station
-
రైల్వే స్టేషన్లో దీపావళి రద్దీ.. తొక్కిసలాటలో తొమ్మిదిమందికి గాయాలు
ముంబై: ముంబైలోని బాంద్రా టెర్మినల్ రైల్వే స్టేషన్లో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. రైలు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తొక్కిసలాట అనంతరం అప్రమత్తమైన రైల్వే అధికారులు గాయపడినవారిని ముంబైలోని భాభా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడిన తొమ్మదిమందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉదయం 5.56 గంటలకు ఈ ఘటన జరిగింది. STORY | 9 persons injured in stampede at Mumbai's Bandra railway stationREAD: https://t.co/sdZpmGELdkVIDEO:(Source: Third Party) pic.twitter.com/LIBuwJkniS— Press Trust of India (@PTI_News) October 27, 2024బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి ప్రయాణికులు పోటీ పడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని షబ్బీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కంగాయ్ (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (27), మహ్మద్ షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సాహ్ని (19), నూర్ మహ్మద్ షేక్ (18)గా పోలీసులు గుర్తించారు. Meanwhile in India #Mumbai : A #stampede on platform number 1 at #Bandra Terminus has left nine people injured. The injured passengers have been taken to the hospital, according to BMC.#MumbaiLocal #MumbaiCrowd #BandraStation #BandraStampede #Diwali #MumbaiLocalT pic.twitter.com/4HoRG2auoA— know the Unknown (@imurpartha) October 27, 2024ఇది కూడా చదవండి: కేజీఎఫ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది -
ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్..అచ్చం లగ్జరీయస్ హోటల్..!
మాములుగా అంతరిక్ష కేంద్రాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అవి వారి పరిశోధనకు అనుగుణంగా ఉంటాయి. అలా కాకుండా భూమ్మీద ఉండే అత్యంత విలాసవంతమైన హోటల్ మాదిరిగా ఉంటే..ఆ ఊహా అబ్బా అనిపిస్తోంది కదూ. అలాంటి ఆలోచనకే అంకురార్పణ చేసింది అమెరికా కొత్త స్టార్టప్ స్పేస్ టెక్ కంపెనీ వాస్ట్. ఈ కంపెనీ స్పేస్ ట్రావెల్ కొత్త శకానికి నాంది పలికింది. సాంప్రదాయ అంతరిక్ష కేంద్రాలకు స్వస్తి చెప్పి అత్యంత ఆధునాత లగ్జరియస్ హోటల్‌లా తీర్చిదిద్దనుంది. ఆగస్ట్ 2025లో ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్ పాల్కన్ 9 రాకెట్లో హెవెన్ -1 అనే పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో వ్యోమగాములకు రిసార్ట్ లాంటి వాతావరణాన్ని అందించనుంది. పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ హెవెన్-1ని చెక్కతో అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, తెల్లటి గోడలు, హై ఎండ్ హోటల్‌కు సరిపోయే సౌకర్యాలతో అత్యంత ఆధునాతనంగా తీర్చిదిద్దారు.pic.twitter.com/6VD6XrJg8P— VAST (@vast) October 10, 2024 అంతేగాదు ఇందులో అత్యాధునిక జిమ్ కూడా ఉంటుందట. సందర్శకులు సున్నా గురుత్వాకర్షణలో చూసేలా వీలు కల్పిస్తోంది. ఇది అచ్చం భూమిపై ఉన్న హోటల్ మాదిరి అనుభూతిని అందిస్తుంది. అంతేగాదు ఈ హేవెన్ 1కి సంబంధించిన తుది డిజైన్‌ను స్పేస్ కంపెనీ వెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని పీటర్ రస్సెల్ క్లార్ట్, వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్ రూపొందిస్తున్నారు. ఇందులో వ్యోమగాములు హాయిగా గదుల్లో ఉండేలా సౌకర్యం ఉటుంది. అలాగే మెరుగైన నిద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెడ్ వంటివి కూడా ఉంటాయి. అంతేగాదు గుండె, ఎముకల ఆరోగ్యం కోసం ఆన్‌బోర్డ్ ఫిట్నెస్ సిస్టమ్ వంటి ఆధునాత సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్‌ను 2025లో ప్రారంభించనుండగా, అందులోని ఈ హెవెన్1 చెల్లింపు కస్టమర్లు మాత్రం 2026 నుంచి మొదలవుతారని వెల్లడించారు పరిశోధకులు. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Today, Vast unveiled the final design for Haven-1, the world’s first commercial space station, setting a new standard. Guided by visionary designer Peter Russell-Clarke and astronaut Andrew Feustel, we’re pushing the boundaries of life in space with human-first design led by… pic.twitter.com/xDdMzNFnuF— VAST (@vast) October 10, 2024(చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!) -
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్పిట్ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యవస్థలన్నీ విఫలం... భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్యార్డ్గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్యార్డ్కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్యార్డ్పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చే స్తారు.ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు.. పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలంజనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసింది. -
పాక్ నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బీఎల్ఏ దాడి
పాకిస్తాన్‌లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడికి తెగబడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడింది. బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం బీఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాలలో పేలుళ్లకు పాల్పడ్డారు. నేవీ బేస్ దగ్గర అర్థరాత్రి వేళ షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పీఎన్ఎస్ అనేది పాక్‌లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం. పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు. సోమవారం రాత్రి దాడి ప్రారంభంకాగా ఇప్పటికీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ ఉదంతంపై పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టర్బాట్‌లోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యులను అప్రమత్తం చేశారు. దీనికి ముందు జనవరి 29న గ్వాదర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి జరిగింది. కాగా తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. After the passage of 7 hours, the BLA Majeed Brigade still continues to hold control of the PNS Siddiqui Naval Base in #Turbat city. Firing and explosions continue, BLA fighters reportedly destroy drone operating systems at base source police pic.twitter.com/W68QW8w2os — Benjimen Baluch (@BaluchBenjimen) March 26, 2024 -
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
వాటర్‌ప్రూఫ్ పవర్‌స్టేషన్
ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోవడానికి వీలుగా పోర్టబుల్ పవర్ స్టేషన్లు రకరకాలకు చెందినవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వీటితో ఇబ్బందేమీ ఉండదు గాని, అకస్మాత్తుగా వాన కురిసి, వాన నీటి వల్ల వీటి లోపలి భాగాలు తడిస్తే మాత్రం ప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. నీరు పడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఆర్క్ప్యాక్’ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్‌ప్రూఫ్ పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘ఆర్క్ ఐపీ67’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇది 1500 డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఏకకాలంలో పదకొండు ఎలక్ట్రానిక్ పరికరాలను దీని ద్వారా చార్జింగ్ చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉండటం విశేషం. ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు, బోటు షికార్లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోయి, ఎక్కడ కావాలనుకున్నా ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని తీర్చిదిద్దారు. దీని ధర 1,999 డాలర్లు (రూ.1.66 లక్షలు). -
కూలిన మెట్రో స్టేషన్ వాల్... పలువురికి గాయాలు!
ఢిల్లీలోని గోకల్‌పురి మెట్రో స్టేషన్లో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌లోని సైడ్ వాల్లోని కొంత భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో, అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో కొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్నవారికి బయటకు తీసుకువచ్చి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ గురువారం 11 గంటల సమయంలో గోకల్‌పురి మెట్రో స్టేషన్ సరిహద్దు గోడ (తూర్పు వైపు) కూలిపోయి, దిగువ రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో స్థానిక పోలీసులు, మెట్రో ఉద్యోగులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వెయ్యిమంది రైల్వే స్టేషన్లో కుక్కల్లా ఎందుకు మొరిగారు?
మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు వందలాది మంది ఒకే చోట గుమిగూడి మిమ్మల్ని చూసి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైతే ఆశ్చర్యపోతారు. అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. ఇటువంటి ఉదంతం బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు. అయితే ఉన్నట్టుండి కుక్కలా మొరగడం మొదలుపెట్టారు. రైల్వేస్టేషన్లో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వారు సామూహికంగా మొరుగుతూ అటువైపు వచ్చిపోయే వారితో మాట్లాడుతున్నారు. ‘డైలీ మెయిల్’ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ అని అంటారు. వీరు తమను తాము కుక్కలుగా భావిస్తుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ Hundreds of people who identify as dogs gathered at the Potsamer Platz railroad station, in central Berlin, on Tuesday for a meeting organized by a group called 'Canine Beings' which advocates for the rights of people who identify as #dogs. Germany. pic.twitter.com/n3Wj13SeIC — Funny News Hub (@Funnynewshub) September 20, 2023 -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
స్మార్ట్ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతులు. ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ను ఏర్పాటు చేసుకుని చీడపీడలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంట నష్టాన్ని నివారించుకుంటున్నారు. పనిలో పనిగా సస్యరక్షణ ఖర్చు సగానికి తగ్గినట్టే. నాణ్యత పెరగడమే కాదు.. ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సూత్రాలను ‘స్మార్ట్’గా పాటిస్తూ పండ్ల తోటల్లో ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ ద్వారా చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు అనంతపురం రైతులు. దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల తోటలు సాగు చేసే పెద్ద రైతులకు వెదర్ స్టేషన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. తోటల యాజమాన్యాన్ని ‘స్మార్ట్’ సాధనాలతో సులభతరం చేసుకోవడమే కాక ఖర్చును తగ్గించుకుంటూ అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆటోమేటిక్ స్మార్ట్ వెదర్ స్టేషన్ సోలార్ సిస్టమ్‌తో నడుస్తుంది. భూమి రకాన్ని బట్టి 3 ఎకరాలకు ఒకటి సిఫారసు చేస్తున్నారు.. ఒకే పంటను సాగు చేసే రైతులు ఒక పరికరంతోనే సత్ఫలితాలను పొందుతున్నారు. రూ.50 వేల వ్యయంతో దీన్ని తోట మధ్యలో అమర్చుకోవాలి. భూమి లోపల కనీసం 2–3 మొక్కలను కలుపుతూ ఒక అడుగు లేదా 15 అంగుళాల లోతులో సెన్సార్‌ను పెడతారు. అలాగే, రాబోయే 14 రోజుల్లో ఉండే ఉష్ణోగ్రతలను అంచనా వేసేందుకు టవర్‌కు మధ్యలో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. గాలివేగం, తేమశాతం తెలుసుకునేందుకు టవర్‌కు రెండో వైపు 2.5–3 అడుగుల ఎత్తులో మరో సెన్సార్‌ను ఏర్పాటు చేస్తారు. భూమిలో ఉండే సెన్సార్ మొక్కల వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతోంది? వేర్ల దగ్గర తేమ శాతం, ఒత్తిడి ఎలా ఉందో చెబుతుంది. అలాగే రెండో సెన్సార్ ఉష్ణోగ్రతలను, మూడో సెన్సార్ ద్వారా గాలిలో తేమ శాతం, గాలి వేగం గురించి చెబుతుంది. రెయిన్ గేజ్ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. 3 సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని తనే విశ్లేషించుకొని రైతులకు తగిన సూచనలు, సలహాలతో మెస్సేజ్‌లు పంపుతుంది. మంచి ఫలితాలొస్తున్నాయి నేను 25 ఎకరాల్లో దానిమ్మ, 10 ఎకరాల్లో ద్రాక్ష పండ్లు సాగు చేస్తున్నా. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాబాసాహెబ్ ఘోరే శిక్షణా కార్యక్రమంలో వీటి ప్రయోజనాల కోసం తెలుసుకున్నా. రెండేళ్ల క్రితం వీటిని మా తోటల్లో ఏర్పాటు చేశాం. చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే సిఫార్సులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏర్పాటు చేసిన ఫసల్ కంపెనీ ఏడాది పాటు ఉచితంగా సేవలందించింది. మా జిల్లాలో 10 మంది రైతులు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి రాగా, పెట్టుబడులు పోను రూ.2–3 లక్షల వరకు నికరాదాయం వస్తో్తంది. – గౌని పాతిరెడ్డి, కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా (9440752434) ఇంట్లో నుంచే తోట యాజమాన్యం నేను 64 ఎకరాల్లో దానిమ్మ, బత్తాయి, బొప్పాయి తోటలు సాగు చేస్తున్నా. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు. పంట ఏ తెగులు బారినపడుతుందో అన్న దిగులు లేదు. ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌కి మెస్సేజ్లొస్తాయి. సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే చాలు. గతంతో పోలిస్తే∙నీరు 50% ఆదా అవుతుంది. 25% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దిగుబడి పెరిగింది. పండ్ల నాణ్యత 50% పెరిగి మంచి రేటు కూడా వస్తోంది. – సుగాలి చిన్న నాగరాజు, యలగలవంక తండా, బేలుగుప్ప మం., అనంతపురం జిల్లా (7702828062) చీడపీడలను ఇట్టే పసిగడుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది.. ఫలానా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.. ఫలానా తెగులు సోకే ప్రమాదం ఉంది.. మరో గంటలో వర్షం పడే అవకాశం ఉంది వంటి హెచ్చరికలు పంపిస్తుంది. భూమిలో ఉండే సెన్సార్ ఆధారంగా ఏ సమయంలో ఎంత మేరకు నీరు పెట్టాలో చెబుతుంది. పోషక లోపాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. చీడపీడలకు పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఎంత మోతాదులో ఎటు నుంచి పిచికారీ చేయాలో కూడా చెబుతుంది. టవర్‌కు ఉండే రెయిన్ గేజ్ ఆధారంగా పంటపొలం వద్ద ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడింది? ఆ ప్రభావం పంటలపై ఏ మేరకు ఉంటుందో కూడా రైతులకు తెలియజేస్తుంది. టవర్ లోపల సిమ్ కార్డు నిక్షిప్తం చేసి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు టెక్ట్స్ మెసేజ్ రూపంలో రైతుకు సమాచారం వస్తుంది. రైతు తోటలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే ప్రత్యేక యాప్ ద్వారా మెసేజ్ రూపంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతాయి. ఏమైనా తెగుళ్లు సోకినట్టు గుర్తిస్తే తప్ప అనవసరంగా మందులు కొట్టే అవసరం ఉండదు. సిఫారసు చేసిన పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులో స్ప్రే చేయడం వలన అదనపు ఖర్చు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన మందు స్ప్రే చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది. తెగుళ్లు, చీడపీడలు సోకకుండా ముందస్తుగా గుర్తించడం వలన పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. పురుగుమందుల వినియోగం తగ్గడంతో ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పొలంలో వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెట్టుబడి ఖర్చు 20% తగ్గడంతోపాటు, నాణ్యత 50%, దిగుబడి 25% వరకు పెరుగుతుంది. 20% పైగా అదనపు ఆదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి (చదవండి: ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం! స్మెదిక్‌లో సిక్కు జాతీయుల ఫార్మింగ్ సిటీ) -
ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే..
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగివుంది. ఈ విషయంలో భారతీయ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. వీటిలో కొన్ని రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలంలో నిర్మితమయ్యాయి. అవి ఎక్కడ ఉన్నాయో, ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం. భారతీయ రైల్వే ప్రస్తుతం 7 వేలకుపైగా రైల్వే స్టేషన్లను కలిగివుంది. వీటి మీదుగా 13 వేలకు మించిన రైళ్లు నడుస్తుంటాయి. దీనితో పాటు ఈ రూట్లలో గూడ్సు రైళ్లు కూడా నడుస్తుంటాయి. భారత్‌లో రైల్వే వ్యవస్థ.. బ్రిటీషర్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఏర్పడింది. నాడు నిర్మితమైన రైల్వే స్టేషన్లు ఇవే.. హౌరా రైల్వేస్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పట్టణంలోని ప్రముఖ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి తొలి రైలు 1854 ఆగస్టు 15న తన రాకపోకలు ప్రారంభించింది. ఈ రైలు హౌరా-హుబ్లీల మధ్య నడిచేది. ఇది మన దేశంలో ఏకంగా 23 ప్లాట్‌ఫారాలు కలిగిన అతిపెద్ద రైల్వే స్టేషన్. రాయ్‌పూర్ రైల్వేస్టేషన్ చెన్నై సబర్బన్ రైల్వే నెట్వర్క్ పరిధిలోని వాలాజాపేట విభాగంలో ఉన్న రాయపూర్ రైల్వేస్టేషన్‌ను బ్రిటీషర్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి 1856లో దక్షిణభారతానికి చెందిన తొలి రైలు నడిచింది. ప్రస్తుతం ఇది దక్షిణ మరాఠా- మద్రాస్‌కు కేంద్ర కార్యాలయంగా ఉంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయన్ రైల్వే స్టేషన్‌ను గతంలో ముగల్‌సరాయ్ రైల్వే స్టేషన్ పేరుతో పిలిచేవారు. తరువాతి కాలంలో దీని పేరు మార్చారు. ఇది యూపీలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. బెనారస్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. ఈ స్టేషన్ 1862లో నిర్మితమయ్యింది. ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్ భారత్‌లోని ప్రముఖ రైల్వే స్టేషన్. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీని నిర్మాణం 1978లో ప్రారంభమయ్యింది. తొలుత ఈ రైల్వే స్టేషన్‌కు మహారాణి విక్టోరియా పేరు పెట్టారు. తరువాత 1996లో దీని పేరు ఛత్రపతి శివాజీ టర్మినస్‌గా మార్చారు. డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ డెహ్రాడూన్ రైల్వేస్టేషన్ ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ రైల్వేస్టేషన్. దీని నిర్మాణం 1897-1899 మధ్యకాలంలో బ్రిటీషర్ల సారధ్యంలో సాగింది. ఈ రైల్వే లైన్‌కు 1896లో అనుమతి లభించింది. 1900 మార్చి 1న ఈ రైలు ప్రారంభమయ్యింది. లక్నో చార్బాగ్ రైల్వేస్టేషన్ లక్నోలోని ఐదు రైల్వే స్టేషన్లలో చార్బాగ్ రైల్వే స్టేషన్ ఒకటి. దీని నిర్మాణం 1914లో మొదలయ్యింది. 1923 నాటికి ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ స్టేషన్ డిజైన్‌ను బ్రిటీష్ ఆర్కిటెక్ జె. హెచ్ రూపొందించారు. ఈ స్టేషన్ నిర్మాణంలో భారత ఇంజినీరు చౌబె ముక్తా ప్రసాద్ కీలక బాధ్యతలు వహించారు. నాటిరోజల్లో ఈ స్టేషన్ నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చయ్యాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అజ్మరీ గేట్- పహాడ్‌గంజ్ మధ్య ఉన్న న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నిర్మాణానికి 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతినిచ్చింది. 1931 నాటికి ఈ రైలు ప్రారంభానికి నోచుకుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో మొత్తం 16 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ప్రతీరోజూ కొన్ని వందల రైళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తాయి. నంది హాల్ట్ రైల్వే స్టేషన్ నంది హాల్ట్ రైల్వే స్టేషన్ బెంగళూరులోని యలువహళ్లిలో ఉంది. ఇది 108 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో నిర్మితమయ్యిందని చెబుతారు. ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ? -
అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు!
రైలు నడుస్తున్నప్పుడు ఆ రైలులోని లైట్లన్నింటినీ ఆర్పివేయడమనేది ఎక్కడైనా చూశారా? టెక్నికల్ ప్రోబ్లం కాకుండా అలా ఎప్పుడైనా జరుగుతుందా? సాధారణంగా ఇలా జరగదు. అయితే వీటికి భిన్నంగా ఆ ప్రాంతంలోకి రైలు రాగానే దానిలోని లైట్లన్నీ బంద్ అయిపోతాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో? అటువంటి ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకిలా చేస్తారంటే.. చైన్నైలోని ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఇలా జరుగుతుంది. చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌కు సమీపంలోని కొంత దూరంలోకి లోకల్ రైలు రాగానే దానిలోని లైట్లు ఆరిపోతాయి. అయితే ఇలా లోకల్ రైళ్ల విషయంలోనే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఒక లోకోపైలెట్ సమాధానమిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొద్దిదూరం వరకూ మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ కాస్త దూరంలో ఓహెచ్‌ఈలో కరెంట్ ఉండదు. ఓహెచ్ఈ అనేది లోకోమోటివ్‌కు విద్యుత్‌ను అందిస్తుంది. అక్కడి ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లో విద్యుత్ ఉండదు. ఇటువంటి ప్రాంతాన్ని నేచురల్ సెక్షన్ అని అంటారు. కట్ కరెంట్ ప్రాంతంగా.. ఇటువంటి స్థలాలను రైల్వేనే రూపొందిస్తుంది. దీనిని ఓవర్ హెడ్ వోల్టేజ్, విద్యుత్ నిర్వహణ కోసం తయారు చేస్తారు. దీనిని కట్ కరెంట్ అని పిలుస్తారు. ఇది నూతన విద్యుత్ జోన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీని వల్ల కొంత దూరం వరకు కరెంటు ఉండదు. లోకల్ రైళ్ల లైట్లు డ్రైవర్ క్యాబిన్ నుండి పనిచేస్తాయి. వాటి పవర్ సిస్టమ్ భిన్నంగా ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో ప్రభావితమవుతుంది. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, పాసింజర్ రైళ్లలో కోచ్‌లకు వేర్వేరుగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. దీని కారణంగా ఆ రైళ్లలో ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తదు. నూతన జోన్ కారణంగా ఇక్కడ నుండి వెళ్ళే లోకల్ రైళ్లలోని లైట్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. ఇది కూడా చదవండి: పాములు పట్టడంలో ఎవరైనా అతని తర్వాతే.. ‘స్నేక్ మ్యాన్’ స్టోరీ! -
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. నలుగురు సైనికులు మృతి..
చండీగఢ్: గుర్తు తెలియని ఆగంతకుల కాల్పులతో పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిబిరంలోని శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భోజనశాల పక్కనే ఉన్న బ్యారక్‌లలో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు దాడి చేశారా? మరొకరి పనా ? అనేది భారత సైన్యం ఇంకా స్పష్టంచేయలేదు. ఘటన విషయం తెల్సిన వెంటనే సత్వర స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతోంది. సాధారణ దుస్తులు, ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పుల ఘటన తర్వాత ఆ బ్యారక్ నుంచి బయటికొచ్చి అటవీ ప్రాంతం వైపు పారిపోయారనే ప్రత్యక్ష సాక్షి అయిన ఒక జవాను చెప్పారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. ఆగంతకుల కోసం వేట మొదలుపెట్టారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీతూటాలు లభించాయి. రెండ్రోజుల క్రితం ఇక్కడే ఇన్సాస్ రైఫిల్‌తోపాటు 28 రౌండ్ల తుపాకీ గుళ్ల చోరీ ఘటనకు, ఈ దాడికి సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తును చేస్తున్నట్లు ఆర్మీ నైరుతి కమాండ్ తెలిపింది. ఘటన తాలూకు సమగ్ర వివరాలను సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఉగ్రదాడి కాదు. ‘బయటివాళ్ల’ పని అస్సలు కాదు. ఆర్మీతో సమన్వయంతో ఈ ఘటనపై శోధిస్తున్నాం’’ అని పంజాబ్ అదనపు డీజీపీ పార్మర్ చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్చేయలేదని భటిండా పోలీస్ కంటోన్మెంట్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గుర్మీత్ సింగ్ స్పష్టంచేశారు. ‘ ఇది అంతర్గత వ్యక్తుల దాడిలా తోస్తోంది. ఫోరెన్సిక్ బృందం సంబంధిత ఆధారాలను సేకరిస్తోంది. లోతైన దర్యాప్తు కొనసాగిస్తాం’ అని భటిండా సీనియర్ ఎస్పీ గులీ్నత్ సింగ్ ఖురానా మీడియాతో చెప్పారు. చోరీకి గురైన రైఫిల్ దొరికినట్లు సమాచారం. మరణించిన జవాన్లలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందినవారు. ఘటనాస్థలిలోకి ఎవరూ రాకుండా ఆర్మీ నిషేధ ఆంక్షలు విధించింది. చదవండి: ఏడు నెలల గర్భిణి.. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగిన ప్రియురాలు.. నల్లమల అడవిలోకి తీసుకెళ్లి.. -
HYD: పైసల్లేవ్.. మెట్రో స్టేషన్ నుంచి దూకేసింది!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: మెట్రో స్టేషన్లో యువతి కిరాక్ డ్యాన్స్ స్టెప్పులు
-
HYD: మెట్రో స్టేషన్లో యువతి కిరాక్ డ్యాన్స్ స్టెప్పులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో వికృత చేష్టలతో యువత రెచ్చిపోతున్నారు. మెట్రో స్టేషన్‌ని కేంద్రంగా చేసుకొని టిక్ టాక్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాజాగా నగరంలోని మెట్రో స్టేషన్లో ఓ యువతి హంగామా సృష్టించింది. కాగా, హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్లో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీసుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.. వీడియో కాస్తా మెట్రో అధికారుల దృష్టికి చేరింది. వీడియోపై స్పందిస్తూ.. ఈ వీడియోను ఏ స్టేషన్లో చేశారో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు. -
మెట్రో స్టేషన్ విషాదం: అనాథలా బతకడం ఇష్టం లేకనే..
అక్షర్ధామ్ మెట్రో సూసైడ్ కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెవిటి-మూగ అయితే ఆ యువతి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అదృష్టం కొద్దీ బతికింది అనుకునేలోపు.. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. జీవితం మీద ఆమెకు అంతలా విరక్తి కలగడానికి వెనక కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనకమానరు. పాతికేళ్లకే జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఏంటన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఒక్కో విషయం తెలుస్తోంది. పంజాబ్ హోషియాపూర్‌కు చెందిన బాధితురాలు.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించింది. అయితే ఆమె తల్లిదండ్రులు సహా ఇంట్లో వాళ్లంతా ఎప్పుడో మరణించారు. ప్రస్తుతం ఒక్క బామ్మ మాత్రమే బతికి ఉంది. ఆ పెద్దావిడ కూడా ఇవాళో రేపో అన్నట్లు ఉంది. ఈ తరుణంలో.. ఆవిడ కూడా చనిపోతే.. అనాథగా మిగిలిపోతానేమోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఈ విషయమై చాలాకాలంగా ఆలోచిస్తూ డిప్రెషన్లో కూరుకుపోయిన ఆమె.. ఆఫీస్‌లోనూ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటోందని, కౌన్సెలింగ్ కోసం కూడా సహకరించలేదని ఆమెతో పని చేసిన కొలీగ్స్ చెప్పారు. ఇక ఒంటరితనం గురించి ఆలోచించి.. ఆలోచించి.. చివరకు ఈమధ్యే ఆ యువతి ఉద్యోగం కూడా మానేసిందట. ఆపై అనాథగా మిగిలిపోతానేమోనని ఆందోళనతో.. ఇలా తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు వెల్లడించారు. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 కాపాడే ప్రయత్నంలో.. నలభై అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. తీవ్రంగా గాయాలపాలై శుక్రవారం ఆమె మృతి చెందినట్లు లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తూర్పు ఢిల్లీ అక్షరధామ్ మెట్రో స్టేషన్ బ్లూ లైన్ మెట్రో ప్లాట్ఫారం చివర నుంచి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. ఆమెను నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. పైన ఒక బృందం ఆమెను బతిమాలి ఆత్మహత్య ప్రయత్నం విరమించే దిశగా కృషి చేయగా.. కింద మరో టీం దూకితే గనుక బ్లాంకెట్ సాయంతో ఆమెను పట్టేసుకోవాలని రెడీగా ఉన్నారు. ఈలోపు ఆమె దూకేయగా.. బ్లాంకెట్‌లో పట్టేసుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసిందామె. చదవండి: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మౌలాలి రైల్వేస్టేషన్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మౌలాలి రైల్వేస్టేషన్లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు అవకాశం లభించింది. పెద్ద ఎత్తున చేపట్టిన రైల్వేస్టేషన్ విస్తరణ, ప్లాట్‌ఫామ్‌ల పొడిగింపు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే రైళ్ల నిర్వహణకు అనుగుణంగా స్టేషన్ అందుబాటులోకి రానుంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కోసం లూప్లైన్ల ఏర్పాటు చేశారు. అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికుల రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించనున్నాయి. సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల రద్దీ నివారణకు అనుగుణంగా మౌలాలి స్టేషన్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మేరకు సరుకు రవాణా లైన్లను లూప్‌లైన్లుగా మార్పు చేశారు. మరోవైపు రెండు రైల్వే లైన్ల పొడవును విస్తరించారు. దీంతో ఈ రైల్వేస్టేషన్లో 18 బోగీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెరుగనుంది. (క్లిక్: సౌతిండియాలో అతిపెద్ద లాజిస్టిక్ పార్క్.. హైదరాబాద్‌లో ప్రారంభం) ఈ సదుపాయంతో మౌలాలి స్టేషన్లో మరిన్ని రైళ్లు నిలిపేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రయాణికుల రైళ్లను నిలిపేందుకు ఇప్పుడు ఉన్న రెండు ప్లాట్‌ఫామ్‌లతో పాటు మరొకటి అదనంగా అందుబాటులోకి రానుంది. రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కూడా మెరుగుపడనుందని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. (క్లిక్: ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా) -
Hyderabad: బిపిన్ రావత్ యాదిలో..
సాక్షి, హైదరాబాద్: త్రివిధ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2017లో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది చివర్లో సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ (సీడీఎం)ని, 2018 డిసెంబర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఎంసీఈఎంఈ)ని సందర్శించారు. సీడీఎం సందర్శనలో భాగంగా హయ్యర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు (హెచ్‌డీఎంసీ)లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దేశ రక్షణలో ఆర్మీ ప్రాముఖ్యత, అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా ఆర్మీ పని తీరును మెరుగుపరుచుకోవడంపై పలు కీలక సూచనలు చేశారు. 2019 డిసెంబర్ 14న తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ 99వ స్నాతకోత్సవానికి సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సందర్శన సందర్భంగా.. ఈ సందర్భంగా ఎంసీఈఎంఈలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మిలిటరీ అధికారులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. 2019 తర్వాత బిపిన్ రావత్ సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్‌ను సందర్శించలేదు. ఇక్కడి ప్రతిష్టాత్మక శిక్షణ సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలకు వెబ్‌నార్ ద్వారా హాజరయ్యేవారు. ఎంసీఈఎంఈ స్నాతకోత్సవంలో.. – కంటోన్మెంట్ చదవండి: CDS Bipin Rawat: సెలవిక దళపతి... వెల్లింగ్టన్లో మృతులకు నివాళి -
కరోనాను జయించిన కానిస్టేబుల్‌కు ఘన స్వాగతం
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా): కరోనాను జయించిన కానిస్టేబుల్‌కు పోలీస్ స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. వివరాల ప్రకారం.. తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్ సత్యనారాయణకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో 28 రోజలపాటు క్వారంటైన్లో ఉన్న అనంతరం విధులకు హాజరయ్యారు. దీంతో స్టేషను వద్దనే కానిస్టేబుల్ సత్యనారాయణకు శాలువా, పూలమాలతో ఎస్సై విజయబాబు సాదరంగా ఆహ్వానించారు. మిగతా సిబ్బంది కూడా పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఇక రెండు రోజుల క్రితం వివాహమైన అమలాపురం పట్టణం పద్మినీ పేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. -
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లు
-
ఇందూరు ‘స్టేషన్’లో ఇక్కట్లు..?
నిజామాబాద్ సిటీ: ‘ఏ గ్రేడ్’ రైల్వేస్టేషన్ స్థాయికి ఎదిగిన నిజామాబాద్ రైల్వేస్టేషన్లో ఇప్పటికి ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంలేదు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మీదుగా నిత్యం 45–50 రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాదిగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అయితే వారి ఇబ్బందులను తీర్చడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేందుకు, ఏడాది క్రితం రెండో రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌కు వెనుకాల గల నాందేవ్‌వాడ, హమాల్వాడి, దుబ్బ, సుభాష్‌నగర్, కంఠేశ్వర్ ప్రాంతాల ప్రజలకు ఈ రైల్వేస్టేషన్ ఉపయోగపడుతుందని భావించారు. రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఏర్పాటు ద్వారా ప్రధాన రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్లపై భారం తగ్గుతుందని సైతం భావించారు. తద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారు. దీంతో పై ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మొదటి రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో క్యూలో ఉండటం, ఆ సమయంలో తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుండటం నిత్యం జరుగుతోంది. అయితే రెండో రైల్వేస్టేషన్లో సిబ్బంది కొరత కారణంగా దాదాపుగా మూసి ఉంచుతున్నారు. గూడ్స్ రైలు వస్తే స్టేషన్ బంద్.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు గూడ్స్ రైలు వచ్చిందంటే చాలు రెండో రైల్వేస్టేషన్‌కు తాళం పడుతోంది. రెండో రైల్వేస్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందే గూడ్స్ రైలులో సరుకులు నింపే పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఇక్కడకు టిక్కెట్ల కోసం వచ్చేవారికి తిప్పలు తప్పడంలేదు. ప్రధాన స్టేషన్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు. నిజామాబాద్ మీదుగా సుదూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ, నాందేడ్ మార్గాలకు ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. దీంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిజామాబాద్ ప్రధాన రైల్వేస్టేషన్లో టిక్కెట్టు కౌంటర్లు మూడు ఉండగా ఇవి ఏ మాత్రం సరిపోక ప్రైవేట్‌గా టిక్కెట్లు ఇచ్చే మిషన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దివరకు సమస్య తీరింది. రైలు నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందు ప్రయాణికుల సంఖ్య బాగా ఉండడంతో బుకింగ్ కౌంటర్లన్ని కిటికిటలాడుతుంటాయి. రెండో స్టేషన్లో బుకింగ్ కౌంటర్ పనిచేయక ప్రయాణికుల బాధలు మరింత పెరుగుతున్నాయి. అవగాహన కల్పించకపోవడంతోనే.. నిజామాబాద్ రెండో రైల్వేస్టేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించకనే అది నిరుపయోగంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద రెండో రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ ఉన్నట్లు ప్రచారం చేయకపోవటం, ప్రజల్లో అవగాహన కల్పించక ప్రజలంతా ప్రధాన రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. తద్వారా అక్కడ టిక్కెట్ల కోసం ప్రయాణికుల తోపులాట ఆగటంలేదు. రెండో రైల్వేస్టేషన్ నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించి, బుకింగ్ కౌంటర్‌పై అవగాహన కల్పిస్తే దుబ్బ, నాందేవ్‌వాడ, హమాల్‌వాడీ, కంఠేశ్వర్, సుభాష్‌నగర్ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే అధికారులు రెండో రైల్వేస్టేషన్ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
బాలానగర్ స్టేషన్ పేరు మార్పు
హైదరాబాద్: కూకట్పల్లి వైజంక్షన్‌లో ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలానగర్ స్టేషన్‌గా శనివారం నామకరణం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు కలసి పేరును అధికారికంగా మార్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభపై మెట్రో ఎండీ ఎన్వీఎస్.రెడ్డి స్టేషన్ పేరు మారుస్తున్నట్లుగా ఉన్న పత్రాలను కలెక్టర్, కమిషన్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేశారు. అనంతరం ఎన్వీఎస్.రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ మహామేధావి అని, ఆయన పేరు మెట్రో స్టేషన్‌కు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎల్ అండ్ టీని ఒప్పించి పేరు మార్చామని చెప్పారు. దళిత ఐక్యవేదిక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పేరు మార్పునకు ఎంతో కృషి చేశారన్నారు. -
అదృష్టంతో బతికిపోయింది..!
హాంగ్‌కాంగ్ : ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే సంఘటన. పొరపాటున అటుగా రైలు వచ్చుంటే.. అన్న మాట తలపుకు వస్తేనే కాళ్ల కింద భూకంపం వచ్చే భయానక సన్నివేశం హాంగ్‌కాంగ్‌లో జరిగింది. హాంగ్‌కాంగ్‌లోని యెన్లాంగ్ మెట్రో స్టేషన్లో రైలు కోసం ఒక యువతి ఎదురు చూస్తోంది. రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆమె అటుఇటు తిరుగుతూ.. అటువైపున ఉన్న మిత్రులకు హాయ్ చెబుతోంది. ఇంతలో ఒక వ్యక్తి.. ఆమెను వెనక నుంచి హఠాత్తుగా రైల్వే ట్రాక్‌మీదకు తోసేసి.. తనకు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. ట్రాక్ మీద పడ్డ యువతి.. తనకు ఏం జరిగింది? ఎందుకిలా పడ్డాను? అని అనుకుంటూ.. అటుగా వెళ్తున్న వ్యక్తిని గట్టిగా తిడుతోంది. ఆమె అదృష్టం బాగుండి.. అప్పటికే అటు రావాల్సిన రైలు ఆలస్యం కావడంతో ప్రాణాలతో బతికిపోయింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో.. నిందితుడిని కొద్ది సేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందిదాకా చూశారు.