడు. -
మూడేళ్ల తర్వాత.. కరోనా కలిపింది
బెంగళూరు: కరోనా వల్ల అన్ని కష్టాలే కాదు.. కొంత మేలు కూడా జరిగింది అంటున్నాడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కరమ్ సింగ్(70). ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరమ్ సింగ్ మూడేళ్ల క్రితం కొడుకు వివాహానికి అవసరమైన డబ్బు సమకూర్చడం కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే రైల్వే స్టేషన్లో ఒక రైలు బదులు మరొకటి ఎక్కాడు. అలా కరమ్ సింగ్ బెంగళూరు చేరుకున్నాడు. కొత్త ప్రాంతం, భాష తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రోడ్ల వెంట నడుస్తూనే ఉన్నాడు. అలా మైసూరు చేరుకున్నాడు. అయితే ఈ కఠినమైన ప్రయాణం, ఆందోళన వల్ల అతడు మతి స్థిమితం కోల్పోయాడు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు తదితర వివారాలేం అతడికి గుర్తు లేవు. అలా మైసూర్ వీధుల వెంట తిరుగుతూ.. ఎవరైన ఏమైన ఇస్తే తింటూ.. ఫుట్‌పాత్ మీద జీవితం గడిపాడు. (భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం) ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం వీధుల వెంట ఉండే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపించింది. ఈ క్రమంలోనే కరమ్ సింగ్‌ను కూడా నంజరాజా బహదూర్ వృద్ధాశ్రమానికి తీసకెళ్లారు అధికారులు. అక్కడ మానసికవవైద్యులు కరమ్ సింగ్‌కు చికిత్స చేశారు. కొంత కాలంలోనే అతడి ఆరోగ్యం మెరుగవ్వడమే కాక జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడు. చికిత్స సమయంలో కరమ్ సింగ్ తాను ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చానని.. తన కుటుంబం వివరాలు తెలియజేశాడు. దాంతో మైసూర్ సిటీ కార్పొరేషన్ అధకారులు, పోలీసుల సాయంతో కరమ్ సింగ్ కొడుకును కాంటక్ట్ చేయగలిగారు. తండ్రి బతికే ఉన్నాడని తెలిసి అతను ఎంతో సంతోషించాడు. వెంటనే తండ్రిని ఇంటికి పంపిచాల్సిందిగా కర్ణాటక అధికారులను కోరాడు. (కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం!) ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘కరమ్ సింగ్ బతికి ఉన్నాడని తెలిసి అతడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. మూడేళ్లుగా అతడు కనిపించకపోవడంతో.. చనిపోయాడని భావించారు. అతడిని కుటుంబంతో కలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కరమ్ సింగ్‌ని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉత్తరప్రదేశ్ పంపిస్తాము’ అన్నారు అధికారులు.(కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!) -
‘మతి’ పోయింది..ఇపుడు ఓకే!
సావోపోలో : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (64) తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారట. ఈ విషయాన్నిస్వయంగా అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానేవుందని చెప్పొకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో చికిత్స అనంతరం తన అధికారిక నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. బొల్సొనారో అందించిన వివరాల ప్రకారం తన అధికారిక నివాసంలో జారి కిందపడటంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలింది. అల్వొరాడా ప్యాలెస్‌లో బాత్రూమ్లో జారిపడ్డారు. అయితే పడిపోయిన వెంటనే ఏమీ గుర్తు లేదు..జ్ఞాపకశక్తిని కోల్పోయాననీ అధ్యక్షుడు తెలిపారు. ఉదాహరణకు నిన్న ఏం చేశానో, ఏం జరిగిందో గుర్తు లేదు. ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగలుగుతున్నా..ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని బ్యాండ్ టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. కానీ వయసుతోపాటు, కత్తిపోటు (అధ్యక్ష పదవికి పోటీ సందర్భంగా 2018 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోదాడి చేశాడు) గాయం వల్ల కొన్ని సమస్యలు ఇంకా వున్నాయన్నారు. కాగాఈ ఏడాది జనవరిలో బొల్సొనారో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తి కడుపులో కత్తితో పొడిచారు. ఈ గాయానికి చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. అలాగే స్కిన్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నానని ఈ నెల ప్రారంభంలో బోల్సొనారో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
జిమ్‌కు వెళ్లండి... మతిమరపును దూరం చేసుకోండి
మీరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి అక్కడ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాల వల్ల మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్‌మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి పెద్దవయసులోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వందలాది మంది పెద్దవయసు వారిపై చాలాకాలంపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. -
పన్నెండేళ్లకు ఇంటికి చేరిన సావిత్రి
సాక్షి, నిజామాబాద్(జక్రాన్‌పల్లి): పన్నెండేళ్ల తర్వాత తల్లీబిడ్డలు కలుసుకున్న ఉద్విగ్న క్షణాలవి.. ఒకరినొకరు తనివితీరా చూసుకున్నారు..ఆలింగనం చేసుకున్నారు.. కన్నీరుమున్నీరయ్యారు.. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలో బుధవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన సావిత్రి రైలులో చెన్నై చేరగా అక్కడి రైల్వే పోలీసులు కోర్టుకు సరెండర్ చేశారు. కోర్డు ఆదేశాల మేరకు అధికారులు సావిత్రిని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో చేర్పించారు. ఆమె కూతురును బాలిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి చదువు చెప్పించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం సావిత్రి మామూలు స్థితికి రాగా అక్కడి వైద్యులకు తన వివరాలు తెలియ జేసింది. అక్కడి వైద్యులు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అం దించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిషన్ సావిత్రి రాక కోసం కృషి చేశారు. కుటుంబీకులు చెన్నై వెళ్లి సావిత్రిని తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను సావిత్రి గుర్తు పట్టింది. గతం గుర్తుందో లేదోనన్న వారు అనుమానాలను నివృత్తి చేసింది. గ్రామ సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు ఎస్ గంగారెడ్డి, వార్డు సభ్యులు అప్క సత్యం, సాయిలు ఇంటికి వెళ్లి సావిత్రి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ శ్రీనివాస్ సావిత్రికి ఆర్థిక సహా యాన్ని అందజేశారు. సావిత్రి భర్త లింగన్న గతంలో చనిపోయాడని కుటుంబీకులు తెలిపారు. సావిత్రికి ఇంటి నిర్మాణంతో పాటు పింఛను, రేషన్ సదుపాయం కల్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు. -
‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’
తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాల గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్‌లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్లో దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ‘మళంగ్’ చిత్రంలో నటిస్తున్నారు. -
ప్చ్.. మర్చిపోయా !
సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నేటి కాలంలో ప్రతి ఇంట్లో వినిపిస్తున్నమాట మరిచిపోయా.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు పుస్తకాలు, పెన్నులు, లంచ్‌బాక్స్ మరిచిపోయి నానా అగచాట్లు పడటం చూస్తుంటాం. కళాశాలలకు, ఉద్యోగాలకు వెళ్లే యువత పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రతి రోజూ బైక్తాళాలో, ఇతర వస్తువులో వెతుకుతూ తమ మతిమరుపుతనాన్ని తిట్టుకోవటం చాలా ఇళ్లలో కనిపిస్తూనే ఉంటోంది. ఉరుకుల, పరుగుల జీవితంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు మరుపు సమస్య సాధారణంగా మారింది. చదువులో వెనుకబడతామనే ఒత్తిడి, ఉద్యోగం రాదనే భయం, పని ఒత్తిడి, ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం పాతికేళ్లు దాటిన వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. మారిన ఆహార అలవాట్లతో పౌష్టికాహారం అందక తలెత్తే కొన్ని రకాల ఆనార్యోగాలు కూడా మతిమరుపునకు దారి తీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యుక్త వయస్సులోనే... మతిమరుపు సమస్యకు యుక్తవయస్సులోనే బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నారు. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామనే విషయం తెలీక అనారోగ్యంగా ఉందంటూ వైద్యులను సంప్రదిస్తున్నారు. రాజధాని యువతలో 20 శాతం మందికి మరుపు సమస్య ఉందని అంచనా. లోపిస్తున్న ఏకాగ్రత... యువతలో ఏకాగ్రత లోపిస్తుండటమే ఈ సమస్యకు మూల కారణమని తెలుస్తోంది. ఏదైనా అంశాన్ని వినడం, విన్నదాన్ని మదిలో నిలుపుకోవటం, దాన్ని తిరిగి చెప్పే అంశాల్లో తీవ్రమైన మార్పులొస్తున్నాయి. విన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు. ఇలానే మతిమరుపు సమస్య మొదలవుతోందని వైద్యులు చెబుతున్నారు. యువత చదివిన, తెలుసుకున్న విషయాలను గుర్తు పెట్టుకోకుండా సెల్ఫోన్లు, ట్యాబ్స్ వంటి గాడ్జెట్స్‌పై ఆధారపడటం, పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేయడం మతిమరుపునకు కారణమవుతున్నట్లు గుర్తించారు. ఆహార అలవాట్లు.. జ్ఞాపక శక్తి పెరగటానికి విటమిన్ బీ12 అవసరం. ఇవి లోపించినా మతిమరుపు పెరుగుతుంది. పౌష్టికాహారలేమి మెదడుపై ప్రభావం చూపుతుంది. రెడీ మేడ్ ఫుడ్, జంక్‌ఫుడ్ వంటివి మెదడు పనితీరును మందగించేలా చేస్తాయి. మానసిక సమస్యలు.. జ్ఞాపక శక్తి తగ్గిపోవటానికి, మానసిక సమస్యలు తలెత్తటానికి ఆందోళన కూడా ప్రధాన కారణమే. ఏ పని చేయాలన్నా ఆందోళన చెందటం,హడావుడి పెరగటంతో తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది మనసుపై ప్రభావం చూపుతుంది. పనిఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఏకాగ్రతతో సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మెదడుకు పని కల్పించాలి ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, యువతలో కూడా మతి మరుపు కనిపిస్తోంది. దీనికి జీవనవిధానంతో పాటు ఆహారపు అలవాట్లు, బీ12 విటమిన్ లోపం, ఏకాగ్రత లేకపోవడం కారణాలుగా మారుతున్నాయి. ఏ విషయాన్ని ఏకాగ్రతతో చేయకపోవటం ప్రతి పనికి సెల్‌ఫోన్‌పై ఆధారపడి మెదడుకు నికల్పించకపోవటంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పౌష్టికాహారం తీసుకోవటం, చెస్ ఆడటం, పజిల్స్ పూర్తి చేయటం, పుస్తక పఠనం వంటి వాటిని చేస్తుంటే మతిమరుపు కొంతమేర తగ్గుతుంది. –డాక్టర్ ఆర్.గోపీనాయక్, ప్రభుత్వ వైద్యుడు -
ఇతను నిజంగానే గజిని
సూర్య హీరోగా నటించిన గజిని సినిమా గుర్తుందా! తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రతి 15 నిమిషాలకు తన గతాన్ని హీరో మర్చిపోతుంటాడు. ఇలా నిజంగానే ఓ గజిని ఉన్నాడు. తైవాన్‌లో ఉండే అతని పేరు చెన్(26). సిన్చూ కౌంటీలో ఉంటున్న చెన్ను స్థానికులందరూ ‘నోట్‌బుక్ బాయ్’ అని పిలుస్తారు. తొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చెన్ తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో అతనికి షార్ట్‌టైం మెమొరి లాస్ సమస్య ఏర్పడింది. 5 నుంచి 10 నిమిషాల ముందు జరిగిన ఘటనలు మాత్రమే చెన్కు గుర్తుంటాయి. అంతకుముందు జరిగిన ఏ విషయమూ చెన్కు గుర్తుండదు. దీంతో రోజూ తాను చేసిన పనుల్ని చెన్ అక్షరబద్ధం చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు, తోటలో పనిచేయడం, మార్కెట్లో కూరగాయలు అమ్మడం.. ఇలా తాను చేసిన ప్రతీపనిని చెన్ ఓ పుస్తకంలో రాసిపెట్టుకుంటాడు. ఈ విషయమై చెన్ మాట్లాడుతూ..‘ఓసారి నా పుస్తకాల్లో ఒకటి కనిపించకుండా పోయింది. నేను చాలా బాధలో మునిగిపోయాను. కన్పించకుండాపోయిన నా నోట్‌బుక్‌ను తెచ్చివ్వాలని నాన్నను అప్పట్లో బ్రతిమాలాను’ అని అన్నాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సున్న చెన్ తన పెంపుడు తల్లి వాంగ్ మియో సియాంగ్(65)తో కలిసి ఉంటున్నాడు. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం చేసిన కొద్దిపాటి సాయానికి తోడు తమకున్న భూమిలో పండ్లు, కూరగాయలు సాగుచేస్తూ చెన్, అతని తల్లి జీవిస్తున్నారు. ఇంతకాలం తాను తోడుగా ఉన్నప్పటికీ, తానుపోయాక చెన్ను చూసుకునే వారు ఎవరూ లేరని తల్లి ఆందోళన చెందుతోంది. -
గుర్తుకు రావడం లేదు...!
ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు పెరిగిపోతున్నాయి... ప్రతీ ఏడాది దాదాపు కోటి వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు వాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వారు కూడా ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నట్టు తాజాగా కేసులు బయటపడడం పట్ల డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధదేశాల్లో ఐదు కోట్లకు పైగానే ఈ పేషంట్లు ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు తక్కువ, మధ్య ఆదాయ (లో అండ్ మిడిల్ ఇన్కమ్) దేశాల్లోనే (ప్రపంచబ్యాంక్ వర్గీకరించిన ఈ ఆదాయ దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలున్నాయి) నివసిస్తున్నారు. డిమెన్షియా పేషంట్ల సంఖ్య 2030 కల్లా ఎనిమిదిన్నర కోట్లకు, 2050 కల్లా 15 కోట్లు దాట వచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్‌ఓ) అంచనా. పరిష్కారం ఏమిటీ ? జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మాటల కోసం తడుముకోడం, తెలిసిన మనుషులను కూడా గుర్తించకలేకపోవడం, ఏవైనా వస్తువుల కోసం పదే పదే వెతుక్కోవడం, ఏవైనా సులభమైన కూడికలు కూడా చేయలేకపోవడం వంటివి అల్జీమర్స్ లక్షణాలు. అల్జీమర్స్‌తో పాటు ఇతర రూపాల్లోని చిత్తవైకల్యాన్ని డిమెన్షియాగా పరిగణిస్తున్నారు. మనదేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు అధికరక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఇలాంటి వారికి వయసు పెరిగే కొద్ది అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. సాథారణంగా 65 ఏళ్ల వయసు వారిలో ఇలాంటì లక్షణాలుæ కనిపిస్తున్నట్టు, ఓ సారి ఆల్జీమర్స్ బారిన పడ్డాక దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం మాత్రం సాధ్యం కాదని డా.నస్లీ ఇచ్ఛపోరియా అభిప్రాయపడ్డారు. అయితే దీని బారిన పడకుండా చురుకుగా చైతన్యవంతంగా వ్యవహరించడంలో మెదడు పనితీరు కీలకం అవుతుందని చెప్పారు. ఆరోగ్యపరిరక్షణకు మంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయమం. సామాజిక సంబంధాలు కలిగి ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో గడపడం, మనుషులను కలుసుకోవడం చేస్తుండాలని సూచించారు. ‘వాయుకాలుష్యం కూడా అల్జీమర్స్‌కు ఓ కారణంగా తెలుస్తోంది. గాలిలో కాలుష్యం శ్వాసకోస వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు భావిస్తున్నా, మెదడు కణాలు క్రమక్రమంగా బలహీనపడేందుకు, మెదడుకు అందే రక్తప్రసారం తగ్గిపోయేందుకు కారణమవుతోంది. వాయుకాలుష్యంలో భాగంగా ఉన్న లెక్కకు మించిన ర సాయనాలు మెదడు సరిగా పనిచేయకుండా చేస్తున్నాయి.’ అని డా.నస్లీ తెలిపారు. భారత్‌లో పౌరుల సగటు ఆయుర్ధాయం పెరుగుదల వల్ల కూడా పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతుండడంతో వారిలో అల్జీమర్స్‌కు కారణం అవుతోంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి లేనివారు, మెదడును చురుకుగా, చైతన్యవంతంగా ఉంచకుండా స్తబ్దుగా ఉండేవాళ్లు ఎక్కువగా అల్జీమర్స్ బారిన పడే అవకాశాలున్నాయి. మెదడును క్రియాశీలంగా ఉపయోగించకపోతే పెద్దవయసులో క్రమంగా మతిమరుపుతో పాటు అల్జీమర్స్‌లోని ఇతర లక్షణాల బారిన పడాల్సి వస్తుంది ’ అని డా. హేమంత్ సంత్ పేర్కొన్నారు. -
సెల్‌ఫోన్ వాడకంతో వారికి ప్రమాదం
బెర్నే : అతిగా సెల్‌ఫోన్ వాడే యుక్తవయస్కుల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువని అధ్యయనంలో తేలింది. మెదడు ఎక్కువగా రేడియేషన్‌కు గురికావటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ‘‘స్విస్ ట్రాపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్’ పరిశోధకుల బృందం తేల్చింది. యుక్తవయస్కులు ఎక్కువగా మొబైల్ ఫోన్లను, కంప్యూటర్లను వాడటం వల్ల డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఎక్కువవుతుందని తెలిపారు. ఈ భావనలు ఎక్కువగా యువతులలో కలుగుతాయని పేర్కొన్నారు. సెల్ఫోన్లను అతిగా వాడటం వల్ల వాటి నుంచి వెలువడే ‘‘రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమ్యాజ్నటిక్ ఫీల్ట్స్’’ తరంగాలు యుక్తవస్కులపై ఎక్కువ ప్రభావం చూపుతాయని వారు కనుగొన్నారు. సెల్ఫోన్లను తల కుడివైపు ఉంచి వాడటం వల్ల మెదడు కుడిభాగంలో కేంద్రీకృతమై ఉన్న ‘‘ఫిగరల్ మెమొరీ‘‘ దెబ్బతింటుందని వారు వెల్లడించారు. ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల, ఫోన్లో మాట్లాడుతున్నపుడు స్పీకర్లో ఉంచటం ముఖ్యంగా మెసెజ్‌లు పంపుతున్నపుడు, గేమ్స్ ఆడుతున్నపుడు, ఇంటర్నెట్ వాడుతున్నపుడు రేడియేషన్ తక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు. -
నిద్ర కరవైతే కోట్లు ఖర్చవుతాయి..
జనాలు సరిగ్గా నిద్ర పోకపోతే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది! ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి అనే సమస్య ఎక్కువవుతోందని.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందికి తగినంత నిద్ర లభించకపోగా.. మిగిలిన వారు వృత్తిపరమైన ఒత్తిడితో, సామాజిక, కుటుంబ కార్యకలాపాల కోసం నష్టపోతున్నారని.. ఇంకొందరు తెలిసో తెలియకో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు దాని ప్రభావం ఉత్పాదకతపై పడటంతోపాటు ఆరోగ్యసమస్యలకూ కారణమవుతోందని వీరు అంటున్నారు. తగినంత నిద్ర లేకపోతే త్వరగా కోపం రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ప్రతిస్పందించే సమయం తగ్గిపోవడం, సానుభూతి కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ రకమైన సమస్యలన్నింటి పర్యవసానాలు ఆర్థికంగా ఎలా ఉంటాయని ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్‌లు లెక్కకట్టారు. ఆరోగ్య ఖర్చులు, ప్రమాదాల వంటి వాటి వల్ల వచ్చే ఖర్చులు వంటివన్నీ లెక్కకడితే ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 1788 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు వీరు తేల్చారు. ఈ నష్టం ఒక్క ఆస్ట్రేలియాలోనే దేశ జీడీపీలో 1.55 శాతం వరకు ఉందని అంచనా. -
బాసూ.. మెమొరీ లాసూ!
సాక్షి, హైదరాబాద్: ఉరుకుల పరుగుల జీవితం...పని ఒత్తిడి.. నిద్రలేమి నేపథ్యంలో గ్రేటర్ సిటీజన్లకు మతిపోవడమే కాదు.. మతిమరుపు పెరుగుతోందట. మతిమరుపులో హైదరాబాద్ మహానగరం దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో నాలుగోస్థానంలో నిలిచినట్లు ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ ‘లాస్ అండ్ ఫౌండ్’ తాజా సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా గతేడాది తమ క్యాబ్ సర్వీసుల్లో రాకపోకలు సాగించిన ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను విశ్లేషించి, ఈ సర్వే వివరాలను తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో గ్రీన్ సిటీగా పిలిచే బెంగళూరు తొలిస్థానంలో, ఢిల్లీ రెండో స్థానంలో, మూడోస్థానంలో ముంబై నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో కోల్‌కతా, చెన్నై.. ఆ తర్వాతి స్థానాలు పూణే, జైపూర్, చండీగఢ్, అహ్మాదాబాద్ నగరాలు దక్కించుకున్నాయి. ప్రయాణాల్లోనే ఎక్కువగా.. భోజనం తరవాత భుక్తాయాసం, ప్రయాణంలో కునుకుపాట్ల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో..అదీ ప్రయాణం చేస్తున్న సమయంలోనే తమ వ్యక్తిగత వస్తువులను సిటీజన్లు పోగొట్టుకుంటున్నట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధిక ప్రయాణీకులు సెల్ఫోన్లు, బ్యాగ్‌లు, ఇళ్లు, ఆఫీసు తాళాలు పోగోట్టుకుంటున్నారట. మరికొందరు ఐడీ కార్డులు, కళ్లజోళ్లు, గొడుగుల వంటి వ్యక్తిగత వినియోగ వస్తువులను మరిచిపోతున్నట్లు తెలిపింది. మరికొందరైతే ఏకంగా బంగారు ఆభరణాలు, ఎల్సీడీ టీవీలు, పిల్లల ఆట వస్తువుల వంటివి తాము పోగొట్టుకుంటున్నట్లు తెలిపారని ఈ సర్వే ప్రకటించడం విశేషం. -
నిద్రలేమితో జ్ఞాపకశక్తి లోపం
వాషింగ్టన్: నిద్రలేమి కారణంగా మన జ్ఞాపకశక్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్రలేకపోతే మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస ్థ సక్రమంగా పనిచేయదని, అందువల్ల జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలుంటాయని నెదర్లాండ్‌లోని గ్రానింగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ హావెక్స్ తెలిపారు. నిద్రలేమి మెదడులోని నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఎలుకలపై శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన నిర్వహించారు. పరిశోధనలో భాగంగా రోజులో కనీసం ఐదు గంటల నిద్రలేకపోవడం ద్వారా మెదడులోని నాడీవ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో గుర్తించారు. నిద్రలేమితో మెదడులోని నాడీవ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని దీని ఆధారంగా కనుగొన్నారు. నిద్రలేమి కారణంగా ఎలుక మెదడులోని అణువులు సక్రమంగా పనిచేయకపోవడంతో అది నాడీవ్యవస్థపై ప్రభావం చూపిందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఆధునిక సమాజంలో నిద్రలేమి ఓ సాధారణ సమస్యగా మారిందని దాని ద్వారా ఆరోగ్య సంబంధమైన సమస్యలతోపాటు మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతోందని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త టెడ్ అబెల్ తెలిపారు. కాగా, ఈ పరిశోధన కు సంబంధించిన ఫలితాలు ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. -
మతిమరుపును తగ్గించే ఔషధం గుర్తింపు
న్యూయార్క్: అల్జీమర్స్.. పెద్ద వయసు వారిలో కనిపించే మానసిక వ్యాధి. ఇది సోకిన వారు క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఇప్పటివరకు దీనికి సరైన చికిత్సంటూ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో నయం చేయగలిగే మందులంటూ ఏవీ లేవు. కానీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారు తీసుకునే ఓ మందు అల్జీమర్స్‌ను కూడా అదుపు చేయగలదని పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. అవయవ మార్పిడి చేయించుకున్న వారు దుష్ర్పభావాలు సోకకుండా ఉండేందుకు తీసుకునే చికిత్స అల్జీమర్స్ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స తీసుకున్న 2,644 మంది అమెరికా రోగులను పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో ఎనిమిది మందిలో మాత్రమే మతిమరుపు సంబంధమైన లక్షణాలు కనిపించాయి. ఈ సమాచారాన్ని అల్జీమర్స్ అసోసియేషన్ ఫ్యాక్ట్స్, డాటా సమాచారంతో విశ్లేషించారు. దీని ద్వారా అవయవ మార్పిడి వల్ల దుష్ర్పభావాలు సోకకుండా చికిత్స తీసుకున్న వారిలో అల్జీమర్స్ తక్కువగా ఉన్నట్లు, కొందరిలో అసలు ఈ సమస్యే లేనట్లు వారు గుర్తించారు. మతిమరుపు రావడంలో కాల్షిన్యూరిన్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలో తీసుకునే ఔషధాలు ఈ ఎంజైమ్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా వీరికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.