Sivakartikeyan
-
కమల్ హాసన్ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్’ డైరెక్టర్
‘అమరన్’ విడుదలకు ముందు కమల్ హాసన్ గారికి సినిమా మొత్తం చూపించాను. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను’అన్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ అమరన్ చిత్రానికి అన్ని చోట్ల హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. →ఈ చిత్రానికి కమల్ హాసన్ చాలా సపోర్ట్ చేశారు.నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.→ ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.→ అయితే ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయను తీసుకోవాలని మొదట్లో అనుకోలేదు. ఓసారి ఆయనకు కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.→ ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.→ యాక్షన్స్ సీక్వెన్స్‌లు చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.→ ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.→ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను. -
'అమరన్' కలెక్షన్స్.. శివ కార్తికేయన్ కెరీర్లో అరుదైన రికార్డ్
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం 'అమరన్'. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ కెరిర్లో ఒక మైల్స్టోన్ లాంటి సినిమాగా అమరన్ నిలిచిపోనుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు.వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటిరోజే రూ. 35 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, మూడురోజులకు ప్రపంచవ్యాప్తంగా అమరన్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరింది. కేవలం తమిళనాడులోనే రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన అమరన్.. శివ కార్తికేయన్ కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ కెక్కింది. ఆయన నటించిన గత సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు డాక్టర్ (25 రోజులు), డాన్ (12రోజులు) పట్టింది. అయితే, ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమరన్ చిత్రాన్ని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు రజనీకాంత్ కూడా చూశారు. సినిమా బాగుందంటూ వారు ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించిన కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తమిళనాడులోని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మేజర్ 'ముకుంద్ వరద రాజన్' జీవిత కథతో ఈ సినిమాను రూపొందించారు. 2014లో జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ ఆయన అసువులు బాసిన వీరుడిగా నిలిచారు. ఆయన పాత్రలో శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయి పల్లవి మెప్పించారు. -
స్టార్ హీరోతో 'జాతి రత్నాలు' డైరెక్టర్ సినిమా..
Sivakarthikeyan Anudeep KV Movie SK20 In Telugu And Tamil: శివ కార్తికేయన్ హీరోగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ‘ఎస్కె 20’ వర్కింగ్ టైటిల్‌తో తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ ‘ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అని సురేష్ బాబు తెలిపారు. మరియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సహనిర్మాతగా అరుణ్ విశ్వ వ్యవహరిస్తున్నారు. చదవండి: రూ. 44 లక్షల మోసం.. యూట్యూబర్ అరెస్ట్.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ❤️❤️❤️👍#SK20FromAugust31 https://t.co/aa13VqnZct — Sivakarthikeyan (@Siva_Kartikeyan) May 30, 2022 -
నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్. అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు. -
సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్
‘‘థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, చప్పట్లే నాకు ప్రేరణ.. రెండేళ్లుగా వాటిని మిస్ అవుతున్నా. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో మీ చప్పట్లు, ఈలలు వింటుంటే సంతోషంగా ఉంది. సినిమాకు ఎల్లలు లేవు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. కోటపాడి జే రాజేష్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ‘‘మా సినిమాలో చాలా వినోదం ఉంది’’ అన్నారు నెల్సన్ దిలీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో యాక్షన్, థ్రిల్, కామెడీ, మంచి కథ, కథనం ఉన్నాయి’’ అన్నారు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి. ‘‘ఈ చిత్రంలో నటించడం గర్వంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా అరుల్ మోహన్. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సంగీతం: అనిరుధ్. -
‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. ఆయనకు జంటగా అనుఇమ్మాన్యువేల్ నటించింది. ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో నటించిన చిత్రం ఇది. ఇకపోతే ఇందులో మరో నటి ఐశ్వర్యరాజేశ్ శివకార్తికేయన్‌కు చెల్లెలిగా ముఖ్య పాత్రలో నటించింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన మరో గ్రామీణ కథా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు నట్టి, ఆర్కే.సురేశ్, సూరి, యోగిబాబు, వేలరామమూర్తి, నాడోడిగళ్ గోపాల్, సుబ్బుపంజు, అర్చన, షీలా, సంతానలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ పొందింది. కాగా నమ్మవీట్టుపిళ్లై చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈ చిత్రంపై నటుడు శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన చిత్రాలు వరుసగా నిరాశపరచడమే ఇందుకు కారణం. అదీ కాకుండా శివకార్తికేయన్ తొలి రోజుల్లో పాండిరాజ్ దర్శకత్వంలో మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రాల్లో నటించారు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా నటించిన నమ్మవీట్టుపిళ్లై వీరి కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. -
శివకార్తికేయన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్
అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. దీంతో పాటు చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఆ పేరే నమ్మ వీట్టు పిళ్లై. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం తరువాత శివకార్తీకేయన్ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. నటి అనుఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుండగా, శివకార్తికేయన్‌కు చెల్లెలుగా ఐశ్వర్యరాజేశ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెకు జంటగా నట్టి నటిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతాన్ని, నిరవ్‌షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గ్రామీణ పాత్రలో మాస్ గెటప్‌లో కనిపించాడు. ఇక రెండో పోస్టర్లో దర్శకుడు పాండిరాజ్ మార్క్ కనిపించేలా చిత్రంలోని పాత్రలన్నింటిని పొందుపరిచి ఒక కుటుంబంలా కనిపించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా కార్తీ హీరోగా కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మ వీట్టు పిళ్లై. చిత్రంపై శివకార్తికేయన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తదుపరి శివకార్తికేయన్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇరుంబుతిరై చిత్రం ఫేం పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు. దీన్ని లైకా సంస్థ నిర్మించనుంది. వీటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
ఇదో మరపురాని అనుభూతి!
తన జీవితంలో మరపురాని, మధురమైన అనుభూతి ఇది అంటున్నారు నటుడు శివకార్తికేయన్. ఒక బుల్లితెర యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభి, రాణించిన ఈయన అందులోనే ఆనందాన్ని వెతుక్కోకుండా, నటుడిగా అవతారమెత్తి చాలా వేగంగా టాప్ హీరోగా ఎదిగిపోయారు. ఈయన నటించిన తాజా చిత్రం సీమరాజా మిశ్రమ స్పందనను పొందినా, ప్రస్తుతం స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార నాయకిగా నటిస్తోంది. కాగా శివకార్తికేయన్ నిర్మాతగా మారి కణా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్యరాజేశ్, సత్యరాజ్, దర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజ్ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీకి దిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కణా చిత్ర ఆడియో ఇటీవల విడుదలై సంగీతప్రియుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా ఈ ఆల్బంలోని వాయాడి పెత్త పుళ్ల అనే పాటను యూట్యూబ్‌లో 50 మిలియన్ల మంది చూశారట. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శివకార్తికేయన్ తన ఐదేళ్ల కూతురు ఆరాధనతో కలిసి పాడడం. దీంతో పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్న శివకార్తికేయన్ తన ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని సమయల్లో మనం ఊహించన సంఘటనలు జరిగి సంతోషంలో ముంచేస్తాయన్నారు. అలాంటి సంతోషాన్నే సంగీత ప్రేమికులు తమ చిత్రంలోని వాయాడి పెత్త పుళ్ల పాటకు అందించారన్నారు. తండ్రి, కూతుళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించే పాటగా ఇంది ఉంటుందన్నారు. ఇది సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, గీత రచయిత జీకేపీల సమష్టి కృషికి దక్కిన విజయంగా పేర్కొన్నారు. తన కూతురు ఆరాధనకు తనకు మధ్య ప్రేమానుబంధాన్ని కాలమంతా గుర్తుండిపోయి, మధురానుభూతిని కలిగించేలా చేసే ఈ పాటను అందించిన వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాన్నారు. ఆరాధన తీయని గొంతు ఈ పాట ఇంత మధురంగా రావడానికి కారణం అన్నారు. అన్నిటికీ మించి తనను, తన కూతురిని ఈ పాట పాడించాలన్న ఆలోచనను తీసుకొచ్చిన దర్శకుడు అరుణరాజు కామరాజ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. కణా చిత్ర నిర్మణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శివకార్తికేయన్ తెలిపారు. ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని, రైతుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. అథ్లెట్స్ క్రీడల్లో రాణించాలన్న కూతురు కలను నెరవేర్చడానికి తండ్రి ఏం చేశారన్నది ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానంటున్నారు వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాష్‌రాజ్, స్నేహ, ఆర్.జె.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్.డి.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. ‘నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది.. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం.. ఈ కారణంగా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు.. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను.. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్.. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది.. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను.. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు.. అందుకు నటనలో ఆమె అంకితభావమే కారణం.. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను.. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు.. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం.. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా అని అడుగుతున్నారు.. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు.. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం.. చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్.. నిర్మాత ఆర్.డి.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు.. కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది.. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను.. అని చెప్పారు. -
శివకార్తికేయన్ ప్లేస్‌కు విజయ్‌సేతుపతి
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుల్లో శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిని పేర్కొనవచ్చు. శివకార్తికేయన్ రజనీమురుగన్, రెమో వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. ఇందులో ఆయనతో తొలిసారిగా నటి నయనతార నటిస్తున్నారు. ఫాహద్ఫాజాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. రెమో చిత్రం తరువాత 24ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న చిత్రం వేలైక్కారన్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సెప్టెంబరు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాక పోవడంతో చిత్ర విడుదలను డిసెంబరు నెలాఖరుకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మరో సక్సెస్ఫుల్ నటుడు విజయ్‌సేతుపతి, విక్రమ్‌వేదా, పురియాదపుధీర్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం కరుప్పన్. ఇందులో నటి తాన్యా నాయకిగా నటిస్తోంది. బాబీసింహా విలన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శివకార్తికేయన్ చిత్రం వేలైక్కారన్ విడుదల కావలసిన సెప్టెంబరు 29వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
సమంత తొలిసారిగా..
శివకార్తికేయన్, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి శుక్రవారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్న శివకార్తికేయన్ ఆ చిత్ర షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు. ఆ చిత్ర నిర్మాత ఆర్డీ.రాజానే తాజా చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. ఇంతకుముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిబర్ సంఘం, రజనీమురుగన్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పొన్రామ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఇందులో తొలిసారిగా నటి సమంత శివకార్తికేయన్‌తో జత కట్టనున్నారు. మరో కీలక పాత్రలో సిమ్రాన్ నటించనుండడం విశేషం. ఆమె అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతుండడంతో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సమంత కోరిక మేరకు నేటి నుంచి తొలి షెడ్యూల్‌ను 30 రోజులపాటు ఏకధాటిగా నిర్వహించనున్నారట. చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే మూడు పాటలను రెడీ చేశారట. దీనికి బాలసుబ్రమణియన్ ఛాయాగ్రహణం నెరుపుతున్నారు. -
శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు రెడీ
చెన్నై చిన్నది సమంత శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరో పక్కపెళ్లి కార్యక్రమాలతో యమ బిజీగా ఉన్నారు నటి సమంత. ఈ బ్యూటీ టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి నాగచైతన్య అక్టోబర్ 6 అంటూ ముహూర్తం కూడా వెల్ల డించేశారు. కాగా ఇటీవల విజయ్‌కు జంటగా ఆయన 61వ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్న సమంత మరో పక్క తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో నటిస్తున్నారు. తాజాగా శివకార్తికేయన్‌తో మరో తమిళ చిత్రం చేసేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును వారి తొలి కాంబినేషన్లో చిత్రం ఈ నెల 16న ప్రారంభం కానుందన్న తాజా సమాచారం. వరుస విజయాలతో జోరు మీదున్న శివకార్తికేయన్ ప్రస్తుతం వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం మరో పది రోజుల ప్యాచ్‌వర్క్‌తో పూర్తి అవుతుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అంతకుముందు పొన్రాం దర్శకత్వంలో నటించనున్నారు. ఇంతకు ముందు శివకార్తికేయన్‌తో వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన పొన్రాం మూడోసారి ఆయనతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అదే విధంగా రెమో, వేలైక్కారన్ చిత్రాలను నిర్మించిన ఆర్డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నారు. డి.ఇమాన్ ఇప్పటికే పాటలకు బాణీలు కట్టే పనిలో బిజీగా ఉన్నారట. సమంత పెళ్లికి ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారట. -
నయనతో వేలక్కారన్ ఏం చేస్తున్నారు?
నయనతారతో వేలక్కారన్ ఏం చేస్తున్నారన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి శివకార్తికేయన్ అభిమానుల్లో చాలానే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర వ్యాఖ్య స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు శివకార్తికేయన్. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం నుంచి నటుడిగా ఈయన దిన దిన ప్రవర్థమానం అన్నట్లు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఆ మధ్య నటించిన రెమో చిత్రం శివకార్తికేయన్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది. తాజాగా టాప్ కథానాయకి నయనతారతో యుగళగీతాలు పాడుతున్నారు. గతంలో రజనీకాంత్ నటించిన హిట్ చిత్రం వేలైక్కారన్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకుడు. 24 ఏఎం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటి స్నేహ, ప్రకాశ్‌రాజ్, ఆర్జే.బాలాజీ, తంబిరామయ్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందట. ప్రస్తుతం చెన్నైలోని ఒక స్టూడియోలో వేసిన బ్రహ్మాండమైన సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న వేలైక్కారన్ చిత్ర యూనిట్ తదుపరి 35 రోజులు పాటు మలేషియాలో మకాం పెట్టనున్నారట. సమాజంలోని ముఖ్యమైన సమస్యను ఆవిష్కరించే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు, చిత్రాన్ని వినాయక చతుర్థసి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. -
నేనంటే శివకు బోర్ కొట్టింది
చెన్నై: నాతో నటించి నటుడు శివకార్తికేయన్‌కు బోర్ కొట్టిందని నవ్వుల విరిబోణి కీర్తీసురేశ్ అంటున్నారు. లక్కీ హీరోయిన్లలో మొదటి స్థానంలో నిలిచిన నటి ఈ కేరళాకుట్టి అని చెప్పవచ్చు. నాల్గవ చిత్రంతోనే ఇళయదళపతితో యుగళగీతాలు పాడే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన రజనీమురుగన్, రెమో చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ధనుష్ సరసన నటించిన తొడరి చిత్రంలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీసురేశ్.. విజయ్‌తో నటించిన భైరవా చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిరునవ్వుల చిన్నదానితో చిన్న భేటీ. ప్ర: ఈ పొంగల్ మీకు చాలా స్పెషల్ అనుకుంటా? జ: కచ్చితంగా స్పెషలే. ఈ పండగను భైరవా పొంగల్ అనే అనవచ్చు. ఏడాది ఆరంభంలోనే నా భారీ చిత్రం తెరపైకి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్ర: విజయ్‌తో నటిస్తున్నప్పుడు ఆయనలో గమనించిన అంశాలు? జ: నటకు ముందు వరకూ చాలా కూల్‌గా ఉండే విజయ్ కెమెరా ముందుకు వెళ్లగానే పూర్తిగా మారిపోతారు. అదే విధంగా పాటల సన్నివేశాలకు ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా చాలా ప్రశాంతంగా నృత్యరీతులను గమనించి షాట్లో దుమ్మురేపుతారు. ప్ర: విజయ్‌తో నటించడానికి భయపడిన సందర్భం ఏమైనా ఉందా? జ: ఆయనతో డ్యాన్స్ చేయడానికే చాలా భయపడ్డాను. ప్ర: భైరవా చిత్రంలో మీ పాత్ర గురించి? జ: భైరవా చిత్రంలో నా పాత్ర పేరు మలర్విళి. తిరునెల్వెలి అమ్మాయిగా లంగాఓణి, చుడీదార్ దుస్తుల్లో గ్రామీణ యువతిగా కనిపిస్తాను. ప్ర: మీరు చాలా చలాకీగా ఉంటారు. విజయ్ మౌన మునిలా ప్రవర్తిస్తారు. చిత్ర షూటింగ్లో ఎలా గడిచింది? జ: ఇతరులతో ఎలా జాలీగా మాట్లాడతానో విజయ్‌తో కూడా అలానే సరదాగా ఉండేదాన్ని. ప్ర: ఏ నటుడితో నటించాలని ఆశిస్తున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు చిన్నతనం నుంచే సూపర్‌స్టార్‌తో నటించాలని కోరిక ఉంది. ప్ర: మీ అభిమాన నటి? జ: నేను నటి నయనతారకు వీరాభిమానిని. ప్ర: నటుడు శివకార్తికేయన్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు? జ: శివకార్తికేయన్‌కు నాతో నటించి బోర్ కొట్టిందని అనుకుంటున్నాను. రెమో చిత్రం తరువాత మా ఇద్దరికీ చిన్న గ్యాప్ అవసరం. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తాం. ప్ర: పొంగల్ వేడుక ఎలా జరుపుకోనున్నారు? జ: చాలా జాలీగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నాను. కొత్త డ్రస్‌లు చాలా కొనుక్కున్నాను. భైరవా చిత్రం విడుదలైంది. పొంగల్ పండగను చెన్నైలోని ఇంట్లోనే జరుపుకోనున్నాను. నాకు పొంగల్ చేయడం రాదు. అయితే భలే తింటాను. ఇక చెరకు ముక్కలు నోరు పగిలే వరకూ తింటాను. -
నయనానందంగా..
పాత్రల్లో ఇమిడి పోవడానికి ఇంతకు ముందు కథానాయకులే శా రీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేసేవారు. ఇప్పటి కథానయికలూ తామూ అందుకు రెడీ అంటున్నారు. పాత్ర లు డిమాండ్ చేస్తే బరువు పెరగడానికి, తగ్గడానికి సిద్ధం అంటున్నారు. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క 80 కిలోల వరకూ బరువు పెరిగి నటించారు. తాజాగా నటి నయనతార జీరో సైజ్‌కు మారి మరింత నాజూగ్గా తయారయ్యారు. ఇదంతా నటుడు శివకార్తికేయన్ కోసమేనట. అదేమిటని ఆశ్చర్య పోతున్నారా? మరీ అంతగా ఇదైపోకండి. నయనతార శివకార్తికేయన్‌కు జంటగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. శివకార్తికేయన్ లాంటి యువ హీరోతో జత కట్టడానికి నయనతార తన అందాలను మెరుగు పరచుకోవాలని భావించారట. దీంతో కేరళలో ఆయుర్వేద చికిత్స పొంది మరింత నాజూగ్గా తయారై వచ్చారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలే అందగత్తె.. అందులోనూ టాప్‌మోస్ట్ హీరోయిన్. అలాంటి చక్కనమ్మ మరింత చిక్కితే ఆ నయనానందమే వేరులే అంటున్నారు ఆమె తాజా చిత్ర యూనిట్ వర్గాలు. -
వారితో రాజీ కుదిరిందా?
విజయాలు తమ వెంటే సమస్యలను తెచ్చిపెడతాయన్నది నటుడు శివకార్తికేయన్ విషయంలో మరోసారి రుజువైంది. మాన్‌కరాటే, రజనీమురుగన్, రెమో అంటూ వరుస విజయాలతో మరో స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన నటుడు శివకార్తికేయన్. అలాంటి నటుడే రెమో చిత్ర సక్సెస్ మీట్ వేదికపై తమ పని తమను చేసుకోనివ్వండి అంటూ కంట తడిపెట్టారు. అదే శివకార్తికేయన్‌పై ముగ్గురు నిర్మాతలు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. యువ నిర్మాత జ్ఞానవేల్‌రాజా అయితే శివకార్తికేయన్ తనకు చిత్రం చేయకపోతే తనకు ఆత్మహత్య మినహా వేరే దారి లేదని అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తోంది. వీటికి సంబంధించి వివరాల్లోకెళ్లితే శివకార్తికేయన్ రెమో చిత్రానికి ముందే స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజాకు, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థకు చిత్రాలు చేస్తానని అడ్వాన్సలు తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది.అయితే తాను స్టూడియోగ్రీన్ సంస్థ నుంచి మినహా వేరే సంస్థ నుంచి అడ్వాన్స తీసుకోలేదని శివకార్తికేయన్ స్పష్టం చేశారు.అయితే పైన చెప్పిన మూడు సంస్థల నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో నటుడు శివకార్తికేయన్‌పై ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై నిర్మాతల మండలి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. శివకార్తికేయన్ ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాకు ఒక చిత్రం,ఆ తరువాత ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థలకు కలిసి ఒక చిత్రం చేసే విధంగా రాజీ కుదిరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెల్లడించలేదన్నది గమనార్హం. -
శివకార్తికేయన్‌లా నేనూ ఏడవాలా?
అచ్చం యన్బదు మడమైయడా చిత్రంలో ఓ దృశ్యం నటుడు శివకార్తికేయన్‌లా తానూ ఏడవాలా? అని పత్రికలవారితో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ పేర్కొన్నారు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రం అచ్చంయన్బదు మడమైయడా. శింబు, మంజిమామోహన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో ‘సాహసమే శ్వాసగా సాగిపో’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించారు. ఈ చిత్రం రెండు భాషల్లోనూ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర విడుదల ఆలస్యానికి కారణం ఏమిటన్న విలేకరి ప్రశ్నకు చిత్ర షూటింగ్లో ఆలస్యం అయిన విషయం తనకు తెలుసని, అయితే అందుకు కారణం ఏమిటన్నది మాత్రం తెలియదని అన్నారు. ఇందుకు నటుడు శివకార్తికేయన్ ఒక వేదికపై ఏడ్చినట్లు తనని ఏడ్వమంటారా? అని ప్రశ్నించారు. నటుడు శింబు తొమ్మిది గంటలకు కాల్షీట్ అయితే మధ్యాహ్నం రెండు గంటలకు లొకేషన్‌కు వచ్చే వారని, అయినా సంతోషంగా షూటింగ్లో పాల్గొనేవారని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో శింబుకు గౌతమ్ మీనన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో శింబుతో మళ్లీ చిత్రం చేస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా చేస్తానని, అయితే శింబు నటించే చిత్రానికి తాను నిర్మాతగా ఉంటానని అన్నారు. అచ్చంయన్బదు మడమైయడా చిత్రం జనరంజకంగా వచ్చిందని గౌతమ్ మీనన్ తెలిపారు. -
శివకార్తికేయన్‌తో మరోసారి!
ప్రస్తుత సీనిమాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న చిత్రాల కథానాయకుల్లో యువ నటుడు శివకార్తికేయన్ ఒకరు. ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటూ అనతి కాలంలోనే క్రేజీ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్ ఇటీవల విడుదలైన రెమో చిత్రంతో హీరోగా చాలా ఎత్తుకు ఎదిగారని చెప్పవచ్చు. అంతే కాదు ప్రముఖ కథానాయికలు శివకార్తికేయన్‌తో కలిసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారన్నది గమనార్హం. తాజాగా మోహన్‌రాజా దర్శకత్వంలో నటించడానికి సిద్ధమతున్నారు. రెమో చిత్ర నిర్మాత ఆర్డీ.రాజానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన అగ్ర నటి నయనతార నటించనున్నారు. ఈ చిత్రం తరువాత శివకార్తికేయన్ వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం ఫేమ్ పోన్‌రామ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో ఆయనతో నటి సమంత రొమాన్స చేయనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ కథానారుుకలతో నటిస్తున్న శివకార్తికేయన్ తదుపరి నటి హన్సికతో నటించడానికీ రెడీ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే శివకార్తికేయన్‌తో నటించిన తొలి క్రేజీ నాయకి హన్సికనే. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మాన్ కరాటే మంచి విజయాన్ని సాధించింది. అలాంటి హిట్ జంట మరోసారి కలిసి నటించనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు ఇండ్రు నేట్రు నాళై వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రవికుమార్ తాజాగా శివకార్తీకేయన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నాయకిగా నటి హన్సికను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం 2017 చివర్లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాగా శివకార్తికేయన్‌కు జంటగా రెండో సారి నటిస్తున్న నాయిక హన్సికనే అవుతుంది. నటి కీర్తీసురేశ్ ఆయనతో వరసగా రజనీమురుగన్, రెమో చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. -
సమస్యలు సృష్టిస్తున్నారు
సమస్యలు సృష్టిస్తున్నారంటూ నటుడు శివకార్తికేయన్ కంటతడి పెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. ఈయన నటించిన తాజా చిత్రం రెమో. కీర్తీసురేష్ నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ పరిచయం అయ్యారు. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని ఒక నక్షత్ర హోటల్లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ తాను నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదల సయమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొందో అందరికీ తెలిసిందేనన్నారు. ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అది విడుదలవుతుందో, లేదో తెలియని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. నిజానికి అంత బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక రెమో చిత్రానికి అలాంటి సమస్యలనే ఎదుర్కోవలసివచ్చిందన్నారు. తాను గానీ, ఇతర చిత్ర యూనిట్‌గానీ చిత్రం చూసిన తరువాత మరో విధంగా చేస్తే బాగుండని అనుకుని ఉండవచ్చని,అయితే ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రెమోపై నమ్మకం కలిగిన వ్యక్తి నిర్మాత రాజానేనని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. డబ్బు సంపాదించుకుని ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చునని, అయితే తాము అలా అనుకోవడం లేదనిఅన్నారు. మంచి చిత్రం చేసి ప్రేక్షకులను అలరింపజేయాలన్నదే తమ భావన అని తెలిపారు. తాము ఎవరి సాయం కోరుకోవడం లేదన్నారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తున్నామనిఅందువల్ల దయచేసి తమను పని చేసుకోనివ్వండి అంటూ కంటతడి పెట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తప్పు చే స్తే బాధ పడవచ్చునని, తాము ఎలాంటి తప్పు చేయడం లేదని,కష్టపడి పని చేసుకుంటున్నామని అన్నారు. అందుకే ఆ బాధ అనిపిస్తోందని పేర్కొన్నారు. నటి కీర్తీసురేశ్,అనిరుద్, కేఎస్.రవికుమార్, చాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. -
ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ!
దక్షిణాదిన భారీ పారితోషికం తీసుకునే తారల్లో నయనతార ఒకరు. కోటికి పైగా డిమాండ్ చేస్తున్న ఈ మలయాళ మందారం ఇప్పుడు రివర్స్‌లో పారితోషికాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. విషయం ఏంటంటే.. నయనతార నిర్మాతగా మారనున్నారని చెన్నై కోడమ్బాక్కం వర్గాల సమాచారం. నచ్చిన కథలు దొరికితే, వాటిని నిర్మించడానికి ఈ మధ్య కొంత మంది కథానాయికలు రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో అనుష్కా శర్మ ఇప్పటికే నిర్మాతగా మారి, ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రియాంకా చోప్రా కూడా ప్రొడ్యూసర్ అయ్యారు. మన తెలుగులో చార్మి ‘జ్యోతిలక్ష్మి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక, నయనతార విషయానికి వస్తే.. ఆ మధ్య ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో ‘నేనూ రౌడీనే’) చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేశ్ శివన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నయనతార ఖరారయ్యారు. ఈ సినిమా కథ నచ్చడంతో కేవలం నటించడం మాత్రమే కాదు, నిర్మించాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారట. -
17న సెలబ్రిటీ క్రికెట్
తమిళసినిమా: చెన్నై వాసులకు ముఖ్యంగా సినీ అభిమానులను కనువిందు చేయడానికి,ఆనందోత్సాహాలను కలిగించడానికి తమిళ ఉగాది పండ గ వెంటనే మరో వేడుక జరగనుంది. అదే సెలబ్రిటీ క్రికెట్. సాధారణంగా క్రికెట్ అంటేనే అభిమానులకు ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఇక తమ అభిమాన తారలు స్టేడియంలో ఫోర్లు,సిక్సర్లు అంటూ బ్యాట్‌ను ఝుళిపించి బంతులను పరిగెత్తిస్తుంటే ఆ జోషే వేరు. అలాంటి తరుణం ఈ నెల 17న రానుంది. దక్షిణ భారత నటీనటుల సంఘ భవన నిర్మాణం కోసం నిధిని సేకరించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ స్టార్స్ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదిక కానుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొననున్న ఈ క్రికెట్ క్రీడను స్టార్ నటులు 8 జట్లుగా ఆడి ఆనందాలను పంచనున్నారు. ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడనున్నారు. ఈ జట్లకు కెప్టెన్ బాధ్యతలను నిర్వహించే వారి వివరాలను సోమవారం ఒక స్టార్ హోటల్లో సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ 8 జట్లలో రామ్రాజ్ చెన్నై సింగమ్స్ జట్టుకు నటుడు సూర్య, ఎస్థల్ మదురై కాళైస్ జట్టుకు నటుడు విశాల్, శక్తి మసాలా కోవై కింగ్స్‌కు నటుడు కార్తీ, ఎమ్జీఆర్ యూనివర్సిటీ నెల్లై డ్రాగర్స్ జట్టుకు జయంరవి, రామ్నాట్ రైనోస్ జట్టుకు విజయ్‌సేతుపతి, తంజై వారియర్స్ జట్టుకు నటుడు జీవా, సేలం చీటర్స్ జట్టుకు నటుడు ఆర్య, కల్యాణ్ జ్యువెలర్ తిరుచ్చి టైగర్స్ జట్టుకు శివకార్తికేయన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ క్రీడకు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్ అదనపు ఆకర్షణ కానున్నట్లు ఇంతకు ముందు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది.అయితే ఆ విషయం గురించి ఇప్పుడు ప్రస్థావించకపోవడం గమనార్హం. సమావేశంలో పలువురు నటీనటులతోపాటు దర్శక,నిర్మాతలు పాల్గొన్నారు. -
కేడీతో లేడీ
సక్సెస్ఫుల్ డెరైక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన చిత్రం ‘కేడీ బిల్లా - కిలాడీ రంగా’. విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి ఇందులో హీరో హీరోయిన్లు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. సమర్పకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ -‘‘నా అభిమాన నిర్మాతల్లో తుమ్మలపల్లి ఒకరు. ఆయనతో అసోసియేటవ్వాలని చాలా రోజులుగా అనుకున్నా. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు. ‘‘రెజీనా, బిందుమాధవిల అందాలు, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.సత్యనారాయణ. -
బిల్లా-రంగా ఏం చేశారు?
రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న ఓ ఇద్దరు యువకుల జీవితాలు ఓ సంఘటన వల్ల ఎలా మలుపు తిరిగాయనే కథాంశంతో తమిళంతో తెరకెక్కిన చిత్రం ‘కేడీ బిల్లా-కిలాడీ రంగా’. ఈ చిత్రాన్ని అదే పేరుతో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. విమల్, శివకార్తీకేయన్, రెజీనా, బింధుమాధవి ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘‘ ‘గోలీసోడా’, ‘మెరీనా’ లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలుపెడతాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: విజయ్. -
రజనీ సాయం చేశారు
రజనీ మురుగన్ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద సాయం చేశారని ఆ చిత్ర నిర్మాత ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెలిపారు. ఈయన తన తిరుపతి బ్రదర్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం రజనీమురుగన్. శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజాకిరణ్, సముద్రకని, సూరి తదితరులు ముఖ్యపాత్రలు ధరించారు. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్ర ఫేమ్ పొన్రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లింగుస్వామి మాట్లాడుతూ ఇటీవల ఎదుర్కొన్న సమస్యల గురించి చాలా చెప్పాలన్నారు. అయితే అంతకంటే ముందు రజనీమురుగన్ చిత్రం గురించి మాట్లాడే తీరాలని అన్నారు. ఈ చిత్ర కథా చర్చలు చాలా జాలీగా సాగాయన్నారు. జీవితంలో చాలామంది ఉత్తమ విలన్లు వస్తుంటారు. మీరు ఇదే సంతోషంతో ఉండాలని చిత్ర దర్శకుడు పొన్రామ్కు చెప్పానన్నారు. తనకు చాలా సమస్యలు ఉండవచ్చునని అవన్నీ ఎదుర్కొనే వచ్చానని అన్నారు. మైనా చిత్ర విజయానికి ముందే కుంకీ చిత్రం చేయడానికి రెడీ అయ్యాను. అలాగే వరుత్త పడాద వాలిబర్ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రం ఒప్పందం జరిగిందని తెలిపారు. ఇదంతా నమ్మకంతో చేసినదేనని అన్నారు. ఈ చిత్రానికి రజనీమురుగన్ అని పేరు పెట్టాలనుకున్నప్పుడు నటుడు రజనీకాంత్ అనుమతిస్తారా? అనే సందేహం కలిగిందన్నారు. కారణం తన పేరును టైటిల్ వాడుకోవడానికి ఆయన అంగీకరించరన్న దానికి ఇంతకుముందు జరిగిన సంఘటనలే ఉదాహరణ అన్నారు. అయినా ఒకసారి రజనీకాంత్ ను కలిసి వివరిద్దాం అని ఫోన్ ద్వారా సంప్రదించానన్నారు. ఆయన్ని కలవాలన్న విషయాన్ని తెలిసిన రజనీ తన సమయాన్ని వృథా చేయడం ఇష్టంలేక ఫోన్ ద్వారానే మాట్లాడి విషయం అడిగారన్నారు. తానప్పుడు రజనీమురుగన్ టైటిల్ గురించి చెప్పి ఇది దర్శకుడి గురువు రాజేష్ చేసిన ఒరు కల్ఒరు కన్నాడి చిత్రంలోని ఒక పాత్ర పేరు అని, ఈ టైటిల్‌తో మీ ఇమేజ్‌కు ఎలాంటి భంగం కలగదని చెప్పి చూడగా ఆయన మధ్యలోనే కట్ చేసి ఆ టైటిల్‌కు తన అనుమతి కావాలి అంతేగా పెట్టుకోండి అంటూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అనుమతించి చాలా పెద్ద సాయం చేశారని లింగుస్వామి అన్నారు. -
శ్రీదివ్యపై దుష్ర్పచారం
నటి శ్రీ దివ్య అంటే గిట్టని వాళ్లు, ఆమె ఎదుగుదలను భరించలేనివారు ఆమెపై దుష్ర్పచారంతో దాడికి దిగుతారట. పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. కోలీవుడ్‌లో మొదట విడుదలైన వరుత్త పడాద వాలిబర్ సంఘంతో విజయాన్ని అందిపుచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జీవా, వెళ్లక్కార దురై వంటి చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ పలు అవకాశాలను దక్కించుకుంటూ వెళుతున్నారు. గ్లామర్ విషయంలో హద్దులు విధించుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటున్న శ్రీదివ్య నటుడు అధర్వతో జత కట్టిన ఈటి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీ దివ్య కళాశాల విద్యార్థినిగా నటించారు. అదే విధంగా త్వరలో కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నటుడు శివకార్తికేయన్‌తో ఒక చిత్రంతో పాటు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీదివ్యపై కొందరు పని కట్టుకుని మరి దుష్ర్పచారం చేస్తున్నారట. చూడటానికి చిన్నమ్మాయిలా కనిపించినా శ్రీ దివ్య వయసు 28 ఏళ్లు అని, ఆ విధంగా చూస్తే యువ నటి కాదని, తమిళ హీరోల కంటే తెలుగు హీరోలతో డ్యూయెట్లు పాడటానికే ఆసక్తి చూపిస్తారని, అక్కడ అవకాశాలు వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వైపే చూడరంటూ దుష్ర్పచారాలను చేస్తున్నారట. అయితే ఇవన్నీ ఈ చెవిలో విని ఆ చెవి ద్వారా వదిలేస్తున్నారట శ్రీదివ్య. పండ్లున్న చెట్టుకే రాళ్లన్న చందాన క్యాజువల్‌గా తీసుకుంటున్నారట.