Poonam Kaur
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. -
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్‌కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్‌పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
' సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు సమస్య లేదు'.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ కావడంపై తనదైన శైలిలో పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రితో కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ట్విటర్ వేదికగా ప్రశ్నించింది.మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. కేవలం హీరోలకు, బిజినెస్ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చింది. తాజా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతోందని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.కాగా.. సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, త్రివిక్రమ్, వెంకటేశ్ లాంటి ప్రముఖులంతా సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరఫున ఏ ఒక్క మహిళ డైరెక్టర్ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీన్ని ఉద్దేశించే నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue - none can have one .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024 -
అల్లు అర్జున్‌పై నటి పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడంతో మరోసారి అల్లు అర్జున్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశాడని, అరెస్ట్ కోసం వెళితే దరుసుగా ప్రవర్తించారంటూ బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ..అవన్నీ నూటికి నూరు శాతం అబద్దాలేనని స్పష్టం చేశాడు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ.. మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించండం బాధించిందన్నారు. (చదవండి: అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన డీజీపీ)ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ వివాదం గురించే చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో నటి పూనమ్ కౌర్ పుష్ప 2 చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చాలా బాగుందని చెబుతూ.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని తెలంగాణలోని సమ్మక్క సారలక్క జాతరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘మొత్తానికి పుష్ప-2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు. మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపించారీ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు’ అని పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. (చదవండి: పీలింగ్స్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో స్టెప్పులు.. మొదట అసౌకర్యంగా ఫీలయ్యా..)ఇక పుష 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Just completed watching #pushparaj , loved the Gangamma Jatra episode,refelects the #samakkasarakka like culture from #telangana , can’t imagine a talent other than #alluarjun adorning the character,thank you to the makers for reflecting our authentic Indian self so beautifully.— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 21, 2024 -
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఓ తెలుగు దర్శకుడు.. ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్‌నే నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)'ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడు. మా(మూవీ ఆర్టిస్ట్ అసియేషన్) జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్‌గా మారిన నటుడు కాదు. అయితే ఈ విషయంలోకి తనను ఓ నటుడు/రాజకీయ నాయకుడు అనవసరంగా లాగారు' అని పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ పెట్టింది.పూనమ్ ట్వీట్ పెట్టింది కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే నిజాన్ని బయటపెట్టింది. తాజా ట్వీట్ చూస్తే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌నే పరోక్షంగా టార్గెట్ చేసిందా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్‌కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్‌పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్‌ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్‌ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
పవన్ తిరుమల పర్యటన.. పూనమ్ ట్వీట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా.. సోషల్ మీడియా ద్వార నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటునే..సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌లపై ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. వారిద్దరిని విమర్శిస్తూ గత కొన్నాళ్లుగా ఆమె ట్వీట్స్ చేస్తోంది. కొన్ని ప్రత్యేక్షంగా, మరికొన్ని సార్లు పరోక్షంగా ట్వీట్లు చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తుంటుంది. పవన్ కల్యాణ్‌పై ఆమె చేసిన ట్వీట్లు గతంలో దుమారం రేపాయి. తాజాగా మరోసారి పవన్‌ని విమర్శిస్తూ ట్వీట్ చేసింది పూనమ్. నిబంధనలకు విరుద్ధంగా పవన్ పర్యటనడిప్యూటీ సీఎం పనన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. వాస్తవానికి భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్దంగా పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. అలాగే నిషేదంలో ఉన్న వావనాలను కొండపైకి అనుమతి ఇస్తూ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.(చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్..)ప్రతి ఒక్కరికి కూతురు ముఖ్యమే: పూనమ్ కౌర్పవన్ తిరుమల పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం దర్శనం కోసం సాధారణ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలబెట్టడం సరికాదంటున్నారు నెటిజన్స్. పవన్ ఆశిస్సుల కోసం అధికారులు అత్యత్సాహం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు. మరోవైపు కూతుళ్లతో కూడా రాజకీయం చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక పవన్‌పై తరచు విమర్శలు చేసే పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా తిరుమల పర్యటనను తప్పుపట్టింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ తిరుమల పర్యటన చేసిన నేపథ్యంలో ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే పూనమ్ ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ తన రాజకీయ ప్రయోజనాలకు కోసం కూతుళ్లను కూడా వాడుకుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Everyone’s daughter is important !!!— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 2, 2024 -
త్రివిక్రమ్ పై పిర్యాదు చేశా.. పరిష్కారం ఏది ..?
-
KSR Live Show: దర్శకుడు త్రివిక్రమ్ పూనమ్ కౌర్ ట్వీట్
-
జత్వాని కేసుపై పెట్టిన ఫోకస్.. పూనమ్ కౌర్ కేసుపై అదే స్పీడ్ ఉండాలి..
-
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
జానీని ‘మాస్టర్’ అని పిలవకండి: హీరోయిన్ పూనమ్ కౌర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియా జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలు మార్లు వేధింపులకు కూడా గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (చదవండి: మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి)ఈ విషయం బయటకు రాగానే పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్‌పై ఫైర్ అవుతూ.. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. సింగర్ చిన్మయి స్పందిస్తూ.. యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా జానీ మాస్టర్‌పై సీరియస్ అయింది. ఇకపై అతన్ని మాస్టర్ అనే పిలువొద్దని ఎక్స్ వేదికగా కోరింది. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. Accused ‘shaik jani’ should not be called a master anymore ,Have some respect for the word ‘Master’ 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2024 -
'పవర్ రేపిస్ట్' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పలు సంఘటనల్లో ఆమె వెంటనే రియాక్ట్ అవుతారు. సత్యవేడుకు చెందిన ఒక మహిళ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మీద తాజాగా పూనమ్ సంచలన ట్వీట్ చేశారు. ఆమె చేసిన కామెంట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది."పవర్ రేపిస్ట్"ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందిస్తున్నానంటూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేశారు. అతను అలా తన భార్యకు అండగా లేకుండా ఉండుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 'ఇలాంటి సంఘటన ఎదురైతే అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా ఉండమని చెబుతారు.. కానీ, అతను తన భార్యను సపోర్ట్ చేస్తూ తప్పును బహిర్గతం చేశాడు.తన భార్య మీద అత్యాచారం చేసిన ఎమ్మెల్యే వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా ఎంకరేజ్ చేసిన ఆ భర్తకు నా కృతజ్ఞతలు. అత్యాచారానికి గురైన మహిళ దైర్యంగా బయటికొచ్చి మాట్లాడిన ఆ మహిళను అభినందిస్తున్నాను.' అని పూనమ్ పేర్కొన్నారు.పూనమ్ కౌర్ చేసిన 'పవర్ రేపిస్ట్' అనే వ్యాఖ్యం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు నెట్టింట పెద్ద దుమారమే రేగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న బాధిత మహిళ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సంచలన ఆరోపణలతో పాటు వీడియోలను విడుదల చేసింది. ఆయన తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారం చేశారని చెబుతూ ఆమె మీడియా ముందుకు వచ్చింది.Highly appreciative of the husband who encouraged his partner to expose the “ POWER RAPIST” - had he not done that - the MLA from #TDP wouldn’t have be suspended - many would just say they in power keep quiet - kudos to him 🙏 and the woman who exposed him - gives hope . 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 5, 2024 -
జరిగింది దారుణం.. ఐక్యంగా పోరాడితే నిజం బయటకు..
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: విద్యార్థినుల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మాయిలారా. మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ.. బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన ఈ పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను.‘నేరస్థులు ఎలా రక్షించబడతారు, బాధితులు ఎలా అవమానింపబడతారు’ అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. వ్యక్తులు ఎంతశక్తిమంతమైన వారైనా.. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలామంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలామంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగించింది. నేరస్థులకు ఎంతటి శక్తిమంతులైనా.. ఎవరు సహకరిస్తున్నా.. ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది’ అని పూనమ్ కౌర్ ఆ లేఖలో పేర్కొన్నారు.నిందితులను శిక్షించాలి బాత్రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు చిత్రీకరించారని తెలిసి భయపడిపోయాం. వీటిని ఎందుకు ఏర్పాటు చేశావని అడిగితే.. ఆ విద్యార్థిని నీ దిక్కు ఉన్నచోట చెప్పుకోమని బెదిరించింది. హాస్టల్, కళాశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదు. నిందితురాలికి వత్తాసు పలుకున్నారు. ఇదెక్కడి న్యాయం. నిజాలు నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలి. – సుజన, హాస్టల్ విద్యార్థిని వణికిపోతున్నాంవాష్రూమ్లో కెమెరాలు పెట్టారని తెలిసినప్పటి నుంచి నాతో పాటు సహచర విద్యార్థినులు ఆందోళనలో ఉన్నారు. ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాం. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. న్యాయం చేస్తారనుకున్న పోలీసులు పట్టించుకోవాల్సింది పోయి మమ్మల్నే బెదిరిస్తున్నారు. అనుమానితురాలిగా ఉన్న విద్యార్థినికి సకల మర్యాదలు చేసి గదిలో ఉంచుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. మాకు న్యాయం చేయాలి. – స్వప్న, హాస్టల్ విద్యార్థిని బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు న్యాయం చేయాలని విద్యార్థినులందరూ ఆందోళన చేస్తున్నా ఎవరికి తమ గోడు పట్టడం లేదు. నిజాలు నిగ్గు తేల్చి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భరోసా కలి్పంచాల్సింది పోయి హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తమను బెదిరిస్తున్నారు. పోలీసులే న్యాయం చేయాల్సింది పోయి వారే తమను బెదిరిస్తే తమకు న్యాయం చేసే వారు ఎవరూ. నిందితులను కఠినంగా శిక్షించి తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. – సత్యరాణి, విద్యార్థిని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి చిత్రాలను చిత్రీకరించిన ఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఘటనలు చాలా దారుణం. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడే వ్యక్తుల్ని వదలకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – మైల రత్నకుమారి, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం నమ్మి పంపిస్తే ఇలాంటి మోసాలు చేయొచ్చా కాలేజీల యాజమాన్యాల మీద నమ్మకంతో పిల్లల్ని మీ దగ్గర వదిలిపెడుతున్నాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన చోటే ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరగడం అత్యంత హేయం. ముందుగా కాలేజీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయాలు లేకుండా ఎవరికి వారే మన ఇంటి పిల్లలు అనుకుని నిందితుల్ని పట్టుకుని శిక్షించాలి. – ఎ.సత్యవతి, కృత్తివెన్ను రాజకీయాలు కాదు వాస్తవాలు కావాలి గుడ్లవల్లేరు ఘటన చాలా దురదృష్టకరం. దీనికి భాద్యులు ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ పెద్దలు సైతం రాజకీయాలు పక్కనపెట్టి వాస్తవాలను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఆడపిల్లల భవిష్యత్, వారి జీవితాలకు సంబంధించిన విషయం. – జె.ఝాన్సీ, యండపల్లి, కృత్తివెన్ను మండలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులకు ఈ దుస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఈ దుస్థితి దాపురించింది. వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అలాంటిదేమీ లేదని ప్రభుత్వం కితాబివ్వడం అత్యంత హేయం. విద్యార్థినులను కట్టడి చేస్తూ.. కాలేజీ యాజమాన్యం నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా.. వారిని బలవంతంగా ఇళ్లకు పంపించడం దుర్మార్గం. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏపీలో రక్షణ కరువైంది ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే. గుడ్లవల్లేరు ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకు రాలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏం చేస్తున్నట్టు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి -
గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి.. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారని, ఏకంగా 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు చిత్రీకరించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదలా ఉండగా హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ సంఘటనపై ట్వీట్ చేసింది. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. బయట ఎదుర్కొన్న పరిస్థితులు దారుణం. నేరస్థులని రక్షించడం, బాధితులకు అన్యాయం జరగడం లాంటి చాలా అనుభవాలతో నేను అలసిపోయాను. వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు బహిర్గతం చేస్తారని నిర్ధారించుకోండి''ఓ అమ్మాయి చాలామంది అమ్మాయిలని ఇలా ప్రమాదంలో నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తోంది. నేరస్తులు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ, అభినందనలతో' అని పూనమ్ కౌర్ నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)#AndhraPradesh pic.twitter.com/DgpWBaw1dO— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 31, 2024 -
చేనేత దినోత్సవం.. కేరళ చీరలో మెరిసిన పూనం కౌర్ (ఫొటోలు)
-
జీవితాలను నాశనం చేస్తారంటూ 'పూనమ్' డైరెక్ట్ ఎటాక్
పూనమ్ కౌర్.. సామాజిక బాధ్యతతో వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని చాలా క్లియర్‌గా స్పందించే హీరోయిన్. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ఇద్దరపై నర్మగర్భ ట్వీట్లు కూడా వేస్తుంటుంది. అయితే తాజాగా డైరెక్ట్‌గానే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పూనమ్ కౌర్ ట్వీట్ చేసిందంటే చాలు కొందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం కూడా ఉంది. కొందరి గురించి తాను నోరు విప్పితే వారికి పుట్టగతులు కూడా ఉండవ్ అనేలా రియాక్షన్ ఇచ్చింది. తాజాగా ఆమె మాటల రచయిత త్రివిక్రమ్ మీద విరుచుకుపడింది.ఏం జరిగింది..? డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో జల్సా సినిమాలో బ్రహ్మానందంతో పవన్ కల్యాణ్ మాట్లుడుతున్న సీన్స్‌లో రేప్ డైలాగ్స్ రన్ అవుతాయ్. ఆ వీడియో చాలామంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇలాంటి విషయాల మీద కూడా స్పందించాలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఇలా కామెంట్ చేసింది. 'త్రివిక్రమ్ నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ ఆశించడం తప్పే అవుతుంది' అని తెలిపింది. అయితే, విజయ్ నగేష్ అనే ఒక నెటిజన్ రియాక్ట్ ఇలా అయ్యాడు 'మీ వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వ్యక్తపరచకండి' అని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు త్రివిక్రమ్ టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.జీవితాలను నాశనం చేస్తాడు: పూనమ్పూనమ్ కౌర్‌కు ఉచిత సలహా ఇచ్చిన సదరు వ్యక్తికి కౌంటర్ కూడా ఇచ్చింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసు. నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అని పూనమ్ మరోసారి ఫైర్ అయింది. Dialouges written by trivikram- don’t expect anything worthwhile .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2024 -
మోసం, కుట్రలతో గెలవడం కంటే ఓటమే మేలు: టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్
నటి పూనమ్ కౌర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.పూనమ్ కౌర్ తన ట్వీట్లో రాస్తూ.. కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏపీలో జరిగిన ఎన్నికల గురించే పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024 -
గీతాంజలికి న్యాయం జరగాలి.. ‘జల్సా’ తో కట్టుకథ అల్లారు: పూనమ్ కౌర్
టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, పిల్లలను చదించడానికి అమ్మఒడి పథకం కింద డబ్బులు అందించారని, ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైఎస్సార్సీపీయే గెలుస్తుదని ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు గీతాజంలిపై అసత్యాలను ప్రచారం చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ మానసికంగా హింసించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల దాడికి తట్టుకోలేక గీతాంజలి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషాదాకర ఘటనపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. అలాగే ‘జల్సా’ సినిమా సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించింది. గీతాంజలికి న్యాయం జరగాలి ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్లైన్ ట్రోలర్స్ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు. దయచేసి వారిని శిక్షించండి. ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారనే ఎక్కువ పాపులర్ అయ్యారు పూనమ్ కౌర్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై ఆమె చేసే ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి బాగోతాలను నిర్భయంగా బయటపెట్టే ఏకైక నటి పూనమ్ మాత్రమే. అందుకే పవన్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. అంతేకాదు ఆమెపై ఓ కట్టుకథను కూడా అల్లారు. జల్సా సినిమాలో అవకాశం అడిగే ఇవ్వలేదని.. అందుకే ఆమె వారిద్దరిని టార్గెట్ చేసిందని ప్రచారం చేశారు. (చదవండి: సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?) తాజాగా దీనిపై స్పందించింది పూనమ్ కౌర్. అవన్నీ పూకార్లు మాత్రమేనని.. తాను ఇంత వరకు ఎవ్వరినీ కూడా అవకాశాలు అడుక్కోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన మీద మాత్రమే ఆదారపడకుండా ఎప్పుడూ ప్రత్యామ్నాయ జీవన మార్గాల కోసం వెతుకుతుంటానని చెప్పింది. తాను నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువని, దయచేసి అలాంటి రూమర్స్ నమ్మకండి అని మరోసారి తన అభిమానులను కోరింది పూనమ్. #JusticeForGeetanjali , I was confused about who led her to committing suicide , whether it’s online trollers of a particular party who are truly capable of physiologically abusing a woman or a volunteer who seems to go invisible. Please punish . Young girl kids deserve justice. — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 12, 2024 -
పూనమ్ కౌర్ ట్వీట్.. సీఎం జగన్ సాయం మరోసారి తెరపైకి
నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆమె స్పందిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కొద్దిరోజుల క్రితం ఆమె ప్రసంశించారు. 'కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో అండగా నిలిచిందని ఆమె కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఆమె తన ఎక్స్ పేజీలో పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న తీరుపై నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలయిపోయి, బంపర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే కోవిడ్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఏడాదిలోనూ పూర్తిగా కోవిడ్ ఆంక్షల మధ్యనే ఆయన పాలన సాగింది. అలా రెండేళ్ల పాటు కరోనాపై ఏపీ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎనలేని మేలు చేశాయి. ఆ పరిస్థితుల్లో ఎందరో ఉపాధి కోల్పోయి లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తున్న చోట కరోనా పేరుతో జీతాలలో కోతలు పడటమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో అనేక మందికి సీఎం జగన్ ఇస్తున్న ఈ పథకాలు ఎంతో లబ్ధిని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతులు, అమ్మ ఒడి లబ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు నడుపుకునే వాళ్లు, పూజారులు, పాస్టర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ పథకాలు వేరే! ప్రజల క్షేమం కోరుకున్న ఆయనపై ప్రతి పక్షాల నుంచి విమర్శలు వచ్చినా, పంచుడు కార్యక్రమాలు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నా.. సీఎం జగన్ తన దారిలో వెనక్కు తగ్గలేదు. అప్పు చేసైనా సరే ముందుగా ప్రజల ఆకలి తీర్చాలని జగన్ భావించారు. కరోనా సమయంలో కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అప్పుడు ఆ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు క్రమం తప్పకుండా అందాయి. దీనంతటికి కారణం సీఎం జగన్ తీసుకున్న డైనమిక్ నిర్ణయాలు అని చెప్పవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం అప్పట్లో క్లియర్‌గా తేలిపోయింది. రోగానికి భయపడి చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కానీ సీఎం జగన్ మాత్రం తన మంత్రుల సమీక్షలతో ప్రజలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. అలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో పారాసెట్మాల్ వేసుకోమని జగన్ గారు చెబితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా చివరకు సీఎం జగన్ చెప్పిన సూత్రాలనే ప్రపంచవ్యాప్తంగా పాటించారు. కోవిడ్ సమయంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ఎలాగైనా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన అనునిత్యం తపనపడ్డారు. మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్‌ది కాక ఇంకెవరిది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టీకాలు కూడా దొరకకపోవడంతో బార్డర్ దగ్గరగా ఉన్న ప్రజలు ఏపీలోకి వచ్చి టీకాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తమ ఇంటికి సంతోషంగా వెళుతున్న సమయంలో రూ. 2000 వారి జేబులో పెట్టి పంపించారు. లాక్డౌన్ సమయంలో వాహనాలు లేకపోవడంతో కాలినడక ద్వార తమ గమ్యానికి చేరుకోవాలని ఎందరో రోడ్డు బాట పట్టారు. వారిలో కొందరికి కనీసం చెప్పులు కూడా లేని పరిస్థితి. అలాంటి వారి కోసం పలు చోట్ల చెప్పుల స్టాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేమైనా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్ అని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేసేవారు. కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని పూనమ్ తాజాగా కొనియాడటంతో మరోసారి నెటిజన్లు కూడా ఆనాటి రోజులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు. #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 -
సీఎం జగన్ పై నటి పూనమ్ ప్రశంసలు