national cricket academy
-
రంజీ క్రికెట్ కింగ్ రషీద్
గుంటూరు వెస్ట్: విజయాలకు అడ్డదారులుండవు. కఠోర సాధనతోపాటు క్రమశిక్షణ ఎంతటి వారినైనా విజయతీరాల వైపు నడిపిస్తాయని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నిరూపిస్తున్నాడు. ఇంతై వటుడింతై అన్నట్లు అండర్–14 చిన్నారుల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి వారితో క్రికెట్ ఆడే అవకాశాల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం మరో విశేషం. దాదాపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాకు రంజీ సారథ్యం లభించడం విశేషం. ఎంఎస్కే ప్రసాద్ తర్వాత రషీదే కావడం గమనార్హం. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ వరకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆడే ప్రతి జట్టుకు నమ్మదగిన బ్యాటర్‌గా చక్కని సేవలందిస్తున్నాడు. రెండేళ్ల నుంచి చైన్నె సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు స్థానిక ఎన్జీఓ కాలనీలో కుటుంబంతో జీవిస్తున్నాడు.జీవితాన్ని మార్చేసిన అండర్–19 భారత జట్టు స్థానం2021లో అండర్–19 భారత జట్టులో రషీద్ స్థానం సంపాదించడంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. దీంతోపాటు చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపికవ్వడమే కాకుండా ఇండియా –డి జట్టుకు సారథ్యం వహించి తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు 274 పరుగులు సాధించాడు. 2022లో కోల్కొత్తాలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్, ఏషియన్ పోటీలోనూ చక్కగా రాణించాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు.కొహ్లి ఆటంటే ఎంతో ఇష్టంరషీద్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావులేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఔటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్‌లో సరి చేసుకుంటాడు. దీని కోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్‌కు విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్. కోహ్లి ఆడే విధానం, అతడి దృఢ చిత్తం గొప్పవరమని రషీద్ అంటాడు. కోహ్లి ఆటతోపాటు ఫిట్‌నెస్‌పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్‌కు మార్గదర్శకాలని కితాబునిస్తాడు. -
భారత క్రికెట్లో ‘కొత్త’ కళ
దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం భారత వర్ధమాన క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు, అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ ఇచ్చేందుకు బీసీసీఐ బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ని ఏర్పాటు చేసింది... నగరం నడి»ొడ్డున చిన్నస్వామి స్టేడియం ఆవరణలోనే ఇంతకాలం అది కొనసాగింది...క్రికెట్లో వస్తూ వచి్చన మార్పుల నేపథ్యంలో మరింత అధునాతన సౌకర్యాలతో దానిని విస్తరించాలని భావించిన బోర్డు నగర శివార్లలో 2008లోనే భూమిని కొనుగోలు చేసింది. కానీ వేర్వేరు కారణాలతో దాని ఏర్పాటు ఆలస్యం కాగా... ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత అద్భుత సౌకర్యాలతో అది సిద్ధమైంది. జాతీయ క్రికెట్ అకాడమీనుంచి పేరు మార్చుకొని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా క్రికెటర్లకు అందుబాటులోకి వచి్చంది. బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బీసీఈ)ని అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. భారత సీనియర్ జట్టుకు వివిధ సిరీస్‌లకు ముందు క్యాంప్‌లు, యువ ఆటగాళ్లకు శిక్షణ, గాయపడిన క్రికెటర్లకు చికిత్స, స్పోర్ట్స్ సైన్స్, రీహాబిలిటేషన్... ఇలా అన్నింటి కోసం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో, ఇంగ్లండ్‌లోని లాఫ్బారోలో ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుంటూనే భారత్‌లో అలాంటి కేంద్రం కావాలని భావించిన బోర్డు దీనిని సిద్ధం చేసింది. 16 ఏళ్ల క్రితమే భూమిని తీసుకున్నా...వివిధ అడ్డంకులతో పని సాగలేదు. తుది అనుమతులు 2020 చివర్లో రాగా, కోవిడ్ కారణంగా అంతా ఆగిపోయింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 2022లో పని మొదలు పెట్టి ఇప్పుడు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీఏను దశలవారీగా ఇక్కడకు తరలిస్తారు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశేషాలు... → మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. తాజా నిర్మాణంలో 33 ఎకరాలను వాడుకున్నారు. తర్వాతి స్థాయిలో విస్తరణ కోసం మరో 7 ఎకరాలను ఖాళీగా ఉంచారు. → ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా ఫస్ట్ క్లాస్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించగలిగే మూడు పెద్ద మైదానాలు అందుబాటులో ఉన్నాయి. మూడు భిన్న స్వభావం ఉన్న పిచ్‌లు మన ఆటగాళ్లు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యేందుకు పనికొస్తాయి. → ప్రధాన గ్రౌండ్లో ఆధునిక తరహా ఫ్లడ్లైట్లతో పాటు సబ్ ఎయిర్ డ్రైనేజ్ వ్యవస్థ, మ్యాచ్‌ల ప్రసారానికి ఏర్పాట్లు, మొత్తం 13 పిచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి తెప్పించిన ఎర్ర మట్టితో ఈ పిచ్‌లు రూపొందించారు. ఇక్కడి బౌండరీ 85 గజాల దూరంలో ఉండటం విశేషం. → మిగతా రెండు గ్రౌండ్లను ప్రధానంగా ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు. దక్షిణ కర్ణాటకలోని మాండ్యానుంచి, ఒడిషా నుంచి తెప్పించిన నల్లరేగడి మట్టితో మొత్తం 20 పిచ్‌లు తయారు చేశారు. ఇక్కడ బౌండరీ 75 గజాలుగా ఉంది. → మొత్తం 9 వేర్వేరు భాగాలుగా విభజించి 45 అవుట్డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్‌లు అందుబాటులో ఉంచారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఏరియా దీనికి అదనం. → ఇండోర్ ప్రాక్టీస్ మైదానంలో ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను పోలిన ఎనిమిది ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్నాయి. → నాలుగు ప్రత్యేక అథ్లెటిక్ ట్రాక్‌లు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. బీసీఈలోని ఉన్న సౌకర్యాలను మునుŠుమందు క్రికెటేతర ఆటగాళ్లు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కలి్పస్తామని...ముఖ్యంగా ఒలింపియన్లు ఇక్కడ సిద్ధమయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని జై షా వెల్లడించారు. నేను ప్రపంచంలో ఇలాంటి ఎన్నో సెంటర్లకు వెళ్లాను. కానీ ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవు. భారత క్రికెటర్లందరి కోసం ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తాము అన్ని రకాలుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశం ఉంది. ఈ క్రమంలో మన జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్ టీమ్‌గా ఎదుగుతుంది. ఇకపై అండర్–15 స్థాయి ఆటగాళ్ల మొదలు సీనియర్ వరకు ఏడాది పాటు నిరంతరాయంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైంది మూడు భిన్నమైన పిచ్‌లు ఉండటం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడినా దాని కోసం ఒకే వేదికపై సిద్ధమయ్యే అవకాశం ఇది కలి్పస్తుంది. –వీవీఎస్ లక్ష్మణ్, బీసీఈ హెడ్ -
బెంగళూరులో కొత్త ఎన్సీఏ.. ప్రారంభం ఎప్పుడంటే?
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా నిర్మితమైన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. బెంగళూరు నగర శివారులో సువిశాలమైన ప్రాంగణంలో అత్యున్నత సదుపాయాలతో నిర్మించిన ఎన్సీఏను ఈనెల 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా జరగనుంది. ఈ మీటింగ్ అజెండాలో కార్యదర్శి ఎన్నిక అంశం లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ కానుంది. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ నెలాఖరుదాకా ఉంది. డిసెంబర్ 1 తర్వాతే జై షా ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో అప్పటిదాకా బోర్డు కార్యదర్శిగా ఆయన కొనసాగుతారు. దీంతో ఎన్నికపై ఇప్పుడప్పుడే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశమే లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎప్పట్లాగే బోర్డు వ్యవహారాలు, ఆదాయ–వ్యయాలు, వార్షిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని బోర్డు అధికారులు చెప్పారు. -
రాహుల్ ద్రవిడ్ గల్లీ క్రికెట్..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మిస్టర్ డిఫెండ్బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్సీఏ హెడ్‌గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW— Johns. (@CricCrazyJohns) August 11, 2024 -
NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే!
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్సీఏ హెడ్‌గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్‌తక్ పేర్కొంది.సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్‌ను ముగించారు.ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్}మరోవైపు.. 2021లో ఎన్సీఏ హెడ్‌గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.అతడి స్థానంలో ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌తో మరోసారి మాట్లాడనున్నారు.అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్‌కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ మెంటార్‌గా రీ ఎంట్రీ?కాగా ఎన్సీఏ హెడ్‌గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
NCA: వీవీఎస్ లక్ష్మణ్ సైతం గుడ్‌బై!.. కారణం?
భారత క్రికెట్ మేనేజ్మెంట్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీ కాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ టీ20 మెగా టోర్నీ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేందుకు ద్రవిడ్ అంగీకరించాడు.ఈ క్రమంలో అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు కోరగా అందుకు అతడు నిరాకరించాడనే వార్తలు వినిపించాయి. అనంతరం రేసులోకి దూసుకొచ్చిన మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితుడు కావడం దాదాపుగా ఖరారైపోయింది.కాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలో 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఎన్సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు.లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోనున్నట్లు సమాచారం. అయితే, కుటుంబానికి సమయం కేటాయించే క్రమంలో అతడు తన కాంట్రాక్టును పునరుద్ధరించుకునేందుకు సిద్ధంగా లేడని తెలుస్తోంది.ఎన్సీఏ హెడ్‌గా తప్పుకొన్న తర్వాత కామెంట్రీ చేయడంతో పాటు ఐపీఎల్ మెంటార్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా 2013- 2021 వరకు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే.కాగా ఎన్సీఏ చైర్మన్‌గా తన పదవీకాలంలో వీవీఎస్ లక్ష్మణ్ అబ్బాయిలు, అమ్మాయిల క్రికెట్లోని అన్ని కేటగిరీలపై దృష్టి సారించి జూనియర్ నుంచి సీనియర్ లెవల్ వరకు రాటుదేలేలా శిక్షణ ఇవ్వడంలో సఫలీకృతమయ్యాడని చెప్పవచ్చు. అదే విధంగా.. గాయపడిన ఆటగాళ్ల పునరావాసం, త్వరగా వాళ్లు కోలుకునేలా సహాయక సిబ్బందిని సరైన మార్గంలో నడిపించాడు. ఈ మేరకు ది టెలిగ్రాఫ్ తన కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో సెమీస్ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతున్న రోహిత్ సేన.. సోమవారం నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. చదవండి: కోహ్లి, రోహిత్‌లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. కెప్టెన్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్ ఐపీఎల్ 2024లో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని ఎన్సీఏ క్లీన్ చిట్ ఇచ్చింది. రాహుల్ మరో రెండు రోజుల్లో జట్టుతో కలుస్తానడి పేర్కొంది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో రాహుల్ కేవలం బ్యాటర్‌గా మత్రమే కొనసాగాలని కండీషన్ పెట్టింది. ప్రస్తుతం రాహుల్ వికెట్‌కీపింగ్ భారాన్ని మోస్తే అతని గాయం తిరగబెట్టవచ్చని హెచ్చరించింది. కాగా, రాహుల్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా రాహుల్ ఆ సిరీస్‌లోని తదుపరి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా కూడా గాయపడిన రాహుల్ ఈ సీజన్‌కు కూడా దూరమవుతాడని అంతా అనుకున్నారు. అయితే అతను ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో త్వరగా కోలుకుని త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ సీజన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. లక్నో సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో లక్నో.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. -
శ్రేయస్ అయ్యర్ నాటకం?.. బండారం బయటపెట్టిన ఎన్సీఏ!
NCA email claims Shreyas Iyer "fit and available": ‘‘జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలంటే.. ముఖ్యంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందే’’.. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారడన్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా జారీ చేసిన అల్టిమేటం. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న ఆటగాళ్లు తప్ప ప్రతి ఒక్కరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని జై షా కుండబద్దలు కొట్టాడు. అయినా.. ఇషాన్ బోర్డు ఆదేశాలను పట్టించుకోలేదు. డొమెస్టిక్ టీమ్ జార్ఖండ్ తరఫున బరిలో దిగనూ లేదు. తాజాగా శ్రేయస్ అయ్యర్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇషాన్లా నేరుగా కాకుండా ‘ఫిట్నెస్’ను అడ్డుపెట్టుకుని నాటకాలకు తెరతీశాడంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ 2023-24 సీజన్లో ముంబై తరఫున బరిలో దిగాడు అయ్యర్. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. కానీ.. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు నుంచి అయ్యర్‌ను తప్పించగా.. వెన్నునొప్పి కారణంగానే అతడు జట్టుకు దూరమయ్యాడని వార్తలు వినిపించాయి. వెన్నునొప్పి.. ఆడలేను ఆ తర్వాత నాలుగో టెస్టుకు ప్రకటించిన జట్టులోనూ అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ముంబై తరఫున క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలోకి దిగాలని బోర్డు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను వెన్నునొప్పితో బాధపడుతున్న కారణంగా రంజీ మ్యాచ్ ఆడలేనని శ్రేయస్ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో బరోడాతో ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌కు అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని రిపోర్టు ఇచ్చాం. తాజాగా అతడు ఎటువంటి గాయాల బారిన పడలేదు. టీమిండియా నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా అతడికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు’’ అని ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ తన ఇ-మెయిల్లో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం.. ఫిట్‌గా ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ రంజీ బరి నుంచి వైదొలగడానికి నాటకం ఆడాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ చేసిన స్కోరు వరుసగా.. 35, 13, 27, 29. చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..? -
ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ..
Ranji Trophy 2023-24- Mumbai: టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు మైదానంలో దిగనున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఆగష్టులో పృథ్వీ షా గాయపడ్డాడు. మెకాలి నొప్పి కారణంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఇప్పట్లో రాడంటూ వార్తలు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ క్రమక్రమంగా కోలుకున్నాడు. అయితే, పృథ్వీ షాకు ఇప్పట్లో రిటర్న్ టు ప్లే(ఆర్టీపీ) సర్టిఫికెట్ లభించకపోవచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో మరికొన్నాళ్లపాటు అతడు ఆటకు దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పృథ్వీ షా గురించి అప్డేట్ అందించాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశాయి. ‘‘బీసీసీఐ జాతీయ అకాడమీ పృథ్వీ షాకు ఆర్టీపీ సర్టిఫికెట్ జారీ చేసింది. బుధవారమే దీనిని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు కూడా పంపించింది. ఎన్సీఏ నెట్స్‌లో అతడు బాగా ప్రాక్టీస్ చేశాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. సెలక్ట్ చేశామన్న సెక్రటరీ మరోవైపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజింక్య నాయక్ పృథీ షా రీఎంట్రీని ధ్రువీకరించాడు. షాను జట్టులో చేర్చామని.. ముంబై తరఫున తదుపరి మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా అజింక్య రహానే కెప్టెన్సీలో ఫిబ్రవరి 2 నుంచి ముంబై.. బెంగాల్‌తో మ్యాచ్ మొదలుపెట్టనుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా పేరొందిన పృథ్వీ షా టీమిండియాలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయాడు. ఇక షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్ టీమిండియాలో రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా పాతుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియా స్టార్ ఓపెనర్‌కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్‌లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్‌కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్‌మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
శ్రేయస్ అయ్యర్ ఇరగదీశాడు.. 199 పరుగులు..!
త్వరలో జరుగనున్న ఆసియా కప్-2023 కోసం భారత సెలెక్టర్లు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరంగా ఉన్న అయ్యర్ ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుని టీమిండియాకు ఎంపికయ్యాడు. అయ్యర్ ఎంపిక, అతని ఫిట్‌నెస్‌పై పలువురు మాజీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీకి చెందిన ఓ కీలక అధికారి ఈ అంశాలపై వివరణ ఇచ్చాడు. అయ్యర్‌తో పాటు గాయం నుంచి కోలుకుని ఆసియాకప్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడని స్పష్టం చేశాడు. ప్రోటోకాల్ ప్రకారం బెంగళూరులోని ఎన్సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇరువురు చాలా చరుగ్గా కనిపించారని, వారిద్దరిలో మునుపటి కంటే అధికమైన ఉత్సాహం కనిపించిందని తెలిపాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 150కిపైగా బంతులను ఎదుర్కొని 199 పరుగులు చేశాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా అయ్యర్ 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడని వెల్లడించాడు. ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఓ ఆటగాడు ఇంతకంటే ఏం చేయాలని ప్రశ్నించాడు. అయ్యర్‌తో పాటు రాహుల్ కూడా 100 శాతం ఫిట్నెస్ సాధించారని, ఎన్సీఏలో వారిద్దరూ గత రెండునెలలుగా కఠోరంగా శ్రమించారని తెలిపాడు. రాహుల్, అయ్యర్లు పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే సెలెక్టర్లు హడావుడిగా వారిని ఆసియాకప్‌కు ఎంపిక చేశారన్నది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. ఎన్సీఏలో ఫిట్నెస్ ప్రామాణికాలు చాలా కఠినంగా ఉంటాయని, ఇక్కడ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడమంటే ఆషామాషీ విషయం కాదని తెలిపాడు. ఇకనైనా రాహుల్, అయ్యర్ల ఎంపికపై అనవసర రాద్దాంతాలు మానాలని, వారివురు పూర్తి ఫిట్‌గా ఉన్నందుకే వారి ఎంపిక జరిగిందని స్పష్టం చేశాడు. కాగా, వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఎంపిక హడావుడిగా జరిగిందని పలువురు మాజీలతో పాటు కొందరు నెటిజన్లు సైతం అనుమానిస్తున్నారు. అయితే, తాజాగా ఎన్సీఏ అధికారి వివరణతో అంతా మిన్నకుండిపోయారు. ఇదిలా ఉంటే, ఈనెల 30వ తేదీ నుంచి ఆసియా కప్-2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 6 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్ జరుగనుంది. లంకలోని పల్లెకెలె స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్.. ఇదే మైదానంలో టీమిండియాను ఢీకొంటుంది. -
బెంగళూరుకు పయనమైన రోహిత్, కోహ్లి.. వాళ్లంతా వచ్చేది అప్పుడే!
Asia Cup 2023: ఆసియా కప్-2023 నేపథ్యంలో టీమిండియా సన్నాహకాలు మొదలయ్యాయి. జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు భారత జట్టు ఆటగాళ్లు పయనమయ్యారు. విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ ఆరంభం కానుంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో పాటు స్టాండ్ బైగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరమై జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం పునరావాసం పొందుతున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ఈవెంట్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో ఏడాది కాలంగా ఆటకు దూరమైన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే పునరాగమనం చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో భాగంగా.. ఘనంగా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక బుమ్రా నేతృత్వంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా బుధవారం నాటి ఆఖరి టీ20 ముగిసిన తర్వాత భారత్‌కు పయనం కానుంది. వీరి సంగతి ఇలా ఉంటే.. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బెంగళూరుకు చేరుకుంటున్నారు. మిగతా వాళ్లు కూడా వచ్చిన తర్వాత ఆగష్టు 29 వరకు ట్రెయినింగ్ క్యాంపు నిర్వహించనుంది బీసీసీఐ. ఆసియా కప్-2023కి ఎంపికైన జట్టులోని సభ్యులు మాత్రమే ఈ శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ మార్గదర్శనంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సెప్టెంబరు 2న శ్రీలంకలో పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది చదవండి: Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్ -
Asia Cup 2023: గ్రౌండ్లో దిగిన రోహిత్ శర్మ.. ఫొటోలు వైరల్
Rohit Sharma Pics Goes Viral: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగాడు. గ్రౌండ్లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్.. ఆసియా వన్డే కప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో చివరిగా రోహిత్ వన్డే మ్యాచ్ ఆడాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన ఈ ముంబైకర్.. 1-0తో జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్, కోహ్లి భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్ ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ ప్రాక్టీస్ కోసం కేటాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్, షార్ట్స్‌లో జాగింగ్ షూ వేసుకుని రోహిత్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఆసియా కప్ టోర్నీకి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆగష్టు 23న అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లుతో కూడిన భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగష్టు 18న మొదలైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
హ్యాపీ బర్త్‌డే మచ్చా.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు: పంత్ భావోద్వేగం
Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే మచ్చా.. థాంక్యూ ‘‘కొంచెం బ్లర్‌గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్సీఏకు పంత్‌ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. కాగా ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్‌కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్!'
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్‌కు ఎంపిక కావడంతో బ్యాటింగ్‌లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
వరల్డ్ కప్ కి రిషబ్ పంత్ రీఎంట్రీ ..!
-
కొత్త పొద్దుపొడుపు
అవును... భారత క్రికెట్లో ఇది కొత్త పొద్దుపొడుపు. దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్–19 టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతలుగా నిలిచిన క్షణాలు అలాంటివి. షఫాలీ వర్మ సారథ్యంలో తెలుగమ్మాయి సునీత గొంగడి సహా 15 మంది సభ్యుల టీనేజ్ బాలికల జట్టు తమ విజయంతో దేశ మహిళా క్రికెట్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్వయంగా దక్షిణాఫ్రికాకు వచ్చి ఫైనల్‌కు ముందు స్ఫూర్తి నింపిన ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా సహా అందరి ఆశలనూ, అంచనాలనూ నిజం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పురుషులకు సమానంగా మహిళలకూ వేతనమివ్వాలని గత అక్టోబర్ చివరలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన వేళ... తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏర్పాటైన క్షణాన... వీస్తున్న మార్పు పవనాలకు ప్రపంచ కప్ సాధన ఓ కొత్త జోడింపు. సరిగ్గా 40 ఏళ్ళ క్రితం 1983లో పురుషుల ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత భారత క్రికెట్ మరింత మెరుగైన రీతిలో సమూలంగా మారిపోయింది. తాజాగా మన బాలికలు సాధించిన విజయం మన మహిళా క్రికెట్‌కు సరిగ్గా అలాంటి ఉత్ప్రేరకమే. గతంలో మన మహిళా క్రికెట్ జట్టు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరింది. అయితే, ఏ ఫార్మట్‌లోనైనా మన మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ సాధించడం ఇదే తొలిసారి. బీసీసీఐ మహిళా క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో ఈ విజయం ఒక కొత్త ఉత్సాహం, ఊపునిచ్చాయి. విరాట్ కోహ్లీ తదితరులది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం కాగా, షఫాలీ వర్మ సారథ్యంలోని అండర్–19 వరల్డ్ ఛాంపియన్ బాలికలను రానున్న డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్) తరం అనుకోవచ్చు. 2008 బాలుర అండర్–19 వరల్డ్ కప్‌లో కోహ్లీ బృందం ఇలాగే విజయం అందుకుంది. అదే సమయంలో ఐపీఎల్ రావడంతో రాత్రికి రాత్రి పలువురు లక్షాధికారులయ్యారు. ఆటకు అవతార మూర్తులై, ఇంటింటా పాపులర్ అయ్యారు. భారత క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు మన బాలికల జట్టు ప్రపంచ ఛాంపి యన్లుగా అవతరించిన సమయానికి డబ్ల్యూపీఎల్ కొత్తగా వచ్చింది. త్వరలో తొలి డబ్ల్యూపీఎల్ వేలంతో ఈ క్రికెటర్లలో కొందరు లక్షాధికారులు కానున్నారు. కష్టాలు కడతేరి, ఆర్థిక, సామాజిక హోదా మారిపోనుంది. ఈ మ్యాచ్‌ల ప్రసార హక్కులు, పలు ఫ్రాంఛైజీల బిడ్లు దాదాపు రూ. 5.5 వేల కోట్ల పైగా పలికినట్టు వార్త. మహిళా క్రికెట్‌కు ఇవి బంగారు క్షణాలంటున్నది అందుకే. అయితే, ఎన్ని లీగ్‌లు వచ్చినా అంతిమంగా అగ్రభాగాన నిలిపేది ప్రతిభే. భారత అండర్–19 బాలికల క్రికెట్ జట్టు ఈ ఐసీసీ వరల్డ్ కప్‌లో మొదటి నుంచి తన సత్తా చాటుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆట మెరుగుపరుచుకుంటూ ఆస్ట్రేలియా (ప్రాక్టీస్ మ్యాచ్‌లో) సహా అనేక జట్లను అధిగమించి, ఫైనల్స్‌కు చేరింది. కప్ సాధించింది. మన బాలికల క్రికెట్ ఈ వరల్డ్ కప్ ఘనత సాధించడం వెనుక ఆటగాళ్ళతో పాటు పలువురి పాత్ర ఉంది. జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) శ్రద్ధ, మహిళా కోచ్ నూషిన్ అల్ ఖదీర్ అసాధారణ అంకితభావం లాంటివి అండగా నిలిచాయి. పద్ధెనిమిదేళ్ళ క్రితం వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత సీనియర్ మహిళా జట్టులో సభ్యురాలైన నూషిన్ ఆకలిగొన్న పులిలా బరిలోకి దిగి, ఈ టీనేజ్ బాలికలను తీర్చిదిద్దారు. పోటీలోని వివిధ జట్ల క్రికెటర్ల కన్నా ప్రతిభావంతులుగా నిలిపారు. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది. కాలగతిలో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యంతో బాలికలు ఉరకలెత్తుతున్నారు. దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగవుతున్నాయనడానికి ఇది ఓ సూచన. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్ అనేక శృంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో ఈ తొలి అండర్–19 టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు... మొత్తం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే కీలక మలుపు. దేశంలో ఆడపిల్లలకు ప్రత్యేక క్రికెట్ అకాడెమీలు వెలుస్తున్న రోజులివి. ఈ విజయం వాటికి కొత్త ఉత్తేజం. విజేతలకు ఆత్మవిశ్వాసం పెంచే ఔషధం. పురుషులకు భిన్నంగా తగిన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా అవమానాలు ఎదురైనా, ఆర్థిక – సామాజిక అవరోధాలున్నా – అవన్నీ దాటుకొని వచ్చిన స్త్రీలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఇది... కూతురు సోనా యాదవ్ క్రికెట్ షూస్ కోసం అదనపు షిఫ్ట్‌లు పనిచేసిన గ్లాస్ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆడబిడ్డ త్రిష శిక్షణ కోసం ఉద్యోగం వదిలి భద్రాచలం నుంచి హైదరాబాద్ మారిన తండ్రి... ఇలా ఎందరో తల్లితండ్రుల త్యాగఫలం. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇది తాజా దర్పణం. బ్యాడ్మింటన్ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్ కొత్త దీపశిఖ. దీన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేయాల్సింది ఆటల సంఘాలు, అధికారంలోని పెద్దలే. -
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-ఏ జట్టు హెడ్ కోచ్‌గా సితాన్షు కోటక్
అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని భారత-ఏ జట్టు రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటన వెళ్లనుంది. ఈ సిరీస్‌కు భారత-ఏ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ పర్యటనకు భారత-ఏ జట్టు హెడ్‌కోచ్ వివియస్ లక్ష్మణ్ దూరమయ్యాడు. వివియస్ లక్ష్మణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత సీనియర్ జట్టుకు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతాలే కూడా న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు గుజరాత్ మాజీ బ్యాటర్, నేషనల్ క్రికెట్ ఆకాడమీ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌ను భారత-ఏ జట్టు హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. అతడితో పాటు బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ఈ సిరీస్‌లో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా నవంబర్ 29న ఇరుజట్ల మధ్య తొలి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం భారత సీనియర్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. తొలి నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ షెత్ రెండో నాలుగు రోజుల మ్యాచ్‌కు భారత-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్, యశస్వి జైస్వాల్, యష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, అతిత్ శేథ్, ఛెతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, కేఎస్ భరత్! చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
అడుగులో అడుగు వేస్తున్న జడ్డూ.. వీడియో వైరల్
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలీ సర్జరీ అనంతరం ఎన్సీఏ క్యాంప్‌లో కోలుకునే పనిలో ఉన్నాడు. కాగా కుడి మోకాలికి బ్యాండేజీతో ఉన్న జడేజా ఫిట్నెస్ రూంలో మెళ్లిగా అడుగులు వేస్తూ కనిపించాడు. అయితే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్ చేసిన రవీంద్ర జడేజా ''పాపా-పగిలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మోకాలి గాయంతో రవీంద్ర జడేజా అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఆసీస్, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లకు దూరమైన జడేజా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనుండడంతో ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. కాగా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తున్నాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అక్షర్ పటేల్.. రానున్న టి20 ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) చదవండి: దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్! -
ఆసియా కప్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లకు ఫిట్నెస్ టెస్ట్..!
ఆసియా కప్ 2022 కోసం యూఏఈకు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ పరీక్షలకు హాజరు కానున్నారు. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 18న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. అక్కడ వారికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించునున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మెరకు.. "ఆసియా కప్‌లో పాల్గొనే భారత బృందం ఆగస్టు 18న నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. వారు అక్కడ ఫిట్నెస్ పరీక్షలను ఎదుర్కొనున్నారు. ఇది ఆటగాళ్ల విరామం తర్వాత తప్పనిసరి ప్రోటోకాల్. ఇక ఆగస్టు 20న మా జట్టు ఆటగాళ్లు దుబాయ్‌కి బయలుదేరుతారు. అక్కడకి చేరుకున్నాక పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనున్నాము" అని అతడు పేర్కొన్నారు. మరోవైపు జింబాబ్వే వన్డే, ఆసియా కప్ రెండు జట్లులోను భాగమైన దీపక్ హుడా, అవేష్ ఖాన్ ఆగస్టు 22న సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి దుబాయ్‌కు చేరుకుంటారు. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28 తలపడనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్! ఇక కష్టమే! -
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దీంతో అతడు కరీబియన్ దీవులకు ఆదివారం పయనమయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కుల్ధీప్ వెల్లడించాడు. త్వరలో కరేబియన్‌లో కలుద్దాం, నా సహచర ఆటగాళ్లతో చేరడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ఇనస్టాగ్రామ్ ఖాతాలో కుల్దీప్ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్, ఇంగ్లండ్ పర్యటనకు అతడు దూరమయ్యాడు. అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. ఈ క్రమంలో విండీస్‌తో వన్డే సిరీస్‌కు కాకుండా టీ20 సిరీస్‌కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీ20 సిరీస్‌కు ముందు కుల్దీప్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది అని జట్టు ఎంపిక సమయంలో సెలక్షన్ కమిటీ పేర్కొంది. ఇక తాజాగా కుల్ధీప్ యాదవ్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "ఆదివారం( జులై 24) కుల్ధీప్కు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాం. అందులో అతడు ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి నేరుగా ట్రినిడాడ్‌కి పయనమయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. ఇక వన్డే సిరీస్ అనంతరం ఐదు టీ20ల్లో విండీస్‌తో భారత్ తలపడనుంది. చదవండి: IND vs WI: వన్డేల్లో వెస్టిండీస్ ఓపెనర్ అరుదైన ఫీట్.. నాలుగో ఆటగాడిగా..! -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న రాహుల్.. వీడియో వైరల్..!
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తెగ కష్టపడుతున్నాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్‌కు అఖరి నిమిషంలో రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న రాహుల్ తిరిగి విండీస్ సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే ఈ సిరీస్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలంటే రాహుల్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఫిట్నెస్ సాధించేందుకు జిమ్‌లో చేస్తున్న వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా విండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు,5 టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్ ప్రారభం కానుంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ చదవండి: NZ vs IRE 2nd T20: ఐర్లాండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కైవసం..! View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) -
గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్!
గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గాయం కారణంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన రాహుల్ ఆఖరి నిమిషంలో దూరమైన విషయం తెలిసిందే. అనంతరం అతడు గత నెలలో స్పోర్ట్స్ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. కాగా త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రాహుల్ పునరాగమనం చేయనున్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు కాకుండా టీ20 సిరీస్‌కు రాహుల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే అతడు తన ఫిట్నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాహుల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చెమటోడ్చుతున్నాడు. సన్నాహాల్లో భాగంగా భారత మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బౌలింగ్‌లో రాహుల్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని నెలలగా గాయం కారణంగా జట్టుకు దూరమైన ఝులన్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. జూలన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆడింది. చదవండి: Lendl Simmons : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! K L Rahul is batting and Jhulan Goswami is bowling. He is fully fit for West Indies tour 💙🔥 #MenInBlue 📍NCA, Bangalore#KlRahul #IndvsWI #INDvsEND pic.twitter.com/UAfCxhdimc — 𝘛𝘶𝘴𝘩𝘢𝘳 ⚡ (@TUSHARBAGGA1M) July 18, 2022 -
టీమిండియా టి20 తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రధాన కోచ్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్లనుండటంతో తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ఆడిన తర్వాత జూన్ 19న భారత్ ఐర్లాండ్‌కు పయనమవుతుంది. అక్కడ జూన్ 26, 28 తేదీల్లో డబ్లిన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. చదవండి: Rashid Khan: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? చక్కగా నిద్రపో! -
VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్‌నయ్యా..
అబిడ్స్:చిన్నప్పటి నుంచే అభిరుచికి అనుగుణంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన బౌలింగ్ మిషిన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ అంటోనితో కలిసి ప్రారంభించారు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదవడం తన అదృష్టమన్నారు. చిన్నప్పుడే స్కూల్లో విద్యతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా ఎదిగానన్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అయినా చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రికెట్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ ఆంటోని మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో రాణించేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ జాకబ్, అజిత్, రమేష్, బ్రిజ్ మోహన్, పుణ్యవతి, సంపత్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.