Sunlight
-
ఈకార్లతో.. ఫ్రీగా తిరిగేయొచ్చు
శిలాజ ఇంధనాల వాడకాన్ని నియంత్రించి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా వాటివినియోగం ఆశించినంతగా పెరగడం లేదు. అసలే వాటి ధరలు అధికం, అయినా కొనేద్దామనుకున్నా.. ఒకేసారి ఎక్కువ దూరం వెళ్లలేం, పైగాగంటలకు గంటలు చార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ త్వరలోనే పరిస్థితి మారిపోతుందని.. అసలు చార్జింగ్ అవసరం లేకుండానే వేల కిలోమీటర్లు తిరగొచ్చని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రకటించింది. ఇందుకోసంవినూత్నమైన ‘సోలార్ పెయింట్’ను అభివృద్ధి చేసినట్టు తెలిపింది.దానంతట అదేచార్జింగ్ అవుతూ...సోలార్ ప్యానల్స్ తరహాలో సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మార్చే ఈ ‘ఫొటో వోల్టాయిక్ పెయింట్’ను నానో పార్టికల్స్‌తో రూపొందించినట్టు మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. వాహనంపై వెలుగు పడినంత సేపూ చార్జింగ్ అవుతూనే ఉంటుందని... ఇలా ఏడాదిలో సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా చార్జింగ్ లభిస్తుందని తెలిపారు. వాహనంపై మొదట సోలార్ కోటింగ్ వేసి, దానిపైన ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని... దీనివల్ల ఇప్పుడున్న వాహనాల్లానే కనిపిస్తాయని వివరించారు.మన దేశంలో అయితే మరింత లాభంఎక్కువగా ఎండ పడే ప్రాంతాల్లోఈ సోలార్ పెయింట్‌తో రూపొందించిన కార్లు వేగంగా, ఎక్కువగాచార్జింగ్ అవుతాయని కంపెనీప్రతినిధులు తెలిపారు. అంటే భారత్ సహా దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, అరేబియన్ దేశాల్లో ఈ ‘సోలార్ పెయింట్’కార్లతో మరింత ప్రయోజనంఉండనుంది. ఈటెక్నాలజీని కార్లు మాత్రమేకాదు బస్సుల వంటి ఇతర వాహనాల్లోనూ వాడవచ్చు. అయితే ఈ టెక్నాలజీకి అయ్యే ఖర్చుతక్కువేనని మెర్సిడెస్–బెంజ్ ప్రతినిధులు పేర్కొన్నా... అది ఎంతనేదిగానీ, దీనిని ఎప్పటికి మార్కెట్లోకి తీసుకువస్తారన్నదీ వెల్లడించలేదు.పెయింట్‌తో ఎలా చార్జింగ్ అవుతుంది? వాహనాల బాడీపై ఈ సోలార్ పెయింట్ కోటింగ్ వేస్తారు. అందులోనే అతి సన్నని ఎలక్ట్రోడ్లు కూడా ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి కలసి కారులోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం అవుతాయి. సోలార్ పెయింట్ సూర్యరశి్మని గ్రహించి ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్‌గా మార్చి బ్యాటరీకి పంపుతుంది. దీనితో కారుపై వెలుతురు పడినంత సేపూ (అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు) బ్యాటరీ చార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ దూరం ప్రయాణించి, బ్యాటరీ ఖాళీ అయిపోయి, వెంటనే మళ్లీ ప్రయాణం చేయాల్సి వస్తేనే చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నిత్యం తక్కువ దూరాలకు వెళ్లేవారు అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదని మెర్సిడెస్–బెంజ్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సాక్షి సెంట్రల్‌డెస్క్ -
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్‌ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్‌లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్‌లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్‌లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్‌పై హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!) -
రాత్రిని పగలుగా మార్చేయండిలా..
అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మనిషి పని. ఇప్పటికే అనేక అద్భుతాలను సృష్టించిన మానవుడు.. రాత్రి పూట కూడా వెలుతురును అందించడానికి కొత్త ప్రయోగాలను చేస్తున్నాడు. ఇదే జరిగితే.. రాత్రి పూట ఎక్కడ వెలుతురు కావాలన్నా ఇట్టే ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకోవానికి అదేమైనా ఫుడ్ అనుకున్నావా? అనే అనుమానం మీకు రావొచ్చు.. వినడానికి కొంత వింతగా కూడా అనిపించవచ్చు. కానీ వివరాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యాపోవడం తప్పకుండా మీ వంతు అవుతుంది. ఇక ఆలస్యమెందుకు ఈ కథనంలో చదివేయండి..కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటాల్' (Reflect Orbital) అనే కంపెనీ సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యరశ్మిని (కాంతిని) అందించడానికి ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కంపెనీ సీఈఓ 'బెన్ నోవాక్' కొన్ని వివరాలను కూడా షేర్ చేసుకున్నారు.బెన్ నోవాక్ ప్రకారం.. భూమి ఉపరితలం మీద భారీ సౌరఫలకాలను ఏర్పాటు చేసి కాంతి ఎక్కడ కావాలనుకుంటారో అక్కడకు మళ్లించడానికి కొత్త టెక్నాలజీలను తీసుకువస్తున్నారు. సమయంలో సంబంధం లేకుండా.. సూర్యరశ్మిని అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ప్లాన్‌ను కూడా బెన్ నోవాక్.. లండన్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్'లో వివరించారు.ప్రస్తుతం ఎక్కువమంది సోలార్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆనందించాల్సిన విషయమే. అయితే ఇక్కడ వచ్చిన ఓ సమస్య ఏమిటంటే కోరుకున్నప్పుడు సౌరశక్తి అందుబాటులో ఉండదు. సోలార్ ఫామ్‌లు రాత్రిపూట శక్తిని ఉత్పత్తి చేయలేక పోతున్నాయని వెల్లడించారు. కాబట్టి తమ ప్రాజెక్ట్ ద్వారా రాత్రి సమయంలో కూడా వెలుగును అందిస్తామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం నోవాక్ బృందం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులోని ప్రతి ఒక్కటీ 33 చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్తో అమర్చబడి ఉన్నాయి. ఇవన్నీ భూమి ఉపరితం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయి. అత్యవసర సమయంలో.. భూమి ఉపరితలం మీద నిర్మించిన పవర్ ప్లాంట్లకు అదనంగా 30 నిమిషాల కాంతిని అందించగలవని పేర్కొన్నారు.మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే.. కక్ష్యలోని ఉపగ్రహాలు సూర్యుని నుంచి కాంతిని గ్రహించి, భూమిపై అమర్చిన సోలార్ ఫలకాల మీద పడేలా చేస్తాయి. ఆ తరువాత కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డైరెక్షన్ ఆధారంగా ఆపరేటర్లు ఎక్కడ లైటింగ్ కావాలో అక్కడ ప్రసరించేలా చేస్తారన్నమాట.ఏడుగురు సభ్యులతో కూడిన నోవాన్ బృందం దీనిని అర్థం అయ్యేలా చెప్పడానికి ఒక ప్రయోగం చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌కు సుమారు ఎనిమిది అడుగుల మైలార్ మిర్రర్ జోడించారు. సౌర ఫలకాలపై సూర్యరశ్మిని పరావర్తనం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఉపయోగించిన మైలార్ మిర్రర్స్ గాజుతో కాకుండా.. అల్యూమినియం ఫ్రేమ్‌పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్‌ను కలిగి ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: జాబిల్లిపై రోబో గోడలు!ఈ వీడియోలో ఒక కంట్రోలర్ సాయంతో అక్కడే ఉన్న ట్రక్కు మీదికి కాంతిని ప్రసరింపజేయడం చూడవచ్చు. ప్రయోగంలో 800 అడుగులు దూరంలో హాట్ ఎయిర్ బెలూన్‌పై ఉన్న మైలార్ మిర్రర్.. కింద ఉన్న సోలార్ ప్యానెల్స్‌పై కాంతిని ప్రసరించేలా చేసింది. అన్నీ అనుకున్న విధంగా పూర్తయితే.. ఇది 2025 నాటికి అమలులోకి వస్తుంది. ఇప్పటికే దీనికోసం 30000 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇదెలా పనిచేస్తుందంటే..ఇప్పటికే అప్లై చేసుకున్నవారు.. రాత్రి పూట కాంతి అవసరమైన ప్రదేశంలో లైటింగ్ కావాలనుకున్నప్పుడు కంపెనీ లోకేషన్ ఆధారంగా కాంతిని ప్రసరింపజేస్తారు. అయితే ఈ కాంతి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 -
సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..
ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..? రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి. సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు. చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్‌కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు. అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్‌వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్‌వెజ్‌కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. -
మేఘాలను మరింత మందంగా మార్చేస్తే.. సూర్యకాంతిని అడ్డుకుంటే
వాషింగ్టన్: ఆధునిక యుగంలో మానవాళిని బెంబేలెత్తిస్తున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. వేడెక్కుతున్న భూగోళం, ఒకవైపు ముంచెత్తుతున్న వరదలు, మరోవైపు తీవ్రమైన కరువులు, పడిపోతున్న పంటల దిగుబడి.. ఇవన్నీ వాతావరణ మార్పుల సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాలే. కాలుష్యానికి తోడు నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న తీవ్రమైన వేడికి భూమి అగ్నిగుండంగా మారిపోతోంది. అలాంటప్పుడు ఈ సమస్య పరిష్కారానికి సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా ప్రభుత్వానికి వచ్చింది. దీనిపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ’ ఓ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవాలన్నదే ఈ పరిశోధన ఉద్దేశం. జియో ఇంజనీరింగ్ విధానంతో సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పరిశోధన చేస్తున్నట్లు తెలియజేసింది. సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఆకాశంలోని మేఘాలను మరింత మందంగా మార్చడం ద్వారా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పద్ధతిని సిరస్ క్లౌడ్ థిన్నింగ్ అంటారు. జియో ఇంజనీరింగ్ అమలు చేయడం సులభమేనని వారి వాదన. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికం. ఆ సమయంలో క్లౌడ్ థిన్నింగ్ చేయాలన్న యోచనలో ఉన్నారు. -
ఇక పైకప్పులన్నీ కూల్కూల్గానే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల ఒకటోతేదీ నుంచి అమలులోకి వ చ్చిన కూల్‌రూఫ్ పాలసీని రాబోయే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్ల మేర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పైకప్పుల కంటే కూల్ రూఫ్ సూర్యుడి నుంచి తక్కువ వేడిని తీసుకుంటుంది. ఇది సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, థర్మల్ రేడియేషన్‌ను విడుదల చేసి, వేడిని తగ్గిస్తుంది. సాధారణ పైకప్పులు 20 శాతం సూర్యరశ్మిని మాత్రమే తిరిగి ప్రతిబింబిస్తే, కూల్ రూఫ్‌లు దాదాపు 80 శాతం సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. తద్వారా కూల్రూఫ్లతో భవనాలు గణనీయంగా చల్లబడతాయి. ఈ కూల్‌రూఫ్ విధానాన్ని 2023–24లో జీహెచ్ఎంసీలో 5 చ.కి.మీ మేర... మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 2.675 చ.కిమీల మేర అమలు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాల్లో ఈ సంవత్సరం కూల్‌రూఫ్ పాలసీ అమలుకు సంబంధించిన విధి విధానాలను, విస్తీర్ణం వివరాలతో సీడీఎంఏ ఎన్. సత్యనారాయణ శనివారం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 3,468 వార్డుల్లో తొలి ఏడాది ఇంటి పైకప్పులను చల్లబరిచే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 287.9 లక్షల చదరపు అడుగుల మేర ఇంటి పైకప్పులను కూల్‌రూఫ్ పాలసీ కిందికి తీసుకురానున్నారు. ఏ ఇళ్లకు కూల్‌రూఫ్ విధానం తప్పనిసరంటే... 600 చదరపు గజాలు, అంతకు పైబడిన స్థలాల్లో నిర్మించే గృహ నిర్మాణాల అనుమతులకు ఇక నుంచి కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో కూల్‌రూఫ్ విధానంలో నిర్మించిన వాటికి మాత్రమే పురపాలక శాఖ ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ ఇవ్వనుంది. ఇక అన్ని ప్రభుత్వ భవనాలు కూల్ రూఫ్ విధానంలోనే నిర్మాణం జరగాలి. సైట్ ఏరియా, బిల్డప్ ఏరియాతో సంబంధం లేకుండా అన్ని రకాల నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ ఇదే విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక 600 చదరపు గజాలకన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస గృహాలకు కూల్‌రూఫ్ పాలసీ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే కూల్ రూఫ్ విధానంలో నిర్మించకపోయినా, అనుమతులకు ఇబ్బందులేం ఉండవు. ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న వారు సైతం శీతలీకరణ కోసం కూల్‌రూఫ్ విధానంలోకి మారే ఆప్షన్ ఉంటుంది. వచ్చే మూడేళ్లలో నివాసేతర గృహాలకు రెట్రా ఫిట్టింగ్ చేసుకోవడం కూడా ఆప్షన్‌గా సీడీఎంఏ పేర్కొంది. పాత ఇళ్లకు కూల్‌రూఫ్ ఎలా..? ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న నివాసాలను కూడా కూల్‌రూఫ్ విధానంలోకి తీసుకువచ్చేలా విధివిధానాలను రూపొందించారు. ఇందుకోసం ఆయా మునిసిపాలిటీల్లోని వార్డుల్లో నిర్దేశించిన విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఇళ్లకు కూల్రూఫ్ను తప్పనిసరి చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయనుంది. ఆయా ఇళ్ల పైకప్పులకు సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ చేస్తారు. తెల్లటి టైల్స్‌తో లేదా తెల్లటి పొరతో పైకప్పులను కప్పి పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించాలనేది నిర్ణయం. -
గ్లోబల్ వార్మింగ్‌కు... చంద్రధూళితో చెక్.. తవ్వి తీసి వెదజల్లడమే!
చంద్రుడంటేనే చల్లదనానికి చక్కని ప్రతీక. అందుకే చల్లని రాజా అంటూ చందమామపై సినీ కవులు ఎన్నో పాటలు కూడా కట్టారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నానాటికీ ప్రమాదకరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేసి భూమిని చల్లబరిచేందుకు కూడా చంద్రుడు ఎంతో సాయపడగలడట. అమెరికా సైంటిస్టుల బృందమొకటి ఈ దిశగా వినూత్నమైన ప్రతిపాదనతో ముందుకొచ్చింది. చంద్రధూళిని అంతరిక్షంలోకి వెదజల్లడం! తద్వారా భూమిపై పడే సూర్యరశ్మిని కొద్దిగా మళ్లించడం!! ఆ మేరకు భూమిని చల్లబరచడం..!!! ఏమిటీ ప్రతిపాదన...? చంద్రునిపై ఉన్న ధూళిని భారీ పరిమాణంలో తవ్వి తీయాలి. దాన్ని సూర్యునికేసి వెదజల్లాలి. అది భారీ ధూళి మేఘాల రూపంలో కనీసం ఓ వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో నిలిచి ఉండేలా చూడాలి. అది చెదిరిపోయాక చంద్రునిపై మరో దఫా తవ్వకం. మరో వారం పాటు సూర్యునికి, భూమికి మధ్యలో మరిన్ని ధూళి మేఘాలు. ఇలా మొత్తమ్మీద ఏటా ఏకంగా కోటి టన్నుల చంద్ర ధూళిని భూమికి, సూర్యునికి మధ్య మేఘాల రూపంలో వెదజల్లాలన్నది ప్రతిపాదన. ఏమిటి సమస్య? ► చంద్ర ధూళిని అంతరిక్షంలో వెదజల్లడం వినడానికి బానే ఉన్నా అందుకు చాలా సాంకేతికత అవసరం. అంతేగాక సాంకేతిత, రాజకీయ సవాళ్లతోనూ, అంతకుమించి భారీ వ్యయ ప్రయాసలతోనూ కూడిన పని కూడా. ఎందుకంటే... ► అన్నింటికంటే ముందుగా చంద్రునిపై భారీ సైజులో ఓ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూళిని తవ్వి పోసే పరికరాలు తదితరాలను అక్కడికి చేరేసుకోవాలి. ► గత 50 ఏళ్లలో మనిషి చంద్రునిపై కాలు పెట్టలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదంతా ఎంత కష్టమో అర్థమవుతుంది. ► రాజకీయంగా చూస్తే ఈ మొత్తం ప్రయోగానికి ఎవరు సారథ్యం వహించాలి, ఇందులో ఏ దేశం పాత్ర ఎంతమేరకు, ఎలా ఉండాలన్నది మరో పెద్ద ప్రశ్న. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం ఇప్పటికే పెద్ద దేశాల మధ్య పోటీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న వేళ కేవలం ఓ పర్యావరణ లక్ష్యసాధన కోసం ఆభిజాత్యాలను పక్కన పెట్టి అవన్నీ ఏ మేరకు కలిసొస్తాయన్నది అనుమానమే. ► అంతరిక్షంలో భూమికి, సూర్యునికి మధ్య ప్రాంతమంతా పలు దేశాలు ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహాలతో నిండిపోయి ఉంది! ► ఇన్ని కష్టాలూ పడి ఒకవేళ విజయవంతమైనా ధూళిని వెదజల్లే ఉపాయం తాత్కాలిక ఫలితాలే ఇస్తుంది తప్ప గ్లోబల్ వార్మింగ్‌కు శాశ్వతంగా అడ్డుకట్టు వేసే స్థాయిలో దీర్ఘకాలికంగా పెద్దగా ప్రయోజనం కన్పించకపోవచ్చని కొందరు సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు. చంద్రధూళే ఎందుకు? ► భూమిపై పడే సూర్యరశ్మి పరిమాణాన్ని కొంత మేరకు తగ్గించడం ద్వారా భూమిని చల్లబరచాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా ఉన్నవే. దీన్ని సోలార్ జియో ఇంజనీరింగ్, సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ► భూ వాతావరణపు పై పొరలోకి వాయు కణాలతో కూడిన సన్నని లేయర్‌ను పంపి భూమిపైకి వచ్చే సూర్యరశ్మిని కొద్దిమేరకు అడ్డుకోవాలన్న ప్రతిపాదనపై విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఇది ఆచరణసాధ్యం కాదని, ఇలా వాతావరణపు పొరలతో చెలగాటమాడితే భూమిపై పలు ప్రాంతాల్లో వర్షపాతం తదితరాలు తీవ్రంగా ప్రభావితం కావచ్చన్న భయాల నేపథ్యంలో దానిపై ముందడుగు పడలేదు. ► మరికొందరు అంతరిక్షంలో భారీ అద్దాలు, లేదా ఫిల్టర్లను ఉంచాలని సూచించినా అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ► అదే చంద్రధూళిని వాడుకోగలిగితే ఇలాంటి సమస్యలేవీ లేకుండానే దిగ్విజయంగా పని పూర్తవుతుందన్నది తాజా యోచన. ► ఎందుకంటే చంద్రుని ఉపరితలంపై అది అపారంగా అందుబాటులో ఉంది. ► గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే చంద్రుని పై నుంచి ధూళి మేఘాలను అంతేగాక భూమి పై నుంచి జరిపే ఏ ప్రయోగంతో పోల్చినా అత్యంత తక్కువ వ్యయ ప్రయాసలతో సులువుగా అంతరిక్షంలోకి తరలించవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారం రోజులుగా వాతావరణంలో మార్పులు.. అనారోగ్యంతో ప్రజలు సతమతం
సాక్షి, ఆదిలాబాద్: మహాశివరాత్రి దాటితే వేసవి ఎండలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. కానీ ఈసారి శివరాత్రి కంటే ముందే ఎండకాలం మొదలైనట్లు వాతావరణం కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రివేళ చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పల్లెల్లో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతం అవుతున్నారు. తగ్గని చలి.. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండగా, చలి మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే ఉంటున్నాయి. గురువారం తెల్లవారు జామున సిర్పూర్(యూ)లో 9.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, బజార్హత్నూర్(ఆదిలాబాద్) 9.8, బేల(ఆదిలాబాద్)లో 10.3, కవ్వాల్ టైగర్ రిజర్వు జన్నారం(మంచిర్యాల)లో 10.5, బోరజ్(ఆదిలాబాద్)లో 10.6, కెరమెరి(కుమురంభీం)10.9, వాంకిడి(కుమురంభీం) 10.9, జైనథ్(ఆదిలాబాద్) 11.2, ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు(ఆదిలాబాద్) 11.3, నేరడిగొండ(ఆదిలాబాద్) 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండుతున్న ఎండలు.. సాధారణంగా మార్చి నుంచి ఎండల తీవ్రత కనిపిస్తుంది. ప్రస్తుతం చలితోపాటు మండుతున్న ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను తిప్పలు పెడుతున్నాయి. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. తాజాగా కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. అసాధారణ వాతావరణ పరిస్థితులతో రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లోనూ వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. తీవ్రత అధికంగా ఉన్నవారు నిర్లక్ష్యం చేయొద్దని, తప్పనిసరిగా ఆస్పత్రుల్లో సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి వాతావరణ మార్పులతో ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మంచు కురిసే సమయాల్లో ఎక్కువగా బయట తిరుగొద్దు. దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – నవత, వైద్యురాలు, కౌటాల వారం రోజులుగా రోగుల తాకిడి వారం రోజులుగా జిల్లాలోని ప్రభు త్వ ఆస్పత్రులకు 60శాతం రోగుల తాకిడి పెరిగింది. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు సమయం పడుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో, కుమురంభీం -
సొంత సూర్యుడ్ని సెట్ చేసేసుకున్నారు!
అదో చిన్న ఊరు.. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది.. కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు. మధ్యాహ్నం రెండు, మూడు గంటల పాటు తప్పిస్తే.. మిగతా సమయంలో పగలూ, రాత్రీ తేడా తెలియదు. వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు.. కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడ్ని తెచ్చేసుకున్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం.. ఓ టిక్‌టాకర్ చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అద్దాల నుంచి ప్రతిఫలిస్తున్న వెలుగులో విగనెల్లా గ్రామం. (ఇన్సెట్లో) కొండపై ఏర్పాటు చేసిన అద్దాలు ఏడాదికి మూడు నెలలు.. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే విగనెల్లా. రెండు, మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో.. ఏటా నవంబర్ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీదాకా ఊరిలో ఎండ మొత్తానికే పడదు. కొండలపై పడ్డ ఎండ ప్రతిఫలించి (రిఫ్లెక్షన్) వచ్చే వెలుతురే వారికి దిక్కు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 13వ శతాబ్దం నుంచీ అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఆ ఊరివాళ్లు ఇలాగే గడుపుతున్నారు. హా మూడు నెలల చీకటి తర్వాత ఎండపడటం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు. చదవండి: కరోనా అనిశ్చితి: చేతిలో డబ్బున్నా.. వాయిదాల్లోనే! చిన్న ఆలోచనే.. వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం, అదీ చలికాలం కావడంతో.. ఊరివాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడుతూనే వచ్చారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్ చేయాలని 1999లో ఊరి మేయర్ మిడాలి ప్రతిపాదన చేశాడు. ఆర్కిటెక్ట్ బొంజాని, ఇంజనీర్ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి.. వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే.. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు. మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకేచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది. స్టీలు అద్దం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో.. మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని.. అత్యంత నున్నటి స్టీల్ అద్దాలను తెప్పించారు. ఎనిమిది మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి.. ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ మోటార్ వ్యవస్థకు అనుసంధానించారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా.. అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీనితో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ.. ఎప్పుడూ ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది. 2006 డిసెంబర్ 17న ప్రారంభించిన ఈ వ్యవస్థకోసం.. అప్పుడే రూ.90 లక్షలు (లక్ష యూరోలు) ఖర్చయింది. నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా.. తమ ‘కొత్త సూర్యుడి’తో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరివాళ్లు చెప్తుంటారు. నాలుగు రోజుల కింద మనదేశానికి చెందిన కరన్ రాజన్ అనే వ్యక్తి ఈ ఊరి గురించి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Pan - Aadhaar Link: పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక! మరో దేశానికీ స్ఫూర్తినిచ్చి.. భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా దేశాల్లో కూడా.. కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాల్లో ‘విగనెల్లా’ వంటి పరిస్థితే ఉంటుంది. నెలలకు నెలలు ఎండ పడదు. నార్వేలో అలా ఇబ్బందిపడుతున్న జుకాన్ అనే ఊరివాళ్లు.. విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని 2013లో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
సాక్షి, పాలకొల్లు: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేషం సంతరించుకుంది. అర్చకులు కిష్టప్ప తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 6.60 గంటల సమయంలో గాలిగోపురం నుంచి నేరుగా శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. సాధారణంగా ఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రో జు, అంతకు ముందు, ఆ తర్వాత రోజుల్లో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకుతుంటాయి. అయితే భాద్రపద మాసంలో సూర్యకిరణాలు తాకడం ప్రత్యేకతను సంతరించుకుంది. అన్ని గ్రహాలు ఒకే కూటమిలో ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చ ని కిష్టప్ప భావిస్తున్నారు. ఇదిలాఉండగా త్వరలోనే కరోనా అంతం కానుందని, ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్‌లో సూర్యకిరణాలు స్వామిని తాకడమే ఇందుకు నిదర్శనమని భక్తులు అంటున్నారు. మద్దిలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.హర్షవర్దన్ దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం ఆయన్ను అర్చకులు దుశ్శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో టీవీఎస్‌ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
డీ విటమిన్‌తో కరోనాకు ఢీ
కాన్బెర్రా : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతి రోజు పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం ఒక్కటే అత్యుత్తమమైన పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రాచెల్ నీల్ తెలియజేశారు. తాను పరిశీలించినంత వరకు విటిమిన్ డీ తక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. డీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోవడం తాను గతేడాదే కనుగొన్నానని డాక్టర్ రాచెల్ తెలిపారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా శ్వాసకోశపరమైన ఇబ్బందులు ఉంటాయని ఆమె తెలిపారు. అయితే డి విటమిన్ తక్కువగా ఉన్న 78 వేల మంది రోగులను అధ్యయనం చేశానని, వారిలో డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో ఉండే శ్వాసకోశ ఇబ్బందులకన్నా డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో రెట్టింపు ఇబ్బందులు కనిపించాయని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంటే, ఎండ తీవ్రతను బట్టి ప్రతి రోజు ఐదు నుంచి 15 నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం మంచిదని ఆమె సూచించారు. (కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూర్య కిరణాలకు కరోనా ఖతం!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలకు భయకంపితుల్ని చేస్తున్న కరోనా వైరస్, సూర్య కిరణాలకు కొన్ని క్షణాల్లో నశించి పోతుందని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ సెక్యురిటీ’ ఓ అధ్యయనంలో కనుగొంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అడ్వైజర్ విలియం బ్య్రాన్ గురువారం రాత్రి వైట్‌హౌజ్ వద్ద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్ట్రావయొలెట్ లైట్‌తో రేడియేషన్ ప్రసరింప చేయడం వల్ల కరోనా వైరస్‌లో జన్యువులు నశించి పోయాయని పర్యవసానంగా అది పునరుత్పత్తి శక్తిని కోల్పోయిందని తెలిపారు. (చదవండి: కరోనా: మనదేశంలో రికవరీ శాతం 20.57) సూర్యుడి కిరణాల్లో కూడా ఈ అల్ట్రావయొలెట్ కిరణాలు ఉంటాయికనుక, వాటివల్ల కరోనా వైరస్ నశించి పోతుందని ఆయన చెప్పారు. ఉష్ణం, ఉక్క వల్ల కూడా వైరస్ నశిస్తుందని ఆయన అన్నారు. భూ ఉపరితలంపైనే కాకుండా గాలిలో ఉన్న వైరస్‌ను కూడా సూర్య కిరణాలు చంపేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు, శాస్త్రవిజ్ఞాన సంస్థలు నిర్ధారించాల్సి ఉంది. (చదవండి: మహమ్మారిని తరిమే మార్గదర్శకాలు..) -
సూర్యరశ్మితో కరోనాకు చెక్
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచిత్ర ప్రకటనలతో అందరినీ ఆందోళన పరుస్తున్నారు. వైరస్‌కు ఔషధాన్ని కనుగొంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. తాజాగా మరో విచిత్రమైన ప్రకటన చేశారు. కరోనా రోగులను ఎక్కువ వేడి ఉన్న చోటు ఉంచాలని, వేడి ఎక్కువగా ఉండే చోట కరోనా మనుగడ సాధించలేదని అన్నారు. రోగులను ఎండకు ఉంచితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. వైరస్ సోకకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే శక్తివంతమైన సన్‌లైట్, అల్ట్రావయొలెట్ రేస్‌లతో రోగి శరీరాన్ని వేడి చేయాలని సలహా ఇచ్చారు. క్లీనింగ్ ఏజెంట్లను కరోనా రోగుల శరీరంలోకి ఇంజక్ట్ చేయాలని ఉచిత సలహాలు ఇచ్చారు. సూర్యరశ్మి కాంతితో వైరస్‌ను నిరోధించవచ్చిన ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వైట్ హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అంతా చెప్పిన తరువాత తానేమీ వైద్యుడికి కాదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ప్రసంగం ముగించారు. కాగా అమెరికాలో కరోనా ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం నాటికి దేశ వ్యాప్తంగా 8,66,148 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 48,868కి చేరింది. వైరస్ బారిన పడిఇప్పటి వరకు 84వేలమంది కోలుకున్నారు. (మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!) -
సూర్య గడియారం.. సమయం చూసేదెలా?
సాక్షి, అన్నవరం: హిందువులతో పూజించబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన లేనిదే మానవ మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి సూర్యభగవానుడు కొలువైన క్షేత్రాలు అతి తక్కువ. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన కూడా సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. విష్ణు పంచాయతనం కలిగిన సత్యదేవుని ఆలయం దిగువన యంత్రాలయంలో ఆగ్నేయంలో సూర్యభగవానుడు కొలువు తీరారు. అంతే కాదు సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయం తెలిపే సూర్యగడియారం కూడా రత్నగిరిపై దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. సూర్య కిరణాల ఆధారంగా.. సత్యదేవుని ఆలయానికి ఈశాన్యభాగాన, స్వామి వారి నిత్య కల్యాణ మండపం వద్ద గల సూర్యగడియారం (సన్డయిల్)లో సూర్యకాంతి ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారం ఈ గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతుడైన రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించారు. నిర్మాణం ఇలా.. 12 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ పలకపై త్రికోణం ఆకారంలో తూర్పునకు అభిముఖంగా మరో చిన్న పలక అమర్చారు. సూర్యకాంతి ఆ చిన్న పలక మీద పడి దాని నీడ పెద్ద పలకపై పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో ఉన్నట్టుగా అంకెలు ఉంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలు అనుసరించి కొంత సమయాన్ని కలపడం లేదా తీసివేయడం చేయాలి. అలా చేయడం వల్ల మనకి కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే దానిపై అక్కడ గల సూచనల పట్టికలో వివరంగా లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆ పలక నీడ 10–20 అంకెల మధ్య పడితే అక్కడ ఉన్న పట్టిక ప్రకారం ఆ తేదీకి పది నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం 10.30 అయినట్టు. విశేషమేమిటంటే ఈ సమయం కచ్చితంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కు సరిపోతుంది. నిర్వహణ పట్టించుకోని దేవస్థానం ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్యగడియారం ఆలనా పాలనా లేకపోవడంతో సమయం ఎలా తెలుసుకోవాలో తెలియక భక్తులు ఏదో నిర్మాణాన్ని చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు తప్ప, ఆ గడియారంలో సమయం తెలుసుకునే విధానం తెలుసుకోలేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడ పలక మీద వేసిన అంకెలు, సూచనల పట్టికలోని సూచనలు, ప్లస్, మైనస్ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించాలి. అదే విదంగా ఈ సూర్య గడియారం ప్రాముఖ్యతను భక్తులకు వివరించేందుకు అక్కడొక గైడ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. -
పగటిపూటే నదుల్లో అధిక ఆక్సిజన్!
సాక్షి, హైదరాబాద్: నదుల నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ (డీఓ) శాతం రాత్రివేళ కంటే పగటిపూటే అధికంగా ఉంటుందని కేంద్ర జల సంఘం తేల్చింది. నదిలో కరిగి ఉండే ఆక్సిజన్ స్థాయికి, సూర్యరశ్మికి దగ్గరి సంబంధం ఉందని వెల్లడించింది. ఈ కారణంగానే సూర్యరశ్మి పడే సమయంలో మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా ఉండి నది నీటిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో వివిధ సందర్భాల్లో, పుష్కరాలు జరిగే సీజన్లలో నది నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై అనేక అపోహలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దృష్ట్యా నదుల్లోని ఆక్సిజన్ పరిమాణం, దానికి సూర్యరశ్మికి గల సంబంధం, అది వివిధ సందర్భాల్లో ఎలా ఉంటుంది, జీవజాలం మనుగడకు అది ఎలా దోహదం చేస్తుంది? అన్న అంశాలపై కేంద్ర జల సంఘంతో నిపుణులతో శాస్త్రీయ అధ్యయనం చేయించింది. దేశవ్యాప్తంగా నర్మద, యమున, తుంగభద్ర, గంగ వంటి నదుల పరిధిలోని 19 నీటి నాణ్యతా కేంద్రాల వద్ద పరీక్షలు నిర్వహించి నీటి పరిమాణం, సూర్యరశ్మి మధ్య ఉన్న సంబంధాన్ని తేల్చింది. పగలే బెటర్.. నదుల్లో నీటి నాణ్యతను డీఓ నిర్ణయిస్తుంది. నీటిలో డీఓ పరిణామం లీటర్‌కు కనీసం 4 మిల్లీగ్రాములు ఉండాలి. డీవో తగ్గేకొద్దీ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) పెరుగుతుంటుంది. బీవోడీ లీటర్‌కు 3 గ్రా. మించొద్దని నిబంధనలు ఉన్నా.. ప్రస్తుతం నదుల్లో బీవోడీ స్థాయి 4 నుంచి 9 గ్రాములు/లీ. వరకు ఉంది. నదిలో బీఓడీ పెరిగితే ఆ నీరు తాగేందుకు, స్నానాలకు కానీ పనికి రావు. అయితే ప్రస్తుతం కేంద్ర జల సంఘం చేసిన అధ్యయనంలో రాత్రి వేళలో నది నీటిలో డీఓ తక్కువగా ఉంటోంది. రాత్రివేళ సూర్యరశ్మి లేకపోవడంతో చెట్లలో కిరణజన్య సంయోగ క్రియ స్థాయి తగ్గుతుంది. దీంతో నది లోపల ఉండే మొక్కలు ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడంతో నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అదే పగటి ఉష్ణోగ్ర తలు అధికంగా ఉన్నప్పుడు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఉప ఉత్పత్తి గా ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేయడంతో అది నీటిలో ఎక్కువగా కరిగి ఉంటుందని అధ్యయనంలో తేల్చింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 వరకు నదుల్లో డీఓ తగ్గుతుందని, అందువల్లనే ఈ సమయంలో బ్యాక్టీరియా శాతం పెరుగుతుందని తెలిపింది. రాత్రివేళ తగ్గే డీఓతో నదుల్లోని జీవజాలానికి ప్రాణాంతకం అయ్యేదిగా మాత్రం ఉండదని తేల్చిచెప్పింది. డీఓకు సూర్యరశ్మితో అవినాభావ సంబంధం ఉంటుందని, ఈ ప్రభావం వల్ల డీఓలో హెచ్చుతగ్గులు 16.31 శాతం నుంచి 150.63 శాతం వరకు ఉంటాయని తెలిపింది. యమున,తుంగభద్ర నదుల్లో... యమున, తుంగభద్ర నదుల్లో రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 7 వరకు డీఓ లీటర్‌కు 1.81 మిల్లీ గ్రాములు మాత్రమే ఉందని, ఉదయం సమయాల్లో 4 మిల్లీగ్రాముల వరకు ఉందని అధ్యయనంలో గుర్తించింది. నదిలో నీటి పరిమాణాన్ని సూర్యరశ్మితో పాటే వాతావరణ పీడనం, వాతావరణ పరిస్థితులు వంటివి ప్రభావితం చేస్తాయని గుర్తించింది. దీంతో సూర్యోదయం తర్వాతే నదీ స్నానం ఉత్తమమని కేంద్ర జల సంఘం అధ్యయనం తేల్చినట్లయిం దని నిపుణులు చెబుతున్నారు. -
నీటి శుద్ధికి బ్యాక్టీరియా...
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ మాటలు చాలాసార్లు మనం వినే ఉంటాం. అయితే నీటిని శుద్ధి చేసేందుకు బ్యాక్టీరియాలను ఉపయోగించవచ్చునన్న ఆలోచన మాత్రం వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసి చూపారు. బ్యాక్టీరియా కారణంగా నీరు కలుషితమవుతుందిగానీ.. శుద్ధి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అంటున్నారు సింగమనేని శ్రీకాంత్. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరైన ఈయన తన విద్యార్థులతో కలిసి బ్యాక్టీరియాతో నిర్మితమైన ఓ ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ ఫిల్టర్‌లో గ్రాఫీన్ ఆౖMð్సడ్, బ్యాక్టీరియల్ నానో సెల్యులోజ్ ఉంటాయి. నీటి శుద్ధీకరణకు వాడే సాధారణ ఫిల్టర్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల కొద్దోగొప్పో దుర్వాసన వేస్తూంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కానీ కొత్త ఫిల్టర్‌లో మాత్రం ఈ సమస్య ఉండదు. శ్రీకాంత్ గతంలోనూ ఇలాంటి ఫిల్టర్లను బంగారు నానోకణాల సాయంతో చేసినప్పటికీ చౌకైన ప్రత్యామ్నాయం కోసం జరిగిన ప్రయత్నాల్లో గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఫిల్టర్ సిద్ధమైంది. గ్రాఫీన్ ఆక్సైడ్ కారణంగా ఫిల్టర్ సూర్యరశ్మితో వేడెక్కుతుందని, అది చుట్టూ ఉన్న నీటిలోకి ప్రవేశించడం ద్వారా నీటిలోని ఇతర బ్యాక్టీరియాను శుద్ధి చేస్తుందని శ్రీకాంత్ అంటున్నారు. -
ఆ హార్మోన్ తక్కువగా ఉంది
నా వయస్సు 29. నాకు ఈమధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ప్రతిచిన్నదానికి బాగా నీరసంగా అనిపిస్తుంది. దేనిపైనా ఆసక్తి కలగడం లేదు. దాంతో డాక్టర్ని కలిశాను. పరీక్షలు చేసి ‘టెస్టోస్టెరాన్ హార్మోన్ తగిన స్థాయిలో లేదు’ అన్నారు. మందులు కూడా రాసిచ్చారు. అసలు టెస్టోస్టెరాన్ అంటే ఏంటి? దాని వివరాలను తెలియజేయగలరు. – పి.రమ్య, మందమర్రి మన శరీరంలోని అన్ని ప్రక్రియలు సరిగా పని చెయ్యటానికి అనేక హార్మోన్లు దోహదపడతాయి. వాటిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒకటి. ఇది మగవారిలో 28-0-&-1-1-00ng/dl విడుదల అవుతుంది. ఆడవారిలో 15-&-70ng/dl ∙విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మగవారికి చాలా అవసరం. అలాగే ఆడవారికి కూడా కొంచెం మోతాదులో అవసరం. ఇది కండరాలు పెరగడానికి, బలానికి, శక్తికి, ఎముకల ఎదుగుదలకి, శరీరం – మనసు ఉత్తేజంగా ఉండటానికి కొద్దిగా లైంగిక కోరికలకు ఉపయోగపడుతుంది. ఇది అండాశయాల నుంచి మరియు అడ్రినల్ గ్రంథి నుంచి విడుదల అవుతుంది. వీటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, టెస్టోస్టెరాన్ తక్కువగా విడుదల అవ్వడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి అలాగే పీరియడ్స్ ఆగిపోయినప్పుడు అంటే మెనోపాజ్ దశలో కూడా తగ్గుతుంది. ఇది చాలా తక్కువగా విడుదల అవ్వడం వల్ల.. శక్తి లేకపోవడం, నీరసంగా అనిపించడం, ఉత్సాహంగా లేకపోవటం, ఒళ్లునొప్పులు, జాయింట్ నొప్పులు, కండరాల నొప్పులు, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అవసరమైన మరిన్ని పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవటం మంచిది. నా వయసు 27. నేను ప్రెగ్నెంట్‌ని. గర్భిణీలకు సన్‌లైట్ ఎక్స్పోజర్ అవసరం అని చెబుతుంటారు. అయితే ఏ సమయంలో ఎండలో కూర్చోవాలి అనేదాని మీద నాకు స్పష్టత లేదు. ‘గర్భిణులు ఎండలో కూర్చోవడం అసలు మంచిది కాదని’ మా అత్తయ్య చెబుతున్నారు. సూర్యరశ్మి వల్ల కలిగే మంచి చెడుల గురించి వివరంగా తెలియజేయగలరు. – కె. స్పప్న, సికింద్రాబాద్ సూర్యకాంతి నుంచి వచ్చే అల్ట్రావైలెట్–బి కిరణాలు చర్మంపైన పడినప్పుడు చర్మంలో విటమిన్–డి తయారవుతుంది. ఇది రక్తం నుంచి కాల్షియాన్ని అధికంగా శరీరంలోకి, ఎముకలలోకి చేరుస్తుంది. దీని వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. ఇంకా విటమిన్–డి ఆహారపదార్థాలైన పాల ఉత్పత్తుల్లో.. పండ్లలో.. చేపల్లో.. మాంసాహారంలో లభిస్తాయి. గర్భిణీ సమయంలో 9 నెలల పాటు బిడ్డ ఎదుగుదలకు, తల్లిలో జరిగే మార్పులకు విటమిన్–డి ఎంతో అవసరం. సాధారణంగా అయితే ఉదయం 11 గంటల నుంచి 1 గంట సమయంలో ఉండే సూర్యకాంతిలో అల్ట్రావైలెట్–బి కిరణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ గర్భవతుల చర్మం, హార్మోన్లలో మార్పుల వల్ల చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. కాబట్టి గర్భవతులు ఉదయం 10 గంటలలోపే 10–15 నిమిషాల పాటు వారానికి మూడు రోజులు సూర్యకాంతిలో లేతరంగు దుస్తులతో గడపవచ్చు. గర్భవతులు ఎక్కువసేపు సూర్యకాంతిలో గడపడం వల్ల బాగా చెమట పట్టడం, అలిసిపోవడం, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే చర్మంపై పిగ్మెంటేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మొదటి మూడు నెలల్లో బిడ్డ వెన్నుపూస వంటి అవయవాలు తయారు అవుతాయి. ఈ సమయంలో ఫోలిక్‌యాసిడ్ చాలా అవసరం. అయితే గర్భిణులు ఎక్కువ సేపు ఎండలో ఉంటే సూర్యకాంతిలోని కిరణాలు శరీరంలో ఉండే ఫోలిక్యాసిడ్ను ధ్వంసం చేస్తాయి. దానివల్ల బిడ్డకు వెన్నుపూసకు సంబంధించిన లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎంత చేసినా విటమిన్–డి తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భిణులు విటమిన్–డి సరిగా ఉండేటట్లు మితమైన సూర్యకాంతితో పాటు, పౌష్టికాహారం అలాగే అవసరమైతే డాక్టర్ సలహామేరకు విటమిన్–డి మాత్రలు వేసుకోవడం మంచిది. మా సోదరి వయసు 23. తను ప్రెగ్నెంట్. గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవల్సిన వాక్సిన్లు, వాటి ఉపయోగాల గురించి తెలియజేయగలరు. ఈ వాక్సినేషన్ వల్ల బేబి ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని విన్నాను. ఇది ఎంత వరకు నిజమో దయచేసి తెలియజేయగలరు. – జి. వనిత, నెల్లూరు సాధారణంగా గర్భిణులలో, టీ.టీ (Tetanus Toxoid) ఇన్జెక్షన్ ఒక నెల గ్యాప్‌తో రెండు డోసులు ఇస్తారు. గర్భం వచ్చిన తర్వాత నాలుగు నెలల నుంచి ఏడు నెల లోపల తీసుకోవడం మంచిది. ఇది కాన్పు సమయంలో ధనుర్వాతం నుంచి తల్లిని, బిడ్డని కాపాడుతుంది. ఇది తప్పనిసరిగా గర్భిణీకి ఇస్తారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇస్తారు. దీని వల్ల బిడ్డకి, తల్లికి ఎటువంటి హాని జరగదు. ఇంక కొన్ని వ్యాక్సిన్స్ అవసరాన్ని బట్టి, సీజన్ బట్టి, వారివారి రిస్క్‌లను బట్టి ఇస్తారు. ఇవి కచ్చితంగా అందరూ తీసుకోవాలని ఏమీ లేదు. ఇవి తీసుకోవడం వల్ల హాని కంటే మంచి ఎక్కువ జరుగుతుంది అని అనుకున్నప్పుడు తీసుకోవలసి ఉంటుంది. Tdap injection 28–32 వారాల సమయంలో ఇస్తారు. ఇది తల్లిలో బిడ్డలో ధనుర్వాతం, డిఫ్తీరియా, కోరింత దగ్గు వంటి అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఫ్లూ ఎక్కువ వ్యాపిస్తున్న కాలంలో అంటే నవంబర్ నుంచి మార్చి వరకు కొంతమందికి ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు అని సలహా ఇస్తారు. హెపటైటిస్–బి సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉన్నవారికి మూడు నెలలు దాటిన తర్వాత తీసుకోమని సలహా ఇస్తారు. సాధారణంగా పైన చెప్పిన వ్యాక్సిన్స్ వల్ల దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వీటి వల్ల బిడ్డ ఎదుగుదలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. డాక్టర్ సలహా మేరకు గర్భవతి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
కార్బన్ డయాక్సైడ్తో ఇంధనం!
సూర్యకాంతిని ఉపయోగించి వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చేందుకు లారెన్స్ బెర్క్లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మొక్కల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకుంటాయన్నది తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చేందుకు ఇప్పటికే ఎన్నో ఇతర పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. లారెన్స్ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు. కార్బన్ డయాక్సైడ్ను వాయుస్థితి నుంచి ద్రవ స్థితికి మార్చేందుకు, ఆ తర్వాత దాన్ని ఇథనాల్, ఇథిలీన్ వంటి ఇంధనాలుగా మార్చేందుకు ప్రత్యేక పదార్థాలు, పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే అతితక్కువ ఇంధనాన్ని ఖర్చుపెట్టి కార్బన్ డయాక్సైడ్ను వేర్వేరు కర్బన పరమాణువులుగా మార్చేందుకు ఓ ప్రత్యేకమైన ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. రాగి–వెండితో కూడా నానోకోరల్ క్యాథోడ్, ఇరీడియం ఆక్సైడ్ నానోట్యూబ్ ఆనోడ్తో మొక్కల కంటే సమర్థంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగారు. సౌరశక్తితోనే వాతావరణంలోని విషవాయువును తగ్గించేందుకు తమ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని బెర్క్లీ శాస్త్రవేత్త గురుదయాళ్ తెలిపారు. -
కాస్తంత ఎండ తగలనీయండి!
ఈమధ్యే నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో 65–75% మంది విటమిన్ డి లోపంతో ఉన్నారని తెలిసింది. మరి ఆ విటమిన్ డి అందడానికి కష్టపడాల్సిన పనేమైనా ఉందా? అంటే అదీ లేదు. ప్రకృతి నుంచి చాలా సహజంగా అందే విటమిన్ అది. సూర్యరశ్మి ఒంటికి తగిలితే కావాల్సిన విటమిన్ డి దానంతట అదే అందుతుంది. కాగా మారిన జీవన విధానంతో సహజసిద్ధంగా లభించే ఆ సూర్యరశ్మికి కూడా ఇప్పటి తరం దూరమవుతోంది. ఇది ఇలాగే జరుగుతూ పోతే పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. విటమిన్ డి లోపం ఎన్నో రోగాలకు దారితీసే అవకాశం ఉంది. విటమిన్ డి తగ్గుతూ పోతే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విటమిన్ డి తగ్గితే ఒంట్లో కాల్షియం నిలవదు. దీంతో ఎముకల్లో పటిష్టత తగ్గిపోతుంది. సాధారణంగా 30–100 యూనిట్ల మధ్య విటమిన్ డి ఉండాలి. అంతకు తగ్గితే జాగ్రత్త పడడం చాలా అవసరం. మరి ఏం చేయాలి? విటమిన్ డి పొందాలంటే సూర్యరశ్మి తగిలేలా చూస్కోవడమే సులువైనది, ఉత్తమమైనది. రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల మధ్య ఓ పావుగంట పాటు బాడీకి ఎండ తగలనివ్వాలి. చేపలు, చికెన్, సోయాబిన్ లాంటివి తినడం ద్వారా కూడా కొంత విటమిన్ డి అందుతుంది. కౌంట్ మరీ 10 యూనిట్లకు తగ్గిపోతే డాక్టర్ సలహాతో విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవడం తప్పక చేయాల్సిన పని. -
వ్యాంపైర్ డిసీజ్!
మెడి క్షనరీ సూర్యకాంతికి భయపడి భూతాలు పగటివేళ బయటికి రానట్లే... ఈ వ్యాధి సోకిన వారు కూడా భూతాల్లా పగటివేళ ఇంట్లోంచే బయట కాలుపెట్టలేరు. పైగా హాలీవుడ్ చిత్రాల్లో భూతాల్లా చూడటానికే చాలా భయంకరంగానూ మారిపోతారు. అందుకే ఈ వ్యాధికి వ్యాంపైర్స్ సిండ్రోమ్ అని పేరు. సూర్యుడి నుంచి లభించే సూర్మరశ్మి అందరికీ అవసరం. అయితే సూర్యకాంతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు అందరి చర్మానికి హానికరం. పోర్ఫైరియా అనే పేరున్న ఈ వ్యాధి వల్ల ఉన్నవారికి ఏమాత్రం సూర్యకాంతి సోకినా భరించలేరు. అందుకే వాళ్లు ఏమాత్రం సూర్యకాంతిని భరించలేకపోవడంతో పాటు, చాలా భయంకరంగా కనిపించేలా మారిపోతారు కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఇది చాలా అరుదైన వ్యాధి. -
'చీకటిని చూసి భయపడుతున్నాడట'
ముంబై: ఎందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముంబై మారణహోమం కేసులో కీలక నిందితుడు అబూ జుందాల్ వ్యవహరశైలి అనుమానాస్పదంగా మారింది. వందలమంది జీవితాల్లో చీకట్లు నింపిన అబూ జుందాల్... ఇప్పుడు అదే చీకటిని చూసి భయపడుతున్నాడట. తనకు గాలి, వెలుతురు కావాలని పేచి పెడుతున్నాడట. ముంబైలోని అర్థర్ జైలులో ఖైదీగా ఉన్న అబూ జుందాల్ నిరాహార దీక్షకు దిగాడు. తనను చీకటి గది నుంచి వెలుతురు ఉన్న గదిలోకి మార్చాలంటూ దీక్ష చేపట్టాడు. చీకటి గదిలో ఉండడం వల్ల తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని జుందాల్ తెలిపాడు. తన డిమాండ్లను పేర్కొంటూ బుధవారం మోకా కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్‌ను నిఘా వర్గాలు 2012లో సౌదీ అరేబియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
పదో తరగతి మాదిరి ప్రశ్నపత్రం
GENERAL SCIENCE PAPER-II (Biological Science) (Telugu Version) Time: 2.45 Hours Max. Marks: 40 విభాగం - ఐ సూచనలు: 4 ణ 4 = 16 {పతి ప్రశ్నకు 8-10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. {పతి ప్రశ్న నుంచి అంతర్గతంగా ఒక ప్రశ్నను ఎన్నుకుని సమాధానం రాయండి. 1. ఆకుపచ్చని మొక్కలను సూర్య కాంతిలో ఉంచినప్పుడు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీన్ని నిరూపించడానికి మీరు ఏ ప్రయోగం చేస్తారు? (లేదా) మీ టీచర్ పక్కన చూపిన ప్రయోగ నమూనాను తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఎ) ఈ పటం ఏ ప్రయోగాన్ని తెలియజేస్తుంది? బి) {పయోగంలో ఉపయోగించిన పరికరాల పేర్లు రాయండి. సి) {పయోగ విధానాన్ని వివరించండి. 2. డయాలసిస్ అంటే ఏమిటి? దాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారు? ఎలా నిర్వహిస్తారు? (లేదా) చిన్న పేగు చుట్టుకొని అనేక ముడతలుగా ఉండటానికి కారణం ఏమైనా ఉందా? జీర్ణక్రియకు అది ఏ విధంగా తోడ్పడుతుంది? 3. లింగ వివక్షత వల్ల ఆడ శిశువుల విక్రయం, బ్రూణహత్యలు అనే వార్తలు తరచూ వింటున్నాం. సైన్స విద్యార్థిగా మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో ఉదాహరణలతో వివరించండి. మీ గ్రామస్థులను ఏ విధంగా చైతన్య పరుస్తారో తెలపండి. (లేదా) {Mిమికీటకాల బారి నుంచి పంటలను, ఆహార పదార్థాలను సంరక్షించడానికి క్రిమి సంహారకాలను ఉపయోగించాలా? వద్దా? ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని సహేతుక కారణాలతో తెలపండి. 4. కింద ఇచ్చిన నీటి పారుదల సౌకర్యాలు- విస్తీర్ణం పటాన్ని గమనించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఎ) పటంలో వివిధ నీటి వనరుల శాతాలను పేర్కొనండి. బి) భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి? సి) భూగర్భ జల వనరులు వేగంగా తరిగిపోతున్నాయి కదా! దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? (లేదా)వివిధ రకాల మొక్కల నుంచి లభించే ఆల్కలాయిడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్ లేదా గ్రంథాలయం నుంచి సేకరించి నివేదిక తయారు చేయండి. విభాగం - ఐఐ సూచనలు: 6 ణ 2 = 12 అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. {పతి ప్రశ్నకు 4 నుంచి 5 వాక్యాల్లో జవాబు రాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 5. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకత తెలిపే కృత్యానికి సంబంధించిన గాజు సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచకపోతే ఏం జరుగుతుంది? 6. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం లభిస్తే శ్వాసక్రియ గురించి ఏయే ప్రశ్నలు అడుగుతారు? 7. కొంతమంది పిల్లలు 15 లేదా 16 ఏళ్లు వచ్చే వరకూ రాత్రిపూట నిద్రలో పక్క తడుపుతుంటారు. కారణమేమిటి? 8. పటంలో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ భాగాల పేర్లు రాయండి. 9. కిందివాటిలో నియంత్రిత, అనియంత్రిత అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి. ఎ) రక్తనాళాల్లో రక్త ప్రసరణ బి) మంచి ఆహారం చూడగానే నోట్లో లాలాజలం ఊరడం సి) వందేమాతర గీతం వినగానే లేచి నిలబడటం డి) పాట పాడటం 10. ‘సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ’ - దీన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు? విభాగం - ఐఐఐ సూచన: 7 ణ 1 = 7 అన్ని ప్రశ్నలకు 1, 2 వాక్యాల్లో జవాబులు రాయండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 11. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి కొవ్వులను జీర్ణం చేసుకోలేడు. కారణమేమిటి? 12. కింది గ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది? 13. కాడవర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏమిటి? 14. ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తి కాదో తెలపండి. 15. గర్భాశయంలోని ఉమ్మనీటి కోశం విధి ఏమిటి? 16. ‘కార్బన్ డేటింగ్’ పద్ధతిని దేనికి ఉపయోగిస్తారు? 17. ఇంకుడు గుంట, ఇంకుడు చెరువు మధ్య తేడా ఏమిటి? విభాగం - ఐగ సూచనలు: 10 ణ 1/2 = 5 అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు. సరైన సమాధానాన్ని ఎంచుకొని ప్రశ్న సంఖ్య, దాని జవాబును సూచించే అక్షరాన్ని (అ/ ఆ/ ఇ/ ఈ) సమాధాన పత్రంలో రాయండి. 18. రవికి గాయమైన భాగంలో రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంది. అతడు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నాడు? అ) విటమిన్-ఎ ఆ) విటమిన్-సి ఇ) విటమిన్-డి ఈ) విటమిన్ - కె 19. ఊపిరితిత్తుల్లో శ్వాసక్రియ క్రమాన్ని గుర్తించండి. 1) రక్తం ద్వారా వాయు రవాణా 2) కణజాలాల్లో వాయు మార్పిడి 3) ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి 4) కణశ్వాస క్రియ అ) 1, 2, 3, 4 ఆ) 3, 1, 2, 4 ఇ) 4, 2, 1, 3 ఈ) 4, 3, 1, 2 20. ఎఫిడ్లు పోషక కణజాలం నుంచి గ్రహించిన మొత్తం చక్కెరలో కొంత భాగం చిక్కని ద్రవం రూపంలో పాయువు నుంచి వెలువడుతుంది. దీన్ని ఏమంటారు? అ) మలం ఆ) తేనే ఇ) మలకబళనం ఈ) చక్కెర 21. మూత్రం ఏర్పడే దశల క్రమం ఏది? అ) గుచ్ఛ గాలనం- వరణాత్మక పునఃశోషణం -నాళికా స్రావం ఆ) వరణాత్మక పునఃశోషణం- నాళికా స్రావం- గుచ్ఛగాలనం ఇ) వరణాత్మక పునఃశోషణం - గుచ్ఛగాలనం- నాళికా స్రావం ఈ) నాళికా స్రావం- వరణాత్మక పునఃశోషణం - గుచ్ఛగాలనం 22. ఎగబాకే మొక్కల్లో నులి తీగలు సన్నగా, పొడవుగా దారాల మాదిరిగా ఉండి, ఏదైనా ఆధారం వైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. ఈ ప్రతిస్పందనలను ఏమంటారు? అ) నాస్టిక్ చలనాలు ఆ) కాంతి అనువర్తనం ఇ) గురుత్వానువర్తనం ఈ) స్పర్శానువర్తనం 23. పటంలో భాగాన్ని గుర్తించండి. అ) ప్రథమ కాండం ఆ) ప్రథమ మూలం ఇ) పరాగనాళం ఈ) కేసరదండం 24. కిందివాటిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపేది ఏది? అ) సిగరెట్ పొగలోని రసాయనాలు ఆ) ఆల్కహాల్ ఇ) ఔషధాలను అధికంగా వాడటం ఈ) పైవన్నీ 25. కడుపు నిండుగా ఉండి, ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనే భావనకు వచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏది? అ) గ్రీలిన్ ఆ) లెప్టిన్ ఇ) ఇన్సులిన్ ఈ) పైత్యరసం 26. చార్లెస్ ఎల్టాన్ ప్రకారం కిందివాటిలో సరైన వాక్యం? అ) మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటారు ఆ) పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహీతమవుతుంది ఇ) పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు ఈ) అ, ఇ 27. పక్క పటం దేన్ని సూచిస్తుంది? అ) తగ్గించడం ఆ) పునర్వినియోగం ఇ) పునఃచక్రీయం ఈ) పదార్థాల నాణ్యత విభాగం - ఐగ సమాధానాలు 18) ఈ 19) ఆ 20) ఆ 21) అ 22) ఈ 23) ఇ 24) ఈ 25) ఆ 26) ఈ 27) ఇ సూర సత్యనారాయణ సబ్జెక్ట్ ఎక్స్పర్ట -
ఓ మంచి సంకల్పానికి ఆది!
కొంత నిర్దుష్టమైన కాలం, శక్తులను కలిపి మనం జీవితం అంటాం. ఇందులో కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతుంది. సూర్యచంద్రుల పరంగా భూమి ఉండే స్థానం మన వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. మన శరీరం, మనసులపై ఈ సూర్యచంద్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి ముఖ్యంగా సూర్యశక్తి వల్లే నడుస్తున్నది, మీ శరీరం కూడా ఈ భూమిలో ఒక అంశమే. సూర్యశక్తిని మీరెంత గ్రహించగలరన్న దానిని బట్టే మీకెంత శక్తి ఉన్నదనేది నిర్ణయించబడుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ జరిగే భూ పరిభ్రమణం కాలాన్నే కాక, శక్తిని కూడా నిర్దేశిస్తుంది. అంటే జీవానికి ప్రధాన అంశాలైన కాలమూ, శక్తి అనే ఈ రెండూ కూడా సూర్యుని వల్లనే నిర్దేశింపబడుతున్నాయి. అందువల్ల భూమిపై సూర్యుని ప్రభావం అత్యంత అధికంగా ఉంటుంది. సూర్యునిలాగా చంద్రుడు శక్తిని ప్రసరింప లేకపోయినా, భూమికి అతి సమీపంలో ఉండడంవల్ల మనపై చంద్రుడి ప్రభావం కూడా ఎక్కువే. అసలు మన పుట్టుకే చంద్రగమనంపై ఆధారపడి ఉన్నది. ఎందుకంటే స్త్రీ శరీరంలోని ఋతుక్రమానికీ, చంద్రుని గమనానికి నూటికి నూరు శాతం సంబంధం ఉంది. చంద్రుని ప్రభావం కాంతి, శక్తి, ఉష్ణాలకు సంబంధించినది కాదు, అయస్కాంత పరమైనది. ఈ రోజు ఏదో ఒకదాని భ్రమణ, పరిభ్రమణాల వల్లనే విద్యుత్తు తయారవుతున్నది. వేరే మార్గం లేదు. అదేవిధంగా చంద్రుడు తన భ్రమణ, పరిభ్రమణాల ద్వారా ఒక శక్తిక్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాడు. అందువల్ల బయట నుంచి మన జీవితాన్ని ప్రభావితం చేసే వాటిని అర్థం చేసుకోవాలంటే సూర్యడిని పరిగణనలోకి తీసుకోవాలి. అంతరంగంలో జరిగే దానిని అర్థం చేసుకోవాలంటే చంద్రుడిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది. ఎదగటానికి వేసవి అత్యంత అనుకూలమైనది. వృక్షజాతి అంతా వేసవిలోనే బాగా పెరుగుతుంది. ఎరుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మంచిది. మీ చుట్టూ ఉన్న జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు మీకు కావలసిన విధంగా మలచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైన సమయం. ఇది ఉత్తరాయణ కాలం కూడా. అంటే భూమి పరంగా చూస్తే సూర్యగమనం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు ఈ సమయం ఎంతో ముఖ్యమైనది. ఆత్మ సాక్షాత్కారానికి, ఆశయాలను సాధించుకోవడానికి అనువైన సమయం ఇదే. మానవుని అంతరంగంలో జరిగే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతులు సహజంగానే చాంద్రమాన క్యాలండర్‌ను లేక నూటికి నూరుశాతం చాంద్రమానం కాకపోయినా ఎక్కువ చాంద్రమాన ప్రభావం ఉన్న సౌర చాంద్రమాన క్యాలండర్‌ను అనుసరించాయి. భారతీయ సాంప్రదాయ క్యాలండర్ని పంచాంగం అంటారు. ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలండర్లలో ఇది ఒకటి. ఈ క్యాలండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. నిజానికి ఈ అనంతవిశ్వంలో పాత సంవత్సరం, కొత్తసంవత్సరం అంటూ ఏమీలేవు. ఈ ఎల్లలన్నీ మనం మన జీవితం ఎలా సాగుతుందో చూసుకోవడానికి మనం ఏర్పరచుకున్నవే. మనం ముందుకు పోతున్నామో, లేదా వెనక్కు పోతున్నామో తెలుసుకోవడానికి ఏర్పరచుకున్నవే. అందువల్ల క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే మానవునిగా మనం పురోగమించామా లేదా గమనించాలి. మానవునిగా క్రితం సంవత్సరం కన్నా కొద్దిగానైనా మెరుగయ్యామా, లేదా అన్నది చూసుకోవాలి. అలాగే వచ్చే సంవత్సరం కల్లా మీరు ఇప్పటికన్నా చాలా మెరుగైన మానవులు కావాలి. ఇంకా సంతోషంగా, శాంతంగా, ప్రేమగా ఉండే అంటే అన్నిరకాలుగా ఉత్తమమైన మానవులుగా తయారవ్వాలి. దానికి మీరేం చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఆ విధంగా అడుగులు వేస్తే, మీలో మానవత్వం పొంగిపొర్లుతుంది. అప్పుడు దివ్యత్వం మీకు దానంతటదే సంభవిస్తుంది. అలా మీకు సంభవించు గాక! ప్రేమాశీస్సులతో... సద్గురు -
భానుడి వరం...
అసలు విషయం చెప్పుకునే ముందుగా ఒక్కసారి పురాణకాలంలోకి వెళ్దాం. కుంతీదేవికి సూర్యుడి అంశతో కర్ణుడు సహజకవచకుండలాలతో పుట్టాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే... అది మన పూర్వికులు సూర్యుడి వల్ల ఎముకలూ, శరీరం అభేద్యంగా ఉంటాయన్న సంగతిని ప్రతీకాత్మకంగా చెప్పారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ నవీనకాలంలోకి వద్దాం. భానుడి కాంతి తమ శరీరంపై సరైన రీతిలో ప్రసరించనివారి ఎముకలు గుల్లబారిపోతున్నాయి. అంతేకాదు... ఆ సూర్యుడి వెలుగుకి తగినంత మోతాదులో ఎక్స్పోజ్ కానివారు ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నారు. కారణం... విటమిన్ ‘డి’ లోపం! బహుశా ఈ విటమిన్ అనేక వ్యాధులకు, అంతులేనంతగా ఇచ్చే వ్యాధినిరోధకతనే మన పూర్వికులు సహజ ‘కవచం’ అంటూ అభివర్ణించారేమో అనిపిస్తోంది కదా! పురాణాల మాట ఎలా ఉన్నా... ఈ నవీనకాలంలో విటమిన్ డి అంటే వ్యాధుల పట్ల అది సహజకవచమే. ఆ వ్యాధినిరోధక కవచాన్ని ధరించడం ఎలా అన్నది తెలిపేందుకే ఈ ప్రత్యేక కథనం. ప్రపంచంలోని చాలా పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి అంతగా ప్రసరించదు. అందుకే వారి రచనల్లో ఆహ్లాదకరమైన రోజును ‘సన్నీడే’ అంటూ అభివర్ణిస్తుంటారు. ఎప్పుడూ మబ్బుపట్టి ముసురుతుంటుంది కాబట్టి ‘రెయిన్ రెయిన్... గో అవే’ అంటూ రయిమ్స్ పాడుతుంటారు. కాబట్టి... అక్కడ విటమిన్ ‘డి’ లోపం చాలా సహజం, సాధారణం. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ అంటే నూరు కోట్లమంది, (వారిలో పాశ్చాత్యులే ఎక్కువ) విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని ఒక అంచనా. అందుకే వారు సూర్యకాంతి కోసం సన్బాత్ల వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఎండ పుష్కలంగా ఉండే మన భారతదేశంలాంటి చోట కూడా ఇప్పుడు ప్రజల్లో విటమిన్ ‘డి’ లోపం వేధిస్తోంది. సామాజికంగా ఎండలోకి వెళ్లి చేసే పనుల కంటే నీడపట్టునే ఉండి చేసే పనులు క్రమంగా పెరిగిపోవడం, ఎండకు ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు తగ్గడమే దీనికి కారణం. విటమిన్ డి లోపం కారణంగా వస్తాయని పేర్కొనే అనేక అనర్థాలు ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తుండటంతో డాక్టర్లు సైతం పెద్ద ఎత్తున రోగులకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్లు వాడుతుండటం ప్రస్తుత చికిత్సాశైలిగా మారింది. విటమిన్ ‘డి’ అంటే... శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. అయితే ఈ పోషకం ఆహారంలో కంటే సూర్మరశ్మి నుంచే ఎక్కువగా లభ్యమవుతుంది. సూర్యకాంతి వల్ల దొరికేది 80 శాతమైతే... కేవలం మిగతా 20 శాతం మాత్రమే ఆహార పదార్థాల నుంచి లభ్యమవుతుంటుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని సాంకేతికంగా సెకోస్టెరాయిడ్ అంటారు. అంటే దీని నిర్మాణంలో పరమాణు వలయాలు తెగినట్లుగా ఉంటాయి. (సెకో అంటే బ్రోకెన్ అని అర్థం). పైగా స్టెరాయిడ్ వంటి పదార్థాల నుంచి ఆవిర్భవించిందనే మరో అర్థం కూడా ఉంది. కాబట్టి స్వాభావిక స్టెరాయిడ్‌తో పాటూ విటమిన్ కూడా! ఫలితంగా ఇది శరీరానికి కలిగించే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఎలా తయారవుతుంది?... చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది. ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో అది ‘క్యాల్సీడియల్’ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్‌కు తొలిరూపాన్ని తీసుకుంటుంది. మళ్లీ అది రక్తప్రవాహంలో కలిసి ‘క్యాల్సీడియల్’ నుంచి క్యాల్సిట్రియల్గా మారుతుంది. ఈ క్యాల్సిట్రియాల్నే ‘విటమిన్-డి’ అనుకోవచ్చు. రక్తప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి ‘విటమిన్-డి’గా రూపొందుతుంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది. అందుకే ఈ విటమిన్ ఇంత ప్రభావపూర్వకమైన ‘సహజవ్యాధి నిరోధకారి’గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక శరీరానికి అవసరమైన పోషకం, దాంతోపాటూ శరీరం తయారు చేసుకునే ఒక హార్మోన్ లాంటిది కూడా కావడంతో రెండు రకాల భూమికలనూ పోషిస్తుంది. కనుగొన్న తీరు ఆసక్తిదాయకం... విటమిన్-డి ని కనుగొన్న తీరును కథలా చెబితే ఒక థ్రిల్లర్‌ను తలపింపజేస్తుంది. రెండు శతాబ్దాల క్రితం రికెట్స్ అనే ఎముకల వ్యాధి వ్యాప్తి విస్తృతంగా ఉండేది. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎముకలు తమ సహజ ఆకృతిని కోల్పోయి వంకరలు తిరిగిపోవడం, దొడ్డికాళ్లలా మారడం వంటివి జరిగేవి. పిల్లల్లో వచ్చిన రికెట్స్‌ను ‘ఆస్టోమలేసియా’ అనేవారు. దాదాపు నూరేళ్ల క్రితం హాలెండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఈ రికెట్స్‌కు విరుగుడుగా వైద్యులు ‘కాడ్ లివర్ ఆయిల్’ అనే నూనెను ఉపయోగించేవారు. దీన్ని కాడ్ అనే రకం చేప కాలేయం నుంచి సంగ్రహించేవారు. 1918లో ఎడ్వర్డ్ మెలాన్‌బీ అనే శాస్త్రవేత్త - కాడ్‌లివర్ ఆయిల్‌లోని కొవ్వులో కరిగే ఒక నిర్దిష్టమైన పోషకమే ఈ రికెట్స్ వ్యాధికి సమర్థమైన చికిత్సగా పని చేస్తోందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత 1924లో హెచ్. స్టీన్‌బాక్, ఆల్ఫ్రెడ్ ఫేబియన్ హెస్ అనే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో సూర్యరశ్మిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు కొన్ని జీవులను తాకినప్పుడు ఆ జీవుల్లో కొవ్వులాంటి పోషకం ఉత్పత్తి అవుతుంటుందని కనుగొన్నారు. ఆ పోషకాన్ని ‘వయొస్టెరాల్’ అని పిలిచేవారు. ఇక 1935లో దీన్ని ల్యాబ్‌లో ఐసోలేట్ చేసి, దానికి ‘క్యాల్సిఫెరాల్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత అందులో కొద్దికొద్ది నిర్మాణపరమైన మార్పులతో... అనేకరకాల విటమిన్ డి (డి1, డి2, డి3.... డి7, డి8)లను కనుగొన్నారు. విటమిన్ ‘డి’లో రకాలు... ‘విటమిన్ డి’లో విటమిన్ డి1, డి2, డి3...డి7... ఇలా చాలా రకాలు (దాదాపు పది వరకు) ఉన్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) ముఖ్యమైనవి. ఇతర సమస్యలకూ చికిత్సగా... ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికీ విటమిన్ ‘డి’ని వైద్యులు ప్రిస్క్రయిబ్ చేస్తారు. హై కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి, డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి, మల్టిపుల్ స్క్లిరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ) ఉన్నవారికి, ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులకు, మహిళల్లో ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్‌తో బాధపడేవారికి, పంటి, చిగుళ్ల వ్యాధుల నివారణకు, విటిలిగో (బొల్లి), స్క్లిరోడెర్మా, సోరియాసిస్ వంటి చర్మరోగాలు ఉన్నవారికి డాక్టర్లు విటమిన్-డిని సూచిస్తారు. సోరియాసిస్ చికిత్సలో ‘క్యాల్సిట్రియల్’ లేదా ‘క్యాల్సిపోట్రియాల్ / క్యాల్సిపోట్రిన్’ అనే రూపంలో విటమిన్-డిని పైపూతమందుగా పూస్తారు. ఇక విటమిన్-డి ఎన్నో రకాల క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. అందుకే అనేక రకాల క్యాన్సర్ల చికిత్సల్లో ‘విటమిన్-డి’ని ఒక మందులాగానే ప్రిస్క్రిప్షన్‌లో సూచిస్తారు. విటమిన్ డి లోపాన్ని నిర్ధారణ చేస్తారిలా... రక్తపరీక్ష ద్వారా విటమిన్-డి ఉండాల్సిన పరిమాణంలో ఉందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఇందుకోసం 25 (ఓహెచ్)డీ అనే పరీక్షనూ లేదా 1,25 (ఓహెచ్) డీ3 అనే పరీక్షను చేస్తారు. విటమిన్-డి ఉండాల్సిన పాళ్లు తెలుసుకునేందుకు పైన పేర్కొన్న మొదటి పరీక్ష అయిన 25 (ఓహెచ్)డీ మంచి ఫలితాలను ఇస్తుందని చాలామంది వైద్యుల అభిప్రాయం. 25 (ఓహెచ్)డీ పరీక్షనే 25-హైడ్రాక్సీక్యాల్సిఫెరాల్ లేదా 25-హైడ్రాక్సీ విటమిన్- డి అనే మాటకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఆరోగ్యవంతుడి రక్తంలో విటమిన్ డీ పాళ్లు 50-65 ఎన్జీ/ఎమ్ఎల్ ఉండాలి. దాని కంటే తక్కువగా ఉంటే విటమిన్-డి మాత్రలను డాక్టర్లు సూచిస్తారు. విటమిన్ ‘డి’ - విశేషాలు... ఎండవేళలోనే విటమిన్-డి తయారవుతుంది. పైగా చర్మాన్ని తాకాక అది కాలేయాన్ని చేరుతుంది. ఇలా విటమిన్-డి తయారీలోనూ, నిక్షిప్తం చేయడంలోనూ కాలేయం కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి... ఎండ తక్కువగా ఉండే చలికాలం నాలుగు నెలల కోసం అవసరమైన విటమిన్-డిని కాలేయం నిల్వ చేసుకుని పెట్టుకుంటుంది. క్యాల్షియమ్ సక్రమంగా ఎముకల్లోకి ఇంకి... వాటిని పటిష్టం చేసేందుకు విటమిన్-డి ఎంతో అవసరం. ఆహారంలోని క్యాల్షియమ్‌ను శరీరం తీసుకునే ప్రక్రియలో అది పేగుల్లోనే జరిగేలా విటమిన్-డి తోడ్పడుతుంది.గర్భిణులకు తగినంత విటమిన్ -డి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. వాళ్ల వికాసానికి విటమిన్-డి ఎంతగానో తోడ్పడుతుంది.జుట్టు ఒత్తుగా పెరగడం కోసం కూడా విటమిన్-డి తోడ్పడుతుంది.విటమిన్-డి లోపం ఉన్నవారు సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే వేళల్లో మాత్రం సన్‌స్క్రీన్ వాడకూడదు. సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అల్ట్రావయొలెట్ కిరణాలను చర్మంలోకి ఇంకనివ్వక లోపాన్ని పెంచుతుంది. విటమిన్-డి లోపాలతో వచ్చే సమస్యలు... విటమిన్-డి లోపాలతో వచ్చే ఆరోగ్య సమస్యల చిట్టా చాలా పెద్దదే. అందుకే ఇటీవల సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లోనూ డాక్టర్లు విటమిన్‘డి’ లోపాన్ని ఎక్కువగా కనుగొంటున్నారు. విటమిన్ ‘డి’లోపం వల్ల కనిపించే సమస్యలు... శరీరంలో ఖనిజలవణాల అసమతౌల్యత (ముఖ్యంగా జింక్, ఐరన్, ఫాస్ఫరస్ వంటివి) హార్మోన్ల అసమతౌల్యత అత్యంత వేగంతో భావోద్వేగాలు మారిపోవడం (మూడ్స్ స్వింగింగ్) మానసిక ఆరోగ్యం దెబ్బతినడం గర్భవతుల్లో పిండం ఎదుగుదలలో లోపాలు మెదడు కణాలైన న్యూరాన్లు (నరాల కనెక్షన్లలో) లోపాలు కండరాల కదలికల్లో సమన్వయలోపాలు రక్తపోటు ధమనుల్లో రక్తప్రసరణ లోపాలు చక్కెర నియంత్రణలో లోపాలు దంతసంబంధమైన సమస్యలు కణ విభజనలో లోపాలు ఎముకల బలం లోపించడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం రికెట్స్ వ్యాధి ఆస్టియోపోరోసిస్ ఆస్టియోమలేసియా ఒక్కోసారి ఫిట్స్ రావడం మొదలైనవి. విటమిన్ ‘డి’ని పొందడం ఇలా... ముఖం, చేతులు, భుజాలు, సాధ్యమైనంత వరకు శరీర భాగాలు లేత ఎండ కాంతికి ఎక్స్పోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మంచి మార్గం. దీనితో పాటూ... డాక్టర్లు అనేక రకాల విటమిన్ ‘డి’ మాత్రలను, వాటిని ఉపయోగించాల్సిన మోతాదులను సూచిస్తుంటారు. ఒకవేళ మాత్రలు సరిపడక స్వాభావిక రూపంలోనే విటమిన్-డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాలివి... చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది. ప్రధానంగా కాడ్, మాక్రెల్, సొరచేప (షార్క్), సార్డైన్, ట్యూనా వంటి చేపల కాలేయాలలో. వేటమాసం, అందులోనూ ప్రత్యేకంగా కాలేయంతో పాటు వెన్న, నెయ్యి, గుడ్డులోని పచ్చసొనలో ‘విటమిన్-డి’ ఎక్కువ. ఇటీవల చాలామంది పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదంటూ దాన్ని పరిహరిస్తున్నారు. కానీ దానిలో కొలెస్ట్రాల్‌తో పాటు క్యాలిటరాల్ అని పిలిచే విటమిన్-డి ఉంటుంది. కాబట్టి విటమిన్-డి కోసం పచ్చసొన తీసుకోవడం చాలా మంచిది. పచ్చసొనను పరిహరించడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు కంటే క్యాల్సిటరాల్ వంటి ఎన్నో పోషకాలు పోగొట్టుకునే నష్టమే ఎక్కువ. అందుకే పరిమిత స్థాయిలో పచ్చసొన తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. పుట్టగొడుగుల్లో విటమిన్-డి2 ఎక్కువగా ఉంటుంది. విటమిన్-డి లోపం ఉన్నవారు పుట్టగొడుగులతో చేసిన రకరకాల ఆహార పదార్థాలతో పాటు ఎండలో నడవటం వల్ల స్వాభావికంగానే విటమిన్-డి2 సమకూరుతుంది. ఫోర్టిఫైడ్ ఆహారాల్లో...: పాలు, జ్యూస్ వంటి కొన్ని రకాల ఆహారపదార్థాల్లో ఇతర పోషకాలతో మరింత సంతృప్తం చేస్తారు. ఇలాంటి ఆహారాలను ఫోర్టిఫైడ్ ఆహారాలుగా పేర్కొంటారు. మామూలుగా అయితే పాలలో విటమిన్-డి పాళ్లు తక్కువే. కానీ ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ సోయామిల్క్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్, ఫోర్టిఫైడ్ ఓట్మీల్, ఫోర్టిఫైడ్ సిరేల్స్ (తృణధాన్యాల) వంటి ఆహార పదార్థాల్లో విటమిన్-డి పాళ్లు ఎక్కువ. ఏయే పదార్థాలలో ఎంతెంత...? వాస్తవానికి ఆహారపదార్థాల ద్వారా లభ్యమయ్యేదాని కంటే సూర్యరశ్మికి తాకినప్పుడు చర్మం కింది పొరలో దీని ఉత్పత్తి ఎక్కువ. అయినప్పటికీ కొద్ది మోతాదుల్లో కొన్ని రకాల ఆహారపదార్థాల నుంచి అది లభిస్తుంది. అవి... ఆహార పదార్థం పరిమాణం (మైక్రోగ్రాముల్లో) కాడ్‌లివర్ ఆయిల్ 175 షార్క్ లివర్ ఆయిల్ 50 గుడ్లు (పచ్చసొనతో) 1.5 నెయ్యి 2.5 వెన్న 1.0 (ఇవన్నీ 100 గ్రాముల ఎడిబుల్ పోర్షన్లో లభించే మోతాదులు) విటమిన్ - డి కోసం డైట్‌ప్లాన్ ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా విటమిన్-డిని స్వాభావికంగానే పొందాలంటే న్యూట్రిషనిస్టులు వ్యక్తిగతంగా వారిని పరిశీలించి, డైట్ ప్లాన్ చెబుతారు. ఇక్కడ పేర్కొన్న డైట్ ప్లాన్ సగటు వ్యక్తి కోసం రూపొందించినదిగా భావించవచ్చు. ఉదయం 6.30కి: ఒక గ్లాసు విటమిన్-డితో ఫోర్టిఫై చేసిన (వాస్తవ అర్థంలో చెప్పాలంటే మరింత బలోపేతం చేసిన అని చెప్పుకో వచ్చు) లో ఫ్యాట్ (కొవ్వు తక్కువగా వున్న) పాలు. బ్రేక్‌ఫాస్ట్ 8 గం.లకు: ఒక కప్పు ఫోర్టిఫైడ్ విత్ విటమిన్ డి ఓట్మీల్ లేదా ఒకకప్పు కార్న్‌ఫ్లేక్స్ ప్లస్ ఒక ఉడికించిన గుడ్డు (పచ్చసొనతో సహా ఇందులో 42 ఐయూ విటమిన్ డి ఉంటుంది). బ్రంచ్ 11 గంటలకు: విటమిన్-డి ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ / ఆపిల్ జ్యూస్ / స్ట్రాబెర్రీ జ్యూస్ ఒక గ్లాసు. లంచ్ (ఒంటిగంటకు): రాగులు / జొన్నలు / పొట్టు తీయని ముడిబియ్యంతో ఒక పెద్ద కప్పు అన్నం ప్లస్ అంతే మోతాదులో ఆకుపచ్చని ఆకుకూరలతో చేసిన కూర ప్లస్ 100 గ్రాముల చేపల కూర (ఈ చేపలు ట్యూనా/సార్డిన్ రకానికి చెందినవైతే మంచిది) ప్లస్ ఒక కప్పు వెజ్ సలాడ్. ప్లస్ చివర్లో పెరుగు. సాయంత్రానికి కాస్త ముందు అంటే 3 గంటలప్పుడు: ఫోర్టిఫైడ్ సోయా మిల్క్.సాయంత్రం వేళ అంటే 5 గంటల ప్రాంతంలో: మొలకెత్తిన ధాన్యాలు (స్ప్రౌట్స్) ఒక కప్పు ప్లస్ చీజ్ శాండ్విచ్ / టోఫూ శాండ్విచ్. రాత్రి భోజనంలో అంటే రాత్రి 8 గంటలకు : ఫోర్టిఫైడ్ ఓట్మీల్ ఒక కప్పు ప్లస్ మష్రూమ్‌తో చేసిన కూర లేదా ఆకుపచ్చటి ఆకుకూరలతో చేసిన కూర. నిద్రకు ఉపక్రమించే ముందు 10 గంటలకు: ఒక గ్లాసెడు విటమిన్-డి ఫోర్టిఫైడ్ అండ్ లో ఫ్యాట్ పాలు. విటమిన్ డి టాక్సిసిటీ అంటే ఇంతటి ఉపయోగకరమైన విటమిన్-డి ఉండాల్సిన మోతాదు కంటే మించితే... అది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు సొంతంగా విటమిన్-డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటితే ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం సాధారణం. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని గోడలపైనా, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు (క్యాల్సిఫికేషన్) రావచ్చు. రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా... ఇతరత్రా రూపాల్లో విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. -
గోరువెచ్చని సూరీడు చాలా మంచివాడు!
ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల్లోపు కనీసం 20 నిమిషాల సేపు సూర్యకాంతిని ఆస్వాదిస్తే చాలు మీ జీవన శైలిలో ఎంతో ఉత్సాహవంతమైన మార్పులు వస్తాయని అంటున్నారు పరిశోధకులు. ఉదయం పూట ఎండతో శరీరానికి విటమిన్ డి సమకూరుతుందనే అంశం అందరికీ తెలిసిందే. అంతే కాదు.. ఉదయం పూట గోరవెచ్చని ఎండ రాత్రి వరకూ శరీరంపై ప్రభావం చూపగలదట. ప్రధానంగా ఉత్సాహాన్ని ప్రసాదిస్తాయట సూర్యకిరణాలు. శారీరకంగా యాక్టివ్ గా ఉండటంతో పాటు ఆకలి కొంచెం పెరగడం, శారీరక జీవ క్రియలు క్రమబద్ధం కావడం జరుగుతుందట. అమెరికాకు చెందిన నార్త్ వెస్ట్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం వారు ఈ విషయాలను వివరించారు. నడవండి.. కాన్సర్ బారికి దూరంగా! రోజులో రెండు గంటలసేపు అదనంగా కూర్చోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 10 శాతం పెరుగుతాయి. పెద్దప్రేవులకు క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు 8 శాతం పెరుగుతుంది, ఊపిరితిత్తులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఆరు శాతం పెరుగుతాయి... నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. మామూలుగా వ్యాయామం చేస్తూ కూడా అదనంగా కూర్చొవడం వల్ల ఈ ప్రమాదాలు తప్పవట. అందుకే వీలైనంత ఎక్కువగా నడవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.