Science Congress
-
స్వతంత్ర భారతి: నూరవ ‘సైన్స్ కాంగ్రెస్’
నూరవ ‘సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు కలకత్తాలో జనవరి 3 నుంచి 7 వ తేదీ వరకు జరిగాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐ.ఎస్.సి.ఎ.) వీటిని నిర్వహించింది. ఐ.ఎస్.సి.ఎ. కలకత్తాలోనే 1914లో ప్రారంభం అయింది. ఈ సంస్థ ఏటా జనవరి నెల మొదటి వారంలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తుంటుంది. దేశవిదేశాల శాస్త్రవేత్తలు, సైన్స్‌లో నోబెల్ గ్రహీతలు హాజరై ప్రసంగిస్తారు. స్వామీ వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు ఆధ్యాత్మిక గురువు స్వామీ వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యులు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు పి.బి.శ్రీనివాస్, శకుంతలాదేవి, శంషాద్‌బేగం, రితుపర్ణోఘోష్, శ్రీహరి, మన్నాడే.. కన్నుమూత. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు. లోక్‌సభ, రాజ్యసభల్లో క్రిమినల్ లా (అమెండ్‌మెండ్) యాక్ట్, 2013 కు ఆమోదం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ బిల్, 2013 కు రాజ్యసభ ఆమోదం. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన బీజేపీ. దేశంలోనే తొలి మహిళా బ్యాంకు (అందరూ మహిళా సిబ్బందే ఉండే బ్యాకు) ముంబైలో ప్రారంభం. అమల్లోకి హెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్, 2013. రాజ్యసభలో లోక్‌పాల్, లోకాయుక్త్ బిల్లు 2013 ఆమోదం. -
రైతు సృజనకు ప్రోత్సాహం
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ ఆదాయం పెరుగుదలకు సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తున్న రైతులే కీలకమని భారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర స్పష్టం చేశారు. ఈ కారణంగానే తాము ఐసీఏఆర్ తరఫున రైతుల సృజనాత్మక పరిశోధనలకు ఒక వేదిక కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. బెంగళూరులో జరుగుతున్న 107వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో త్రిలోచన్ మహాపాత్ర సోమవారం ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు కానున్న ప్రత్యేక కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో రైతుల కోసం వేదిక, సమావేశం, చర్చలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రంతోనే సాధ్యం.. సైన్స్ ఆధారంగానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయని మహాపాత్ర తెలిపారు. మూడేళ్ల క్రితం వరకూ దేశంలో ఏడాదికి రూ.పది వేల కోట్లతో పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకునేవారని, టెక్నాలజీ ఆధారిత ప్రణాళిక ద్వారా గత మూడేళ్లలో పప్పు ధాన్యాల దిగుబడిని 6 నుంచి 9 మిలియన్ టన్నులకు పెంచడంతో దిగుమతులు నిలిచిపోయాయని అన్నారు. తద్వారా విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడ్డ 55 శాతం జనాభాలో సుమారు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, వీరి ఆదాయాన్ని పెంచేందుకు సమీకృత వ్యవసాయమే మేలైన మార్గమని సూచించారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. -
ఆరంభం అదిరింది..
సైన్స్ సంబరం అంబరాన్నంటింది.. వైజ్ఞానిక వెలుగులను విరజిమ్మింది.. లబ్ధప్రతిష్టులైన ఎందరో శాస్త్రవేత్తలు హాజరైన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సాంకేతిక సౌరభంతో పరిమళించింది. జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్న ప్రముఖులను, అవార్డులు వరించిన జూనియర్ సైంటిస్టులను చూసి విద్యార్థులు పులకించిపోయారు. వారి ప్రసంగాలతో స్ఫూర్తి పొందారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ముద్దులొలికే రేపటి శాస్త్రవేత్తలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో ఏపీ సైన్స్ కాంగ్రెస్–2019 ఘనంగా ప్రారంభమైంది. జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇదే తొలిసారి. అంబేడ్కర్ వర్సిటీలో మూడు రోజుల వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వు పోలీసు గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో వచ్చిన గవర్నర్ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. గవర్నర్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, వైస్ చాన్సలర్ కూన రామ్‌జీ, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఘనంగా స్వాగతం పలికారు. తొలుత వర్సిటీ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్పోర్ట్సు స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చి వారి ప్రాజెక్టులు పరిశీలించారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో ప్రారంభించారు. విద్యార్థులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అనంతరం గవర్నర్ లైఫ్‌టైం అచీవ్మెంట్, ఫెలోషిప్, యువ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. ప్రారంభ ప్లీనరీలో సైన్స్ కాంగ్రెస్ ప్రాధాన్యతను ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాధరావు వివరించారు. ప్రారంభ ప్లీనరీలో నలుగురు శాస్త్రవేత్తలు సాంకేతిక ప్రగతిపై మాట్లాడారు. రెండో పూట ప్లీనరీ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలల కాంగ్రెస్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర రాష్ట్ర స్థాయి ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ స్టాళ్లు ప్రదర్శించారు. సైన్స్ కాంగ్రెస్‌లో సావనీర్, వర్సిటీ బులెటిన్లను గవర్నర్ ఆవిష్కరించారు. గవర్నర్ రాకతో విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్, ఎస్పీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్సిటీ అధికాలు ఏర్పాట్లు చేశారు. -
పరిశోధనలతోనే ప్రగతి
కాజీపేట అర్బన్: నూతన ఆవిష్కరణలు, పరిశోధనలతోనే అభివృద్ధి సాధ్యమని డీఎస్టీ మాజీ సెక్రటరీ డాక్టర్ టి.రామస్వామి తెలిపారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్లోని ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, నిట్ వరంగల్ సంయుక్తంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు టీఎస్ఎస్సీ–18 సదస్సును నిర్వహిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్–18 తోడ్పడుతోందని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో సమాజ మనుగడ సాధ్యమని.. విద్యార్థులకు సైన్స్‌పై మక్కువను పెంచేందుకు టీఏఎస్ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు శాస్త్రవేత్తల పరిశోధనలపై అవగాహన కల్పిస్తూ.. ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా వారికి స్ఫూర్తినందించాలని సూచించారు. నూతన పరిశోధనలకు నాంది: నిట్ డైరెక్టర్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ నిట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న టీఎస్ఎస్సీ–18లో నూతన పరిశోధనలకు నాంది పలికే విధంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పరిశోధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మీట్ ది సైంటిస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు, టీఎల్సీ ప్రొఫెసర్ అప్పారావు, ఇండో యూఎస్ అసుపత్రి వైద్యుడు ప్రసాదరావు హాజరై శాస్త్రవేత్తల పరిశోధనలపై స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. కాగా, టీఎస్ఎస్సీ–18 సావ నీర్, రిటైర్డ్ ప్రొఫెసర్ చాగంటి కృష్ణకుమారి రచించిన వీరి వీరి గుమ్మడి పండు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో టీఏఎస్ అధ్యక్షుడు కె.నరసింహారెడ్డి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్, డీన్లు కేవీ జయకుమార్, ఎల్‌ఆర్‌జీ రెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్ అసమర్థుడు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిన అసమర్థుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం అసమర్థతతో ప్రభుత్వం చేతకానితనం బయట పడిందని గురువారం మండిపడ్డారు. సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలిపోవడం రాష్ట్రానికి అవమానమని, ఇది విద్యారంగానికి బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన విద్యార్థులపై, ఓయూపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓయూలో రౌడీలు, టెర్రరిస్టులు ఉన్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. సదస్సు నిర్వహించకపోవడంతో యూనివర్సిటీకి రూ.1,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. -
ఓయూ ప్రతిష్టను దిగజార్చారు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వచ్చేనెల 3 నుంచి 7వరకు జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను వాయిదా వేసి ఓయూ ప్రతిష్టను దిగజార్చారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలం గాణ కోసం పోరాడిన ఓయూపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని.. ప్రధాని ఓయూకు రావడం సీఎంకు ఇష్టంలేనందునే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు. 62 దేశాల ప్రతినిధులు, ఏడుగురు నోబెల్ గ్రహీతలు ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలను కూడా ఖర్చు పెట్టారన్నారు. అవి టీఆర్ఎస్ మహాసభలు: తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహాసభల్లా జరిగాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు భాషాభివృద్ధికి గాని, తెలుగు విశ్వవిద్యాలయానికిగాని ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. దత్తాత్రేయను అవమానించే విధంగా మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని మాత్రమే వేదిక మీదకు ఆహ్వానించారని ఈ సభల్లో తెలంగాణ కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. -
ఓయూపై కక్షగట్టిన సీఎం కేసీఆర్ : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ..జనవరి 3 నుంచి 7 దాకా జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, నోబెల్ బహుమతులు పొందిన వారు ఏడుగురు ఈ సమావేశాలకు హాజరు అవుతామని నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన ప్రయాణపు టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు. ఏకపక్షంగా రద్దుచేయడం ద్వారా ఓయూ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ప్రధాని రాష్ట్రానికి రావడం ఇష్ఠం లేనందుకే సీఎం కేసీఆర్‌కు ఇష్ఠంలేదని ఆరోపించారు. ఇది తెలంగాణకు అవమానమన్నారు. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. లక్ష్యం లేకుండానే తెలుగు మహా సభలు సొంత డబ్బాకోసం నిర్వహించారని, రాచరిక పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని ఆరోపించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించారా, తెలుగు భాషాభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. తెలుగు మహాసభలు టీఆర్ఎస్ మహాసభల్లా జరిగాయన్నారు. మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అవమానించే విధంగా వేదిక మీదకు ఆహ్వానించకుండా, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేదిక మీదకు పిలిచారని అన్నారు. ఇవేమి తెలుగుసభలో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. -
సైన్స్ కాంగ్రెస్ వేదికపై మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ వేదికపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న ఆలిండియా సైన్స్ కాంగ్రెస్‌కు ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాల ప్రారంభ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ రానుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఓయూలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో సమావేశాల నిర్వహణ పై సందిగ్ధత నెలకొంది. ఓయూలో ఉన్న పరిస్థితులు, వరుస ఆందోళనలు, వస్తున్న వార్తల కారణంగా వేదికను మార్చాలని ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గతేడాది నిర్వహించిన ఉస్మానియా శతాబ్ది వేడుకల్లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సీఎం కేసీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. విద్యార్థులు ఆందోళనకు దిగే వాతావరణం నెలకొనడంతో హడావుడిగా ప్రారంభ సమావేశం ముగించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల మురళి అనే విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూకు మంగళవారం నుంచి వచ్చే 45 రోజుల పాటు తరగతులకు, హాస్టళ్లకు సెలవులు ప్రకటించారు. వేదికను మరో చోటికి మార్చాలని ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అచ్యుత సమంతా లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో వేదికను హెచ్ఐసీసీకి మార్చాలని అధికారులు యోచిస్తున్నారు. -
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు దరఖాస్తులు
ప్రొఫెసర్ రెడ్యానాయక్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2018, జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనదలచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ స్థానిక కార్యదర్శి, ప్రొఫెసర్ రెడ్యానాయక్ తెలిపారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే అభ్యర్థులు నవంబరు 30లోగా రూ.2 వేలు, డిసెంబరు 15లోగా రూ.2,500, విద్యార్థులు రూ.1500 చెల్లించి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ‘బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రెజెంటేషన్, పరిశోధనపత్రాలకు సంబంధించి ఈ నెల 31 వరకు, యువ శాస్త్రవేత్త అవార్డుల కోసం ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. చిల్డ్రన్స్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. సైన్స్ కమ్యూనికేటర్ మీట్లో చిత్రపరిశ్రమ, జర్నలిస్టులు, విద్యావంతులు పాల్గొనవచ్చు. ఇందుకు వంద పదాలతో కూడిన బయోడేటాను పంపించాలి. సైన్స్ ఎగ్జిబిషన్, ప్లీనరీ లెక్చర్స్, 14 టెక్నికల్ సెషన్స్, 30 సింపోజియాలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.టఛిజ్ఛీnఛ్ఛిఛిౌnజట్ఛటట.nజీఛి.జీn వెబ్సైట్లో లేదా 9290491044 నంబర్లో సంప్రదించాలి’అని రెడ్యానాయక్ వివరించారు. -
సైన్స్‌పై అవగాహన పెంచాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: చిన్నారుల్లో సైన్స్‌పై అవగాహన పెంచాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర నాయకుడు అందె సత్యం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జేవీవీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో రోజురోజుకూ పెరిగి పోతున్న మూఢ విశ్వాసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచాలని సూచిం చారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్‌లో మత భావాలను పెం పొందించేలా ప్రసంగాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శికి సహాయకారిగా బి.సీతారాములును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఐపీఎస్ఎన్ జాతీయ కోశాధికారి అలవాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కస్తూరి, మల్లెంపాటి వీరభద్రయ్య, బి.సీతారాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రాఘవయ్య, టి.శివనారాయణ, జిల్లా బాధ్యులు ఆర్.శ్రీరాములు, పి.సీతారామారావు, నామా పురుషోత్తం, టి.కృష్ణవేణి, పురుషోత్తం, కిరణ్, లింగమూర్తి, వంజాకు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కమిటీ ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్.వెంకటేశ్వర్లు, ప్రభుసింగ్, కోశాధికారిగా ఎం.మోహన్‌రావుతో పాటు ఏడుగురు ఉపాధ్యక్షులుగా, ఆరుగురు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. -
సముద్రంలో పడినా పైకి తేలాల్సిందే
మెటామెటీరియల్‌తో వినూత్న ప్రయోగాలు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎలక్ట్రానిక్ రంగంలో కంటికి కనిపించనంత సూక్ష్మమైన అణువులతో వినూత్న ప్రయోగాలు జరగనున్నాయా? విమానం సముద్రంలో కూలినా పైకి తేలాల్సిందేనా? అవును.. దీనికి ‘మెటా మెటీరియల్స్’ తగిన సమాధానం చెబుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారం ‘పోటోనిక్స్, మెటామెటీరియల్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముంబైలోని టాటా న్యూక్లియర్, అటామిక్ ఫిజిక్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుశీల్ మజుందార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఎస్.అనంతరామకృష్ణ, కోల్‌కతా వర్సిటీ ప్రొఫెసర్ సుబల్ కర్ ప్రసంగించారు. పోటోనిక్స్, మెటామెటీరియల్స్పై విస్తృత పరిశోధన జరుగుతోందని, భారతదేశంలోనూ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. వివిధ రకాల వస్తువుల సమ్మిళితంగా మెటా మెటీరియల్ తయారవుతుందన్నారు. దీని వల్ల బహుళ ప్రయోజనాలుంటాయని, ప్రస్తుతం దేశంలో మెటామెటీరియల్, మైక్రోవేవ్స్, మిల్లీమీటర్ వేవ్ ఇంజినీరింగ్ వంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఉక్కు కన్నా పటిష్టం.. తక్కువ బరువు కార్బన్ నానో ట్యూబ్స్ లేదా కార్బన్ నానోట్యూబ్ గ్రిడ్ పేపర్‌తో తయారయ్యేదే బకీ పేపర్. ఈ నానో ట్యూబ్స్ అనేవి మనిషి వెం ట్రుక కన్నా 50 వేల రెట్లు పలచగా ఉంటాయి. ప్రస్తుతం బకీ పేపర్ జర్మనీలో తయారవుతుంది. 4, 5 సెంటీమీటర్ల పేపరు ధర భారతీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది. అగ్ని ప్రమాదాల నివారించేందుకు, ఎల్సీడీలు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, సెల్ఫోన్ల తయారీకి ఈ పేపర్‌ను వినియోగిస్తారు. ఉక్కు కన్నా 500 రెట్లు పటిష్టంగా.. పైగా బరువు చాలా తక్కువ. కూలినా మునగదు.. ఆ మధ్య మలేసియాకు చెందిన ఓ విమానం కూలిపోయింది. కొన్ని నెలల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ తెలియలేదు. ఎక్కడ మునిగిపోయిందో గుర్తించలేకపోయారు. అదే మెటామెటీరియల్‌తో తయారు చేసిన విమానమైతే దానంతట అదే నీటిపై తేలియాడుతుంది. సముద్రంలో కూలినా మునిగిపోయే ప్రసక్తి ఉండదు. మెటామెటీరియల్ వినియోగించి తేలికపాటి విమానాలు, లేజర్ సోనిక్ పరికరాలు, ఇప్పటికన్నా పల్చనైన సెల్ఫోన్లు, ఎల్సీడీలు, బరువు తక్కువ కార్లు తయారుచేయవచ్చు. -
నైపుణ్యమివ్వండి చాలు..
♦ డొనేషన్లు, ప్యాకేజీలు వద్దు... మా వనరులే మాకు పెట్టుబడి ♦ ఈశాన్య రాష్ట్రాల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై విద్యా ప్రముఖులు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య భారతంగా పిలిచే 8 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీదున్న జీవవైవిధ్య వనరుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని, ఆ వనరుల్నే పెట్టుబడిగా మలిచేలా విద్యా, విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే చాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల మాదిరి తాము ప్యాకేజీలు, డొనేషను కోరుకోవడం లేదని, నైపుణ్య శిక్షణ ఇస్తే సరిపోతుందన్నారు. 104వ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారమిక్కడ ఈశాన్య రాష్ట్రాలలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. గౌహతీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గౌతమ్ బిశ్వాస్ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో మణిపూర్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ అరుణ్‌కుమార్, శాస్త్ర, సాంకేతిక శాస్త్రాల పరిశోధనా సంస్థ (గౌహతీ) డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్సీ తాలూక్‌ధర్, ఈశాన్య రాష్ట్రాల గిరి ప్రాంతాల విశ్వవిద్యాలయం అధిపతి ప్రొఫెసర్ బీకే తివారీ, ప్రొఫెసర్ అరుణ్ కె.మిశ్రా తదితరులు ప్రసంగించారు. ‘‘ఈశాన్య భారతంలోని రాష్ట్రాలలో డిగ్రీ సీట్లు 60 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు 50 శాతం మిగిలిపోతున్నాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభుత్వ జోక్యంతో ప్రజల మధ్య అంతరం పెరుగుతోంది. ఫలితంగా తాము ఈ దేశంలో భాగం కాదా? అనే భావన ప్రజల్లో పెరిగి తిరుగుబాట్లకు దారితీస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి విద్యార్థులు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచాలి. నైపుణ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. కీలకమైన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పేరిట ఏది పడితే అది రుద్దే కన్నా ఏది అవసరమో అది ఇస్తే చాలు’’ అని నిపుణులు చెప్పారు. -
యాప్‌లకు భద్రత ఏదీ?
వీటి నుంచి లావాదేవీలతో మోసాలు అధికం ∙యాప్‌లకు భద్రతా సర్టిఫికెట్లు కావాల్సిందే.. జాతీయ స్థాయిలో ఏజెన్సీ ఏర్పాటు చేయాలి ∙సైబర్ నేరాలపై నిపుణుల అభిప్రాయాలు (తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : క్యాష్తో పనేంటి?.. నగదు రహిత లావాదేవీలకు ఎన్ని మార్గాలు లేవు... ఒక్క క్లిక్‌తో క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.. పెద్దనోట్ల రద్దు తర్వాత తెరమీదకొచ్చిన కొత్త మంత్రమిది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే జపం చేస్తున్నాయి. గల్లీ షాపు మొదలుకొని ఢిల్లీ వరకూ ప్రతీ షాపులోనూ రకరకాల యాప్‌లు కన్పిస్తున్నాయి. వాటి ముందు మొబైల్ పెడితే ఇట్టే కోడ్ తీసుకుని లావాదేవీ జరిగిపోతుంది. సౌకర్యం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఎదరయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం భద్రత ప్రమాణాలే లేని వీటి నుంచి లావాదేవీలు చేస్తే రకరకాల మోసాలు జరగొచ్చని చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారమే హరించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. మనిషి జన్మించినా.. మరణించినా సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ లక్షల కోట్ల లావాదేవీలు చేస్తూ.. కోట్లాది మంది ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, యాప్‌లకు ఎందుకు భద్రత సర్టిఫికేట్లు అక్కర్లేదని ప్రశ్నిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాలపై యువ శాస్త్రవేత్తలు విరుచుకుపడాలని, సైబర్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే దిశగా పరిశోధనలు జరగాలని సూచిస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై శనివారం ఓ సెమినార్ జరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. సెమినార్లో ఎవరేం మాట్లాడారంటే... సెక్యూరిటీ ఏదీ? మొబైల్ ఫోన్లు కొంటాం. దానికి రేడియేషన్ లేదని సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆ ఫోన్ సేఫ్ అని మాత్రం తయారీ సంస్థగానీ, మరే ఇతర ఏజెన్సీగానీ గ్యారెంటీ ఇవ్వదు. ఆ మొబైల్ నుంచి జరిగే లావాదేవీలు, పాస్వర్డ్స్ వేరే వాళ్ల చేతికి వెళ్లవన్న భరోసా ఇవ్వరు. కానీ అమెరికాలో ఈ సిస్టమ్ లేదు. కచ్చితంగా సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ ప్రమాణాల కోసం జాతీయ స్థాయిలో ఓ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. – నరేంద్రనాథ్, టెలీ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక యాప్స్, వాలెట్స్ ప్రజల్లో విస్తృత ప్రచారం పొందాయి. వ్యక్తిగత సమాచారం ఎవరైనా దొంగిలించరని నమ్మకం ఏమిటి? అందుకే ప్రభుత్వ పరంగానే ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి. – ఎన్ బాలకృష్ణన్, ఐఐటీ కంప్యూటర్ శాస్త్రవేత్త నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగింది.. సదుపాయాలేవీ? ఒక చిన్న రోడ్డులోకి జాతీయ రహదారి నుంచి వెళ్లే వాహనాలను దారి మరలిస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో పరిస్థితి ఇదే. లావాదేవీలు విపరీతంగా పెరిగినా... నెట్‌వర్క్‌లో మౌలిక సదుపాయాలు లేవు. మరో 20 ఏళ్లకు సరిపడా నెట్‌వర్క్‌ను అంచనా వేసి, అందుకు తగ్గట్టు నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి విస్తృత పరిశోధనలు జరగాలి. – ఎస్వీ రాఘవన్, చీఫ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కియాలజిస్ట్, చెన్నై -
అదిరె..అదిరే..కన్నే అదిరె!
-
అయానిక్ యాసిడ్స్‌తో గాయాలకు మందు
తెలుగు శాస్త్రవేత్త పి.వెంకటేశ్‌కు ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారం తిరుపతి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మీ శరీరంలో ప్రొటీన్లు తగ్గాయా? తద్వారా ఏమైనా రుగ్మతలు వస్తున్నాయా? ఇకపై దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాటికో పరిష్కార మార్గం కనిపెట్టానంటున్నారు ఢిల్లీ వర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ పి.వెంకటేశ్. శరీరంలో ప్రొటీన్లు తగ్గినా, పెరిగినా నష్టమే. శరీరంపై గాయాలు ఏర్పడి నప్పుడు అవి మానడం కష్టమవుతుంది. అయానిక్ యాసిడ్స్ (ఓ రకమైన లవణ ద్రావణం)తో గాయాలను తగ్గించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ అంశంపై తాను చేసిన పరిశోధనతో ఆయన ప్రధానమంత్రి ప్రత్యేక పురస్కారానికి ఎంపికయ్యారు. తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. డెంటీస్ట్రరీలో వినూత్న ప్రయోగాలకు పురస్కారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన డాక్టర్ బిశ్వజిత్ పాల్ కోల్‌కతా యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్త. దంతాలకు సంబంధించిన వ్యాధులు, కట్టుడు పళ్లతో వచ్చే రుగ్మతలపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. కట్టుడు పళ్లకు ఉపయోగించే సిరామిక్స్, సిల్వర్ మెటల్స్ వంటి వాటితో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టినట్టు తెలిపారు. -
నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైంది
సైన్స్ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం బాబు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్ప టికే మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మొదట్రెండు పారిశ్రామిక విప్లవాలు నెమ్మదిగా నడిస్తే మూడోది వేగంగా, నాలుగోది కచ్చిత త్వంతో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళ వారం జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో చంద్రబాబు మాట్లాడారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్స హించడంలో ఏపీ ముందుందన్నారు. టెక్నాలజీతోనే భవిష్యత్ అన్నారు. ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేకిన్ ఏపీ చేప ట్టామన్నారు. ‘ఫైబర్ గ్రిడ్’ ద్వారా ప్రస్తుత మున్న విద్యుత్ స్తంభాలనే ఫైబర్ కేబుల్స్ కోసం వినియో గించుకుంటూ రూ.4,367 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో అమెరికా,చైనా తర్వాత భారతే ఉంటుంద న్నారు. మున్ముందు వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవస్థ రానుందన్నారు. మహనీయుడు మోదీ... చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని పదే పదే కీర్తించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక సం స్కరణల తర్వాత అద్భుత ప్రయోగాలు చేస్తున్న మహనీయుడు మోదీ అంటూ ఆకా శానికెత్తేశారు. ధైర్యవంతుడు, ధీశాలి సమా జానికి పట్టిన అవినీతి రుగ్మతను పారదోలేం దుకు నడుం కట్టిన పెద్ద రాజకీయ సంస్కర్తగా మోదీని అభివర్ణించారు. -
నేటి నుంచి సైన్స్ కాంగ్రెస్
► తిరుపతి ఎస్వీయూలో ప్రారంభించనున్న ప్రధాని ►నోబెల్ పురస్కార గ్రహీతలతో భేటీ ► ఐదురోజుల పాటు సదస్సులు ► ఆకట్టుకుంటున్న ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మక భారతీయ విజ్ఞాన సమ్మేళ నం (సైన్స్ కాంగ్రెస్)కు సర్వం సిద్ధమైంది. మంగళవారం నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాల యం ప్రాంగణంలో జరిగే ఈ 104వ సమ్మేళనాన్ని నేడు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఉత్తరాది వంటకాలు సిద్ధం చేశారు. ఎస్వీయూలో సైంటిస్ట్‌ల సందడి.. సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎటుచూసినా శాస్త్రవేత్తలతో కళకళలాడుతోంది. నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, యంగ్ అచీవర్ అవార్డు విజేతలు, ప్రతిభా అవార్డులను గెల్చుకున్న విద్యార్థులు వర్సిటీ ప్రాంగణంలో సందడి చేస్తున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక, పరిశోధనా రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులతో ఎస్వీయూ క్యాంపస్ కొత్త రూపును సంతరించుకుంది. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. డీఆర్డీవో, ఐఎస్ఎస్ఆర్, ఇస్రో, షార్లతో పాటు హెచ్ఏఎల్, బీడీఎల్, వంటి భారత ప్రభుత్వ రంగ సంస్థల తయారీ ఎగ్జిబిట్లు తరలి వచ్చాయి. వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్, డెయిరీ రంగాల్లో సాధించిన పురోగతిని తెలియజేసే టెక్నాలజీని కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీ నుంచే నిఘా దేశ విదేశీ ప్రముఖులు హాజరవుతున్న విజ్ఞాన సమ్మేళనానికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఇంటిలిజెన్ప్ బ్యూరో (ఐబీ) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతి పట్టణాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం అత్యంత వేగంతో పనిచేసే ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ జూమ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఢిల్లీలోని ఐబీ కార్యాలయానికి అనుసంధానం చేశామని, ఒక్కో కెమెరా రెండు కిలోమీటర్ల పరిధిని గమనిస్తుందని అధికారులు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల ఆధార్, ఇతర ఫోటో గుర్తింపు కార్డులను నిఘా విభాగం సాఫ్ట్‌వేర్‌కు లింక్ చేశారు. దాదాపు 6,500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల సూచనలను పాటిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని రాయలసీమ రేంజ్ ఐజీ శ్రీధర్‌రావు తెలిపారు. డీఐజీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ఇద్దరు ఐపీఎస్‌లు, 30 మంది డీఎస్పీలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక తిరుపతిలోని స్టార్హోటళ్లన్నీసైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు, సందర్శకులతో కిటకిటలా డుతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానమే ప్రధానం స్వదేశీ పరిజ్ఞానాన్ని మరింత మెరుగు పర్చుకునే దృఢ సంకల్పంతో భారత్ ముందడుగు వేస్తోంది. దీనికోసం ఇండి యన్ న్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కృషిచేస్తోంది. 1914లో కల కత్తా కేంద్రంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారం భమైంది. ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరిశోధనా రంగాల్లో సాధించిన పురోగతిని పరస్ప రం సమీక్షించుకునేలా ఏర్పాట్లు చేసింది. 2013లో శత వసంతాల వేడుకను కోల్ కతాలోనే నిర్వహించారు. గత సమ్మేళ నాన్ని మైసూర్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రత్యేకతలివీ... ♦ ఈసారి సదస్సుకు 12,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ♦ మొత్తం 32 ప్లీనరీలు, సబ్ సెక్షన్స్ ♦ 1,100 మంది వలంటీర్లు సేవలందించేందుకు సిద్ధమయ్యారు. ♦ ఈఏడాది శిశు, మహిళా కాంగ్రెస్ సదస్సులనూ నిర్వహిస్తున్నారు. ♦ ఏడెకరాల్లో భారీ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ♦ ప్రతినిధులందరికీ టూరిజం శాఖ పర్యాటక ప్రదేశాలను చూపిస్తుంది. ♦ సైన్స్ టెక్నాలజీ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించనున్నారు. హాజరవుతున్న నోబెల్ గ్రహీతలు... 1. ప్రొ.విలియం ఈమోర్నర్(యూఎస్ఏ) 2. ప్రొ.టకాకి కజిత (జపాన్) 3. ప్రొ.సెర్జ్ హరోచి (ఫ్రాన్స్) 4. ప్రొ.జీన్ టిరోలి (ఫ్రాన్స్ ) 5. ప్రొ.అడా ఇ యెనాత్ (ఇజ్రాయెల్) 6. ప్రొ.మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్) -
అంతా మాయ
స్కెచ్ ‘ముఖ్య’నేతది... అమలు చిన్నబాబుది అత్యంత నాసిరకంగా తిరుపతి సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో కరకంబాడి, ఎయిర్‌పోర్టు రోడ్లను మూడు నెలల క్రితమే ‘తుడా’ నిధులతో అందంగా తీర్చిదిద్దారు. అయితే, ఇప్పుడు సైన్స్ కాంగ్రెస్ నేపథ్యంలో మళ్లీ అవే రోడ్లకు మరమ్మతులకు రూ.4 కోట్లు కేటాయించారు. తిరుపతి ఎయిర్‌ఫోర్టు జంక్షన్ నుంచి కేఎల్ఎం ఆస్పత్రి వరకూ ఉన్న 71వ జాతీయ రహదారికి గతంలోనే సుందరీకరణ చేపట్టారు. బాగున్న తారు రోడ్డుపై ఇటీవల రాత్రికి రాత్రే మరికాస్త తారు పోసి మమ అనిపించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పనుల్లో జరుగుతున్న అవకతవకలకు ఈ ఉదంతాలే నిదర్శనం. సర్కారు సొమ్ముకు ఎసరు ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ పనుల్లోనైనా కమీషన్లు నొక్కేయడంలో ‘ముఖ్య’నేత, ఆయన కుమారుడు ఆరితేరిపోయారు.గడువు ముంచు కొచ్చే వరకూ టెండర్లు పిలవకుండా ఉద్దేశపూర్వకం గా జాప్యం చేయడం... తర్వాత సమయం లేదం టూ కమీషన్లు ఇచ్చేవారికే నామినేషన్ విధానంలో పనులు అప్పగించేయడం.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో నిధులు కేటాయించడం.. నాసిరకంగా పనులు పూర్తిచేసి ఆ నిధులు భోంచేయడం.. ఇదీ ‘ముఖ్య’నేత వేసే స్కెచ్. దాన్ని పక్కాగా అమలు చేసి, కమీషన్లు జేబులో నింపుకోవడమే చినబాబు చేసే పని. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా సాగుతున్న దందా ఇదే. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్ పనుల్లోనూ రూ.175 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు రంగం సిద్ధం చేశారు. గతంలో ఏ సైన్స్ కాంగ్రెస్‌కూ కేటాయించని విధంగా ఈసారి భారీగా నిధులిచ్చారంటే ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఎప్పటిలాగే నాసిరకం పనులతో ప్రభుత్వ సొమ్మును మింగేసే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతూనే ఉంది. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఇస్కా)ను తిరుపతి ఎస్వీయూలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభిస్తారు. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. వీటిలో దాదాపు రూ.80 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల విలువైన వి జరుగుతాయని అంచనా. ‘ముఖ్య’నేత, ఆయన కుమారుడి అండదండలున్న కాంట్రాక్టర్లే ఈ పనులను దక్కించుకున్నారు. పేరుకే టెండర్లు.. ముందే ఒప్పందాలు ‘ఇస్కా’ ఏర్పాట్లకు సంబంధించిన పనులతోపాటు రోడ్లు, సెమినార్ హాళ్లు, ఆడిటోరియంలు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతు వంటి మేజర్ పనులను అధికార పార్టీ నాయకులే దక్కించుకున్నారు. ‘ముఖ్య’నేత పేరు చెప్పి టెండర్లలో పాల్గొన్నారు. పేరుకు టెండర్లయినా ఏయే పనులు ఎవరెవరు చేయాలో ముందే నిర్ణయించారు. ఈ విషయంలో ఆర్అండ్బీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిగా సహకరించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్అండ్బీ రోడ్లతోపాటు నేషనల్ హైవేకు చెందిన ఏడు రోడ్ల పనులను (సుమారు రూ.35 కోట్లు) తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. దగ్గరుండి మరీ అధిక ధరలకు(ఎక్సెస్) టెండర్లు దాఖలు చేయించి పనులు కట్టబెట్టారు. టెండర్లలో పాల్గొన్న శుభగిరి, వీవీఆర్, టీజేఎన్, హేమంత్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు రోడ్ల పనులు చేపట్టాయి. ఇంత ఖర్చు ఇదే మొదటిసారి! విశాఖపట్నంలో 2008లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగినప్పుడు నిర్వహణ వ్యయం దాదాపు రూ.20 కోట్లే. గతేడాది మైసూరులో సైన్స్ కాంగ్రెస్ వ్యయం రూ.60 కోట్లని సమాచారం. అయితే ఈ ఏడాది తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏకంగా రూ.175 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇస్కా సదస్సులకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. వాహనాల టెండర్లలోనూ అదే తీరు వాహనాల అద్దెలకే రూ.2 కోట్లు వెచ్చించాలని అంచనాలు రూపొందించారు. తిరుపతికి చెందిన స్వర్ణాంధ్ర ట్రావెల్స్, చెన్నైకి చెందిన మరో ట్రావెల్స్‌కు టెండర్లు అప్పగించారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ అతిథులకు 2,534 వాహనాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో 980 ఇన్నోవాలు, 1,200 స్విఫ్ట్ డిజైర్ కార్లు, 206 టెంపో ట్రావెలర్స్తోపాటు ఆర్టీసీ బస్సులు, ఏసీ కోచ్‌లు అవసరమని ప్రతిపాదించారు. ఒక్కో వాహనం రోజుకు 250 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇన్నోవాకు రోజుకు రూ.3,600, స్విఫ్ట్ డిజైర్‌కు రూ.2,500, టెంపో ట్రావెలర్‌కు రూ.4,600 చొప్పున చెల్లించాలి. ఏసీ బస్సుకు రోజుకు రూ.10 వేలు చెల్లించాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఒక్కో వాహనం రోజుకు 250 కిలోమీటర్లు తిరిగే ప్రసక్తే లేదు. ఎంత ఎక్కువ తిరిగినా 100 కిలోమీటర్లకు మించదు. ఇవి మాత్రమే కాకుండా భోజనాలు, షామియానాలు, వేదికల నిర్మాణం, సుందరీకరణ, విమానాల చార్జీలు, హోటళ్ల అద్దెలకు నిధుల కేటాయింపు గురించి నివేదికల్లో కనిపించడం లేదు. టూర్ ప్యాకేజీలకు రూ.2 కోట్లట... తిరుపతి చుట్టుపక్కలుండే అప్పలాయకుంట, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం వంటి ఆలయాలను అతిథులకు చూపెట్టేందుకు టూర్ ప్యాకేజీలు నిర్ణయించిన రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ఏసీ బస్సుల్లో నాలుగు రోజులు వరుసగా తిప్పినా రూ.10 లక్షలు కావు, మరి రూ.2 కోట్లు ఎలా ఖర్చు చూపిస్తారన్నది ప్రశ్న. తమకెంతో సన్నిహితంగా ఉండే విజ్‌క్రాఫ్ట్ సంస్థకు ఈ కాంట్రాక్టును ప్రభుత్వం అప్పగించింది. ఏఏ పనులకు ఎంతెంత..? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుల సందర్భంగా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్, బయట చేపడుతున్న వివిధ రకాల పనులకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వి«వరాలు ఈ విధంగా ఉన్నాయి. 1 పురుషుల హాస్టళ్ల రిపేర్లకు – రూ.10.59 కోట్లు 2 మహిళల హాస్టళ్ల రిపేర్లకు – రూ.5.70 కోట్లు 3 టూరిజం, కల్చరల్ విభాగాల వ్యయం – రూ.2.00 కోట్లు 4 మంచినీళ్లు, వాటర్లైన్లు, ఆర్వో ప్లాంట్లు – రూ.1.46 కోట్లు 5 సెమినార్ హాళ్లు, ఆడిటోరియంల రిపేర్లకు – రూ.11.20 కోట్లు 6 ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణ, రిపేర్లు – రూ.10.96 కోట్లు 7 జాతీయ రహదారుల పనులకు – రూ.25.27 కోట్లు 8 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లకు – రూ.1.00 కోట్లు పనులన్నింటిలోనూ మాయాజాలం... ⇒ ఆర్ అండ్‌బీ రోడ్ల విషయంలో ఆసక్తికరమైన విషయం ఏమంటే... దాఖలైన ఈ ప్రొక్యూర్మెంట్ బిడ్లను తెరవకముందే ఓ కాంట్రాక్టరు ఎస్వీయూ క్యాంపస్‌లో రోడ్ల పనులను మొదలు పెట్టారు. దీంతో టెండర్ల కేటాయింపుల్లో గోల్మాల్ జరిగినట్లు తేటతెల్లమైంది. ⇒ కరకంబాడి, ఎయిర్‌పోర్టు రోడ్లను మూడు నెలల కిందటే తుడా నిధులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ రెండు రోడ్లూ అందంగా, వెడల్పుగా బాగున్నా యి. అయితే మళ్లీ ఇదే రోడ్లకు రిపేర్లంటూ రూ.4 కోట్లు కేటాయించారు. ⇒ ఎయిర్‌ఫోర్టు జంక్షన్ నుంచి కేఎల్ఎం ఆస్పత్రి వరకూ ఉన్న 71వ జాతీయ రహదారికి సుందరీకరణపనులు చేపట్టారు. రాత్రికి రాత్రే బాగున్న తారు రోడ్డుపై మరికాస్త తారు పోసి అయ్యిందనిపించారు. కచ్చితంగా ఈ పనుల్లో పెద్ద మొత్తంలో వెనుకేసుకునే వీలుంది. ⇒ వర్సిటీ రోడ్ల పనులు చేపట్టిన శుభగిరి నిర్మాణ సంస్థ కూడా కూడా హడావుడిగానే పనులు కానిచ్చేశారు. వాస్తవంగా క్యాంపస్‌లోని 36 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్లకు పూర్తిస్థాయిలో రిపేర్లు చేయాలి. కాగా ఉద్యోగులు నివాసముండే ఏరియాలో రోడ్లకు ప్యాచ్ వర్కులు మాత్రమే జరిగాయి. ⇒ ఎస్వీయూ క్యాంపస్‌లో ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ఉదయం సిమెంట్ పనులు చేసి మధ్యాహ్నం టైల్స్ అతికించారు. క్యూరింగ్ లేని కారణంగా చాలా చోట్ల అడుగు పడితే పగిలిపోయేట్లున్నాయి. ⇒ క్యాంపస్‌లో విద్యుత్ పనులు కూడా నాసిరకంగా జరిగాయి. భూగర్భంలో వేసిన విద్యుత్ కేబుల్స్, బల్బులు స్టాండర్డ్ లేని కంపెనీలవి వాడారని ఆరోపణలున్నాయి. కనీసం తయారీ సంస్థకు సంబంధించిన లేబుల్స్ లేని చైనా కంపెనీకి చెందిన ఎల్ఈడీ బల్బులను తెచ్చి బిగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ⇒ క్యాంపస్‌లో జరిగే ఇస్కా సదస్సులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లలో భాగంగా ఎనిమిది ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బోర్లు కోసం రూ.12 లక్షలు, వాటర్ లైన్ల కోసం రూ.30 లక్షలు, కొత్త మోటార్ల కొనుగోలు కోసం రూ.30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతినిధుల వాటర్ బాటిళ్ల సరఫరా కోసమం టూ మరో రూ.34 లక్షలు కేటాయించారు. ⇒ ఇదే అదునుగా వీసీ బంగ్లా ఆవరణలోనూ, ప్రకాశ్నగర్లోనూ రెండు బోర్లు వేసి మోటార్లు బిగించారు. ⇒ అంచనాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులుగా సింటెక్సు ట్యాంకులు వాడతామని చెప్పి ఆక్వాటెక్ కంపెనీకి చెందిన ట్యాంకులు ఏర్పాటు చేశారు. ⇒ శ్రీనివాసా ఆడిటోరియాన్ని రూ.1.22 కోట్లతో ఆధునికీకరించారు. ఆర్ అండ్ బీలోని ఓ అధికారి బినామీ కాంట్రాక్టర్ పేరుమీద తానే పనులన్నీ చేయించారు. అయితే ఆడిటోరియం లోపల గోడలకు బిగించిన ఫ్యాన్లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. ఉడ్ వర్క్ కూడా బాగా లేదు. ⇒ హాస్టళ్లు, సెమినార్ హాళ్ల భవనాలకు లోపల, బయట వేసిన పెయింట్లు నాసిరకంగా ఉన్నాయి. వాడిన సున్నం కూడా బ్రాండెడ్ కంపెనీది కాదు. దీనికితోడు రెండో పూత లేకుండా పెయింటింగ్ పనులు మమ అనిపించారు. ⇒ రోడ్ల పక్కన బ్యూటిఫికేషన్ పేరిట మంచి మొక్కలన్నింటినీ పీకి తక్కువ రకం పూలకాగితాల మొక్కలను విరివిగా పాతారు. దీనికితోడు క్యాంపస్‌లో భారీగా పెరిగిన వృక్షాలను నరికి వేశారు. దీంతో 50 ఏళ్ల నాటి పచ్చదనం తగ్గిపోయింది. -
సైన్స్ కాంగ్రెస్‌కు తిరుపతి ముస్తాబు
- రేపు ఉదయం ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం - 4న ప్రముఖులతో ముఖాముఖి సాక్షి, అమరావతి: ఐదు రోజుల పాటు జరిగే 104వ భారత సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) సమ్మేళ నానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ముస్తాబైంది. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీవేంక టేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణ వేదిక కానుం ది. సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశాన్ని వివరించే పోస్టర్లు వాడవాడలా వెలిశాయి. యూనివర్సిటీ దారు లన్నీ ఆకర్షణీయ బ్యానర్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికే ఫ్లెక్సీలతో నిండిపో యాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువ చేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలకు వర్సిటీలోని వివిధ ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ లబ్ధ ప్రతిష్టులైన తొమ్మిది మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవే త్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్ తదితర సంస్థలకు చెందిన 18 వేల మంది ప్రతినిధులు సైన్స్ కాంగ్రెస్‌కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బాలల సైన్స్ కాంగ్రెస్, శాస్త్రీయ కార్యక్రమం, మహిళా సైన్స్ కాంగ్రెస్, సైన్స్ పరివాహకుల సదస్సు, సైన్స్ ఎగ్జి బిషన్, ప్లీనరీ సమావేశాలు కూడా నిర్వహించ నున్నారు. ఈసారి ఎక్స్పో విశిష్టత ఇదీ... సైన్స్ కాంగ్రెస్‌తో పాటు నిర్వహించనున్న ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్పో (పీఒఐ)లో కొత్త ఆలో చనలు, కొంగొత్త ఆవిష్కరణలు, సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. సామాన్యులు సైతం ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. వీటితో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకుల జీవనయానంలోని మజిలీలను తెలియజేసేలా మరో ప్రదర్శనను హాల్ ఆఫ్ ప్రైడ్ పేరిట నిర్వహిస్తారు. తిరుపతికి రానున్న విజ్ఞాన జ్యోతి... శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ఢిల్లీలో బయలుదేరిన విజ్ఞాన జ్యోతి సైన్స్ కాంగ్రెస్ మహాసభ ప్రారంభం నాటికి తిరుపతి చేరుకుంటుంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయం మేరకు విజన్ 2010 పేరిట ఈ విజ్ఞాన జ్యోతి ప్రారంభమైంది. 4న జెనిసిస్...: సైన్స్ కాంగ్రెస్‌లో రెండోరోజు (4వ తేదీ) వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులతో జెనిసిస్ పేరిటి ముఖాముఖి నిర్వహిస్తారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం కోసం పారిశ్రామిక రంగం చేపట్టాల్సిన, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై సభికుల ప్రశ్నలకు ప్రముఖులు జవాబులిస్తారు. -
సైన్స్ కాంగ్రెస్ విజయవంతం చేయాలని..
తిరుపతి: తిరుపతిలో వచ్చే నెల 4, 5 ,6 తేదీల్లో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలను విజయవంతం చేయాలని కోరుతూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎస్పీ జయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీ శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ వరకు సాగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా ఉంటుందని తెలిపారు. -
జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపిక
– రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు ఎంపిక – జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపిక కర్నూలు సిటీ: విజయవాడలో ఈనెల 3,4 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని, ఇందులో జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. నగరంలోని ఇండస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఉమ్మెసల్మా, సిస్టర్స్టాన్సిలా పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సౌమ్య ప్రదర్శించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆ విద్యార్థినులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా అభినందించాయి. -
సైన్స్ కాంగ్రెస్‌కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక
సిద్దవటం: సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి కడప లోని సైన్స్ మ్యూజియంలో జరిగిన 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలో తమ పాఠశాలకు విద్యార్థిని లక్ష్మిప్రసన్న ఆహారం మరియు వ్యవసాయం అనే అంశంపై సెమినార్లో పాల్గొని చక్కటి ప్రతిభను కనపరచడంతో న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. డిశంబర్ 3,4, తేదీలలో విజయవాడలో జరిగే రాష్ఠ్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థికి గైడ్ ఉపాధ్యాయుడుగా నరసింహబాబు వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో గురువారం లక్ష్మిప్రసన్న ను ప్రధానోపాధ్యాయుడు లోకేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
1న జిల్లా స్థాయి చిల్డ్రన్స్ సైన్స్‌కాంగ్రెస్
నరసరావుపేట: విద్యార్థుల జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్‌ను నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ బాలుర హైస్కూలు ఆవరణలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకున్న వారు మాత్రమే ఈ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు ఒక విద్యార్థి, ఒక గైడ్ ఉపాధ్యాయుడు మాత్రమే పాల్గొనాలని సూచించారు. విద్యార్థి, గైడ్ ఉపాధ్యాయుడు ఫొటోలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా కో ఆర్డినేటర్ ఏఏ మధుకుమార్(సెల్‌ఫోన్ నంబర్ 90328 71234), జిల్లా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ షేక్.మహమద్ గౌస్(సెల్‌ఫోన్ నంబర్ 93900 70555)లను సంప్రదించాలని సూచించారు. -
18న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల18వ తేదీన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల స్కూల్ నుంచి ఒక సైన్స్ గైడ్ టీచర్, విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి స్కూల్ ఈ ప్రదర్శనలలో పాల్గొవాలని ప్రాజెక్టును ఠీఠీఠీ.nఛిటఛి.ఛిౌ.జీn అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డిలను 9948605546, 8790111331 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
కేయూ వీసీకి ఫెలో పురస్కారం
మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో సైన్స్, టెక్నాలజీలో విశేష పరిశోధనలు జరిపిన కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సుంకరి రామకృష్ణారావుకు ఫెలో ఆఫ్ ఎ.పి.ఎ.ఎస్ పురస్కారాన్ని అందజేశారు. అకాడమీ ఆఫ్ సైన్సెన్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని పీబి సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్–2016 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయం వీసీతో పాటు రసాయన శాస్త్ర విభాగాధిపతి డి.రామశేఖరరెడ్డి, బయో టెక్నాలజీ విభాగాధిపతి పీ.వి బ్రహ్మచారీలకు అసోసియేట్ ఫెలో ఆఫ్ ఎ.పి.ఎ.ఎస్ పురస్కారాన్ని అందజేశారు. వీరిని విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.