RLD
-
కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ వ్యవహారం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి, ఎన్డీయే మిత్రపక్షం రాష్ట్రీయా లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ నేత జయంత్ చౌదరీ ఈ వ్యవహారంపై స్పందించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్డీయే మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి ఇలా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.‘‘ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాదుల పేర్లబోర్డులు స్పష్టంగా కనిపించేలా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వటం సరికాదు. ఇది పూర్తిగా ఆలోచించి, సహేతుకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏ నిర్ణయమైనా సమజ శ్రేయస్సు, సామరస్య భావానికి హాని కలిగించదు. కన్వర్ యాత్ర చేపట్టేవారు.. వారికి సేవచేవారు అందరూ ఒక్కటే. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. కన్వర్ యాత్ర చేపట్టినవారికి సేవ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవ చేసేవారిని మతం,కులం ఆధారంగా ఎవరూ గుర్తించరు. ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవటం లేదా వాటి అమలుపై తప్పనిసరి చేయటంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది’’ అని అన్నారు.శనివారం యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్రపక్షనేత, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సమర్థించారు. ఇతర పార్టీల అభిప్రాయల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని పేర్కొన్నారు. -
వేదికపై చోటు దక్కని ఆర్ఎల్డీ
న్యూఢిల్లీ: పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లో శుక్రవారం ఎన్డీఏ భేటీ సందర్భంగా రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరిని వేదికపైకి ఆహా్వనించకుండా ఎంపీల మధ్య కూర్చోబెట్టి బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు ఆరోపించాయి. ‘‘ ఒక్క సీటు సాధించిన పారీ్టలకూ వేదికపై బీజేపీ చోటిచి్చంది. ఇద్దరు ఎంపీలున్న ఆర్ఎల్డీని పట్టించుకోలేదు. ఆత్మాభిమానముంటే వెంటనే ఎన్డీఏను వీడండి. మిమ్మల్ని అవమానిస్తే సహించకండి’ అని జయంత్‌కు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ హితవు పలికారు. కుర్చీలను బట్టి గౌరవం మారదని, అదేమంత పెద్ద విషయం కాదని ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బదులిచ్చారు. -
అందుకే రాజీనామా చేశాను.. ఆర్ఎల్డీ కీలక నేత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జయంత్ చౌధరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు 'షాహిద్ సిద్ధిఖి' పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అయన పదవికి రాజీనామా చేశారు. సిద్ధిఖి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్న సమయంలో చూస్తూ మౌనంగా ఉండలేను. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరికి పంపినట్లు వెల్లడించారు. జయంత్ చౌదరిని ఉద్దేశించి.. మేము 6 సంవత్సరాలు కలిసి పని చేసాము, ఒకరినొకరు గౌరవించుకున్నాము. నేను.. నిన్ను సహోద్యోగి కంటే కూడా తమ్ముడిగానే భావించాను. ముఖ్యమైన సమస్యలను సోదరభావంతో పరిష్కరించుకున్నాము. మీ దివంగత తాత, భారత రత్న చరణ్ సింగ్, మీ దివంగత తండ్రి అజిత్ సింగ్ అందరూ కూడా పార్టీ విలువల కోసం నిలబడ్డారు అని షాహిద్ సిద్ధిఖి అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. గరిష్టంగా 80 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో, ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ వంటి వాటిని కలుపుకొని బీజేపీ బలమైన కూటమికి నాయకత్వం వహిస్తోంది. Respected Jayantji, We have worked together for 6 long years and have respect for each other. I, for one, look upon you more as a younger brother than a colleague. We have stood shoulder to shoulder on significant issues and at creating an atmosphere of brotherhood and respect… — shahid siddiqui (@shahid_siddiqui) April 1, 2024 -
RLD: అలా ఎన్డీఏలో చేరిక.. ఇలా అభ్యర్థుల ప్రకటన!
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో అధికారికంగా చేరిన రెండు రోజుల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (RLD) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్ఎల్డీ వెల్లడించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ పార్టీ బిజ్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పట్ నుండి రాజ్‌కుమార్ సాంగ్వాన్‌లను పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మలూక్ నగర్ బిజ్నోర్ స్థానాన్ని గెలుచుకుంది. బాగ్పట్ సీటును బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు కూడా ఆర్ఎల్డీ అభ్యర్థిని ప్రకటించింది. యోగేష్ చౌదరిని రంగంలోకి దించింది. ఉత్తరప్రదేశ్‌లో 51 మందితో సహా దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా 80 సీట్లు ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్ కీలకం . జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు మరణానంతరం గత నెలలో భారతరత్న అవార్డు లభించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో 2019లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుతో పోటీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 స్థానాలను కైవసం చేసుకుంది. -
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
మీకేమైనా డౌటా..? ఇండియా కూటమికి ఇంకో షాక్
లక్నో: రాష్ట్రీయా లోక్ దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేరుతారని ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాలు ఆర్ఎల్డీ పార్టీ బీజేపీలో చేరిందనడానికి బలం చేకూర్చాయి కూడా. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీనరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్కు భారత రత్న ప్రకటించింది. అయితే చరణ్ సింగ్.. మనవడే ప్రస్తుత ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ. తన తాతకు భారత రత్న ప్రకటించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరికకు సంబంధించిన ప్రచారాన్ని ధ్రువీకరించారు. గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల నుంచి చేయని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈ రోజు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్న ప్రకటించారని ఆనందం వ్యక్తంచేశారు. వెలుగులోకి రాని వ్యక్తులకు ప్రధాన స్రవంతిలోకి తీసువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరుతారన్న ప్రశ్నకు... ‘మీకేమైనా అనుమానం ఉందా? నేను ఈ రోజు ఎలా తిరస్కరించగలను’ అని అన్నారు. దీంతో జయంత్ చౌదరీ ఎన్డీయే కూటమి చేరిపోతారని సంకేతాలు అందించినట్లు అయింది. సామాజ్‌వాదీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఆర్ఎల్డీ.. బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని తెగప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీలను ఎలా విడగొట్టాలో బీజేపీకి బాగా తెలుసని, ప్రత్యర్థులపై ఎలా దాడి చేయాలో కూడా బీజేపీ తెలుసని మండిపడ్డారు. పార్టీల్లో, నాయకల్లో చీలికలు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీను ఎలా వాడుకోవాలో బీజేపీ వాళ్లకు తెలుసని ఆరోపంచారు. ఎలా మోసం చేయాలో మొన్నటి చంఢీఘర్ మేయర్ ఎన్నికల పోలింగ్‌తో అర్థం అవుతుందని అన్నారు. ఎవరిని ఎలా కొనుగోలు చేయాలో కూడా బాగా తెలుసని.. విధానాల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు. గత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగంగా ఆర్ఎల్డీ బరిలోకి దిగినప్పటికీ పోటీ చేసిన మూడు స్థానాల్లో (మథుర, బాగ్పట్, ముజఫర్ నగర్) ఓటమి పాలుకావటం గమనార్హం. జాట్ వర్గంలో ఆర్ఎల్డీకి మంచిపట్టు ఉండటం విశేషం. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్
లక్నో: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో ఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి తిరుగులేని మెజారిటీ సాధిస్తుందని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ కూటమి చివరి వరకు రైతుల శ్రేయస్సు కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. కాగా, తాను, ఆర్ఎల్డీకి చెందిన నేత జయంత్ చౌదరి రైతుల మానస కుమారులుగా అఖిలేష్ అభివర్ణించుకున్నారు. ‘నేను ఎప్పుడూ నా జేబులో ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను.. లాల్ టోపి, లాల్ పొట్లీని’ ఉంచుకుంటానని తెలిపారు. బీజేపీని ఓడించడమే నా సంకల్పమని అఖిలేష్ తెలిపారు. 2017 నుంచి ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని కాషాయపార్టీ నెరవేర్చలేదని అఖిలేష్ విమర్శించారు. అదే విధంగా జయంత్ చౌదరి కూడా బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. జయంత్ షాను బీజేపీలో చేరాలని అమిత్ షా ఆహ్వనించారు. దీనిపై జయంత్ స్పందించారు. తాను నాణెంలా ఎగిరేవ్యక్తి కాదని తెలిపారు. పశ్చిమ యూపీలో జాట్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు షా.. ఆర్ఎల్డీ చీఫ్‌ను పార్టీలోని ఆహ్వనించినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే విధంగా.. జాట్ నాయకులతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని జయంత్ తెలిపారు. ఈ సమావేశంలో యూపీ ఎంపీ సంజీవ్ బల్యాన్ సహా పార్టీ ప్రముఖ జాట్ నేతలు హజరయ్యారు. పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ అధికారంలో ఉన్న అన్ని స్థానాల్లో జాట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ప్రస్తుతం ఆర్ఎల్డీకి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పార్టీ ఎస్పీతో కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తుంది. చదవండి: ‘సిద్ధూ డబ్బుకోసం అమ్మనే వదిలేశాడు.. ఆమె అనాథలా చనిపోయింది’ -
బీజేపీది వన్ గేర్ కారు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మతపరంగా ఓట్లను సంఘటితం చేసే రాజకీయాలకు ఇక చోటులేదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌధురి అన్నారు. హిందుత్వ ఎజెండా రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ముస్లిం వ్యతిరేకతని తమ నైపుణ్యం అంతా ఉపయోగించి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత చేసినా... ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి సవాల్ విసురుతున్న జయంత్ చౌధరి ఒక వార్తా సంస్థతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ప్ర: బీజేపీని వీడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు ఎస్పీలో చేరుతున్నారు ? జ: గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ఏమీ చెయ్యలేకపోయామన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది. సరైన ప్రత్యామ్నాయం కనిపించగానే వరసపెట్టి వస్తున్నారు. ప్ర: ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా? జ: విపక్షాల ఓట్లు చీలిపోయే ప్రసక్తే లేదు. గత ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు ఎస్పీ కూటమి వైపే చూస్తున్నారు. పాలనా వైఫల్యం, నాయకత్వ లోపాలు, కాగడావేసి చూసినా కనిపించని అభివృద్ధి.. వీటన్నింటితో ఓటర్లు బీజేపీకి దూరమవుతున్నారు. ప్ర: హిందూత్వ రాజకీయాలు ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జ: గత అయిదేళ్లలో హిందుత్వ ఎజెండాతో ఎన్నో ఘటనలు జరిగాయి. విద్వేషం రాజేయడం, దాడులు జరపడం కళ్లారా చూశాం. వాటితో వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ప్రజలు గ్రహిస్తున్నారు. మథురలో మందిరం అంశంపై బీజేపీ పిలుపునిస్తే పట్టుమని పది మంది కూడా రాలేదు. మతం, మందిరం అంటే ప్రజలు వినే రోజులు పోయాయి. బీజేపీ వన్ గేర్ కారులో వెనక్కి వెళుతోంది. ప్ర: ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలేమిటి? జ: రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కీలకం కానున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేసిన నిరసనలతో వారు బీజేపీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది. ప్ర: ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విజయావకాశాలు ఎంత? జ: హిందుత్వ ఎజెండా ఓట్లను సంఘటితం చేస్తూ ఉండడం వల్ల ఇన్నాళ్లూ మేమెంతో నష్టపోయాం. ప్రజలెదుర్కొంటున్న అసలు సిసలు సమస్యలపై మేము దృష్టి పెట్టాం. ప్రజలు ఇప్పుడు మార్పుని కోరుకుంటున్నారు. దేశంలో ఒకట్రెండు రాష్ట్రాల్లో మినహా మరెక్కడా లేని విధంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తామని హామీ ఇచ్చాం. 22 తీర్మానాలతో మా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది.అందుకే మా గెలుపు ఖాయం. -
ఎస్పీ, ఆర్ఎల్డీ సీట్ల చర్చ
లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీలు మంగళవారం లక్నోలో భేటీ అయ్యా రు. భేటీ తర్వాత ‘మంతనాలు ముగిశాయి’ అనే శీర్షికతో జయంత్ ఒక ట్వీట్ చేశారు. అఖిలేశ్‌ను కలిసినప్పటి ఫొటోను ట్వీట్‌కు జతచేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ఖరారుకాలేదు. -
‘ఫతేపూర్’ బస్తీలో రాజ్‌బబ్బర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్ బంధన్‌లో స్థానం దక్కని కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్ నటుడైన రాజ్‌బబ్బర్ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్‌ను బబ్బర్ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్‌లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్‌సింగ్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్‌కు బీజేపీ టికెట్ దక్కలేదు. రాజ్‌కుమార్ చాహర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్ బంధన్ తరఫున శ్రీభగవాన్ శర్మ అలియాస్ గుడ్డూ పండిత్ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఘజియాబాద్ వద్దన్న బబ్బర్.. రాజ్ బబ్బర్‌ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. బబ్బర్ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్ సిక్రీ టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్‌బబ్బర్ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్ జాట్. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్‌పాల్ సింగ్, ధరమ్‌పాల్ సింగ్ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో రాజ్ బబ్బర్ ప్రచారం ఊపందుకుంది. మోదీ ఇమేజ్‌పైనే బీజేపీ అభ్యర్థి భారం బీజేపీకి లోక్‌సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్‌కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు? బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్‌పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్‌కు బీఎస్పీ టికెట్ లభించింది. స్థానికేతురుడైన బులంద్‌శహర్ ఎమ్మెల్యే పండిత్‌కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్‌కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆలయనగరిలో... ఎవరిపైనో దేవుడి దయ
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావించే, ‘టెంపుల్ టౌన్’గా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మథురలో ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తుంటే, ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్రసింగ్, కాంగ్రెస్ నుంచి మహేష్ పట్నాయక్ బరిలోకి దిగారు. జాట్ ఓటర్లకు బాగా పట్టున్న ఈ స్థానంలో రెండోసారి ఎంపీ సీటు దక్కించుకోవడానికి సినీ నటి హేమమాలిని గత ఎన్నికల్లో ‘జాట్ బహూ’గా ఈ నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈసారి సైతం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 మోదీ వేవ్‌లో బీజేపీ నుంచి మథుర లోక్‌సభకు పోటీ చేసి, అప్పటి ఆర్ఎల్డీ సిట్టింగ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించి హేమమాలిని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగల జాట్ సామాజిక వర్గం సెంటిమెంట్‌ని గత ఎన్నికల్లో హేమమాలిని వాడుకున్నారు. ‘జాట్ బహూ’ (జాట్ సామాజికవర్గం కోడలు)గా మీ ముందుకొస్తున్నాను. ఆదరించండం’టూ జోరుగా ప్రచారం చేసి విజయాన్ని సాధించగలిగినా ఇప్పుడా సెంటిమెంటు ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. గెలుపు అంత ఈజీ కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశాన్నీ బీజేపీ స్వీప్ చేసిన సందర్భంలో హేమమాలిని గెలుపు సులువైంది. కానీ ఈసారి ఈ స్థానంలో విజయాన్ని చేజిక్కించుకోవడం నల్లేరు మీద నడక మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో బీజేపీపై జాట్ సామాజిక వర్గంలో నెలకొన్న వ్యతిరేక ప్రవాహానికి ఎదురీదడం అంత తేలికేం కాదన్నది స్థానిక పరిశీలకుల అభిప్రాయం. అందుకే హేమమాలిని ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మథురలో జాట్ ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపును ప్రభావితం చేయగలిగిన ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 20 శాతం మందిగా ఉన్న జాట్ సామాజిక వర్గం ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. మథుర పార్లమెంటు పరిధిలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే. ఠాకూర్లు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలు ప్రధాన సామాజిక వర్గాలు. కొంత వరకు ముస్లింలు, వైశ్యులు కూడా ఉన్నారు. ప్రముఖ జాట్ నాయకుడు చౌధరీ చరణ్‌సింగ్ ఈ ప్రాంతం వారే కావడం విశేషం. చౌధరి చరణ్‌సింగ్ భార్య గాయత్రీదేవి 1984 ఎన్నికల్లో మథురలో ఓడిపోయారు. ఆయన కుమార్తె గ్యానవతి 2004లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మన్వీర్సింగ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌధరి మథుర నుంచి పార్లమెంటుకి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధరీని ఓడించి హేమమాలిని గెలిచారు. ఆమె గెలుపునకు అనేక కారణాలున్నాయనీ, ‘జాట్ బహూ’ సెంటిమెంట్‌తో హేమమాలిని ఎమోషన్ అందుకు బాగా ఉపయోగపడిందనీ జాట్ సామాజిక వర్గానికే చెందిన స్థానికుడు ముఖేష్ చౌధరి అన్నారు. దీనికి తోడు మోదీ ఛరిష్మాకంటే «భర్త ధర్మేంద్రతో బంధం కూడా గత ఎన్నికల్లో పని చేసిందనీ, అయితే ఈసారి అది పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలని గోవర్ధన్‌లో నివసించే జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిమా సింగ్ అభిప్రాయపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా 2014లో మథురలోని రావాల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఆ గ్రామానికి హేమమాలిని ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయనీ, హేమమాలిని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఎస్పీ–బీఎస్పీ’కి 7 సీట్లు వదిలిన కాంగ్రెస్
లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు. అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. -
మోదీ ఓ ఎద్దు.. స్మృతి బలిష్టమైన ఆవు
మథుర: రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని ఆయన ఎద్దు–దూడ–బలిష్టమైన ఆవుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని కోసీకలాన్‌లో రైతులతో చర్చ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘తప్పుడు వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే ఐదేళ్ల తర్వాత మార్చగలిగే హక్కు ప్రజలకు ఉండటం నిజంగా ప్రజాస్వామ్యం గొప్పతనమే. మీ ఆవులు, ఎద్దులు, దూడలు ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వార్తాపత్రికల్లో చూస్తున్నాను. వాటిని మీరు స్కూళ్లు, కాలేజీ భవనాల్లో కట్టేస్తున్నారు. ప్రజలేమో వాటిని మోదీ–యోగి అని పిలుస్తున్నారు. మరికొందరేమో బాగా బలిష్టమైన ఆవు ఒకటి వచ్చిందని చెబుతున్నారు. స్మృతీ ఇరానీ కూడా ఈ మధ్య బాగా తిరుగుతున్నారు’ అని అజిత్ సింగ్ వ్యాఖ్యానించారు. -
యూపీలో ఎస్పీ–బీఎస్పీ జట్టు!
లక్నో: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు జట్టు కట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ రెండింటితోపాటు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) వంటి చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో ఉండనున్నాయి. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఎస్పీ–బీఎస్పీల కూటమితో కలిసే సాగుతుందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కూటమితో కాంగ్రెస్ కలిస్తే, ఆ పార్టీకి అతి తక్కువ స్థానాల్లోనే టికెట్లు దక్కనున్నాయి. ఎస్పీ–బీఎస్పీల కూటమిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి చెప్పారు. అమేథీ, రాయ్‌బరేలీల్లో పోటీ చేయం.. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ఇప్పటికే పలుమార్లు సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చించారనీ, తాజాగా శుక్రవారం వారు ఢిల్లీలో భేటీ అయ్యి మాట్లాడారని రాజేంద్ర చెప్పారు. కూటమి ఏర్పాటుకు వీరిరువురూ సూత్రప్రాయ అంగీకారం తెలిపారన్నారు. కూటమిలో కాంగ్రెస్ ఉండాలా లేదా అన్న అంశాన్ని అఖిలేశ్, మాయావతిలు తర్వాత నిర్ణయిస్తారనీ, అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీల నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో మాత్రం తమ కూటమి అభ్యర్థులను పోటీలో నిలపకుండా ఆ సీట్లను కాంగ్రెస్‌కే విడిచిపెట్టాలని నిర్ణయించామన్నారు. యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మాట్లాడుతూ అఖిలేశ్–మాయావతిల భేటీపై అధికారిక ప్రకటనేదీ లేదనీ, దీనిపై తాను మాట్లాడేదీ లేదంటూ ఆయన స్పందించేందుకు నిరాకరించారు. యూపీలో 80 లోక్‌సభ స్థానాలుండగా గత ఎన్నికల్లో 71 సీట్లు బీజేపీ, మరో రెండు సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ గెలిచాయి. ఎస్పీ ఐదు, కాంగ్రెస్ రెండు సీట్లు గెలవగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. -
యూపీలో ఒక్కటైన నాలుగు పార్టీలు..
సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక లోక్‌సభ స్ధానాలున్న యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు సమిష్టిగా పోరాడాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. యూపీలోని 80 పార్లమెంట్ స్ధానాల్లో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేయాలనే కసరత్తు తర్వాత చేపట్టాలని ఈ పార్టీలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలంటే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో విపక్షాల మధ్య అవగాహన కీలకం. ఈ ఏడాది యూపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో సమైక్యంగా పోటీచేసిన ప్రతిపక్షాలు మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. గోరఖ్‌పూర్, పూల్పూర్, కైరానా, నూర్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీపై కలిసికట్టుగా పోరాడిన విపక్షాలు దీటైన విజయాలు నమోదు చేశాయి. ఇదే ఊపుతో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల సర్ధుబాటుకు పూనుకోవాలని ఎన్సీపీ నేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీల మధ్య సీట్ల సర్ధుబాటు బెడిసికొట్టడం విపక్ష శిబిరంలో నిరుత్సాహం అలుముకుంది. బీఎస్పీ అధినేత్రి తమకు 50 స్ధానాలు కేటాయించాలని కోరతుండగా, కాంగ్రెస్ 22 సీట్లను ఇవ్వచూపింది. 30 స్ధానాలకు మించి బీఎస్పీకి ఇవ్వలేమని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. -
బీజేపీని ఓడించే ఫార్ములా ఇదే..
సాక్షి, లక్నో : 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా వెలుగొందే ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ సహకరించాలని ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదురి సూచించారు. యూపీలోని కైరానా పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలతో మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో విపక్షాల ఐక్యతపై అంచనాలు ఊపందుకున్నాయి. నాలుగు ప్రధాన పార్టీలున్న యూపీలో సీట్ల సర్ధుబాటు సంక్లిష్ట సమస్యేనని జయంత్ అంగీకరించారు. బీజేపీని నిలువరించేందుకు అన్ని పార్టీలూ సర్ధుబాటు ధోరణితో వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు దానికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ ఫార్ములాతో బీజేపీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించవచ్చని సూచించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీయే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా భాగస్వామ్య పక్షాలు ఈ మార్గంలోనే ముందుకెళ్లాలని గుర్తెరగాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుతో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటేచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. -
ఈ ఫలితాలు మోదీ పతనానికి నాంది: పొన్నం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పతనానికి నాంది అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫలితాలు భవిష్యత్ కాంగ్రెస్ విజయానికి పునాది వేశాయన్నారు. 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాల్లో కేవలం ఒక ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఘోర పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలకు మేఘాలయ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో ఆర్ఎల్డీ విజయం బీజేపీ వ్యతిరేక శక్తుల కలయికతోనే సాధ్యం అయిందన్నారు. -
బీజేపీకు 3.. విపక్షాలకు 11
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు 11 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ కూటమి మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు విపక్షాలకు భారీ విజయం వంటివే. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన యూపీలోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ (సిట్టింగ్ స్థానంలో) ఓటమిపాలైంది. ఇక్కడ విపక్షాల తరపున బరిలో దిగిన ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంక సింగ్‌పై విజయం సాధించారు. యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ (బీజేపీ సిట్టింగ్ స్థానం) విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (సమాజ్‌వాదీ పార్టీ) గెలిచారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ లలో జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ ఎంపీ స్థానంలో 29వేల పై చిలుకు ఓట్లతో, ఉత్తరాఖండ్‌లో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. మరాఠా గడ్డపై ఫిఫ్టీ–ఫిఫ్టీ మహారాష్ట్రలో పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒకచోట గెలిచి.. మరోచోట ఓటమి పాలైంది. పాల్ఘర్ ఎన్నికల్లో శివసేనతో చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో బీజేపీ విజయం 29,572 ఓట్లతో సాధించింది. బీజేపీ తరపున రాజేంద్ర గవిట్, శివసేన తరపున శ్రీనివాస్ వనగా పోటీపడ్డారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగింది. బీజేపీకి 2,72,782 ఓట్లు, శివసేనకు 2,43,210 ఓట్లు రాగా.. బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) పార్టీ 2,22,838 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 47,714 ఓట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికకు ముందే కాంగ్రెస్ నుంచి గవిట్ బీజేపీలో చేరారు. అటు, భండారా–గోందియా స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ మధ్య హోరాహోరీగానే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి హేమంత్పై ఎన్సీపీ అభ్యర్థి 48,907 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, ఆర్పీఐ మరో స్వతంత్రుడు కలిపి ఎన్సీపీకి మద్దతిచ్చారు. ఈ విజయంతో ఎన్సీపీ ఎంపీల సంఖ్య ఐదుకు పెరగగా.. లోక్‌సభలో బీజేపీ సభ్యుల సంఖ్య (మహారాష్ట్ర నుంచి) 22కు తగ్గింది. గోందియాలో బీజేపీ ఓటమితో మోదీ అహంకార పూరిత పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని ఎన్సీపీ విమర్శించింది. నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షమైన ఎన్డీపీపీ అభ్యర్థి తోఖెహో యెప్తోమీ లక్షా 73వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి ఎన్డీపీపీ అధ్యక్షుడు, నాగాలాండ్ ప్రస్తుత సీఎం నీఫూ రియో విజయం సాధించారు. బిహార్‌లో ఆర్జేడీ.. బెంగాల్లో మమత బిహార్‌లోని జోకిహత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో అధికార జేడీయూకు, సీఎం నితీశ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ స్థానంలో జేడీయూ గెలిచింది. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం ఆర్జేడీ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో ఎన్డీయే కూటమికి ప్రతికూలంగా మారింది. లాలూ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి ఈ విజయం భారీగా నైతిక బలాన్నిచ్చింది. ఈ విజయం మోదీ అహంకారపూరిత పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. అటు పశ్చిమబెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 62వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ రెండోస్థానంలో నిలవగా, లెఫ్ట్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేరళలోని చెంగన్నూర్ స్థానం ఉప ఎన్నికలో అధికార సీపీఎం అభ్యర్థి సాజిచెరియన్ 20,956 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచారు. పంజాబ్‌లో అకాలీదళ్ కంచుకోట షాకోట్లో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి హర్దేవ్ సింగ్ లాడీ 38,801 ఓట్లతో అకాలీ–ఆప్ సంయుక్త అభ్యర్థిపై గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని థరాళీలో బీజేపీకి చెందిన మున్నీదేవీ షా 1900 ఓట్లతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. జార్ఖండ్‌లోని సిల్లీ, గోమియా నియోజకవర్గాలో జేఎంఎం ఘన విజయం సాధించింది. మేఘాలయాలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ నేత ముకుల్ సంగ్మా కూతురు మియానీ షిరా 3191 మెజారిటీతో అంపతీ నియోజకవర్గంలో గెలిచారు. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 41వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. యూపీలో హసన్‌ల హవా 2014 సార్వత్రిక ఎన్నికల్లో, 2017లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూపీపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా పట్టుకోల్పోతోంది. మార్చిలో యూపీలో గోరఖ్‌పూర్, ఫుల్పూర్ ఎంపీ స్థానాల ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీ.. గురువారం వెల్లడైన కైరానా ఫలితాల్లోనూ పరాజయం పాలైంది. నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ ఓటమిపాలైంది. కైరానాలో బీజేపీ, ఆర్ఎల్డీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగానే పోలింగ్ జరిగింది. విపక్షాల (ఆర్ఎల్డీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ) ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హసన్ 44,618 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో తబస్సుమ్.. యూపీ నుంచి 16వ లోక్‌సభకు ఎన్నికైన తొలి ముస్లింగా నిలిచారు. నూర్పూర్లో ఎస్పీ అభ్యర్థి నయీముల్ హసన్ (కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ మద్దతు) 5,662 సీట్లతో గెలిచారు. ఈ రెండు స్థానాలూ బీజేపీ నుంచే విపక్షాలు గెలుచుకున్నాయి. 2019లో యూపీలో ప్రధాని మోదీ ప్రభావమేమీ ఉండదని ఫలితాలు నిరూపిస్తున్నాయని తబస్సుమ్ అన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని విశ్వసించని వారికి, విభజన రాజకీయాలు చేసేవారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ చెప్పారు. ఎవరేమన్నారంటే.. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి చావుగంట మోగింది. నేను ప్రతిపాదించిన మూడో కూటమి ఫార్ములా విజయవంతమైంది. ప్రజలకు బీజేపీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఆ పార్టీ పతనం ఉత్తరప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలసి పనిచేస్తే యూపీలో బీజేపీ ఓటమి ఖాయం. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. – మమతా బెనర్జీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేని, విభజన రాజకీయాలకు పాల్పడే వారి ఓటమి ఇది. బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇది దళితులు, రైతులు, పేదల విజయం. – అఖిలేశ్ యాదవ్ నాలుగేళ్ల ఎన్డీయే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అబద్ధాలు, మోసంతో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్–మిత్ర పక్షాల విజయం తథ్యం. – కాంగ్రెస్ యూపీలోని కైరానాలో బీజేపీ ఓటమితో ప్రజలు కుల రాజకీయాలను తిరస్కరించారన్న సంగతి స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఓటుబ్యాంకును ఏర్పర్చుకోవడానికి బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. – సీతారాం ఏచూరి మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. ఓట్ల చీలిక వల్లే పాల్ఘర్లో బీజేపీ గెలుపొందింది. బీజేపీ పతనం ఆరంభమైందని అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. – ఎన్సీపీ -
కైరానా విపక్షాల కైవసం
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడమే పరాజయానికి కారణమని ఓటమి అనంతరం మృగంకా వ్యాఖ్యానించారు. ఫలితాలు నిరాశకు గురి చేసినా, భవిష్యత్‌లో తిరిగి నియోజకవర్గంపై పట్టు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాల వల్లే ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీను ఓడించాయని అన్నారు. ఇందుకు బీజేపీ మరింత సన్నద్ధం కావాల్సివుందని అభిప్రాయపడ్డారు. కాగా, కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్ మాట్లాడుతూ ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని అన్నారు. మహ్మద్ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చి ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ ఫిబ్రవరిలో అర్థాంతరంగా తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. -
బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్న అఖిలేశ్..!
లక్నో : గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రానున్న కాలంలో అదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి, మౌర్య ఈ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపింది. అదే స్ఫూర్తిగా కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఈ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నాయకలు మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి విజయం సాధించిన అఖిలేశ్ అదే వ్యుహాన్ని మళ్లీ రచిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రీయ్ లోక్ దళ్‌తో జట్టు కట్టారు. కైరానా లోక్‌సభ స్థానానికి ఎస్పీ నేతను ఆర్ఎల్డీ పార్టీ తరఫున పోటీ చేయించనున్నారు. అదేవిధంగా నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి ఆర్ఎల్డీ అభ్యర్థిని ఎస్పీ తరఫున నిలుపనున్నారు. దీనిద్వారా ఇరు పార్టీల కార్యకర్తలు విజయం కోసం శ్రద్ధగా పనిచేస్తారని అఖిలేశ్‌తోపాటు, ఆర్ఎల్డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరి భావిస్తున్నారు. ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న కైరానా లోక్‌సభ స్థానంలో 2009లో ఎస్పీ తరఫున విజయం సాధించిన తబుసమ్ హసన్‌ను ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మాయావతి మాత్రం ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలిపేది లేదని చెప్పడం, కాంగ్రెస్ కూడా ఆర్ఎల్డీ అభ్యర్థికైతేనే మద్దతు తెలుపుతామని చెప్పడంతో అఖిలేశ్ తమ పార్టీ అభ్యర్థిని ఆర్ఎల్డీ తరఫున బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరఫున చనిపోయిన హుకుమ్ సింగ్ కుమార్తె మ్రింగాక సింగ్‌ను ఆ స్థానంలో బరిలోకి దించారు. మే 28న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇవ్వడంతోపాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకురావచ్చని అఖిలేశ్ భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పొందిన ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి ఒకవేళ మాయావతి మద్దతు తెలిపితే విజయం సులువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పొత్తు కాంగ్రెస్‌తోనే..
ఆర్ఎల్డీతో ఉండదు: ఎస్పీ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడుతుం దన్న ఊహాగానాలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఫుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్‌తోనే కలసి పోటీ చేస్తామని, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో తమకు ఎలాంటి పొత్తూ ఉండబోదని స్పష్టం చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తోనే పొత్తు కుదుర్చుకున్నాం. ఆర్ఎల్డీతో ఎలాంటి అవగాహనా లేదు. ఆ పార్టీతో మేం అసలు చర్చించనే లేదు. మేం రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు 300కి పైగా సీట్లలో పోటీ చేస్తాం. మిగతా వాటిలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలుపు తుంది’అని తెలిపారు. పొత్తు, సీట్ల కేటా యింపునకు సంబంధించి ఎస్పీ అధినేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకులతో గురువారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చిం చారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నందా వెల్లడించారు. తాము ఇవ్వజూపిన సీట్ల కన్నా ఆర్ఎల్డీ అదనంగా కోరిందని.. దాంతో ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్నట్లు ఎస్పీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్పీని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ అధినేత అఖిలేశ్.. శివ్‌పాల్ యాదవ్ బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. -
ఆ పార్టీతో పొత్తులేదని తేల్చేసిన ఎస్పీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో బీజేపీని ఎదుర్కోవాలని పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న సమాజ్‌వాద్ పార్టీ, తమలో రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)ని కలుపుకుంటుందనే వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. ఆర్ఎల్డీతో తాము ఎలాంటి పొత్తు కుదుర్చుకోమంటూ సమాజ్‌వాద్ పార్టీ గురువారం తేల్చేసింది. తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుపెట్టుకుంటామని పేర్కొంది. '' ఎస్పీ కేవలం కాంగ్రెస్‌తోనే పొత్తుకు సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకోం. ఆర్ఎల్డీతో ఎలాంటి చర్చలు జరుపడం లేదు. మొత్తం 403 సీట్లలో 300 సీట్లలో ఎస్పీ పోటీ చేస్తాం. మిగతా 103 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది'' అని సమాజ్‌వాద్ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్మయ్ నందా స్పష్టంచేశారు. పార్టీ సీనియర్ లీడర్లు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో ఆరుగంటల పాటు జరిపిన చర్చలానంతరం పొత్తులపై నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్పీ ఇస్తానన్న సీట్ల కంటే ఆర్ఎల్డీ ఎక్కువ సీట్లను కోరుతుందని అందుకే పొత్తు చర్చలు కుదరలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఎన్నికలు ముంచుకొచ్చినా.. తేలని పొత్తులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలిదశ నామినేషన్లకు గడువు గట్టిగా వారం రోజులు కూడా లేదు. కానీ అక్కడ ఇంకా పొత్తుల విషయం తేలలేదు. అఖిలేష్ నేతృత్వంలో ఏర్పడుతుందనుకుంటున్న మహాకూటమిలో అజిత్ సింగ్ పార్టీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) ఉంటుందో లేదోనన్న అనుమానాలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ.. ఇవన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలని, తద్వారా బీజేపీ, బీఎస్పీలను ఓడించాలని ముందునుంచి భావిస్తున్నారు. అయితే.. తొలిదశలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. అదే ఇప్పుడు పొత్తు విషయంలో ప్రధాన అడ్డంకిగా మారింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు కూడా. దాదాపు వారం రోజుల క్రితం తొలిదఫా చర్చలు జరిగాయి. అప్పుడు ఆర్ఎల్డీకి 23 టికెట్లు ఇస్తామని సమాజ్‌వాదీ ఆఫర్ చేసింది. అయితే తమకు మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం కావాలని అజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కానీ దానికి అఖిలేష్ బృందం అంగీకరించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ చర్చలన్నవి ఏమీ జరగలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని మొదటి రెండు దశల్లో.. ముజఫర్ నగర్, మీరట్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, ఆగ్రా, మథుర లాంటి ప్రాంతాలున్నాయి. 2014 ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఇక్కడ సీట్లు బాగానే గెలుచుకుంది. ఇక్కడ తమకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే బీజేపీని గట్టి ఎదుర్కోగలమని ఆర్ఎల్డీ అంటోంది. గత ఎన్నికల్లో ఆర్ఎల్డీకి వచ్చిన స్థానాలు 8 మాత్రమే. అందువల్ల ఇప్పుడు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న విషయంలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో.. ఏం చేయాలోనని తలపట్టుకుంటున్నాయి. -
మహాపంచాయత్ భగ్నం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌తో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిలో ఆర్ఎల్డీ నిర్వహించ తలపెట్టిన మహాపంచాయత్‌ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అజిత్ ఖాళీ చేసిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్ నిర్వహించేందుకు ఆర్ఎల్డీ పిలుపునివ్వడంతో సదరు బంగ్లా ఉన్న ప్రాంతమైన 12 తుగ్లక్‌రోడ్‌కు దారితీసే రహదారులన్నింటినీ బారీకేడ్లతో మూసివేశారు. లూటియెన్స్ జోన్లో 144 సెక్షన్‌ను అమలు చేయడమే కాకుండా రేస్‌కోర్సు రోడ్డు మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఉదయం 8.20 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మూసివేయడంతో 12 తుగ్లక్ రోడ్డుకుచేరుకోలేకపోయారు. చేరుకున్న కొంతమందిని పోలీసుల అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. అనుమతి లేదని ముందే ప్రకటించిన పోలీసులు తమ నేతతో బంగ్లా ఖాళీ చేయించేందుకు ఎంసీడీ అనుసరించిన తీరును ఆర్ఎల్డీ కార్యకర్తలు తీవ్రంగా తప్పుబట్టారు. సదరు బంగ్లాకు నీటి సరఫరా బంద్ చేయడం, కరెంటు సరఫరా బంద్ చేయడం వంటి చర్యలను ఖండించారు. దీంతో ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకునేందుకు నగర శివార్లలో ఆందోళన నిర్వహించిన ఆర్ఎల్డీ కార్యకర్తలు మంగళవారం రాజధానిలో తమ సత్తా నిరూపించేందుకు ప్రయత్నించారు. అజిత్‌సింగ్‌తో ఖాళీ చేయించిన బంగ్లా ఎదుటే మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ ఆందోళనకారులు పంచాయత్ నిర్వహించేందుకే నిర్ణయించుకోవడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఆర్ఎల్డీ మద్దతుదారులను అడ్డుకునేందుకు పోలీ సు లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అజిత్‌సింగ్ బంగ్లా వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాాలను మోహరించడంతోపాటు తుగ్లక్ రోడ్‌తోపాటు బంగ్లాకు దారితీసే ప్రధాన రహదారులపై పలుచోట్ల బారికేడ్లను అమర్చారు. బారి కేడ్ల కారణంగా ఆర్ఎల్ డీ మద్దతుదారులు పెద్ద ఎత్తున అజిత్ సింగ్ నివాసానికి చేరుకోలేకపోయారు. చేరుకున్నవారిని పోలీసులు వాహనాలలో ఎక్కించుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఆంక్షలతో నగరవాసుల ఇబ్బందులు ఉదయం రద్దీ వేళల్లో రోడ్లపై బారికేడ్లను అమర్చడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. బారికేడ్ల ప్రభావం దక్షిణ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ట్రాఫిక్‌పై కనిపించింది. ఐఎన్ఏ, ఔరంగాజేబ్ రోడ్, తీన్‌మూర్తి రోడ్డుతో పాటు పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. రేస్‌కోర్సు మెట్రోస్టేషన్‌ను కూడా మూసివేయడం మెట్రో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. 12 తుగ్లక్‌రోడ్‌లో అజిత్ సింగ్ 30 సంవత్సరాలుగా నివాసముంటున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన సింగ్ సదరు బంగళాను ఖాళీ చేయాలని ప్రభుత్వం అంటోంది. అయితే తన తం డ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఈ బంగ్లాలో నివాసమున్నారని, దానిని చరణ్‌సింగ్ మెమోరియల్‌గా ప్రకటించాలని అజిత్‌సింగ్ డిమాండ్ చేస్తున్నారు.