smartwatch
-
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్‌వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
వాంతులను అరికట్టే స్మార్ట్‌వాచ్‌ను.. ఎప్పుడైనా వాడారా!
ఇప్పటి వరకు చాలా స్మార్ట్‌వాచ్‌లు వాడుకలోకి వచ్చాయి. వీటిలో కొన్ని గుండెలయ, రక్తపోటు, శ్వాసతీరు, నిద్రలో ఇబ్బందులు వంటివి ఎప్పటికప్పుడు కనిపెడుతూ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తాయి. తాజాగా అమెరికన్ కంపెనీ ‘ఎమిటెర్మ్’ వాంతులను అరికట్టే యాంటీనాసీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొందరికి బస్సులు, కార్లు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు వికారం మొదలై వాంతులవుతాయి. ఓడల మీద సుదూర ప్రయాణాలు చేసే వారికి, విమానాల్లో ప్రయాణించే వారిలో కొందరికి కూడా ఈ సమస్య ఉంటుంది.మరీ సున్నితమైన వారికి గాలిలో తేడా వచ్చినా, సరిపడని వాసనలు సోకినా వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలా మొదలయ్యే వికారం, వాంతుల నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. ఇకపై మందులతో పని లేకుండా ఈ స్మార్ట్ వాచ్ ధరిస్తే చాలు, ఎలాంటి పరిసరాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వికారం, వాంతులు దరిచేరవని తయారీదారులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ ‘ఎక్స్ప్లోర్’, ‘ఫ్యాషన్’ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతోంది. ‘ఎక్స్ప్లోర్’ మోడల్ ధర 139.99 డాలర్లు (రూ.11,752), ఫ్యాషన్ మోడల్ ధర 86.99 డాలర్లు (రూ.7,302) మాత్రమే!ఈ ప్యాచ్‌ను అతికించుకుంటే చాలు..ఇది బయో వేరబుల్ ప్యాచ్. దీనిని జబ్బ మీద అతికించుకుంటే చాలు, ఒంట్లోని చక్కెర స్థాయి ఎంత ఉందో ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు తెలియజేస్తుంది. దీనిని జబ్బకు తగిలించుకుంటే, ఒంట్లోని చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి వేలికి సూది గుచ్చుకుని, నెత్తుటి చుక్కలు బయటకు తీయాల్సిన పనే ఉండదు. బ్రిటిష్ కంపెనీ ‘అబాట్’ ఈ బయో వేరబుల్ ప్యాచ్‌ను ‘లింగో టీఎం’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. డయాబెటిస్తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా చక్కెర స్థాయిలోని హెచ్చుతగ్గులు ఎప్పడికప్పుడు తెలుస్తుండటం వల్ల ఆహార విహారాల్లోను, వైద్యులను సంప్రదించి మందుల మోతాదుల్లోను మార్పులు చేసుకోవడం తేలికవుతుంది. ఇందులోని సెన్సర్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. దీని ధర 89 పౌండ్లు (రూ.9,538) మాత్రమే! -
ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘శామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘శామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
అంబులెన్స్‌కి కాల్ చేసి.. పోయే ప్రాణాలను నిలబెట్టిన స్మార్ట్‌వాచ్!
యాపిల్ స్మార్ట్‌వాచ్ పోయే ప్రాణాల్ని నిలబెట్టింది. ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఇంట్లో అచేతన స్థితిలో పడిపోయినట్లు యాపిల్‌వాచ్ గుర్తించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ నెంబర్‌కి కాల్ చేసి ప్రమాదంలో ఉన్న బాధితుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా నిలిచింది. ఇంతకి ఏం జరిగిందంటే? అమెరికాకు చెందిన జోష్ ఫర్మాన్ టైప్ 1 డయాబెటిస్తో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో ఓ రోజు ఇంట్లో ఉన్న ఫర్మాన్‌లో బ్లడ్ షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గి నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. నోటి నుంచి మాటలేదు. శరీరంలో చలనం లేదు. ఆ సమయంలో అతనిని రక్షించేందుకు ఇంట్లో ఎవరూ లేరు. కానీ ఆయన ఇష్టపడి చేతికి పెట్టుకున్న యాపిల్‌వాచ్ ప్రాణాల్ని నిలబెడుతుందని ఊహించలేకపోయాడు. ఫర్మాన్ కింద పడిపోవడంతో అప్రమత్తమైన యాపిల్‌వాచ్ వెంటనే 911కి (ఎమర్జెన్సీ నెంబర్)కి కాల్ చేసింది. అవతలి నుంచి 911 ఆపరేటర్ ఏం జరిగిందని అడిగే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకపోయింది. యాపిల్వాచ్లో ఉన్న జీపీఎస్ ట్రాకర్ సాయంతో అంబులెన్స్ సిబ్బంది స్వల్ప వ్యవధిలో ఫర్మాన్ ఇంటికి చేరుకున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపగా.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తనని యాపిల్‌వాచ్ కాపాడిందని సంతోషం వ్యక్తం చేశాడు. అంతా రెప్పపాటులో ఈ సందర్భంగా తనకు ఎదురైన ఘటనని మీడియాతో పంచుకున్నాడు. ‘ఫోన్లో మా అమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఫోన్నెంబర్లని స్టోర్ చేశా. నేను ఆపస్మారక స్థితిలో పడిపోవడంతో ముందుగా 911కి కాల్ చేసింది. నేను ప్రమాదంలో ఉన్నానని మా అమ్మకి సమాచారం వెళ్లడం, ఆమె కూడా అంబులెన్స్‌కి కాల్ చేసి ఆరోగ్యం గురించి చెప్పడం.. వైద్యులు నా ప్రాణాలు కాపాడడం అంతా ఇలా రెప్పపాటులో జరిగిపోయింది’ అని అన్నారు. ప్రాణపాయ స్థితిలో ఉంటే ఫర్మాన్లా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడడంలో స్మార్ట్‌వాచ్‌లు ఎప్పుడూ ముందుంటాయని మరోసారి నిరూపించాయి. యాపిల్‌తో పాటు ఇతర స్మార్ట్‌వాచ్‌లలో గుండె లయ తప్పడం, ఇతర అత్యవవసర వైద్య సేవలు అందేలా చూడడం, వినియోగదారులు స్వయంగా ఆపరేట్ చేయకపోయినా.. స్మార్ట్‌వాచ్‌లు వాటి పనిని సక్రమంగా నిర్వర్తిస్తాయి. ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యల్ని గుర్తించి దీంతో పాటు వాచ్‌లలో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌తో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను ట్రాక్ చేయడానికి, ఇన్సులిన్ ఇంజెక్షన్ల కోసం రిమైండర్లను సెట్ చేయడానికి, ప్రాణాంతకమైన డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సంకేతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. చదవండి👉 కోడింగ్ పోటీల్లో 67,000 మందిని ఓడించి.. మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీ ఆఫర్‌తో! -
యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్ వాచ్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘శామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారా?..ఇదొకసారి చదవండి!
స్మార్ట్‌వాచ్, రిస్ట్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నారా? అయితే, వాటిని రోజులో ఎన్నిసార్లు శుభ్రం చేస్తున్నారు? ఎందుకంటే? మీకెంతో ఇష్టమైన యాపిల్‌వాచ్, ఫిట్‌బిట్ రిస్ట్‌బ్యాండ్‌ల వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఏయూ) పరిశోధకులు ప్లాస్టిక్, రబ్బర్, క్లాత్, లెదర్, గోల్డ్ అండ్ సిల్వర్‌తో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్,స్మార్ట్‌వాచ్‌ల పై పరిశోధనలు నిర్వహించారు. ఈ రీసెర్చ్‌లో స్మార్ట్‌వాచ్, రిస్ట్ బ్యాండ్లను ధరించడం బ్యాక్టీరియాను ఆహ్వానించడమేనని గుర్తించారు. 95 శాతం వేరబుల్స్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతయాని అంశాన్ని వెలుగు చూశారు. తద్వారా ఫివర్, డయేరియా, వ్యాధినిరోదక శక్తి తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ప్రత్యేకించి రిస్ట్‌బ్యాండ్ ధరించడం వల్ల చర్మ సమస్యలకు దారితీసే స్టెఫిలోకాకస్ ఎస్పీపీ అనే బ్యాక్టీరియాతో స్టాఫ్ ఇన్ఫెక్షన్, 60 శాతం ఈ కొల్లీ, 30 శాతం సూడోమోనాస్ ఎస్పీపీ (Pseudomonas spp)లు వంటి బ్యాక్టీరియాలు ఉన్నాయని పరిశోధనల్లో తేటతెల్లమైంది. సురక్షితంగా ఉండాలంటే ప్లాస్టిక్, రబ్బరు రిస్ట్‌బ్యాండ్‌లలో ఎక్కువ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని, మెటల్, బంగారం, వెండితో తయారు చేసిన రిస్ట్ బ్యాండ్లలో వైరస్ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రిస్ట్బ్యాండ్లు వినియోగించే స్థానాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని రీసెర్చర్ న్వాడియుటో ఎసియోబు అన్నారు. జిమ్‌కి వెళ్లే వారు సైతం వాచ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు వారు ధరించే వాచ్‌లను శుభ్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి👉 ‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’ -
'ట్యాప్ & పే' ఫీచర్‌తో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6..యాపిల్‌కు షాకే!
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. బుధవారం సియోల్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ వాచ్ 6, క్లాసిక్ పేరుతో రెండు వేరియంట్లను బుధవారం తీసుకొచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఇష్టమైన ఫీచర్, ఫిజికల్ రొటేటింగ్ బెజెల్‌ను తీరిగి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో AFib లేదా క్రమరహిత హృదయ స్పందన రేటు ట్రాకింగ్, ఎమర్జెన్సీ ఎస్‌వోఎస్, ఫాల్డిటెక్షన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ లాంటివి కీలక ఫీచర్లుగా ఉన్నాయి. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) అలాగే దేశంలో తొలిసారిగా గెలాక్సీ వాచ్ 6 సిరీస్ 'ట్యాప్ & పే' ఫీచర్‌తో వీటిని లాంచ్ చేసింది. అంటే యూజర్లు, చేతికి వాచ్ ఉండగానే ప్రయాణంలో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ లాంచింగ్ సందర్భంగా ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్) వీటి కోసం ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 44ఎంఎ గ్రాఫైట్ , సిల్వర్‌లో , 40ఎంఎం గ్రాఫైట్,గోల్డ్ కలర్స్‌లో లభ్యం.300mAh , 400mAh బ్యాటరీలను ఇందులో అందించింది. ప్రీమియం, టైమ్‌లెస్ టైమ్‌పీస్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ బ్లాక్ అండ్ సిల్వర్ , 43ఎంఎ, 47ఎంఎం మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. AOD ఫీచర్ ఆన్‌తో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ని, AOD ఫీచర్ ఆఫ్‌తో 40 గంటల వరకు అందించబడతాయని కంపెనీ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 ధర రూ. 29,999 నుండి ప్రారంభం. 44ఎంఎ డయల్, LTE సపోర్ట్‌ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 36,999. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 43 ఎంఎం మోడల్ ధర రూ.36,999. LTT, 47 ఎంఎం మోడల్ ధర రూ.43,999గా నిర్ణయించింది. వినియోగదారులు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ నుండి జూలై 27 నుండి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 11న సేల్స్ మొదలవుతాయి. ప్రీ-బుక్ చేసుకున్న వారు రూ.19,999తో ప్రారంభమయ్యే సరికొత్త గెలాక్సీ వాచ్ 6 సిరీస్‌ని సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. -
థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ
యాపిల్ వాచ్‌లోని కీలక ఫీచర్ ఇప్పటివరకు చాలామంది ప్రాణాలను కాపాడింది. భయానక పరిస్థితుల నుంచి యాపిల్ వాచ్ కారణంగా బయటపడ్డానంటూ ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లు షేర్ చేసిన పలు కథనాలూ చదివాం. తాజాగా అలాంటి మరో స్టోరీ వైరల్‌గా మార్చింది. యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి నా ప్రాణాలు గాలి కలిసిపోయేవే అంటూ ఒక వ్యక్తి ఈ లిస్ట్‌లో చేరారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) కెనడాకు చెందిన వ్యక్తి అలెగ్జాండర్ లేజర్సన్ కథనం ప్రకారం యాపిల్ వాచ్ కీలకమైన సమయంలో స్పందించి అత్యవసరమైన వ్యక్తుల ఫోల్ చేయడంతో సకాలంలో వైద్యం అందింది. తద్వారా తలకు భారీ గాయమైనా ప్రాణాలతో బతికి బైటపడ్డాడు. దీనికి ఆయన యాపిల్ స్మార్ట్‌వాచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలెగ్జాండర్ ఏదో పనిచేసుకుంటూ ఉండగా నిచ్చెనపై నుండి కింద పడిపోయాడు.దీంతో అతని తలికి తీవ్ర గాయమైంది. కానీ వెంటనే యాపిల్ వాచ్ సిరీస్ 8 స్మార్ట్ వాచ్ అత్యవసర సేవల నంబరు, అతని భార్యను డయల్ చేసింది.దీంతో వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.తలపై ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం కోలుకుంటున్నానని పేర్కొన్న అలెగ్జాండర్ వాచ్‌లోని టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) కాగా యాపిల్ స్మార్ట్‌వాచ్ Apple Watch 4, ఆ తరువాతి మోడల్స్ లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యూజర్ అందుబాటులో ఉంది. ఒకవేళ యూజర్ పడిపోతే ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ అవుతుంది.ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్‌లను, వ్యక్తులకు సమాచారం ఇస్తుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం ఈ ఫీచర్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. సెటింగ్స్‌లో మాన్యువల్‌గా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. (తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
రూ. 2999కే కొత్త స్మార్ట్‌వాచ్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
Pebble Cosmos Vault Smartwatch: దేశీయ మార్కెట్లో మెటాలిక్ స్ట్రాప్‌ను ఇష్టపడే వారి కోసం 'పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్' విడుదలైంది. క్లాసిక్ సిల్వర్, రోజ్ గోల్డ్, క్లాసిస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి వెబ్సైట్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా అమ్మకానికి ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలైన పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్‌వాచ్ 1.43 ఇంచెస్ అమోలెడ్ రౌండ్ డిస్ప్లే పొందుతుంది. ఇది ఇందులో చెప్పుకోదగ్గ హైలెట్. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) కొత్త పెబల్ కాస్మోస్ వాల్ట్ వాచ్‌లో 240 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా ఏడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ వాచ్ మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్న సమయంలో నోటిఫికేషన్స్ కూడా వాచ్లోనే పొందవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ వాచ్ ఆధునిక కాలంలో వినియోగదారులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. -
మోటో వాచ్ 200 వచ్చేస్తోంది...ఫీచర్లు చూశారా!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలోనే మోటో వాచ్‌లను లాంచ్ చేయనుంది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను వెబ్సైట్లో వెల్లడించింది. మోటో స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మోటోవాచ్ 70, మోటోవాచ్ 200 లిస్ట్ చేసింది. బడ్జెట్-సెంట్రిక్ వినియోగదారుల కోసం మోటో వాచ్ 70ని, ప్రీమియం ఫీచర్లతో మోటో వాచ్ 200 ద్వారా ప్రీమియం స్మార్ట్ వాచ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇస్తోంది. మోటో వాచ్ 200 ఫీచర్లు: డిస్ప్లే: 1.78 అంగుళాలు బ్యాటరీ: 355 ఎంఏహెచ్ (14 రోజుల వరకు) 5 ఏటియం వాటర్‌ప్రూఫ్; హార్ట్‌రేట్ మానిటర్ ఎస్పీవో2 మీటర్ బ్లూటూత్: 5.3 ఎల్ఈ; బిల్డ్–ఇన్ జీపిఎస్ మైక్రోఫోన్, స్పీకర్ కలర్స్: వార్మ్ గోల్డ్ అండ్ ఫాంటమ్ బ్లాక్. కంపెనీ ఇంకా ధరను వెల్లడించనప్పటికీ, ధర సుమారురూ. 12 వేలు (149.99 డాలర్లు) ఉంటుందని అంచనా. మోటో వాచ్ 70 కర్వ్డ్ 1.69-అంగుళాల LCD డిప్స్లే, 43mm జింక్ అల్లాయ్ కేస్, హార్ట్‌రేట్ మానిటర్ , టెంపరేచర్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. -
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) యువతరాన్ని ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో లేటెస్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ప్రిస్టీన్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 2,999. ఇది మహిళల కోసం ప్రత్యేకంగా తయారైంది, కాబట్టి వారికి ఇష్టమైన పింక్, వైట్, వైట్ ఓషియన్ స్ట్రాప్, వైట్ ప్లాటినమ్ స్ట్రిప్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ వాచ్ ఇప్పుడు కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి ఉంది. (ఇదీ చదవండి: Global NCAP: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన స్లావియా, వర్టస్ - వివరాలు) మార్కెట్లో విడుదలైన కొత్త ప్రిసీన్ స్మార్ట్‌వాచ్ 1.32 ఇంచెస్ హెచ్డీ ఫుల్ టచ్ రౌండ్ షేప్ డిస్ప్లే కలిగి మెటల్ బాడీ, రెండు మెటల్ బటన్లను పొందుతుంది. చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీని కోసం మైక్రోఫోన్, స్పీకర్ వంటివి ఉంటాయి. కావున బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ డయల్ ప్యాడ్, కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలను కలిగి ఉండటం వల్ల నేరుగా వాచ్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు. మొబైల్‌కు కనెక్ట్ చేసుకున్నప్పు నోటిఫికేషన్లను పొందవచ్చు. అంతే కాకుండా వాచ్ ద్వారా మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. (ఇదీ చదవండి: UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?) ఈ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, మెనిస్ట్రువల్ సైకిల్ రిమైండర్ లాంటి హెల్త్ ఫీచర్లను కూడా పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 7 రోజుల వరకు పనిచేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడినప్పుడు ఛార్జింగ్ మూడు రోజుల వరకు వస్తుందని కంపెనీ తెలిపింది. -
వారేవా! అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం!
ప్రముఖ స్మార్ట్‌వాచ్ తయారీ సంస్థ అమేజ్ ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఫిట్నెస్ నుంచి ఫ్యాషన్ వరకు యాక్సెస్ చేసేలా అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ వాచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హ్యూమంగస్ బ్యాటరీ, సింగిల్ ఛార్జ్‌తో 14 రోజుల వినియోగం, బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేసేలా అద్భుతమైన ఫీచర్లు ఉన్న వాచ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ ధర ఎంతంటే? అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది. అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ మిడ్నైట్ బ్లాక్, మిస్టీ పింక్, ఓషన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. అమేజ్‌ఫిట్ జీటీఆర్ మినీ స్పెసిఫికేషన్లు అమేజ్‌ఫిట్ జీటీఆర్లో మినీ వాచ్.. 1.28 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో ఎలాంటి కండీషన్లో ఉన్నా వాచ్‌ను ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటుంది. వీటితో పాటు స్మార్ట్‌వాచ్ బయోట్రాకర్ పీపీజీ, ఆప్టికల్ సెన్సార్, హార్ట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, ఒత్తిడి స్థాయిని మానిటర్ చేస్తుంది. అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలను సిఫార్సు చేస్తుంది. అంతేనా బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు పనిచేయడం దీని ప్రత్యేకత అని అమేజ్ ఫిట్ ప్రతినిధులు చెబుతున్నారు. -
Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌పై మరో సేల్‌ను ప్రకటించింది. మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు హెడ్ఫోన్లు తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మార్చి 14 వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్ ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో) మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్లో శాంసంగ్, యాపిల్, బోట్, పైర్ బాల్ట్, లెనోవో, ఆసుస్, కెనాన్, సోనీ లాంటి ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులు తగ్గింపు ధరల్లో అందించనుంది. హెడ్ఫోన్లు, టాబ్లెట్లు,పీసీ యాక్సెసరీలు, కెమెరాలతో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్ , ఆఫర్లను అందిస్తుంది. దీంతోపాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. మెగా సేల్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు ♦ ఆసుస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది ♦ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కే కొనుగోలు చేయవచ్చు ♦ ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్ వాచ్ రూ. 1,699కే లభ్యం. ♦ రూ. 34,990కే యాపిల్ వాచ్ ఎస్ఈ లభిస్తుంది. బ్యాంకు కార్డ్ కొనుగోళ్లగా రూ. 1500 తగ్గింపు అదనం ♦ ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది. ♦ సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 రూ. 69,490కి లభిస్తోంది. -
‘హార్ట్ ఎటాక్’ను గుర్తించే యాపిల్ వాచ్ సిరీస్ 8పై భారీ డిస్కౌంట్లు!
హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు వారికేననే ఓ అభిప్రాయం ఉండేది. అయితే ఆ ముప్పు ఇప్పుడు యువతను, చిన్నారులను చుట్టుముడుతోంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలల్లో హటాత్తుగా అడ్డంకులు ఏర్పడటాన్ని గుండె పోటు అంటారు. మరి గుండెకు రక్తం, ఆక్సీజన్ సరిగ్గా అందకపోతే అది పంపింగ్ చేయలేదు. ఎంత ఎక్కువ సేపు అడ్డంకి ఏర్పడితే అంత నష్టం జరుగుతోంది. పురుషుల్లో ఇలాంటి గుండె పోట్లు 65 ఏళ్లకు, మహిళలకు 72 ఏళ్లకు వస్తాయనే పాతలెక్క. కానీ ఆ వయస్సు ఇటీవల కాలంలో క్రమంగా కిందకు పడిపోతుంది. యువకుల్లో గుండెకు సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం అతిపెద్ద సమస్య. చాలా సార్లు నిశబ్ధంగా విరుచుకుపడి ప్రాణాల మీదకు తెస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనల్ని పెంచుతున్నాయి. దీని కారణం ఏంటనేది వైద్య నిపుణులు రకరకాల అంశాలను ఉదహరిస్తుండగా.. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. పైన పేర్కొన్నట్లుగా గుండె సంబంధిత సమస్యల్ని ముందే గుర్తించి యూజర్లను అలెర్ట్ చేసేందుకు యాపిల్ వాచ్ సిరీస్ 8ను గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకొని యూనికార్న్ స్టోర్ అనే సంస్థ వాటిని నేరుగా భారత్‌లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు అదే సంస్థ యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వాటిలో యాపిల్ వాచ్ సిరీస్ 8 కూడా ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 8 ఫీచర్లు యాపిల్ వాచ్ సిరీస్ 8లో గుండె పనితీరు సంబంధించిన సమస్యల్ని గుర్తించవచ్చు. అలా గుర్తించేందుకు టెక్ దిగ్గజం ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లడ్‌లో నీరసం, అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా చూసేందుకు ఉపయోగపడే హిమోగ్లోబిన్ లెవల్స్ ఎలా ఉన్నాయో గుర్తించడం, గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయడం, కర్ణిక దడ (atrial fibrillation detection)ని గుర్తించడం, గుండెలోని విద్యుత్ సంకేతాలను కొలిచే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (Electrocardiogram (ECG)ను పర్యవేక్షించడం వంటివి చేస్తుంది. ఈ పర్యవేక్షణ గుండె సమస్యలను గుర్తించడానికి, గుండె ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు టెంపరేచర్ సెన్సార్, దంపతులు ఏ సమయంలో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో గుర్తించే అండోత్సర్గము(ovulation cycles) అనే ఫీచర్‌ను యాపిల్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ వాచ్ సిరీస్ 8పై ఆఫర్లు పోయిన ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 8 ధర రూ.45,900 ఉండగా.. ఇప్పుడు ఆ ధర భారీగా తగ్గించింది. కొనసాగుతున్న యునికార్న్ యాపిల్ ఫెస్ట్‌లో భాగంగా వినియోగదారులు యాపిల్ వాచ్ సిరీస్ 8 పై 12 శాతం తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లు, ఈజీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ.2 వేల వరకు క్యాషీఫై ఎక్ఛేంజ్ బోనస్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఇలా అన్నీ బెన్ఫిట్స్ కలుపుకొని యాపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ.25,000 నుంచి లభ్యమవుతుందని యానికార్న్ యాపిల్ ఫెస్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. చదవండి👉 ఏం ఫీచర్లు గురూ..అదరగొట్టేస్తున్నాయ్,యాపిల్ వాచ్ సిరీస్ 8 విడుదల! -
బ్రాండ్ వాల్యూ: నాయిస్ మేకర్‌గా కింగ్ ఆఫ్ క్రికెట్ కోహ్లీ
సాక్షి,ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ దూసుకు పోతోంది. స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ నోయిస్ కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా, విరాట్ కోహ్లీని కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుది. నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ లకు కోహ్లీ వ్యవహరించ నున్నాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా నాయిస్ ఉత్పత్తులకు కోహ్లీ అన్ని రకాలుగా ప్రచారకర్తగా ఉంటారు. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లిని నోయిస్ మేకర్‌గా స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని నోయిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ఖత్రి వ్యాఖ్యానించారు. స్మార్ట్‌వాచ్ డొమైన్లో నాయిస్ ప్రపంచవ్యాప్త అభిమానుల అభిమానంగా మారడానికి టీమిండియా దిగ్గజం విరాట్‌తో జోడీ పనిచేస్తుందన్నారు. పవర్-ప్యాక్డ్ పనితీరును అందించాల్సిన అవసరం తోపాటు, విరాట్‌తో ఇండియా తోపాటు విదేశాలలో ఉన్న యువ ప్రేక్షకులతో తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. It’s official! I am a loud and proud Noisemaker. Stoked to be a part of India’s No. 1* Smartwatch Brand. Keep up with the Noise, kyunki #ShorRukegaNahi! #NoisemakerVirat@gonoise #ad *IDC Worldwide Quarterly Wearable Device Tracker, 3Q22 pic.twitter.com/Ab9jdySU9H — Virat Kohli (@imVkohli) December 2, 2022 ఈ ఒప్పందంపై కోహ్లీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. తానిపుడు అధికారికంగా నోయిస్ మేకర్‌గా మారాననీ, భారత్ లో నెం.1 స్మార్ట్ వాచ్ బ్రాండ్ లో తానూ ఒక భాగమేనని పేర్కొన్నారు. -
వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన స్మార్ట్ వాచ్‌ల పనితీరు చర్చాంశనీయమయ్యాయి. ఇప్పటికే పలు ప్రమాదాల నుంచి యూజర్లను సురక్షితంగా రక్షించిన యాపిల్ వాచ్‌లు.. తాజాగా ఓ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని తనకు ముందే గుర్తు చేశాయి. యాపిల్ వాచ్‌లో హార్ట్ మానిటరింగ్, ఈసీజీ, ఆక్సిమీటర్‌తో పాటు ఆరోగ్యపరమైన ఫీచర్లు ఉన్నాయి. కాబట్టే వినియోగదారులు హెల్త్ పరమైన సమస్యల్ని ముందే గుర్తించేందుకు ఆ సంస్థ వాచ్‌లను ధరిస్తుంటారు. అయితే తాజాగా యాపిల్ వాచ్ ధరించిన ఓ మహిళకు..ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని, త్వరలో డాక్టర్‌ను సంప్రదించాలంటూ ఆలెర్ట్లు (హార్ట్‌బీట్) పంపించడం ఆసక్తికరంగా మారింది. రెడ్డిట్ ప్రకారం.. 34ఏళ్ల మహిళ యాపిల్ వాచ్‌ను ధరించింది. ఈ తరుణంలో వాచ్ ధరించిన కొన్ని రోజుల తర్వాత ఆమె హార్ట్ బీట్‌లో పెరిగింది. సాధారణంగా ‘నా హార్ట్ రేటు 57 ఉండగా..అది కాస్తా 72కి పెరిగింది. వాస్తవంగా హార్ట్ రేటు గత 15 రోజులుగా ఎక్కువగా ఉన్నట్లు యాపిల్ వాచ్ హెచ్చరించింది. ఓ వ్యక్తి హార్ట్ రేటు పెరగడానికి అనేక కారణాలుంటాయి. అందుకే అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నా. అందులో నెగిటీవ్ వచ్చింది.’ అదే సమయంలో గర్భం దాల్చిన మొదటి వారాల్లో మహిళ హార్ట్ బీట్ పెరుగుతుందని, ఇదే విషయాన్నితాను హెల్త్ జర్నల్‌లో చదివినట్లు పోస్ట్‌లో పేర్కొంది. తర్వాత తాను ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్‌కు వెళ్లగా..డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి నాలుగు వారాల గర్బణీ అని నిర్ధారించినట్లు చెప్పారని తెలిపింది. హార్ట్ రేట్ : గర్భం దాల్చిన మహిళల హార్ట్ రేటు నిమిషానికి 70 నుంచి 90 వరకు కొట్టుకుంటుంది చదవండి👉 స్మార్ట్ వాచ్‌ను విసిరి కొట్టాలనుకుంది..కానీ అదే ఆ యువతి ప్రాణాల్ని కాపాడింది! -
ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే!
ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వాచ్‌లలో రకరకాల ఫీచర్స్‌ను జోడిస్తూ ముందుకు వస్తున్నాయి కంపెనీలు. ఇక స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీ బ్రాండ్ ఆంబ్రేన్ "ఫిట్‌షాట్ సర్జ్" పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,999గా నిర్ణయించింది. ఈ వాచ్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒక సంవత్సరం పాటు వారంటీతో వస్తుంది. ఫిట్‌షాట్ సర్జ్'ను ప్రీమియం రస్ట్ ప్రూఫ్ జింక్ అల్లాయ్ బాడీ, తేలికపాటి డిజైన్'తో తయారు చేశారు. ఇందులో ఐపీ68 రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ రోజ్ పింక్. జేడ్ బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. ఆంబ్రేన్ ఫిట్‌షాట్ సర్జ్ స్మార్ట్‌వాచ్ 1.28 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 24×7 రియల్ టైమ్ హెల్త్ ట్రాకింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో Spo2, రక్తపోటు, క్యాలరీలు, స్లీప్, పెడోమీటర్, బ్రీత్ ట్రైనింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి పారామీటర్లను చూసుకోవచ్చు. స్టెప్ ట్రాకర్ కూడా ఉంటుంది. ఎన్ని కాలరీలను ఖర్చు చేశామనే వివరాలు ఇందులో తెలుస్తుంది. స్మార్ట్ నోటిఫికేషన్లు, 8 ట్రైనింగ్ మోడ్లు, టైమర్, అలారం, స్టాప్‌వాచ్, వాతావరణం, సెడెంటరీ రిమైండర్ వంటి మరెన్నో ఇతర ఫీచర్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ హిస్టరీని రికార్డు చేయవచ్చు. యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌లో అంబ్రేన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు హెల్త్ హిస్టరీని ట్రాక్చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ వాయిస్- అసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌ను కనెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. (చదవండి: దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!) -
చావు బతుకుల్లో నేహ భర్త.. కాపాడినందుకు టిమ్ కుక్కు థ్యాంక్స్!
విమాన ప్రమాదంలో తండ్రీ- కూతుర్ని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుడ్ని ఇప్పుడు ఊపిరి ఆడక ప్రాణాలు పోతున్న ఓ డాక్టర్‌ను. ఇలా ప్రాంతాలు వేరైనా ఆయా ఘటనల్లో బాధితుల్ని రక్షిస్తుంది మాత్రం వస్తువులే. మనం ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాల్సిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ అనే సినిమా డైలాగుల్ని వినే ఉంటాం. కానీ పై సంఘటనలు ఆ డైలాగ్ అర్ధాల్నే పూర్తిగా మార్చేస్తున్నాయి. వస్తువుల్ని సరిగ్గా వినియోగించుకుంటే మనుషుల ప్రాణాల్ని కాపాడుతాయని నిరూపిస్తున్నాయి. తాజాగా ఊపిరాడక ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ డెంటిస్ట్‌ను యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడింది. యాపిల్ సంస్థ స్మార్ట్ వాచ్ 'సిరీల్4, సిరీస్ 5, సిరీస్ 6, సిరీస్ 7' లలో ఈసీజీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ 'ఈసీజీ యాప్' చేసే పని ఏంటంటే హార్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ పల్సెస్ యాక్టివిటీని మెజర్ చేసి అప్పర్ ఛాంబర్, లోయర్ ఛాంబర్ హార్ట్ బీట్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హార్ట్ బీట్ సరిగ్గా లేకపోతే ఏట్రియాల్ ఫైబ్రిల్లటిన్ atrial fibrillation (AFib) స్మార్ట్ వాచ్‌కు రెడ్ సిగ్నల్స్ పంపిస్తుంది. దీంతో బాధితుల్ని వెంటనే ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. హర్యానాకు చెందిన నితేష్ చోప్రా (34) వృత్తి రీత్యా డెంటిస్ట్. గతేడాది నితేష్‌కు అతని భార్య నేహా నగల్ ఈసీజీ యాప్ ఫీచర్ ఉన్న యాపిల్ వాచ్ 'సిరీస్ 6' ని బహుమతిగా ఇచ్చింది. అయితే నితేష్‌కు తాను ధరించిన యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఫీచర్ గురించి తెలియదు. ఈ నేపథ్యంలో మార్చి 12న నితేష్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాధితుడి భార్య వాచ్‌లో ఈసీజీ యాప్‌ను చెక్ చేయమని భర్తకు సలహా ఇచ్చింది. వెంటనే నితేష్ యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్ ఓపెన్ చేసి చూడగా.. అందులో అతని గుండె పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేసింది. వాచ్ అలెర్ట్‌తో నితేష్ హుటాహుటీన వైద్యుల్ని సంప్రదించాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..నితేష్ గుండెకు స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో ఉన్న తన భర్త ప్రాణాల్ని యాపిల్ స్మార్ట్ వాచ్ కాపాడిందని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ యాపిల్ సీఈఓ టీమ్ కుక్ మెయిల్ చేసింది. "నా భర్తకు 30వ పుట్టిన రోజు సందర్భంగా యాపిల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాను. అదే వాచ్ నా భర్త ప్రాణాల్ని కాపాడుతుందని అనుకోలేదు. ప్రమాదంలో ఉన్నాడని స్మార్ట్ వాచ్ హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. నా భర్త ఆరోగ్యం కుదుట పడింది. నా భర్తకు జీవితాన్ని ప్రసాదించిన మీకు, అందులో భాగమైన టెక్నాలజీకి కృతజ్ఞతలు తెలుపుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మెయిల్లో పేర్కొంది. అనూహ్యంగా నేహా మెయిల్‌కు టిమ్ కుక్ స్పందించారు. సకాలంలో మీ భర్తకు ట్రీట్మెంట్ అందినందుకు చాలా సంతోషిస్తున్నాను. స్మార్ట్ వాచ్ మీ భర్తను కాపాడిందనే విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ టిమ్ కుక్ నేహా మెయిల్‌కు రిప్లయి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
కనెక్ట్ ఎస్‌డబ్ల్యు1 ప్రో స్మార్ట్‌వాచ్
హైదరాబాద్: యాక్సెసరీస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కనెక్ట్ గ్యాడ్జెట్స్ ఎస్‌డబ్ల్యు1 ప్రో స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. 10.5 మిల్లీమీటర్ల మందం, 1.72 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ కర్వ్డ్ ట్రూ వ్యూ లార్జ్ డిస్ప్లే, 180 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందించింది. ధర రూ.3,999. అంతరాయం లేని, మెరుగైన కాల్స్ కోసం డ్యూయల్ బ్లూటూత్ మల్టీ పాయింట్ టెక్నాలజీతో జోడించినట్టు కనెక్ట్ సీవోవో ప్రదీప్ తెలిపారు. (చదవండి: అదిరిపోయే ఫీచర్స్ గల 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!) బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సీజన్, ఈసీజీ తెలుసుకోవచ్చు. ఫిమేల్ అసిస్టెన్స్, బ్రెత్ మోడ్, వెదర్ రిపోర్ట్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, గెశ్చర్ కంట్రోల్, ఏడు రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిదాల్లోనూ కొనుగోలు చేయవచ్చు. (చదవండి: ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!) -
పేరు మార్చాడో లేదో...! ఏకంగా యాపిల్‌కే గురిపెట్టాడు..!
Meta Plans To Launch Smartwatch With Camera As Competitor To Apple Watch: ఫేస్బుక్ మాతృ సంస్థ పేరును మార్క్ జుకమ్‌బర్గ్ ‘మెటా’ గా మార్చిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఫేస్‌బుక్‌పై భారీ ఎత్తున ఆరోపణలు రావడంతో..ఫేస్బుక్ పేరును మారిస్తే కాస్త ఊరట లభించవచ్చునని మార్క్ జుకమ్‌బర్గ్ భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘మెటావర్స్’ అనే వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాం కోసం కూడా ఫేస్బుక్ పేరును మార్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. చదవండి: సత్యనాదెల్లా రాకతో..! నెంబర్ 1 స్థానం మైక్రోసాఫ్ట్ సొంతం..! యాపిల్‌తో ఢీ..! ఫేస్బుక్ పేరు మార్చిన విషయం గురించి పక్కన పెడితే మార్క్ జుకమ్‌బర్గ్ పెద్ద ఐడియాతోనే ముందుకు వస్తోన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్‌లో పేరొందిన యాపిల్‌ను ఢీ కొట్టే ప్రయత్నాలకు జుకమ్‌బర్గ్ సిద్ధమయ్యాడు. మెటా సంస్థ త్వరలోనే యాపిల్‌కు పోటీగా స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనున్నుట్లు తెలుస్తోంది. మెటా తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను వచ్చే ఏడాది నాటికి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్‌కు ఉపయోగించేందుకు వీలుగా స్మార్ట్‌వాచ్‌కు కెమెరాను కూడా అమర్చారు. కాగా మెటా ఇప్పటికే రేబాన్ సహాకారంతో స్మార్ట్గ్లాసెస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీలకు మెటా పోటీగా నిలిచే అవకాశం లేకపోలేదని పలు టెక్నికల్ నిపుణుల భావిస్తున్నారు. ఇదిలా ఉండగా..మెటా మరికొద్ది రోజుల్లోనే మెటావర్స్ వర్చువల్ రియాల్టీ ప్రోగ్రాంను కూడా లాంచ్ చేయనుంది. అందులో భాగంగా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లు, పోర్టల్ వీడియో-చాట్ పరికరాలను మెటా ఇప్పటికే విక్రయిస్తోన్నట్లు తెలుస్తోంది. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీని మిళితం చేసే "ప్రాజెక్ట్ కాంబ్రియా" అనే కోడ్‌నేమ్‌తో కూడిన కొత్త హై-ఎండ్ హెడ్‌సెట్‌పై పనిచేస్తున్నట్లు మెటా గురువారం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ రూపొందించిన స్మార్ట్‌వాచ్ దాని హెడ్సెట్లకు ఇన్పుట్ పరికరం లేదా అనుబంధంగా పని చేస్తుందని మెటా తెలిపింది. చదవండి: మహీంద్రా ఎక్స్‌యూవీ700 జావెలిన్ ఎడిషన్‌పై ఓ లుక్కేయండి..! -
స్మార్ట్ వాచ్.ఆ పని చేస్తున్న బాయ్ ఫ్రెండ్‌ను పట్టిచ్చింది!
వాషింగ్టన్: ఇది స్మార్ట్‌యుగం.. స్మార్ట్ ఫోన్లు, వాచ్‌లు, లాపీలు మనుషులకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి మనిషి జీవింతంలో ఒక భాగమైపోయాయి. అయితే, ఇవి కొందరికి వరంగా మారితే, మరికొంత మందికి ఇబ్బందికరంగా కూడా తయారయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నాదియా ఎసెక్స్ అనే యువతి తన బాయ్ ఫ్రెండ్‌కు స్మార్ట్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వాచ్‌లో ప్రధానంగా.. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఫిట్నెస్ అలెర్ట్, రిమైండర్స్, ఫిట్‌బిట్ రీడింగ్..ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే , ఆ స్మార్ట్ వాచ్ అలెర్ట్ నోటిఫికేషన్‌ను ఆ యువతి తన స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంది. ఈ క్రమంలో, ఒకరోజు బాయ్‌ఫ్రెండ్‌కు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో 500ల కేలరీల శక్తి ఖర్చయినట్లు ఆమెకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంత రాత్రి అన్నికాలరీల శక్తి ఖర్చవ్వడానికి కారణం ఏంటని ఆలోచించింది.. అతని ప్రవర్తనలో మార్పును గ్రహించింది. దీంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని గ్రహించింది. ఈ విషయాన్ని నాదియా ఎసెక్స్.. టీక్ టాక్ వీడియోతో తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకొంది. అయితే ఇప్పుడిది తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నీ తెలివికి ఫిదా’..‘నీకు మంచే జరిగింది’..‘ఎసెక్స్ రాణి ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు! -
వాటికి గుబులే : త్వరలో వన్‌ప్లస్ వాచ్
సాక్షి, ముంబై: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్న వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ టీవీలు, వైర్లెస్ ఇయర్‌బడ్‌లతో ఆకట్టుకున్న చైనా దిగ్గజం వన్‌ప్లస్ త్వరలోనే స్మార్ట్‌వాచ్ లను కూడా ఆవిష్కరించనుంది. తద్వారా శాంసంగ్, ఒప్పో లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్మార్ట్‌వాచ్ లాంచింగ్ పై చాలాకాలంగా ఇంటర్నెట్లో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే సింగపూర్ ఇన్ఫోకామ్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దీనికి సంబంధించిన ధృవీకరణ పొందినట్లు సమాచారం. దీంతో రాబోయే నెలల్లో వన్‌ప్లస్ వాచ్ పేరుతో వీటిని తీసుకురానుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ, మార్కెట్లో ఉన్న ప్రముఖ స్మార్ట్‌వాచ్‌లకు ధీటుగా ఉండేలా మార్కెట్లోకి రానున్నాయి. ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫిట్నెస్, హెల్త్ ఫీచర్స్ ముఖ్యంగా హృదయ స్పందన సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ , స్లీప్ ప్యాటర్న్ అనాలిసిస్, గోల్స్ ఓరియెంటెడ్ ఎక్స్ ర్ సైజ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఆధారిత ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. కొనుగోలుదారులను మరింత ఆకర్షించేలా వన్‌ప్లస్ వాచ్ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 తరహాలో ఈసీజీ మానిటర్ లాంటి ప్రీమియం ఫీచర్లును కూడా జోడించనుంది. శాంసంగ్ తోపాటు ఇటీవల లాంచ్ చేసిన ఒప్పో వాచ్ లకు వన్‌ప్లస్ వాచ్ గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాల అంచనా. -
టైటన్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే
సాక్షి, ముంబై: కంజ్యూమర్ గూడ్స్ రంగ సంస్థ టైటన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్ కంపెనీ హగ్ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్ ఫౌండర్ రాజ్ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్ వాచెస్, వేరబుల్స్ విభాగం సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. దీనిని టైటన్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్‌గా మార్చినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేప్రణాళికలో భాగంగా హగ్‌ను సొంతం చేసుకుంది. అయితే డీల్ విలువ వివరాలను రవికాంత్ వెల్లడించలేదు. అలాగే ‘కనెక్టెడ్ ఎక్స్ ’ పేరుతో టైటన్ ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. టైటన్ పోర్ట్‌ఫోలియోలో ఇది టైటాన్ యొక్క 13 వ ఉత్పత్తి. మార్చి నుంచి ఈ స్మార్ట్ వాచ్ అన్ని ప్రముఖ టైటాన్ స్టోర్లలో లభిస్తుంది. 1.2 అంగుళాల ఫుల్ కలర్ టచ్‌స్క్రీన్ , స్మార్ట్ వాచ్ అనలాగ్ హ్యాండ్స్, యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్ అలర్ట్స్ లాంటి 13 టెక్ ఫీచర్లతో లోడ్ చేయబడిన మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ వాచ్ ధర రూ.14,995గా కంపెనీ నిర్ణయించింది. కాగా అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసుకునే నేరావటి 2012లో నిర్భయ ఘటన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి మహిళల భద్రతా సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని గచిబౌలిలో స్టార్టప్ సంస్థ హగ్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించారు. ఫాక్స్‌కాన్, ఫిట్నెస్ బ్యాండ్ల సహకారంతో భద్రతా లక్షణాలతో పలు స్మార్ట్ వాచ్‌లను హగ్ రూపొందించిది. 30వేల మంది కస్టమర్లను హగ్ సొంతం. -
హార్ట్ బీట్‌ను పసిగట్టే స్మార్ట్‌వాచ్
సాక్షి, ముంబై: చైనా మొబైల్స్ తయారీదారు హువావే కొత్త స్మార్ట్‌వాచ్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. జీటీ 2 స్మార్ట్‌వాచ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీటీ 2 వాచ్ 42 ఎంఎం వేరియంట్ లభ్యత వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే 46 ఎంఎం వేరియంట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర రిటైల్ దుకాణాలతో సహా ఇ-కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. జీటీ2 స్మార్ట్‌వాచ్ ఫీచర్లు 1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్ప్లే, రౌండ్ డయల్ హువావే కిరిన్ ఎ1 చిప్, 3డీ గ్లాస్, బ్లూటూత్ 5.1 వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్ ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్ ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్, ధరలు 46 ఎంఎం స్పోర్ట్ (బ్లాక్) రూ.15,990, లెదర్ స్ట్రాప్ మోడల్ రూ.17,990, మెటల్ స్ట్రాప్ రూ.21,990. 42 ఎంఎం వేరియంట్ ప్రారంభ ధర రూ. 14,990 డిసెంబర్ 12 - 18 వరకు వినియోగదారులు ప్రీ బుక్ చేసుకోవచ్చు. అలాగే ముందస్తు బుకింగ్‌లో మొత్తం నగదు చెల్లించిన వారికి 6999 రూపాయల విలువైన హువావే ఫ్రీలేస్ ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభ్యం. 19 వ తేదీ అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31 వరకు మొదటి సేల్కు అందుబాటులో వుంటుంది. హువావే మినిస్పీకర్ (రూ .2,999) గెలుచుకునే అవకాశం కూడా వుంది. 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వుంటుందని కంపెనీ తెలిపింది.అంతేకాదు తమ స్మార్ట్‌వాచ్ వినియోగదారుని హార్ట్ బీట్‌ను మానిటర్ చేస్తుందని, హృదయ స్పందన రేటు 100 బిపిఎమ్ కంటే ఎక్కువ లేదా 50 బిపిఎమ్ కంటే తక్కువ 10 నిమిషాలకు మించి ఉంటే వినియోగదారుడిని అలర్ట్ చేస్తుందని, స్విమ్మింగ్ చేస్తున్నపుడు కూడా ఈ వాచ్ పనిచేస్తుందని హువావే వెల్లడించింది.