Nampally Court
-
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు ఊరట
-
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట
సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court ) ఊరట కల్పించింది. పలు షరతులతో ఆయనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు తాజాగా వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది.అల్లు అర్జున్ (Allu Arjun) గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా అక్కడికి వెళ్లారు. దీంతో కాస్త ఇబ్బంది వాతావరణం అక్కడ కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లడం వల్ల సెక్యూరిటీ పరంగా పలు ఇబ్బందులు వస్తున్నాయని కోర్టులో ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. తాజాగా విచారించిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయస్థానం కోరింది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు)పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్ (చిక్కడపల్లి)లో హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ అంశంలో ఆయనకు సడలింపు ఇచ్చింది.డిసెంబర్ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీతేజ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అల్లు అర్జున్ పరామర్శించి వచ్చారు. బాలుడికి కావాల్సిన వైద్య సదుపాయం అల్లు అర్జున్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రేవతి కుటుంబానికి పుష్ప2 చిత్ర యూనిట్ రూ. 2 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
-
నాంపల్లి కోర్టుకు 'అల్లు అర్జున్'
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అల్లు అర్జున్ వ్యక్తిగతంగా సమర్పించనున్నారు.సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడం వల్లే తోపులాట జరిగిందని ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడంతో పాటు రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఆపై సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. -
అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్
సిటీ కోర్టులు (హైదరాబాద్): పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్‌కు శుక్రవారం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్ (చిక్కడపల్లి)లో హాజరు కావాలని ఆదేశించింది. డిసెంబర్ 5న జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఘటనపై రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ను ఏ–11గా చేర్చిన పోలీసులు.. సెక్షన్ 105, 118(1), రెడ్‌విత్ 3(5) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి్రస్టేట్ జడ్జి నిర్మల 14 రోజుల రిమాండ్ విధించారు. కానీ హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ఈనెల 10న పూర్తికానుండగా.. అల్లు అర్జున్ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో డిసెంబర్ 26న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును వాయిదా వేసిన జడ్జి వినోద్‌కుమార్.. శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇదిలా ఉండగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై ఈనెల 21 వాదనలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాదులు మీడియాకు తెలిపారు. -
A1 పెద్దరామిరెడ్డి, A2 చిన్న రామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
-
తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా రెగ్యులర్ బెయిల్ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.ఏం జరిగింది?డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్, అతడి టీమ్‌తో పాటు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్‌పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.చదవండి: అల్లు అర్జున్‌కు నేడు బెయిల్ లభించనుందా.. ? -
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. జనవరి మూడో తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఇక, ఈరోజు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద రేవతి మృతిచెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్బంగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి. ఇదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరిన పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈరోజు ఇరు వర్గాల వాదనల అనంతరం, తీర్పును వచ్చే నెల మూడో తేదీకి కోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు..సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు..రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదు..బీఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్‌కు వర్తించదు.ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు మధ్యంతర ఇచ్చింది.రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి.పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు..రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణం..అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది..ఆయనకు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తాడు..బెయిల్ ఇస్తే పోలీసుల విచారణకు సహకరించడు..అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి. ఇక, సంధ్యా థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ప్రస్తుతం హైకోర్టు బెయిల్‌తో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయినా అల్లు అర్జున్. డిసెంబర్ 13వ తేదీన అల్లు అర్జున్‌కు హైకోర్టు.. నాలుగు వారాల మద్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. -
నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్ హాజరు
హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రమేయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యా రు. ఈ కేసులో ఏ–11గా ఉన్న ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. జ్యుడీషియల్ రిమాండ్ గడువు శుక్రవారం ముగియడంతో ఆయన కోర్టు కు నేరుగా హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రాంగణానికి భారీగా అభిమానులు రావొచ్చని అంచనా వేసిన పోలీసులు.. ఆయన్ను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జడ్జి నిర్మల జనవరి 10కి వాయిదా వేశారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో ఆయన తరఫు న్యా యవాదులు నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ కోరడంతో అంగీకరించిన జడ్జి వినోద్‌కుమార్ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
-
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, బన్నీ పిటిషన్ దాఖలుపై కౌంటర్ వేసేందుకు ప్రభుత్వం తరపున ఉన్న న్యాయవాది సమయం కోరారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 30కి వాయిదా పడింది.సంధ్య థియేటర్ ఘటనలో ఆన్లైన్ ద్వారా నాంపల్లి కోర్టు విచారణలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. -
నాంపల్లి కోర్ట్ కు అల్లు అర్జున్
-
నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ ఆన్లైన్ ద్వారా హాజరుకానున్నారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలో బన్నీని చంచల్‌గూడ జైలుకు కూడా తరలించారు. అయితే, అదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.అయితే, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ నేటితో పూర్తి అవుతుంది. రిమాండ్ గడువు పూర్తి అయిన తర్వాత జరిగే ప్రాసెస్‌లో భాగంగా అల్లు అర్జున్ వర్చువల్‌గా కోర్టులో హాజరుకానున్నారు. ఆపై ఆయన తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు హాజరై అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలపనున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి రూ.2కోట్ల సాయం పుష్ప2 టీమ్ అందించింది. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు అందించిన విషయం తెలిసిందే. రేవతి కుమారుడు శ్రేతేజ్ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఇప్పటికే వైద్యులు కూడా ప్రకటించారు. -
లగచర్ల ఘటనలో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్
-
లగచర్ల కేసు: పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. లగచర్ల కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనతో సహా మరో 24 మంది నిందితులకు బెయిల్ లభించింది.లగచర్ల కేసులో నిందితులు దాదాపు నెలకు పైగానే జైల్లో ఉన్నారు. మరోవైపు మూడు నెలలపాటు ప్రతీ బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పట్నంకు రూ.50వేల షూరిటీ, అలాగే మిగతా వాళ్లకు రూ.20వేలతో రెండు షూరిటీలు సమర్పించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 11వ తేదీన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయన్ని హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. -
ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు: అల్లు అర్జున్ తరపు లాయర్
-
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
హైదరాబాద్, సాక్షి: సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. ‘‘ఇది అక్రమ అరెస్ట్. బీఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్‌కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్‌కు అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు.ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్ ఖాన్ గుజరాత్ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్‌కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకెళ్లారు. ఇది చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇది మరీ టూమచ్!అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్ లాయర్.. మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై అల్లు అర్జున్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’హైకోర్టులో వాదనలు ఇలా.. ‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమే. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్ మంజూర చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని, గతంలో బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు?.సెక్షన్ 105, 118(1)లు అల్లు అర్జున్‌కు వర్తిస్తాయా? అని అడిగారు. 👉పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. అల్లు అర్జున్ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్ పిటిషన్ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అల్లు అర్జున్‌కు రిమాండ్ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అన్నారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు. యాక్టర్ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం. కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్ మంజూరు చేయాలంటూ చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
-
HYD: కౌశిక్‌రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్‌రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్‌రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
కేటీఆర్‌పై పరువునష్టం కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరువునష్టం కేసు దాఖలైంది. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి శనివారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది.షోధా కన్స్ట్రక్షన్ కంపెనీతో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డి తన సొంత బావ అని, అందుకే షోధా కంపెనీకి రూ.2 కోట్ల లాభాన్ని ఇచ్చారని, అర్హతలేని కాంట్రాక్టులను పొందానని కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ కంపెనీలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను ఆ సంస్థకు డైరెక్టర్‌ను కూడా కాదని చెప్పారు. ఈ సంస్థకు ఎండీగా కందాల దీప్తిరెడ్డి ఉన్నారని సృజన్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ పేరుతో రూ.1,137.77 కోట్ల ప్రజా ధనాన్ని వృ«థా చేశారంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేశారన్నారు. -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
కోర్టులో కొండా కౌంటర్..
-
కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన కోర్టు.. ఇవాళ మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది.కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. ఇలా మొత్తం 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈకేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. -
కేటీఆర్ 30 నిమిషాల స్టేట్ మెంట్.. కొండా సురేఖకు చురకలు..
-
కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందా.. కోర్టులో కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ చేసిన అసత్య ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణ నిమిత్తం.. ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ హజరయ్యారు. ప్రస్తుతం కోర్టు కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి,బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌లు వెళ్లారు. కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్అమెరికాలో ఆరేళ్లు చదువుకున్నానుచదువు పూర్తి అయ్యాక ఇండియా కు తిరిగి వచ్చానుభారత్కు వచ్చాక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది2006 ఆగస్ట్ కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారుమళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి2006 నుంచి 2009వరకు తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీగా పనిచేశానుతెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశాను 2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలో గెలిచానుఐదుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాను2014లో నేను మంత్రి గా పనిచేశాను2023 వరకు నేను మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్న కొండాసురేఖ నాపై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసిందినాపై ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిందిఆమె చేసిన వాఖ్యలు సమాజంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందిఆమె చేసిన వాఖ్యలు అనేక ప్రచార మధ్యమాల్లో ప్రచారం అయ్యాయినా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ చేసానని వాఖ్యలు చేశారుఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వాఖ్యలు చేశారునేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు ఆరెంజ్ చేస్తా అని కొండా సురేఖ వాఖ్యానించారుసాక్షులు నాకు 18 సంవత్సరాలుగా తెలుసుసాక్షులు కొండా సురేఖ వాఖ్యలను టీవీలో చూసి వారు నాకు ఫోన్ చేశారుకొండ సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజంలో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నదికొండ సురేఖ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వాఖ్యలు చేసి నాతో పాటు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేశారురాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి వాఖ్యలు చేశారుతనపై సమాజంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టాలను దిగజార్చాలానే అలాంటి వాఖ్యలు చేశారుఅన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించానుయూట్యూబ్ లింక్స్, పేపర్ స్టేట్ మెంట్స్ అన్ని కోర్టుకు ఇచ్చానుచట్ట ప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ గురించి కొండా సురేఖ ఏం మాట్లాడారు అని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలు ఉన్నాయని కేటీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కాపీలోని వివరాల్నే ప్రామాణికంగా తీసుకోవాలా ? స్టేట్మెంట్ ఇస్తారా ? మరోసారి కోర్టు వివరణ అడిగింది. అందుకు స్పందించిన కేటీఆర్.. కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని వివరంగా చెప్పమంటే చెప్తాను అని అన్నారు. అందుకు కోర్టు అనుమతించగా.. కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కేటీఆర్ చదివి వినిపించారు. నాగ చైతన్య విడాకులకు నేను కారణం అని ఆమె అన్నారుఎన్కన్వెన్షన్ విషయంలో సమంత, నా గురించి లేని పోని విధంగా మాట్లాడారునేను ఫోన్లు ట్యాప్ చేశానని వ్యాఖ్యానించారునేను ఒక డ్రగ్ బానిస అని, ఇతరులను డ్రగ్ తీసుకునేలా ప్రేరేపించనని ఆమే వ్యాఖ్యానించారునా వల్ల పెళ్లిల్లు బ్రేక్ అవుతున్నాయనీ ఆమె అన్నారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుందని కోర్టు తెలిపింది. తర్వాత కేటీఆర్ తరుఫు సాక్షుల స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేయడం ప్రారంభించిందికొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ మనస్తాపంఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలో కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను తీవ్ర మనస్తాపం చెందానని,కొండా సురేఖపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.కేటీఆర్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, అందుకు కేటీఆర్ కొంతసమయం అడిగారు. దీంతో విచారణను నాంపల్లి స్పెషల్ కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. కేటీఆర్ ఈ రోజు కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇస్తున్నారు.