people
-
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్‌పై జనం ఆగ్రహం
-
జార్ఖండ్‌లో భూకంపం.. వణికిన రాంచీ, జంషెడ్పూర్
రాంచీ: జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల పలు జిల్లాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 9:20 గంటలకు భూకంపం వచ్చింది. వెంటనే జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి.. -
ఈ దేశాల్లోనూ దీపావళి సెలవులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ఈ పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు బంగారం, వెండి, కార్లు, పాత్రలు, కొత్త బట్టలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. అన్ని విద్యా సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలకు దీపావళి రోజున సెలవు ఉంటుంది.విదేశాల్లో దీపావళి వేడుకల విషయానికొస్తే నేపాల్, బాలి, సింగపూర్ సహా పలు దేశాల్లో దీపావళి సందడి కనిపిస్తుంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తారు. అమెరికాలో అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు దీపావళి సందర్భంగా వైట్ హౌస్‌లో దీపం వెలిగిస్తారు. అమెరికాలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లలో దీపావళినాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.ఫిజీ: 1879 నుంచి ఫిజీలో దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.మలేషియా: మలేషియాలో ప్రభుత్వ సెలవుల జాబితాలో దీపావళి కూడా చేరింది. మారిషస్: మారిషస్‌లో హిందువుల జనాభాను పరిగణనలోకి తీసుకుని దీపావళి నాడు ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు. ఈ ద్వీపంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. ఇళ్లను అందంగా అలంకరిస్తారు.నేపాల్: నేపాల్‌లో దీపావళిని తిహార్ లేదా స్వాంతి అంటారు. అక్కడ ఈ పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు.శ్రీలంక: శ్రీలంకలో తమిళనాడు చెందినవారు దీపావళిని జరుపుకుంటారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవులు ఇస్తారు.సింగపూర్: దీపావళి సందర్భంగా సింగపూర్‌లో ప్రభుత్వ సెలవుదినం. లిటిల్ ఇండియాలో దీపావళి నాడు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, టొబాగోలో కూడా దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇస్తారు. ఇది కూడా చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
నంద్యాలలో చిరుత సంచారంతో కలకలం?
నంద్యాల జిల్లా: జిల్లా మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అయితే స్థానికులు తమకు చిరుత కనిపించిందని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాద ముద్రలు సేకరించారు. పాదముద్రలు సరిగ్గా లేకపోవడంతో.. అది పులినా లేక మరేదైనా జంతువు అన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసతమైతే కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, కొద్ది నెలల క్రితం నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులోని పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరున్నీసాపై తాజాగా చిరుతపులి దాడి చేసి తలను తినేసిన సంఘటన స్థానికులను కలచివేసింది. కట్టెపుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమైపె చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇదిలా ఉండగా మహానందిలోనూ చిరుతపులి సంచారంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. నంద్యాల, ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లోని నల్లమల అడవి పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపంలో చిరుతపులులు సంచరిస్తున్నాయి. నెలల వ్యవధిలోనే నలుగురు చిరుతపులి దాడిలో గాయపడ్డారు. ఇటీవల అటవీశాఖలోని మూడాకుల గడ్డ ప్రాంతంలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో విధులు నిర్వహించే అజీమ్‌బాషాపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి చిరుత సంచరిస్తుందనే ప్రచారంతో స్థానికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. -
బహ్రాయిచ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ఒక యువకుడు మృతి చెందిన దరిమిలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐదు వేల మంది స్థానికులు మహసీ తహసీల్ కార్యాలయం ముందు ఆ యువకుని మృతదేహాన్ని ఉంచి, నిరసనకు దిగారు.బహ్రాయిచ్ జిల్లాలోని మహరాజ్‌గంజ్ మార్కెట్లో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దీనిలో ఒక యువకుడు మృతిచెందాడు. రామ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహువా మన్సూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బహ్రాయిచ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న దరిమిలా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటువైపుగా వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.రెహువా మసూర్ గ్రామస్తులు దుర్గామాత విగ్రహంతో నిమజ్జనానికి వెళుతూ, డీజేను ప్లే చేశారు.దీంతో ఆగ్రహంచిన మరోవర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. మరోవర్గం జరిపిన కాల్పుల్లో రామ్ గోపాల్ మిశ్రా(22) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. యువకుని మృతితో ఉద్రిక్తతలు మరింగా పెరిగాయి. వేలాది మంది గ్రామస్తులు నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి, షోరూంకు నిప్పు పెట్టారు. పలు ఇళ్లకు కార్లకు కూడా నిప్పు పెట్టారు.నిరసనకు దిగిన వారితో పోలిస్తే పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి లేదు. అయితే ఈ కేసులో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదిపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి
మైహార్: మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు రోడ్డు పక్కనే నిలిపివుంచిన ఉన్న హైవా వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా తొమ్మదిమింది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు.ఈ ఘటనలో గాయపడిన వారిని మైహర్, అమర్పతన్, సత్నా జిల్లా ఆసుపత్రులకు తరలించారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు ప్రయాగ్‌రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్‌పూర్ వెళుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా వెళుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 53 సీట్లున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే, నాదన్, మైహార్ పోలీసులు ఎస్‌డిఎం వికాస్ సింగ్, తహసీల్దార్ జితేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ సుధీర్ కుమార్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ కట్ చేసి, ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికుల్లోని కొందరు కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో రోజుకు వెయ్యి మందికి పైగా జనం కుక్క కాటుకు గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు, జీటీబీ, డీడీయూ, లోక్‌నాయక్, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రేబిస్ వ్యాక్సిన్ కోసం ప్రతి రోజు వెయ్యి మందికి పైగా బాధితులు వస్తున్నారు.కుక్కకాటు కేసుల్లో 60 శాతం మంది చిన్నారులేనని వైద్యులు చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి చెందిన యాంటీ రేబిస్ క్లినిక్ హెడ్ డాక్టర్ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రోజూ దాదాపు 500 రేబిస్ టీకాలు వేస్తున్నారని తెలిపారు. వీరిలో 200 మంది కొత్త రోగులు కాగా, 300 మంది పాత రోగులు. లోక్ నాయక్ ఆస్పత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతూ సక్సేనా మాట్లాడుతూ తమ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 100 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. సెలవు దినాల్లో వీరి సంఖ్య మరింతగా పెరుగుతున్నదన్నారు.సాధారణంగా కుక్క, పిల్లి, నక్క, తోడేలు, గబ్బిలం లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు బాధితుడు తప్పనిసరిగా రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా జంతువు కరచిన వెంటనే బాధితునికి మొదటి డోస్ ఇస్తారు. రెండవది మూడు రోజులు, మూడవది ఏడు రోజులు, నాల్గవ డోస్ 28 రోజులకు అందిస్తారు. మొదటి డోస్‌తో పాటు యాంటీ రేబిస్ సీరమ్ (ఏఆర్ఎస్)ను కూడా బాధితునికి ఇస్తారు.ఇది కూడా చదవండి: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం -
ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. రంగపురి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే కూతుళ్లను హత్య చేసి, ఆపై తాను విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటనలో సల్ఫా మాత్రలు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు కూతుళ్లలో ఒక కుమార్తె అంధురాలు. మరో కుమార్తె కూడా అంగవైకల్యంతో బాధపడుతోంది. సంఘటనా స్థలంలో సల్ఫేట్ సాచెట్లను పోలీసులు గుర్తించారు. ఒక గదిలోని డబుల్ బెడ్‌పై కుమార్తెల మృతదేహాలు పడి ఉండగా, రెండో గదిలో తండ్రి మృతదేహం లభ్యమైంది. అయిదుగురి నోటి నుండి తెల్లటి నురగ వచ్చినట్లు కనిపిస్తోంది. వీరందరి మెడకు ఎర్రటి దారం కట్టివుంది.ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటి యజమాని, తండ్రి హీరాలాల్(50) కార్పెంటర్‌గా పనిచేస్తుండగా, ఏడాది క్రితం అతని భార్య క్యాన్సర్‌తో మృతిచెందింది. ఈ నెల 24 నుంచి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టగా, వారికి లోపల ఐదు మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్‌లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బుండి: రాజస్థాన్‌లోని బుండిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎకో వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో హిడోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ నేషనల్ హైవేలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైవేపై ఉన్న కెమెరాలు, టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన గురించి బుండి ఏఎస్పీ ఉమా శర్మ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. కాగా రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఓ కారు రెండు బైక్‌లను ఢీకొంది. ఈ ఘటనలో కూడా ఆరుగురు మృతి చెందారు.ఇది కూడా చదవండి: రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి -
బాబు, పవన్ పై పిఠాపురం ప్రజల ఆగ్రహం
-
కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ మిగలలేదు..
-
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్‌యార్డ్‌లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్‌లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా..
-
వరద సహాయక చర్యల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం
-
చుట్టుముట్టిన కష్టాలు
కళ్ల ముందు నీళ్లు పారుతున్నాయి.. కానీ గొంతు తుడుపుకొనేందుకు గుక్కెడు మంచి నీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడనీయని అంధకారం.. విష పురుగులు విలయతాండవం.. ఇళ్లు, వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం.. పట్టపగలే పీక్కుతింటున్న దోమలు. ఇదీ.. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజల దీన స్థితి.సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తురకపాలెం తదితర గ్రామాలను మంగళవారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒకవర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్లు చెబుతున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లను ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి.దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు, ఆహారం వచ్చిందంటే చాలు.. వాటి మీదికి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మంచి నీళ్లిచ్చినా తాగి ప్రాణాలు దక్కించుకుంటామని పలువురు బాధితులు ‘సాక్షి’తో చెప్పారు.అంధకారంలో గ్రామాలుమూడు రోజులుగా 27 లంక గ్రామాలను వరద చుట్టుముట్టగా గత రెండు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లంక గ్రామాల పరిధిలో ఉన్న రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీటిలో మునగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్ లైన్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని పూరిళ్లతో పాటు వీధుల్లోనూ నీరు అలానే ఉంది. విషపురుగులు బెడద పెరిగింది. దోమలు పట్టపగలే పీక్కుతింటున్నాయి. దీనికి తోడు పారిశుధ్యం అధ్వానంగా మారడంతో జ్వరాలు పెరుగుతున్నాయి. బయట ఆస్పత్రులకు వెళదామంటే బోట్లు లేని దుస్థితి. నీరు, భోజనం సరఫరా చేయడానికి వచ్చిన బోట్లలో కొంతమందిని బయటకు తరలించి అక్కడి నుంచి తెనాలి, గుంటూరులోని ఆస్పత్రులకు పంపారు. బోట్లు లేక.. ఊరు దాటలేక... లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు బోట్లు అందుబాటులో లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బయటకు వచ్చి సొంతంగా తాగునీరు, ఆహారం, ఇతర వస్తువులు తెచ్చుకుందామన్నా ప్రభుత్వం తగినన్ని బోట్లను ఏర్పాటు చేయలేదు. అలాగే పశువులకు తినేందుకు మేత లేక అవి దీనంగా అరుస్తున్నాయి. వేలాది ఎకరాల్లోని అరటి, తమలపాకు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు మొత్తం నీటి పాలయ్యాయి. ఒక్కో ఎకరానికి రెండు నుంచి రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఎకరం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశారు. వరద రాకతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బోటు లేదు.. ఓటి మాటలేసీఎం చంద్రబాబు దగ్గరుండి మూడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ.. కనీసం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటుచేయలేదనేందుకు నిదర్శనం ఈ చిత్రం. విజయవాడలో వరద నీటిలో థర్మాకోల్ షీట్‌పై వెళుతున్న దివ్యాంగురాలిని చంద్రబాబు పరామర్శిస్తున్న దృశ్యమిది. -
AP: వరద బీభత్సం.. సింగ్‌నగర్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, విజయవాడ: సింగ్‌నగర్‌లో వరద బీభత్సం సృష్టించడంతో ప్రజల కష్టాలు హృదయ విదారకంగా మారాయి. వరద దాటే ప్రయత్నం చేస్తూ మహిళ మృతి చెందింది. గంగానమ్మ ఆలయం ఎదురుగా మసీదు రోడ్డులో ఈ ఘటన జరిగింది. నీటిలో నుంచి దాటుతుండగా మహిళ గుండెపోటుతో మరణించింది. తరలించలేక మృతదేహాన్ని కారుపైనే పెట్టి వదిలేశారు స్థానికులు. మొత్తం జలమయం కావడంతో జనజీవనం స్తంభించింది.కాగా, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కీసర-ఐతవరం మధ్య రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. తీరం వెంబడి 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికాలు జారీ చేసింది. -
వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
కాలుష్య కోరల్లో కుత్బుల్లాపూర్
-
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్