Selva Raghavan
-
భార్యతో తిట్లు తిన్న ప్రముఖ డైరెక్టర్.. వీడియో వైరల్!
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు. స్టార్ హీరోలందరితో ఆయన పలు సినిమాలు చేశారు. కాదల్ కొండేన్ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ను 2006లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతాంజలిని 2011లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజాగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన భార్యతో గొడవ పడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య తిడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెల్వరాఘవన్ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ సతీమణితో గొడవ పడిన విషయాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఎంతటి వారైనా భార్య చేతిలో తిట్లు తప్పవని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో సెల్వ రాఘవన్ కూడా నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరలవుతోంది. కాగా.. సెల్వ రాఘవన్ ప్రస్తుతం ధనుష్ చిత్రంలో 'రాయాన్' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Selvaraghavan (@selvaraghavan) -
తమ్ముడి డైరెక్షన్లో అన్న.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
స్టార్ హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే తమిళ నటుడు కానీ తెలుగు, హిందీలోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ధనుష్‌లో గాయకుడు, లిరిక్ రైటర్, దర్శకుడు కూడా ఉన్నాడు. నటుడిగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ధనుష్ ఎదుగుదలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ పాత్ర ఎంతో ఉంది. తాజాగా అన్న సెల్వ రాఘవన్ గురించి ధనుష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకి బ్రేకప్ చెప్పిన భార్య.. విడాకుల తీసుకోబోతున్నారా?) ధనుష్ తొలి చిత్రం 'తళ్లువదో ఇళమై' సినిమాని తీసిన సెల్వరాఘవన్నే. ఈ చిత్రం విజయం వీరిద్దరి ఫేట్ మార్చేసింది. ఆ తర్వాత కాదల్ కొండేన్, పుదుపేట్టై వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. కాగా ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తీస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి 'రాయన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ అన్న సెల్వరాఘవన్ కూడా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ధనుష్.. 'మిమ్మల్ని(సెల్వరాఘవన్ ) డైరెక్ట్ చేస్తానని ఊహించలేదు సర్' అని ఎమోషనల్ అయిపోయాడు. దీనికి బదులిచ్చిన సెల్వరాఘవన్.. తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దర్శకుడు సార్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్) Never thought I’ll direct you someday sir 🙏🙏 @selvaraghavan pic.twitter.com/X1TnkaGqAR — Dhanush (@dhanushkraja) February 22, 2024 -
సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరాది భామ సోనియా అగర్వాల్ గురించి సినీ వర్గాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే అంత సంచలన నటి ఈ భామ. ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ సమయంలో సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్ లేకపోవడం గమనార్హం. కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్ తాజాగా ఆ వృత్తికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు. తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్ సరసన నటి సోనియా అగర్వాల్, స్నేహా నటించారు. దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. సెల్వరాఘవన్ తో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. నటన తన వృత్తి అని, పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనన్నారు. అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్ పేర్కొన్నారు. -
హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ కూతురు.. కీలక పాత్రలో టాలీవుడ్ నటుడు!!
దర్శకుడు సెల్వరాఘవన్ నటుడిగా బిజీ అవుతున్నారు. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆయన నట జీవితం ఇప్పుడు హీరో స్థాయికి చేరుకుంది. తాజాగా పాన్ ఇండియా చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మూమెంట్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జీఎం.హరికృష్ణన్, దుర్గాదేవి హరికృష్ణన్ నిర్మిస్తన్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, టాలీవుడ్ నటుడు సునీల్, జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!) ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు రాజీవ్ మీనన్ వారసురాలు సరస్వతి మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 1990 ప్రాంతంలో దర్శకుడు కే.భాగ్యరాజ్ రూపొందించిన చిత్రాలు తమిళంలో విజయవంతమవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయి హిట్ అయ్యాయని, అలాంటి కథతో రూపొందించనున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న సెల్వరాఘవన్‌కు నచ్చడంతో ఇందులో ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకరించారని అన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం దిండుగళ్ ప్రాంతంలో 1000 మంది సహాయ నటీనటులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిపారు. (ఇది చదవండి: సమంతలాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి) View this post on Instagram A post shared by Saraswathi Menon (@sarasmenon) -
బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్ యూనే..
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్. ఎస్జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్ యూ నే..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంటోని’. ఈ చిత్రంలో విశాల్ లుక్ సరికొత్తగా ఉంటుంది. ‘ఐ లవ్ యూ నే..’ పాటలో హీరోహీరోయిన్ల మాస్ స్టెప్స్, అందుకు తగ్గట్టుగా వస్తున్న ఫాస్ట్ బీట్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
7జి బృందావన కాలనీ సీక్వెల్లో ఆ మలయాళ హీరోయిన్?
తుళ్లువదో ఇళమై.. ఈ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా, ధనుష్ హీరోగా పరిచయమయ్యాడు. వీరిద్దరూ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ధనుష్ హీరోగా కాదల్ కొండేన్ చిత్రం చేసి మరోసారి సక్సెస్ అందుకున్నాడు. కాగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం 7 జీ రెయిన్బో కాలనీ. 2004లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. నిర్మాత ఏఎం రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆయనకు జంటగా నటి సోనియా అగర్వాల్ నటించింది. ఈమెకు ఇదే తొలి చిత్రం. వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత 7జీ రెయిన్బో కాలనీ(7జి బృందావన కాలనీ) చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సెల్వరాఘవన్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నమే నిర్మించనున్నట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రంలో నటి సోనియా అగర్వాల్‌కు బదులుగా మలయాళం హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు తెలిసింది. ఈమె బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పలు చిత్రాల్లో వివిధ పాత్రలో నటిస్తూ గుర్తింపు పొందింది. ఇటీవల త్రిష కథానాయికగా నటించిన రాంగీ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. అదేవిధంగా థగ్స్ , హిందీ చిత్రం యారియన్ 2 తదితర చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. నటుడు రవి కష్ణ కూడా ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారు. View this post on Instagram A post shared by S H E ♾️ (@anaswara.rajan) చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్
సోనియా అగర్వాల్ టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ' సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్ అన్నయ్య అయిన దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో వివాహమాడి ఆపై 2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు. కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది. (ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది) పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో బ్రేక్ తీసుకున్నానని తెలిపింది. అయితే 2010లో భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది -
మేనల్లుడి కోసం ధనుష్, అనిరుధ్ మాస్టర్ ప్లాన్ ?
సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ధనుష్ కొనసాగుతున్నారు. 'సార్' విజయం తర్వాత ఆయన మరింత జోరుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పీరియాడికల్ వార్ డ్రామాగా ఆయన కెరీర్లోనే భారీ బడ్జెతో రానుంది. తర్వాత తన మైల్స్టోన్ 50వ చిత్రానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించకుండా అతిధి పాత్రలో మాత్రమే కనిపించనున్నాడు. కానీ ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే ఈ మూవీని ఆయనే డైరెక్ట్ చేయనున్నారు. (తల్లి విజయలక్ష్మి, అక్కలు విమల గీత (కుడి), కార్తీక (ఎడమ)తో ధనుష్) పవర్ పాండి తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇందులో S.J సూర్య,సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, అనిఖా సురేంద్రన్, దుషార విజయన్, సెల్వరాఘవన్లు ఉండగా కీలక పాత్ర కోసం మట్టి కుస్తి హీరో విష్ణు విశాల్‌ను తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తన మూడవ చిత్రాన్ని కూడా ధనుస్ లైన్లో పెట్టాడట. ఈ సినిమాతో అతని మేనల్లుడు ఆరంగేట్రం చేస్తున్నాడట. ధనుష్, సెల్వరాఘవన్లకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. డాక్టర్ విమల గీత, డాక్టర్ కార్తీక వారిద్దరూ చెన్నైలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. వారిలో ధనుష్ అక్క అయిన విమల గీత కుమారుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అందుకోసం అతను ఇప్పటికే శిక్షణ కూడా ప్రారంభించాడట. ఇదే నిజమైతే ధనుష్‌ల ఫాలోయింగ్‌తో అతని ఎంట్రీ కూడా భారీ రేంజ్లో ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. (ధనుష్ అక్క విమల గీత ఫ్యామిలీ) మేనల్లుడికి ఇండస్ట్రీలో మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేయాలని అందుకు కావాల్సిన కథను ఇప్పటికే రెడీ చేశాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్ కింగ్ అనిరుధ్ రవిచందర్‌ను ఏర్పాటు చేస్తున్నాడట. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో 'D51' కూడా జరుగుతుంది. -
సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రెడీ.. హీరోయిన్ ఎవరంటే..?
కోలీవుడ్‌లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్‌కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్‌లో దర్శకత్వం వహించిన సక్సెస్ఫుల్ చిత్రం 7జీ రెయిన్బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నది సామెత మాత్రమే కాదు.. జీవిత సత్యం కూడా. దర్శకుడు సెల్వ రాఘవన్, నటుడు ధనుష్‌ల కథ ఇంచుమించు ఇలాంటిదే. వీరిద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే! ఇద్దరు ఒకేసారి సినీ ప్రయాణం ప్రారంభించారు. తుళ్లువదో ఇళమై చిత్రంతో సెల్వరాఘవన్ దర్శకుడుగా, ధనుష్ నటుడుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత కాదల్ కొండాన్, పుదుపేట్టై, మయక్కం వంటి ఎన్నో చిత్రాలు రూపొందించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ ఎవరి బాటలో వారు ప్రయాణించారు. చాలా కాలం తర్వాత ఇటీవల 'నానే వరువేన్' చిత్రంతో మళ్లీ కలిశారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ధనుష్ కథానాయకుడిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. దర్శకుడిగా, నిర్మాతగా విజయాలను అందుకున్నారు. కాగా ఇప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్ కూడా నటుడిగా అవతారం ఎత్తారు. ఈయన సాని కాగితం చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ప్రశంసలను అందుకున్నారు. అదేవిధంగా బీస్ట్, నానేవరువేన్ చిత్రాలలో కీలకపాత్రలను పోషించారు. రుద్ర తాండవం చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. తాజాగా సెల్వ రాఘవన్.. తాను కథానాయకుడిగా పరిచయం చేసిన తన సోదరుడు ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సెల్వ రాఘవన్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తాజా సమాచారం. నటి దుషారా నాయకిగా నటిస్తున్న ఇందులో ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ కథా చిత్రం అని తెలిసింది. చదవండి: భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి సురేశ్.. ఎంతంటే? మిథునం రచయిత కన్నుమూత -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
సంచలనం సృష్టించిన..7/G బృందావన్ కాలనీ సీక్వెల్
-
హీరోయిన్‌తో విడాకులు..ఒంటరిగా ఉండమని సలహా ఇచ్చిన ధనుష్
సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఒకప్పుడు బెస్ట్ కపుల్ అనిపించుకున్న వారే ఆ తర్వాత విడాకులు తీసుకొని షాక్ ఇచ్చిన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్- హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఉన్నారు. 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్. ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడిన ఆమె హీరోయిన్గా పీక్ టైంలో ఉండగానే అతడిని 2006లో పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై సెల్వ రాఘవన్ ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ''కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడాకులు తీసుకున్నాం. అప్పుడు నా తమ్ముడు ధనుష్ ఒక మాట అన్నాడు.. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు అని. నిజంగానే విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం సింగిల్‌గానే ఉంటోంది. -
బకాసురన్.. కూతురి కోసం పోరాడే తండ్రి కథ!
చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్‌తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను రూపొందించారు. తాజాగా శ్రీ దర్శకత్వంలో జీఎం ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వరాఘవన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటరాజన్, కే రాజన్, మన్సూర్ అలీఖాన్, నటి తారాక్షి, లావణ్య మాణిక్యం, దేవదర్శిని, పి.ఎల్ తేనప్పన్, గుణానిధి, రామ్, శశిలైలా రిచా, కూల్ జయంత్, అరుణోదయన్, కుట్టి గోపి ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ బాషా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జీటీఎం సంస్థ శుక్రవారం విడుదల చేసింది. దర్శకుడు మోహన్.జి ఈ చిత్రానికి సమాజంలో జరుగుతున్న ప్రస్తుత విషయాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. కొన్ని యధార్థ సంఘటనలను చిత్రంలో వాడుకున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల భవిష్యత్తులతో విద్యాసంస్థల అధినేతలు ఎలా ఆడుకుంటున్నారు?, పరిస్థితుల ప్రభావం కారణంగానో, మరి ఇతర కారణాల వల్లో యువతులు వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందుకు కొందరు యువకులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారు? వంటి అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన కథ చిత్రం బకాసురన్. ఇందులో వీధి భాగోతం కళాకారుడుగా దర్శకుడు సెల్వరాఘవన్ నటించారు. మాజీ సైనికుడిగా నటరాజన్, విద్యాసంస్థ అధినేతగా రాధారవి నటించారు. వీరి మధ్య జరిగే కథే బకాసురన్. అయితే ఇందులో బకాసురన్ ఎవరనేదే చిత్రంలో ఆసక్తికరమైన అంశం. కూతురి తండ్రిగా భీమరాజ్ పాత్రలో సెల్వరాఘవన్ నటన హైలైట్‌గా ఉంటుంది. ఆయన అలుపెరుగని పోరా టమే బకాసురన్ చిత్రం. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’.. టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. 1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్‌తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’ చిత్రం
తమిళ స్టార్ హీరో ధనుశ్ తాజా చిత్రం ‘నానే వరువేన్’. ధనుశ్ సోదరుడు, డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి కలై పులి ఎస్ తను ఈ సినిమాను సమర్నిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా నిర్మాత కలై పులి గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నేను వస్తున్నా పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెలలో(సెప్టెంబర్) విడుదల చేస్తామని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
పగ, ప్రతీకారంతో రగిలిన కీర్తి సురేష్ 'చిన్ని' మూవీ రివ్యూ
టైటిల్: చిన్ని నటీనటులు: కీర్తి సురేష్, సెల్వ రాఘవన్, మురుగదాస్, కన్నా రవి, లిజీ అంటోని తదితరులు కథ, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్ నిర్మాత: డి. ప్రభాకరన్, సిద్ధార్థ్ రావిపాటి సంగీతం: సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్ విడుదల తేది: మే 6, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో) 'మహానటి' కీర్తి సురేష్ డీ గ్లామరైజ్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'చిన్ని'. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో మే 6న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. అయితే ఓవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ సింట్రిక్ ఫిలీంస్‌తో అలరిస్తోంది కీర్తి సురేష్. అలా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్ని సినిమా కథేంటి ? ఇందులో కీర్తి సురేష్ నటన ఎలా ఉంది ? సెల్వ రాఘవన్ పాత్ర ఏంటి ? అనే తదితర విషయాలను రివ్యూలో చూద్దాం. కథ: భర్త మారప్ప, ఐదేళ్ల కూతురు ధనతో కానిస్టేబుల్‌గా జీవితం సాగిస్తుంటుంది చిన్ని (కీర్తి సురేష్). గ్రామంలోని రైస్ మిల్లులో పని చేస్తున్న మారప్ప స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలనుకుంటాడు. అది మారప్ప పని చేసే మిల్లు ఓనర్‌కు నచ్చదు. ఈ క్రమంలో మిల్లు ఓనర్‌తో జరిగిన గొడవ అతనిపై మారప్ప చేయిచేసుకునే వరకు వెళ్తుంది. దీన్ని పెద్ద అవమానంగా భావించిన మిల్లు ఓనర్, అతడి స్నేహితులు మారెప్ప కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. చిన్ని కుటుంబాన్ని మిల్లు ఓనర్ ఏం చేశాడు ? దానికి చిన్ని ఏం చేసింది ? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకుంది ? చిన్నికి రంగయ్య (సెల్వ రాఘవన్)కు ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలే సముహారమే 'చిన్ని' సినిమా. విశ్లేషణ: చిన్ని సినిమా స్టోరీ అంతా 1989 నాటి కాలంలో సాగుతుంది. అప్పటి సమాజంలో అగ్రవర్ణాలవారు పేదవారిని ఎలా చూసేవారనేది కథగా తెరకెక్కించాడు డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. అయితే కథలో ఎంత భావోద్వేగపు సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు అంతగా ఆ సీన్లకు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో డైరెక్టర్ సఫలం అయ్యారనే చెప్పవచ్చు. చిన్ని కుటుంబంపై మిల్లు ఓనర్ చేసే దారుణాలు ఆడియెన్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. సినిమాను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో మొదలు పెట్టి, గతంలో జరిగిన విషయాలకు కనెక్ట్ అయ్యేలా ఆ సీన్లను కలర్లో చూపించడం బాగుంది. రివేంజ్ డ్రామా కాబట్టి ఈ మూవీలో సన్నివేశాలన్ని ప్రేక్షకుడు ఊహించినట్లే సాగుతాయి. చిన్ని, రంగయ్య చేసే హత్యలు హింసాత్మకంగా ఉన్నా ఆకట్టుకుంటాయి. ఈ సన్నివేశాలను ఆసక్తికరంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ సాధించారనే చెప్పవచ్చు. కాకపోతే ఈ సీన్లు రియాల్టీకి దూరంగా ఉంటాయి. సినిమా పూర్తిగా లాజిక్‌గా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ప్రతి పాత్రను వివరంగా చూపించే క్రమంలో సాగాదీసినట్లుగా ఉంటుంది. ఇలాంటి స్టోరీలో పాటలు లేకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టలేదనే చెప్పవచ్చు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేసే సినీ ప్రియులకు 'చిన్ని' కచ్చితంగా నచ్చుతుంది. ఈ వారంలో ఓటీటీలో టైంపాస్‌కు సినిమా చూడాలనుకనే వారికి 'చిన్ని' ఒక బెటర్ ఆప్షన్. ఎవరెలా చేశారంటే: 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'గుడ్‌లక్ సఖి' వంటి లేడి ఒరియంటేడ్ మూవీస్‌కే ఓటు వేసింది. అయితే కీర్తి సురేష్‌కు అవి అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. కానీ 'చిన్ని'తో తన నటనలోని కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినట్లయింది. కుటుంబంతో కలిసి బతకాలన్న ఆశయం కలిగిన కానిస్టెబుల్‌గా 'చిన్ని' పాత్రలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. పగ, ప్రతీకారం తీర్చుకుంటునే తనను తాను కాపాడుకునే మహిళగా తాను చేసిన నటన ఎంతో అలరిస్తుంది. ఇక రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయారు. నటనలో ఆయన మార్క్‌ను చూపించారు. తదితర నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలంగా అనిపిస్తుంది. సామ్ సీఎస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ఆకట్టుకుంటుంది. దీంతో ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. అయితే ఫైనల్‌గా డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిన్ని మూవీ కథ కొత్తేమి కాకున్నా తీర్చి దిద్దిన విధానం బాగుంది. స్క్రీన్‌ప్లే స్లోగా కాకుండా ఉంటే ప్రేక్షకుడికి సాగదీసినట్లుగా అనిపించేది కాదు. కాబట్టి స్లోగా ఉన్నా మంచి రివేంజ్ డ్రామా చూడాలనుకుంటే 'చిన్ని' మూవీని ట్రై చేయవచ్చు. -
24 హత్యలు చేసిన కీర్తి సురేష్.. ఆసక్తిగా ట్రైలర్
Keerthy Suresh As Killer In Chinni Movie And Trailer Released: 'మహానటి' కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కంటే ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. 'సాని కాయిధం' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. ఈ మూవీలో ధనుష్ సోదరుడు, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించాడు. ఇది వరకు రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఎన్ని మర్డర్లు చేశావని' రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు అడగడంతో మూవీ ట్రైలర్ ప్రారంభమైంది. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ తాము చేసిన హత్యల గురించి చెప్పే పద్ధతి ఉత్కంఠంగా ఉంది. వీరిద్దరి యాక్టింగ్ సూపర్బ్ అనేలా ఉంది. 24 మందిని చంపి తాను చేయబోయే 25వ హత్య గురించి చెప్పడం క్రూరంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ పగ, ప్రతికారం, క్రైమ్ నేపథ్యంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా పని చేసిన చిన్ని ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వ వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మే 6 నుంచి ప్రసారం కానుంది. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ 'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు ఏ మూవీ అంతగా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్లో కీర్తి సురేష్ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అన్నదమ్ములకు సోకిన కరోనా.. సినిమా షూటింగ్‌కు బ్రేక్
Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌తోనే తెలుగులో నేరుగా ధనుష్ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'. వెంకీ అట్లూరీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్ సోదరుడు డైరెక్టర్ సెల్వ రాఘవన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్ కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో 'సార్' సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ధనుష్‌కు కరోనా అని తేలగానే 'సార్' చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ హోం ఐసోలేషన్‌లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్ 'సార్' చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్‌ను భారీగా ప్లాన్ చేశారని టాక్. ఎక్కువ సీన్లు ధనుష్పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫొర్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టీచర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ధనుష్ కుటుంబంలో కరోనా కలకలం..
Dhanush Brother Director Selva Raghavan Tests Positive Covid 19: కరోనా మహమ్మారి విజృంభణ అస్సలు తగ్గేలా లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలను తన పంజాతో భయపెడుతోంది. ఇప్పటివరకు ఎంతో మంది నటీనటులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా తమిళ డైరెక్టర్, హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్‌కు జనవరి 23న కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. అలాగే వైద్యుల సలహాలు పాటించాలని సెల్వ రాఘవన్ విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇటీవల తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్‌లకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 🙏🏼🙏🏼 pic.twitter.com/jqqPQVEVOT — selvaraghavan (@selvaraghavan) January 23, 2022 -
ఓటీటీకి కీర్తి సురేశ్ మూవీ
మహనటి కీర్తీ సురేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ఆమె తమిళంలో ‘సాని కాయిదమ్’ అనే వైవిధ్యమైన చిత్రంలో నటించింది. 1980 కాలం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు మహేశ్వర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టెసింది. ఈ నేపథ్యంలో నిన్న(అగష్టు 19) ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కీర్తి ఒక పెల్లెటూరి అమ్మాయిగా ఢిగ్లామర్తో కనిపించగా ఆమె పక్కనే ఆమె పక్కనే దర్శకుడు సెల్వరాఘవన్ లుక్ ఆసక్తిగా ఉంది. ఇందులో ఆయన చేతులకు రక్తంతో ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాయి కానిదమ్ అద్భుతమైన జర్నీ అని, ఈ మూవీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని ఈ సందర్భంగా సెల్వ రాఘవన్ అన్నాడు. పొస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినికిడి. కీర్తిసురేశ్ ఇంతకుముందు చేసిన ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలాగే ‘సానికాయిధమ్’ కూడా ఓటీటీలోనే రానుందని అంటున్నారు. సర్కారి వారి పాట మూవీతో పాటు కీర్తి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తై మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్‌కి విలన్‌గా ప్రముఖ దర్శకుడు
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ‘సాని కాయిదమ్’ చిత్రంతో యాక్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ మరో ప్రధాన పాత్రధారి. తాజాగా సెల్వరాఘవన్ ‘బీస్ట్’ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఉపారు. విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘బీస్ట్’ సినిమాలో నటించే కొందరి యాక్టర్స్ పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు. సెల్వరాఘవన్‌తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్ ఫరూకీ, షైన్ టామ్ చాకో, అపర్ణాదాస్, అంకుర్ అజిత్ వికాల్లు కీలక పాత్రలు పోషించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో సెల్వరాఘవన్ విలన్ రోల్ చేయనున్నారని టాక్. ఇక దర్శకుడిగా ‘నానే వరువేన్’, ‘యుగానికి ఒక్కడు 2’ చిత్రాలను సెల్వరాఘవన్ తెరకెక్కించనున్నారు. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’కి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మా ఇంటికి సంతోషం వచ్చింది
తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఇంట్లో సంతోషం నెలకొంది. ఆయన మూడోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు సెల్వరాఘవన్, గీతాంజలి. వీరికి ఒక పాప, బాబు (లీలావతి, ఓంకార్) ఉన్నారు. తాజాగా ఓ బాబుకి జన్మనిచ్చారు గీతాంజలి. ఈ బాబుకి రిషికేశ్ సెల్వరాఘవన్ అని పేరు పెట్టారు. ‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని పేర్కొన్నారు ఈ దంపతులు. 2010లో సెల్వరాఘవన్, గీతాంజలి వివాహం చేసుకున్నారు. ‘‘7/జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు’ వంటి సినిమాలను రూపొందించారు సెల్వరాఘవన్. -
తండ్రైన ప్రముఖ దర్శకుడు
సాక్షి చెన్నై: ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.తమకు కుమారుడు జన్మించాడంటూ రాఘవన్ భార్య గీతాంజలి తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అప్పుడే ఈ బుడ్డోడికి రిషికేష్ అనే పేరు కూడా పెట్టేశారు. గురువారం ఉదయం "రిషికేశ్ సెల్వరాఘవన్’’ తమ జీవితాల్లోకి ఎనలేని ఆనందాన్నితీసుకొచ్చాడంటూ గీతాంజలి ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని, తాము క్షేమంగా ఉన్నామని తెలిపారు. అలాగే తమకు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దీంతో తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి విషెస్ అందిస్తున్నారు. కాగా సెల్వరాఘవన్ తమిళ హీరో ధనుష్ సోదరుడు. 2006లో నటి సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహాయ దర్శకురాలు గీతాంజలిని సెల్వ రాఘవన్ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికీ పిల్లలు లీలావతి, ఓంకార్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే గీతాంజలి, గత ఏడాది నవంబర్ నుంచి తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.