south asia
-
మైక్రోసాఫ్ట్‌కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగాల గురించి తెలిసే కొద్దీ, దానిపై సాధారణంగా నెలకొన్న వ్యతిరేకత స్థానంలో క్రమంగా సానుకూల ధోరణి పెరుగుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. తమ ’కోపైలట్’ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుతం కృత్రిమ మేథకు దాదాపు పర్యాయపదంగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ఏఐ డెవలపర్లలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అన్ని టెక్ కంపెనీలకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థపరంగా చూస్తే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని చందోక్ చెప్పారు. పటిష్టంగా డిమాండ్, సరఫరా.. ఇటు డిమాండ్ అటు సరఫరాపరంగా భారత మార్కెట్ పటిష్టంగా ఉందని చందోక్ చెప్పారు. ‘డిమాండ్‌పరంగా చూస్తే భారత్‌లో 7,000 పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది. సరఫరాపరంగా చూస్తే మైక్రోసాఫ్ట్‌కి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫాం ’గిట్‌హబ్’లో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్ నుంచి దాదాపు 1.5 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో ఈ సంఖ్య అమెరికాను కూడా దాటిపోతుంది‘ అని చందోక్ పేర్కొన్నారు. -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో షబానా సినీ స్వర్ణోత్సవం
బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కెరీర్లో గోల్డెన్ ఇయర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా (ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ) టొరంటో’ షబానా ఆజ్మీ సినీ స్వర్ణోత్సవాన్ని జరపనుంది. 13వ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో వేడుకలు కెనడాలో ఈ ఏడాది అక్టోబరు 10 నుంచి 20 వరకు జరగనున్నాయి. 22 భాషల్లోని 120 చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమవుతాయని అలాగే సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ నటి షబానా ఆజ్మీ స్వర్ణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని, ‘ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏ–టొరంటో ఫెస్టివల్’ నిర్వాహక అధ్యక్షుడు సన్నీ గిల్ పేర్కొన్నారు. ఇక 1950 సెప్టెంబరు 18న కైఫీ ఆజ్మీ (దివంగత ప్రముఖ గీత రచయిత), దివంగత నటి షౌకత్ కైఫీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించారు షబానా ఆజ్మీ. 150పైగా చిత్రాల్లో నటించారామె. షబానా ఆజ్మీ తొలి చిత్రం ‘అంకుర్’ 1974లో విడుదలైంది. దాంతో నటిగా షబానా ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నట్లయింది. ‘అంకుర్, అర్థ్ (1982), కందార్ (1984), పార్ (1984), గాడ్ మదర్ (1999) వంటి సినిమాలకు గాను షబానా జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకున్నారు.ఇంకా ‘శత్రంజ్ కే ఖిలాడీ – 1977 (ది చెస్ ప్లేయర్స్), మండీ (1983), ఫైర్ (1996), మక్డీ (2002)’ వంటి ఎన్నో హిట్ ఫిల్మ్స్‌లో నటించారామె. అంతేకాదు... అమెరికన్ మిలటరీ సైన్స్ ఫిక్షన్ టెలివిజన్ సిరీస్ ‘హాలో’ (2022–2024)లోనూ నటించి, హాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందారు. సినీ రంగానికి షబానా అందించిన సేవలకుగాను 1998లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. -
దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?
శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని, దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత? -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
భారత్‌ను మాల్దీవులు వదులుకోగలదా?
దక్షిణాసియాలో చిట్టచివరగా బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్య్రం పొందిన దేశం మాల్దీవులు. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ–సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు భారత్ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్ కాక్టస్ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదుల చెర నుండి కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రెండు మూడేళ్లుగా ఏకంగా ‘ఇండియా అవుట్’ ప్రచారానికి కేంద్రం అయింది. దీని వెనక ఐఎస్ఐ, చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాగని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. మాల్దీవుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారత వ్యతిరేక రాజకీయాలు నెరిపిన మొహమ్మద్ ముయిజ్యూ సుమారు 54 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఇరు దేశాల సంబంధాలు ఎలా వుండబోతున్నాయో అంచనా వేసే ముందు, భారత్ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మాల్దీవ్స్‌లో 12వ శతాబ్దంలో ఇస్లాం అడుగుపెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాలు, ఆచారాల సమ్మిళితంతో ఉదారవాదంగా ఉండేది. 1970ల్లో ఉదార మత విధానాలను అవలంబించిన మాల్దీ వులు, క్రమంగా గల్ఫ్ దేశాల ప్రభావానికి లోనయ్యింది. చమురు ఉత్పాదిత గల్ఫ్ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి. సున్నీ ముస్లిం వహాబీజం పాటించే గల్ఫ్ దేశాలు సంప్రదాయవాదాన్ని బలంగా ప్రచారం చేయడం, మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని ప్రభుత్వం 1980, 90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు సాంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం వరుసగా జరిగాయి. ఆఫ్గనిస్తాన్‌ను సోవియట్ ఆక్రమించడంతో దానికి వ్యతిరేకంగా సంప్రదాయవాద వర్గాల ఏకీకరణ జరిగింది. ఇరవై ఒక్కటవ శతాబ్దం మొదట్లో జరిగిన ప్రపంచ పరిణామాల ప్రభావం మాల్దీవుల యువత మీద తీవ్రంగా పడింది. ఆ దేశంలోని చాలామంది యువత అల్–ఖాయిదాలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. 2008లో మాల్దీవులు ఏక పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మతపరమైన సాంప్రదాయ పార్టీలు ఏర్పాటు కావడానికీ, అవి మత రాజకీయాలు నెరప డానికీ ఇది దారి తీసింది. 2012లో షరియా చట్టాల అమలు కోసం అనేక ఉద్యమాలు ఈ పార్టీలు చేపట్టాయి. చాలామంది యువత ‘ఐసిస్’లో చేరడానికి సిరియా వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ఎగదోయడంలో, ముఖ్యంగా భారత్ పట్ల వ్యతిరేకతను పెంచడంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పాత్ర చాలా ఉంది. 1990ల్లో జరిగిన ఇస్రో ‘హనీ ట్రాప్’ కేసులో మాల్దీవులకు చెందినవారు ఉన్నట్టుగా బయట పడటం ఆ దేశంలో వేళ్లూనుకున్న ఐఎస్ఐ పాత్రకు ఒక ఉదాహరణ మాత్రమే. 1978 నుండి 2008 వరకు సుమారు ముప్పయ్యేళ్లు మాల్దీవులను ఏకధాటిగా పాలించిన మౌమూన్ అబ్దుల్ గయూమ్, అయన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలీహ్ భారత్ పట్ల సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ 2013 నుండి 2018 మధ్యకాలంలో అధికారంలో ఉన్న అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక విధానాలను అనుసరించింది. తాజాగా ఆయన వారసుడిగా మొహమ్మద్ ముయిజ్యూ భారత్ పట్ల అంతే తీవ్ర వ్యతిరేక ప్రచారాలతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. యామీన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాల్దీవ్స్‌లో చైనా కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2014లో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో మాల్దీవ్స్ చేరడమే కాకుండా అనేక మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను చైనీస్ కంపెనీలకు అప్పగించింది. మాలె, హుల్హులే, హుల్హుమాలే దీవులను కలిపే సినిమాలే బ్రిడ్జితో పాటు, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం, హుల్హులే ద్వీపంలోని నివాస సముదాయ నిర్మాణాలు, టూరిజం, ఎనర్జీ తదితర రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మాల్దీవుల ఆర్థిక శాఖ అంచనా ప్రకారం, 2022 చివరికల్లా ఆ దేశ అప్పులు జీడీపీలో 110 శాతం. అందులో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రతి సంవత్సరం చైనాకు చెల్లించే వడ్డీలు సుమారు 92 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మాల్దీవుల వార్షిక బడ్జెట్లో ఇది సుమారు 10 శాతం. యామీన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. దీని ఆసరాగా చైనీస్ కంపెనీలు ఫెయిదూ ఫింహులు ద్వీపాన్ని 50 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాయి. ఈ లెక్కలు చైనా ప్రభావం మాల్దీవుల పైన ఎంతవుందో, చైనా అప్పుల ఊబిలో ఎంతగా చిక్కుకుందో తెలియజేస్తాయి. చైనా ఈ పరిస్థితులను భారత వ్యతిరేక శక్తులను పెంచడానికి ఉప యోగించుకుంది. చైనా అనుసరిస్తున్న వైఖరిని గ్రహించిన ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం ‘ఇండియా ఫస్ట్’ విధానాన్ని పాటించింది. అయితే భారత వ్యతిరేక శక్తులు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని సాగించాయి. ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం, భారతీయులు టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకు పోవడమేననీ, భారత్‌లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నా రనీ, భారత్ తన సైనిక కార్యక్రమాలు సాగిస్తూ మాల్దీవుల సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇబ్రహీం సోలీహ్ ప్రభుత్వం దేశ సంపదను భారత్‌కు ధారాదత్తం చేస్తోందనీ ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. ఇదే రకమైన రాడికలైజేషన్, యువతలో భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి బంగ్లాదేశ్‌లోనూ గమనించవచ్చు. ఈ ప్రచారం వెనక అటు ఐఎస్ఐ, ఇటు చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్ అడ్డుకుంది. దక్షిణాసియాలో ప్రాంతీయేతర శక్తుల ప్రభావాన్ని అడ్డు కోవడం భారత విదేశీ విధానంలో ముఖ్య భాగం. కానీ అది క్రమంగా మారడం గమనించవచ్చు. 2020లో కుదిరిన అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్ ప్రస్తుత పరిస్థి తుల్లో తన స్వరం మార్చింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది. భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు మరీ ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైపులైన్ ప్రాజెక్ట్, విద్య, అరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కొనసా గించాలి. ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందు తున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. ‘ఇండియా అవుట్’ ప్రచారం అక్కడి భారత సైనిక బలగాలకు వ్యతి రేకంగానో, భావోద్వేగ రాజకీయాల కోసమో తప్ప, పూర్తిగా భారత్‌ను ఆ దేశానికి దూరం చేయాలని కాదని మనం అనుకోవలసి ఉంటుంది. డా‘‘ గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, ఎస్ఐఎస్, జేఎన్‌యూ -
సూపర్డ్రైతో రిలయన్స్ జత
న్యూఢిల్లీ: దక్షిణాసియా మేధో హక్కుల(ఐపీ ఆస్తులు) విక్రయానికి రిలయన్స్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూకే ఫ్యాషన్ రిటైలర్ సూపర్‌డ్రై తాజాగా పేర్కొంది. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ) ద్వారా రిలయన్స్ రిటైల్ 4 కోట్ల పౌండ్లు(రూ. 402 కోట్లు) వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా స్వెట్‌షర్టులు, హుడీస్, జాకెట్స్ తదితర ఫ్యాషన్ ప్రొడక్టులను రూపొందిస్తున్న సూపర్‌డ్రై.. జేవీలో 24 శాతం వాటాను పొందనుంది. మిగిలిన 76 శాతం వాటా రిలయన్స్ రిటైల్ చేతిలో ఉంటుంది. ఒప్పందం ప్రకారం సూపర్‌డ్రై బ్రాండ్ ఐపీ ఆస్తులు కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీకి శాశ్వతంగా బదిలీకానున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ హోల్డింగ్ యూకేతో ఐపీ జేవీ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సూపర్‌డ్రై పీఎల్సీ.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. తద్వారా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో సూపర్‌డ్రై బ్రాండుసహా.. సంబంధిత ట్రేడ్‌మార్క్‌లను జేవీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధుల ఆవశ్యకత: సూపర్‌డ్రై ఇటీవల హోల్‌సేల్ కస్టమర్ల నుంచి బలహీన ఆర్డర్ల కారణంగా స్టాక్ నిల్వలు, లిక్విడిటీ తదితర అంశాలలో సవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో జేవీకి తెరతీసింది. దీంతో స్థూలంగా 3.04 కోట్ల పౌండ్ల నగదు లభించనుందని అంచనా వేస్తోంది. కాగా.. తాజా ఒప్పందంతో రిలయన్స్ దక్షిణాసియాలోని మూడు దేశాలలో కార్యకలాపాలు చేపట్టనున్నట్లు సూపర్‌డ్రై తెలియజేసింది. జేవీలో సూపర్‌డ్రై వాటాను కొనసాగించడంతోపాటు.. తమ నైపుణ్యం ద్వారా బ్రాండ్ డెవలప్మెంట్, డిజైన్, మార్కెటింగ్‌లలో మద్దతిస్తుందని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీ దర్శన్ మెహతా చెప్పారు. భారత్ భారీ అవకాశాల మార్కెట్‌కాగా.. రిలయన్స్‌తో పటిష్ట బంధమున్నట్లు సూపర్‌డ్రై వ్యవస్థాపకుడు, సీఈవో జూలియన్ డంకెర్టన్ పేర్కొన్నారు. -
అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక అస్థిరతల మధ్య వచ్చే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరహా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో అభిప్రాయాలు వ్యక్తం అయినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజా ‘చీఫ్ ఎకనమిస్ట్ ఔట్లుక్’ నివేదిక పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తీవ్ర ప్రతికూలతల నేపథ్యంలో చైనా అవుట్‌లుక్ మసకబారింది. ► ప్రపంచం రాజకీయ, ఆర్థిక అస్థిరతతో పోరాడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) చేరుకోవడంలో పురోగతి బలహీనంగా ఉంటుందని దాదాపు 10 మందిలో ఆరుగురు విశ్వస్తున్నారు. ► ప్రత్యేకించి ఆహార భద్రత, వాతావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణతో సహా ఎస్డీజీకి సంబంధించి పలు లక్ష్యాల్లో మందగమనం ఉంటుంది. 2030లో అర బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తారు. ► ఇటీవల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ కఠిన ఫైనాన్షియల్ పరిస్థితులు కొనసాగుతాయని మెజారిటీ (86 శాతం) అంచనా. ఆయా అంశాల నేపథ్యంలో వ్యాపార రుణాలపై ఒత్తిడి, కార్పొరేట్ రుణ ఎగవేతలలో పెరుగుదల, ఆస్తి–ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర దిద్దుబాట్లు తప్పదు. ► 74 శాతం మంది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరికొన్ని సంవత్సరాలు తప్పదని భావిస్తున్నారు. ► అమెరికాలో మే నుండి అవుట్‌లుక్ బలపడింది. ప్రతి 10 మందిలో ఎనిమిది మంది 2023, 2024 అమెరికా ఒక మోస్తరు లేదా లేదా బలమైన వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నారు. ► యూరోప్ విషయంలో ఎకానమీ బలహీనం లేదా మరీ బలహీన పరిస్థితులు ఈ ఏడాది ఉంటాయని 77 శాతం మంది భావిస్తున్నారు. 2024లో పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చని అంచనా. -
భారత్ అగ్రరాజ్యం అవ్వాలంటే... 20 ఏళ్లలో 8 నుంచి 9 శాతం వృద్ధి అవశ్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 20 ఏళ్లలో 8–9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అన్నారు. పెట్టుబడులకు సంబంధించి ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం (చైనాతో పాటు మరో దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు) నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని ఆయన అన్నారు. భారత్ పెద్ద మార్కెట్ అని, ఇక్కడ అందుబాటులో ఉన్నంత స్థాయి, కార్యకలాపాల పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచి్చన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ► అంతరిక్ష రంగం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికే 200 స్టార్టప్‌లు ఉన్నాయి. 2040 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించే అవకాశం ఉంది. ► అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలంటే కనీసం 2047 వరకు 8–9 శాతం వృద్ధిని సాధించాలి. మధ్య ఆదాయ స్థాయి పెరగడం, వేగంతో ఎదగడం అంత సులభం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఏడాది ప్రాతిపదికన 8–9 శాతం వేగం వృద్ధిని నమోదుచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ► వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ వెహికిల్సహా ఇతర పురోగతి చెందుతున్న భారత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేíÙంచవచ్చు. దేశం సంవత్సరానికి 16,000–18,000 కిలోమీటర్ల (వేగంతో)మేర రోడ్లను నిర్మిస్తోంది. ఇది మౌలిక రంగం పురోగతికి, ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే అంశం. ► బహుళజాతి కంపెనీలు ’చైనా ప్లస్ వన్’ విధానం వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీలు తమ తయారీని చైనా కాకుండా వేరే చోటికి తరలించాలని నిర్ణయించినప్పుడు ప్రయోజనం పొందే ఇతర దేశాలు ఉన్నప్పటికీ భారత్ మినహా మరే ఇతర దేశానికి అంత స్థాయి, పరిమాణం లేదు. ► ముడిచమురు దిగుమతుల బిల్లే భారత్ అతిపెద్ద సవాలు. సాంకేతికంగా దేశం పురోగమన పథంలో ఉన్నప్పటకీ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్అండ్పీ గ్లోబల్ గత నెలలో ఒక నివేదిక విడుదల చేస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 3.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2031 నాటికి 6.7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్‌లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్‌తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్‌లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్‌లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్‌ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్‌లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
రూపీ ట్రేడ్‌పై దక్షిణాసియా దేశాలతో చర్చలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్య లావాదేవీలు నిర్వహించడంపై దక్షిణాసియా దేశాలతో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చర్చలు జరుపుతోంది. యూపీఐ విధానం ద్వారా ప్రాంతీయంగా సీమాంతర చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యూపీఐకి సంబంధించి ఇప్పటికే భూటాన్, నేపాల్ తదితర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు. క్లోనింగ్‌వంటి రిస్కులు ఉన్న నేపథ్యంలో డిజిటల్ రూపీని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వంతో కలిసి అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునే విధానంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ప్రాంతీయంగా ఇప్పటికే కొన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది‘ అని దాస్ వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడికి ప్రాధాన్యం .. కోవిడ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మార్కెట్ల నిబంధనలు కఠినతరం కావడం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంత దేశాలు విధానపరంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయన్నారు. భారత్ వంటి దక్షిణాసియా దేశాలు ద్రవ్యోల్బణ కట్టడిపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇందుకోసం విశ్వసనీయమైన ద్రవ్యపరపతి విధానాలతో పాటు సరఫరాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం, ద్రవ్య.. వాణిజ్య విధానాలు, పాలనాపరమైన చర్యలు అవసరమని ఆయన వివరించారు. ఇటీవల కమోడిటీ ధరలు, సరఫరాపరమైన సమస్యలు కొంత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టవచ్చని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగిన పక్షంలో వృద్ధికి, పెట్టుబడులకు రిస్కులు ఏర్పడవచ్చని దాస్ చెప్పారు. దక్షిణాసియా ప్రాంత దేశాలు ఇంధనాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుండటం వల్ల, ఇంధన దిగుమతిపరమైన ద్రవ్యోల్బణంతో సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాలు వాణిజ్యం విషయంలో పరస్పర సహకరించుకుంటే ప్రాంతీయంగా వృద్ధికి, ఉపాధికి మరిన్ని అవకాశాలు లభించగలవని దాస్ చెప్పారు. -
అక్షర లక్షలు
దక్షిణాసియా సాహిత్యపు ప్రతిష్ఠను పెంచుతూ ఈ ఏటి బుకర్ పురస్కారాన్ని శ్రీలంకకు చెందిన సెహన్ తిలకరత్న గెలుచుకున్నారు. మరణానంతర థ్రిల్లర్ ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మీదా’ ఆయనకు ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఒకరోజు చావు నుంచి మేల్కొన్న ఫొటోగ్రాఫర్ మాలీ అల్మీదా తను దాచిన ఛాయాచిత్రాలను సరైన మనిషి చేతుల్లో పెట్టడానికి చేసే ప్రయత్నం ఈ నవల. దానికిగానూ అతడికి ఉన్న కాలం కేవలం ఏడు చంద్రులు. ఈ ప్రయాణంలో భాగంగా 1980–90ల నాటి శ్రీలంక సంక్షుభిత కాలాన్ని, అంతర్యుద్ధం వల్ల జరిగిన మానవ నష్టాన్ని నవల చిత్రిస్తుంది. ఇంత కల్లోలంలోనూ ప్రతి మానవ జీవితమూ విలువైనదేనన్న ఒక ఆదర్శం కోసం అన్వేషించడం బుకర్ న్యాయనిర్ణేతలను కదిలించింది; షార్ట్‌లిస్టులో ఉన్న ఆరుగురు రచయితల్లోంచి కరుణతిలక వైపు మొగ్గేలా చేసింది. ఒక శ్రీలంక రచయిత ఈ బహుమతిని పొందడం ఇది రెండోసారి. మొదటి రచయిత కెనడాలో స్థిరపడిన మైకేల్ ఆండాట్జీ. 1992లో ‘ది ఇంగ్లిష్ పేషెంట్’ నవలకుగానూ ఆయన ఈ గౌరవం పొందారు. అక్టోబర్ నెలంతా సాహితీ మాసంగా గడిచిపోయింది. ఈ నెలలోనే అంతా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌను వరించింది. ఆంగ్లంలో రాసిన, యునైటెడ్ కింగ్డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అర్హమయ్యే బుకర్ ప్రై జ్ ‘పరిధి’ పరిమితమైనది అయినప్పటికీ, దీని కోసం కూడా సాహిత్య లోకం ఆసక్తిగా చూసింది. ఆంగ్ల భాషా వ్యాప్తి పెరుగుతూండటమూ, ఇతర భాషల సాహిత్యాలు కుంచించుకుపోతుండటమూ, ఇతర భాషీయులు కూడా ఆంగ్లాన్ని తమ మాతృభాషలాగే స్వీకరించి సాహిత్యపరమైన ఆలోచనను కూడా ఆ భాషలోనే చేస్తూండటమూ, ఆంగ్ల సాహిత్యం నిత్యనూతనంగా ఉంటుండటమూ, ఇలా చాలా కారణాల వల్ల బుకర్ ప్రైజ్ అచ్చమైన అంతర్జాతీయ అవార్డు స్థాయిని పొందింది. ఈ పురస్కార విజేతకు 50 వేల పౌండ్ల నగదు లభిస్తుంది. బ్రిటిష్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, దీని విలువ సుమారు 47 లక్షల రూపాయలు! బుకర్ ప్రైజ్ పేరుతో ఇస్తున్నప్పటికీ 1969–2001 వరకు మాత్రమే బ్రిటిష్ ఫుడ్ హోల్‌సేల్ ఆపరేటర్ అయిన ‘బుకర్ గ్రూప్ లిమిటెడ్’ ఈ అవార్డుకు నిధులు సమకూర్చింది. అది తప్పుకొన్న తర్వాత, 2002–19 వరకు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మ్యాన్ గ్రూప్’ ఇచ్చినందున మ్యాన్ బుకర్ ప్రైజ్ అని వ్యవహరించారు. 2019 నుంచి వెల్‡్ష శ్రీమంతుడు మైకేల్ మోరిట్జ్ ఛారిటీ సంస్థ ‘క్రాంక్‌స్టార్ట్’ దీనికి నిధులు ఇస్తోంది. దాతలు మారుతున్నప్పటికీ, ‘అత్యధిక పారితోషికం గల సాహిత్య పురస్కారాల్లో ఇదీ ఒక’టన్న ప్రతిష్ఠకు మాత్రం లోటురావడం లేదు. తమాషా ఏమిటంటే, దీన్ని తలదన్నే మొత్తాన్ని ఇస్తున్న పురస్కారాలు కూడా ఉన్నాయి. యూఏఈకి చెందిన ‘మిలియన్స్ పొయెట్’ పోటీకి 50 లక్షల ధీరమ్స్ (సుమారు 11 కోట్ల రూపాయలు) ఇస్తున్నారు. అరబిక్ దేశాల్లోని అత్యుత్తమ కవులను వెతికే ఈ రియాలిటీ టెలివిజన్ కవితల పోటీ ప్రసారమైనప్పుడు, టీఆర్పీ రేటింగ్స్‌లో ఫుట్‌బాల్‌నే వెనక్కి నెట్టేస్తుంది. నగదును టాప్–5 కవులకు పంచుతారు. ఇక స్పెయిన్ లో ఇచ్చే ‘ప్రీమియో ప్లానెటా దె నావెలా’ ప్రైజ్‌మనీ పది లక్షల యూరోలు. అంటే సుమారు 8 కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఆర్థిక పరంగా ప్రస్తుతం ఇదే అత్యంత ఘనత వహించిన అవార్డు. 1952లోనే ఇది మొదలైంది. పుస్తకాల ప్రచురణ కర్త ‘గ్రూపో ప్లానెటా’ దీన్ని బహూకరిస్తుండటం గమనార్హం. ఇక ‘ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ మెమోరియల్ అవార్డు’ పేరుతో స్వీడన్ లో ఇచ్చే పురస్కార విలువ 50 లక్షల స్వీడిష్ క్రోనాలు(సుమారు 37 లక్షల రూపాయలు). గుర్తుంచుకోవాల్సింది స్వీడన్ జనాభా అక్షరాలా ఒక కోటి నలభై లక్షలు మాత్రమే. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ విజేతకు ఒక కోటి స్వీడిష్ క్రోనార్ల నగదు (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు)తోపాటు 18 క్యారెట్ల బంగారు పతకం బహూకరిస్తారు. మళ్లీ బుకర్ వద్దకే వస్తే– ఆంగ్లంలోకి అనువాదమైన ఇతర భాషా పుస్తకాల కోసం ప్రత్యేక విభాగంగా నెలకొల్పిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పురస్కార నగదు కూడా 50,000 పౌండ్లు. దీన్ని రచయిత, అనువాదకులకు సమంగా పంచుతారు. పోయినేడాది హిందీ నవలా రచయిత్రి గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్తో పాటు గెలుచుకున్నది ఇదే. ఇంతేసి పారితోషికాలు, ఒక పుస్తకం కోసం సాహిత్య లోకం ఎదురుచూడటాలు తెలుగు నేలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా కనిపించడం లేదూ! ఉమ్మడిగా రెండు రాష్ట్రాల జనాభా సుమారు తొమ్మిది కోట్లు. అయినా ఒక రచయిత తన సొంత ఖర్చుతో వేసుకునే వెయ్యి కాపీలు అమ్మడం కూడా దుర్భరం. ఇలాంటి వాతావరణానికి కారణాలు ఏమిటి? పఠనాన్ని తగ్గించాయని చెప్పే అన్ని కారణాలూ అన్ని దేశాలకూ వర్తిస్తాయి కదా. మరెక్కడుంది లోపం? మన సంస్కృతిలో. ‘చదవడం’ అంటే మనకు అర్థం వేరే. ‘ఒక దేశం తన కథకులను కోల్పోయిందంటే, తన బాల్యాన్ని కోల్పోయినట్టే’ అన్నాడు పీటర్ హాండ్కే. మన జీవితమంతా మన చిన్నతనంలోనే ఉండిపోయిందని పెద్దయినకొద్దీ అర్థమవుతూ వస్తుంది. డబ్బులు మాత్రమే సర్వస్వమా అంటే– అది మన సారస్వత నిర్మాతలను మనం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నది తెలియజేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్లలో వెయ్యి కోట్లు దాటే సినిమాలు తీస్తున్న తెలుగు నేల మీద, ఒక తెలుగు రచయితకు కోటి రూపాయల బహుమతి ఇచ్చే ఊహయినా చేయగలమా? -
భారత్ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది. -
South Asia Football Tournament: ఫైనల్లో భారత్
మాలీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. టైటిల్ పోరుకు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి బృందం 3–1తో మాల్దీవులు జట్టును ఓడించింది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన భారత్, నేపాల్ జట్లు శనివారం జరిగే ఫైనల్లో తలపడతాయి. -
ఐసిస్–కెతో భారత్‌కూ ముప్పు!
న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు. కేరళ టు కాబూల్ టు కశ్మీర్ అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. -
ఇండియా చేతికి ఇజ్రాయెల్ డ్రోన్‌గార్డ్ వ్యవస్థ?!
దక్షిణాసియాకు చెందిన ఒక దేశానికి తమ ఈఎల్ఐ–4030 డ్రోన్ గార్డ్ వ్యవస్థను(సీ–యూఏఎస్)ను విక్రయించినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(ఐఏఐ) చేసిన ప్రకటన సంచలనం కలిగిస్తోంది. సదరు దేశం పేరును సంస్థ వెల్లడించకున్నా, అది భారతేనని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల భారత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ సంస్థ ప్రకటన ప్రాముఖ్యం సంతరించుకుంది. కొన్ని కోట్ల డాలర్లకు డ్రోన్ గార్డ్ విక్రయాన్ని పూర్తి చేశామని మాత్రమే ఈనెల 2న ఐఏఐ ప్రకటించినట్లు డిఫెన్స్ వార్తల ప్లాట్‌ఫామ్ జానెస్ తెలిపింది. ఎప్పటికల్లా సదరు దేశానికి ఈ వ్యవస్థను డెలివరీ చేసేది వెల్లడించలేదు. తమ డోమ్ వ్యవస్థపై భారత్ ఆసక్తి చూపుతోందని గతేడాది ఇజ్రాయెల్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే! దీన్ని దృష్టిలో ఉంచుకొనే, తాజాగా ఐఏఐ చేసిన ప్రకటనలోని దేశం ఇండియా అని పలువురు అంచనా వేస్తున్నారు. భారత్ వద్ద ప్రస్తుతం ఎలాంటి యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదని రక్షణ నిపుణుడు అభిజిత్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. జమ్మూ ఘటనల నేపథ్యంలో ఈ డోమ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, భారత్‌కు ఇజ్రాయెల్ నమ్మకమైన రక్షణ భాగస్వామి కావడం వల్ల సీ–యూఏఎస్‌ను భారత్ కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలా పనిచేస్తుంది ఒకవైపు నుంచి వచ్చే దాడులనే కాకుండా పలువైపుల నుంచి వచ్చే దాడులను సైతం డ్రోన్ గార్డ్ అడ్డుకోగలదు. ఇందులో షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ (3, 4.5, 6కిలోమీటర్ల రేంజ్)వేరియంట్లుంటాయి. ఇందులో వివిధ విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలో సెన్సర్లు ఒక్కో పని నిర్వహిస్తాయి. ఏఈఎస్ఏ, మల్టి మిషన్ 3డీ ఎక్స్ బాండ్ రాడార్, కామిన్ట్ జామర్, ఈఓ మరియు ఐఆర్ సెన్సర్ అనే విభాగాలు డ్రోన్ గార్డ్‌లో ఉంటాయని ఐఏఐ తెలిపింది. వచ్చిన డ్రోన్లను అడ్డుకొని వెనక్కు పంపడాన్ని సాఫ్ట్ కిల్ అని, డీకేడీ(డ్రోన్ కిల్ డ్రోన్) వ్యవస్థను ఉపయోగించి వచ్చిన డ్రోన్లను పేల్చేయడాన్ని హార్డ్ కిల్ అని అంటారు. తమ సీ– యూఏఎస్ చిన్న, సూక్ష్మ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తుందని ఐఏఐ అధికారి ఎలి అల్ఫాసి వివరించారు. తమ వ్యవస్థలోని జామింగ్ ఫీచర్ దాడికి వచ్చిన డ్రోన్స్ వెనక్కు వెళ్లేలా లేదా క్రాష్ అయ్యేలా చేస్తుందన్నారు. ఇప్పటికే పలువురు కస్టమర్లకు దీన్ని విక్రయించామని, భారత్ కూడా దీనిపై ఆసక్తి చూపిందని గతంలో ఆయన చెప్పారు. తాజా దాడుల ప్రభావం? జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. దాని తర్వాత పాక్‌లోని భారత రాయబారి కార్యాలయ సమీపంలో డ్రోన్లు తచ్చాడాయి. జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడికి వచ్చిన డ్రోన్‌లో జీపీఎస్ అడ్రస్‌ను లాక్ చేశారు. అంతేకాకుండా పేలుడు పదార్థాలను సైతం డ్రోన్ జారవిడిచింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. దేశ మిలటరీ చరిత్రలో ఇది తొలి డ్రోన్ అటాక్‌గా భావిస్తున్నారు. దాడిలో పాక్ టెర్రరిస్టుల పాత్ర ఉంటుందని జాతీయ భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది ఉగ్రదాడిగా జమ్మూ పోలీసు చీఫ్ ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో మరిన్ని డ్రోన్ దాడులు జరగకుండా నివారించేందుకు సిద్ధమైంది. ఇటీవలే ప్రధాని హోం, రక్షణ మంత్రులతో పాటు భద్రతా సంస్థలు, మిలటరీ అధికారులతో సమావేశమయ్యారు. అత్యున్నత రక్షణ విధానాన్ని రూపొందించాలని çనిర్ణయించారు. దీన్లో భాగంగానే డ్రోన్ గార్డ్‌ను భారత్ కొనుగోలు చేసి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. -
5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: 5.5 కోట్ల యూజర్లకు ఎయిర్టెల్ శుభవార్త అందించింది. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్‌వర్క్‌లోని తక్కువ-ఆదాయం గల 5.5 కోట్ల వినియోగదారులకు రూ.49 ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. రూ.49 ప్యాక్ కింద 100 ఎంబి డేటా, 38 విలువైన టాక్ టైమ్ రూ.28 రోజుల చెల్లుబాటు కానున్నట్లు తెలపింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ వినియోగదారులకు అత్యవసర సమయాల్లో క్లిష్టమైన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది కొంత సహాయ పడనున్నట్లు పేర్కొంది. అలాగే, ఈ సమయంలో ప్రజలు తమ కుటుంబం, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అవసరం ఉందని గ్రహించిన ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. ఈ కూపన్ల వల్ల క్లిష్ట సమయాల్లో వారి కుటుంబంతో కనెక్ట్ అవ్వొచ్చని పేర్కొంది. ఈ రెండు ప్రయోజనాలు రాబోయే వారం రోజుల్లో ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుతాయని సంస్థ ప్రకటించింది. దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని 18 దేశాలలో 45.8 కోట్లకు పైగా కస్టమర్లు కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఎయిర్టెల్ ఒకటి. ఇది ఆఫ్రికన్ మార్కెట్లో రెండవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్. ప్రస్తుతం మనదేశంలో భారతీ ఎయిర్‌టెల్‌కు 34కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. చదవండి: హీరో మోటోకార్ప్ ప్రియులకు తీపికబురు -
సహకరించుకుందాం.. సవాళ్లను ఎదిరిద్దాం..
న్యూఢిల్లీ: దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మధ్య అనుసంధానం పెరగకపోతే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోదని తేల్చిచెప్పారు. 10 ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ‘కోవిడ్–19 మేనేజ్మెంట్: ఎక్స్పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ఆన్లైన్లో మాట్లాడారు. ప్రత్యేక వీసా పథకం తీసుకొద్దాం.. వర్క్‌షాప్‌లో మోదీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు. దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడానికి వీలుగా డాక్టర్లు, నర్సులు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా, వేగంగా ప్రయాణించేలా వీసాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఎయిర్ అంబులెన్స్ ఒప్పందంపైనా దక్షిణాసియా దేశాల పౌర విమానయాన శాఖ మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా ఒక స్థానిక వేదికను సృష్టించుకుంటే బాగుంటుందని అన్నారు. ‘పరీక్ష పే చర్చ’ ఆన్లైన్లోనే.. సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో భయాందోళనలను దూరం చేయడానికి మోదీ ప్రతిఏటా ‘పరీక్ష పే చర్చ’ నిర్వహిస్తున్నారు. 9–12 తరగతుల విద్యార్థులతో మాట్లాడేవారు. కోవిడ్ కారణంగా ‘పరీక్ష పే చర్చ’ను ఈ ఏడాది ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. చర్చలో పాల్గొనేందుకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా పీపీసీ(పరీక్ష పే చర్చ) కిట్ ఇస్తారు. విద్యుత్ సంస్కరణల్లో ముందడుగు విద్యుత్ పంపిణీ, నియంత్రణ రంగాల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిస్కమ్‌లకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధుల సమర్ధ వినియోగానికి సంబంధించి గురువారం జరిగిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇతర నిత్యావసరాలను నచ్చినవారి నుంచి కొనుక్కునే వీలున్నట్లే.. విద్యుత్‌ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన పంపిణీదారు నుంచి కొనుగోలు చేసుకునే వీలుండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక రంగంగా పరిగణిస్తుందని, పరిశ్రమ రంగంలో భాగంగా చూడదని వివరించారు. గత ఆరేళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం రెండున్నర రెట్లు, సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 15 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 139 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించి ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ఫ్రీక్వెన్సీ’లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. దేశీయ తయారీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నది తమ అభిమతమన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య నెలకొన్న విశ్వాసానికి ఈ వెబినార్ ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పీఎం కుసుమ్’పథకం ద్వారా, రైతులు తమ క్షేత్రాల్లో చిన్న, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. అలా, 30 గిగావాట్ల సౌర విద్యత్ ఉత్తత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం
వాషింగ్టన్: అమెరికాలో తమ ప్రభుత్వం ఏర్పాటైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని సహించబోదని బైడెన్ ఎన్నికల ప్రచార నిర్వాహకులు చెప్పారు. భారత దేశం అమెరికా సహజ భాగస్వాములని నమ్ముతున్నామని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అమెరికాలోని హిందూ, అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వివిధ అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసి, తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అధ్యక్షస్థానానికి పోటీ చేస్తోన్న పార్టీలకు పంపించింది. మొట్టమొదటిగా ఆ ప్రశ్నావళికి బైడెన్ రాతపూ ర్వకం గా సమాధానమిచ్చారు. ఇరువురూ ఈ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలను బట్టి, నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కమిటీ నిర్ణయిస్తుంది.(చదవండి: బైడెన్‌కే భారతీయుల బాసట) -
కోవిడ్ పేదలు వంద కోట్లు
న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం బారిన పడతారని, అందులోనూ దక్షిణాసియాలో భారీ స్థాయిలో పేదలుగా మిగులుతారని ఓ సర్వేలో తేలింది. కింగ్స్ లండన్ కాలేజీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్ రీసెర్చ్ కలసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వే నివేదిక తాజాగా వెల్లడైంది. 100 కోట్ల మంది కలసి రోజుకు 50 కోట్ల డాలర్ల రాబడి కోల్పోతున్నారని నివేదిక పేర్కొంది. మున్ముందు పరిస్థితులు ఇంతకంటే దిగజారవచ్చని తెలిపింది. దక్షిణాసియాలో భారీగా పేదలు పెరగనున్నారని పేర్కొంది. భారత్, సబ్ సహారన్ ఆఫ్రికాలోనే పేదరికం 30 శాతం వరకూ ఉంటుందని నివేదిక వెల్లడించింది. తూర్పు ఆసియా, పసిఫిక్, చైనాలు కలిపి 41 శాతం పేదలకు ఆవాసాలుగా మారనున్నాయంది. అల్పాదాయ దేశాలైన నైజీరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, ఇండోనేíసియాలు కలిపి 18 శాతం పేదరికాన్ని చవి చూస్తాయని అంచనా వేసింది. డీఆర్ కాంగో, టాంజానియా, పాకిస్తాన్, కెన్యా, ఉగాండా, ఫిలిప్పీన్స్ దేశాలు 11–12 శాతం పేదలకు కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అత్యంత నిరుపేదలు ఉండే దేశాల్లో ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాలు టాప్ 10లో ఉంటాయంది. -
అక్కడి నుంచే భారత్‌లోకి కరోనా
సాక్షి, బెంగళూరు : కరోనా మన దేశానికి యూరప్, దక్షిణ ఆసియా దేశాల నుంచి వచ్చి ఉంటుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని 294 కరోనా వైరస్ జన్యుక్రమాలపై కుమార్ సోమసుందరం, మైనక్ మండల్, అంకిత లావార్డ్‌లతో కూడిన ఐఐఎస్సీ బృందం చేసిన అధ్యయనం గుర్తించిన విషయాల్లో ఇది ఒక అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్స్–కోవిడ్–2 వైరస్‌కీ, భారతదేశంలోని వైరస్‌కీ మధ్య ఉన్న జన్యుపరమైన తేడాలను నిర్ధారించడంలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌తో ఎక్కువ రాకపోకలు జరిగే, కోవిడ్ విస్త్రుతంగా వ్యాప్తి చెందిన దేశాలైన యూరప్, తూర్పు మధ్య ఒషియేనా, దక్షిణ ఆసియా ప్రాంతాల నుంచి మన దేశంలోకి ఈ వైరస్ వచ్చి ఉండొచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. (చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ!) ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పీపీఈ కిట్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దళంలోని ప్రతి సభ్యుడికి ఐదేసి పీపీఈ కిట్లు అందజేస్తామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు. వీటిలో రెండు కోవిడ్‌కు, మిగతా మూడు ఎండ, ఇతర కలుషితాలు సోకకుండా రక్షణ కల్పించేవన్నారు. రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొనే బృంద సభ్యులకు పీపీఈ కిట్లు, హైడ్రో క్లోరోక్విన్ మాత్రలు అందించడంతోపాటు వ్యాధినిరోధక శక్తి పెంపునకు ఆయుష్ శాఖ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల సంభవించిన అంఫన్ తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 51మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. వీరిలో ఎవరికీ కోవిడ్ లక్షణాలు లేనందున, మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల ప్రభావం అధికంగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర బృందాలను పంపింది. అత్యధిక కేసులు ఉన్న ప్రాంతాలు, అధికంగా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా హైలెవల్ మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్స్ పనిచేస్తాయి. తెలంగాణకు నాలుగు, మహారాష్ట్రకు 7, తమిళనాడుకు 7, రాజస్తాన్‌కు 5, అసోంకు 6, హరియాణాకు 4, గుజరాత్‌కు 3, కర్ణాటకకు 4, ఉత్తరాఖండ్‌కు 3, మధ్యప్రదేశ్‌కు 5, పశ్చిమబెంగాల్‌కు 3, ఢిల్లీకి 3, బిహార్‌కు 4, యూపీకి 4, ఒడిశాకు 5 బృందాలను పంపినట్టు తెలిపింది. ప్రతీ త్రిసభ్య బృందంలో ఇద్దరు ఆరోగ్య నిపుణులు, ఒక సీనియర్ సంయుక్త కార్యదర్శి స్థాయి నోడల్ అధికారి ఉంటారు. -
8.8లక్షల కోట్ల డాలర్లు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 5.8–8.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. ఇందులో దక్షిణాసియా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై సుమారు 142–218 బిలియన్ డాలర్ల దాకా ప్రతికూల ప్రభావం పడనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ ప్రారంభంలో వెలువరించిన అంచనాలకు కొనసాగింపుగా ఏడీబీ తాజా నివేదికను రూపొందించింది. ఏప్రిల్ 3న నాటి ఆసియా అభివృద్ధి అంచనాల (ఏడీవో) నివేదికలో ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్‌పరమైన నష్టాలు సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని పేర్కొంది. తాజాగా.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఎకానమీ సుమారు 5.8 – 8.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో నష్టపోనుంది. ఇది గ్లోబల్ జీడీపీలో 6.4–9.7 శాతానికి సమానం. అటు దక్షిణాసియా జీడీపీ కూడా 3.9–6.0 శాతం మేర క్షీణించవచ్చు. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం ఇందుకు కారణం‘ అని వివరించింది. ఈ అధ్యయనంలో విధానపరమైన చర్యల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఏడీబీ తెలిపింది. గ్లోబల్ జీడీపీ 2–4 శాతం తగ్గొచ్చంటూ ప్రపంచ బ్యాంకు వేసిన అంచనాల కన్నా ఏడీబీ అంచనాలు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్షీణత 6.3 శాతం స్థాయిలో ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. చైనాకు 1.6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలు .. ఆంక్షలను స్వల్పకాలికంగా మూడు నెలల పాటు కొనసాగించిన పక్షంలో ఆసియా, పసిఫిక్ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ నష్టాలు 1.7 లక్షల కోట్ల డాలర్ల మేర, ఆరు నెలల పాటు అమలు చేస్తే 2.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలోనూ ఉంటాయని ఏడీబీ పేర్కొంది. మొత్తం గ్లోబల్ ఉత్పత్తి క్షీణతలో ఈ ప్రాంత వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చైనా నష్టాలు సుమారు 1.1–1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఏడీబీ అంచనా. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ కట్టడిపై వేగంగా స్పందించాయని, ద్రవ్యపరమైన చర్యలతో ఆదాయ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేశాయని ఏడీబీ తెలిపింది. ఈ చర్యలను ఇలాగే కొనసాగించిన పక్షంలో కరోనాపరమైన ప్రతికూల ప్రభావాలు 30–40 శాతం దాకా తగ్గొచ్చని వివరించింది. జీతాల్లో కోతలు.. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లలో వేతన ఆదాయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండొచ్చని ఏడీబీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదాయాలు 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల దాకా తగ్గొచ్చని పేర్కొంది. ఆసియాలో వేతన ఆదాయాలు 359–550 బిలియన్ డాలర్ల స్థాయిలో క్షీణించవచ్చని వివరించింది. ఏడీబీ నివేదిక -
మనదగ్గర కరోనా కేసులు తక్కువెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతం దక్షిణాసియా. దాదాపు రెండు వందల కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యరంగంలోనూ వెనకబడింది. అయినా ఆరోగ్యరంగంతోపాటు ఆర్థికంగా బాగున్న చైనా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకన్నా కరోనా వైరస్ బాధితులు తక్కువగా ఉండడం ఎంతో విశేషం. ఏప్రిల్ 20వ తేదీ నాటికి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,446 కాగా, మృతుల సంఖ్య 817. అమెరికాలోని ఒక్క న్యూయార్క్ సిటీలోనే 1,34,436 మంది కరోనా బాధితులుకాగా, 10,022 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో 20 శాతానికి పైగా జనాభా కలిగిన దక్షిణాసియాలో కరోనా కేసుల శాతం 1.2 శాతం మాత్రమే. ఇక మృతుల సంఖ్య 0.5 శాతానికన్నా తక్కువ. దక్షిణాసియాలోని మొత్తం 28,446 కేసుల్లో భారత్‌లో 17,265, పాకిస్థాన్‌లో 8,418, బంగ్లాదేశ్‌లో 2,456, శ్రీలంకలో 271, నేపాల్‌లో 31, భూటాన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. (చదవండి: 80 శాతం రోగులకు కరోనా లక్షణాలు లేవు) అలాగే మృతుల సంఖ్యలో భారత్‌లో 543 మంది, పాకిస్థాన్‌లో 176, బంగ్లాదేశ్‌లో 91, శ్రీలంకలో ఏడుగురు మరణించగా, నేపాల్, భూటాన్‌లో ఒక్కరు కూడా మరణించలేదు. నిర్ధారిత కరోనా కేసుల్లో మృతుల సంఖ్య దక్షిణాసియాలో సరాసరి 2.87 శాతంకాగా, అమెరికాలో 5,34 శాతం, బ్రిటన్‌లో 13,38 శాతం. ప్రపంచ సరాసరి శాతం 6.87 శాతం. ఈ విషయంలో బంగ్లాదేశ్ 3.71 శాతంతో ముందుండగా, 3.15 శాతంతో భారత్ స్థానంలో ఉంది. 2.09 శాతంతో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. దక్షిణాసియాలో ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఎంత మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందనే విషయంలోనూ దక్షిణాసియా రికార్డు బాగానే ఉంది. అందుకనే తాము నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య సముచితంగా ఉందంటూ భారత్ వాదిస్తోంది. భారత్‌లో పరీక్షలు జరిపిన వారిలో నిర్ధారిత కేసులు 25.9 శాతం కాగా, పాకిస్థాన్‌లో 13.2 శాతం, బంగ్లాదేశ్‌లో 11.6 శాతం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ దక్షిణ కొరియాలో 52.4 శాతం కాగా, అమెరికాలో 5,3, బ్రిటన్‌లో 3.3 శాతం ఉంది. తక్కువగా ఉండడానికి కారణాలేమిటీ? దక్షిణాసియాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉండడానికి పలు సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. టీబీ కోసం బెసిల్లస్ కాల్మెట్టీ గెరిన్ వ్యాక్సిన్ (బీసీజీ) కారణమని చెబుతున్నారు. దక్షిణాసియాలోని అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను వాడుతున్నాయి. ఉష్టమండల ప్రాంతమవడంతో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా మనుగడ సాగించలేక పోతోందన్నది మరో సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను నమ్మడానికి సరైన కారణాలు కనిపించడం లేదని వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, ఎపిడిమిమాలజిస్ట్ జయప్రకాష్ ములియిల్ అన్నారు. ఓ ఆశను పట్టుకొని చర్యలు తీసుకోలేమని చెప్పారు. ‘ఆ సిద్ధాంతాలు నిజమైనా వాటిని పరిగణలోకి తీసుకోలేం. మనం లాటరీ గెలిస్తే మంచిదే. అలా అని లాటరీ టిక్కెట్లను కొనేందుకు సగం జీతం ఖర్చు పెట్టడం వధా అవుతుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్ జాకబ్ జాన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం వద్ద సరైన డేటా లేదని, దేశంలో ఎంత మంది చనిపోయారో, వారు ఏ కారణంతో చనిపోయారో స్పష్టంగా తెలియజేసే గణాంకాలు లేవని జయప్రకాష్ తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంఖ్య కూడా తక్కువగా ఉందని అన్నారు. (చదవండి: కోవిడ్-19 : ఆ మందు ప్రభావంపై షాకింగ్ సర్వే..) -
కౌలాలంపూర్ నుంచి అంటుకుందా?
సాక్షి, న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన ఒక్క సదస్సు దక్షిణాసియాలోని అనేక దేశాలు ఇప్పుడు వణికిపోయేలా చేస్తోంది. దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా సోకిన వారిలో అత్యధికులు తబ్లిగి జమాత్ సదస్సులకు హాజరైన వారే ఉన్నారు. నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా అంతర్జాతీయంగా ఇస్లాం మత బోధన చేస్తున్న తబ్లిగి జమాత్ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉంది. ప్రవక్త చెప్పిన ఇస్లాం జీవనశైలి కలిగి ఉండాలని బోధిస్తుంది. ఈ సంస్థ కౌలాలంపూర్‌లోని పెటాలింగ్ మసీదులో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు 16 వేల మందితో సదస్సు నిర్వహించింది. దీనికి 1500 మంది విదేశీయులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన 34 ఏళ్ల మలేసియన్ 17న మృతిచెందాడు. అక్కడి పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు జమాత్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులవేనని వార్తలొచ్చాయి. సదస్సుకు హాజరైనS ప్రతినిధులు తమ సొంత దేశాల్లో, ఇతర దేశాల్లో ఆ వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు. కౌలాలంపూర్ సదస్సుకు హాజరైన ఇండోనేసియన్లలో 31 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్æ సమావేశాల్లో పాల్గొన్నారు. నిజాముద్దీన్ మర్కజ్‌కు ఇలా.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న తబ్లిగి జమాత్ మర్కజ్‌కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది ఏడాది పొడవునా జరుగుతుంది. తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనవరి 1 నుంచి మన దేశానికి 2,100 మంది ప్రతినిధులు రాగా.. మార్చి 21 నాటికి 1040 మంది ప్రతినిధులు దేశంలోనే ఉన్నారని, మిగిలిన వారు లాక్ డౌన్‌కు ముందే వెళ్లిపోయి ఉంటారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మార్చి 21 నాటికి దేశవ్యాప్తంగా 824 మంది విదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉండగా.. మర్కజ్లో 216 మంది ఉన్నారని ప్రకటించింది. 1500 మంది స్వదేశీ ప్రతినిధులు మర్కజ్లో ఉన్నట్టు తెలిపింది. 2,100 మంది స్వదేశీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించే పనిలో ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీలో మార్చి 13–15తేదీల్లో ‘ఇజ్తెమా’ పేరుతో జరిగిన సమావేశాలకు నాలుగైదు వేల మంది స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ముందే కౌలాలంపూర్ సదస్సులో పాల్గొన్న 31 మంది ఇండోనేసియా దేశస్తులు, ఇతర దేశస్తులు ఢిల్లీ చేరుకుని మర్కజ్లో సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తోంది. దేశం నలుమూలలకు.. : ‘ఇజ్తెమా’ ముగిసిన తరువాత మార్చి 16 నుంచి అనేకమంది తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. మార్చి 22 నాటి జనతా కర్ఫ్యూ అనంతరం మార్చి 23న 1500 మంది స్వస్థలాలకు వెళ్లిపోయారని, లాక్డౌన్ ప్రకటనతో సమావేశాలు నిలిపి వేశామని, కానీ విధిలేని పరిస్థితుల్లో వెయ్యి మంది అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తబ్లిగి జమాత్ వెల్లడించింది. వీరిని స్వస్థలాలకు చేర్చేందుకు వాహనాలను అనుమతించాల్సిందిగా తాము సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశామని, ఇదే విషయాన్ని హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇచ్చిన నోటీస్‌కు జవాబులో తెలిపామని వివరించింది. చట్టబద్ధమైన ఆదేశాలను తాము ఉల్లంఘించలేదని పేర్కొంది. అయితే తాజాగా వీరిలో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, కరోనా లక్షణాలు ఉన్న 411 మందిని ఆసుపత్రులకు పంపామని ఢిల్లీ సీఎం ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1339 మంది జమాత్ ప్రతినిధులను క్వారంటైన్‌కు తరలించామని హోం శాఖ ప్రకటించింది. టూరిస్ట్ వీసాపై వచ్చి మతపరమైన మిషనరీ పనుల్లో పాల్గొనరాదని ఇదివరకే హోం శాఖ ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రతినిధుల వీసా కేటగిరీని తనిఖీ చేయాలని రాష్ట్రాల పోలీస్ యంత్రాంగానికి సూచనలు ఇచ్చామని తెలిపింది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధులను, వారికి జిల్లాల వారీగా, స్థానికంగా సమన్వయం చేస్తున్న 2,137 మంది స్వదేశీ ప్రతినిధులను స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. వీరందరూ ఎక్కడెక్కడ తిరిగారో వారి కదలికలను గుర్తించాలని రాష్ట్రాలను మార్చి 29న ఆదేశించినట్టు తెలిపింది. పాజిటివ్ కేసులు ఇలా వెలుగులోకి.. నిజాముద్దీన్æ సమావేశాలకు హాజరై స్వస్థలాలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో రామగుండంకు వచ్చిన ఇండోనేసియన్లలో 10 మందికి మార్చి 20నే పాజిటివ్ అని తేలింది. ఈ సదస్సుకు హాజరైన కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి మార్చి 26న తన స్వస్థలంలో కరోనాతో మరణించారు. మార్చి 27న మర్కజ్ నుంచి ఆరుగురిని, 28న 33 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ సమావేశాలకు హాజరైన వారిలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అండమాన్‌లో బయటపడ్డ పాజిటివ్ కేసులకు మర్కజ్ సమావేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఇతర దేశాల్లోనూ ఇదే తీరు.. దక్షిణాసియాలోని వివిధ దేశాల్లో కేసులకు కౌలాలంపూర్ సదస్సుకు లింక్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మలేషియాలో 2,400 కేసుల్లో మూడో వంతు కేసులకు ఈ సదస్సుకు సంబంధం ఉందని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. లాహోర్ సమీపంలో గల రాయ్‌విండ్‌లో తబ్లిగీ జమాత్ అక్కడి మర్కజ్లో వార్షిక సదస్సు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ సభ్యులు 27 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏ ప్రాంతాల వారు హాజరయ్యారు మర్కజ్‌కు గడిచిన రెండు నెలలుగా ఇండోనేసియా, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, మయన్మార్, అల్జీరియా, కిర్గిస్తాన్, ఇంగ్లండ్, సింగపూర్ దేశాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మన దేశం నుంచి 20కి పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు ఐదారు వేలకు మందికి పైగా ప్రతినిధులు హాజరైనట్టు ప్రాథమిక అంచనా. తబ్లిగి సమావేశాలకు హాజరైన వారిని గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్, అసోం, మణిపూర్‌లతోపాటు కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కర్ణాటక నుంచి 54 మంది పాల్గొనగా 13 మందిని గుర్తించామని వీరందరికీ వైరస్ సోకలేదని పరీక్షల ద్వారా స్పష్టమైందని ఆ రాష్ట్రం తెలిపింది.హిమాచల్ ప్రదేశ్ నుంచి 17 మంది ఈ సమావేశాలకు హాజరయ్యారని అంచనా. కాగా దేశవ్యాప్తంగా తబ్లిగి జమాత్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్న 824 మంది విదేశీ ప్రతినిధుల వివరాలను కేంద్రం సేకరించింది. ఇలా తెలంగాణలో 82 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్టు తెలిపింది. -
కథనాలే కాదు మాటా పదునే
‘దక్షిణాసియాలో మానవ హక్కులు’ అనే అంశం మీద మంగళవారం యు.ఎస్.లో సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును ఏర్పాటు చేసింది యు.ఎస్. హౌస్ కమిటీ. హౌస్ అంటే ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’. ప్రతినిధుల సభ. ఆ సభ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మీద చర్చలకు, తీర్మానాలకు ‘హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్’ పని చేస్తుంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మంగళవారం నాటి సదస్సు జరిగింది. అందులో మాట్లాడ్డం కోసం ఆసియా దేశాల్లోని జర్నలిస్టులు కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. ఇండియా నుంచి ప్రముఖ పాత్రికేయురాలు ఆర్తిసింగ్‌కు ఆహ్వానం అందింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వారిలో ఎక్కుమంది కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్ని బట్టి.. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బయటిదేశాల్లో ఇప్పటికే బాగా ప్రచారం అయిందని ఆర్తికి అర్థమైంది. ఏ ప్రచారంలోనైనా ప్రపంచ మీడియా పాత్ర బలంగా ఉంటుంది. అందుకని ఆర్తి తన ప్రసంగంలో.. ప్రచారం జరుపుతున్న వారి బాధ్యతారాహిత్యం మీద ప్రశ్నలు గుప్పించారు. ‘‘ముప్పై ఏళ్లుగా కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయంపై ప్రపంచ మీడియా ఒక్కసారైనా నోరు మెదిపిందా? కశ్మీర్లో పాక్ ఉగ్రవాద బాధితుల గురించి గళమెత్తడం తమ కనీస ధర్మం అని ప్రపంచ మీడియాతో పాటు, ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు ఏనాడైనా అనుకున్నారా?’’ అని ఆర్తి విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందన, పాక్‌ను సమర్థించే దేశాల ప్రతిస్పందన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ఆర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్తి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆర్తి, గతంలో జమ్మూకశ్మీర్‌లో ఏడేళ్లపాటు న్యూస్ కరస్పాండెంట్‌గా పని చేశారు.