Payal Rajput
-
అల్లు అర్జున్ పుష్ప-2.. తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్!
అల్లు అర్జున్ పుష్ప-2 నిరీక్షణకు మరో రోజులోనే తెరపడనుంది. డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్ పేరే వినిపిస్తోంది. పుష్ప డైలాగ్స్‌తో ఇమిటేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.అయితే ఇంతలా హంగామా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, సినీప్రియులు చేస్తారని అందరికీ తెలుసు. కానీ సినీతారలు కూడా పుష్ప-2 కోసం వెయిట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా పుష్ప-2 విడుదల సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ వీడియోలో పుష్ప డైలాగ్‌తో అదరగొట్టింది ముద్దుగుమ్మ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ మేనరిజం చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి బెస్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
మరో ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంగళవారం. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్లోనే ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో భాషలో మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం మంగళవారం మూవీ చూసే ఛాన్స్ దక్కింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మంగళవారం మూవీ హిందీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్, కృష్ణ చైతన్య కీలకపాత్రలు పోషించారు. పాయల్ ఈ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కించుకుంది. ‘మంగళవారం’కథేంటంటే..ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు.మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. -
అనంతపురంలో సినీ తారలు పాయల్ రాజ్‌పుత్,నభా నటేష్ సందడి (ఫొటోలు)
-
నిజామాబాద్‌లో సందడి చేసిన పాయల్, రామ్ (ఫొటోలు)
-
మెగా కోడలి డ్యాన్స్.. పాయల్ రాజ్‌పుత్ గ్లామర్
పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ షాలినీ పాండేనవ్వుతూ డ్యాన్సులేస్తూ హ్యాపీ మూడ్‌లో లావణ్య త్రిపాఠిభర్తతో సోనాక్షి సిన్హా రొమాంటిక్ పోజులుపింక్ డైమండ్‌లా మెరిసిపోతున్న కృతిశెట్టియంగ్ బ్యూటీ శ్రీలీల స్మైలీ స్టిల్స్.. చూస్తే మతిపోయేఎండలో ఫొటోలకు పోజులిచ్చిన రాశీఖన్నాశ్రీలీల డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసిన నితిన్ View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Sanjeeta Bhattacharya (@sanjeeta11) View this post on Instagram A post shared by Madhumitha H (@madhumitha.h_official) -
లెజండ్ శరవణన్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'లెజెండ్ శరవణన్' కథానాయకుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించి నిర్మించిన 'ది లెజెండ్' చిత్రం గత 2022లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాల కథానాయక నటించారు. కాగా లెజెండ్ శరవణన్ ఇప్పుడు హీరోగా, నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దురైసెంథిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ కథానాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ఢిల్లీ బ్యూటీ ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. అదే విధంగా తమిళనాడులో ఇప్పటికే ఒక చిత్రంలో నటిస్తున్నారు. కాగా శరవణన్ సరసన నటించేది ఈమెకు రెండవ చిత్రం అవుతుంది. అదేవిధంగా ఇందులో ఆండ్రియా, శ్యామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చైన్నె పరిసర ప్రాంతాల్లో తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఆదివారం తూత్తుకుడి బయలుదేరారు. ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో శరవణన్ మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం మంచి విజయాన్ని సాధించిందని అదేవిధంగా మంచి యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందుతున్న ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల విడుదలైన మహారాజా, గరుడన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, అదేవిధంగా దర్శకుడు దురైసెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
బాత్రూం పోజుల్లో షాలినీ పాండే.. నీడలో పాయల్ వయ్యారాలు!
బాడీ బెండు తీసేలా హీరోయిన్ పాయల్ రాజ్పుత్షూట్ గ్యాప్‌లో ఫన్నీగా ప్రవర్తిస్తున్న అనన్య నాగళ్లబాత్రూమ్ పోజుల్లో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండేవింటేజ్ హీరోయిన్లా రెడీ అయిపోయిన కృతిశెట్టిలంగా ఓణీలో వయ్యారంగా వితిక షేరు సోయగాలుమహారాష్ట్ర అడవుల్లో విహరిస్తున్న ఈషా రెబ్బాజీను ప్యాంటులో కారు పక్కన బిగ్ బాస్ వాసంతి View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
కరీంనగర్లో సందడి చేసిన సంయుక్త మీనన్, పాయల్ రాజ్‌పుత్ (ఫొటోలు)
-
ఆరెంజ్ డ్రెస్ లో హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్‌పుత్’ (ఫొటోలు)
-
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది. ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రక్షణ్ మూవీ రిలీజైంది. విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్వీట్ చేసింది. లేడీ సింగ్ గర్జించేందుకు వస్తోంది అంటూ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఏసీపీ పాత్రలో అలరించారు. కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్‌పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి.ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. Lady Singam is ready to roar!👮🏻♀️Payal's 'Rakshana' is coming on aha!!🎬 #Rakshana premieres Aug 1st only on aha @starlingpayal @ActorMaanas @RajeevCo @actorchakrapani @sivannarayana_ @PrandeepThakore pic.twitter.com/sOdDmVSHKz— ahavideoin (@ahavideoIN) July 29, 2024 -
Rakshana Review: పాయల్ రాజ్‌పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ మూవీ ఎలా ఉంది?
టైటిల్: రక్షణనటీనటులు: పాయల్ రాజ్‌పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులునిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్దర్శక-నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్సంగీతం: మహతి సాగర్సినిమాటోగ్రఫీ: అనిల్ బండారిఎడిటర్: గ్యారి బి హెచ్విడుదల తేది: జూన్ 7, 2024ఆర్ఎక్స్ 100, ‘మంగళవారం’సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘రక్షణ’. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా..పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. మంచి అంచనాలతో నేడు(జూన్ 7)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కిరణ్(పాయల్ రాజ్‌పుత్) ఓ పవర్ఫుల్ ఏసీపీ. అనేక కేసులను ఈజీగా సాల్వ్ చేసిన కిరణ్.. తన స్నేహితురాలు హత్య కేసును మాత్రం ఛేదించలేకపోతుంది. ఓ సైకో ఆమెను హత్య చేసి..అది ఆత్మహత్యగా చిత్రీకరించాడని కిరణ్ అనుమానిస్తుంది. ఆ దిశగా విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు ప్రేమించమని అమ్మాయిల వెంటపడుతూ హింసించే అరుణ్(మానస్)ని కిరణ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో కిరణ్‌పై అరుణ్ పగపెంచుకుంటాడు. ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కిరణ్ ఫోటోలను పోస్ట్ చేసి..ఆమె మొబైల్ నంబర్ని పబ్లిక్‌లో పెడతాడు. దీంతో కిరణ్‌కు అసభ్యకరమైన సందేశాలు..పోన్లు వస్తుంటాయి. ఇది అరుణ్ చేసిన పనే అని కనిపెట్టిన కిరణ్.. అతన్ని పట్టుకునేందుకు ఓ బంగ్లాకు వెళ్లగా..అరుణ్ ఆమె కళ్లముందే బంగ్లాపై నుంచి కిందపడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఏసీపీ కిరణ్ వేధింపుల కారణంగానే చనిపోతున్నానని ఓ వీడియో కూడా చిత్రీకరిస్తాడు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ సస్పెండ్కి గురవుతుంది. ఆ తర్వాత కిరణ్ లోతుగా విచారించగా.. తన స్నేహితురాలితో పాటు అరుణ్ ఆత్మహత్యల వెనుక ఎవరో ఒకరు ఉన్నారని, ఆయనే వీరిద్దరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు తన స్నేహితురాలితో పాటు మరికొంతమంది యువతులను చంపాడు? అరుణ్‌కి ఆ సైకో కిల్లర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కిరణ్‌ని లూజర్ చేయాలని ఎందుకు ప్రయత్నించాడు? ఆ సైకో కిల్లర్‌ని కిరణ్ కనిపెట్టిందా? చివరికి ఏం జరిగింది? ఈ కథలో రోషన్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. నగరంలో వరుస హత్యలు జరగడం.. ఆ హత్యల వెనుక ఓ కిల్లర్ ఉండడం.. అతన్ని పట్టుకునేందుకు హీరో/హీరోయిన్ రంగంలోని దిగడం..తన తెలివితేటలన్నీ ఉపయోగించి చివరకు ఆ సైకో కిల్లర్‌ని అంతమొందించడం.. సైకో థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలన్నీ ఇంచుమించు ఒకే మూసలో సాగుతాయి. దీంటో హత్యలు జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో/హీరోయిన్ ఎంత తెలివితా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘రక్షణ’ విషయంలో ఇది కొంతవరకే సఫలం అయింది. సైకో కిల్లర్.. అతని నేపథ్యం ఉత్కంఠభరితంగా ఉన్నా.. కథానాయికా చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉండదు. ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకునే సీన్‌తో పాయల్ పాత్రను పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంటనే తన ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి.. స్నేహితురాలి హత్యను చూపించి..అసలు కథను ప్రారంభించారు. సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు చూపించకుండా కథపై ఆసక్తిని పెంచాడు. ఆ తర్వాత వెంటనే అర్జున్ పాత్రని చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేశాడు. ఫస్టాఫ్ అంతా అర్జున్, కిరణ్‌ల చుట్టే తిరుగుతుంది. అర్జున్ పట్టుకునేందుకు కిరణ్ చేసే ప్రయత్నం మెప్పించదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత..అసలు అతను ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఆ సైకో కిల్లర్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకోవడంతో పాటు పెరెంట్స్‌ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్షపై కూడా దర్శకుడు ఓ మంచి సందేశాన్ని అందించాడు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు తెరపై గ్లామర్‌గా కనిపించిన పాయల్.. ఈ చిత్రంలో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. ఏసీపీ కిరణ్ పాత్రలో ఒదిగిపోయింది. హీరో స్థాయిలో యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. తెరపై సరికొత్త పాయల్ని చూస్తారు. బిగ్‌బాస్ ఫేం మానస్ తొలిసారి నెగెటివ్ పాత్రలో నటించాడు. అమ్మాయిలను ఏడిపించే శాడిస్ట్ అరుణ్ పాత్రకి మానస్ పూర్తి న్యాయం చేశాడు. రామ్ పాత్రకి రోషన్ బాగా సెట్ అయ్యాడు. రాజీవ్ కనకాల, శివన్నారాయణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. మహతి సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల టెన్షన్ పెట్టాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాత ఒక్కరే కావడంతో సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడేవారికి ‘రక్షణ’ నచ్చుతుంది. -
అందుకే రక్షణ టైటిల్ పెట్టాం: ప్రణదీప్ ఠాకోర్
‘‘ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్ పెట్టాం’’ అన్నారు దర్శక–నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘రక్షణ’. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ– ‘‘గుణశేఖర్‌గారి వద్ద ‘ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి’ సినిమాలకు అసిస్టెంట్ కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆనంద్ రంగా ‘ఓయ్’ చిత్రానికి, భాస్కర్ ‘ఆరెంజ్’ సినిమాకి కో–డైరెక్టర్‌గా చేశాను. ఓ పెద్ద కథ పట్టుకుని చాలామంది వద్దకు వెళ్లాను... కానీ కుదరలేదు. అందుకే చిన్న సినిమా తీసి, నిరూపించుకోవాలని ‘రక్షణ’ తీశాను. ఇందులో పాయల్ అద్భుతంగా నటించారు. ‘రక్షణ’ తర్వాత ఆమెకు మరింత పవర్ఫుల్ రోల్స్ వస్తాయి. సినిమా తీయడం క్రియేటివ్... రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్‌లో పూర్. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు. -
పాయల్ రాజ్‌పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
-
వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ప్రమోషన్స్‌కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.సెటిల్మెంట్ కోరుకుంటున్న పాయల్తాజాగా పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక నోట్ రాసింది. 'నేను డైరెక్టర్, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్.. నేను ఎవరికీ అపకారం చేయను. రక్షణ టీమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్‌ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్‌ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. నాలుగేళ్ల క్రితం నటించిన రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే టాలీవుడ్ బహిష్కరిస్తామంంటున్నారని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పాయల్ సినిమాను ప్రమోట్ చేయడానికి డేట్లు కేటాయించకపోవడంపై నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్ ఠాకూర్ నుంచి మార్చిలోనే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అతను ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాడని తెలిపింది. కానీ ఇందుకు పాయల్ సహకరించలేదని.. మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ప్రమోషన్స్‌కు వస్తే ఆమెకు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వెల్లడించారు.ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. మేనేజర్ ద్వారా పాయల్‌ను కలిసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని టీఎఫ్‌పీసీ పేర్కొంది. ఈ చిత్రంలో పాయల్ నటించినందున ప్రమోషన్స్ సమయంలో ఆమె పేరును ఉపయోగించుకునే హక్కు నిర్మాత, దర్శకుడు ప్రణ్దీప్కు ఉందని వారు పేర్కొన్నారు.బ్యాన్ చేస్తామంటూ..కాగా.. అంతకుముందు పాయల్ తనను బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ సినిమా ప్రమోషన్లకు పాల్గొనకపోతే టాలీవుడ్లో నిషేధిస్తామంటున్నారంటూ ఆరోపించింది. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పిందని.. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film "Rakshana" Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council pic.twitter.com/0TlzpYmA3s— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2024 -
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు బెదిరింపులు
-
ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్
'ఆర్ఎక్స్ 100'తో తెలుగువారికి దగ్గరైంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమా పరిశ్రమ అంటే అమితమైన అభిమానం. అయితే, తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని పాయల్ విచారం వ్యక్తం చేసింది. 2010 నుంచి దాదాపు ఏడేళ్లపాటు ఎన్నో సీరియల్స్లలో నటించిన ఆమె 'చన్నా మేరేయా' పంజాబీ సినిమా ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ చిత్రం పాయల్‌కు విజయాన్ని అందించింది. అలా 'ఆర్ఎక్స్ 100'తో టాలీవుడ్లో అడుగుపెట్టి ఇక్కడ కూడా భారీ హిట్‌ను అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఆమెకు తెలుగులో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100'తో మెప్పించిన పాయల్.. గతేడాది విడుదలైన 'మంగళవారం' చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చాలెంజింగ్‌గా నటించింది. ఇలాంటి పాత్రలు చేసేందుకు చాలామంది హీరోయిన్స్ అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. కానీ పాయల్ దుమ్మురేపింది. 'మంగళవారం' ఆమె కెరీర్లో ఒక ప్రత్యేకత గల పాత్రగా మిగులుతుంది. ఆ విజయమే ఇప్పుడు ఆమెకు శాపంగా మారింది.'2019-2020 సమయంలో నేను 'రక్షణ' అనే సినిమాను ఒప్పకున్నాను. ముందుగా ఆ చిత్రానికి అనుకున్న టైటిల్ '5Ws'. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయింది. కానీ, రీసెంట్గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం నేను కూడా అందుబాటులో లేను. కానీ నా టీమ్ ఆ చిత్ర యూనిట్‌తో టచ్‌లో ఉంది. సినిమా ప్రమోషన్స్‌కు రాకపోతే తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పింది. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదు. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను.' అని ఆమె తెలిపింది. 'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్‌గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్‌రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్‌గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్‌గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
విచిత్రమైన పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీలతమ్ముడు చనిపోయి మూడేళ్లు.. హీరోయిన్ నిక్కీ ఎమోషనల్ పోస్ట్చీరలో మరింత అందంగా బిగ్‌బాస్ ఫేమ్ స్రవంతిసొగసులు చూపిస్తూ రెచ్చగొట్టేస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి45 ఏళ్ల వయసులోనే చూపుతిప్పుకోనివ్వంత బ్యూటీతో జ్యోతిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by ANANTARA (@label_anantara) -
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
'వారికి దూరంగా ఉండటమే మంచిది'.. మంగళవారం బ్యూటీ పోస్ట్ వైరల్!
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి యూత్‌లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. గతేడాది మంగళవారం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే పాయల్ టాలీవుడ్లో అంతకుముందు ఆర్డీఎక్స్ లవ్’, వెంకీమామ, డిస్కోరాజా, తీస్ మార్ఖాన్, జిన్నా చిత్రాల్లో కనిపించింది. మంగళవారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. పాయల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు యత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి. మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా' అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
షాపింగ్‌లో మంగళవారం బ్యూటీ.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్!
బ్లూ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ హోయలు.. షాపింగ్‌తో బిజీగా ఉన్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్... ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్స్.. అలాంటి డ్రెస్‌లో ఈషా రెబ్బా స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో రితికా సింగ్ బోల్డ్ లుక్స్.. గ్రీన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా హోయలు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
అమ్మకు ఆపరేషన్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన హీరోయిన్
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన తల్లికి సర్జరీ చేయించింది. గతకొంతకాలంగా మోకాలి నొప్పుతో బాధపడుతున్న తల్లికి ఆపరేషన్ చేయించింది. ఈ విషయాన్ని పాయల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమ్మకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిందని, ఇది చాలా నొప్పితో కూడుకున్నదని పేర్కొంది. ఆపరేషన్ విజయవంతమైందని, అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపింది. తనకోసం ప్రార్థించండి అని వేడుకుంది. ఆపరేషన్ అనంతరం తన తల్లి నడిచేందుకు ప్రయత్నిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి.. పాయల్ కెరీర్ విషయానికి వస్తే.. మొదట్లో ఆమె హిందీ సీరియల్స్ చేసింది. దాదాపు ఏడేళ్లపాటు బుల్లితెరకే పరిమితమైన ఆమె 2017లో చన్నా మెరియా అనే పంజాబీ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేసింది. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాయల్ పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. మంగళవారంతో సత్తా చాటిన పాయల్ వరుస పెట్టి సినిమాలు చేసింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. గతేడాది రిలీజైన మంగళవారం సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించింది పాయల్. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో కిరాతక అనే మూవీలో నటిస్తోంది. చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్ సినిమా -
పబ్‌లో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించింది. 3 రోజెస్ అనే సిరీస్ కూడా చేసింది. ప్రియుడితో వాలంటైన్స్ డే కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇకపోతే పాయల్‌కు సౌరభ్ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ పాయల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇంకోసారి కొట్టాల్సింది పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్ నెత్తిని బాటిల్‌తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు సౌరభ్ స్పందిస్తూ.. చాలా బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్ కాదు, రీల్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్లో భాగంగా పాయల్ ఇలా చేసిందని అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) చదవండి: ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ నాలుగు హైలెట్