substation
-
నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం
కామారెడ్డి: రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకై క ప్రభుత్వం మాదేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొల్లూర్‌లో రూ.98 కోట్ల నిధులతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రాన్ని 15 ఏళ్లు సీఎంగా పాలించినా నేటికి అక్కడ కరెంటుకు దిక్కులేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడం, సీఎండీగా ప్రభాకర్‌రావు డిస్ట్రీబ్యూషన్, ట్రాన్స్మిషన్, జనరేషన్లో తీసుకున్న విప్లవాత్మక చర్యల మూలంగా తెలంగాణలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన సమయంలో మనకు 7,780 మెగావాట్ల విద్యుత్ వస్తే దాన్ని నేడు 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్రావులకే దక్కుతుందన్నారు. కొల్లూర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్కిట్లను పంపిణీ చేశారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రారెడ్డి, జెడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ తుకారాం, నాయకులు ద్రోణవల్లి సతీష్, అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. తలసరి వినియోగంలో టాప్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140యూనిట్లు అయితే దేశం సరాసరి విద్యుత్ తలసరి వినియోగం 1255 యూనిట్లు మాత్రమేనని తెలిపారు. వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్ఈ సూర్య నర్సింహారావు, తదితరులు ఉన్నారు. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు షాక్: సబ్‌స్టేషన్ అమ్ముతా.. కొంటారా ?
సాక్షి, నేలకొండపల్లి: విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒకరు స్థలం దానంగా ఇవ్వగా, నేతలు, అధికారులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరకపోవడంతో ఆ దాత వినూత్నంగా నిరసనకు దిగాడు. దీంతో, అతడి నిరసన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి 2014లో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరైంది. గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసింహారావు 12 గుంటల భూమి ఇచ్చాడు. అప్పుడు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని చెప్పినా, హామీ నెరవేరకున్నా పైసా జీతం లేకుండా పనిచేశాడు. గతంలో పలుమార్లు నిరసన తెలిపినా, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, విసుగు చెందాడు ఈ క్రమంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నరసింహారావు.. సబ్‌స్టేషన్ అమ్ముతున్నందున కావాల్సిన వారు తనను సంప్రదించాలని కోరాడు. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా ఉద్యోగమైనా ఇవ్వాలని, లేకపోతే ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: రీసేల్.. రివర్స్ -
15– 20 గంటల కరెంట్ నిరూపిస్తే రాజీనామా
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాష్ట్రమంతటా విద్యుత్ కోతలు ఉన్నాయని, ఎక్కడైనా 15–20 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. విద్యుత్ కోతలపై వివరాలు తెలుసుకునేందుకు తాము భువనగిరి పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను తీసుకుంటే, ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్స్టేషన్లలోని లాగ్ బుక్‌లను తీసేసుకుందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులను నమ్ముకున్నారని, తాము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలలో రహదారులు మాత్రమే అభివృద్ధి చెందాయని, ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదని కోమటిరెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని బతకలేని తెలంగాణగా మార్చారన్నారు. ఎన్నికల కోసం దళితబంధు, బీసీ బంధులను ప్రకటిస్తూ సొంత పారీ్టకి చెందిన వారి కుటుంబసభ్యులకే లబ్ధి చేకూరుస్తున్నారని, ఈ బంధులతో కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. హోంగార్డు రవీందర్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి లేదు కాంగ్రెస్‌లో ఎలాంటి అసంతృప్తి లేదని కోమటిరెడ్డి అన్నారు. పదవులు తనకు కొత్తకాదని వ్యాఖ్యానించారు. 17న కొంగరకలాన్‌లో జరిగే కాంగ్రెస్ సభలో కర్ణాటక తరహాలో ఐదు గ్యారంటీ పథకాలను సోనియాగాంధీ ప్రకటించనున్నట్లు తెలిపారు. -
గ్రేటర్ ‘పవర్’ఫుల్..!
ఐటీ, అనుబంధ సంస్థల రాకతో నగరవాసుల ఆదాయం గణనీయంగా పెరిగింది. ధనిక, పేద తేడా లేకుండా ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, కంప్యూటర్లు, టీవీలు, వాటర్ హీటర్లు, ఐరన్ బాక్స్‌లు, మిక్సీలు, గీజర్లు సర్వ సాధారణమయ్యాయి. ఫలితంగా తలసరి కరెంట్ వినియోగం కూడా భారీగా పెరిగింది. 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 2,261 యూనిట్లకు చేరడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, పారిశ్రామిక భవనాలు వెలుస్తున్నాయి. నెలకు సగటున 2500–3000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు జత చేరుతున్నాయి. ఫలితంగా ఏటా విద్యుత్ వినియోగం రెండు నుంచి మూడు శాతం అధికంగా నమోదవుతున్నట్లు అంచనా. ఇక విద్యుత్ గృహోపకరణాల సంఖ్యా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవుతుండటంతో సిటీజనాలు ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా ఆన్ చేసి ఉంచుతున్నారు. ఫలితంగా గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ పీక్కు చేరుకుంది. రికార్డు స్థాయిలో డిమాండ్ రాష్ట్రం ఏర్పాటు సమయంలో గ్రేటర్ పీక్ సీజన్ డిమాండ్ 48 నుంచి 49 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా... ప్రస్తుతం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 19న డిస్కం చరిత్రలోనే అత్యధికంగా 80 ఎంయూలు నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 28న 71.09 ఎంయూల విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ సారి ఏకంగా ఎనిమిది ఎంయూలకు పైగా వినియోగం నమోదు కావడం గమనార్హం. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో ఇంజనీర్లు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవుతుండటం, ఆయిల్ లీకేజీల కారణంగా బస్తీల్లోని పలు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతుండటం, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు అప్రమత్తమై.. ఎప్పటికప్పుడు ఆయా సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. -
విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు
-
త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోంది?
రఘునాథపల్లి: వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు జనగామ జిల్లా రఘునాథపల్లి సబ్ డివిజన్ సెక్షన్ ఆఫీస్, ఈఆర్వో కార్యాలయం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రీఫేజ్ కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు రాత్రివేళ పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ప్రధాన సంచికలో మంగళవారం ‘చేను తడవాలంటే జాగారమే’శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులున్నాయా.. 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన, వర్క్ కేటాయింపు రిజిస్టర్లను తనిఖీ చేశారు. వినియోగదారులకు, రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ æఇంజనీర్ వేణుమాధవ్, డీఈ ఆపరేషన్ ఎంఎల్ఎన్ రెడ్డి, డీఈ ఐటీ అనిల్‌కుమార్, ఏడీఈ మనోహర్‌రెడ్డి, ఎస్‌ఏవో జయరాజ్, ఏఏవో హన్మంత్‌నాయక్, ఏఈ రాహుల్ తదితరులున్నారు. -
విద్యుత్ సిబ్బందిని బంధించిన రైతులు
కోరుట్ల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా ధర్మారం రైతులు మంగళవారం సబ్‌స్టేషన్ సిబ్బందిని కార్యాలయం గదిలో బంధించి తాళం వేశారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ రంగానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో నీళ్లు అందక వరి, మక్క, కూరగాయల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కోరుట్ల–మల్లాపూర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మల్లాపూర్ ఏడీఈ శ్రీనివాసరావు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో సిబ్బందిని విడుదల చేసి ఆందోళన విరమించారు. -
నోయిడా విద్యుత్ సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ సబ్‌స్టేషన్‌లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌పిసిఎల్) లోని 148 సబ్‌స్టేషన్ వద్ద మంటలు వ్యాపించాయి. పవర్‌స్టేషన్ నుంచి నోయిడా మెట్రోకు విద్యుత్ సరఫరాను అందిస్తుండగా ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సహాయక చర్యల్లో పాల్గొంది. సబ్‌స్టేషన్ మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్మేసింది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
‘చరిత్ర’ను చదును చేసేశారు
► బృహత్ శిలాయుగం నాటి జనావాస ఆనవాళ్లు ధ్వంసం ► రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివార్లలో పురావస్తు సంపద ► ఆ రక్షిత ప్రాంతం సబ్‌స్టేషన్‌కు కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఆఫ్రికాకు తెలంగాణకు సంబంధం ఏమైనా ఉంటుందా?.. మూడు వేల ఏళ్ల క్రితమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలసలుండేవన్న విషయం తెలుసా?.. ఇనుముకు కార్బన్‌ను జోడిస్తే అది దృఢంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నివసించిన ఆనాటి వారు రెండున్నర వేల ఏళ్ల కిందే ఉక్కును రూపొందించారని తెలుసా?.. నిజమే ఇనుపయుగం నాటి మానవుల సమాధులున్న ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసినప్పుడు బయటపడ్డ విషయాలివి. హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పక్కనున్న కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ పురాతన సంపద ఉంది. కానీ మూడు వేల ఏళ్ల నాటి పెద్ద జనావాసమున్న ఈ పురాతన సంపద ఆనవాళ్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాశనమైపోయాయి. నిజాం హయాంలో గుర్తింపు కేతిరెడ్డిపల్లి గ్రామం వెలుపల వందల సంఖ్యలో బృహత్ శిలాయుగం నాటి సమాధులున్నాయి. నిజాం హయాంలో నాటి పురావస్తు నిపుణులు దీనిని గుర్తించారు. దాంతో ఈ ప్రాంతాన్ని పరిరక్షించాలని భావించిన నిజాం.. సమాధులు విస్తరించి ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలాన్ని పురావస్తుశాఖకు అప్పగించారు. స్వాతంత్రం అనంతరం పురావస్తు శాఖ దానిని రక్షిత స్థలంగా ప్రకటిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. పురావస్తు రక్షిత ప్రాంతంగా గుర్తిస్తూ 1953లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. భవిష్యత్తులో వాటిని తవ్వి సమాధుల్లో లభించే వస్తువుల ఆధారంగా పరిశోధనలు చేయాలని అప్పట్లో నిర్ణయించినా తర్వాత పట్టించుకోలేదు. ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనిదే కావడంతో అలాగే ఖాళీగా ఉండిపోయింది. సబ్‌స్టేషన్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా.. హైదరాబాద్ శివార్లలో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ట్రాన్సకో మొయినాబాద్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ స్థలం కావాలని రెవెన్యూ శాఖను కోరింది. దీంతో అధికారులు సరిగ్గా పురావస్తు సంపద ఉన్న చోటే 71 ఎకరాల స్థలాన్ని ట్రాన్సకోకు అప్పగించారు. ట్రాన్సకో రెండు నెలలుగా ఈ ప్రాంతాన్ని చదును చేసే పని చేపట్టింది. అక్కడ పురావస్తు సంపద ఉన్న విషయాన్ని రెండు శాఖలూ గుర్తించలేదు. ఈ క్రమంలో సమాధులకు గుర్తుగా భారీ రాళ్లతో వృత్తాకారంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించేశారు. కొన్ని వందల నిర్మాణాలు ధ్వంసమయ్యాక గ్రామస్తుల సమాచారంతో మేల్కొన్న పురావస్తు శాఖ అధికారులు... హడావుడిగా వెళ్లి పనులను ఆపివేయించారు. దీంతో 18 ఎకరాల ప్రాంతం మాత్రం మిగిలింది. ఇందులో ఉన్న కొన్ని సమాధులను పరిరక్షించాలని పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
వ్యవసాయానికి మూడు షిప్టుల సరఫరాపై రైతుల నిరసన సూళ్లూరుపేట: వ్యవసాయానికి మూడు షిప్టులుగా విద్యుత్‌ను సరఫరా చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మంగానెల్లూరు సబ్‌స్టేషన్‌ను సోమవారం రాత్రి ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వేకువజామున 3.45 నుంచి ఉదయం 10.45 గంటల వరకు ఒక షిప్టు, ఉదయం 10.45 నుంచి సాయంత్రం 5.45వరకు మరో షిప్టు కింద ఏడు గంటల కరెంట్ ఇస్తూ వస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడో షిప్టు కింద రాత్రి 8.45 గంటల నుంచి వేకువజామున 3.45 గంటల వరకు ఇస్తున్నారని వివరించారు. దీంతో రాత్రి వేళల్లో ´పొలాÌల్లో జాగారం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు షిప్టుల కరెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడో షిఫ్టును రద్దు చేయకపోతే ఏడీఈ, ఏఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామానెల్లూరు, మంగానెల్లూరు, సుగ్గుపల్లి, ఉగ్గుమూడి, మతకామూడి, వెలగలపొన్నూరు, తుంగమడగు రైతులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్‌స్టేష్ ముట్టడి
అప్రకటిత కోతలపై రైతుల ఆగ్రహం అంబారిపేటలో అన్నదాతల నిరసన కథలాపూర్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితిలో ఉన్నామని ఆగ్రహించిన గంభీర్పూర్ గ్రామ రైతులు మంగళవారం అంబారిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. రాత్రివేళల్లో ఇళ్లకు కరెంట్ కోతలు విధించడంతో అంధకారంలో గడుపుతున్నామని ఆవేదన చెందారు. త్రీఫేజ్ సమయంలోనూ కరెంట్ సరిగా సరఫరా చేయడంలేదని గ్రామస్తులు మండిపడ్డారు. సుమారు నెలరోజులుగా విద్యుత్ సమస్యలతో ఇక్కట్లపాలవుతున్నామని పేర్కొన్నారు. అప్రకటిత కోతలతో అవస్థలు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో అధికారులను సంప్రదిస్తే స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు కరెంట్ కోతలు విధిస్తే పంటలకు నీళ్లు అందక ఎండిపోతాయని రైతులు వాపోయారు. కరెంట్ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. అక్కడకు వచ్చిన ట్రాన్స్‌కో ఏఈ రవితో ఇదే విషయంపై వాదనకు దిగారు. సమస్యను పరిష్కరిస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
విద్యుత్ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని రాస్తారోకో
బక్కమంతులగూడెం (మఠంపల్లి): మండలంలోని బక్కమంతులగూడెంకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయించాలని కోరుతూ సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు శనివారం మట్టపల్లి–హుజూర్నగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంభం బొర్రయ్య, ఎంపీటీసీ మామిడి సోవమ్మ శ్రీనివాసులు మాట్లాడుతూ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఆరు మాసాల క్రితమే విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేసిందని, ఇందుకుగాను తమ గ్రామ సమీపంలోని డొంక వద్ద సర్వేనం. 489లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామన్నారు. ఆ స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతి ఇప్పించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆకుల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తహసీల్దార్ యాదగిరికి ఫోన్ చేసి సమస్య వివరించారు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బేత ప్రతాప్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ గంగసాని వెంకటరెడ్డి, బలుపునూరి వెంకటరెడ్డి, వల్లపుదాసు వెంకన్న గౌడ్, పుల్లారెడ్డి, వెంకన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి బలి
► మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ► జిన్‌కుంట సబ్‌స్టేషన్‌లో ఘటన బల్మూర్ : సబ్‌స్టేషన్‌లో పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గంటపాటు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. బల్మూర్ మండలంలోని జిన్‌కుంటకు చెందిన నెల్లి సలేశ్వరం (40), లక్ష్మయ్య, యాదయ్య సుమారు పదేళ్లుగా విద్యుత్ కాంట్రాక్టర్ చుక్కారెడ్డి వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం స్థానిక సబ్‌స్టేషన్‌లో ఈ ముగ్గురూ తొమ్మిది గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కోసం 33/11 పవర్ ట్రాన్స్ఫార్మర్ లైన్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం స్తంభాలపై ఉన్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సలేశ్వ రం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారిం చారు. అనంతరం మిగతా ఇద్దరినీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, సలేశ్వరానికి భార్య భీమమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల నిర్లక్ష్యమేనని రాస్తారోకో సబ్‌స్టేషన్‌లో పనులు చేస్తున్నపుడు ఏబీ స్విచ్‌ను బంద్ చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని మృతుడి కుటుంబ స భ్యులు, బంధువులు, జిన్‌కుంట గ్రామస్తులు ఆరోపించారు. ఈ పని ఏడీ, ఏఈ పర్యవేక్షణలో ఎల్సీ (లైన్ కట్) తీసుకు ని చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహించారన్నారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిం చే ఆపరేటర్లు నిత్యం మద్యం మత్తులో జోగుతుంటారన్నారు. ఈ మేరకు వారు అచ్చంపేట-నాగర్‌కర్నూల్ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఈ రూట్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్ అక్కడికి చేరుకుని బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై మృతుడి భార్య భీమమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అంతిరెడ్డిపల్లిలో రైతు.. వెల్దండ : మరో సంఘటనలో వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంతిరెడ్డిపల్లికి చెందిన కొండల్‌రెడ్డి (42) వృత్తిరీత్యా రైతు. ఈయనకు భార్య సుగుణమ్మతోపాటు ఇద్దరుకు మార్తెలు ఉన్నారు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సమీపంలోని తమ పొలం వద్ద అతను బోరుమోటార్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జానకిరాంరెడ్డి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సంఘటనతో బాధిత కుటుంబ సభ్యులు బోరుమన్నారు. -
ప్రాణం పోయినా.. భూములివ్వం
ఆర్డీవోకి తేల్చిచెిప్పిన తొండపి గ్రామస్తులు తొండపి(ముప్పాళ్ళ): ప్రాణం పోయినా.. భూములు ఇచ్చేది లేదని తొండపి గ్రామస్తులు ఆర్డీవో భాస్కరనాయుడుకు తెగేసి చె ప్పారు. మండలంలోని తొండపిలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 400 కె.వి. సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణలో భాగంగా ఆర్డీవోతో పాటు తహసీల్దారు సోమవారం గ్రామంలో పర్యటించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు భూములు ఇవ్వమని చెప్పారు. పంట పండే భూములను స్వాధీనం చేసుకుంటే తమ జీవనం సాగదన్నారు. దీంతో చేసేదేంలేక అధికారులు వెనుదిరిగారు. వారి వెంట ఆర్.ఐ సత్యం, సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వో రత్నకుమారి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. గ్రామంలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మించనున్న సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణపై రైతులతో మాట్లాడేందుకు మంగళవారం కలెక్టర్ కాంతిలాల్ దండే రానున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. -
ఇక నో టెన్షన్!
నగరంలో మరింత మెరుగైన విద్యుత్ సరఫరా..! వచ్చే రెండేళ్లలో మరో 80 సబ్స్టేషన్లు స్థలాల కోసం డిస్కం అన్వేషణ కలెక్టర్లకు బాధ్యతలు సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచి, సబ్స్టేషన్లపై ఉన్న భారాన్ని మరింత తగ్గించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే రెండేళ్లలో మరో 80 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరంలో భూమి చాలా ఖరీదై పోవడం, ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ భూమి కూడా ఇప్పటికే కబ్జా దారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, కోర్టు కేసుల్లో ఉండటం, నివాసాల మధ్యలో సబ్స్టేషన్ల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో వీటి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. శివారు ప్రాంతాలతో పోలిస్తే కోర్‌సిటీలో ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇదే అంశాన్ని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ బాధ్యతను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్‌ఏపీడీఆర్‌పీ పథకం కింద చేపట్టిన 64 సబ్స్టేషన్లలో ఇప్పటికీ చాలా వరకు ఇదే సమస్యతో నిలిచిపోవడం కొసమెరుపు. రూ.240 కోట్లతో లైన్ల తొలగింపు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అనేక విజ్ఞప్తులు అందాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రధానంగా గృహాలపై వేలాడుతూ ప్రమాదభరితంగా మారిన హైటెన్షన్ వైర్లను తొలగించాల్సిందిగా కోరుతూ వినతులు అందాయి. దీంతో వాటిని తొలగించి అండర్‌గ్రౌండ్ కేబుళ్లను అమర్చాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజనీర్లు గ్రేటర్ అంతా సర్వే చేసి రూ.240 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. పునఃసమీక్షించి తుది నివేదిక అందజేయాల్సిందిగా సీఎం ఆదేశించడంతో అధికారులు రెండు రోజుల నుంచి అదే పనిలో నిమగ్నమయ్యారు. శాఖల మధ్య సమన్వయలోపం: విద్యుత్ సరఫరా, నిర్వహణపై ట్రాన్స్‌కో, డిస్కంల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఒకరు తవ్వి లైన్ వేసిన మరో ఆరు మాసాల వ్యవధిలోనే అదే చోట మరొకరు తవ్వి కేబుళ్లు అమర్చుతూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. మింట్ కంపౌండ్‌లోని హుస్సేన్‌సాగర్ సబ్‌స్టేషన్ నుంచి ఐమాక్స్ వెళ్లే దారిలో 220 కేవీ, 33 కేవీ, 11 కేవీ కేబుళ్ల కోసం ఏడాది వ్యవధి లోనే మూడు సార్లు తవ్వడం చూస్తే ఆయా శాఖల మధ్య సమన్వయం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా శివం, మన్సూరాబాద్, మలక్‌పేట్, తదితర ప్రాంతాల్లో లైన్ల కోసం తవ్విన గుంతలను పూడ్చక పోవడంతో అటుగా వెళ్లిన వారు ప్రమాదానికి గురవుతున్నారు. -
తండాకు కరెంట్ షాక్
ఒకరు మృతి... వరంగల్ జిల్లాలో ఘటన పాలకుర్తి: తండా మొత్తానికి విద్యుత్ షాక్ రావడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు గ్రామపంచాయతీ శివారు చీమలభాయి తండాలో లకావత్ నాను నాయక్(60) స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదా ఘాతానికి గురై ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకు ముందే ఒక మహిళ విద్యుదాఘాతానికి గురైంది. తండాకు చుట్టపుచూపుగా వచ్చిన జనగామ మండలం పెద్దపహాడ్వాసి బానోతు బాలు కరెంట్ షాక్‌కు గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమారు 120 గృహా లున్న చీమలభాయి తండాలో ఒకే ట్రాన్స్ఫారం ఉందని, దానికి విద్యుత్ ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో నేరుగా కరెంట్ సరఫరా అయి ప్రాణాలు పోతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. -
రాత్రి కరెంటుకు రైతు బలి
కురవి/మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం మాధవపురం శివారు చీకటిచింతల తం డాకు చెందిన రైతు బానోత్ వెంకన్న(38) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకన్న తన మూడు ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి సాగు చేస్తున్నాడు. ఇతని పొల మున్న ప్రాంతానికి కురవి మండలం అయ్యగారిపల్లి సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. గత ఆదివారం వేకువ జామున రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గురువారం వేకువ జామున పొలానికి నీరు పెట్టేందుకు వెంకన్న వెళ్లాడు. మోటార్ ఆన్ చేసేందుకు ఫీజులు పెడుతుండగా, షాక్ కొట్టడంతో అరచి కుప్పకూలాడు. -
రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్..
పొలమే ఇల్లయితంది.. నా పేరు రాయిడి చిన్నయ్య. మాది సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం. నాకు మూడెకరాల వ్యవసాయం ఉంది. ఇందులో ఒక బోరుబావి ఉంది. ఈ ఏడాది పత్తి, మిర్చి పంటలు సాగుచేశాను. పొద్దున పంటపొలానికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికి వస్తున్నం. భోజనం చేసిన వెంటనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాత్రి కరెంటు ఇవ్వడంతో పొలానికి వెళ్లిపోతున్నం. రాత్రింబవళ్లు పంటపొలంలోనే గడపాల్సి వస్తంది. రాత్రిపూట పొలంగట్ల వెంబడి నడుస్తుంటే పాములు, తేళ్లు సంచరిస్తున్నాయి. అయినా ప్రాణాలు లెక్కచేయకుండా పంటలకు నీరందిద్దామంటే ఇచ్చే కరెంటులో తరచూ కోతలు విధిస్తున్నరు. సాగుకు దిగింది మొదలు.. దిగుబడి వచ్చి.. పంట అమ్ముకునే వరకూ రైతన్న పరిస్థితి దయనీయం. ఆరు గాలం.. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టించాల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కరెంటు కోతలు విధి స్తుండడం.. రాత్రిల్లో సరఫరా చేస్తుం డడంతో రైతుల పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. సాగు సమరంలో రైతుల కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.. బోర్ల వద్దే జాగారం కుంటాల : వరుస కష్టాలతో అన్నదాత ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలకు తోడు కరెంట్ కష్టాలు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం సాగవుతున్న పంటలకు తగినంత వర్షం లేక.. విద్యుత్ మోటార్ల ద్వారా పంటలను కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు కారు చీకట్లో నిద్రాహారాలు మాని చేళల్లోనే జగారాం చేస్తున్నారు. కాలం కలిసిరాక కరెంట్ కష్టాలు తోడై ప్రభుత్వ సహాయం అందక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ఎక్కడ అమలు కావడంలేదు. సోమవారం కుంటాల సబ్స్టేషన్నుంచి అధికారికంగా మూడు గంటలు కరెంట్ సరఫరా చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాగా వెంకూర్ ఫీడర్‌కు గంట, ఓలా ఫీడర్‌కు రెండు గంటలు, అంబకంటి ఫీడర్‌కు రెండున్నర గంటలు, దౌనెల్లి ఫీడర్‌కు రెండు గంటల పది నిమిషాలు మాత్రమే సరఫరా చేశారు. కరెంట్ వస్తుందనుకున్న వెంకూర్, ఓలా, విఠాపూర్, కుంటాల, అంబకంటి, దౌనెల్లి గ్రామాల రైతులు సోమవారం రాత్రి సెల్ఫోన్లు, టార్చి లైట్లు పట్టుకుని పంట పొలాల వద్దకు వెళ్లి నిద్రించారు. అయినా గంట కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో బోరు బావుల వద్దే నిద్రించారు. వెంకూర్ గ్రామానికి చెందిన రైతులు అదే రాత్రి కోతలపై కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్ సరఫరా చేయకపోవడంతో చేతికొచ్చిన పత్తి, సోయా, వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో కరెంటు తిప్పలు చెన్నూర్ : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కరెంటు కోసం రాత్రి అనక పగలనక కంటి మీద కునుకు లేకుండా రైతులు పొలాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు నానాకష్టాలు పడుతున్నారు. జైపూర్ మండలంలోని దుబ్బపల్లికి చెందిన కామెర లింగయ్య అనే రైతు రూ.60 వేలు ఖర్చు చేసి రెండు ఎకరాల వరి పొలాన్ని సాగు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. పగలంతా కరెంటు సరఫరా లేకపోవడంతో రాత్రి ఏ సమయానికైన కరెంటు వస్తే పొలానికి నీరు పెట్టుకునేందుకు టార్చిలెట్ పట్టుకొని పొలం కూర్చున్నారు. కరెంటు కోసం కంటి మీద కునుకు లేకుండా నెల రోజులుగా రాత్రిళ్లు పొల ం వద్దే ఉంటున్నానని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది లింగయ్య ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. నియోజకవర్గంలోని రైతులందరిది. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రతి రోజు కనీసం సక్రమంగా 5 గంటలైనా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. భయపడుతూనే పొలాలకు... సారంగాపూర్ : నాపేరు లక్ష్మారెడ్డి నాకు సారంగాపూర్ గ్రామ సమీపంలో నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు వేయించాను. ఈసారి పత్తి, సోయా పంటలు పండిస్తున్నాను. అయితే వ్యవసాయానికి రెండు వారాలకోసారి రాత్రిపూట కరెంటు ఇస్తున్నరు. రాత్రి రెండు గంటలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వస్తుందని తెలిస్తే దానికి గంట ముందే పంట పొలాలకు వెళ్తున్నం. తెల్లవార్లు పంటలకు నీరందిస్తుండగా దాదాపు రెండుమూడు సార్లు కరెంటు సరఫరాలో కోతలు విధిస్తున్నరు. దీంతో అటు నీరందక, ఇటు నిద్ర పాడుచేసుకుంటున్నం. దీంతో పాటు రాత్రి పంటలకు నీళ్లందించడానికి పొలం గట్ల వెంబడి నడుస్తున్నపుడు పురుగు పుట్ర చూసి భయపడుతున్నం. వ్యవసాయానికి రాత్రిపూట కరెంటుకు బదులు పగటిపూట ఇస్తే బావుంటది. - లక్ష్మారెడ్డి, రైతు, సారంగాపూర్ అడవిపందుల బెడద ఉంది సారంగాపూర్ : మాది సారంగాపూర్ మండలం జామ్ గ్రామం. నాకు గారమ శివారంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఈ ఏడాది కూరగాయలు, పత్తి పంటలు పండిస్తున్నాను. అయితే ప్రతి రెండు వారాలకోసారి వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చే స్తున్నరు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 7 వ రకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తుండటంతో భ యంతో వణికిపోతున్నం. రాత్రివేళ కరెంటు ఇవ్వడంతో అర్ధరాత్రి లేచి పొలాలకు వెళ్తుండగా దారిపొడవునా అడవిపందులు సంచరిస్తున్నా యి. దీంతో రాత్రివేళ పంటలకు నీరందించడానికి వెళ్లాలంటేనే భయం గా ఉంటుంది. ఒకసారి నాద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడవిపందు లు రోడ్డుకు అడ్డుగా రావడంతో కింద పడ్డాం. మోటారు వద్ద ఏదైనా సమస్య వస్తే కరెంటు తీగలు సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురవాల్సి వస్తోంది. - కరిపె ప్రభాకర్, రైతు, జామ్, సారంగాపూర్ -
విద్యుత్ కోసం రైతుల కన్నెర్ర
కొత్తలింగాల(కామేపల్లి) : విద్యుత్ సరఫరాపై రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొత్తలింగాల సబ్‌స్టేషన్ ఫర్నిచర్‌ను జాస్తిపల్లికి చెందిన రైతులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అనంతరం రాస్తారోకో చేశారు. తమ పంటలకు రాత్రి 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉండగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు ఆందోళకు దిగినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడిక చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. -
మాకు చావే శరణ్యం
దోమకొండ : ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించాలని, లేకుంటే పంటలు ఎండితే తమకు చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూములకు నిరంతరంగా ఏడు గంటలపాటు విద్యుత్ అందించాలని కోరుతూ మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన రైతులు సోమవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. వర్షాలు లేక పంటలు వేయలేదని బోర్ల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిరంతరంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ను అందించాలని కోరారు. అనంతరం రైతులు లైన్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య, లైన్మెన్లు సుధాకర్, దేవరాజ్, ఆపరేటర్ సురేష్లను గదిలో నిర్బంధించారు. ఏఈ రావాలని నినాదాలు చేశారు. సబ్‌స్టేషన్ ఎదుట గంటపాటు ధ ర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు గంగరాములు,రాజిరెడ్డి, నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, దేవేందర్, నాగరాజ్‌గౌడ్, ఉపసర్పంచ్ బాగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు యాచం నరేందర్, కాంగ్రెస్ నాయకులు నాగరాజ్‌గౌడ్, రాజనర్సు తదితరులు ఉన్నారు. విద్యుత్ సక్రమంగా సరాఫరా చేయండి వర్ని : మండలంలోని రుద్రూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని లింగంపల్లి శివారుకు సక్రమంగా విద్యుత్‌ను సరఫరా చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు సోమవారం ఆందోళన చేశారు. సబ్‌స్టేషన్‌ను ముట్టడించి సిబ్బందిని నిలదీశారు. విద్యుత్‌ను నమ్ముకుని బోర్ల ద్వారా నాట్లు వేశామని విద్యుత్ కోతల వల్ల పంట ఎండి పోయే దశకు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఐదు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. దీనిపై సిబ్బంది చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని రైతులు వారిని గదిలో నిర్బం ధించారు. ఏఈ వచ్చేవరకు ఆందోళన విరమించబోమని మొండికేశారు. సమాచారం తెలుసుకున్న ఏఈ నర్సింలు, అసిస్టెంట్ ఏఈ గోపికృష్ణ సబ్‌స్టేషన్‌కు రాగానే వారిని రైతులు నిలదీశారు. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు కేవలం మూడు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారని మండి పడ్డారు. రోజుకు ఏడు గంటలు ఇస్తామని ప్రక టించి మూడు గంటలు సరఫరా చేయడమేంటని ప్రశ్నిం చారు. రాత్రి వేళ విద్యుత్ రావడం లేదని ఆరోపిం చారు. ఫీడర్లను మార్పు చేయడం వల్ల కొంతమేర సరఫరాలో అంతరాయం జరిగిందని, సక్రమంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చూస్తానని ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఆందోళనలో రైతులు పోశెట్టి, బాగయ్య, గంగాధర్, బాలు, పర్వయ్య, వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ కోతలు షురూ..
- వానాకాలం మొదట్లోనే మొదలు.. - మండల కేంద్రాల్లో 2 గంటలు.. - సబ్‌స్టేషన్ పరిధిలోనూ 2గంటలు - అధికారికంగా మరింత కోత సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. విభజన తర్వాత వానాకాలం మొదట్లోనే కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్పత్తి తగ్గిందంటూ ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించేందుకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్ సర్కిల్లో శుక్రవారం నుంచి కోతలను అమలులో పెట్టింది. ప్రస్తుతం వ్యవసాయానికి విద్యుత్తు అవసరం కొంత మేరకే ఉంది. అయినప్పటికీ ఉత్పత్తి తగ్గడంతో సరఫరా మెగావాట్లు తగ్గాయని, ట్రాన్స్‌కో నుంచి కోతలకు ఆదేశాలిచ్చారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామాలు, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లోని అన్ని వర్గాల కనెక్షన్లపై విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో అధికారికంగా ఆరు గంటలు కోత విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా... అది ఏడు నుంచి 8 గంటలకు పైగా ఉంటుంది. గ్రామాల్లో ఆరు గంటలు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఆరు గంటల విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. పలు సందర్భాల్లో రాత్రి కూడా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యుత్ కోతను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పలు కారణాలు, సరఫరాలో సాంకేతిక కారణాలు అంటూ రోజూ రాత్రిపూట గంటపాటు కోత విధిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ఎల్ఆర్ తీసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అధికారిక కోత 6గంటలే అయినా... తీసేస్తుంది మాత్రం 8గంటల వరకు ఉంటుంది. ప్రతీసారీ విద్యుత్ కోతలకు గ్రామాలనే టార్గెట్ చేస్తున్న అధికారులు... ఈసారి కూడా పల్లెలపైనే పడ్డారు. ముందుగా పల్లెలకు విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారు. పునఃప్రారంభం వేసవి నుంచి విద్యుత్ సరఫరా కొంత మెరుగ్గానే ఉంది. రబీ తర్వాత వ్యవసాయ మోటర్లు నడవడం లేదని, జిల్లాకు కావాల్సిన విద్యుత్తు సరఫరా అవుతుందంటూ నిరంతర విద్యుత్ ఇచ్చారు. అయితే గ్రామాల్లో మాత్రం అనధికారికంగా గంటో, రెండు గంటలో కోత పెట్టినా... కొద్ది రోజులకే పరిమితం చేశారు. తాజాగా శుక్రవారం మళ్లీ కరెంట్ కోతలు మొదలుపెట్టారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఎమర్జెన్నీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) తీసుకుంటున్నారు. మండలాల్లో 2గంటలు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 2 గంటల కోత విధిస్తున్నారు. రెండు రోజుల నుంచే కోతలు అమలు చేస్తున్నా... శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అన్ని మండలాలు, డివిజన్లకు ఫోన్ సమాచారమిచ్చారు. మండల కేంద్రాల్లో అధికారికంగా 2గంటలు కోత పెడుతున్నా మరో గంటపాటు అడపాదడపా తీసేస్తున్నారు. సబ్‌స్టేషన్ పరిధిలో 2 గంటలు జిల్లాలోని 226 సబ్‌స్టేషన్ కేంద్రాల్లో అధికారిక కోత 2 గంటలు పెడుతున్నారు. ఇక్కడ కూడా అధికారిక కోతకు అదనంగా 30నుంచి 50 నిమిషాలపాటు అనధికారికంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
లక్షలు కొట్టి.. ఉద్యోగం పట్టి
సాక్షి, ఏలూరు : వెలుగుల శాఖను అవినీతి చీకట్లు వెంటాడుతున్నాయి. అక్రమాల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆయిల్ కుంభకోణం, ట్రాన్స్ఫార్మర్లలో కాపర్వైర్ల చోరీ, వ్యవసాయ సర్వీసులకు లంచాల డిమాండ్ వంటి అక్రమాలతో విద్యుత్ శాఖ అప్రతిష్ట పాలైంది. తాజాగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాలలో అవకతవకలు బయటపడ్డాయి. ఇటీవల విద్యుత్ శాఖలో అవినీతిపై ‘సాక్షి’ వరుస కథనాలతో సామాన్యుల్లో కదలిక వచ్చింది. ఆ శాఖ అధికారుల అవినీతిచిట్టాలను ఒక్కొక్కటిగా విప్పుతున్నారు. దీంతో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంలో ఉన్నతాధికారుల అవినీతి వెలుగుచూసింది. నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొలువులను అమ్ముకుంటున్న వైనం బయటపడింది. 8 నుంచి 10 మంది నియామకం జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 195 ఉన్నాయి. వీటిలో 152 సబ్స్టేషన్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలోనూ, 43 సబ్స్టేషన్లు ఈపీడీసీఎల్ నిర్వహణలోనూ ఉన్నాయి. జిల్లాలో కొత్త సబ్స్టేషన్లను ప్రతిఏటా నిర్మిస్తున్నారు. గతేడాది 13 సబ్స్టేషన్లను రూ.14 కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది 22 సబ్స్టేషన్లను రూ.26.06 కోట్లతో నిర్మించడానికి అనుమతిపొందగా 20 పూర్తయ్యాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌కు నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు అమ్మేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో నిరుద్యోగులు పోటీపడ్డారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు క్యూకట్టారు. వారితో సిఫార్సు చేయించారు. ఎవరినీ నొప్పించడం ఇష్టంలేని ఈపీడీసీఎల్ అధికారులు కాంట్రాక్టర్‌తో సయోధ్య కుదుర్చుకుని సబ్‌స్టేషన్‌లో 8 నుంచి 10 మంది చొప్పున ఆపరేటర్లను అనధికారికంగా నియమించేశారు. ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు వినవస్తున్నాయి. 6నెలలుగా జీతాల్లేవ్ సిబ్బంది ఎక్కువ కావడంతో ఎవరికి నియామక పత్రాలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆరు నెలలుగా ఎవరికీ జీతాలు లేవు. ఇటీవల ప్రారంభమైన ఉండ్రాజవరం మండలం పాలంగి సబ్‌స్టేషన్‌లో ఓ షిఫ్ట్ ఆపరేటర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను గత జూన్ 1 నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటికీ ఒక్కరూపాయి కూడా జీతం ఇవ్వలేదని తెలిపారు. శిక్షణలో ఉన్నానని చెబుతూ తనపేరు బయటపెడితే ఉద్యోగం పోతుందనే భయం వ్యక్తం చేశారు. ఔను నిజమే: ఎస్ఈ నిడదవోలు డివిజన్లోని పలు సబ్స్టేషన్లలో అక్రమ నియామకాలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, సబ్‌స్టేషన్‌లో నలుగురు చొప్పున మాత్రమే షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నారని డివిజనల్ ఇంజినీర్ సీహెచ్ నాగేశ్వరావు చెప్పారు. దీనిపై ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా షిఫ్ట్ ఆపరేటర్లను ఉండాల్సిన దా నికంటే అధికంగా నియమించిన మాట వాస్తవమని, నిడదవోలుతో సహా కొన్ని మండలాల్లో ఇలా జరిగిందని చెప్పారు. ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. -
కోతలు మళ్లీ షురూ..
మంథని, న్యూస్‌లైన్ : కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యా యి. నిరంతర సరఫరాతో కొంతకాలంగా ఊపిరి పీల్చుకున్న పల్లెవాసులను విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. గురువారం నుంచి జిల్లాలో అధికారికంగా విద్యు త్ కోత అమలుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి మండలస్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. పెరిగిన విద్యుత్ వాడకానికి సరిపడా ఉత్పత్తి జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తుందని, ప్రజలకు నచ్చజెప్పాలని మౌఖి కంగా సూచించారు. గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, 11 నుంచి 1 గంట వరకు కోత విధించనున్నారు. మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు కరెంట్ కట్ చేయనున్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణాలకు కోతల నుంచి మినహాయింపు ఇచ్చారు. సీమాంధ్ర ఉద్యమం దృష్ట్యా అనధికారికంగా కొద్ది రోజులుగా సరఫరాలో అంతరాయం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ఆ శాఖ కోతల అమలుకు చర్యలు చేపట్టింది. ఎండకాలం మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కరెంటు కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయనున్నాయి. -
విద్యుత్ కోతకు నిరసనగా రాస్తారోకో
గాండ్లపెంట, న్యూస్‌లైన్: రోజుల కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారంటూ గాండ్లపెంటకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో ఉన్న సబ్‌స్టేషన్ వద్ద బుధవారం రాత్రి రాస్తారోకో నిర్వహించారు. ఉదయం నుంచి 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేసిన అధికారులు రాత్రి 8.30 సమయం వరకూ కోత విధించడంతో గ్రామ సర్పంచ్ కాకర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి , విధుల్లో ఉన్న సిబ్బందిని ఈ విషయమై ప్రశ్నించారు. వారు ఎల్ఆర్ ఉందని సమాధానం చెప్పడంతో, ఫోన్లో లైన్‌మెన్‌తో మాట్లాడేందుకు సర్పంచ్ ప్రయత్నించారు. కాగా, అతను ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో, ఏఈకి కూడా ఫోన్ చేశారు. అది కూడా స్విచాఫ్‌లోనే ఉన్నట్లు సమాధానం రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులు వచ్చేవరకు అక్కడి నుంచి కదలమని రోడ్డుపై బైఠాయించారు. బిల్లుల వసూలుపై చూపే శ్రద్ధ సరఫరాలో ఎందుకు చూపరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బక్రీద్ పండుగకు మాత్రమే కరెంటు పోతుందా అంటూ ఆగ్రహించారు. ఒక దశలో సబ్‌స్టేష న్లో పనిచేసే సిబ్బందిని బయటకు పంపి వేశారు. వందల సంఖ్యలో గ్రామస్తులు సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చ చెప్పి రాస్తారోకో విరమింపజేశారు.