Nepal
-
శభాష్ షెర్పా
అవమానాలే అవకాశాలుగా మలచుకుని, తండ్రి స్ఫూర్తితో ‘పర్వతా’లంత కీర్తి సాధించాడు నేపాల్‌కు చెందిన పర్వతారోహకుడు నిమా రింజి షెర్పా. తాము కేవలం సహాయకులమే కాదనీ, పర్వతాలనూ అధిరోహించగలమని నిరూపిస్తూ ప్రపంచంలో 8వేల మీటర్ల పైచిలుకు ఉన్న పర్వతాలను ఎక్కి ‘షెర్పా’ కీర్తి పతాకను రెపరెపలాడించాడు. తాజాగా చైనాలోని శిషాపంగ్మా శిఖరాగ్రానికి చేరుకున్న అతి పిన్నవయస్కుడిగా రికార్డ్ సాధించాడు. నేపాల్‌లోని హిమాలయ పర్వత సాణువుల్లో ‘షెర్పా’ సామాజిక వర్గం పర్వతారోహకులకు సహాయకులుగా ఉంటారు. తరచూ వారి నుంచి ‘షెర్పా’ సామాజిక వర్గానికి చీత్కారాలు ఎదురయ్యేవి. చిన్నప్పటి నుంచి వీటిని కళ్లారా చూసిన రింజి, ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. పర్వతారోహకుల నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. ఆక్రమంలోనే 2022లో తన 16 ఏట మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు . – ఏపీ సెంట్రల్ డెస్క్‌మరిన్ని పర్వతాల అధిరోహణ..2022లో మౌంట్ మనస్లు (8163మీ) శిఖరాన్ని అధిరోహించడం ద్వారా అతి పిన్న వయసులో ఈ పర్వతాన్ని ఎక్కిన యువకుడిగా రికార్డు సాధించాడు. అనంతరం మే 2023లో 17 సంవత్సరాల వయసులో కేవలం 10 గంటల వ్యవధిలో మౌంట్ ఎవరెస్ట్ (8848.86మీ), మౌంట్ లోట్సే (8516మీ) పర్వతాలను అధిరోహించడంతో అతని కెరీర్లో అతి పెద్ద విజయాన్ని సాధించినట్లయింది.స్ఫూర్తినిచ్చిన విజయం..తాను సాధించిన విజయాలను బాటలుగా ఎంచుకుని 2023 జూలైలో మౌంట్ గాషెర్బ్రీమ్–1 (8068మీ), మౌంట్ గషెర్బ్రీమ్–2 (8035మీ), మౌంట్ బ్రాడ్‌పీక్ (8047మీ), మౌంట్ కె–2 (8611మీ), సెప్టెంబర్‌లో మౌంట్ ధౌలగిరి (8167మీ), అక్టోబర్‌లో చో–ఓయు పర్వతం (8188మీ)లను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. కలతచెందిన మనసుఅయితే శిషాపంగ్మా పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో హిమపాతం కారణంగా నలుగురు అధిరోహకులు మరణించడంతో తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. దీనిపై స్పందిస్తూ మరణించిన నలుగురిలో తనకు ఒకరు స్నేహితుడని, అతడితో కలిసి పాకిస్తాన్లో ఐదు పర్వతాలను అధిరోహించినట్లు తెలిపాడు. తనకు మార్గదర్శిలాంటివాడని, కానీ హిమపాతంలో చిక్కుకుని మరణించడం మనసును కలచివేసిందని రింజి షెర్పా చెప్పాడు. ఇక 2024 ఆరంభంలో మళ్లీ పర్వతారోహణకు అవకాశం రాగా, ఏప్రిల్‌లో మౌంట్ అన్నపూర్ణ (8091), మే 4లో మకాలు (8485మీ) పర్వతాలను అధిరోహించగా, తాజాగా శిషాపంగ్మాను అధిరోహించడం ద్వారా రికార్డు నెలకొల్పాడు. -
Kukur Tihar: శునకాల పండుగ
కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి మరుసటి రోజును ‘కుకుర్ తిహార్’ పేరుతో శునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు శునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో ఉంది.నేపాల్‌లో శునకాల మీద ప్రేమ బాల్యం నుంచి నేర్పిస్తారు. అక్కడ దీపావళి పండుగ ఐదు రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు దీపావళి అయితే రెండోరోజు ‘కుకుర్ తిహార్’. అంటే శునకాల పండుగ. ఆ రోజున శునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తారు. ‘పిల్లలూ... మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతోపాటే ఉంటుంది. మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. అంతేకాదు... మనం చనిపోయాక స్వర్గం వరకూ దారి చూపించేది అదే. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాలి. కుకుర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి’ అని చెబుతారు.నేపాలీలు తరతరాలుగా ఇలా ఈ సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని ‘కుకుర్ తిహార్’ నిర్వహిస్తారు.కుంకుమ బొట్టు... బంతి పూల మాల‘కుకుర్ తిహార్’ రోజు పెంపుడు కుక్కలకు గాని, ఇంటి కుక్కలకు గాని ప్రతి ఇంటి వారు తప్పక పూజ చేస్తారు. పూజలో మొదట కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తర్వాత నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. ఆపైన బంతి పూల మాల వేస్తారు. ఆ పైన హారతి ఇచ్చి నమస్కరించుకుంటారు. ఇక అప్పుడు దానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తారు. కుక్కలు కూడా బుద్ధిగా కూచుని ఇవన్నీ చేయించుకుంటాయి. తమ యజమానులను మరింతగా ప్రేమిస్తాయి.విశ్వాసానికి కృతజ్ఞతకుక్కలా విశ్వాసంగా ఉండే జీవి మరొకటి లేదు. చరిత్రలు దాదాపు 14 వేల సంవత్సరాల క్రితం నుంచే మనిషికి, కుక్కకు స్నేహం కుదిరిందని ఆధారాలు చెబుతున్నాయి. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతారు. అందుకే కుకుర్ తిహార్ ఎంతో శ్రద్ధగా జరుపుతారు. మరో విషయం ఏమిటంటే కుక్కలకే కాదు మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు. -
భారత్‌కు చుక్కెదురు
కట్మండు: దక్షిణాసియా సీనియర్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 2–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. -
వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే
బంజారాహిల్స్: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్‌మూమెంట్ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్‌కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. జయన్ బహదూర్ కుక్‌గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లోని లిటిల్‌స్టార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.ఎప్పుడూ ఫస్టే.. తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్‌మూమెంట్ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్‌బుక్‌లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్ అనూష తెలిపారు. బ్లాక్‌బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్ చేస్తుందని హిందీ టీచర్ అర్షియా పరీ్వన్ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు. నూరు శాతం హాజరు.. వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది. క్రాఫ్ట్‌వర్క్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, చార్ట్ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్ అటెండెన్స్‌లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది. -
బహ్రెయిచ్ నిందితుల అరెస్టు
బహ్రెయిచ్: దుర్గాదేవి విగ్రహ ఊరేగింపు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన కాల్పులు, అల్లర్ల ఘటనలో నిందితులైన ఐదుగురిని యూపీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచగా కాళ్లపై షూట్‌చేసి వారిని నిలువరించారు. తొలుత పోలీసులపైకి నిందితులు కాల్పులు జరపడంతో కొద్దిసేపు పరస్పర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బహ్రెయిచ్– నేపాల్ సరిహద్దులోఈ ఘటన జరిగిందని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ అమితాబ్ యష్ చెప్పారు. మొహమ్మద్ ఫహీన్, మొహమ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మొహమ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ, మొహమ్మద్ అఫ్జల్‌లను అరెస్ట్చేశామని డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. తొలుత ఫహీన్, తలీమ్‌లను అరెస్ట్‌చేసి కాల్పులకు వాడిన ఆయుధాన్ని స్వా«దీనం చేసుకునేందుకు పోలీసులు గురువారం మధ్యాహ్నం నేపాల్ సరిహద్దు సమీపంలోని హడా బసేహరీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే హమీద్, సర్ఫరాజ్, అఫ్జల్ పోలీసులపైకి కాల్పులు మొదలెట్టారు. ఈ క్రమంలో సర్ఫరాజ్, తలీమ్ పోలీసుల నుంచి తప్పించుకుని నేపాల్‌కి పారిపోబోయారు. ఈ క్రమంలో పోలీసులు జరిపి ఎదురుకాల్పుల్లో సర్ఫరాజ్, తలీమ్ గాయపడ్డారు. ఒకరి కుడి కాలికి, ఇంకొకరి ఎడమ కాలికి బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మహ్సీ తాహసిల్ పరిధిలోని మన్సూర్ గ్రామంలో అక్టోబర్ 13న దుర్గామాత విగ్రహం ఊరేగింపులో మరో మతానికి చెందిన ప్రార్థనాస్థలం ఎదురుగా భారీ శబ్ధంతో ‘మళ్లీ యోగీజీ వస్తారు’ అంటూ పాటలు, డీజే మోగించడంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా ఒక ఇంటి పైనుంచి గుర్తు తెలియని వ్యక్తి ఊరేగింపుపై కాల్పులు జరిపాడు. దీంతో 22 ఏళ్ల రాంగోపాల్ మిశ్రా చనిపోగా, ఆరుగురు గాయపడ్డారు. వ్యక్తి మృతికి నిరసనగా 14వ తేదీన అల్లరి మూకలు ఇళ్లు, దుకాణాలు, షోరూమ్‌లు, ఆస్పత్రులు, వాహనాలను దగ్ధంచేయడం తెల్సిందే. పరిస్థితి గురువారినికి అదుపులోకి రావడంతో ప్రభుత్వం 4 రోజుల తర్వాత బహ్రెయిచ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. పరిపాలనలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జిల్లా, రాష్ట్ర యంత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ దుయ్యబట్టారు. -
నేపాల్ నుంచి ఏనుగుల గుంపు.. బీహర్ గ్రామాల్లో ఆందోళన
పశ్చిమ చంపారణ్: బీహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్‌లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకినగర్ రేంజర్ రాజ్‌కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా.. -
18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ
కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులోఅధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్ థౌజెండర్స్’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జని్మంచిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెపె్టంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి. -
నేపాల్‌లో వరద బీభత్సం.. 112 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరదలకు ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడగా దాదాపు 68 గల్లంతు అయినట్టు సమాచారం.నేపాల్‌లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. నేపాల్ వరదల ప్రభావం బీహార్‌పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బీహార్‌లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. September 27, 2024Kathmandu, NepalFloods and landslides in Nepal continue to claim lives, 66 dead and dozens missing have been reported so far. Heavy rains caused catastrophic consequences in the Kathmandu Valley and other regions of the country, destroying roads pic.twitter.com/M3xgvgwQ97— Creative Society India (@CreativeSoIndia) September 29, 2024 #BREAKING: Nepal has reported 112 deaths due to flooding, landslides, and road closures due to persistent downpours, with 69 missing and 60 injured.#NepalFloods #Kathmandu #Flood #Nepal pic.twitter.com/fvm6nWiCei— JUST IN | World (@justinbroadcast) September 29, 2024 Happening now at Medicity hospital, Be safe. pic.twitter.com/o22qMm4B3A— संजय तिमिल्सिना (@sanjayabkt) September 28, 2024ఇక, నేపాల్‌లో శనివారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 54 సంవత్సరాల తర్వాత కేవలం 24 గంటల సమయంలోనే 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలువురు మృతిచెందారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లు, బోట్ల సాయంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. #BREAKING #NEPAL #KATHMANDU🔴 NEPAL : 📹 SEVERE FLOODING IN NEPAL DUE TO INCESSANT MONSOON RAINS Nepal floods and landslides killed at least 66 people, 69 missing. Capital City of Kathmandu is mostly affected.-Reuters#Ultimahora #Flooding #Inundación #Inondation pic.twitter.com/YHLMtYGWbM— LW World News 🌍 (@LoveWorld_Peopl) September 28, 2024ఇది కూడా చదవండి: నస్రల్లా మృతిపై జో బైడెన్ సంచలన కామెంట్స్ -
నేపాల్‌లో పోటెత్తిన వరదలు..50 మంది మృతి
కఠ్మాండు:నేపాల్‌లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. -
ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు
న్యూయార్క్: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ న్యూయార్క్‌లో భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఆయన నుంచి ఒక ప్రకటన వెలువడింది. ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని ఓలీ దానిలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ప్రాంతీయ అంశాలు, పరస్పర సహకారం తదితర విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రధానిగా మరోమారు ఎన్నికైన కెపి శర్మ ఓలీ భారత ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరువురు నేతల భేటీ అనంతరం భారత్-నేపాల్ సంబంధాలు మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. #WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका के न्यूयॉर्क में लोट्टे न्यूयॉर्क पैलेस होटल में नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली के साथ द्विपक्षीय बैठक की। (सोर्स: ANI/DD न्यूज) pic.twitter.com/7SVCH08sNH— ANI_HindiNews (@AHindinews) September 22, 2024అయితే గతంలో ఓలీ చైనా ఆదేశాల మేరకు భారత్‌తో సంబంధాలను చెడగొట్టుకున్నారు. భారతదేశంలోని కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్ ప్రాంతాలు నేపాల్‌కు చెందినవి అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ప్రకటన చేసిన కొంతకాలం తర్వాత ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి భారత్-నేపాల్ సంబంధాలు స్థిరంగా మారాయి. అయితే ఓలీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. #WATCH न्यूयॉर्क, अमेरिका: प्रधानमंत्री नरेंद्र मोदी के साथ लोट्टे न्यूयॉर्क पैलेस होटल में अपनी द्विपक्षीय बैठक पर नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली ने कहा, "बैठक बहुत अच्छी रही।" https://t.co/HiMNIBHWpd pic.twitter.com/8vVWXkM5Jg— ANI_HindiNews (@AHindinews) September 22, 2024ఇది కూడా చదవండి: మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే? -
Bangemudha: పంటినొప్పులకు విరుగుడట!
ఈ చెట్టు కాండానికి నాణెం కొడితే పంటినొప్పులు తగ్గుతాయట! అలాగని భక్తుల విశ్వాసం. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని దర్బార్ చౌరస్తా నుంచి థమేల్ వైపు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ విచిత్రం. వైశాదేవ్ ఆలయ ప్రాంగణంలో ‘బంగెముధా’ అనే చెట్టు కాండం శతాబ్దాలుగా ఉంది. ఆలయాన్ని దర్శించుకునే భక్తుల్లో దంతబాధలు ఉన్నవారు ఈ కాండానికి మేకులతో నాణేలను కొట్టి తగిలిస్తారు. దీనివల్ల దంతబాధలు తగ్గిపోతాయని వారు నమ్ముతారు. నేపాల్ ప్రాంతాన్ని లిచ్ఛావి వంశస్థులు పాలించే కాలం నుంచి– అంటే, సుమారు క్రీస్తుశకం 400–750 మధ్య కాలం నుంచి ఈ కాండం ఇక్కడే ఉన్నట్లు చెబుతారు. ఆధునిక దంతవైద్యం ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇక్కడి జనాలు దంతబాధల నివారణకు ఇప్పటికీ ఈ చెట్టు కాండాన్నే నమ్ముకుంటూ ఉండటం విశేషం. ప్రతిరోజూ వందలాది భక్తులు ఈ చెట్టుకాండానికి నాణేలు కొట్టి మొక్కుకుని వెళుతుంటారు. ఈ కాండంలోని పెద్ద తొర్ర లోపల బంగారు దేవతా విగ్రహం ఉండేదని, అది చోరీకి గురైందని కూడా కఠ్మాండూ ప్రజలు చెప్పుకుంటుంటారు. అయితే, తొర్ర లోపలి విగ్రహానికి సంబంధించి ఆధారాలేవీ లేవు. వైశాదేవ్ ఆలయ పరిసరాల్లో డజనుకు పైగా దంతవైద్యుల క్లినిక్‌లు ఉన్నా, జనాలు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండటం చూసి విదేశీ పర్యాటకులు ఆశ్చర్యపోతుంటారు. -
భారత్-నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్‌లో మరో రైలు ప్రారంభమైంది. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణంతో పర్యాటకులు భారత్ - నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని చవిచూడగలుగుతారు. ఈ యాత్రకు ‘ఇండియా- నేపాల్ మైత్రి యాత్ర’ అని పేరు పెట్టారు. రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ఈ నూతన సేవను ప్రారంభించామని, ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త భారత్ గౌరవ్ యాత్రలు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఈ భారత్ గౌరవ్ రైలులో ప్రయాణికులు భారతదేశం- నేపాల్‌ల సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో పర్యటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 'ఇండియా నేపాల్ మైత్రి యాత్ర' ప్రయాణం 9 రాత్రులు, 10 పగళ్లు ఉండనుంది. ఈ రైలు ప్యాకేజీలో అయోధ్య, కాశీ, సీతామర్హి, జనక్‌పూర్, పశుపతినాథ్, బిండియా బస్ని టెంపుల్లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారతీయ రైల్వే కల్పిస్తుంది.ఈ రైలులో మొదటి ఏసీ క్యాబిన్ ఛార్జీ ఒక్క వ్యక్తికి రూ.1,05,500, ఇద్దరికి రూ.89,885, ముగ్గురికి రూ.87,655లు ఉంటుంది. ఇందులో బెడ్ విత్ చైల్డ్ ఛార్జీ రూ.82,295. సెకండ్ ఏసీలో ఒక్క వ్యక్తి టిక్కెట్ ధర రూ.94,735. ఇద్దరు వ్యక్తులకు రూ.79,120 కాగా, ముగ్గురికి రూ.76,890. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.71,535గా ఉంది. థర్డ్ ఏసీలో ఒక్క వ్యక్తికి రూ.81,530, ఇద్దరికి రూ.66,650, ముగ్గురికి రూ.64,525. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.60,900గా ఉంటుంది. ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లతో పాటు పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైలులో ప్రయాణికుల కోసం రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 370 రోజులకు పైగా! -
నేపాల్ కొత్త కరెన్సీ నోట్లలో భారత్ ప్రాంతాలు? మరోమారు ఉద్రిక్తతలు?
ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్‌తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్ ఖబర్ డాట్ కామ్’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్‌లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్‌తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.కాగా, గతంలో అప్పటి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్‌తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
భారత సంతతి వ్యక్తి కాల్పులు.. మునా పాండే మృతి
వాషింగ్టన్: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతి వ్యక్తి జరిపిన కాల్పుల్లో నేపాల్‌కు చెందిన మునా పాండే మృతిచెందింది. ఈ క్రమంలో కాల్పులు జరిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు అమెరికా పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని హ్యుస్టన్‌లో భారత సంతతి వ్యక్తి బాబీ సిన్ షా(25) నేపాల్‌కు చెందిన యువతి మునా పాండే(21)పై కాల్పులు జరిపాడు. అయితే, బాబీ.. ఆమె ప్లాట్‌లో దొంగతనం చేసేందుకు వెళ్లిన క్రమంలో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి తాజాగా బాబీ సిన్ షా ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు. కాగా, మునా పాండే అమెరికాలో కమ్యూనిటీ కాలేజీలో చదువుతోంది. 51 year old Man arrested, charged after 21-year-old Nepali student found shot to death inside her NW Houston apartment 🇺🇸Bobby Singh Shah allegedly shot and killed 21-year-old Muna Pandey during an aggravated robbery over the weekend. Her body was discovered with multiple… pic.twitter.com/UzRS1Ddlx2— CarraDeShaukeen (@CarraDeShaukeen) August 30, 2024 ఇదిలా ఉండగా.. మునా పాండే మృతి కారణంగా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ.. మునా పాండే నాకు ఒక్కగానొక్క కూతురు. ప్రతీరోజు నాతో ఫోన్లో మాట్లాడేది. ఒక్కసారిగా ఫోన్ రాకపోవడంతో కంగారుపడ్డాను. ఆమె స్నేహితులకు ఫోన్ చేయడంతో చనిపోయినట్టు చెప్పారు. నేను ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయాను. అసలు ఏం జరిగిందో తెలియదు. దయచేసి మా కూతరు మృతదేహాన్ని మాకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, మునా పాండే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు నేపాల్ కాన్సులేట్ ప్రయత్నాలు చేస్తోంది. -
నేపాల్ లో ఘోర ప్రమాదం.. బస్సులో 40 మంది భారతీయులు
-
నేపాల్‌లో ఘోర ప్రమాదం
కఠ్మాండు: నేపాల్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 27 మంది చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రిజస్టరయిన ఈ బస్సు సెంట్రల్ నేపాల్‌లోని మార్స్‌యాంగడీ నదిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా భుసాల్ గ్రామానికి చెందిన 104 మంది యాత్రికులు మూడు బస్సుల్లో నేపాల్‌కు వచ్చారు. మొత్తం 10 రోజుల యాత్రలో పొఖారాలో రెండు రోజులు గడిపారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం మూడు బస్సుల్లో కఠ్మాండు వైపు తిరుగు పయనమ య్యారు. ఇందులో ఒక బస్సు ఉదయం 11.30 గంటల సమయంలో తనహున్ జిల్లా ఐనా పహరా వద్ద హైవేపై అదుపుతప్పి 150 మీటర్ల లోతున్న మార్స్‌యాంగడీ నదిలో పడిపోయింది. ఈ బస్సులో డ్రైవర్, హెల్పర్ సహా మొత్తం 43 మంది ఉన్నారు. పరవళ్లు తొక్కుతున్న నదిలో నుంచి 16 మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులైన 11 మంది ఆస్పత్రిలో చనిపోయారు. మరో 16 మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బస్సు నుజ్జునుజ్జయింది. మూడు బస్సుల్లో ఉన్న వారంతా కుటుంబసభ్యులు, బంధువులేనని పోలీసులు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే ఘటనా ప్రాంతానికి యూపీ ప్రభుత్వం మహారాజ్‌గంజ్ సబ్ కలెక్టర్‌ను పంపించింది. రక్షణ, సహాయక చర్యలను ఈయన సమన్వయం చేస్తారని తెలిపింది. బాధితులను సాధ్యమైనంత త్వరగా నేపాల్ నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. #WATCH | Nepal: An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district. The bus was en route to Kathmandu from Pokhara. Search and rescue operations underway by the Nepal Army at the incident site.(Video Source: News Agency… pic.twitter.com/txxO43O4CV— ANI (@ANI) August 23, 2024 -
Nepal: కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నేపాల్ అతలాకుతలమయ్యింది. గడచిన 24 గంటల్లో పశ్చిమ నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు.నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగల్ మునిసిపాలిటీలో కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు కొట్టుకుపోయింది. ఆ ఇంటిలో ఉంటున్న నలుగురు జల సమాధి అయ్యారు. జాజర్కోట్ జిల్లాలోని నల్‌గఢ్ మునిసిపాలిటీ-2లోని మజగావ్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.ఈ హిమాలయ దేశంలో ఒక దశాబ్ద కాలంలో రుతుపవన సంబంధిత విపత్తుల కారణంగా 1,800 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయాయి. వివిధ విపత్తులలో సుమారు 400 మంది గల్లంతయ్యారు. 1,500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. -
నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
భారత్, నేపాల్ సంబంధాలకు పరీక్ష
కేపీ శర్మ ఓలీ నాలుగోసారి నేపాల్ ప్రధాని అయ్యారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. ఉదాహరణకు, బీర్గంజ్ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. భారత్‌తో నేపాల్ సరిహద్దును విస్తరిస్తూ నేపాల్ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. అయితే ఆయన చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద నాయకుడు. నేపాల్ స్థిరత్వాన్ని, అభివృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండటం తప్పనిసరి. చైనాతో నేపాల్ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. కానీ భౌగోళికం, చరిత్ర, సంస్కృతితో పాటు ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు భారత్–నేపాల్ సంబంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.నేపాల్‌లో కొత్త ప్రధానమంత్రి అధికారంలోకి రావడంతో, రాజ్యాంగ రాచరికాన్ని స్థాపించిన 1990 నాటి జన ఆందోళన్ నుండి ప్రభుత్వ అధిపతికి సంబంధించి 30వ మార్పును నేపాల్ చూసినట్లయింది. పైగా 2006లో అదే రాచరికాన్ని రద్దు చేసి పార్లమెంటరీ గణతంత్రాన్ని స్థాపించిన లోక్తంత్ర ఆందోళన తర్వాత ఆ దేశంలో ప్రభుత్వాధిపతి మారడం 15వ సారి. గత తొమ్మిదేళ్లలో నేపాల్‌లో ప్రభుత్వం 8 సార్లు మారింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెని నిస్ట్)కి చెందిన కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)కు చెందిన పుష్ప కమల్ దహల్, నేపాలీ కాంగ్రెస్‌కి చెందిన షేర్ బహదూర్ దేవుబా వరుసగా ప్రధానమంత్రులు అవుతున్నారు. అయితే నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ మార్పులతో భావజాలానికి సంబంధం లేదు.ఓలీ స్పష్టమైన మెజారిటీతో నాలుగోసారి ప్రధాని అయ్యారు. 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆదివారం (జూలై 21) ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు రావడంతో, మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించారు. భారత్‌లో నేపాల్ మాజీ రాయబారి, ఖాట్మండు యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ లోక్ రాజ్ బరాల్ ఇటీవల నేపాలీ రాజకీయాలు ‘అసంబద్ధతలతో నిండి ఉన్నాయి’ అని అభివర్ణించారు. తన తొలి పదవీకాలంలో ఓలీ భారత్‌ను చికాకుపెట్టారు. అనేక భారత్ వ్యతిరేక ఎత్తుగడలు వేశారు. ఉదాహరణకు, బీర్గంజ్ సమీపంలోని థోరి నిజమైన అయోధ్య అని పేర్కొన్నారు. నేపాల్ పురావస్తు శాఖ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడం గురించి పరిశీలిస్తోందని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. ‘సత్యమేవ జయతే’ కాదు, ‘సింహదేవ జయతే’ అనేది భారతదేశ జాతీయ నినాదంగా కనిపిస్తోందని అన్నారు. భారత్‌తో నేపాల్ సరిహద్దును ఉత్తరం వైపు కాకుండా, వాయువ్యంగా విస్తరిస్తూ నేపాల్ మ్యాప్‌ను, రాజ్యాంగాన్ని మార్చారు. తద్వారా వివాదాస్పద ప్రాంతాన్ని అనేక రెట్లు పెంచి, పరిష్కారాన్ని కష్టతరం చేశారు.ఓలీ చైనా అనుకూలుడనే సాధారణ అభిప్రాయం సరికాదు. ఆయన జాతీయవాద రాజకీయ నాయకుడు. నేపాల్ స్థిరత్వాన్ని, అభి వృద్ధిని కోరుకుంటారు. అందుకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు తప్పనిసరి. చైనాతో నేపాల్ సత్సంబంధాలను కొనసాగించడంలో భారత్‌కు ఎలాంటి సమస్య లేనప్పటికీ... ఇరు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు, భౌగోళికం, చరిత్ర, సంస్కృతి భారత్–నేపాల్ సంబంధాన్ని ప్రత్యేకంగా మారుస్తున్నాయి.ఇప్పటికే అంగీకరించిన విద్యుత్ వాణిజ్యం, వాతావరణ మార్పుల సహకారం, అనుసంధానంపై చొరవతో కూడిన కార్య క్రమాల ద్వారా దీనిని మరింతగా మార్చవచ్చు. గత రెండేళ్లుగా, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కాళీగండకి, త్రిశూలి, దేవిఘాట్లోని తన జలవిద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి చేసిన మిగులు విద్యుత్తును ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ద్వారా భారత్‌కు యూనిట్‌కు రూ. 6 కంటే ఎక్కువ లాభదాయకమైన ధరకు విక్రయిస్తోంది. ఏప్రిల్ 2022లో ఆమోదించిన విద్యుత్ రంగ సహకారంపై భారత్–నేపాల్ ఉమ్మడి దార్శనికతా ప్రకటన మూడు కార్యకలాపాలను అంచనా వేసింది. నేపాల్‌లోని విద్యుత్ రంగ ప్రాజెక్టుల ఉమ్మడి అభివృద్ధి, సీమాంతర సరఫరా మౌలిక వ్యవస్థ, ద్వి–దిశాత్మక విద్యుత్ వాణిజ్యం. అయితే నేపాల్‌లోని కొన్ని ప్రతికూల శక్తులు వీటిని వ్యతిరేకిస్తున్నాయి.నేపాల్‌కు అత్యంత అనుకూలంగా వ్యవహరించిన భారత ప్రధాని చంద్రశేఖర్ 1991 ఫిబ్రవరిలో ఖాట్మండును సందర్శించిన ప్పుడు, ఒక విలేఖరుల సమావేశంలో జలవిద్యుత్ రంగంలో భారత్– నేపాల్ సహకార అవకాశాల గురించి విస్తృతంగా మాట్లాడారని గుర్తుచేసుకోవడం ఆసక్తికరం. ఆ సమావేశం తర్వాత నేపాలీ యువ జర్నలిస్ట్ విజయ్ కుమార్‌ను తనతో కలిసి టీ తాగడానికి భారత ప్రధాని ఆహ్వానించారు. అప్పుడు చంద్రశేఖర్ చెప్పిన మొదటి విషయం, ‘‘జనాల మేత కోసం నేను చెప్పిన మాటలను నమ్మవద్దు’’ అని. విజయ్ కలవరపడటం చూసి, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా గ్రామంలో కరెంటు లేని ఒక గుడిసెలో తన పెంపకం గురించి వివరించారు. భారత్ త్వరలో విముక్తి పొందుతుందని తండ్రి ఆయనతో అన్నారు: ‘‘అభివృద్ధి పథంలో మన మిత్రదేశం నేపాల్ నడిచినప్పుడు మనకు కరెంట్ ఇస్తుంది. ఇప్పుడు మన జుట్టు నెరి సిందిగానీ నేపాల్ నుంచి మన ఇంటికి కరెంట్ రాలేదు. నేపాల్ తనను చీకట్లో ఉంచుకుంటుంది, మనల్నీ చీకట్లోనే ఉంచుతుంది.’’పరిస్థితులు ఎలా మారిపోయాయో ఈ ఉదంతం వివరిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా నేపాల్‌కు భారత్ విద్యుత్తును సరఫరా చేస్తుండగా, ఇప్పుడు అది మారింది. అయితే నేపాల్ మిగులు విద్యుత్తును మాత్రమే భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది నేపాల్ వాణిజ్య సంతు లనాన్ని సరిదిద్దుతుంది. నేపాల్ తన వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే, భారత్ నుంచి పెట్రో లియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ఆపేసి, వాటిని మరో చోటునుంచి దిగుమతి చేసుకోవడం.నేపాల్‌కు భారత్ ఏకైక చమురు సరఫరాదారు. 2019 సెప్టెంబరులో భారత్‌లోని మోతీహారి (బిహార్) నుండి నేపాల్‌లోని అమ లేఖ్గంజ్ వరకు దక్షిణాసియాలో మొట్టమొదటి సీమాంతర పెట్రో లియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్‌కు క్రమం తప్పకుండా సరసమైన పెట్రోలియం సరఫరాలను నిర్ధారించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొ రేషన్ షెడ్యూల్ కంటే ముందే దీన్ని నిర్మించింది. నేపాల్ విద్యుత్‌ను భారత్ దిగుమతి చేసుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్‌కు నేపాల్ విద్యు త్ను సరఫరా చేయడానికి అంగీకరించే యోచనలో ఉంది. ఇది దక్షిణా సియాలోని ఏదైనా మూడు దేశాలలో మొదటి త్రైపాక్షిక ఏర్పాటు.నేపాల్‌తో రవాణా, కనెక్టివిటీ కోసం భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ చేయగలదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద, ట్రాన్స్ –హిమాలయన్ మల్టీ–డైమెన్షనల్ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని చైనా హామీ ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో దానికి ఎలాంటి ఆధా రాలు లేవు. ఖాట్మండుకు రైలు మార్గాన్ని నిర్మించడం ద్వారా, జల మార్గాల గుండా బంగాళాఖాతంలోకి నేపాల్‌కు యాక్సెస్‌ను అందించడం ద్వారా నేపాల్ భూపరివేష్టిత పరిస్థితిని సమర్థవంతంగా ముగించేలా భారత్ ప్రతిపాదించింది. బిహార్‌లోని రక్సోల్–ఖాట్మండు రైలు లింక్ తుది స్థాన సర్వే నివేదిక గతేడాది జూన్ నుండి నేపాల్ ప్రభుత్వం వద్ద ఉంది.నేపాల్‌తో చైనా కుదుర్చుకున్న 2016 ట్రాన్సిట్ అండ్ ట్రాన్ ్సపోర్ట్ ఒప్పందం అనేక చైనీస్ ఓడరేవుల లోకి నేపాల్‌కు ప్రాప్యతను ఇస్తుంది. కానీ గత ఎనిమిదేళ్లలో, సుదీర్ఘమైన, ఆర్థికంగా లాభసాటి కాని దూరాల కారణంగా ఈ మార్గాలు ఉపయోగించలేదు. నేపాల్‌కు సంబంధించి మూడవ దేశ వాణిజ్యం కోల్‌కతా, విశాఖపట్నంలోని భారతీయ ఓడరేవుల ద్వారా కొనసాగుతోంది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా లేదా యూరప్‌కు ఎగుమతి చేయడానికి నేపాల్‌కు భారత పశ్చిమ తీరప్రాంతంలోని కాండ్లా వంటి ఓడరేవులు అవసరమైతే, భారత్ దాన్ని సులభతరం చేస్తుంది. నేపాల్‌లో తరచూ జరిగే నాయకత్వ మార్పు స్థానిక రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. తమ సాంస్కృతిక సాన్నిహిత్యం వల్ల భారతీయులు, నేపాలీలు ఒకరి పట్ల మరొకరు కొంత ఉదాసీనంగా ఉన్నారు. బదులుగా, వారు పరస్పరం ఎక్కువగా పట్టించుకోవాలి. జయంత్ ప్రసాద్ వ్యాసకర్త నేపాల్‌లో భారత మాజీ రాయబారి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
నేపాల్ ప్రమాదానికి టేబుల్ టాప్రనేవే కారణం!.. ఏంటిది?
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సిబ్బంది సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంతో సహా 19 ప్రయాణికులుండగా.. కేవలం పైలట్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్‌లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఇందుకు అక్కడ ఎక్కువగా టేబుల్-టాప్ రన్వేలు ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇవి సవాళ్లతో కూడుకుని ఉంటాయి. తాజాగా ప్రమాదం జరిగిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా టేబుల్ టాప్ విమానాశ్రయమే. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర విమానాశ్రయాల్లో ఒకటి.అన్ని వైపులా లోతైన లోయలు ఉండి.. ఎత్తైన కొండపై భాగంలో ఎయిర్‌పోర్టు ఉంటుంది.. ఈ రన్‌వే చుట్టుపక్కల భూభాగం కంటే ఎత్తులో ఉంటాయి. వీటికి దాదాపు అన్ని వైపులా లోయలు ఉంటాయి. కానీ దూరం నుంచి చూస్తే రన్‌వే, పక్కన ఉన్న భూభాగం సమాంతరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల విమానం రన్‌వేపై అదుపుతప్పితే అది లోయలో పడి క్రాష్ అవ్వడం జరుగుతుంది.సాధారణంగా విమానం టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేప్పుడు అది రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో విమానం టైరు నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్ చేసి ఉంటుంది. అయితే వర్షాలు, ఇతర కారణాలతో రన్‌వే సరిగా కనిపించకపోతే విమానం దానికి మార్కింగ్ చేసిన నేలను దాటి తాకుతుంది. దీన్ని ఓవర్ షూట్ అంటారు. సాధారణ రన్‌వేలపై ఇలా జరిగినప్పుడు విమానం ఆగడానికి తగినంత అదనపు స్థలం ఉటుంది. కానీ టేబుల్‌టాప్ రన్‌వేలపై ఓవర్ షూట్ జరిగితే మాత్రం విమానం నేరుగా లోయ వంటి ప్రదేశంలో పడిపోతుంది.ఇక భారత్‌లోనూ అయిదు విమానాశ్రయాలు టేబుల్-టాప్ రన్‌వేలను కలిగి ఉన్నాయి. సిమ్లా(హిమాచల్ ప్రదేశ్), కాలికట్(కేరళ), మంగళూరు(కర్ణాటక), లెంగ్‌పుయ్ (మిజోరం). పాక్యోంగ్ (సిక్కిం). వీటిలో కేరళ, మంగళూరు విమానాశ్రయాలు గతంలో పెద్ద ప్రమాదాలు సైతం జరిగాయి. మే 22, 2010న, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బందితో సహా 158 మంది ప్రయాణికులు మరణించారు. -
Asia Cup 2024: టీమిండియా హ్యాట్రిక్ విజయం.. సెమీస్‌కు అర్హత
మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్‌లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్‌ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్‌కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్‌గా ఉండగా.. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్‌లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్‌ను సెమీస్‌లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. -
నేడు (జులై 23) టీమిండియాతో నేపాల్ 'ఢీ'
మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ప్రస్తుత ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్‌తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్‌పై గెలిచినా సెమీస్‌కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక టాపర్‌గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది. -
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-ఎంయూఎల్) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. -
Asia Cup 2024: పసికూనపై పాక్ ప్రతాపం
మహిళల ఆసియా కప్‌లో పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. నేపాల్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. పసికూన నేపాల్‌పై విరుచుకుపడింది. నేపాల్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మైదానంలో పాదరసంలా కదిలారు. పాక్ ఆటగాళ్లు ముగ్గురు నేపాల్ బ్యాటర్లను రనౌట్ చేశారు. సైదా ఇక్బాల్ 2, ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కబిత జోషి (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సీతా రనా మగర్ 26, పూజా మహతో 25, కబిత కన్వర్ 13 పరుగులు చేశారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (35 బంతుల్లో 57; 10 ఫోర్లు), మునీబా అలీ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) నేపాల్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇవాళ (జులై 22) శ్రీలంక, మలేసియా.. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో (జులై 23) నేపాల్‌తో తలపనుంది.