Sports bike
-
కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న ఆస్ట్రియన్ కంపెనీ కేటీఎం పూర్తి స్థాయిలో ఉత్పత్తులను అందించడం ద్వారా భారత్‌లో తన మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. నాలుగు విభాగాల్లో అంతర్జాతీయంగా లభించే 10 కొత్త బైక్స్‌ను భారత మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.4.75 లక్షలతో మొదలై రూ.22.96 లక్షల వరకు ఉంది.‘అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా కేటీఎం అమ్మకాలను పెంచుకోగలిగింది. ప్రత్యేకించి బజాజ్ ఆటోతో భాగస్వామ్యం తర్వాత ఎగుమతులు అధికం అయ్యాయి. మహారాష్ట్ర చకన్లోని బజాజ్ ప్లాంటులో తయారైన బైక్స్‌ను 120కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. గత ఏడాది కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3.7 లక్షల మోటార్‌సైకిళ్లను విక్రయించింది’ అని కేటీఎం–స్పోర్ట్మోటార్సైకిల్ జీఎంబీహెచ్ ఆసియా, పసిఫిక్, మిడిల్–ఈస్ట్, ఆఫ్రికా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ పెర్బెర్స్లాగర్ తెలిపారు.ఇదీ చదవండి: మూడు ‘హీరో’ బైక్‌లు లాంచ్‌కు రెడీఅమ్మకాలలో భారత్ వాటా 40 శాతమని, ఇక్కడి మార్కెట్లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ పూర్తి ఉత్పత్తి శ్రేణిని దేశీయంగా అందించలేదని వివరించారు. చకన్ ప్లాంటు నుంచి 500 సీసీలోపు సామర్థ్యంగల 12 లక్షల యూనిట్ల కేటీఎం బైక్‌లు ఎగుమతి అయ్యాయి.కొత్త బైక్‌లు ఇవే..అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ (రూ. 22.74 లక్షలు), 890 అడ్వెంచర్ ఆర్ (రూ. 15.80 లక్షలు), ఎండ్యూరో మోటార్‌సైకిల్ శ్రేణిలో 350 EXC-F (రూ. 12.96 లక్షలు), మోటోక్రాస్ విభాగంలో 450 SX-F (రూ. 10.25 లక్షలు), 250 SX-F (రూ. 9.58 లక్షలు), 85 SX (రూ. 6.69 లక్షలు), 65 SX (రూ. 5.47 లక్షలు), 50 SX (రూ. 4.75 లక్షలు). -
రయ్.. రయ్.. గూబ గుయ్!
బంజారాహిల్స్: రాత్రీ పగలూ తేడా లేకుండా మోడిఫైడ్ సైలెన్సర్‌తో భీకర శబ్దాలతో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ బైక్‌లు, కార్లపై అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టిపెట్టారు. గడిచిన నెల రోజుల కాలంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మితిమీరిన వేగంతో చెవులు దద్దరిల్లే శబ్దంతో దూసుకెళ్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు సదరు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇంత చేస్తున్నా ఇంకా కొంతమంది యువకులు స్పోర్ట్స్ బైక్‌లు, కార్లలో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తూనే ఉన్నారు. రాత్రి 10 గంటల తర్వాతనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, నెక్లెస్‌రోడ్డు, మాసబ్‌ట్యాంక్, మాదాపూర్, దుర్గం చెరువు ప్రాంతాల వైపు యువకులు రేసింగ్‌లకు పాల్పడుతూ బైక్‌లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉదయం 11 నుంచి గంట పాటు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రెండు గంటలు మాత్రమే వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తమ దృష్టికి వస్తే మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి 7 తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులపై బైక్‌లు, కార్లు మోత మోగిస్తూ దూసుకెళ్తుండగా వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. చెవులు దద్దరిల్లే సౌండ్లతో నివాసితులు సైతం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కనీసం వారానికి రెండు సార్లైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేర్వేరుగా వాహన తనిఖీలు చేపడితే పెద్ద ఎత్తున మోడిఫైడ్ సైలెన్సర్ల వాహనాలను పట్టుకోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రాణం తీసిన స్పోర్ట్స్ బైక్.. యువకుడు బైక్‌తో పరార్..
ఆదిలాబాద్: జీవితాంతం తోడుంటానని తనతో ఏడడుగులు నడిచిన భర్త కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆయన భార్య జీర్ణించుకోలేక పోతోంది. దంపతులిద్దరూ కలిసి ప్రతిరోజు పనుల నిమిత్తం తమ గ్రామం మావల నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఓరగంటి నర్సయ్య (40) జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అలాగే అతడి భార్య ప్రతిమ బస్టాండ్ ఎదుట కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. రోజు లాగే విధులు ముగించుకుని బస్టాండ్ ప్రాంతానికి కాలిబాటన నర్సయ్య రోడ్డుకు అటువైపు ఉన్న భార్యను తీసుకొని వెళ్లేందుకు రోడ్డు దాటే క్రమంలో ఓ యువకుడు బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. ప్రమాదానికి కారకుడైన యువకుడు సంఘటనా స్థలం నుంచి బైక్‌తో పాటు పరారయ్యాడు. బైక్ నంబర్‌తో చూడగా భుక్తాపూర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబం మరొకరి జీవితంలో వెలుగు నింపేలా నిర్ణయం తీసుకుంది. మృతిచెందిన నర్సయ్య కళ్లను ఇతరులకు దానం చేసి వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు. అసలేం జరిగిందంటే.. అటవీశాఖ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నర్సయ్యది పేద కుటుంబం. తండ్రి ఇదివరకే మరణించగా, వృద్ధురాలైన తల్లి సుభద్ర ఇంటివద్దే ఉంటుంది. నర్సయ్యకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్విత పదో తరగతి చదువుతుండగా, రెండో కుమార్తె అంకిత 8వ, మూడో కుమార్తె ఆర్వి 5వ తరగతి చదువుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు భార్య ప్రతిమ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ప్రతిరోజు వీరు ఉదయం మావల గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి వస్తారు. మళ్లీ సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి పయనం అవుతారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదుట రోడ్డు దాటుతున్న నర్సయ్యను ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు రాత్రి 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తరలించారు. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం అక్కడినుంచి మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన కళ్లను దానం చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్సై డి.ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!
సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్ స్పోర్ట్స్ బైక్ లవర్స్‌ను అకట్టుకునేలా కొత్త వెర్షన్ బైక్‌ను ఆవిష్కరించింది. కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650నిలాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త! 2023 కవాసాకి నింజా 650 ఇంజీన్, ఫీచర్లు స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ బూక్‌లో 649 సీసీ పార్లల్-ట్విన్ ఇంజన్‌ను జత చేసింది. ఇది 8,000 rpm వద్ద 68 పవర్‌ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్‌షీల్డ్‌ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్‌పిట్‌కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్లు తమ బైక్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్‌తోపాటు, ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్లు,కొత్త డన్లప్ స్పోర్ట్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్‌పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?) ధర, లభ్యత దేశంలో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే కొత్త నింజా 650 బుకింగ్‌లు మొదలు కాగా, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. -
భారత్‌లో సుజుకీ కటానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో కటానా స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.61 లక్షలు. పూర్తిగా తయారైన బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. 999సీఎం3 ఫోర్ స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ, ఇన్లైన్–ఫోర్ ఇంజన్, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌తో కూడిన సుజుకీ ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. -
హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వచ్చేస్తుందిగా
ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ స్పోర్ట్ 660 ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షలు. ఈ మోడల్ రాకతో మధ్యస్థాయి బరువుగల అడ్వెంచర్ బైక్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అయిందని కంపెనీ తెలిపింది. 660 సీసీ ట్రిపుల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 81 పీఎస్ పవర్, 17 లీటర్ల ఇంధన ట్యాంక్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బ్లూటూత్ రెడీ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్విచేబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి హంగులు ఉన్నాయి. డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఎయిర్ వెంట్, బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్‌తో స్పోర్టీ లుక్‌ను పొందనుంది. రేడియేటర్ కౌల్‌ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్ మోటార్స్ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. ఈ బైక్ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఇది కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి వంటి బైక్‌లకు పోటీగా నిలవనుంది. (చదవండి: 2022–23 బడ్జెట్..దూసుకుపోనున్న దేశ ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్!) -
తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది
సాక్షి, మంచిర్యాలక్రైం: బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న తనయుడు లారీ చక్రాల కింద నలిగి తండ్రి కళ్లెదుటే దుర్మరణం చెందిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన రెబ్బ రాజలింగు– మణెమ్మ దంపతులకు అంజన్న(24), రాజేశ్వరి సంతానం. అంజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ టీవీ షోరూంలో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన తండ్రి రాజలింగుతో కలిసి జైపూర్ మండలం షెట్పల్లి సమీపంలోని నర్సింగాపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాకు రాగానే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో బండిని నిలిపివేశారు. ట్రాఫిక్ సిగ్నల్ సమయం పూర్తి కాగానే అంజయ్య నేరుగా వెళ్తుండగా అతని పక్కనే వచ్చిన లారీ టర్న్ తీసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం లారీ టైర్ల కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అంజయ్య లారీ కిందపడగా అతని తండ్రి రాజలింగు అవతలివైపు పడ్డాడు. దీంతో లారీ టైర్లు అంజన్నవీుదుగా వెళ్లాయి. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో తేరుకున్న రాజలింగు విలవిలలాడుతున్న కొడుకును చూసి తల్లడిల్లాడు. అతడిని కాపాడేందుకు చేతుల్లోకి తీసుకోగా.. తీవ్రగా యాలు కావడంతో తండ్రి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఘటన స్థలాన్ని ఎస్సై కిరణ్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేతికందిన కొడుకు కానరాని లోకాలకు వెల్లడంతో తల్లిదండ్రులు, చెల్లి రాజేశ్వరి ఆస్పత్రిలో రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఆరు నెలల క్రితమే బైక్ కొనుగోలు.. ఇంటర్ వరకు చదివిన అంజన్న ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు స్థానికంగా ఓ టీవీ షోరూంలో పనిచేస్తున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ కొనివ్వాలని అంజన్న ఆరు నెలల క్రితం తండ్రిని అడిగాడు. ఒక్కగానొక్క కొడుకు అడిగిన కోరికను రాజలింగు కాదనలేకపోయాడు. అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే అంజన్న కొత్త బైక్‌పై తండ్రితో కలిసి వెళ్తూ దుర్మరణం చెందడంతో హాజీపూర్‌లో విషాదం నెలకొంది. హెల్మెట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. అంజన్న తలకు హెల్మెట్ ధరించినప్పటికీ దానికి ఉన్న బెల్ట్ పెట్టుకోలేదు. లారీ ఢీకొనగానే అంజయ్య కిందపడ్డాడు. ఈ సమయంలో హెల్మెట్ ఊడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ బెల్ట్ ధరించి ఉంటే గాయాలతో బయటపడేవాడేమో అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిక్షిప్తంకాని సీసీ ఫుటేజీ.. ఈ ఏడాది జనవరి 29న ఉదయం 6,30 గంటలకు ఇదే ప్రాంతంలో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. మళ్లీ ఇదే ప్రాంతలో ఆదివారం జరిగిన ప్ర మాదంలో అంజన్న మృతి చెందాడు. అయితే ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం కాకపోవడం గమనార్హం. పోలీస్ అధికారులు సీసీ కెమెరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంలో తప్పు ఎవరిదో తెలిసేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలకం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్..! రేంజ్ కూడా అదుర్స్..!
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈవీ శకం మొదలైంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో సమానంగా ఇండియన్ ఈవీ స్టార్టప్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు స్టార్టప్స్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలతో భారత ఆటోమొబైల్ సెక్టార్‌ను ఊపేస్తున్నాయి. తాజాగా ఇగ్నీట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ భారత ఈవీ మార్కెట్లలోకి సరికొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ Cyborg GT120ను లాంచ్ చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే..180కి.మీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే Cyborg GT 120 బుల్లెట్ వేగంతో దూసుకెళ్లనుంది. ఈ బైక్ గరిష్టంగా 125kmph వేగంతో ప్రయాణించనుంది. బైక్ రేంజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 180కి.మీ దూరం మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్‌లో 4.68kWhr లిథియం-అయాన్ బ్యాటరీను అమర్చారు.ఇది 6000 W గరిష్ట శక్తి రిలీజ్ చేయనుంది. Cyborg GT 120 బ్యాటరీ 0 నుంచి 80శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటలు, 100 శాతం ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు సమయం పడుతుంది. కాగా ఈ బైక్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెలలో బైక్ ధరను వెల్లడించనున్నట్లు సమాచారం. ఇది బ్లాక్, పర్పుల్ రెండు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. మోటారు, బ్యాటరీ, వాహనంపై 5 సంవత్సరాల వారంటీతో రానుంది. ఇతర ఫీచర్స్..! సైబోర్గ్ GT 120లో కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS) ముందు భాగంలో డిస్క్ బ్రేక్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లో జియో-ఫెన్సింగ్, జియో-లొకేషన్, USB ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ కూడా ఉన్నాయి. క్లస్టర్లో LED డిస్ప్లేను కల్గి ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్‌తో రానుంది.ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ మూడు రైడింగ్ మోడ్లతో వస్తుంది - ఎకో, నార్మల్, స్పోర్ట్స్. పార్కింగ్ అలర్ట్‌ను కూడా అందించనుంది. కుర్రకారే లక్ష్యంగా..! ఇగ్నీట్రాన్ మెటోకార్ప్ కుర్రకారును లక్ష్యంగా హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు Cyborg GT120తో కలిపి మూడు రకాల హై స్పీడ్ బైక్‌లను కంపెనీ లాంచ్ చేసింది. Cyborg Yoga, Cyborg Bob E, Cyborg GT 120 హై స్పీడ్ బైక్స్ అందుబాటులో ఉండనున్నాయి. చదవండి: టెస్లాకు భారీ షాక్.. ఒక్కరోజుల్లో 100 బిలియన్ డాలర్ల వాల్యూ ఢమాల్ -
కాస్ట్లీ గిఫ్ట్‌తో లవ్ ప్రపోజ్ చేసిన అషూ రెడ్డి
Ashu Reddy Surprise Gift To Express Hari: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి బిగ్‌బాస్ అనంతరం ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ఇటీవలి కాలంలో నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్, ఆ తర్వాత ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషూ మరింత పాపులర్ అయ్యింది. ఇదిలా ఉండగా గత కొంత కాలంలో ఓషోలో కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరికి, అషూకి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ‘ప్రభాస్-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..! ఇది వరకే హరి తన గుండెలపై అషూ పేరుతో పచ్చబొట్టు పొడిపించుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా అషూ సైతం హరిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. హరి కోసం ఖరీధైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేసింది. ఊహించని సర్‌ప్రైజ్‌కి షాక్ అయిన హరి ఇప్పటివరకు తన తల్లిదండ్రులు కూడా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనివ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అషూ సైతం వీడియోను షేర్ చేస్తూ.. 'హరి నీకు ఈ బైక్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. లైఫ్‌లో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా నా ఆలోచనలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటావు' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. అషూ మా చిచ్చా(రాహుల్)ని వదిలేస్తున్నావా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి : 'మా' ఎన్నికల్లో మరో వివాదం..జీవితపై కంప్లైంట్ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
నిలకడగా సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం
రాయదుర్గం/బంజారాహిల్స్(హైదరాబాద్): హీరో సాయిధరమ్‌తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఈ ప్రమా దం చోటు చేసుకుంది. రాయదుర్గం, మాదాపూర్ పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి సాయిధరమ్‌తేజ్ జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు స్పోర్ట్స్ బైక్‌పై బయలుదేరారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు నుంచి ఐకియా వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో కంటి భాగం, కడుపు, ఛాతీపై గాయాలయ్యాయి. వెంటనే కొందరు వాహనదారులు 108కు సమాచారమిచ్చారు. గాయపడిన సాయి ధరమ్‌తేజ్‌ను 108 సిబ్బంది మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తూ పోలీసులకు ఫోన్ చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు అతన్ని సాయిధరమ్తేజ్గా గుర్తించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్‌తేజ్ హెల్మెట్ ధరించడంతో తలకు బలమైన గాయాలేవీ కాలేదని వారు వెల్లడించారు. సాయి ధరమ్‌తేజ్ నడిపిన బైక్ ఇదే.. ఇసుక మేటతోనే ప్రమాదం..... రోడ్డుపై ఇసుక మేట వేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై మట్టి, ఇతర వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఉదయం పూట ఊడుస్తున్నా.. మరుసటిరోజు తెల్లవారేలోగా మళ్లీ మట్టి, దుమ్ము, వర్షం వస్తే ఇసుక మేట వేస్తుంది. ఇసుక మేట కారణంగానే బైక్ అదుపుతప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తేజ్ బైక్(టిఎస్ 07 జీజే 1258)ను స్వాధీనం చేసుకుని, ఐపీసీ 336, 279 సెక్షన్, 279 మోటార్ వెహికిల్ యాక్ట్ 184 కింద.. నిర్లక్ష్యం, అతివేగంగా బైక్ నడినందుకు కేసును నమోదు చేశారు. అయితే బైక్ (‘ట్రంప్’–1160 సీసీ) అనిల్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. సాయిధరమ్‌తేజ్, మరో నటుడి కుమారుడు, మరో ఇద్దరు ఆర్టిస్టులు వీకెండ్ పార్టీకి వెళుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. నిలకడగా ఆరోగ్యం... సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలైనట్లు గుర్తించారు. కాలర్‌బోన్ ఫ్రాక్చర్ అయినట్లు పరీక్షలో తేలింది. మిగిలిన గాయాలు ప్రమాదకరమైనవి కావని, అంతర్గతంగానూ ఎలాంటి గాయాలు లేవని వైద్యులు పేర్కొంటున్నారు. కాలర్‌బోన్ శస్త్ర చికిత్సపై మరో రోజు గడిచిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇదిలాఉండగా శనివారం ఉదయం చిరంజీవి దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆస్పత్రికి వచ్చి అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరేగాక హీరో రామ్‌చరణ్‌తేజ్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మంచు లక్ష్మి తదితరులు ఆస్పత్రికి వచ్చి తేజ్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అతివేగంతో నడిపారు.. అనుమతించదగిన వేగ పరిమితుల్లో తేజ్ వాహనాన్ని నడిపి, హెల్మెట్ సరిగ్గా పెట్టుకొని ఉంటే దురదృష్టకర సంఘటన జరిగేది కాదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రమాద ప్రాంతంలో 75 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపారని చెప్పారు. దుర్గంచెరువు వంతెనపై ఈ వేగం 100 కిలోమీటర్లుగా ఉందని తేలిందన్నారు. బైక్ నడుపుతూ ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా అధిగమించినట్లు సీసీ కెమెరా ఆధారాల ద్వారా గుర్తించామని వెల్లడించారు. -
సాయిధరమ్ తేజ్ మా ఇంటి నుంచే బయలుదేరాడు: నరేశ్
టాలీవుడ్ యంగ్ హీరో, సాయిధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. అపోలో ఆసుపత్రిలో ఆయనకి చికిత్స జరుగుతోంది. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసిన ఎంతో మంది సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడారు. ‘మా అబ్బాయి నవీన్‌కి తేజ్ క్లోజ్‌ఫ్రెండ్. ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారు. బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా, కానీ ఆలోపే వెళ్లిపోయారు. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరం. వేగం విషయంలో యువత కంట్రోల్ ఉండాలి. నాకు ఒకసారి చిన్న ప్రమాదం జరగడంతో.. బాధతో మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో మళ్లీ బైక్ ముట్టుకోలేదు. కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరి అందరూ అనవసరంగా బైక్ ముట్టుకోకుండా ఉండాల’ని నరేశ్ కోరారు. -
Sai Dharam Tej Accident: సాయి తేజ్ వాడిన బైక్ ఏంటి? ధర ఎంత?
Sai Dharam Tej Accident Updates: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. సాయి తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడనే విషయం తెలియగానే.. ఆయన వాడిన బైక్ ఏంటి? దాని ధర ఎంత? అని నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. (చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్) ఇక సాయి తేజ్ బైక్ విషయానికొస్తే.. దీన్ని ఆయన రీసెంట్గా హైదరాబాద్‌లో కొలుగోలు చేశాడు. TS07 GJ1258 ఇది ఆ బైక్ రిజిష్ట్రేషన్ నంబర్. అనిల్ కుమార్ పేరుతో బైక్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఆయన వాడిన బైక్ ఖరీదు రూ. 11 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటుంది. ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్. దీని బరువు దాదాపు 200 కేజీల వరకు ఉంటుంది. బైక్ రైడింగ్ అంటే సాయి తేజ్‌కి చాలా ఇష్టం. విరామం దొరికితే చాలు తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. శుక్రవారం కూడా అదే క్రమంలో వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా ఈ ప్రమాదం జరిగింది. -
స్నేహితులను దొంగలుగా మార్చిన జల్సాలు
సాక్షి, హైదరాబాద్: ఓన్లీ స్పోర్ట్స్ బైక్స్‌నే టార్గెట్‌గా చేసుకుని హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లాలో 12 రోజుల్లో 8 ద్విచక్ర వాహనాలను కొట్టేసిన అంతర్రాష్ట్ర ముఠా విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టళ్ల వద్ద ఉన్న వాహనాలను తస్కరించాలనే ఆలోచన తన స్నేహితుడు, గ్యాంగ్ మెంబర్ విడిది చేసిన హాస్టల్ వద్ద పరిస్థితిని చూసిన తర్వాతే వచ్చిందని ప్రధాన సూత్రధారి బయటపెట్టాడు. ముగ్గురినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సింగా కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ► గుంటూరు జిల్లా నరసరావుపేట వాసి శివనాగ తేజ కుందన్‌బాగ్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి స్నేహితులైన గుంటూరు జిల్లా వాసులు చందు, మధు మద్యం, జల్సాల కోసం ఇతడి వద్దకు వచ్చేవాళ్లు. ► జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ఈ ముగ్గురూ కలిసి నేరాలు చేయాలని భావించారు. గత నెల మూడో వారంలో నగరంలో సమావేశమైన ఈ త్రయం వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది. ► తేజ ఉంటున్న హాస్టల్లో పార్కింగ్ సదుపాయం లేకపోడంతో అందులో ఉండే వాళ్లు తమ వాహనాలను రోడ్డు పక్కనే పార్క్ చేసేవాళ్లు. ఇది చూసిన ఈ త్రయం హాస్టల్స్ వద్ద బైక్స్‌నే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ► వాళ్లు వాడే స్పోర్ట్స్ బైక్స్ ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. అల్యూమినియంతో తయారైన వాటి హ్యాండిల్‌ను కాలితో తేలిగ్గా విరగ్గొట్టవచ్చని, ఫ్యూజుల్లో పిన్నీసు పెట్టి వాహనం స్టార్ట్ చేయొచ్చని నేర్చుకున్నారు. ► పిడుగురాళ్ల నుంచి రాత్రి బస్సులో బయలుదేరే చందు, మధు తెల్లవారుజామున నగరానికి చేరుకునే వాళ్లు. ఆ రోజు అర్ధరాత్రి వరకు మద్యం తాగి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30– 3 గంటల మధ్య వాహనం తస్కరించే వాళ్లు. ► చందు, శివ ఓసారి మద్యం కోసం నల్లగొండ జిల్లాలో తెలంగాణ– ఏపీ సరిహద్దుల్లోని వాడపల్లికి బస్సులో వచ్చారు. తిరిగి వెళ్లడానికి అవసరమైన డబ్బునూ మద్యానికే వాడేశారు. తమ స్వస్థలాలకు చేరడానికి అక్కడో బైక్ తస్కరించారు. ►ఈ చోరులను పట్టుకోవడంతో ఆసిఫ్‌నగర్ క్రైమ్ కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రామకృష్ణలు దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ పరిశీలించారు. అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ సోమవారం అరెస్టు చేశారు. ►వీరిపై వాడపల్లిలోనూ ఓ కేసు నమోదై ఉంది. దీంతో ఈ త్రయం అరెస్టుపై అక్కడి పోలీసులకు ఆసిఫ్‌నగర్ అధికారులు సమాచారం ఇచ్చారు. త్వరలో వాళ్లు పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురినీ అరెస్టు చేసి తరలించనున్నారు. -
అంతా యూట్యూబ్ మహిమ.. ఓన్లీ స్పోర్ట్స్ బైక్స్‌యే సుమీ..!
సాక్షి, హైదరాబాద్: పార్కింగ్ వసతి లేని హాస్టళ్ల బయట పార్క్ చేసిన పల్సర్ కంపెనీ స్పోర్ట్స్ బైక్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాకు ఆసిఫ్‌నగర్ పోలీసులు చెక్ పెట్టారు. ఈ గ్యాంగ్ కేవలం 12 రోజుల వ్యవధిలో ఎనిమిది వాహనాలను తస్కరించినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్‌తో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ, గొల్ల మధు స్నేహితులు. ప్రైవేట్ ఉద్యోగులైన వీరిలో నాగతేజ ప్రస్తుతం కుందన్ బాగ్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారు. ఏపీ కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో తాగడానికే చందు, మధు తరచూ తేజ వద్దకు వచ్చేవాళ్లు. పగలంతా మద్యం సేవించి రాత్రికి మళ్లీ బస్సెక్కి వెళ్లిపోయేవారు. ఇటీవల కాలంలో మద్యానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ముగ్గురూ కలిసి వాహనాలు చోరీ చేయాలని పథకం వేశారు. ఆసిఫ్‌నగర్, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో ని హాస్టళ్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో హాస్టళ్లలో ఉండే వాళ్ల స్పోర్ట్స్ బైకులను చోరీ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. వాటిని ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. ఆ వీడియోల ఆధారంగా చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను నరసరావుపేటలోని మధు ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో దాచి.. మళ్లీ సిటీకి వచ్చేవాళ్లు. ఇలా కేవలం 12 రోజుల్లో ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్, కేపీహెచ్‌బీల్లో 8 పల్సర్ స్పోర్ట్స్ బైక్స్ చోరీ చేశారు. ఈ చోరీలను ఛేదించడానికి ఆసిఫ్‌నగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ టీమ్ రంగంలోకి దిగింది. దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను పరిశీలించిన టీమ్ అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ అరెస్టు చేసి, 8 వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. -
BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా
ముంబై: జర్మనీ విలాస వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మంగళవారం భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. ‘‘ఎస్ 100 ఆర్’’ పేరుతో వస్తున్న ఈ ప్రీమియం బైక్ ధర రూ.17.9 లక్షలుగా ఉంది. కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (సీబీయూ) రూపంలో భారత్‌లోకి దిగుమతి అవుతోంది. స్టాండర్డ్, ప్రో, ప్రో ఎం స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో కొత్తగా డెవలప్ చేసిన వాటర్ కూల్డ్ 4–సిలిండర్ ఇన్–లైన్ ఇంజిన్‌ను అమర్చారు. 3 సెకన్లలో బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైకు కేవలం 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 250 కి.మీ. వేగం ప్రయాణించగలదు. ప్రీమియం బైకులను కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకొని రెండో తరానికి చెందిన బీఎండబ్ల్యూ ఎస్ 100 ఆర్ బైక్‌లను రూపొందించామని భారత్ విభాగపు ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉండే అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌ల వద్ద కొత్త మోడల్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ
సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్‌వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్‌శ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్ చేరింది. అలాగే సచిన్ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్‌ను కూడా శోధించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం థానే వెళ్లారు. అయితే మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్‌యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. In CCTV footage (in pic), Sachin Waze was seen going to Chhatrapati Shivaji Maharaj Terminus at 7 pm on 4th March. He had taken a local train to Thane that day. He was brought to CSMT y'day for scene recreation Body of Mansukh Hiren was found at Kalwa creek in Thane on 5th March pic.twitter.com/gnMfdaMLLQ — ANI (@ANI) April 6, 2021 -
డ్యూక్ 790 స్పోర్ట్స్ బైక్.. ధరెంతో తెలుసా..!!
న్యూఢిల్లీ : ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎమ్.. అధునాతన ‘డ్యూక్ 790’ బైక్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 799 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.8.64 లక్షలుగా కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో.. బెంగుళూరు, ముంబై, పుణె, హైదరాబాద్, సూరత్, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై, గువాహటిల్లో డ్యూక్ 790 బైక్‌ను ఈ రోజు నుంచే బుక్ చేసుకోవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. క్రోమియం మాలిబ్డినం స్టీల్ ఫ్రేమ్‌తో మిరుమిట్లు గొలుపుతున్న ఈ బైక్‌పై ఈఎంఐ సదుపాయం కల్పిస్తున్నట్టు బజాజ్ ఆటో ఫిన్‌కార్ప్ తెలిపింది. 1.70 లక్షల డౌన్‌పేమెంట్‌తో, నెలకు రూ.19 వేలు ఈఎంఐతో బైక్‌ను సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. గతేడాది డ్యూక్ 200 బైక్‌ను కేటీఎమ్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
18 లక్షలు పెట్టి బైక్ కొన్న హీరో
ముంబై: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఖరీదైన బైక్ సొంతం చేసుకున్నాడు. అత్యంత శక్తివంతమైన బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ ఎడ్వెంచరస్ మోటార్‌సైకిల్ కొన్నాడు. రూ. 18.25 లక్షలు (ఎక్స్ షోరూమ్) వెచ్చించి దీన్ని కొనుగోలు చేశాడు. కొత్త బైక్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. హైఎండ్ బైకులంటే అమితాసక్తి చూపించే షాహిద్ కపూర్ దగ్గర డుకాటి స్కాంబ్లర్ 1200, హార్లే-డేవిడ్సన్ ఫాట్‌బాయ్, యమహా ఎంటీ 01 బైక్‌లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ310 ఆర్ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన ఫొటోను కొద్ది రోజుల క్రితం ట్విటర్లో పెట్టాడు. ముంబై ట్రాఫిక్‌లో నడపడానికి అత్యంత అనువుగా ఈ బైక్ ఉంటుందని పేర్కొన్నాడు. అయితే ఈ బైక్‌ను కొన్నాడా, లేదా అనేది వెల్లడించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ తదితర ప్రముఖులు కూడా బీఎండబ్ల్యూ బైకులు వాడుతున్నారు. షాహిద్ కపూర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈసినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. టీ సిరీస్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 జూన్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. View this post on Instagram 1250 reasons to smile. Thank you @bmwmotorrad @bmwmotorrad_in for the stunning gs1250 #bikelover gone mad 🤩 A post shared by Shahid Kapoor (@shahidkapoor) on Mar 7, 2019 at 6:53am PST -
యమహా కొత్త ‘వైజెడ్ఎఫ్–ఆర్3’
గ్రేటర్ నోయిడా: యమహా మోటార్ ఇండియా తాజాగా తన స్పోర్ట్స్ బైక్ ‘వైజెడ్ఎఫ్–ఆర్3’లో అప్డేటెడ్ వెర్షన్‌ని మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.3.48 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇందులో 321 సీసీ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ 4 స్ట్రోక్ ఇంజిన్, డ్యూయెల్ చానల్ యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 14వ ఎడిషన్ ఆటో ఎక్స్పో కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్, యమహా బ్రాండ్ అంబాసిడర్ జాన్ అబ్రహం ఈ ‘వైజెడ్ఎఫ్–ఆర్3’ బైక్‌ని ఆవిష్కరించారు. కాగా ఈ స్పోర్ట్స్ బైక్స్ ఎంపిక చేసిన యమహా డీలర్షిప్స్ వద్ద మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. -
కవాసాకి కొత్త స్పోర్ట్స్ బైక్.. ధర ఎంతో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ: కవాసాకి ఇండియా కొత్త బైక్లాంచింగ్పై సూచనలు అందించింది. త్వరలోనే స్పోర్టీ క్రూయిజర్‌ను ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతోంది. తన అధికారిక వెబ్ సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోడల్ వుల్కాన్ 650ఎస్ క్రూయిజర్ గా భావిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీన్ని లాంచ్ చేయనుందని సమాచారం. దీని ధర రూ. 5.5 లక్షలుగా ఉంటుందని అంచనా. 'ఎర్గో ఫిట్' సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ రైడర్లకు భిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది.ముందువైపు ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుకవైపు సెట్-సెట్ ఎడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్, లైట్ వైట్ చక్రాలు, హై ట్రాక్షన్ టైర్లను అమర్చింది. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి స్టాండర్డ్ ఫీచర్‌తోపాటు 649 సీసీ ట్విన్ మోటార్, సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లు ప్రధానంగా ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న నింజా 650, జెడ్ 650 పోలిన ఫీచర్లను పోలిన ,మోటార్, ఇంజీన్ అమర్చింది. అయితే 62.8 ఎన్ఎం, 6600 ఆర్పీఎం టార్క్లాంటి భిన్నమైన ఫీచర్లను జోడించింది. హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 , స్ట్రీట్ రాడ్ మోడల్ విభాగంలో త్వరలో లాంచ్ కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ ట్విన్ సిలిండర్ క్లాసిక్ బైక్‌కు పోటీ ఇవ్వనుంది. -
కొంటానని వచ్చి.. కొట్టేశాడు
సాక్షి, రావులపాలెం (కొత్తపేట): ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన ఒక ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌ను సినీ ఫక్కీలో చోరీ చేసిన సంఘటనపై కేసు నమోదు చేసినట్టు రావులపాలెం ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతలపల్లి శివారు పోతుమట్టలకు చెందిన కటికదల విశ్వతేజ తన స్పోర్ట్స్ బైక్‌ను అమ్మతానని ఇటీవల ఓఎల్ఎక్స్ సైట్లో పెట్టాడు. ఇది చూసిన రాజమహేంద్రవరానికి చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ కొంటానని ఆన్లైన్లోనే సంప్రదించాడు. బైక్‌ను రావులపాలెం తీసుకురావాలని సూచించాడు. దీంతో శనివారం విశ్వతేజ బైక్‌తో రావులపాలెం వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తి బైక్ ట్రయిల్ వేస్తానని చెప్పడంతో ఇద్దరు స్థానికంగా కొంత దూరం వెళ్లాక సమీపంలో తన భార్య ఉందని డబ్బులు తెస్తానని చెప్పడంతో విశ్వతేజ బైక్ దిగాడు. ఇదే అదనుగా ఆ వ్యక్తి బైక్‌తో ఉడాయించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్ విలువ రూ.1.75 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. దీనిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు. -
ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్
బైక్‌పై వచ్చి.. పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ చందుర్తి(వేములవాడ): సమయం.. శనివారం ఉదయం 9.15 గంటలు.. రయ్‌మంటూ స్పోర్ట్స్ బైక్ ఒకటి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది.. హెల్మెట్.. స్పోర్ట్స్ జాకెట్ ధరించిన ఆ వ్యక్తి ఆ బైక్‌పై నుంచి కిందికి దిగారు. ఈ హఠాత్పరిణామానికి నోరెళ్ల బెట్టి చూస్తున్న పోలీసులు, అంతేవేగంతో అప్రమత్తమయ్యా రు.. శత్రువు ఎవరైనా వచ్చారా? అని ఆలోచిస్తూనే ఆయుధాలు ఎక్కుపెట్టారు.. కానీ, బైక్‌పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి గన్‌మన్ బైక్ దిగడంతో.. వచ్చింది పోలీసు ఉన్నతాధికారి అయి ఉంటారని ఆసక్తిగా చూశారు.. అంతలోనే ఎస్పీ విశ్వజిత్ తన తలపై హెల్మె ట్ను తొలగించారు.. ఆయనను గుర్తించిన పోలీసు సిబ్బంది.. ఎస్పీకి సెల్యూట్ చేశారు. ఇలా స్పోర్ట్స్ బైక్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి ఠాణాను శనివారం ఎస్పీ విశ్వజిత్ కంపాటి తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. -
కేటీఎం టార్గెట్ @50,000 బైక్స్
♦ 2018కల్లా 500 షోరూంలు ♦ ప్రోబైకింగ్ సౌత్ హెడ్ గౌరవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం ఈ ఏడాది భారత్‌లో 50,000 బైక్‌లను విక్రయించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. 2016లో కంపెనీ దేశవ్యాప్తంగా 36,000 బైకులు విక్రయించింది. కేటీఎంలో ప్రస్తుతం అయిదు మోడళ్లను రూ.1.4 లక్షల నుంచి రూ.2.3 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉంచామని ప్రోబైకింగ్ డివిజన్ సౌత్ హెడ్ గౌరవ్ రాథోర్ గురువారం తెలిపారు. మార్కెట్ తీరుకు అనుగుణంగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. గురువారమిక్కడి కూకట్‌పల్లిలో శ్రీ వినాయక మోబైక్స్ ఏర్పాటు చేసిన కేటీఎం షోరూంను ప్రారంభించిన అనంతరం డీలర్ కె.వి.బాబుల్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ.8 లక్షలు ఆపైన ధర గల మోడళ్లలో ఉండే ఫీచర్లను కేటీఎం బైక్స్‌లో పొందుపరచడం వల్లే కస్టమర్ల నుంచి ఆదరణ ఉందని తెలియజేశారు. ‘‘భారత్‌లో 350కిపైగా షోరూంలను నిర్వహిస్తున్నాం. 2018 డిసెంబరుకల్లా మరో 150 ఔట్లెట్లు తెరుస్తాం’’ అని చెప్పారు. శ్రీ వినాయక మోబైక్స్ 9వ కేటీఎం షోరూం బహదూర్‌పురలో మే నాటికి రానుందని బాబుల్ రెడ్డి తెలిపారు. నెలకు 110 కేటీఎం బైక్‌లను విక్రయిస్తున్నామని, ఈ ఏడాది నుంచి నెలకు 150 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేవారు. శ్రీ వినాయక బజాజ్ ఇప్పటికే 6 బైక్స్ షోరూంలను నిర్వహిస్తోంది. జూన్‌కల్లా కొత్తగా రెండు ఔట్లెట్లు ఏర్పాటు చేస్తోంది. -
మార్కెట్లోకి బజాజ్ స్పోర్ట్స్ బైక్.. ‘డామినర్ 400’
ప్రారంభ ధర రూ.1.3 లక్షలు న్యూఢిల్లీ: మార్కెట్‌ను ఊరిస్తున్న బజాజ్ 400సీసీ బైక్ రంగప్రవేశం చేసింది. ‘డామినర్ 400’ పేరిట బజాజ్ ఆటో ఈ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.36 లక్షలు నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత శక్తివంతమైన బైక్ ఇదే. ‘డామినర్ 400’లో 373.2 సీసీ డీటీఎస్–ఐ, సింగిల్–సిలిండర్, లిక్విడ్–కూల్డ్, 4–వాల్వ్ ఇంజిన్‌ను అమర్చినట్లుకంపెనీ పేర్కొంది. బైక్‌లో స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6–స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 8.23 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బైక్ గరిష్ట వేగం గంటకు 148 కిలోమీటర్లు. నాన్–ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.36 లక్షలుగా, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.5 లక్షలుగా ఉందని తెలిపింది. జనవరిలో డెలివరీ..: రూ.9,000తో బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని, జనవరి నుంచి డెలివరీ ఉంటుందని వివరించింది. నెలకు 15,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ⇔ ప్రత్యేక ఫీచర్లివీ... ⇔ ఆల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ⇔ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ⇔ ఫుల్ డిజిటల్ 2 స్టెప్ ఇన్స్ట్రుమెంటేషన్ట ళీ శక్తివంతమైన ఇంజిన్ ళీ స్లిప్పర్ క్లచ్. -
ఈ ఏడాదే మార్కెట్లోకి టీవీఎస్ ‘అకూల 310’
♦ 2016-17లో 12 శాతం వృద్ధి లక్ష్యం ♦ కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న టీవీఎస్ మోటార్ కం పెనీ స్పోర్ట్స్ బైక్‌ల విభాగంలో వేగం పెంచింది. ఇటీవలే అపాచీ ఆర్టీఆర్ 200 మోడల్‌ను ఆవిష్కరించిన ఈ సంస్థ అకూల 310 పేరుతో మరో స్పోర్ట్స్ బైక్‌ను తేబోతోంది. బీఎండబ్ల్యు గ్రూప్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ మోటారాడ్తో కలసి టీవీఎస్ దీనిని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది చివరికల్లా భారతీయ రోడ్లపై అకూల దూసుకెళ్లనుందని టీవీఎస్ మోటార్ సేల్స్, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ జేఎస్ శ్రీనివాసన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కొత్త టీవీఎస్ విక్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విక్టర్ బైక్‌లు నెలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1,500, దేశవ్యాప్తంగా 15 వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. పరిశ్రమ కంటే రెండింతలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి రేటు 6 శాతం ఉండొచ్చని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే టీవీఎస్ 12 శాతం వృద్ధి నమోదు ఖాయమని అన్నారు. విక్టర్, ఎక్స్ఎల్ 100 మోడళ్లు కంపెనీ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. భారత స్కూటర్ల మార్కెట్లో 15 శాతం, మోటార్ సైకిళ్ల విపణిలో 14 శాతం వాటాను టీవీఎస్ కైవసం చేసుకుంది. విక్టర్ రాకతో ఎగ్జిక్యూటివ్ క్లాస్ మోటార్‌బైక్స్ విభాగంలో కంపెనీ వాటా 2 శాతం అధికమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2002 నుంచి విజయవంతంగా ఈ బైక్ అమ్ముడవుతోందని వివరించారు. ఎక్స్ఎల్ 100 మోపెడ్స్ నెలకు దేశవ్యాప్తంగా 64,000 యూనిట్లు విక్రయమవుతున్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో విక్టర్ ధర వేరియంట్‌నుబట్టి రూ.51,900 నుంచి ప్రారంభం.