Shabir Ali
-
ముస్లిం రేసేవాషన్లు తొలగించటం అమిత్ షా తరం కాదు
-
ఫీ‘జులుం’పై చర్యలేవీ..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్య వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణను ప్రారంభించింది. సోమవారం దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఈ క్యాంపెయిన్ ను మాజీ మంత్రి, మండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తొలి సంతకం చేసి ప్రారంభించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షబ్బీర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాఠశాల విద్య భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యంత ఖరీదైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 ఆగస్టులో అమల్లోకి తెచ్చిన ఉత్తర్వులను టీఆర్ఎస్ తుంగలో తొక్కింద న్నారు. సీఎం కేసీఆర్ విద్యావ్యాపారంపై ఎప్పుడూ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని, దాదాపు 52 శాతం మంది పిల్లలు చదువుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థలకు ముకుతాడు వేయడం గురించి ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. టీపీసీసీ మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సోహైల్ మాట్లాడుతూ.. రానున్న 2 నెలల్లో 10 లక్షల సంతకాలను సేకరించి గవర్నర్‌కు ఇస్తా మని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొలి సంతకం చేస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ -
జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు భత్యం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఉందని, ఈమేరకు బుల్లెట్ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టీఎస్ 09పీఏ1653, టీఎస్ 09పీఏ1654 వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ ఈ కోడ్ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్‌కు రూ.37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936 చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అధికార పార్టీకి సైతం రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, ఇతర వీఐపీలు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సైతం ఇదే రీతిలో చెల్లించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఎవరెవరికి ఇచ్చారు? ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశాలపై సాక్షి ఆరాతీసేందుకు ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరు అందుబాటులోకి రాలేదు. -
12శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రిజర్వేషన్లను యాభై శాతానికి మించి పెంచబోమని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిందని, ఈ దృష్ట్యా రాష్ట్రంలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాక కేంద్ర ప్రభుత్వం సైతం రిజర్వేషన్ల పెంపునకు ఒప్పుకునే అవకాశం లేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయకుండా సీఎం కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీనియర్ నేత దయాసాగర్‌తో కలిసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీలతో మాట్లాడతానని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఏదీ సాధించకుండా రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు తెస్తానని, సుప్రీంకోర్టుకు వెళ్తానని లేదంటే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలన్నీ కోతలేనని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్‌ది అయితే, ఒక్క ఆర్డినెన్స్‌తో బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించిన చరిత్ర టీఆర్ఎస్ది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చావలేదు.. ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టమ్ నిర్వహించిందా? అని అడగ్గా, పార్టీ ఇంకా చావలేదన్నారు. కాంగ్రెస్‌కు 134 ఏళ్ల చరిత్ర ఉందని, పార్టీ ఓటమిపై కేవలం సమీక్ష మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు కేవలం మోదీ వర్సెస్ రాహుల్ – ధర్మం, అధర్మం మధ్యే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎన్ని డబ్బులు పంచినా ఫలితాలు భిన్నంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన టీ కాంగ్రెస్ నేతలు
-
స్వామిగౌడ్‌తో షబ్బీర్ అలీ భేటీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనం చేయడంపై టీ కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ సుత్రాలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు స్వామిగౌడ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్ మండలి ఛైర్మన్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరడానికి గల కారణాలను ఆయనకు వివరించారు. ఇటీవల రాములు నాయక్‌కు టీఆర్ఎస్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారపక్షం తీరుతో ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో ఖూనీ అవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. శాసనమండలిలో కాంగ్రె స్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లేఖ ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు మండలి కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని శుక్రవారం అనూహ్యంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ అందజేసిన నేపథ్యంలో ఉత్తమ్, షబ్బీర్‌లు స్వామిగౌడ్‌ను కలిశారు. పార్టీ మారిన కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రతిపాదనను ఆమోదించవద్దని స్వయంగా చేతిరాతతో కూడిన లేఖను అందజేశారు. రాష్ట్ర శాఖలకు విలీన అధికారం లేదు... ‘నలుగురు సభ్యులు టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. నిజానికి ఈ నెల 20న ఎలాంటి సీఎల్పీ సమావేశం జరగలేదు. వారిచ్చిన లేఖను తిరస్కరించాలి. ఎంఎస్ ప్రభాకర్‌పై రెండేళ్ల నుంచి, దామోదర్‌రెడ్డిపై ఏడాది నుంచి అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలు విలీనం చేయాలని పిటిషన్ పెట్టారు. ‘తెలం గాణలో ప్రజా స్వామ్యాన్ని రక్షించాలని మేం కోరుతున్నాం. వారిచ్చిన లేఖను తిరస్కరించాలని విన్నవిస్తున్నాం. దీంతోపాటే ఆ నలుగురు ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం’ అని లేఖలో ఉత్తమ్, షబ్బీర్ పేర్కొన్నారు. దీంతోపాటు సమర్పించిన మరోలేఖలో భారత రాజ్యాంగం, గతంలో వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించారు. ‘స్పీకర్ పార్టీలను విలీనం చేయకూడదని భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఇత ర పార్టీలో విలీనం చేసే అధికారాలు భారత జాతీయ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం రాష్ట్ర పార్టీ శాఖలకు లేవు. ఒక జాతీయ పార్టీ ఎప్పటికీ ప్రాంతీయ పార్టీ లో విలీనం కాలేదు. విలీన వినతిని తోసిపుచ్చాల్సిం దే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పేరా 4 ప్రకారం స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించకూడదు. మిగిలి న పేరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం ఉత్తమ్, షబ్బీర్ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయికి తీసుకెళతాం: షబ్బీర్ అలీ పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తామిచ్చిన లేఖలపై నిర్ణయం చేయకుండా, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ కోరగానే చైర్మన్ వెంటనే స్పందించారని షబ్బీర్ అలీ అన్నారు. పార్టీ ఫిరాయించినవారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని ప్రశ్నిం చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. సరిగా స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తామన్నారు. మరో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇదొక విచిత్రమైన పరిస్థితి అని, విలీన అంశం నైతికమా? అనైతికమా? అనే దానిని నాయకులే చెప్పాలన్నారు. ఆ లేఖ వెనుక ఎవరున్నారో గమనించాలి: ఉత్తమ్ శాసనమండలిలోని కాంగ్రెస్ఎల్పీని టీఆర్ఎస్లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు సభ్యులు లేఖ ఇవ్వడం తెలంగాణ సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎలాంటి సీఎల్పీ భేటీ కాకుండా, అసలు కాంగ్రెస్‌లో లేనివాళ్లు విలీనలేఖను ఎలా ఇస్తారని ప్రశ్నిం చారు. నలుగురు ఎమ్మెల్సీలు సమర్పించిన లేఖ వెనుక ఎవరున్నారో తెలం గాణ సమాజం గమనించాలన్నారు. ఆకుల లలిత, సంతోష్‌కు సీఎల్పీ మీటింగ్ పెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. చైర్మన్ న్యాయబద్ధంగా వ్యవహరించి మండలి ప్రతిష్టను కాపాడాలని కోరారు. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తమను టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ప్రభాకర్, దామోదర్‌రెడ్డిల వినతికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ సానుకూలంగా స్పందించి వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ బులిటెన్ జారీ చేసిన అంశంపై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలసి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతోందో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలనే భావనలో ఉంది. దీనిపై శనివారం పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీయై చర్చిస్తారని, అనం తరం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
ఆశించి.. భంగపడ్డారు!
అనుకున్నామని జరగవు అన్నీ..అనుకోలేదని ఆగవు కొన్ని..జరిగినవన్ని మంచికని అనుకోవడమే మనిషి పని..అన్నారు మనసు కవి.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల వారసులు ఇలాగే సర్దిచెప్పుకుంటున్నారు. వీరి రంగప్రవేశానికి కాంగ్రెస్ అధిష్టానం ఎర్రజెండా చూపింది. ఒక్కరికి మినహాయించి మిగిలిన నేతల సంతానానికి ఇప్పుడు అవకాశమివ్వలేమని తేల్చిచెప్పడంతో వారు ఎన్నికల బరికి దూరమయ్యారు. కుటుంబానికి ఒకే టికెట్ అన్న విధానాన్ని ముందుపెట్టి..కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు నిరాకరించిన దరిమిలా మరో దఫా చూద్దామని సర్దిచెప్పుకుని తల్లిదండ్రుల ప్రచారంలో వారు చురుగ్గా పాల్గొంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ కార్తీక్.. వచ్చేసారే.. ఈ జాబితాలో అందరి కంటే ముందుగా నిరాశకు గురైంది. కాంగ్రెస్ యువనేత కార్తీక్ రెడ్డి. గతంలో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన.. ఆయన ఈసారి రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. దానిని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆయన తల్లి, మాజీ మంత్రి సబితారెడ్డికి మహేశ్వరం టికెట్ కేటాయించిన అధిష్టానం కార్తీక్‌కు టికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. జానా కుమారుడికీ రిక్తహస్తమే.. ఇక అంతా ఆసక్తిగా ఎదురుచూసిన మిర్యాలగూడ టికెట్ జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డికి దక్కలేదు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో రఘువీర్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నా.. అధిష్టానం మాత్రం కరుణించలేదు. ఆయన తండ్రి జానారెడ్డి టికెట్ కోసం రంగంలోకి దిగి పార్టీ అధ్యక్షుడు రాహుల్వద్ద చర్చలు జరిపారు. ఒకదశలో రాహుల్ నుంచి రఘువీర్‌కు పిలుపురావడంతో టికెట్ వస్తుందని ఆశించినా భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో ఆయన తలమునకలయ్యారు. అరుణ కుమార్తెకూ నో.. ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని పోటీకి దింపాలని డీకే అరుణ గట్టి ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ వేదికగాను, అధిష్టాన పెద్దలతో పలు దఫాలు చర్చలు జరిపారు. తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మక్తల్ నుంచి టికెట్‌ను ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కుటుంబానికి రెండు ఇవ్వమని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం ఆ స్థానాన్ని సైతం టీడీపీకే కేటాయించింది. దీంతో చేసేదిలేక స్నిగ్ధారెడ్డి తన తల్లికి మద్దతుగా గద్వాల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సుస్మితకూ.. అదే పరిస్థితి.. కూతురు కోసమే పార్టీ మారిన కొండా సురేఖకు భంగపాటు తప్పలేదు. తన తనయ సుస్మితాపటేల్‌ను భూపాలపల్లి నుంచి పోటీలోకి దించేందుకు టీఆర్ఎస్ నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. కుటుంబానికి ఒకే టికెట్ అన్న కాంగ్రెస్ నిబంధన ఆమెకు నిరాశే మిగిల్చింది. షబ్బీర్ పుత్రుడికీ.. అబ్బే అనేశారు మాజీమంత్రి షబ్బీర్ అలీ తన కుమారుడు ఇలియాస్‌ను బరిలోకి దించాలని గత ఎన్నికల నుంచి యోచిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇలియాస్‌ను గత ఎన్నికల్లోనే కామారెడ్డి నుంచి పోటీలో నిలిపేందుకు ప్రయత్నించినా.. చివరి నిమిషంలో ఎడ్ల రాజిరెడ్డికి అవకాశం దక్కింది. -
కాంగ్రెస్‌లో నంబర్ టు రేస్
-
రాహుల్ తలచుకుంటే షబ్బీర్ అలీనే సీఎం..!
సాక్షి, కామారెడ్డి : రాహుల్ గాంధీ తలచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం షబ్బీర్ అలీనే అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కునూర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్లొన్న రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతున్నా షబ్బీర్ అలీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ అసలు కామారెడ్డిలో ఒక్కసారైన కనిపించారా అని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రజలకు షభ్బీర్ అలీ ముత్యం లాంటి వ్యక్తి అని ఆయనే రేపు కాబోయే ఉప ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తలుచుకుంటే ఆయనే సీఎం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రశ్నించిన వారిపై కేసీఆర్ అక్రమంగా కేసుల పెడుతున్నారని.. వాటికివ్వరు బయపడేది లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పెదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి ఒక్క పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టడానికి తాను రోడ్ షోలు చేస్తున్నట్లు రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులిస్తే తీసుకోండని.. అవి మీ డబ్బులే కాబట్టి తీసుకుని ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టండని పిలుపునిచ్చారు. అక్రమ ఫైల్స్ దొరికాయని నాపై దాడులు చేశారు.. చివరికి కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని మండిపడ్డారు. -
రాహుల్‌గాంధీ భేటీల్లో గందరగోళం
-
విభజన చట్టం అమల్లో కేసీఆర్ విఫలం
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం–2014 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ గురువారం ఆరోపించారు. గత ప్రభుత్వం విభజన హామీలను అమలు చేస్తామంటే ఈ ప్రభుత్వం కాదనడం ఏంటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లిన తర్వాత అమలు సాధ్యంకాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తుంటే కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూర్చుని అదే ప్రపంచం అనుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. సీఎం శుక్రవారం ప్రధాని మోదీని కలుస్తున్న నేపథ్యంలో విభజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మోదీని అడగాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్లను మోదీతో ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఒక్క శాతం కూడా అమలు చేయనందునే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మోదీతో కేసీఆర్‌కు ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆచితూచి అడుగేసి..
సాక్షిప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నియామకంపై ఆ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగేసింది. డీసీసీ అధ్యక్షునిగా తాహెర్‌బిన్ హందాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం నిజామాబాద్ జిల్లా పార్టీ పగ్గాలను తాహెర్కే అప్పగించింది. ఈ పదవి విషయంలో జిల్లాలోని పార్టీ అగ్రనేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా తర్జనభర్జన కొనసాగింది. మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులుగా తాహెర్‌ను కొనసాగించాలని పట్టుబట్టగా., శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. జిల్లా విభజన నేపథ్యంలో ఈ పదవిని కామారెడ్డి జిల్లాకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి మార చంద్రమోహన్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో డీసీసీ అధ్యక్షునిగా దశాబ్ద కాలం పాటు పనిచేసిన గడుగు గంగాధర్ కూడా తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్ ద్వారా నరాల రత్నాకర్ ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. తాహెర్ స్థానంలో మరొకరిని నియమిస్తే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని బోధన్‌కు చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాషా కోరినట్లు తెలిసింది. బాల్కొండ నియోజకవర్గం నుంచి మానాల మోహన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌధాగర్ గంగారాం, మాచారెడ్డికి చెందిన నర్సింగ్‌రావు కూడా ఈ పదవిని ఆశించారు. ఇలా ఈ పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడగా ఎవరికి వారే ఈ పదవి కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. గ్రూపుల నేపథ్యంలో.. ఆధిపత్యపోరు, గ్రూపు తగాదాలకు నిలయంగా మారిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి విషయంలో ఏడాది కాలంగా ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎంతో కీలకమైన ఈ పదవిలో తన అనుచరుణ్ణి నియమించుకునేందుకు పార్టీ జిల్లా అగ్రనేతలు ఎవరికి వారే పావులు కదిపారు. ఈ మేరకు టీపీసీసీ ముఖ్యనాయకత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ పరిస్థితుల్లో తాహెర్‌ను మార్చి.. కొత్త వారికి అవకాశం ఇస్తే అనవసరమైన తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో అధిష్టానం తాహెర్‌ను కొనసాగించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీనికి తోడు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తాహెర్ స్థానంలో మరో మైనారిటీ నేతను నియమించాల్సి ఉంటుంది. ఈ సమీకరణలు కుదరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి తోడు ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్ష స్థానాన్ని మార్చడం అంత మంచిది కాదని భావించిన అధిష్టానం అధిష్టానం తాహెర్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాగానే.. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి జిల్లాగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొత్త జిల్లాల వారీగా కాకుండా, ఉమ్మడి జిల్లాగానే డీసీసీని ఏర్పాటు చేసింది. డీసీసీ అధ్యక్షుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉండటంతో ఉన్నఫలంగా ఈ జాబితాను ప్రకటించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త జిల్లాలకు అధ్యక్షులను ఇంకా నియమించలేదు. -
మోదీ,ఇవాంకా కోసమైనా బాగు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘గతంలో ఇంటి నుంచి అరగంటలో అసెంబ్లీకి వచ్చే వాళ్లం. ఇప్పుడు గం టకుపైగా పడుతోంది. హైదరాబాద్‌లో రోడ్లు అంతగా దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారికోసం కాకున్నా, త్వరలో నగరానికి రానున్న ట్రంప్ కూతురు, ప్రధాని మోదీ కోసమన్నా బాగుచేయించండి’అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోమ వారం మండలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. రోడ్ల నిర్వహణలో ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, 50 ఏళ్ల పాలనలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిగా నిర్వహించలేని కాంగ్రె స్ నేతలు చెబితే నేర్చుకునే పరిస్థితిలో తాము లేమన్నారు. ‘‘నగరంలో రోడ్లను భారీ వ్యయం తో బాగు చేస్తున్నాం. మూసీ, రోడ్ల అభివృద్ధికి రూ.వేయి కోట్లకుపైగా కేటాయించాం. స్ట్రాటజి క్ రోడ్ డెవలప్మెంట్ కింద ఇప్పటికే రూ. 1894 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మ రో రూ.975 కోట్ల పనులు చేపట్టనున్నాం’’అని వివరించారు. తాను బదులిస్తుండగా కాంగ్రెస్ నేతలు ఏదో అనడంతో, ‘రన్నింగ్ కామెంటరీకి ఇదేమన్నా క్రికెట్ మ్యాచా?’అంటూ కేటీఆర్ అసహనం వెలిబుచ్చారు. -
నిధుల్లేక నీరసిస్తున్న స్థానిక సంస్థలు
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేక స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు పెట్టారు. దీంతో తాము స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి సడక్ యోజన అమలు, ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పనులకు సంబంధించి సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.1,318 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.601 కోట్లే విడుదల చేశారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిధుల్లేక గ్రామ పంచాయతీలు బలహీనపడిపోతున్నాయని టీఆర్ఎస్ సభ్యుడు భూపాల్‌రెడ్డి చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాలుగు జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్లొస్తే వాస్తవం తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. సర్పంచులు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వాపోయారు. 14వ ఆర్థిక సంఘంలో మార్పుల వల్ల నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులు పోతున్నాయని, దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు రావట్లేదని టీఆర్ఎస్ సభ్యుడు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇస్తున్నట్లే జిల్లా పరిషత్‌లకు రూ.100 కోట్ల చొప్పున కేటాయించాలని టీఆర్ఎస్ సభ్యుడు భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, పాత చట్టాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి త్వరలోనే సమగ్ర పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 2015–17 కాలంలో స్థానిక సంస్థలకు రూ.1,146.94 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకే వెళ్తున్నాయని, మండల, జిల్లా పరిషత్‌లకు రావట్లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ రహదారులు ఘోరంగా ఉన్నాయని షబ్బీర్ అలీ విమర్శించగా.. మంత్రి జూపల్లి బదులిస్తూ 20–30 ఏళ్లలో చేసిన దానికంటే ఒక్క ఏడాదిలోనే వేల కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇతర మంత్రులు జోక్యం చేసుకోవడంతో షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘సంబంధిత మంత్రికి జవాబు ఇవ్వడం రాదా? లేదా ఆయన శాఖ ఏమైనా మారిందా?’అంటూ విరుచుకుపడ్డారు. పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలి.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) స్థానంలో పాత పద్ధతిని పునరుద్ధరించాలని టీఆర్ఎస్ సభ్యుడు జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల అభద్రతా భావంతో బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో తినుబండారాల ధరలు 6 నుంచి 10 రెట్లు అదనంగా ఉంటున్నాయని, వీటిని కట్టడి చేయాలని సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. చౌక దుకాణాల్లో బియ్యం తప్ప వేరే ఇవ్వడం లేదని, దీంతో వేలాది మంది డీలర్లకు కనీస కమీషన్లు కూడా రావట్లేదని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, గ్రూప్–1 ఫలితాలను నిలుపుదల చేయడంపై వాయి దా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని షబ్బీర్‌అలీ కోరగా.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ తిరస్కరించారు. ఉస్మానియా భూముల లీజుకు రూపాయా?: ప్రభాకర్‌రావు ఉస్మానియా వర్సిటీలో కొన్ని భూములను ఏడాదికి ఎకరం రూపాయికే లీజుకు ఇవ్వడంపై ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. కొందరికి ఎకరానికి రూపాయి, ఇంకొందరికి రూ.40, మరికొందరికి రూ.50 లక్షలకు లీజుకు ఇచ్చారని, వ్యత్యాసమెందుకు ఉందన్నారు. 24 ప్రభుత్వ, తదితర సంస్థలకు 187.5 ఎకరాలు లీజుకు ఇచ్చామని కడియం శ్రీహరి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 4 సంస్థలు లీజుకు అడగగా, వాటికి లీజు రేట్లను పెంచే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో పెట్రోల్ బంకుల టాయిలెట్లు పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని మంత్రి కె.తారకరామారావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ల పరిస్థితిపై పలువురు అడిగిన ప్రశ్నలపై మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లు ప్రజలకు ఉపయోగపడేలా వాటి యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో 1,152 మంది అనాథ పిల్లలున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. అందులో 37 మందికి బీసీ–ఎ సర్టిఫికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు. సరైన స్థలంలోనే కలెక్టరేట్ల నిర్మాణం: తుమ్మల ప్రజామోదం లేకుండా ఎక్కడా కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలిలో హామీ ఇచ్చారు. నిజామాబాద్ కలెక్టరేట్ కోసం అనువైన ప్రదేశం ఎంపిక చేయలేదని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కలెక్టరేట్ల స్థలాల మంజూరుపై బాలసాని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మార్పుపై పొంగులేటì ప్రశ్నించారు. నిర్మల్‌లో కొండ మీద స్థలంపై విమర్శలు రావడంతో శంకుస్థాపన చేయలేదని తుమ్మల పేర్కొన్నారు. -
సంక్షేమ ఖర్చుపై శ్వేతపత్రం ఇవ్వాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు తప్ప ఆచరణలో ఏమీలేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలు, కేటాయింపులు, ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఏదో చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో వాగ్దానం చేస్తున్నారని చెప్పారు. ఎంబీసీలకు రూ. 1,000 కోట్లు అని చెప్పారని, ఇప్పటిదాకా ఎంబీసీ కులాలకోసం ఎంత ఖర్చుచేశారో చెప్పాలన్నారు. బీసీలకు బడ్జెట్లో కేటాయించిన 5వేల కోట్లలో ఇప్పటిదాకా ఖర్చు చేసిందేమీ లేదని షబ్బీర్ అలీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు కూడా నెలకు 5వేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో కంచ ఐలయ్య దూషిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. వైశ్య సోదరులు సంయమనంగా వ్యవహరించాలని షబ్బీర్ కోరారు. -
గూండాల్లా టీఆర్ఎస్ నేతల దాడులు: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా కామారెడ్డిలో యాత్రను నిర్వహిస్తున్న తెలంగాణ జేఏసీ నేతలపై టీఆర్ఎస్ నేతలు గూండాల్లాగా దాడులకు దిగారని మండలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు రవి, అనీల్‌కుమార్ యాదవ్‌లతో కలసి గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. కామా రెడ్డిలో దాడులకు దిగిన టీఆర్ఎస్ నేతలపై రౌడీషీట్లు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు కీలక అనుచరులుగా ఉన్నవారే జేఏసీ చైర్మన్ కోదండరాం యాత్రలో విద్యార్థులు, ఉద్యమకారులపై దాడులకు దిగా రని షబ్బీర్ అలీ ఆరోపించారు. టీఆర్ఎస్లో ఇప్పుడంతా తెలంగాణ ద్రోహులే ఉన్నారని, అçప్పుడు తెలంగాణ వాదులపై దాడులకు పాల్పడినవారే ఇప్పుడు ఉద్యమకా రులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమస్యలపై పోరాడుతున్న కోదండరాంను పోలీసు స్టేషన్లన్నీ తిప్పుతున్నారన్నారు. -
హిమాన్షు మోటార్స్‌పై కేటీఆర్ అబద్ధాలు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: హిమాన్షు మోటార్స్ మంత్రి కేటీఆర్‌దేనని, అయినా సిగ్గూ శరం లేకుండా అబద్ధాలు చెబుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హిమాన్షు మోటార్స్‌లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని, 2014 ఎన్నికల అఫిడవిట్లో ఈ విషయాన్ని కేటీఆర్ వెల్లడించారని వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే హిమాన్షు మోటార్స్ నుంచి వైదొలగినట్టుగా మంత్రి కేటీఆర్ సిగ్గు, శరం విడిచిపెట్టి పచ్చి అబద్ధాలు చెప్పారని షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ రోజుకు కూడా కేటీఆర్ దానికి డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. అబద్ధాలు మాట్లాడిన కేటీఆర్‌కు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. హిమాన్షు మోటార్స్ నుంచి 300 ఇన్నోవాల కొనుగోళ్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. -
కేటీరావు.. పెద్ద గాలిరావు
త్యాగాల కుటుంబంతో మీకు పోలికా?: షబ్బీర్ అలీ సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తనపేరును గాలి రావుగా మార్చుకుంటే బాగుంటుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నోరు తెరిస్తే అబద్ధాలు, మాయమాటలు, మోసాలు, గాలిమాటలు తప్ప నిజాలు, త్యాగాలు కేసీఆర్ కుటుంబానికి తెలియవని ధ్వజమె త్తారు. అలాంటి కేసీఆర్ కుటుంబాన్ని దేశంకోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంతో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి, పార్టీకి మెజారిటీ రాగానే సీఎం కుర్చీలో కేసీఆర్ కూర్చున్నారని దుయ్యబట్టారు. పార్టీకి అధికారం వచ్చినా ప్రధాని పదవిని త్యాగం చేసిన చరిత్ర సోనియాగాంధీదన్నారు. అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్‌గాంధీతో కేటీఆర్‌కు పోలికా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ వాస్తవాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. -
కేటీఆర్.. అహంకారం మంచిది కాదు
పాతాళానికి ఎవరుపోతారో చూద్దాం: జానా, షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కాలని కుసంస్కారంతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, ఉపనేత టి.జీవన్‌రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. కుసంస్కారం కలిగినవారు మంత్రులైనా, మరెవరైనా ఒక్కటేనని జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గురించి నోటికొచ్చి నట్టుగా మాట్లాడిన ఎన్నో పార్టీలు పాతాళానికి వెళ్లడం కాంగ్రెస్ పార్టీ చూసింద న్నారు. కాంగ్రెస్ పార్టీని తిడితే ఆకాశంపై ఉమ్మివేసినట్టేనని షబ్బీర్ అలీ అన్నారు. అహంకారం తలకెక్కిన మంత్రి కేటీఆర్‌ను రాళ్లతోకొట్టే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌కు రోజులు దగ్గరప డుతు న్నాయని హెచ్చరించారు. ఎవరు పాతాళానికి వెళ్తారో చూద్దామని సవాల్ చేశారు. తప్పుడు కేసులతో తలవంపులు తేవద్దు: రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులుపెట్టి పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం తలవం పులు తెస్తోందని జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నేతను హత్య చేసినవారు స్వయంగా లొంగిపోయారని, అయినా కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిపై కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. హతునితో రాజకీయ వైరాన్ని సాకుగా చూపించి, కేసును బనాయించడం రాజకీయాల్లో మంచిదికాదని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని జానారెడ్డి, షబ్బీర్‌అలీ హెచ్చరించారు. -
భూస్కాంలో కాంగ్రెస్ నేతలెవరో తేల్చాలి
హరీశ్‌కు షబ్బీర్ సవాల్ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూములతో పాటు కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారో తేల్చాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ సవాల్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భూకుంభకోణంలో కాంగ్రెస్ నేతల హస్తముందని హరీశ్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, కుంభకోణంలో కాంగ్రెస్‌తోపాటు ఏ పార్టీ నేతలున్నా పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతీదానికి కాంగ్రెస్‌ను నిందించడం టీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు అలవాటైందని మండిపడ్డారు. మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సీబీఐ విచారణ చేస్తే అన్ని ఆధారాలను అందిస్తామని తెలిపారు. భూముల పరిరక్షణ కోసం, నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి సెక్షన్లు మార్చితే సరిపోదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చట్టాన్ని పెట్టాలని సూచించారు. కేటీఆర్ అధికార అహంకారంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. -
ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్
-
ఇది భూకబ్జాల ప్రభుత్వం: షబ్బీర్
తాండూరు టౌన్: టీఆర్ఎస్ సర్కార్ కబ్జా ల ప్రభుత్వంగా మారిం దని శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూ రులో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. రూ.15వేల కోట్ల భూము లు అన్యాక్రాంతమైనా ఒక్క గజం కూడా కబ్జా కాలేదని చెబుతున్న కేసీఆర్ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. అధికారులను బదిలీ చేసినంత మాత్రాన చేసిన తప్పులు మాసిపోవన్నా రు. కేసు దర్యాప్తులో ఉండగా నిబంధ నలకు విరుద్ధంగా కేసీఆర్ వివరణ ఇవ్వ డాన్ని బట్టి చూస్తే స్కాం లోతు ఎంత ఉందో అర్థమ వుతోందన్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్నారు. ఆ భూము లను స్వాధీన పరుచుకుని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేలా చూడాలని గవర్నర్‌కు కోరామన్నారు. -
సీఎంకు ఎందుకు భయం?