Sarfaraz Khan
-
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. మిడిలార్డర్ ఆటగాడికి గాయం..?
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడని తెలుస్తుంది. సర్ఫరాజ్ మోచేతికి గాయమైనట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. గాయం అనంతరం సర్ఫరాజ్ మోచేతిని పట్టుకుని నెట్స్‌ను వీడాడు. ఈ వీడియోలో సర్ఫరాజ్ నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.ఒకవేళ సర్ఫరాజ్ ఖాన్ గాయం నిజంగా పెద్దదై అతను తొలి టెస్ట్‌కు దూరమైతే టీమిండియా కూర్పులో తేడాలొస్తాయి. ఇది భారత జట్టుకు శుభ పరిణామం కాదు. ప్రస్తుతం సర్ఫరాజ్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్ పిచ్‌లపై అతడు తప్పక రాణిస్తాడని టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది. 27 ఏళ్ల సర్ఫరాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. వరుస హాఫ్ సెంచరీలు చేసి కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సర్ఫరాజ్.. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్ట్‌లో సూపర్ సెంచరీతో (150) మెరిశాడు. అయితే ఆతర్వాత అతను కాస్త లయ తప్పాడు. సెంచరీ తర్వాత ఏడు ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, భారత జట్టు కొద్ది రోజుల కిందట రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా జట్టంతా ఆస్ట్రేలియాకు చేరుకుంది. తొలి టెస్ట్‌కు వేదిక అయిన పెర్త్ వాకా స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇక్కడి ఫాస్ట్ మరియు బౌన్సీ పిచ్‌లపై భారత ప్లేయర్లు నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల చేత రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికే టీమిండియాకు తలనొప్పిగా మారింది. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా ఎవరిని పంపాలని జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది. ఇప్పుడు సర్ఫరాజ్‌కు కూడా గాయమైతే టీమిండియా సమస్యలు తీవ్రతరమవుతాయి.ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.ట్రావెలింగ్ రిజర్వ్: ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. -
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
ఇట్స్ బేబీ బాయ్: సర్ఫరాజ్ ఖాన్‌కు ప్రమోషన్(ఫొటోలు)
-
మాస్ హిట్టింగ్ తో న్యూజీలాండ్ కి చుక్కలు
-
బెంగళూరు టెస్టు.. ఆధిక్యంలోకి భారత్
Update: బెంగళూరు టెస్టులో భారత్ 32 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. దాదాపు రెండు గంటల విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. 79 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(85), సర్ఫరాజ్ ఖాన్(144) పరుగులతో ఉన్నారు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా అదరగొడుతోంది. భారత యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ కివీస్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు.మరోవైపు గాయం నుంచి కోలుకుని బ్యాటింగ్ చేస్తున్న పంత్ కూడా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే భారత్ జోరుకు వరుణుడు బ్రేక్‌లు వేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో 20 నిమిషాల ముందే లంచ్‌కు ఆటగాళ్లు వెళ్లిపోయారు.వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 344 పరుగుల స్కోర్ చేసింది. ప్రస్తుతం భారత్ ఇంకా 12 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) పరుగులతో ఉన్నారు. పంత్, ఖాన్ నాలుగో వికెట్‌కు ఇప్పటికే 113 పరుగులు జోడించారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు' -
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నాడు. శుబ్‌మన్ గిల్ స్దానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్.. మూడో రోజు ఆటలో దుమ్ములేపాడు.భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వీప్, ర్యాంప్ షాట్లు ఆడుతూ సర్ఫరాజ్ అలరించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులతో ఖాన్ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భారత్ తమ రిథమ్‌ను కొనసాగించాలంటే వీలైనంత సమయం పాటు సర్ఫరాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేకర్ పోల్చాడు."సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అతడు ఆట తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.అతడికి అద్భుతమైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆఖరిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆటను ముగించాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ కీలకం కానున్నాడు. బౌన్సర్లను కూడా సర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌కు ఇది నిజంగా శుభసూచకమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు? -
IND vs NZ: ఆ అద్భుతం సాధ్యమా!
బెంగళూరు: న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడిపోయి 37 ఏళ్లు గడిచాయి. 1987లో చివరిసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత జట్టుకు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ముప్పు పొంచి ఉంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం... క్రీజులోకి రావాల్సిన భారత బ్యాటర్లకు భారీ స్కోర్లు చేసే సత్తా ఉండటంతో అద్భుతం జరుగుతుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది. ఎందుకంటే 2001లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులోనూ భారత జట్టు ఇలాగే ప్రత్యరి్థకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సమరి్పంచుకొని... ఆ తర్వాత తిరిగి పుంజుకుని విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అసాధారణ ఆటతీరుతో కంగారూల నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఇప్పుడు తాజా మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌కు 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంత భారీ లోటును పూడ్చాలంటే... రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతం జరగాల్సింది. అలాంటి అరుదైన సందర్భానికి శుక్రవారం బ్యాటింగ్ చేసిన నలుగురు నాంది పలకగా... నాలుగో రోజు మిగిలిన వాళ్లు దాన్ని కొనసాగించాల్సి ఉంది. దేశవాళీల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశి్వన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అయితే కీపింగ్ చేస్తూ గాయపడ్డ పంత్ బ్యాటింగ్ చేయడంపై స్పష్టత లేదు. సొంతగడ్డపై పూర్తిస్థాయి బ్యాటర్ల కన్నా మంచి ఇన్నింగ్స్‌లు ఆడే ఆల్‌రౌండర్లు అశి్వన్, జడేజా రాణించాల్సిన అవసరం ఉంది. టీమిండియాకు కనీసం రెండొందల పరుగుల ఆధిక్యం దక్కితే తప్ప... బెంగళూరులో బౌలర్లు కూడా పెద్దగా చేయగలిగిందేమీ లేదు! -
ముగిసిన మూడో రోజు ఆట.. 125 పరుగుల వెనుకంజలో భారత్
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో రోజు చివరి బంతికి విరాట్ కోహ్లి (70) ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (70) క్రీజ్‌లో ఉన్నాడు.న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 125 పరుగులు వెనుకపడి ఉంది. భారత్ చేతిలో మరో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2, గ్లెన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్) డకౌట్ కాగా.. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 పరుగులు చేశారు.చదవండి: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
IND VS NZ 1st Test: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్ట్‌ల్లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. కష్టాల్లో ఉన్న భారత్‌ను సర్ఫరాజ్, విరాట్ (49) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) ఔట్ కాగా.. విరాట్, సర్ఫరాజ్ (51) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 167 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మరో రెండు రోజులు బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచాల్సి ఉంది.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. మ్యాట్ హెన్రీ (5/15), విలియమ్ ఓరూర్కీ (4/22), సౌథీ (1/8) టీమిండియా పతనాన్ని శాశించారు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు (కోహ్లి, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్) డకౌట్ కాగా.. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రోహిత్ 2, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 పరుగులు చేశారు.అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో, డెవాన్ కాన్వే (91), టిమ్ సౌథీ (65) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, అశ్విన్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్న యశస్వి -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్
రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్ 150 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటడంతో రెండో రోజు లంచ్ సమయానికి (94 ఓవర్లలో) ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌తో పాటు తనుశ్ కోటియన్ (26) క్రీజ్‌లో ఉన్నాడు.SARFARAZ KHAN - THE STAR. ⭐- Yet Another day and yet another Hundred by Sarfaraz Khan in first Class, He has 15 Hundreds & 14 Fifties in First Class. 🤯pic.twitter.com/xIVR7ZV3TX— Tanuj Singh (@ImTanujSingh) October 2, 2024ముంబై ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. పృథ్వీ షా 4, ఆయుశ్ మాత్రే 19, హార్దిక్ తామోర్ 0, షమ్స్ ములానీ 5 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్ స్కోర్ 237/4 వద్ద ముంబై రెండో రోజు ఆట మొదలుపెట్టిన విషయం తెలిసిందే.15వ ఫస్ట్ క్లాస్ సెంచరీరెస్ట్ ఆఫ్ ఇండియాపై చేసిన సెంచరీ సర్ఫరాజ్ ఖాన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15వది. ఈ సెంచరీతో సర్ఫరాజ్ యావరేజ్ 67 దాటింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యుత్తమ యావరేజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా ఇరానీ కప్‌లోనూ అతనికి ఇది రెండో సెంచరీ.చదవండి: ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్ -
ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్‌లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. -
అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి బంగ్లా-భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయాలని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమచారం. దేశవాళీ టోర్నీ ఇరానీ ట్రోఫీ కోసం సర్ఫరాజ్ పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్టోబర్ 1 నుంచి లక్నో వేదికగా ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ ప్రారంభం కానుంది.ఇందులో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరపున ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ రెండు టెస్టుకు ముందు ఆఖరి నిమషంలో భారత జట్టులో ఎవరైనా గాయపడితే సర్ఫరాజ్ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశముంది. కాగా తొలి టెస్టు తుది జట్టులో కూడా సర్ఫరాజ్‌కు చోటు దక్కలేదు. ఇప్పుడు రెండో టెస్టులో కూడా దాదాపు చెపాక్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే భారత జట్టు మెనెజ్‌మెంట్ కొనసాగించే ఛాన్స్ ఉంది."భారత జట్టులోని ప్రధాన బ్యాటర్లలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు లేదా గాయపడితే సర్ఫరాజ్‌కు రెండో టెస్టులో ఆడే అవకాశం కచ్చితంగా దక్కుతుంది. లేనియెడల ఇరానీ ట్రోఫీ కోసం అతడిని ప్రధాన జట్టు నుంచి రిలీజ్ చేసేందుకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సిద్దంగా ఉన్నాడు. కాన్పూర్ నుంచి లక్నోకు ప్రయాణానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. తుది జట్టును ఎంపిక మ్యాచ్‌కు ముందే ఎంపిక చేస్తారు. కాబట్టి కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. -
ఎట్టకేలకు నెరవేరిన కల.. కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్
సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు బంపరాఫర్ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి కెప్టెన్ కావాలన్న అతడి కల నెరవేరింది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024లో సర్ఫరాజ్‌ను ముంబై జట్టు కెప్టెన్‌గా నియమించింది యాజమాన్యం.కాగా దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో గత రంజీ సీజన్ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. ఇక ఆ సమయంలో షామ్స్ ములానీ రహానే డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా వ్యహరించాడు. అయితే, రహానే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీలతో బిజీగా ఉన్నాడు. లీసెస్టర్‌షైర్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.మరోవైపు.. షామ్స్ ములానీ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక పృథ్వీ షా సైతం ఇంగ్లండ్‌లో బిజీగా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం చేసి ప్రస్తుతం జట్టుతో పాటు కొనసాగుతున్నాడు.కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ఇలా సీనియర్లంతా తమ తమ షెడ్యూల్‌తో బిజీగా ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ ధ్రువీకరించాడు. ‘‘అజింక్య రహానే అందుబాటులో ఉంటే అతడే కెప్టెన్‌గా ఉండేవాడు. ఒకవేళ అతడు జట్టుతో లేకపోయినా మాకు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతడే ఈ టోర్నీలో మా కెప్టెన్‌గా ఉంటాడు’’ అని సంజయ్ పాటిల్ ‘మిడ్ డే’తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తుదిజట్టులో కూడా చోటు దక్కించుకుని హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మూడు టెస్టులాడి 200 పరుగులు సాధించాడు. అయితే, కేఎల్‌రాహుల్, రిషభ్ పంత్ వంటి సీనియర్ల రాకతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికవుతాడా?లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు ముంబై జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా.కాగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీకి మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. 1868లో జన్మించిన ఆయన.. స్వదేశీయులకు క్రికెట్ క్లబ్లో అవకాశాలు కల్పించారు. క్రికెట్ జట్లలో వివక్షకు తావులేకుండా గొంతెత్తారు. ఆయన పేరు మీదుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. -
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్ వెనుక హీరోలు తండ్రులే..!
ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్ గిల్-లఖ్విందర్ సింగ్: భారత క్రికెట్ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్ గిల్ తండ్రి పేరు లఖ్విందర్ సింగ్. లఖ్విందర్ సింగ్ తన కొడుకు క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్ చలువే. గిల్ కెరీర్ కోసం లఖ్విందర్ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్.. కొడుకు కెరీర్లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్ చేసేందుకు లఖ్విందర్ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరుకాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్ చేయించేవాడు. గిల్ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్ సింగ్-యోగ్రాజ్ సింగ్: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్, టు టైమ్ వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ తండ్రి పేరు యోగ్రాజ్ సింగ్. స్వతాహాగా క్రికెటర్ అయిన యోగ్రాజ్ సింగ్.. యువరాజ్ క్రికెట్లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడిన యోగ్రాజ్.. క్రికెట్లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్రాజ్.. యువరాజ్ సాధించిన గోల్డ్ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్ క్రికెట్ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్ ఖాన్-నౌషద్ ఖాన్: టీమిండియా యంగ్ తరంగ్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి పేరు నౌషద్ ఖాన్. సర్ఫరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్ చేయాలని పరితపించిన నౌషద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్‌కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్‌కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్‌తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
ధనాధన్ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్‌పై మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తాజా సిరీస్‌లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్‌మన్ గిల్(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. Wood's got pace? Sarfaraz has the answer 😎#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSport pic.twitter.com/htRkcp57X1 — JioCinema (@JioCinema) March 8, 2024 చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్ తండ్రి -
అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడిన సర్ఫరాజ్.. సహనం కోల్పోయిన మార్క్ వుడ్
IND VS ENG 5th Test Day 2: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో మూడో అర్ధశతకాన్ని సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్దసెంచరీలు (62, 68 నాటౌట్) చేసిన సర్ఫరాజ్.. తన రెండో టెస్ట్‌లో విఫలమైనా (14, 0) తిరిగి మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దసెంచరీతో సత్తా చాటాడు. టీ విరామం సమయానికి సర్ఫరాజ్ 56 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా పడిక్కల్ (44) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. Showing his shots 🔥pic.twitter.com/h4I1Jks4lt — CricTracker (@Cricketracker) March 8, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో రోజు ఆటలో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆడిన అద్భుతమైన ర్యాంప్ షాట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇది ట్రేడ్ మార్క్ షాట్. ఇతను చాలా సందర్భాల్లో ఇలాంటి షాట్లు ఆడాడు. నాలుగో టెస్ట్‌లో దృవ్ జురెల్ సైతం వుడ్ బౌలింగ్‌లో ఇదే తరహా ర్యాంప్ షాట్ ఆడాడు. సర్ఫరాజ్ ర్యాంప్ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. వుడ్ స్టెడ్జింగ్ను ఏమాత్రం పట్టించుకోని సర్ఫరాజ్ తన సహజశైలిలో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్‌లకు జాక్‌పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్‌తో జరుగబోయే తదుపరి టెస్ట్‌లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లే ఆడారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్‌ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్‌కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్‌లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్‌కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్‌లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
Ind vs Eng: గోల్డెన్ డకౌట్.. ఇదేంటి సర్ఫరాజ్? నువ్విలా..
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులే చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై పెద్ద ఎత్తున మీమ్స్ వస్తున్నాయి. ‘‘నిన్ను పొగిడితేనే బ్యాట్ ఝులిపించగలవా ఏంటి? అయినా ఇప్పటికే నీకు రావాల్సిన దానికంటే.. చాలా ఎక్కువ క్రెడిట్ వచ్చేసింది భయ్యా! ఇంకా పొగడటం మా వల్ల కాదు’’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ధ్రువ్ జురెల్ పేరును ప్రస్తావిస్తూ కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో వరుసగా రెండు అర్ధ శతకాలు(62, 68 నాటౌట్) బాదాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. తద్వారా తొలి టెస్టులోనే ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా దిలావర్ హుసేన్, సునిల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అయితే, తన రెండో మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ పూర్తిగా తేలిపోవడం గమనార్హం. రాంచి టెస్టులో రెండుసార్లూ ఇంగ్లండ్ స్పిన్నర్ల చేతికే చిక్కాడు. రెండు ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ వికెట్‌ను.. టామ్ హార్లే, షోయబ్ బషీర్ దక్కించుకున్నారు. కాగా రాంచి మ్యాచ్‌లో విజయానికి టీమిండియా 52 పరుగుల దూరంలో ఉన్న సమయంలో సర్ఫరాజ్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే, సర్ఫరాజ్ మాత్రం డగౌట్లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ మధ్య కూర్చుని చిల్ అవుతూ కనిపించాడు. "Mauj masti rukni nahi chahiye" vibes. pic.twitter.com/C2jRAfcrql — Silly Point (@FarziCricketer) February 26, 2024 ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. మొత్తంగా 129 పరుగులు చేసిన జురెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 -
ఓ పక్క అన్న.. మరో పక్క తమ్ముడు.. రఫ్ఫాడిస్తున్న ఖాన్ బ్రదర్స్
ప్రస్తుతం భారత క్రికెట్లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్ బ్రదర్స్ ప్రపంచ క్రికెట్లోనూ హాట్ టాపిక్‌గా మారారు. వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్.. దేశవాలీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్ ఖాన్.. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్ టెస్ట్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంచలనాల ముషీర్.. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగించి, పరుగుల వరద (7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు. శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్ జోన్లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఎందుకంత హైప్.. క్రికెట్లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ ఖాన్ బ్రదర్స్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్, ముషీర్లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్, ముషీర్ల తండ్రి నౌషద్ ఖాన్ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. సర్ఫరాజ్ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. -
సర్పరాజ్ తండ్రికి బహుమతిగా థార్ జీప్
-
టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా?
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు 130 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అరంగేట్రంలోనే అకట్టుకున్న సర్ఫరాజ్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు సరైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికేశాడని మంజ్రేకర్ కొనియాడాడు. "సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన కనబరిచాడు. నా వరకు అయితే భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికాడని అనుకుంటున్నాను. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా సర్ఫరాజ్ మంచి ఎంపికనే. వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టిస్తాడని భావిస్తున్నానని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సర్ఫరాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు. చదవండి: ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్! I think India have found a very good 50 overs middle order batter option, to bat in the middle stages, with 5 fielders inside the circle, it’s Sarfraz Khan. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 18, 2024 -
మొన్న సర్ఫరాజ్.. ఇవాళ గిల్
సహచర ఆటగాళ్ల తప్పిదాల కారణంగా రనౌట్లు కావడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సహచరుడు రవీంద్ర జడేజా తప్పిదానికి బలైపోగా.. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. సహచరుడు కుల్దీప్ యాదవ్ రాంగ్ కాల్ కారణంగా రనౌటయ్యాడు. A heart-breaking run-out for Shubman Gill....!!!!pic.twitter.com/GoFZ3OEeOl — Johns. (@CricCrazyJohns) February 18, 2024 ఈ రెండు ఘటనల్లో స్ట్రయికింగ్‌లో ఉన్న ఆటగాళ్లే (జడేజా, కుల్దీప్) తొలుత పరుగుకు పిలుపున్చి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. ఈ రెండు సందర్భాల్లో రాంగ్ కాల్‌కు బలైపోయిన ఆటగాళ్లు మాంచి ఊపులో ఉన్నప్పుడు రనౌటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యే సమయానికి మెరుపు అర్ధసెంచరీ (66 బంతుల్లో 62 పరుగులు; 9 ఫోర్లు, సిక్స్) చేసి జోరు మీదుండగా.. ఇవాళ జరిగిన దురదృష్ట ఘటనలో గిల్ సెంచరీకి తొమ్మిది పరుగులు దూరంలో (151 బంతుల్లో 91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నప్పుడు ఔటయ్యాడు. సర్ఫరాజ్, గిల్ రనౌట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కాగా, రాజ్‌కోట్ టెస్ట్ నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 440 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాల్టి ఆటలో శుభ్‌మన్ గిల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153)