Rani Mukherjee
-
శివానీ శివాజీ రాయ్ నాకు చాలా ప్రత్యేకం
బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధానపాత్రలో నటించనున్న ‘మర్దానీ 3’ సినిమా ప్రకటన వచ్చింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ లీడ్ రోల్ చేసిన ‘మర్దానీ’ చిత్రం 2014 ఆగస్టు 22 విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా గోపీ పుత్రన్ డైరెక్షన్లో రూపొందిన ‘మర్దానీ 2’ సినిమా 2019 డిసెంబరు 13న రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. తొలి, ద్వితీయ భాగాల్లో సిన్సియర్ పోలీసాఫీసర్ శివానీ శివాజీ రాయ్పాత్రలో రాణీ ముఖర్జీ నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక ‘మర్దానీ 2’ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ‘మర్దానీ 3’కి సంబంధించిన మేకింగ్ వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ చిత్రానికి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ– ‘‘2025 ఏప్రిల్‌లో ‘మర్దానీ 3’ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది.పోలీస్ డ్రెస్ వేసుకుని అద్భుతమైనపాత్ర (శివానీ శివాజీ రాయ్) ను చేయటం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఈపాత్ర చేయటం ద్వారా ప్రేక్షకుల నుంచి నాకు అపరిమితమైన ప్రేమాభిమానాలు లభించాయి. ‘మర్దానీ 3’లోనూ పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండటం ఎంతో గర్వంగా ఉంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ, విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికి సైతం వెనుకాడని ధైర్యవంతులైనపోలీస్ ఆఫీసర్స్కి ఈ సినిమా అంకితం. తొలి, మలి భాగాలను మించేలా ‘మర్దానీ 3’లో గొప్ప సన్నివేశాలున్నాయి’’ అని తెలిపారు. కాగా ‘రైల్వే మెన్’ మూవీ ఫేమ్ ఆయుష్ గు΄్తా ‘మర్దానీ 3’కి స్క్రిప్ట్‌ను అందించారు. -
ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. కడుపులోనే బిడ్డను కోల్పోయిన నటి (ఫోటోలు)
-
కన్నబిడ్డల కోసం ఆ తల్లి పోరాడింది, చివరకు..
పిల్లలకు చిన్నగాయమైనా, కాసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది.. వాళ్లను తమ నుంచి శాశ్వతంగా దూరం చేసే యత్నం చేస్తే? తమ సంరక్షణలో పెరగనివ్వకుండా చట్టాలు అడ్డుకుంటే!. సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో దూరమైన బిడ్డలు.. స్వదేశంలో తల్లి చెంతకు చేరిన కథే ఇది. అందుకోసం చట్టం పోరాడిందామె. ఈ క్రమంలో భర్తకు దూరమైంది. ఆయినా ఆమె కుంగిపోలేదు. ప్రయత్నించి.. చివరకు పిల్లలను దక్కించుకుంది. ఆ కథనే రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో బాలీవుడ్లో ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’గా తెరకెక్కించారు. తన కన్నబిడ్డల కస్టడీ కోసం భారత్‌కు చెందిన ఓ మహిళ.. నార్వే ప్రభుత్వంతో పోరాడింది. ఆ పోరాటం అప్పట్లో వార్తల్లో హెడ్‌లైన్స్ అయ్యింది. ఆ గడ్డపై ఓటమి పాలైనా.. అది తాత్కాలికమే అయ్యింది. చివరికి స్వదేశానికి చేరుకుని పిల్లల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ తల్లి విజయం సాధించి పదేళ్లు పూర్తైంది. ఇంతకీ అప్పుడేం జరిగింది.. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన అనురూప్ ఛటర్జీ ఉద్యోగం రిత్యా నార్వేకు వెళ్లాడు. కూడా భార్య సాగరికాను తీసుకెళ్లాడు. అప్పటికే వాళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబును చూసుకోవడంతోనే సాగరికకు సరిపోయేదట. ఈలోపు ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో కొడుకును చూసుకోవడం కష్టంగా మారిందామె. ఇదే ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి, కన్నబిడ్డలను దూరం చేసేందుకు నార్వే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. నార్వేలో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందరూ వాటిని పాటించాలి. పిల్లలను కొట్టినా.. చివరకు చేత్తో తినిపించినా శిక్షార్హమైన నేరమే. అలాంటిది కొడుకు కోసం సెపరేట్ బెడ్ లేకపోవడం(తండ్రితోనే పడుకునేవాడు)తో.. ఆమె తన కొడుకును సరిగా చూసుకోవడం లేదంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్(Barnevarne అని కూడా అంటారు)కు ఫిర్యాదు వెళ్లింది. వెంటనే అనురూప్ ఇంటికి బార్నెవార్నె అధికారులు వెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె గర్భవతిగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ క్రమంలో.. ఆమె కొడుకు వెళ్లే ప్లే స్కూల్ నిర్వాహకులు.. సాగరిక దినచర్య సరిగా ఉండదని, తరచూ పిల్లాడి విషయంలో కౌన్సిలింగ్‌కు పిలిచేవాళ్లమంటూ నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్‌కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంతలో మరో బిడ్డను ప్రసవించాక ఆ పరిస్థితి మరింత దిగజారింది. పిల్లలిద్దరినీ ఆమె సరిగా పెంచడం లేదంటూ.. వాళ్లను తల్లిదండ్రులకు దూరంగా సంరక్షణా కేంద్రంలో ఉంచారు. అలాగే 18 ఏళ్లు నిండేవరకు వారు అక్కడే పెరుగుతారని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. ఇది జరిగింది 2011లో. అప్పటికి కొడుకు వయసు రెండున్నరేళ్లు కాగా, పాపకి ఏడాది వయసు కూడా లేదు. కోర్టుకు వెళ్తే.. సంరక్షణా కేంద్రానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. కావాలంటే ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వచ్చి చూడొచ్చంటూ కోర్టు తల్లిదండ్రులకు చెప్పింది. మానసికంగా వాళ్లకు కుంగదీసింది ఈ పరిణామం. ఆ ప్రభావంతో అనురూప్-సాగరికల మధ్య దూరం పెరిగి.. విడిపోయారు. కోల్‌కతా కోర్టు తీర్పు అనంతరం బయట సంతోషంగా సాగరిక మరోవైపు సాగరిక కథ హెడ్‌లైన్స్ ద్వారా భారత్‌కు చేరింది. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దౌత్యపరమైన పరిష్కారం కోసం యత్నించింది. కానీ, నార్వే ప్రభుత్వం మొండివైఖరి అవలంభించింది. చివరికి.. భారత్ ఒత్తిడికి తలొగ్గి బంధువులకు అప్పగించేందుకు నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అలా.. 2012లో పిల్లలు భారత్‌లోని తమ బంధువు వద్దకు వచ్చారు. కానీ, సాగరిక తన న్యాయపోరాటం ఆపలేదు. స్వస్థలానికి చేరుకున్నాక.. కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిందామె. 2013 జనవరిలో కోల్‌కతా హైకోర్టు పిల్లలను ఆమె కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఎట్టకేలకు ఆమె బిడ్డలు ఆమె చెంతకు చేరారు. ఆ సమయంలో ఆ తల్లికి అవి వర్ణించలేని క్షణాలు. సాగరిక పోరాటాన్నే ఇప్పుడు తెరపై రాణీ ముఖర్జీ ప్రదర్శించబోతున్నారు. మార్చి 17వ తేదీన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రం విడుదల కానుంది. :::సాక్షి ప్రత్యేకం -
Beauty Tips: అలోవెరా జ్యూస్, జీరా వాటర్ తాగుతా! అందుకే ఇలా...
Rani Mukherjee- Beauty Secrets: ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే నటీమణుల్లో రాణి ముఖర్జీ ఒకరు. యోగాతో పాటు కార్డియో ఎక్సర్సైజులు చేస్తానంటూ గతంలో వెల్లడించారామె. రోజుకు గంటకు పాటు వర్కౌట్లకు వెచ్చించే రాణికి ఆరోగ్యంతో పాటు సౌందర్య స్పృహ కూడా ఎక్కువే. అయితే, అందరిలా కృత్రిమ పద్ధతులు కాకుండా అమ్మ చెప్పిన చిట్కాలు పాటిస్తూ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నట్లు తన సౌందర్య రహస్యాలు పంచుకున్నారు 44 ఏళ్ల ఈ ముంబై బ్యూటీ. ‘‘బాగా నీళ్లు తాగుతాను. నీళ్లతోపాటు అలోవెరా జ్యూస్, నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్లు, జీరా వాటర్.. తప్పకుండా తీసుకుంటా. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపించి.. చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. డైట్లో అయితే సూప్స్, సలాడ్స్, ఉడికించిన కూరగాయలే ఉంటాయి ఎక్కువ శాతం. ఇవన్నీ నన్ను చురుగ్గా, ఉత్సాహంగా, అందంగా ఉంచుతాయి! అమ్మ చెప్పిన చిట్కాలు కదా మరి!’’ అని రాణి ముఖర్జీ తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేశారు. కాగా నిర్మాత ఆదిత్య చోప్రాను రాణి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ కూతురు సంతానం. చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! Allu Arjun Wife Sneha Reddy: చీరకట్టులో కుందనపు బొమ్మలా అల్లు స్నేహారెడ్డి! ఆ సారీ ధర ఎంతంటే! -
'గంగూభాయ్ కథియావాడి'ని వదిలేసుకున్న హీరోయిన్లు వీళ్లే!
పాన్ ఇండియా యాక్టర్ కావాలనే కలకు అప్పుడే పునాదులు వేసుకుంటోంది ఆలియా భట్. శ్రీదేవిలా ప్రతి భాషలోనూ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటున్న ఆలియా నటించిన తాజా చిత్రం గంగూభాయ్ కథియావాడి. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. సౌత్‌లో గంగూభాయ్ హడావుడి పెద్దగా కనిపించకపోయినా బాలీవుడ్లో మాత్రం బాగానే సక్సెస్ అయింది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసింది. కుర్ర హీరోయిన్ మాఫియా క్వీన్‌గా నటించగలదా? అన్న అనుమానాలను సైతం పటాపంచలు చేస్తూ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. నిజానికి గంగూభాయ్ పాత్ర కోసం ముందుగా ఆలియాను అనుకోలేదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఈ సినిమాను ముందుగా ముగ్గురు హీరోయిన్లు వదిలేసుకున్నారట! దీపికా పదుకొనేతో తీద్దామనుకుంటే అప్పటికే ఆమె ఇతర ప్రాజెక్టుల్లో ఉండటంతో నో చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రాను సంప్రదిద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే ఈ స్టోరీకి మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఓ మీడియా ఛానల్ అడగ్గా.. నా దగ్గరకు ఎవరూ ఆ స్టోరీతో రాలేదు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి హిందీ సినిమాలను అంగీకరించలేను అని తేల్చి చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూ చూశాక ఆమె దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్ అయ్యారట నిర్మాతలు. రాణీ ముఖర్జీకి ఈ పాత్ర పర్ఫెక్ట్గా ఉంటుందని ఆమెను సంప్రదించారట. ఆమె గతంలో సంజయ్ లీలా సినిమాల్లోనూ నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయనని తేల్చేసిందట. అలా చివరగా ఈ అవకాశం ఆలియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం, గంగూభాయ్‌గా ఆలియా అదరగొట్టేసింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం రఫ్ఫాడించగలనని నిరూపించుకుంది. -
దసరా ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖుల సందడి
సాక్షి, ముంబై: పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. రానున్న విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్, అజయ్ దేవగణ్ భార్య కాజోల్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అమిత్ కుమార్, సినీ గాయకుడు షాన్ అతని తల్లి, టీవీ నటి, కపిల్ శర్మ ఫో ఫేం సుమోన చక్రవర్తి, జాన్ కుమార్ సాను, డెబినా బోన్నర్జీ, గుర్మీత్ చౌదరి, బప్పా బి లాహిరి, తనీషా లాహిరి, దేబు ముఖర్జీ , శర్బానీ ముఖర్జీ తదితర స్టార్లు ఉత్తర బొంబాయి సర్బోజనిన్ దుర్గను సందర్శించుకున్నారు. ముంబైలోని పురాతన , అతిపెద్ద దుర్గా పూజా మండపాల్లో ఇది కూడా ఒకటి. కాగా కరోనా మహమ్మారి, కఠిన ఆంక్షల మధ్య ఇది వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గా సాగుతోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి నిస్తుండటం విశేషం. చదవండి : Durga Puja : బాలీవుడ్ హీరోయిన్ సందడి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
బంటీ – బబ్లీ – బైబై
అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ జంటగా 2005లో వచ్చిన హిందీ చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ’. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ (అభిషేక్ స్థానంలో), రాణీ ముఖర్జీ జంటగా నటించారు. సిద్ధాంత్ చతుర్వేదీ, షర్వారీ ఇతర పాత్రలు చేశారు. కరోనా వల్ల కొంత భాగం చిత్రీకరణ వాయిదా పడింది. ఆ భాగాన్ని ఇటీవలే ప్రారంభించి, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను శనివారంతో పూర్తి చేశారు. దాంతో యూనిట్ సభ్యులందరూ బైబై చెప్పుకున్నారు. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సీక్వెల్లో మొదటి భాగానికి మించిన వినోదం ఉంటుందట. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. -
సైఫ్, రాణి ముఖర్జీ కొత్త సినిమా షూటింగ్ పూర్తి
బంటీ ఔర్ బబ్లీకి క్రైం కామెడీ సినిమాకి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంటీ ఔర్బబ్లీ-2’. తాజాగా ఈ చిత్రం చివరి షూటింగ్ పూర్తైనట్లు యాష్ రాజ్ నిర్మాణ సంస్థ తన ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, షార్వారీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతులు రావటంతో చిత్రం బృందం ఈ సినిమాలోని చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మూవీలోని ఓ సరదా పాటను చిత్రీకరించామని తెలిపింది. ఇందులో నటించిన సిద్దాంత్ చతుర్వేది, షార్వారీ కూడా తమ ట్విటర్లో సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. 2005లో తెరకెక్కిన ‘బంటీ ఔర్ బబ్లీ’లో హీరో అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా అతిథి పాత్రలో కనిపించారు. అభిషేక్ స్థానంలో ప్రస్తుత సినిమాలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇక ఆయన యాష్ రాజ్ నిర్మాణ సంస్థలో విజయవంతమైన టైగర్ జిందా, సుల్తాన్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. And it’s a wrap! #BuntyAurBabli2 crew wraps up shooting of the film with a fun song while maintaining safety measures. pic.twitter.com/RXHzIYD12h — Yash Raj Films (@yrf) September 12, 2020 -
మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం మర్దానీ-2. డిసెంబర్ 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన ‘మర్దానీ’కి సీక్వెల్‌గా మార్దానీ-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు సుమారు రూ. 5 నుంచి 6 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. అదేవిధంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల స్పందన, విమర్శకుల సమీక్షలు పరిశీలిస్తే.. ఇక మీదట బాక్సాఫీసు వద్ద సందడి చేయనుందని చిత్రం బృందం భావిస్తోంది. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణి శివానీ శివాజీరాయ్‌గా రాణి ముఖర్జీ నటించారు. రాణిముఖర్జీ 2018లో నటించిన హిచ్కి కూడా విడుదలైన మొదటి రోజు సుమారు రూ. 3.30 కోట్లు రాబట్టింది. రెండో రోజు నుంచి ఈ చిత్రం కలెక్షన్లు పెరుగుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోయింది. అదేవిధంగా మంచి స్పందన లభిస్తున్న మార్దానీ-2 కూడా కలెక్షన్లు వేగం పెరిగి బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మర్దానీ 2’ లో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా ప్రధాన పాత్రలు పోషించారు. -
కాముకులకు ఖబడ్దార్
అత్యాచారాలు మేజర్లే చేస్తారని ఒక అభిప్రాయం ఉంది. మైనర్లు ఎంత ఘోరంగా ప్రవర్తించగలరో ‘నిర్భయ’ కేసు చెప్పింది. ప్రియాంకా రెడ్డి కేసు కూడా మైనర్ల దుశ్చర్యను బయటపెట్టింది. అత్యాచారాలు చేయొచ్చని బరి తెగిస్తున్న మైనర్లను ‘ఖబడ్దార్’ అని ‘మర్దానీ 2’లో హెచ్చరిస్తోంది రాణీ ముఖర్జీ. ‘మర్దానీ’ ఫస్ట్ పార్ట్ హ్యుమన్ ట్రాఫికింగ్ కథతో సాగుతుంది. మరి.. ‘మర్దానీ 2’లో ఏ అంశం గురించి చూపించారు? రాణీ ముఖర్జీ: రెండో భాగం ప్రధానంగా అత్యాచారం మీద సాగుతుంది. నూనూగు మీసాలు కూడా రాని మగపిల్లలు అత్యాచారం చేయడం అనేది నిర్ఘాంతపరిచే విషయం. అలాంటి బాల నేరస్తుల గురించిన కథ ఇది. దర్శకుడు గోపీ పుత్రన్ కథ చెబుతున్నప్పుడే ఘటనలు విని, చాలా బాధ అనిపించింది. ‘మర్దానీ 1’కి ఆయన రైటర్‌గా చేశారు. సెట్స్‌కి వచ్చి చాలా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఫస్ట్ పార్ట్‌తో రైటర్‌గా ట్రావెల్ అయిన అనుభవంతో డైరెక్టర్‌గా సెకండ్ పార్ట్‌ని అద్భుతంగా తీశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో, అంతకుముందు ఘోరమైన ‘హత్యాచారాలు’ జరిగాయి. వీటిపై మీ స్పందన? అత్యాచారం అనేది అమానవీయ విషయం. దాదాపు ప్రతి రోజూ మనం ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం. విన్న ప్రతిసారీ మళ్లీ ఇలాంటిది జరిగిందని వినకూడదనుకుంటాను. కానీ అది సాధ్యం కాదని అర్థమవుతోంది. ఓ 15 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల అమ్మాయిపై దాడి చేసి, అత్యాచారం జరిపాడు. నాలుగైదు రోజుల క్రితం ఇది ముంబైలో జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకు హైదరాబాద్ ఘటన. షాక్ అయ్యాను. ఇలాంటివాళ్లను ఊరికే వదలొచ్చా? వదిలితే నేరాలు పెరుగుతాయి. వీళ్లకు విధించే శిక్ష చాలామందికి పాఠం కావాలి. నేరం చేయాలంటేనే భయపడాలి. శిక్ష అలా ఉండాలి. హిందీలో మీ తొలి చిత్రం ‘రాజా కీ ఆయేగీ బారాత్’ (1997)లో అత్యాచారానికి గురైన యువతిగా నటించారు. ఆ సినిమా గురించి రెండు మాటలు? 22 ఏళ్ల క్రితం ఆ సినిమా చేశాను. విచారించదగ్గ విషయం ఏంటంటే.. ఇన్నేళ్లల్లో అత్యాచారం మీద చాలా సినిమాలు వచ్చాయి. చాలావరకూ సమాజంలో జరిగేవే సినిమాకి కథావస్తువు అవుతాయి. ఇప్పటికీ రేప్ మీద సినిమాలు వస్తున్నాయంటే సమాజంలో ఇంకా జరుగుతున్నాయి కాబట్టే. వెలుగులోకి వచ్చేవి పదుల సంఖ్యలో ఉంటే రానివి వందల సంఖ్యలో ఉంటాయేమో! ‘నిర్భయ’ లాంటి ఘటనలు కొన్నే బయటకు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ‘రాజా కీ ఆయేగీ..’ రిలీజ్ అప్పుడు మా నాన్నగారికి ఆపరేషన్ జరిగింది. ఆయన స్పృహలోకి రాగానే సినిమా ఎలా ఉంది? అని అడిగారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు. సినిమాలో నా పేరు మాల. ఓ పెళ్లికి వెళ్లిన మాల ఆ తర్వాత రేప్‌కి గురవుతుంది. అక్కడ్నుంచి తను పడే మానసిక క్షోభతో సినిమా ఉంటుంది. అది నటనే అని తెలిసినా మా నాన్నగారు చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఇక నిజంగా తమ కూతుళ్లకు అలాంటిది జరిగితే ఆ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మొదటి సినిమాలోనే రేప్‌కి గురయ్యే యువతిగా చేయడం రిస్క్ అనుకోలేదా? ఫస్ట్ నుంచి కూడా నేను నా మనసుకి నచ్చిన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే మనసుకి నచ్చని పాత్రలు చేస్తే నటిగా నాకు ఆత్మసంతృప్తి లభించదు కదా. అందుకే రిస్క్‌లు తీసుకోవడానికే ఇష్టపడ్డాను. ప్రతి పాత్రనూ మనసు పెట్టి చేశాను కాబట్టి నటిగా మంచి పేరు తెచ్చుకోగలిగాను. ‘మర్దానీ’ వచ్చిన ఐదేళ్లకు సీక్వెల్ చేశారు. ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన స్పందన సెకండ్ పార్ట్‌కి వస్తుందా లేదా? అనే టెన్షన్ ఏమైనా? టెన్షన్ ఏమీ లేదు కానీ, ‘మర్దానీ 2’ ట్రైలర్ రిలీజ్ అప్పుడు మాత్రం ఎలాంటి స్పందన వస్తుందా? అని చాలా ఆత్రుతగా ఎదురు చూశాను. ట్రైలర్ చూసిన వాళ్లందరూ బాగుందన్నారు. శివానీ శివాజీ రాయ్ (‘మర్దానీ’లో రాణీ ముఖర్జీ పాత్ర పేరు)ని ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సీక్వెల్ గురించి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థమైంది. దేశం మొత్తం ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్న అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ‘అసలు వీళ్లు ఈ నేరం చేయగలుగుతారా?’ అని ఊహించలేం. అలాంటి యువకులు ఈ సినిమాలో నేరం చేస్తారు. సమాజంలో పైకి అమాయకంగా కనిపించి, పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. స్త్రీలందరూ అప్రమత్తంగా ఉండండి. మైనర్లే అని తేలికగా తీసుకుంటే జీవితం నాశనం చేస్తారు. శివానీ శివాజీ రాయ్ పాత్ర చేయడంలో ఉన్న సవాళ్లేంటి? మొదటి భాగంలో నేను క్రైమ్‌బ్రాంచ్ ఆఫీసర్‌గా చేశాను. సెకండ్ పార్ట్‌లో ఎస్పీ పాత్ర చేశాను. రెండూ పోలీస్ శాఖలకు సంబంధించిన పాత్రలే అయినప్పటికీ పాత్రల బిహేవియర్లో మార్పు ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌కి, ఈ పార్ట్‌లోని శివానీ శివాజీ రాయ్‌కి వ్యత్యాసం చూపించగలగాలి. అది కొంచెం చాలెంజింగ్‌గా అనిపించింది. అదే శివానీ అయినప్పటికీ మీరు తేడా గమనించగలుగుతారు. పోలీసాఫీసర్‌గా చేయడం మీకిది కొత్త కాదు. అయినప్పటికీ ‘ఎస్పీ’ పాత్ర కోసం ఎవరినైనా ప్రేరణగా తీసుకున్నారా? ఈ సినిమా చేయడం కోసం నేను చాలామంది మహిళా పోలీసాఫీసర్లను కలిశాను. వాళ్లందరూ నాకు ఆదర్శమే. రియల్ పోలీస్‌లను కలిసి మాట్లాడినప్పుడు వాళ్లు కొన్ని కేసుల గురించి చెప్పారు. వాటిని పరిష్కరించడానికి వాళ్లేం చేశారో విని, ఆశ్చర్యపోయాను. పోలీసాఫీసర్స్కి ఎన్నో సవాళ్లుంటాయి. వాళ్లంటే అభిమానం పెరిగింది. ఆ ఫీల్‌తో నేను శివానీ క్యారెక్టర్ని బాగా చేయగలిగాను. ఫైనల్లీ... ఒక పాత్ర ప్రభావం మీ మీద ఎంతవరకూ ఉంటుంది? నేను ఒక పాత్ర చేస్తున్నానంటే ఆ పాత్ర ‘నేనే’ అనే ఫీల్ నాకు కలగాలి. అలాంటి పాత్రలే ఒప్పుకుంటాను. ‘మర్దానీ’ చేస్తున్నంతసేపూ నేను రాణీ ముఖర్జీని అనే విషయం మరచిపోయాను. శివానీ శివాజీ రాయ్‌ని అనుకున్నాను. అయితే ఈ ఫీల్ అంతా కెమెరా ముందు ఉన్నంతవరకే. ఆ తర్వాత నేను నాలా ఉంటాను. – డి.జి. భవాని సమాజంపై సినిమా ప్రభావం చాలా ఉంటుంది. మరి మీ సినిమాల విషయంలో మీరెంతవరకూ బాధ్యతగా ఉంటారు? మేం చేసే అన్ని సినిమాలూ సమాజాన్ని ప్రభావితం చేసేవే అయ్యుండాలని లేదు. కాకపోతే సమాజ మార్పు కోసం కొన్ని సినిమాలు చేయాల్సిన బాధ్యత ఉన్నట్లుగా భావిస్తాను. ‘మర్దానీ’లాంటి సినిమాలు ఆ మార్పుకి కారణమవుతాయి. సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తాయి. స్త్రీలకు అవగాహన కల్పిస్తాయి. ఇవాళ దేశం ఎంతో ముందుకు వెళుతోంది. కానీ స్త్రీల రక్షణ విషయంలో వెనకబడి ఉన్నాం. వాళ్లని రక్షించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివన్నీ ‘మర్దానీ 2’లో చెప్పాం. -
పాయల్ బోల్డ్ కబుర్లు
ఛకొన్ని సినిమాలు హిట్ అయినట్టుకొన్ని బండ్లు కూడా హిట్ అవుతుంటాయి.ఒకప్పుడు ఆర్ఎక్స్ బైక్ పెద్ద హిట్.ఆ పేరుతో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ కూడా హిట్.హీరోగా కిక్ కొట్టిన కార్తికేయకు ఎన్ని సినిమాలువచ్చాయో బ్యాక్సీట్లో కూర్చున్నపాయల్కి కూడా అంతే డిమాండ్ వచ్చింది.ఆల్రెడీ ఐదు సినిమాలు చేస్తోంది.ఇంకో నాలుగైదు డిస్కషన్లో ఉన్నాయి.బ్యూటిఫుల్ మాత్రమే కాదు..బోల్డ్ పాత్రలు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్‘సాక్షి’తో బోలెడు కబుర్లు చెప్పింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో నటించాక బైక్ స్పీడ్ అంత వేగంగా కెరీర్ కొనసాగుతున్నట్లుంది? పాయల్: అవును. ఫుల్ స్పీడ్. తెలుగులో ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డిఎక్స్ లవ్’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. తేజగారి ‘సీత’లో స్పెషల్ సాంగ్ చేశాను. చూసే ఉంటారు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అందులో వేశ్య పాత్రలో కనిపిస్తాను. లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంది. అయినా తప్పక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బ్రేకా.. ఎందుకు? నెల రోజులుగా పాపికొండల్లో ‘ఆర్డిఎక్స్ లవ్’ సినిమా కోసం ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. అంతా సాఫీగా జరిగితే బ్రేక్ వచ్చేది కాదు. ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ గాయపడ్డాను. ఆ పాట తీసే ముందు నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మోకాలి ఎముక డిస్లొకేట్ అయింది. దాంతో పది రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. పాపికొండల్లో ఎండలను ఎలా తట్టుకోగలిగారు? అయ్య బాబోయ్.. చాలా ఎండలు. నాకు వైరల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ముఖ్యంగా నా టవల్‌ను ఉతక్కుండా నాలుగు రోజులు వాడాను. ఉతికి ఇవ్వమని చెబుదామంటే మరచిపోయేదాన్ని. హరీబరీగా షూటింగ్‌కి రెడీ కావడం, మళ్లీ టవల్‌తో ముఖం తుడుచుకున్నప్పుడు ఉతకలేదని గుర్తుకు రావడం.. దాంతో ఫేస్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చాయి. మేకప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. సినిమా ఆర్టిస్ట్ జాబ్ అంత ఈజీ కాదనిపించిందా? చాలా టఫ్. మన భుజం మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ హైప్‌ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎండ, వాన, చలి.. ఇలా సీజన్స్‌ని పట్టించుకోకూడదు. మాకున్నదల్లా సినిమా సీజన్ ఒక్కటే. ఆల్ టైమ్ సీజన్ అన్నమాట. దానికోసం ఎంతైనా కష్టపడాలి. మరి పేరు, డబ్బూ ఊరికే రావు కదా. హీరోయిన్ కావాలన్నది మీ చిన్నప్పటి కలా? అవును. హీరోయిన్ కావాలని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజమైంది. నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాను. నా మాతృభాష పంజాబీలో సినిమాలు చేసుకుంటున్న నన్ను తెలుగు ఇండస్ట్రీ ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. ‘ఆర్ఎక్స్ 100’లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమ వర్ణించలేనిది. ‘ఆర్ఎక్స్ 100’లో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయిని మోసం చేసే అమ్మాయి పాత్ర అది. అవకాశం పోగొట్టుకోకూడదని చేశారా? ఇష్టంగానే చేశారా? నిజానికి నాకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. వ్యక్తిగా నా పర్సనల్ చాయిస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ నటిగా ఏదైనా కొత్త పాత్రలు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేయాలనుకుంటాం కదా. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను. చాలా మంది హీరోయిన్లు ఆ పాత్ర విని చేయడానికి ఒప్పుకోలేదట. నాకు మాత్రం కథ వినగానే, ఇలాంటివి సొసైటీలోనూ జరుగుతున్నాయి కదా. అబ్బాయిల కంటే కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. సినిమాలో చూపిస్తే తప్పేంటి? అని ఒప్పుకున్నాను. ఆ సినిమాలో అన్నీ మోతాదుకి మించి ఉంటాయి. లిప్‌లాక్ సన్నివేశాలైనా, ఇతర రొమాంటిక్ సీన్స్ అయినా. మరి ఈ పాత్ర గురించి ఇంట్లో చెప్పారా? మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. అలాగని లేనిపోని హద్దులు పెట్టి, మా అమ్మానాన్న నన్ను పెంచలేదు. కూతురికి అండగా ఉండటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇద్దరూ నా బ్యాక్‌బోన్. డైరెక్టర్ అజయ్ భూపతిగారు కథ చెప్పినప్పుడే ‘మీ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది’ అన్నారు. ఇంట్లో చెప్పాను. ఫస్ట్‌లో కొంచెం ఆలోచించినా తర్వాత ఒప్పుకున్నారు. ‘యాక్టర్‌గా నువ్వు ఏది చేసినా అది నీ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలి. ప్లస్ ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే డిసైడ్ చేసుకో’ అన్నారు. ఈ సినిమా చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. అయితే సినిమా చూసి నా పేరెంట్స్ షాక్ అయ్యారు. రవితేజతో చేస్తున్న ‘డిస్కో రాజా’లో మీది చాలెంజింగ్ రోల్ కదా? అవును. డెఫ్ అండ్ డమ్ (మూగ, చెవిటి అమ్మాయి) పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను సవాల్ చేసే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ఇంకా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు. వెంకటేశ్ గారితో చేస్తున్న ‘వెంకీ మామా’ షూటింగ్ చేస్తున్నాను. వచ్చే నెల ‘డిస్కో రాజా’ షూటింగ్లో అడుగుపెడతాను. ఆ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అడ్జెస్ట్ కావాలి’ అని అడిగారని క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. దాని గురించి? నీకు ఇది కావాలంటే ఇలా కాంప్రమైజ్ కావాలి అని అడగటం నా దృష్టిలో బుల్షిట్. అలాంటి వాళ్లను అసలు కేర్ కూడా చేయను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ అడుగుతారు. ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటారు. అంటే అడగడం కామన్ అన్నమాట. వాటిని అంగీకరించకూడదు. తిరస్కరించాలి. మన టాలెంట్ మీదే మనం ఆధారపడాలి. తిరస్కరణ అనేది తెలివిగా జరగాలి. మరి ఆ టైమ్‌లో మీ తెలివితేటలను ఎలా ప్రదర్శించారు? కరెక్టే. గొడవలకు దిగకూడదు. అలాగని అమాయకత్వాన్ని ప్రదర్శించకూడదు. సింపుల్‌గా ‘నో’ అనేయడమే. నో చెప్పేటప్పుడు మన గొంతులో సీరియస్‌నెస్‌ని ఎదుటివాళ్లు గ్రహించగలగాలి. అలా చెప్పాలి. అంతే. యాక్టింగ్‌లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడటానికైనా రెడీ. ఎంత కష్టపెట్టినా రెడీయే. అందుకే ఇలాంటి విషయాలకు తలొంచాల్సిన అవసరం లేదనుకున్నా. పోనీ అడిగారే అనుకుందాం.. ఎందుకు బయటకు చెబుతున్నావు అని కొందరు అన్నారు. చెబితే తప్పేంటి? అనేది నా ఫీలింగ్. అడ్జస్ట్ కావాలని అడిగినది మీ పంజాబీ ఇండస్ట్రీలోనా? ఇక్కడా? క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోటా ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. ఓకే.. పాయల్ టామ్ బోయా లేక నాటీ గాళా? నేనంత నాటీ కాదు.. టామ్ బోయ్ టైప్ కూడా కాదు. అయితే చాలా హుషారైన అమ్మాయిని. నా లైఫ్ చాలా బ్యూటిఫుల్. నాన్న, అమ్మ, తమ్ముడు, నేను. చిన్నప్పుడు పెద్ద బ్రైట్ స్టూడెంట్ను కాదు. నా చదువు మీద ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ముంబై పంపితే హీరోయిన్ అయిపోతాను కదా? అనేదాన్ని. ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాతే అన్నారు. అమ్మానాన్న మాటలను కాదనలేదు. మీకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదు. కానీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దేవుణ్ణి ఏదైతే అడిగానో దాన్ని ఇచ్చాడు. దీన్ని ఇలా కొనసాగించాలంటే ఈ హార్డ్ వర్క్‌ను ఇలా కొనసాగించాలి. నటిగా అవకాశాలు సంపాదించుకునే క్రమంలో పడిన కష్టాల గురించి? నేను కాలేజ్‌లో ఉండే సమయంలో మా అమ్మ నాకు 5 వేలు పాకెట్ మనీ ఇచ్చేవారు. ఐదు వేలంటే తక్కువ కాదు. కానీ హీరోయిన్ కావడానికి ముంబై వెళ్లాలంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. 1500 నుంచి 5 వేలు సంపాదించడం స్టార్ట్ చేశాను. సేవింగ్స్‌తో ముంబై వెళ్లాలన్నది ఆలోచన. ముంబై వెళ్లే సమయానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? లక్ష రూపాయలు. ఫైనల్లీ... ప్రస్తుతం సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ గ్రోత్‌ని ఎలా చూస్తున్నారు. సంపాదన కోట్ల దాకా ఎదగడం ఆనందమే (పెద్దగా నవ్వుతూ). చాలా బావుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తోంది. గతంలో నేను కొన్ని సౌత్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. ‘బ్యూటిఫుల్... అవకాశం మీకే’ అనేవారు. కానీ ఇచ్చేవారు కాదు. చాలా సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఇది మన టైమ్ కాదనుకుంటా అనుకునేదాన్ని. అప్పట్లో నేను సీరియల్స్ చేసేదాన్ని. ఆ సీరియల్ షూటింగ్ బ్రేక్స్‌లో సినిమాలకు ట్రైల్ వేస్తుండేదాన్ని. ప్రతిదాంట్లో రిజెక్షన్. ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముంబైలో నా ఫోటో చూపించి ‘ఇలాంటి హీరోయిన్ కావాలి’ అంటున్నారు. అది చాలా గర్వంగా అనిపిస్తుంది. – డి.జి. భవాని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేస్తున్న సినిమాలో మీది వేశ్య పాత్ర అన్నారు. మళ్లీ బోల్డ్ రోలా? అది బయోపిక్. నిజంగా చాలెంజింగ్ రోలే. సవాళ్లు నాకిష్టం (నవ్వుతూ). రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్ వేశ్య పాత్రలు చేశారు. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుంటున్నారా? అఫ్కోర్స్. వారి సినిమాలు చూస్తాను. అయితే నా స్టైల్లో చేస్తాను. వేశ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఒప్పుకున్నాక వాళ్ల లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వారి జీవితం అంత ఈజీగా సాగదు. ఒకవేళ వాళ్లు బ్రెడ్ అండ్ బటర్ కోసమే ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఆపేయమని చెప్పలేం. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం వారిష్టం కాబట్టి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కామెంట్ చేయలేం. -
శివానీ శివాజీ రిటర్న్స్
ఐదేళ్ల క్రితం ‘మర్దానీ’ చిత్రంలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు రాణీ ముఖర్జీ. మంచి హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారు. ‘మర్దానీ 2’ కోసం మరోసారి శివానీ శివాజీ రాయ్ క్యారెక్టర్లోకి తిరిగొచ్చారు రాణీ. పోలీస్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ఎక్కువ హీరోలే కనిపిస్తుంటారు. కానీ లేడీ ఓరియంటెడ్ పోలీస్ ఫ్రాంచైజ్ సినిమాతో ‘మర్దానీ 2’ కూడా ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఈ సీక్వెల్లో రాణీ లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు చిత్రబృందం. మొదటి భాగానికి రచయితగా పని చేసిన గోపీ పుత్రన్ ఈ సీక్వెల్ ద్వారా దర్శకుడిగా మారారు. ‘‘ఫ్రాంచైజ్ సినిమాలు చేయడం తొలిసారి. అలానే మళ్లీ శివానీ పాత్ర చేయడం మంచి ఎక్స్పీరియన్స్’’ అని పేర్కొన్నారు రాణీ. -
ఆన్ డ్యూటీ
నాలుగేళ్ల తర్వాత శివానీ శివాజీ రాయ్ పోలీస్ ఆఫీసర్‌గా మళ్లీ చార్జ్ తీసుకున్నారు. డ్యూటీ మొదలు పెట్టారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ఫిల్మ్స్ నిర్మాణంలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మర్దాని’(2014). ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు యశ్‌రాజ్ సంస్థ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాణీ ముఖర్జీనే హీరోయిన్గా నటిస్తారు. అయితే ‘మర్దాని’ చిత్రానికి రచయితగా పనిచేసిన గోపీ పుత్రన్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. తొలుత నైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘మర్దాని’ చిత్రం చైల్డ్ హ్యూమన్ ట్రాఫిక్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీక్వెల్లో మరో కొత్త పాయింట్‌ను టచ్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. -
అంత్యక్రియల్లో నవ్వినందుకు..
సాక్షి, ముంబై : ఇటీవల కన్నుమూసిన లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్ కపూర్‌కు బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచన్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్, అలియా భట్ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా కృష్ణరాజ్ కపూర్ ప్రేయర్ మీట్లో కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీలు నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక పార్టీలోనా..? అని కామెంట్ చేశారు. మిస్టర్ ఫర్పెక్షనిస్ట్ నుంచి ఇలాంటి దిగజారుడు చర్యను ఊహించలేమని.. షేమ్ అంటూ మరొక నెటిజన్ ఆమిర్‌ఖాన్‌ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. రాణీ, కరణ్ జోహార్లు సిగ్గుమాలిన పని చేశారు. రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను పెళ్లాడటం ఘనంగా భావిస్తోందని..తాము ఆమెను ద్వేషిస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
మహిళలం కావడమే మన గుర్తింపు... మన గౌరవం
ఫెమినిజం లేదా స్త్రీవాదం అనే భావనకు దశాబ్దాలుగా ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతూ వస్తున్నారు. చివరికి దానినొక గౌరవం లేని పదంగా మార్చేసింది పురుషాధిక్య సమాజం. ఇదే విషయమై బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు కొన్నింటిని వెల్లడించారు. గౌరవం కనీస హక్కు మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ తన గుర్తింపును తాను కోల్పోకుండా ఉండగలగడమే అసలైన ఫెమినిజం అంటున్నారు రాణీ ముఖర్జీ. ఫెమినిజం అంటే... స్త్రీ ఒక మగవాడితో కలిసి జీవించే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోకుండా నిలబెట్టుకుంటూ జీవించగలగడమేనంటోందామె. ‘‘భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే తనకు దక్కాల్సిన గౌరవం దక్కించుకోవాలి. భార్య స్థానం కోసం వ్యక్తిగా తను రాజీపడాల్సిన పరిస్థితి రాకూడదు’’ అంటున్నారామె. అలాగే... ‘‘సమానత్వం అని నినదిస్తూ దైనందిన జీవితంలో తనను తాను కోల్పోవడం కాదు ఫెమినిజం అంటే. మార్పు దిశగా అడుగు వేయాలి, సమాజాన్ని మార్చడానికి మరో అడుగు వేయాలి’’ అని కూడా రాణి అన్నారు. మాతృత్వపు మధురిమ ఓ బిడ్డకు తల్లి కావడంలో ఉండే మధురానుభూతి చాలా గొప్పది అంటారు రాణి. కూతురు ‘అధిర’ కు జన్మనివ్వడం ద్వారా తాను తల్లి పాత్రలోకి మారానంటూ ఓ బిడ్డకు తల్లిగా తన్మయత్వాన్ని పొందుతున్నారు ఆమె. ఈ కోణంలో సినీ పరిశ్రమ దృష్టిని, ప్రాచ్య, పశ్చిమ దేశాలలో స్త్రీ పరిస్థితిని ఆమె విశ్లేషించారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు స్త్రీకి, పురుషునికి మధ్య ఎలాంటి భేదాలు చూపించరు. నటీనటులకు కూడా అదే సూత్రం వర్తిస్తుందక్కడ. నటిగా స్థిరపడడం, పెళ్లి చేసుకోవడం, బిడ్డకు జన్మనివ్వడం వంటివన్నీ ఒకదానికొకటి సమాంతరంగా జరిగిపోతుంటాయి. ఇండియాలో అలా ఉండదు ’’ అంటారు రాణీ ముఖర్జీ. అంటే పెళ్లి కాగానే నటిగా ఆమె కెరీర్ ఆగిపోతుందని. వ్యక్తిగా తొలి గుర్తింపు బాల్యంలో ఫలానా వారి అమ్మాయి, ఫలానా ఇంటి కోడలు లేదా ఫలానా వ్యక్తి భార్య, వార్ధక్యంలో ఫలానా వారి తల్లి.. ఇదీ మహిళకు భారతీయ సమాజం ఇచ్చిన గుర్తింపు. ‘మహిళ గుర్తింపు ఇలాగే ఉండాలి, ఇలా ఉండడమే ఆమెకి గౌరవం’ అనే తనదైన నిర్వచనం చెప్పిన సమాజం మనది. ఇప్పుడిప్పుడే వ్యక్తి.. వ్యక్తిగా గుర్తింపు పొందే సంస్కృతి వైపు అడుగులు పడుతున్నాయి. అవే అసలైన ఫెమినిజం ఉన్న సమాజ నిర్మాణం దిశగా పడుతున్న అడుగులు’’ అంటారు రాణీ ముఖర్జీ. ఇండియాలో ఒక నటుడు పెళ్లి చేసుకుని, బిడ్డకు తండ్రయి నటుడిగా తన కెరీర్‌ని యథాతథంగా కొనసాగించడానికి అంగీకరిస్తారు. కానీ ఒక నటి పెళ్లి చేసుకుని బిడ్డను కనడాన్ని ఔదార్యంతో స్వీకరించలేరు. -
అందుకే అరవై రోజులు!
రాణీ ముఖర్జీ తన తదుపరి చిత్రం ‘హిచ్కీ’ ప్రమోషన్ మెదలు పెట్టనున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్ ఎవరైనా చేస్తారు.. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 60 డేస్ ప్రమోషన్ కోసం కేటాయించారామె. ఎందుకిలా? అంతగా ఎందుకు ప్రమోట్ చేయాలి? అంటే.. నాలుగేళ్ల తర్వాత రాణి నటించిన చిత్రం ‘హిచ్కీ’. పెళ్లయి, తల్లయ్యాక నటించిన సినిమా. అందుకని ఈ సినిమా ఆమెకు ఓ స్పెషల్. ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఇందులో ఆమె టూరెట్ సిండ్రోమ్ అనే నెర్వస్ డిజార్డ్‌తో బాధపడుతున్న నైనా మతూర్ పాత్రలో కనిపించబోతున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్. మనలోని లోపాలని మన అవకాశాలుగా మలుచుకుని, వాటిని చాలెంజ్ చేసి గెలవటం అనే కథాంశంతో తీసిన సినిమా ఇది. అందుకని బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఎంతైనా 60 రోజులు చేస్తారా? అంటే.. కంటిన్యూస్‌గా చేయడంలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని చేస్తారు. ఒక్క ముంబైలోనే కాదు.. దేశంలోని పలు కాలేజీలు, స్కూల్స్‌ను సందర్శించనున్నారామె. ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది. -
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాషన్ షోనా?!
ఈ ఫ్యాషన్ షోలను చూస్తూ ఉంటారా? అదేనండీ, ర్యాంప్ వాక్‌లు గట్రా. ఆ ర్యాంప్ మీద నడవాలంటే చాలా ట్రైనింగ్ ఉంటుంది. కాలు ముందు కాలెయ్యాలి. చేతులు ఓ లాగా ఊపాలి. భుజం ఓ లాగా తిప్పాలి. నడుము మరోలా ఊపాలి. మొన్నెప్పుడో రాణీ ముఖర్జీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిందట. అది ఎయిర్‌పోర్ట్‌లా అనిపించలేదు! ర్యాంప్ వాక్ ఫ్యాషన్ షోలా కనిపించిందట. దుస్తులు, బూట్లు, పర్సులు, హెయిర్ స్టయిల్, కళ్లద్దాలు, హ్యాంగింగ్స్, ఇన్క్లూడింగ్.. ట్రావెల్ బ్యాగ్.. ఒక స్టయిల్లో ఉంటేనే సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లోకి వస్తారట. ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఆ ఎయిర్పోర్ట్ ర్యాంప్‌ను గుర్తు చేసుకుంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వి చైర్లోంచి కింద పడిపోయింది రాణీ ముఖర్జీ. అంత గమ్మత్తుగా అనిపించిందట. ఏం చేస్తార్లే పాపం.. ఈ రోజుల్లో సెలబ్రిటీలను ప్రతి విషయానికీ జడ్జ్ చేసేస్తుంటారు. సింపుల్ బట్టలు వేసుకుంటే యూజ్లెస్ ఫెలో అంటారేమోనని.. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడానికి ఏ బట్టలు వేసుకోవాలి అన్నది చెప్పడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్‌ని పెట్టుకుంటున్నారంటూ, మరోసారి నవ్వుతూ చైర్లోంచి కింద పడింది రాణీ ముఖర్జీ. ‘ఒకప్పుడు ఎయిర్పోర్ట్కెళితే సెక్యూరిటీ చెక్‌ల ఇబ్బంది తప్పించుకోవడం కోసం ఒక ట్రాక్ సూట్, ఒక జత చెప్పులు, సింపుల్ హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకుని వెళ్లేవాళ్లం. కంఫర్టబుల్‌గా ఉండేది. ఇప్పుడు బెల్టు తియ్యమంటాడు. షూ తియ్యమంటాడు. బ్యాగు తిప్పెయ్యమంటాడు. జుట్టు క్లిప్పు తియ్యమంటాడు. అయినా.. ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో అన్న టెన్షన్లో ఎయిర్‌పోర్ట్‌లో ర్యాంప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు’ అనంటూ మళ్లీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ చైర్లోంచి కింద పడిందట. -
నటులు కూడా బిచ్చగాళ్లలాంటి వాళ్లు..!
కోల్‌కతా: సినీ నటులు కూడా బిచ్చగాళ్లలాంటివాళ్లేనని అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఈ అమ్మడు తాజాగా ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో ముచ్చటించింది. నటులు బిచ్చాగాళ్లలాంటి వాళ్లేనని, వాళ్లకొచ్చే ఆఫర్స్లోనే ఎంచుకొని నటించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు ఏదైనా పాత్ర వస్తే.. అది ప్రజలు నమ్మేలా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తానని రాణి తెలిపింది. బంటీ ఔర్ బబ్లీ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించడం ఆస్వాదించానని పేర్కొంది. బ్లాక్ సినిమా సెట్స్‌లో అంధ, చెవిటి వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. పద్మావతి సినిమా వివాదంపై స్పందిస్తూ ఒక సమాజంగా మనం ప్రేమను పెంపొందించుకోవాలిగానీ, ద్వేషాన్ని కాదని ఆమె సూచించింది. తమ ఇంట్లో సినిమాల గురించి అస్సలు చర్చించమని, తమ మధ్య ఉన్న అన్యోన్యమైన బంధం, కూతురి గురించే చర్చించుకుంటామని తెలిపింది. -
రాణీ రీ–ఎంట్రీ
బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. 2014లో ఆదిత్యా చోప్రాను వివాహం చేసుకున్న రాణీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2015లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చారు. తాజాగా ‘హిచ్కీ’ సినిమాతో ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. సిద్ధార్థ్ పి.మల్హోత్రా దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై మనీష్ శర్మ నిర్మించనున్న ఈ చిత్రంలో రాణీ ప్రధాన పాత్ర పోషించనున్నారని టాక్.తన బలహీనతలను ఓ మహిళ బలంగా ఎలా మార్చుకుంది? అన్నదే కథాంశం. ‘‘పాజిటివ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా’ అన్నారు రాణీ ముఖర్జీ. -
మరపురాని మతిమరుపు చిత్రాలు
సిల్వర్ అల్జైమర్స్ ‘బ్లాక్ ’ చిత్రంలోని ఒకే ఒక్క పాట.. ‘హా మైనే షుకర్ దేఖా హై’. ఇందులోని... ‘క్షణాల వేలిని జ్ఞాపకాలు పట్టుకుని ఉన్నాయి. వరండాలోకి వచ్చాను. ఆ జ్ఞాపకాలను నేను తాకాను. చూశాను’ అనే చరణం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేస్తుంది. అల్జైమర్స్లోని ప్రధాన లక్షణం మెమరీ లాస్. జ్ఞాపకశక్తి సన్నగిల్లడం లేదా నశించడం. మెమరీ లాస్ కథాంశంతో మంచి మంచి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. బిఫోర్ ఐ గాట్ స్లీప్ (థ్రిల్లర్), ది వోవ్(రొమాంటిక్ డ్రామా), ది బార్న్ ట్రయాలజీ (యాక్షన్), ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్ (ఎమోషనల్), టోటల్ రీకాల్ (సైన్స్ ఫిక్షన్), 50 ఫస్ట్ డేట్స్ (రొమాంటిక్ కామెడీ), ఫైండింగ్ నెమో (ఉద్వేగం), మెమెంటో (సైకాలజీ)... అన్నవి మరపురాని సినిమాలు. నేరుగా అల్జైమర్స్ మీదే వచ్చిన సినిమాలూ ఉన్నాయి. ‘ది శావేజస్, ఎవే ఫ్రమ్ హర్, అరోరా బరియాలిస్, ది నోట్‌బుక్, ది సాంగ్ ఆఫ్ మార్టిన్, ఐరిస్: ఎ మెమొయిర్ ఆఫ్ ది ఐరిస్ ముర్డోక్, ఫైర్‌ఫ్లై డ్రీమ్స్, యాన్ ఓల్డ్ ఫ్రెండ్స్’... ఇలాంటివే. ‘మతిమరుపు’ వరం అంటారు. కావచ్చేమో కానీ చుట్టుపక్కల వారికి మాత్రం శాపం. చుట్టుపక్కల వాళ్లు అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు. వీళ్లందరికీ రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల గురించి మతిమరుపు ఉన్న వారికి తెలియకపోవడం మరో విషాదం. మరి ఇంత విషాదం ఉన్న అల్జైమర్స్... సినిమాలకు మంచి కథాంశం ఎలా అవుతోంది? అది దర్శకుల ప్రతిభ! ఈ డెరైక్టర్లు మతిమరుపును వినోదంగా, విడ్డూరంగా, ఉద్వేగంగా, ఊహించని విధంగా మలిచి ప్రేక్షకులను థియేటర్ లకు రప్పిస్తున్నారు. బాలీవుడ్లో, ఇతర భారతీయ భాషల్లో కూడా అల్జైమర్స్పై కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగినవి ‘బ్లాక్, మాయ్, యు మి ఔర్ హమ్’ (హిందీ), ‘గోధి బన్నా సాధారణ మైకట్టు’ (కన్నడ), ‘తన్మంత్ర’ (మలయాళం). తెలుగులో, తెలుగు డబ్బింగులో ఇలాంటివి ఒకటీ అరా సినిమాలు వచ్చాయి. (గజనీ, నేను మీకు తెలుసు, భలే భలే మగాడివోయ్... వగైరా). 2005లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘బ్లాక్’ సినిమా పూర్తిగా అల్జైమర్స్ మీదే నడుస్తుంది. రాణీ ముఖర్జీ, అమితాబ్ బచ్చన్ నటించారు. ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె అంధురాలు. వినపడదు కూడా. టీచర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడుతుంది. ఆ టీచర్‌కి క్రమంగా అల్జీమర్స్ వచ్చి, ఆమెను మరిచిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే ‘బ్లాక్’. హెలెన్ కెల్లర్ జీవిత కథను ఆధారంగా చేసుకుని భన్సాలీ ఈ సినిమాను నిర్మించారు. ఎమోషనల్లీ హిట్. విషయం ఏమిటంటే... ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషా చిత్రాలకు ఎవర్గ్రీన్ క్లిక్ ఫార్ములా అల్జైమర్స్. మనుషుల్లో ఎన్ని ఉద్వేగాలు ఉంటాయో... అన్ని ఉద్వేగాలనూ పలికించగల సెంటర్ పాయింట్ సబ్జెక్ - అల్జైమర్స్. -
అమ్మా... అమ్మోరు తల్లీ...
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ‘అమ్మా.. అమ్మోరు తల్లీ..’ అంటూ అమ్మవారిని పూజిస్తున్నారు. హిందీ తారలైతే ఇంట్లో పూజలు చేయడంతో పాటు వీధుల్లో అక్కడక్కడా పెట్టే అమ్మవారి విగ్రహాలను దర్శిస్తుంటారు. ప్రతి ఏడాదీ అమితాబ్ బచ్చన్ కుటుంబం, కాజోల్, సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ వంటి తారలు తప్పనిసరిగా అమ్మవారిని సందర్శిస్తుంటారు. అందరూ ఒకే ఏరియాకి కాకపోయినా ఎవరి సౌకర్యానికి తగ్గట్టుగా వాళ్లు వెళుతుంటారు. కొడుకు, కోడలు, మనవరాలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యా బచ్చన్, భార్య జయాబచ్చన్, కూతురు శ్వేతానందాతో కలిసి అమితాబ్ బచ్చన్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అభి, ఐష్, ఆరాధ్యలను జనాలు చుట్టుముట్టేసి, ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఇక, కాజోల్ విషయానికొస్తే, కూతురు నైసా, కొడుకు యుగ్, తల్లి తనూజలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎప్పటిలానే సందడి సందడిగా ప్రసాదం పంచారు. దత్త పుత్రికలు రీనీ సేన్, అలీషా సేన్‌తో సుస్మితా సేన్ అమ్మోరు తల్లికి పూజలు నిర్వహించారు. డింపుల్ బ్యూటీ ఆలియా భట్ కూడా అమ్మవారిని దర్శించుకుని, తన భక్తిని చాటుకున్నారు. ఇంకా బాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌అమ్మోరు తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించారు. -
కూతురితో... భర్త సినిమాలో రీ-ఎంట్రీ?
గాసిప్ బాలీవుడ్ కథానాయిక రాణీముఖర్జీ మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా...? హిందీ పరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మర్దాని’ తర్వాత రాణీ ముఖర్జీ మళ్లీ తెరపై కనిపించలేదు. దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రాని పెళ్లి చేసుకోవడం, ఓ పాపకు కూడా జన్మనివ్వడంతో ఇక రాణి సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ, అందరి ఊహాగానాలకు భిన్నంగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేస్తున్నారు. అది కూడా తన భర్త ఆదిత్యా చోప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ‘బేఫికర్’లో నటించనున్నారు. రణ్‌వీర్‌సింగ్, వాణీ కపూర్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాణీముఖర్జీ తన కూతురితో కలిసి తెరపై కనబడటానికి సిద్ధమవుతున్నారు. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు భార్యా, కూతురూ కలిసి కనిపించే సన్నివేశంలో ఆదిత్యా చోప్రా కూడా కనిపిస్తారట. -
అమ్మ కానున్న రాణీ ముఖర్జీ
‘తా... రా... రంపమ్’లో ఇద్దరు బిడ్డలకు తల్లిగా రాణీ ముఖర్జీ అద్భుతంగా నటించారు. బిడ్డల పట్ల ఓ తల్లికి ఉండే మమకారాన్ని ఆ చిత్రంలో చక్కగా ఆవిష్కరించారు. రీల్ లైఫ్‌లోనే అమ్మగా ఈ స్థాయిలో ఒదిగిపోయిన రాణీ రియల్ లైఫ్‌లో పిల్లలుంటే కచ్చితంగా ‘బెస్ట్ మమ్మీ’ అనిపించుకుంటారు. ఆ సమయం రానే వచ్చింది. అవును... రాణి ముఖర్జీ ఇప్పుడు ప్రెగ్నెంట్. గత ఏడాది దర్శక -నిర్మాత ఆదిత్య చోప్రాతో ఆమె వివాహం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి నిన్న మొన్నటి దాకా రాణి గర్భవతి అనే వార్తలు వీర విహారం చేశాయి. కానీ, ఆ వార్తలన్నీ నిజం కాలేదు. తాజా వార్త మాత్రం నిజమే. వచ్చే ఏడాది జనవరిలో రాణీకి డెలివరీ డేట్ ఇచ్చారు. -
డైనమిక్ రిపోర్టర్లు
కుదిరితే నాలుగు డైలాగులు, అవసరాన్ని బట్టి ఆరు పాటలు... చాలా సినిమాల్లో హీరోయిన్ల పరిస్థితి ఇంతే. గ్లామర్ ఒలకబోయడానికే పరిమితం కాకుండా ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కొన్ని పాత్రల ద్వారానే ఆ చాన్స్ దొరుకుతుంది. అలాంటి పాత్రల్లో జర్నలిస్ట్ పాత్ర ఒకటి. ఆ పాత్రలో కొందరు హీరోయిన్లు నటించి మెప్పించి గుర్తుండిపోయారు. వారే వీరు. ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’లో రాణీ ముఖర్జీ అచ్చమైన జర్నలిస్టులా కనిపించింది. ‘సత్యాగ్రహ’లో కరీనా కూడా చక్కని ప్రతిభ కనబర్చింది. దక్షిణాదికి వస్తే... ‘రాఖీ’లో ఇలియానా చేసిన పాత్ర సూపర్బ్. హ్యూమన్ ట్రాఫికింగ్‌ని అడ్డుకోవడానికి ప్రాణాలను అడ్డు వేసే సన్నివేశంలో ఆమె నటనను మర్చిపోలేం. ‘సెల్యూట్’లో చిలిపి రిపోర్టర్‌గా, ‘కృష్ణం వందే జగద్గురుం’లో మంచి విలువలున్న జర్నలిస్టుగా నయనతార కూడా అద్భుతంగా చేసింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో ఫొటో జర్నలిస్టుగా తమన్నా కూడా మార్కులు కొట్టేసింది. ఇక ‘అనసూయ’లో భూమిక నటన అయితే అత్యద్భుతం. రిపోర్టర్ అంటే ఇలానే ఉండాలి అనేంతగా అదరగొట్టేసిందామె! -
ఐశ్వర్యా రాయ్... ఆ ముగ్గురూ నై
కొంతమంది ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతారు. మరికొంతమంది ఎంత కాలం కలిసి పని చేసినా ఉప్పూ నిప్పులాగానే ఉంటారు. ఇందుకు రకరకాల కారణాలు. అసూయ.. ఎక్స్ట్రా... ఎక్స్ట్రా... బాలీవుడ్లో ఇలా ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తించే జాబితా చాలా ఎక్కువ. మాట్లాడుకోవడం సంగతలా ఉంచితే, ఎక్కడైనా తారసపడితే కనీసం పలకరింపుగా కూడా ఈ ముద్దుగుమ్మలు నవ్వుకోరట. ఇక.. ఈ ఆగర్భ శత్రువుల గురించి తెలుసుకుందాం... ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురంటే ఐశ్వర్యా రాయ్‌కి పడదు. వాళ్లే సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ, సోనమ్ కపూర్. ముందుగా సుస్మితా సేన్, ఐష్ గురించి చెప్పాలంటే... వృత్తిపరమైన పోటీ కారణంగా ఈ ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగా మెలగలేదు. మోడలింగ్ డేస్ అప్పుడే వీళ్లిద్దరి మధ్య వైరం మొదలైంది. టాప్ మోడల్ అనిపించుకోవడానికి ఇద్దరూ పోటీపడేవారట. ఆ తర్వాత ‘ఫెమీనా మిస్ ఇండియా’ కిరీటం పొందే విషయంలో ఈ సుందరీమణులు పోటీపడ్డారు. చివరకు ఆ కిరీటం సుస్మితా గెల్చుకున్నారు. ఆ తర్వాత ‘మిస్ యూనివర్శ్’ కిరీటం కూడా దక్కించుకున్నారామె. ఐష్ ఏమో ‘మిస్ వరల్డ్’ టైటిల్ మాత్రమే గెల్చుకున్నారు. ఈ కిరీటాలే ఈ ఇద్దరి మధ్య నిప్పు రాజేశాయి. సుస్మితా ప్రతిష్ఠాత్మక బిరుదులు సొంతం చేసుకోవడం ఐష్‌కి మింగుడుపడలేదని బాలీవుడ్లో చెప్పుకుంటుంటారు. ఏది ఏమైనా 1990లలో మొదలైన వీరి శత్రుత్వానికి ఇప్పటివరకూ ఫుల్స్టాప్ పడకపోవడం విశేషం. ఐష్, రాణీ ముఖర్జీ కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారి మనస్పర్థలు నెలకొడానికి కారణం ‘చల్తే చల్తే’ సినిమా. షారూక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ముందు ఐశ్వర్యా రాయ్‌ని నాయికగా తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఐష్ స్థానంలో రాణీ ముఖర్జీని ఎంపిక చేశారు. ఇక, వ్యక్తిగతంగా అభిషేక్ బచ్చన్ విషయంలో ఇద్దరూ శత్రువులయ్యారు. అభిషేక్ బచ్చన్‌తో రాణి డేటింగ్ చేశారనే వార్త అప్పట్లో ప్రచారమైంది. కానీ, మధ్యలో ఐష్ ఇన్వాల్వ్ అయిపోయి, అభిషేక్ బచ్చన్‌తో డేటింగ్ మొదలుపెట్టారట. ఆ విధంగా రాణీతో డేటింగ్‌కి అభిషేక్ రామ్ రామ్ చెప్పేశారట. ఆ తర్వాత అభిషేక్, ఐష్ పెళ్లి చేసుకుని సెటిలవ్వడం తెలిసిందే. కానీ, రాణీ, ఐష్ మధ్య ఉన్న మనస్పర్థలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఐశ్వర్యా రాయ్, సుస్మితా, రాణీ ముఖర్జీ.. ఈ ముగ్గురూ అటూ ఇటూగా సమ వయస్కులే. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా వీళ్ల మధ్య పొరపొచ్ఛాలు రావడం సహజం. కానీ, ఐష్కన్నా దాదాపు పదిహేనేళ్లు చిన్నదైన సోనమ్ కపూర్‌తో వైరం ఏర్పడటం విచిత్రం. అయితే, దీనికి పూర్తి బాధ్య సోనమ్‌దే. ఈ ఇద్దరూ ఓ సౌందర్య సాధనానికి ప్రచారకర్తలుగా చేశారు. దానికి సంబంధించిన సమావేశంలో ఐశ్వర్యా రాయ్‌ని సోనమ్ ‘ఆంటీ’ అని సంబోధించారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఆంటీ, అంకుల్ అనే పిలుపుని ఇష్టపడరు. సోనమ్ అలా పిలవడం ఐష్ అంగీకరించలేకపోయారు. అప్పట్నుంచీ ఇద్దరి మధ్య మాటలు కట్.