Mercedes Benz car
-
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?!
దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు. వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపుకంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది. -
భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్‌ను పొందింది. ఎయిర్ ఇన్టేక్స్లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే గోవాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తాను కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్ ఈవీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. #TFNExclusive: Man of Masses @tarak9999 gets papped as he visits the RTO office for the registration of his new car!📸😎#JrNTR #Devara #TeluguFilmNagar pic.twitter.com/61cW1D74k9 — Telugu FilmNagar (@telugufilmnagar) April 2, 2024 -
ఇకపై చిన్న నగరాలకు మెర్సిడెస్ బెంజ్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ చిన్న నగరాలకు విస్తరించనుంది. జమ్ము, కాన్పూర్, పాట్నా వంటి 10 నగరాల్లో 20 వర్క్‌షాప్స్ ఏర్పాటు చేయనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ఇటువంటి నగరాల నుంచి లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సర్వీస్ కోసం కస్టమర్లు 2 గంటలకు మించి డ్రైవింగ్ చేయకూడదన్న ఆలోచనతో మినీ మెట్రోలపై దృష్టిసారించామని వివరించారు. ప్రస్తుతం ఇటువంటి మినీ మెట్రోలు, చిన్న మార్కెట్ల నుంచి తమ కంపెనీకి 30 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. కాగా, కొత్త జీఎల్ఏ ఎస్యూవీ, ఏఎంజీ జీఎల్ఈ 53 మోడళ్లను కంపెనీ బుధవారం ప్రవేశపెట్టింది. -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్..
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో విజన్ మేబ్యాక్ 6 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శించిన ఈ కొత్త కారు దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. 2016లో కాలిఫోర్నియాలోని పెబుల్ బీచ్‌లో అడుగుపెట్టి ఈ కారు దాదాపు 7 సంవత్సరాలకు దేశీయ విఫణిలో కనిపించింది. దాదాపు 6 మీటర్ల పొడవున్న ఈ కారు డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కావున ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ లైట్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, 24 ఇంచెస్ వీల్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ 80 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో 750 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక చార్జితో ఏకంగా 500 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ లగ్జరీ బెంజ్ కారు గురించి చాలా వివరాలు తెలియాల్సి ఉంది. -
ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరో సారి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ S680.. భారతదేశంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీలో కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్షిప్ సెడాన్. ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలను కార్ క్రేజీ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. ఇందులో కొత్త కారుని చూడవచ్చు. ఈ కారుతో పాటు రేంజ్ రోవర్ వోగ్ సెక్యూరిటీ కారు కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన రకుల్ ప్రీత్.. ధర ఎన్ని కోట్లంటే?
రకుల్ ప్రీత్ సింగ్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్‌వే 34', 'కట్ పుట్లి, 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన నటించింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) టాలీవుడ్లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం. తాజాగా ఈ ముద్దుగమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కారు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది భామ. అంతేకాకుండా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ లగ్జరీ బెంజ్ కారు విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. (ఇది చదవండి: హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?) View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఓ లుక్కేసుకోండి!
1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే.. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్‌హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు. జర్మనీలో స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! నిజానికి ఈ కార్లు లే మాన్స్‌లో రేసింగ్‌కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే?
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్‌వే 34', 'కట్ పుట్లి', 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్.. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది భామ. తెలుగులోనూ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిస వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!) తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ భామ.. సరికొత్త మెర్సిడెజ్ కారును తన గ్యారేజ్‌కు తీసుకొచ్చింది. ఆ వీడియోలో తన కారు పరిశీలిస్తూ కనిపించింది. రకుల్ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు విలువ దాదాపు రూ. 3.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ రకుల్ ప్రీత్ సెలెక్షన్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: కాజోల్‌తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్–బెంజ్ ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో మెర్సిడెస్కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్ కార్లలో ఎన్టీజీ 7 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో తయారైన జీఎల్సీ 300 4మేటిక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. -
విండీస్‌తో టెస్టుల్లో విఫలం! ఖరీదైన కారు కొన్న టీమిండియా క్రికెటర్.. ధర ఎంతంటే!
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. విలాసంతమైన మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఎస్‌యూవీకి యజమాని అయ్యాడు. కాగా 2010లో ఐపీఎల్లో అడుగుపెట్టిన సౌరాష్ట్ర క్రికెటర్ ఉనాద్కట్.. అదే ఏడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్లో టీమిండియా తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కట్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3, 9, 14 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ టూర్-2023లో భాగంగా టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన ఈ రైట్ ఆర్మ్ ఫాప్ట్బౌలర్.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. రూ. కోటి! విండీస్‌తో ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో కేసీ కార్టీ వికెట్ తీసి రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇక కరేబియన్ దీవి పర్యటన తర్వాత జయదేవ్ ఉనాద్కట్ తాజాగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ. కోటి వరకు Mercedes-Benz GLE SUVని అతడు సొంతం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న కారును ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఉనాద్కట్ క్రికెట్బాల్పై సంతకం చేసి షో రూం నిర్వాహకులకు ఇవ్వడం విశేషం. ఈ అత్యాధునిక కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. ఇక SUV కొనుగోలు చేసిన సందర్భంగా.. భార్యతో కలిసి కారు వద్ద ఉనాద్కట్ దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో 11.50 కోట్లు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2018 వేలం సందర్భంగా జయదేవ్ ఉనాద్కట్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయిన విషయం తెలిసిందే. ఈ పేసర్ కోసం రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఆ సీజన్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనాద్కట్ రికార్డు సృష్టించాడు. చదవండి: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
సెకండ్ హ్యాండ్ కారు కొన్న 'అత్తారింటికి దారేది' నటుడు..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్‌ను కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతని కుటుంబ సభ్యులతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్! ) అయితే బోమన్ ఇరానీ కొన్నకారు కొత్తదేం కాదు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కొత్త మోడల్ అయినప్పటికీ.. ఈ కారును సెకండ్ హ్యాండ్‌లోనే ఆయన కొనుగోలు చేశారు. చాలా మంది సెలబ్రిటీలు ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ కారును బోమన్ ఇరానీ తన ఇంటికి తీసుకెళ్లారు. ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటు ప్రీ-ఓన్డ్ కారును కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్లో, శిల్పాశెట్టికి ప్రీ-ఓన్డ్ కార్లంటే చాలా ఇష్టం ఆమె దాదాపు అన్ని లగ్జరీ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లే. కాగా.. బోమన్ ఇరానీ అత్తారింటికి దారేది కీలక పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) View this post on Instagram A post shared by Auto Hangar Advantage (@autohangar.advantage) View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!
ఆసియాలో అత్యంత ధనవంతుడు, ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ఇండస్ట్రీస్ (మార్కెట్ క్యాప్ రూ. 17.69 ట్రిలియన్లు) అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన కార్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటారు. తాజాగా మోస్ట్ సేఫెస్ట్, 'బుల్లెట్ ప్రూఫ్' మెర్సిడెస్ బెంజ్‌కారును ఆయన సొంతం చేసుకున్నారు. దీని విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. బిలియనీర్ అంబానీ కుటుంబ సభ్యులు లగ్జరీ ఎస్‌యూవీలు, ఖరీదైన కార్లతో పొడవైన కాన్వాయ్‌లలో ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా మెర్సిడెస్-బెంజ్-S680 గార్డ్ బుల్లెట్‌ప్రూఫ్ సెడాన్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ మోడళ్లలో ఒకటి ఎస్ 680 గార్డ్ సెడాన్. ఇటీవల అంబానీకి బెదిరింపులు ఎక్కువైన తరుణంలో ఈ కొత్త కారు ప్రత్యేకతలు విశేషంగా నిలుస్తున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్ ) CS12 Vlogs షేర్ చేసిన వీడియోలో కాన్వాయ్‌తో పాటు, కొత్త బుల్లెట్‌ప్రూఫ్ కారులో చూడవచ్చు. ఇది ఇతర మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాగానే కనిపిస్తుంది. కానీ సాధారణ సెడాన్ కంటే దాదాపు 2 టన్నుల బరువు ఎక్కువ . అలాగే దీని బాడీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ షెల్‌ను కలిగి ఉంది. కారులో బుల్లెట్, బ్లాస్ట్ ప్రూఫ్, మల్టీ-లేయర్ గ్లాస్ ఉన్నాయి. మెషిన్ గన్లు కాల్పులనుంచి రక్షించే కెపాసిటీ ఉన్న కారిది. (ఐఆర్సీటీసీ డౌన్, యూజర్లు గగ్గోలు!) కేవలం తుపాకీ కాల్పుల తాకిడికి మాత్రమే తట్టుకోగలదని అనుకుంటే పొరపాటే. ఇదిగ్రెనేడ్ల దాడిని కూడా తట్టుకోగలదు. అంతేకాదు ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సూపర్-ఖరీదైన కారు రీన్ఫోర్స్డ్ టైర్లతో వస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో దూసుకుపోతుంది. ఈ కారు 6.0-లీటర్ V12 ఇంజన్‌తో 612 పవర్‌ను, 830 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కాన్వాయ్‌లో రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో జీ–క్లాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
Kiara Advani: ఖరీదైన కారు కొన్న కియారా.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ కియారా అద్వానీ పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్గా అగ్ర హీరోలతో సినిమాల్లో నటించిది. కొద్ది నెలల క్రితమే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో అత్యంత వైభవంగా ఈ ప్రేమజంట వివాహం జరిగింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) కాగా.. కియారా సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని సమాచారం. ఇటీవలే భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జపాన్ టూర్‌కు వెళ్లిన భామ ఇండియాకు తిరిగొచ్చింది. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) కాగా.. టాలీవుడ్లో మెగా తనయుడు రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ చిత్రంలో కనిపించనుంది. కియారా నటించిన సత్యప్రేమ్ కి కథ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. -
నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు
ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్‌లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. -
ఖరీదైన కారు కొన్న 'చిరుత' బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ నటి నేహా శర్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో క్రూక్ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత వరుసగా యమ్లా పగ్లా దీవానా 2, సోలో, తాన్హాజీతో సహా పలు చిత్రాలలో నేహా శర్మ కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ. కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మ ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. నేహా శర్మ దాదాపు రూ.1.09 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) నేహా తన ట్విటర్లో రాస్తూ..'మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం. భగవంతుడు మనపట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వారి పెంపుడు కుక్కతో కలిసి తన కొత్త కారును ఇంటికి స్వాగతించారు. కొత్త కారుకు కొబ్బరికాయ కొట్టేందుకు నేహా శర్మ, చెల్లెలు ఐషా శర్మ ఇబ్బంది పడ్డారు. కాగా.. నేహా 'క్రూక్', 'క్యా సూపర్ కూల్ హై హమ్', 'యమ్లా పగ్లా దీవానా 2', 'యంగీస్తాన్', 'తుమ్ బిన్ 2', 'తాన్హాజీ' వంటి అనేక చిత్రాలలో నటించింది. త్వరలోనే నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'జోగిరా సారా రా' చిత్రంలో నటించనుంది. ఇందులో సంజయ్ మిశ్రా, మహాఅక్షయ్ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. May we keep working hard and May God always be kind to us and may we be forever grateful ..#gratitude 🙏 @aishasharma25 pic.twitter.com/DnTFho1wa8 — Neha Sharma (@Officialneha) April 4, 2023 -
కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్
టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్‌టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎంజి జిఎల్సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం) మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?) ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi) -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మిర్చి సింగర్.. ఎవరికో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్. అతను పలు భాంగ్రా, పాప్, సినీ గీతాలు ఆలపించి ఫేమస్ అయ్యారు. సుప్రసిద్ధ పంజాబీ సింగర్ దలేర్ మెహంది తమ్ముడు మికా సింగ్. అతని తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావడం వల్ల మికా కూడా ఆ రంగం పట్ల ఆకర్షితుడయ్యాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన వాయిస్ వినిపించాడు. తాజాగా మికా సింగ్ తన స్నేహితునికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. తన అత్యంత సన్నిహితుడైన కన్వల్ జీత్ సింగ్‌కు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు మికా సింగ్. స్నేహితుని కారును ఇచ్చిన అతని కలను నెరవేర్చాడు సింగర్ మికా. మికా తన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేస్తూ.. ' మేం ఎప్పుడు ఏదో ఒకటి కొనుగోలు చేస్తుంటాం. కానీ మీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి ఆలోచించరు. కానీ నా స్నేహితుడు ఈ ఆనందానికి అర్హుడు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మికా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీది చాలా పెద్దమనసు ఉంటూ ప్రశంసిస్తున్నారు. సింగర్ మికా ప్రేమకు కన్వల్ జీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. కన్వల్ దీత్ సింగ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము కలిసి 30 ఏళ్లు అయింది. అతను కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు. అంతకు మించి మేము జీవితాంతం సోదరులం. నా ఫేవరేట్ కారును బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీది చాలా గొప్పమనసు. ఈ బహుమతిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను.' అంటూ కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ నటి.. ధరెంతో తెలుసా?
ప్రముఖ బుల్లితెర నటి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. బాలీవుడ్ భామ, అనుపమ నటి రూపాలీ గంగూలీ దాదాపు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన కల నిజమైందని రూపాలీ తెలిపింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అత్యధిక పారితోషికం రూపాలీ తన భర్త అశ్విన్ వర్మ, కుమారుడు రుద్రాంశ్ వర్మతో కలిసి షోరూమ్‌లో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా.. రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటిగా పేరు సంపాదించింది. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్','మోనిషా సారాభాయ్' 'అనుపమ'లో సీరియల్స్‌లో రూపాలి నటించారు. రూపాలీ ప్రారంభంలో రోజుకు రూ.1.5 లక్షలు తీసుకోగా.. ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు తీసుకుంటోంది.'సంజీవని'లో డాక్టర్ సిమ్రాన్ చోప్రా పాత్రను కూడా పోషించారు. ఆ తరువాత 2006లో రియాల్టీ షో బిగ్ బాస్‌లో పోటీదారుగా పాల్గొన్నారు. అనుపమ సీరియల్లో రూపాలి పరిపూర్ణ గృహిణి, తల్లిగా నటిస్తోంది.'అనుపమ'లో సుధాన్షు పాండే, గౌరవ్ ఖన్నా, అనేరి వజని, మదాల్సా శర్మ, అల్పనా బుచ్, అరవింద్ వైద్య నటించారు. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. పంత్ ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్‌కు వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతని కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంత్‌ను అదే మార్గంలో హరిద్వార్ వెళ్తున్న బస్ డ్రైవర్ సునీల్ కారులో నుంచి బయటకు లాగారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలాంటి ప్రమాదాల నుంచి యూజర్లను కాపాడేందుకే యాపిల్ సంస్థ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగిస్తున్న యూజర్లు రోడ్డు ప్రమాదాలకు గురైతే అత్యవసర సేవలకు కనెక్ట్ అయ్యేందుకు సహాయ పడుతుంది. యాపిల్ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అంటే ఏమిటి? క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది సెడాన్లు, మినీవ్యాన్లు,ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కులు, ఇతర ప్యాసింజర్ కార్లతో కూడిన ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్ వంటి కారు ప్రమాదాల్ని గుర్తించేందుకు సహాయపడుతుంది. ఆ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ 14 మోడల్స్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఎస్ఈ (2వ తరం), యాపిల్ వాచ్ ఆల్ట్రా తాజా వెర్షన్ వాచ్ఓఎస్లో సైతం అందుబాటులోకి వచ్చింది. కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఐఫోన్ 14 మోడల్‌లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్‌గా ఆన్ ఆవుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగుతుంది. ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చూపిస్తుంది. వెంటనే ఫోన్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ల స్లైడర్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసే పరిస్థితుల్లో లేరంటే 20 సెకన్లలో అదే నెంబర్‌కు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రమాదంలో ఉన్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు, దగ్గరలో ఉన్న హాస్పటల్స్‌కు వాయిస్ కాల్స్ వెళతాయి. -
మెర్సిడెస్ బెంజ్‌కు ఏమైంది? హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు క్రాష్ ఫోటో వైరల్
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం తరువాత మెర్సిడెంజ్ బెంజ్‌కు చెందిన మరో లగ్జరీ కారు ప్రమాదానికి గురి కావడం ఆందోళన రేపుతోంది. సుమారు రూ.1.6 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రమాదానికి గురైంది. ముంబైలో ప్రమాదానికి గురైన ఈ కారు ఫోటోలను కార్ రివ్యూ సంస్థ టీం బీహెచ్పీ షేర్ చేసింది. ముఖ్యంగా కారు ముందుభాగం, బంపర్ ధ్వంసమైన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏమైంది బెంజ్‌కార్లకు అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి. (అమెజాన్‌లో పింక్ స్లిప్స్ కలకలం, వేలమందిపై వేటు!) మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారును మెర్సిడెస్-బెంజ్ ఈ ఏడాది కొంత కాలం క్రితం భారత మార్కెట్లో పరిచయం చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయింది. ఒక్కరోజులోనే భారత మార్కెట్ నుంచి 300 ఆర్డర్లను సాధించింది. జర్మనీ మినహా ఇండియాలో మాత్రమే లభ్యమవుతున్న దీని ధర రూ. 1.55 కోట్లకు పైమాటే. 107.8 kWh బ్యాటరీ సామర్థ్యంతో దేశంలో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకంటే ఎక్కువగా సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 857 కిలోమీటర్ల మైలేజీతో 4.1 సెకన్లలో 100 కిమీ/గం వరకు దూసుకుపోతుందని రిలీజ్ సందర్బంగా బెంజ్ వెల్లడించింది. ఇదీ చదవండి: ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? -
మెర్సిడెస్ ఈవీ,మేడ్ ఇన్ ఇండియా.. ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఈక్యూఎస్ 580 4మేటిక్ తయారీ ప్రారంభించింది. జర్మనీ వెలుపల భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం. 14వ మేడిన్ ఇండియా మోడల్‌గా ఈక్యూఎస్ 580 4మేటిక్ నిలిచింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్‌లో అత్యధిక దూరం ప్రయాణించే కారుగా ఇది స్థానం దక్కించుకుంది. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లో 15 నిముషాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించ గలిగే స్థాయిలో చార్జింగ్ పూర్తి అవుతుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.55 కోట్లు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి
అషురెడ్డి.. సోషల్ మీడియా యాజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్ షోతో రాత్రి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న ఆమె తరచూ తన హాట్‌హాట్ ఫొటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఇలా నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో ఆమె ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన కూడా పడింది. ఇదిలా ఉంటే గురువారం ఆమె పుట్టిన రోజు. సెప్టెంబర్ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా తన తండ్రి నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందుకుంది అషు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అషు బర్త్‌డే సందర్భంగా ఆమె తండ్రి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D అనే మోడల్ కారును బహుమతిగా ఇచ్చాడు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. ఇక తండ్రితో కలిసి కారు ముందు ఫోజులు ఇచ్చిన ఫొటోలు ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇక దీనికి ‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్ప్రైజ్’ అంటై బ్లూ హాట్ ఎమోజీని జత చేసింది. కాగా బర్త్‌డే సందర్భంగా అషు అందుకున్న ఈ బహుమతి కారు ఖరీదు దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు ఫుల్ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నానంది. ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోతుంది. ఇక ఆమె పోస్ట్‌పై తన ఫాలోవర్స్ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu)