recall
-
సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే..
భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా'కు రీకాల్ ప్రకటించింది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైకుకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.మూడవ తరం హయబుసాలలో బ్రేక్ సమస్య ఉన్నట్లు గుర్తించిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ స్వచ్ఛందంగానే రీకాల్ ప్రకటించింది. 2021 మార్చి - 2024 సెప్టెంబర్ మధ్య తయారైన సుమారు 1,056 బైకులలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఇది బైక్ రైడర్లను ప్రమాదంలోకి నెడుతుంది.ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించిన పిర్యాదులు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తుందని సమాచారం. దీనికోసం కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయదు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. -
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
7 లక్షల వాహనాలకు రీకాల్: బీఎండబ్ల్యూ కీలక ప్రకటన
బీఎండబ్ల్యూ కంపెనీ చైనాలో దాదాపు 7,00,000 బ్రాండ్ వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని కూలెస్ట్ పంపులో ఏర్పడిన సమస్య కారణంగా జర్మన్ కార్‌మేకర్ ఈ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. ఇందులో స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లు మాత్రమే కాకుండా.. దిగుమతి చేసుకున్న కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ వెల్లడించింది.బీఎండబ్ల్యూ మోడళ్లలో అమర్చిన లోపభూయిష్ట కూలెస్ట్ పంప్ ప్లగ్‌లు తుప్పు పట్టే అవకాశం ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్లకు కారణమైతే.. వాహనంలో మంటలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు కంపెనీ దృష్టికి రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగా రీకాల్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.రీకాల్ ప్రకటించిన కార్లలో స్థానికంగా తయారైన బీఎండబ్ల్యూ 3 సిరీస్, 5 సిరీస్ వాహనాలు ఉన్నాయి. అలాగే దిగుమతి చేసుకున్న కార్లలో ఎక్స్ సిరీస్ కార్లు ఉన్నాయి. రీకాల్ కారణంగా కంపెనీ కార్ల సేల్స్ ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. గత నాలుగు సంవత్సరాల్లో అమ్మకాలు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..కంపెనీ గత సెప్టెంబర్ నెలలో కూడా కాంటినెంటల్ ఏజీ ద్వారా సరఫరా చేసిన కార్లలో బ్రేకింగ్ సిస్టమ్‌లలో సమస్య ఉందని గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా 1.5 మిలియన్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ లోపాన్ని కంపెనీ సరి చేయడానికి ఏకంగా 1.1 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన
అమెరికన్ వాహన తయారీ 'జనరల్ మోటార్స్' కంపెనీ 4,49,000 కంటే ఎక్కువ పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.కంపెనీ రీకాల్ ప్రకటించిన వాహనాల జాబితాలో.. 2023-2024 కాడిలాక్ ఎస్కలేడ్, ఎస్కలేడ్ ESVలు, 2023 చేవ్రొలెట్ సిల్వరాడో 1500, 2023-2024 చేవ్రొలెట్ టాహో, సబర్బన్ సిఐ 1500, 2023 జీఎంసి సియెర్రా 1500, 2023-24 జీఎంసి యుకాన్ ఎక్స్ఎల్ మోడల్స్ ఉన్నాయి.రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ బ్రేక్ ఫ్లూయిడ్ కోల్పోయినప్పుడు వార్ణింగ్ ప్రదర్శించడంలో లోపం అని తెలుస్తోంది. ఇది బ్రేకింగ్ పనితీరును తగ్గిస్తుంది, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది.కంపెనీ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్లకు అక్టోబర్ 28న మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుంది. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
7.20 లక్షల బీఎండబ్ల్యూ కార్లకు రీకాల్: ఎందుకో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సుమారు 7,20,796 యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ కంపెనీ ఈ రీకాల్ ఎంధుకు ప్రకటించింది. దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎండబ్ల్యూ కంపెనీ తన కార్లలో వాటర్ పంప్లో ఒక లోపభూయిష్ట సీల్‌తో కూడిన సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. ఈ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రీకాల్ జెడ్4 కన్వర్టిబుల్తో సహా 2012 నుంచి 2018 మోడల్ సంవత్సరాల వరకు 12 మోడళ్లను ప్రకటించింది. ఇందులో 2,3,4,5 సిరీస్ కార్లు మాత్రమే కాకుండా ఎక్స్1, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5 కార్లు ఉన్నాయి.ఈ 'రీకాల్'కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇప్పటికే డీలర్లకు తెలియజేసింది. కస్టమర్లకు అక్టోబర్ ప్రారంభం నుంచి వెల్లడించే అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించడానికి కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే మొత్తం ఖర్చును కంపెనీ భరిస్తుంది. -
ఆల్టో కే10 కార్లకు రీకాల్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకి) 2,555 యూనిట్ల ఆల్టో కే10 కార్లకు రీకాల్ ప్రకటించచింది. స్టీరింగ్ గేర్ బాక్స్‌లో లోపం కారణంగా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.స్టీరింగ్ గేర్ బాక్స్‌లో తలెత్తిన సమస్య వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కంపెనీ భావిస్తోంది. కాబట్టి ఈ లోపాన్ని భర్తీ చేసేవరకు వాహనదారులు కార్లను డ్రైవ్ చేయవద్దని సంస్థ ప్రకటించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బాధిత వాహన యజమానులను మారుతి సుజుకి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. జూలై 30, 2019 - నవంబర్ 1, 2019 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో & 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్లను మార్చిలో రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఇప్పుడు ఆల్టో కే10 కోసం రీకాల్ ప్రకటించింది. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
రూ.20.95 లక్షల బైక్‌కు రీకాల్ - కారణం ఇదే..
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇటీవలే దేశీయ మార్కెట్లో రూ. 20.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ఆర్ 1300 జీఎస్ బైక్ లాంచ్ చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ బైకులకు రీకాల్ ప్రకటించింది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో రిలే సరిగా పనిచేయడం లేదనే సమస్య కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య బైక్ నిలిచిపోవడానికి కారణమవుతుంది. 18 మార్చి 2024కి ముందు తయారు చేసిన బైకులలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. కాబట్టి వీటికి రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన బైకులలో సమస్యను పరిష్కారించడానికి కంపెనీ కొత్త ఎలక్ట్రోమెకానికల్ స్టార్టర్ రిలేను అమర్చనుంది. కంపెనీ 2024 మార్చి 18 ముందు సుమారు 25000 బైకులను తయారు చేసినట్లు.. వీటన్నంటికీ సంస్థ రీకాల్ ప్రకటించింది.ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ కంపెనీ ముందుగానే స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా ఈ బైకులలోని సమస్యను సంస్థ ఉచితంగా పరిష్కరించనుంది. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
టెస్లా కీలక నిర్ణయం.. సైబర్ట్రక్లకు రీకాల్ - ఎందుకో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులకు ముందు అమరికలో సైబర్‌ట్రక్ లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని రోజుల తరువాత కంపెనీ సుమారు 11,688 సైబర్ ట్రక్కులకు రీకాల్ ప్రకటించింది. ఇంతకీ ఈ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి? దీనికోసం కంపెనీ చార్జెస్ వసూలు చేస్తుందా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెస్లా కంపెనీ లాంచ్ చేసిన ఈ సైబర్ ట్రక్కులను రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.. విండ్‌షీల్డ్ వైపర్ పనిచేయకపోవడం, ట్రంక్ బెడ్ ట్రిమ్ సమస్య అని తెలుస్తోంది. ఈ రెండు సమస్యల కారణంగా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) వెల్లడించింది.ఏజెన్సీ ప్రకారం.. కొన్ని సందర్భాల్లో విండ్‌షీల్డ్ వైపర్ ఎటువంటి హెచ్చరిక లేకుండా విఫలమవుతుంది. ఇది వర్షం పడుతున్నప్పుడు సమయంలో ప్రమాదానికి కారణం అవ్వొచ్చని తెలుస్తోంది. 2023 నవంబర్ 13 నుంచి జూన్ 6 మధ్య తయారైన వాహనాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కస్టమర్లకు ఆగష్టు 18న మెయిల్ ద్వారా మెయిల్ అందుతుంది. ఈ రీకాల్ కోసం కంపెనీ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.ఇప్పటి వరకు సైబర్ ట్రక్కుల వినియోగదారుల నుంచి దీనికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చని.. కంపెనీ స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. దీనిని సైబర్‌ట్రక్ వినియోగదారులు సులభంగా ఎటువంటి చార్జీలు చెల్లించకుండా వినియోగించుకోవచ్చు. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్.. ఎందుకంటే..
హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తన ఈవీ అయానిక్5 మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్ 5 మోడల్ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్ 5 మోడల్కార్లను రీకాల్ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేస్తాం. రీకాల్ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు. -
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా నిస్సాన్ కంపెనీ తయారుచేసిన మ్యాగ్నైట్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య తయారైన ఈ మోడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మోడళ్లలో ఈ సమస్య లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ కస్టమర్లకు చేరవేశామని కంపెనీ చెప్పింది. కంపెనీ గుర్తింపు పొందిన సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా రిపేర్ చేసి ఇస్తామని సంస్థ పేర్కొంది. -
ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాహనతయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కృషిచేస్తాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంప్ మోటార్లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్ఆర్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. 2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్ మోటార్ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల నుంచి ప్రభావిత వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్ చేయలేదని తెలిసింది. మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్క్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు -
4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే..
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్‌వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది. -
అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్‌లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్వేర్ వెర్షన్‌పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు తెలిపింది. భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నష్టాల్లో టెస్లా.. ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. -
11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది. సమస్య ఏంటంటే? 2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. -
20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్‌ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్.. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. -
లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్
డెట్రాయిట్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్‌లను సాఫ్ట్వేర్ అప్డేట్ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్ బేసిక్ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోపైలట్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్‌లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేక్‌లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్‌ను ఆన్ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. -
ఆ బైకులు కొన్నవారికి షాక్.. రీకాల్ ప్రకటించిన కంపెనీ!
Honda Motorcycle & Scooter: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఈ రోజు హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ బైకులపై ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కంపెనీ తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. ఈ రెండు బైకుల విడిభాగాల్లో లోపం ఉందని, వాటిని సరి చేయదనే ఈ రీకాల్ ప్రకటించినట్లు స్పష్టం చేసింది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ రావొచ్చనే అనుమానంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రియర్ స్టాప్ లైట్స్ విచ్ రబ్బర్ పార్ట్స్‌లో క్రాక్ వచ్చినట్లైతే నీరు లోపలి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా లోపల తుప్పు పట్టే అవకాశం ఉందని కంపెనీ ముందుగానే ఊహించింది. 2020 ఆక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యలో తయారైన బైకులలో ఈ సమస్య తలెత్తవచ్చని.. వాటిని డిసెంబర్ 2023 రెండవ వారం నుంచి బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకురావాలని కంపెనీ తెలిపింది. బైక్ వారంటీ స్థితితో సంబంధం లేకుండా నాసిరకం భాగాలు ఉచితంగా భర్తీ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అయితే ఎన్ని బైక్స్‌పై ఈ ప్రభావం ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ వెల్లడించినట్లు 2020 - 2023 మధ్య కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. -
'డైజీన్ సిరప్' వాడుతున్నారా? వెంటనే ఆపేయండి! లేదంటే..
ప్రముఖ ఔషధాల తయారీదారు 'అబాట్ ఇండియా' (Abbott India) తన గోవా ఫెసిలిటీలో తయారు చేసిన యాంటాసిడ్ సిరప్ 'డైజీన్ జెల్'కి సంబంధించిన అన్ని బ్యాచ్‌లకు రీకాల్ చేసింది. కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణం ఏంటి? దీని వినియోగం వల్ల వచ్చే ప్రమాదమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పింక్ కలర్లో ఉన్న ఈ మెడిసిన్‌ని వినియోగదారులు ఆగస్టు ప్రారంభంలో కొనుగోలు చేసినప్పుడు సీసాలోని ద్రవం తెల్లగా మారిందని, చేదుగా, ఘాటైన వాసన కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అబాట్ గోవా ప్లాంట్‌లో తయారు చేసిన యాంటాసిడ్ జెల్ వాడకాన్ని నిలిపివేయాలని డీసీజీఐ వినియోగదారులను కోరింది. ఆ సిరప్ సురక్షితమైనది కాదని, దీని వల్ల రోగి ప్రతికూల ప్రభావాణ్ణి ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇదీ చదవండి: 25 ఏళ్ళ క్రితం అలా.. ఇప్పుడేమో ఇలా - సుందర్ పిచాయ్ ఎక్స్పీరియన్స్! నిజానికి డైజీన్ సిరప్ లేదా మాత్రలు అసిడిటీ, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ వంటి వాటిని నివారించడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ సమస్యల కోసం ఈ ఔషధం ఉపయోగించే వారు వెంటనే నిలిపివేయాలి. ప్రస్తుతం కంపెనీ కూడా ఈ ప్రొడక్ట్‌కి రీకాల్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా దీనిని ఎవరైనా విక్రయిస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఔషధం వినియోగించిన వ్యక్తికి ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే దాని గురించి తెలియజేయాలని DCGI ఆదేశించింది. -
మహీంద్రా కీలక నిర్ణయం..ఎక్స్‌యూవీ 700 కార్లను వెనక్కి ఇచ్చేయండి
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌యూవీ 700 కార్ల ఇంజన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లో లోపాల్ని గుర్తించింది. వెంటనే ఈ సమస్య ఉన్న కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, 2021 జూన్ 8 నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన మొత్తం 1,08,306 కార్లలో ఈ లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌యూవీ 700తో పాటు, ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీలను సైతం రీకాల్ చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. 2023 ఫిబ్రవరి 16 నుంచి 2023 జూన్ 5 మధ్య తయారైన 3,560 కార్లలో బ్రేక్ పొటెన్షియోమీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కార్లను సైతం వెనక్కి రప్పిస్తున్నట్లు మహీంద్రా తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కార్లలో సమస్యల్ని గుర్తించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా బాగు చేసి కస్టమర్లకు అందిస్తామని స్పష్టం చేసింది.