T20 Blast
-
టీ20 బ్లాస్ట్ విజేత గ్లోసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ వేదికగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను గ్లోసెస్టర్‌షైర్ గెలుచుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్ సోమర్సెట్ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 19.4 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.డేవిడ్ పేన్, మ్యాట్ టేలర్ తలో మూడు, జోష్ షా రెండు వికెట్లు తీసి సోమర్సెట్ను దెబ్బకొట్టారు. ఒలివర్ ప్రైస్, టామ్ ప్రైస్ తలో వికెట్ దక్కించుకున్నారు. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఒక్కడే అర్ద సెంచరీతో (53) రాణించాడు. కాడ్మోర్ (21), ఏబెల్ (19) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.Maiden T20 Blast title for Gloucestershire🏆#ICYMI: Half-centuries from Cameron Bancroft and Miles Hammond powered Gloucestershire to their first T20 Blast title with a comfortable win over Somerset in Birmingham on Saturday. pic.twitter.com/Wsw9Qqsdkx— CricTracker (@Cricketracker) September 15, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్.. 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి విజయతీరాలకు చేరింది. మైల్స్ హామండ్ (58 నాటౌట్), కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ (53) తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి గ్లోసెస్టర్‌షైర్‌ను గెలిపించారు. జోష్ డేవి, జేక్ బాల్‌లకు తలో వికెట్ దక్కింది. టీ20 బ్లాస్ట్ టైటిల్‌ను గెలవడం గ్లోసెస్టర్‌షైర్‌కు ఇది మొదటిసారి. -
సామ్ కర్రన్ వీర బాదుడు
టీ20 బ్లాస్ట్ 2024లో సర్రే జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరింది. నిన్న (సెప్టెంబర్ 3) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు డర్హమ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో డొమినిక్ సిబ్లే (67), సామ్ కర్రన్ (52) సర్రేను గెలిపించారు. ముఖ్యంగా సామ్ కర్రన్ ఆఖర్లో వీర బాదుడు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జట్టులో టాపార్డర్ అంతా విఫలం కాగా.. ఆఖర్లో బెన్ రెయినే (23), మైఖేల్ జోన్స్ (37 నాటౌట్), టర్నర్ (27), బాస్ డి లీడ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సర్రే బౌలర్లలో డేనియల్ వారెల్, రీస్ టాప్లే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టామ్ కర్రన్, సామ్ కర్రన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సర్రే.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు తాకింది. డొమినిక్ సిబ్లే, సామ్ కర్రన్ అర్ద సెంచరీలతో రాణించి సర్రేను గెలిపించారు. వీరిద్దరు మినహా సర్రే ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విల్ జాక్స్ 8, లారీ ఈవాన్స్ 1, రోరి బర్న్స్ 10 పరుగులు చేశారు. డర్హమ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, పార్కిన్సన్ తలో రెండు వికెట్లు, బెన్ రెయినే ఓ వికెట్ పడగొట్టారు. టీ20 బ్లాస్ట్ రెండో క్వార్టర్ ఫైనల్లో ఇవాళ ససెక్స్, లాంకాషైర్ జట్లు తలపడనున్నాయి. -
64 బంతుల్లోనే 135 రన్స్: 5 వికెట్లతో దుమ్ములేపిన లబుషేన్
Glamorgan vs Somerset: టీ20 బ్లాస్ట్ లీగ్-2024లో భాగంగా సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు దుమ్ములేపింది. సమిష్టి ప్రదర్శనతో ఏకంగా 120 పరుగుల తేడాతో సోమర్సెట్ను చిత్తు చేసింది.ఇంగ్లండ్‌కు చెందిన ఈ టీ20 లీగ్‌లో భాగంగా సౌత్ గ్రూపు జట్లు గ్లామోర్గాన్- సోమర్సెట్ శుక్రవారం రాత్రి తలపడ్డాయి. కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.64 బంతుల్లోనేఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ కిరాన్ కార్ల్సన్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు.అతడి తోడుగా మరో ఓపెనర్ విలియమ్ స్మాలే(34 బంతుల్లో 59 రన్స్) కూడా దంచికొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఇంగ్రామ్ 21, వికెట్ కీపర్ కూకీ 16 రన్స్‌తో ఫర్వాలేదనిపించగా.. బెన్ కెల్లావే 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన గ్లామోర్గాన్ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు గ్లామోర్గాన్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లువీరి దెబ్బకు సోమర్సెట్ కేవలం 123 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. 13.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. గ్లామోర్గాన్ బౌలర్లలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.కేవలం 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి సోమర్సెట్ లోయర్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇక ఐదు వికెట్ల హాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడం ద్వారా వచ్చిన వికెట్లే కావడం విశేషం.లబుషేన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ వికెట్లు తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో సోమర్సెట్ ఇప్పటి వరకు 8 విజయాలతో సౌత్ గ్రూపులో మూడోస్థానంలో ఉండగా.. గ్లామోర్గాన్ విజయాల సంఖ్య తాజాగా ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.2003లో ఈ పొట్టి లీగ్ మొదలుకాగా టీ20 బ్లాస్ట్ లీగ్‌ను ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది. ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. తాజా సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.చదవండి: NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే! View this post on Instagram A post shared by FanCode (@fancode) -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్‌షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్‌షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
ఇదెక్కడి క్యాచ్ రా సామీ.. పొట్టి క్రికెట్లో బెస్ట్ క్యాచ్‌గా జేజేలు
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024లో అత్యుత్తమ క్యాచ్‌లు నమోదవుతున్నాయి. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే ఐదారు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఫ్యాన్స్‌కు మతి పోగొట్టాయి. తాజాగా అలాంటి క్యాచే మరొకటి నమోదైంది. కార్డిఫ్ వేదికగా గ్లోసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లామోర్గన్ ఆటగాడు మార్నస్ లబూషేన్ మెరుపు క్యాచ్ అందుకున్నాడు.మేసన్ క్రేన్ బౌలింగ్‌లో బెన్ ఛార్లెస్వర్త్ లాంగ్ ఆన్ దిశగా ఆడిన భారీ షాట్‌ను లబూషేన్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌గా మలిచాడు. ఓ మోస్తరు ఎత్తులో వెళ్తున్న బంతిని పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ క్యాచ్‌కు చూసిన వారు పొట్టి క్రికెట్లో అత్యుత్తమ క్యాచ్ అని జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను పట్టిన లబూషేన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.MARNUS LABUSCHAGNE WITH A BLINDER. 🤯💯- One of the greatest catches ever! pic.twitter.com/ssDsUdg2aU— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2024కాగా, గ్లామోర్గన్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లోసెస్టర్‌షైర్ గెలుపుకు చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. జోష్ షా ఆండీ గోర్విన్ బౌలింగ్ సిక్సర్ కొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయగా.. గ్లోసెస్టర్‌షైర్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. గ్లామోర్గన్ ఇన్నింగ్స్‌లో సామ్ నార్త్ఈస్ట్ (46 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో జాక్ టేలర్ (70) అత్యధిక పరుగులు సాధించాడు. -
కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో డర్హామ్ ఆల్‌రౌండర్ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్ను సంచలన క్యాచ్‌తో కొగ్లిన్ పెవిలియన్‌కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ కొగ్లిన్ ప్లాన్‌ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్ ఫ్రంట్‌పుట్‌కు వచ్చి స్టైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్‌లో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. What a ludicrous catch.pic.twitter.com/ucPjKpeH0Z— The Cricketer (@TheCricketerMag) June 16, 2024 -
హ్యాట్రిక్‌తో విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్‌లో కెంట్ బౌలర్, ఇంగ్లండ్ లెగ్ స్పిన్ బౌలర్ మాథ్యూ పార్కిన్సన్ అదిరిపోయే హ్యాట్రిక్ సాధించాడు. మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో హ్యాట్రిక్‌తో కలుపుకుని 4 వికెట్లు పడగొట్టాడు. పార్కిన్సన్ ధాటికి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న మిడిల్సెక్స్ 107 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కెంట్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. జో డెన్లీ (56), బెల్ డ్రమ్మండ్ (38) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.హాల్మెన్ (3/27), బ్లేక్ కల్లెన్ (3/47), టామ్ హెల్మ్ (2/37) బంతితో రాణించారు.A hat-trick for Matt Parkinson! 🤩 pic.twitter.com/RoIcNZgH9X— Vitality Blast (@VitalityBlast) May 31, 2024అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిడిల్సెక్స్ పార్కిన్సన్, మార్కస్ (2/28), గ్రాంట్ స్టివార్ట్ (2/22), స్వేన్పోయెల్ (1/11), బార్లెట్ (1/16) ధాటికి 14.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో హాల్మెన్, ఎస్కినాజీ, జాక్ డేవిస్ తలో 23 పరుగులు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా. టీ20 బ్లాస్ట్ టోర్నీ మే 30వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 5 వన్డేలు, 6 టీ20లు ఆడిన మాట్ పార్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 12 మ్యాచ్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసిన పార్కిన్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ పార్కిన్సన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను 37 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు దేశీయంగా జరిగే పలు టీ20 టోర్నీల్లో పాల్గొనే పార్కిన్సన్.. ఇప్పటివరకు 104 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు పడగొట్టాడు. -
టీ20 బ్లాస్ట్ 2023 విజేత సోమర్సెట్.. ఫైనల్లో ఎసెక్స్‌పై గెలుపు
2023 సీజన్ టీ20 బ్లాస్ట్ విజేతగా సోమర్సెట్ జట్టు నిలిచింది. నిన్న (జులై 15) జరిగిన ఫైనల్లో సోమర్సెట్.. ఎసెక్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ఎసెక్స్ 18.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సోమర్సెట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4/25), ఐష్ సోధి (3/22), లెవిస్ గ్రెగరీ (2/25), క్రెయిగ్ ఓవర్టన్ (1/30) ఎసెక్స్ పతనాన్ని శాశించారు. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ సామ్స్ (45), ఆడమ్ రోసింగ్టన్ (19), డేనియల్ లారెన్స్ (16), పాల్ వాల్టర్ (26) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు సీన్ డిక్సన్ (53) రాణించడంతో సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (20), కోహ్లెర్ క్యాడ్మోర్ (19), గ్రెగరీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఎసెక్స్ బౌలర్లలో స్నేటర్, పాల్ వాల్టర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, క్రిచ్లీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
బ్యాట్ ఝులిపించిన సునీల్ నరైన్.. 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసం
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా ఎసెక్స్‌తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఆటగాడు, సర్రే ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో (4-0-42-1) తేలిపోయిన నరైన్.. బ్యాటింగ్‌లో రాణించి అజేయమైన మెరుపు అర్ధసెంచరీతో (37 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరిశాడు. నరైన్ బ్యాట్‌తో విజృంభించినా, అతని జట్టు సర్రే మాత్రం విజయం సాధించలేకపోయింది. కెప్టెన్ క్రిస్ జోర్డన్ (4-0-23-1) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (4-0-45-1), ఆసీస్ పేసర్ సీన్ అబాట్ (4-0-47-1) సహా అంతా విఫలమయ్యారు. ఫెరోజ్ ఖుషి (35 నాటౌట్), డేనియల్ లారెన్స్ (58), మైఖేల్ కైల్ పెప్పర్ (75) ఎసెక్స్కు గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. సునీల్ నరైన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నరైన్‌తో పాటు సర్రే ఆటగాళ్లు విల్ జాక్స్ (23), జేసన్ రాయ్ (28), జేమీ ఓవర్టన్ (23), టామ్ కర్రన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, ఆరోన్ బియర్డ్, సామ్ కుక్, హార్మర్, స్నేటర్, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాడు.. అనంతరం బరిలోకి దిగిన ఎసెక్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో ఫెరోజ్ ఖుషీ ఆఖరి బంతికి సిక్సర్ బాది ఎసెక్స్‌ను గెలిపించాడు. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. పొట్టి క్రికెట్లో తొలి బౌలర్‌గా రికార్డు
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జూన్ 30) జరిగిన మ్యాచ్‌లో నాటింగ్హమ్ ఆటగాడు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు గోల్డెన్ డకౌట్లు (తొలి బంతికే ఔట్) ఉన్నాయి. ఫలితంగా వార్విక్షైర్ తొలి ఓవర్లో 7 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA — Vitality Blast (@VitalityBlast) June 30, 2023 వార్విక్షైర్ ఖాతాలో ఉన్న 7 పరుగుల్లో 5 వైడ్ల రూపంలో వచ్చినవి కావడం విశేషం. తొలి బంతికి వైడ్ల రూపంలో 5 పరుగులు రాగా.. ఆతర్వాతి బంతికి అలెక్స్ డేవిస్ (0) ఎల్బీడబ్ల్యూ, రెండో బంతికి బెంజమిన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యారు. 3, 4 బంతులకు సింగల్స్ రాగా.. ఐదో బంతికి మౌస్లే (1).. ఓలీ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరి బంతికి బర్నార్డ్ (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఓ బౌలర్ ఈ తరహాలో తొలి ఓవర్లో 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. వన్డేల్లో శ్రీలంక పేస్ దిగ్గజం చమిందా వాస్ ఈ ఘనత సాధించాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాస్.. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్.. నిర్ణీత ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లింటాట్, హసన్ అలీ తలో 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్ 2, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టగా.. నాటింగ్హమ్ ఇన్నింగ్స్‌లో టామ్ మూర్స్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయిన వార్విక్షైర్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాబర్ట్ ఏట్స్ (65), జేకబ్ బెథెల్ (27), జేక్ లింటాట్ (27 నాటౌట్) రాణించారు. నాటింగ్హమ్ బౌలర్లలో అఫ్రిది 4, జేక్ బాల్ 3 వికెట్లు పడగొట్టారు. -
టీ20ల్లో బట్లర్ జమానా.. ఉతికి ఆరేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్, అత్యంత అరుదైన జాబితాలో చోటు
టీ20ల్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ జమానా నడుస్తుంది. ఇటీవలకాలంలో పొట్టి ఫార్మాట్లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు తాజాగా ఓ అరుదైన క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టీ20 బ్లాస్ట్ 2023లో భాగంగా బట్లర్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్ తరఫున బరిలోకి దిగిన బట్లర్.. 39 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ 10000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయ్యాడు. టీ20 కెరీర్లో మొత్తం 372 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 34.16 సగటున, 144.70 స్ట్రయిక్ రేట్‌తో 6 శతకాలు, 21 హాఫ్ సెంచరీల సాయంతో 10080 పరుగులు చేశాడు. The crowning moment 🙌 pic.twitter.com/bTAyzxz0dS — Vitality Blast (@VitalityBlast) June 23, 2023 టీ20ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు.. టీ20 ఫార్మాట్లో 10000 పరుగులు సాధించిన తొమ్మిదో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562) అగ్రస్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్ (12528), కీరన్ పోలార్డ్ (12175), విరాట్ కోహ్లి (11965), డేవిడ్ వార్నర్ (11695), ఆరోన్ ఫించ్ (11392), అలెక్స్ హేల్స్ (11214), రోహిత్ శర్మ (11035) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో నిలిచారు. Jos Buttler becomes the 9th batter to complete 10,000 runs in T20. 😍#Cricket #JosButtler #England pic.twitter.com/XQ7uIwWTMH — Sportskeeda (@Sportskeeda) June 24, 2023 ఇంగ్లండ్ తరఫున రెండో ఆటగాడు.. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున 10000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. బట్లర్‌కు ముందు అలెక్స్ హేల్స్ (11214) ఈ ఘనత సాధించాడు. బట్లర్ తర్వాత జేమ్స్ విన్స్ (9343) టీ20ల్లో 10000 పరుగులకు చేరువలో ఉన్నాడు. Can we have 12 for that one, @VitalityBlast? 💥@liaml4893 clears a maximum over the new development! 👷♂️ Watch LIVE on #LancsTV! 💻➡️ https://t.co/mClaOSvXZ6 ⚡ #LightningStrikes pic.twitter.com/HZ1NdKIiOW — Lancashire Lightning (@lancscricket) June 23, 2023 రోహిత్ శర్మ కంటే వేగంగా.. జోస్ బట్లర్ టీ20ల్లో రోహిత్ శర్మ కంటే వేగంగా 10000 పరుగుల మార్క్‌ను రీచ్ అయ్యాడు. రోహిత్‌కు ఈ ఘనత సాధించేందుకు 362 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బట్లర్ కేవలం 350 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లి ఈ ఘనతను వేగంగా అధిగమించాడు. విరాట్ కేవలం 285 ఇన్నింగ్స్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వీరవిహారంతో లాంకాషైర్ ఘన విజయం.. డెర్బీషైర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బట్లర్ వీరవిహారం చేయడంతో లాంకాషైర్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు జతగా లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) రాణించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 15 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్ లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్‌స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సర్రే క్లికెట్ క్లబ్‌కు సామ్ కర్రాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో , గ్లామోర్గాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్రాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు బౌలర్లను కర్రాన్ ఊచకోత కోశాడు. కర్రాన్ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కర్రాన్ తన పేరిట లిఖించకున్నాడు. ఓవరాల్ ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఓపెనర్లు విల్ జాక్స్(69), ఏవెన్స్(40) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే..238 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. గ్లామోర్గాన్ బ్యాటర్లలో క్రిస్ కోక్(49) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సర్రే బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, నరైన్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని Sam Curran was in electric form with the bat last night ⚡️ His 59 from 22 helped Surrey to their third-highest T20 total ever - 238/5!#Blast23 pic.twitter.com/ymYCoQRux3 — Vitality Blast (@VitalityBlast) June 21, 2023 -
లక్నో ఆల్‌రౌండర్ సిక్సర్ల సునామీ.. తడిసి ముద్ద అయిన లార్డ్స్ మైదానం
టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు. సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి మిడిల్సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్ను విజేతగా ప్రకటించారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు. కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్
క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుతుందని.. ఇక లక్ష్యం 10 బంతుల్లో 17 పరుగులే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ గాల్లోకి అమాంతం లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత విన్యాసాన్ని మైదానంలోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు. కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STOP WHAT YOU ARE DOING BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI — Vitality Blast (@VitalityBlast) June 16, 2023 చదవండి: లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్ -
విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ
టీ20 బ్లాస్ట్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్స్, బ్రదర్స్ సామ్ కర్రన్, సామ్ కర్రన్లు విధ్వంసం సృష్టించారు. ససెక్స్‌తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత సామ్ (35 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో టామ్ (9 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అసలుసిసలు టీ20 మజాను ప్రేక్షకులకు అందించారు. వీరికి తోడు లారీ ఈవాన్స్ (51 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో సర్రే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 బ్లాస్ట్‌లో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్. ససెక్స్ బౌలర్లలో తైమాల్ మిల్స్, హెన్రీ క్రొకోంబ్ తలో 2 వికెట్లు, మెక్ ఆండ్రూ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ససెక్స్.. సునీల్ నరైన్ (3/12), కెమరూన్ స్టీల్ (3/41), విల్ జాక్స్ (2/29), టామ్ లావెస్ (2/17) ధాటికి 14.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా సర్రే 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. టామ్ అల్సోప్ (17), మైఖేల్ బుర్గెస్ (12), డానియల్ ఇబ్రహీం (17), హడ్సన్ ప్రెంటిస్ (11)లు రెండంకెల స్కోర్లు చేశారు. A 🆕 entry on the highest Blast totals list 👀 @surreycricket with an astonishing display of hitting tonight!#Blast23 pic.twitter.com/xF1zYWKo5q — Vitality Blast (@VitalityBlast) June 9, 2023 కాగా, ఐపీఎల్లో కోట్లు కుమ్మరించినా ఆడని సామ్ కర్రన్ స్వదేశంలో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. కర్రన్ ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో మెరుపు వేగంతో పరుగుల సాధించడంతో (237, 13 సిక్సర్లు) పాటు వికెట్లు (7) కూడా తీస్తున్నాడు. కర్రన్ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా సర్రే పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చదవండి: బజ్‌బాల్ లేదు తొక్కా లేదు.. మీ పప్పులు మా ముందు ఉడకవు.. ఇంగ్లండ్‌కు స్టీవ్ స్మిత్ వార్నింగ్ -
జోస్ బట్లర్ వీరవిహారం.. శివాలెత్తిన సామ్ కర్రన్
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా నిన్న (జూన్ 7) జరిగిన వివిధ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ క్రికెటర్లు పేట్రేగిపోయారు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహించిన జోస్ బట్లర్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. గ్లామోర్గన్‌పై ససెక్స్ ఆటగాళ్లు లారీ ఈవాన్స్ (60 బంతుల్లో 118 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు), సామ్ కర్రన్ (29 బంతుల్లో 66; ఫోర్, 7 సిక్సర్లు, 2/36) రెచ్చిపోయారు. ఫలితంగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ఘన విజయం సాధించాయి. బట్లర్ వీరవిహారం.. లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్సెస్టర్‌షైర్ ఆడమ్ హోస్ (29 బంతుల్లో 42), మిచెల్ సాంట్నర్ (33 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. లాంకాషైర్ బౌలర్లలో డారిల్ మిచెల్ 3, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 2, లూక్ వుడ్, టామ్ హార్ట్లీ, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో జోస్ బట్లర్, స్టీవ్ క్రాఫ్ట్ (40), డారిల్ మిచెల్ (33 నాటౌట్), లివింగ్‌స్టోన్ (23) రాణించడంతో లాంకాషైర్ 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్సెస్టర్‌షైర్ బౌలర్లలో పెన్నింగ్టన్, పాట్రిక్ బ్రౌన్ తలో 2 వికెట్లు, ఆడమ్ ఫించ్ ఓ వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన ఈవాన్స్.. శివాలెత్తిన సామ్ కర్రన్ గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. లారీ ఈవాన్స్, సామ్ కర్రన్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన గ్లామోర్గన్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసి 65 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సర్రే బౌలర్లలో కర్రన్, అట్కిన్సన్, క్రిస్ జోర్డన్ తలో 2 వికెట్లు, సీన్ అబాట్,సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. నిన్న జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఎసెక్స్‌పై కెంట్ 4 వికెట్ల తేడాతో.. వార్విక్‌షైర్‌పై డెర్బీషైర్ 6 వికెట్ల తేడాతో.. సోమర్సెట్పై హ్యాంప్‌షైర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించాయి. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా -
గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ బ్యాటర్ తన వ్యక్తిగత మైలురాయి కోసం స్ట్రయిక్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి పరువు పోగొట్టుకున్నాడు. నాటింగ్హమ్షైర్తో నిన్న (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ బ్యాటర్ సామ్ హెయిన్.. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ జేక్ లింటాట్ను ఇబ్బంది పెట్టాడు. ఇంత చేసి అతనేమైనా సెంచరీ సాధించాడా అంటే.. అదీ లేదు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్షైర్.. జో క్లార్క్ (53 బంతుల్లో 89; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కొలిన్ మున్రో (43 బంతుల్లో 87; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో సామ్ హెయిన్ (52 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తన జట్టును (వార్విక్షైర్) గెలిపించలేకపోయాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. pic.twitter.com/A171O5RKOC— Spider Rashid (@RashidSpider) June 4, 2023 సెంచరీ కోసం కింద పడిపోయిన సహచరుడిని లేపి పరిగెట్టించాడు.. అయినా..! ఆఖరి ఓవర్ చివరి 3 బంతుల్లో 19 పరుగులు చేయల్సిన పరిస్థితి ఉండింది. జేక్ బాల్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని లింటాట్ సిక్సర్‌గా మలచడంతో ఈక్వేషన్ 2 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అప్పటికి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హెయిన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, వార్విక్షైర్ గెలిచే పరిస్థితి కూడా లేదు. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న లింటాట్ భారీ షాట్ ఆడబోయి క్రీజ్‌లోనే కింద పడిపోయాడు. అవతలి ఎండ్‌లో సెంచరీ కోసం పరితపిస్తున్న హెయిన్.. సహచరుడు కిందపడి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా, సగం క్రీజ్ వరకు వచ్చి అతన్ని పరుగు తీయాల్సిందిగా కోరాడు. దీంతో లింటాట్ హెయిన్ సెంచరీ కోసం పడుతూ లేస్తూ పరుగు పూర్తి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ లోపే ఫీల్డర్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు బంతి విసరడం, బౌలర్ ఆ బంతితో లింటాట్ను రనౌట్ చేయడం జరిగిపోయాయి. ఇంత జరిగికా కూడా సెంచరీ కోసం ఆఖరి బంతిని ఎదుర్కొన్న హెయిన్ అది సాధించాడా అంటే.. అది లేదు. 96 పరుగుల వద్ద ఉండిన హెయిన్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఉంటే, తన జట్టు గెలవకపోయినా అతను సెంచరీ అయినా చేసే వాడు. అయితే అతను సింగిల్ మాత్రమే తీయడంతో 97 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం తంతు చూసి నెటిజన్లు హెయిన్ను తిట్టిపోస్తున్నారు. స్వార్ధపరుడని, గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం సహచరుడిని ఇబ్బందిపెట్టి పరువు పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. టీ20 బ్లాస్ట్-2023లో భాగంగా నిన్న (జూన్ 2) ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విన్స్ 45 బంతుల్లోనే శతకం బాదాడు. ఇందులో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. విన్స్ శతకాన్ని బౌండరీ, సిక్సర్‌తో కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న విన్స్ 103 పరుగులు చేసి ఔటయ్యాడు. విన్స్ శతక్కొట్టుడు సాయంతో హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో లియామ్ డాసన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో హాంప్‌షైర్ 200 పరుగుల మార్కును దాటింది. విన్స్‌కు జతగా టోబి ఆల్బర్ట్ (28), వెథర్లీ (29) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. ఎసెక్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్, హార్మర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. క్రిచ్లీ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. లియామ్ డాసన్ (4-0-21-4), నాథన్ ఇల్లిస్ (2.1-0-10-3), స్కాట్ కర్రీ (3-0-21-3) ధాటికి 14.1 ఓవర్లలో 96 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (23), డేనియల్ లారెన్స్ (22), పాల్ వాల్టర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న విన్స్.. ఎసెక్స్‌తో మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించిన విన్స్ ప్రస్తుత టీ20 బ్లాస్ట్ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 103 పరుగులు చేసిన విన్స్.. దీనికి ముందు ససెక్స్‌తో మ్యాచ్‌లో 56 బంతుల్లో 88, మిడిల్సెక్స్తో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేశాడు. 2019 ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన.. ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి -
T20 Blast: నవీన్ ఉల్ హక్‌ను చెడుగుడు ఆడుకున్న అనామక బ్యాటర్లు
ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్సన్తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్మన్ (1/16) వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్షైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు. -
T20 BLAST లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బౌలర్..
-
బౌలర్ బ్యాటర్‌గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్