swimmer
-
80 ఏళ్ల స్విమ్మర్! ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయం..కానీ..!
ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు. అదే నిరూపించింది 80 ఏళ్ల బామ్మ. లేటు వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని ఎన్నో పతకాలు సాధించింది. అతేగాదు నృత్యకారిణిగా కూడా రంగ ప్రవేశం చేసి ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్ధురాలిగా పేరు తెచ్చుకుంది. జీవితంలో కష్టాలు మాములే వాటిని పక్కన పెట్టి మంచిగా ఆస్వాదించడం తెలిస్తే హాయిగా జీవించొచ్చు అంటోంది ఈ బామ్మ. ఎవరీమె? రెస్ట్ తీసుకునే వయసులో మెరుపుతీగలా పతకాలు సాధిస్తూ.. దూసుకుపోతున్న ఆమె నేపథ్యం ఏంటంటే..గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల బకులాబెన్ పటేల్ అనే బామ్మకి ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయమట. కానీ ఇప్పుడు గజ ఈతగాడి మాదిరి అలవోకగా ఈత కొట్టేస్తోంది. 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించిందట. మొదట్లో విభిన్న అథ్లెటిక్ క్రీడలు ప్రయత్నిస్తూ..చివరికి ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు, సర్టిఫికేట్లు సాధించింది. ఈ పోటీల నేపథ్యంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఆస్ట్రేలియా వంటి 12 దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతేగాదు ఆ బామ్మ పేరు మీదుగా ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, దాదాపు 500కి పైగా సరిఫికేట్లు ఉన్నాయి. అంతేగాదు 400 మందికి పైగా స్విమ్మర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. అలాగే ప్రపంచంలో అత్యంత సవాలుతో కూడిన సముద్రాలు, నదులను కూడా ఈదేసింది. అత్యంత కష్టమైన కెనడియన్ సముద్రంలో కూడా అలవోకగా రెండుసార్లు స్విమ్ చేసింది. అంతేగాదు ఏదో ఒక రోజు ఇంగ్లిష్ ఛానెల్‌ను కూడా జయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాలని భావిస్తోంది బకులాబెన్. దీంతోపాటు ఏడు పదుల వయసులో భరతనాట్య నృత్యకారిణిగా రంగప్రవేశం చేసింది. పైగా ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్దురాలిగా నిలవడమే గాక ఉత్తమ నృత్యకారిణిగా ప్రశంసలందుకుంది. ఇక బకులాబెన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13వ ఏటనే వివాహం చేసుకుని ఇద్దర పిల్లలకు తల్లి అయ్యింది. అయితే కొంతకాలనికే భర్త మరణించడంతో ఒంటిరిగా పిల్లలను పోషించుకుంటూ బతికింది. వాళ్లు పెద్దవాళ్లై మంచి పొజిషన్లో సెటిల్ అవ్వడంతో మళ్లీ ఆమె జీవితం శూన్యంతో నిశబ్దంగా ఉండిపోయింది. దీన్నుంచి బయటపడేలా ఆమె తన దృష్టిని క్రీడలవైపుకి మళ్లించింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించింది. తాను ఏ రోజుకైనా దేశం గర్వపడేలా విజయం సాధించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనేది ప్రగాఢమైన కోరికట ఆమెకు. (చదవండి: ఫ్యాషన్ బ్లాగ్‌తో ..ఏకంగా రూ. 40 కోట్లు..!) -
వృత్తి అగర్వాల్‌కు స్వర్ణం
మంగళూరు: జాతీయ సీనియర్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ రెండో పతకాన్ని సాధించింది. పోటీల రెండో రోజు బుధవారం హైదరాబాద్‌కు చెందిన వృత్తి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచింది. వృత్తి 1500 మీటర్లను అందరికంటే వేగంగా 17 నిమిషాల 45.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో వృత్తి రజత పతకం గెల్చుకుంది. -
‘ఈత’కు చేతులు కావాలా!.. స్వర్ణాల వీరుడు
పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనే వారంతా వివిధ రకాల వైకల్యాలతో ఇబ్బంది పడేవారే. నిబంధనలకు అనుగుణంగా దాదాపు తమలాంటి శారీరక లోపాలతో ఉన్న వ్యక్తులతోనే వారంతా పోటీ పడటం కూడా వాస్తవమే. అయినా సరే కొందరు ఆటగాళ్ల శారీరక లోపాలు అయ్యో అనిపిస్తాయి. మరికొందరి పోరాటం కన్నీళ్లు తెప్పిస్తుంది. అలాంటి జాబితాలో ఉండే ప్లేయర్ గాబ్రియెల్ డాస్ సాంతోస్ అరాజో.డాల్ఫిన్ తరహాలో దూసుకుపోతాడుబ్రెజిల్కు చెందిన ఈ స్విమ్మర్ ఈత కొలనులో దూసుకుపోతున్న తీరు చూస్తే ఎలాంటి వైకల్యమైనా తలవంచి అభివాదం చేస్తుంది. పుట్టుకతోనే ‘ఫోకోమెలియా’ అనే వ్యాధి బారిన పడటంతో గాబ్రియెల్ రెండు చేతులూ పూర్తిగా కోల్పోయాడు. కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. ఇలాంటి స్థితిలోనూ అతను స్విమ్మింగ్‌పై ఆసక్తి చూపించి కొలనులోకి దిగాడు. మిగిలిన శరీరాన్ని మాత్రమే కదిలిస్తూ డాల్ఫిన్ తరహాలో ఈతలో దూసుకుపోయే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తీవ్ర సాధనతో పారాలింపిక్ స్విమ్మర్‌గా ఎదిగాడు. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల గాబ్రియెల్ బ్రెజిల్ దేశానికి తొలి పతకాన్ని అందించాడు. ఎస్2 కేటగిరీ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దూసుకుపోయిన అతను స్వర్ణం గెలుచుకున్నాడు. స్వర్ణాల వీరుడుఅంతేకాదు.. 1 నిమిషం 53.67 సెకన్లలోనే అతను దీనిని పూర్తి చేయడం విశేషం. గత టోక్యో ఒలింపిక్స్‌లో కూడా రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన ఘనత గాబ్రియెల్ అతని సొంతం. విజయం సాధించిన తర్వాత తమ దేశ సాంప్రదాయ ‘సాంబా’ నృత్యాన్ని అతను ప్రదర్శించిన తీరు గాబ్రియెల్ ఘనతకు మరింత ప్రత్యేకతను తెచ్చింది. View this post on Instagram A post shared by Paralympics (@paralympics) -
కేటీ... 13 పతకాలతో మేటి
పారిస్: అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్ వీన్‌స్టెన్, పెయిజ్ మాడెన్, ఎరిన్ గిమెల్లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది. -
ఆమె స్థైర్యం ముందు.. విధే చిన్నబోయింది..!
బాల్యమంతా ఆస్తమాతో పోరాడింది. ఆ వ్యాధి చికిత్సలో భాగంగా నేర్చుకున్న స్విమ్మింగ్‌నే కెరీర్‌గా మార్చుకుని అథ్లెటిక్ స్థాయికి చేరి.. ఒలింపిక్‌లో బంగారు పతకాలు సాధించింది. ఇలా ఆమె ఏకంగా ఆరుసార్లు పతకాలను గెలుచుకోవడం విశేషం. శరీరానికే వైద్యపరమైన సమస్య కానీ మనసుకు కాదని నిరూపించింది. హాయిగా జీవితం సాగుతుంది అనుకునేలోపు ఊహించిన ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులుగా చేసింది. అయినా తగ్గేదేలా అంటూ దూసుకుపోతూ తనలాంటి చిన్నారులను ఛాంపియన్లగా మారేలా స్థైర్యం నింపుతూ ఆదర్శంగా నిలిచింది.ఆమెనే అమీ వాన్ డైకెన్. స్విమ్మింగ్ ఎక్సలెన్స్‌కు పర్యాయపదంగా ఆమె. అమీ బాల్యం అంతా ఆస్తమాతో పోరాడింది. అందుకోసం తీసుకున్న చికిత్సలో భాగంగా ఈత నేర్చుకునేది. చెప్పాలంటే ఈత ద్వారా ఉపశమనం పొందేది. అదే ఆమెకు భవిష్యత్తులో కెరీర్‌గా మారి ఉన్నత శిఖరాలు చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆమె వైద్యుడు చికిత్సలో భాగంగా సూచించిన స్విమ్మింగ్ తన సమస్యను నివారించడమే కాకుండా అదే ఆమెను స్విమ్మింగ్ ఛాంపియన్‌గా అవతరించేలా చేసింది. 1996లో అట్లాంటా ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్న తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ సమయంలో, మరో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. ఇలా ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు బంగారు పతకాలను దక్కించుకున్న అథ్లెట్‌గా నిలిచింది. ఇక వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికీ..మాజీ-అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు టామ్ రూయెన్‌ను వివాహం చేసుకుంది . ఇక స్విమ్మింగ్ నుంచి రిటైర్ అయ్యి, యాంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలా అమె టీవీ, రేడియో ప్రెజెంటర్‌గా మారింది. ఐతే జూన్ 6, 2014న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కి పరిమితమైపోయింది. అయినా కూడా తగ్గేదే లే..! అంటూ తనలా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ఒలింపిక్ ఛాంపియన్లలా రాణించేలా స్ఫూర్తిని నింపుతోంది. ఆమె గాథ జీవితంలో విధి కష్టాల రూపంలో మన గమనానికి బ్రేక్పడేలా చేస్తే.. ఆగిపోకుండా దాన్నే ఆయుధంగా చేసుకుని బతకాలన్న గొప్ప సందేశాన్ని ఇస్తోంది కదూ..!(చదవండి: ఈ కిచెన్వేర్స్ని నిమ్మకాయతో అస్సలు క్లీన్ చేయకూడదు !) -
ఒలింపిక్స్‌లో 14 ఏళ్ల చేపపిల్ల
1952లో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తరఫున 11 ఏళ్ల ఆర్తి సాహా పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్ల తర్వాత బెంగళూరు స్విమ్మర్ ధీనిధి దేశింఘు పారిస్ ఒలింపిక్స్‌లో ఈత పోటీలో పాల్గొనే అవకాశంపొందింది. 9వ తరగతి చదువుతున్న «ధీనిధి ఈతలో దేశీయ రికార్డులు సొంతం చేసుకుంది. కాని పారిస్ కల కోసం ఆమె చేసిన కృషి ఎట్టకేలకు ఆమె కోరుకున్నది సాధించి పెట్టింది‘నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు క్లాసులో చాలా బిడియంగా ఉండేదాన్ని. చురుగ్గా లేనని మా అమ్మానాన్నలు ఈతలో చేర్పించారు. ముందు ఈతకు భయపడ్డాను. తర్వాత స్విమింగ్ పూల్ నా ఫ్రెండ్ అయ్యింది. ఆ తర్వాత ఈత నా ΄్యాషన్ అయ్యింది’ అంటుంది 14 ఏళ్ల «ధీనిధి దెశింఘు. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి మరికొద్ది రోజుల్లో పారిస్‌లో మొదలు కానున్న ఒలింపిక్స్‌లో మన దేశ ప్రతినిధిగా పాల్గొననుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇంత చిన్న వయసు అమ్మాయి మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొననుండటం ఒక విశేషం. 1952 ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల బాలిక ఆర్తి సాహా మన దేశం నుంచి పాల్గొంది.యూనివర్సాలిటీ కోటాఈసారి మన దేశం నుంచి ఎవరూ ఒలింపిక్స్‌లో ఈత పోటీలకు నేరుగా అర్హతపొందలేదు. ‘ఒలింపిక్ సెలక్షన్ టైమ్’ ప్రదర్శించి ‘ఇంటర్నేషనల్ స్విమింగ్ ఫెడరేషన్’ ద్వారా అయినా ఆహ్వానాన్నిపొందలేదు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ వారు ఆయా దేశాలకు ‘యూనివర్సాలిటీ ప్లేసెస్’ కింద ఇద్దరిని పంపమని అనుమతి ఇస్తారు. జాతీయంగా ఉత్తమ ప్రతిభ ఉన్న ఇద్దరిని అలా పంపవచ్చు. ఈ ‘కోటా’ను ఉపయోగించుకుని మన దేశం ఉంచి పురుషుల ఈత కోసం శ్రీహరి నటరాజ్‌ను, స్త్రీల ఈత కోసం «ధీనిధిని ఎంపిక చేసి పంపుతున్నారు. ఒలింపిక్స్ కమిటీ వీరు పాల్గొనడాన్ని అనుమతించింది. యూనివర్సాలిటీ ప్లేసెస్ కింద «ధీనిధి ఎంపిక సాగినా అంత చిన్న వయసులో ఆ అవకాశంపొందడం కూడా ఘనతే.స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్బెంగళూరుకు చెందిన «ధీనిధి అక్కడి డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ఈత కోసం చేరినప్పుడు పూల్‌లో చేపపిల్లలా ఈదుతున్న ఆ అమ్మాయిని చూసి కోచ్ మధుకుమార్ ఈ పిట్ట కొంచెం కూత ఘనం అని కనిపెట్టాడు. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. స్ట్రయిట్ ఆర్మ్ టెక్నిక్‌తో ఈత కొట్టే కొద్దిమంది భారతీయ స్విమ్మర్లలో «ధీనిధి నిలిచింది.12 ఏట నుంచే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ‘నా కంటే వయసులో రెండింతలు ఎక్కువ ఉన్నవారు నా పక్కన ఉంటే భయం వేసేది. కాని పూల్‌లో దిగాక ఈత మీదే నా దృష్టి’ అంటుంది «ధీనిధి. గోవాలో జరిగిన 2023 నేషనల్ గేమ్స్‌లో ఈతలో కర్నాటక 7 స్వర్ణాలు సాధించడంలో ధినిధి కీలకంగా నిలిచింది. అదే డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో ద్రోణాచార్య అవార్డీ నిహార్ అమీన్ శిక్షణ మొదలయ్యాక 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో ఆమె మరింత ప్రతిభ కనబరిచి 02:04–24 సెకన్ల రికార్డు సొంతం చేసుకుంది.కఠోర శ్రమ‘ఈ అవకాశం నాకు ఊరికే రాలేదు. ఫ్రెండ్స్, సినిమా, ఫోన్, వేరే ఆటలు అన్నీ పక్కనపెట్టి రోజుకు ఆరు గంటలు సాధన చేశాను. ఇందులో జిమ్ ఉంటుంది, ఈత కూడా ఉంటుంది. అప్పుడప్పుడు బాగా ఒంటరిగా అనిపించేది. కాని ఒలింపిక్స్‌లో పాల్గొనే నా కల కోసం ముందుకు సాగేదాన్ని. ఒలింపిక్స్‌లో 7సార్లు గోల్డ్ సాధించిన లెజెండ్ స్విమ్మర్ కేటీ లెడెకి నాకు స్ఫూర్తి. ఆమెను పారిస్ ఒలింపిక్స్‌లో కలవబోతున్నానన్న ఊహే నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. ఆమె కోసం కొన్ని కానుకలు కూడా తీసుకెళుతున్నాను’ అంది ధీనిధి. పారిస్ ఒలింపిక్స్‌లో «ధీనిధి ఏ మెడల్ సాధించినా ఆమెపొందబోయే ప్రశంసలు ఒక సముద్రాన్నే తలపించకమానవు. వాటిని ఈదుకుంటూ ఆమె మరింత ముందుకు పోవాల్సి ఉంటుంది. -
వృత్తి అగర్వాల్‌కు ఐదో పతకం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రీడల్లో శుక్రవారం ఆమె ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. గుజరాత్లో జరిగిన గత జాతీయ క్రీడల్లో వృత్తి మూడు రజతాలు, ఒక కాంస్యంతో నాలుగు పతకాలు సాధించింది. ఈసారి ఆమె మూడు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఫైనల్లో రష్మిక–శివాని జోడీ జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ ఈవెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రష్మిక –శివాని ద్వయం 6–4, 6–7 (5/7), 10–5తో షర్మదా బాలూ–సోహా సాదిక్ (కర్ణాటక) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జనానికి స్పృహ పెరిగింది. పిల్లలు తినే ఆహారం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఓ స్విమ్మింగ్ చాంపియన్ ఓ కంపెనీ పెట్టి పిల్లలకు మంచి ఆహారం అందిస్తోంది... మంచి లాభాలూ ఆర్జిస్తోంది. ఇదీ చదవండి: Pepsi New Logo: పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత... కూతురు కోసం చేసిన ప్రయత్నం.. పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపైనే ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి. ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్‌కు నాయకత్వం వహించారు. స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? స్విమ్మింగ్‌లో చాంపియన్ మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె 400 బంగారు పతకాలను గెలుచుకుంది. మేఘన ఎనిమిదేళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. మేఘన విద్యాభ్యాసం మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు -
ఇంగ్లిష్ జల సంధిని ఈదిన ఆంధ్ర హెడ్ కానిస్టేబుల్!
విజయవాడ: స్విమ్మింగ్ మౌంట్ ఎవరెస్ట్‌గా ప్రసిద్ధికెక్కిక ప్రఖ్యాత ఇంగ్లిష్ జలసంధిని అంతర్జాతీయ స్విమ్మర్ తులసీచైతన్య సునాయాసంగా ఈదాడు. ఇంగ్లండ్‌లోని డోవర్ తీరం నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్ తీరం వరకూ ఈ జలసంధి ఉంది. అక్కడి ఆర్గనైజర్లకు రూ.4 లక్షలు చెల్లించి ఆయా దేశాల అనుమతులు తీసుకుని ఈ నెల 27న 33.79 కిలోమీటర్ల పొడవున్న జలసంధిని 15 గంటల 18 నిమిషాల్లో ఈదాడు. స్విమ్మర్ తులసీచైతన్య విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గతంలో పాక్ జలసంధి(భారత్–శ్రీలంక), జీబ్రా జలసంధి(తరిఫా–మెహారో), బోడెన్సీ జలసంధి(జర్మనీ–స్విట్జర్లాండ్)లను ఈదిన రికార్డులున్నాయి. ఇంగ్లండ్ తీరంలో ఉన్న మరో రెండు జల సంధులను ఈదేందుకు తులసీచైతన్య సిద్ధమవుతున్నాడు. మైనస్ డిగ్రీల చలి, షార్క్‌లు, జెల్లీ ఫిష్‌లు కలిగిన ఇంగ్లిష్ జలసంధిని సాహసోపేతంగా ఈదిన తులసీచైతన్యను కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ అభినందించారు. ఇదీ చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు
అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో జరిగింది. 25 ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత అనితా సొమ్మసిల్లీ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్‌ను రక్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ అనితా అల్వరేజ్ పోటీల్లో పాల్గొంటూనే సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని పేర్కొంది. Rapid rescue.@AFP photographers Oli Scarff and Peter Kohalmi capture the dramatic rescue of USA's Anita Alvarez from the bottom of the pool when she fainted during the women's solo free artistic swimming finals at the Budapest 2022 World Aquatics Championships pic.twitter.com/8Y0wo6lSUn — AFP News Agency (@AFP) June 23, 2022 చదవండి: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
స్విమ్మర్ షేక్ ఖాజా మొహిద్దీన్ విజయగాథ
బతుకుబాటలో కష్టాలకు ఎదురు ఈదుతూనే అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువకుడు. 12 ఏళ్ల వయసులో సరదాగా ప్రారంభించిన ఈతలో అసమాన ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. అందరిచేత శభాష్ షేక్ ఖాజా మొహిద్దీన్ అనింపించుకుంటున్నాడు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): అది 2003. కాకుమాను మండలం చినలింగాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా షేక్ ఖాజా మొహిద్దీన్ దగ్గరలోని లక్ష్మీపురం బకింగ్‌హామ్ కాలువలో సరదాగా స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ ఈత కొట్టేవాడు. మిగతా వారి కంటే వేగంగా ఈదడం గమనించిన పీఈటీ మనోహర్ మొహిద్దీన్ను ప్రోత్సహించారు. నిత్యం సాధన చేస్తే అంతర్జాతీయ స్విమ్మర్వి అవుతావని వెన్నుతట్టారు. ఆ మాట మొహిద్దీన్ మదిలో బలంగా నాటుకుపోయింది. అంతే అప్పటి నుంచి ఇంకా అతను ఈతను ఆపలేదు. కష్టాలను అధిగమించి ఖాజా స్వస్థలం కాకుమాను మండలం చందోలు. ప్రస్తుతం గుంటూరులోనే స్థిరపడ్డాడు. తండ్రి చిరుద్యోగి. అతి సామాన్య కుటుంబం. నిత్యం ఈత సాధనతో మంచి ప్రావీణ్యం సాధించిన ఖాజా అనేక పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ తరుణంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీదపడడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా వెనుకడుగు వేయలేదు. నిత్య సాధనతో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. విద్యావంతురాలైన భార్య సహకారంతో ముందుకు సాగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఈత శిక్షకుడిగా మారినా ఆశించిన జీతభత్యాలు లేవు. కరోనా కష్టకాలంలో దాదాపు రెండేళ్లు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూసేశారు. ఈ సమయంలో ఖాజా మంచితనం, స్నేహితుల అండదండలు అతడిని ముందుకు నడిపించాయి. ప్రస్తుతం ఖాజా జీఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దీంతోపాటు గుంటూరులో ప్రముఖులకు శిక్షకుడిగానూ మారారు. ఎందరి నుంచో అభినందనలు పొందారు. మొహిద్దీన్ సాధించిన విజయాలు ► అంతర్జాతీయంగా : 2018లో ఖజికిస్తాన్లో జరిగిన ఇండో– ఖజక్ మాస్టర్స్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు. ఒక రజతం. ► అదే ఏడాది మలేషియాలో జరిగిన ఫస్ట్ ఏషియన్ పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్యం. ► 2019లో టర్కీలో జరిగిన టర్కీ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వింటర్ పోటీల్లో ఐదు రజతాలు, రెండు కాంస్యాలు. ► 2020లో దుబాయ్‌లో జరిగిన 3వ ఇంటర్నేషనల్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు. ► 2022 గత నెల చివరిలో గోవాలో జరిగిన 4 కిలోమీటర్ల సీ స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ స్థానం. ► ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10 బంగారు, ఆరు రజతాలు, ఏడు కాంస్యాలు. ► జాయతీ స్థాయిలో 10 బంగారు, 11 రజతాలు, ఏడు కాంస్యాలతోపాటు రాష్ట్ర స్థాయిలో 50కిపైగా పతకాలు. చివరి శ్వాస వరకూ.. మా మాస్టారు వల్ల నేను స్విమ్మర్ అయ్యాను. అనూహ్య విజయాలు సాధించాను. దీనికి నా కుటుబంతోపాటు ఎంతోమంది సహాయసహకారాలు కారణం. ఈత కొలను ఎన్నో జీవిత సత్యాలు నేర్పింది. ఈత మధ్యలో ఆపితే ప్రాణం ఎలా ఆగిపోతుందో.. జీవితంలో పోరాటం ఆపినా అది ముగిసిపోతుంది. అందుకే నా చివరి శ్వాస వరకు ఈత కొలనే నా జీవితం. ఇప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మనవి. – ఖాజా మొహిద్దీన్, అంతర్జాతీయ స్విమ్మర్ -
Khelo India University Games 2021: స్విమ్మర్ అభిలాష్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరఫున పాల్గొన్నాడు. -
యువ స్విమ్మర్ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి
Former Swimming Champion Amartya Chakraborty Passed Away: మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో మృతి చెందాడు. గత కొంతకాలంగా వెన్నెముక, మెదడు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమర్త్య.. బుధవారం ఉదయం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కావడంతో కన్నుమూశాడు. భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేవని అమర్త్య తండ్రి అమితోష్ చక్రవర్తి కన్నీరుమున్నీరవడం అందరినీ కలచి వేసింది. కొడుకుని బతికించుకునేందుకు ఉన్నందంతా ఖర్చుచేయడమే కాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయానని అమితోష్ వాపోయాడు. ఆర్ధిక సాయం కోసం కేంద్ర క్రీడా శాఖకు, భారత పారాలింపిక్ కమిటీకి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అమర్త్య చక్రవర్తి అనారోగ్యం కారణంగా ఐదేళ్ల కిందట పారా స్విమ్మింగ్ ఈవెంట్స్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయాడు. అమర్త్య 2017 పారా నేషనల్స్‌లో ఉత్తమ స్విమ్మర్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: బోణీ విజయం కోసం ముంబై.. రెండో విజయంపై కన్నేసిన చెన్నై -
శభాష్.. శ్యామల! సముద్రంపై సాహ'షి'
కలలో కూడా అలలపై ఈదాలనే ఆలోచనే రాలేదు. సప్త సముద్రాలు పేర్లు విన్నప్పుడూ.. వాటిపై తన పేరున రికార్డులు సృష్టిస్తానని అనుకోలేదు. కానీ.. సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్న ఆమె ప్రపంచంలోని సముద్రాలను సైతం అలవోకగా ఈదేస్తున్నారు. అది కూడా 47 ఏళ్ల వయసులో. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఎదురొడ్డుతూ.. కారు చీకట్లలో సైతం నడి సంద్రాన్ని వెనక్కి నెట్టేస్తూ అంతర్జాతీయ స్విమ్మర్లను సైతం అబ్బుర పరుస్తున్నారు స్విమ్మర్ గోలి శ్యామల. సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సామర్లకోట గోలి శ్యామల స్వస్థలం. తండ్రి సాధారణ రైతు. చిన్నప్పటి నుంచి శ్యామలను చదువు వైపే ప్రోత్సహించారు. ఎంఏ సోషియాలజీ చేసిన ఆమె వివాహానంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కళలపై ఆసక్తితో యానిమేషన్ నేర్చుకుని.. ఒక సంస్థను కూడా స్థాపించారు. ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఆ సంస్థను మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా డిప్రెషన్లోకి వెళ్లిన శ్యామల దానినుంచి బయటపడేందుకు సరదాగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు. తన స్విమ్మింగ్ శిక్షణ వృథా కాకూడదనే ఆలోచన ఆమెను శ్రీలంక–భారత్ మధ్య గల పాక్ జలసంధిని అధిగమించేలా చేసింది. గతేడాది మార్చిలో 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని 13.47 గంటల్లో పూర్తి చేసిన ప్రపంచంలోనే రెండవ, తొలి తెలుగు మహిళగా రికార్డు నెలకొల్పారు. అంతకు ముందు భారత దేశానికి చెందిన ప్రముఖ స్విమ్మర్ అర్జున, పద్మశ్రీ అవార్డు గ్రహీత బులా చౌదురి 2004లో 35 ఏళ్ల వయసులో 14 గంటల్లో ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. కఠినమైన ‘కాటాలినా’లోనూ విజయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సెవన్ ఓపెన్ ఓషన్ వాటర్ స్విమ్లలో (సప్త సముద్రాల్లో ఈత అని కూడా అంటారు) ఒకటిగా పిలిచే కాటాలినా చానల్‌ను గత ఏడాది సెప్టెంబర్ 29న తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు శ్యామల. కాలిఫోర్నియాలోని శాంటా కాటాలినా ద్వీపం నుంచి లాస్ ఏంజెల్స్ మధ్య విస్తరించి ఉన్న 36 కిలోమీటర్ల పొడవైన చానల్‌ను ఈదడం ఆషామాషీ కాదు. 15 డిగ్రీల చల్లని నీరు.. ఎముకలు కొరికే చలి.. సముద్రంలోకి దిగితే రక్తం గడ్డకట్టే వాతావరణం అక్కడ ఉంటాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈదడం అంటే శీతల ప్రాంతాల నుంచి వచ్చిన సాహసికులు సైతం ఐదారు సార్లు ప్రయత్నించక తప్పదు. అలాంటిది ఉష్ణ మండల ప్రాంతం నుంచి వెళ్లిన శ్యామల అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి 19.47 గంటల్లో కాటాలినా లక్ష్యాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. కాటాలినాను అధిగమించిన 10 మంది భారతీయుల్లో ముగ్గురు మహిళలు ఉంటే అందులో తెలుగు గడ్డ నుంచి శ్యామల స్థానం సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ‘కైవీ’ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కైవీ చానల్లో సాహసం చేసిన తొలి ఆసియా మహిళగా శ్యామల రికార్డు నెలకొల్పారు. అమెరికాలోని హవాయి దీవుల్లో 48 కిలోమీటర్ల పొడవైన ‘కైవీ చానల్‌ను ఈదడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామల ప్రయత్నించి విఫలమయ్యారు. కేవలం లక్ష్యానికి 4.5 కి.వీ. దూరంలో ఒక్కసారిగా సముద్రంలో చోటుచేసుకున్న మార్పులు.. ఆరు కిలోమీటర్ల వేగంతో వెనక్కి నెడుతున్న అలల మధ్య నాలుగు గంటలు శ్రమించినా మూడు కిలోమీటర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ప్రయత్నాన్ని అర్ధంతరంగా ముగించుకున్నారు. అయితే కైవీ సాహస యాత్రలో నిర్విరామంగా 22 గంటలపాటు 43.5 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది ప్రశంసలు అందుకున్నారు. ‘ఇంగ్లిష్ చానల్’ దిశగా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లిష్ చానల్ (ఉత్తర ప్రాన్స్–దక్షిణ ఇంగ్లండ్ మధ్య అట్లాంటిక్ సముద్రం)ను ఈదే లక్ష్యంతో శ్యామల కఠోర సాధన చేస్తున్నారు. జూన్‌లో చేసే ఈ సాహస యాత్రకు శ్యామల రోజుకు 8 గంటలు సాధనలో 6గంటలకు పైగానే స్విమ్మింగ్ పూల్‌లో ఉంటున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నేను సముద్రాన్ని ఈదుతా అన్నప్పుడు అన్నిచోట్లా హేళనకు గురయ్యాను. చాలామంది నీ వయసేంటి అన్నారు. కుటుంబ సభ్యులైతే స్విమ్మింగ్ దుస్తుల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, నేను ఆత్మ విశ్వాసంతోనే ముందుకు వెళ్లాను. నా దృష్టిలో వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నేను కైవీని అధిగమిస్తున్నప్పుడు అతిపెద్ద వేల్ చేప నన్ను తాకుతూపోతుంటే గుండె ఝల్లుమంది. చాలాచోట్ల షార్క్ పిల్లలు వెంటపడేవి. ఒక్కోసారి భయం వేసేది. ఆర్థిక ఇబ్బందుల్లో ఈదుతున్న నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. – గోలి శ్యామల, అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ -
మిస్టరీగా మారిన గజ ఈతగాని మృతి.. సీసీకెమెరాలో షాకింగ్ విషయాలు
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా, బైంసా గడ్డేన్న ప్రాజెక్టులో గజ ఈతగాని మృతి మిస్టరీగా మారింది. రెండు రోజుల క్రితం ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన సాయినాథ్ శవమై తెలాడు. అయితే సాయినాథ్ డ్యామ్‌లోకి దూకిన సమయంలో ఆ సంఘటన సీసీ కెమెరాలలో రికారయ్యింది. ఈ సీసీ పుటేజీలో డ్యామ్‌లో దూకిన సాయినాథ్ కొద్ది దూరం ఈతకోట్టినట్లు రికార్డైంది. (చదవండి: వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు) ఆ తర్వాత నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాడు ఎలా మ్రుతిచెందాడనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: హాస్టల్లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని.. -
కరోనాను జయించి.. కనకంతో మెరిసి..
టోక్యో: బ్రిటన్‌కు చెందిన స్విమ్మర్ టామ్ డియాన్ ఒకటి కాదు... రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డాడు. స్వదేశంలోనే అతనిపై ఏమాత్రం అంచనాలు లేవు. కరోనాతోనే సరిపోతుంది... టోక్యోదాకా ఏం వెళతాడులే! అని కొందరంటే... అతనికి ఈ నేషనల్ ట్రయల్సే ఎక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. కానీ టామ్ డియాన్ అలాంటి అభిప్రాయాలను, అనుమానాలను పటాపంచలు చేశాడు. అంచనాల్ని తారుమారు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో టామ్ బంగారు పతకం గెలుపొందాడు. గత సెప్టెంబర్‌లో తొలిసారి అతనికి కోవిడ్ సోకింది. మళ్లీ నాలుగు నెలలకే ఈ జనవరిలోనూ వైరస్ బారిన పడ్డాడు. ఈసారి కరోనా అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు ఓ పట్టాన తగ్గనేలేదు. అందుకే అతనిపై ఎవరికీ నమ్మకం లేకపోయింది. కానీ ఇక్కడ మాత్రం అతనే విజేత! పోటీని టామ్ అందరికంటే ముందుగా 1ని:44.22 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు డన్కన్ స్కాట్ (1ని:44.26 సెకన్లు) రజతం, బ్రెజిల్ స్విమ్మర్ ఫెర్నాండో (1ని:44.66 సెకన్లు) కాంస్యం గెలిచాడు. వందేళ్లలో బ్రిటన్ స్విమ్మర్లు ఒకే ఈవెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలవడం కూడా ఇదే మొదటిసారి. 1908 లండన్ ఒలింపిక్స్‌లో బ్రిటన్ స్విమ్మర్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. ఆ తర్వాత తాజాగా టోక్యోలోనే దీన్ని పునరావృతం చేశారు. -
యూనివర్సాలిటీ కోటాలో ఒలింపిక్స్‌కు మానా
ఒలింపిక్స్ పోటీలకు మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపికైంది. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు ఎన్నికైనట్లు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) శుక్రవారం ధృవీకరించింది. దీంతో భారతదేశం నుంచి ఒలింపిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా మానా పటేల్ నిలిచింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్.. శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాష్‌లతో కలిసి మానా పటేల్ ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సాలిటీ కోటా ద్వారా పోటీల్లో సత్తా చాటే ఓ మేల్, ఓ ఫిమేల్ అథ్లెట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మానా పటేల్ ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అభినందించారు. 21 ఏళ్ల వయసు గల మానా పటేల్ జాతీయ క్రీడల్లో 50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. మానా పటేల్ 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో స్వర్ణం సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. పటేల్ 72 వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు. 2018 లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో పటేల్ మూడు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లను కైవసం చేసుకున్నారు. 2019లో గాయం తర్వాత ఈ ఏడాదే ఆమె తిరిగి పూల్‌లో దిగింది. -
వంకర మనుషులున్నారు.. నా వల్ల కాదు
అడిలైడ్: ఆస్ట్రేలియన్ స్విమ్మర్, 2016 ఒలంపిక్స్‌లో రెండు పతకాల్ని సాధించిన మేడ్లైన్ గ్రోవ్స్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఒలంపిక్స్ ట్రయల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ ఆటలో ఆడవాళ్లపై ద్వేషాన్ని వెల్లగక్కే వాళ్లున్నారని, వంకరబుద్ధితో చూస్తారని, వాళ్ల బూట్లు నాకేవాళ్లు కూడా కొందరు ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే 26 ఏళ్ల మేడ్లైన్ గ్రోవ్స్ ఈ తరహా ఆరోపణలు చేయడం కొత్తేం కాదు. గతంలో స్విమ్మింగ్ పూల్ బాయ్ ఒకడు తనను తేడాగా చూశాడంటూ ఒక పోస్ట్ చేసిన ఆమె.. పోయినేడాది డిసెంబర్లో ఓ కోచ్ తనపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశాడని స్విమ్మింగ్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ స్విమ్మింగ్ సంచలనం ఈ తరహా ఆరోపణలు చేయడంపై స్విమ్మింగ్ దిగ్గజాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆ ఆరోపణలను గవర్నింగ్ బాడీ పరిశీలిస్తుందని, ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని స్విమ్మింగ్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కెయిరెన్ పర్కిన్స్ వెల్లడించారు. మరోవైపు గ్రోవ్స్(ముద్దుపేరు మ్యాడ్ డాగ్) తన ఆరోపణల గురించి పూర్తి స్థాయిలో వివరించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తన ఆవేశాన్ని వెల్లగక్కుతోంది. దాదాపు ఏడాది వాయిదా తర్వాత జులై 23 నుంచి టోక్యోలో సమ్మర్ ఒలంపిక్స్-2020(2021) ఒలంపిక్స్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా దేశం ఒలంపిక్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో మెడల్స్ కొల్లగొడుతుంటుంది. ఈ తరుణంలో ట్రయల్స్‌లో గ్రోవ్స్ గనుక పాల్గొనపోతే.. ఆమెను ఒలంపిక్స్‌ను ఎంపిక చేయడం కష్టం కావడమే కాదు.. మెడల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని స్విమ్మింగ్ ఆస్ట్రేలియా భావిస్తోంది. -
ఉరి వేసుకొని చనిపోయిన జాతీయ స్విమ్మర్
యశవంతపుర: కరోనా కాటుతో ఏడాదికి పైగా ఉద్యోగం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన క్రీడాకారిణి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం బెంగళూరులో వెలుగుచూసింది. జాతీయ స్థాయి క్రీడాకారణి జి.బి.శిల్ప బాలరాజు (41) స్విమ్మింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు పొందారు. శిల్ప బెంగళూరు జయనగరలో నివాసముంటూ ఒక ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కరోనా కారణంగా స్కూల్లో ఆమెతో సహా పలువురు టీచర్లను తొలగించారు. పనిలోకి చేర్చుకోవాలని శిల్ప పలుమార్లు పాఠశాల యజమాన్యానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న భర్త, నృత్య శిక్షకునిగా పనిచేసే నీలకృష్ణ ప్రసాద్ విగతజీవిగా మారిన శిల్ప కనిపించారు. క్రీడాకారిణిగా జాతీయ స్థాయికి ఎదిగినప్పటికీ పాఠశాలలో ఒక ఉద్యోగం సంపాదించలేక పోయానని సూసైడ్ నోట్లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం శిల్ప తల్లి మరణించారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ శిల్ప ఆత్మహత్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: క్షుద్రపూజలు చేసిన కుటుంబానికి దేహశుద్ధి -
క్యాన్సర్‌తో పోరాడి... ఒలింపిక్స్‌కు అర్హత
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు అందరూ క్వాలిఫయింగ్‌లో పోరాడతారు. కానీ జపాన్‌కు చెందిన మహిళా స్విమ్మర్ రికాకో ఐకీ మాత్రం క్యాన్సర్‌తో పోరాడింది. దానిని జయించి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. జపాన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో లక్ష్యదూరాన్ని ఆమె 57.77 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. రెండేళ్ల క్రితం లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడిన ఆమె తాజా విజయంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
సీఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ సస్పెండ్
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ), అంతర్జాతీయ మాజీ స్విమ్మర్ ఖజాన్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఖజాన్తోపాటు మరో కోచ్, ఇన్స్పెక్టర్ సుర్జీత్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి వెల్లడించారు. గత డిసెంబర్లో ఖజాన్పై మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని బాబా హరిదాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఖజాన్, సుర్జీత్ అత్యాచారం చేశారని, సీఆర్పీఎఫ్లోని పలువురు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేయగా... విచారణ లో వారిద్దరూ దోషులుగా తేలారు. దీంతో ఖజాన్, సుర్జీత్ సస్పెన్షన్‌కు గుర య్యారు. 56 ఏళ్ల ఖజాన్ సింగ్ 1986 సియోల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో రజత పతకం సాధించాడు. పతకంతో దేశానికి పేరుతెచ్చిన అతనికి సీఆర్పీఎఫ్లో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగమిచ్చారు. 1984లో ‘అర్జున’ అవార్డు పొందిన ఖజాన్ 1988 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1988 వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో రజతం, 1989 దక్షిణాసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు సాధించాడు. 1986 ఆసియా క్రీడల్లో రజత పతకంతో ఖజాన్ సింగ్ -
పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళ
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈది ఔరా అనిపించారు. శ్రీలంక తీరం నుంచి శుక్రవారం ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సాయంత్రం 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్కోటి చేరుకున్నారు. 2012లో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. కాగా, పాక్ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల కావడం విశేషం. యానిమేటర్ నుంచి స్విమ్మర్ వరకు.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. శ్యామలను ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్ అయ్యారు. మా జూనియర్స్ చానల్లో యానిమేషన్ సిరీస్ చేశారు. లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ సినిమా కూడా తీశారు. అయితే, ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు. -
సున్ యాంగ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
హాంకాంగ్: మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా ఫ్రీ స్టయిల్ స్విమ్మర్ సున్ యాంగ్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) శుక్రవారం ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబర్‌లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించడానికి వెళ్లిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రతినిధులకు సహకరించకుండా... వారు సేకరించిన శాంపిల్స్‌ను నాశనం చేశాడనే అభియోగంతో సీఏఎస్ అతడిపై విచారణ చేపట్టింది. తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్‌ను దోషిగా తేలుస్తూ... అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అయితే దీనిపై స్పందించిన సున్ తానెటువంటి తప్పు చేయలేదని...దీనిపై స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని మీడియాకు తెలిపాడు. చైనా స్విమ్మింగ్ సంఘం (సీఎస్ఏ) కూడా సున్కు మద్దతు తెలిపింది. ఆ రోజు సున్ శాంపిల్స్ సేకరించడానికి వచ్చిన వారు అర్హత కలిగిన అధికారులు కాదని తెలిపింది. 2014లో కూడా సున్ డోపింగ్‌లో పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
తులసీ చైతన్యకు ఆరు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ స్విమ్మర్ తులసీ చైతన్య అద్భుత ప్రదర్శన చేశాడు. చైనాలోని చెంగ్డూలో జరిగిన ఈ క్రీడల్లో తులసీ చైతన్య ఒకస్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. విజయవాడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే తులసీ చైతన్య ట్రయాథ్లాన్ టీమ్ ఈవెంట్లో పసిడి పతకం గెల్చుకోగా... 4్ఠ50 మిక్స్డ్ ఫ్రీస్టయిల్ రిలేలో, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకాలు సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 4్ఠ50 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తులసీ చైతన్య కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు తులసీ చైతన్య మూడుసార్లు (2013, 2017, 2019) ప్రపంచ పోలీసు క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 20 పతకాలు సాధించాడు.