TMU
-
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
ఆర్టీసీ యూనియన్ వ్యవస్థను పునరుద్ధరించాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణ ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్ల వ్యవస్థను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.థామస్‌రెడ్డి కోరారు. బుధవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనియన్ల ద్వారానే ఆర్టీసీలో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. జేఏసీల వల్ల ఆర్టీసీకి ఒరిగింది ఏమిలేదన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు. సమ్మెలు చేసి సాధించే రోజులు పోయాయని సంధి ద్వారానే సమస్యలను సాధించుకోవచ్చన్నారు. 70శాతం మంది కార్మికులు మా సంఘానికి మద్దతు తెలుపుతున్నారని, మా సంఘానికి గౌరవ అధ్యక్షురాలు కవితమ్మనేనని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రతపై జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని, ఆర్టీసీని కాపాడేందుకు బడ్జెట్లో 2శాతం లేదా రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎన్.కమలాకర్‌గౌడ్, ముఖ్య సలహాదారు ఎల్.మారయ్య, ఉపాధ్యక్షుడు జి.ఆర్.ఆర్ రెడ్డి, సహాయ కార్యదర్శి బి.నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఎస్ఆర్టీసీ తరహాలో ఇక్కడ కూడా..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ జారీ చేసిన మార్గదర్శకాలు సరిగ్గా లేవని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన తరహా మార్గదర్శకాలు కావాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కేంద్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మార్గదర్శకాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు పక్కన పెట్టి మొక్కుబడి మార్పులతో కొత్త మార్గదర్శకాలు రూపొందించారని వాటిని.. అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. పెండింగులో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ఈనెల 21నాటికి పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి, అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో నాగోల్‌లోని శుభం గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఇటీవల ఆ సంఘం మరోనేత థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది సంఘం నేతలుగా పేర్కొంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని సవాల్ చేస్తూ ఈ సమావేశం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావటంతో, సంఘం నేతలంతా తమవైపే ఉన్నారని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ప్రతి ఏటా వేయి కొత్త బస్సులు కొనాలని, వేతన సవరణ వెంటనే చేపట్టాలని, గత వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, సీసీఎస్, ఎస్ఆర్బీఎస్ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు జరపాలని, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను సెటిల్ చేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించింది. చరిత్రలో అదొక మైలురాయి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించడం సంస్థ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఖైరతాబాద్ ట్రాన్స్‌పోర్టు భవన్‌లోని తన కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ భద్రత ఆదేశాలు, మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, సంస్థను పటిష్టపరిచేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో విధులు నిర్వర్తించేవారని, ప్రస్తుతం పదేపదే తప్పులు చేస్తే తప్ప వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులదేనని, సిబ్బంది ఏవైనా చిన్నచిన్న తప్పులు చేస్తే వాటిని డిపో మేనేజర్ స్థాయిలోనే పరిష్కరించేలా మార్గదర్శకాలు రూపొందించినట్టు వెల్లడించారు. తాను రవాణా శాఖ మంత్రిగా, కార్మికుల పక్షాన నిలుస్తూ వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. టికెట్ల రూపంలో సంస్థ కు రోజువారీ ఆదాయం రూ.13 కోట్లకు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, ఈడీలు వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, కార్గో ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘అశ్వద్ధామ రెడ్డిని టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: అశ్వద్ధామ రెడ్డి బయట ఉంటే ఆయన అవినీతికి జైల్లో పెడతారని భయపడి... మళ్లీ యూనియన్‌లో చేరతానని అంటున్నారు. ఆయనను టీఎంయూ నుంచి తొలగిస్తున్నాం అంటూ థామస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడాదిన్నర నుంచి అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సంఘాలను నిర్వీర్యం చేశారు. దాంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కార్మికులు ఉద్యోగాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. టీఎంయూలో అశ్వద్ధామ రెడ్డిని నామినేట్ చేసింది నేనే. నన్ను తొలగిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆర్టీసీని సర్వనాశనం చేసింది ఆయనే’’ అన్నారు. (చదవండి: రోజుకో రూ.కోటి.. చేతులెత్తేశారు!) అంతేకాక ‘‘థామస్ రెడ్డిని మళ్ళీ బస్ భవన్‌లోకి ట్రాన్స్ఫర్ చేయండి.. జిల్లా నుంచి రప్పించండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. థామస్ రెడ్డి వల్ల కార్మికులు కష్టాలు తీరతాయని సీఎం చెప్పారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పటికీ మాకు తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్లో కూడా డ్యూటీ లేకున్నా, బస్సులు నడవకున్నా మాకు జీతాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా మాకు జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే చాలా బస్సులు పాడైపోయాయి.. 2000 కొత్త బస్సులు కొనాలని కోరుతున్నాం.. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.. ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీ కార్మిక నేతలకు షాక్; రిలీఫ్ డ్యూటీ రద్దు
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలను క్షమించబోమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ గుర్తింపు సంఘమైన టీఎంయూ కార్యాలయాన్ని బస్‌భవన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ విజిలెన్స్ రామ్‌చందర్‌రావు, చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్ ఆదేశాల మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఏంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో టీఎంయూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి షాక్ తగిలినట్టైంది. ఇక రానున్న కాలంలో యూనియన్లకు గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. కార్మిక నేతల రిలీఫ్ డ్యూటీ రద్దు.. ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర కమిటీలోని 30 మంది కార్మిక నేతలకు విధుల నుంచి మినహాయింపు(రిలీఫ్ డ్యూటీ)ను రద్దు చేసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో 26 మందికి, ఎంప్లాయిస్ యూనియన్‌లో ముగ్గురికి, ఎస్‌డబ్ల్యూఎఫ్‌లో ఒక్కరి చొప్పున రిలీఫ్ డ్యూటీని రద్దు చేసినట్లు ప్రకటించింది. రిలీఫ్ డ్యూటీ అంటే.. కార్మికుల ఇబ్బందుల పరిష్కారం కోసం పనిచేసేందుకుగానూ కార్మిక నేతలకు డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. విధులకు హాజరు కాకున్నా యాజమాన్యం పూర్తిస్థాయి జీతం చెల్లించేది. జిల్లాలో జోనల్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు ఫుల్ డే రిలీఫ్, హాఫ్ డే రిలీఫ్‌లు వారానికి మూడురోజులు వర్తింపజేసేది. వీరితోపాటు రీజినల్ సెక్రటరీలకు, డిపో కార్యదర్శిలకు వారానికి ఒక రోజు వేతనం చెల్లించేవారు. వీటిని రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించడంతో ఇకమీదట కార్మిక నేతలెవరికీ రిలీఫ్ డ్యూటీలు ఉండవు. -
ఆర్టీసీ సమ్మె విరమణ..!
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు. సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ హిమగిరి ఫంక్షన్ హాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్లోని హిమాగిరి ఫంక్షన్ హాల్లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది? 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమ్మెపై తర్జనభర్జన ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే. -
గంట లేటుగా వచ్చామనడం అబద్ధం..
సాక్షి, హైదరాబాద్: సమ్మె వల్ల ఆర్టీసీ కుటుంబాలు పండుగలు జరుపుకోకపోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇవాళ్టికి టీఎంయూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. యూనియన్ను బలోపేతం చేయడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. సమ్మెలో పుట్టిన టీఎంయూ యూనియన్ మళ్లీ సమ్మెలోనే ఎనిమిదో ఆవిర్భావాన్ని పూర్తి చేసుకోవడం దురదృష్టకరం. టీఎంయూ జెండా రంగు కూడా మార్చాం. నిన్న చర్చలు నిర్బంధ కాండ మధ్య జరిగాయి. మేము గంట ఆలస్యంగా వచ్చామనడంలో వాస్తవం లేదు. ముందే చెప్పాం....మధ్యాహ్నం 2.15 గంటలకు వస్తామని. సీనియర్ ఐఏఎస్ అధికారులే ఆలస్యంగా వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. 29న బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తున్నాం. 30న జరిగే సకలజనుల సమరభేరీ విజయవంతం అవుతుంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సమ్మెకు మద్దతుగా ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తాం.’ అని తెలిపారు. కాగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజు కూడా కొనసాగుతోంది. చదవండి: లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం.. -
హీటెక్కిన ఆర్టీసీ.. సమ్మె రూటులో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్, టీజేఎంయూ సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ, మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూలు బుధవారం నోటీసులిచ్చాయి. టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్ఎంయూ నేతలు కూడా మంత్రి సమక్షంలోనే ఇన్చార్జి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బస్‌భవన్‌లో అత్యవరసర భేటీ అయ్యారు. అయితే రవాణా శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ, రవాణా శాఖలపై అవగాహన, అధికారులతో పరిచయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి, అప్పులు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీ, వేతనాలకు డబ్బుల్లేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మె మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కూడా సొంత వనరులు పెంచుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ స్వరూపం, బస్సుల నిర్వహణ, సంస్థాగత విషయాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాగా, సమావేశానికి ముందు ఎన్ఎంయూ నేత నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బస్‌భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్లో ఆర్టీసీకి కేవలం రూ.550 కేటాయించటం సంస్థను అవమానపరచడమే అని ఆరోపించారు. రూ.800 కోట్ల పాతబకాయిలు చెల్లించి బడ్జెట్ కేటాయింపులను కనీసం రూ.3 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లపై తాను సీఎంతో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి హామీ ఇచ్చారు. రవాణా శాఖ అధికారులతోనూ.. రవాణా శాఖ అధికారులతోనూ మంత్రి సుదీర్ఘరంగా చర్చించారు. రవాణా శాఖ సమకూర్చుకుంటున్న ఆదాయంతో పాటు విధివిధానాలను మంత్రి తెలుసుకున్నారు. శాఖలో పారదర్శకత కోసం ఆన్లైన్ విధానంతో పాటు ఎం–వాలెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చెక్‌పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేయడం, అక్రమ రవాణాను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 ఆగస్టు వరకు రూ.1,418 కోట్లు ఆదాయం వచ్చిందని, రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగేలా ఉన్న వాహనాల నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు పురుషోత్తం నాయక్, టీవీ రావు, యాదగిరి, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేశ్, పాండురంగ నాయక్‌తోపాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
25న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా
హైదరాబాద్: ఆర్టీసీని ప్రక్షాళన చేసి కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలతో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్‌రెడ్డి, అధ్యక్షుడు తిరుపతి తదితరులు ఉన్నతాధికారులను కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు పూర్తి చేయకపోవడంతో ఆర్టీసీ ప్రమాదంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులకు అందాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఏళ్లు గడుస్తున్నా టికెట్ధరలు పెంచకపోవడంతో పెరిగిన డీజిల్ ధరలు ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పాడైన బస్సులను తొలగించి కొత్త బస్సులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ తెలంగాణ ఉపాధ్యక్షుడు బీవీ రెడ్డి, మారయ్య, కోశాధికారి రాజాసింగ్, సంయుక్త కార్యదర్శులు ఉషాకిరణ్, శంకర్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తీసుకున్న నిర్ణయంతోపాటు ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేయడాన్ని టీఎంయూ స్వాగతిస్తుందని నాయకులు పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీలో ఉద్యోగ భద్రత, ఐఆర్‌ను 27 శాతానికి పెంచడాన్ని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల తెలంగాణలోని ఆర్టీసీ కార్మికుల్లో ఒత్తిడి, ఆందోళన వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీంతో తాము కూడా పైడిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. -
టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి హరీశ్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఎంయూ(తెలంగాణ మజ్దూర్ యూనియన్) గౌరవాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్థామరెడ్డికి పంపారు. అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వల్ల ఆర్టీసీ కార్మిక సంఘం కార్యక్రమాల్లో భాగస్వామ్యం సాధ్యపడటం లేదని లేఖలో పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ఆర్టీసీ చైర్మన్, టీఎంయూ మధ్య కోల్డ్‌వార్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, గుర్తింపు సంఘం టీఎంయూ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. అదిప్పుడు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. చైర్మన్ సోమారపు సత్యనారాయణ తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కార్మికుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని టీఎంయూ ప్రధానకార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బస్ భవన్లో విలేకరులతో వారు మాట్లాడారు. గత నెల 28న సీసీఎస్, పీఎఫ్ నిధులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బస్‌భవన్ ముందు ధర్నా నిర్వహించిన తమ ను ఉద్దేశించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పోలీస్ కేసు పెడతామని, ఇదేచివరి వార్నింగంటూ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశామని, తమపై చర్య లు తీసుకునే అధికారం చైర్మన్‌కు లేదని అన్నారు. అధికారిని వెనుకేసుకొస్తున్నారు.. ఆర్టీసీ ఎండీ లేని సమయంలో చైర్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి విమర్శించారు. ఫైనాన్స్ అడ్వైజర్ స్వర్ణశంకరన్ నిబంధనలకు విరుద్ధంగా సీసీఎస్ నుంచి రూ.400 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని ఆరోపించారు. కార్మికుల ప్రావిడెండ్ ఫండ్(పీఎఫ్)కు చెందిన దాదాపు రూ.500 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని, అలాగే ఎస్బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌లకు సంబంధించిన రూ.100 కోట్లను కూడా డ్రా చేశారని తెలిపారు. కార్మికులు ఎన్‌క్యాష్‌మెంట్ రాక జీతభత్యాలు లేక నానా అవస్థలు పడుతుంటే ఫైనాన్స్ అడ్వైజర్ నిధు లను దుర్వినియోగం చేశారని, చట్టప్రకారం అడ్వైజర్‌ను శిక్షించాల్సిందిపోయి చైర్మన్ వెనుకేసుకొస్తున్నా రని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ.400 కోట్లు సంస్థకు రావాల్సి ఉందని, వాటిని తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరిస్తూ టీఎంయూపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ కేసులు, జైళ్లకు భయపడేది లేదని, జైలుకు పంపితే బెయిల్ కూడా తీసుకోబోమని వారు స్పష్టం చేశారు. -
ఆర్టీసీలో అప్పుడే ఎన్నికల వే‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్ పదవీకాలం ఈనెల 7వ తేదీతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిన దరిమిలా ఇక్కడా అదే వాతావరణం నెలకొంది. దీంతో కొందరు యూనియన్ నేతలు అపుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మంగళవారం అన్ని యూనియన్లు మోటారు వాహన సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నాయి. సాయంత్రానికి సమ్మె ముగియగానే పలు యూనియన్ల నేతలు ఎన్నికలపై దృష్టిసారించారు. కీలక నిర్ణయాల్లో..! ఆర్టీసీలో ప్రతీ రెండేళ్లకోసారి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్ గుర్తింపు యూనియన్‌గా రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఆర్టీసీ తీసుకునే పలు కీలక నిర్ణయాలు, చర్చలు, వివిధ కార్యక్రమాల్లో ఈ యూనియన్ సభ్యులకు అధికారికంగా ఆహ్వానం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల సమస్యలు, ఇబ్బందులను నేరుగా సంస్థ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యూనియన్‌కు దక్కుతుంది. పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించే వరకు ఈ యూనియనే ఆపద్ధర్మ గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతుంది. 2013 నుంచి టీఎంయూనే..! ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ 2013 నుంచి ఆర్టీసీలో తన హవా కొనసాగిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పురుడుపోసుకున్న టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కలసి 2012 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2013 జనవరి 3న అధికారిక యూనియన్‌గా ఉత్తర్వులు వచ్చాయి. 2015 జనవరి 2తో వీరి పదవీకాలం ముగిసింది. తరువాత 2016 జూలైలో మరో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. మొత్తానికి ఐదున్నరేళ్లుగా టీఎంయూ అధికారిక యూనియన్‌గా ఉండటం విశేషం. గతానుభవాల దృష్ట్యా ఈ మారు ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..లేదా వాయిదా పడుతాయా అనే చర్చకూడా కార్మికుల్లో సాగుతోంది. ఎందుకైనా మంచిదని కొన్ని సంఘాలు అప్పుడే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారం ముందస్తుగానే ప్రారంభించేశాయి. ఎన్నికలు వాయిదా వేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. -
నేడు దేశవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె
-
నేడు ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 7న సమ్మె చేస్తున్నట్లు యాజమాన్యానికి జూలై 24న గుర్తింపు యూనియన్ తెలంగాణæ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నోటీసులిచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) తదితర 9 ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. లారీల సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. ఆటోరిక్షాలు, క్యాబ్ సర్వీసులు కూడా బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. కోటిమందికి ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 97 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. 24 గంటల సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతు ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద నిరసన ప్రదర్శనలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. సమ్మె డిమాండ్లు రాష్ట్రం పరిధిలోనివి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికుల, సంస్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ. 2,600 కోట్లు అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నేటి సమ్మెతో మరోసారి నష్టం తప్పేలా లేదు. డిమాండ్లు ఇవే! కొత్త మోటారు వాహన సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వారు ప్రయాణ మార్గాలను కొనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉండే.. రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ వారు కొనుక్కున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు కనిపించకూడదు. దీనిపై అన్ని ప్రభుత్వ రవాణా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే టోల్ గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తగ్గింపు, కార్మికుల కనీస వేతనం రూ.24,000, డీజిల్‌పై అదనపు సుంకాలు తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ‘గ్రేటర్’ రవాణా బంద్ గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ అనుబంధ రవాణా కార్మిక సంఘాలు, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్, జై డ్రైవరన్న క్యాబ్స్ అసోసియేషన్ తదితర కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. దీంతో సుమారు 3,560 సిటీ బస్సులు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 2 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. స్కూలు బస్సులు, వ్యాన్లు, ఆటోరిక్షాలనూ నిలిపివేయనున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో నగర వ్యాప్తంగా రవాణా స్తంభించనుంది. సుమారు 50 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికానున్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో అదనపు సర్వీసులు బంద్ వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టాయి. నాగోల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా తదితర మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తుండగా.. ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సమ్మెకు సహకరించండి దేశంలోని అన్ని ఆర్టీసీల మనుగడకు మోటారు వాహన సవరణ బిల్లు–2016 ముప్పుగా మారింది. ఈ బిల్లు ఆర్టీసీ ఉనికికే ప్రమాదం. బిల్లు ఆమోదం పొందితే పేద విద్యార్థులకు రవాణా భారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. కాబట్టి కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ఆటో, లారీలు, ఇతర రవాణా సంఘాలన్నీ మాతో కలసి రావాలని కోరుతున్నాం. – అశ్వథ్థామరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు, థామస్‌రెడ్డి, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రభుత్వం దిగిరావడం ఇది మా విజయమే!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో కార్మికుల తలపెట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె ఆలోచనను విరమించుకుంటున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ ఒత్తిడి వల్లే కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి వచ్చారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన తూతూ మంత్రపు ప్రకటనలకు టీఎంయూ ఒప్పుకోవడం దారుణమన్నారు. ఇంకా ముఖ్యమైన డిమాండ్లు సాధించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు గుర్తింపు సంఘం టీఎంయూ భయపడిందని ఆరోపించారు. టీఎంయూ ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. ప్రభుత్వ గుర్తింపు సంఘమైన టీఎంయూ సమ్మె విరమించడం వల్ల తాము కూడా ప్రస్తుతానికి సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. తాజా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం ఆర్టీసీ జేఏసీ విజయమేనని తెలిపారు. నేటి (శనివారం) రాత్రి అన్ని డిపోల దగ్గర ఆర్టీసీ జేఏసీ సమావేశాలు నిర్వహించి.. ప్రభుత్వం కార్మికులను ఎలా మోసం చేసిందో వివరిస్తామని చెప్పారు. -
చర్చలు సఫలం : 16 శాతం మధ్యంతర భృతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్‌కు తెరపడింది. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కార్మికులు అన్యాయానికి గురయ్యారని వెల్లడించారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు 25 శాతం మధ్యంతర భృతి అడిగారని, ఆర్టీసీ వందల కోట్ల నష్టాల్లో ఉన్నప్పటికీ 16 శాతం ఐఆర్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, అసంఘటిత కార్మిక సంఘాలవైపే సీఎం దృష్టి సారించారని అన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి హరీష్ రావు అటు కార్మిక సంఘం నాయకుడిగా, ఇటు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని కొనియాడారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన 16 శాతం ఐఆర్‌తో నెలకు 16కోట్లు, ఏడాదికి 200 కోట్ల రూపాయల వరకూ భారం పెరిగిందని అన్నారు. అయినా కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉందని, లాభాల బాట పట్టించడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యమంలో నుంచి పుట్టిన సంస్థ టీఎంయూ అని, ఆర్టీసీ సంస్థ బలోపేతం చేశాక ఫిట్మెంట్ కూడా ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ నష్టాలపై హైలెవల్ కమిటీ వేస్తామని, తాత్కాలికంగా ఐఆర్ ప్రకటిస్తున్నామని, జులై నుంచి ప్రకటించిన ఐఆర్‌ను ఇస్తామని మంత్రి ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ రాయితీలన్నీ కల్పిస్తామని అన్నారు. వయసు మీరిన కార్మికుల ఉద్యోగాన్ని వాళ్ల పిల్లలకు కూడా అర్హతలను బట్టి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సకల జనుల సమ్మె సమయంలో జీతాన్ని కూడా కార్మికులకు తక్షణమే అందచేసే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అనంతరం టీఎంయూ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము కోరిన 16శాతం ఐఆర్ ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించిందని, భవిష్యత్తులో తాము కోరిన ఫిట్‌మెంట్‌కు సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కండక్టర్లు, డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు ఉండదని అన్నారు. ఇప్పటి నుంచే సమ్మె నోటీసుని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. సంబంధిత కథనం ఇక్కడ చదవండి : ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్ -
ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సమ్మెకు వెళ్తే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించినా, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకే మొగ్గు చూపడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే సమ్మె ఆలోచనను విరమించేందుకు, మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులకు టీఎంయూ నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావుఅటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం వహించారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, టీఎంయూ ప్రదాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి, ఇతర కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తే తదనంతరం పరిణామాలను మంత్రి కార్మిక సంఘాలకు వివరించారు. మధ్యంతర బృతి ఇస్తే కార్మికులను ఎలా ఒప్పించాలనే అంశంపై మంత్రులు, కార్మిక సంఘాలు తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. టీఎంయుపై కార్మికులకు నమ్మకం సన్నగిల్లకుండా ఏవిధంగా ముందుకు వెళ్లాలని సమాలొచనలు జరిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు 25 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేసినా చర్చల అనంతరం 15 శాతానికి దిగొచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా పీఆర్సీ, వేతన సవరణ చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే 12.5 శాతం ఇస్తామంటూ మంత్రుల బృందం వెల్లడించినట్లు సమాచారం. 25 శాతం మధ్యంతర బృతి ఇస్తే రూ.900కోట్లకు పైగా భారం పడుతుందని మంత్రి వర్గం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు వివరించింది. ఈ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించేందుకు మంత్రులతో పాటు టీఎంయూ ప్రధాన నేతలు ప్రగతి భవన్ బయలుదేరారు. అయితే మంత్రుల భేటి వివరాలను బయటకు వెల్లడించడానికి టీఎంయూ నేతలు నిరాకరించారు. ఆర్టీసీ పరిరక్షణ, లాభాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వర్గం కార్మిక సంఘాలకు సూచించినట్లు తెలిసింది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నష్టాల ఎదుర్కొంటున్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విభజనే పరిష్కారమనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు తరహా పరిస్థితులపై అధ్యయనం చేసి, నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆర్టీసీ సమ్మె.. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఈ నెల 11 నుంచి సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మెపై సీఎం కేసీఆర్ ఫైర్ అవ్వడంతో టీఎంయూ గౌరవ అధ్యక్షడు హరీష్‌రావుతో ఆ సంఘం నేతలు శనివారం భేటీ అయ్యారు. అనంతరం కడియం శ్రీహరి నివాసంలో భేటీ అయిన స్ట్రాటజిక్ కమిటీకి మంత్రి హరీష్‌రావు టీఎంయూ నేతల అభిప్రాయాలను వివరించారు. ఈ భేటీలో కార్మికులు సమ్మెకు వెళితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై చర్చించారు. అవసరమైనపక్షంలో ఎస్మా ప్రయోగిస్తే జరిగే పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. మంత్రుల అంతర్గత భేటీ అనంతరం టీఎంయూ నేతలతో మంత్రులు చర్చలు జరిపారు. కార్మిక సంఘాల నేతల అభిప్రాయాలను తీసుకున్న మంత్రులు ప్రగతి భవన్‌కు బయలు దేరారు. కార్మిక సంఘాలతో జరిగిన భేటీలో ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, హరీష్ రావ్, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ నెల 8న చర్చలకు రావాలని ఆర్టీసీ గుర్తింపు సంఘం, జేఏసీ సహా అన్ని కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. సమ్మె ఆగాలంటే వెంటనే కార్మికుల వేతనాలు పెంచాలని, వేతన సవరణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా వేతన సవరణకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె చేపట్టనున్నట్టు గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న తెల్లవారుజామున తొలి బస్సును నిలిపేయటం ద్వారా సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ వెల్లడించింది. దీనికి సన్నాహకంగా ఈ నెల 7 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి వెల్లడించారు. 7వ తేదీన అన్ని డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామని, 8వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని చెప్పారు. వేతన సవరణ గడువు ముగిసి 14 నెలలు దాటినందున వెంటనే 50 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు. -
ఈనెల 21 తర్వాత టీఎస్ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్’ చేపట్టారు. దీంతో బస్‌భవన్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్ చేస్తోంది. 2017, ఏప్రిల్ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్‌భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. టీఎంయూ మీటింగ్ ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. కార్మిక లోకం కన్నెర్ర చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారన్నారు. ప్రగతి భవన్ ముట్టడి వరకు రానివ్వద్దననారు. ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారంటే అది తెలంగాణ అర్టీసీ కార్మికుల చలువేనన్నారు. ఎవరి దయదాక్షిణ్యాల మీద కార్మికులు లేరని తెలిపారు. చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించే నాధుడే లేరన్నారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల మీటింగ్‌కు ఎందుకు అనుమతి దొరకడం లేదు? కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? అని ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని కోరారు. నేడు జరిగిన ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని, ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. -
టీఎంయూలోకి భారీగా చేరికలు
నిజామాబాద్‌నాగారం : ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని నిర్వహించిన సమావేశంలో ఈయూ డిపో–1 కార్యదర్శి అబ్బయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు టీఎంయూలో చేరారు. నాయకులను, కార్మికులను అశ్వద్ధామరెడ్డి పూలమాలలతో సత్కరించి సాదారంగా తమ యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈయూలో కొంత మంది నేతల వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతోందని అందుకే టీఎంయూలో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఈయూ డిపో–1 చైర్మన్ సుధాకర్, రీజినల్ కోశాధికారి నందిపేట్ శ్రీనివాస్, సాయిబాబా సహా 100 మంది కార్మికులు టీఎంయూలో చేరడంతో ఎంప్లాయీస్ యూనియన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వందేమాతరం శ్రీనివాస్, మురలీధర్, రీజినల్ కార్యదర్శి మాక్లూర్ శేఖర్, సీహెచ్ నర్సయ్య, నర్సయ్య పాల్గొన్నారు. -
బస్ భవన్లో టీఎంయూ విజయోత్సవ సభ
హైదరాబాద్: నగరంలోని బస్ భవన్లో మంగళవారం టీఎంయూ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా సమావేశంలో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు టీఎంయూకు గుర్తింపు హోదా పత్రాన్ని అందజేశారు. -
టీఎంయూ జయకేతనం
ఐదు డిపోల్లో గెలుపు ఒక్క డిపోలో ఈయూ విజయం జిల్లాలో మంగళవారం ఆర్టీసీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.. నిజామాబాద్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హవా కొనసాగింది.. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా.. ఐదింటిలో టీఎంయూ.. ఒక్క డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విజయం సాధించాయి.. నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ.. నిజామాబాద్ డిపో-2లో మాత్రం ఈయూ విజయకేతనం ఎగురవేసింది.. ఈ సందర్భంగా కార్మికులు బాణాసంచా కాల్చుతూ.. రంగులు చల్లుకుంటూ విజయోత్సాహం నిర్వహించారు.. నిజామాబాద్‌నాగారం : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సత్తా చాటింది. జిల్లాలో ఆరింటిలో ఐదు డిపోల్లో జయకేతనం ఎగురవేసింది. ఒకదాంట్లో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌లో 6 డిపోలు ఉన్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 3,064 ఓట్లుండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 97గా నమోదైంది. టీఎంయూ, ఈయూల మధ్యే ప్రధాన పోటీ సాగింది. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా సంఘాలు చర్యలు తీసుకున్నాయి. అనారోగ్యంతో ఉన్న కార్మికులను ఆటోలు, జీపులు, బైక్‌లపై పోలీంగ్ కేంద్రాలకు తరలించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేశారు. నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ గెలుపొందింది. నిజామాబాద్ -2 డిపోలో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది. రీజియన్‌లో 3,064 ఓట్లు ఉండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. టీఎంయూ 1,733 ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. బాన్సువాడ డిపోలో ఒక ఓటు విషయంలో రీకౌంటింగ్ నిర్వహించారు. మిగతా అన్ని డిపోల్లో అంతా ప్రశాంతంగా లెక్కింపు పూర్తి అయ్యింది. క్లాస్-3 రాష్ట్రానికి సంబంధించి పూర్తి మెజారిటీ సాధించింది. రీజీయన్ స్థాయి క్లాస్-6లో డిపో-2లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో టీఎంయూ గెలిచింది. 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్.. దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన మిగతా 62 మంది కార్మికులు తమ ఓటు హక్కును ఈ నెల 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకోవచ్చునని డిప్యూటీ లేబర్ కమిషనర్ చతుర్వేది తెలిపారు. వీరి ఓట్లను లెక్కించి సీల్డ్ కవర్లో రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. వాటి వివరాలను వచ్చేనెల 8న ప్రకటిస్తారన్నారు. డిపోల్లో సంబురాలు.. అన్ని డిపోల్లో కార్మికుల సంబురాలు అంబరాన్నింటాయి. ఐదు డిపోల్లో టీఎంయూ, ఒక డిపోలో ఈయూ సంబురాలు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు.