Supreme Court
-
అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట
మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటులతో పాటు దర్శకులు కూడా నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌తో అక్కడి నటీమణులు చాలామంది గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.2016లో నటిపై అత్యాచారంమలయాళ నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఫేస్బుక్ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు రేవతి తెలిపింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫిర్యాదుకు ఎనిమిదేళ్లు ఎందుకు: కోర్టుసిద్ధిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరును జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే, ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు. హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు. -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
Brazil: సుప్రీంకోర్టు వద్ద పేలుడు.. ఒకరు మృతి
బ్రసీలియా: బ్రెజిల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు సార్లు పేలుడు సంభవించగా ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సిబ్బంది కోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించారు. పేలుడు కారణంగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు సంభవించింది. కోర్టు ప్రాంగణంలో రెండుసార్లు పేలుడు జరగడంతో ఒకరు మృతి చెందారు. దీంతో, అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు.. సుప్రీంకోర్టు లోపల ఉన్న జడ్జీలు, ఇతర సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. అనంతరం, కోర్టు సమయం ముగిసిన వెంటనే భారీ స్థాయిలో పేలుళ్లు జరిగాయని అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల ఘటనలో చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే, పేలుడు సంభవించిన ప్రాంతానికి దగ్గరలోనే ప్రెసిడెంట్ లూలా డెసిల్వా భవనం కూడా ఉంది. పేలుడు జరిగిన సమయంలో ప్రెసిడెంట్ భవనంలో లేరని అధికారులు వెల్లడించారు.🚨🇧🇷 EXPLOSIONS ROCK BRAZIL’S SUPREME COURT, 1 DEADTwo blasts near Brazil's Supreme Court left one dead. Justices safely evacuated as police secure the area. Investigations are ongoing.pic.twitter.com/g6CRmcL6CT— Mario Nawfal (@MarioNawfal) November 13, 2024 -
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్‌స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్‌డ్రైవ్‌ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్‌డ్రైవ్‌లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్‌డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్‌కుమార్‌ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్‌డ్రైవ్‌లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన డేటాను అరుణ్‌కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్‌కుమార్‌కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
ఈడీ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
-
నిజాయితీగా వాస్తవాలు చెప్పండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్‌డ్రైవ్‌లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్‌ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టుచట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్‌డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్‌డ్రైవ్‌ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్‌కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు. చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.‘సన్‌లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్ -
కూల్చివేత బాధితులు కోర్టుకు రావొచ్చు
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసినా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ అధికారులు దీన్ని ఉల్లంఘించారని, ఈ మూడు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. పిటిషనర్‌కు కూల్చివేత బాధితుడు కాదని, ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటితో ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం పేర్కొంది. తేనెతుట్టను కదల్చాలని తాము అనుకోవడం లేదని, కూల్చివేత బాధితులు ఎవరైనా ఉంటే కోర్టుకు రావొచ్చని స్పష్టం చేసింది. నిందితులు అయినంత మాత్రాన వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూల్చవద్దని సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తెలిపింది. దీనిపై తాముదేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు జారీచేస్తామని చెప్పింది. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే.. అది గుడి అయినా, మసీదు అయినా కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేత చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాన్పూర్, హరిద్వార్, జైపూర్లలో అధికారులు కూల్చివేతలకు దిగారని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఒకచోట అయితే ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కూల్చివేతకు పాల్పడ్డారని తెలిపారు. ఫుట్‌పాత్ ఆక్రమణనను మాత్రమే తొలగించారని, పిటిషనర్‌కు నేరుగా దీనితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు వాస్తవాలు తెలియవని ఉత్తరప్రదేశ్ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషనర్ సుప్రీంకోర్టుకు వచ్చారని అన్నారు. ఈ కూల్చివేతలతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి... పిటిషన్‌ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పైన పేర్కొన్న మూడు ఘటనల్లో ఇద్దరు జైళ్లో ఉన్నారని పిటిషనర్ తెలుపగా.. వారి కుటుంబీకులు కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం బదులిచి్చంది. -
ఆయన చేసిన నేరం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపిస్తూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావులు గత మార్చి 23న అరెస్టు అయ్యారని చెప్పారు. తిరుపతన్న 211 రోజులుగా జైల్లోనే ఉన్నారని తెలిపారు. చార్జ్ïÙట్ను దాఖలు చేశారని, ఇది దాఖలు చేసి కూడా మూడు నెలలవుతోందని వివరించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులను ఆశ్రయించగా... బెయిల్ పిటిషన్లను కొట్టివేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని... 211 రోజులుగా నిందితుడు జైల్లో ఎందుకున్నారని, ఆయన చేసిన నేరం ఏంటని న్యాయవాదిని ప్రశ్నించింది. ఇందుకు మోహిత్ రావు సమాధానమిస్తూ.... ‘ఎస్ఐబీ వింగ్ అనేది నా కంట్రోల్లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రొఫైల్ తయారు చేయడం, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం అధికారిగా నా విధి’అని తెలిపారు. రాష్ట్ర శాంతిభద్రతలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారని, చట్టవిరుద్ధంగా చేయలేదని విన్నవించారు. ఈ వాదనలపై మరోసారి న్యాయస్థానం జోక్యం చేసుకొని... ‘‘ఇందులో నేరం ఏంటో మాకు అర్థం కావడం లేదు’అని అభిప్రాయపడింది. అయితే ప్రభుత్వ వాదనలు సైతం వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనంతరం కౌంటర్ దాఖలుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. -
సీఎం యోగి ‘ఆపరేషన్ బుల్డోజర్’పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
మోదీ డిగ్రీపై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆయన చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.కాగా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలను వెల్లడించాలని 2016లో తొలిసారి కేజ్రీవాల్ డిమాండ్ చేయడంతో.. ఈ వివాదం ప్రారంభమైంది. అయితే కేజ్రీవాల్ డిమాండ్‌కు ప్రతి స్పందనగా సమాచార హక్కు చట్టం కింద అందించాలంటూ ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశించింది. అయితే గుజరాత్ హైకోర్టు సీఐసీ ఉత్తర్వును కొట్టివేసింది. సమాచారాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంది.అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ బహిరంగంగా, విలేకరుల సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ యూనివర్సిటీ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. మోదీ విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందడంపై ప్రశ్నిస్తూ.. చేసిన వ్యాఖ్యలను గుజరాత్ యూనివర్సిటీ అవమానకరమైనవిగా, తమ పరువు ప్రతిష్టకు భంగం కలించేవిగా భావించింది.ఈ నేపథ్యంలో యూనివర్సిటీ రిజిష్ట్రర్ పీయూష్ పటేల్ కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేత సంజయ్ సింగ్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్, ఆప్‌కి చెందిన సంజయ్ సింగ్‌లకు గుజరాత్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కొట్టి వేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, జస్టిస్ హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. -
గ్రూప్ 1 పరీక్షకు లైన్ క్లియర్
-
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
ఇకపై సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం
-
హీరా గోల్డ్ MD నౌహీరా షేక్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం
-
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా సంజీవ్ కన్నా పేరు సిఫార్సు
-
వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్‌ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఇంటిపేర్లు, అడ్రస్‌లు లేకుండానే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్‌గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్‌లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్‌లు చూపించారు.చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్‌కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్‌కుమార్ పేరు కాజ్‌లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్‌ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది. -
కళ్లారా చూస్తూ సమన్యాయం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు. సీజేఏ డీవై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు. -
ఉచిత హామీలపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
ఎస్సీ వర్గీకరణ: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, సాక్షి: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక.. 24గంటల్లో కమిషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని, కమిషన్ రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటీఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచనలు చేశారు. -
మరణశిక్షను ఆపిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పధ్నాలుగు సంవత్సరాల క్రితంనాటి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మారే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దోషికి హైకోర్టు విధించిన మరణశిక్షను నిలుపుదలచేసింది. 2010లో ఏడేళ్ల పిల్లాడిని కిడ్నాప్‌చేసి చంపిన కేసులో సుఖ్జీందర్ సింగ్‌కు పంజాబ్, హరియాణా హైకోర్టు ఈఏడాది ఆగస్ట్‌లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ దోషి తరఫున లాయర్ హర్వీందర్ సింగ్ మాన్ సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాల ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించిన శిక్ష తగ్గింపు నివేదికను బెంచ్ పరీశీలించింది. హత్య జరిగిన కాలంలో 23ఏళ్ల వయసులో నిందితుడు విపరీతమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రిపోర్ట్‌లో ఉంది. ‘ఎంతో మారిపోయిన ఇతను ఇకపై సమాజానికి ఏరకంగానూ హానికరం కాదు. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇతనిలో సత్ప్రవర్తన వచ్చింది. ఏకంగా మరణశిక్ష విధించేముందు హైకోర్టు ఇతని మానసిక స్థితిపై తుది అవగాహనకు రాలేదు. రిహాబిటేషన్ సెంటర్‌కు పంపే అవకాశం ఇవ్వలేదు’ అని నివేదిక పేర్కొంది. ‘కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడిని చంపాడు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కిడ్నాపర్‌కు పిల్లాడి తండ్రి డబ్బిచ్చినా చంపాడని హైకోర్టు మరణశిక్ష వేసింది’ అని నివేదిక వివరించింది. దీంతో కేసు విచారణను 16 వారాలు వాయిదావేసిన సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రొబేషన్ అధికారి నివేదిక ఇచ్చేలా చూడాలని పంజాబ్ సర్కార్‌ను ఆదేశించింది. అమృత్సర్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా గడిపిన సమయంలో ఇతని మానసిక పరిస్థితి, తోటి ఖైదీలతో ప్రవర్తన గురించి నివేదించాలని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దోషి మానసిక స్థితిని టెస్ట్‌లు చేసి ధృవీకరించాలని చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ను కోర్టు కోరింది.