special song
-
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్’ స్టెప్పులు..?
స్పెషల్ సాంగ్.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్ అయిపోయింది. సినిమాలో స్టార్ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్ హీరోయిన్ని తీసుకొస్తున్నారు. మార్కెట్ లెక్కలేసి మరీ ఐటమ్ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ డ్యాన్స్ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుండగా..ఇప్పుడు ప్రభాస్ కోసం మరో స్టార్ హీరోయిన్ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిచయంతోనే రాజాసాబ్తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కాగా, ప్రభాస్, నయన్ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. -
శ్రద్ధా కపూర్ 'ఊ అన్నారా'?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తుండగా, హీరోయిన్ శ్రీవల్లిపాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే మిగిలి ఉన్నపాటలను చిత్రీకరించే పనిలో ఉంది టీమ్. ఈ నెలాఖర్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో మెరిసే హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్, మృణాళినీ ఠాకూర్, శ్రద్ధా కపూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే శ్రద్ధా కపూర్‌ను యూనిట్ సంప్రదించిందని, ఆమే నటించనున్నారని భోగట్టా. మరి... శ్రద్ధా కపూర్ ఊ అన్నారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పుష్ప’ సినిమా తొలి భాగం ‘పుష్ప : ది రైజ్’లోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామ..’లో సమంత మెరిశారు. ఈ సాంగ్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ‘పుష్ప 2’లోని స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. తొలి భాగానికి సంగీతదర్శకత్వం వహించిన దేవిశ్రీ ప్రసాద్ ‘పుష్ప: ది రూల్’కూ సంగీతం అందిస్తున్నారు. -
సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ‘ఆజ్ కీ రాత్’కి నో చెప్పా: తమన్నా
హీరోయిన్ తమన్నా కెరీర్లో స్పెషల్సాంగ్స్కు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు దాదాపు పదికిపైగా స్పెషల్‌సాంగ్స్‌లో నర్తించారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ స్పెషల్‌సాంగ్‌కు మంచి ఆదరణ దక్కింది. యూట్యూబ్‌లో 200 మిలియన్స్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు తమన్నా మొదట నో చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్‌గారి ‘జైలర్’లో నేను చేసిన ‘వా నువ్వు కావాలయ్యా పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సమయంలో నాకు ‘ఆజ్ కీ రాత్ ’ చాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే అందరూ ‘వా నువ్వు కావాలయ్యా’ పాటతో పోలికలు పెడతారు. సాంగ్ కాస్త అటు ఇటు అయినా సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకులే? అనుకున్నాను. దీంతో ‘ఆజ్ కీ రాత్’కు మొదట నో చెప్పాను. కానీ ‘స్త్రీ 2’ దర్శకుడు ఆమర్కౌశిక్ పట్టుబట్టి ఈ పాటను నాతో చేయించుకున్నారు’’ అని మాట్లాడారు తమన్నా. ఇక ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ ‘స్త్రీ 2’లో సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూ΄ాయల వసూళ్లను రాబట్టిందని బాలీవుడ్ సమాచారం. -
తమన్నా ‘స్పెషల్’ : ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు?
ఏ సినిమాకు అయినా పాటలు ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనం మాములుగా ఉన్నా.. పాటలతోనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక స్పెషల్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు హైప్ తీసుకురావడంతో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ దర్శకులు సైతం స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. (చదవండి: సమంత సర్ప్రైజ్.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!)స్టార్ హీరోయిన్లతో స్టెప్పులేయిస్తే.. కాసుల వర్షం కురుస్తుందని భావిస్తారు. అయితే నిజంగానే కొన్ని సినిమాలకు స్పెషల్ సాంగ్ బాగా కలిసొస్తుంది. అలా ఇటీవల స్పెషల్ సాంగ్‌తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ హారర్ ఫిల్మ్ ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.(చదవండి: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో) ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సినిమాకు హైప్ తీసుకొచ్చిన అంశాల్లో ఈ పాట కూడా ఒకటి. అయితే స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట. కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కారణంగానే ఆ స్పెషల్ సాంగ్‌కి హైప్ వచ్చిందని..అది సినిమాకు బాగా ప్లస్ అయిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాంగ్ నోరా ఫతేహీ చేయాల్సింది. స్త్రీ పార్ట్ 1లో ఆమే ఐటమ్ సాంగ్ చేసింది. పార్ట్ 2 లో నోరానే చేయాల్సింది కానీ.. చివరి నిమిషంలో తమన్నాను సంప్రదించారట మేకర్స్. వాళ్లు తీసుకున్న నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత
తమిళసినిమా: వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నటి సమంత ఒక సంచలనమే. మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా, తెలుగులో నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే సక్సెస్ ఆమె నట జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు వరుస కట్టడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. అలా తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ జీవితం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సమంత ఐటమ్ సాంగ్ చేసిన చిత్రం పుష్ప. అల్లుఅర్జున్ , రషి్మక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయంలో సమంత నటించిన ఊ అంటావా మామ పాటకు అధిక భాగమే ఉంది. ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డాన్స్ చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు. ఆ పాట పెద్ద టర్నింగ్ గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదు అని అన్నారు. వివాహా జీవితంలోనూ తాను వంద శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు. అయితే అది తనకు వర్కౌట్ కాలేదని అన్నారు. సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మైయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఖుషీ చిత్రం తరువాత మరో చిత్రం నటించలేదు. కాగా సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణంలో చిత్రం చేసి తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ట్రెండింగ్‌లోనే ఉన్నారు. -
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
దేవ దేవం అయోధ్య రామ గానం
-
'చేజారిన కొడుకు'..! రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ సాంగ్ రిలీజ్..!
కరీంనగర్: ఈ ఏడాది జూలై 4న సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ఓ యువకుడు బైక్ అతివేగంగా నడుపుతున్నాడు. మరో యువకుడు దానిపై కూర్చున్నాడు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయారు. ఓ వారం రోజుల తర్వాత.. జగిత్యాల బైపాస్‌రోడ్డుకు చెందిన ఓ బాలుడి తండ్రి గల్ఫ్ నుంచి వచ్చాడు. అదేరోజే మంచినీళ్ల కోసమని ఆ బాలుడు ద్విచక్ర వాహనంపై వాటర్ ప్లాంట్‌కు బయలుదేరి వెళ్లాడు. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని మృతిచెందాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరు కావడం బాధించింది. ► నేను చదువుకున్న రోజుల్లోనే చిన్నచిన్న కవితలు రాశా. పాఠశాల, కళాశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకే ప్రమాదాల నియంత్రణకు ఓ పాట రాయాలని సంకల్పించా. మంచి పాట రాశా. ► వీలైనంత వరకు అతిత్వరగా రోడ్డు ప్రమాద ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులకు సూచిస్తున్నా. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నా.. ముఖ్యంగా తక్షణమే స్పందించాలని ఘటనా స్థలాల్లో ఉండే ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. సీపీఆర్‌పై వివరిస్తున్నా. ప్రజల్లో చైతన్యం తెస్తున్నా. ► హైదరాబాద్‌లో కొంతకాలం ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా సేవలు అందించా. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం అక్కడ షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించా. వాటిని ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకునేలా యువతలో చైతన్యం తీసుకొచ్చా. జగిత్యాల జిల్లాలోనూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇంజినీరింగ్, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులతో కలిసి హాట్స్పాట్లు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ► కొందరు యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో షార్ట్‌ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువతే కాదు.. ఎవరైనా ట్రాఫిక్ నిబంనలు పాటించాలి. సురక్షితంగా గమ్యస్థానం చేరాలి. అదే మా లక్ష్యం. - ‘సాక్షి’తో ఎస్పీ భాస్కర్ -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట -
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్‌తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. -
భర్త శివ బాలాజీతో మధుమిత మాస్ డాన్స్, వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన మధుమిత ప్రస్తుతం గృహిణిగా పిల్లలు బాధ్యత, ఇంటి వ్యవహారాలను చూసుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తిక విషయాలు తెలుసా? తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ వెకేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భర్త శివ బాలాజీతో కలిసి డాన్స్ చేసిన వీడియో షేర్ చేసింది. పుష్పలో సమంత నటించిన ‘ఊ అంటవా మావ ఊఊ అంటావా’ ఐటెం సాంగ్‌కు భర్తతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్‌కి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. చాలా రోజులు తర్వాత మధుమితను ఇలా కొత్తగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివ బాలాజీ-మధుమితల ఈ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
మహాశివరాత్రి స్పెషల్.. మంచు లక్ష్మి సాంగ్ వైరల్..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్‌ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023 -
SSMB 28: స్పెషల్ సాంగ్‌లో రష్మిక.. పారితోషికం అన్ని కోట్లా?
స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేస్తే.. ఆ కిక్కే వేరేలా ఉంటుంది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఐటం సాంగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి స్టార్ హీరోయిన్లను ఒప్పిస్తారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనుందట. దీని కోసం రష్మిక భారీగా డిమాండ్ చేస్తోందట. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయాలంటే రూ.4 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని రష్మిక అడిగిందట. రష్మిక రెమ్యునరేషన్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు సినిమాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది. -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్‌గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో రామ్‌తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్‌ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్‌బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్‌లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్‌గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్‌గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్! క్లారిటీ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ నుంచి తాజా ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా చిత్ర బృందం విడదల చేసిన ఓ ఫోటోతో ఈ వార్తలపై స్పష్టత వచ్చేసింది. సినిమాలో ఐటెం సాంగ్‌కు చిరుతో కలిసి ఆమె స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. చదవండి: బర్త్‌డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్! ఇటీవల ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేశ్ బర్త్‌డేను వాల్తేరు వీరయ్య సేట్లో సెలబ్రేట్ చేశారు. మూవీ సెట్లో ఆయనతో కేక్ కట్ చేయించిన ఫొటోను డైరెక్టర్ బాబీ ట్విటర్లో షేర్ చేస్తూ ఆయన పుట్టిన రోజును వాల్తేరు వీరయ్య సెట్లో నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మెహర్ రమేశ్ ఇతర క్రూడ్‌తో పాటు నటి ఊర్వశి రౌతేల కూడా దర్శనమించింది. దీంతో ఈ చిత్రంలో ఆమెతో అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారని స్పష్టమైందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ Wishing dearest @MeherRamesh Anna a very happy birthday 🎂 🎉 Super happy to Celebrate your birthday on our #WaltairVeerayya sets along with Boss @KChiruTweets 😍 May you be blessed with best of everything, have a Blockbuster year ahead. ❤️#HBDMeherRamesh pic.twitter.com/OoIMSrue31 — Bobby (@dirbobby) November 6, 2022 -
రామ్ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ
యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగనుంది. పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ హీరో రామ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్‌లో నటించనుందనే న్యూస్ కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. @ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022 -
సమంతకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్? ఈసారి తెలుగులో కాదు!
మంచి కమర్షియల్ సినిమా అంటే అందులో తప్పకుండ ఓ ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో స్పెషల్ సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తమ సినిమాల్లో ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా హీరోలు, దర్శక-నిర్మాతలు చూసుకుంటున్నారు. అంతేకాదు ఈ పాటలో స్టార్ హీరోయిన్స్‌తో స్టెప్పుడు వేయించి మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు దర్శకులు. చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా? ఈ క్రమంలో కాజల్, తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్‌లో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల సమంత చేసిన పుష్ప ఐటెం సాంగ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు ఈవెంట్స్‌లో, పెళ్లిళ్లలో, షోలో ఈ పాట ఇప్పటికి మారుమోగుతుంది. ఇదిలా ఉంటే సమంత మరోసారి స్పెషల్ సాంగ్‌తో అలరించనుందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా సాంగ్‌తో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది సామ్. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? ఈ క్రమంలో ఆమెకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి కాకుండ బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. హిందీ చిత్రం ‘ఎనిమల్’లోని ఐటెం సాంగ్‌లో నటించేందుకు చిత్ర బృందం సామ్‌ను సంప్రదించిందట. అయితే దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? నో చెబుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎనిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మనాలిలో తొలి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. -
హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్. అంతేకాకుండా 'పుష్ప' చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' స్పెషల్ సాంగ్‌తో అనేక మంది చేత 'ఊ' కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ పాటను తనదైన స్టైల్లో ప్రస్తావించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా 'సల్మాన్ ఖాన్‌ను ఇన్స్పైర్ (ప్రభావితం) చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా ?' అని సల్లూ భాయిని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సల్మాన్ 'ఊ అంటావా మావా' అని హమ్ చేశాడు. ఈ వీడియోను సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌ను సామ్ రీట్వీట్‌ను చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్‌తో పంచుకుంది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యశోద, శాకుంతలం, ఖుషితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో సామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? ♥️♥️♥️ https://t.co/UzkF0PVspl — Samantha (@Samanthaprabhu2) June 26, 2022 చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు -
ట్రెండింగ్‌లో ‘దంపుడు లక్ష్మి’ స్పెషల్ సాంగ్
రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మాటరాని మౌనమిది’. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ దంపుడు లక్ష్మి పాట చూసిన ప్రేక్షకులు మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకు అషీర్ లుక్ సంగీతం అందించగా డి సైయద్ బాషా లిరిక్స్ అందించారు. రేవంత్, మనీష పాండ్రంకి, రాహుల్ కనపర్తి ఈ పాటను ఆలపించారు. ఇప్పుడు ఈ దంపుడు లక్ష్మి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనంతో మీ ముందుకు వస్తున్నాను. మేం ఇటీవల విడుదల చేసిన టీజర్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ‘దంపుడు లక్ష్మి’ ఐటమ్ పాటను మధుర మ్యూజిక్ ద్వారా విడుదల చేశాము. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి నాటు పాట, చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మా సంగీత దర్శకుడు అషీర్ లుక్ అద్భుతమైన పాటలు ఇచ్చారు, రాజ్ కృష్ణ డాన్స్ స్టెప్స్ ఆ పాటకు ప్రాణం పోశాయి. మా 'దంపుడు లక్ష్మి' ఐటమ్ పాట సోషల్ మీడియాలో ట్రేండింగ్లో ఉంది’ అని ఆయన తెలిపారు. -
ఐటెం సాంగ్స్‌పై సాయి పల్లవి స్పందన, ఏం చెప్పిందంటే..
Sai Pallavi Interesting Comments On Item Songs: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నాచులర్ బ్యూటీ. మొదటి నుంచి నటిగా తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకున్న సాయి పల్లవి గ్లామర్ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరమనే సంగతి తెలిసిందే. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టింది. చదవండి: విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్! ఇక త్వరలోనే విరాట పర్యం చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఐటెం, స్పెషల్ సాంగ్‌లపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. పుష్ప మూవీలోని ‘ఊ అంటావా మావ’, రంగస్థలంలోని ‘జిగేలు రాణి’ వంటి తరహా పాటల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని హోస్ట్ అడగ్గా.. ఖచ్చితంగా చేయను అని మరు క్షణమే బదులిచ్చింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. ‘ఐటెం సాంగ్స్ నాకు కంఫర్ట్‌గా ఉండవు. ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చేప్తాను. చదవండి: ఎలాగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోలేను.. నటి ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. అందుకే స్పెషల్ సాంగ్‌లో నటించలేను. అసలు నాకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రేమపై తన అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘జీవితానికి కెరీర్ ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం. రెండింటిలో ఏది లేకపోయిన జీవితం సంపూర్ణం కాదు’ అని సమాధానం ఇచ్చింది సాయి పల్లవి. చివరగా శ్యామ్ సింగరాయ్‌లో కనిపించిన సాయి పల్లవి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాకు సంతకం చేయలేదని తెలుస్తోంది. ఇక రానాతో ఆమె నటించిన విరాట పర్వం జూలై 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్‌ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్‌గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్‌పై స్పందించిన అనిల్ రావిపూడి