Pratyush Sinha Committee
-
రోస్ అటేనా!
⇒ కలెక్టర్ ఆంధ్రకే కేటాయింపు ⇒ తుది నివేదికలోనూ ‘ప్రత్యూష్’ వెల్లడి ⇒ తెలంగాణకే ‘రొనాల్డ్ రోస్’ సుముఖత ⇒ కేసీఆర్ లేఖను కేంద్రం పరిశీలిస్తుందా? ⇒ రెండు రోజులలో బదిలీపై స్పష్టత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఐఏఎస్ అధికారి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌ను ఆంధ్రకే కేటాయించారు. గురువారం ప్రత్యూష్‌సిన్హా కమిటీ కేంద్రానికి సమర్పించిన తుది నివేదికలోనూ ఈ విషయూన్ని స్పష్టం చేశారు. ఈ నివేదికను కేంద్రం కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ బదిలీ అనివార్యమన్న చర్చ జరుగుతోంది. తాను పనిచేస్తూ.. అధికార యంత్రాంగం తో చేయిస్తూ.. క్షేత్రస్థాయి పర్యటనలు... అత్మీయానురాగాల పలకరింపులతో అన్ని వర్గాలతో మమేకం అవుతూ జిల్లా పాలనపై తనదైన మార్కు వేసి అనతికాలంలో డైనమిక్ కలెక్టర్‌గా రొనాల్డ్‌రోస్ పేరు తెచ్చుకున్నారు. డిసెంబర్ చివరివారంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యూ రుు. జనవరి మొదటి వారంలో 17 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రలో చేరేందుకు ప్రభుత్వం అనుమతి కూడ ఇచ్చింది. ఆ సమయంలోను కేంద్రం కే టా యింపుల ప్రకారం కలెక్టర్ ఆంధ్రకే వెళ్తారన్న ప్రచారం జరిగింది. నాటి నుంచి సందిగ్ధమే! ఐఏస్ల కేటాయింపుల ప్రక్రియ మొదటి నుంచి జరుగుతున్నా, రోనాల్డ్‌రోస్‌కు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో అయన బదిలీపై సందిగ్ధం నెల కొంది. అదే సమయంలో తెలంగాణ రాష్ర్టంలో పనిచేస్తున్న సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్య, జయేష్తోపాటు రొనాల్డ్‌రోస్‌ను రాష్ట్రంలోనే కొనసాగించాలని సీ ఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్ర ప్రభుత్వం సైతం అక్కడే పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులను కోరుతుండటంతో తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారులను ఇక్కడే కొనసాగించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో పరస్పర బదిలీల (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్) అంశాన్ని కూడా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెట్రీలు చర్చించారు. ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా, పదవీ విరమణకు రెండేళ్లకాలం ఉంటే వారి కోరిక మేరకు, వారిని అదే రాష్ర్టంలో కొనసాగించవచ్చు. అదే విధంగా అఖిల భా రత సర్వీసులో దంపతులు ఇద్దరినీ ఒకే రాష్ట్రంలో కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు కూడా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని రోస్‌ను తెలంగాణలోనే ఉం డేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయడంతో ఆయన జిల్లాలో కొనసాగడం ఖాయమైనట్లు భావించారు. కలెక్టర్ సైతం అధికార యంత్రాంగం, ప్రజాప్రతి నిధులను కలుపుకొని జిల్లా సమగ్రాభివృద్దిలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో గురువారం ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది నివేదిక ఇవ్వడం.. కేంద్రం ఆమో దం తెలపడంతో ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. కేసీఆర్ ఇచ్చిన లేఖను కేంద్రం పరిశీలిస్తుందా? ఇరు రాష్ట్రాల సీఎస్ల చర్చించిన విధంగా పరసర్ప బదిలీల ప్రకారం రోనాల్డ్‌రోస్ ఇక్కడే కొనసాగుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. -
ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం ప్రత్యూష్ సిన్మా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణా రావు, రాజీవ్ శర్మ పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్ అధికారుల పంపిణీ గురించి చర్చించారు. పలు అధికారుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన అధికారుల పరస్పర మార్పిడి, భార్యాభర్తల అంశాలను నివేదించారు. -
ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం
-
ఐఏఎస్‌ల విభజనకు ప్రధాని ఆమోదం
* ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులతోనే జాబితా ఖరారు * ఏపీకి 166, తెలంగాణకు 128 మంది ఐఏఎస్‌లు * ఐపీఎస్‌ల్లో ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది * ఆంధ్రాకు 71, తెలంగాణకు 56 మంది ఐఎఫ్ఎస్లు * ఏపీ సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ సహానీ తెలంగాణకు.. పీవీ రమేష్ ఆంధ్రాకు * జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ కూడా ఏపీకే * పక్షం రోజుల్లోగా అభ్యంతరాల స్వీకరణ, 3 నెలల్లో తుది కేటాయింపు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఐఏఎస్, ఐపీఎస్‌ల తాత్కాలిక కేటాయింపులకు(ప్రొవిజినల్ అలాట్మెంట్) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆమోదముద్ర వేశారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన తుది సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనుంది. తర్వాత వారం రోజుల్లోగా తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అధికారులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక కేటాయింపులపై ఏవైనా అభ్యంతరాలుంటే.. పక్షం రోజుల్లోగా తెలియచేయాలని, అలాగే పరస్పర మార్పిడి(స్వాపింగ్), భార్యాభర్తల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే.. వాటిని పరిశీలించి మూడు నెలల్లోగా తుది జాబితాను ప్రధాని ఆమోదంతో కేంద్రం ప్రకటిస్తుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. జూన్ ఒకటో తేదీ నాటికి అందుబాటులో ఉన్న 294 మంది ఐఏఎస్ అధికారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 166 మందిని, తెలంగాణకు 128 మందిని కేటాయించారు. అలాగే 211 మంది ఐపీఎస్‌ల్లో ఏపీకి 119 మంది, తెలంగాణకు 92 మంది, ఇక 127 మంది ఐఎఫ్ఎస్ అధికారుల్లో ఏపీకి 76 మంది, తెలంగాణకు 51 మంది దక్కారు. ఈ అధికారుల విభజన కోసం గత మార్చి 28న ప్రత్యూష్ సిన్హా కమిటీని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధికారుల నుంచి సీల్డ్ కవర్లో ఆప్షన్ ఫారాలను కమిటీ తీసుకుంది. జూన్ 2న రాష్ర్ట విభజన తర్వాత ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ కమిటీలో సభ్యులుగా చేరారు. అధికారులిచ్చిన ఆప్షన్లు, రోస్టర్ విధానాన్ని అనుసరించి తొలి జాబితాను ఆగస్టు 22న కమిటీ ప్రకటించింది. ఈ సమయంలోనే.. ఏ అధికారి ఏ రాష్ట్రానికి ఆప్షన్(ఐచ్చికం) ఇచ్చారన్న విషయాన్నీ వెల్లడించింది. అధికారుల ఆప్షన్లతో సంబంధం లేకుండా రోస్టర్ పద్ధతిలోనే రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఆ తర్వాత పక్షం రోజుల గడువులో 70 మంది అధికారులు తమ అభ్యంతరాలను కమిటీకి అందించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను అక్టోబర్ 10న ప్రత్యూష్ సిన్హా కమిటీ వెల్లడించగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రధాని కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైలు వెనక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మరో రెండు సార్లు కమిటీ సమావేశమై కేటాయింపులను ఖరారు చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారులను ఇన్సైడర్లుగా పరిగణించి వారు చదువుకున్న ప్రాంతం, సర్వీస్‌లో చేరడానికి ముందు వారిచ్చిన పోస్టల్ అడ్రస్‌ల ఆధారంగా పంపిణీ చేయాలని కమిటీ నిర్ణయించింది. రాష్ర్టేతర అధికారులను రోస్టర్ విధానంలో విభజించింది. దీంతో ఎట్టకేలకు రూపొందిన తుది తాత్కాలిక జాబితాకు ప్రధాని ఆమోదం లభిం చింది. దీనిపై 15 రోజుల్లోగా వచ్చే అభ్యంతరాలన్నింటినీ మూడు నెలల్లో పరిష్కరించి తుది జాబితాను కేంద్రం విడుదల చేయనుంది. ఆంధ్రాకు పీవీ రమేశ్, సోమేశ్‌కుమార్ తెలంగాణకు బినయ్‌కుమార్ తాత్కాలిక కేటాయింపులో భాగంగా తెలంగాణ కేడర్‌లోకి వచ్చిన డాక్టర్ పీవీ రమేశ్‌ను తాజా జాబితాలో ఆంధ్రాకు కేటాయించారు. కాగా, గత జాబితాలో మార్పులకు కారణమైన బినయ్‌కుమార్ తాజా జాబితాలో తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం ఏపీ కేడర్‌లో ఉన్న నీలం సహానీ, ఆమె భర్త అజయ్ సహానీ ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యకార్యదర్శిగా ఉన్న అజయ్ సహానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. చందనాఖన్, ఎస్పీ సింగ్, అజయ్‌జైన్‌ను తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రాకు కేటాయించాలంటూ జేఎస్వీ ప్రసాద్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చినట్లు సమాచారం. ఆయనను తెలంగాణాకే కేటాయించింది. తెలంగాణలో ఉన్న బీపీ ఆచార్య, నీరబ్‌కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలిని మిశ్రా, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రాకు కేటాయించారు. -
అధికారుల విభజన ప్రక్రియ పూర్తి
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిలభారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియ పూర్తి అయింది. అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం లభించింది. అధికారుల విభజన ఫైలుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. రెండు రాష్ట్రాలకు కేటాయించిన అధికారుల జాబితా ఎల్లుండు విడుదల చేసే అవకాశం ఉంది. -
ఇక తుది నిర్ణయం మీదే!
* కేంద్రం వద్దకు చేరిన ఇరు రాష్ట్రాల పంచాయితీ * అన్ని వివాదాలను కేంద్రమే పరిష్కరించాలని ఇద్దరు సీఎస్ల వినతి * కేంద్ర హోం కార్యదర్శితో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీ * కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలతోనూ వేర్వేరుగా సమావేశం * అన్ని అంశాలపై మరోసారి వాదనలు వినిపించిన అధికారులు * ఉద్యోగుల పంపకాలపై నోడల్ కమిటీని వేయాలని ప్రతిపాదన * ఐఏఎస్‌ల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని ఏపీ సీఎస్ విజ్ఞప్తి * ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకోవాలన్న టీ-సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన అనేక సమస్యలకు సంబంధించిన పంచాయితీ కేంద్రం వద్దకు చేరింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆయా సమస్యలపై రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పరిశీలించి, న్యాయ సలహా మేరకు తుది నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు స్పష్టం చేశారు. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు రెండు రాష్ట్రాల విద్యుత్, నీటిపారుదల, ఇంధన, ప్లానింగ్ శాఖల కార్యదర్శులు శుక్రవారం సమావేశమయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ, అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీపై పనిచేస్తున్న ప్రత్యూష్ సిన్హా కమిటీతోనూ ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఉదయం కమల్‌నాథన్ కమిటీతో భేటీ సందర్భంగా.. ఉద్యోగుల పంపకాల తుది గడువు, దీనికి సంబంధించిన ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు మరోమారు కూలంకషంగా చర్చించారు. పోస్టులు తక్కువగా, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కొన్ని శాఖల్లో సర్దుబాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనలో వచ్చే సమస్యల పరిష్కారం, ఇతర అనుమతులకు సంబంధించి ఓ నోడల్ కమిటీని వేయాలన్న ప్రతిపాదనను ఇరువురు సీఎస్‌లు కేంద్రం దృష్టికి తెచ్చారు. వివాదాలపై వాడివేడి చర్చ రాష్ర్ట విభజన చట్టంలోని అంశాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు ఇరువురు సీఎస్‌లు తమతమ వాదనలు వివరించారు. విద్యుత్ కేటాయింపులు, నదీజలాల పంపకాలు, షెడ్యూల్ తొమ్మిది, పదిలోని ఉమ్మడి సంస్థల నిర్వహణ , ఉమ్మడి పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. కృష్ణా బోర్డు ఇచ్చిన ఏకపక్ష నోటీసుల అంశాన్ని తెలంగాణ సీఎస్ ప్రస్తావించారు. ఈ విషయంలో ఏపీ వైఖరి సరిగా లేదని, కావాలనే సమస్యలు సృష్టిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాజీ వ్‌శర్మ కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 8 ప్రకారం హైదరాబాద్‌లో పోలీసు యంత్రాంగా న్ని గవర్నర్ పరిధిలోకి తేవాలని ఏపీ సీఎస్ కోరగా.. అందుకు రాజీవ్‌శర్మ అభ్యంతరం తెలి పారు. చట్టంలో అలా పేర్కొనలేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రస్తావిస్తూ.. పీపీఏలను అమలు చేసేలా చూడాలని తెలంగాణ సీఎస్ కోరారు. ఉమ్మడి సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే ఏపీకి నిధులు మళ్లించుకున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై అనిల్ గోస్వామికి ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా నివేదికలను అందజేసినట్టు సమాచారం. పదో షెడ్యుల్‌లో పేర్కొన్న సంస్థలు భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నం దున వాటి నిర్వహణ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉంటుందని రాజీవ్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. ఐవైఆర్ కృష్ణారావు కూడా దీనిపై తన వాదన వినిపించారు. ఇక ఉమ్మడి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఇబ్బం దికరంగా ఉందని కూడా ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో చెప్పిన ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఉమ్మడిగా చేపట్టాలని వివరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. స్థూలంగా అన్ని సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, న్యాయ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇరు రాష్ట్రాలకు దక్కాల్సిన పలు సదుపాయాలను కేంద్రం దృష్టికి తెచ్చాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలను కూడా వివరించాం. వాటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి చె ప్పారు’ అని ఏపీ సీఎస్ కృష్ణారావు వెల్లడించారు. చట్టంలో పేర్కొన్న అంశాలపై త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు టీ-సీఎస్ రాజీవ్‌శర్మ తెలిపారు. ‘తెలంగాణకు ఇచ్చే ప్రోత్సాహకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. విభజన చట్టంలోని విధానాల అమలుపై రాష్ర్టం తరఫున ప్రతిపాదనలు పంపుతాం. అదేవిధంగా ఏపీ కూడా పంపుతుంది. వీటిపై న్యాయ సలహా తీసుకుని నిర్ణయం చెప్పాలని కేంద్రాన్ని కోరాం. ఈ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. సత్ఫలితాలు వస్తాయనుకుంటున్నాం’ అని రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. కాగా, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజన అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇద్దరు సీఎస్‌లు భేటీ అయ్యారు. ఐఏఎస్‌ల కేటాయింపుల ఫైలును ప్రధాని నరేంద్రమోదీ తిప్పి పంపిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇరువురు సీఎస్‌లు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలని కమిటీని కోరారు. -
'సంతృప్తి పరచడానికి సమయం పడుతుంది'
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికారులు అందరినీ సంతృప్తి పరచడానికి సమయం పడుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐఏఎస్ అధికారుల విభజన పారదర్శికంగా జరుగుతుందని చెప్పారు. 15 రోజుల్లో అధికారుల విభజన జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రానికి ఏ అధికారిని కేటాయించాలన్నదానిపై చర్చ జరుగుతుందని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపుపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ముగిసింది. వివాదంలేని అధికారుల కేటాయింపునకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 20 మంది అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ అధికారుల అభ్యంతరాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ** -
ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ఈ కమిటీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ సమావేశమైనట్లు తెలుస్తోంది. -
నేడు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హాజరవుతున్న ఇరురాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరవుతున్నారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ శనివారం సమావేశం నిర్వహిస్తోంది. తెలంగాణలో పనిచేస్తూ.. ఆంధ్రాకు కేటాయించిన ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్యలను తమ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ కోరనుంది. తమ వద్ద పనిచేస్తూ.. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లైన అజయ్ సహాని, ఆదిత్యనాథ్‌దాస్, అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తమ వద్దనే ఉంచాలని ఏపీ కోరనుంది. అభ్యంతరం లేని వారిని గత జాబితా ప్రకారం రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖను కోరడం తెలిసిందే. -
'వారిద్దరినీ మాకివ్వండి'
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారమిక్కడ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, సోమేష్ కుమార్‌లను తెలంగాణలోనే కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీని కోరనుంది. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. మార్గదర్శకాలపై అభ్యంతరాలకు రేపటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం కానుంది. -
ఏపీకి 28 మంది ఐఏఎస్‌లు
తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మంది వీరిలో ఆరుగురు అధికారులు ఎక్కడివారు అక్కడే మిగతావారు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులివ్వాలంటూ సీఎస్ల ఉమ్మడి లేఖ సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రకటించిన ప్రొవిజనల్ జాబితా ప్రకారం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేస్తున్న 44 మందిలో 28 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆ 28 మందిని రాష్ట్రానికి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తాత్కాలికంగా పనిచేసేందుకు 44 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. కమిటీ ప్రొవిజనల్ జాబితా ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేటాయించబడిన ఆరుగురు అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారో ప్రస్తుతానికి అక్కడే కొనసాగించాలని, వారు మినహా మిగ తా అభ్యంతరం లేని ఐఏఎస్‌లు రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఒకే లేఖపై సంతకాలు చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించారు. సోమవారం ఇద్దరు సీఎస్‌లు వేర్వేరుగా సంతకాలు చేసి ఐఏఎస్‌ల జాబితాలను కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే సీఎస్లిద్దరూ ఒకే లేఖపై సంతకాలు చేసి పంపాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇద్దరు సీఎస్‌లు ఉమ్మడి లేఖపై సంతకాలు చేసి పంపిం చారు. తెలంగాణలో పనిచేస్తున్న బి.పి.ఆచార్య, సోమేశ్‌కుమార్‌లను ఏపీకి కేటారుుంచారు. అయితే వీరిని తెలంగాణలోనే కొనసాగించాలని సీఎస్‌లు లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఆదిత్యనాథ్ దాస్, అజయ్ సహాని, అజయ్ జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించగా.. వీరిని ఏపీలోనే కొనసాగించాలని సీఎస్‌లు కోరారు. వీరు మినహా రెండు రాష్ట్రాలకు ఐఏఎస్‌లను కేటాయిస్తూ విడుదల చేసిన జాబితా మేరకు వారు రెండు రాష్ట్రాల్లో పని చేసేందుకు వీలుగా వర్క్ టు ఆర్డర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఆమో దం లభించగానే ఉద్యోగుల పంపిణీ ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన పూర్తి
తుది జాబితా విడుదల చేసిన కేంద్రం ప్రత్యూష్‌సిన్హా సిఫార్సులకే ప్రాధాన్యం బాబు ముఖ్యకార్యదర్శి సహానీ తెలంగాణ కు.. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆంధ్రాకు హైదరాబాద్: ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది సిఫారసుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేస్తూ కేంద్ర సిబ్బంది, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టులో జారీ చేసిన తాత్కాలిక జాబితాలో మార్పులు చోటు చేసుకున్నాయి. 20 మంది వరకు అధికారుల కేటాయింపులు మారాయి. డెరైక్ట్ రిక్రూట్ ఐఏఎస్ పోస్టులు 261 ఉండగా ప్రస్తుతం అందుబాటులో 191 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అలాగే కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులు 113 కాగా.. ప్రస్తుతం 103 మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. డెరైక్ట్ రిక్రూటీల్లో ఆంధ్రాకు 108 మందిని, తెలంగాణకు 83 మందిని కేటాయించగా.. పదోన్నతి పొందిన అధికారుల్లో ఏపీకి 57 మందిని, తెలంగాణకు 46 మందిని కేటాయించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 165 మంది అధికారులను, తెలంగాణకు 129 మంది అధికారులను కేటాయించారు. అలాగే మొత్తం 256 ఐపీఎస్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 211 మంది అధికారులు అందుబాటులో ఉన్నారు. వీరిలో డెరైక్ట్ రిక్రూటీలు 142 మంది, ప్రమోషన్ అధికారులు 69 మంది ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మంది, తెలంగాణకు 92 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. కాగా, ఐఎఫ్ఎస్ పోస్టుల సంఖ్య 147 ఉండగా.. ప్రస్తుతం 127మంది అందుబాటులో ఉన్నారు. వీరిని ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. ఆంధ్రాకు పీవీ రమేష్... తెలంగాణకు బినయ్‌కుమార్.. తాత్కాలిక జాబితాలో తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ పీవీ రమేష్‌ను తుది జాబితాలో మాత్రం ఆంధ్రాకు కేటాయించారు. కాగా, తాత్కాలిక జాబితాలో మార్పులకు కారణమైన ఐఏఎస్ బినయ్‌కుమార్ తుది జాబితాలో తెలంగాణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఏపీ సహానీతో పాటు ఐఏఎస్‌లు చందనాఖన్, ఎస్పీ సింగ్, అజయ్‌జైన్ కూడా తాజాగా తెలంగాణకు వచ్చారు. ఇక తనను ఆంధ్రాకు కేటాయించాలంటూ జెఎస్వీ ప్రసాద్ చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. తెలంగాణలో ఉన్న బీపీ ఆచార్యను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మొన్నటి వరకు హెచ్ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరించిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను తాజాగా ఏపీకి కేటాయించారు. అలాగే పూనం మాలకొండయ్య, అజయ్‌మిశ్రా సతీమణి షాలిని మిశ్రా కూడా ఏపీకి దక్కారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేష్‌కుమార్‌ను కూడా ఆంధ్రాకు కేటాయించారు. అయితే ఈ తుది కేటాయింపులపైనా పలువురు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాలు చెప్పడానికి పక్షం రోజులు గడవు కోరుతామని వారు చెబుతున్నారు. ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు ఐవీ సుబ్బారావు, ఐవైఆర్ కృష్ణారావు, చిర్రావూరి విశ్వనాధ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీ విజయకుమార్, ఎల్వీ సుబ్రమణ్యం, అజయ్ కల్లం, ఆర్ సుబ్రమణ్యం, డీ సాంబశివరావు, ఎ.గిరిధర్, ఎ.శాంతికుమారి, కేఎస్ జవహర్‌రెడ్డి, జి.సాయిప్రసాద్, కె.విజయానంద్, ఎంటీ కృష్ణబాబు, నాగులాపల్లి శ్రీకాంత్, కాటంనేని భాస్కర్, వినయ్‌చంద్ వాడరేవు, నారాయణ భరత్‌గుప్తా, అమ్రపాలి కాటా, వి.విజయరామారాజు, ముద్దాడ రవిచంద్ర, జె.శ్యామలరావు, రేవు ముత్యాలరాజు, కేవీఎన్ చక్రధర బాబు, ఎ. మల్లిఖార్జున, సగిలి షాన్మోహన్, బి. శాంబాబ్, పి. వెంకటరమేష్‌బాబు, డి. శ్రీనివాసులు, కె.ప్రవీణ్‌కుమార్, బి.రాజశేఖర్, కాంతిలాల్ దండే, కోన శశిధర్, గంథం చంద్రుడు, ముధావత్ ఎం నాయక్, ఇంద్రజిత్‌పాల్, ఆర్పీ వాటల్, సత్యనారాయణ మహంతి, ఎస్పీ టక్కర్, శ్యాంకుమార్ సిన్హా, లింగరాజు పాణిగ్రహి, బీపీ ఆచార్య, దినేష్‌కుమార్, భన్వర్‌లాల్, ప్రీతి సుధాన్, అనిల్ చంద్ర పునేటా, ఏఆర్ సుకుమార్, నీలం సహాని, సమీర్‌శర్మ, వీణా ఈష్, మన్మోహన్సింగ్, జగదీశ్చంద్ర శర్మ, అభయ త్రిపాఠి, సతీష్ చంద్ర, నీరభ్‌కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాసు, పూనం మాలకొండయ్య, శాలినీ మిశ్రా, సోమేష్‌కుమార్, శంశాక్ గోయల్, రజత్‌కుమార్, సుమితా దావ్రా, జి.అశోక్‌కుమార్, జయేష్ రంజన్, వికాష్ రాజ్, గోపాల్‌కృష్ణ ద్వివేది, లవ్ అగర్వాల్, పీయూష్ కుమార్, వి.శేషాద్రి, ఎస్.సురేష్‌కుమార్, సౌరభ్‌గౌర్, ప్రవీణ్‌కుమార్, వివేక్‌యాదవ్, కార్తికేయ మిశ్రా, శ్వేతా మొహం తి, శ్వేత తియోతియా, ఎల్ఎస్ బాలాజీరావు, గగ న్దీప్ సింగ్, పి.రవి సుభాష్, హిమన్షు శుక్లా, జి.జయలక్ష్మీ, శశిభూషణ్‌కుమార్, ఎన్.గుల్జార్, సాల్మన్ ఆర్యోగరాజు, ఎ.బాబు, ఎన్.యువరాజ్, ఎం.జానకి, డి.రోనాల్డ్ రోజ్, బాలాజీ దిగంబర్ మంజులే, జె.నివాస్, హరినారాయణ్, ప్రసన్న వెంకటేష్, కె. విజయ, టి.రాథ, విజయకుమార్, ఆర్.క రికాల వల వన్, రాం ప్రకాష్ సిసోడియా, యోగితా రాణా, జి.వీరపాండ్యన్, జి.లక్ష్మీషా, జె.రామానంద్, జి.అనంతరాము, ఎస్ఎస్ రావత్, ముఖేష్‌కుమార్ మీనా, పీఎస్ ప్రద్యుమ్న, ఎస్.నాగలక్ష్మి, ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.మధుసూధనరావు, ఎంవీ సత్యానారాయణ, వైవీ అనురాధ, బి.ఉదయలక్ష్మి, కె.దమయంతి, డి.కాడ్మియేల్, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్ శ్రీనరేష్, కె.రాంగోపాల్, ఎ.వాణీ ప్రసాద్, బి.రామాంజనేయులు, కె.సునీత, జి.వాణిమోహన్, డి.వరప్రసాద్, రాం శంకర్ నాయక్, బి.శ్రీధర్, జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, కేఎస్ శ్రీనివాస్‌రాజు, కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి, ఎన్.గిరిజాశంకర్, జి.రవిబాబు, విజయ్‌మోహన్, ఎన్.కృష్ణ, కేవీ రమణ, పి.వెంకట్రామిరెడ్డి, పి.లక్ష్మీ నరసింహం, ఎం. జగన్నాథం, ఐ.శ్యామ్యూల్ అనంద్‌కుమార్, వి.కరుణ, కేవీ సత్యానారాయణ, హెచ్.అరుణకుమార్, ఎం.పద్మ, పి.ఉషాకుమారి, పీఏ శోభ, కె.హర్షవర్థన్, పి.భాస్కర్, ఎం.హరి జవహర్లాల్, టి.బాబూరావు నాయుడు, ఎం.రామారావు, కె.శారదాదేవి, కె.ధనుంజయ్‌రెడ్డి, జె.మురళీ, సీహెచ్ శ్రీధర్, ఎంవీ శేషగిరిబాబు, డి.మురళీధర్‌రెడ్డి, బి.లక్ష్మీకాంతం, కె.కన్నబాబు, ఎస్. సత్యనారాయణ, పి.బంసత్కుమార్, బి.రామారావు, ఎ.సూర్యకుమారి, జి.రేఖారాణి, డాక్టర్ సి.శ్రీధర్, ఏఎండీ ఇంతియాజ్, పి.కోటేశ్వరరావు, ఎం.ప్రశాంతి, బి.కిషోర్. ఐపీఎస్ అధికారులు... అశోక్ ప్రసాద్, ఎస్ఏ హుడా, వివేక్ దూబే, డాక్టర్ బి.భూపతి బాబు, ఈష్ కుమార్, వీఎస్కే కౌముది, ఆర్పీ ఠాకూర్, వినయ్ రంజన్ రే, టీఏ త్రిపాఠి, సంతోష్ మెహ్రా, కేఆర్ఎం కిషోర్ కుమార్, అంజనీ కుమార్, అంజనా సిన్హా, మహ్మద్ అహసాన్ రజా, హరీష్ కుమార్ గుప్తా, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠీ ఉజేలా, అభిలాష్ బిష్ట్, అతుల్ సింగ్, డాక్టర్ ఎస్బీ బగ్చీ, భావన సక్సేనా, మహేష్ చంద్ర లడ్హా, మనీష్ కుమార్ సిన్హా, నవీన్ గులాటి, యస్. శ్యాంసుందర్, సర్వశ్రేష్ట త్రిపాఠి, షిమోషీ, భాస్కర్ భూషణ్, రాహుల్‌దేవ్ శర్మ, అభిషేక్ మహంతి, వరుణ్ బీఆర్., ఆద్నాన్ న యీం అస్మీ, ఐశ్వర్య రస్తోగి, మహేష్ మురళీధర్ భగవత్, విజయ్ కుమార్, రాజేష్ కుమార్, ఆర్.జయలక్ష్మి, యస్.సెంథిల్ కుమార్, అన్బురాజన్ కేకేఎన్, కె.శశికుమార్, టి.కృష్ణరాజు, నళిన్ ప్రభాత్, డాక్టర్ ఎ.రవిశంకర్, గ్రేవాల్ నవదీప్ సింగ్ కేఎస్, విశాల్ గున్నీ, సిద్ధార్థ కౌశల్, డి.గౌతం సవాంగ్, రాజీవ్ కుమార్ మీనా, వినీత్ బ్రిజిలాల్, ఫకీరప్ప కాగినెల్లి, వి.వేణుగోపాలకృష్ణ, జి.సూర్యప్రకాశరావు, బి.శ్రీనివాసులు, పి.ఉమాపతి, ఇ.దామోదర్, బి.బాలకృష్ణ, అబ్రహాం లింకన్, ఎ.సుందర్ కుమార్ దాస్, టి.యోగానంద్, కె.వెంకటేశ్వరరావు, యం.శివప్రసాద్, ఏ.రవిచంద్ర, డి.రామక్రిష్ణయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్, డాక్టర్ యం.కాంతారావు, పీవీఎస్ రామకృష్ణ, కేవీవీ గోపాలరావు, బి.వి.రమణ కుమార్, పి.హరికుమార్, సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు, డాక్టర్ యం.నాగన్న, ఏ.ఎస్.ఖాన్, ఐ.సత్యనారాయణ, ఐ.ప్రభాకర్రావ్, జి.శ్రీనివాస్, డి.నాగేంద్ర కుమార్, టి.రవికుమార్ మూర్తి, కె.కోటేశ్వరరావు, ఎల్ కేవీ రంగారావు, పి.వెంకటరామిరెడ్డి, జి.పాలరాజు, జి.వి.జి.అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్.హరికృష్ణ, యం.రవిప్రకాష్, ఎస్.వి.రాజశేఖర్ బాబు, కె.వి.మోహన్‌రావు, పీహెచ్డీ రామకృష్ణ, డాక్టర్ సిహెచ్ శ్యాంప్రసాద్‌రావు, జాస్తి వెంకటరాముడు, ఎన్.సాంబశివరావు, యం.మాలకొండయ్య, ఎన్వీ సురేంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌డీ తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ఎన్.మధుసూధన్‌రెడ్డి, కొల్లి రఘురాంరెడ్డి, ఆకే రవికృష్ణ, గజరావ్ భూపాల్, కోయ ప్రవీణ్, భూసారపు సత్య ఏసుబాబు, వెంకట అప్పలనాయుడు చింతం, ఎన్.సంజయ్, కాంతిరాణా టాటా, సీయం త్రివిక్రమ వర్మ, గోపీనాథ్ జెట్టి, బాబూజీ అట్టాడ, బి.ప్రసాదరావ్, ఎస్.వెంకటరమణ మూర్తి, పీవీ సునీల్ కుమార్, చిరువోలు శ్రీకాంత్, విజయరావ్ చంపటపల్లి, బూరుగు రాజకుమారి, పీఎస్ఆర్ ఆంజనేయులు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు.. డి.లక్ష్మీ పార్థసారథి భాస్కర్, సీబీ వెంకటరమణ, ఎంజీ గోపాల్, వీకే అగర్వాల్, వి.నాగిరెడ్డి, జె.రేమండ్ పీటర్, పుష్పా సుబ్రమణ్యం, జేఎస్.వెంకటేశ్వర ప్రసాద్, వై.శ్రీలక్ష్మీ, కె.రామకృష్ణారావు, సవ్యసాచి ఘోష్, శైలజా రామయ్యర్, స్మితా సభర్వాల్, కె.శశాంక, జి.శ్రీజన, సి.సుదర్శన్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ హనుమంత్, బి.వెంకటేశం, ఎన్.శ్రీధర్, ఎ.విద్యాసాగర్, ఎం.దానకిషోర్, హరికిరణ్ చెవ్వూరు, కె.ప్రదీప్ చంద్ర, రాహుల్ బొజ్జా, హరిచందన దాసరి, శివశంకర్ లోతేటి, గొర్రెల సువర్ణ పండాదాస్, ఆర్ భట్టాచార్య, చందనాఖన్, ఏకే ఫరీదా, రాజీవ్ శర్మ, ఎస్పీ సింగ్, రణదీప్ సుధాన్, వినయ్ కుమార్, రంజీవ్ ఆర్ ఆచార్య, శైలేంద్ర కుమార్ జోషి, అజయ్‌మిశ్రా, అజయ్ ప్రకాష్ సహానీ, సుతీర్థ భట్టాచార్య, సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, రాజేశ్వర్ తివారీ, రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, అదర్‌సిన్హా, రజత్ భార్గవ, సునీల్ శర్మ, హరిప్రీత్‌సింగ్, అజయ్ జైన్, సంజయ్ జాజూ, అనిల్‌కుమార్ సింఘాల్, ప్రవీణ్ ప్రకాష్, నవీన్ మిట్టల్, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, సిద్ధార్థ జైన్, గౌరవ్ ఉప్పల్, పౌసుమీ బసు, సర ్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య, పాటిల్ ప్రశాంత్ జీవన్, బి.కృష్ణ భాస్కర్, శ్రుతి ఓజా, అద్విత్ కుమార్‌సింగ్, సంజయ్ కుమార్, అహ్మద్ నదీమ్, సందీప్‌కుమార్ సుల్తానీయా, నీతూకుమారీ ప్రసాద్, కె.ఇల్లంబర్తి, కె.మాణిక్యరాజ్, రజత్ కుమార్ షైనీ, భారతీ హోలికేరీ, అలగ వర్షిణి, ఆర్వీ కర్ణన్, హీరాలాల్ సమారియా, ఐ.రాణీకుముదినీ, జ్యోతి బుద్ధ ప్రకాష్, డీఎస్ లోకేష్‌కుమార్, సుధామ్రావు, బీఆర్ మీనా, అరవింద్ కుమార్, బెనహర్ మహేష్‌దత్ ఎక్కా, క్రిస్టియానా జడ్ చోంగ్తూ, ప్రీతిమీనా, బి.అరవిందరెడ్డి, బి.వెంకటేశ్వరావు, ఎన్.శివశంకర్, ఎం జగదీశ్వర్, సి పార్థసారథి, వీఎన్ విష్ణు, ఆర్వీ చంద్రవదన్, జీడీ అరుణ, వి.అనిల్‌కుమార్, బి.జనార్దన్‌రెడ్డి, ఎల్.శశిధర్, జి.వెంకట్రామిరెడ్డి, ఎ.అశోక్, ఎం.వీరబ్రహ్మయ్య, అనితా రాజేంద్ర, సయ్యద్ ఓమర్ జలీల్, ఎం జగన్మోహన్, ఎ.దినకర్‌బాబు, జి.కిషన్, ఎం.రఘునందరావు, టి.చిరంజీవులు, జీడీ ప్రియదర్శిని, టి.విజయకుమార్, పి.సత్యానారాయణరెడ్డి, ఇ.శ్రీధర్, మహ్మద్ అబ్దుల్ అజీం, టీకే శ్రీదేవి, బి.బాలమాయాదేవి, అనితా రామచంద్రన్, కె.నిర్మల, ఎల్.శర్మన్, పార్వతీ సుబ్రమణ్యన్, ఎ.శరత్, ఎం.చంపాలాల్, ఎ.మురళి, బి.భారతీ లక్పతి నాయక్, బి.విజయేంద్ర, కేవై నాయక్, పి.వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్ర మోహన్, డాక్టర్ ఏంవీ రెడ్డి, డి.వెంకటేశ్వరరావు, ఎ.శ్రీదేవసేన, ఎన్.సత్యనారాయణ్, ఎస్.అరవిందర్‌సింగ్ ఐపీఎస్ అధికారులు... టి.పి.దాస్, నవీన్ రంజన్ వాసన్, అనురాగ్ శర్మ, సుధీప్ లక్టాకియా, రాజీవ్ త్రివేది, ప్రభాకర్ అలోక, వి.కె.సింగ్, ఎ.ఆర్.అనురాధ, ఉమేష్ షరాఫ్, రవిగుప్త, రాజీవ్ రతన్, జితేందర్, సందీప్ శాండిల్యా, వినాయక్ పి ఆప్టే, డాక్టర్ సౌమ్య మిశ్రా, శిఖాగోయల్, రీతూ మిశ్రా, దేవేంద్రసింగ్ చౌహాన్, విక్రంసింగ్ మాన్, అకున్ సబర్వాల్, తరుణ్ జోషి, విక్రమ్‌జీత్ దుగ్గల్, తఫ్సీర్ ఇగ్బాల్, అంబర్ కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్, విజయకుమార్ ఎస్ఎం, విష్ణు ఎస్ వారియర్, వి.సి.సజ్జనార్, సంజయ్ కుమార్ జైన్, షాన్వాజ్ ఖాసీం, డి.జోయల్ దావిస్, భాస్కరన్ ఆర్, సత్యనారాయణ్, గోవింద్ సింగ్, అనిల్‌కుమార్, రామరాజేశ్వరి ఆర్, కల్మేశ్వర్ సింగన్వార్, డాక్టర్ బి.ఎల్.మీనా, స్వాతి లక్రా, కార్తీకేయన్, వి.నవీన్‌చంద్, యం.కె.సింగ్, కె.వేణుగోపాల్ రావు, టి.వి.శశిధర్ రెడ్డి, వై.గంగాధర్, జి.సుధీర్ బాబు, టి.ప్రభాకర్‌రావు, పి.ప్రమోద్ కుమార్, ఎన్.శివశంకర్ రెడ్డి, డాక్టర్ వి.రవీందర్, వి.శివకుమార్, వి.బి.కమలాసన్ రెడ్డి, ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, యం.రమేష్, ఎస్.జె.జనార్దన్, ఎ.వి.రంగనాథ్, బి.సుమతి, యం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావు, ఎన్.సూర్యనారాయణ, ఆర్.బి.నాయక్, టి.మురళీకృష్ణ, పి.మునిస్వామి, సి.రవివర్మ, ఎ.సత్యనారాయణ, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, అరుణ బహుగుణ, కె.దుర్గాప్రసాద్, అబ్దుల్ ఖయూం ఖాన్, తేజ్‌దీప్ కౌర్ మీనన్, మహీందర్‌రెడ్డి, జె.పూర్ణచంద్రరావ్, సి.వి.ఆనంద్, కె.శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, చారుసిన్హా, యారం నాగిరెడ్డి, అవినాష్ మహంతి, నేలకొండ ప్రకాష్‌రెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, బి.నవీన్ కుమార్, విశ్వజిత్ కంపతి, టి.కృష్ణప్రసాద్, యం.గోపీకృష్ణ, డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, జి.చందనా దీప్తి, చేతన మైలాబత్తుల -
కీలక కేడర్‌లో భారీ మార్పులు!
ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది కసరత్తు పూర్తి తెలంగాణకు ఆంధ్రా సీఎం పేషీ ముఖ్యకార్యదర్శి అజయ్‌సహానీ ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి బీపీ ఆచార్య, బీఆర్ మీనాలు త్వరలో ప్రధానమంత్రికి ఫైలు.. వారంలో జాబితా ప్రకటన! సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారుల తుది కేటాయింపు జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 మంది అధికారుల కేడర్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది జాబితాను ఖరారు చేసినట్లు ఆ కమిటీ వర్గాలు తెలిపాయి. అఖిల భారత అధికారుల కేటాయింపునకు సంబంధించి గత నెల చివరలో ముసాయిదా జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి దాదాపు వందకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన కమిటీ భారీ మార్పులతో తుది జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులను తెలంగాణకు కేటాయించడం, 1983 బ్యాచ్ బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తికి ప్రత్యూష్‌సిన్హా పెద్ద పీట వేసినట్లు చెప్తున్నారు. తాత్కాలిక కేటాయింపులో బినయ్కుమార్ను ఆంధ్రాకు కేటాయించారు. అయితే తెలంగాణకు కేటాయిస్తే భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉన్నందున బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు మరికొన్ని ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ తుది జాబితాలో భారీ మార్పులు చేసింది. ప్రధానంగా ముసాయిదా జాబితాలో కేటాయింపు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఖరారైన బినయ్‌కుమార్ అభ్యంతరాన్ని పరిశీలించడంతో రోస్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. కేంద్ర సర్వీసును తీసేసి రాష్ట్ర సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఔట్ సైడర్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పని చేసి ఇక్కడికి బదిలీ అయి రావడం కారణంగా వారిని సంబంధిత బ్యాచ్‌లో చివరగా తీసుకుని సర్వీసును లెక్కించినట్టు సమాచారం. ఈ జాబితాను నేడో రేపో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ప్రధానమంత్రికి పంపనుంది. ప్రధానమంత్రి ఆమోదించిన తరువాత ఈ తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి. మారిన అధికారుల కేడర్ ఇలా..! తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..: ఎస్.ఎస్.రావత్, పి.వి.రమేశ్, బి.పి.ఆచార్య, బి.ఆర్.మీనా, ఆధిత్యనాథ్‌దాస్, దినేష్‌కుమార్, జె.రామానంద్, శాంతికుమారి, వీణా ఈష్, అనంతరాం, నీలం సహాని, షాలినిమిశ్రా తదితరులు ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు..: బినయ్‌కుమార్, అజయ్‌సహానీ, అజయ్‌జైన్, అదర్‌సిన్హా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి జె.ఎస్.వి.ప్రసాద్ అభ్యర్థనను కమిటీ తిరస్కరించింది. ఆయన తెలంగాణలోనే ఉంటారు. -
ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
-
రేపు ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సివిల్స్ సర్వీసెస్ అధికారుల పంపకాలపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశం అవుతుంది. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శలు హాజరుకానున్నారు. అధికారుల తుది జాబితాను కమిటీ రేపు ఖరారు చేయనుంది. అయితే పలువురు ఉన్నతాధికారుల అభ్యంతరాలను కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఆ అభ్యంతరాలపై కమిటీ రేపు చర్చించనుంది. అనంతరం ఆ జాబితాను ప్రధాని నరేంద్ర మోడీకి కమిటీ పంపనుంది. మోడీ ఆమోద ముద్ర పడగానే పూర్తి స్థాయిలో విభజన జరగుతుంది. -
ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటి!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, కృష్ణారావు (సీఎస్)లు బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంలో ఉద్యోగులు, కాలుష్య నియంత్రణ మండలి విభజన, ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈనెల 15న ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటి కానున్నారు. ఇప్పటికే ఈ భేటికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఆహ్వానం అందింది. ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారంతో ఐఏఎస్‌లను మార్చుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
నేటితో ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రక్రియ పూర్తి..
సివిల్ సర్వెంట్ల అభ్యంతరాలను పరిశీలించనున్న కమిటీ తుది నివేదికను డీవోపీటీకి ఇవ్వనున్న కమిటీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ పని మంగళవారంతో పూర్తి కానుంది. ఆగస్టు 22న సమావేశమైన కమిటీ రెండు రాష్ట్రాలకు అఖిల భారత అధికారులను తాత్కాలికంగా కేటాయించడం తెలిసిందే. ఈ కేటాయింపులపై గతనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిపై మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై చర్చించనుంది. దీనిలో కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు పాల్గొంటారు. ప్రధానంగా భార్యాభర్తలు, డెప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, అనారోగ్యంతో బాధపడుతున్న అధికారుల నుంచి అభ్యంతరాలు అందినట్టు సమాచారం. భార్యాభర్తలకు సంబంధించి మొత్తం 12 మందితోపాటు, పైన పేర్కొన్న కారణాలతో దరఖాస్తు చేసుకున్న 32 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలనకు తెలంగాణ సర్కార్ పంపించింది. తెలంగాణలో పనిచేయడానికి ఈ 32 మంది అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో .వారి పేర్లను ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీకి పంపింది. అధికారులు ఇచ్చిన దరఖాస్తుల్లో సహేతుకమైనవాటిని పరిశీలించి కమిటీ మార్పులు చేర్పులు చేయనుంది. అయితే వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆమోదించాలన్న నిబంధనేదీ లేదని అధికారవర్గాలు తెలిపాయి. డీవోపీటీ నిబంధనల మేరకు అధికారులను కేటాయించనున్నారు. నివేదికను ప్రధాని ఆమోదించాక శాశ్వతంగా అధికారుల కేటాయింపు జరుగుతుంది. అది ఈనెల 15 లోగా పూర్తవుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
అధిపతులంతా తెలంగాణకే..
సాక్షి, ఖమ్మం: ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇరు రాష్ట్రాలకు చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల విభజనలో జిల్లాలోని అధికారులందరూ తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లకు తెలంగాణ కేడర్ దక్కింది. రోస్టర్ పద్ధతిన విభజించిన ఈప్రక్రియలో జిల్లాకు చెందిన అధికారులు తెలంగాణ కేడర్‌తో ఇక జిల్లాలోనే విధులు నిర్వహించనున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ అధికారుల విభజనకు కసరత్తు ప్రారంభించినప్పటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము ఏ కేడర్‌లోకి వెళ్తామోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. నిబంధనలు ఎలా ఉంటాయి..? తాము ఎటు వైపు వెళ్లే అవకాశం ఉంది..? అని గత పదిహేను రోజులుగా ఈ అంశంపైనే అధికారుల్లో చర్చ సాగింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తొలుత కొంత మంది అధికారులను లాటరీ పద్ధతిన, మరి కొందరిని రోస్టర్ పద్ధతిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించింది. శుక్రవారం ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపకాలను ఈ కమిటీ పూర్తి చేసింది. అయితే జిల్లాలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా తెలంగాణ కేడర్లోనే ఉన్నారు. అటు వెళ్లి.. ఇటు వచ్చి.. ఈనెల 1న డాక్టర్ కె.ఇలంబరితి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో పాలనను చక్కదిద్దే పనిలో ఉండగానే ఐఏఎస్‌ల విభజనతో ఆయన ఎటు వైపు వెళ్తారోనని చర్చ జరిగింది. ఒక వేళ ఆయనకు తెలంగాణ కేడర్ దక్కకపోతే కొత్త కలెక్టర్ ఎవరు వస్తారోనని జిల్లాలో చర్చ జరిగింది. అయితే అధికారుల పంపకాల్లో చివరకు ఆయన తెలంగాణ కేడర్ కిందకే వచ్చారని, కలెక్టర్‌గానే జిఆల్లలోనే కొనసాగనున్నారని తేలింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇలంబరితి ..2005 ఐఏఎస్ బ్యాచ్. తొలి నుంచి ఆయన తెలంగాణ కేడర్‌నే కోరుకున్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీడీఓ పీఓ డి.దివ్య కూడా.. ఆమె కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకే వచ్చారు. నల్లగొండకు చెందిన జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ రోస్టర్‌లో తెలంగాణ కేడర్లోనే ఉన్నారు. ఇద్దరు ఐపీఎస్‌లూ ఇక్కడే.. ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ను ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలంగాణ కేడర్ అధికారిగానే పరిగణనలోకి తీసుకుంది. ఆయన కూడా రోస్టర్‌లో తెలంగాణలోకే వచ్చారు. కరీంనగర్ జిల్లా వాసి, భద్రాచలం ఏఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి కూడా రోస్టర్‌లో తెలంగాణ కేడర్‌లోకే వచ్చారు. దీంతో జిల్లాలోని ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్‌లోకి రావడంతో జిల్లాలోనే విధుల్లో కొనసాగనున్నారు. -
మనవాళ్లెక్కడికి!
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్కడ పని చేయాలనే విషయంలో స్పష్టత కొరవడటం అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం లాటరీ తీయడంతో అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. రోస్టర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఐపీఎస్ అధికారి ఎస్పీ ఆకే రవికృష్ణలు ఎక్కడ సేవలందిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేయగా.. మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్‌పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేయడం తెలిసిందే. గత శనివారం కమిటీ ఢిల్లీలో సమావేశం కాగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేటగిరీలకు తీసిన లాటరీల్లో తొలి అవకాశం తెలంగాణకే లభించింది. ప్రత్యక్ష నియామకాలపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన(అవుట్ సైడర్) అధికారుల కేటాయింపులను రోస్టర్ విధానంలో తెలంగాణ రాష్ట్రం నుంచే చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడివిడిగా రోస్టర్ విధానంలో.. నేరుగా నియమితులైన(ఆంధ్ర కేడర్), పదోన్నతి పొందిన రాష్ట్ర అధికారులను స్థిర నివాస ప్రాంతం ఆధారంగా కేటాయించనున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారుల కొరత ఆధారంగా కూడా కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూలై 14న బాధ్యతలు చేపట్టిన సీహెచ్ విజయమోహన్ పదోన్నతుల కేటగిరీలో ఐఏఎస్ అధికారి అయ్యారు. గతంలో కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్‌గా పని చేశారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతల అనంతరం కలెక్టర్‌గా పోస్టింగ్ దక్కింది. కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ అయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో నిర్వహించిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయనను ఏ రాష్ట్రానికి కేటాయిస్తారనేది వేచి చూడాలి. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ ఆకే రవికృష్ణ 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. జిల్లాకు కొత్తే అయినా రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రవికృష్ణ భవిష్యత్ ఏమిటనేది కూడా కేటాయింపుల్లో తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి వట్టి వసంతకుమార్ ఓఎస్డీగా పని చేస్తూ దాదాపు 22 నెలల క్రితం జిల్లాకు బదిలీపై వచ్చిన జేసీ కె.కన్నబాబు కూడా పదోన్నతుల ప్రక్రియలోనే ఐఏఎస్ హోదా పొందారు. జేసీగా తొలి పోస్టింగ్ అయినప్పటికీ విధి నిర్వహణలో తన ముద్రను కనబర్చారు. ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే. మరి ఈయన సేవలను ఏ రాష్ట్రంలో ఉపయోగించుకుంటారో స్పష్టం కావాల్సి ఉంది. -
తెలంగాణకు 163, ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వెంట్ల విభజన ఓ కొలిక్కి వచ్చింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజనపై ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం సమావేశం అయ్యింది. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తయింది. ముందుగా తెలంగాణ పేరు లాటరీలో రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులను లాటరీ ద్వారానే నిర్ణయించారు. తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తవుతుందని రేమండ్ పీటర్ తెలిపారు. అధికారుల విభజన 13:10 నిష్ఫత్తిలో జరుగుతుందని ఆయన చెప్పారు. గతంలో ఆప్షన్ల కోసం ఇచ్చిన సీల్డ్ కవర్లను నేడు కమిటీ పరిశీలిస్తుందన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు రేమండ్ పీటర్ పేర్కొన్నారు. -
ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యూష్ సిన్హా కమిటీ అఖిలభారత సర్వీసు అధికారులను కేటాయించింది. తెలంగాణకు 163 మంది ఐఏఎస్‌లు, 112 మంది ఐపీఎస్‌లు, 65 మంది ఫారెస్ట్ అధికారులన కేటాయించింది. ఏపీకి 211 మంది ఐఏఎస్‌లు, 144 మంది ఐపీఎస్‌లు, 82 మంది ఫారెస్ట్ అధికారులను కేటాయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తిన చేసి, తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. -
రెండేళ్ల లోపు రిటైరయ్యే వారికే ఆప్షన్!
పీఎంవోకు తుది నివేదిక అందజేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ కసరత్తు పూర్తయింది. తుది మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమిటీ సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్టు సమాచారం. కమిటీ సభ్యులు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులతో సమావేశమయ్యారు. మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాల అనంతరం తుది నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రత్యూష్ సిన్హా అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపిణీకి సంబంధించి తుది నివేదికలో పొందుపర్చాల్సిన మార్గదర్శకాలపై కమిటీ ఇరు రాష్ట్రాల సీఎస్ల అభిప్రాయాలు కోరింది. కోటాకి మించి ఉన్న అధికారులను ఇవ్వడం, రిటైర్మెంట్ దగ్గరపడిన అధికారుల్లో ఎన్నేళ్ల వారికి ఆప్షన్లు ఇవ్వాలన్న అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగనట్టు తెలిసింది. రెండేళ్లలోపు రిటైర్మెంట్ పొందే వారికి మాత్రమే ఆప్షన్లు ఇస్తే సరిపోతుందని కమిటీ అభిప్రాయపడినట్టు సమచారం. అనంతరం ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదికను ఖరారు చేసింది. దీనిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పీఎంవోకు పంపినట్టు తెలిసింది. వారం రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపిణీ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. వాటిపై అధికారుల అభ్యంతరాలు తెలుసుకుని నెలరోజుల్లోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చే స్తామని హోంశాఖ వర్గాలు తెలిపాయి. -
ఈ సారికి పంటరుణాలుండవా?
'తాంబూలాలిచ్చేశాం... తన్నుకుచావండి' అన్న రీతిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇరు ప్రభుత్వాలకూ బోలెడన్ని బాలారిష్టాలను వదిలి మరీ వెళ్లింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రమాణ స్వీకారాలైతే చేయగలిగారు కానీ ఆ తరువాత పని ముందుకు సాగడం లేదు. పరిపాలన పడక దిగనంటోంది. ఇరు రాష్ట్రాలకు ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఐఏఎస్ అధికారుల పంపిణీ. ఐఎఎస్ ఆధ్వర్యంలోనే పాలన సాగుతుంది. కానీ వారి కేటాయింపు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ కీలక నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు నాయుడు కొన్ని ఫైళ్లపై సంతకాలు చేయగలిగారు. కానీ ఒక్క ఫైలు కూడా ముందుకు సాగడం లేదు. చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం ఒక సమావేశం గుంటూరులో, ఇంకొకటి విశాఖ పట్నంలో ఏర్పాటు చేసి 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు' చేస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచే పనిచేస్తోంది. చాలా సందర్భాల్లో తెలంగాణకు కేటాయించిన అధికారులు ఇంకా వారికి కేటాయించిన కె, ఎల్ హెచ్ బ్లాకులకు వెళ్లలేదు. ఫైళ్ల విభజన, పని విభజన పూర్తిగా జరగకపోవడంతో ఎవరే రాష్ట్రానికి పనిచేస్తున్నారన్న విషయంలోనూ స్పష్టత రావడం లేదు. తెలంగాణకు ఇప్పటి వరకూ చేసిన కేటాయింపులన్నీ తాత్కాలికమే. తెలంగాణకు ఇంకా కొందరు అధికారులను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 376 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీరిని 58:42 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణల మధ్య పంచాల్సి ఉంది. అయితే ఈ పంపిణీ చాలా సమయం తీసుకుంటోంది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ పూర్తి చేసి, ప్రధానమంత్రి ఆమోదానికి పంపించాల్సి ఉంది. అయితే జాబితా తయారీకే కనీసం నెల పట్టే అవకాశం ఉందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడానికి వీలుండదు. అంతే ఈ లెక్కన పంట రుణాల ఫైలు కదిలేందుకు కనీసం రెండు నెలలు పడుతుంది. కాబట్టి చంద్రబాబు సంతకం పెట్టినంత మాత్రాన పనేమీ జరగదు. ఈ ఖరీఫ్ పూర్తయిపోయినా రుణాలు చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబు ఈ జాబితా జాప్యం సాకు చూపించి, తన వైఫల్యం కప్పి పుచ్చుకుని, ఈ సారికి రైతులకు పంట రుణాలు లేకుండా చేయడానికి సిద్ధమౌతున్నారా , కేవలం మాటలతోనే చంద్రబాబు ప్రజలను మభ్యపెడతారా అన్నది అసలు ప్రశ్న! -
ఐపీఎస్, ఐఏఎస్‌ల విభజనపై నివేదిక రెడీ
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక సిద్ధమైంది. సిన్హా కమిటీ పరిశీలించి రాష్ట్రం ప్రభుత్వం సమర్పించిన నివేదికను ప్రధానమంత్రి ఆమోదానికి పంపారు. కాగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నుంచి... కేంద్రం పరోక్షంగా ఆప్షన్స్ తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 376 ఐఎఎస్ కేడర్ పోస్టులు ఉండగా 296 మంది అధికారులు మాత్ర మే విధుల్లో ఉన్నారు. మిగితా 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఐపిఎస్ అధికారులకు సంబంధించి 258 పోస్టులు ఉండగా 207 మంది మాత్రమే ఉన్నారు. 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎఫ్ఎస్ పోస్టులు 149 ఉండగా 123 మంది మాత్రమే ఉన్నారు. మిగితా 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎఎస్, ఐపిఎస్ పోస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తక్కువగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఎఎస్‌లను తెలంగాణకు బదిలీ చేయాల్సి ఉంటుందని విభజన కమిటీ సూచించింది.ఆప్షన్ల విధానాన్ని తమకే వదిలేయాలని కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్, ఐఫ్ఎస్ అధికారులు నేరుగా ప్రత్యూష్ సిన్హా కమిటీకి విజ్ఞప్తి చేశారు -
'ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నో ఆప్షన్స్'
న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఎక్కడ పనిచేయాలోననే ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే అవకాశం (ఆప్షన్) ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ అయ్యారు. అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్ఎఫ్ అధికారుల విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 284మంది ఐఏఎస్ అధికారులు, 209మంది ఐపీఎస్ అధికారులు, 136మంది ఐఎఫ్ఎస్ అధికారులున్నట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. కేంద్ర సర్వీసు అధికారుల విభజన కోసం రాష్ట్రస్థాయిలో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ కమలనాథన్ నేతత్వంలో పనిచేస్తున్న కమిటీ పరిశీలనలు, అభిప్రాయాలను కూడా ప్రత్యూష్ సిన్హా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఇక జాతీయ సర్వీసు అధికారుల విభజన ప్రక్రియలో నిర్దేశిత కోటా వారీగా ఉన్న డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీలను ఇన్సైడర్, అవుట్ సైడర్లుగా గుర్తించి వారిలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ), షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) కేటగిరీలుగా విభజించనున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్వీసు అధికారులను ఇరు రాష్ర్టాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కేటాయింపుల కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) మాజీ అధికారి ప్రత్యూష్ సిన్హా నేతత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటయిన విషయం తెలిసిందే.