Soup
-
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది. బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది. టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది. కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు. ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..! ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి. కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి! -
దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!
ఇటీవల గ్లామరస్‌గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు. ఎలా తయారు చేస్తారంటే..ఇది స్విఫ్ట్లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్‌లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రయోజనాలు..పోషకాలు సమృద్ధిగా ఉంటాయిఅమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయికణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిదిరోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందికొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. View this post on Instagram A post shared by Golden Nest Inc (@goldennestusa) (చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!) -
ఓ ‘సూపు’ సూద్దామా..!
– రెస్టారెంట్లో తప్పనిసరి ట్రెండ్– కొత్త రుచులను ఆస్వాదిస్తున్న నగరవాసులు– రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం– ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా మన చేతికిచ్చే మెనూలో మొదట కనిపించేది సూప్స్ అండ్ స్టార్టర్స్. ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ఈ ట్రెండ్.. ప్రస్తుతం తప్పనిసరైంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూప్స్ నగర జీవన శైలిలో భాగమయ్యాయి. ప్రస్తుతం ఆహార ప్రియులు రెస్టారెంట్లలో తమకు నచ్చిన సూపులను ఓ సూపు సూస్తున్నారు. విభిన్న ఫ్లేవర్స్ జిహ్వకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక పోషక విలువలు కలిగిన సూప్స్ చక్కని ఆరోగ్య ఫలితాలనూ అందిస్తున్నాయి. ఆకలి తీర్చడమే కాకుండా ఆకలిని పెంచడంలోనూ సూప్స్ది ప్రత్యేక స్థానం. వెజ్, నాన్‌వెజ్ రూపాల్లో లభించే సూప్స్‌లో విభిన్న రకాలున్నాయి. ప్రాంతం, ఆహారపు అలవాట్లను బట్టి వివిధ దేశాల్లో వివిధ రకాల సూప్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక నగరాల్లో అయితే అన్ని రకాల సూప్స్ అందుబాటులో ఉంటాయి. ఇండియన్, చైనీస్ సూప్‌లతో పాటు ఈ మధ్య కొరియన్ సూప్స్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. మిరియాలు, దోసకాయ, పాలు, నిమ్మరసం, పెరుగు, క్యారెట్, నువ్వులు, పాలకూర, అల్లం, రైస్ వెనిగర్ పదార్థాలతో తయారు చేసిన సూప్‌లు శరీరంలోని పోషకాలను, ఎలక్రో్టలైట్లను పెంపొందిస్తాయని ప్రముఖ చెఫ్ మంగ అశోక్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ వేదికగా తయారు చేసే సూప్స్‌లో సీజనల్‌గా ఆరోగ్యానికి సహకరించే మిరియాలు, అల్లం వంటి పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నామని అన్నారు. ఎండలో డీహైడ్రేషన్‌కు, చలికాలం గొంతు ఇన్ఫెక్షన్లకు సూప్స్ చక్కని ఉపశమనం. గుండె నరాలు, మధుమేహం నిర్వహణలోనూ మనకు సాయపడతాయని అశోక్ చెబుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసుకునేందుకు అనువైన కొన్ని సూప్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రేటింగ్ కోసం దోస–అవకాడో.. దోసకాయ, అవకాడో కలిపి చేసిన సూప్ హైడ్రేటింగ్ శక్తినిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ సూప్ తయారీలో అవకాడోలు, దోసకాయలు, పెరుగు/కొబ్బరి పాలు, నిమ్మరసం, జీలకర్ర, మిరియాలు, పుదీనా కలపాలి. చల్లని సూప్‌లో కొత్తిమీర కూడా చేర్చాలి. ఇది కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రధాయిని. క్యారెట్లు, దుంపలు, నిమ్మకాయ కలుపుకుంటే రుచి మారుతుంది. జరు సోబా జరు సోబా అనేది సంప్రదాయ సూప్‌ల మాదిరిగా కాకుండా..ఉడకబెట్టిన పులుసు ఆధారిత సూప్. చల్లబడిన బుక్వీట్ నూడుల్స్‌తో తయారు చేసే జపనీస్ వంటకం ఇది. సాస్‌తో వండే ఈ సూప్ సోయా, డాషి, మిరిన్ నుంచి తయారు చేస్తారు. ఈ చల్లని సూప్ తక్కువ కేలరీలతో హృదయనాళ ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మధుమేహం నిర్వహణలో సహాయపడుతుంది. ఉడికించిన నూడుల్స్‌ను చల్లటి నీటితో శుభ్రం చేశాక అవి దృఢంగా మారతాయి. తియ్యగా.. కారంగా..... తియతియ్యగా, కారంగా నాలుకకు రుచినందించే వినూత్న సూప్..టమాట–మిరియాల సూప్. దక్షిణాదిలో ఎక్కువ ఆదరణ ఉన్న ఈ సూప్‌ను రసంగానూ వాడుకోవచ్చు. జలుబుకు నివారణగా నాలుకపై టేస్ట్ బడ్స్ మేల్కొల్పడానికి, చలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మిరియాల రసం, జీర రసం, టమాట రసం, మిలాగు రసం, తక్కలి రసం, టమాట మిరియాల చారు వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇందులో మంచి రుచి కోసం వెల్లుల్లి, మిరియాలు, జీలకర్రను వినియోగిస్తారు. రుచుల సమ్మేళనాన్ని సమతుల్యం చేయడానికి కాస్త బెల్లంతో తీపి చేస్తారు. సీజనల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఇదొక చక్కని ఔషధంలా పనిచేస్తుంది. -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
పప్పుకు నిప్పెట్టాడు!
అప్పు చేసి పప్పు కూడు తినమన్నారు గానీ...పప్పుకు నిప్పెట్టమని చెప్పలేదు పెద్దలు. హరిద్వార్‌లోని జ్వాలానగర్‌కు చెందిన ఈ పెద్దాయన పప్పుకు నిప్పెట్టి ‘ఫైర్‌వాలీ దాల్’ పేరుతో తన హోటల్లో హాటు హాటుగా అమ్ముతుంటాడు. నెయ్యి... మొదలైన దినుసులు ఉన్న గరిటెను మండించి ప్లేట్లో ఉన్న పప్పుకు జస్ట్ అలా తగిలిస్తాడు...అంతే! ‘ఫైర్‌వాలీ దాల్’కు రుచికరమైన సూప్‌ను ఉచితంగా ఇస్తాడు. ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ కోసం ఎప్పుడూ వచ్చే వారితో పాటు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అంటూ వచ్చే వాళ్లు కూడా ఎక్కువే. ఆనోటా ఈ నోటా ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ గురించి విన్న ఒక యువకుడు పనిగట్టుకొని దిల్లీ నుంచి హరిద్వార్‌కు వచ్చాడు. ‘ఇతడి చేతిలో ఏదో ఇంద్రజాలం ఉంది’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేడి వేడిగా పోస్ట్ చేశాడు. ‘సో టెంప్టింగ్’ అంటూ స్పందించారు నెటిజనులు. -
కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్ వేసుకుందని వేడి వేడి సూప్ పోసి..
ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్ ప్యాంట్( పొట్టి షార్ట్) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు. -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్‌ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్‌లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్‌లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..) -
Recipe: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా!
Winter- Recipes In Telugu: చలికాలంలో బ్రెడ్ గార్లిక్ సూప్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – అర కప్పు ►వెల్లుల్లిపాయ – సగం ( పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 2 (తినేవారి సంఖ్యని బట్టి పెంచుకోవచ్చు) ►కారం – 1 టేబుల్ స్పూన్ పైనే ►ఉప్పు – తగినంత ►బిర్యానీ ఆకు – 1 ►అన్నిరకాల కూరగాయ ముక్కలు – (చిన్నచిన్నగా తరిగి, 4 కప్పుల నీళ్లు పోసి.. కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని.. సుమారు రెండున్నర కప్పులు అయ్యేలా.. బాగా మరిగించి, ముక్కల్ని వడకట్టి.. ఆ వెజిటబుల్ స్టాక్‌ని పక్కన పెట్టుకోవాలి) ►నూనె – సరిపడా ►కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ►ముందుగా ఒక కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి.. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించాలి. ►అవి వేగాక బ్రెడ్ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం.. ఉడికించిన కూరగాయలను వడకట్టిన నీటిని 2 కప్పుల వరకు ఇందులో పోసుకోవాలి ► తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి. ►మధ్యలో రెండు గుడ్లను పగలగొట్టి.. పసుపు సొన విడిపోకుండా కళాయిలో వేరువేరుగా వేసుకోవాలి. ►గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ ఉడకనివ్వాలి. ►మొత్తం మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ►గుంట గరిటెతో గుడ్లను సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ►తినే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ! Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా! -
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ ఇలా!
అసలే ఉరుకుల పరుగుల జీవితం, దీనికితోడు ఒత్తిడి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒత్తిడిని అధిగమించకపోతే ఏ పనీ సరిగా చేయలేం. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. అయినా తగ్గదు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే స్ట్రెస్ ఇట్టే తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వంటకాలు ఎలా వండుకోవాలో చూద్దాం.... ఆవకాడో టోస్ట్ కావలసినవి: ►ఆవకాడో గుజ్జు – పావు కప్పు ►రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్ – ఒకటి ►ఉడికించిన గుడ్డు – ఒకటి ►ఆలివ్ ఆయిల్ – టీస్పూను ►నిమ్మరసం – టీస్పూను ►సబ్జా గింజలు – టీస్పూను ►ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ: ►బ్రెడ్ స్లైస్‌ను రెండు ముక్కలుగా కట్ చేయాలి ►బ్రెడ్ ముక్కలపై ఆవకాడో గుజ్జుని పొరలా రాసి, దీనిపైన గుడ్డుని స్లైసులుగా కట్ చేసి పెట్టాలి ►చివరిగా నిమ్మరసం, సబ్జాగింజలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి చల్లుకుని సర్వ్‌చేసుకోవాలి. చిలగడ దుంప సూప్ కావలసినవి: ►నూనె – టేబుల్ స్పూను ►జీలకర్ర – అర టీస్పూను ►ఆవాలు – అర టీస్పూను ►పసుపు – పావు టీస్పూను ►అల్లం తురుము – టే బుల్ స్పూను ►వెల్లుల్లి తురుము – టేబుల్ స్పూను ►పచ్చిమిర్చి – రెండు ►నిమ్మచెక్క – ఒకటి ►టొమాటో – ఒకటి (సన్నగా తరగాలి) ►చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్ – నాలుగు కప్పులు ►తొక్కతీసిన చిలగడ దుంపల తురుము – రెండు కప్పులు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ►చికెన్ లేదా వెజిటేబుల్ స్టాక్‌ను తీసుకుని పసుపు, ఉప్పు వేసి మీడియం మంట మీద మరిగించాలి ►పదినిమిషాల తరువాత చిలగడ దుంపల తురుము, అల్లం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసి ఉడికించాలి ►ఈ దుంపల మిశ్రమాన్ని పది నిమిషాలు ఉడికించాక టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ►స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి ∙కాగిన నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి ►ఆవాలు వేగాక కరివేపాకు వేసి వేయించాలి. ►దీనిలో మరిగించిన సూప్‌ను పోయాలి చివరిగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి వేడివేడిగా సర్వ్‌చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Tomato Keema Balls Recipe: టొమాటో కీమా బాల్స్.. తయారీ ఇలా! Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. -
All In One: ఫిష్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే!
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్‌తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ కుకర్‌లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్‌కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్‌లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది. ధర : 252 డాలర్లు (రూ.19,313) చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
Summer Tips: వేసవిలో సలాడ్స్ తిన్నారంటే!
కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో సలాడ్స్ తినడం మేలు చేస్తుంది. వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు ఒంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. ఇక సలాడ్స్‌తో పాటు దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. గ్రీక్ రైస్ సలాడ్ తయారీ: కావలసిన పదార్ధాలు: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను తయారీ: గిన్లెలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి. బౌల్స్‌లో సర్వ్ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరి! క్యాబేజీ సలాడ్ విత్ ఎ క్రంచ్ కావలసిన పదార్ధాలు: క్యాబేజీ తరుగు – కప్పు, నూడుల్స్ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్ కోసంసోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి.. అది వేడెక్కిన తర్వాత నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ఒక పెద్ద బౌల్లో నూడుల్స్ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. త్రీ బీన్ సలాడ్ కావలసినవి: నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్ – 2 టీ స్పూన్లు తయారీ: ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్లో వెనిగర్, పంచదార, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి. -
Delicious Winter Soup Recipes: స్పినాచ్ సూప్, బ్రకోలి ఆల్మండ్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... స్పినాచ్ సూప్ కావల్సిన పదార్ధాలు లేత పాలకూర ఆకులు – రెండు కప్పులు క్యారెట్ – ఒకటి బంగాళదుంప – ఒకటి ఉల్లిపాయ – ఒకటి వెల్లుల్లి రెబ్బలు – నాలుగు మిరియాల పొడి – టీస్పూను ఆయిల్ – రెండు టీస్పూన్లు పంచదార – టీస్పూను వెజిటేబుల్ స్టాక్ – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యారెట్ బంగాళ దుంపలను తొక్కతీసి కడిగి, సన్నగా తరుక్కోవాలి. ►ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు, క్యారెట్, బంగాళ దుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. ►ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వేడినీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి, క్యారెట్, దుంపలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వెజిటేబుల్ స్టాక్ వేసి ప్యూరీలా చేసుకోవాలి. ►ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి. ►ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్కలర్లోకి మారేవరకు వేయించాలి. ►తరువాత పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మరిగించాలి. ►ఈ వేడివేడి సూప్‌లో క్రీమ్ లేదా బటర్ వేసి సర్వ్‌చేసుకోవాలి. బ్రకోలి ఆల్మండ్ సూప్ కావల్సిన పదార్ధాలు బ్రకోలి – ఒకటి ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – ఆరు (సన్నగా తరగాలి) బాదం పప్పులు – పదహారు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు బటర్ – టీ స్పూను పాలు – కప్పు మిరియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా బ్రకోలిని ముక్కలుగా తరుక్కోవాలి. ►పాన్ వేడెక్కిన తరువాత బటర్, ఆయిల్ వేయాలి. ►బటర్ కరిగిన వెంటనే వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇప్పుడు బాదం పప్పులు, బ్రకోలి వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. ►ఇవన్నీ ఉడికిన తరువాత, చల్లారానిచ్చి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును మరో పాన్‌లో వేసి నీరంతా ఇగిరేంత వరకు మరిగించాలి. ►ఇప్పుడు పాలు పోసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి, మిరియాల పొడితో గార్నిష్‌చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
Delicious Winter Soups: గుమ్మడి సూప్, మటన్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... గుమ్మడి సూప్ కావల్సిన పదార్ధాలు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – రెండు గుమ్మడి తరుగు – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – అరటీస్పూను నీళ్లు – రెండు కప్పులు క్రీమ్ – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ►ఇవి కూడా వేగిన తరువాత గుమ్మడి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి రెండు కప్పులు నీళ్లు పోసి కలపి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఉడికిన తరువాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఐదు నిమిషాలు మరిగించి, క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మటన్ సూప్ కావల్సిన పదార్ధాలు మటన్ – పావుకేజీ నీళ్లు – రెండు కప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను పసుపు – అర టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను జీలకర్ర పొడి – పావు టీస్పూను గరం మసాలా – అర టీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను తయారీ విధానం ►మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. ►ప్రెజర్ కుకర్ గిన్నెలో మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్టు, మిరియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పులు నీళ్లుపోయాలి. ►వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి. ►కుకర్ ప్రెజర్ పోయాక మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మటన్ సూప్ రెడీ. చదవండి: Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్! -
రుచులూరే వేడివేడి వింటర్ సూప్స్ తయారు చేయండిలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బీట్రూట్ చికెన్ సూప్ కావల్సిన పదార్ధాలు చికెన్ – పావుకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఆరు అల్లం – అరంగుళం ముక్క ఉల్లిపాయలు – రెండు బీట్రూట్ – రెండు మిరియాల పొడి – టీ స్పూను బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►పాత్రను తీసుకుని.. శుభ్రంగా కడిగిన చికెన్, ఒక ఉల్లిపాయను ముక్కలు తరిగి వేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, లీటరు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ►ఉడికించిన మిశ్రమం నుంచి చికెన్, స్టాక్‌ను వేరుచేసి పక్కనబెట్టుకోవాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కిన తరువాత బటర్ వేయాలి. ►మిగిలిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మిగిలిన ఉల్లిపాయను ముక్కలు తరిగి వేసి వేయించాలి. ►ఇవి రెండూ వేగిన తరువాత చికెన్ స్టాక్, బీట్రూట్ ముక్కలు మరికొన్ని నీళ్లు పోసి మరిగించాలి. ►పది నిమిషాలు మరిగాక చికెన్ ముక్కలు వేసి మరో ఇరవై నిమిషాలు మరిగించి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్‌చేయాలి. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. స్వీట్ కార్న్ వెజ్ సూప్ కావల్సిన పదార్ధాలు పేస్టు కోసం: స్వీట్‌కార్న్ గింజలు – అరకప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు సూప్: ఆయిల్ – మూడు టీస్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – రెండు అల్లం – అంగుళం ముక్క స్ప్రింగ్ ఆనియన్ తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు క్యారెట్ తరుగు – పావు కప్పు బీన్స్ తరుగు – పావు కప్పు నీళ్లు – మూడు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాలపొడి – టీ స్పూను వెనిగర్ – టీస్పూను కార్న్‌ఫ్లోర్ – టీస్పూను (పావు కప్పు నీటిలో కలిపి పెట్టుకోవాలి) తయారీ విధానం ►ముందుగా అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. ►తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పావు కప్పు స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ తరుగును వేసి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. ►ఇప్పుడు పేస్టుకోసం తీసుకున్న స్వీట్‌కార్న్‌ను రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు వేయించాలి. ►ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు మరిగించాలి. ►మరిగాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ►సూప్ మిశ్రమం చిక్కబడిన తరువాత మిరియాల పొడి, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్ వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!
టెక్సాస్: రెస్టారెంట్లలో సర్వ్ చేసేవాళ్లతో కొంతమంది కస్టమర్లు ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంటారో చూసే ఉంటాం. అంతేకాదు మరికొంతమంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చాడంటూ సర్వ్ చేసేవాళ్లను చేయి చేసుకుడమే కాక అక్కడ ఉన్న ఫర్నేచర్ను పాడు చేసిన వార్తలు కూడా విన్నాం. కానీ ఇక్కడొక రెస్టారెంట్‌లోని మహిళా ఆ కస్టమర్లందరీ కంటే ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణంగా ప్రవర్తించింది. (చదవండి: విమానాలకు రన్‌వేగా....) అసలేం జరిగిందంటే.. టెక్సాస్‌లోని రెస్టరెంట్లో ఒక కస్టమర్ స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయిత ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్‌లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆమె కోపంతో రెస్టారెంట్ మేనేజర్ జన్నెల్లే బ్రోలాండ్ వద్దకు వచ్చి జరిగిన విషయం వివరిస్తుంది. అంతేకాదు ఏవిధంగా ఆ సూప్ కంటైనర్ మూత కరిగిపోయిందో చూపిస్తూ మేనేజర్‌పై కోపంగా అరుస్తూంది. కాసేపటికి ఉన్నటుండి ఆ వేడివేడి సూప్‌ను మేనేజర్ బ్రోలాండ్ ముఖంపైన విసిరేసి హడావిడిగా పరుగెత్తుతూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు బ్రోలాండ్ షాక్‌కి గురవుతోంది. ఈ మేరకు బ్రోలాండ్ వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆమె వెళ్లిపోతున్న కారుని ఫోటోలు తీసి టెక్సాస్‌లో పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ప్రస్తుతం సదరు కస్టమర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు కస్టమర్ తీరుని విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) -
ఆ కష్టం తెలుస్తోంది!
‘‘మన భోజనం మన చెంతకు చేరడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవు తోంది’’ అంటున్నారు సమంత. ఇటీవలే ఆమె తన టెర్రస్‌పై గార్డెనింగ్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ గార్డెనింగ్ క్లాసుల ద్వారా తెలుసుకుంటున్న కొత్త విషయాలు తనకు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయని అంటున్నారు సమంత. ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ – ‘‘ఆసక్తికర విషయాలు తెలుసుకునే సమయం మీ దగ్గర ఉన్నట్లయితే గార్డెనింగ్‌ను స్టార్ట్ చేయమని నేను సలహా ఇస్తాను. ప్రస్తుతం నేను గార్డెనింగ్ చేస్తున్నాను. ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్ ను నేను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. నా భోజనం ప్లేటు నా టెబుల్పైకి రావడం వెనక ఎంత పెద్ద పని దాగి ఉందో అర్థం అవుతోంది. ఒక చిన్న విత్తనాన్ని నాటినప్పుడు అది భూమిని చీల్చుకుని పైకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఆ తర్వాత అది రోజులు, నెలలు, సంవత్సరాలు పెరుగుతుంది. ఈ విధానానికి మనం అందరం కనెక్టయ్యే ఉంటామని మనం అర్థం చేసుకోవాలి’’ అన్నారు. అలాగే సమంత కుకింగ్ క్లాసుల్లో చేరారు. ఓ సూపర్ సూప్‌ను తయారు చేశారు. తన గార్డెనింగ్‌లో పెరిగిన మొక్కల ఆకులతోనే సమంత ఈ సూప్‌ను తయారు చేశారట. ఇంకా ఫెయిల్ అవుతున్నాను కొబ్బరికాయను వెంటనే పగలుకొట్టడంలో తరచూ ఫెయిల్ అవుతుంటానని అంటున్నారు సమంత. ‘‘చాలా ఏళ్లు గడిచాయి. దాదాపు 50 సినిమాల కోసం కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చింది. అలా యాభైసార్లు ప్రాక్టీస్ కూడా చేశాను. కానీ కొబ్బరికాయను కొట్టడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నాను. కొందరు కొన్ని విషయాలు ఎప్పటికీ నేర్చుకోలేరు’’ అని సమంత తన ఇన్ స్టాగ్రాగామ్లో షేర్ చేశారు. సూప్ రుచి చూస్తున్న సమంత -
రైస్ ఫ్లోర్ సూప్
కావలసినవి చిన్నచిన్న ముక్కలుగా తరిగిన క్యారట్ + క్యాబేజి + బీన్స్ + బఠాణీ – 5 కప్పులు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూను; పాలు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తి మీర – కొద్దిగా; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారి ∙స్టౌ మీద బాణలి వేడి చేశాక, బటర్ వేసి కరిగించాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙కూర ముక్కలు, ఉప్పు జత చేసి మరో రెండు నిమిషాలు వేయించాలి ∙మూడు కప్పుల నీళ్లు జత చేసి, ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి ∙ఒక చిన్న గిన్నెలో పాలు, బియ్యప్పిండి వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కూరముక్కలలో వేసి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి ∙మిరియాల పొడి, కొత్తిమీర జత చేస్తే, వేడి వేడి రైస్ ఫ్లోర్ సూప్ రెడీ అయినట్లే ∙బ్రెడ్ లేదా పావ్‌తో అందించాలి. -
కూరలు చేయ పువ్వు తెచ్చాను
పెరటిలోన అరటంట...ఫలములెన్నో ఇచ్చునంట...పండు అరటి..కూర అరటి....మరి పువ్వు?దానితో కూడా కూర చేయవచ్చునట...పోపు వేసి రుచి చూడవచ్చునట...పువ్వు ఒకటేనట.... పదార్థం పదునారు రకాలట.పూజలు చేయడానికి తెచ్చే పూలు వేరు. కూరలు చేయడానికి ఈ పువ్వు తెండి. సుష్టుగా తినండి. అరటి పువ్వు– పెసర పప్పు కూర కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పెసర పప్పు – పావు కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 3; అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – పావు టీ స్పూను; నూనె – 5 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా. తయారీ: ∙అరటి పువ్వును ముందుగా శుభ్రం చేసుకోవాలి ∙పైన ఉన్న డిప్పలు తీసి, లోపల ఉన్న వాటిలో నుంచి మద్యభాగంలో ఉండే కేసరం తీసేయాలి ∙శుభ్రం చేసిన అరటిపువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసుకోవాలి ∙ఒక గిన్నెలో నీళ్లు, తగినంత పసుపు వేసి బాగా కలిపి, కచ్చాపచ్చాగా చేసుకున్న అరటిపువ్వును అందులో వేసి రెండుమూడు సార్లు బాగా కడగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వుకు తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించి, చల్లారాక, గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బాగా వేయించాక పసుపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి ∙కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి ∙అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాక, ఉడికించిన అరటి పువ్వు మిశ్రమం, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి, చివరగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి, మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అరటి పువ్వు పికిల్ కావలసినవి: అరటి పువ్వు – 1; ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి – 6 రెబ్బలు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు వేయించి, దింపేసి చల్లారనివ్వాలి ∙వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండు మిర్చి, వేయించిన ధనియాల మిశ్రమం వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అరటి పువ్వు వేసి పచ్చి వాసన పోయేవరకు సుమారు పది నిమిషాలు వేయించాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపి, ఎండు మిర్చి మిశ్రమంలో వేసి, తగినంత ఉప్పు జత చేయాలి ∙ఉడికించి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి, మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, సెనగ పప్పు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అరటిపువ్వు – పులిహోర కూర కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పచ్చి మిర్చి – 3; సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు; ఎండు మిర్చి – 2; పసుపు – అర టీ స్పూను; చింతపండు పులుసు – అర కప్పు; ఉప్పు – తగినంత; పోపు సామాను – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టీ స్పూను; తయారీ: ∙అరటి పువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి బయటకు తీసి, పసుపు నీళ్లతో రెండు మూడు సార్లు కడగాలి (ఇలా చేయడం వల్ల వగరు పోతుంది) ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, సెనగ పప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙పసుపు, చింతపండు పులుసు, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙కచ్చాపచ్చాగా చేసిన అరటి పువ్వు జత చేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙ఆవ పొడి జత చేసి బాగా కలిపి దింపేసి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. అరటి పువ్వు వడ కావలసినవి: అరటి పువ్వు – 1; పసుపు – ఒక టేబుల్ స్పూను; పెరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; సోంపు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర – ఒక కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ :అరటి పువ్వును శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వు తరుగు, తగినన్ని నీళ్లు, కొద్దిగా పసుపు, రెండు టీ స్పూన్ల పెరుగు జత చేసి మూత పెట్టి సుమారు మూడు గంటలసేపు పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి గంట సేపు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో... సెనగ పప్పు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేసి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙అరటి పువ్వుకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్లు గట్టిగా పిండి తీసేయాలి.∙∙ఒక గిన్నెలో ఉడికించిన అరటి పువ్వును వేసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙మెత్తగా చేసుకున్న సెనగ పప్పు మిశ్రమం, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి అన్నీ కలిసేవరకు కలపాలి ∙ కొద్దికొద్దిగా మిశ్రమం చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న వడలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి. అరటి పువ్వు కొబ్బరి పచ్చడి కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); కొబ్బరి తురుము – ఒక కప్పు; పచ్చి మిర్చి – 4; ఎండు మిర్చి – 10; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; తాలింపు – ఒక టే బుల్ స్పూను. తయారీ: ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి పసుపు కలిపిన చన్నీళ్లతో మూడునాలుగు సార్లు బాగా కడగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వాలి ∙ వేయించిన పోపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙ అరటి పువ్వు వేసి మరోమారు తిప్పాలి ∙కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి ∙వేయించిన తాలింపు గింజలు జత చేసి కలిపి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. అరటి పువ్వు పులుసు కూర కావలసినవి: అరటి పువ్వు – ఒక కప్పు; ఆవ పొడి – ఒక టీ స్పూను; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో ముక్కలు – అర కప్పు; చింతపండు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); మిరప కారం – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో ముక్కలు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాక, తగినంత ఉప్పు జత చేసి కలపాలి ∙పసుపు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన అరటి పువ్వును జత చేయాలి ∙మిరపకారం వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ∙చింతపండు రసం వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ∙ఆవ పొడి వేసి కలియబెట్టాలి ∙తగినంత నువ్వుల పొడి వేసి మరోమారు కలపాలి ∙కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర చూడటానికి గ్రేవీ మాదిరిగా వస్తుంది. అరటి పువ్వు కందిపప్పు కూర కావలసినవి: అరటి పువ్వు – 1; కంది పప్పు – ఒక కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 3; వెల్లుల్లి రెబ్బలు – 5; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ∙కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి ఉడికించాలి (మరీ ముద్దగా చేయకూడదు) ∙అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి, కచ్చాపచ్చాగా చేసి, పసుపు నీళ్లలో రెండు మూడుసార్లు కడిగి, గట్టిగా పిండి నీరు తీసేయాలి ∙ఉడికిన పప్పులో వేసి బాగా కలపాలి ∙తగినంత ఉప్పు, పసుపు జత చేసి కలపాలి ∙మిరప కారం జత చేసి మరోమారు కలిపి, తడిపోయే వరకు ఉడికించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ∙జీలకర్ర, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి కలిపి, ఉడికించిన కందిపప్పు అరటి పువ్వు కూరలో వేసి కలిపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. కదంబం శాకంభరీ పూజల సందర్భంగా అమ్మవారికి నివేదన చేసే ‘కదంబం’ కావలసినవి: బియ్యం – 1 కప్పు; కంది పప్పు – ఒక కప్పు; చింతపండు రసం – 1 టేబుల్ స్పూను; బెండకాయలు – 4; క్యారట్ – 1; చిలగడ దుంప – 1; బంగాళదుంప – 1; వంకాయలు – 2; క్యాప్సికమ్ – 1; బఠాణీ – పావు కప్పు; తీపి గుమ్మడి కాయ ముక్క – చిన్నది; చిక్కుడుకాయ ముక్కలు – పావు కప్పు; సాంబారు పొడి – 1 టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – 1 టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు రెమ్మలు – 2 తయారీ: కూరగాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కందిపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙బియ్యం శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి ∙ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసి మరోమారు వేయించాలి ∙సాంబారు పొడి, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపాక, ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరోమారు కలపాలి ∙కొద్దిగా ఉyì కిన తరవాత అన్నం, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. కదళీ కుసుమం కాంతివర్ధకం భారతీయ సనాతన ఆచారాలలోనూ, తెలుగు సంస్కృత కవీశ్వరుల కలాలలోనూ, ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్ర ఔషధ కోశాగారంలోనూ... ఈ మూడు చోట్లా ఆశ్రయం పొంది మిసమిసలాడిన ముద్దుగుమ్మ మన ‘రంభ’. అదే జగద్విదితమైన అరటికి మరోపేరు. పర్యాయ పదాలు... కదళీ (రీ), సుఫలా, మోచా, వారణ, వనలక్ష్మీ, ఊరుస్తంభా గుచ్ఛఫలా, సత్పత్రీ మొదలైనవి.హైందవ శుభకార్యాల పందిళ్లలో కనిపించేది అర టిచెట్టు, ఆహారం వడ్డించే విస్తరాకు అరటి ఆకు, ఆకులోని అమోఘమైన ఫలం అరటిపండు, నదీ జలాలలో తళతళలాడే కార్తీక దీపాలను నిలబెట్టేది అరటికాండపు ముక్క. మృదుమధురంగా సునాయాసంగా అర్థమయ్యే కవితారసాన్ని కదళీపాకం అంటారు. కవులు తమ వర్ణనలలో, కోమలత్వాన్ని సూచించే ఉపమాన ద్రవ్యం కదళీకాండం. ఆయుర్వేదంలో అరటి యొక్క పంచాంగాలనూ (ఫలం, పత్రం, పుష్పం, మూలం, కాండం) రకరకాల వ్యాధులలో ఔషధ ద్రవ్యంగా ప్రయోగిస్తారు.అరటికాయకి తియ్యదనంతో పాటు కొంచెం వగరు కూడా ఉంటుంది. చలవ చేస్తుంది. మల బంధకం. పరిపూర్ణంగా పక్వమైతే (పండు) దానికి తియ్యదనం పెరిగి వగరు తగ్గుతుంది. బక్కచిక్కిన వారికి బరువు పెరగడానికి ఉపయోగకరం. అరుచిని పోగొడుతుంది. ప్రమేహాన్ని కూడా పోగొడుతుంది. శీతలం, శుక్రకరం. ఆకలిదప్పికలను తగ్గిస్తుంది. అరటి పువ్వు:ఇది అరటికాయ గెలలకు క్రింది భాగంలో చాలా సుందరంగా వ్రేలాడుతుంటుంది. పైన కనపడే ఎరుపునలుపుల వెడల్పైన రేకలను తొలగిస్తుంటే లోపల అగ్గిపుల్లల మాదిరి కనబడే పువ్వుల గుత్తులు కనబడతాయి. ప్రతి నాళిక పైన స్వచ్ఛమైన ఉల్లిపొరలాంటిది ఉంటుంది. దాన్ని తొలగిస్తే తినదగిన పుష్పనాళికల మధ్య ఒక ముదురు కేసరం కనిపిస్తుంది. ఇది తినడానికి పనికిరాదు. తినదగిన ఈ పువ్వులు వాతావరణానికి సోకితే క్రమేపీ నల్లబడిపోతాయి. నీటిలో నానబెట్టి ఉంచితే నల్లబడదు. పువ్వులోని పోషక విలువలు – ఆరోగ్య ప్రయోజనాలు: పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉంటుంది. నీటిలో కరిగిపోయే పీచు, కరగని పీచు ఈ రెండూ ఉంటాయి. కరగని పీచువల్ల రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. కరిగే పీచు వల్ల అతిసారం (అధిక విరేచనాలు) తగ్గుతాయి. కనుక ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి మంచి గుణకారి. అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ ఆమ్లం, ఇతర రసాయనాల వల్ల మధుమేహాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. పిండి పదార్థాలు తగుమాత్రం ఉన్నా ‘శర్కర శాతం, సోడియం, కొలెస్టరాలు’ శూన్యం. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కనుక అధిక రక్తపోటుని తగ్గించి, కండరాలకు శక్తినిస్తుంది. ఐరన్, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. రక్తహీనతను పోగొడుతుంది.‘మెగ్నీషియం, ప్రొటీన్లు తగినంత లభిస్తాయి. ఆందోళన, నరాల వ్యాధులను తగ్గిస్తాయి. అల్జీమర్సు, పార్కిన్సోనియం వంటి వ్యాధులలో గుణకారిగా చెప్పవచ్చు.ఎ, సి, ఇ విటమిన్లు దండిగా ఉంటాయి. చర్మకాంతికి మంచిది. స్త్రీలలో అధిక ఋతుస్రావాన్ని అరికడుతుంది. కంటి రోగాలకు మంచిది. దీనిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్రిమిహర ంగాను, అకాల వార్ధక్యాన్ని తగ్గించేదిగాను ఉపకరిస్తుంది. క్యాన్సరు రోగులకు కూడా మంచిది.ప్రసూతులలో తల్లిపాలను సమృద్ధిగా కలిగేట్టు చేస్తుంది. అరటిపువ్వు అంతా బలమే (ఆయుర్వేదం)ప్రాచీన ఆయుర్వేద వైద్య పుంగవులైన చరక సుశ్రుత వాగ్భటులందరూ అరటి ద్రవ్యాలను రకరకాలైన వ్యాధులను నయం చేయటానికి ప్రయోగించారు. ఇతర ఆయుర్వేద వైద్య గ్రంధాలలో కూడా దీని ఔషధ విలువలు ఉటంకించబడ్డాయి.రాజ నరహరి నామధేయుడైన నృసింహ పండితుడు రాజ నిఘంటువు గ్రంధ రచయిత. అందులోని శ్లోకం...రంభాఫలం కషాయ మధురం బల్యంచ శీతం తథా‘పిత్తం అస్రవిమర్దనం గురుతరం పథ్యం న మందానవే‘‘సత్యః శుక్రవివృద్ధిదం క్లమహరం తృష్ణాపహరం కాంతి దం‘దీప్తాగ్నౌ సుస్వదం కషాయకరం సంతర్పణం దుర్జరం‘‘బాలం ఫలం మధురం... పుష్పం తదపి అనుగుణం,క్రిమిహారి, కందం పర్ణంచ శూలశమకం కదలీ భవం స్యాత్ గమనిక: పైన చెప్పిన ఆధునిక శాస్త్రజ్ఞులు వివరించిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఉదా: దుర్జరం : వార్ధక్యాన్ని నిలుపుతుంది సద్యః క్లమహరం: తక్షణ శక్తినిస్తుంది. సంతర్పణం : కృశత్వాన్ని పోగొట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రిమిహారి: యాంటిసెప్టిక్ మరియు యాంటీ బయోటిక్ఉబ్బసానికి కూడా మంచిది. ఎలా తినాలి?పువ్వు రేకల్ని నీళ్లల్లో నానబెట్టిన అనంతరం, ఇతర సలాడ్స్‌తో కలిపి పచ్చివి తినవచ్చు లేదా సూప్‌గా తయారుచేసుకోవచ్చు. పువ్వు పచ్చడి: శుభ్రపరచిన పువ్వుని చిన్న ముక్కలుగా తరిగి, కొంచెం ఆవాలు, నువ్వులపప్పు, మిరపకాయలు ముద్దగా చేసి, ఈ రెంటినీ కలపాలి. ఆ మిశ్రమానికి తగినంత ఉప్పు, చింతపండు/నిమ్మరసం జత చేసి, ఇంగువ పోపు పెట్టాలి. తినేటప్పుడు చిక్కటి పెరుగుని కూడా కలుపుకుని, అన్నంలోను, రొట్టెలలోను కూడా తినవచ్చు. మంచి వ్యంజనం.గుర్తుంచుకోవలసిన సారాంశంఇతర కుసుమ సౌరభములు ఎదకు హితముఅన్ని వ్యాధులు తగ్గించు అరటి పువ్వుసకల శక్తులు బలపర్చి శాంతిజేయురంభ శక్తిని గుర్తించి ప్రజ్వరిల్లు! మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
జలుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి. ♦ సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... ♦ రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ♦ ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. ♦ వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ♦ ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి. ♦ ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. ♦ కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం. ♦ జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
జులుబుకు ఏ సూప్ మంచిదంటే!
వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావం చూపుతాయి. అవి, జలుబు, ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం, దగ్గు రూపంలో బాధిస్తాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జులుబు, జ్వరం, దగ్గు సమస్యల ఉపశమనానికి... చికెన్ సూప్: ఉల్లికాడలు, ఉల్లిపాయలు, మిరియాల పొడి కలిపి తయారుచేసుకున్న చికెన్ సూప్ జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం ఇస్తుంది. మష్రూమ్/పాల కూర సూప్: శాకాహారులు పుట్టగొడుగులు, పాలకూరలతో సూప్‌లను తయారుచేసుకోవచ్చు. దీంట్లోనూ ఉల్లికాడలు, మిరియాలు, వెల్లుల్లి, జిలకర్ర కలిపి తయారుచేసుకొని సేవించాలి.సూప్‌లు ఏ సమయంలోనైనా వేడి వేడిగా తీసుకుంటే రుచిగానూ ఉంటాయి. అనారోగ్యసమస్యల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే... రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ‘సి’ విటమిన్, యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఈ సీజన్లో నీటి కాలుష్యం ఎక్కువ. వడకట్టడం, మరిగించి చల్లార్చిన నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే విరేచనాలు అవుతుంటాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే పెరుగు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒకరోజు లేదా 15 రోజులకొకసారి ఉపవాసం ఉండాలి. అంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా కాదు. ఆ రోజు మొత్తం కూరగాయలు, పండ్లు, పళ్ల రసాలు, నీళ్ల మీదే ఉండాలి. వేరే ఇతర ఆహార పదార్థాలేవీ తీసుకోకూడదు. దీని వల్ల శరీరంలో మలినాలు తొలగి, జీర్ణవ్యవస్థ పనితీరు చురుకు అవుతుంది. శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా శాతం పెరిగి అనారోగ్యసమస్యలు దరిచేరవు. ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్‌లు ఈ కాలం చాలా మంచివి. ఈ కాలం మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తుంటాయి. అలాగే – ఊపిరితిత్తులు, ముక్కుకు సంబంధించినవి, మలబద్దకం సమస్యలకు అవకాశాలు ఎక్కువ. రోజులో 2–3 లీటర్లు శుభ్రమైన నీళ్లు సేవిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే విరేచనం సాఫీగా అవుతుంది. కాయగూరల్లో బీట్రూట్, క్యారెట్ వంటి సూప్‌లను ఎర్రకందిపప్పును ఉపయోగించి తయారుచేసుకోవాలి. ఇది సలాడ్‌లా తయారుచేసుకొని భోజనంలా కూడా తినవచ్చు. ∙టొమాటో రసం, టొమాటో పప్పు.. టొమాటోతో కూడిన వంటకాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యకరం.జీర్ణకోశం నుంచే రోగనిరోధక కణాలు పుడుతూ ఉంటాయి. అందుకని జీర్ణకోశాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఈ కాలం అంత ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాన్ని విస్మరించకూడదు. – డాక్టర్ బి.జానకి, న్యూట్రిషనిస్ట్ -
హెల్దీ సూప్
చికెన్ అండ్ హాట్ సోర్ సూప్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – 85 గ్రా.; క్యాబేజి – 30 గ్రా. (సన్నగా తర గాలి); క్యారట్ – 30 గ్రా.లు (సన్నగా తరగాలి); మొక్కజొన్న పిండి – ఒకటిన్నర టీ స్పూన్; నూనె – 10 గ్రా; ఉప్పు – అర టీ స్పూన్; వెల్లుల్లి – 4 టీ స్పూన్లు (సన్నగా తర గాలి); కారం – అర టీ స్పూన్; పంచదార – 1 టీ స్పూన్; మిరియాలపొడి – అర టీ స్పూన్; ఉల్లిపాయ – ఒకటి (పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి); సోయసాస్ – అర టేబుల్ స్పూన్; వెనిగర్ – 1 టేబుల్ స్పూన్ తయారీ: చికెన్‌ని శుభ్రపరిచి మూడుకప్పుల మంచినీళ్లు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడకబెట్టాలి. దీనిని చికెన్ స్టాక్ అంటారు. (ఈ చికెన్ స్టాక్‌ని వడకట్టుకుని ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు నిల్వ ఉంచుకుని, కావల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.) పాన్‌లో నూనె వేడయ్యాక వెల్లుల్లి, క్యాబేజి, క్యారట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. ముక్కలు ఎర్రబడకూడదు. దాంట్లో చికెన్ స్టాక్ ముక్కలతో సహా పోసి ఉడికించాలి. అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి, పంచదార, వెనిగర్, సోయసాస్ వేసి కలిపి పది నిమిషాలు ఉంచాలి. చల్లని నీటిలో మొక్కజొన్న పిండిని కలిపి దాన్ని ఉడుకుతున్న మిశ్రమంలో పోస్తూ కలపాలి. దించి సర్వ్ చేసేముందు చిల్లీసాస్ చల్లితే రుచిగా ఉంటుంది. నోట్: చికెన్ తిననివారు కూరగాయ ముక్కల్ని ఉడికించి పైవిధంగానే వెజిటబుల్ సూప్‌ని తయారుచేసుకోవచ్చు. -
క్యాలిఫ్లవర్ సూప్
కావలసినవి: బటర్–రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ–ఒకటి(తరగాలి), బంగాళాదుంప–ఒకటి, తరిగిన క్యాలిఫ్లవర్–నాలుగుటేబుల్ స్పూన్లు, పాలు–ఒక కప్పు, చీజ్–ఒక స్లైస్ తయారి: బాణలిలో వెన్న వేసి వేడయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల సేపు వేగనివ్వాలి. అప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసి నాలుగు నిమిషాల సేపు వేయించిన తర్వాత క్యాలిఫ్లవర్ వేయాలి. పిల్లలు ఇష్టపడేటట్లయితే క్యారట్ లేదా కూరగాయలను కూడా వేసుకోవచ్చు. క్యాలిఫ్లవర్ వేడయిన తర్వాత కూరగాయల ముక్కలు వాటిని ఉడికించిన నీటితో సహా బాణలిలో వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫుడ్ ప్రాసెసర్‌లో బ్లెండ్ చేయాలి. దీనిని సాస్ పాన్‌లో వేసి సన్నమంట మీద ఉడికించి, పాలు పోసి, ఉప్పు కలిపి చీజ్‌తో గార్నిష్ చేయాలి. సూప్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. ఇది ఈవెనింగ్ స్నాక్‌గా అయితే పిల్లలు ఇష్టపడతారు. పిల్లలకు ఉదయం పూట ఇవ్వాలంటే చల్లగా ఇవ్వాలి. ముందు రోజు సాయంత్రం చేసి ఆ మర్నాడు ఉదయం తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. కూరగాయలు ఉడికించిన నీటికి బదులుగా కాని వాటితోపాటు కాని చికెన్ ఉడికించిన నీళ్లు, కోడిగుడ్డులోని తెల్లసొన వాడవచ్చు. పోషకాలు: ఎనర్జీ : 435 క్యాలరీలు, ప్రొటీన్లు – 17గ్రా; కార్బోహైడ్రేట్లు – 33గ్రా; ఫ్యాట్ – 33 గ్రా, ఐరన్ – 4 మి.గ్రా. -
పిట్టగూడు సూప్
రూ.64వేలు (కేజీకి) సూప్‌గా చేసుకుని తినే ఈ గూళ్ల ధర ♦ కాస్తంత గడ్డకట్టిన తమ లాలాజలంతో బుల్లిపిట్టలు కట్టుకున్న గూళ్లు ఇవి. ♦ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఈ గూళ్లను స్విఫ్ట్‌లెట్ జాతి చిన్న పక్షులు నిర్మిస్తాయి. ♦ వీటిని తింటే శృంగార జీవితం బాగుంటుందని, ఊపిరితిత్తుల వ్యాధులు రావని, చర్మం కాంతివంతం అవుతుందని నమ్ముతారు. ♦ ఇవి తింటే వృద్ధాప్యం త్వరగా రాదని నమ్ముతారు. ♦ చైనా, హాంకాంగ్, తైవాన్‌లో ఈ గూళ్లకు డిమాండ్ ఎక్కువ. ♦ వ్యాపారం కోసం చైనాలో కాంక్రీట్ భవంతుల్లోనూ పక్షులను పెంచి అవి అక్కడే గూళ్లు కట్టేలా చేస్తున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా ఈ గూళ్ల వ్యాపారం విలువ అక్షరాలా ఐదు బిలియన్ డాలర్లు. ♦ ఆగ్నేయాసియాలో ఈ వ్యాపారం మరింత ఎక్కువ. ♦ చీకటి గుహల్లో, కొండ అంచు దిగువన ఎక్కువగా ఉంటాయి. -
'పోటుగాడు' ఎనీటైమ్ ఎనీ సెంటర్
బంతిని తీసుకొని గట్టిగా గోడకేస్తే అంతే గట్టిగా వెనక్కి వస్తుంది. మరి పొటాటోని వేస్తే ఏమవుతుంది? గోడ తినేస్తుంది. ఇట్ ఈజ్ సో టేస్టీఎక్కడైనా ఎప్పుడైనా కలిసిపోయే రకం. అలూని ఆర్డినరీగా చూడకండి. అబ్సల్యూట్లీ పోటుగాడు ఈ పొటాటోగారు. స్టఫ్డ్ పొటాటో కావల్సినవి: బంగాళదుంపలు – 4 (80శాతం ఉడికించాలి), పనీర్ – 100 గ్రాములు, నల్లమిరియాల పొడి – పావు టీ స్పూన్, జీడిపప్పులు – 8–10, మైదా – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్నముక్క, క్రీమ్ – అర కప్పు, కొత్తిమీర తరుగు – 2–3 టేబుల్ స్పూన్లు, నూనె – వేయించడానికి తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ధనియాల పొడి – 1 1/2 టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్ తయారీ: ∙బంగాళదుంపల పై పొట్టు తీసి మిశ్రమం కూరడానికి (స్టఫ్) అనువుగా కత్తితో చేయాలి. మిశ్రమం తయారీ: ∙పనీర్‌ను తరగాలి. దీంట్లో మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, జీడిపప్పు పలుకులు, మిగిలిన ఆలూ గుజ్జు వేసి కలపాలి. ∙ఒక బంగాళ దుంప తీసుకొని సిద్ధం చేసిన మిశ్రమాన్ని అందులో కూరాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి, అందులో మిశ్రమాన్ని కూరిన బంగాళదుంçపను వేసి వేయించాలి. మిగతా దుంపలన్నీ అలాగే సిద్ధం చేసుకోవాలి. దుంపలు వేగిన తర్వాత గిన్నెలో అడుగున కొద్దిగా నూనె మిగిలిపోతుంది. దీంట్లో జీలకర్ర, ఇంగువ, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. దీంట్లో టొమాటో ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కారం, మసాలా వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి 4–5 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక స్టఫ్డ్ బంగాళదుంపలను వేసి ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగు వేసి దించాలి. ఇది చపాతీ, పరాటా, రోటీ, అన్నంలోకి బాగుంటుంది. సూప్ కావల్సినవి: బంగాళదుంపలు – 6 (ముక్కలుగా కట్ చేయాలి), క్యారెట్లు – 2 (సన్నగా తరగాలి), కొత్తిమీర కాడలు – 6 (సన్నగా తరగాలి), నీళ్లు – 8 కప్పులు, ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), బటర్ క్యూబ్స్ – 6, ఉప్పు – తగినంత, మైదా – 6 టేబుల్ స్పూన్లు, పాలు – 1 1/2 కప్పు తయారీ: ∙బంగాళదుంప, క్యారెట్, కొత్తిమీర తరుగులను నీళ్లలో వేసి స్టౌమీద పెట్టి 15–20 నిమిషాలు ఉడికించి, వడకట్టాలి. అదే పాన్‌లో ఉల్లిపాయలు, బటర్, మైదా, ఉప్పు కలిపి పాలు పోసి మరిగించాలి. మిశ్రమం చిక్కబడ్డాక ఉడికించిన కూరగాయల ముక్కలు వేసి, వడకట్టి ఉంచిన నీళ్లు పోసి కలపాలి. సూప్ కప్పులో పోసి వేడి వేడిగా అందించాలి. బంగాళదుంప చికెన్ ఫజిట కావల్సినవి: బంగాళదుంపలు – 2 (పెద్దవి), చికెన్ ముక్కలు – 6 (స్కిన్ లెస్, బోన్ లెస్), పెద్ద మిర్చి (పసుపు రంగువి) – పావు కప్పు, పెద్ద మిర్చి (నారింజ రంగువి) – పావు కప్పు, ఉల్లిపాయలు – అర కప్పు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, కారం – కొద్దిగా, మిరియాల పొడి – చిటికెడు, జీలకర్ర పొడి – చిటికెడు, నిమ్మరసం – అర టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు తయారీ: ∙ఆలివ్ ఆయిల్, కొద్దిగా ఉప్పు కలపాలి. బంగాళదుంప పై తొక్క తీసి పైన ఉప్పు కలిపిన ఆలివ్ ఆయిల్‌ను రుద్దాలి. ∙ఒక్కో బంగాళదుంపకు ఫాయిల్ పేపర్‌ను చుట్టి అవెన్‌లో బేక్ చేసి (ఉడికించి) తీయాలి. లోపలి దుంప గుజ్జు తీయాలి. ∙చికెన్ ముక్కలకు మిరియాల పొడి, ఉప్పు పట్టించి, 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత పదునైన కత్తితో అతి సన్నగా తరగాలి. ∙విడిగా స్టౌ మీద పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీంట్లో చికెన్ తరుగు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి వేసి వేయించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. ఉడికిన బంగాళదుంపలో చికెన్ మిక్చర్‌ని కూరాలి. నోట్: టొమాటో ముక్కలు, తరిగిన ఛీజ్, వెన్నతో అలంకరించి వడ్డించాలి. దమ్ ఆలూ కావల్సినవి: చిన్న బంగాళదుంపలు – 12, నూనె – 7 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – 1 1/2 కప్పు, అల్లం తరుగు – టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్లు, ధనియాలు – 4 టేబుల్ స్పూన్లు, పసుపు – అర టీ స్పూన్, కారం – ముప్పావు టీ స్పూన్, గరం మసాలా – టీ స్పూన్, టొమాటో ముక్కలు – కప్పు, పెరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, వెన్న – పావు కప్పు తయారీ: ∙బంగాళదుంపల పై పొట్టు చెక్కి, 4 –5 చోట్ల గాట్లు పెట్టాలి. వీటిని చల్లటి నీళ్లలో వేయాలి. ∙పొయ్యిమీద గిన్నె పెట్టి 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక బంగాళదుంపలను నీళ్లనుంచి బయటకు తీసి వేయాలి. సన్నని మంట మీద వేగనివ్వాలి. తర్వాత వీటిని పేపర్ టవల్ మీద వేయాలి. ∙అదే గిన్నెలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేగాక అల్లం తరుగు వేసి వేయించాలి. దీంట్లో ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పెరుగు, ఉప్పు, వేయించిన బంగాళదుంపలు వేసి ఉడికించాలి. సన్నని మంట మీద కనీసం 35 నిమిషాలు ఉడకనివ్వాలి. మిశ్రమం కొంచెం లూజ్‌గా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలపాలి. చివరగా క్రీమ్, మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నూనె కలిపి దించాలి. కొత్తిమీర తరుగు చల్లి ఉప్పు తగినంత ఉందో లేదో సరిచూసుకొని అన్నంలోకి వడ్డించాలి. హల్వా కావల్సినవి: బంగాళదుంపలు – 400 గ్రాములు, పంచదార – కప్పు, నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి– అర టీ స్పూన్, నీళ్లు – టేబుల్‌స్పూన్, బాదం పప్పు – 10పిస్తాపప్పు – 10 తయారీ: ∙ఉడికిన బంగాళదుంపల పై పొట్టు తీసి, గుజ్జు చేయాలి. మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి. సన్నని మంట మీద ఉడికిస్తూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత గుజ్జు బంగారు రంగులోకి మారుతుంది. దీంట్లో పంచదార వేసి కలపాలి. పంచదార కరిగాక యాలకుల పొడి, తరిగిన బాదం, పిస్తాపప్పు వేసి కలపాలి. ఈ హల్వాను వేడి వేడిగా వడ్డించాలి. పాన్ కేక్ కావల్సినవి: బంగాళదుంప గుజ్జు (దుంపలను మెత్తగా ఉడికించి, గుజ్జు చేయాలి) – 3 కప్పులు, ఛీజ్ – పావు కప్పు, ఉల్లికాడల తరుగు – 2 టేబుల్ స్పూన్లు, గుడ్డు – 1 (గిలకొట్టాలి), మైదా – 3 టేబుల్ స్పూన్లు, మైదా – అర కప్పు, నూనె – పాన్ మీద వేయడానికి తగినంత, వెన్న – తగినంత తయారీ: ∙పెద్ద గిన్నెలో బంగాళదుంపల గుజ్జు, ఛీజ్, ఉల్లికాడలు, గుడ్డు, 3 టేబుల్ స్పూన్ల మైదా తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ పిండితో చిన్న చిన్న ఉండలు 12 చేయాలి. ప్రతి ఒక్క ఉండను అర ఇంచు మందంలో అదిమి, పరాటాలా చేయాలి. దీనికి మిగిలిన అర కప్పు మైదాను ఉపయోగించాలి. పాన్‌ను స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. దీనిపైన సిద్ధం చేసుకున్న పాన్‌కేక్‌ను వేసి, ఒక్కోవైపు 3–4 నిమిషాలు కాల్చాలి. బాగా కాగిన తర్వాత పేపర్ టవల్మీదకు తీసుకోవాలి. ఈ పొటాటో పాన్ కేక్స్ మీద వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పును పలుచగా చల్లాలి. వెన్న పైన పెట్టి ఉల్లికాడల తరుగును కొద్దిగా చల్లి సర్వ్ చేయాలి.