profit booking
-
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్‌లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్‌లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్‌లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్‌లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
నాలుగు రోజుల రన్‌కు బ్రేక్: మార్కెట్ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్‌కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి. భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్‌ఫార్మ టాప్ విన్నర్స్‌గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్ , హెచ్డీఎఫ్సీ బాగా నష్టపోయాయి. -
లాభాల స్వీకరణ, ఎఫ్ఎంసీజీ, ఐటీ డౌన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. రికార్డు హైల వద్ద లాభాల స్వీకరణకు తోడు థాంక్స్ గివింగ్ సందర్భంగా అమెరికా మార్కెట్లు పనిచేయని కారణంగా పెట్టుబడిదారుల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రభుత్వ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్,నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 62 వేల పాయింట్లకుపైన, నిఫ్టీ 18400కు ఎగువన ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు,అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా లాభాల్లోనూ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, సిప్లా, నెస్లే, ఆసియన్‌పెయింట్స్ , అదానీ ఎంటర్ పప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి15 పైసలు ఎగిసి 81.51 వద్ద కొనసాగుతుంది -
stockmarket: ప్రాఫిట్ బుకింగ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా ట్రేడింగ్ పప్రారంభం నుంచీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు క్షీణించి 52,549 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు నష్టంతో 15,748 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్యరంగానికి ప్రకటించిన ఉపశమన చర్యల కారణంగా ఫార్మ, ఇంకా ఎఫ్ఎంసిజి షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా, సిప్లా, డివిస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడగా, ఓఎన్జీసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందాల్కో, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఆటో నష్టపోయాయి. -
stockmarket: ఫెడ్ ఎఫెక్ట్, కరెక్షన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో గురువారం ట్రేడింగ్‌ను ఆరంభిచాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాలతో కుప్పకూలాయి. మెటల్, బ్యాంకింగ్, షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో కూడా అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 296 పాయింట్లు కుప్ప కూలి 52205 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టంతో 15673 వద్ద కొన సాగుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, టాటా స్టీల్, హీరమోటో, బజాజ్ ఫిన్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. ఫెడరల్ బ్యాంకు, టాటా టెలీ , శ్రీ రేణుక లాంటి షేర్లు స్వల్పంగా లాభపడు తున్నాయి. -
ప్రాఫిట్ బుకింగ్: 52 వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసి రికార్డు స్థాయికి ఎగిసిన నిఫ్టీ చివరికి కీలక మద్దతు స్థాయికి దిగువన ముగిసింది. భారీ అమ్మకాలతో అటు సెన్సెక్స్ 52 వేల దిగువన ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 334 పాయింట్ల నష్టంతో 51941 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు కోల్పోయి15635 వద్ద క్లోజ్ అయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ధోరణి కనిపించింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, కోటక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, యూనియన్ బ్యాంకు,పీఎన్బీ, ఫెడరల్ బ్యాంకు తదితరలు నష్టపోయాయి. ఇంకా టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ గ్రాసిం, ఐషర్ మోటార్స్ , రిలయన్స్ నష్టపోగా ఓఎన్జిసి, ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ గ్రిడ్, ఎస్బిఐ లైఫ్, భారత్ పెట్రోలియం, దివిస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. -
మిశ్రమ ముగింపు : ఐటీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్పల్ప నష్టాలతో ముగిసాయి. రికార్డు స్థాయి లాభాల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్ నుంచి కోలుకున్నాయి. ఒక దశంలో 300 పాయింట్లకు కోల్పోయినా, చివరికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 51849 వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో వద్ద 15576 పటిష్టంగా ముగిసాయి. బ్యాంకింగ్ మెటల్, ఫార్మా ఇండెక్స్ లాభపడగా, ఐటీ , ఎఫ్ఎంసిజి కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. రిలయన్స్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో , మారుతి, అదానీ పోర్ట్స్ టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఐటీసి, ఇన్పోసిస్, యాక్సిస్, టైటన్, విప్రో, భారతి ఎయిర్టెల్, తదితరాలు నష్టపోయాయి. అటు డాలరుమారకలో రూపాయి 19పైసలు క్షీణించి 73.09 వద్ద ముగిసింది. చదవండి : Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్ -
stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కీలక సూచీలు మంగళవారం నాటి బలహీనతను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు పతనమై 51704 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 15524 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మార్చి క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో ఐటీసీ కుప్పకూలింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభాలు 1.3 శాతం క్షీణంచాయి. మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 3,748 కోట్ల రూపాయలుగా నమోదైంది..దీంతో ఐటీసీ షేరు 3 శాతం నష్టపోయింది. ఇంకా ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ నష్టపోతున్నాయి. అదానీ పోర్ట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, సిప్లా, శ్రీ సిమెంట్స్, టాటా స్టీల్, డివిస్ ల్యాబ్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఎస్బిఐ లైఫ్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం వెల్లడించనుంది. చదవండి : నిఫ్టీ రికార్డు ర్యాలీకి విరామం భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర -
రికార్డు ప్రాఫిట్ బుకింగ్ : ఫ్లాట్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య మార్కెట్లు ఊగిసలాడాయి. పెట్టుబడిదారులు లాభాలను రికార్డు స్థాయిలో లాభాలను స్వీకరించడంతో సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకుపై పతనమై 51వేల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 15వేలకు దిగువకు పతనమైంది. కానీ కనిష్ట స్థాయిల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. తద్వారా కీలక మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడం విశేషం. చివరకు సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 51300 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 15106 వద్ద పటిష్టంగా ముగిసాయి. స్థిరపడ్డాయి. టాటా స్టీల్ బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలవగా ఐషర్ మోటార్స్టాప్ లూజర్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, గెయిల్ లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాలతో ముగిసాయి. -
ప్రాఫిట్ బుకింగ్ : బడ్జెట్ ర్యాలీకి బ్రేక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగు నుంచి వెనక్కి తగ్గాయి. రికార్డుల మోత మోగించిన సూచీలు ఆఖరి గంటలో మొత్తం లాభాలను కోల్పోయాయి. లాభాల స్వీకరణతో రికార్డు హై నుంచి సెన్సెక్స్ 642 పాయింట్లు పతనమైంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ , ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. చివరకు సెన్సెక్స్ 20పాయింట్ల నష్టంతో 51329 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 15109వద్ద స్థిరపడ్డాయి. తద్వారా వరుస ఏడు రోజుల లాభాలకు బ్రేక్ చెప్పాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 487 పాయింట్లు పెరిగి 51,835.86 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 15,257 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ , రిలయన్స్ డీల్‌కు హైకోర్టు తన మునుపటి ఉత్తర్వులను రద్దు చేస్తూ సానుకూల తీర్పురావడంతో ఫ్యూచర్ షేర్లు 10 శాతం ఎగిసాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది. ఇంకా టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్, టీసీస్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఎస్బిఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్, టైటాన్, శ్రీ సిమెంట్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రికార్డు స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో ఆరు రోజుల బడ్జెట్ ర్యాలీని బ్రేక్ పడిందని విశ్లేషకులు తెలిపారు. -
లాభాల స్వీకరణ: బుల్ రన్‌కు బ్రేక్
సాక్షి, ముంబై: అత్యధిక రికార్డు స్థాయిలనుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదు పరుల లాభాల స్వీకరణ సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో కొనసాగుతున్నప్పటికీ 50వేలకు ఎగువన సెన్సెక్స్, నిఫ్టీ 14700కు పైన స్థిరంగా ట్రేడ్ అవుతుండటం గమనార్హం. 50వేల మద్దతు స్థాయికి పైన ఉన్నంతవరకు ఆందోళన అవసరం లేదని విశ్లేషకుల అంచనా. అయితే ఈ స్థాయిల్లో అప్రమత్తత అవసరమని సూచిస్తునన్నారు. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 50040 వద్ద, నిఫ్టీ 51 పయింట్ల నష్టంతో 14750 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, ఐటీ, పీఎస్‌యు బ్యాంక్ సూచికల్లో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. మరోవైపు, ఆటో, ఎఫ్ఎంసిజి, మెటల్, మీడియా షేర్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, టాటామోటార్స్ ఏషియన్ పెయింట్స్ తదితరాలు నష్టాల్లోనూ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జిసి, బజాజ్ ఆటో లాభాల్లోను ఉన్నాయి. మెరుగైన ఫలితాలనుప్రకటించినభారతి ఎయిర్టెల్ లాభాల జోరు కనిపిస్తోంది. -
భారీ నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. జూలై ఎఫ్అండ్ఓ సిరీస్ రేపటితో ముగియనున్న సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 99పాయింట్ల నష్టంతో 37912వద్ద, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 11157 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా ఫెడ్ నిర్ణయాలవైపు చూస్తున్న కారణంగా అప్రమత్తత కొనసాగుతోందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రిలయన్స్, నెస్లే, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, బీపీసీఎల్, అదాని పోర్ట్స్, టీసీఎస్, మారుతి, హీరో మోటో, టెక్ మహీంద్ర నష్టపోతున్నాయి. గ్రాసీం, భారతీ ఇన్ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. -
ఊరట : దిగివచ్చిన బంగారం
ముంబై : కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నా పదిగ్రాముల పసిడి ఇంకా 47,000కు పైగానే పలుకుతోంది. ఇండో-చైనా ఉద్రిక్తతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధరలు నిలకడగానే ఉన్నా ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దేశీ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం 439 రూపాయలు తగ్గి 47,128 రూపాయలకు దిగివచ్చింది. ఇక కిలో వెండి 230 రూపాయలు పతనమై 48,100 రూపాయలు పలికింది. చదవండి : ‘ఆ కోట కింద రూ. 11,617 కోట్ల సంపద’ -
వరుస లాభాలు : లాభాల స్వీకరణ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరసగా ఏడవ సెషన్ లో లాభాల బాటలో వుంది. ఆరంభంలో తడబడినా వెంటనే పుంజుకుని సెన్సెక్స్ 182 పాయింట్ల లాభంతో 34291 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు లాభంతో 10119 వద్ద ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోను కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. అరబిందో ఫార్మా, టాటా మోటార్స్,ఎస్ బీఐ, వేదాంతా ఇండిగో లాభపడుతుండగా, ఇండస్ ఇండ్, యాక్సిస్, హెచ్డీఎఫ్ సీ బ్యాంకు తదితర షేర్లలో లాభాల స్వీకరణ నెలకొంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 114 పాయింట్లు కోల్పోయి 33998 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 10036 వద్ద కొనసాగుతుండటం గమనార్హం. చదవండి : అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన -
ప్రాఫిట్ బుకింగ్: ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడు రోజు కూడా లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలో సెన్సెక్స్ 90 పాయింట్లు ఎగియగా, నిప్టీ 30 పాయింట్లు లాభపడింది. అయితే వెంటనే ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు క్షీణించి 38575 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టంతో11286 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా నిఫ్టీ 11300 దిగువకు చేరింది. ముఖ్యంగా ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫార్మ షేర్లు బలహీనంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ మెటల్, బ్యాంక్ నిఫ్టీ ,ఆటో రంగాలు నష్టపోతున్నాయి. ఐటీ షేర్లులాభపడుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు,ఓఎన్జీసీ నష్టపోతుండగా, ఎయిర్‌లైన్ షేర్లు, ఇండిగో, స్పైస్ జెట్ కూడా బాగా నష్టపోతున్నాయి. బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్,యూపీఎల్, టైటన, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో,భారతి ఇన్ఫ్రాటెల్ లాభపడుతున్నాయి. మరోవైపు ఫెడ్ వడ్డీ రేటు కట్ నిర్ణయంతో డాలరు బాగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి కనిష్టం నుంచి కోలుకుంది. -
రికార్డుస్థాయి నుంచి భారీ నష్టాల్లోకి
సాక్షి,ముంబై: మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 దిగువన కొనసాగుతున్నాయి. గరిష్టస్థాయిలకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయం తీవ్ర నష్టాలకు కారణమవుతోంది. ప్రధానంగా హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లలో అనూహ్య అమ్మకాలతో పాటు ఐటీ, బ్యాంకింగ్, పెట్రోరంగ కంపెనీలకు చెందిన మిడ్‌క్యాప్ షేర్లలో అనూహ్య అమ్మకాలు సూచీలను గరిష్టస్థాయిల నుంచి వెనక్కి లాగాయి. ఫలితంగా 42,274 గరిష్టం నుంచి 700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ 355 పాయింట్లు కుప్పకూలి 41591వద్దకు చేరగా, నిప్టీ రికార్డు స్థాయి 12,430 నుంచి పడి, ప్రస్తుతం 105 పాయింట్లు నష్టపోయి 12,246 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకు నిఫ్టీ టాప్ లూజర్‌గా ఉంది. ఎల్అండ్టీ, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, పవర్ గ్రిడ్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. -
అమ్మకాలు, చతికిలబడిన పందెం ‘షేర్లు’
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో సంక్రాంతి శోభ ముందే రావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు. కీలక సూచీలు మంగళవారం జీవిత కాల గరిష్టాలను నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 263 పాయింట్ల కుప్పకూలగా, నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించింది. దీంతో సెన్సెక్స్ 41800 స్థాయిని , నిఫ్టీ 12300 స్థాయిని కూడా కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో ప్రాఫిట్‌బుకింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మలో అమ్మకాలు కొనసాగుతుండగా, మెటల్ , పెయింటింగ్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఇండస్ ఇండ్, విప్రో, డా.రెడ్డీస్, ఎస్బీఐ, బీపీసీఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, గ్రాసిం నష్టపోతున్నాయి. హీరో మోటో, టైటన్, ఎం అండ్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్, మారుతి సుజుకి స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. -
లాభాల స్వీకరణ : మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచీ అమ్మకాల ఒత్తిడినిఎదుర్కొంటున్న కీలక సూచీలు మిడ్ సెషన్‌నుంచి మరింత పతన మైనాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లాభాల స్వీకరణతో ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లు పతనమై 40731 వద్ద,నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 12035 వద్ద ట్రేడవుతున్నాయి. తద్వారా వారాంతంలో సెన్సెక్స్ 41 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 12050 స్థాయి దిగువకు చేరింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు కేంద్రం సెప్టెంబర్ త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హిందూస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో షేర్లు నష్టపోతుండగా, యస్‌బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీఎయిర్‌టెల్, అదానీపోర్ట్స్, ఇన్ఫ్రాటెల్ షేర్లు లాభపడ్డాయి. -
ఐటీ షేర్ల షాక్ : నష్టాల్లోకి సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. స్వల్పలాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు మిడ్ సెషన్‌కు భారీగా నష్టపోతున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్లుకుప్పకూలి 40344 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 11901 వద్ద కొనసాగుతోంది. ఒకదశలో నిఫ్టీ 11900 స్థాయికి కిందికిచేరింది.ప్రధానంగా ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమీ కో అపరేషన్ అండ్ డెవెలప్మెంట్(ఓఈసీడీ) 5.8శాతానికి డౌన్‌గ్రేడ్ చేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. మెటల్, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వీసా నిబంధనల మార్పుల వార్తలతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తడి నెలకొంది. అలాగే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. భారతి ఇన్ఫ్రాటెల్ 5 శాతం పతనమైన టాప్‌లూజర్‌గా కొనసాగుతోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యుపిఎల్, బజాజ్ ఆటో, సిప్లా నష్టపోతుండగా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, ఎన్టీపీసీ, జీ లిమిటెడ్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, కోల్ ఇండియా లాభపడుతున్నాయి. -
లాభాల స్వీకరణ, అయినా ఓకే!
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ 93 పాయింట్లు ఎగిసి 40,258 వద్ద , నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11927 వద్ద ట్రేడవుతోంది, ఈ రోజు కొన్ని లాభాలను అధిగమించడానికి ముందు సరికొత్త రికార్డును తాకింది. ఒక దశలో సెన్సెక్స్ 330 పాయింట్లకు పైగా ఎగిసి 40,500 వద్దకు, నిఫ్టీ కూడా రోజు గరిష్ట స్థాయికి పెరిగింది. ఆటె, మెటల్ షేర్లు లాభపడుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాహ వార్తలు మెటల్షేర్లకు పాజిటివ్‌గా మారాయి. యస్ బ్యాంకు దాదాపు 10 శాతం నష్టపోయింది. జీ, ఐవోసీ, మారుతి సుజుకి, హీరోమోటో, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ నష్టపోతుండగా, టాటా స్టీల్ వేదాంతా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ ఐసీఐసీఐ బ్యాంకు లాభపడుతున్నా -
ప్రాఫిట్ బుకింగ్ : అయినా లాభాల్లోనే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. కానీ ఆరంభ లాభాలను కుదించుకోవడంతో ఆల్ టైం హైల నుంచి వెనక్కి తగ్గాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డుల బోణి కొట్టిన కీలక సూచీలు రెండూ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. ఆరంభంనుంచి దాదాపు చివరి వరకూ ట్రిపుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు ఒక దశలో 400 పాయింట్ల లాభాలను సాధించాయి. అయితే చివరి అర్థగంటలో అమ్మకాలతో సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాలకు పరిమితమై 38871 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 11669 వద్ద ముగిశాయి. ఇవాల్టి మార్కెట్లో సెన్సెక్స్ 39వేల మైలురాయిని దాటగా, నిప్టీ 11700 స్థాయికి ఎగువన ట్రేడ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ స్థాయిలో కొనసాగడం విశేషం. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా లాభపడ్డాయి. మెటల్, ఐటీ, ఆటో రంగాలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ నష్టపోయాయి. ఆంధ్రాబ్యాంక్, లక్ష్మీ విలాస్, టాటా స్టీల్, పీఎన్బీ హౌసింగ్, వెల్ కార్ప్ టాప్విన్నర్స్గా ఉండగా, జేఅండ్‌కే, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, యూనియన్, బీవోఐ, కెనరా, అలహాబాద్, సెంట్రల్, ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, గెయిల్, టాటా స్టీల్, విప్రో, మారుతీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. అయితే ఐవోసీ, యూపీఎల్, ఇండస్ఇండ్, జీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐషర్, టైటన్, కోల్ ఇండియా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఆర్బీఐ రేట్ కట్ అంచనాలు, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుందనే అంచనాలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దారి తీసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. -
ప్రాఫిట్ బుకింగ్ : నష్టాల్లోకి మార్కెట్లు
సాక్షి,ముంబై: ఫెడ్ బూస్ట్‌తో లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా నష్టాల్లోకి జారుక్నున్నాయి. అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిగడంతో ఆరంభ లాభాలన్నీ ఆవి రైపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ సెంచరీకి పైగా లాభాలతో 38,500ను అధిగమించిన సెన్సెక్స్ ప్రస్తుతం 78 పాయింట్లు నష్టపోయి 38308వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లు నష్టపోయి 11501 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు 30వేల స్థాయి వద్ద ఆల్ టైం హైని టచ్ చేసింది. దీంతో బ్యాంకింగ్ సెక్టార్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నిఫ్టీ11500 స్థాయిని నిలదొక్కుకోవడం విశేషం. రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్, యస్ బ్యాంక్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐషర్, హిందాల్కో, పవర్‌గ్రిడ్ టాప్ విన్నర్స్‌గా ఉండగా, హెచ్‌పీసీఎల్, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, జీ, ఆర్ఐఎల్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 3.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ప్రెస్టేజ్, శోభా, సన్‌టెక్ 1-0.6 శాతం మధ్య లాభపడుతున్నాయి. -
సిరీస్ క్లోజింగ్ : ప్రాఫిట్ బుకింగ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్ సుమారు 400పాయింట్లకు పైగా ఎగియగా, 10800 పైనే నిఫ్టీ ఉత్సాహంగా కదలాడింది. అయితే డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో మిడ్ సెషన్ తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 256 పాయింట్ల లాభంతో 35,906 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభానికి పరిమితమై 10806వద్ద కొనసాగుతోంది. అయితే అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రధానంగా ఐటి, ఎఫ్ఎంసిజి, ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ రంగ కౌంటర్లు లాభపడుతున్నాయి. మెటల్, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. వేదాంతా, సన్‌ఫార్మ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. అటు క్రూడ్ భారీగా పెరగడంతో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం షేర్లు నష్టపోతున్నాయి. -
బడ్జెట్ భయంతో ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ప్రపంచమార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఆర్థిక సర్వే వ్యాఖ్యల నేపథ్యంలో కీలక సూచీలు రికార్డ్ స్థాయిల నుంచి వెనక్కి మళ్లాయి. భారీగా అమ్మకాల ఒత్తిడితో ట్రేడింగ్‌ను ఆరంభించిన మార్కెట్లలో చివరి వరకూ అదే ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 36,034 వద్ద నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 11,050 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ ప్రధానంగా నష్టపోయాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1 న రానున్న యూనియన్ బడ్జెట్ నేపథ్యంలో పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్టు విశ్లేషకులు తెలిపారు. ఐషర్, కొటక్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, బాష్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, హిందాల్కో, యాక్సిస్ నష్టాల్లోనూ, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హీరో మోటో, కోల్ ఇండియా, భారతీ, సన్ ఫార్మా, ఎస్బీఐ లాభాల్లోనూ ముగిశాయి.